
తండ్రికి తలకొరివి పెట్టిన ఆరేళ్ల కూతురు
మిరుదొడ్డి(దుబ్బాక): ఆరేళ్ల ప్రాయం.. లోకమేమిటో తెలియని చిన్నారి.. చితి కుండ పట్టుకుంది. తండ్రికి తలకొరివి పెట్టింది. వివరాలివి. మండల కేంద్రమైన మిరుదొడ్డికి చెందిన బోయిని నాగరాజు (28)గురువారం గుండె పోటుతో మృతి చెందాడు. అతనికి భార్య నవ్య, ఆరేళ్ల కూతురు శివాని ఉన్నారు. కొడుకుల్లేక పోవడంతో శుక్రవారం నిర్వహించిన అంత్యక్రియల్లో కూతురు శివాని తలకొరివి పెట్టింది. తండ్రి శవయాత్రలో చితికుండతో నడుస్తున్న ఆమెను చూసినవారు కంటతడి పెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment