mortuary
-
ఇంకా సుత్తి, శానం వాడుతుండడం బాధాకరం..
ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వైద్యశాస్త్ర విభాగానికి సంబంధించి ఇటీవలి కాలం (2017)లో... హైకోర్టు క్రిమినల్ అప్పీల్ నం. 326లో వెల్లడించిన ఆదేశాలను అనుసరించి, ఒక సమూల ప్రక్షాళనకై ప్రభుత్వం నిపుణుల కమిటీని నియమించింది. హైకోర్టు న్యాయమూర్తులు తమ తీర్పులో శవపరీక్షల నిర్వహణలో పాటించాల్సిన శాస్త్రబద్ధమైన ప్రమాణాలు, తదనంతరం తయారు చేసే నివేదికల నిబద్ధతపై విస్తృతంగా చర్చించారు. ఆధునిక సమాజంలో ప్రజల అసహజ మరణాలకు గల కారణాలను తెలుసుకోవడం, దోషులను శిక్షించడం, నేరాలను నివారించడం ప్రభుత్వాల బాధ్యత. ఈ ప్రక్రియలో పోలీసులు, కోర్టు లతో పాటు ఫోరెన్సిక్ వైద్యుల పాత్ర చెప్పుకోదగ్గది.గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున వైద్యుల నియామకాలు జరిగిన పుణ్యమా అని చాలాచోట్ల ఫోరె న్సిక్ వైద్యులు అందుబాటులో ఉండడంచేత శవపరీక్షలు నాణ్యతా ప్రమాణాలతో నిర్వహించడానికి అవకాశం ఏర్పడింది. అయితే హైకోర్టు ఆశించిన విధంగా న్యాయ వైద్య శాస్త్రంలో అంతర్జాతీయ ప్రమాణాలు పాటించడానికి నియమ నిబంధనావళి రూపొందించడం ఈ విశేషజ్ఞుల కమిటీకి పెద్ద కష్టమైన పని కాకపోయినప్పటికీ... దానిని ఆచరణలో పెట్టాలంటే మన శవాగారాలను ఆధునీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చాల చోట్ల శవాలను భద్రపరిచే శీతల వ్యవస్థ (కోల్డ్ స్టోరేజ్) అవసరాలకు సరిపోయేలా లేదు.మన మార్చురీలలో బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ.. ముఖ్యంగా ద్రవ వ్యర్థాల నిర్వహణకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాల్సి వుంది. శవపరీక్షలు చేయడానికి కావల్సిన ఆధునిక పనిముట్లు చాలాచోట్ల అందుబాటులో లేవు. ప్రపంచం అంతా ఎలక్ట్రిక్ రంపాలతో పుర్రెలను తొలచి మెదడును పరీక్షిస్తుంటే, మనం మాత్రం పాత పద్ధతిలో ఇంకా సుత్తి, శానం వాడుతుండడం బాధాకరం. కొన్ని అసహజ మరణాలను పరిశోధించడానికి బాడీ శాంపుల్స్‌ను దూరంగా ఉన్న ప్రయోగశాలలకు పంపాల్సి ఉంటుంది, అప్పటివరకు ఆ నమూనాలను పరిరక్షించడానికి డీప్ ఫ్రీజర్లు, అవి చెడిపోకుండా ఉండడానికి ప్రత్యేక సంరక్షక ద్రవ్యాలు అవసరం అవుతాయి. ఈ ప్రాథమిక మౌలిక సదుపాయాలు కల్పన పని నాణ్యతను పెంచడానికి ఎంతగానో దోహదపడతాయి.చదవండి: నిజంగా పవన్ కల్యాణ్‌కు ఆ ధైర్యం ఉందా?ఆంధ్రప్రదేశ్‌లోని న్యాయ వైద్య శాస్త్ర ప్రయోగశాలలు (ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీస్) అనేక విష పదార్థాల కారణంగా మరణించినవారి శవపరీక్షలలో పరిమాణాత్మక ఫలితాలను అందించ లేకపోతున్నాయి. అనేక విషాలను గుణాత్మకంగా గుర్తించడంలో పేలవంగా ఉన్నాయి. కాలం చెల్లిన విశ్లేష ణాత్మక విషశాస్త్ర పద్ధతులు (ఎనటికల్ టాక్సికాలజీ) ఉపయోగించడమే దీనికి గల ముఖ్య కారణం. ఎఫ్ఎస్ఎల్లు న్యాయ వైద్య విభాగం మధ్య సరిగ్గా సమన్వయం లేక పోవడం కొన్ని కేసుల న్యాయ విచారణ విఫలమయ్యేందుకు కూడా కారణ మవుతోంది.మొత్తంగా న్యాయ వైద్యశాస్త్ర విభాగం బాగుపడాలంటే... మన మార్చురీలలో, న్యాయ వైద్య ప్రయోగశాలల్లో, పోలీస్ వ్యవస్థలో, అలాగే సంబంధిత వ్యక్తులకు వృత్తి పట్ల అంకిత భావంలో పెను మార్పులు అవసరం.– కట్టంరెడ్డి అనంత రూపేష్ రెడ్డిసహాయ ఆచార్యులు, న్యాయ వైద్య శాస్త్రం– విష విజ్ఞాన శాస్త్రం, ఆంధ్ర వైద్య కళాశాల -
మృతదేహాలతో.. వ్యాపారం ? ..
ఏలూరు టౌన్: ఏలూరు సర్వజన ఆసుపత్రిలోని మార్చురీ దారుణాలకు కేంద్ర బిందువుగా మారింది..అనాథ శవాలే అక్కడి కొందరు సిబ్బందికి ఆదాయ వనరులుగా మారాయి. ఏలూరు జీజీహెచ్‌లో గత కొంత కాలంగా గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న అవినీతి బాగోతం బహిర్గతమైంది. పదిరోజుల కిత్రం జరిగిన ఓ ఘటనతో తీగ లాగితే.. డొంకంతా కదిలినట్లు..మార్చురీలో సాగుతున్న అక్రమ శవాల వ్యాపారం వెలుగులోకి వచి్చంది. ఈ ఆసుపత్రిలో అనాథ శవాలను భారీ రేటుకు విక్రయిస్తూ వ్యాపారం చేస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏడాదిన్నరగా 8–10 అనాథ శవాలను ఇతర రాష్ట్రాలు, ప్రాంతాలకు తరలించినట్టు తెలుస్తోంది. తమిళనాడు రాష్ట్రం చెన్నై, బెంగళూరులోని ప్రైవేటు మెడికల్ కాలేజీలకు శవాలను భారీ రేటుకు విక్రయిస్తున్నట్టు చెబుతున్నారు. ఒక్కో శవాన్ని రూ.లక్ష నుంచి రూ.2 లక్షలకు వరకూ విక్రయిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. కొన్ని అంబులెన్సుల ద్వారా అనాథ శవాలను తరలించేందుకు కేవలం అంబులెన్స్‌లకే రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు చెల్లిస్తున్నారని సమాచారం. దీనిపై ఏలూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ సుధాకర్ విచారణ చేపట్టారు. ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శశిధర్ పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసేందుకు నిర్ణయించారు. ఏడాదిన్నర కాలంలో ఏలూరు జీజీహెచ్‌లోని మార్చురీకి ఎన్ని అనాథ శవాలు పోస్టుమార్టం నిమిత్తం వచ్చాయి ?అనాథ శవాలను ఎవరైనా బంధువులకు ఇచ్చారా ? శవాలను పూడ్చిపెట్టారా ? లేక దహనం సంస్కరాలు చేశారా... ఇలా పలు అంశాలపై విచారణ చేపడుతున్నారు. -
AP: ఇంత నిర్లక్ష్యమా?.. మార్చురీ వద్ద దుర్భర పరిస్థితి
సాక్షి, విజయవాడ: ప్రభుత్వాసుపత్రి మార్చురీ వద్ద దుర్భర పరిస్థితి నెలకొంది. మృతదేహాల కోసం కుటుంబీకులు పడిగాపులు కాస్తున్నారు. వరదల కారణంగా చనిపోయిన వారి మృతదేహాలు మార్చురీకి తరలించగా, వరద నీటిలో ఉన్న మృతదేహాలను మార్చురీకి తీసుకురావడంలోనూ చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.సీఎం చంద్రబాబుకు చెప్పుకుంటే కానీ మృతదేహాలను తరలించేందుకు ప్రభుత్వ యంత్రాంగం సహకరించడం లేదు. ప్రస్తుతం విజయవాడ ప్రభుత్వాసుపత్రి మార్చురీలో 12 మృతదేహాలు ఉండగా, రెండు రోజుల నుంచి మృతదేహాల కోసం మార్చురీవద్దే కుటుంబీలు నిరీక్షిస్తున్నారు. పోస్టు మార్టం ప్రక్రియ పూర్తిచేసి ఇచ్చేందుకు అధికారులు, పోలీసులు జాప్యం చేస్తున్నారు.కాగా, బాధితుల ఆర్తనాదాలు అరణ్య రోదనగానే మిగిలిపోతున్నాయి. మూడ్రోజులుగా గల్లంతైన వారు శవాలుగా మారి నీటిలో కొట్టుకుపోతూ కనిపిస్తున్న దృశ్యాలు అత్యంత హృదయ విదారకంగా మారాయి. వరదల గురించి ముందుగా అప్రమత్తం చేయడంలో విఫలమైన ప్రభుత్వం.. కనీసం గల్లంతైన వారి ఆచూకీ అయినా చెబుతుందేమోన్న బాధిత కుటుంబాల ఆశలపై నీళ్లు చల్లుతోంది. మృతదేహాలు అలా కళ్లెదుటే వెళ్లిపోతున్నా, చంద్రబాబు సారధ్యంలోని ప్రభుత్వ యంత్రాంగం చేష్టలుడిగి చూస్తోంది. మృతదేహాలకు గౌరవంగా అంత్యక్రియలు నిర్వహించడం కనీస భారతీయ సంప్రదాయమనే విషయాన్ని విస్మరిస్తోంది. ఇప్పటిదాకా 32 మృతదేహాలు వెలుగుచూశాయి. మూడ్రోజులుగా ప్రజల మధ్యే ఉన్నప్పటికీ ఈ వాస్తవాలు దాచిపెట్టడం చంద్రబాబు దుర్మార్గానికి పరాకాష్ట. -
యాదాద్రి భువనగిరి: మృతదేహాన్ని కొరికేసిన ఎలుకలు!
భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రి మార్చురీలో ఉన్న ఓ మృతదేహాన్ని ఎలుకలు కొరుక్కుతిన్నాయి. ఏపీలోని గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండలం బాయపాలెం గ్రామానికి చెందిన పెరికల రవికుమార్ (38) కుటుంబం 2016లో భువనగిరికి వలస వచ్చింది. రవికుమార్‌కు వివాహం జరగా, ఒక కుమార్తె జన్మించింది. కొంతకాలానికి ఆమె చనిపోవడంతో, రెండో వివాహం చేసుకున్నాడు. ఆమెకు ఓ కుమారుడు ఉన్నాడు. ఏడాది క్రితం రెండో భార్య రవికుమార్‌ను వదిలివెళ్లింది. దీంతో ఆయన తల్లిదండ్రులు, పిల్లలతో కలిసి పట్టణంలోని ప్రగతినగర్‌లో అద్దెకు ఉంటున్నాడు. డ్రైవర్‌గా పనిచేస్తున్న రవికుమార్ కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. ఆదివారం రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చాడు. తగాదా పడుతుండడంతో తల్లిదండ్రులు, పిల్లలు సమీపంలోని తెలిసిన వారి ఇంటికి వెళ్లారు. తిరిగి రాత్రి 11:30 నిమిషాలకు ఇంటికి వచ్చేసరికి రవికుమార్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. మార్చురీ గదిలోని ఫ్రీజర్‌లో కాకుండా బయట భద్రపరిచారు. ఆ ఆనవాళ్లు చూసి.. రవికుమార్ మృతదేహాన్ని చూసేందుకు సోమవారం ఉదయం కుటుంబసభ్యులతో పాటు బంధువులు మార్చురీకి వచ్చారు. అప్పటికే మృతదేహం ముఖం, చెంపలు, నుదుటిపై ఎలుకలు కొరికిన ఆనవాళ్లు చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందన్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లారు. ఎలుకలు కొరికినట్టు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని ఆస్పత్రి సూపరింటెండెంట్ చిన్నానాయక్ తెలిపారు. -
ఆమె సేవ అనూహ్యం
లక్నో: ఈ ఫొటోలో మహిళ పేరు వర్ష వర్మ. వయసు 44 సంవత్సరాలు. ఉత్తరప్రదేశ్‌లో లక్నోకు చెందిన ఆమెలో సమాజానికి ఏదో ఒక విధంగా సేవ చేయాలనే తపన ఉంది. దీంతో అయిదేళ్లుగా ఎవరూ చేయలేని ఒక అనూహ్యమైన పనికి పూనుకున్నారు. ఏక్ కోషిస్ ఏసీ భీ అనే సంస్థను స్థాపించి మార్చురీల్లో గుర్తు పట్టని మృతదేహాలకు శాస్త్రోక్తంగా అంతిమ సంస్కారం జరిపిస్తున్నారు. దీనివల్ల మరణించిన వారిని గౌరవంగా పైలోకాలకు పంపిస్తున్నట్టుగా ఆమె భావిస్తున్నారు. 72 గంటల సేపు మృత దేహం కోసం కుటుంబ సభ్యులెవరూ రాకపోతే స్థానిక అధికారులు ఆమెకే చెబుతారు. ఇలా వారానికి సగటున మూడు మృతదేహాలకు వర్ష అంతిమ సంస్కారం నిర్వహిస్తున్నారు. ప్రపంచం నుంచి శాశ్వతంగా వెళ్లిపోయిన వారికి గౌరవప్రదంగా వీడ్కోలు పలకాలని వర్ష చెబుతున్నారు. -
గాంధీ, ఉస్మానియా మార్చురీల్లో అనాథ శవాల ఆత్మఘోష!
అవి రాష్ట్రంలోనే పేరొందిన రెండు ప్రభుత్వ పెద్దాస్పత్రులు... పేద రోగులకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను ఉచితంగా అందిస్తూ వారికి అండగా నిలుస్తున్న గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులు. కానీ ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. మరోవైపు ఈ రెండు ఆస్పత్రుల్లోని మార్చురీలు (శవాగారాలు), వాటి దయనీయ పరిస్థితిని చూస్తే ఎవరికైనా కళ్లు చెమరుస్తాయి.. గుండెలు బరువెక్కుతాయి. ఎంతో మంది అనాథలు, అభాగ్యుల మృతదేహాలు ఆనవాళ్లు లేక మార్చురీల్లో కుళ్లిపోయి దుర్వాసనలు వెదజల్లుతూ శవాల దిబ్బగా మారుతున్నాయి. సరైన సమయంలో దహన సంస్కారాలకు నోచుకోక వాటి ఆత్మలు ఘోషిన్తున్నాయి.. ఈ హృదయ విదారక దుస్థితిపై ‘సాక్షి’ప్రత్యేక కథనం. సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరంలోని గాంధీ, ఉస్మానియా మార్చురీల్లో నిత్యం సుమారు 50 మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహిస్తుంటారు. వాటిలో దాదాపు 10–15 వరకు అనాథ శవాలే. తాజా మృతదేహాలను మార్చురీలోని ఫ్రీజరు బాక్స్‌ల్లో భద్రపరుస్తున్న సిబ్బంది... గుర్తుతెలియని, అనాథ మృతదేహాలను పఫ్రూం (మూకుమ్మడిగా మృతదేహాలను భద్రపరిచే గది)కు తరలిస్తున్నారు. అయితే జీహెచ్ఎంసీ నిర్లక్ష్యం, పోలీసులు, ఫోరెన్సిక్ వైద్యుల మధ్య సమన్వయ లోపం కారణంగా మృతదేహాలను అక్కడ రోజుల తరబడి ఉంచాల్సి వస్తుండటంతో అవి కుళ్లిపోయి దుర్వాసన వెదజల్లుతున్నాయి. సిబ్బంది సైతం లోపలకు వెళ్లలేని దుస్థితి నెలకొంటోంది. నిబంధనలకు పాతర! పోస్ట్‌మార్టం జరిగిన 72 గంటల తర్వాత అనాథ శవాలను జీహెచ్ఎంసీ విభాగం శ్మశానవాటికకు తరలించాలనే నిబంధనలు ఉన్నా అవి అమలుకు నోచుకోవడం లేదు. జీహెచ్ఎంసీ ఓ కాంట్రాక్టు సంస్థను ఎంపిక చేసి ఒక్కో మృతదేహం తరలింపు, అంత్యక్రియల నిర్వహణకు కొంత మొత్తం చెల్లిస్తుండగా ఆ సంస్థ మాత్రం వివిధ సాకులు చెబుతూ మృతదేహాల తరలింపులో తీవ్ర జాప్యం చేస్తోంది. రవాణా ఖర్చులు మిగుల్చుకొనేందుకు దాదాపు 10 రోజులకోసారి దాదాపు 20 చొప్పున మృతదేహాల తరలింపు ప్రక్రియ చేపడుతోంది. ప్రస్తుతం ఒక్కో మృతదేహం తరలింపు, అంత్యక్రియలకు కాంట్రాక్టు సంస్థకు జీహెచ్ఎంసీ రూ. 2,000–2,500 మ«ద్య ఇస్తున్నట్లు సమాచారం. గతంలో గాంధీ, ఉస్మానియాలకు చెందిన అనాథ శవాల అంత్యక్రియలు నిర్వహించిన ఓ స్వచ్ఛంద సంస్థపై ఆరోపణలు రావడంతో దానిని తప్పించి జీహెచ్ఎంసీయే రంగంలోకి దిగినా అదే తీరు నెలకొనడం గమనార్హం. కాలేజీలకు కొన్ని అనాథ శవాలు? మార్చురీ నుంచి కొన్ని అనాథ శవాలను కొందరు ప్రైవేటు మెడికల్ కాలేజీలకు అమ్ముకుంటున్నట్లు ఆరోపణలు సైతం వెల్లువెత్తుతున్నాయి. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంసీ) నిబంధనల ప్రకారం మెడికల్ కాలేజీల్లో వైద్య విద్యార్థులకు మానవ అనాటమీ, డిసెక్షన్పై అవగాహన కల్పించాలి. ఇందుకోసం మృతదేహాలు కావాలి. అయితే రోడ్డు ప్రమాదాల్లో తీవ్ర గాయాలపాలై మృతిచెందే వ్యక్తుల మృతదేహాలు డిసెక్షన్‌కు పనికిరానందున రోడ్లు, ఫుట్‌పాత్‌లపై నివసిస్తూ సాధారణ రుగ్మతలతో మరణించే అనాథల మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం కొందరు ప్రైవేటు మెడికల్ కాలేజీలకు అమ్ముకొని సొమ్ముచేసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పుర్రె, ఎముకల విక్రయం! అంత్యక్రియలకు ముందు అప్పుడప్పుడూ అనాథ మృతదేహాల నుంచి పుర్రెతోపాటు కొన్ని శరీర భాగాలకు చెందిన ఎముకలను వేరు చేసి తాంత్రిక, భూత వైద్యులుగా చెలామణి అయ్యే వారికి అమ్ముకుంటున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. పుర్రెను రూ. 10 వేల నుంచి రూ. 20 వేలకు, చేతి, తొడ ఎముకలు, వెన్నెముక, జాయింట్‌గా ఉన్న ఐదు చేతివేళ్ల ఎముకలను రూ. 2 వేల నుంచి రూ.20 వేల వరకు విక్రయిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. వెంటాడుతున్న సిబ్బంది కొరత.. గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులను సిబ్బంది కొరత వెంటాడుతోంది. గాంధీ మార్చురీలో ప్రస్తుతం ఏడుగురు వైద్యులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. మరో ముగ్గురు వైద్యులు, ఆరుగురు సిబ్బందితో ఇంకో యూనిట్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన కొన్నేళ్లుగా కార్యరూపం దాల్చడంలేదు. మరోౖవెపు ఉస్మానియాలో వైద్యుల కొరత అంతగా లేకున్నా ఏడుగురు కిందిస్థాయి సిబ్బందితో నెట్టుకొస్తున్నారు. సమన్వయంతో అంత్యక్రియలు గుర్తుతెలియని వ్యక్తుల మృతదేహాలను పఫ్ రూంలోకి తరలించాక 5–6 మృతదేహాలను ఒకసారి చొప్పున జీహెచ్ఎంíసీ సిబ్బంది తీసుకెళ్తున్నారు. వారితో సమన్వయం చేసుకుంటూ అంత్యక్రియలు నిర్వహిస్తున్నాం. – డాక్టర్ బి. నాగేందర్, ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండెంట్ చనిపోయిన వ్యక్తి అనాథ కాకూడదు గుర్తుతెలియని వ్యక్తిని అనాథ శవంలా కాకుండా వారి కుటుంబ సభ్యులకు చేరవేయాలనే మా ఉద్దేశానికి వ్యతిరేకంగా ఈ తంతు నడుస్తోంది. ప్రభుత్వంతో 8 ప్రామాణికాలకు అనుగుణంగా చేసుకున్న ఒప్పందం ప్రకారమే మేం నడుచుకున్నా మమ్మల్ని కాదని జీహెచ్ఎంసీకి అప్పగించింది. – డా. రాజేశ్వర్‌రావు, సత్యహరిశ్చంద్ర ఫౌండేషన్, ప్రధాన కార్యదర్శి తరలింపులో కొన్నిసార్లు జాప్యం అనాథ శవాల తరలింపులో కొన్నిసార్లు జాప్యం జరుగుతున్న మాట వాస్తవమే. మేం ప్రతిరోజూ జీహెచ్ఎంసీకి అనాథ శవాల వివరాలను లిఖితపూర్వకంగా అందిస్తున్నాం. గాంధీలో 60 మృతదేహాలను భద్రపరిచేందుకు అవసరమైన ఫ్రీజరు బాక్సులు, పఫ్రూంతోపాటు అన్ని వసతులు ఉన్నాయి. – ప్రొఫెసర్ రాజారావు, గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ జాప్యం లేదు.. 3 అనాథ శవాల తరలింపులో జాప్యం జరగట్లేదు. సమాచారం అందిన వెంటనే మార్చురీ నుంచి ప్రత్యేక వాహనంలో మృతదేహాలను శ్మశానవాటికకు తరలించి అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నాం. – ముకుందరెడ్డి, జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్, బేగంపేట సర్కిల్ -
నిద్రిస్తున్నట్లుగానే పడిపోయారు..దాదాపు 12 గంటలు తర్వాత...
‘మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడూ’ అంటూ రాసిన అందెశ్రీ ఇది చూసి ఉంటే ‘అసలెక్కడున్నడమ్మా మనిషన్నవాడూ’ అంటూ అక్షరాలా ఆవేదన చెందకమానరు.. సాక్షి, బంజారాహిల్స్: సాటి మనిషి శవమై నడిరోడ్డుపై పడుంటే పక్కనుంచే ఏమీ పట్టనట్టు పోతున్న మనుషుల్ని చూస్తే అసలు వీరు..బతికున్నారా? అనిపించకమానదు. ఉసురు పోయినా పట్టక ఉరుకులూ పరుగులు తీస్తున్న మనిషీ ఊపిరి ఉన్నంత వరకే ఈ ‘సిరి’ అని మరిచావా అని అరవాలనిపించకమానదు. ఒక కాకి చనిపోతే వంద కాకులు గుమికూడి విలపించినట్టు హైరానా పడతాయి. కానీ మన నగరవాసి మంత్రం రెండు కిలో మీటర్ల దూరంలో ఇద్దరు వ్యక్తులు రోడ్ల పైన చచ్చిపడి ఉన్నా పట్టించుకోలేదు. ఎందుకిలా జరిగి ఉంటుందని ఆగి చూసే ఓపిక లేకుండా పోయింది. రోడ్డు పైన పడి ఉన్న శవాల పక్క నుంచే వందలాది మంది వెళ్తున్నారు తప్ప పోలీసులకో, ప్రభుత్వ యంత్రాంగానికో సమాచారం ఇద్దామనే ఆలోచన, ఓపిక కూడా లేదు. సంపన్నులు నివసించే బంజారాహిల్స్‌లోని బసవతారకం ఆస్పత్రివద్ద, జూబ్లీహిల్స్‌లోని భారతీయ విద్యాభవన్ స్కూల్ వద్ద బుధవారం రెండు గుర్తు తెలియని వ్యక్తుల శవాలు పడి ఉన్నాయి. వీరు ఎలా చనిపోయారో..ఎప్పుడు చనిపోయారో తెలియలేదు. రోడ్డుపైన, ఫుట్‌పాత్‌పైన నిద్రిస్తున్నట్లుగానే పడిపోయారు. దాదాపు 12 గంటలు గడిచాక..ఎవరో ఓ వ్యక్తి ఎట్టకేలకు వారు నిద్రించడం లేదు...చనిపోయారని గుర్తించి డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం అందించాడు. ఈలోపే మరొకరెవరో ఆ శవంపై నుంచి వాహనాలు వెళ్లకుండా ఓ రాయిని, ఓ కర్రను అడ్డంగా పెట్టి వెళ్లిపోయాడు. ఇక వాహనదారులు మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా రాకపోకలు సాగిస్తూనే ఉన్నారు. కనీసం ఇక్కడ విధులు నిర్వర్తించే జీహెచ్ఎంసీ సిబ్బంది కూడా ఈవిషయాన్ని గుర్తించ లేదు. చివరకు మధ్యాహ్నం వేళ పోలీసులు వచ్చి..అనాథ శవాలుగా కేసు నమోదు చేసి...మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించారు. (చదవండి: ఫాంహౌజ్ కేసు: బెయిల్‌పై విడుదల, ఆ వెంటనే మళ్లీ అదుపులోకి..) -
ఉస్మానియాలో దారుణం...రూ.వెయ్యి ఇస్తేనే మార్చురీలోకి మృతదేహం
అఫ్జల్‌గంజ్: ఉస్మానియా ఆసుపత్రిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రూ.1000 ఇస్తేనే మృతదేహాన్ని ఫ్రీజర్ బాక్సులో భద్ర పరుస్తానంటూ మార్చురీ సిబ్బంది మృతుడి బంధువులను డిమాండ్ చేశారు. బాధితులు ఈ విషయాన్ని సెల్ఫోన్లో వీడియో చిత్రీకరించడంతో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. మలక్‌పేట ప్రాంతానికి చెందిన మహ్మద్ ముజీబ్ అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న చాదర్‌ఘాట్ పోలీసులు కుటుంబీకులతో కలిసి మృతదేహాన్ని సోమవారం రాత్రి ఉస్మానియా మార్చురీకి తరలించారు. మార్చురీ వద్ద మద్యం మత్తులో విధుల్లో ఉన్న కాంట్రాక్టు ఉద్యోగి రాజు మృతదేహాన్ని భద్ర పరచాలంటే రూ.1000 ఇవ్వాల్సిందేనని భీష్మించాడు. ఎందుకు ఇవ్వాలని కుటుంబ సభ్యులు ఎదురు తిరగడంతో ఇరువురి మద్య వాగ్వాదం చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఉన్న రాజు పోలీసులను సైతం తోసివేస్తూ మార్చురీ గదిని మూసివేస్తూ అసభ్య పదజాలంతో దూషించాడు. మృతుడి కుటుంబీకులు మంగళవారం ఉదయం అతడిపై ఆసుపత్రి అధికారులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన సూపరింటెండెంట్ డాక్టర్ బి.నాగేందర్ కాంట్రాక్ట్ ఉద్యోగిపై ప్రాథమిక విచారణ చేపట్టిన అనంతరం అతడిని విధుల్లోంచి తొలగించారు. ఈ సందర్భంగా డాక్టర్ బి.నాగేందర్ మాట్లాడుతూ.... ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్లు, వార్డులు సెక్యూరిటీ సిబ్బంది, శానిటరీ సిబ్బంది, మార్చురీ, రోగ నిర్ధారణ కేంద్రాల్లోని సిబ్బంది డబ్బులు డిమాండ్ చేస్తే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఉస్మానియా ఆసుపత్రి ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరిస్తే ఎంత టి వారినైనా ఉపేక్షించేది లేదన్నారు. ఆసుపత్రి గ్రేవియన్స్ కమిటీ ఆధ్వర్యంలో ఔట్‌పేషెంట్ బ్లాకు, ఆర్ఎంఓ రూమ్ దగ్గర ఫిర్యాదు బాక్సులను ఏర్పాటు చేశామని సలహాలు, సూచనలతో పాటు తమ ఫిర్యాదులను ఆ బాక్సులో వేస్తే వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు. (చదవండి: టార్చర్ ఫ్రమ్ హోమ్!) -
ఉస్మానియా ఆస్పత్రి వద్ద ఆందోళన.. వెయ్యి ఇస్తేనే శవం తీసుకెళ్తాం!
-
ఉస్మానియా ఆస్పత్రి: వెయ్యి ఇస్తేనే శవం తీసుకెళ్తాం!
హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రిలోని దారుణమైన పరిస్థితులు మరోసారి వెలుగులోకి వచ్చాయి. ఆస్పత్రి మార్చురీలో దారుణం చోటు చేసుకుంది. శవం విషయంలో మార్చురీ సిబ్బంది లంచం డిమాండ్ చేయడంతో పాటు బాధిత కుటుంబ సభ్యులపై జులుం కూడా ప్రదర్శించింది. చాదర్‌ఘాట్‌లో ఆర్థిక ఇబ్బందులతో మజీద్ అనే వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు మజీద్ మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు పోలీసులు. అయితే.. రూ. వెయ్యి ఇస్తేనే మృతదేహాన్ని తీసుకుంటామని మార్చురీ సిబ్బంది చెప్పడంతో గొడవ మొదలైంది. వెయ్యి రూపాయలు డిమాండ్ చేస్తూ మృతుడి బంధువులతో గొడవకు దిగారు. వాళ్లపై జులుం ప్రదర్శించారు. తాగిన మత్తులో మార్చురీ సిబ్బంది వీరంగం సృష్టించారు. బంధువులతో వాగ్వివాదానికి దిగిన మార్చురీ సిబ్బంది వ్యవహారంతో ప్రస్తుతం ఉస్మానియా ఆస్పత్రి వద్ద ఆందోళన నెలకొంది. -
సినిమాలోనూ ఇలాంటి ట్విస్ట్ ఉండదేమో!.. చనిపోయి మళ్లీ బతికాడు.. వీడియో వైరల్
లక్నో: చనిపోయాడనుకున్న వ్యక్తి మళ్లీ బతకడం లాంటివి సినిమాలో చూసుంటాం. కానీ ఈ తరహా ఘటనే యూపీలోని మోరదాబాద్‌లో చోటుచేసుకుంది. ఆ వ్యక్తి చనిపోయాడనుకుని సుమారు 7 గంటలపాటు మార్చురీ ఉంచిన్నప్పటికీ సజీవంగా బతికి అందరినీ ఆశ్చర్యపరిచాడు. వివరాల్లోకి వెళితే.. మొరాదాబాద్ పౌరసరఫరాల సంస్థలో ఎలక్ట్రీషియన్ శ్రీకేష్ కుమార్ (40) పని చేస్తున్నాడు. గురువారం రాత్రి వేగంగా వస్తున్న బైక్ ఢీకొనడంతో శ్రీకేష్ కుమార్‌ను జిల్లా ఆస్పత్రికి తీసుకొచ్చారు. అయితే ఆసుపత్రిలోని వైద్యులు అతను చనిపోయినట్లు ధ్రువీకరించి అతన్ని మార్చురీలో ఫ్రీజర్‌లో ఉంచి పోస్ట్‌మార్టం పరీక్ష పెండింగ్‌లో ఉంచారు. పంచనామ పూర్తి చేసి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించడానికి పోలీసులు వచ్చారు. ఆ సమయంలో శ్రీకేశ్ కుమార్ మృతదేహంలో కదలికలను అతని వదిన గుర్తించారు. ప్రస్తుతం అతని వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. వెంటనే డాక్టర్లు శ్రీకేశ్కు చికిత్స అందించగా బతికి బయటపడ్డాడు. చదవండి: Viral Video: పెళ్లిలో డ్యాన్స్‌తో దుమ్మురేపిన వదిన.. అందరి చూపు ఆమె వైపే -
మృతదేహాన్ని పీక్కుతున్న ఎలుకలు, చీమలు
లక్నో: మట్టి నుంచి వచ్చిన మానవుడు మట్టిలో కలవాల్సిందే.. కానీ, కరోనా దెబ్బకు బంధుత్వాలు, మానవత్వం మట్టిపాలు అవుతున్నాయి. కుటుంబసభ్యులు చనిపోతేనే దగ్గరుండి అంత్యక్రియల్ని జరిపించలేకపోతున్నాం. దీంతో స్మశానాల్లో, ఆస్పత్రులలో మృతదేహాల పరిస్థతి దారుణంగా తయారైంది. చీమలు, ఎలుకలు పీక్కుతింటున్నాయి. కొద్దిరోజుల క్రితం మహారాష్ట్ర సాతారా జిల్లాలో ఫల్టాన్ మున్సిపల్ పరిధిలోని ఓ శ్మశాన వాటికలో.. సగం కాలిన కరోనా మృతదేహాల అవయవాలను ఓ మతిస్థిమితం లేని వ్యక్తి తిన్న దృశ్యాలు నెటిజన్లు కంటతడి పెట్టించాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ ఆజమ్‌ఘడ్ జిల్లాలో దారుణం జరిగింది. ఆస్పత్రి మార్చురీలో మహిళ మృతదేహాన్ని ఎలుకలు, చీమలు తినడం కలకలం రేపుతుంది. ఏప్రిల్ 29న రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని మహిళ తీవ్రంగా గాయపడింది. అత్యవసర చికిత్స కోసం స్థానికులు బల్రాంపూర్ మండల ఆస్పత్రికి తరలించారు. వైద్యపరిక్షలు నిర్వహించి ఆస్పత్రిలోనే ట్రీట్మెంట్ అందిస్తుండగా.. మరుసటి రోజే ఆమె మరణించింది. దీంతో ఆమె మరణంపై కుటుంబసభ్యులకు సమాచారం అందించాలని వైద్యులు జిల్లా పోలీసులకు సమాచారం అందించారు. కానీ, 4 రోజుల తర్వాత పోలీసులు, డాక్టర్ల నిర్లక్క్ష్యంతో మార్చురీలో ఉన్న మృతదేహాన్ని చీమలు, ఎలుకలు తిన్నాయి. ఈ దారుణం వెలుగులోకి రావడంతో చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఏకే మిశ్రా అప్రమత్తమయ్యారు. గుర్తుతెలియని మహిళ మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించేందుకు సిద్ధమైనట్లు తెలిపారు. మృతదేహాన్ని ఎలుకలు తిన్న ఘటనలో బాధ్యులైన వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. -
10 రోజుల కష్టంతో తండ్రి శవం సాధించిన బాలుడు
లక్నో: కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఎన్నో విషాద.. అమానవీయ సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. కరోనా కథలు ఎన్ని చెప్పిన తక్కువే. తాజాగా ఓ ఆస్పత్రి అధికారులు కరోనాతో చనిపోయిన వ్యక్తి మృతదేహం అప్పగించకుండా పది రోజులుగా మార్చురీలోనే పడేశారు. మృతుడికి సంబంధించిన బంధువులు రాలేదంట.. వచ్చిన అతడి కుమారుడు మైనర్ బాలుడు కావడంతో అతడికి మృతదేహం అప్పగించడం కుదరదని అధికారులు చెప్పారు. దీంతో ఆ పిల్లాడు కాళ్లరిగేలా తండ్రి మృతదేహం తీవ్రంగా కష్టపడ్డాడు. చివరకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు కలగజేసుకోవడంతో ఎట్టకేలకు తండ్రి మృతదేహాన్ని తీసుకెళ్లాడు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌లో ఉన్న దీన్‌దయాల్ ఆస్పత్రికి రోజువారీ కూలీ రాజు ఏప్రిల్ 21వ తేదీన వచ్చాడు. ఆరోగ్యం విషమించడంతో ఏప్రిల్ 23వ తేదీన మృతి చెందాడు. దీంతో కొడుకు తన తండ్రి మృతదేహం అప్పగించాలని అధికారులను కోరాడు. అయితే పిల్లాడు మైనర్ కావడంతో అధికారులు శవం అప్పగించడానికి నిరాకరించారు. ఎవరైనా పెద్దవారిని తీసుకురా అని చెప్పాడు. అయితే ఆ బాలుడికి తండ్రి తప్ప నా అనేవారు ఎవరూ లేరు. బంధువులను బతిమిలాడాడు. అయితే కరోనా భయంతో మృతదేహాన్ని తీసుకువచ్చేందుకు వారు నిరాకరించారు. దీంతో పది రోజులుగా రాజు మృతదేహం ఆస్పత్రి మార్చురీలోనే ఉండిపోయింది. చివరకు స్థానికుడు మహేశ్ స్పందించి ఎమ్మెల్యే అనిల్ పరషార్, ఎమ్మెల్సీ మాన్వేంద్ర ప్రతాప్ సింగ్ సహాయంతో ఆ బాలుడి తండ్రి మృతదేహాన్ని పది రోజుల అనంతరం బయటకు తీసుకువచ్చారు. అయితే తండ్రి అంత్యక్రియలు నిర్వహించేందుకు బాలుడి వద్ద డబ్బు కూడా లేకపోవడంతో ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు ముందుకు వచ్చి అంత్యక్రియలను జరిపించారు. ఈ విధంగా తండ్రి మృతదేహం కోసం ఆ బాలుడు తీవ్రంగా కష్టపడి చివరకు అతికష్టమ్మీద తన తండ్రికి పున్నామ నరకం నుంచి తప్పించాడు. అయితే ఆస్పత్రి అధికారులపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. బాలుడి తండ్రి మృతదేహం అప్పగించడంలో నిబంధనల పేరిట ఇబ్బందులకు గురి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. చదవండి: ఆక్సిజన్ కొరత లేదు.. కరోనా కంట్రోల్లోనే -
పగవాడికి కూడా రావొద్దు ఈ కష్టం
న్యూఢిల్లీ : కరోనా దెబ్బకు జనం చిగురుటాకుల్లా వణికిపోతున్నారు. ముసలి, ముతకా, ఉన్నోడు, లేనోడు ఇలా తారతమ్యాలు లేకుండా కరోనా ప్రతి ఒక్కరిపై తన ప్రతాపం చూపిస్తుండడంతో బ్రతుకు జీవుడా అంటూ క్షణం క్షణం భయం గుప్పిట్లో జనం బతుకుతున్నారు. ఓవైపు కరోనా సోకిందనే అనుమానంతో టెస్ట్‌లు చేయించుకుందామనేలోపే ఊపిరి ఆగిపోతున్న ఘటనలు కంటతడి పెట్టిస్తున్నాయి. తాజాగా ఢిల్లీకి చెందిన ఓ మహిళ ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోయింది. వివరాలు.. ఢిల్లీకి చెందిన 35 ఏళ్ల జాగృతి సాఫ్ట్ వేర్‌గా విధులు నిర్వహిస్తుంది. ఆమెకు ఇద్దరు పిల్లలు. అయితే ఆమెకు కరోనా సోకి ఆరోగ్యం క్షీణించడంతో అత్యవసర చికిత్స కోసం ఆమె భర్త తన కారులో ఇంటినుంచి గ్రేటర్ నోయిడాలోని ప్రభుత్వాసుపత్రికి బయలు దేరారు. ఆస్పత్రి బయట పార్కింగ్ ఏరియాలో ఆమె స్పృహ కోల్పోయింది. దీంతో కంగారు పడ్డ ఆమె భర్త పరిగెత్తుకుంటూ వెళ్లి తనకు ఆక్సిజన్ సిలీండర్ కావాలని, తన భార్య ప్రాణాపాయస్థితిలో ఉందని ఆస్పత్రి సిబ్బందని వేడుకున్నాడు. ఆక్సిజన్ సిలిండర్ లేకపోవడంతో చివరికి ఆస్పత్రిలో అడ్మిట్ చేయాలని స్ట్రెచ్చర్ కోసం వెతికాడు. కానీ అప్పటికే నష్టం జరిగిపోయింది. పార్కింగ్ స్థలంలో ఉన్న కారులోనే జాగృతి మరణించింది. బాధితురాలు ప్రాణాలు కోల్పోయిందని సమాచారం అందుకున్న ఆస్పత్రి సిబ్బంది ఆమె డెడ్‌బాడీ పట్ల మరింత కాఠిన్యం ప్రదర్శించారు. ప్రోటోకాల్ పేరుతో మృతదేహాన్ని మార్చురీకి తీసుకెళ్లి దహనం చేసేందుకు కూడా ఏర్పాట్లు చేయలేదు.పైగా దహన సంస్కారం చేసే ముందు సుమారు 3 గంటల పాటు తన భార్య జాగృతి మృతదేహాన్ని కారులో అలాగే ఉంచారని బాధితురాలి భర్త కన్నీరుమున్నీరయ్యాడు. -
మార్చురీలో బాడీని కోస్తుండగా కళ్లు తెరిచాడు
కెరిచో: ఓ ఆస్పత్రి నిర్లక్ష్యం మనిషి బతికుండగానే మార్చురీలో పడుకోబెట్టేలా చేసింది. చనిపోయాడనుకున్న వ్యక్తిని అంత్యక్రియల కోసం సిద్ధం చేస్తుండగా స్పృహలోకి రావడంతో సిబ్బంది భయంతో పరుగులు పెట్టారు. వివరాల్లోకి వెళ్తే.. కెరిచో దేశానికి చెందిన ముప్పై రెండేళ్ల పీటర్ కైగెన్ కడుపు సంబంధిత సమస్యలతో కప్లాటెట్ ఆస్పత్రికి వెళ్లాడు. అయితే ఓ నర్సు అతడు చనిపోయినట్లు రోగి కుటుంబానికి తెలిపింది. దీంతో సిబ్బంది అతడిని మార్చురీ గదిలోకి తరలించారు. అంత్యక్రియలు జరిపేవరకు అతడి శరీరం కుళ్లిపోకుండా ఉండేందుకు సిబ్బంది ఎంబాలింగ్ ప్రక్రియను చేపట్టారు. (చదవండి: షాకింగ్ వీడియో: యువతి మృతదేహాన్ని..) అందులో భాగంగా అతడి శరీరం నుంచి రక్తాన్ని వేరు చేసే ప్రక్రియను మొదలు పెట్టారు. ఇంతలో అతడు నొప్పితో కళ్లు తెరిచి, కేకలు పెట్టగా చనిపోయిన వ్యక్తికి మళ్లీ ప్రాణం వచ్చిందని సిబ్బంది భయభ్రాంతులకు లోనయ్యారు. కాసేపటికే అతడు చనిపోలేదని నిర్ధారణకు క్యాజువల్ సాధారణ వార్డులోకి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ షాకింగ్ ఘటన గురించి కైగెన్ సోదరుడు మాట్లాడుతూ.. "మార్చురీలో ఉన్న వ్యక్తి కంగారుగా మా దగ్గరకు వచ్చి లోపలకు రమ్మన్నారు. అక్కడ కైగెన్ శరీరంలో కదలికలు చూసి షాకయ్యాం. ఓ క్షణం పాటు ఏం జరుగుతుందనేది మాకే అర్థం కాలేదు. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగింది" అని చెప్పుకొచ్చారు. మరోవైపు కైగెన్ మాట్లాడుతూ.. 'ఇది నేనే నమ్మలేకపోతున్నాను. నేను చనిపోయానని డాక్టర్లు ఎలా చెప్పారు? అసలు ఎప్పుడు స్పృహ కోల్పోయానో, ఎప్పుడు తిరిగి ఈ లోకంలోకి వచ్చానో నాకే తెలీట్లేదు. ఏదేమైనా నాకు మళ్లీ జీవితాన్ని ప్రసాదించినందుకు ఆ దేవుడికి ధన్యవాదాలు" అని సంతోషం వ్యక్తం చేశారు. (చదవండి: కన్నీళ్లు ఇంకిపోయేలా ఏడ్చాను) -
అడ్డంగా దొరికిన ఆస్పత్రి అటెండర్
-
అడ్డంగా దొరికిన ఆస్పత్రి అటెండర్
సాక్షి, విజయవాడ: కృష్ణజిల్లా మచిలీపట్నంలో అమానవీయ ఘటన వెలుగు చూసింది. మృతదేహాన్ని అప్పగించాడానికి డబ్బులు ఇవ్వాల్సిందేనని మార్చురీ అటెండర్ డిమాండ్ చేశాడు. అసలే కూతురు చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ తల్లిదండ్రులు లంచం ఇవ్వక తప్పలేదు. అయితే, ఆ అటెంటర్ లంచావతారం మొత్తం వీడియోలో రికార్డవడంతో వైరల్‌గా మారింది. వివరాలు.. ఈ నెల 21 సుమలలిత అనే వివాహితను ఆమె భర్త హత్య చేశాడు. పోలీసులు మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. కూతురి మృతదేహం కోసం మార్చురీకి వెళ్లిన మృతురాలి తల్లిదండ్రులకు చేదు అనుభవం ఎదురైంది. శవాన్ని ఇచ్చేందుకు మార్చురీ అటెండర్ రూ.6 వేలు లంచం డిమాండ్ చేశాడు. డబ్బులు ఇవ్వనిదే మృతదేహాన్ని అప్పగించేది లేదని స్పష్టం చేశాడు. చివరకు ఆ తల్లిదండ్రులు రూరూ.1500 ముట్టజెప్పారు. ఈక్రమంలో వారి బంధువులు అటెండర్ బాగోతాన్ని వీడియో తీసి వైరల్ చేశారు. మార్చురీ అటెండర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
గాంధీలో మళ్లీ అదే సీన్
సాక్షి, హైదరాబాద్: గాంధీ ఆస్పత్రి మార్చురీ వైద్య సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. కరోనా వైరస్ బారిన పడి మూ డ్రోజుల క్రితం గాంధీ ఆస్పత్రిలో మరణించిన బేగంపేటకు చెందిన వ్యక్తి (48) మృతదేహం తారుమారైన ఘటన మరకముందే తాజాగా గురువారం మరో వ్యక్తి (37) మృతదేహం కనిపించకుండా పోవ డం వివాదాస్పదంగా మారింది. తీరా కు టుంబసభ్యులు ఆస్పత్రికి చేరుకుని అధికారులను నిలదీయడంతో అసలు విషయం బయటపడింది. ఒకరికి ఇవ్వాల్సిన మృతదేహాన్ని మరొకరికి ఇచ్చినట్లు తేలింది. అయితే ఈ అంశాన్ని గాంధీ వైద్యులు కానీ.. పోలీసులు కానీ ఇప్పటివరకు అధికారికంగా ధ్రువీకరించలేదు. అసలేమైందంటే..? మెహిదీపట్నానికి చెందిన రషీద్‌ఖాన్ (37) దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలతో బాధపడుతూ చికిత్స కోసం ఈ నెల ఏడో తేదీన నగరంలోని మెడిసిటీ ఆస్పత్రిలో చేరాడు. కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో 8న ఆయన్ను గాంధీ ఆస్పత్రికి తర లించారు. తొమ్మిదో తేదీ రాత్రి ఆయన మృతిచెందాడు. ఇదే సమయంలో.. గాం ధీలో కరోనాతో ప çహాడీషరీఫ్కు చెంది న మహమూద్ (40) మరణించాడు. ఇరువురి మృతదేహాలను గాంధీ మార్చురీకి తరలించారు. ఈ విషయాన్ని ఇరువురి కుటుంబసభ్యులకు చేరవేశారు. దీంతో బుధవారం (10వ తేదీన) ఉదయం పçహాడీషరీఫ్ మృతునికి సంబంధించిన కుటుంబసభ్యులు ఆస్పత్రికి చేరుకుని ఒక మృతదేహాన్ని చూసి, ఇది తమదేనని చెప్పి వెంట తీసుకెళ్లి అం త్యక్రియలు పూర్తి చేశారు. ఇటు మరణించిన మెహిదీపట్నం వ్యక్తికి సంబంధించిన కుటుంబసభ్యులు గురువారం ఉదయం ఆస్పత్రికి చేరుకున్నారు. మార్చురీలోకి వెళ్లి మృతదేహాలను పరిశీలించగా, వాటిలో రషీద్‌ఖాన్ మృతదే హం కన్పించకపోవడంతో వారు అధికారులను నిలదీశారు. వార్డులన్నీ తిరిగి.. చివరికి మారిపోయి నట్లు గుర్తించి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ రమేశ్‌రెడ్డి సహా, స్థానిక డీసీపీ కల్మేశ్వర్‌లు హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్నారు. ఒకవేళ రషీద్ చనిపోయి ఉండకపోతే ఆస్పత్రిలోనే ఉండి ఉంటారని భావించి, ఆ మేరకు కుటుంబ సభ్యులతో కలసి ఆస్పత్రిలోని ఐసీయూ, ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులందరినీ పరిశీలించారు. వారిలో సదరు వ్యక్తి కన్పించకపోవడంతో మరింత ఆందోళనకు గురయ్యారు. అంతా కలసి చివరకు మళ్లీ మార్చురీకి చేరుకున్నారు. ఈ నెల 10న మార్చురీకి చేరుకున్న వారి మృతదేహాలతో పాటు మార్చురీ నుంచి మృతదేహాలను తీసుకెళ్లిన వారి వివరాల ను ఆరా తీశారు. మెహిదీపట్నంకు చెందిన రషీద్ మృతదేహాన్ని పహాడీషరీఫ్‌కు చెందిన మహమూద్‌గా భావించి సదరు వ్యక్తి కుటుంబ సభ్యులు తీసుకెళ్లినట్లు గుర్తించారు. ఆ మేరకు వారిని ఆస్పత్రికి పిలిపించారు. మహమూద్ మృతదేహం గాంధీ మార్చురీలోనే ఉన్నట్లు గుర్తించారు. అధికారులు ఇరువురు కుటుంబసభ్యులతో చర్చించి సమస్యను సద్దుమణిగేలా చేశారు. కాగా, మహమూద్ మృతదేహాన్ని కూడా అంత్యక్రియల కోసం జీహెచ్ఎంసీ సిబ్బందికే అప్పగించడం కొసమెరుపు. అధ్వానంగా రికార్డుల నిర్వహణ.. మార్చురీకి వచ్చే మృతదేహాలను భద్రపరిచే విషయంలోనే కాదు వాటికి సంబంధించిన కేసు షీట్లు, రికార్డుల నిర్వహణ అధ్వానంగా ఉన్నట్లు మరోసారి స్పష్టమైంది. కరోనా వైరస్‌తో చనిపోయిన వారి మృతదేహాలను పూర్తిగా కవర్ కట్టిపెట్టడం, వాటికి రికార్డ్ ట్యాగ్లు లేకపోవడం, గుర్తింపు కోసం వచ్చిన బంధువులు కూడా ఎక్కడ తమకు వైరస్ సోకుతుందో అనే భయంతో దూరం నుంచే వాటిని చూడాల్సి రావడం, మృతదేహాల ముఖం పూర్తిగా కన్పించకపోవడం, అంత్యక్రియలు నిర్వహించే సమయంలోనూ పూర్తిగా తెరిచి చూపించకపోవడం సమస్యకు కారణమవుతోంది. ఇకపై మృతదేహాల గుర్తింపు పక్కాగా నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. మృతదేహానికి మృతుని పేరు, వయసు, చిరునామాతో కూడిన ట్యాగ్‌ను ఏర్పాటు చేయడంతో పాటు గుర్తింపు కోసం వచ్చే బంధువులను కూడా ఫొటో, వీడియో రూపంలో రికార్డు చేయాలని నిర్ణయించారు. -
కరోనా శవాల బాధ్యత కూడా వారిదే
విష్ణు గుర్జార్.. అతను జైపూర్‌లోని స్వారీ మాన్ సింగ్(ఎస్ఎమ్ఎస్) ఆసుపత్రిలో మార్చురీ గదిలో పనిచేస్తాడు. శవాల మధ్యలో పని చేసినప్పటికీ ఎప్పుడూ శ్మశానం వైపు వెళ్లేవాడు కాదు. కానీ కరోనా వైరస్ వ్యాప్తి తర్వాత ఇప్పుడు అతను తరచూ శ్మశానానికి వెళ్తున్నాడు. అనాథలా మిగిలిపోతున్న శవాలకు అన్నీ తానై దహన సంస్కారాలు చేస్తున్నాడు. హిందువులైనా ముస్లింలైనా తనకు అందరూ సమానమేనంటూ అంతిమ సంస్కారాలు చేస్తున్నాడీ యువకుడు. కరోనాతో చనిపోయిన వారి దహన సంస్కారాల బాధ్యత మార్చురీ వర్కర్ల మీద పెట్టింది రాజస్థాన్ ప్రభుత్వం. దీనికోసం ప్రత్యేకంగా ఆరు గంటల షిఫ్ట్ కేటాయిస్తూ కరోనా శవాల అంతిమ సంస్కారాలకు సాయం చేయాల్సి ఉంటుందని ఆదేశించింది. వైరస్ సోకుతుందన్న భయం వెంటాడుతుంది ఈ నిర్ణయం గురించి గురించి విష్ణు గుర్జార్ మాట్లాడుతూ.. "నా జీవితంలో శ్మశానానికి వెళ్తానని ఎప్పుడూ అనుకోలేదు. పైగా ఆ ప్రదేశమంటే నాకు భయం కూడా. అంతేకాకుండా ఇస్లామిక్ ఆచారాల గురించి ఏమీ తెలీదు. కానీ ఇప్పుడు హిందువులైనా, ముస్లింలైనా నాకు అందరూ సమానమే. ఎందుకంటే నాకు ఎలాంటి మతం లేదు. ఎవరూ లేని వారికీ నేనున్నా" అని చెప్పుకొస్తున్నాడు. ఇతనితోపాటు తోటి వర్కర్లు పంకజ్, మనీశ్, మంగళ్, అర్జున్, సూరజ్‌లు కూడా ఇలాంటి పనుల్లో భాగస్వామ్యం అవుతున్నారు. అయితే వైరస్ ఎక్కడ సోకుతుందోనని భయం గుప్పిట్లో బతుకుతున్నారు. (ఇలాంటి కష్టం పగవాడికి కూడా వద్దు) మమ్మల్ని ఎవరూ గుర్తించరు.. ఆరు నెలల పాప, మూడేళ్ల కొడుకు ఉన్న విష్ణు గత 40 రోజులుగా ఇంటికే వెళ్లలేదు. మరోవైపు పంకజ్ తన వివాహాన్ని వాయిదా వేసుకున్నాడు. వీరి శ్రమను, సేవలను ప్రజలు, ప్రభుత్వాలు ఏమాత్రం గుర్తించట్లేదని విచారం వ్యక్తం చేస్తున్నారు. గుర్జార్ మాట్లాడుతూ.. "ఇళ్లకు వెళ్లినప్పుడు కాలనీ వాసులు ప్రశంసించడం మాని తిరిగి భయపెడతారు. మమ్మల్ని, మా సేవలను గుర్తించరు. కనీసం మాకు మంచి భోజనం వంటి సరైన సదుపాయాలు కూడా లభించవు" అని ఆవేదన వ్యక్తం చేశారు. జైపూర్‌లో ఇప్పటివరకు కరోనా వల్ల 63 మంది మరణించగా ఇందులో 36 శవాలను శ్మశానానికి తీసుకెళ్లి మరీ మార్చురీ వర్కర్లు అంత్యక్రియలు నిర్వహించారు. (హెల్మెట్ ధరిస్తే.. శానిటైజర్ ఫ్రీ) -
మార్చురీలో ఎలుకలపై విచారణ
ఏలూరు టౌన్: ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీలో మృతదేహం కనుగుడ్లు, కనురెప్పలను ఎలుకలు తినివేసిన సంఘటనపై ఉపముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని సీరియస్ అయ్యారు. ఆయన ఆదేశాల మేరకు గురువారం ఏలూరు జిల్లా ఆసుపత్రిలో వైద్యవిధాన పరిషత్ రీజనల్ డైరెక్టర్ డాక్టర్ వాణి, ఏపీ మెడికల్ బోర్డు మెంబర్ డాక్టర్ దిరిశాల వరప్రసాదరావు విచారణ చేశారు. మార్చురీ, ఆస్పత్రి ప్రాంగణాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. డీసీహెచ్ఎస్ డాక్టర్ కె.శంకరరావు, డీఎంహెచ్ఓ బి.సుబ్రహ్మణ్యేశ్వరి, ఆ సుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఏఎస్ రామ్‌తో కలిసి పరిస్థితిని సమీక్షించారు. ఆసుపత్రి మార్చురీ నిర్వహణ ఎలా ఉందో స్వయంగా తనిఖీ చేశారు. మార్చురీలోని ఫ్రీజర్ బాక్సులను, సౌకర్యాలను గమనించారు. ఫ్రీజర్ బాక్సులకు రంధ్రాలు ఉండటాన్ని చూసి రీజనల్ డైరెక్టర్ వాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితి ఉంటే ఎలుకలు ఎందుకు వెళ్లకుండా ఉంటాయంటూ వైద్యాధికారులను ప్రశ్నించారు. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎలాగంటూ అధికారులు, సిబ్బంది తీరుపై మండిపడ్డారు. ఫ్రీజర్ బాక్సులకు మరమ్మతులు ఆసుపత్రి ప్రాంగణంలోని రెండు మార్చురీ గదులను పరిశీలించామని, ఒక గదిలో సరిగా సౌకర్యాలు లేకపోవటంతో దానిని సీజ్ చేయాలని ఆదేశించినట్టు ఆర్డీ వాణి తెలిపారు. ఫ్రీజర్ బాక్సులకు మరమ్మతులు చేయించాలని ఆదేశించామని, ఇకపై ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు చేపడతామన్నారు. ఆసుపత్రి పారిశుధ్య విభాగానికి సంబంధించి ఫెస్ట్ కంట్రోల్ కాంట్రాక్ట్ సంస్థపై చర్యలు తీసుకుంటామన్నారు. వివరణ ఇవ్వాల్సిందిగా నోటీసులు జారీ చేశామని, ఆ సంస్థ కాంట్రాక్ట్‌ను రద్దు చేస్తామన్నారు. ఏపీ మెడికల్ కౌన్సిల్ బోర్డు మెంబర్ డాక్టర్ దిరిశాల వరప్రసాదరావు మాట్లాడుతూ ఈ సంఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని ఆదేశించారని, పూర్తి జాగ్రత్త తో చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. డీసీహెచ్ఎస్ డాక్టర్ శంకరరావు మాట్లాడుతూ ఏలూరు జిల్లా ఆసుపత్రిలో ఈగల్ హంటర్ అనే సంస్థకు ఫెస్ట్ కంట్రోల్ బాధ్యతలు అప్పగించామన్నారు. ఎలుకలు, పాములు, పందులు, కుక్కలు, క్రిమికీటకాలు లేకుండా ఆసుపత్రి ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచటమే వారి బాధ్యత అన్నారు. ఈ ఫెస్ట్ కంట్రోల్ సంస్థకు నెలకు రూ.40 వేలు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందన్నారు. సంస్థ ఇద్దరు సిబ్బందిని నియమించి, రాత్రి, పగలు పనిచేసేలా చూస్తారని తెలిపారు. ఆ రోజు రాత్రి విధులు నిర్వర్తించిన వెంకటేశ్వరరావును బాధ్యతల నుంచి తొలగించామని, వేరే సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. రెడ్‌క్రాస్ ౖచైర్మన్ జయప్రకాష్, ఆర్ఎంవో తవ్వా రామ్మోహనరావు, క్వాలిటీ మేనేజర్ మనోజ్ తదితరులు ఉన్నారు. -
చనిపోయిందని వదిలేసి వెళ్లారు!
కర్నూలు (హాస్పిటల్): అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లలకు ఏదైనా అనారోగ్యం కలిగితే విలవిల్లాడిపోతాం. అలాంటిది ఓ పదేళ్ల బాలిక అనారోగ్యంతో చనిపోతే.. మృతదేహాన్ని ఆసుపత్రిలోనే వదిలేసి వెళ్లారు కుటుంబసభ్యులు. వివరాల మేరకు.. కర్నూలు జిల్లా నందికొట్కూరుకు చెందిన లావణ్య (10)కు ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆమె తండ్రి భాస్కర్, తాత కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చేర్పించారు. పాప కోలుకోకపోవడంతో గురువారం రాత్రి మృతి చెందింది. అప్పటికే తండ్రి అక్కడి నుంచి వెళ్లిపోగా.. చనిపోయే వరకు ఉన్న తాత కూడా మృతదేహాన్ని ఆసుపత్రిలోనే వదిలేసి మెల్లిగా జారుకున్నాడు. ఆసుపత్రి సిబ్బంది ఈ విషయాన్ని అవుట్‌పోస్టు పోలీసులకు తెలిపారు. పేషెంట్ రిజిస్టర్లో నమోదైన వివరాలను బట్టి పోలీసులు బాలిక కుటుంబసభ్యుల కోసం ఆరా తీస్తున్నారు. మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచారు. -
శవాలకూ రక్షణ కరువు
సాక్షి, జగిత్యాల: జిల్లాకేంద్రంలోని ప్రధానాస్పత్రిలో శవపరీక్షలకు కష్టకాలం వచ్చింది. జిల్లా ఆస్పత్రిలోని మార్చురీ గది చిన్నగా ఉండడం, ఫ్రీజర్ సైతం ఒకటే ఉండడం ఇబ్బందిగా మారింది. సెలవు దినాల్లో రెండుకు మించి మృతదేహాలు వస్తే భద్రపరచడం కూడా కష్టంగా మారింది. రెండేళ్ల క్రితం ఓ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మార్చురీలో భద్రపరచగా.. ఎలుకలు తిన్నాయి. అంతేకాకుండా ఫ్రీజర్‌లోనూ రెండు మృతదేహాలను మాత్రమే భద్రపరిచే అవకాశం ఉంది. అది కూడా ఒక దానిపైన మరో శవాన్ని ఉంచాల్సి వస్తుండడంతో మృతుల బంధువుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. జిల్లా ఆస్పత్రిలో ఒకే ఫీజర్ జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి చుట్టుపక్కల గ్రామాల నుంచి రోగులు వస్తుంటారు. ఏదైన ప్రమాదం జరిగి చనిపోతే పోస్టుమార్టం కోసం ఇక్కడికే తీసుకొస్తుంటారు. మున్సిపాలిటీగా ఉన్న సమయంలో ఆస్పత్రిని అప్పటి జనాభా అవసరాలకు అనుగుణంగా నిర్మించారు. ప్రస్తుతం జిల్లాగా అవతరించడం, జనాభా పెరగడం తో ఆస్పత్రి సరిపోవడం లేదు. దీంతో పోస్టుమార్టం గది సైతం చిన్నగా మారింది. ఈ గదిలో రెండు ఫ్రీజర్లతోపాటు ఒక బల్ల మాత్రమే ఉన్నా యి. ఈ ఆస్పత్రికి వారంలో కనీసం 3 నుంచి 4 మృతదేహాలు వస్తుంటాయి. సాయంత్రం వేళ పోస్టుమార్టం చేయకపోవడం, రాత్రి వేళ చనిపోయిన వారిని ఇక్కడే తేవడంతో మృతదేహాలను పోస్టుమార్టం గదిలో భద్రపరుస్తుంటారు. రెండు మృతదేహాలకన్నా ఎక్కువగా ఉంటే బయట వరండాలోనే వేయాల్సిన దుస్థితి. అన్నీ అసౌకర్యాలే.. పోస్టుమార్టం గదికి ఒక భవనంతోపాటు మృతదేహాలను భద్రపర్చేందుకు ఒక గది, కుళ్లిన మృతదేహాల నుంచి సేకరించిన నమూనాలను భద్రపరిచేందుకు ఒక గది ఉండాలి. కానీ ఇందులో రెండు మాత్రమే ఉన్నాయి. ఇందులో నిరంతరం నీటి సరఫరాతోపాటు శుభ్రం చేసేందుకు వాక్యుమ్‌క్లీనర్లు ఉండాలి. ఇవన్నీ కనిపించడం లేదు. పరికరాలు సైతం స్టీల్‌తో చేసినవి ఉండాలి. గది లోపలికి గాలి వెళ్లేందుకు ఎగ్జిట్‌ఫ్యాన్లు సైతం ఉండాలి. కానీ ఈ గది పురాతనమైనది కావడంతో ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. అంతేకాకుండా ఇతర సామగ్రిని సైతం ఇందులోనే వేస్తున్నారు. శవ పంచనామా రాసేందుకు ప్రత్యేక గది లేదు. మరొకటి ఎప్పుడో ? జగిత్యాల జిల్లా కేంద్రంగా మారడంతో ఆస్పత్రిని జిల్లా ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేసినప్పటికీ ఆ స్థాయిలో వసతులు కల్పించలేదు. మృతదేహాలు సైతం దాదాపు నెలకు 30కి పైగానే వస్తుంటాయి. వీటన్నింటికి పోస్టుమార్టం చేసేందుకు ఒకే గది ఉంది. గతంలో అధికారులు పరిశీలించినప్పటికీ స్థలం లేదని, ఉన్న దాంట్లోనే మరమ్మతులు చేపట్టారు. ఇప్పటికైన అధికారులు స్పందించి జిల్లా కేంద్రంలోని ఆస్పత్రిలో మరో పోస్టుమార్టం గదిని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. స్థలం లేకనే ఇబ్బందులు ప్రస్తుతం ఉన్న పోస్టుమార్టం గదికి మరమ్మతులు చేయిస్తున్నాం. అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. మరో గదిని ఏర్పాటు చేయాలంటే స్థలం లేదు. ప్రస్తుతం ధరూర్ క్యాంప్‌లో నిర్మిస్తున్న మాతాశిశు సంక్షేమ భవనంలోకి గైనిక్ విభాగం వెళ్తే ఇబ్బందులు తొలగుతాయి. ఇటీవల మృతదేహాలు కూడా ఎక్కువగానే వస్తున్నాయి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. – సుదక్షిణాదేవి, ఆస్పత్రి సూపరింటెండెంట్ -
డివైడర్‌ను ఢీకొన్న డీసీఎం వ్యాన్: ముగ్గురి మృతి
పహాడీషరీఫ్: డీసీఎం వ్యాన్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీ కొట్టిన ఘటనలో ముగ్గురు కూలీలు మార్బుల్స్ మధ్య నలిగిపోయి దుర్మరణం పాలయ్యారు. పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకున్న ఘటన వివరాలిలా ఉన్నాయి. శంషాబాద్ నుంచి డీసీఎం వ్యాన్ (ఏపీ 28 టీఏ2410) కల్వకుర్తి వైపు మార్బుల్స్ లోడ్‌తో ఏడుగురు కార్మికులను ఎక్కించుకుని వెళుతోంది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ రోడ్డు తుక్కుగూడ గ్రామం వద్దకు రాగానే డీసీఎం డ్రైవర్ నియంత్రణ కోల్పోయి వాహనాన్ని టోల్గేట్ డివైడర్‌కు ఢీ కొట్టాడు. ఈ ఘటనలో షాపూర్ గ్రామానికి చెందిన రాములు(32), సాయిలు(40), కూకట్‌పల్లికి చెందిన శ్రీను(35)లు మార్బుల్స్ మధ్య నలిగిపోయి అక్కడికక్కడే మృతి చెందారు. ఎ.సంగయ్య(50), సత్యనారాయణ(48), పండరీ (32), ఎర్ర సాయిలు(40)కు తీవ్రంగా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పహాడీషరీఫ్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. -
బతికేవున్నా.. చచ్చాడంటూ..
మధ్యప్రదేశ్: డెబ్బై ఏళ్ల వృద్ధుడు మృతి చెందాడని వైద్యులు నిర్ధారించి రాత్రంతా మార్చురీలో ఉంచిన ఘటన మధ్యప్రదేశ్‌లోని ఓ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కాశీరాం(72) అనే వృద్ధుడు గురువారం రోజు రోడ్డుపై స్పృహ తప్పిపడిపోయాడు. స్థానికులు అతన్ని సాగర్ జిల్లాలోని బినా సివిల్ ఆస్పత్రికి తరలించగా డ్యూటీలో ఉన్న డాక్టర్ అతడు మృతి చెందినట్లు నిర్ధారించాడు. బాడీని రాత్రంతా మార్చురీలో (మృతదేహాలను ఉంచే గది) ఉంచారు. ఆ వృద్ధుడి మృత దేహాన్ని మర్చురీ ఉంచినట్లు పోలీసులకు తెలిపారు. పోస్ట్‌మార్టమ్ నిమిత్తం పోలీసులు శుక్రవారం ఉదయం అస్పత్రిలోని మార్చురీలో ఉన్న మృతదేహాన్ని పరిశీలించగా.. అతడు బతికే ఉన్నట్లు తేలింది. ఈ క్రమంలో కంగుతిన్న డ్యూటీ డాక్టర్ బతికున్న ఆ వృద్ధుడికి చికిత్స అందించారు. అయినప్పటికినీ అతను కొంత సమయం పాటు చికిత్స పొంది..మృతి చెందాడు. విచారణలో భాగంగా ..ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఈ నెల 14న ఆస్పత్రికి వచ్చాడని తేలిసింది. ‘వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే వృద్ధుడు మరణించాడని, ఈ విషయాన్ని జిల్లా పాలనా యంత్రాంగానికి చేరవేస్తూ.. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. ఆస్పత్రి ప్రధాన వైద్యాధికారి మాట్లాడుతూ.. ‘ఈ విషయంపై ఎంక్వైరీ నిర్వహించి, డ్యూటీలో ఉన్న డాక్టర్‌ను వెంటనే గుర్తించి మోమో జారీ చేస్తామన్నారు. -
ఎన్ఎఫ్
జూన్ 10వ తేదీ తెల్లవారుజాము 5 గంటలవుతోంది. నార్త్ జోన్ పరిధిలోని మధురానగర్ పోలీస్ స్టేషన్లో ఫోన్ మోగుతోంది. నైట్ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ నిద్ర మత్తులో ఉండి అసహనంగా రిసీవర్‌ను చెవిలో పెట్టుకున్నాడు. ‘‘సార్... ఇక్కడ ఒక శవం ముక్కలు ముక్కలుగా నరికి పడి ఉంది. అర్జెంట్‌గా రావాలి’’ అవతలి వ్యక్తి భయంగా చెప్పాడు. ఇది విన్న కానిస్టేబుల్ నిద్ర మత్తు వదిలించుకుని ఆ వ్యక్తి చెప్పిన వివరాలన్నీ నమోదు చేసుకున్నాడు. వెంటనే పై అధికారులకు సమాచారం ఇచ్చాడు. అప్రమత్తమైన ఎస్సై షుకూర్ తన సిబ్బందితో ఎంజీ ఫ్లై ఓవర్ పక్కన శవం ఉన్న స్థలానికి వెళ్లాడు. ఆ స్థలం చిన్న చెత్తకుప్పలా ఉంది. చుట్టూ జనం మూగి ఉన్నారు. ‘‘ఆ..ఎవరు ఇక్కడ పోలీసులకు ఫోన్ చేసింది?’’ ఎస్సై అడిగాడు. ‘‘నేనే సార్’’ అని అక్కడున్న 45 ఏళ్ల వ్యక్తి చేతులు కట్టుకుని ఎస్సై దగ్గరికి వచ్చాడు. ‘‘ఇక్కడెందుకున్నావ్? నీకెలా కనిపించింది ఈ శవం?’’ అడిగాడు ఎస్సై. ‘‘సార్.. నేను మున్సిపాలిటీలో చెత్తను సేకరించే వ్యక్తిని. నా పనిలో భాగంగా ఈరోజు ఉదయమే ఈ ఏరియాలో చెత్త తీయడానికి వచ్చా. అప్పుడే చెత్తలో కనిపించిన శవాన్ని చూసి మీకు ఫోన్ చేశా’’ అన్నాడు. అతనితో మాట్లాడుతూనే దగ్గరికొస్తూ పరిశీలనగా చూశాడు ఎస్సై. ఆ శవాన్ని ముక్కలుగా నరికి చికెన్ వ్యర్థాల్లో కలిపి పడేశారు. దానిపై చెత్త కప్పడాన్ని చూశాడు. బహుశా పోలీసు జాగిలాలకు క్లూ దొరక్కుండా నేరస్తులు ఇలా చేశారనుకున్నాడు ఎస్సై. అక్కడ ఉపయోగపడే క్లూలు సేకరించి శరీర భాగాలను మార్చురీకి పంపాడు. సెప్టెంబర్ 23వ తేదీ ఉదయం ఆరున్నర ప్రాంతంలో ఈస్ట్‌జోన్ పరిధిలోని కంప చెట్లలో ఓ యువతి శవాన్ని కనుగొన్నారు పోలీసులు. అక్కడకు పెద్ద సంఖ్యలో ప్రజలు, మీడియా ప్రతినిధులు చేరారు.మీడియా వాళ్లను స్పాట్‌కు రానివ్వకపోవడంతో దూరం నుంచే వీడియోలు తీస్తూ లైవ్ టెలికాస్ట్ చేస్తున్నారు. అంతకంతకూ జనం తాకిడి పెరుగుతుంటే కంట్రోల్ చేయడానికి పోలీసులకు తలనొప్పిగా మారింది.ఈస్ట్‌జోన్ ఏసీపీగా కొత్తగా విధుల్లోకి చేరిన భగత్ అప్పుడే ఆ స్పాట్‌కు వచ్చాడు. శవాన్ని పరిశీలిస్తూ సిబ్బంది ద్వారా వివరాలు సేకరిస్తున్నాడు. ‘‘సార్... యువతి వయసు 25 ఏళ్లు ఉంటుంది. నిందితులు అత్యాచారం చేసి దారుణంగా హతమార్చారు. మొహం గుర్తు పట్టకుండా ఉండేలా యాసిడ్ పోయడంతో ముఖం మొత్తం కాలిపోయింది’’ చెప్పారు సిబ్బంది. ‘‘సరే ఏవైనా క్లూస్ దొరికాయా?’’ అని అడిగి మొత్తం కులంకషంగా పరిశీలించాలని ఆదేశించాడు భగత్. యువతి చేతి గోర్లకు రక్తం మరకలు అంటి ఉండటాన్ని సిబ్బంది గమనించి భగత్‌కు చెప్పారు. దీంతో ఫోరెన్సిక్ వారు వచ్చి ఆ క్లూస్‌ని తీసుకుని ల్యాబ్‌కు తీసుకెళ్లారు. అనంతరం యువతి శవాన్ని పంచనామా కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఫోరెన్సిక్ ల్యాబ్ ఇన్చార్జి ఎస్సై ప్రసాద్, ఏసీపీ భగత్‌కు కాల్ చేసి యువతి శరీరంపై 4 పొడవాటి వెంట్రుకలు ఉన్నాయని చెప్పాడు. నేరస్తుల్లో మహిళ కూడా ఉండొచ్చని అనుమానం వెలిబుచ్చాడు. మరిన్ని వివరాల కోసం ఆ స్పాట్‌కు వెళ్లాలని నిర్ణయించుకుని సిబ్బందితో బయలుదేరాడు భగత్. అక్కడంతా తిరిగి వెతికాడు. ఏ ఇతర క్లూ దొరకలేదు. కానీ అక్కడ బ్లూ కలర్లో ఉన్న కుడికాలు ప్లాస్టిక్ చెప్పు ఒకటి కనిపించింది. అది బాగా వాడబడి ఉంది. అందుకేనేమో కాళ్ల వేళ్లన్నీ అనిగి గుంటలు పడి ఉన్నాయి. ఆ చెప్పును తీక్షణంగా పరిశీలించిన భగత్..కుడికాలి బొటన వేలి పక్క వేలి ముద్ర లేకపోవడాన్ని గమనించాడు. చెప్పు పై భాగంలో ‘ఎన్ఎఫ్’ అనే సింబల్ మాత్రం కనిపించి కనిపించనంతగా అరిగిపోయి ఉంది. దాన్ని స్వాధీనం చేసుకున్న భగత్ సిబ్బందితో ఆఫీసుకు వచ్చాడు. ‘‘సార్ ఇప్పుడే ఫాక్స్ వచ్చింది. ఈస్ట్‌జోన్ పరిధిలో మాజీ కార్పొరేటర్ నాగేందర్ బహిరంగ సభ ఉందట. డీజీపీ ఆఫీసు నుంచి ముందస్తు సమాచారం వచ్చింది’’ అసిస్టెంట్ ఏసీపీ భగత్‌కు తెలిపాడు. ‘‘సరే చూద్దాం’’ అంటూ ఆ విషయాన్నంతగా పట్టించుకోకుండా ఏదో ఆలోచనలో మునిగిపోయాడు. ‘‘ఆ హత్య వివరాలు వచ్చాయా? పోస్టుమార్టమ్ రిపోర్టు ఏమైంది? ఆ అమ్మాయి వివరాలు తెలిశాయా?’’ అంటూ శంకర్‌ను అడిగాడు భగత్. ‘‘తెలిసింది సార్. ఆ అమ్మాయి విజయ్ సేథ్ అనే నగల వ్యాపారి కూతురు. పేరు మీనాక్షి. ఆ అమ్మాయిని అత్యాచారం చేసి గొతు నులిమి చంపారని తర్వాత ముఖంపై యాసిడ్ పోసి గుర్తు పట్టలేనంతగా నిందితులు మార్చినట్లు పోస్టుమార్టం రిపోర్టులో తెలిసింది’’ అన్నాడు.అప్పుడే ఫోరెన్సిక్ ఎస్సై ప్రసాద్ నుంచి భగత్‌కు ఫోన్ వచ్చింది.‘‘ప్రసాద్ ఎనీ ప్రోగ్రెస్?’’ అని అడిగాడు. ‘‘సార్.. హత్య జరిగిన స్థలంలో ముగ్గురు, నలుగురి పాద ముద్రలు గుర్తించాం. బహుశా ఆ హత్యలోముగ్గురు నలుగురు పాల్గొని ఉండొచ్చు’’ అని చెప్పాడు. ‘‘సరే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే నాకు చెప్పు’’ అని ఫోన్ కట్ చేశాడు భగత్. ‘‘నేను ఇక్కడ చార్జ్ తీసుకోకముందు నార్త్‌జోన్‌లో జూన్ 10న కార్పొరేటర్ చిన్నారావు మర్డర్ జరిగిందిగా.. ఆ వివరాలు కావాలి’’ అని ఏసీపీ భగత్ ఎస్సై శంకర్‌ను అడిగాడు. ‘‘ఆ కేసు ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్లో ఉంది. పూర్తి వివరాలు రాకపోవచ్చు’’ చెప్పాడు శంకర్. ‘‘నాకు అర్జెంటుగాఆ వివరాలు కావాలి’’ అని గట్టిగా చెప్పాడు భగత్.దీంతో ఎస్సై శంకర్ మధురానగర్ పోలీస్‌స్టేషన్ ఎస్సై షుకూర్‌కు ఫోన్ చేసి ‘‘ఏసీపీ సార్ కార్పొరేటర్ చిన్నారావు మర్డర్ కేసుకు సంబంధించి మాట్లాడతారంట’’ అని భగత్‌కు ఫోన్ ఇచ్చాడు. ఆ వ్యక్తి హత్య గురించి ఎంత వరకు విచారణ జరిగింది, పోస్టుమార్టం, ఫోరెన్సిక్ వివరాలన్నీ ఎంత వరకు సేకరించారో ఎస్సై షుకూర్ ఏసీపీ భగత్‌కు వివరించాడు. ‘‘ఓకే ఆ ఫైల్ నేనొకసారి చూడాలి. రేపొకసారి ఫైల్‌తో కలవండి’’ భగత్ ఆదేశించాడు.మర్నాడు ఉదయమే ఎస్సై షుకూర్ ఆ హత్యకు సంబంధించిన ఫైల్‌ను తీసుకుని ఏసీపీ భగత్ ఆఫీసుకు వచ్చాడు. ఎస్సై శంకర్ షుకూర్‌ను ఏసీపీ భగత్‌కు పరిచయం చేశాడు. ‘‘సార్ ఇదే ఆ ఫైల్. హత్య వివరాలు, ఫోరెన్సిక్, పోస్టుమార్టం రిపోర్టు అన్నీ ఈ ఫైల్లో ఉన్నాయి’’ ఫైల్‌ను భగత్‌కు ఇచ్చాడు ఎస్సై షుకూర్.ఫైల్ చూసిన భగత్ ‘‘ఇదేంటి... మృతుడి మొహం రాడ్‌తో చితక్కొట్టిననట్లుంది’’ అడిగాడు. ‘‘అవును సార్. కత్తితో గొంతుకోసి హత్య చేశాక మొహాన్ని గుర్తు పట్టకుండా చేసి శరీరాన్ని ముక్కలుగా కట్‌చేసి చికెన్ వ్యర్థాలతో కలిపి చెత్త కుప్పలో పారేశారు’’ షుకూర్ చెప్పాడు. ‘‘అయితే హత్య ఎన్ని గంటల ముందు జరిగింది?’’ అడిగాడు భగత్. బాడీని స్వాధీనం చేసుకునే సమయానికి 6 లేదా 7 గంటల ముందు జరిగి ఉంటుందని పోస్టుమార్టంలో తేలిందని తెలిపాడు.షుకూర్ ఏదో చెప్పబోతుండగా మధ్యలో ఆపిన భగత్ ప్రభుత్వాసుపత్రి డాక్టర్‌కు ఫోన్ చేసి మీనాక్షి బాడీని స్వాధీనం చేసుకునే సమయానికి ఎంత సమయం ముందు జరిగిందని అడిగాడు.సుమారు 6 గంటల ముందు జరిగి ఉంటుందని డాక్టర్ చెప్పాడు. ఓకే అని ఫోన్ పెట్టేసిన భగత్...‘‘అంటే రెండు హత్యలు దాదాపుగా అర్ధరాత్రి జరిగి ఉంటాయి’’ అని ఎస్సైతో అనుమానం వ్యక్తం చేశాడు.ఇన్వెస్టిగేషన్ గురించి ఎస్సై శంకర్‌తో మాట్లాడుతుండగానే కమీషనర్ నుంచి భగత్‌కు ఫోన్‌కాల్ వచ్చింది. ‘‘గుడ్ మార్నింగ్ సార్’’ విష్ చేశాడు భగత్. ‘‘ఆ మర్డర్ కేసు ఏమైంది?’’ భగత్‌ను అడిగాడు. ‘‘అదే పనిలో ఉన్నాం సార్. ఇన్పుట్స్ సేకరిస్తున్నాం. రెండు మూడు రోజుల్లో ఓ కొలిక్కి వస్తుంది’’ అని చెప్పాడు భగత్. వీలైనంత త్వరగా కేసు ముగించాలని ఫోన్ పెట్టేశాడు కమీషనర్. ఏసీపీ భగత్ మాజీ కార్పొరేటర్ నాగేందర్ సభ విజిటింగ్‌కు బయల్దేరాడు. సభా ప్రాంగణానికి వచ్చిన భగత్ అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నాడు.‘‘మినిస్టర్ క్యాంపు ఆఫీసు నుంచి కాన్వాయ్ బయల్దేరిందా?’’ ఎస్సై శంకర్‌ను అడిగాడు భగత్. ‘‘ఇప్పుడే స్టార్ట్ అయింది సార్’’ శంకర్ బదులిచ్చాడు. ఇంతలోనే సభకు ముఖ్య అతిథిగా వస్తున్న మినిస్టర్ కాన్వాయ్ వచ్చింది. అభిమానుల తోపులాటమధ్య మినిస్టర్, ఇతర నాయకులను వేదికపై భద్రంగా పంపించారు. సభ భద్రతకు వచ్చిన సిబ్బంది ఎండ, ధూళిని లెక్క చేయకుండా తమ విధుల్లో మునిగిపోయారు. భగత్ మాత్రం సభకు కొంచెం దూరంగా ఉన్న తన వాహనం దగ్గరకు వచ్చి ఆ హత్యల గురించి ఆలోచిస్తున్నాడు. ఇంతలో ‘‘హాయ్ భగత్’’ అంటూ పక్క నుంచి ఒక పలకరింపు వినిపించింది. తీరా అటూ ఇటూ చూసేసరికి ఓఎస్డీ ప్రభాకర్ ఎదురుగా ఉన్నాడు. ఓఎస్డీ ప్రభాకర్ ఏసీపీ భగత్‌లు ఒకే బ్యాచ్. అదీగాక వారిద్దరూ మంచి స్నేహితులు కూడా. కొంతసేపు పిచ్చాపాటిగా మాట్లాడుకున్నారు. వీళ్లు తమ మాటల్లో ఉండగానే సభ కూడా పూరై్తంది. ‘‘భగత్ సాయంత్రం చిన్న ఈవెంట్ ఉంది నువ్వు కూడా రా..నీకూ రిలీఫ్‌గా ఉంటుంది’’ అని ప్రభాకర్ ఆహ్వానించాడు. ‘‘ ఏం ఈవెంట్? ఎక్కడ?’’ అని అడిగాడు భగత్. ‘‘ఎర్రగడ్డలోని మెంటల్ ఆస్పత్రిలో తెలిసిన స్వచ్ఛంద సంస్థ వారు ఏదో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ముఖ్య అతిథిగా నన్ను రమ్మన్నారు. నువ్ కూడా రా అలా వెళ్లొద్దాం’’ అనేసరికి భగత్ తలూపాడు.సాయంత్రం 4గంటలకు ఎస్సై శంకర్‌తో ఎసీపీ భగత్ ఎర్రగడ్డలోని ఆస్పత్రికి వచ్చారు. అప్పటికే వచ్చిన ఓఎస్డీ ప్రభాకర్ భగత్‌ను రిసీవ్ చేసుకున్నాడు. ‘నేస్తం’ అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పేషెంట్లకు చెప్పులు, దుస్తులు, పండ్లు పంపిణీ జరుగుతోందని అక్కడ కట్టిన బ్యానర్లను చూసేసరికి భగత్‌కు అర్థమైంది. ఆ సంస్థ నిర్వాహకుడు యాదగిరిని భగత్‌కు పరిచయం చేశాడు ప్రభాకర్. మా సంస్థ ఆధ్వర్యంలో 12 ఏళ్లుగా ఆర్నెళ్లకోసారి ఇలా పంపిణీ చేస్తామని యాదగిరి తెలిపాడు. చిన్నపాటి ప్రసంగం తర్వాత బహుమతుల ప్రదానం జరిగింది. తర్వాత టీ విరామంలో నిర్వాహకుడు యాదగిరి ఆస్పత్రి ముఖ్య డాక్టర్‌ను వీరికి పరిచయం చేశాడు. తర్వాత డాక్టర్, భగత్, ప్రభాకర్‌లు ఏదో విషయమై కొంతసేపు ముచ్చటించారు. అలా మాట్లాడుతూనే ఆస్పత్రి ఆవరణ అంతా కలియతిరిగారు. కార్యక్రమం పూరై్తన తర్వాత తన కారు ఎక్కబోతున్న భగత్ ఒక్కసారిగా ఆగిపోయాడు. వేరే డాక్టర్‌తో మాట్లాడుతున్న ప్రభాకర్ ఏమైందని ఆశ్చర్యంగా అడిగాడు. ఎస్సై శంకర్ కూడా వచ్చాడు. అటుగా వెళ్తున్న పని మనిషిని పిలవమని శంకర్‌ను అన్నాడు. శంకర్ ఆ చెత్తబుట్ట తీసుకెళ్తున్న ఆమెను పట్టుకొచ్చాడు. ఆ చెత్తబుట్టలో ఉన్న చెప్పును తీసి చూపిస్తూ ‘‘శంకర్ నీకిది గుర్తుందా? మీనాక్షి మర్డర్ జరిగిన చోట ఇలాంటిదే దొరికింది!’’ ఆశ్చర్యంగా అన్నాడు ప్రభాకర్. ‘‘అవును సార్ అచ్చం అలాగే ఉంది’’ బదులిచ్చాడు శంకర్. ‘‘ఈ చెప్పు ఇక్కడెలా ఉంది?’’ అని డాక్టర్‌ను ప్రశ్నించాడు. ‘‘ఇది మా ఆస్పత్రిలోని రోగులకు పంపిణీ చేసింది. అందరికీ ఇదే మోడల్ ఇచ్చారు’’ అని అక్కడికొచ్చిన నిర్వాహకుడు యాదగిరి బదులిచ్చాడు. మరి ఇందాక పంపిణీ చేసినవి వేరే డిజైన్‌లో ఎందుకున్నాయని భగత్ ఎదురు ప్రశ్నించాడు. ‘‘పాత మోడల్ చెప్పులతో నడవడానికి ఇబ్బంది కలుగుతోందని ఫీడ్‌బ్యాక్ వస్తే ఈ రోజు పంపిణీ చేసిన వాటితో కొత్త మోడల్ ప్రారంభించాం’’ చెప్పాడు యాదగిరి. పాత మోడల్ చెప్పు ‘ఎన్ఎఫ్’ అనే అక్షరాల లోగో అర్థం ఏంటని భగత్ అడిగేసరికి ‘నేస్తం ఫౌండేషన్’ అని యాదగిరి చెప్పాడు. ‘‘కొత్త మోడల్ చెప్పుపై కూడా ఇవే అక్షరాలుంటాయి. కానీ లోగో వేరే డిజైన్‌లో పెద్దగా ఉంటుంది’’ అని చెప్పాడు. హత్య జరిగిన ప్రదేశంలో దొరికిన చెప్పును తీసుకురమ్మని ఎస్సై శంకర్‌కు భగత్ చెప్పాడు. శంకర్ వెళ్లాక డాక్టర్‌తో మాట్లాడుతూ ‘‘ఈ వరుస హత్యలతో దొరికిన ఏకైక క్లూ ఈ చెప్పు. మీరు మా విచారణకు సహకరించాలి’’ అని కోరాడు. ‘‘సరే’’ అన్నాడు డాక్టర్.ఇంతలోనే ల్యాబ్‌లో ఉన్న చెప్పును తీసుకుని ఆస్పత్రికి చేరుకుని భగత్‌కు చూపించాడు శంకర్. దాన్ని యాదగిరికి చూపించి నిర్ధారించుకున్నాడు. ఏసీపీ భగత్, డాక్టర్, ప్రభాకర్‌లు ఆస్పత్రిలోని ఒక గదికి వెళ్లారు.మొత్తం ఇక్కడ ఎంతమంది పేషెంట్లు, పనివాళ్లు, డాక్టర్లు ఉంటారని ముఖ్య డాక్టర్‌ను ప్రశ్నించాడు. ‘‘ఇక్కడ మొత్తం 132 మంది పేషెంట్లు, 20కి పైగా సిబ్బంది ఉంటారు’’ అని బదులిచ్చాడు. ‘‘మాకు దొరికిన ఈ చెప్పును బాగా పరిశీలిస్తే కొన్ని క్లూలు దొరికాయి. దాన్ని బట్టి నిందితులు ఇక్కడివారేనని నాకు అనుమానం వస్తోంది. ఈ చెప్పులో అన్ని వేలి ముద్రలున్నాయి. కానీ కుడికాలు బొటనవేలి పక్క వేలి ముద్రలేదు. అలాగే ఇది 7 అంగుళాల సైజు ఉన్న చెప్పు. అంటే ఆ వ్యక్తి దాదాపు 65 కేజీల బరువు, 5.5 అడుగుల పొడవుంటాడు’’ చెప్పాడు భగత్. నేరస్తులను గుర్తించడానికి పేషెంట్లతో సహా సిబ్బందిని బయటి నిల్చోబెట్టారు. అందర్నీ బయటికి తెచ్చే క్రమంలో ఇద్దరు వ్యక్తులు గోడ దూకి పారిపోయే ప్రయత్నం చేయగా అక్కడే ఉన్న పోలీసులు వాళ్లను భగత్ దగ్గరకు తీసుకొచ్చారు. అందులో ఒకరికి బొటనవేలి పక్కన వేలు లేదు. వారిని గదమాయించగా మిగతా ఇద్దరిని ఆ వరుసలో చూపించారు. అందరినీ పోలీస్ స్టైల్లో అడిగేసరికి ఆ రెండు హత్యలు వారే చేశారని ఒప్పుకున్నారు. ‘‘మాతో మాజీ కార్పొరేటర్ నాగేందర్ ఈ హత్యలు చేయించాడు’’ అని నిజం చెప్పారు. ‘‘ఈ హాస్పిటల్లో ఎందుకున్నారు?’’ అని గదమాయించగా, ‘‘ హత్యలకు ప్లాన్ చేసే ముందు ఏదైనా సేఫ్ ప్లేస్ ఎంచుకుంటాం. ఇంతకుముందు హత్య చేసి వేరే రాష్ట్రం పారిపోయేవాళ్లం. కానీ ఈసారి ఎన్నికలొస్తున్నందున నాగేందర్ మమ్మల్ని అందుబాటులో ఉండేలా ఈ ఆస్పత్రిలో ఉండమని ప్లాన్ ఇచ్చాడు. ఇక్కడి నుంచి హత్య ప్లాన్ చేస్తే ఎవరికీ అనుమానం రాదని మెంటల్ పేషెంట్లుగా చేరాం. తనకు రాజకీయంగా అడ్డుగా ఉన్నాడని కార్పొరేటర్ చిన్నారావును, షేర్ నుంచి అడిగినంత డబ్బు ఇవ్వకపోవడంతో అతని కూతురు మీనాక్షిని రేప్ చేసి హత్య చేశాం’’ అని ఒప్పుకున్నారు. ‘‘హాస్పిటల్ నుంచి ఎలా వెళ్లారు?’’ భగత్ అడిగాడు.‘‘రాత్రి 9 గంటల నుంచి 12 గంటల మధ్యలో మెంటల్ ఆస్పత్రి నుంచి జనరల్ హాస్పిటల్‌కు వ్యాన్‌లో చెకప్‌కు తీసుకెళ్తారు. ఆ సమయంలో మేం నలుగురం ఒకేసారి వెళ్లి హత్య చేసి గోడ దూకి హాస్పిటల్‌కి వచ్చాం’’ అని చెప్పారు. అందులో ఒకడి జుట్టు పొడవుగా ఉండటం చూసి అక్కడ దొరికిన పొడవైన వెంట్రుక వీరిదేనని, ఆడవాళ్ల పాత్ర లేదని భగత్ నిర్ధారించాడు.వీళ్లు చెప్పిన ఆధారాలతో మాజీ కార్పొరేటర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు.నేరాన్ని ఒప్పుకున్నాడు నాగేందర్. - ఉమేశ్ కోమటి -
మార్చురీ పక్కన అన్నా క్యాంటీన్‌పై తీవ్ర విమర్శలు
-
ఉస్మానియా ఘటనపై హెచ్ఆర్సీ ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రి మార్చురీలోని శవాలను ఎలుకలు, పంది కొక్కులు పీక్కుతింటున్న వైనంపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా స్పందించింది. ‘సాక్షి’లో ప్రచురితమైన ‘శవాలను పీక్కుతింటున్నాయి’ కథనాన్ని సుమోటోగా స్వీకరించిన కమిషన్.. దీనిపై సమగ్ర విచారణ జరిపి ఈ నెల 28లోగా నివేదిక ఇవ్వాలని వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్, టీఎస్ఎంఐడీసీ ఇంజనీర్లు బుధవారం మార్చురీని సంద ర్శించి అక్కడ ఎదురవుతున్న ఇబ్బందులపై ఆరా తీశారు. వివాదాస్పదంగా మార్చురీ నిర్వహణ.. ఉస్మానియా మార్చురీ నిర్వహణ అంశం వివాదాస్పదంగా మారింది. ఆ బాధ్యత తమది కాదంటే తమదికాదంటూ ఫోరెన్సిక్, ఆస్పత్రి వైద్యులు తప్పించుకుంటున్నారు. ‘శవాలకు పోస్టుమార్టం చేయడం వరకే మా పని’అని ఫోరెన్సిక్ వైద్యులు స్పష్టం చేస్తుండగా.. ‘పోస్టుమార్టం సహా శవాలను భద్రపరచడం, పారిశుద్ధ్య నిర్వహణ వంటి అంశాలను ఇప్పటి వరకు వైద్య కళాశాలకు చెందిన ఫోరెన్సిక్ విభాగమే చూసుకునేది’అని ఆస్పత్రి వైద్యులు చెబుతు న్నారు. మార్చురీకి ఆస్పత్రికి సంబంధం లేదని, అది పూర్తిగా వైద్య కళాశాలకు అనుబంధమని, ఆస్పత్రి ప్రాంగణంలో ఉన్నందు వల్లే మంచినీరు, విద్యుత్ సరఫరా చేస్తున్నామని, అంతకు మించి తమకు ఎలాంటి సంబంధం లేదని ఆస్పత్రి వైద్యులు స్పష్టం చేస్తున్నారు. 11 మంది ఆర్‌ఎంఓలు ఉన్నా.. రోడ్డు, అగ్ని ప్రమాదాలు, ఆత్మహత్యలు, హత్యలు వంటి న్యాయపరమైన అంశాలతో ముడిపడిన(మెడికో లీగల్ కేసులు) మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా మార్చురీకి తీసుకొస్తారు. వీటిని నేరుగా మార్చురీకి తరలిస్తుండగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిన వారి వివరాలను ఎంఎల్సీ రిజిస్టర్లో నమోదు చేయాలి. నిబంధనల ప్రకారం ఈ పనులను సంబంధిత మెడికల్ ఆఫీసర్ చూసుకోవాలి. బంధువులు కోరితే పోస్టుమార్టం తర్వాత ఉచిత అంబులెన్స్‌ను బుక్ చేసి, శవాన్ని వారి సొంతూరుకు పంపాలి. కానీ ఉస్మానియాలో 11 మంది ఆర్‌ఎంఓలు ఉన్నా.. ఏ ఒక్కరూ ఈ పని చేయడం లేదు. శవాల తరలింపు పనులను కూడా పారిశుద్ధ్య నిర్వహణను పర్యవేక్షించాల్సిన హెల్త్ ఇన్స్పెక్టర్లకు అప్పగిస్తున్నారు. -
శవాలను పీక్కుతింటున్నాయ్..!
సాక్షి, హైదరాబాద్: మనిషి బతికున్నప్పుడు గౌరవం ఇచ్చినా.. ఇవ్వకపోయినా.. చనిపోయిన తర్వాత శవానికి గౌరవం ఇవ్వడం మన సంప్రదాయం. అయితే.. ఉస్మానియా ఆస్పత్రి మార్చురీలో శవాలకూ దిక్కు లేకుండా పోతోంది. మార్చురీ సిబ్బంది వచ్చిన శవాలకు సకాలంలో పోస్టుమార్టం చేయకపోవడమే కాక.. ఉన్నవాటికీ రక్షణ కల్పించలేక పోతున్నారు. ఫలితంగా పందికొక్కులు, ఎలుకలు శవాలను పీక్కుతింటున్నాయి. డంపింగ్ రూమ్‌లో భారీగా శవాలు పేరుకుపోవడం.. ప్రధాన రహదారికి ఆనుకుని మార్చురీ ఉండటంతో కుక్కలు శవాల కాళ్లు, చేతులు పీక్కుతిన్న ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. తాజాగా ఓ శవాన్ని ఎలుకలు, పందికొక్కులు పీక్కుతినడం చర్చనీయాంశమైంది. సమయం మించిందని అప్పగించి వెళితే.. హబీబ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అఫ్జల్‌సాగర్‌కు చెందిన ఉమ(21) సోమవారం ఆత్మహత్య చేసుకుంది. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ఉస్మానియా మార్చురీకి తరలించారు. అప్పటికే సాయంత్రం ఆరు కావడంతో ఫోరెన్సిక్ నిపుణులు విధులు ముగించుకుని వెళ్లిపోవడంతో యువతి బంధు వులు శవాన్ని మార్చురీ సిబ్బందికి అప్పగించి వెళ్లిపోయారు. మంగళవారం ఉదయం వచ్చి శవాన్ని పరిశీలించగా.. ముక్కు, పెదాలు, మెడ భాగం ఛిద్రమై కన్పించాయి. దీంతో మార్చురీ సిబ్బందిపై యువతి బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడమే కాక ఉన్నతాధికారికి ఫిర్యాదు చేశారు. కుప్పలుగా శవాలు.. ఉస్మానియా వైద్య కళాశాలకు అనుబంధంగా ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో మార్చురీ కొనసాగుతోంది. ఇక్కడికి ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో చనిపోయిన వారి మృతదేహాలే కాక గ్రేటర్ శివారు ప్రాంతాల నుంచి మెడికో లీగల్ కేసులకు సంబంధించిన శవాలు వస్తుంటాయి. ఇలా రోజుకు సగటున 20–25 శవాలు వస్తుంటాయి. రోజుకు సగటున 15 శవాలకు పోస్టుమార్టం చేసే అవకాశం ఉంది. వీటిని భద్రపరిచేందుకు 32 ్రíఫీజర్ బాక్సులు, ప్రత్యేకంగా ఓ గది ఉన్నాయి. పోస్టుమార్టం తర్వాత మూడు రోజుల వరకు బాడీలను భద్రపరిచే వీలుంది. అప్పటికే బాడీ డీకంపోజ్ అయితే డంప్ రూమ్‌లోకి తరలిస్తారు. బంధువులు శవాలను గుర్తించి తీసుకెళ్లగా, మిగిలిన వాటిని అనాథ శవాలుగా పరిగణించి జీహెచ్ఎంసీకి అప్పగిస్తారు. వీటిని ప్రతి పది రోజులకు ఓసారి సామూహిక దహనం చేస్తుంటారు. ఈ నేపథ్యంలో ఆయా వార్డుల్లో భారీగా శవాలు పేరుకుపోతున్నాయి. తగిన బాక్స్‌లు లేకపోవడం వల్లే.. నిర్దేశిత సమయంలో వచ్చిన శవాలకు అదే రోజు పోస్టుమార్టం చేస్తుండగా, సాయంత్రం నాలుగు తర్వాత వచ్చిన వాటిని ఫ్రీజర్ బాక్స్‌లో భద్రపరిచి, పోలీసుల పంచనామా తర్వాత పోస్టుమార్టం చేస్తున్నారు. పోలీసులు పంచనామా ఇన్‌టైమ్‌లో చేయకపోవడం, బంధువులు సకాలంలో రాకపోవడం వల్ల కొన్నిసార్లు రెండు మూడు రోజుల పాటు శవాన్ని బాక్స్‌లోనే ఉంచాల్సి వస్తోంది. ఫ్రిజర్ బాక్సులన్నీ శవాలతో నిండిపోవడంతో ఆ తర్వాత వచ్చిన వాటిని వార్డులో ఓ మూల పడేయాల్సి వస్తోంది. వస్తున్న శవాల నిష్పత్తికి తగ్గట్టు మార్చురీని అభివృద్ధి చేయకపోవడం.. ఎప్పటికప్పుడు శవాలను దహనానికి తరలిం చకపోవడం ఇందుకు కారణాలని వైద్యనిపు ణులు చెపుతున్నారు. ఉస్మానియా మార్చురీ మూసీ నదిని ఆనుకుని ఉంది. భవనం కూడా శిథిలావస్థకు చేరుకుంది. ఏళ్ల తరబడి భవనానికి మరమ్మతులు నిర్వహించక పోవ డంతో పందికొక్కులు, ఎలుకలు, కుక్కలకు నిలయంగా మారింది. వీటిని నియంత్రించా ల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు. నిజానికి ఫ్రీజర్ బాక్స్‌లో భద్రపరిచిన శవాలను పందికొక్కులు, ఎలుకలు కొరికే అవకాశం లేదు. బాక్స్‌లో కాకుండా వార్డులో ఓ మూలన పడేస్తుండటం వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. -
రాష్ట్రంలోనే ఆధునిక మార్చురీ
రూ 3.25 కోట్లతో నిర్మాణం. వైద్య విద్యార్థుల పరిశోధనకు విశాలమైన హాలు ఎంబాల్మింగ్ ఏర్పాటు నేడు ప్రారంభించనున్న మంత్రులు నెల్లూరు(అర్బన్) : రాష్ట్రంలో తొలిసారిగా రూ 3.25 కోట్లతో నెల్లూరు ప్రభుత్వ మెడికల్ కళాశాల బోధనాసుపత్రిలో ఆధునికమైన విశాలమైన మార్చురీ భవనాలను ఏర్పాటు చేశారు. వైద్య విద్యార్థుల పరిశోధనకు అనుకూలంగా నిర్మించారు. ఎలాంటి వాసన లేకుండా క్లీన్ అండ్ గ్రీన్ పద్ధతిలో ఎంబాల్మింగ్ వంటి సౌకర్యాలతో ఏర్పాటు చేసిన ఈ భవనాలను సోమవారం రాష్ట్ర మంత్రులు కామినేని శ్రీనివాస్, శిద్దరాఘవరావు, పొంగూరు నారాయణ ప్రారంభించనున్నారు. అరెకరా స్థలంలో ఏర్పాటు అర ఎకరా స్థలంలో మార్చురీ భవనాలను ఏర్పాటు చేశారు. భవనాల కోసం రూ 1.25 కోట్లను, వైద్య పరికరాలు, ఫ్రీజర్లు, ఎక్స్‌రే, ఎంబాల్మింగ్ వంటి పరికరాల కోసం మరో రూ.2 కోట్లు వెచ్చించారు. ఎంబాల్మింగ్ ప్రత్యేకత ఇప్పటి వరకు పెద్దాసుపత్రిలో ఎంబాల్మింగ్ పరికరాలు లేవు. ఎవరైనా మరణించి ఇతర దేశాల నుంచి రక్తసంబంధీకులు రావాల్సి ఉండి కొన్ని రోజులు ఆగాల్సి వస్తే శవాలు కుళ్లిపోయేవి. ఇప్పుడు ఆ ఇబ్బందులు లేకుండా ఎంబాల్మింగ్ ప్రక్రియ పరికరాలుండటం వల్ల వారం రోజులైనా శవాలను కుళ్లిపోకుండా ఉండే ఏర్పాట్లు చేశారు. వైద్య విద్యార్ధులకు ఎంతో ఉపయోగం : డాక్టర్ శశికాంత్, ఫోరెన్సిక్ హెచ్ఓడీ ఇలాంటి వసతులున్న మార్చురీ భవనాలు రాష్ట్రంలో ఎక్కడా లేవు. ఉమ్మడి రాష్ట్రంలో గాంధీ ఆసుపత్రి తర్వాత నెల్లూరు మెడికల్ కళాశాలలో ఏర్పాటు చేయడం జరిగింది. 150 మంది విద్యార్థులు చొప్పున 2 బ్యాచ్‌లుగా ఇక్కడ మెడికల్ వైద్యసేవలు నేర్చుకుంటారు. మెడికోలకు ఇది ఎంతో ఉపయోగం -
కాపాడాల్సిన వాడే కాలయముడయ్యాడు..
► విలపించిన మృతురాలి తల్లి ► చిన్నారులను చంపడానికి వాడికి చేతులెలా వచ్చాయయ్యా... ►గొంతు నులిమి...ఆపై పట్టాలపై పడవేసి ► బుడంపాడు వద్ద ఓ కన్నతండ్రి ఘాతుకం గుంటూరు రూరల్ : జీవితాంతం తోడూ నీడగా ఉంటానని పెళ్లిరోజు చేసిన ప్రమాణానికి పాతరేశాడు.. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్న బిడ్డలను కడతేర్చాడు. భార్యా, బిడ్డలను దారుణంగా హతమార్చి రైలు కింద ముక్కలు చేశాడు. హత్యలను ఆత్మహత్యలుగా చిత్రీకరించాలనే ప్రయత్నం బెడిసికొట్టడంతో అరండల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు.. ఈ సంఘటనతో జిల్లా ప్రజలు ఉలిక్కిపడ్డారు. గుంటూరు శివారు బుడంపాడు గ్రామ పంచాయతీ శివారులోని గుంటూరు - తెనాలి రైల్వే లైన్ వద్ద పొన్నూరు మండలం పిట్టలవానిపాలేనికి చెందిన పేర్లీ రమేష్ భార్య, ఇద్దరు బిడ్డల్ని హతమార్చిన విషయం తెలిసిందే. గుంటూరు ప్రభుత్వాస్పత్రిలోని మార్చురీలో ఉన్న కుమార్తె నాగలక్ష్మి, మనవళ్ల మృతదేహాలను చూసి అనంతరం గుంటూరు జంక్షన్ రైల్వేస్టేషన్ నాలుగో ప్లాట్ ఫాం వద్దగల జీఆర్పీ పోలీస్‌స్టేషన్‌లో అమ్మమ్మ బాలమ్మ, బంధువులు ఫిర్యాదు చేశారు. నెల రోజుల్లో పుట్టిన రోజు వేడుకలు చేయాలనుకుంటే పాడెక్కించాల్సి వచ్చిందయ్యా.. అంటూ బాలమ్మ విలపిస్తున్న తీరు చూసి అక్కడి వారికి కంటనీరు ఆగలేదు.. ఇంటికి వచ్చి దుస్తులు, బొమ్మలు కొనిస్తానంటూ మాయమాటలు చెప్పి తీసుకెళ్లి ఇంతటి దుర్మార్గానికి పాల్పడతాడని ఊహించలేదంటూ కన్నీటి పర్యంత మైంది. అల్లారు ముద్దుగా పెంచుకున్న ముద్దులొలికే చిన్నారులను చంపడానికి వాడికి చేతులెలా వచ్చాయయ్యా.. అంటూ ఆమె గుండెలు బాదుకుంది. పెళ్ళై ఏడాది గడవకముందే వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందనే కక్షతో మా అక్కను చిత్రహింసలకు గురిచేసేవాడు.. అని మృతురాలు నాగలక్ష్మి చెల్లెలు కుమారి విలపిస్తూ చెప్పింది. నేను మారిపోయాను.. ముందుగా వేసుకున్న పథకం ప్రకారమే మా ఇంటికి వచ్చి మంచిగా నటించి మా అక్క, కొడుకులను తీసుకెళ్ళి కర్కశంగా హతమార్చాడని ఆమె విలపించిన తీరు అక్కడి వారిని కంటతడి పెట్టించింది. లొంగిపోయిన నిందితుడు పట్నంబజారు : భార్యతోపాటు ఇద్దరు పిల్లల్ని హతమార్చిన మృగాడు.. అరండల్‌పేట పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు తెలుస్తోంది. పోలీసులు విచారణలో హత్య చేసినట్లు అంగీకరించినట్లు సమాచారం. మూడు సంవత్సరాల కిందట నల్లచెరువుకు చెందిన పేర్లి నాగలక్ష్మి (25)కి పిట్టలవానిపాలేనికి చెందిన రమేష్‌తో వివాహం జరిగింది. అయితే నాగలక్ష్మిపై అనుమానం ఉండటంతో ఏడాది కిందట విడిపోయినట్లు పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. రమేష్‌కూ వివాహేతర సంబంధం ఉందనే అనుమానం నాగలక్ష్మికీ ఉండటంతో వారి మధ్య తరచూ వివాదాలు జరుగుతుండేవి. ఈ క్రమంలో ఇద్దరూ ఏడాది కిందట విడిపోయారు. మృతురాలు నల్లచెరువులోని తల్లితండ్రుల వద్దనే ఉంటోంది. అయితే నిత్యం కాకాని తోటకు వెళ్లే అలవాటు ఉన్న నాగలక్ష్మిని మంగళవారం సాయత్రం కలిసిన రమేష్ ద్విచక్ర వాహనంపై భార్య, పిల్లల్ని ఎక్కిం చుకుని షాపింగ్‌కు అని నమ్మబలికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. మాయమాటలు చెప్పి బుడంపాడులోని తెనాలి గుంటూరు రైల్వే ట్రాక్ వద్దకు తీసుకుని వెళ్లి రాయితో నాగలక్ష్మిని దారుణంగా కొట్టి చంపినట్లు విచారణలో ఒప్పుకున్నట్లు సమాచారం. అనంతరం చిన్నారులను గొంతు నులి మి కిరాతకంగా చంపినట్లు అంగీకరించినట్లు తెలిసింది. నిందితుడు రమేష్‌ను గవర్నమెంట్ రైల్వే పోలీసులకు అప్పగించేందుకు అరండల్‌పేట పోలీసులే సిద్ధమవుతున్నారు. -
ఆ మృతులు... పాలమూరు బిడ్డలు
♦ ఆ ఇద్దరూ స్నేహితులే ♦ మనస్తాపంతో ప్రాణాలు తీసుకున్న శిరీష, మంజుల ♦ ‘సాక్షి’ కథనం చదివి తరలివచ్చిన వారి తల్లులు ♦ గజ్వేల్ మార్చురీలో మృతదేహాల గుర్తింపు ♦ కలిచివేసిన బాధితుల రోదన గజ్వేల్: జగదేవ్‌పూర్ మండలం కొండపోచమ్మ ఆలయ గుట్టల్లో సోమవారం వెలుగు చూసిన ఇద్దరు బాలికల మృతదేహాల కేసు మిస్టరీ ‘సాక్షి’ కథనంతో వీడింది. ప్రధాన సంచికలో ప్రచురితమైన ఈ కథనం చూసి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మృతుల తల్లులు, బంధువులు గజ్వేల్‌కు చేరుకున్నారు. పోస్టుమార్టం గదిలో శవాలు చూసి తమ పిల్లలేనని గుర్తించి కన్నీరుమున్నీరయ్యారు. మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలం సూరారం గ్రామానికి చెందిన పూజరి నర్సమ్మ-చెన్నయ్య దంపతుల కూతురు శిరీష(15), యాదమ్మ-బాల్‌రాజు దంపతుల కూతురు మంజుల ఇద్దరు స్నేహితులు. పదోతరగతి పరీక్షలు మరో మూడు మిగిలి ఉండగానే ఇంట్లో నుంచి వెళ్లిపోయి ఆత్మహత్యకు పాల్పడ్డారు. శవాలు కుళ్లిపోయి ఉండడంతో దాదాపు ఏప్రిల్ 3న లేదా 4వ తేదీల్లో ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. వివరాలు ఇలా... మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలం సూరారం గ్రామానికి చెందిన పూజరి నర్సమ్మ-చెన్నయ్య దంపతుల కూతురు శిరీష(15). గత కొన్నేళ్ల క్రితం తండ్రి చెన్నయ్య మరణించాడు. వీరిది రెక్కాడితేగానీ డొక్కాడని పరిస్థితి. నర్సమ్మ కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలోనే రెండేళ్ల నుంచి శిరీష అయ్యవారుపల్లిలోని మేనత్త యాదమ్మ ఇంట్లో ఉంటోంది. 10 కిలోమీటర్ల దూరంలోని ఫారూక్‌నగర్ మండలం మొగిలిగిద్ద గ్రామ జెడ్పీహెచ్ఎస్లో పదోతరగతి చదివింది. యాదమ్మ-బాల్‌రాజు దంపతుల కూతురు మంజుల మొగిలిగిద్ద జెడ్పీహెచ్‌ఎస్‌లోనే చదివింది. ఈ క్రమంలో శిరీష, మంజుల క్లాస్మేట్స్ కావడంతో స్నేహితులుగా మారారు. మంజుల తండ్రి బాల్‌రాజు సైతం కొన్నేళ్ల క్రితమే మరణించాడు. ఈమె తల్లి యాదమ్మ కూడా కూలి పనులు చేస్తూ శిరీషను సాకుతోంది. వీరిది కూడా పేద కుటుంబం. శిరీష, మంజుల ఇద్దరూ గత మార్చిలో పదోతరగతి పరీక్షలు రాశారు. ఏప్రిల్ ఒకటి నాటికి మరో మూడు పరీక్షలు రాయాల్సి ఉంది. ఈ క్రమంలో మంజుల ప్రేమిస్తున్న యువకుడు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో ఆ బాలిక తీవ్ర మనోవేదనకు గురైంది. ప్రియుడి కోసం చనిపోవాలని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని శిరీషకు వివరించింది. శిరీషకు సైతం కుటుంబీకులు ఇష్టంలేని పెళ్లిని కుదిర్చారు. దీంతో ఆ బాలిక కూడా మనస్తాపంతో ఉంది. ఇద్దరు కలిసి చనిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఏప్రిల్ ఒకటి నుంచి ఇళ్లల్లో చెప్పకుండా వెళ్లిపోయారు. మిగతా పరీక్షలకు కూడా హాజరు కాలేదు. ఏప్రిల్ 3న మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం కొండపోచమ్మ ఆలయం వద్దకు వచ్చారు. అక్కడి నుంచి శిరీష తన తల్లి నర్సమ్మకు ఫోన్ చేసింది. ఎక్కడున్నావని తల్లి ప్రశ్నిస్తే... అప్పరెడ్డిగూడెం వద్ద ఉన్నామని చెప్పింది. మంజుల కూడా తనతో ఉందని తెలిపింది. ‘మీకోసమే రోజూ వెతుకుతూ ఇప్పుడే షాద్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వచ్చాం’ అని నర్సమ్మ తెలిపింది. దీంతో శిరీష ఫోన్ కట్‌చేసింది. అప్పటి నుంచి బాలికలకు, వారి కుటుంబీకులకు ఎలాంటి సమాచారం లేదు. ఈ క్రమంలో సోమవారం కొండపోచమ్మ ఆలయ ప్రాంగణంలోని గుట్టల్లో గుర్తు తెలియని శవాలు బయటపడిన సంగతి తెలిసిందే. ఈ కథనం ‘సాక్షి’ ప్రధాన సంచికలో ప్రచురితం కావడంతో.. మృతుల కుటుంబీకులు ఆ శవాలు తమ పిల్లలవేనంటూ మంగళవారం గజ్వేల్‌కు చేరుకున్నారు. ‘సాక్షి’ పత్రికలో వచ్చిన కథనం చూసి తామిక్కడికి చేరుకున్నామని తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో బాలికల శవాలను గుర్తుపట్టారు. మృతదేహాలు చూసి బాధిత కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు. గజ్వేల్ సీఐ సతీష్, జగదేవ్‌పూర్ ఎస్ఐ వీరన్నలు వారి నుంచి వివరాలు సేకరించారు. బాధిత కుటుంబ సభ్యులు చెబుతున్న సమాచారంతో మృతదేహాలు వారివేనని దాదాపుగా నిర్ధారించారు. దీంతో కేసు మిస్టరీ వీడింది. -
పాపం.. ఆ అవ్వ చనిపోయింది
ఉసురుతీసిన ఉస్మానియా వైద్యుల నిర్లక్ష్యం అఫ్జల్‌గంజ్: పాపం... ఆ అవ్వ చనిపోయింది. ఏ దిక్కూలేని ఆమెకు ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది సమయానికి వైద్యం అందించడంలో నిర్లక్ష్యం చేయడంతో చివరికి కన్ను మూసింది. వైద్యో నారాయణో హరి అంటారు. అయితే, ఇక్కడి వైద్యులు ఆ మాటకు అర్థాన్ని మార్చేశారు. చార్మినార్ పోలీస్‌స్టేషన్ పరిధిలో అపస్మారకస్థితిలో ఉన్న వృద్ధురాలిని పోలీసులు వైద్యం కోసం ఉస్మానియా ఆసుపత్రిలో చేర్పించారు. రెండు రోజుల పాటు వైద్యం అందించిన వైద్యులు, సిబ్బంది ఆమె వెంట సహాయకులు లేరనే కారణంతో ఈ నెల 13వ తేదీ అర్దరాత్రి ఆసుపత్రి నుంచి గెంటివేశారు. మరుసటి రోజు ఆసుపత్రిని సందర్శించిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లకా్ష్మరెడ్డికి ఈ విషయం తెలిసి వైద్యులు, సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వెంటనే ఆమెను తిరిగి ఆసుపత్రిలో చేర్చుకొని రెండు రోజుల పాటు వైద్యం అందించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. ఆసుపత్రి నుంచి బయటికి గెంటివేయకుండా వైద్యం అందించి ఉంటే ఆమె మరికొన్ని రోజులు ఈ లోకంలో ఉండేదేమో.. సరైన వైద్యం అందకపోవడంతో గురువారం రాత్రి కన్నుమూసింది. ఎవ్వరూ లేని అనాధగా మిగిలిపోవడం ఆ అవ్వ చేసిన పాపమా.. లేక సరైన సమయంలో వైద్యం అందించని ఉస్మానియా వైద్యులదా? అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్చురీలో మృతదేహం: వృద్ధురాలి సంబంధీకులు ఎవ్వరూ లేకపోవ డంతో అఫ్జల్‌గంజ్ పోలీసులు అనాధ శవంగా కేసు నమోదు చేశారు. పోస్ట్‌మార్టం చేయించి మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు. సంబంధీకులుంటే అఫ్జల్‌గంజ్ ఠాణాలో సంప్రదించాలని కోరారు. -
నా మనవడికి ఏమయ్యిందయ్యా?
దేవరాయబొట్లవారిపాలెం(పెదకాకాని): పెళ్లయిన 26 రోజులకే రోడ్డు ప్రమాదంలో నూతన వధూవరులకు నూరేళ్ళు నిండటంతో దేవరాయబొట్లవారిపాలెంలో విషాదఛాయలు అలముకున్నాయి. మండల పరిధిలోని వెంకటకృష్ణాపురం గ్రామ పరిధిలోని దేవరాబొట్లవారిపాలెం 100 ఇళ్ళు, 400 మంది జనాభా ఉన్న చిన్న గ్రామం. ఇటీవల పెళ్ళైన నూతన వధూవరులు రోడ్డు ప్రమాదంలో చనిపోయారనే వార్త తెలియగానే గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గ్రామానికి చెందిన కొండా చిన నరసింహారావు, కాశులమ్మ దంపతులకు నలుగురు సంతానం. కూలీపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. ఇద్దరు కూతుళ్లకు గతంలోనే వివాహమైంది. మూడవ సంతానం పెదబాబు. నాలుగో సంతానం రామారావు. పెదబాబు తండ్రికి తోడుగా వ్యవసాయ కూలీ పనులకు వెళుతుండగా రామారావు పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. పెదబాబుకు ఏప్రిల్ 22న చిలకలూరిపేటకు చెందిన నీలిమతో వివాహమైంది. నూతన దంపతులు అత్తగారింటికి వెళ్లేందుకు బుధవారం చిలకలూరిపేట బయలు దేరారు. మార్గం మధ్యలో గుంటూరు రూరల్ మండలం ఓబులనాయుడుపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు.గ్రామంలోని పెద్దలు, తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు అంతా గుంటూరు మార్చురీకి తరలివెళ్లారు. మృతుడు చినబాబు అమ్మమ్మ ఏం జరిగిందో తెలియక ఇంటికి వచ్చిన వారందరినీ నా మనమడికి ఏమయ్యిందయ్యా అంటూ అందోళనగా అడుగుతోంది. పెళ్ళైన 26 రోజులకే నూరేళ్ళు నిండాయా అంటూ స్థానికులు కన్నీటి పర్వమయ్యారు. -
మృతులకు పరిహారంపై హైడ్రామా
► మట్టిపెళ్ళల మృతులకు న్యాయం చేయాలని కోరిన అఖిలపక్షం ► ప్రభుత్వ ఆసుపత్రి, మార్చురీ వద్ద ధర్నాలు ► బాధితులకు అండగా నిలిచిన వైఎస్సార్ సీపీ నేతలు ► మృతుల కుటుంబాలకు రూ.50వేల చొప్పున సాయం ► బాధిత కుటుంబాలకు రూ.20 లక్షలు...పక్కా ఇళ్లు మంజూరుచేయాలని డిమాండ్ గుంటూరు ప్రభుత్వాస్పత్రి వద్ద బాధితులను ఓదార్చుతున్న వైఎస్సార్సీపీ నేతలు బొత్స, మర్రి, లేళ్ల, రావి, సుచరిత, కావటి తదితరులు న్యాయం కోసం ఎలుగెత్తారు.. అన్యాయంపై తిరగబడ్డారు. మట్టిపెళ్లల మృతులకు నష్టపరిహారం కోసం భీష్మించారు. బిల్డర్ నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు. ప్రధాన నిందితుడి అరెస్టుకు పట్టుబట్టారు. సజీవ సమాధి అయిన ఏడుగురి కుటుంబాల కోసం అఖిలపక్షంగా ఏర్పడిన వైఎస్సార్ సీపీ, కాంగ్రెస్, వామపక్షాలు, ప్రజాసంఘాలు ఆదివారం నిర్వహించిన ఆందోళనలతో గుంటూరు నగరం అట్టుడికింది. అరండల్‌పేట (గుంటూరు) : గుంటూరు లక్ష్మీపురంలో చుక్కపల్లి రమేష్‌కు చెందిన వాణిజ్య భవన నిర్మాణంలో శనివారం రాత్రి మట్టిపెళ్ళలు విరిగి పడిన ఘటనలో ఏడుగురు మృతిచెందారు. ఒకరు తీవ్ర గాయాలపాలై ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో ఆదివారం నగరంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బాధిత కుటుంబాలకు తక్షణ పరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష నాయకులు, బాధిత కుటుంబాల సభ్యులు, వివిధ ప్రజాసంఘాల నాయకులు ఉదయం 8 గంటల నుంచి ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి(జీజీహెచ్) మార్చురీ ఎదుట ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగారు. మరో వైపు జీజీహెచ్ వద్ద ఆందోళన చేపట్టిన బాధిత కుటుంబాలకు వైఎస్సార్సీపీ సీనియర్ నేతలు అండగా నిలిచారు. సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే సుచరిత, జిల్లా అధ్యక్షులు మర్రి రాజశేఖర్, నగర అధ్యక్షులు లేళ్ల అప్పిరెడ్డి, జిల్లా యువజన విభాగం అధ్యక్షులు కావటి మనోహర్‌నాయుడు, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణ, చిన్నపరెడ్డి, సాయిబాబు, పానుగంటి చైతన్య తదితర నాయకులు బాధిత కుటుంబాలను పరామర్శించారు. బాధితులతో మాట్లాడుతున్న సమయంలో వారి కష్టాలను విన్న సుచరిత కంటతడిపెట్టారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 50వేల చొప్పున సాయం అందిస్తామని బొత్స ప్రకటించారు. అలాగే పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి త్వరలోనే బాధిత కుటుంబాలను పరామర్శిస్తారని తెలిపారు. నిర్మాణ పనుల్లో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే ప్రమాదం సంభవించిందన్నారు. ఇందుకు కారణమైన బిల్డర్, ఇతరులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే బిల్డర్‌పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి, బాధిత కుటుంబాలను ఆదుకున్నప్పుడే న్యాయం జరుగుతుందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు మర్రి రాజశేఖర్ డిమాండ్ చేశారు. నష్టపరిహారంపై హైడ్రామా ... మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ప్రకటించే విషయంలో హైడ్రామా చోటుచేసుకుంది. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల నష్టపరిహారం, ఐదు ఎకరాల భూమి, బిల్డర్ చుక్కపల్లి రమేష్‌పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు, మృతుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని బాధిత కుటుంబ సభ్యులు, అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. దీనిపై జీజీహెచ్ ఎదుట రోడ్డుపై సుమారు ఏడు గంటల పాటు ఆందోళన నిర్వహించారు. ఈ సమయంలో జిల్లా జాయింట్ కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, అర్బన్ జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ఠత్రిపాఠి పెద్ద ఎత్తున డీఎస్పీలు, సీఐలు అక్కడకు చేరుకున్నారు. పలు దఫాలుగా అధికారులతో అఖిలపక్ష నాయకులు చర్చలు జరిపినా కొలిక్కి రాలేదు. బాధితులకు, అధికారులకు మధ్యవర్తిగా వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు వ్యవహరించారు. నష్టపరిహారం ప్రకటించడంలో హైడ్రామా నడిపారు. మధ్యాహ్నాం మూడు గంటలకు జేసీ శ్రీధర్ నష్టపరిహారం వివరాలను వెల్లడించారు. వీటిలో మృతుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వం నుంచి రూ. 5 లక్షలు, బిల్డర్ నుంచి రూ. 15 లక్షలు మొత్తం రూ. 20 లక్షల పరిహారం, గొట్టిపాడులో ఎస్సీలందరికి రూరల్ హౌసింగ్ స్కీమ్ కింద పక్కా ఇళ్లు కట్టించేందుకు అంగీకరించారు. మృతుల కుటుంబాల్లోని పిల్లలను ప్రభుత్వ హాస్టళ్లలో చేర్పించే విషయంలోను స్పష్టమైన హామీ ఇచ్చారు. అయితే బిల్డర్‌పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదుతో పాటు ప్రభుత్వ ఉద్యోగంపై హామీ ఇవ్వలేదు. ఇదే సమయంలో బాధిత కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం హామీని లిఖితపూర్వకంగా ఇవ్వాలని కోరితే ఆయన స్పందించలేదు. బాధ్యులపై పోలీసులకు ఫిర్యాదు భవన నిర్మాణ పనుల్లో ఏడుగురు కూలీలు మృతి చెందిన ఘటనపై నగర కమిషనర్ ఎస్. నాగలక్ష్మి స్పందించారు. బిల్డర్ చుక్కపల్లి రమేష్, లెసైన్స్డ్ ఇంజినీరు హరిబాబు, స్ట్రక్చరల్ ఇంజినీరు వీఏ రెడ్డి, ఫోనెక్స్ సంస్థ నిర్వాహకులపై కేసులు నమోదు చేయాల్సిందిగా పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అలాగే హరిబాబు, వీఏ రెడ్డి, చుక్కపల్లి రమేష్‌ల లెసైన్సులను రద్దుచేశారు. బిల్డింగ్ ఇన్స్పెక్టరు సువర్ణకుమార్‌ను సస్పెండ్ చేయడంతో పాటు డీసీపీ సత్యనారాయణ, సీపీ ధనుజంయరెడ్డిలకు మెమో జారీచేశారు. పరారీలో ప్రధాన నిందితుడు రమేష్, పోలీసుల అదుపులో ముగ్గురు ఏడుగురు కార్మికుల మృతికి బాధ్యులుగా బావిస్తున్న భవన బిల్డర్, ప్రధాన నిందితుడు చుక్కపల్లి రమేష్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆయన ఓ ప్రజాప్రతినిధి అండతో హైదరాబాద్‌లో ఉన్నట్లు సమాచారం. అలాగే సైట్ సూపర్వైజర్ సాంబశివరావు, మేస్త్రీ రాము, కాంట్రాక్టరు వినోద్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
బాలుడిని అపహరించి..
► బాలుడిని అపహరించి.. ఆపై హతమార్చిన అగంతకులు ► కర్చిఫ్‌తో గొంతు బిగించి కర్కశంగా చంపిన వైనం ► కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న తల్లిదండ్రులు ► దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు కిడ్నాపర్ల కర్కశత్వానికి బాలుడు బలయ్యాడు. అడిగిన సొమ్ము ఇవ్వలేదన్న కక్షతో అతి కిరాతకంగా చంపేశారు.. గొంతుకు కర్చీఫ్ చుట్టి, కాళ్లుచేతులు కట్టేసి.. రాయిని తాడుతో ఒంటికి కట్టి బావిలో పడేశారు. నేడో రేపో తమ బిడ్డ తిరిగొస్తాడని ఎదురుచూస్తున్న తల్లిదండ్రులు బాలుడి మృతివార్తతో గుండెలవిసేలా విలపిస్తున్నారు.. పట్నంబజారు(గుంటూరు) : గుంటూరు ఏటీ అగ్రహారం జోరో లైనుకు చెందిన నన్నం జయకుమారి కుమారుడు యదిద్యరాజు (డుంబు) (12) ఇదే ప్రాంతంలోని సెంట్రల్ పబ్లిక్ స్కూల్లో ఆరో తరగతి చదువుతున్నాడు. ఈ నెల 14వ తేదీన సాయంత్రం నాలుగు గంటలకు ఇంటి నుంచి ట్యూషన్‌కు బయలుదేరి వెళ్లాడు. తిరిగి ఇంటికి వచ్చే సమయం కావస్తున్నా.. రాకపోవడంతో కంగారుపడుతున్న తల్లి జయకుమారికి రాత్రి 10 గంటల సమయంలో ఆగంతకులు ఫోన్ చేశారు. మీ బిడ్డ మా వద్దే ఉన్నాడని, రూ.15 లక్షలు ఇస్తే కానీ వదలమని, విషయాన్ని పోలీసులకు తెలియజేస్తే కడతేరుస్తామని బెదిరింపులకు దిగారు. మళ్లీ ఆగంతకులు ఫోన్ చేయడంతో తమ వద్ద అంత డబ్బుల్లేవని, రూ.రెండు లక్షలే ఉన్నాయని వారికి తెలిపారు. కిడ్నాప్ జరిగిన మరుసటి రోజు 15వ తేదీన డుంబు తల్లి జయకుమారి నగరంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఫోన్ కాల్ ఆధారంగా విచారణ ప్రారంభించారు. దానిలో భాగంగానే పేరేచర్ల, మాచర్ల, వినుకొండ ప్రాంతాల్లో మూడు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. అయినా యదిద్యరాజు ఆచూకీ తెలియలేదు. రూ.రెండు లక్షలు చెల్లించేందుకు వెళ్లాడుగానీ.. కిడ్నాపర్ల కోరిక మేరకు రూ.రెండు లక్షలు చెల్లించేందుకు శుక్ర, శనివారాల్లో మృతుడి మేనమామ రాజు వెళ్లాడు. మాచర్ల రెలైక్కి, తుమ్మల చెరువు రైల్వేస్టేషన్లో ఆగంతకులు చెప్పిన ప్రకారం డబ్బు సంచిని పడేశాడు. మొదటి రోజు వెళ్లినప్పుడు డబ్బుల సంచి పడేయలేదని, రెండో రోజు శనివారం వారు కుడి పక్కకు చెబితే, పొరపాటున కంగారులో ఎడమ చేతి పక్కకు పడేసినట్లు రాజు చెప్పాడు. దీంతో డబ్బులు ఇవ్వలేదని, పోలీసులను తీసుకువచ్చారని ఆగంతకులు ఇంతటి దారుణానికి ఒడిగట్టి ఉంటారని భావిస్తున్నారు. రెండు రోజుల కిందటే దారుణం.. ఫిరంగిపురం మండలం తాళ్లూరు గ్రామంలో రోడ్డు పక్క ఉన్న పొలంలోని బావిలో యదిద్యరాజును దారుణంగా కాళ్లు, చేతులు కట్టి పడేశారు. శరీరమంతా భారీగా ఉబ్బిపోయి ఉండడంతో రెండు రోజుల కిందటే పడేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. అనంతరం అక్కడ నుంచి మృతదేహాన్ని గుంటూరు మార్చురీకి తరలించారు. సంఘటన స్థలాన్ని వెస్ట్ డీఎస్పీ కేజీవీ సరిత, నగరంపాలెం పోలీస్‌స్టేషన్ ఎస్‌హెచ్‌వో హైమారావు సందర్శించారు. యదిద్యరాజు మృతదేహాన్ని చూసిన తల్లి జయకుమారి కన్నీరుమున్నీరుగా విలపించిన తీరు ప్రతి ఒక్కరిని కంట తడి పెట్టించింది. తెలిసిన వారి పనేనా..? రోడ్డుపై బాలుడిని ఎత్తుకుని వెళితే... కనీసం గొడవ జరగడం, లేదా కేకలు వేయడం వంటి సంఘటనలైనా జరిగి ఉండాలి. ఇటువంటి ఏమీ లేకుండా బాలుడిని తీసుకుని వెళ్లారంటే ఇది కచ్చితంగా ఎవరో తెలిసిన వారి పనే అయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. యదిద్యరాజు కుటుంబంతో అంతటి పగ ఎవరికి ఉందనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దీనికితోడు ఆస్తి తగాదాలు కూడా ఉండడంతో పలు అనుమానాలకు తావిస్తోందని పోలీసులు అంటున్నారు. -
మార్చురీల్లో ‘అవినీతి గద్దలు’
► విషాద సమయాల్లో చేతివాటం.. పోస్టుమార్టం వద్ద కాసుల బేరం మృతుల బంధువులను పీక్కుతింటున్నవైనం ► బాధితులకు భారంగా మారిన శవపంచనామా సిరిసిల్ల మార్చురీ సాక్షిగా డబ్బుల వసూళ్లు అవినీతి గద్దలు శవాలనూ వదలడం లేదు. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యంతో ఆత్మహత్య చేసుకున్నా, రోడ్డు ప్రమాదాలు, అనుమానాస్పద మృతి ఘటనలు జరిగిన సందర్భా ల్లో చట్టరీ త్యా పోస్టుమార్టం తప్పనిసరి. ఇలాంటి సందర్భా ల్లో శవాలపై పేలాలు ఏరుకున్నట్లు అవినీతిపరులు చేతివాటాన్ని పదర్శిస్తున్నారు. సిరిసిల్ల డివిజన్లోని తొమ్మిది మండలాల్లో జరిగే సంఘటనకు సంబంధించి సిరిసిల్ల ప్రాం తీయ ఆస్పత్రిలో పోస్టుమార్టం జరుగుతుంది. మార్చురీ సాక్షిగా శవాలను చుట్టే చాపలు అ మ్మే వ్యాపారుల నుంచి ఆస్పత్రి సిబ్బంది, పోస్టుమార్టం నివేదిక రాసే పోలీసులు, చివరికి ఫొటోగ్రాఫర్లు సైతం అడ్డగోలుగా డ బ్బులు దండుకుంటూ విషాద సమయాల్లో బాధితులకు చుక్కలు చూపిస్తున్నారు. సిరిసిల్ల మార్చురీ వద్ద జరిగే అవినీతి దందాపై కథనమిదీ.. ఇల్లంతకుంట మండలం ముస్కాన్‌పేటకు చెందిన రైతు సామ మోహన్‌రెడ్డి(50) అప్పుల బాధతో ఇటీవల క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ‘అప్పులోళ్లూ నన్ను క్షమించండి’ అంటూ సూసైడ్ నోటు కూడా రాశాడు. బ్యాంకు అప్పు చెల్లించేందుకు తన బైక్‌ను అమ్మి కిస్తీ చెల్లించాడు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మోహన్‌రెడ్డి కుటుంబం శవపంచనామా, పోస్టుమార్టం కోసం సిరిసిల్ల ప్రాంతీయ ఆస్పత్రిలో రూ.3 వేలు చెల్లించాల్సి వచ్చింది. మోహన్‌రెడ్డి బంధువులు తెలిసిన వాళ్లు ఆ డబ్బులు సర్దుబాటు చేశారు. కోనరావుపేట మండలం బావుసాయిపేటకు చెందిన రైతు మారుపాక శంకర్(40) పంట ఎండిపోయి, ఆర్థికంగా చితికిపోయి పురుగుల మందు తాగి ఇటీవల ఆత్మహత్య చేసుకున్నాడు. కులం చిట్టీలో డబ్బులు చెల్లించా ల్సి రావడంతో మానసిక వేదనకు గురైన శంకర్ పంట చేతికొచ్చే ఆశ లేక.. చేసిన అ ప్పులు తీర్చే మార్గం కానరాక ఆత్మహత్య చే సుకున్నాడు. శంకర్ శవానికి సిరిసిల్ల ఆస్పత్రిలో పోస్టుమార్టం చేసేందుకు రూ.4 వేలు ఖర్చు అయ్యాయి. నిజానికి శంకర్ కుటుంబం పుట్టెడు అప్పుల్లో ఉంది. కరువు పరిస్థితుల్లో ఊరిలో అప్పు దొరకని దుస్థితి. సిరిసిల్ల : సిరిసిల్ల డివిజన్లోని తొమ్మిది మండలాల పరిధిలోని 202 గ్రామాల్లో ఎలాంటి సంఘటనలు జరిగిన సిరిసిల్ల ప్రాంతీయ ఆస్పత్రికి శవాలను తరలిస్తారు. నెలకు 60 నుంచి 100 పోస్టుమార్టం కేసులు సిరిసిల్లలో జరుగుతున్నారు. పోస్టుమార్టం చేసే పక్రియలో మార్చురీ సిబ్బంది చేతివాటం మృతుల బంధువులను మరింత బాధిస్తోంది. బాధితుల నుంచి నెలకు రూ.లక్షల్లో డబ్బులు దండుకుంటున్నారు. ప్రధానంగా ఆస్పత్రి సిబ్బందితోపాటు ప్రైవేటు వ్యక్తులు మార్చురీ వద్ద ఉండి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఒక్కో శవాని రూ.వెయ్యి వరకు గుంజుతున్నారు. పోస్టుమార్టం గదిలో వాసన ఉంటుందని మందు(లిక్కర్) తాగందే పోస్టుమార్టం చేయరాదంటూ డబ్బులు వసూలు చేస్తున్నారు. శవపంచనామా నిర్వహించే పోలీసులు భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారు. తాము ఎఫ్ఐఆర్లో నమోదు చేసే వివరాల ఆధారంగానే మీకు ప్రభుత్వసాయం అందుతుందని డబ్బులు నొక్కేస్తున్నారు. ఒక్కో శవ పంచనామాకు రూ.1500 నుంచి రూ.3 వేల వరకు గుంజుతున్నారు. శవాలను చుట్టే చాపలు అమ్మే వ్యాపారులు సైతం రూ.500 తగ్గకుండా వసూలు చేస్తున్నారు. శవాలను ఫొటోలు తీసే ఫొటో గ్రాఫర్ సైతం ఈ కేసులో నేను కోర్టుకు హాజరు కావాల్సి వస్తుందని ఫొటోలకు రూ.500 గుంజుతున్నారు. ఇలాఅన్ని స్థాయిల్లోనూ అడ్డగోలుగా డబ్బులు వసూలు చేస్తున్నారు. అసహాయ స్థితిలో కుటుంబ సభ్యులు విషాదంలో ఉంటే అవినీతి రాబంధులు అందినకాడికి దండుకుంటున్నాయి. పోలీసు అధికారులు శవపంచనామాలో వసూళ్లపై దృష్టిసారించాల్సి అవసరం ఉంది. ఫిర్యాదు చేస్తే చర్య తీసుకుంటాం పోస్టుమార్టం చేసేందుకు ఎవరైనా డబ్బులు అడితే ఫిర్యాదు చేయండి. తప్పకుండా చర్యలు తీసుకుంటాం. బయట జరిగే తతంగంతో మాకు సంబంధం లేదు. ప్రైవేటు వ్యక్తులు వసూలు చేసినట్లు తెలిసింది. కానీ ఇప్పు డు ఎవరూ ఉండవద్దని చెప్పాం. శవాలను భద్రపరిచేందుకు ఒక్క ఫ్రీజర్ ఉంది. మరో ఫ్రీజర్‌ను తెప్పిస్తున్నాం. పోస్టుమార్టంలో మా వాళ్లు ఎవరు డబ్బులు తీసుకున్నా చర్య తీసుకుంటాం. - గూడూరి రవీందర్, ఆస్పత్రి సూపరింటెండెంట్ -
కట్టలు తెగిన ఆగ్రహం
► గుత్తిలో తల్లీ, ఇద్దరు బిడ్డల ► ఆత్మ‘హత్య’లపై బంధువుల ఆందోళన ► భార్యా పిల్లలను భర్త, అతని కుటుంబ సభ్యులే చంపి ఆత్మహత్యగా ► చిత్రీకరించినట్లు ఆరోపణ ► నిందితులను అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ ► ప్రభుత్వాస్పత్రి మార్చురీ ఎదుట ► బైఠాయింపు, ధర్నా, ఆస్పత్రి గేట్లు మూసివేత గుత్తి: గుత్తి ప్రభుత్వాస్పత్రి పరిసరాలు ఆందోళనలతో దద్దరిల్లాయి. తల్లీ, ఇద్దరు పిల్లల ఆత్మ‘హత్య’ల నేపథ్యంలో మృతురాలి పుట్టింటి వారు, బంధువులు ఆందోళనకు దిగారు. గుత్తికి చెందిన నేత్రావతి, ఆమె ఇద్దరు పిల్లలు మురారి, ముఖేశ్‌ను కుటుంబ యజమాని రఘుబాబు, అతని కుటుంబ సభ్యులే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించినట్లు ఆమె తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తూ వారు స్థానిక ప్రభుత్వాస్పత్రి ప్రధాన గేట్లను మూసివేసి ధర్నాకు దిగారు. అంతకు ముందు మార్చురీ ఎదుట భైటాయించి నిరసన తెలిపారు. నేత్రావతి చాలా ధైర్యవంతురాలని, ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాద న్నారు. పైగా పిల్లలంటే ఆమెకు వల్లమాలిన ప్రేమ అన్నారు. వివాహేతర సంబంధం కోసం రఘుబాబే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు నిప్పులు చెరిగారు. రఘుబాబు సహా అతని ఉంపుడుగత్తెను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రజా సంఘాల మద్దతు: నేత్రావతి, ఆమె ఇద్దరు పిల్లల మరణానికి కారణమైన రఘుబాబును తక్షణం అరెస్టు చేయాలని కోరుతూ బెంగళూరు నుంచి వచ్చిన ఆమె తల్లి అన్నపూర్ణమ్మ, పెద్దమ్మ వెంకటలక్ష్మమ్మ, సోదరులు అశోక్, చంద్రశేఖర్, అక్క భారతి, చెల్లెళ్లు అశ్వని, ఆశా, శాలిని, శేకమ్మ, మేనమామలు కిరణ్, నారాయణస్వామి సహా మరో 50 మంది బంధువులు ఆందోళనకు దిగిన విషయం తెలుసుకున్న ప్రజా సంఘాల నాయకులు వారికి మద్దతుగా నిలిచారు. ఎమ్మార్పీఎస్, ఐద్వా నాయకులు మద్దతు తెలిపిన వారిలో ఉన్నారు. ఆందోళన విషయం తెలుసుకున్న ఎస్ఐ రామాంజనే యులు తమ సిబ్బందితో ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. ఆందోళనకారులతో మాట్లాడారు. ధర్నా విరమించాలని కోరగా వారు ససేమిరా అన్నారు. డీవైఎస్పీ, తహశీల్దార్ సమక్షంలో మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించాలని డిమాండ్ చేశారు. పెళ్లి సమయంలో తీసుకున్న రూ.4 లక్షల కట్నం డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. రఘుబాబు ఉంచుకున్న మహిళపైనా కేసు నమోదు చేసి అరెస్టు చేయాలన్నారు. తహశీల్దార్ హరిప్రసాద్, ఆస్పత్రి సూపరిండెంట్ మాధవకృష్ణ, ఎస్ఐ రామాంజనేయులు, ఎమ్మార్సీఎస్ మండల శాఖ అధ్యక్షులు అంజిన్ ప్రసాద్, ఐద్వా నాయకురాళ్లు రేణుక, సునీత, మదార్బీ, సీపీఎం మండల శాఖ అధ్యక్షులు శ్రీరాములు, న్యాయవాది రాజశేఖర్, కేవీపీఎస్ అధ్యక్షులు మల్లికార్జున సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించడానికి అంగీకరించడంతో ధర్నా విరమించారు. మృతదేహాలకు పోస్టుమార్టం: నేత్రావతి, ఆమె పిల్లలు మురారి, ముఖేశ్ మృతదేహాలకు బుధవారం వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం చెట్నేపల్లిలో అంత్యక్రియలు నిర్వహించారు. రఘుబాబు కుటుంబ సభ్యుల అరెస్టు: నేత్రావ తి, ఇద్దరు పిల్లల మృతి కేసులో భర్త రఘుబాబు, అత్త శాంతకుమారి, బావ ప్రసాద్, అక్క చాముండి, ఆడబిడ్డ ఉమను ఎస్ఐలు చాంద్‌బాషా, రామాంజనేయులు అరెస్టు చేశారు. అనంతరం వారిని పోలీసు స్టేషన్‌కు తరలించారు. -
ఆగని మృత్యు కేళి
► మజ్జివలస హాస్టల్లో గిరిజన విద్యార్థి మృతి ► రెండు నెలల వ్యవధిలో ఏడుగురు మృత్యువాత ► మార్చురీ వద్ద కుటుంబ సభ్యులు, బంధువుల ఆందోళన ► గిరిజన సంక్షేమ డీడీ కమల ► లిఖితపూర్వక హామీతో ఆందోళన విరమణ పాడేరు రూరల్: మన్యంలోని గిరిజన సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థుల మరణాలు ఆగడం లేదు. మన్యం వసతి గృహాల్లో ఉండి చదువుకుం టున్న ఏడుగురు విద్యార్థులు రెండు నెలల వ్యవధిలో అనారోగ్యంతో మృత్యువాత పడ్డారు. విద్యార్థులు పిట్టల్లారాలిపోతున్నా ఐటీడీఏ, గిరిజన సంక్షేమ అధికారులు మరణాల అడ్డుకట్టకు సరైన చర్యలు తీసుకోవడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు, గిరిజన, ప్రజా సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. తాజాగా హుకుంపేట మండలం మారుమూల బూరుగుపుట్టు పంచాయతీ మజ్జివలస గిరిజన సంక్షేమ పాఠశాలలో ఆరవ తరగతి చదువుతున్న కొర్రా శంకరరావు అనే విద్యార్థి మృతి చెందాడు. అదే పాఠశాలలో చదువుతున్న శంకరరావు సోదరుడు కొర్రా నవీన్‌కుమార్, తోటి విద్యార్థులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కొర్రా శంకరరావు బుధవారం రాత్రి భోజనం తర్వాత అందరి విద్యార్థులతో హాస్టల్లో పడుకున్నాడు. తెల్లవారు జాము 4.30 గంటలకు ఉన్నట్టుండి కడుపునొప్పి, రక్తంతో కూడిన వాంతులు అవడం మొదలైంది. పక్కనే నిద్రపోతున్న విద్యార్థులు గమనించి హాస్టల్ క్వార్టర్స్‌లో ఉంటున్న సీఆర్టీలకు సమాచారం అందజేశారు. వారు ఉదయం ఏడు గంటలకు విద్యార్థిని ఉప్ప ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. కానీ ఆ సమయంలో ఆస్పత్రికి తాళం వేసి ఉంది. ఆస్పత్రిలో ఉండాల్సిన స్టాఫ్ నర్సుతో సహా మిగిలిన ఎవ్వరు లేరు. చేసేదేమీ లేక ఉప్పలో ఓ ప్రైవేటు వాహనంలో పా డేరు ఆస్పత్రికి తరలిస్తుండగా హుకుంపేట వచ్చేసరికే విద్యార్థి మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పాడేరు ప్రాం తీయ ఆస్పత్రికి తరలించారు. విద్యార్థి కుటుంబ సభ్యుల ఆందోళన తమ బిడ్డ మృతి చెందిన విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, వైఎస్ఆర్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి తడబారికి సురేష్‌కుమార్, గిరిజన సంఘం జిల్లా సహాయ కార్యదర్శులు ఎం.ఎం.శ్రీను, కె.సుందర్రావులు ఆస్పత్రికి చేరుకున్నారు. శంకరారవు కుటుంబాన్ని ఆదుకోవాలని, మృతిపై పూర్తి స్థాయి విచారణ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాఠశాల డిప్యూటీ వార్డెన్, హెచ్ఎం, ఏటీడబ్ల్యూఓలపై కఠిన చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. న్యాయం జరిగకపోతే అక్కడి నుంచి కదిలేది లేదబి బీష్మించుకుని కూర్చున్నారు. డీడీ హామీతో ఆందోళన విరమణ గిరిజన సంక్షేమ శాఖ డీడీ ఎం.కమల ఆస్పత్రి మార్చిరీ వద్ద చేరుకుని విద్యార్థి కుటుంబ సభ్యులు, సంఘాల నాయకులతో మాట్లాడారు. మృతిపై పూర్తి స్థాయి విచారణ చేస్తామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని, ఎక్స్‌గ్రేషియా మంజూరయ్యేటట్లు కృషి చేస్తామని లిఖితపూర్వకంగా హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అనంతరం పోస్టుమార్టం పూర్తి చేసి విద్యార్థి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నట్టు హుకుంపేట ఎస్ఐ రవికుమార్ తెలిపారు. -
చెన్నైలో తవ్వే కొద్దీ శవాలు
మార్చురీల్లో పేరుకుపోతున్న మృతదేహాలు చెన్నై, సాక్షి ప్రతినిధి: వరదలతో అతలాకుతలమైన చెన్నైలో తవ్వేకొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. చెత్తాచెదారం తొలగించేటప్పుడు బయటపడుతున్న శవాలు అంత్యక్రియలకు నోచుకోక ప్రభుత్వ మార్చురీల్లో పేరుకుపోతున్నాయి. ఈ నెల మొదటి వారంలో కురిసిన భారీ వర్షాలకు చెన్నై చెరువులా మారిపోయింది. వరదల్లో కొట్టుకుపోయి, విద్యుదాఘాతానికి గురై వందలాది మంది మృతి చెందారు. నీటిలో గల్లంతైన వారి మృతదేహాలు కొన్ని లభ్యం కాగా, వందలాది శవాలు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. 230 మంది చనిపోయినట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నా కనీసం వెయ్యి మందికి పైగా మృతిచెందినట్లు తెలుస్తోంది. వారం రోజులుగా నగరంలో పారిశుధ్య పనులు చురుగ్గా సాగుతున్నాయి. చెత్తను తొలగిస్తున్న క్రమంలో అందులో కూరుకుపోయిన శవాలు బయటపడుతున్నాయి. వీటిని ప్రభుత్వ ఆసుపత్రుల్లోని మార్చురీకి చేరుస్తున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న మృతదేహాలను భద్రపర్చలేక మార్చురీల సిబ్బంది అవస్థలు పడుతున్నారు. మార్చురీ సామర్థ్యానికి మించి శవాలు వస్తున్నాయి. మిన్నకుండిపోతున్న బంధువులు వరద నీటిలో నాని కుళ్లిపోయిన శవాలు గుర్తుపట్టలేని స్థితికి చేరుకున్నాయి. ఉబ్బిపోయిన తమవారి శవాలను గుర్తించే వీలులేదని బంధువులు మిన్నకుండిపోతున్నారు. దీంతో మార్చురీల్లో మృతదేహాల సంఖ్య పెరిగిపోతోంది. మృతుల సంఖ్య పెరిగిన పక్షంలో ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చే అవకాశం ఉండటంతో మార్చురీల్లోని వరద మృతదేహాల సంఖ్య గోప్యంగా మారింది. మార్చురీల్లోని శవాల వివరాలు వెల్లడించ వద్దని తమిళనాడు ఆరోగ్యశాఖ కార్యదర్శి రాధాకృష్ణన్ ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు నోరు మెదపడం లేదు. -
చచ్చాడు.. బతికాడు.. మళ్లీ చచ్చాడు
ముంబయి: చనిపోయిన వ్యక్తి పోస్టు మార్టానికి తీసుకెళ్లాక లేచి అందరినీ అవాక్కయ్యేలా చేసి రెండు రోజులు ప్రాణాలతో ఉండి తిరిగి మళ్లీ చనిపోయాడు. ఈ ఘటన ముంబయిలో చోటుచేసుకుంది. గత ఆదివారం ముంబయి నగరంలో ప్రధాని నరేంద్రమోదీ కార్యక్రమం ఉన్న నేపథ్యంలో భారీ సంఖ్యలో పోలీసులు వచ్చారు. రోడ్లు వెంట పెట్రోలింగ్ నిర్వహించారు. ఆ క్రమంలో ఓ ఆస్పత్రికి సమీపంలో ప్రకాశ్(50) అనే ఓ వ్యక్తి అపస్మారక స్థితిలో కనిపించాడు. అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లగా నాడీ పరీక్షించిన వైద్యుడు అతడిని చనిపోయినట్లు నిర్ధారించాడు. దీంతో పోస్టుమార్టానికి కావాల్సిన ప్రక్రియ పూర్తి చేసి పోస్టుమార్టం ప్రారంభించే సమయంలో లేచి కూర్చుని మొత్తం ఆస్పత్రినే కాకుండా పోలీసులను కూడా అవాక్కయ్యేలా చేశాడు. అయితే, ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యంతో బతికి ఉన్న వ్యక్తిని చనిపోయాడని చెప్పారని పలు రకాలుగా విమర్శించారు. ఆ వెంటనే అతడిని ఐసీయూలోకి తరలించారు. అయితే, అలా బతికిన వ్యక్తి రెండు రోజులు మాత్రమే ప్రాణాలతో ఉండి ఐసీయూలో మంగళవారం చనిపోయాడు. ఆస్పత్రి డీన్ సులేమాన్ మర్చంట్ ఈ విషయం ధ్రువీకరించారు. -
మార్చురీల్లోనే అనాథ శవాలు
సాక్షి, ముంబై: స్థానిక ప్రభుత్వ ఆస్పత్రుల్లోని మార్చురీలో 119 అనాథ శవాలు అలాగే పడి ఉన్నాయి. బంధువులెవరూ రాకపోవడం ఆస్పత్రి యాజమాన్యాలకు తలనొప్పిగా పరిణమించింది. నియమ, నిబంధనల ప్రకారం వాటికి అంత్యక్రియలు నిర్వహించాల్సిన బాధ్యత పోలీసు శాఖపై ఉంది. ఆస్పత్రుల యాజమాన్యాలు పలుమార్లు లిఖిత పూర్వకంగా పోలీసులకు తెలియజేసినప్పటికీ వారు పట్టించుకోలేదు. దీంతో ఏడు నెలల నుంచి అవి శవాల గదిలో అలాగే ఉన్నాయి. నగరంలో జే.జే.,రాజావాడి, కూపర్, భగవతి ప్రభుత్వ ఆస్పత్రుల్లో మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహిస్తారు. గత మూడేళ్ల నుంచి అనాథ శవాల సంఖ్య పెరుగుతోంది. దీంతో మున్ముందు ఇబ్బందులను ఎదుర్కోక తప్పదని ఆస్పత్రి యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి. వీటిని ఇంకెంత కాలం భద్రపర్చాలో అర్థం కాక ఆస్పత్రి సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. దేశ ఆర్థిక రాజాధాని నగరమైన ముంబైకి నిత్యం వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది ఉపాధి నిమిత్తం వస్తుంటారు. కొందరు కుటుంబ కలహాలతో ఇంటి నుంచి పారిపోయి వస్తుంటారు. మరికొందరు మానసిక స్థితి సరిగాలేక ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడే ఉండిపోతారు. ఇలాంటి వారి తాలూకు వివరాలుగానీ, చిరునామాగానీ ఉండదు. ఇలా వచ్చిన వారంత రైల్వే ప్లాట్‌ఫాంలు, స్టేషన్ బయట ఉన్న ఖాళీ స్థలాలు, బస్టాండ్ పరిసరాల్లో ఉంటుంటారు. ఆనారోగ్యంతో లేదా ప్రమాదవశాత్తు చనిపోతే వీరికి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎవరూ ముందుకు రారు. ఇలాంటి అనాథ శవాలను పోలీసులు ఆస్పత్రులకు తరలించి చేతులు దులుపేసుకుంటున్నారు. ఆ తరువాత వైద్యులు వాటికి పోస్టుమార్టం నిర్వహించి మార్చురీలో భద్రపరుస్తారు. వారికి సంబంధించిన దస్తులు, ఆనవాళ్లు, ఇతర వస్తువులు స్టోర్ రూంలో భద్రపరుస్తారు. అయితే నెలలు గడుస్తున్నప్పటికీ వారి బంధువులెవరూ రాకపోవడంతో ఆస్పత్రిలో శవాల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. దీంతో వాటిని నెలల తరబడి భద్రపర్చడం సవాలుగా మారింది. ప్రస్తుతం భగవతి ఆస్పత్రిలో 54, జే.జే ఆస్పత్రిలో 18, కూపర్ ఆస్పత్రిలో 20 అనాథ శవాలున్నాయి. -
ఆరుబయటే పోస్టుమార్టం
మెదక్ రూరల్ :పేరుకే డివిజన్లో పెద్దాస్పత్రి. ఇక్కడ పోస్టుమార్టం చేయడానికి కనీస వసతులు లేవు. ముఖ్యంగా గదులు సమస్య వేధిస్తోంది. దీంతో ఆస్పత్రికి వచ్చిన మృతదేహాలకు ఆరుబయటే పోస్టుమార్టం నిర్వహించాల్సి వస్తోంది. ఒక వేళ అనాథ మృతదేహాలు వస్తే వాటిని భద్రపరిచేందుకు ఫ్రీజర్లు కూడా లేవు. దీంతో సచ్చినా కష్టాలు తప్పడం లేదు. మెదక్ ఏరియా ఆస్పత్రికి మెదక్, చిన్నశంకరంపేట, పాపన్నపేట, కొల్చారం, చేగుంట, కౌడిపల్లితో పాటు పలు పీహెచ్‌సీల నుంచి ప్రజలు చికిత్సల నిమిత్తంతో పాటు ప్రమాదాల్లో మరణిస్తే పోస్టుమార్టం కోసం ఇక్కడికి రావాల్సిందే. కానరాని సౌకర్యాలు... మెదక్ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం కోసం ఓ గదిని కేటాయించారు. కానీ అది చాలా ఇరుకుగా ఉంది. కనీసం అందులోకి గాలి, వెలుతురు కూడా రాని పరిస్థితి. మరో ఇరుకు గదిలో శవాలను భద్రపరిచే ఒక ఫ్రీజర్ ఉంది. అది దశాబ్దాల క్రితం చెడిపోవడంతో అది కూడా మూలన పడింది. దీంతో గత్యంతరం లేక ఆరు బయటనే మృతదేహాలకు పోస్టుమార్టం చేస్తున్నారు. కనీసం నీటి సౌకర్యం కూడా లేక పోవడంతో బయట నుంచి బకెట్లలో నీటిని తెచ్చుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. పోస్టుమార్టం మృతదేహాలను బద్రపరిచేందుకు కావాల్సిన ఫ్రీజర్ల, (మార్చురీ) యూనిట్ లేదు. పోస్టుమార్టం చేయాలి అంటే రెండు పెద్ద సైజు బెంచీలతో పాటు విశాలమైన గది ఉండాలి. అదే గదిలో కనీసం 3 నుంచి 4 మృతదేహాలను భద్ర పరిచేందుకు ఫ్రీజర్లు అందుబాటులో ఉండాలి. గదిలో మృతదేహం వాసన రాకుండా ఉండేందుకు వాడే రసాయనాలను అందుబాటులో ఉంచుకోవాలి. అయితే ఏరియా ఆస్పత్రిలో ఇటువంటి సౌకర్యాలు ఏవీ లేవు. దీంతో అనాథ మృతదేహాలను రోజుల తరబడి ఓ గదిలో ఉంచ డంతో కుళ్లిపోయి దుర్వాసన వస్తోంది. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించేందుకు అన్నిసౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయంపై ఆస్పత్రి సూపరింటెండెంట్ చంద్రశేఖర్‌ను వివరణ కోరగా ఈ సమస్యను గతంలోనే ఉన్నతాధికారుల దృష్టి కి తీసుకెళ్లడం జరిగిందన్నారు. నిధులు మంజూరైతే విశాలమైన గదితో పాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. -
నిమ్స్ మార్చురీలోనే ఉదయకిరణ్ మృతదేహం
హైదరాబాద్: ఆత్మహత్య చేసుకున్న సినీహీరో ఉదయ్ కిరణ్ మృత దేహాన్ని ఈ రాత్రికి నిమ్స్ మార్చురీలోనే ఉంచాలని బంధువులు నిర్ణయించారు. శ్రీనగర్ కాలనీలోని జ్యోతి హోమ్స్ ఫ్లాట్ నంబర్ 402లో ఉదయ్ కిరణ్ రాత్రి 12:15 నిమిషాలకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. తొలుత మృతదేహాన్ని అపార్ట్‌మెంట్‌కు తరలించాలని అనుకున్నారు. అయితే అపార్ట్మెంట్లో నివాసం ఉండేవారు అందుకు అంగీకరించలేదు. అభిమానుల తాకిడి ఎక్కువగా ఉంటుందని వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో మృత దేహాన్ని ఈ రాత్రికి మార్చురీలోనే ఉంచాలని అనుకున్నట్లు బంధువులు తెలిపారు. ఉదయ్ కిరణ్ సోదరి, బావ మస్కట్ నుంచి నిమ్స్‌కు చేరుకున్నారు. రేపు ఉదయం 9.30 గంటలకు ఉదయ కిరణ్ మృత దేహాన్ని ఫిలిం ఛాంబర్‌కు తరలిస్తారు. సినీరంగం వారు, అభిమానుల సందర్శనార్ధం రెండు గంటలపాటు అక్కడ ఉంచుతారు. ఆ తరువాత ఎర్రగడ్డ స్మశానవాటికకు తరలించి, మధ్యాహ్నం అక్కడ అంత్యక్రియలు జరుపుతామని కుటుంబ సభ్యులు తెలిపారు.