ఏలూరు జీజీహెచ్ మార్చురీలో దారుణం
ఏలూరు టౌన్: ఏలూరు సర్వజన ఆసుపత్రిలోని మార్చురీ దారుణాలకు కేంద్ర బిందువుగా మారింది..అనాథ శవాలే అక్కడి కొందరు సిబ్బందికి ఆదాయ వనరులుగా మారాయి. ఏలూరు జీజీహెచ్‌లో గత కొంత కాలంగా గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న అవినీతి బాగోతం బహిర్గతమైంది. పదిరోజుల కిత్రం జరిగిన ఓ ఘటనతో తీగ లాగితే.. డొంకంతా కదిలినట్లు..మార్చురీలో సాగుతున్న అక్రమ శవాల వ్యాపారం వెలుగులోకి వచి్చంది.
ఈ ఆసుపత్రిలో అనాథ శవాలను భారీ రేటుకు విక్రయిస్తూ వ్యాపారం చేస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏడాదిన్నరగా 8–10 అనాథ శవాలను ఇతర రాష్ట్రాలు, ప్రాంతాలకు తరలించినట్టు తెలుస్తోంది. తమిళనాడు రాష్ట్రం చెన్నై, బెంగళూరులోని ప్రైవేటు మెడికల్ కాలేజీలకు శవాలను భారీ రేటుకు విక్రయిస్తున్నట్టు చెబుతున్నారు. ఒక్కో శవాన్ని రూ.లక్ష నుంచి రూ.2 లక్షలకు వరకూ విక్రయిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.
కొన్ని అంబులెన్సుల ద్వారా అనాథ శవాలను తరలించేందుకు కేవలం అంబులెన్స్‌లకే రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు చెల్లిస్తున్నారని సమాచారం. దీనిపై ఏలూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ సుధాకర్ విచారణ చేపట్టారు. ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శశిధర్ పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసేందుకు నిర్ణయించారు. ఏడాదిన్నర కాలంలో ఏలూరు జీజీహెచ్‌లోని మార్చురీకి ఎన్ని అనాథ శవాలు పోస్టుమార్టం నిమిత్తం వచ్చాయి ?అనాథ శవాలను ఎవరైనా బంధువులకు ఇచ్చారా ? శవాలను పూడ్చిపెట్టారా ? లేక దహనం సంస్కరాలు చేశారా... ఇలా పలు అంశాలపై విచారణ చేపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment