మార్చురీల్లో ‘అవినీతి గద్దలు’ | Post mortem of the dead relatives of the bargain | Sakshi
Sakshi News home page

మార్చురీల్లో ‘అవినీతి గద్దలు’

Published Sat, Apr 9 2016 2:36 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM

మార్చురీల్లో ‘అవినీతి గద్దలు’ - Sakshi

మార్చురీల్లో ‘అవినీతి గద్దలు’

విషాద సమయాల్లో చేతివాటం.. పోస్టుమార్టం వద్ద కాసుల బేరం  మృతుల బంధువులను పీక్కుతింటున్నవైనం
బాధితులకు భారంగా మారిన శవపంచనామా  సిరిసిల్ల మార్చురీ సాక్షిగా డబ్బుల వసూళ్లు

 

అవినీతి గద్దలు శవాలనూ వదలడం లేదు. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యంతో ఆత్మహత్య చేసుకున్నా, రోడ్డు ప్రమాదాలు, అనుమానాస్పద మృతి ఘటనలు జరిగిన సందర్భా ల్లో చట్టరీ త్యా పోస్టుమార్టం తప్పనిసరి. ఇలాంటి సందర్భా ల్లో శవాలపై పేలాలు ఏరుకున్నట్లు అవినీతిపరులు చేతివాటాన్ని పదర్శిస్తున్నారు. సిరిసిల్ల డివిజన్‌లోని తొమ్మిది మండలాల్లో జరిగే సంఘటనకు సంబంధించి సిరిసిల్ల ప్రాం తీయ ఆస్పత్రిలో పోస్టుమార్టం జరుగుతుంది. మార్చురీ సాక్షిగా శవాలను చుట్టే చాపలు అ మ్మే వ్యాపారుల నుంచి ఆస్పత్రి సిబ్బంది, పోస్టుమార్టం నివేదిక రాసే పోలీసులు, చివరికి ఫొటోగ్రాఫర్లు సైతం అడ్డగోలుగా డ బ్బులు దండుకుంటూ విషాద సమయాల్లో బాధితులకు చుక్కలు చూపిస్తున్నారు. సిరిసిల్ల మార్చురీ వద్ద జరిగే అవినీతి దందాపై కథనమిదీ..                                            
 
 
 ఇల్లంతకుంట మండలం ముస్కాన్‌పేటకు చెందిన రైతు సామ మోహన్‌రెడ్డి(50) అప్పుల బాధతో ఇటీవల క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ‘అప్పులోళ్లూ నన్ను క్షమించండి’ అంటూ సూసైడ్ నోటు కూడా రాశాడు. బ్యాంకు అప్పు చెల్లించేందుకు తన బైక్‌ను అమ్మి కిస్తీ చెల్లించాడు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మోహన్‌రెడ్డి కుటుంబం శవపంచనామా, పోస్టుమార్టం కోసం సిరిసిల్ల ప్రాంతీయ ఆస్పత్రిలో రూ.3 వేలు చెల్లించాల్సి వచ్చింది. మోహన్‌రెడ్డి బంధువులు తెలిసిన వాళ్లు ఆ డబ్బులు సర్దుబాటు చేశారు.
 
 కోనరావుపేట మండలం బావుసాయిపేటకు చెందిన రైతు మారుపాక శంకర్(40) పంట ఎండిపోయి, ఆర్థికంగా చితికిపోయి పురుగుల మందు తాగి ఇటీవల ఆత్మహత్య చేసుకున్నాడు. కులం చిట్టీలో డబ్బులు చెల్లించా ల్సి రావడంతో మానసిక వేదనకు గురైన శంకర్ పంట చేతికొచ్చే ఆశ లేక.. చేసిన అ ప్పులు తీర్చే మార్గం కానరాక ఆత్మహత్య చే సుకున్నాడు. శంకర్ శవానికి సిరిసిల్ల ఆస్పత్రిలో పోస్టుమార్టం చేసేందుకు రూ.4 వేలు ఖర్చు అయ్యాయి. నిజానికి శంకర్ కుటుంబం పుట్టెడు అప్పుల్లో ఉంది. కరువు పరిస్థితుల్లో ఊరిలో అప్పు దొరకని దుస్థితి.

 
 
 సిరిసిల్ల : సిరిసిల్ల డివిజన్‌లోని తొమ్మిది మండలాల పరిధిలోని 202 గ్రామాల్లో ఎలాంటి సంఘటనలు జరిగిన సిరిసిల్ల ప్రాంతీయ ఆస్పత్రికి శవాలను తరలిస్తారు. నెలకు 60 నుంచి 100 పోస్టుమార్టం కేసులు సిరిసిల్లలో జరుగుతున్నారు. పోస్టుమార్టం చేసే పక్రియలో మార్చురీ సిబ్బంది చేతివాటం మృతుల బంధువులను మరింత బాధిస్తోంది. బాధితుల నుంచి నెలకు రూ.లక్షల్లో డబ్బులు దండుకుంటున్నారు. ప్రధానంగా ఆస్పత్రి సిబ్బందితోపాటు ప్రైవేటు వ్యక్తులు మార్చురీ వద్ద ఉండి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఒక్కో శవాని రూ.వెయ్యి వరకు గుంజుతున్నారు. పోస్టుమార్టం గదిలో వాసన ఉంటుందని మందు(లిక్కర్) తాగందే పోస్టుమార్టం చేయరాదంటూ డబ్బులు వసూలు చేస్తున్నారు. శవపంచనామా నిర్వహించే పోలీసులు భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారు.

తాము ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేసే వివరాల ఆధారంగానే మీకు ప్రభుత్వసాయం అందుతుందని డబ్బులు నొక్కేస్తున్నారు. ఒక్కో శవ పంచనామాకు రూ.1500 నుంచి రూ.3 వేల వరకు గుంజుతున్నారు. శవాలను చుట్టే చాపలు అమ్మే వ్యాపారులు సైతం రూ.500 తగ్గకుండా వసూలు చేస్తున్నారు. శవాలను ఫొటోలు తీసే ఫొటో గ్రాఫర్ సైతం ఈ కేసులో నేను కోర్టుకు హాజరు కావాల్సి వస్తుందని ఫొటోలకు రూ.500 గుంజుతున్నారు. ఇలాఅన్ని స్థాయిల్లోనూ అడ్డగోలుగా డబ్బులు వసూలు చేస్తున్నారు. అసహాయ స్థితిలో కుటుంబ సభ్యులు విషాదంలో ఉంటే అవినీతి రాబంధులు అందినకాడికి దండుకుంటున్నాయి. పోలీసు అధికారులు శవపంచనామాలో వసూళ్లపై దృష్టిసారించాల్సి అవసరం ఉంది.
 
 ఫిర్యాదు చేస్తే చర్య తీసుకుంటాం
 పోస్టుమార్టం చేసేందుకు ఎవరైనా డబ్బులు అడితే ఫిర్యాదు చేయండి. తప్పకుండా చర్యలు తీసుకుంటాం. బయట జరిగే తతంగంతో మాకు సంబంధం లేదు. ప్రైవేటు వ్యక్తులు వసూలు చేసినట్లు తెలిసింది. కానీ ఇప్పు డు ఎవరూ ఉండవద్దని చెప్పాం. శవాలను భద్రపరిచేందుకు ఒక్క ఫ్రీజర్ ఉంది. మరో ఫ్రీజర్‌ను తెప్పిస్తున్నాం. పోస్టుమార్టంలో మా వాళ్లు ఎవరు డబ్బులు తీసుకున్నా చర్య తీసుకుంటాం. -  గూడూరి రవీందర్,  ఆస్పత్రి సూపరింటెండెంట్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement