మార్చురీలో స్పృహలోకి వచ్చిన వ్యక్తి (ఫొటో సేకరణ: ద సన్)
కెరిచో: ఓ ఆస్పత్రి నిర్లక్ష్యం మనిషి బతికుండగానే మార్చురీలో పడుకోబెట్టేలా చేసింది. చనిపోయాడనుకున్న వ్యక్తిని అంత్యక్రియల కోసం సిద్ధం చేస్తుండగా స్పృహలోకి రావడంతో సిబ్బంది భయంతో పరుగులు పెట్టారు. వివరాల్లోకి వెళ్తే.. కెరిచో దేశానికి చెందిన ముప్పై రెండేళ్ల పీటర్ కైగెన్ కడుపు సంబంధిత సమస్యలతో కప్లాటెట్ ఆస్పత్రికి వెళ్లాడు. అయితే ఓ నర్సు అతడు చనిపోయినట్లు రోగి కుటుంబానికి తెలిపింది. దీంతో సిబ్బంది అతడిని మార్చురీ గదిలోకి తరలించారు. అంత్యక్రియలు జరిపేవరకు అతడి శరీరం కుళ్లిపోకుండా ఉండేందుకు సిబ్బంది ఎంబాలింగ్ ప్రక్రియను చేపట్టారు. (చదవండి: షాకింగ్ వీడియో: యువతి మృతదేహాన్ని..)
అందులో భాగంగా అతడి శరీరం నుంచి రక్తాన్ని వేరు చేసే ప్రక్రియను మొదలు పెట్టారు. ఇంతలో అతడు నొప్పితో కళ్లు తెరిచి, కేకలు పెట్టగా చనిపోయిన వ్యక్తికి మళ్లీ ప్రాణం వచ్చిందని సిబ్బంది భయభ్రాంతులకు లోనయ్యారు. కాసేపటికే అతడు చనిపోలేదని నిర్ధారణకు క్యాజువల్ సాధారణ వార్డులోకి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ షాకింగ్ ఘటన గురించి కైగెన్ సోదరుడు మాట్లాడుతూ.. "మార్చురీలో ఉన్న వ్యక్తి కంగారుగా మా దగ్గరకు వచ్చి లోపలకు రమ్మన్నారు. అక్కడ కైగెన్ శరీరంలో కదలికలు చూసి షాకయ్యాం. ఓ క్షణం పాటు ఏం జరుగుతుందనేది మాకే అర్థం కాలేదు. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగింది" అని చెప్పుకొచ్చారు. మరోవైపు కైగెన్ మాట్లాడుతూ.. 'ఇది నేనే నమ్మలేకపోతున్నాను. నేను చనిపోయానని డాక్టర్లు ఎలా చెప్పారు? అసలు ఎప్పుడు స్పృహ కోల్పోయానో, ఎప్పుడు తిరిగి ఈ లోకంలోకి వచ్చానో నాకే తెలీట్లేదు. ఏదేమైనా నాకు మళ్లీ జీవితాన్ని ప్రసాదించినందుకు ఆ దేవుడికి ధన్యవాదాలు" అని సంతోషం వ్యక్తం చేశారు. (చదవండి: కన్నీళ్లు ఇంకిపోయేలా ఏడ్చాను)
Comments
Please login to add a commentAdd a comment