ప్రతీకాత్మక చిత్రం
కోల్‌కత్తా : శ్మశాన వాటిక నుంచి కరోనా బాధితుల కుళ్లిన మృతదేహాలను వ్యాన్‌లో తరలిస్తున్నట్లు వైరల్ అయిన వీడియో వాస్తవం కాదని పశ్చిమ బెంగాల్ వైద్యారోగ్య శాఖ అధికారులు కొట్టిపారేశారు. అవి కరోనాతో మరణించిన వారి మృతదేహలు కావని మోర్గ్ ఆస్పత్రిలో గుర్తు తెలియని మృతదేహాలని పేర్కొన్నారు. గత 15 రోజులుగా వారికి సంబంధించిన వారు ఎవరూ రాకపోవడంతో వాటిని ఖననం చేసేందుకు వ్యాన్‌లో తీసుకెళ్తున్నట్లు స్పష్టం చేశారు. కరోనాపై తప్పుడు వార్తలు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కోల్‌కత్తా పోలీసులు ట్వీట్ చేశారు.
(‘వారిని పశువుల కన్నా హీనంగా చూస్తున్నారు’)
కాగా పశ్చిమ బెంగాల్‌లో దహన సంస్కారాల కోసం మున్సిపల్ సిబ్బంది కోవిడ్-19 మృతదేహలను వ్యాన్‌లో ఎక్కిస్తున్న వీడియో బుధవారం నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఇందులో గారియ శ్మశాన వాటిక వద్ద మున్సిపల్ సిబ్బంది తరలిస్తున్న14 మృతదేహలు కరోనా బాధితులవన్న కారణంగా గరియా ప్రాంత స్థానికులు నిరసనలు చేపట్టారు. అన్ని మృతదేహాలను ఒకేచోట దహనం చేయడంపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. జనసాంద్రత ఉన్న ప్రాంతంలోని శ్మశానవాటికలో కరోనా బాధితుల మృతదేహాలు దహనం చేయడం వల్ల స్థానికంగా కేసులు పెరిగే అవకాశం ఉందని ఆందోళన చేపట్టారు. దీంతో ఆ మృతదేహాలను తిరిగి వ్యానులోకి చేర్చి అక్కడ నుంచి మరో శ్మశానవాటికకు తీసుకెళ్లారు. (‘లాక్‌డౌన్ పొడగించడం లేదు’)
ఇదిలావుండగా ఈ వీడియోపై పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధంఖర్ ఆందోళన వ్యక్తం చేశారు. అంతేగాక ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నివేదిక ఇవ్వాలని కోరారు. ‘మృతదేహాల పట్ల మున్సిపల్ సిబ్బంది ప్రవర్తించిన తీరు వర్ణనాతీతం. మన సమాజంలో మృతదేహాలకు అత్యంత గౌరవం ఉంటుంది. అంతిమ సంస్కారాలు సంప్రదాయం ప్రకారం జరుగుతాయి. ఈ ఘటనపై త్వరగా నివేదిక ఇవ్వండి ’.అంటూ ట్విటర్‌లో గవర్నర్ పేర్కొన్నారు. (కర్మ: తల్లిదండ్రులతో పోర్న్ చూసినట్లుంది!)
Comments
Please login to add a commentAdd a comment