
శవాన్ని తరలిస్తూ..
లక్నో: ఈ ఫొటోలో మహిళ పేరు వర్ష వర్మ. వయసు 44 సంవత్సరాలు. ఉత్తరప్రదేశ్‌లో లక్నోకు చెందిన ఆమెలో సమాజానికి ఏదో ఒక విధంగా సేవ చేయాలనే తపన ఉంది. దీంతో అయిదేళ్లుగా ఎవరూ చేయలేని ఒక అనూహ్యమైన పనికి పూనుకున్నారు. ఏక్ కోషిస్ ఏసీ భీ అనే సంస్థను స్థాపించి మార్చురీల్లో గుర్తు పట్టని మృతదేహాలకు శాస్త్రోక్తంగా అంతిమ సంస్కారం జరిపిస్తున్నారు.
దీనివల్ల మరణించిన వారిని గౌరవంగా పైలోకాలకు పంపిస్తున్నట్టుగా ఆమె భావిస్తున్నారు. 72 గంటల సేపు మృత దేహం కోసం కుటుంబ సభ్యులెవరూ రాకపోతే స్థానిక అధికారులు ఆమెకే చెబుతారు. ఇలా వారానికి సగటున మూడు మృతదేహాలకు వర్ష అంతిమ సంస్కారం నిర్వహిస్తున్నారు. ప్రపంచం నుంచి శాశ్వతంగా వెళ్లిపోయిన వారికి గౌరవప్రదంగా వీడ్కోలు పలకాలని వర్ష చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment