ggh hospital
-
ఏపీలో ‘జీబీఎస్’ తొలి మరణం
సాక్షి,గుంటూరు:ఆంధ్రప్రదేశ్‌లో గులియన్ బారే సిండ్రోమ్(జీబీఎస్)తొలి మరణం నమోదైంది. గులియన్ బారే సిండ్రోంన వైరస్ బారిన పడిన కమలమ్మ అనే మహిళ గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ ఆదివారం(ఫిబ్రవరి16) తుది శ్వాస విడిచారు.కమలమ్మది ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అలసందలపల్లిగా అధికారులు గుర్తించారు. రెండు రోజుల క్రితం కమలమ్మ వైరస్ బారిన పడ్డారు. తీవ్ర జ్వరంతో పాటు కాళ్లు చచ్చుబడి పోవడంతో చికిత్స కోసం గుంటూరు జీజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. గులియన్ బారే సిండ్రోమ్ వ్యాధితో బాధపడుతున్న మరికొందరికి గుంటూరు జీజీహెచ్‌లో డాక్టర్లు చికిత్సనందిస్తున్నారు. ఇటీవల అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరిన బాధితులకు డాక్టర్లు వైద్య పరీక్షలు చేశారు. ఈ వైద్య పరీక్షల్లో బాధితులకు జీబీఎస్ సోకినట్లు గుర్తించారు. నలుగురు బాధితుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారిని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కరోనా బాధితుల్లో జీబీఎస్ ఎక్కువగా కనిపిస్తున్నట్లు దీని గురించి ఆందోళన అవసరం లేదని డాక్టర్లు ఇప్పటికే ప్రకటించారు. -
ప్రభుత్వ ఆస్పత్రుల్లో దూదికీ దిక్కులేదు
సాక్షి, అమరావతి: రోగులకు అవసరమైన మందులన్నింటినీ బయట తెచ్చుకోవాలంటూ రాస్తుండటం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో దయనీయ పరిస్థితికి అద్దం పడుతోంది. దురదృష్టవశాత్తు అనారోగ్యం బారినపడి చేతి నుంచి డబ్బు ఖర్చు పెట్టే స్తోమత లేక పెద్దాస్పత్రులను ఆశ్రయిస్తున్న రోగులపై ప్రభుత్వం మందుల కొనుగోళ్ల భారాన్ని మోపుతోంది. పెద్దాస్పత్రుల్లో 150 నుంచి 200 రకాల మందుల కొరత వేధిస్తోంది. ఏపీఎంఎస్ఐడీసీ సెంట్రల్ డ్రగ్ స్టోర్(సీడీఎస్)లలో ఉండాల్సిన మందులన్నీ అందుబాటులో ఉండటం లేదు. ఈ సమస్యను పరిష్కరించాలని జీజీహెచ్ల సూపరింటెండెంట్లు ప్రభుత్వానికి లేఖలు రాసినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో చేసేది లేక చికిత్సల కోసం వచ్చిన రోగులనే మందులు, సర్జికల్ ఐటమ్స్ కొనుగోలు చేయాలని వైద్యులు చీటీలు రాసిస్తున్నారు. వాస్తవానికి జిల్లా, బోధనాస్పత్రుల్లో 608 రకాల మందులు, 372 రకాల సర్జికల్స్ అందుబాటులో ఉండాలి. అయితే ఆ మేరకు ఎక్కడా అందుబాటులో ఉండటం లేదని ‘సాక్షి’ పరిశీలనలో వెల్లడైంది. రక్త నమూనాలు సేకరించే ట్యూబ్స్ చేతిలో పట్టుకున్న ఈ వ్యక్తి పేరు వందనం. కృష్ణా జిల్లా సగ్గూరు స్వస్థలం. కూలి పనులే జీవనాధారం. కొద్ది రోజుల క్రితం ఇతని భార్యకు తీవ్ర అనారోగ్య సమస్య తలెత్తింది. దీంతో ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి డబ్బు పెట్టి చికిత్స చేయించే స్తోమత లేక ఉచిత వైద్యం కోసం విజయవాడ జీజీహెచ్‌కు వచ్చారు. ఏవో పరీక్షలు చేయాలని.. ఆస్పత్రి బయట మెడికల్ స్టోర్‌లో రక్త నమూనాలు సేకరించే ట్యూబ్స్ కొనుక్కుని రావాలని సిబ్బంది చీటి రాసిచ్చారు. ఖర్చుల కోసం ఇంటి నుంచి తెచ్చుకున్న డబ్బులో కేవలం రూ.వంద మాత్రమే అతని జేబులో ఉంది. ఆ డబ్బులోంచి మెడికల్ స్టోర్‌లో ట్యూబ్స్ కొనుకున్నాడు. ‘ఉచితంగా చికిత్స చేస్తారని పెద్దాస్పత్రికి వచ్చాం. ఇక్కడేమో మా చేతి నుంచే అవి కొనండి.. ఇవి కొనండి... అని చెబుతున్నారు. ఏం ఉచిత వైద్యమో.. ఏమో..’ అని వందనం ఆవేదన వ్యక్తం చేశాడు. మూడు దఫాలుగా బయటే కొంటున్నాను నేను వాచ్‌మెన్‌గా పని చేస్తుంటాను. నరాల సంబంధిత సమస్యకు గతంలో సర్జరీ చేశారు. ఆ తర్వాత కాళ్ల నొప్పులు ఉన్నాయి. దీంతో తరచూ ఆస్పత్రికి చెకప్‌కు వస్తుంటాను. గడిచిన మూడు దఫాలుగా నొప్పులకు వాడే మందులు లేవని బయటకు రాస్తున్నారు. ఏం చేస్తాం? అతి కష్టంగా కొనుగోలు చేయక తప్పడం లేదు. – గోవింద్, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుడు, విజయవాడమందులన్నీ బయటకే రాస్తున్నారు మా నాన్న తిరుపతికి షుగర్ వచ్చి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చాం. ఉదయం నుంచి రాత్రి వరకు డాక్టర్లు చూస్తున్నా.. ఎవరూ సరైన సమాధానం చెప్పడం లేదు. మందులు ప్రతిదీ బయటకే రాస్తున్నారు. మందులకే రూ.1,800 ఖర్చు అయింది. సాయంత్రం 7.30 గంటలకు నమ్మకం లేదని చెప్పారు. పెద్దాస్పత్రిని నమ్ముకుని వస్తే రోగిని పట్టించుకోకపోవడం దుర్మార్గం. – క్రాంతి కుమార్, గద్వాలషుగర్, బీపీ బిళ్లలకూ కటకట⇒ బీపీ, షుగర్, గ్యాస్ వంటి సమస్యలతో బాధ పడుతున్న వారికి పూర్తి స్థాయిలో మందులు ఆస్పత్రుల్లో అందుబాటులో లేవు. షుగర్ వ్యాధిగ్రస్తులకు చికిత్సలో ఇచ్చే హ్యూమన్ మిక్ట్సార్డ్ ఇన్సులిన్ అందుబాటులో ఉండటం లేదు. ఏపీఎంఎస్ఐడీసీ నుంచి కొన్ని నెలలుగా సరఫరా నిలిచిపోయింది. సర్జికల్ గ్లౌజులు కూడా సరిపడా సరఫరా చేయడం లేదు. శస్త్ర చికిత్సల సమయంలో, అనంతరం గాయాల నొప్పుల నుంచి ఉపశమనం కోసం ఇచ్చే అనస్తీíÙయా మందుల కొరత తీవ్రంగా ఉంది. శరీరంలోని వ్యర్థాలను తొలగించడానికి వినియోగించే స్టోమా బ్యాగ్స్, కుట్లు వేసే దారాలు, మూత్ర నమూనాలు సేకరించే బాటిల్స్ కూడా అందుబాటులో లేక బయట కొనుగోలు చేయాలని రోగులపైనే భారం మోపుతున్నారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రి ఆవరణలోనే ఉన్న ప్రైవేట్ మెడికల్ షాపులో మందులు కొనుగోలు చేస్తున్న రోగుల బంధువులు ⇒ గుంటూరు జీజీహెచ్‌లో బ్యాక్టీరియా, ఇతర ఇన్ఫెక్షన్ చికిత్సల్లో వినియోగించే ఎసెన్షియల్ యాంటిబయోటిక్స్, ఇన్సులిన్ ఇంజెక్షన్లకు తీవ్ర కొరత ఉంది. పిప్లాజ్, మోరోపెనెమ్ వంటి మరికొన్ని యాంటి బయోటిక్స్, నెబులైజేషన్ మాస్క్‌లు, ప్లాస్టిక్ యాప్రాన్లు అందుబాటులో లేవు. మల్టీ విటమిన్ మాత్రలు ఉండటం లేదు. న్యూరో, కిడ్నీ, కార్డియాలజీ, పీడియాట్రిక్ విభాగాలను మందుల కొరత వేధిస్తోంది. ఎముకలు, గైనిక్ విభాగాల్లో స్పైనల్ నీడిల్స్, రోగులకు నొప్పి నుంచి ఉపశమనం కల్పించే బుటోర్పనాల్, ఫెంటానిల్, మత్తు ఇచ్చే ఇంజెక్షన్ల కొరత ఉంది. ⇒ విజయవాడ జీజీహెచ్‌లో ఎగ్జామినేషన్ గ్లౌజ్‌లు, ఇన్సులిన్ ఇంజెక్షన్లు, బ్లడ్ థిన్నర్, నొప్పులు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు సంబంధించిన మందులు, ఇంజెక్షన్ల కొరత వేధిస్తోంది. మెట్రోజిల్–400ఎంజీ, సిట్రిజన్ హెచ్‌సీఎల్ 10 ఎంజీ, క్లోరో ఫినరమైన్ హెచ్‌సీఎల్, బి.కాంప్లెక్స్, ఐరెన్ పోలిక్ యాసిడ్, నియోమైసిన్ టాబ్లెట్స్ కొరత ఉంది. నుప్రోసిన్, సిల్వర్ సల్పోడైజన్, పేరా మెట్రిన్, డైక్లో సోడియం ఆయింట్మెంట్లు లేవు. సిప్రో ప్లాక్సిన్, జెంటామైసిన్, జెంటాప్లాక్స్ డ్రాప్స్ లేవు. పాంటాప్ ఇంజక్షన్ల కొరత ఉంది. డెలివరీ సర్జరీలకు, ఆపరేషన్ సమయంలో అవసరమైన మందులను, కిట్లను రోగులు ప్రైవేట్ దుకాణాల్లో కొనుక్కు రావాల్సి వస్తోంది. కృష్ణా జిల్లా ఆస్పత్రిలో ఫ్లూ్కనజోల్, హైవిస్కిన్ బ్యూటైల్ బ్రోమైడ్, లంబార్ పంక్చర్ (ఎల్పీ సూది), ఎల్పీ నీడిల్, విటమిన్ కే 1 ఇంజెక్షన్‌తో పాటు పలు యాంటీబయోటిక్స్ అందుబాటులో లేవు. లివర్ సిర్రోసిస్ రోగులకు వాడే బిలిరుబిన్ ఇంజక్షన్ కొరత ఉంది. బ్రెయిన్ స్ట్రోక్ రోగులకు ఇచ్చే థ్రోంబలైజ్ ఇంజక్షన్స్ అందుబాటులో లేవు. ఇవన్నీ రోగులు బయటే కొంటున్నారు. ⇒ ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ఆస్పత్రుల్లో సిరంజిలు, ఐవీ సెట్లు, బ్యాండేజీలు, కాటన్, యూరిన్ ట్యూబ్స్, డిస్పోజబుల్ బెడ్‌షీట్స్, బెటాడియన్ సొల్యూషన్ కొరత ఉంది. ప్రోఫ్లాక్సిన్, గెటిఫ్లానిక్స్, జెంటామైసిన్, మాక్సీఫ్లాక్సిన్, మానసిక జబ్బులకు సంబంధించిన అమిజుల్రీ్ఫడే –200 ఎంజీ, లిథియం 450 ఎంజీ, క్వటియాపైన్ 25 ఎంజీ, క్లోజాఫైన్ 50 ఎంజీ, క్లోణజపం 0.5 ఎం.జీ., లోరాజెపామ్ 2 ఎం.జీ. మాత్రలు స్టాక్ లేక రోగులు ఇబ్బంది పడుతున్నారు. కనీసం పాంటాప్ మాత్రలు కూడా లేవు.⇒ విశాఖ కేజీహెచ్‌లో 200 రకాలకుపైగా మందులు అందుబాటులో ఉండటం లేదు. విక్టోరియా ఆస్పత్రి, ప్రాంతీయ కంటి ఆస్పత్రి, ప్రభుత్వ మానసిక వైద్యశాల, ఈఎన్టీ ఆస్పత్రి, రాణి చంద్రమతిదేవి ఆస్పత్రి, టీబీ ఆస్పత్రుల్లోనూ మందుల కొరత ఉంది. దెబ్బలు తగిలిన వారికి డ్రెస్సింగ్ చేయడానికి కిట్లు కూడా అందుబాటులో లేకపోవడం గమనార్హం. ఇన్సులిన్, ఫిట్స్ నివారణ కోసం వాడే మందులు, అన్ని రకాల బ్లీడింగ్ నివారణకు వాడే మందులు, పలు రకాల యాంటి బయోటిక్స్, హిమోగ్లోబిన్ పెంచే మందులు, వెంటిలేటర్స్ కిట్స్, ఆక్సిజన్ పైపులు, కార్డియాలజీ సమస్యలకు వాడే మందుల కొరత తీవ్రంగా ఉంది. కడుపు నొప్పి, గ్యాస్ట్రిక్, తిమ్మిర్ల నియంత్రణ, రుతుక్రమంలో వచ్చే లోపాల నియంత్రణ, ఆపరేషన్ సమయంలో కుట్లు వేసే దారం, మలబద్ధకం, గాయాలు మానడం కోసం వాడే మందులు, గర్భాశయ ఇన్ఫెక్షన్లకు సంబంధించిన మందుల కొరత వేధిస్తోంది. అనకాపల్లి జిల్లా ఆస్పత్రిలోనూ ఇదే దుస్థితి. ⇒ కర్నూలు జీజీహెచ్‌లో యాంటిబయోటిక్స్ కొరత ఉంది. కార్డియాలజీ, న్యూరో, ఇతర సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో అన్ని రకాల మందులు అందుబాటులో ఉండటం లేదు. ⇒ కడప రిమ్స్‌లో అధిక రక్తపోటు బాధితులు వాడే రామిప్రిల్, అమాక్సిలిన్ 500 ఎంజీ, డోపామైన్ వంటి చాలా రకాల మందుల సరఫరా ఆగిపోయింది. రక్త నమూనాలు సేకరించే ట్యూబ్స్ చేతిలో పట్టుకున్న ఈ వ్యక్తి పేరు వందనం. కృష్ణా జిల్లా సగ్గూరు స్వస్థలం. కూలి పనులే జీవనాధారం. కొద్ది రోజుల క్రితం ఇతని భార్యకు తీవ్ర అనారోగ్య సమస్య తలెత్తింది. దీంతో ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి డబ్బు పెట్టి చికిత్స చేయించే స్తోమత లేక ఉచిత వైద్యం కోసం విజయవాడ జీజీహెచ్‌కు వచ్చారు. ఏవో పరీక్షలు చేయాలని.. ఆస్పత్రి బయట మెడికల్ స్టోర్‌లో రక్త నమూనాలు సేకరించే ట్యూబ్స్ కొనుక్కుని రావాలని సిబ్బంది చీటి రాసిచ్చారు. ఖర్చుల కోసం ఇంటి నుంచి తెచ్చుకున్న డబ్బులో కేవలం రూ.వంద మాత్రమే అతని జేబులో ఉంది. ఆ డబ్బులోంచి మెడికల్ స్టోర్‌లో ట్యూబ్స్ కొనుకున్నాడు. ‘ఉచితంగా చికిత్స చేస్తారని పెద్దాస్పత్రికి వచ్చాం. ఇక్కడేమో మా చేతి నుంచే అవి కొనండి.. ఇవి కొనండి... అని చెబుతున్నారు. ఏం ఉచిత వైద్యమో.. ఏమో..’ అని వందనం ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంజక్షన్లకు రోజుకు రూ.2 వేలు మా నాన్న ఆళ్ల పెంటారావుకు కాలు, చేయి పడిపోవడంతో విజయవాడ ఆస్పత్రికి తీసుకొచ్చాం. డాక్టర్లు పరీక్షించి పెరాలసిస్ అని నిర్ధారణ చేశారు. ఇంజక్షన్లు, మందుల కొరత తీవ్రంగా ఉండటంతో బయట నుంచి తెచ్చుకుంటున్నాం. పిరాసెటమ్ ఇంజక్షన్, సిటికొలైన్ ఇంజక్షన్లు, లెవోకార్టినిటైన్ టాబ్లెట్స్, మొడాఫినైల్ టాబ్లెట్స్ ఇక్కడ ఆస్పత్రిలో లేకపోవడంతో రోజుకు రూ.2 వేలు పెట్టి బయట కొంటున్నాం. – ఆళ్ల మహేష్, సీతానగరం, తాడేపల్లి, గుంటూరు జిల్లా ఈ ఫొటోలో కనిపిస్తున్న బాలింత పేరు జ్యోతి. అనంతపురం జిల్లా యాడికి మండలం వెంకటాంపల్లి గ్రామం. బత్తలపల్లి ఆస్పత్రిలో సిజేరియన్ జరిగిన తర్వాత మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రికి వచ్చింది. వైద్యం అందించడంలో భాగంగా గైనిక్ వైద్యులు.. పారాసిటమాల్ ఇంజెక్షన్లు, థైరోనార్మ్, పారాసిటమాల్ ఇన్ఫ్యూషన్ ఐపీ తదితరాలు కావాలని చెప్పారు. సర్వజనాస్పత్రిలో అవి లేకపోవడంతో గత్యంతరం లేక జ్యోతి కుటుంబీకులు బయట ప్రైవేట్ మందుల షాపులో కొనుగోలు చేశారు. రూ.2 వేల వరకు ఖర్చు అయ్యింది. మచిలీపన్నానికి చెందిన ఎం.కామేశ్వరరావు కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడు. ఐదు రోజుల క్రితం చికిత్స కోసం గర్భిణి అయిన కుమార్తెను వెంట బెట్టుకుని విజయవాడ జీజీహెచ్‌కు వచ్చాడు. ఆస్పత్రికి రాకముందు 5గా ఉన్న అతడి క్రియాటిన్ లెవెల్, ఇప్పుడు 6.5 దాటింది. ఆస్పత్రిలో చూపించుకుంటే నోడోసిస్, ఆర్కామిన్ వంటి మాత్రలను బయట తెచ్చుకోవాలని రాశారు. సమస్య ఇంకా తగ్గుముఖం పట్టలేదు. ఇక ఇంటికి వెళ్లిపోవాలంటూ వైద్యులు డిశ్చార్జి రాశారు. ఈ నేపథ్యంలో ప్రైవేట్ ఆస్పత్రిలో నర్స్‌గా పనిచేసే కామేశ్వరరావు కుమార్తె సిబ్బందితో వాదించింది. సమస్య తగ్గకుండానే ఎలా డిశ్చార్జి చేస్తారని ప్రశ్నించడంతో డిశ్చార్జి చేయలేదు. ఆ తర్వాత మలబద్ధకం నివారణ కోసం ప్రోక్టోలిసిస్ ఎనిమా 100 ఎంఎల్ బయట తెచ్చుకోవాలని చీటి రాసిచ్చారు. ‘వచ్చిన రోజు నుంచి మందులు బయట తెచ్చుకోవాలని చీటిలు రాసిస్తున్నారు. మందులు ఎలాగోలా తిప్పలు పడి కొనుగోలు చేస్తాం. వార్డుల్లో రోగులను పట్టించుకుంటే చాలు. ఇక్కడికి వచ్చాక మా నాన్నకు జబ్బు తగ్గాల్సింది పోయి... పెరిగింది’ అని కామేశ్వరరావు కుమార్తె వాపోయింది. -
గుంటూరు జీజీహెచ్ : సహానా కుటుంబ సభ్యులకు వైఎస్ జగన్ పరామర్శ (ఫొటోలు)
-
లోకేష్‌ను పప్పు అనడంలో తప్పే లేదు: వైఎస్ జగన్
సాక్షి, గుంటూరు: రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందన్నారు వైఎస్ జగన్. మంత్రి నారా లోకేష్‌ను పప్పు అనడంలో అసలు తప్పే లేదన్నారు. బుద్ధి, జ్ఞానం ఉన్న వాళ్లు ఎవరైనా దిశా చట్టం, ప్రతులను కాల్చేస్తారా? అని ప్రశ్నించారు. ఎన్ని దారుణాలు జరుగుతున్నా పవన్ ఎందుకు స్పందించడం లేదన్నారు.గుంటూరులోని జీజీహెచ్ సహాన కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు. ఈ క్రమంలో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ నాయకులు ఏ తప్పు చేసినా వెనకేసుకొస్తున్నారు. సాక్షాత్తూ సీఎం చంద్రబాబు, లోకేష్ దగ్గరుండి దాడులను ప్రోత్సహిస్తున్నారు. శాంతి భద్రతలు పూర్తిగా చేజారిపోతున్నాయి. పోలీసులు రెడ్ బుక్ పాలనలో నిమగ్నమయ్యారు.బాబు అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల పాలనలో 77 మంది మహిళలు, పిల్లలపై అఘాయిత్యాలు జరిగాయి. ఏడుగురు హత్య, ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారు. రెడ్‌బుక్ పాలనలో టీడీపీ నేతల తప్పులకు శిక్ష ఉండదు. గతంలో దిశ యాప్‌తో 10 నిమిషాల్లో సాయం అందేది. దిశ యాప్ ద్వారా 31,607 మంది మహిళలను కాపాడాము. వైఎస్సార్సీపీ హయాంలో 18 దిశ పీఎస్‌లు, 13 పోక్సో కోర్టులు ఏర్పాటు చేశాం. ప్రతీ జిల్లాలోనూ పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించాం. దిశ యాప్‌కు 19 అవార్డులు వచ్చాయి.దిశ చట్టం ప్రతులను బుద్ధి ఉన్నోడు ఎవడైనా కాల్చేస్తాడా?. దిశ యాప్‌ను పనిచేయకుండా చేశారు. హోంమంత్రి అనితకు కూడా నిజంగా బుద్ధిలేదు. అందుకే దిశ లేకుండా చేశారు. ఇప్పటికైనా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పక్కనపెట్టి పాలనపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. ఇదే సమయంలో వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్న సమయంలో అక్కచెల్లెమ్మలకు భరోసా ఉండేదని గుర్తు చేశారు. -
ఏపీలో బాధిత కుటుంబాలకు 10 లక్షల సాయం: వైఎస్ జగన్
సాక్షి, గుంటూరు: రాష్ట్రంలో మహిళల భద్రతలను కూటమి నేతలు ప్రశ్నార్థకంగా మార్చేశారని అన్నారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్. అన్ని వర్గాల మహిళలను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో రాష్ట్రంలో ప్రతీ బాధిత కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందజేయనున్నట్టు వైఎస్ జగన్ తెలిపారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి బాధితు కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని హితవు పలికారు.గుంటూరు జీజీహెచ్‌లో సహానా కుటుంబ సభ్యులను వైఎస్ జగన్ పరామర్శించారు. ఈ సందర్భంగా వారికి ధైర్యం చెప్పి భరోసా ఇచ్చారు. అనంతరం ఆసుపత్రి వద్ద వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ తరఫున బాధిత కుటుంబాలను ఆదుకుంటాం. ప్రతీ బాధిత ఆరు కుటుంబాలకు రూ.10లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నాం. ప్రభుత్వం స్పందించి ప్రతీ కుటుంబాన్ని ఆదుకోవాలి. రాష్ట్రంలో అక్కచెల్లెమ్మలకు భద్రత లేదు. దీనిపై చంద్రబాబు క్షమాపణ చెప్పాలి.ప్రతిపక్షంలో ఉన్న మేమే బాధిత కుటుంబాలను ఆదుకుంటున్నాం. ప్రభుత్వంలో ఉన్న మీరు ఏం చేస్తారో.. ఎంత సాయం అందిస్తారో చూస్తాం. దళితులంతా నా వాళ్లే.. వారికి అండగా ఉంటాను. పేదల పక్షాన ఎంత దూరమైనా పోరాడతాను. వచ్చేది మన ప్రభుత్వమే. నిందితులను వెంటాడి జైల్లో పెడతాం. మన ప్రభుత్వంలో అందరికీ న్యాయం జరుగుతుంది అని హామీ ఇచ్చారు. ఇది కూడా చదవండి: కళ్ల ఎదుటే సాక్షాలు కనిపిస్తున్నా.. శిక్ష ఎందుకు లేదు?: వైఎస్ జగన్ -
రెడ్‌బుక్ పాలనలో టీడీపీ నేతల తప్పులకు శిక్ష ఉండదు: వైఎస్ జగన్
సాక్షి, గుంటూరు: ఏపీలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉందో సహానా ఘటన చూస్తే అర్థమవుతోందన్నారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్. రెడ్‌బుక్ పాలనలో టీడీపీ నేతల తప్పులకు శిక్ష ఉండదని చెప్పుకొచ్చారు. అలాగే, పోలీసులు రెడ్ బుక్ పాలనలో నిమగ్నమయ్యారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ జగన్. రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలకు చంద్రబాబే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా బాధితులకు సాయం చేసి వారికి క్షమాపణలు చెప్పాలన్నారు.గుంటూరు జీజీహెచ్‌లో సహానా కుటుంబ సభ్యులను వైఎస్ జగన్ పరామర్శించారు. ఈ సందర్భంగా వారికి ధైర్యం చెప్పి భరోసా ఇచ్చారు. అనంతరం ఆసుపత్రి వద్ద వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో దారుణ పరిస్థితులు ఉన్నాయి. దళిత చెల్లి పరిస్థితిని చూస్తే శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో అర్థమవుతుంది. రాష్ట్రంలో లా అండ్ ఆర్ఢర్ లేదు. శాంతిభద్రతలు దిగిజారిపోయాయి. వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్న సమయంలో అక్కచెల్లెమ్మలకు భరోసా ఉండేది. దిశ యాప్ ద్వారా ఆపదలో ఉన్న మహిళలకు అండగా నిలిచాం. ఈ ఘటనలో నిందితుడు నవీన్.. చంద్రబాబుతో కలిసి దిగిన ఫొటోలు ఉన్నాయి. స్థానిక ఎంపీతో కూడా సన్నిహితంగా ఉన్నాడు. నిందితులు బాధితురాలిపై శారీరకంగా, లైంగిక దాడి జరిపి ఆసుపత్రిలో జాయిన్ చేసి వెళ్లిపోయారు. యువతిపై మృగాళ్లలా దాడి చేశారు. యువతి దేహాంపై కమిలిన గాయాలు ఉన్నాయి. ఇవన్నీ కళ్లేదుటే కనిపిస్తున్నా ప్రభుత్వం దాచిపెట్టే ప్రయత్నం చేస్తోంది. నిందితుడు అధికార టీడీపీకి చెందిన వాడు కాబట్టే అతడిని నిస్సిగ్గుగా కాపాడుకుంటున్నారు. ఈ దారుణ ఘటనపై స్థానిక మంత్రి, హోంమంత్రి కనీసం స్పందించలేదు. నేను ఇక్కడికి వస్తున్నా అని తెలిశాకే టీడీపీ నేత ఆలపాటి ఆసుపత్రికి వచ్చారట.రాష్ట్రంలో ప్రతీచోట అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. బద్వేలులో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. బాలికపై పెట్రోలు పోసి నిప్పంటించారు. శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు బాలికలపై అఘాయిత్యం చేశారు. కూల్‌డ్రింక్స్‌లో మత్తుమందు కలిపి అత్యాచారానికి పాల్పడ్డారు. పలాసలో టీడీపీకి చెందిన ప్రబుద్దులే అత్యాచారం చేశారు. అఘాయిత్యాలు జరిగిన చోట పంచాయితీలు చేస్తున్నారు. పిఠాపురంలో యువతిపై టీడీపీ నేత అత్యాచారం చేశారు. రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏం చేస్తున్నాడు. పవన్ కనీసం బాలిక కుటుంబాన్ని పరామర్శించలేదు. హిందూపురంలోనూ అత్తాకోడలిపై గ్యాంప్ రేప్ జరిగింది. స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ కనీసం పరామర్శకు వెళ్లలేదు. అనకాపల్లిలో బాలికను ప్రేమోన్మాది చంపేశాడు. వేధింపులపై అంతకుముందు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. టీడీపీ నాయకుల దౌర్జన్యాలను పోలీసులు అరికట్టలేకపోతున్నారు.రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. టీడీపీ నాయకులు ఏ తప్పు చేసినా వెనకేసుకొస్తున్నారు. సాక్షాత్తూ సీఎం చంద్రబాబు దగ్గరుండి ప్రోత్సహిస్తున్నారు. శాంతి భద్రతలు పూర్తిగా చేజారిపోతున్నాయి. పోలీసులు రెడ్ బుక్ పాలనలో నిమగ్నమయ్యారు. బాబు అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల పాలనలో 77 మంది మహిళలు, పిల్లలపై అఘాయిత్యాలు జరిగాయి. ఏడుగురు హత్య, ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారు. రెడ్‌బుక్ పాలనలో టీడీపీ నేతల తప్పులకు శిక్ష ఉండదు. గతంలో దిశ యాప్‌తో 10 నిమిషాల్లో సాయం అందేది. దిశ యాప్ ద్వారా 31,607 మంది మహిళలను కాపాడాము. వైఎస్సార్సీపీ హయాంలో 18 దిశ పీఎస్‌లు, 13 పోక్సో కోర్టులు ఏర్పాటు చేశాం. ప్రతీ జిల్లాలోనూ పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించాం. దిశ యాప్‌కు 19 అవార్డులు వచ్చాయి. దిశ చట్టం ప్రతులను బుద్ధి ఉన్నోడు ఎవడైనా కాల్చేస్తాడా?. వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్న సమయంలో అక్కచెల్లెమ్మలకు భరోసా ఉండేదని గుర్తు చేశారు. -
సహానాను నిర్జీవంగా చూసి చెలించిన జగన్..
-
జగన్ వెంట తరలివచ్చిన వేలాది జనం...
-
వైఎస్ జగన్ పరామర్శ.. జనసంద్రమైన జీజీహెచ్
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ గుంటూరు పర్యటనలో ఉన్నారు. టీడీపీ కార్యకర్త, రౌడీషీటర్ పైశాచిక దాడిలో మృతి చెందిన తెనాలి యువతి సహానా కుటుంబసభ్యులను పరామర్శిందుకు వైఎస్ జగన్ జీజీహెచ్‌కు వెళ్లారు.ఇక, వైఎస్ జగన్ జీజీహెచ్‌కు వస్తున్న నేపథ్యంలో వైఎస్సార్సీపీ అభిమానులు, ప్రజలు భారీ సంఖ్యలో ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. వైఎస్ జగన్ గుంటూరులో హెలికాప్టర్ దిగి ఆసుపత్రికి వెళ్తున్న మార్గంలో అభిమానులు భారీగా తరలివచ్చారు. పెద్ద సంఖ్యలో అభిమానులు తరలి రావడంతో ఆసుపత్రి వైఎస్ జగన్ పరామర్శలకు కాస్త ఆలస్యమవుతోంది. అయినప్పటికీ వైఎస్ జగన్.. అందరినీ పలకరిస్తూ, అభివాదం చేస్తూ ముందుకు సాగారు. -
బద్వేల్: బాలిక కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
బాధిత కుటుంబాలకు వైఎస్ జగన్ పరామర్శ అప్డేట్స్.. వైఎస్సార్ జిల్లా: బద్వేల్లో మీడియాతో వైఎస్ జగన్ 👉చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ లేదు👉ఘటన జరిగినప్పుడే ప్రభుత్వం భరోసా ఇవ్వాలి👉శనివారం ఘటన జరిగితే ఎవరూ పట్టించుకోలేదు👉నేను వస్తానని తెలిసి ఇప్పుడు సాయం చేశారు 👉చంద్రబాబు పాలన ఇలాగే కొనసాగితే తిరగబడతారు 👉కూటమి పాలనలో మహిళకు రక్షణ లేదు..ప్రజలకు భరోసా లేదుబాధిత కుటుంబానికి వైఎస్ జగన్ ఓదార్పు👉బద్వేల్లో యువకుడి దుర్మార్గానికి బలైన బాలిక👉బాలికపై అత్యాచారం చేసి నిప్పంటించిన కీచకుడు👉బాలిక కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ👉బాధిత కుటుంబాన్ని ఓదార్చి.. ధైర్యం చెప్పిన వైఎస్ జగన్👉 బద్వేల్‌కు బయలుదేరిన వైఎస్ జగన్ 👉 గుంటూరు జీజీహెచ్‌లో సహానా కుటుంబ సభ్యులను వైఎస్ జగన్ పరామర్శించారు. న్యాయం జరిగే వరకు అన్నివిధాలా అండగా ఉంటామని భరోసాయిచ్చారు. 👉 ఇదే సయంలో రాష్ట్రంలో బాధిత కుటుంబాలను వైఎస్సార్సీపీ ఆదుకుంటుంది. ప్రతీ కుటుంబానికి రూ.10 సాయం అందించనున్నట్టు వైఎస్ జగన్ ప్రకటించారు. అలాగే, ప్రభుత్వం రెడ్ బుక్ పాలన వదిలేసి పాలనపై దృష్టి సారించాలని హితవు పలికారు. బాధితులను ఆదుకోవాలన్నారు. 👉 ఈ సందర్భంగా సహానా కుటుంబ సభ్యులను ఓదార్చారు. వారికి ధైర్యం చెప్పారు. అలాగే, సహానాకు అందించిన చికిత్సపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు వైఎస్ జగన్. 👉 వైఎస్ జగన్ జీజీహెచ్ చేరుకున్నారు. ఆసుపత్రి వద్దకు భారీగా అభిమానులు, ప్రజలు చేరుకున్నారు. 👉 వైఎస్ జగన్ గుంటూరు చేరుకున్నారు. కాసేపట్లో సహానా కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. 👉వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు గుంటూరు, వైఎస్సార్ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా గుంటూరు జీజీహెచ్‌లో టీడీపీ కార్యకర్త, రౌడీషీటర్ పైశాచిక దాడిలో మృతి చెందిన తెనాలి యువతి సహానా కుటుంబసభ్యులను పరామర్శిస్తారు.👉కాసేపట్లో తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10.50 గంటలకు గుంటూరు జీజీహెచ్‌కు వైఎస్ జగన్ చేరుకుంటారు. 👉అనంతరం.. అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం వైఎస్సార్ జిల్లా బద్వేలుకు చేరుకుంటారు. ప్రేమోన్మాది దాడిలో మృతి చెందిన దస్తగిరమ్మ కుటుంబాన్ని పరామర్శించి మధ్యాహ్నం మూడు గంటలకు పులివెందుల చేరుకుంటారు. రాత్రికి అక్కడే బసచేస్తారు. -
మృతదేహాలతో.. వ్యాపారం ? ..
ఏలూరు టౌన్: ఏలూరు సర్వజన ఆసుపత్రిలోని మార్చురీ దారుణాలకు కేంద్ర బిందువుగా మారింది..అనాథ శవాలే అక్కడి కొందరు సిబ్బందికి ఆదాయ వనరులుగా మారాయి. ఏలూరు జీజీహెచ్‌లో గత కొంత కాలంగా గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న అవినీతి బాగోతం బహిర్గతమైంది. పదిరోజుల కిత్రం జరిగిన ఓ ఘటనతో తీగ లాగితే.. డొంకంతా కదిలినట్లు..మార్చురీలో సాగుతున్న అక్రమ శవాల వ్యాపారం వెలుగులోకి వచి్చంది. ఈ ఆసుపత్రిలో అనాథ శవాలను భారీ రేటుకు విక్రయిస్తూ వ్యాపారం చేస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏడాదిన్నరగా 8–10 అనాథ శవాలను ఇతర రాష్ట్రాలు, ప్రాంతాలకు తరలించినట్టు తెలుస్తోంది. తమిళనాడు రాష్ట్రం చెన్నై, బెంగళూరులోని ప్రైవేటు మెడికల్ కాలేజీలకు శవాలను భారీ రేటుకు విక్రయిస్తున్నట్టు చెబుతున్నారు. ఒక్కో శవాన్ని రూ.లక్ష నుంచి రూ.2 లక్షలకు వరకూ విక్రయిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. కొన్ని అంబులెన్సుల ద్వారా అనాథ శవాలను తరలించేందుకు కేవలం అంబులెన్స్‌లకే రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు చెల్లిస్తున్నారని సమాచారం. దీనిపై ఏలూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ సుధాకర్ విచారణ చేపట్టారు. ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శశిధర్ పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసేందుకు నిర్ణయించారు. ఏడాదిన్నర కాలంలో ఏలూరు జీజీహెచ్‌లోని మార్చురీకి ఎన్ని అనాథ శవాలు పోస్టుమార్టం నిమిత్తం వచ్చాయి ?అనాథ శవాలను ఎవరైనా బంధువులకు ఇచ్చారా ? శవాలను పూడ్చిపెట్టారా ? లేక దహనం సంస్కరాలు చేశారా... ఇలా పలు అంశాలపై విచారణ చేపడుతున్నారు. -
సెల్‌ఫోన్ వెలుగులో వైద్య సేవలు
గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్ అవుట్ పేషెంట్ విభాగంలో సోమవారం ఉదయం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయింది. విద్యుత్ బోర్డులోని ఎంసీసీబీ స్విచ్ బోర్డు కాలిపోయింది. వర్షాల నేపథ్యంలో విద్యుత్ సరఫరాలో హెచ్చు తగ్గుల కారణంగా స్విచ్ బోర్డు కాలిపోయినట్లు ఆస్పత్రి ఎలక్ట్రికల్ సిబ్బంది తెలిపారు. ఉదయం 11 గంటలకు విద్యుత్ సమస్య ఏర్పడి సాయంత్రం వరకు ఓపీలో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ జరగలేదు. దీంతో ఓపీలో వైద్య సేవలకు కొంతమేర అంతరాయం ఏర్పడింది. ఫార్మాసిస్టులు సెల్‌ఫోన్ టార్చ్‌లైట్ సాయంతో మందుల సరఫరా చేయగా.. కొంత మంది జూనియర్ వైద్యులు రోగులను సెల్‌ఫోన్ వెలుతురులోనే పరీక్షించి చికిత్సలు అందించారు. బ్లడ్ టెస్ట్, ఇతర వైద్య పరీక్షలకు రోగులు ఇబ్బందిపడ్డారు. సుమారు రూ. 26 వేల ఖరీదు చేసే స్విచ్‌బోర్డును కొనుగోలు చేసి సాయంత్రానికల్లా విద్యుత్‌ను పునరుద్ధరించినట్టు సివిల్ సర్జన్ ఆర్ఎంవో డాక్టర్ బత్తుల వెంకటసతీష్‌కుమార్ చెప్పారు. -
Andhra Pradesh: సర్కారు ఆస్పత్రులు సరికొత్తగా..
రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించడమే లక్ష్యంగా వైద్యరంగానికి పెద్దపీట వేసింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది కొరత లేకుండా నియామకాలు చేపట్టింది. అధునాతన వైద్య పరికరాలను ఏర్పాటు చేయడంతోపాటు మౌలిక వసతులను సైతం కల్పించింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సర్కారు ఆస్పత్రుల్లోని వైద్యులు రోగులకు ఉత్తమ వైద్యసేవలు అందిస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఓపీ సంఖ్య గణనీయంగా పెరగడమే ఇందుకు నిదర్శనం. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: గత పాలకుల నిర్లక్ష్యానికి గురైన ప్రభుత్వాస్పత్రుల్లో ప్రస్తుతం ఉత్తమ వైద్యసేవలు అందుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యమే పరమావధిగా సకల సౌకర్యాలతో రోగులకు సేవలందిస్తోంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి బోధనాస్పత్రుల వరకు అన్ని సర్కారు ఆస్పత్రుల్లో మౌలిక వసతులతోపాటు అత్యాధునిక పరికరాలను ఏర్పాటు చేసింది. పూర్తిస్థాయిలో వైద్యు లు, సిబ్బందిని నియమించి నాణ్యమైన వైద్యం అందిస్తుండడంతో గత నాలుగున్నర ఏళ్లలో ప్రభుత్వాస్పత్రులకు వచ్చే రోగుల సంఖ్య రెండు రెట్లు పెరిగింది. జీజీహెచ్‌లో సూపర్ స్పెషాలిటీ సేవలు నెల్లూరులోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి (జీజీహెచ్)లో రోగులకు సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందుతున్నాయి. ప్రభుత్వం ఆయా విభాగాల్లో అధునాతన పరికరాలను ఏర్పాటు చేయడంతో వైద్యులు అత్యుత్తమ వైద్యం అందిస్తున్నారు. 2019కు ముందు కేవలం ఒక సీటీ స్కాన్, ఒక ఎక్సరే పరికరాలు ఉండేవి. అవి కూడా సక్రమంగా పనిచేసేవి కావు. దీంతో జీజీహెచ్‌కు వచ్చిన రోగులు సీటీ స్కాన్, ఎక్సరేల కోసం బయట సెంటర్లకు వెళ్లేవారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నూతన సీటీ స్కాన్, ఎక్సరే, ఎంఆర్ఐ పరికరాలను ఏర్పాటు చేశారు. రక్తపరీక్షల సంఖ్యను పెంచారు. ఆక్సిజన్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. 20 ఫ్రీజర్లను ప్రభుత్వం అందజేసింది. రూ.10 కోట్లతో క్రిటికల్ కేర్ యూనిట్ నిర్మాణంలో ఉంది. ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీట్లను 175కు పెంచారు. అలాగే పిడియాట్రిక్, అనస్తీషియా, పల్మనాలజీ విభాగాల్లో పీజీ సీట్లను తీసుకొచ్చారు. యూపీహెచ్‌సీలకు అధునాతన హంగులు నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో మొత్తం 54 డివిజన్లు ఉండగా, దాదాపు 9 లక్షల మందికి పైగా జనాభా ఉన్నారు. 2019 వరకు కార్పొరేషన్ పరిధిలో కేవలం 8 ఆరోగ్య కేంద్రాలు మాత్రమే ఉండేవి. వాటి నిర్వహణ తూతూమంత్రంగా ఉండేది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 13 నూతన అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లను (యూపీహెచ్‌సీలను)అధునాతన హంగులతో నిర్మించింది. ఒక్కో భవనానికి రూ.1.10 కోట్ల నిధులను ప్రభుత్వం వెచ్చించింది. ఈ ఆరోగ్య కేంద్రాల్లో ఓపీ, మందులు గది, ల్యాబ్, ప్రత్యేక వార్డు, డెలివరీ గదిని ప్రత్యేకంగా నిర్మించింది. పాత ఆరోగ్య కేంద్రాలకు నిధులు వెచ్చించి మరమ్మతులు చేసింది. ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కరోనాలోనూ ఉత్తమ వైద్యసేవలు కోవిడ్–19 సమయంలో జీజీహెచ్‌లోని వైద్యులు, సిబ్బంది, అన్నిశాఖల అధికారులు సమన్వయంతో రోగులకు ఉత్తమ సేవలు అందించారు. కోవిడ్ బారిన పడిన వారికి తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వైదసేవలు అందించారు. ఇతని పేరు పెంచలనాయుడు. ఇతనిది పొదలకూరు. ఇటీవల ఇంట్లో కాలు జారి కింద పడ్డాడు. చెయ్యి విరగడంతో జీజీహెచ్‌కు వెళ్లాడు. అక్కడ ఆర్థో విభాగం వైద్యులు పరీక్షించి చెయ్యి విరిగిన చోట ఆపరేషన్ చేశారు. ప్రస్తుతం అతని పరిస్థితి బాగుంది. దాదాపు పది రోజులుగా జీజీహెచ్‌లో ఉన్నాడు. డాక్టర్లు ఉచిత వైద్యసేవలు అందించడమే కాకుండా ప్రతి పూట భోజనం పెట్టారు. అలాగే ప్రభుత్వం నుంచి రూ.4,720 వరకు ఆర్థికసాయం అందింది. ఇతని పేరు నాగరాజు. ఇతనిది నెల్లూరు నగరం. గత కొంతకాలంగా పైల్స్‌తో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో ప్రైవేట్ ఆస్పత్రికి వెళితే వైద్యానికి రూ.50 వేలు ఖర్చవుతుందని తెలిపారు. ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో నెల్లూరులోని జీజీహెచ్‌కు వెళ్లాడు. వైద్యులు పరీక్షలు చేసి సమస్యను గుర్తించారు. తక్షణమే చికిత్స చేసేందుకు ముందుకువచ్చారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్ చేసేందుకు నిర్ణయించారు. రోగులకు అన్ని సౌకర్యాలు నాడు–నేడు కార్యక్రమం విజయవంతంగా జరుగుతోంది. హాస్పిటల్‌కు వచ్చే రోగులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. అన్ని ఏసీలు పనిచేసేలా చర్యలు తీసుకున్నాం. 10 లిఫ్ట్ లు పనిచేస్తున్నాయి. అధునాతన పరికరాలతో సేవలు అందిస్తున్నాం. – సిద్ధానాయక్, జీజీహెచ్, సూపరింటెండెంట్ సేవ చేయడానికి ముందున్నాం జీజీహెచ్‌కు వైద్యం కోసం వచ్చిన ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నాం. అర్ధరాత్రి ఫోన్ చేసినా స్పందిస్తాను. హాస్పిటల్లో ఎన్నో క్లిష్టమైన డెలివరీలు చేశాం. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో, ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి సహాయ, సహకారాలతో పేదలకు మంచి వైద్యం అందిస్తున్నాం. – లక్ష్మీ సునంద, జీజీహెచ్ హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ కోఆర్డినేటర్ -
గుంటూరు జీజీహెచ్ లో శిశువు కిడ్నాప్
-
కడుపులో కత్తెర మర్చిపోయి కుట్లేశారు
ఏలూరు టౌన్: ఏలూరు జిల్లా పెదపాడు మండలం ఎస్.కొత్తపల్లికి చెందిన జి.స్వప్నకు ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో సిజేరియన్ చేసి కడుపులో కత్తెర మర్చిపోయి కుట్లేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 19న ఆమె డెలివరీ కోసం ఏలూరు సర్వజన ఆసుపత్రికి వచ్చింది. ఎంసీహెచ్ ప్రత్యేక విభాగంలో ఆమెకు సిజేరియన్ చేశారు. అనంతరం ఆరోగ్యంగా తల్లీబిడ్డ ఇంటికి వెళ్లారు. ఇటీవల ఆమెకు కడుపులో తీవ్రంగా నొప్పి రావటంతో ఈ నెల 8న ఏలూరు జీజీహెచ్‌లో జనరల్ వైద్యుల వద్దకు వచ్చింది. వైద్యులు ఎక్స్‌రే తీయించగా..ఆమె కడుపులో ఫోర్సెప్స్ (ఆపరేషన్ చేసినప్పుడు ఉపయోగించే వస్తువు)ను మరిచిపోయి కుట్లు వేసినట్లు గుర్తించారు. దీంతో ఆమెను విజయవాడ జీజీహెచ్‌కు రిఫర్ చేయగా.. అక్కడ స్వప్నకు ఆపరేషన్ చేసి పరికరాన్ని బయటకు తీశారు. ఆమె ప్రస్తుతం క్షేమంగా ఉంది. స్వప్న కడుపులో ఫోర్సెప్స్ పరికరం ఉన్నట్లు తెలిపే ఎక్స్‌రేను హాస్పిటల్‌లోని ఓ ఉద్యోగి సోషల్ మీడియాలో ఉంచాడు. స్వప్న కడుపులో ఫోర్సెప్స్ పరికరాన్ని ఉంచి కుట్లు వేసిన ఘటనపై కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్ ఆదేశాలతో విచారణ కమిటీ వేసినట్లు ఏలూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శశిధర్ చెప్పారు. -
క్యాన్సర్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు
గుంటూరు మెడికల్: క్యాన్సర్ నియంత్రణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని చెప్పారు. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రభుత్వం ఈ ఏడాదిలో రూ.600 కోట్లు క్యాన్సర్ చికిత్సల కోసం ఖర్చు చేసిందన్నారు. గుంటూరు జీజీహెచ్ నాట్కో క్యాన్సర్ సెంటర్లో శుక్రవారం జరిగిన నేషనల్ క్యాన్సర్ గ్రిడ్ (ఎన్సీజీ) ఏపీ చాప్టర్ రాష్ట్రస్థాయి వార్షిక తొలి సమావేశాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో అత్యాధునిక క్యాన్సర్ వైద్యసేవలు పేద ప్రజలకు ఉచితంగా అందిస్తున్నారన్నారు. కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వాస్పత్రుల్లో క్యాన్సర్ వైద్యసేవలు అందిస్తున్నట్లు చెప్పారు. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకంలో గత ప్రభుత్వంలో 990 ప్రొసీజర్లు మాత్రమే ఉండేవని, నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేదలందరికి ఉచితంగా వైద్యం అందించాలనే లక్ష్యంతో 3,257 ప్రొసీజర్లను ఆరోగ్యశ్రీలో చేర్చారని వివరించారు. ముఖ్యమంత్రికి క్యాన్సర్ నియంత్రణకై ప్రత్యేకదృష్టి ఉందని, అందుకే ఆరోగ్యశ్రీ పథకంలో 638 ప్రొసీజర్లు కేవలం క్యాన్సర్ వ్యాధులకు చెందినవే అందుబాటులో ఉంచారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఏడు వైద్య కళాశాలల్లో క్యాన్సర్ చికిత్సల కోసం ప్రభుత్వం రూ.120 కోట్లు ఖర్చుచేస్తోందన్నారు. ఇతర కళాశాలల్లో సైతం రెండోదశలో క్యాన్సర్ చికిత్సలు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. కర్నూలులో రూ.120 కోట్లతో ఏర్పాటు చేసిన స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో రూ.55 కోట్లతో అత్యాధునిక పరికరాలు ఏర్పాటు చేస్తున్నామని, దీన్ని త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు. కడపలో క్యాన్సర్ ఆస్పత్రి ఏర్పాటుకు రూ.107 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. వైజాగ్‌ను క్యాన్సర్ చికిత్సకు సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్‌గా మార్చేందుకు రూ.45 కోట్లతో అత్యాధునిక వైద్యపరికరాలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఆమె చెప్పారు. ఆరోగ్యశ్రీ సీఈవో ఎం.ఎన్.హరీంద్రప్రసాద్ మాట్లాడుతూ అతి తక్కువ ఫీజుతో క్యాన్సర్ చికిత్స అందించేందుకు సమావేశంలో చర్చిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించాక క్యాన్సర్ చికిత్సలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ఇప్పటివరకు ఆరోగ్యశ్రీ ద్వారా క్యాన్సర్ చికిత్సల కోసం ప్రభుత్వం రూ.1,700 కోట్లు ఖర్చు పెట్టిందన్నారు. నాట్కో ట్రస్టు వైస్ ప్రెసిడెంట్ నన్నపనేని సదాశివరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పేదలకు గుంటూరు జీజీహెచ్‌లో ఉచితంగా క్యాన్సర్ వైద్యసేవలు, మందులు అందిస్తున్నట్లు చెప్పారు. నగర మేయర్ కావటి మనోహర్‌నాయుడు, సదస్సు ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ టి.వి.శివరామకృష్ణ, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నరసింహం, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ నీలం ప్రభావతి, వైద్యకళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నీలి ఉమాజ్యోతి, డాక్టర్ ఉమేష్‌శెట్టి, డాక్టర్ ఏకుల కిరణ్‌కుమార్, యడ్లపాటి అశోక్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
8 గంటలు శ్రమించి... ప్రాణాలు కాపాడారు జీజీహెచ్ లో అరుదైన ఆపరేషన్...!
-
అరుదైన ట్యూమర్.. వైద్యులంతా చర్చించి.. ధైర్యం చేసి..
సాక్షి, గుంటూరు మెడికల్: మెడికల్ జర్నల్స్‌లో ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు కేవలం రెండు కేసులు మాత్రమే నమోదైన అత్యంత అరుదైన ట్యూమర్‌ను గుంటూరు జీజీహెచ్ జనరల్ సర్జరీ వైద్యులు గుర్తించారు. ఎంతో క్లిష్టమైన ఆపరేషన్‌ను జనరల్ సర్జరీ రెండో యూనిట్ వైద్యులు విజయవంతంగా చేసి రోగి ప్రాణాలను కాపాడారు. ఆస్పత్రిలో బుధవారం మీడియాకు ప్రొఫెసర్ డాక్టర్ ఏకుల కిరణ్‌కుమార్ వివరాలు వెల్లడించారు. విజయవాడకు చెందిన నేలటూరి శామ్‌సన్‌జాన్‌సునీల్ మంచంపై నుంచి లేవలేని విధంగా ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు చికిత్స కోసం అతడిని విజయవాడ జీజీహెచ్‌కు తీసుకెళ్లారు. వైద్యులు తక్షణమే అతడికి రక్తం ఎక్కించి ఆరోగ్యం కొంచెం మెరుగుపడ్డాక వైద్య పరీక్షలు నిర్వహించి.. కడుపు కింది భాగంలో జిస్ట్ అనే కణితి ఉన్నట్లు నిర్థారించారు. సర్జరీ కోసం ఓ కార్పొరేట్ ఆస్పత్రిని సంప్రదించినా లాభంలేక గుంటూరు జీజీహెచ్‌కు మార్చి 14న రోగిని తీసుకొచ్చారు. రిపోర్టులు పరిశీలించి.. చిన్న పేగు డ్యూడెనమ్, జెజునమ్ జంక్షన్ దగ్గర అత్యంత అరుదైన జిస్ట్ ట్యూమర్ ఉన్నట్లు గుర్తించామని డాక్టర్ కిరణ్‌కుమార్ చెప్పారు. చిన్నపేగు మొదటి భాగంలో గ్యాస్ట్రో ఇంటస్టీనల్ స్ట్రోమల్ ట్యూమర్(జిస్ట్) ఇప్పటివరకు మెడికల్ జర్నల్స్‌లో రెండు మాత్రమే నమోదైనట్టు తెలిపారు. చదవండి: సింగపూర్ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా ఈ సమస్యకు ఏ విధంగా ఆపరేషన్ చేయాలనే విషయాలు ఎక్కడా పేర్కొనలేదని, రెండో యూనిట్ జనరల్ సర్జరీ వైద్యులంతా దీని గురించి చర్చించి ధైర్యంగా మార్చి 25న ఆపరేషన్ చేశారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో రూ.10 లక్షల వరకూ తీసుకునే ఈ సర్జరీని డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పూర్తి ఉచితంగా చేశారు. ఆపరేషన్ ప్రక్రియలో తనతో పాటు వైద్యులు చలం, నాగసంతోష్, వంశీధర్, అనూష, వేణుగోపాల్, కోటి, మత్తు వైద్యులు మహేష్‌బాబు, ఆనందబాబు, అలేఖ్య, కీర్తి, రాఘవ, కవిత పాల్గొన్నట్టు డాక్టర్ కిరణ్‌కుమార్ తెలిపారు. -
ప్లాస్టిక్ కవర్లో పసివాడి ప్రాణం
గుంటూరు ఈస్ట్: నవమాసాలు మోసిన తల్లి... ‘కని’కరం లేకుండా 48గంటల్లోనే తన బిడ్డను వదిలేసింది. పేగు తెంచి పంచిన పసి ప్రాణాన్ని తన పొత్తిళ్లలో అదుముకుని అల్లారుముద్దుగా చూసుకోకుండా... చెత్తను విసిరేసినంత సులభంగా ప్లాస్టిక్ కవర్లో పెట్టి పాడుబడిన ఇంట్లో పడేసింది. తల్లి స్పర్శ కోసం గుక్కపెట్టిన ఆ శిశువు ఏడుపు విని పక్క ఇంట్లో ఉంటున్న మరో మాతృమూర్తి వచ్చి ఆ బిడ్డను కాపాడారు. ఈ హృదయవిదారక ఘటన గుంటూరులో ఆదివారం జరిగింది. గుంటూరు కొత్తపేట పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ శ్రీనివాసరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... నగరంలోని గుంటూరువారితోట 5వ లైనులో ఓ పాడుబడిన భవనం పై నుంచి ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఓ శిశువు ఏడుపు వినిపించడంతో పక్క ఇంట్లో ఉన్న మహిళ చూసేందుకు వెళ్లారు. అక్కడ పాలిథిన్ క్యారీ బ్యాగులో మగ శిశువు కనిపించాడు. ఆమె వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. కొత్తపేట పోలీసులు ఘటనస్థలానికి వెళ్లి ఆ శిశువుని ప్రభుత్వాస్పత్రికి తరలించగా, పిల్లల విభాగంలో ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆ శిశువు పుట్టి రెండు రోజులు అయి ఉంటుందని, ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు. ఆ శిశువు ఉన్న పాడుబడిన భవనం చుట్టూ హాస్పిటల్స్ ఉండటంతో సమీపంలోనే డెలివరీ అయి ఇక్కడ వదిలి వెళ్లి ఉంటారని భావిస్తున్నారు. కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తూ శిశువును ఎవరు వదిలి వెళ్లారనే విషయాన్ని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. -
22 రోజుల శిశువుకు అరుదైన శస్త్ర చికిత్స
లబ్బీపేట(విజయవాడతూర్పు): పుట్టుకతోనే కుడివైపు ముక్కులో మాస్ పెరుగుదల ఉన్న 22 రోజుల శిశువుకు ఎన్టీఆర్ జిల్లా విజయవాడ జీజీహెచ్ ఇఎన్టీ విభాగ వైద్యులు అరుదైన శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ఆ శిశువుకు ఎముకల ఫైబ్రోమా వ్యాధిగా నిర్ధారించిన వైద్యులు, ఆస్పత్రిలో ఉన్న అత్యాధునిక ఎండోస్కోపీ పరికరంతో శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించి కుడి నాసల్లోని మాస్‌ను తొలగించారు. ప్రస్తుతం ప్రభుత్వాస్పత్రిలో అత్యాధునిక పరికరాలతో పాటు, నిపుణులైన వైద్యులు అందుబాటులో ఉండడంతో క్లిష్టతరమైన, అరుదైన శస్త్ర చికిత్సలను సైతం విజయవంతంగా నిర్వహించగలుగుతున్నారు. ముక్కులో మాస్‌తో ఇబ్బంది పడుతున్న శిశువును పాత ప్రభుత్వాస్పత్రి నుంచి ఇక్కడికి రిఫర్ చేయగా, ఆమెకు పుట్టుకతోనే ఉన్న వ్యాధి నిర్ధారించి శస్త్ర చికిత్స నిర్వహించినట్లు ఇఎస్‌టీ విభాగాధిపతి డాక్టర్ రవి తెలిపారు. ఇఎన్టీ వైద్యులు డాక్టర్ లీలాప్రసాద్, డాక్టర్ ఆదిత్య, ఎనస్థీషియా విభాగాధిపతి డాక్టర్ టి సూర్యశ్రీ, డాక్టర్ కిరణ్‌కుమార్, డాక్టర్ సుధారాణి పాల్గొన్నారు. -
Brain Tumor: బ్రెయిన్ ట్యూమర్ గుర్తించడం ఇలా.. కారణాలివే..
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఇటీవల కాలంలో బ్రెయిన్ ట్యూమర్ బాధితులు పెరుగుతున్నారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రికే ప్రతినెలా 20 నుంచి 30 మంది వరకూ బ్రెయిన్ ట్యూమర్ బాధితులు వస్తుండగా, ప్రైవేటు ఆస్పత్రుల్లో మరికొంతమంది చికిత్స పొందుతున్నారు. తీవ్రమైన తలనొప్పితో వచ్చిన వారికి బ్రెయిన్ స్కాన్ చేసి వ్యాధిని నిర్ధారించి, అవసరమైన చికిత్సలు చేస్తున్నారు. ఒకప్పుడు ఎక్కువగా 50 ఏళ్లు పైబడిన వారిలో బ్రెయిన్ ట్యూమర్లు చూసేవారమని, ఇప్పుడు 15 ఏళ్ల చిన్నారులు, 30–40 ఏళ్ల మధ్య వయస్సు వారిలోనూ బ్రెయిన్ ట్యూమర్లు చూస్తున్నామని వైద్యులు చెబుతున్నారు. బ్రెయిన్ ట్యూమర్లు రావడానికి అనేక కారణాలు ఉంటాయని, చిన్న పిల్లల్లో జన్యుపరమైన లోపాలే కారణంగా పేర్కొంటున్నారు. ప్రస్తుతం అత్యాధునిక చికిత్సలు అందుబాటులోకి వచ్చినట్లు చెపుతున్నారు. కారణాలివే.. ► జన్యుపరమైన లోపాలు ► తీసుకునే ఆహారం వలన ► సెల్‌ఫోన్ రేడియేషన్ ► స్మోకింగ్, ఆల్కాహాల్ తీసుకునే వారిలోనూ రావచ్చు. గుర్తించడం ఇలా... బ్రెయిన్ ట్యూమర్‌కు నాలుగు దశలు ఉంటాయని వైద్యులు చెపుతున్నారు. మొదటి దశ : తలనొప్పి, వాంతులు, తల తిరగడం. రెండోదశ : తీవ్రమైన తలనొప్పి, అకారణంగా వాంతులు అవడం, తలతిరగడం ఎక్కువగా ఉంటుంది. మూడో దశ : బ్రెయిన్లోని ట్యూమర్ ఇతర అవయవాలకు వ్యాప్తి చెందుతుంది. ఊపిరితిత్తులు, వెన్నుపూసలకు విస్తరిస్తుంది. లక్షణాలు కూడా తీవ్రంగా ఉంటాయి. నాలుగోదశ : ట్యూమర్ కణాలు శరీరంలోని రక్తంలో కలిసి అంతా వ్యాప్తి చెందుతుంది. ఈ దశలో రోగి మరింత క్షీణిస్తాడు. చికిత్సలు ఇలా.. బ్రెయిన్ ట్యూమర్ దశను బట్టి చికిత్స అందిస్తారు. కొందరికి మందులు ఇస్తూ ట్యూమర్‌ను తగ్గిస్తారు. మరికొందరికి శస్త్ర చికిత్స ద్వారా ట్యూమర్‌ను తొలగిస్తారు. రేడియేషన్ థెరపీ, శస్త్ర చికిత్స తర్వాత కీమోథెరపీ వంటి చికిత్సలు అందిస్తారు. ప్రస్తుతం ఆధునిక చికిత్స, అత్యాధునిక పరికరాలు అందుబాటులోకి రావడంతో బ్రెయిన్ ట్యూమర్ రోగులకు మెరుగైన సేవలు అందుతున్నాయి. నిర్ధారణ ఇలా.. తలనొప్పితో వచ్చిన రోగికి సీటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్లు చేయడం ద్వారా బ్రెయిన్ ట్యూమర్‌ను నిర్ధారిస్తారు. ఒకప్పుడు బ్రెయిన్ ట్యూమర్‌ను నాలుగో దశ వచ్చే వరకూ గుర్తించే వారు కాదు. వ్యాధి నిర్ధారణ కాకముందే మరణించినవారు కూడా ఉన్నారు. ఇప్పుడు అత్యాధునిక డయాగ్నోస్టిక్ సేవలు అందుబాటులోకి రావడంతో తొలిదశలోనే గుర్తించగలుగుతున్నారు. ప్రభుత్వాస్పత్రిలో సైతం రెండు సీటీ స్కానింగ్ యంత్రాలతో పాటు, ఒక ఎంఆర్ఐ పరికరం అందుబాటులో ఉంది. ప్రైవేటులో సైతం విస్తృతంగా స్కానింగ్ పరికరాలు అందుబాటులోకి రావడంతో తొలిదశలో గుర్తించగలుగుతున్నారు. (క్లిక్ చేయండి: చలికాలం మెదడుకు ముప్పు.. జాగ్రత్త..!) ఎక్కువగా రెండో దశలోనే వస్తున్నారు ప్రభుత్వాస్పత్రిలోని న్యూరాలజీ ఓపీకి నెలకు 20 నుంచి 30 మంది వరకూ బ్రెయిన్ ట్యూమర్ రోగులు వస్తున్నారు. ఎక్కువగా రెండో దశలోనే వస్తున్నారు. వారి పరిస్థితిని అంచనా వేసి మందులు ఇవ్వాలా, శస్త్ర చికిత్స చేయాలా అనేది నిర్ధారిస్తాం. తీవ్రమైన తలనొప్పితో వచ్చిన వారికి సీటీ, ఎంఆర్ఐ స్కాన్ చేయడంతో ట్యూమర్‌ను నిర్ధారిస్తున్నారు. అందుకోసం ప్రభుత్వాస్పత్రిలో రెండు సీటీ స్కాన్లు, ఒక ఎంఆర్ఐ స్కానింగ్ పరికరం అందుబాటులో ఉంది. – డాక్టర్ దార వెంకట రమణ, న్యూరాలజీ విభాగాధిపతి, జీజీహెచ్, విజయవాడ కచ్చితమైన నిర్ధారణ బ్రెయిన్ ట్యూమర్లను కాంట్రాస్ట్ సీటీతో కచ్చితమైన నిర్ధారణ చేస్తాం. బ్రెయిన్లో ఏదైనా గడ్డ ఉంటే అది ట్యూమరా, ఇంకేమైనా ఉందా అనేది తెలుసుకోవచ్చు. ఏ ప్రాంతంలో ట్యూమర్ ఉంది అనేది చెప్పవచ్చు. ఒకప్పుడు నాలుగో దశ వరకూ తెలుసుకునే వారు కాదు. ఇప్పుడు అడ్వాన్స్డ్ డయాగ్నోస్టిక్ సర్వీసెస్ అందుబాటులోకి రావడంతో. మొదటి, రెండో దశలోనే గుర్తించగలుగుతున్నారు. తలనొప్పితో వచ్చిన వారికి లక్షణాలను బట్టి స్కాన్ చేస్తే ట్యూమర్ ఉంటే నిర్ధారణ చేయొచ్చు. – డాక్టర్ ఎన్.దీప్తిలత, రేడియాలజిస్ట్ -
పదేళ్ల బాలుడికి పునర్జన్మ
గుంటూరు మెడికల్: ఆడుతూ పాడుతూ ఉండాల్సిన పదేళ్ల బాలుడు అకస్మాత్తుగా జీబీ సిండ్రోమ్ వ్యాధి బారిన పడ్డాడు. రెండు నెలలపాటు పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స చేసినా బాలుడి ఆరోగ్యం మెరుగుపడకపోగా, మరింత క్షీణించింది. వెంటిలేటర్‌పై ఉంచి తీసుకొచ్చిన ఆ బాలుడికి గుంటూరు జీజీహెచ్‌లోని న్యూరాలజీ వైద్యులు సకాలంలో సరైన వైద్యం అందించి పునర్జన్మను ప్రసాదించారు. దీంతో బాలుడి తండ్రి ఆనందంతో న్యూరాలజీ వైద్య విభాగంలో గురువారం కేక్ కట్ చేసి, స్వీట్లు పంచి వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం కొత్తపల్లి పంచాయతీ పరిధిలోని చాకలికుంట తండాకు చెందిన మూడావత్ రాజానాయక్, మంగాబాయి దంపతుల కుమారుడు వగ్యానాయక్(10) ఐదో తరగతి చదువుతున్నాడు. వగ్యానాయక్కు రెండు నెలల క్రితం ముఖంపై వాపు వచ్చింది. అతడికి నరసరావుపేట, గుంటూరులోని పలు ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స అందించారు. అన్ని ఆస్పత్రుల్లో కలిపి రూ.10లక్షలు వరకు ఖర్చు చేశారు. అయినా బాలుడు కోలుకోలేదు. రెండుసార్లు కార్డియాక్ అరెస్టయి ఆరోగ్యం మరింత క్షీణించి వెంటిలేటర్‌పై ఉన్న వగ్యానాయక్ను చివరికి ఈ నెల మూడో తేదీ అర్ధరాత్రి గుంటూరు జీజీహెచ్ న్యూరాలజీ వైద్య విభాగానికి తీసుకొచ్చారు. తక్షణమే డ్యూటీలో ఉన్న పీజీ వైద్యులను అప్రమత్తం చేసి బాలుడిని ఐసీయూలోకి తరలించి వెంటిలేటర్ అమర్చి చికిత్స అందించామని న్యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ నాగార్జునకొండ వెంకటసుందరాచారి తెలిపారు. వారం రోజులపాటు వెంటిలేటర్‌పై చికిత్స అందించిన తర్వాత బాలుడు కోలుకోవడం ప్రారంభమైందని చెప్పారు. ఈ బాలుడికి అరుదుగా సంభవించే గులియన్‌బెరి సిండ్రోమ్ (జీబీ సిండ్రోమ్) సోకినట్లు నిర్ధారించామన్నారు. రోజుకు రూ.లక్ష విలువైన ఇంజక్షన్లు చేశామని, కేవలం ఇంజక్షన్లకు రూ.ఆరు లక్షలకు పైగా ఖర్చు అయినట్లు వెల్లడించారు. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా సుమారు రూ.10 లక్షలు ఖర్చు అయ్యే వైద్యాన్ని బాలుడికి ఉచితంగా చేసి ప్రాణాలు కాపాడామని, ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నాడని వివరించారు. -
World Piles Day 2022: పైల్స్‌కు స‘మూల’ పరిష్కారం..
గుంటూరు మెడికల్: ఆధునిక జీవన శైలి వల్ల ప్రస్తుతం ప్రజలు యుక్త వయసులోనే మూలవ్యాధి(పైల్స్/మొలలు) బారిన పడుతున్నారు. ఎక్కువగా కాలేజీ విద్యార్థులు, ఉద్యోగులు దీనివల్ల బాధపడుతున్నట్టు వైద్య నిపుణులు గుర్తించారు. ఈ రోగులు ఎక్కువగా కూర్చోలేరు. అలాగని తిరగనూ లేరు. గుంటూరు జీజీహెచ్ జనరల్ సర్జరీ వైద్య విభాగానికి ప్రతిరోజూ పది మంది పైల్స్ సమస్యతో చికిత్స కోసం వస్తున్నారు. గుంటూరు జిల్లాలో 120 మంది జనరల్ సర్జన్లు, పది మంది గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టులు ఉన్నారు. ఒక్కో వైద్యుడి వద్దకు ప్రతిరోజూ సగటున ఇద్దరు మొలల బాధితులు చికిత్స కోసం వస్తున్నట్టు సమాచారం. హెమోరాయిడ్స్‌గా పిలిచే ఈ వ్యాధిపై అవగాహన కల్పించేందుకు ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏడాదీ నవంబర్ 20న వరల్డ్ పైల్స్ డేని నిర్వహిస్తున్నారు. సరైన వైద్యం తీసుకుంటే మూలవ్యాధిని సమూలంగా నయం చేయొచ్చని వైద్యులు చెబుతున్నారు. కారణమేంటంటే.. మల విసర్జన సరిగా జరగకపోవడాన్ని మలబద్ధకం అంటారు. ఇది ఎక్కువగా ఉండేవారిలో అన్నవాహిక చివరి భాగంలో మల ద్వారానికిపైన పురీషనాళం వద్ద రక్తనాళాల్లో వాపు చోటుచేసుకుంటుంది. దీనినే మూల వ్యాధి అంటారు. కొందరిలో మలద్వారం దగ్గర సిరలు బలహీనంగా ఉండటం వల్ల కూడా ఈ వ్యాధి వస్తుంది. వంశ పారంపర్యంగానూ వచ్చే ఆస్కారం ఉంది. వ్యాయామం లేకపోవడం, అధిక బరువు, ఆహారపు అలవాట్లు, పీచు పదార్థాలు తక్కువగా తీసుకోవడం వల్ల ఈ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మహిళల్లో గర్భిణిగా ఉన్నప్పుడు వచ్చే ఆస్కారం ఉంది. ఒకేచోట ఎక్కువ సేపు కూర్చొని పనిచేయడం, మానసిక ఒత్తిడి, మద్యపానం, నీరు తక్కువగా తాగడం, మాంసాహారం, జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకునే వారిలో పైల్స్ లక్షణాలు అధికంగా కనిపిస్తాయి. మల ద్వారం చుట్టూ దురదగా ఉండడం, మల విసర్జన సమయంలో వాపు, ఉబ్బు తగలడం, అధిక రక్తస్రావం దీని లక్షణాలు. చికిత్స, జాగ్రత్తలు ► ప్రస్తుతం మూలవ్యాధికి అధునాతన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. స్టాప్లర్, లేజర్, హాల్స్‌వంటి విధానాల వల్ల ఎక్కువ నొప్పి, గాయం లేకుండా మూలవ్యాధిని నయం చేయొచ్చు. ► మొలలు సోకిన వారు పీచు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. ద్రవ పదార్థాలను ప్రత్యేకంగా నీళ్లను తరచూ తాగాలి. పండ్లు, ఆకు కూరలు, కాయగూరలు అధికంగా తీసుకోవాలి. ఎక్కువగా శ్రమపడి ఒత్తిడి కలిగేలా మల విసర్జన చేయకూడదు. కారం, మాసాలాలు, పచ్చళ్లు, వేపుళ్లు, దుంప కూరలకు దూరంగా ఉండాలి. 90 శాతం మందులతోనే నయం పైల్స్ బాధితులకు గుంటూరు జీజీహెచ్‌లో అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. ఉచితంగా ఆపరేషన్లూ చేస్తున్నాం. నూటికి 90 శాతం మూలవ్యాధి మందులతోనే నయమవుతుంది. కేవలం పది శాతం మందికి మాత్రమే శస్త్రచికిత్స అవసరం అవుతుంది. ఆపరేషన్‌కూ అత్యాధునిక పద్ధతులు ఉన్నాయి. లేజర్ చికిత్స ద్వారా అతి తక్కువ కోత, కుట్లతో శస్త్రచికిత్స చేయొచ్చు. – షేక్ నాగూర్‌బాషా, గ్యాస్ట్రో ఎంట్రాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్, గుంటూరు జీజీహెచ్ -
Epilepsy: దేహం రంగు మారిందో ప్రాణాపాయం తప్పదు
సాక్షి, గుంటూరు: ఫిట్స్ వ్యాధికి వైద్యం లేదనే అపోహకు కాలం చెల్లింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం 50 మిలియన్ల ప్రజలు మూర్చవ్యాధితో (ఎపిలెప్సి) బాధపడుతున్నారు. వీరిలో 80 శాతం బాధితులు అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే ఉన్నారు. మన దేశంలో 10 మిలియన్ల మంది వ్యాధితో బాధపడుతున్నారు. ప్రజలకు ఫిట్స్ వ్యాధిపై అవగాహన కల్పించేందుకు ఎపిలెప్సి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2009 నుంచి నవంబర్ నెలను జాతీయ ఎపిలెప్సీ అవగాహన మాసంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి ’ అందిస్తున్న ప్రత్యేక కథనం. మూర్చ అంటే (ఫిట్స్).. మెదడులో ఉన్న న్యూరాన్లలో విద్యుత్ ఆవేశం ఎక్కువైనప్పుడు బయట కనిపించే లక్షణాలనే ఫిట్స్ లేదా మూర్చ అంటారు. ఇది వచ్చినప్పుడు కాళ్లు, చేతులు కొట్టుకుని పడిపోతారు. ఫిట్స్ వచ్చినప్పుడు కొంత మందికి నాలుక కొరుక్కోవడం, నోటి నుంచి నురగ రావడం గమనించవచ్చు. ఫిట్స్ ఎక్కువ సమయం ఉండే మనిషి దేహం నీలంరంగుగా మారి ప్రాణాపాయ స్థితికి చేరుకోవచ్చు. కారణాలు.. మెదడులో వచ్చే ఇన్ఫెక్షన్లు, గడ్డలు, తలకు గాయాలు, బ్రెయిన్ స్ట్రోక్స్, మెదడులో రక్తనాళాలు ఉబ్బడం, పుట్టుకతో వచ్చే జన్యుపరమైన సమస్యల వల్ల ఫిట్స్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. పిల్లలు, పెద్దవాళ్లలో అందరిలోనూ ఈ మూర్ఛ వ్యాధి వస్తుంది. గొంతు, చెవిలో వచ్చే ఇన్ఫెక్షన్స్ వల్ల చిన్నారుల్లో వచ్చే అవకాశం ఉంది. స్త్రీలు ప్రసవ సమయంలో కొన్ని రకాల చికిత్స విధానాలు పాటించకపోవడం వల్ల, టీబీ, హెచ్ఐవీ, మెదడువాపు జబ్బుల వల్ల, వైరస్లు, బ్యాక్టీరియా, ఫంగస్ల వల్ల ఫిట్స్ కేసులు దేశంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. జిల్లాలో బాధితులు.. గుంటూరు జీజీహెచ్‌లో ప్రతి శనివారం మూర్చవ్యాధి బాధితుల కోసం ప్రత్యేక ఓపీ ఏర్పాటు చేశారు. ప్రతి వారం 150 మంది ఓపీ విభాగానికి వైద్యం కోసం వస్తున్నారు. జిల్లాలో సుమారు 90 మంది న్యూరాలజిస్టులు, న్యూరోసర్జన్లు , ఫిజీషియన్ల వద్ద ప్రతి రోజూ ఒక్కొక్కరి వద్ద ఐదు నుంచి పది మంది వరకు ఫిట్స్ సమస్యతో చికిత్స పొందుతున్నారు. -
AP: డాక్టరమ్మ గొప్ప మనస్సు.. రూ.20 కోట్ల భారీ విరాళం
గుంటూరు మెడికల్: ఓ డాక్టరమ్మ తాను వైద్య విద్యను అభ్యసించిన కళాశాలకు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.20 కోట్ల భారీ విరాళం ప్రకటించింది. నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది. వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా, తెనాలి సమీపంలోని కూచిపూడికి చెందిన డాక్టర్ గవిని వెంకటకృష్ణారావు రెండో కుమార్తె డాక్టర్ ఉమ గవిని. గుంటూరు వైద్య కళాశాలలో వైద్య విద్యనభ్యసించారు. అమెరికాలో 40 ఏళ్ల కిందట స్థిరపడి, ఇమ్యునాలజిస్టుగా వైద్య సేవలు అందిస్తున్నారు. చదవండి: ‘సంక్షేమం’ ఖర్చులో ఏపీదే అగ్రస్థానం గుంటూరు వైద్య కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం, ఉత్తర అమెరికా (జింఖానా)కు అధ్యక్షురాలిగా పనిచేసిన ఆమె ప్రస్తుతం జింఖానా కోశాధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. గుంటూరు జీజీహెచ్‌లో నూతనంగా నిర్మిస్తున్న మాతా శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రం(ఎంసీహెచ్)కి డాక్టర్ ఉమ గవిని విరాళం ప్రకటించారు. అధిక మొత్తంలో విరాళం ప్రకటించిన డాక్టర్ ఉమ గవిని దాతృత్వాన్ని ప్రశంసిస్తూ అనేక పోస్టులు ఆమెకు మద్దతుగా సోషల్ మీడియాలో పెట్టారు. -
గుంటూరు వైద్య కళాశాలలో ర్యాగింగ్
గుంటూరు మెడికల్: గుంటూరు వైద్య కళాశాలలో ర్యాగింగ్ జరిగిందని ఫిర్యాదులు రావడంతో శుక్రవారం వైద్య కళాశాల అధికారులు ర్యాగింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పీజీ మహిళా వైద్యులను పిలిపించి విచారణ చేశారు. గుంటూరు జీజీహెచ్‌లో హౌస్ సర్జన్‌గా (ఇంటర్నీ) విధులు నిర్వహిస్తున్న ఓ వైద్య విద్యార్థిని తనను పీజీ విద్యార్థినులు వేధిస్తున్నారని, బెదిరిస్తున్నారని నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్‌చేసి ఫిర్యాదు చేసింది. ఎన్ఎంసీ అధికారులు సదరు ఘటనపై తక్షణమే విచారణ నిర్వహించాలని ఆదేశిస్తూ శుక్రవారం వైద్య కళాశాల అధికారులకు మెయిల్ ద్వారా ఉత్తర్వులు పంపారు. దీంతో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చాగంటి పద్మావతీదేవి ఆధ్వర్యంలో పలువురు యాంటీ ర్యాగింగ్ కమిటీ సభ్యులు ర్యాగింగ్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పీజీ మహిళా వైద్యులను పిలిపించి విచారించారు. కాగా, ఏప్రిల్‌లో మెన్స్ హాస్టల్లో సీనియర్ వైద్య విద్యార్థులు ర్యాగింగ్ చేస్తున్నారంటూ జూనియర్ వైద్య విద్యార్థులు ఎన్ఎంసీకి ఫిర్యాదు చేశారు. నాడు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పద్మావతీదేవి సీనియర్ వైద్య విద్యార్థులు, జూనియర్ వైద్య విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేసి ర్యాగింగ్ విష సంస్కృతిని అనుసరించవద్దని, ఎవరైనా ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయినా మళ్లీ కళాశాలలో ర్యాగింగ్ జరగడం గమనార్హం. -
గుంటూరులో మంకీపాక్స్ కలకలం.. శాంపిల్స్ పూణేకు తరలింపు
సాక్షి, గుంటూరు : గుంటూరులో మంకీపాక్స్ కలకలం సృష్టించింది. మంకీపాక్స్ అనుమానిత లక్షణాలతో రాహువ్ నహక్(8) జీజీహెచ్‌లో చేరాడు. దీంతో, చికిత్స పొందుతున్న రాహువ్ నుంచి శనివారం రాత్రి జీజీహెచ్ అధికారులు వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం శాంపిల్స్ సేకరించారు. గొంతు, ముక్కు నుంచి స్వాబ్ తీయడంతోపాటు, రక్తం, మూత్రం శాంపిల్స్‌ను సేకరించి ప్రత్యేకంగా భద్రపరిచారు. వ్యాధి నిర్ధారణ కోసం ఆ శాంపిల్స్‌ను ఎపిడిమాలజిస్టు డాక్టర్ వరప్రసాద్‌తో శనివారం రాత్రి 10 గంటలకు విమానంలో పూణేకు పంపిస్తామని, వ్యాధి నిర్ధారణకు 3 రోజుల సమయం పడుతుందని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నీలం ప్రభావతి తెలిపారు. కాగా, ఒడిశాకు చెందిన బనిత నహక్, గౌడ నహక్‌లు తమ కుమారుడు రాహువ్ నహక్‌తో కలిసి ఒడిశా నుంచి యడ్లపాడు స్పిన్నింగ్‌మిల్లుకు 16 రోజుల కిందట వచ్చారని పేర్కొన్నారు. ఒంటిపై గుల్లలు రావడంతో ఈ నెల 28న చికిత్స కోసం గుంటూరు జీజీహెచ్‌కు తీసుకువచ్చారని, ప్రత్యేక వార్డులో బాలుడిని అడ్మిట్ చేసి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఇది కూడా చదవండి: సాగర గర్భంలో పర్యాటకం -
గుంటూరులో మంకీపాక్స్ కలకలం.. జీజీహెచ్‌లో చేరిన అనుమానిత కేసు
-
Monkeypox: గుంటూరులో మంకీపాక్స్ కలకలం!
గుంటూరు: గుంటూరులో అనుమానిత మంకీపాక్స్ కేసు కలకలం సృష్టించింది. దద్దుర్లు కనిపించటంతో ఎనిమిదేళ్ల బాలుడిని జీజీహెచ్ ఆసుపత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు. ప్రత్యేక వార్డులో ఉంచి బాలుడికి చికిత్స అందిస్తున్నారు జీజీహెచ్ వైద్యులు. మంకీపాక్స్ లక్షణాలు కనిపించటం వల్ల బాలుడి శాంపిల్స్‌ను గాంధీ ఆసుపత్రికి పంపించినట్లు తెలిపారు. ఇంతకుముందు విజయవాడలోనూ ఓ చిన్నారిలో లక్షణాలు కనిపించాయి. అయితే, పరీక్షల్లో నెగెటివ్‌గా తేలింది. ఇదీ చదవండి: తల్లడిల్లిన మాతృ హృదయాలు -
విజయవాడ జీజీహెచ్.. ఇక ఇ–ఆస్పత్రి
లబ్బీపేట(విజయవాడ తూర్పు): విజయవాడ ప్రభుత్వాస్పత్రి ‘ఇ’(ఎల్రక్టానిక్) ఆస్పత్రిగా రూపాంతరం చెందనుంది. పేపర్ రహిత డిజిటల్ వైద్య సేవలందించేందుకు రాష్ట్రంలోనే మోడల్ ఆస్పత్రిగా ఎంపికైంది. ఈ విషయాన్ని శుక్రవారం రాష్ట్ర వైద్య విద్యా సంచాలకులు ఎం.రాఘవేంద్రరావు ప్రకటించారు. ఇ ఆస్పత్రిగా మార్చే పనులు 15 రోజులుగా చేస్తున్నారు. ఈ నెలాఖరుకు అత్యాధునిక పరికరాలు రానున్నాయి. దీంతో మార్చి 15 నాటికి సేవలు ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఆయుష్మాన్ భారత్ డివిజన్ హెల్త్ మిషన్‌లో భాగంగా ఇ ఆస్పత్రిగా మారుస్తున్నారు. చదవండి: విశాఖలో సీఎం జగన్ పర్యటన.. షెడ్యూల్ ఇదే.. ప్రతి రోగికి ఒక శాశ్వత ఐడీ.. ప్రభుత్వాస్పత్రికి వచ్చే ప్రతి రోగికి ఆధార్ అనుసంధానిత గ్లోబల్ బేస్డ్ ఐడీని క్రియేట్ చేస్తారు. ఒకవేళ ఆ రోగికి అప్పుడే ఐడీ ఉంటే, దాని ప్రకారమే సేవలు అందిస్తారు. ఒకసారి ఐడీని క్రియేట్ చేస్తే, ఆ నంబరు జీవితాంతం ఉండిపోతుంది. రోగి ఏ ఆస్పత్రికి వెళ్లినా ఐడీ నంబరు చెబితే అతని పూర్వ చికిత్స వివరాలు, దీర్ఘకాలిక వ్యాధులు వంటివి రోగి చెప్పకుండానే తెలుసుకునే అవకాశం ఉంటుంది. దేశంలోనే కాకుండా, ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ఆ ఐడీ నంబర్ పనిచేస్తుంది. ఒకవేళ రోగి ఐడీ నంబర్ మర్చిపోయినా, ఆధార్ నంబర్ ఆధారంగా తెలుసుకునే వీలుంది. పేపర్ రహిత సేవలు.. ఎల్రక్టానిక్ ఆస్పత్రిగా రూపొంతరం చెందిన అనంతరం ఆస్పత్రిలో పేపర్ రహిత వైద్య సేవలు అందించనున్నారు. రోగి ఓపీకి ఐడీ ఆధారంగా రిజి్రస్టేషన్ చేయడంతో పాటు, వైద్యులు పరీక్షలు చేసి, వారు గుర్తించిన లోపాలు, రక్త పరీక్షా ఫలితాలు, సీటీ స్కాన్ , ఎంఆర్ఐ రిపోర్టులు ఇలా అన్నీ రోగి ఐడీ ఆధారంగా ఆన్లైన్లోనే ఉంచుతారు. వారి మెడికల్ రికార్డులు సైతం ఆన్లైన్లోనే ఉంటాయి. ఇన్‌పేషెంట్‌గా చేరినా రికార్డులన్నీ ఎలక్ట్రానిక్ పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఆన్లైన్లోనే పొందుపరుస్తారు. ఒక్క క్లిక్‌తో హిస్టరీ అంతా.. ప్రతి రోగికి ఒక ఐడీని క్రియేట్ చేసి, తన రిపోర్టులన్నీ ఆన్లైన్ చేయడం ద్వారా ఒక్క క్లిక్‌తో రోగి పూర్వ పరిస్థితిని (స్టరీ) వైద్యులు తెలుసుకునే అవకాశం ఉంటుంది. రోగి ఐడీని ఓపెన్ చేస్తే పాత హిస్టరీ అంతా తెలుసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం మోడల్ ఆస్పత్రిగా విజయవాడ ప్రభుత్వాస్పత్రిని ఇ ఆస్పత్రిగా మారుస్తుండగా, అనంతరం రాష్ట్రంలోని ఇతర బోధనాస్పత్రులు, జిల్లా ఏరియా ఆస్పత్రులతో పాటు, ప్రైవేట్ ఆస్పత్రులను సైతం మార్చేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది. మార్చి 15కి పూర్తి.. ఎల్రక్టానిక్ ఆస్పత్రిగా మార్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. మార్చి 15 నాటికి పూర్తిస్థాయిలో రూపుదిద్దుకుంటుంది. అందుకోసం ప్రతి వార్డులో ఒక కంప్యూటర్ ఆపరేటర్‌ను ఏర్పాటు చేసి, రికార్డులు ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేస్తాం. ప్రతి రిపోర్టు ఆన్లైన్లోనే ఉంటుంది. పేపర్ రహిత వైద్య సేవలు అందించనున్నాం. రోగి హిస్టరీ అంతా ఐడీ నంబర్‌తో తెలుసుకోవచ్చు. – డాక్టర్ యేకుల కిరణ్‌కుమార్, సూపరింటెండెంట్ -
ఆప్యాయత అల్లుకున్న ’మన ఇల్లు‘
పెద్దాపురం: స్పందించే మనసుంటే చాలు...సేవ చేయాలనే తపన ఉంటే చాలు..ఆదుకోడానికి పెద్దగా ఆస్తిపాస్తులక్కరలేదని చెప్పడానికి ఆయనే నిదర్శనం. అయినవాళ్ల ఆదరణకు దూరంగా ..వృద్ధాప్యంలో అనాథలైన వారికి ఆసరా ఇస్తున్న ఆయన పేరు అల్లవరపు సత్యన్నారాయణ. బాల్యంలో తండ్రి అనారోగ్యం పాలై ఆస్పత్రిలో పడిన బాధల్ని కళ్లారా చూశారు. ఆర్ధిక పరిస్థితి సహకరించకపోతే ఎదురయ్యే పరిస్థితులనూ చూశారు. ఆవే ఆయన్ను ప్రభావితం చేశాయి. అభాగ్యులకు అండగా నిలవాలనే తత్వాన్ని పెంచాయి. ఫలితంగా ఆయన నేతృత్వంలో 2016లో కాకినాలో ఆవిర్భవించిందే బాధ్యత స్వచ్ఛంద సంస్థ. తనలాంటి స్వభావమున్న మరో ఏడుగురు ఈయనకు తోడయ్యారు. నాటి ఆస్పత్రి జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రాఘవేంద్రరావు ప్రోత్సాహమూ బలమైంది. తొలుత కాకినాడలో అనాథ బాలలు గుర్తించి, దిశ వన్ స్టాప్ సర్వీస్‌ల సహాకారంతో సేవలకు శ్రీకారం చుట్టారు. మేమున్నామని.. జీజీహెచ్‌లో ఏ దిక్కూ లేని వృద్ధుల వైద్యసేవలకో వార్డు ఉంది. ఈ వార్డులో చికిత్స పొందుతున్న వారెవరికీ తెలియదు. వీరికోసం ఎవరూ అక్కడికి రారు. ఈ వార్డుకు సత్యనారాయణ బృందం వెళుతూ వారికి సపర్యలు చేస్తున్నారు. వీరికి తామే ఎందుకు ఆసరా కల్పించకూడదనే ఆలోచనతో పెద్దాపురంలో మన ఇల్లు ఏర్పాటు చేశారు. తొలుత ఎనిమిది మందితో ఆరంభమైన మన ఇల్లులో ఇప్పుడు 29మంది ఉంటున్నారు. సహచరులు.. యువత, ప్రభుత్వ ఉద్యోగులు సత్యనారాయణ ఆలోచనకు అండగా నిలుస్తున్నారు. తమ వంతు చేయూతనిస్తున్నారు. మన ఇల్లులో ఉన్నవారెవరికీ తాము అనాథలం అనే భావన రానీయకుండా సాకుతున్నామని సత్యనారాయణ చెప్పారు. ఆహ్లాద కరమైన వాతావరణంలో పడుకోవడానికి బెడ్లు, దుప్పట్లు, వేళకు భోజనం సమకూర్చుతున్నారు. వినోదం కోసం టీవీలు అందుబాటులో ఉంచుతున్నారు మన ఇల్లు నిర్వాహకులు. అసోం నుంచి రైలు ప్రమాదంలో అనారోగ్యం పాలై మతిస్థిమితం కోల్పోయిన శ్రీదౌహరుకు మూడేళ్లపాటు సేవలందించారు. తర్వాత కుటుంబీకుల వివరాలు చెప్పడంతో ఇటీవల వారిని రప్పించి అతడ్ని స్వస్థలానికి పంపించారు. ఈవిషయంలో మన ఇల్లు నిర్వాహకుడు సత్యనారాయణ పోషించిన పాత్రను జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ ప్రశంసించారు. జీజీహెచ్‌లో అనాథలుగా ప్రాణాలు కోల్పోయిన 14 మంది మృతదేహాలకు సత్యనారాయణ బృందం అంతిమ సంస్కారాలను నిర్వహించింది. కాళ్లు చచ్చుబడిన స్థితి నుంచి ఇలా ఉన్నా.. నాది రాజమహేంద్రవరం. నాకు అందరూ ఉన్నారు. రెండు కాళ్లు చచ్చుబడిపోయి మంచాన పడ్డాను. కాకినాడ తిమ్మాపురానికి చెందిన నా సోదరి జీజీహెచ్‌లో చేర్పించింది. నా పరిస్థితి గుర్తించి సత్యన్నారాయణ పెద్దాపురంలోని మన ఇల్లుకు తీసుకువచ్చారు. ఏ ఇబ్బంది లేకుండా ఆనందంగా గడుపుతున్నాను. – వెంకటరమణ, రాజమహేంద్రవరం ఆ వృద్ధులందరూ అమ్మానాన్నలే.. పెద్దాపురంలో మూడేళ్లుగా ‘మనఇల్లు’ను ప్రారంభించాం. ప్రస్తుతం 29 మంది వృద్ధులు ఉన్నారు. వీరికి ఏ ఇబ్బంది రాకుండా చూస్తున్నాం. కొందరికి ఫిజియోథెరపీ సేవలు కూడా అందిస్తున్నాం. వీరంతా అనాధ వృద్ధులు కాదు. నాకు అమ్మా నాన్నలే. వృద్ధులైన వారిపై కుటుంబీకులు నిరాదరణ చూపడం సరికాదు. పెద్దలను గౌరవిస్తూ సేవలందించాలి. – అల్లవరపు సత్యనారాయణ, ‘మన ఇల్లు’ సంస్థ నిర్వాహకుడు -
ఉన్నతస్థితికొచ్చి అండగా ఉంటారనుకున్నాం
గుంటూరు ఈస్ట్/సాక్షి, అమరావతి: వేద విద్యలో ఉన్నతస్థాయికి చేరి తమకు అండగా ఉంటారనుకున్న తమ పిల్లలను.. విగతజీవులుగా చూసిన తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు బోరున విలపించిన తీరు అక్కడి వారి హృదయాలను బరువెక్కించింది. సుదూర ప్రాంతాలనుంచి వచ్చి అచ్చంపేట మండలం మాదిపాడు వేద పాఠశాలలో విద్యనార్జిస్తున్న విద్యార్థుల్లో సంధ్యావందనం కోసం కృష్ణానదిలో స్నానమాచరించేందుకు ఉపక్రమించిన ఐదుగురు వేద విద్యార్థులు, ఒక గురువు ప్రమాదవశాత్తు మృత్యువాత పడిన విషయం విదితమే. ఆ విద్యార్థుల మృతదేహాలను గుంటూరు జీజీహెచ్ మార్చురీలో శనివారం వారి తల్లిదండ్రులు, బంధువులకు అప్పగించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను వారి స్వస్థలాలకు తరలించేందుకు.. ప్రత్యేక అంబులెన్స్‌ను దేవదాయ ధర్మదాయ శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన నితీష్ దీక్షిత్ తండ్రి వీరేంద్రదీక్షిత్, శుభం త్రివేదీ తండ్రి అనిల్ త్రివేది, హర్షిత్శుక్లా తండ్రి రామ్‌శంకర్ శుక్లా, అన్షుమాన్ బాబాయి ఆవదేశ్ శుక్లాలు జీజీహెచ్ మార్చురీకి వచ్చారు. మధ్యప్రదేశ్‌కు చెందిన శివకుమార్ శర్మ మృతదేహానికి తండ్రి లక్ష్మీప్రసాద్ శర్మ గుంటూరు శ్మశానవాటికలోనే అంత్యక్రియలు చేసేందుకు నిర్ణయించుకున్నారు. దేవదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ ఈమని చంద్రశేఖర్‌రెడ్డి మృతదేహాలను స్వస్థలాలకు తరలించేందుకు, తల్లిదండ్రుల ప్రయాణ ఖర్చుల కింద శాఖ తరఫున రూ.1.25 లక్షలు అందజేసినట్లు వెల్లడించారు. కాగా, మృతుల తల్లిదండ్రులంతా మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో చిన్నకారు వ్యవసాయ కుటుంబాలకు చెందిన వారు, నిరుపేద బ్రాహ్మణులే. ప్రభుత్వ అండ: మంత్రి వెలంపల్లి వేద పాఠశాల విద్యార్థుల మృతదేహాలను గుంటూరు జీజీహెచ్ మార్చురీలో దేవదాయధర్మాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ సందర్శించి నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారని తెలిపారు. మృతుల కుటుంబాలను పూర్తి స్థాయిలో ఆదుకుని సహాయసహకారాలు అందించాలని ఆదేశించారని చెప్పారు. పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మృతదేహాలకు నివాళులర్పించారు. ఘటన దురదృష్టకరం: స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ పెందుర్తి: ఐదుగురు వేద విద్యార్థులు, ఒక గురువు ప్రమాదానికి గురై మృత్యువాత పడడం తనను తీవ్రంగా కలచివేసిందని విశాఖ శ్రీశారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కో కుటుంబానికి పీఠం తరపున రూ.50 వేల చొప్పున అందిస్తున్నట్లు వెల్లడించారు. కాగా, వారి కుటుంబాలకు రూ.50 వేల చొప్పున పీఠం ప్రతినిధులు డాక్టర్ వెంకటరమణ, సతీష్‌శర్మ నగదు అందజేశారు. -
జీజీహెచ్, గుంటూరులో 129 పోస్టులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన విజయవాడలోని డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ).. గుంటూరు జిల్లా ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో(జీజీహెచ్) ఒప్పంద/అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 129 ► పోస్టుల వివరాలు: ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, ఫిజిసిస్ట్, డేటాఎంట్రీ ఆపరేటర్, బయో–మెడికల్ ఇంజనీర్, ఆప్టోమెట్రిస్ట్, ఈసీజీ టెక్నీషియన్, రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్, ల్యాబ్ అటెండెంట్స్ తదితరాలు. ► అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, జీఎన్ఎం, డిప్లొమా/బీఎస్సీ, బయోమెడికల్ ఇంజనీరింగ్, బీఫార్మసీ, ఎమ్మెస్సీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత టెక్నాలజీలో సర్టిఫికేట్ కోర్సులతోపాటు ఏపీ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉండాలి. (మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ► వయసు: 01.07.2021 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ► వేతనం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ. 12,000 నుంచి రూ.28,000 వరకు చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కులు, అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును సూపరింటెండెంట్, జీజీహెచ్, గుంటూరు, ఏపీ చిరునామకు పంపించాలి. ► దరఖాస్తులకు చివరి తేది: 15.12.2021 ► వెబ్సైట్: guntur.ap.gov.in -
మెదడు గురించీ ఆలోచించాలి..బ్రెయిన్ స్ట్రోక్‌కు కారణాలు
సాక్షి, అమరావతి: గుంటూరు నగరానికి చెందిన 26 ఏళ్ల యువకుడు ఓ ప్రైవేట్ షోరూమ్‌లో పనిచేస్తుంటాడు. ఇతనికి రెండు నెలల క్రితం మూతి వంకరపోవడంతో కుటుంబ సభ్యులు జీజీహెచ్‌కు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం బ్రెయిన్ స్ట్రోక్ (పక్షవాతం)గా నిర్ధారణ అయింది. డిగ్రీ చదివే రోజుల నుంచే సురేశ్ సిగరెట్లు తాగేవాడు. రోజులు గడిచే కొద్దీ చైన్ స్మోకర్గా మారాడు. చిన్న వయసులోనే స్ట్రోక్‌కు గురికావడానికి పొగతాగడమే కారణంగా వైద్యులు గుర్తించారు. విశాఖపట్నం నగరానికి చెందిన 30 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ కరోనా కారణంగా గత ఏడాదిగా ఇంటి నుంచే పనిచేస్తున్నాడు. రెండు వారాల క్రితం ఇంట్లో పనిచేస్తూ స్పృహ కోల్పోయాడు. కుటుంబ సభ్యులు కేజీహెచ్‌కు తరలించగా వైద్య పరీక్షల అనంతరం బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయినట్టుగా వైద్యులు నిర్ధారించారు. తీవ్రమైన పని ఒత్తిడితో, నిద్రలేమి వంటి సమస్యల వల్ల స్ట్రోక్ వచ్చినట్టుగా గుర్తించారు. ఆలోచనల ఒత్తిడితో సతమతమయ్యే మెదడు గురించి కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే ఆధునిక జీవన శైలి, దురలవాట్ల కారణంగా 20 నుంచి 45 ఏళ్ల మధ్య వయసులో కొందరు బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడుతున్నారు. ఒకప్పుడు 60 ఏళ్లు పైబడిన వారిలో బీపీ, షుగర్ నియంత్రణలో లేకపోవడం వల్ల ఈ వ్యాధి వస్తుండేది. అయితే ప్రస్తుతం నమోదవుతున్న 25 నుంచి 30 శాతం బ్రెయిన్ స్ట్రోక్ కేసుల్లో వ్యక్తుల వయసు 20 నుంచి 45 ఏళ్ల లోపు ఉంటోందని వైద్యులు చెబుతున్నారు. బ్రెయిన్ స్ట్రోక్‌కు కారణాలు.. ► పొగతాగడం, మద్యం, గంజాయి, డ్రగ్స్ తీసుకోవడం. మద్యపానం, ధూమపానం అలవాటైన పదేళ్లకే పలువురిలో బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు కనబడుతున్నాయి. ► బీపీ, షుగర్లు నియంత్రణలో లేకపోవడం. శారీరక శ్రమ లేకపోవడం. ► మహిళలు నెలసరిని వాయిదా వేయడం. అధిక రక్తస్రావం నియంత్రణకు వైద్యుల సలహాలు తీసుకోకుండా మందులు వాడటం. ► ప్రస్తుతం కరోనా బారినపడి కోలుకున్న వారిలో 5 శాతం మంది బ్రెయిన్ స్ట్రోక్‌కు గురవుతున్నారు. రాష్ట్రంలో బీపీ, షుగర్, ఊబకాయం పరిస్థితి ఇలా.. ► మన రాష్ట్రంలో 30 ఏళ్లు నిండిన ప్రతి నలుగురిలో ఒకరికి బీపీ, ప్రతి ఐదుగురిలో ఒకరికి షుగర్ ఉంటోంది. ► గ్రామాల్లో 26 శాతం మంది, పట్టణాల్లో 30 శాతం మంది బీపీ బాధితులు, గ్రామాల్లో 19 శాతం మంది, పట్టణాల్లో 24 శాతం మంది షుగర్ బాధితులు. ► జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే–5 ఆధారంగా రాష్ట్రంలో 36.3 శాతం మంది మహిళల్లో, 31.3 శాతం పురుషుల్లో ఊబకాయం ఉంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ► రోజూ 45 నిమిషాల నడకతో పాటు ఇతర వ్యాయామాలు చేయాలి. ► ఆహారంలో 25 శాతం పండ్లు, 30 శాతం కూరగాయలు, 25 శాతం పిండి పదార్థాలు, 20 శాతం ప్రొటీన్స్ ఉండేలా చూసుకోవాలి. జంక్ ఫుడ్‌ను పూర్తిగా నియంత్రించాలి. ► శరీర బరువును నియంత్రించుకోవాలి. బీపీ, షుగర్ వంటి సమస్యలు ఉంటే తరచూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. ► ఒత్తిడికి గురికాకుండా ఉండాలి. రోజుకు ఆరు గంటలు తప్పనిసరిగా నిద్రపోవాలి. స్ట్రోక్ రెండు రకాలు మెదడులోని రక్తనాళాల్లో రక్త ప్రసరణ సక్రమంగా లేకపోవడం వల్ల శరీరంలోని కొన్ని భాగాలు చచ్చుబడటాన్ని ఇస్కిమిక్ స్ట్రోక్ అంటారు. రక్తనాళాలు చిట్లినప్పుడు హెమరేజిక్ స్ట్రోక్ అంటారు. బీపీ, షుగర్, ఊబకాయం నియంత్రించుకోవడంపై ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడం వల్ల మన దేశంలో మధ్య వయసుల వారు స్ట్రోక్‌కు గురవ్వడం పెరుగుతోంది. కేజీహెచ్‌కు రోజుకు సగటున ఆరు కేసులు వస్తుంటాయి. – డాక్టర్ జి.బుచ్చిరాజు, న్యూరాలజీ విభాగాధిపతి, విశాఖ ఆంధ్ర మెడికల్ కళాశాల మూడు గంటల్లోపు ఆస్పత్రికి వస్తే.. గుంటూరు జీజీహెచ్‌లో ప్రత్యేకంగా స్ట్రోక్ యూనిట్ ఉంది. గతేడాది 614 మంది, ఈ ఏడాది ఇప్పటి వరకూ 416 మంది స్ట్రోక్ బాధితులకు చికిత్స అందించాం. ఈ ఏడాది కరోనా చికిత్స కారణంగా మే నెలలో అడ్మిషన్లు లేవు. కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా చికిత్స ఉంటుంది. స్ట్రోక్ వచ్చిన మూడు గంటల్లోపు రోగిని ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తే వైకల్యం లేకుండా చేయవచ్చు. – డాక్టర్ కె. సుందరాచారి, న్యూరాలజీ విభాగాధిపతి, గుంటూరు మెడికల్ కళాశాల -
4 ఏళ్ల నరకయాతన.. 3 రోజుల్లో విముక్తి
సాక్షి, అమరావతి: నాలుగేళ్ల నరకయాతనకు గుంటూరు జీజీహెచ్ వైద్యులు మూడు రోజుల్లో విముక్తి కల్పించారు. 10 లక్షల మందిలో ఒకరికి అరుదుగా వచ్చే ‘స్టిఫ్ పర్సన్ సిండ్రోమ్’ రుగ్మతకు చికిత్స చేయించుకున్న రైతు కోలుకుని హాయిగా నడవగలిగే స్థితికి వచ్చాడు. వివరాలు.. ప్రకాశం జిల్లా మాచవరానికి చెందిన రైతు ఆర్.రమణయ్య కు 2017 నుంచి ఉన్నట్టుండి కండరాలు బిగుసుకుపోయే సమస్యతో బాధపడుతున్నాడు. ఒంగోలు, గుంటూరు, విజయవాడల్లోని కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్సలు తీసుకున్నా ఫలితం లేకపోవడంతో నాలుగేళ్లపాటు నరకయాతన అనుభవించాడు. వెళ్లిన ప్రతి ఆస్పత్రిలో సీటీ స్కాన్, ఎంఆర్ఐ, ఎక్సరే అంటూ శరీరంలోని ప్రతి అవయవాన్ని పరిశీలించారు. ఒకరు వెన్నెముకలో సమస్య ఉందని, మరొకరు నాడీ వ్యవస్థ సమస్య ఉందని.. అనేక రకాల మందులు రాసిచ్చి, ఫీజులు గుంజారే తప్ప ఎక్కడా నయం కాలేదు. నాలుగేళ్లలో సుమారు రూ.10 లక్షలను ఖర్చు చేసిన ఫలితం లేకపోయింది. చివరకు సెల్‌ఫోన్ రింగ్ వినిపించినా, చిన్న శబ్దమైనా అతడి కండరాలు అమాంతం బిగుసుకుపోయేవి. చివరి ప్రయత్నంగా గుంటూరు జీజీహెచ్‌కు ఈ ఏడాది సెప్టెంబర్ 6న రమణయ్యను కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. న్యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ సుందరాచారి.. రమణయ్య ‘స్టిఫ్ పర్సన్ సిండ్రోమ్’ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్టు నిర్ధారిచారు. 3 రోజుల చికిత్స అందించిన అనంతరం రమణయ్య స్వతహాగా లేచి నడవడం ప్రారంభించాడు. -
Guntur: జీజీహెచ్‌లో పసికందు కిడ్నాప్
గుంటూరు (ఈస్ట్): గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రి (జీజీహెచ్)లో మూడు రోజుల మగ శిశువు అపహరణకు గురయ్యాడు. రంగంలోకి దిగిన పోలీసులు సుమారు 7 గంటల్లోపే కేసును ఛేదించి శిశువును తల్లి ఒడికి చేర్చారు. శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. గుంటూరు జిల్లా పెదకాకానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ ఉప్పతల మహేష్ భార్య ప్రియాంకను ప్రసవ సమయం దగ్గర పడటంతో కుటుంబ సభ్యులు ఈ నెల 11వ తేదీన జీజీహెచ్‌లో చేర్పించారు. ప్రియాంక ఈ నెల 13న మగ శిశువుకు జన్మనిచ్చింది. ఈ నెల 15వ తేదీన అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో మహేష్ తల్లి ఏసుకుమారి వార్డులో కోడలి పొత్తిళ్లలో ఉన్న శిశువు ఏడుస్తుండటంతో ఎత్తుకుని వార్డు బయటకు తీసుకొచ్చింది. కొద్దిసేపటి తరువాత ఆ పసికందును ప్రియాంక తల్లి పార్వతమ్మ వద్ద ఉంచి బాత్రూమ్కు వెళ్లింది. కొద్దిసేపటికే పార్వతమ్మ నిద్రలోకి జారుకోగా.. బాత్రూమ్ నుంచి తిరిగొచ్చిన ఏసుకుమారికి పసికందు కనిపించలేదు. వెంటనే సెక్యూరిటీ సిబ్బంది సహాయంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా.. కొత్తపేట ఎస్‌హెచ్‌వో శ్రీనివాసులురెడ్డి పోలీసు బృందాల్ని రంగంలోకి దింపి గాలింపు చర్యలు చేపట్టారు. ఆస్పత్రిలోని సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా నిందితులు రైల్వేస్టేషన్ వైపు ఉన్న మెయిన్ గేటు నుంచి బయటకు చేరుకుని ఆటో ఎక్కి వెళ్లిపోయినట్టు గుర్తించారు. ఆటో ఎటు వెళ్లిందో కూపీ లాగిన పోలీసులు చివరకు ఆటో డ్రైవర్‌ను గుర్తించి అతడి సహాయంతో నిందితుల ఇంటికి వెళ్లారు. నిందితులు గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం యనమదలకు చెందిన హేమవర్ణుడు, రెడ్డి పద్మజలను అరెస్ట్ చేసి పసికందును తల్లి ఒడికి చేర్చారు. మగ శిశువును అపహరించి విక్రయిస్తే భారీగా సొమ్ము సంపాదించవచ్చని భావించిన హేమవర్ణుడు పథకం ప్రకారం పద్మజతో కలిసి ఈ కిడ్నాప్‌కు పాల్పడినట్లు పోలీసులు తేల్చారు. -
జీజీహెచ్‌లో కిడ్నాప్‌కు గురైన బాలుడు సురక్షితం
సాక్షి, గుంటూరు: గుంటూరు జిల్లాలోని జీజీహెచ్ ఆస్పత్రిలో కిడ్నాపైన పసికందు సురక్షితంగా ఉన్నాడు. బాలుడిని కిడ్నాప్ చేసిన నిందితులను పోలీసులు పట్టుకున్నారు. నెహ్రూనగర్‌లో నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసులు పసికందును తల్లిదండ్రులకు అప్పగించారు. గుంటూరు జీజీహెచ్‌లో శనివారం తెల్లవారుజామున మూడున్నర గంటల సమయంలో..4 రోజుల పసికందును కిడ్నాప్ చేశారు. అయితే, కొద్ది గంటల్లో శిశువు ఆచూకీ లభించింది. అక్కడ వార్డు బాయ్ మరో మహిళతో కలిసి పసికందును అపహరించినట్టు పోలీస్ విచారణలో వెల్లడయ్యింది. పసికందు అపహరణకు గురైన కొద్ది గంటల్లోనే కేసును ఛేదించిన పోలీసులు.. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. -
శవమే శివం.. భోజనం 2 పూటలే.. శుభకార్యాలకు దూరం
కర్నూలు(హాస్పిటల్): ఫోరెన్సిక్ విభాగం అంటే పోలీసులు, వైద్యులు, మీడియా, కొద్దిగా ఉన్నత విద్యావంతులకు మినహా మిగిలిన వారికి పెద్దగా పరిచయం లేని ప్రాంతం. అయితే మార్చురి అంటే దాదాపుగా అందరికీ పరిచయమే. దాని పేరు చెబితేనే...ఆ శవాల గదా..అని ముఖం చిట్లిస్తారు. మరికొందరు అటువైపు వెళ్లాలంటేనే దెయ్యాలంటాయని భయపడతారు. మరికొందరు అక్కడి దుర్వాసనను తట్టుకోలేక అటువైపు వెళ్లాలంటే జంకుతారు. తప్పనిసరైన పరిస్థితుల్లో అక్కడికి వెళ్లే వివిధ వర్గాల ప్రజలు ఇక్కడ నుంచి ఎప్పుడెప్పుడు బయటపడతామా అని ఆలోచిస్తుంటారు. ఇలాంటి ప్రాంతంలో అక్కడే విధులు నిర్వహించే వైద్యులు, సిబ్బంది పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచిస్తే ఒళ్లు జలదరిస్తుంది. కాస్త లోతుగా ఆలోచిస్తే అయ్యోపాపం అనిపిస్తుంది. వారి జీవితం దయనీయంగా ఉంటుంది. కర్నూలు మెడికల్ కాలేజి 1954లో స్థాపించారు. కాలేజి ఆవిర్భావంతోనే ఫోరెన్సిక్ విభాగం కూడా ఏర్పడింది. ప్రస్తుతం ఈ విభాగంలో ఇద్దరు ప్రొఫెసర్లు డాక్టర్ ఆర్. శంకర్(హెచ్‌వోడి), డాక్టర్ పి. బ్రహ్మాజీ మాస్టర్, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ వి. రాజశేఖర్, సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వైకేసి రంగయ్య, మరో నలుగురు కన్సాలిడేట్ పే అసిస్టెంట్ వైద్యులు, ఇద్దరు పీజీ వైద్య విద్యార్థులు పనిచేస్తున్నారు. మరో నాలుగు ట్యూటర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ విభాగానికి సంబంధించి మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించే గది కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఉంది. ఇక్కడికి చికిత్సకు కర్నూలు జిల్లాతో పాటు పక్కనున్న ప్రకాశం, చిత్తూరు, వైఎస్ఆర్ కడప జిల్లా, అనంతపురం, తెలంగాణాలోని మహబూబ్‌నగర్, గద్వాల, వనపర్తి, కర్నాటకలోని బళ్లారి, రాయచూరు జిల్లాల నుంచి ప్రజలు వస్తుంటారు. దీనికితోడు ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి పనిచేస్తూ రోడ్డు ప్రమాదాలు, ఇతర ప్రమాదాలు, ఆత్మహత్యల వల్ల మరణించిన వారి కేసులూ ఉంటాయి. ఈ మేరకు ప్రతిరోజూ సగటున మూడు నుంచి ఐదు, నెలకు 120 దాకా, ఏటా 1200 నుంచి 1500ల దాకా మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహిస్తారు. టిఫిన్ చేసి వస్తే మళ్లీ రాత్రి భోజనమే ఇక్కడ ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇక్కడ మృతదేహాలకు వైద్యులు పోస్టుమార్టం నిర్వహిస్తారు. దీంతో పాటు సెలవు రోజుల్లోనూ మధ్యాహ్నం 1 గంటల వరకు పోస్టుమార్టం చేస్తారు. ఈ మేరకు మొత్తం మృతదేహాలకు పోస్టుమార్టం ముగిశాకే వారు భోజనం చేయాల్సి వస్తోంది. అంటే రోజూ 4 నుంచి 5 గంటల తర్వాతే ఇంటికి వెళ్లి స్నానం చేసిన తర్వాతే భోజనం చేస్తున్నారు. అప్పటి వరకు ఎలాంటి ఆహారం తీసుకోవడానికి వీలుండదు. ఈ కారణంగా వారు ఉదయం టిఫిన్ చేసిన తర్వాత మళ్లీ రాత్రి భోజనంకు మాత్రమే పరిమితమయ్యారు. పురుగులు పట్టినా చూడాల్సిందే.. పోస్టుమార్టం చేసే సమయంలో కొన్ని మృతదేహాలు కుళ్లిపోయి పురుగులు పట్టి ఉంటాయి. ఇలాంటి దృశ్యాలు చూస్తే సామాన్య ప్రజలు జడుసుకుంటారు. కానీ ఫోరెన్సిక్ వైద్యులు, సిబ్బంది మాత్రం వృత్తిధర్మంగా భావించి దుర్వాసనను భరిస్తూ విధులు నిర్వహిస్తారు. ఒక్కోసారి మృతదేహాలను కోసే సమయంలో లీటర్ల కొద్దీ రక్తాన్ని జగ్గుతో తోడిపోయడం వంటి దృశ్యాలను చూస్తూ రిపోర్ట్ రాసుకోవాల్సిందే. ఇలాంటి వాతావరణంలో నుంచి ఇంటికి వెళ్లినా మార్చురి తాలూకు దుర్వాసన శరీరంపై వస్తూనే ఉంటుంది. దీనికితోడు పోస్టుమార్టంకు సంబంధించిన కొన్ని ఫోటోలు ఒక్కోసారి ఇంట్లోనూ పరిశీలిస్తూ కేసును ఛేదించాల్సిన పరిస్థితి వైద్యులది. పోస్టుమార్టం ఎలా చేస్తారంటే...! శవాన్ని ముందుగా నీటితో కడుగుతారు. ముఖాన్ని స్పాంజ్‌తో తుడుస్తారు. శవాన్ని కోశాక మరణానికి కారణాలను గుర్తించేందుకు తమ పరిశోధన కొనసాగిస్తారు. ఏదైనా క్రిమిసంహారక మందు తాగి/తాగించి చనిపోయిన వారి మృతదేహాలకైతే ముందుగా జీర్ణాశయం, 500 గ్రాముల లివర్, 30 సెంటీమీటర్ల చిన్నపేగుల, రెండు కిడ్నీల్లో సగం సగం తీసి ఫోరెన్సిక్ ల్యాబోరేటరికి పంపిస్తారు. ఆ తర్వాత మృతదేహాన్ని కుట్టేసి కుటుంబీకులకు అప్పగిస్తారు. ►నీటిలో మునిగి చనిపోయి ఉంటే తనే నీటిలో పడ్డాడా, ఎవ్వరైనా కొట్టి నీటిలో పారవేశారా, లేక మూర్చవ్యాధితో నీటిలో పడ్డారా అని పోస్టుమార్టంలో తెలుస్తుంది. ►ఇటీవల ఓ వ్యక్తి విద్యుత్ షాక్‌తో చనిపోవడంతో మార్చురికి తీసుకొచ్చారు. అతనికి పొట్టలో పేగులు బయటకు రావడంతో పొడిచి చంపారని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోస్టుమార్టం అనంతరం అతను విద్యుత్ షాక్‌తోనే చనిపోయాడని, విద్యుదాఘాతం వల్లే అతని పొట్టలో పేగులు బయటపడ్డాయని నిర్దారించారు. ►ఇటీవల ఓ యువకుడు రోడ్డు ప్రమాదానికి గురై మరణించాడు. కానీ అతన్ని బండరాయితో స్నేహితులు కొట్టి చంపారని కుటుంబసభ్యులు కేసు పెట్టారు. అతను రోడ్డు ప్రమాదంలోనే మృతి చెందాడని పోస్టుమార్టంలో నిర్దారణ అయ్యింది. మాసం పోస్ట్‌మార్టం ఎగ్జామినేషన్ ఏజ్ డిటర్నినేషన్ సెక్సువల్ అఫెన్సెస్ ఎక్స్పర్ట్ ఒపీనియన్స్ జనవరి 123 05 11 12 ఫిబ్రవరి 141 03 03 09 మార్చి 118 02 04 07 ఏప్రిల్ 123 06 03 11 మే 129 02 05 05 జూన్ 106 04 08 04 మొత్తం 740 22 34 47 2020లో వివిధ రకాల సెక్షన్లలో కేసులు సెక్షన్లు సంఖ్య 304(ఎ) రోడ్డు ప్రమాదాలు 394 174 సీఆర్పీసీ ఆత్మహత్యలు 694 302(ఎ)హత్యలు 15 318(ఎ)అనుమానస్పద మరణాలు 01 498(ఎ), 306 వేదింపుల కారణంగా మహిళల ఆత్మహత్యలు 04 306 ఐపీసీ ఆత్మహత్యకు ప్రేరేపించడం వల్ల మరణాలు 15 307(ఎ) హత్యాయత్నం 01 నాన్ వెజ్ తినడం మానేశాను –డాక్టర్ ఆర్. శంకర్, ఫోరెన్సిక్ హెచ్‌వోడి, కేఎంసీ ఫోరెన్సిక్లో పనిచేస్తున్నప్పటి నుంచి నేను నాన్‌వెజ్ తినలేక మానేశాను. నాన్‌వెజ్ తిందామని కూర్చున్నా ప్లేట్లో మాంసం ముక్కలు చూడగానే మార్చురిలో శవానికి కోసిన శరీర భాగాలు గుర్తుకు వస్తాయి. దీంతో నాన్ వెజ్ అంటేనే విరక్తి కలిగింది. మార్చురిలోని దుర్వాసన మా శరీరానికి అంటుకుపోతుంది. స్నానం చేసినా కూడా దుర్వాసన భావన మనసులోనే ఉంటుంది. వివాహాది శుభకార్యాలకు వెళ్లడం మానేశాం. సమాజంలో అందరినీ కలవలేని పరిస్థితి. ఇల్లు, ఉద్యోగమే జీవితం. కొన్నిసార్లు కుటుంబసభ్యులకూ దూరంగా ఉండాల్సిన పరిస్థితి. మెడికో లీగల్ కేసుల్లో మేమిచ్చే నివేదికలే ఆధారం కాబట్టి మా జీవితం ఇలా అలవాటు పడాల్సి వచ్చింది. -
28 రోజుల్లో వంద పడకల ఆస్పత్రి పూర్తి!
ఒంగోలు టౌన్: ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో కేవలం 28 రోజుల్లో రాష్ట్రంలోనే తొలిసారిగా 100 పడకల ఫ్యాబ్రికేటెడ్ మెటీరియల్ ఆస్పత్రిని నిర్మించారు. జీజీహెచ్ ఆవరణలో ఇండో–అమెరికన్ ఫౌండేషన్ సహకారంతో నిర్మిస్తున్న ఈ ఆస్పత్రి కోసం రూ.3.50 కోట్ల వ్యయం చేస్తున్నారు. ఆస్పత్రి పనులు చివరి దశకు చేరుకున్నాయి. వారం పదిరోజుల్లో దీన్ని ప్రారంభించేలా అధికారులు చర్యలు చేపట్టారు. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా భూమి పూజ జరిగింది. ఇది వినియోగంలోకి వచ్చిన తర్వాత 10 నుంచి 15 ఏళ్ల వరకు ఎలాంటి ఆటంకం లేకుండా వీటి నిర్మాణాలు ఉంటాయని ఏపీఎస్ఎంఐడీసీ ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. పూర్తిగా కోవిడ్ కేసులకే.. ఆస్పత్రిని పూర్తిగా కోవిడ్ కేసులు చూసేలా వైద్యాధికారులు చర్యలు చేపట్టారు. కోవిడ్ థర్డ్ వేవ్ హెచ్చరికలు వస్తున్న నేపథ్యంలో ఈ ఆస్పత్రిని అందుబాటులోకి తీసుకురానున్నారు. మొత్తం 11 బ్లాక్‌లను ఏర్పాటు చేశారు. ఒక బ్లాక్ ఓపీకి, మరొక బ్లాక్ డ్యూటీ డాక్టర్స్ ఉండేందుకు కేటాయించగా, మిగిలిన 9 బ్లాక్‌లను కోవిడ్ బాధితులకు చికిత్స అందించేందుకు సిద్ధం చేస్తున్నారు. ఇందులో 8 ఐసీయూ పడకలు ఉండగా, మిగిలినవన్నీ నాన్ ఐసీయూ కింద ఆక్సిజన్ పడకలతో సిద్ధం చేస్తున్నారు. అన్ని వసతులతో.. ఇక్కడ బ్లాక్‌లోనే రోగులకు వసతులు సమకూర్చడం విశేషం. ఒక్కో బ్లాక్‌లో 13 మంది వైద్య సేవలు పొందేలా వాటిని డిజైన్ చేశారు. ప్రతి పడక వద్ద సీలింగ్ ఫ్యాన్ ఉంటుంది. అందులోనే బాత్రూమ్స్, టాయిలెట్స్‌ను అమర్చారు. జీజీహెచ్ తరఫున సిమెంట్ ప్లాట్‌ఫాం ఏర్పాటు చేశారు. విద్యుత్, నీటి సౌకర్యం కల్పించారు. ఇక మిగిలినదంతా ఇండో–అమెరికన్ ఫౌండేషనే చూసుకుంటుంది. జిల్లా ప్రజలకు ఎంతో ఉపయోగం ఈ ఆస్పత్రి వల్ల జిల్లా ప్రజలకు ఎంతో ఉపయోగం కలుగుతుంది. కోవిడ్ మొదటి దశలో జీజీహెచ్‌లోని అన్ని పడకలనూ దానికే కేటాయించారు. ప్రస్తుతం సెకండ్, థర్డ్ ఫ్లోర్లు కోవిడ్ బాధితులకు కేటాయించాం. కోవిడ్ బాధితులు ఉండటంతో సాధారణ రోగులు భయపడుతున్నారు. 100 పడకల ఆస్పత్రి వినియోగంలోకి వచ్చిన వెంటనే జీజీహెచ్‌లోని కోవిడ్ బాధితులను ఇక్కడికి తరలించి చికిత్స అందిస్తాం. కోవిడ్ పూర్తిగా తగ్గుముఖం పట్టిన తర్వాత ఆ 100 పడకలను నాన్ కోవిడ్ కిందకు మార్చి వైద్య సేవలు అందేలా చూస్తాం. – జీజీహెచ్ సూపరింటెండెంట్ శ్రీరాములు -
గుంటూరు జీజీహెచ్ వద్ద టీడీపీ హైడ్రామా
-
108లో నలుగురి జననం
మాకవరపాలెం/గూడెంకొత్తవీధి/రౌతులపూడి: 108 వాహనాల్లో బుధవారం నలుగురు చిన్నారులు జన్మించారు. మూడో చోట్ల జరిగిన ఈ ఘటనల్లో ఓ తల్లి కవలలకు జన్మనివ్వడం విశేషం. విశాఖ జిల్లా మాకవరపాలెం మండలం మామిడిపాలేనికి చెందిన భవానికి బుధవారం పురిటినొప్పులొచ్చాయి. కుటుంబ సభ్యులు 108కి సమాచారం ఇవ్వగా సిబ్బంది వచ్చి గర్భిణిని నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తీసుకెళుతున్నారు. అయితే మార్గం మధ్యలోనే ప్రసవమై మగబిడ్డకు జన్మనిచ్చిందని 108 సిబ్బంది వినీత, మురళి తెలిపారు. అలాగే చింతపల్లి మండలం చెరపల్లికి చెందిన దేవూరు సుమలతకు పురిటి నొప్పులు రావడంతో 108కి సమాచారం ఇచ్చారు. సిబ్బంది వచ్చి ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా నొప్పులు తీవ్రమయ్యాయి. దీంతో 108 సిబ్బంది వాహనంలోనే ఆమెకు ప్రసవం చేశారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నట్టు సిబ్బంది రాజు, రెహమాన్‌లు చెప్పారు. గర్భిణికి సుఖప్రసవం.. కవలల జననం తూర్పుగోదావరి జిల్లా శంఖవరానికి చెందిన శివకోటి అనంతలక్ష్మికి పురిటి నొప్పులు రావడంతో మంగళవారం రౌతులపూడి సీహెచ్‌సీకి తీసుకెళ్లారు. అయితే పరిస్థితి కొద్దిగా ఆందోళనకరంగా ఉందని అక్కడి డాక్టర్.. కాకినాడ జీజీహెచ్‌కు తరలించాలని సూచించారు. దీంతో కుటుంబ సభ్యులు బుధవారం తెల్లవారుజామున 108లో ఆమెను తరలిస్తుండగా వాహనంలోనే కవలలు(ఆడ, మగ)కు జన్మనిచ్చింది. ఆ తర్వాత తల్లీబిడ్డలను జీజీహెచ్‌కు తరలించారు. -
బాలికపై లైంగిక దాడి
రాజుపాలెం(సత్తెనపల్లి)/నరసరావుపేట: ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు. గుంటూరుకు చెందిన దంపతులు తమ కుమార్తె(16)తో కలిసి ఓ కార్యక్రమం నిమిత్తం రాజుపాలెం వచ్చారు. బుధవారం ఇంటి వద్ద ఒంటరిగా ఉన్న బాలికను ఇద్దరు యువకులు పక్కింట్లోకి లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. ఒంటిపై గాయాలతో బాలిక ఇంటికి చేరుకోవడంతో తల్లిదండ్రులు బాలికతో గుంటూరు వెళ్లిపోయారు. బాధితురాలి తరఫున అందిన ఫిర్యాదు మేరకు అనుమానితులుగా గల్లా లావాను, మేరుగ సంజీవ్‌ను బుధవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితురాలిని ప్రశ్నించగా.. తనపై ఒక్కరే లైంగికదాడి చేసినట్టు తెలిపిందని దిశ రూరల్ డీఎస్పీ రవిచంద్ర చెప్పారు. -
అత్యాచార బాధితురాలికి ప్రభుత్వ అండ
గుంటూరు మెడికల్: గుంటూరు జిల్లా రొంపిచర్లలో దివ్యాంగురాలిపై జరిగిన అత్యాచారం ఘటన సభ్యసమాజం తలదించుకునేలా ఉందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. గురువారం ఆమె మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనితతో కలిసి గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న దివ్యాంగురాలైన అత్యాచార బాధితురాలిని, మరో ఘటనలో అత్యాచారానికి గురైన ఏడునెలల పసికందు కుటుంబాన్ని పరామర్శించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు దివ్యాంగురాలి కుటుంబానికి రూ. 5లక్షల చెక్కును అందజేశారు. అనంతరం హోంమంత్రి సుచరిత మీడియాతో మాట్లాడుతూ .. దివ్యాంగురాలిపై అత్యాచారం చేసిన నిందితులను ‘దిశ’ చట్టం ద్వారా కఠినంగా శిక్షిస్తామన్నారు. దివ్యాంగురాలి సోదరుడికి సైతం అవుట్‌సోర్సింగ్‌లో ఉద్యోగం ఇస్తామని వెల్లడించారు. రాష్ట్ర మహిళ అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. బాధితురాలి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే షేక్ మొహమ్మద్ ముస్తఫా, నగరపాలక సంస్థ మేయర్ కావటి శివనాగ మనోహర్‌నాయుడు, కలెక్టర్ వివేక్ యాదవ్, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ నీలం ప్రభావతి పాల్గొన్నారు. -
నెల్లూరు జీజీహెచ్ సూపరింటెండెంట్‌గా సి.రాధాకృష్ణ
సాక్షి, నెల్లూరు: లైంగిక వేధింపుల ఘటనలో నెల్లూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ బాధ్యతల నుంచి ప్రభాకర్‌ను తొలగించిన సంగతి తెలిసిందే. ఆ స్థానంలో ప్రభుత్వం సి.రాధాకృష్ణను సూపరింటెండెంట్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఈ ఘటనపై విచారణ కోసం ప్రభుత్వం వేసిన రెండు కమిటీలు ప్రభుత్వానికి నివేదిక సమర్పించాయి. ఏసీఎస్ఆర్ మెడికల్ కాలేజీలో ఈ రెండు కమిటీలు విచారణ చేశాయి. అలానే డీఎంఈ త్రిసభ్య కమిటీ, డిస్ట్రిక్ట్ త్రిసభ్య కమిటీలు కూడా ఈ ఘటనపై విచారణ చేశాయి. చదవండి: నెల్లూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభాకర్‌పై వేటు -
నెల్లూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభాకర్‌పై వేటు
సాక్షి, నెల్లూరు: లైంగిక వేధింపుల ఘటనలో నెల్లూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ బాధ్యతల నుంచి ప్రభాకర్‌ను తొలగించారు. తిరుపతి రుయా ఆసుపత్రికి ఆయనను బదిలీ చేశారు. కాగా జీజీహెచ్ ఘటనపై రెండు కమిటీలు విచారణ చేపట్టిన సంగతి విదితమే. డీఎంఈ త్రిసభ్య కమిటీ, డిస్ట్రిక్ట్ త్రిసభ్య కమిటీలు లైంగిక వేధింపుల ఘటనపై లోతుగా దర్యాప్తు చేశాయి. ఈ క్రమంలో ప్రభుత్వానికి నివేదిక సమర్పించగా.. ఆయనను నెల్లూరు జీజీహెచ్ బాధ్యతల నుంచి తొలగించారు. కాగా, ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయిన సంగతి తెలిసిందే. లైంగిక వేధింపులపై మహిళా కమిషన్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. సూపరింటెండెంట్ లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణ జరిపి పూర్తి నివేదిక ఇవ్వాలని మంత్రి ఆళ్ల నాని శుక్రవారం ఆదేశించారు. విచారణ చేపట్టిన రెండు కమిటీలు.. ప్రభుత్వానికి నివేదిక సమర్పించాయి. చదవండి: టెన్త్ పరీక్షలు రద్దు చేయం: మంత్రి సురేష్ విమర్శలు చేయడమే పనిగా పెట్టుకోవద్దు: టీటీడీ ఈవో -
నెల్లూరు జీజీహెచ్ ఘటనపై ప్రభుత్వం సీరియస్
-
ఒంటిపై గాయాలేవీ లేవు
సాక్షి, అమరావతి: వర్గాలు, కులాల మధ్య చిచ్చుపెట్టేలా మాట్లాడటంతో పాటు, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించినందుకు తనను అరెస్ట్ చేసిన సీఐడీ పోలీసులు తనను కస్టడీలో తీవ్రంగా కొట్టారంటూ నర్సాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని తేలిపోయింది. ఆయన ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని హైకోర్టు ఏర్పాటు చేసిన గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి (జీజీహెచ్) సూపరింటెండెంట్ నేతృత్వంలోని మెడికల్ బోర్డు ఆదివారం హైకోర్టుకు సీల్డ్ కవర్లో నివేదిక ఇచ్చింది. గాయాలున్నాయనేందుకు ఎలాంటి ఆధారాలు లేవంది. కాళ్లలో నీరు చేరిందని (ఎడెమా), అందుకే కాళ్లు రంగు మారి కనిపిస్తున్నాయని హైకోర్టుకు వివరించింది. ఎక్కువ సేపు కూర్చున్నా, ప్రయాణించినా కాళ్లు రంగుమారుతాయని చెప్పింది. 2020 నవంబర్ 30న తనకు బైపాస్ సర్జరీ అయిందని, గుండె నొప్పిగా ఉందని రఘురామ చెప్పడంతో వెంటనే కార్డియాలజిస్ట్‌ను పిలిపించామంది. కార్డియాలజిస్ట్ పరిశీలించి, ప్రస్తుతం గుండెకు ఎలాంటి ముప్పు లేదని, ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని చెప్పారని మెడికల్ బోర్డు తన నివేదికలో పేర్కొంది. న్యూరాలజీ, నెఫ్రాలజీ వైద్యులు సైతం రఘురామ ఆరోగ్యం స్థిరంగా ఉందనే చెప్పారని బోర్డు తన నివేదికలో వివరించింది. కొట్టడం వల్ల ఎలాంటి గాయాలు కాలేదని బోర్డు తన నివేదికలో తేల్చి చెప్పింది. ఆయనకు కలర్ డాప్లర్, ఈసీజీ, రక్త పరీక్షలన్నీ చేశామని, అన్నీ పరీక్షల ఫలితాలు సాధారణ స్థితిలో ఉన్నాయని తెలిపింది. ఈ మేరకు మెడికల్ బోర్డు నివేదికను హైకోర్టు న్యాయమూర్తులు చదివి వినిపించారు. బోర్డు చైర్మన్ అయిన జీజీహెచ్ సూపరింటెండెంట్‌తో సహా మిగిలిన డాక్టర్లు కూడా వేర్వేరుగా ఒక రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని తెలిపింది. ఈ నివేదికను హైకోర్టు రిజిస్ట్రీ నుంచి పొందే వెసులుబాటును ఇరుపక్షాలకు ఇచ్చింది. రమేశ్ ఆస్పత్రికి పంపలేం.. మేజిస్ట్రేట్ ఇచ్చిన ఆదేశాల మేరకు రఘురామను గాయాల పరిశీలన నిమిత్తం రమేశ్ ఆసుపత్రికి తరలించాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. దీనిపై సీఐడీ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి తీవ్ర అభ్యంతరం తెలిపారు. రమేశ్ ఆస్పత్రికి పంపడం అంటే టీడీపీ ఆఫీసుకి పంపడమేనన్నారు. అగ్ని ప్రమాదం వల్ల పలువురు కోవిడ్ రోగులు మృతి చెందడానికి కారణమైన రమేశ్ ఆస్పత్రిపై రాష్ట్ర ప్రభుత్వం కేసు నమోదు చేసిందని ఆయన వివరించారు. దీంతో రమేశ్ ఆసుపత్రి యాజమాన్యం ప్రభుత్వంపై కక్ష కట్టి ఉందని, అందువల్ల ఆ ఆస్పత్రికి పంపడానికి తమకు అభ్యంతరం ఉందని తెలిపారు. రమేశ్ ఆసుపత్రికి పంపితే నిష్పాక్షిక నివేదిక వచ్చే అవకాశం ఉండదన్నారు. అంతేకాక రఘురామ గాయాల పరిశీలనకు హైకోర్టు మెడికల్ బోర్డును ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఆయన్ను రమేశ్ ఆసుపత్రికి పంపాలన్న ఉత్తర్వులను సవరించాలని కోరుతూ మేజిస్ట్రేట్ ముందు ఇప్పటికే పిటిషన్ దాఖలు చేశామని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కాబట్టి ఆయన్ను రమేశ్ ఆస్పత్రికి పంపాల్సిన అవసరం లేదన్నారు. దీనిపై దర్మాసనం స్పందిస్తూ ఆ ఉత్తర్వులను సవాలు చేయడం గానీ, వాటిపై స్టే గానీ లేనందున, అవి అమల్లో ఉన్నాయని తెలిపింది. అందువల్ల వాటిని అమలు చేయాల్సిందేనని సీఐడీ అధికారులకు తేల్చి చెప్పింది. మేజిస్ట్రేట్ ఉత్తర్వుల అమలును రేపటి వరకైనా నిలుపుదల చేయాలని పొన్నవోలు కోరగా, ధర్మాసనం ఆ అభ్యర్థనను సైతం తోసిపుచ్చింది. మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు రఘురామను రమేశ్ ఆసుపత్రికి తీసుకెళ్లాలని న్యాయమూర్తులు జస్టిస్ ప్రవీణ్‌కుమార్, జస్టిస్ కన్నెగంటి లలితలతో కూడిన ధర్మాసనం ఆదివారం రాత్రి ఉత్తర్వులిస్తూ తదుపరి విచారణను ఈనెల 19కి వాయిదా వేసింది. ఆస్పత్రికి తీసుకెళ్లమంటే జైలుకు తీసుకెళ్లారు.. ► అంతకు ముందు రఘురామకృష్ణరాజు తరఫు సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ, తనను కొట్టారన్న రఘురామ వాంగ్మూలాన్ని రికార్డ్ చేసిన మేజిస్ట్రేట్ అతన్ని గుంటూరు ప్రభుత్వాస్పత్రితో పాటు రమేశ్ ఆసుపత్రికి సైతం తీసుకెళ్లాలని పోలీసు అధికారులకు ఆదేశాలిచ్చారని తెలిపారు. ► అయితే ఈ ఆదేశాలను అమలు చేయకుండా అధికారులు రఘురామను జైలుకు తరలించారని చెప్పారు. హైకోర్టు మెడికల్ బోర్డు ఏర్పాటు చేసిన నేపథ్యంలో రమేశ్ ఆసుపత్రికి తరలించాల్సిన అవసరం లేదని పోలీసులు చెబుతున్నారన్నారు. మేజిస్ట్రేట్ ఉత్తర్వుల కంటే హైకోర్టు ఉత్తర్వులే అమల్లో ఉంటాయని వక్రభాష్యం చెబుతున్నారని తెలిపారు. సుప్రీంకోర్టులో ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్ సాక్షి, న్యూఢిల్లీ: ఎంపీ రఘురామ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడడంతో ఏపీ సీఐడీ ఆయన్ను అరెస్టు చేసిన విషయం విదితమే. బెయిలు కోరుతూ ఏపీ హైకోర్టును ఆశ్రయించిన ఆయనకు అక్కడ చుక్కెదురైంది. దీంతో హైకోర్టు ఆదేశాలు సవాల్ చేస్తూ బెయిల్ ఇవ్వాలంటూ సుప్రీంను ఆశ్రయించారు. బెయిల్ కారణాలను హైకోర్టు పరిశీలించలేదని, సెషన్స్ కోర్టును ఆశ్రయించాలని సూచించిందని పిటిషన్లో పేర్కొన్నారు. పోలీసులు తనను కొట్టారంటూ పిటిషన్లో ఆరోపించారు. ఆ ఉత్తర్వులను సవరిస్తామని మేజిస్ట్రేట్ చెప్పారు.. ► దీనిపై ఏం చెబుతారని అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డిని ధర్మాసనం ప్రశ్నించింది. హైకోర్టు మెడికల్ బోర్డు ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత ఆ విషయాన్ని రాత్రి 8.30 గంటల సమయంలో మేజిస్ట్రేట్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. మేజిస్ట్రేట్ హైకోర్టు ఉత్తర్వుల కాపీ కావాలని కోరడంతో, హైకోర్టు ఉత్తర్వుల అధికారిక కాపీని ఆదివారం ఉదయం పంపామన్నారు. ఆ ఉత్తర్వులను చూసి రఘురామను రమేశ్ ఆసుపత్రికి పంపాలన్న ఉత్తర్వులను సవరిస్తామని మేజిస్ట్రేట్ చెప్పారని తెలిపారు. సవరణ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉందన్నారు. ► జస్టిస్ లలిత స్పందిస్తూ, ఉత్తర్వులను మేజిస్ట్రేట్ సవరిస్తారన్న ఊహతో రఘురామను ఎలా జైలుకు తరలిస్తారని ప్రశ్నించారు. ఆ ఉత్తర్వులపై సందిగ్ధత ఉంటే తమ దృష్టికి ఆ విషయాన్ని తీసుకొచ్చి స్పష్టత తీసుకుని ఉండాల్సిందన్నారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకల్లా నివేదిక ఇవ్వాలని మెడికల్ బోర్డును ఆదేశిస్తే, సాయంత్రం ఎప్పుడో నివేదిక వచ్చిందని, నివేదిక ఆలస్యం అవుతుందన్న కనీస సమాచారం కోర్టుకు ఇవ్వకపోవడం ఏమిటని జస్టిస్ లలిత ప్రశ్నించారు. జైలుకు తీసుకెళ్లడంపై నిషేధం లేదు ► పొన్నవోలు సుధాకర్‌రెడ్డి స్పందిస్తూ, మెడికల్ బోర్డును తాము సంప్రదించే పరిస్థితి లేదన్నారు. మెడికల్ బోర్డు నివేదిక ఎందుకు ఆలస్యం అయిందో తమకెలా తెలుస్తుందన్నారు. పలు వైద్య పరీక్షలు చేయాల్సి రావడంతో నివేదిక ఆలస్యం అయి ఉండొచ్చని చెప్పారు. ► రిమాండ్‌కు అనుమతినిస్తూ మేజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేసినప్పుడు నిందితుడైన రఘురామను జైలుకు తీసుకెళ్లడంపై ఎలాంటి నిషేధం లేదన్నారు. పైపెచ్చు మెడికల్ బోర్డును ఏర్పాటు చేస్తూ అధికరణ 226 కింద హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పారు. ► ఆదినారాయణరావు జోక్యం చేసుకుంటూ, జీజీహెచ్ సూపరింటెండెంట్ వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ నాయకుని భార్య అని తెలిపారు. జైల్లో రఘురామను హత్య చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందన్నారు. ఈ విషయాన్ని రికార్డ్ చేయాలని ధర్మాసనాన్ని కోరారు. ► ఈ ఆరోపణలపై అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి తీవ్రంగా స్పందిస్తూ వాటిలో అర్థం లేదన్నారు. ఆయన్ను చంపాలనుకుంటే జైల్లోనే ఎందుకు చంపాలనుకుంటుందని ప్రశ్నించారు. ఆదినారాయణరా>వు తీవ్ర స్వరంతో మాట్లాడుతుండటంతో పొన్నవోలు అభ్యంతరం తెలిపారు. మెడికల్ బోర్డును రఘురామ కోరితేనే హైకోర్టు ఏర్పాటు చేసిందన్నారు. ► సుధాకర్‌రెడ్డి కూడా తీవ్ర స్వరంతో మాట్లాడుతూ దీటుగా బదులిచ్చారు. కొద్దిసేపు ఇద్దరు న్యాయవాదులు వాదించుకున్నారు. దీంతో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ సంయమనం పాటించాలని కోరింది. ► మెడికల్ బోర్డు నివేదికపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదినారాయణరావుకు ధర్మాసనం స్పష్టం చేసింది. మెడికల్ బోర్డు నివేదికను తమకు అందజేసేలా చూడాలని ఆదినారాయణరావు కోరగా, రిజిస్ట్రీని ఆశ్రయించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. నేడు మేజిస్ట్రేట్ కోర్టు విచారణ.. ► రఘురామకృష్ణంరాజు తనను పోలీసులు కొట్టారని ఆరోపించిన నేపథ్యంలో ఆయనకు అయిన గాయాలను పరిశీలించేందుకు గుంటూరు ప్రభుత్వాసుపత్రితో పాటు రమేశ్ ఆసుపత్రికి తీసుకెళ్లాలన్న ఆదేశాలను సవరించాలంటూ మేజిస్ట్రేట్ కోర్టులో సీఐడీ సోమవారం ఉదయం పిటిషన్ దాఖలు చేయనుంది. ► పిటిషన్ సిద్ధం చేసినప్పటికీ ఆదివారం కావడంతో దాఖలు చేయలేకపోయింది. ఈ పిటిషన్‌పై మేజిస్ట్రేట్ సోమవారం విచారణ జరపనున్నారు. హైకోర్టు ఏకంగా మెడికల్ బోర్డు ఏర్పాటు చేసిన నేపథ్యంలో రఘురామకృష్ణంరాజును రమేశ్ ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిన అవసరం లేదని, ఆ ఉత్తర్వులను సవరించాలని సీఐడీ తన పిటిషన్లో కోరనుందని తెలిసింది. -
గ్రీన్ చానల్‌తో సకాలంలో ఆక్సిజన్ సరఫరా
సాక్షి, గుంటూరు: కరోనా రోగులకు కీలకంగా మారిన ఆక్సిజన్‌ను గ్రీన్ చానల్ ఏర్పాటు చేసి పోలీసులు సకాలంలో తెప్పించారు. వివరాల్లోకెళ్తే.. గుంటూరు జీజీహెచ్‌లో 800 పడకల్లో కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నారు. వీరితో పాటు సాధారణ రోగులు కూడా ఇక్కడ వందల సంఖ్యలో చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రికి విశాఖపట్నం నుంచి ఆక్సిజన్ సరఫరా అవుతుంటుంది. ఈ క్రమంలో ఆదివారం ఉదయం విశాఖపట్నం నుంచి 10 కిలోలీటర్ల సామర్థ్యం కలిగిన ఆక్సిజన్ ట్యాంకర్ బయల్దేరింది. ఇది సాయంత్రం నాలుగు గంటలకు గుంటూరు చేరుకోవాల్సి ఉంది. అయితే ఈ లోపే ఆక్సిజన్ కొరత ఏర్పడే ప్రమాదం ఉందని జీజీహెచ్ వైద్యులు గుర్తించారు. దీంతో ఆర్ఎంవో డాక్టర్ సతీష్ కొత్తపేట సీఐ రాజశేఖర్‌రెడ్డికి ఉదయం 11 గంటల ప్రాంతంలో విషయం తెలియజేశారు. ఆక్సిజన్ లోడ్‌తో వస్తున్న ట్యాంకర్ డ్రైవర్‌కు సీఐ ఫోన్ చేయగా ఏలూరుకు అవతల ఉన్నట్టు తెలిపాడు. దీంతో సీఐ ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన డీఐజీ త్రివిక్రమ వర్మ, ఎస్పీ ఆర్.ఎన్.అమ్మిరెడ్డి.. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ, విజయవాడ కమిషనర్ శ్రీనివాసులును, స్టేట్ కోవిడ్–19 కమాండ్ కంట్రోల్ రూమ్ అధికారులను అప్రమత్తం చేశారు. ఆక్సిజన్ ట్యాంకర్‌తో వస్తున్న లారీకి ఎక్కడ ట్రాఫిక్‌పరంగా ఇబ్బందులు తలెత్తకుండా హైవే పెట్రోలింగ్, పోలీస్ వాహనాలను పైలెట్‌గా ఉంచి గ్రీన్ చానల్ ఏర్పాటు చేశారు. దీంతో ఆక్సిజన్ ట్యాంకర్ చేరుకోవాల్సిన సమయం కంటే గంటన్నర ముందు అంటే మ«ధ్యాహ్నం 2.20 గంటలకే గుంటూరు జీజీహెచ్‌కు చేరుకుంది. దీంతో వైద్యులు ఊపిరి పీల్చుకున్నారు. -
రేపు వ్యాక్సిన్ ప్రక్రియను పరిశీలించనున్న సీఎం జగన్
సాక్షి, విజయవాడ: జీజీహెచ్‌లో రేపు(శనివారం) కోవిడ్ వ్యాక్సిన్ ప్రక్రియను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిశీలించనున్నారు. ఉదయం 11.30 గంటలకు జీజీహెచ్‌కు సీఎం రానున్నారు. రేపు వ్యాక్సినేషన్ ప్రక్రియను లైవ్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ కూడా పరిశీలించనున్నారు. శనివారం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 332 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. తొలి విడతలో రాష్ట్రంలో 3.83 లక్షల మంది వైద్య సిబ్బందికి వ్యాక్సిన్ వేయనున్నారు. విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో కోవిడ్ వ్యాక్సినేషన్ ఏర్పాట్లను కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ పరిశీలించారు. రేపు విశాఖ, విజయవాడలో వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రధాని మోదీ, సీఎం వైఎస్ జగన్ లైవ్‌లో వీక్షించనున్నారు. వైద్య సిబ్బంది, అధికారులతో ప్రధాని మోదీ మాట్లాడే అవకాశముంది. (చదవండి: గోపూజ మహోత్సవంలో సీఎం జగన్) -
గుంటూరు జీజీహెచ్‌లో అగ్నిప్రమాదం
గుంటూరు: గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో బుధవారం రాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కోవిడ్ ఐసీయూ వార్డులో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. కాగా ఐసీయూ వార్డులో ఉన్న పేషంట్లను మరొక వార్డుకు తరలించారు. షార్ట్ సర్య్కూట్ కారణంగానే ఈ మంటలు చెలరేగినట్లు తెలుస్తుంది. -
గుంటూరు జీజీహెచ్‌లో నిత్యాన్నదానం
అన్నం పరబ్రహ్మ స్వరూపం.. ఆకలితో ఉన్న వారికి పట్టెడన్నం పెట్టటానికి మించిన మంచిపనిలేదని లోకోక్తి. అన్నదానం మహాయజ్ఞంతో సమానమని చెబుతారు. అటువంటి మహాకార్యం గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో పురుడుపోసుకుంటోంది. ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న వారి సహాయకులకు జనవరి నుంచి రెండుపూటలా ఉచితంగా అన్నం పెట్టనున్నారు. ఇందుకు రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు సంకల్పించారు. ఈ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగటానికి కోటి రూపాయల విరాళం ప్రకటించారు. సాక్షి, గుంటూరు: గుంటూరులోని ప్రభుత్వ సమగ్ర వైద్యశాల (జీజీహెచ్) నైపుణ్యమైన వైద్యసేవలకు పెట్టింది పేరు. అవిభక్త కవలల శస్త్రచికిత్సల నుంచి గుండె శస్త్రచికిత్సల వరకు అనేక క్లిష్టమైన వైద్యసేవలను అందించిన ఘనత కలిగింది ఈ వైద్యశాల. రాష్ట్రంలోని 9 జిల్లాల నుంచి రోగులు ఈ ఆస్పత్రికి వస్తుంటారు. వీరిలో పేద, మధ్యతరగతి రోగులే అధికం. 1,500 మందికిపైగా రోగులు ఇన్ పేషెంట్లుగా చికిత్స పొందుతుంటారు. వీరికి ఒకరిద్దరు కుటుంబసభ్యులో, బంధువులో సహాయంగా ఉంటారు. సహాయంగా ఉండేవారి సంఖ్య 2,500 నుంచి మూడువేల వరకు ఉంటుంది. రోగులకు చికిత్స, భోజనం బాధ్యత ఆస్పత్రిదే. సహాయకులు మాత్రం సొంత డబ్బుతో తినాల్సిందే. ఉదయం టిఫిన్, రెండుçపూటలా భోజనానికి ఒక్కొక్కరికి రూ.200 వరకు ఖర్చవుతుంది. 3 వేల మంది సహాయకులు రోజుకు రూ.6 లక్షల భోజనానికే వెచ్చించాల్సి వస్తోంది. ఈ సహాయకుల్లో పలువురు చేతిలో డబ్బులేక పస్తులుంటున్నారు. ప్రస్తుతం పొగాకు వ్యాపారి పోలిశెట్టి సోమసుందరం రోజూ మధ్యాహ్నం 500 మందికి ఉచితంగా భోజనం పెడుతున్నారు. చలించిన మంత్రి కుటుంబసభ్యులు, ఆప్తులు అనారోగ్యంతో బాధపడుతుంటే వారికి సహాయంగా ఉంటూ.. డబ్బులేక కొందరు, సరిపోక కొందరు ఆకలితో బాధపడుతుండటాన్ని గమనించిన మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు చలించిపోయారు. సాటి మనుషులు ఆకలితో బాధపడకుండా చూడాలని అనుకున్నారు. ఇందుకోసం నిత్యాన్నదాన కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. ఈ మహత్కార్యానికి కోటిరూపాయల విరాళం ప్రకటించారు. ఈ కార్యక్రమ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఆస్పత్రి ప్రాంగణంలో ఏపీఎన్జీవో సంఘం ఇచ్చిన రూ.25 లక్షలతో నిర్మిస్తున్న భవనాన్ని అన్నదాన భవనంగా ఉపయోగించనున్నారు. రెండంతస్తుల్లో ఒకేసారి 300 మంది భోజనం చేసేలా వసతులు సమకూరుస్తున్నారు. అత్యాధునిక వంటశాల రూపుదిద్దుకుంటోంది. తమిళనాడులోని కోయంబత్తూరు నుంచి ఆధునిక వంటసామగ్రిని తెప్పించారు. తరువాత ఉదయం 11 గంటల నుంచి, రాత్రి 7 గంటల నుంచి అన్నదాన కార్యక్రమం ప్రారంభించాలని, పరిమితి లేకుండా ఎందరు సహాయకులున్నా అందరికీ భోజనం పెట్టాలని నిర్ణయించారు. స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులు, దాతలు తలోచేయి వేస్తే ఈ అన్నదానయజ్ఞం నిరాటంకంగా సాగుతుంది. జనవరి మొదటి వారంలో అందుబాటులోకి వచ్చే జనవరి మొదటి వారంలో జీజీహెచ్‌లో రోగుల సహాయకులకు ఉచిత భోజన కార్యక్రమం అందుబాటులోకి తీసుకువస్తాం. ఫైవ్‌స్టార్ హోటల్‌ను తలపించేలా భవనంలో వసతులు సమకూరుస్తున్నాం. ఆస్పత్రి అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. – చెరుకువాడ శ్రీరంగనాథరాజు, జిల్లా ఇన్చార్జి మంత్రి -
గుంటూరు జీజీహెచ్‌కి మంత్రి రూ. కోటి విరాళం
సాక్షి, గుంటూరు: మహమ్మారి కోవిడ్-19 సమయంలో గుంటూరు జీజీహెచ్ కీలక పాత్ర పోషిస్తోందని జిల్లా ఇంచార్జ్ మంత్రి శ్రీరంగనాథరాజు అన్నారు. ఆయన గురువారం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి రూ.కోటి విరాళం ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో జీజీహెచ్ తొమ్మిది జిల్లాల ప్రజలకు వైద్య సేవలు అందిస్తోందని తెలిపారు. ఆస్పత్రిలో పేషెంట్లతో పాటు అటెండర్లకు కూడా రెండు పూటల భోజన సదుపాయం కల్పించాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. దాని కోసం వ్యక్తిగతంగా జీజీహెచ్‌కు రూ.కోటి విరాళం అందజేస్తున్నానని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ భాగస్వాములై జీజీహెచ్ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. కోవిడ్ రోగులకు బెడ్లు అందుబాటులో ఉన్నాయని, నూతన భవనాల నిర్మాణం త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కరోనా రోగులకు తగినంత వైద్య సిబ్బందిని నియమిస్తున్నామని వివరించారు. -
కోవిడ్ ఆస్పత్రిలో సిబ్బంది చేతివాటం
లబ్బీపేట(విజయవాడతూర్పు): కోవిడ్–19 స్టేట్ హాస్పటల్లో నాల్గవ తరగతి సిబ్బంది కొందరు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. రోగుల వద్ద ఉన్న సెల్ఫోన్లు, డబ్బులు చోరీ చేస్తున్నారు. ఈ విషయమై ఇప్పటికే బాధితులు అధికారులకు ఫిర్యాదు చేశారు. తాజాగా ఒక రోగి అదృశ్యంపై అధికారులు సీసీ కెమెరాలు పరిశీలిస్తుండగా ఓ ఉద్యోగి రోగి సెల్‌ఫోన్ తస్కరించడం చూసి అధికారులు అవాక్కయ్యారు. నిత్యం ఇలా రోగుల వద్ద ఉన్న సెల్ఫోన్లు, డబ్బులు పోతున్నట్లు ఆరోపణలు ఉన్నప్పటికీ అధికారులు పెద్దగా పట్టించుకోలేదు. అయితే సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలు చూసినప్పటి నుంచి ఆ ఉద్యోగి ఎవరు అని కూపీ లాగుతున్నారు. ఇలా ఇంకా ఎవరెవరు చోరీలకు పాల్పడుతున్నారు.. వారి ప్రవర్తన ఏమిటి అని అధికారులు ఆరా తీస్తున్నారు. ఐసీయూలోనే ఎక్కువ.. కరోనా సోకిన రోగులతో పాటు, సస్పెక్టెడ్ రోగుల సైతం కోవిడ్–19 ఆస్పత్రిలో చేరుతున్నారు. ఐసోలేషన్ వార్డులో ఉన్న, ఐసీయూలో ఉన్న రోగుల వద్ద అటెండెంట్లను అనుమతించరు. వారికి ఏమి కావాలన్నా సిబ్బంది చూసుకోవాల్సిందే. దీనిని తమకు అనుకూలంగా కొందరు సిబ్బంది మలుచుకుని తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా ఐసీయూలో అపస్మారక స్థితిలో ఉన్న రోగులు, మృతిచెందిన రోగుల వద్ద ఉన్న మొబైల్స్, వస్తువులు, డబ్బులు మాయం అవుతున్నట్లు చెబుతున్నారు. ఐసీయూలో అనుభవం ఉన్న వర్కర్లను నియమించాల్సి ఉండగా, ఇటీవల కొత్తగా చేరిన వారిని విధుల్లో వేయడంతో వారు, సేవలు అందించడం మాని చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పర్యవేక్షణ శూన్యం.. ఆస్పత్రిలో పనిచేస్తున్న సిబ్బందిపై పర్యవేక్షణ కొరవడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఏ ఉద్యోగి ఎక్కడ పనిచేస్తున్నాడో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో ఇటీవలి కాలంలో రోగులకు సేవలు అందించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఏదైనా వార్డులో రోగి పరిస్థితి విషమించి వెంటిలేటర్‌పై పెట్టాల్సి వస్తే వైద్యులకు çసహాయంగా ఉద్యోగులు ఉండాలి. కానీ ఉద్యోగులు అందుబాటులో ఉండటం లేదు. అంతేకాదు ఐసీయూలో మరణించిన వారి మృతదేహాలను మార్చురీకి తరలించడంలో కూడా తీవ్ర జాప్యం జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అర్ధరాత్రి మరణించిన వారిని మరుసటి రోజు ఉదయం 10 గంటలకు మార్చురీకి తరలించిన ఘటనలు ఉన్నట్లు చెబుతున్నారు. సిబ్బందిపై సరైన అజమాయిషీ, పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఇలా జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రాణాలకు తెగించి కొందరు సేవలు.. కొందరు చేతివాటం ప్రదర్శిస్తూ రోగుల వస్తువులు తస్కరిస్తుండగా, మరికొందరు సిబ్బంది మాత్రం ప్రాణాలకు తెగించి రోగులకు సేవలు అందిస్తున్నారు. ఐసోలేషన్, ఐసీయూల్లో ఉన్న రోగులకు అన్నీ తామై చూస్తున్నారు. వారికి భోజనం పెట్టడం, మంచినీళ్లు ఇవ్వడం, మందులు ఇవ్వడం వంటి పనులు అన్నీ సిబ్బందే చూస్తున్నారు. అయితే కొందరు సిబ్బంది ప్రవర్తనతో ఆస్పత్రి మొత్తానికి చెడ్డపేరు వస్తోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సెల్‌ఫోన్ చోరీని గుర్తించాం వ్యక్తి అదృశ్యంపై సీసీ కెమెరా విజువల్స్ పరిశీలిస్తుండగా ఒక రోగి వద్ద ఉన్న సెల్‌ఫోన్‌ను ఉద్యోగి తీయడాన్ని గుర్తించాం. ఉద్యోగి పీపీఈలో ఉండటంతో ఎవరనే విషయాన్ని విచారణ చేస్తున్నాం. రోగి ఒక్కరే ఐసీయూలో ఉంటున్నారు. వారిని సేవా భావంతో చూడాలే కానీ ఇలా చేయడం సరికాదు. అలా చేసే సిబ్బందిని సహించం. కఠిన చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ పి. నాంచారయ్య, సూపరింటెండెంట్ -
వైద్యుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి..
సాక్షి, అనంతపురం: అనంతపురం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. సకాలంలో వైద్యం అందకపోవడంతో ఒక రోగి ఊపిరాడక మృతిచెందిన ఘటన అనంతపురం జీజీహెచ్‌లో జరిగింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా నిండు ప్రాణం బలైంది. ధర్మవరానికి చెందిన రాజు అనే వ్యక్తి అనారోగ్యంతో ఆసుపత్రికి రాగా, వైద్యులు పట్టించుకోలేదు. శుక్రవారం తెల్లవారుజామున మూడుగంటలకు ఆసుపత్రికి వచ్చిన రాజుకు వైద్య చికిత్స సకాలంలో అందించకపోవడంతో ఊపిరాడక మరణించినట్లు తెలిసింది. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆసుపత్రి ఎదుట మృతుడి కుటుంబ సభ్యులు,బంధువులు ఆందోళనకు దిగారు. -
ఆ వార్తలు అవాస్తవం: కలెక్టర్ వీరపాండియన్
సాక్షి, కర్నూల్: జిల్లా జీజీహెచ్ స్టేట్ కోవిడ్ ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక కరోనా రోగులు మరణిస్తున్నట్లు వస్తున్న వార్తలను జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ కొట్టిపారేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హస్పీటల్లో అన్ని వైద్య సదుపాయలు, సౌకర్యాలను ప్రభుత్వం కల్పించిందని స్పష్టం చేశారు. ఎటువంటి ఆక్సీజన్, బెడ్స్ కొరత వంటి సమస్యలు లేవని స్పష్టం చేశారు. జీజీహెచ్‌లో ఆక్సిజన్ అందక రోగులు మృతి చెందుతున్నారంటూ వస్తున్న మీడియా కథనాలు అవాస్తమని వెల్లడించారు. ప్రజలను భయాందోళనకు గురిచేసేలా పుకార్లు పుట్టిస్తే చట్ట ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. పుకార్లను నమ్మి ప్రజాలేవరూ ఆందోళన చెందవద్దని, జిల్లాలో పాజిటివ్ కేసులు పెరుగుతున్నందున ముందు జాగ్రత్తగా ప్రభుత్వం కర్నూలు జీజీహెచ్ స్టేట్ కోవిడ్ ఆస్పత్రిలో 11.5 కేఎల్డీ కెపాసిటీతో పెద్ద ఆక్సిజన్ ట్యాంక్ ఏర్పాటు చేసి పైప్ ద్వారా పేషేంట్స్ ఆక్సీజన్ సరఫరా చేస్తుందని తెలిపారు. (చదవండి: ప్రభుత్వ కాలేజీల్లో ఐఐటీ, జేఈఈలకు శిక్షణ) ఆస్పత్రిలో ప్రస్తుతం ఉన్న 11.5 కె.ఎల్.డి పెద్ద ఆక్సీజన్ ట్యాంక్ కు అదనంగా ఇంకా పాజిటివ్ కేసులు పెరిగినా ఇబ్బంది కలగకుండా మరో 10 కేఎల్డీ కెపాసిటీతో అదనంగా కొత్త ఆక్సీజన్ ట్యాంక్ నిర్మాణపు పనులు పూర్తి దశలో ఉన్నాయన్నారు. నాగపూర్‌లో ఉన్న డైరెక్టర్ జెనరల్ (హైఎక్స్‌ప్లోజివ్స్) నుండి అనుమతి వచ్చిన వెంటనే అదనపు 10 కేఎల్డీ ఆక్సీజన్ ట్యాంక్‌ను ఉపయోగించనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. కోవిడ్ పేషేంట్స్ ఆక్సీజన్ అందక మృతి చెందుతున్నారు అనేది వాస్తవం కాదు కర్నూలు జిజిహెచ్ స్టేట్ కోవిడ్ ఆస్పత్రిలో ప్రస్తుతం 450 బెడ్స్‌కు ఆక్సీజన్ సరఫరా సౌకర్యం ఉంది. అదనంగా మరో 1131 బెడ్స్ కు ఆక్సీజన్ సరఫరా కోసం చర్యలు చేపట్టామన్నారు. ప్రస్తుతం కర్నూలు జీజీహెచ్ ఉన్న పాజిటివ్ కేసులకు గాను డైలీ 120 మందికి మాత్రమే ఆక్సీజన్ అవసరం ఉందని డాక్టర్లు చెప్పారు. కాబట్టి ఆస్పత్రిలో సరిపడా ఆక్సీజన్, బెడ్స్ ఉన్నాయన్నారు. (చదవండి: మరో 26 మంది కరోనాను గెలిచారు..) నంద్యాల జిల్లా స్థాయి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో గతంలో 20 బెడ్స్‌కు ఆక్సీజన్ సరఫరా ఉండగా.. అదనంగా మరో 160 బెడ్స్‌కు ఆక్సీజన్ సరఫరా సదుపాయం కల్పించామని చెప్పారు. ఆదోని ప్రభుత్వ జనరల్ ఏరియా ఆస్పత్రిలో గతంలో ఆక్సీజన్ సరఫరా ఉన్న బెడ్స్ జీరో ఉండగా ప్రస్తుతం 100 బెడ్స్‌కు కొత్తగా ఆక్సీజన్ సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించిందని తెలిపారు. ప్రస్తుతం కర్నూలు జీజీహెచ్ స్టేట్ కోవిడ్ ఆస్పత్రిలో 1581 బెడ్స్‌కు, నంద్యాల జిల్లా స్థాయి ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో 161 బెడ్స్‌తో పాటు, ఆదోని ప్రభుత్వ ఏరియా జనరల్ ఆస్పత్రిలో 100 బెడ్స్‌కు కలిపి మొత్తం 1841 బెడ్స్‌కు ఆక్సీజన్ సదుపాయం ప్రభుత్వం తరఫున కల్పించామన్నారు. కాబట్టి కర్నూలు జీజీహెచ్ స్టేట్ కోవిడ్ ఆస్పత్రిలో గాని, జిల్లాలో గాని కోవిడ్ పేషేంట్స్‌కు ఆక్సీజన్, బెడ్స్ కొరత లేదని స్పష్టం చేశారు. కావునా ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని, పుకార్లను నమ్మోద్దని ఆయన సూచించారు. పుకార్లు పుట్టించే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చారించారు. -
ఆస్పత్రి ఎదుట చంద్రబాబు హైడ్రామా
సాక్షి, అమరావతి: జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న ఖైదీని కలవడం సాధ్యం కాదని.. అది నిబంధనలకు విరుద్ధమని తెలిసి కూడా ప్రతిపక్ష నేత చంద్రబాబు హైదరాబాద్ నుంచి గుంటూరు జనరల్ ఆస్పత్రికి వెళ్లి అచ్చెన్నాయుడును కలుస్తానంటూ హంగామా చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. నిబంధనలు, ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువలంటూ నిత్యం శ్రీరంగనీతులు చెప్పే చంద్రబాబు తనకు మాత్రం అవేమీ వర్తించవనే రీతిలో వ్యవహరించారని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. తమ పార్టీ నాయకుడిని కలవడానికి అనుమతి ఇవ్వాలని జైళ్ల శాఖ ఉన్నతాధికారులను, ఆస్పత్రి సూపరింటెండ్‌ను టీడీపీ కార్యాలయం కోరింది. ఇందుకు నిబంధనలు ఒప్పుకోవని.. రిమాండ్ ఖైదీని కలవకూడదని జైళ్ల శాఖ స్పష్టం చేసింది. అనుమతి తన పరిధిలోని అంశం కాదని, మెజిస్ట్రేట్ అనుమతి ఇస్తే కలవవచ్చని ఆస్పత్రి సూపరింటెండెంట్ కూడా స్పష్టం చేశారు. అయినా.. చంద్రబాబు నాయకులతో అచ్చెన్నాయుడు ఉన్న గదికి వెళతానని పోలీసులను కోరడం, వారు అనుమతి లేదనడం, ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను బయటకు పిలిపించి మాట్లాడటం.. ఇలా సుమారు గంట సేపు డ్రామా నడిపారు. ఆ తర్వాత ఆస్పత్రి ఆవరణలోనే మీడియా సమావేశం నిర్వహించారు. ప్రచారం కోసమే హడావుడి రిమాండ్ ఖైదీని కలవకూడదనే నిబంధన 40 ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకునే నాయకుడికి తెలియదా.. తెలిస్తే ఎందుకు వచ్చారని కొందరు మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు టీడీపీ నేతలు ముసిముసి నవ్వులు నవ్వారు. నిబంధనల ప్రకారం కుదరదని తెలిసినా అనుమతి కోరడం.. లేదనిపించుకోవడం.. నిబంధనలు ఉల్లంఘించి మందీమార్బలంతో ఆస్పత్రికి రావడం వంటి మీడియాలో ప్రచారం కోసమే చేశారని టీడీపీ నేతలు కొందరు బహిరంగంగానే చెప్పడం గమనార్హం. ఏదో ఒక హడావుడి చేసి ప్రచారం పొందడం, ప్రజలను గందరగోళపరిచేలా పదేపదే వక్రీకరణ వ్యాఖ్యలు చేయడానికి ఆయన ఈ పర్యటన పెట్టుకున్నట్లు స్పష్టమవుతోంది. అదే బాటలో లోకేష్ చంద్రబాబు కుమారుడు లోకేష్ కూడా శుక్రవారం రాత్రి అచ్చెన్నాయుడును కోర్టులో ప్రవేశపెట్టడానికి తీసుకెళ్లినప్పుడు అక్కడికెళ్లి హంగామా సృష్టించారు. ఒకవైపు ఏసీబీ కోర్టు జడ్జి నివాసంలో నిందితుణ్ణి ప్రవేశపెట్టే ప్రక్రియ జరుగుతుండగా నిందితుణ్ణి కలుస్తానని లోకేష్ నాయకులతో కలిసి హడావుడి చేసి నవ్వుల పాలయ్యారు. జడ్జి నివాసంలో నిందితుణ్ణి కలవడానికి ఎవరైనా ప్రయత్నిస్తారా? అనుమతివ్వడం సాధ్యమా? ఇలా ఎందుకు చేశారంటే? మళ్లీ మీడియా.. ప్రచారం.. తమపై దౌర్జన్యం చేసేస్తున్నారని, ఏదో ఏదో జరిగిపోయిందని ప్రజల్లో అపోసహలు సృష్టించడానికేనని విశ్లేషకులు చెబుతున్నారు. చంద్రబాబు గుంటూరు జనరల్ ఆస్పత్రిలో ఆడిన డ్రామానే అనంతపురంలో కొనసాగించడానికి లోకేష్ మళ్లీ సిద్ధమయ్యారు. ఆదివారం అనంతపురంలో జేసీ ప్రభాకర్‌రెడ్డిని కలవడానికి తనకు అనుమతివ్వాలని కోరారు. -
జీజీహెచ్‌లో కరోనా కలకలం
గుంటూరు మెడికల్/తిరుపతి తుడా: గుంటూరు జీజీహెచ్‌లో గురువారం రాత్రి అడ్మిట్ అయిన ఓ విదేశీయుడికి కరోనా వైరస్ సోకిందన్న వదంతులు కలకలం రేపుతున్నాయి. జ్వరం, దగ్గు, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, కిడ్నీ ఫెయిల్యూర్ లాంటి సమస్యలతో బాధపడుతున్న అతడిని ఎక్యూట్ మెడికల్ కేర్ యూనిట్ (ఏఎంసీయూ)లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఫిజి దేశానికి చెందిన 50 ఏళ్ల వయసున్న అతను విహార యాత్రలో భాగంగా సింగపూర్ వెళ్లి, అక్కడి నుండి ఢిల్లీకి, తర్వాత విజయవాడకు వచ్చాడు. కాగా, ఇతడికి కరోనా వైరస్ సోకిందనే వదంతులు వ్యాపించటంతో ఆస్పత్రి సిబ్బంది ఆందోళనలో ఉన్నారు. ఇలాంటి వారిని గోరంట్ల జ్వరాల ఆస్పత్రిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వార్డులో ఉంచితే ఇతరులకు ఇన్ఫెక్షన్ సోకకుండా నివారించవచ్చన్న అభిప్రాయం సర్వత్రా వెలువడుతోంది. ఈ విషయంపై ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సబిన్కర్ బాబులాల్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా విదేశీయుడికి కరోనా వైరస్ సోకిందనేది కేవలం అపోహేనని తెలిపారు. మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ కారణంగానే అతడిని ఏఎంసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు జనరల్ మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ పతకమూరి పద్మలత వెల్లడించారు. ఇదిలా ఉండగా, నాలుగు రోజుల క్రితం చైనా నుంచి తిరిగొచ్చిన చిత్తూరు జిల్లా పీలేరుకు చెందిన ఓ కుటుంబాన్ని (ఓ మహిళ, ఇద్దరు పురుషులు, ఓ చిన్నారి) అధికారులు వైద్య పరీక్షల నిమిత్తం తిరుపతి రుయా ఆస్పత్రికి పంపించారు. వైద్యులు పరీక్షించి వారికి కరోనా లక్షణాలు ఏ మాత్రం లేవని నిర్ధారించారు. -
సత్యలీలకు 'ఆసరా' తొలి చెక్కు
సాక్షి, గుంటూరు: ఆరోగ్యశ్రీ ద్వారా శస్త్ర చికిత్స అనంతరం విశ్రాంతి కాలానికి డబ్బు చెల్లించే ‘వైఎస్సార్ ఆరోగ్య ఆసరా’ పథకాన్ని సోమవారం గుంటూరు జనరల్ ఆసుపత్రిలో ప్రారంభించిన అనంతరం రోగులకు సీఎం జగన్ చెక్కులను పంపిణీ చేశారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడుకు చెందిన డేగల సత్యలీలకు సీఎం తొలి చెక్కు అందించారు. ఆమె పది రోజుల క్రితం కూలి పనులకు వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురైంది. గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందారు. వైద్యుల సలహా మేరకు వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కింద ప్రభుత్వం ఆమెకు రూ.10 వేలు చెల్లించింది. ఆరోగ్యం జాగ్రత్తమ్మా అన్నారు.. ‘డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య ఆసరా’ కింద నీ ఆరోగ్యం మెరుగయ్యే వరకూ రోజుకు రూ.225 చొప్పున నెలకు గరిష్టంగా రూ.5 వేలు ప్రభుత్వం నుంచి నీకు డబ్బులు వస్తాయి. తొలి చెక్కు నీకే అందిస్తున్నామమ్మా.. ఆరోగ్యం జాగ్రత్త అని ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. కూలికి వెళ్తేగానీ ఇల్లు గడవని పరిస్థితి. పూర్తిగా కోలుకునే వరకూ డబ్బులిస్తామని సీఎం చెప్పారు. ఎంతో సంతోషంగా ఉంది. ఆయనకు రుణపడి ఉంటాను’ – డేగల సత్యలీల, ప్రత్తిపాడు, గుంటూరు జిల్లా భరోసా కల్పించిన సీఎంకు కృతజ్ఞతలు... ‘నా భర్త చనిపోవడంతో చెరుకు రసం అమ్ముకుంటూ జీవిస్తున్నా. కిడ్నీ సంబంధిత వ్యాధితో ఆసుపత్రిలో చేరగా కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. నాకు ముగ్గురు కుమార్తెలు. నేను ఖాళీగా ఉంటే పిల్లలు పస్తులుండాల్సిన పరిస్థితి. ఆరోగ్య ఆసరా పథకం కింద నాకు రూ.8 వేలు అందించారు. నువ్వు దిగులు పడొద్దమ్మా, నీ ఆరోగ్యం కుదుటపడే వరకు ప్రభుత్వం నీకు అండగా ఉంటుందని ముఖ్యమంత్రి చెప్పారు. నాకు, నా పిల్లలకు ఆరోగ్య భరోసా కల్పించిన సీఎంకు కృతజ్ఞతలు. – షేక్ ఇస్మాల్ బీ, కొత్తపేట, గుంటూరు అన్నం పెడుతున్న ‘ఆసరా’ వైఎస్సార్ ఇచ్చిన ఆరోగ్యశ్రీ కార్డు వల్ల నాకు బ్రెయిన్ ట్యూమర్‌కు ఉచితంగా ఆపరేషన్ చేశారు. కొంతకాలం బాగున్నా తిరగబెట్టడంతో ఇబ్బందిపడుతున్నా. ఆపరేషన్ చేయించుకున్నవారికి వైఎస్సార్ ఆసరా ద్వారా భృతి చెల్లించడం వల్ల కడుపు నిండా అన్నం తినగలిగే అవకాశం కలిగింది. మాలాంటి పేదల కోసం ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా చేయాలి. – షేక్ మున్నీ, ఆరోగ్య ఆసరా లబ్ధిదారు, గుంటూరు ఊహించనంత సాయం... నా భర్త గుడిపూడి నాగరాజుకు గుండెనొప్పి రావడంతో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా ఉచితంగా ఆపరేషన్ చేశారు. పనికి వెళ్లకుంటే ఇల్లు ఎలా గడవాలని ఆలోచిస్తున్న సమయంలో ముఖ్యమంత్రి జగన్ ‘ఆసరా’ ద్వారా మాలాంటి పేదలను ఆదుకుంటున్నారు. ఇంత పెద్ద మొత్తంలో సాయం అందుతుందని ఊహించలేదు. మాలాంటి పేదల కోసం ఎల్లప్పుడూ మీరే ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు వర్షాలు ఎలా ఎక్కువగా ఉన్నాయో ఈ ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాలు కూడా అంతే ఎక్కువగా ఉన్నాయి. – మణికుమారి, వేములూరిపాడు,ఫిరంగిపురం మండలం నెల కాదు.. ఆర్నెల్లు ‘ఆసరా’ బండి వెంకన్న పరిస్థితిపై తక్షణమే స్పందించిన సీఎం జీబీ సిండ్రోమ్ (గులియన్ బెరీ సిడ్రోమ్) వ్యాధితో బాధపడుతున్న బండి వెంకన్నకు ఆర్నెల్ల పాటు ‘ఆసరా’ ద్వారా సాయం అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరుకు చెందిన వెంకన్న శరీరం మొత్తం ఈ వ్యాధి వల్ల పక్షవాతానికి గురైంది. చికిత్స కోసం ఆయన కుటుంబం ప్రైవేట్ ఆసుపత్రుల్లో రూ.6 లక్షలకు పైగా ఖర్చు చేసింది. గుంటూరు జీజీహెచ్ వైద్యులు అందించిన చికిత్స వల్ల పది రోజుల్లోనే వెంకన్న శరీరం, చేతుల్లో కదలిక వచ్చింది. వైద్యుల సలహా మేరకు వెంకన్నకు నెల రోజుల పాటు వైఎస్సార్ ఆరోగ్య ఆసరా చెక్కును ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్టు సిద్ధం చేసింది. ఈ చెక్కును సీఎం చేతులమీదుగా ఇచ్చే సమయంలో వెంకన్న పరిస్థితిని న్యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ సుందరాచారి వివరించారు. వెంకన్న కోలుకోవడానికి ఆరు నెలలు పడుతుందని చెప్పడంతో వెంటనే స్పందించిన సీఎం జగన్.. ఆరోగ్య ఆసరా సాయాన్ని ఆ మేరకు అందజేయాలని అధికారులను ఆదేశించారు. సీఎంకు నర్సుల సంఘం వినతి గుంటూరు జీజీహెచ్‌లో డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య ఆసరా చెక్కుల పంపిణీ అనంతరం ప్రభుత్వ నర్సుల సంఘం సభ్యులు తమ సమస్యలపై సీఎంకు వినతిపత్రం అందజేశారు. జీజీహెచ్‌లో నర్సుల కొరత, ప్రోత్సాహకాలు అందక ఇబ్బందులు పడుతున్నట్టు నివేదించారు. సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యం పేదలకు అండగా నిలవటం, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేయటమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోంది. చంద్రబాబు అధికారంలో ఉండగాఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేశారు. నిధులు పక్కదారి పట్టించి పేదల మరణాలకు కారణమయ్యారు. ముఖ్యమంత్రి జగన్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రక్షాళన చేసి పరిధి రూ.5 లక్షల వరకు పెంచారు. నెట్వర్క్ ఆస్పత్రుల విస్తృతి పెంచారు. మూడు మహానగరాల్లో పేదలు ఉచితంగా వైద్యం పొందేలా చేశారు. ఆరోగ్య ఆసరా పథకాన్ని ప్రకటించి ఆపరేషన్ చేయించుకున్న కుటుంబాలను పోషించే బాధ్యత స్వీకరించారు. – ఆళ్ళ నాని,ఉప ముఖ్యమంత్రి సంక్షేమ పథకాలతో చరిత్ర సీఎం జగన్ సంక్షేమ కార్యక్రమాలతో చరిత్ర సృష్టిస్తున్నారు. గత ఐదేళ్లలో నిర్వీర్యమైన ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రక్షాళన చేసి అన్ని వ్యాధులకు వర్తింపచేస్తున్నారు. మంచాన పడిన పేదలను ఆదుకుంటున్న ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజల హృదయాల్లో చిరస్మరణీయుడిగా నిలుస్తారు. – మోపిదేవి, మార్కెటింగ్, పశుసంవర్ధక శాఖ మంత్రి అంతా గర్వపడేలా చేశారు.. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆపరేషన్ చేయించుకున్నవారికి వైఎస్సార్ ఆరోగ్య ఆసరా ద్వారా జీవన భృతిని ముఖ్యమంత్రి జగన్ అందజేస్తున్నారు. ఆరు నెలల పాలనలో అందరూ ఎంతో గర్వపడేలా చేశారు. ప్రతి వారం ఒక సంక్షేమ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి రికార్డు సృష్టిస్తున్నారు. విద్య, వైద్య రంగానికి ప్రభుత్వం ఎన్నడూ లేనంత ప్రాధాన్యం కల్పించింది. – మేకతోటి సుచరిత, హోంశాఖ మంత్రి -
నా మతం మానవత్వం: సీఎం వైఎస్ జగన్
సాక్షి, గుంటూరు : ఎన్నికల ముందు పాదయాత్ర సందర్భంగా ఓ హామీ ఇచ్చాను. ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకోవాలనే ఆరాటంతో ఈ ఆర్నెల్లు పని చేశాం. అందులో భాగంగా ఇచ్చిన మాటలో ఒకదాన్ని నిలబెట్టుకునేందుకు ఇక్కడకు వచ్చాను. మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావిస్తున్నాను. ఇవాళ రకరకాల ఆరోపణల మధ్య రాష్ట్రంలో పరిపాలన చూస్తున్నాం. మంచి పరిపాలన ఎక్కడైనా జరుగుతుంటే జీర్ణించుకోలేని పరిస్థితి. ఈ మధ్య కాలంలో నా మతం, కులం గురించి కూడా మాట్లాడారు. దానికి నాకు చాలా బాధ అనిపించింది. నా మతం మానవత్వం. ఈ వేదికగా చెబుతున్నా... నా కులం మాట నిలబెట్టుకునే కులం. నేను ఉన్నాను... నేను విన్నాను అనే మాటను నిలబెట్టుకున్నందుకు గర్వంగా ఉంది. ఇక వాళ్లు చేస్తున్న అవాకులు, చెవాకులు పక్కనపెడితే..ఇవాళ జరుగుతున్న ఓ గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మనిషి ప్రాణాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ఈ ఆరోగ్య రంగంలో విప్లవానికి నాంది పలికాం. ఇందుకు నాకు సంతోషంతో పాటు గౌరవంగా ఉంది’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. జనవరి 1 నుంచి కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు గుంటూరు మెడికల్ కాలేజీ జింఖానా ఆడిటోరియంలో వైఎస్సార్ ఆరోగ్య ఆసరా పథకాన్ని ఉద్దేశిస్తూ ఆయన ప్రసంగించారు. ‘ఆరోగ్యలో శస్త్ర చికిత్స అనంతరం విశ్రాంతి సమయంలో రోజుకు రూ.225 చొప్పున నెలకు గరిష్టంగా రూ.5వేలు చెల్లిస్తాం. వైద్యుల సిఫార్సుల మేరకు ఆర్థిక సాయం ఎంతవరకూ ఇవ్వాలో నిర్ణస్తాం. పాదయాత్ర సందర్భంగా నేను మాటిచ్చాను. రూ.5 లక్షలలోపు ఆదాయం ఉన్నవారికి జనవరి 1 నుంచి కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు జారీ చేస్తాం. కార్డుతో పాటు క్యూఆర్ కోడ్‌లో పేషెంట్‌కు సంబంధించి మెడికల్ రిపోర్టును అందులో పొందుపరుస్తాం. అలాగే ఆరోగ్యశ్రీ పరిధిలోకి 2వేల రోగాల వరకూ పెంచుతున్నాం. పైలట్ ప్రాజెక్ట్ కింద ముందుగా పశ్చిమ గోదావరి జిల్లాలో జనవరిలో ప్రారంభిస్తాం. ఆ తర్వాత ఏప్రిల్ నుంచి ఒక్కో జిల్లా చొప్పున విస్తరించుకుంటూ వెళతాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ నాడు-నేడు వైద్యం ఖర్చు రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది. వచ్చే ఏప్రిల్ నాటికి 1060 కొత్త 104, 108 వాహనాలను కొనుగోలు చేస్తాం. ఫోన్ కొట్టిన 20 నిమిషాల్లో అంబులెన్స్ మీ ముందు ఉంటుంది. ఆస్పత్రికి తీసుకువెళ్లడమే కాకుండా, మంచి వైద్యం అందించి చిరునవ్వుతో తిరిగి ఇంటికి వెళ్లేలా చూస్తాం. అలాగే స్కూల్ విద్యార్థులకు ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నాం. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలోని 130కి పైగా సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది. ఈ నెల 15 నుంచి 510 రకాల మందులను ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుబాటులోకి తెస్తాం. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో డబ్ల్యూహెచ్‌వో ప్రామాణికం ఉన్న మందులు అందుబాటులోకి తెస్తాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ నాడు-నేడు అమలు చేస్తాం. మూడేళ్లలో ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖలు మార్చి, ప్రైవేట్ ఆస్పత్రులకు దీటుగా అభివృద్ధి చేస్తాం హెల్త్ రికార్డులతో కూడిన కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు జారీ చేస్తాం. డయాలసిస్ రోగులకు ఇస్తున్న విధంగానే తలసేమియా, హీమెఫిలియా వ్యాధిగ్రస్తులకు జనవరి 1 నుంచి నెలకు 10వేలు ఇస్తాం. అలాగే కేన్సర్ పేషంట్లు కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి వస్తారు. ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న డాక్టర్లు, నర్సులు, ఇతర ఆస్పత్రి సిబ్బందికి సంబంధించిన పోస్టులు భర్తీ చేస్తాం.’ అని తెలిపారు. చదవండి: వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ఆసరా ప్రారంభించిన సీఎం జగన్ -
వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ఆసరా ప్రారంభించిన సీఎం జగన్
సాక్షి, గుంటూరు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా శస్త్ర చికిత్స చేయించుకున్న రోగులకు వైద్యం అనంతరం విశ్రాంతి కాలానికి డబ్బు చెల్లించే వైఎస్సార్ ఆరోగ్య ఆసరా పథకాన్ని ఆయన సోమవారం గుంటూరు జనరల్ ఆస్పత్రిలో ప్రారంభించారు. శస్త్రచికిత్స అనంతరం వైద్యులు సూచించిన విశ్రాంతి సమయానికి రోజుకు 225 రుపాయలు లేదా నెలకు గరిష్టంగా 5వేల రూపాయలను ఈ పథకం ద్వారా అందజేస్తారు. రోగులకు ఈ తరహా చేయూత అందించడం దేశంలో ఇదే ప్రథమం. కుటుంబ పెద్ద జబ్బపడితే ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. దీనివల్ల ఏటా నాలుగున్నర లక్షల మంది లబ్ధిపొందుతారని ఓ అంచనా. కాగా నిన్నటినుంచే ఈ పథకం అమల్లోకి వచ్చినా ముఖ్యమంత్రి లాంఛనంగా ఇవాళ ప్రారంభించారు. అలాగే ఆరోగ్యశ్రీలో వైద్యం పొందిన రోగులు ముఖ్యమంత్రి చేతులు మీదుగా చెక్కులు అందుకున్నారు. గుంటూరు మెడికల్ కాలేజీ జింఖానా ఆడిటోరియంలో సీఎం జగన్ ప్రసంగించనున్నారు. -
నేటి నుంచి వైఎస్సార్ ఆరోగ్య ఆసరా
సాక్షి, అమరావతి: ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా పేద రోగులకు ఊరట కల్పించే మరో కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు శ్రీకారం చుట్టనున్నారు. ఆరోగ్యశ్రీ పథకంలో శస్త్ర చికిత్స చేయించుకున్న రోగులకు వైద్యం అనంతరం విశ్రాంతి కాలానికి డబ్బు చెల్లించే ‘వైఎస్సార్ ఆరోగ్య ఆసరా’ను గుంటూరు జనరల్ ఆస్పత్రిలో సోమవారం సీఎం ప్రారంభించనున్నారు. శస్త్రచికిత్స అనంతరం వైద్యులు సూచించిన విశ్రాంతి సమయానికి రోజుకు రూ.225 లేదా నెలకు గరిష్టంగా రూ.5 వేలను ఈ పథకంలో అందచేస్తారు. రోగులకు ఈ తరహా చేయూత అందించడం భారతదేశంలో ఇదే ప్రథమం. కుటుంబ పెద్ద జబ్బుబారిన పడితే ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో సీఎం ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. దీని వల్ల ఏటా 4.5 లక్షల మంది లబ్ధి పొందుతారు. సీఎం చేతుల మీదుగా చెక్కుల పంపిణీ గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో జరిగే కార్యక్రమంలో ఆరోగ్యశ్రీలో వైద్యం పొందిన రోగులు ముఖ్యమంత్రి చేతుల మీదుగా చెక్కులు అందుకుంటారు. డిసెంబర్ 1 నుంచే పథకం అమల్లోకి వచ్చినా సోమవారం లాంఛనంగా ప్రారంభిస్తున్నారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన 48 గంటల్లో విశ్రాంతి తీసుకునే కాలానికి రోగుల అకౌంట్లలో నేరుగా నగదు జమ చేస్తారు. 26 ప్రత్యేక విభాగాల్లో 836 రకాల శస్త్ర చికిత్సలు చేయించుకున్న వారికి ఇది వర్తించేలా ప్రభుత్వం రెండ్రోజుల క్రితమే మార్గదర్శకాలు జారీచేసింది. రోగి డిశ్చార్జి సమయంలో బ్యాంకు ఖాతా, ఆధార్ కార్డు వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ బ్యాంకు ఖాతా లేకపోతే బంధువుల బ్యాంకు ఖాతా ఇస్తే దానికి సొమ్మును జమచేస్తారు. ఈ పథకం అమల్లో ఎలాంటి గందరగోళానికి తావులేకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశాల నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రోగి ఆర్థికంగా ఇబ్బందిపడకూడదనే.. వైఎస్సార్ ఆరోగ్య ఆసరా పథకానికి ఏటా రూ.270 కోట్ల నుంచి రూ.300 కోట్ల వరకూ వ్యయం అవుతుందని అంచనా. శస్త్రచికిత్స అనంతరం రోగి ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఈ పథకంలో ప్రభుత్వం సాయం అందిస్తుంది. –డాక్టర్ మల్లిఖార్జున, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ వైఎస్సార్ ఆసరా వివరాలు మొత్తం స్పెషాలిటీ విభాగాలు 26 ఎన్నిరకాల శస్త్ర చికిత్సలు 836 రోజుకు ఇచ్చే మొత్తం రూ.225 నెల రోజుల విశ్రాంతికి రూ.5000 లబ్ధిదారుల సంఖ్య 4.50 లక్షలు ఏటా వ్యయం దాదాపు రూ.300 కోట్లు -
మద్యం మత్తులో మృగంలా మారి
అజిత్‌సింగ్‌నగర్(విజయవాడ సెంట్రల్): మద్యం మత్తులో రక్తసంబంధం మరిచి మృగంలా మారాడు. ఏం చేస్తున్నానన్న విచక్షణ మరిచి అన్న కూతురిపై చిన్నాన్నే ఘాతుకానికి ఒడిగట్టాడు. అన్నా వదినలపై కోపంతో చిన్నారిని కర్కశంగా మేడపై నుంచి కిందకి పడేశాడు. విజయవాడ వాంబే కాలనీలో ఆదివారం జరిగిన ఈ ఘటనలో ఆ చిన్నారి తీవ్రంగా గాయపడగా.. ప్రస్తుతం పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వివరాల్లోకి వెళ్తే... వాంబేకాలనీ సీ బ్లాకుకు చెందిన కొండ్రాజు శ్రీదేవి, యేసురాజు దంపతులకు ముగ్గురు పిల్లలు. ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో ప్రార్థన పెట్టుకునేందుకు శ్రీదేవి ఇల్లు శుభ్రం చేసి బయటకు వెళ్లింది. ఇంతలో ఆమె మరిది కృష్ణ(28) మద్యం తాగొచ్చి ఆ మత్తులో ఇల్లు మొత్తం అన్నం మెతుకుల్ని పడేశాడు. ఇదేం పనని వదిన మందలించగా.. మద్యం మత్తులో ఉన్న కృష్ణ నన్నే తిడతావా! అంటూ బూతు పురాణం అందుకున్నారు. ఇంతలో అన్నయ్య యేసురాజు వచ్చి కృష్ణపై చేయి చేసుకున్నాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన కృష్ణ ఇంటి బయట ఉన్న అన్న పెద్ద కూతురు జానకి(6)ని వారుంటున్న రెండంతస్తుల భవనం నుంచి కిందకు పడేశాడు. దీంతో జానకి తల వెనుక భాగంలో తీవ్రగాయాలు కాగా.. చెవుల నుంచి రక్తం రావడంతో 108లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాలిక పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
శిశువు మృతిపై హస్పీటల్ ముందు ఆందోళన
సాక్షి, గుంటూరు ఈస్ట్ : జీజీహెచ్ ప్రసూతి వార్డులో డెలివరీ అనంతరం వైద్య సిబ్బంది మృత శిశువుని తల్లికి అప్పజెప్పడంతో బాధిత మహిళ బంధువులు మంగళవారం రాత్రి ఆందోళనకు దిగారు. బాధితుల వివరాల మేరకు.. గుజ్జనగుండ్లలో గోపి, నందిని దంపతులు నివసిస్తున్నారు. నందిని కాన్పు నిమిత్తం ఈ నెల 5వ తేదీ జీజీహెచ్ ప్రసూతి వార్డుకు వచ్చింది. స్కానింగ్ అనంతరం వైద్యులు ఆమెను వార్డులో చేర్చుకున్నారు. అప్పటి నుంచి వరుసగా మూడు రోజులు నందిని కడుపు నొప్పితో బాధపడింది. దీనిపై నందిని తల్లి వైద్యులను సంప్రదించగా ప్రమాదం లేదని చెబుతూ వచ్చారు. మంగళవారం ఉదయం 9 గంటలకు నందినికి స్కానింగ్ చేయాలని వైద్యులు నిర్ధారించారు. అయితే స్కానింగ్ సాయంత్రం 5 గంటలకు చేశారు. అనంతరం అత్యవసరంగా డెలివరీ చేయడంతో మృత శిశువు ప్రసవించింది. నందిని ఆరోగ్యం విషమించడంతో వైద్యులు చికిత్స చేస్తున్నారు. నందిని తల్లిదండ్రులు, బంధువులు ప్రసూతి వార్డు వెలుపల ఆందోళనకు దిగారు. నందిని గర్భంలో శిశువు మృతి చెందడాన్ని వైద్యులు ఆల్యంగా గుర్తించారని ఆరోపించారు. రూ. 1500 తీసుకున్నారు నందిని బంధువులు ఆందోళన చేస్తుండగా.. మరో బాలింత బంధువు షేక్ జాన్‌బీ తమకు జరిగిన అన్యాయం గురించి మీడియా ముందు వివరించింది. షేక్ నజ్మా అనే గర్భిణి ఈ నెల మూడో తేదీ ప్రసూతి వార్డులో బిడ్డకు జన్మనిచ్చింది. ఆ సమయంలో వైద్య సిబ్బంది తన వద్ద రూ.1500 తీసుకున్నట్లు జాన్‌బీ ఆరోపించింది. బిడ్డ వ్యర్థాలు మింగడమే కారణం శిశువు మృతి చెందడంపై ఆర్ఎంవో ఆదినారాయణ వివరణ ఇస్తూ నందిని కాన్పు ఈ నెల ఏడో తేదీగా వైద్యులు నిర్ధారించారని, కడుపులో నొప్పి కారణంగా ఆమెను ఐదో తేదీనే వార్డులో చేర్చుకున్నారని తెలిపారు. గర్భస్థ శిశువు వ్యర్థ పదార్థాలు తీసుకున్న కారణంగా లన్స్‌లోకి ప్రవేశించి మృతి చెందినట్లు వెల్లడించారు. నందిని ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. -
ప్రియురాలిపై కత్తితో దాడి..
చిలకలూరిపేట: ఏడేళ్లుగా సహజీవనం చేస్తున్న ప్రియురాలిని అనుమానించిన ప్రియుడు ఆమెపై కత్తితో దాడిచేసి హత్య చేయాలని ప్రయత్నించాడు. ఆపై తాను కూడా గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ఆదివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... సత్తెనపల్లికి చెందిన కాటేపల్లి రాముకు వినుకొండకు చెందిన కరణం లక్ష్మీప్రసన్నతో ఏడేళ్ల కిందట పరిచయం ఏర్పడింది. ఇరువురూ కలిసి తిరుపతిలో ఐదేళ్ల పాటు సహజీవనం చేశారు. రెండేళ్ల కిందట చిలకలూరిపేట పట్టణానికి చేరుకొని సుబ్బయ్యతోటలో ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. రాము వంట మాస్టర్‌గా పనిచేస్తుండగా, లక్ష్మీ ప్రసన్న ఓ సూపర్ మార్కెట్లో సూపర్వైజర్గా పనిచేస్తోంది. గత ఐదు నెలలుగా లక్ష్మీ ప్రసన్న వేరొకరితో సన్నిహితంగా మెలుగుతున్నట్టు రాము అనుమానిస్తూ వచ్చాడు. సెల్ఫోన్లో వేరొకరితో మాట్లాడటం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసేవాడు. ఆదివారం లక్ష్మీప్రసన్న వేరొకరితో మోటార్ బైక్‌పై రావటం గమనించి ఆగ్రహం వ్యక్తం చేయటంతో ఇరువురి మధ్య ఘర్షణ జరిగింది. ఆగ్రహించిన రాము కూరగాయలు కోసే కత్తితో ఆమెపై దాడి చేశాడు. దీంతో ఆమె ఎడమ చెయ్యి, నడుము, వెనుక భాగంలో తీవ్రగాయాలయ్యాయి. అనంతరం తాను కూడా గొంతుకోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు ఇరువురినీ 108 ద్వారా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇరువురికీ తీవ్ర గాయాలు కావడంతో స్థానిక వైద్యులు ప్రాథమిక చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. -
పైరవీలదే పెత్తనం..
సాక్షి, గుంటూరు: అర్హతలతో పనిలేదు పైరవీలు చేస్తే చాలు.. రూ.లక్షలకు లక్షలు ఖర్చుపెడితే పనైపోతుంది. నిబంధనలు అడ్డంకి రావు. పైరవీలు, పైసలు ఉంటే చాలు నిబంధనలను సైతం తుంగలో తొక్కుతారు.. అన్న చందంగా గత ఐదేళ్ల టీడీపీ పాలనలో గుంటూరు జీజీహెచ్‌లో పాలన సాగింది. అప్పటి టీడీపీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ సిఫార్సు లేఖ ఇవ్వడంతో అడ్డదారిలో ఓ వ్యక్తికి సార్జెంట్ పోస్టు కట్టబెట్టారు. వివరాల్లోకి వెళితే.. జీజీహెచ్‌లో 200 మంది వరకూ వార్డు బాయ్‌లు, ఎంఎన్‌వోలు, తోటీలు, స్వీపర్లు వంటి నాలుగో తరగతి ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరికి విధులు కేటాయించడం, సర్వీస్ రూల్స్, సెలవులు మంజూరు, హాస్పిటల్ సెక్యూరిటీ తదితర వ్యవహారాలపై పర్యవేక్షణకు సార్జెంట్ ఉంటాడు. సార్జెంట్‌గా ఆర్మీలో 17 ఏళ్లకు పైగా పనిచేసి, సుబేదార్, రసీల్దార్ హోదా కలిగిఉన్న వ్యక్తులు అర్హులు. ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసి అన్ని అర్హతలు కలిగిన వారిని సార్జెంట్ నియామకం చేపట్టాలి. అయితే జీజీహెచ్ అధికారులు గత ప్రభుత్వ హయాంలో సార్జెంట్ పోస్టు భర్తీలో నిబంధనలను తుంగలో తొక్కారు. ఎమ్మెల్యే సిఫార్సుతో.. 2016లో అప్పటి పెదకూరపాడు టీడీపీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ ఎం.శ్రీహరి అనే ఎక్స్సర్వీస్మెన్ను సార్జెంట్‌గా నియమించమని సిఫార్సు లెటర్ ఇచ్చాడు. అధికార పార్టీ ఎమ్మెల్యే సిఫార్సు లెటర్ ఇవ్వడంతో నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా శ్రీహరిని కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ పద్ధతిలో నిబంధనలకు విరుద్ధంగా ఆస్పత్రి అభివృద్ధి సొసైటీ ద్వారా 2017లో సార్జెంట్‌గా నియమించారు. నిబంధనల ప్రకారం నోటిఫికేషన్ ద్వారానే సార్జెంట్‌ను రిక్రూట్మెంట్ చేయాలి. అర్హత కలిగిన వ్యక్తులు లేని పక్షంలో నాలుగో తరగతి ఉద్యోగుల్లో సీనియర్ ఉద్యోగిని సార్జెంట్‌గా కొనసాగించవచ్చు. అయినప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టు పద్ధతిలో సార్జెంట్ నియమించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. కాంట్రాక్టు ఉద్యోగి తమపై పెత్తనం చెలాయిస్తుండటంపై నాలుగో తరగతి ప్రభుత్వ ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇది కొత్తేమీ కాదు.. జీజీహెచ్‌లో అనర్హలకు ఉద్యోగోన్నతులు, ఉద్యోగాలు, ఇతర పదవులు కట్టబెట్టడం ఇది కొత్తేమీ కాదు. లైంగిక వేధింపుల కేసులో ఉన్న ఓ వ్యక్తికి ఉత్తమ ఉద్యోగి అవార్డు ఇచ్చిన ఘన చరిత్ర జీజీహెచ్ది. ఆస్పత్రిలో కింది స్థాయి మహిళా సిబ్బందిపై లైంగిక వేధింపులకు పాల్పడి, వడ్డీ వ్యాపారం పేరుతో అరాచకాలకు పాల్పడిన అధికారులకు ఉద్యోగోన్నతులు కల్పించిన ఘటన గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చోటుచేసుకుంది. అరాచకాలు, అక్రమాలకు పాల్పడినా సరే డబ్బులు వెదజల్లి కొందరు ఉద్యోగులు తమపై ఉన్న మరకలను గతంలో చెరిపేసుకున్నారు. కాంట్రాక్ట్ పద్ధతిలో సార్జెంట్‌ను నియమించడం కోసం ఓ అధికారి, అడ్మిస్ట్రేషన్ విభాగంలో పని చేస్తున్న క్లర్క్ రూ.లక్షల్లో వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి.గుంటూరు జీజీహెచ్ -
పసికందు వద్దకు చేరిన తల్లి..
సాక్షి, తూర్పుగోదావరి : ఆస్పత్రిలో రెండు రోజుల పసికందును వదిలేసి వెళ్లిపోయిన తల్లిని ఎట్టకేలకు వన్ టౌన్ పోలీసులు మంగళవారం కాకినాడ జీజీహెచ్‌లో వైద్యులకు అప్పగించారు. ఈ కేసు వివరాలను పోలీసులు వెల్లడించారు. వారి కథనం ప్రకారం ఒడిశా కోరాపుట్‌కు చెందిన సుమలత, ఆమె తమ్ముడు, అదే ఊరుకు చెందిన జ్యోతి ఏడాది క్రితం పశ్చిమగోదావరి జిల్లా తణుకు సమీపంలోని కానూరులో కోళ్ల ఫారంలో పని చేసేందుకు వచ్చారు. కోళ్లఫారంలో పని చేస్తున్న పార్వతీపురానికి చెందిన యువకుడు పెళ్లికాని మైనర్ సుమలతను గర్భిణిని చేసి ఉడాయించాడు. అతడి కోసం నిరీక్షించిన ఆమె తొమ్మిది మాసాలు గర్భం మోసి ఈ నెల 9వ తేదీన తణుకులోనే పురుడు పోసుకుంది. శిశువు అనారోగ్యంతో పుట్టింది. దీంతో సుమలతతోపాటు ఆ పసికందును కాకినాడ జీజీహెచ్‌కు 10వ తేదీన తీసుకొచ్చారు. ఈ శిశువును అక్కడ వదిలేసి వారు వెళ్లిపోయారు. ఈ ఘటనపై జీజీహెచ్ సూపరింటెండెంట్ ఎం.రాఘవేంద్రరావు వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ప్రత్యేక బృందాన్ని తణుకులో విచారణ చేసి కానూరులో కోళ్లఫారంలో పని చేస్తున్న సుమలతను తీసుకుని జీజీహెచ్‌కు వచ్చారు. అనారోగ్యంగా ఉన్న పసికందుకు, ఆమెకు వారం రోజుల పాటు వైద్యం అందించాల్సి ఉందని వైద్యులు తెలిపారు. పసికందుకు పిడియాట్రీక్ విభాగాధిపతి ఎంఎస్ రాజు నేతృత్వంలో వైద్యం చేస్తున్నారు. మైనర్ బాలికను మోసం చేసిన యువకుడిని తీసుకొచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. -
ఆస్పత్రిలో ఉరేసుకున్న వివాహిత
సాక్షి, నెల్లూరు (క్రైమ్): అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ వివాహిత ఆస్పత్రిలోనే ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన జీజీహెచ్‌లో శనివారం తెల్లవారుజామున వెలుగులోకి వచ్చింది. పోలీసుల సమాచారం మేరకు.. ఇందుకూరుపేటకు చెందిన రమేష్, విజయలక్ష్మి (34) దంపతులు. వీరికి 14 ఏళ్ల కిందట వివాహమైంది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. వివాహానికి ముందు నుంచే విజయలక్ష్మి నెమ్ము, ఆయాసం సమస్యలతో బాధ పడుతోంది. ఎక్కడ చూపించినా ఆరోగ్యం కుదుట పడలేదు. రెండేళ్ల నుంచి మధుమేహంతో బాధపడుతోంది. భార్యకు క్రమం తప్పకుండా వైద్యం చేయిస్తున్నారు. ఈ నేపథ్యంలో 15 రోజుల కిందట విజయలక్ష్మికి తీవ్ర జ్వరం రావడంతో భర్త, విజయలక్ష్మి తల్లి వేదవల్లి, సోదరుడు బాలాజీ ఆమెను నగరంలోని వివిధ ప్రైవేట్ ఆస్పత్రుల్లో చూపించారు. అయినా జ్వరం తగ్గలేదు. పరిస్థితి విషమంగా ఉంది. దీంతో రమేష్ ఆమెను చికిత్స నిమిత్తం జీజీహెచ్‌లో చేర్పించారు. వైద్య పరీక్షల్లో ఆమెకు టీబీ సోకిందని నిర్ధారణ అయింది. దీంతో విజయలక్ష్మి మనస్థాపానికి గురైంది. శుక్రవారం అర్ధరాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో తాను చికిత్స పొందుతున్న వార్డుకు ఎదురుగా ఉన్న వార్డులోకి వెళ్లి ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. శనివారం తెల్లవారు జామున రమేష్‌కు మెలకువ వచ్చి భార్య కోసం వార్డులోకి వెళ్లగా అక్కడ ఆమె కనిపించలేదు. దీంతో రమేష్ తన బావమరిది బాలాజీని లేపి అందరూ కలిసి ఆమె కోసం వెతుకులాడగా మరో వార్డులో ఆమె ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. ఆత్మహత్యపై ఆస్పత్రి ఔట్‌పోస్టు పోలీసులు దర్గామిట్ట పోలీసులకు సమాచారం అందించారు. దర్గామిట్ట ఎస్సై జిలానీ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ప్రభుత్వ వైద్యులు మృత దేహానికి శవపరీక్ష నిర్వహించి బాధిత కుటుంబసభ్యులకు అప్పగించారు. ఎస్ఐ జిలాని కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
జీజీహెచ్‌లో నరకం చూస్తున్న బాలింతలు
సాక్షి, కాకినాడ సిటీ: పాలకులు మారుతున్నా కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో గర్భిణులు, బాలింతలకు ఇబ్బందులు తొలగడం లేదు. జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు గర్భిణులకు ప్రసూతి సేవలు అందించలేక చేతులెత్తేస్తున్నాయి. కాన్పు కోసం వచ్చే గర్భిణులను హైరిస్క్ కేసులంటూ ప్రైవేట్ ఆసుపత్రులకు తరిమేస్తున్నారు. అక్కడకు వెళ్లే స్తోమత లేని వారు ప్రభుత్వ ఆసుపత్రిలోని ప్రసూతి విభాగానికి వస్తున్నారు. ఇక్కడ తగినంత మంది ప్రసూతి వైద్యనిపుణులు లేకపోవడం ఒక సమస్యైతే.. ప్రసవం అనంతరం బాలింత సంరక్షణ సమస్యగా మారిందని పలువురు విమర్శిస్తున్నారు. ఈ ఆసుపత్రికి ఉభయ గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన పేద, మధ్య తరగతికి చెందిన గర్భిణులు పెద్ద సంఖ్యలో కాకినాడ సామాన్య ఆసుపత్రికి రావడంతో ఆసుపత్రిలో పడకల సమస్య ఉత్పన్నమవుతోంది. ఈ ఆసుపత్రిలో నిత్యం దాదాపు 300 మందికి పైగా గర్భిణులు వస్తుంటే 80 మంది వరకు ప్రసవాలు జరుగుతుంటాయి. వాటిలో దాదాపు 30 మంది వరకు సిజేరియన్ ఆపరేషన్లు చేస్తుంటారు. దీంతో గైనిక్ విభాగంలోని పోస్టునేటల్ వార్డులో బాలింతలు ప్రత్యక్షనరకం చూస్తున్నారు. శుక్రవారం ఉదయం పరిస్థితి చూస్తే ఒకే మంచంపై ఇద్దరు, ముగ్గురు ఉన్న దృశ్యాలు కన్పించాయి. ఏ తల్లిని కదిపినా ఒకటే ఆవేదన. తాను తొమ్మిది నెలలు గర్భిణులతో ఉన్నా ఎటువంటి ఇబ్బంది కన్పించలేదు, కానీ ఆసుపత్రిలో పురుడు పోసుకున్న తరువాత చిన్నారితో ఉండేందుకు పడుతున్న ఇబ్బందులు అంతా ఇంతా కాకుండా ఉన్నాయంటూ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. బాలింత అంటే ఎంతో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు చెబుతున్నా, ఆ జాగ్రత్తలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కన్పించడం లేదని ఆందోళన చెందుతున్నారు. తల్లి చిన్నారుల పక్కన పడుకొని పాలు ఇవ్వాలంటే మరో చిన్నారి ముఖంపై కాళ్లు పెట్టుకునే పరిస్థితి కన్పిస్తోంది. ఎంత మంది జిల్లా అధికారులు సందర్శించినా ఈ పరిస్థితిలో మార్పురాకపోవడం శోచనీయం. కలెక్టర్ కార్తికేయ మిశ్రా పదేపదే ఆసుపత్రిని సందర్శిస్తున్నా గైనిక్ వార్డుల్లోని సమస్యలు పరిష్కరించిన దాఖలాలు కన్పించలేదు. గురువారం ఆసుపత్రిని సందర్శించిన జీజీహెచ్ అభివృద్ధి కమిటీ బృందం, అధికారుల బృందానికి ఒకే మంచంపై ఇద్దరు ముగ్గురు బాలింతలు ఉన్న దృశ్యం కన్పించకపోవడం శోచనీయం. చాలా మంది బాలింతలకు చెందిన బంధువులు ఒకే మంచంపై ఇద్దరు నుంచి ముగ్గురు ఉన్న విషయాన్ని కలెక్టర్, జీజీహెచ్ అభివృద్ధి కమిటీ దృష్టికి తెచ్చినా పట్టించుకోలేదని పలువురు విమర్శిస్తున్నారు. బాలింత మంచంపై పడుకునేందుకు లేదని, ఇద్దరు, ముగ్గురు పిల్లల్ని మంచంపై పరుండబెడితే తల్లులు కింద కూర్చునే పరిస్థితి ఉందని పలువురు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యం గొప్పగా ఉన్నా సౌకర్యాలు లేకపోవడంతో అనేక అవస్థలు పడుతున్నామన్నారు. గర్భిణులుగా ఉన్నప్పుడు తల్లి ఆలనపాలన చూసే కన్నా బాలింతగా ఉన్న సమయంలోనే తల్లి ఆరోగ్యం కోసం పరితపించాల్సిన అవసరం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాలింత పడుకునేందుకు చోటు లేకపోవడంతో సహాయకులుగా ఉన్న వారే కొద్దిసేపు పిల్లలను ఎత్తుకొని తల్లిని మంచపై పడుకోబెడుతున్నామంటున్నారు. కొన్ని మంచాల వద్ద బాలింతలు రోజంతా నిద్రలేకుండానే గడుపుతున్నారని ఆవేదన చెందుతున్నారు. బాలింత ఉండేందుకు చోటు లేదు తాము జగ్గంపేట నుంచి వచ్చాం. తన భార్యకు పురుడు వచ్చింది. ఆసుపత్రిలో ఒక్కొక్క మంచానికి ఇద్దరు, ముగ్గురు చొప్పున వేస్తున్నారు. మంచాలు ఒకరికన్నా ఎక్కువ ఉండేందుకు సరిపోవడం లేదు. చేసేది లేక పిల్లను మంచంపై ఉంచి బాలింతను పక్కనే పీట మీద కూర్చోబెడుతున్నాం. బాలింతలు పరిస్థితి చూస్తే ఎవరికైనా బాధ కలుగుతుంది. – జి.రామకృష్ణ, జగ్గంపేట గర్భిణుల కన్నా బాలింతకే ఎక్కువ బాధ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లేందుకు స్థోమత లేక ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి పురుడు పోయిస్తే గర్భిణులుగా ఉన్న సమయం కన్నా బాలింతగానే ఎక్కువగా బాధను అనుభవిస్తున్నాం. తల్లి పడుకునేందుకు చోటులేక తల్లి బిడ్డ కూడా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అంతేకాకుండా వీరికి ఆసరాగా వచ్చిన మాలాంటి వారు మరింత ఇబ్బందులు పడుతున్నారు. ఒకే మంచానికి ముగ్గురు చొప్పున వేస్తుంటే తల్లీబిడ్డ పడుతున్న ఇబ్బందులు చూడలేకపోతున్నాం. – అమరావతి, బాలింత తల్లి, కాకినాడ -
ఆమె కాళ్లను కుక్కలు, పందులు పీక్కు తినేసి..
నెల్లూరు(బారకాసు): నెల్లూరులోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని ఓ మహిళ మృతదేహం కాళ్లను కుక్కలు, పందులు పీక్కు తినేసిన ఘటన పలువురిని తీవ్రంగా కలచివేసింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ హృదయవిదారక ఘటన ఆస్పత్రిలోని మెటర్నిటీ విభాగం భవనానికి ఎదురుగా ఉన్న ప్రాంగణంలో చోటు చేసుకుంది. అక్కడున్నవారు చెబుతున్న వివరాల ప్రకారం.. సుమారు 50 ఏళ్ల వయస్సున్న ఓ మహిళ అనారోగ్య కారణంగా చికిత్స నిమిత్తం జీజీహెచ్‌కు మూడురోజుల క్రితం వచ్చింది. ఆమె ఆస్పత్రి భవనం ఎదురుగా ఉన్న ప్రాంగణంలోని చెట్ల కింద సేద తీరేది. అక్కడే ఉన్న అనేక మంది రోగుల అటెండర్లు ఆమెను చూశారు. అయితే వివరాలు ఎవరికీ తెలియదు. ఆమె బుధవారం రాత్రి మృతి చెందినా ఎవరూ గుర్తించలేదు. ఆమె నిద్రపోతోందని భావించారు. గురువారం ఉదయం శానిటేషన్ సిబ్బంది చూడగా ఆమె కాళ్లను కుక్కలు, పందులు పీక్కు తినేసి ఉన్నాయి. మృతదేహంపై దుస్తులు లేవు. శానిటేషన్ సిబ్బంది ఆస్పత్రి అధికారులకు విషయాన్ని తెలియజేశారు. దీంతో అధికారులు అక్కడికి వచ్చి మృతదేహాన్ని చూసి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు వచ్చి మృతదేహాన్ని చూసి కేసు నమోదు చేసుకున్న అనంతరం మార్చురీకి తరలించారు. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరిగిందనే విమర్శలున్నాయి. కొంతమంది వృద్ధ అనాథలు ఇక్కడి ప్రాంగణంలోకి వచ్చి మృతి చెందడం వంటి ఘటనలు ఇటీవల ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయని చెబుతున్నారు. వైద్య కళాశాలకు సంబంధించి 120 మంది సిబ్బంది ఉన్నా పట్టించుకోకపోవడం దారుణమని ఆస్పత్రికి వచ్చిన రోగులు, వారి బంధువులు విమర్శలు గుప్పిస్తున్నారు. గుర్తించి చర్యలు తీసుకున్నాం.. జీజీహెచ్ ప్రాంగణంలో ఉన్న మెటర్నిటీ విభాగపు భవనానికి ఎదురుగా ఉన్న ప్రాంగణంలోని చెట్ల కింద రోజూ రోగుల అటెండెంట్లు సేద తీరుతుంటారు. అయితే ఎవరో గుర్తు తెలియని ఓ మహిళ బుధవారం రోజున వచ్చి ఆచెట్ల కింద ఉన్నట్లుంది. అదేరోజు రాత్రి మృతి చెందినట్లు భావిస్తున్నాం. గురువారం ఉదయం 6గంటలకు శానిటేషన్ సిబ్బంది గుర్తించి తమకు తెలియజేయగా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాం. ఎవరైనా గుర్తుపట్టి వస్తే మృతదేహాన్ని అప్పగిస్తాం. సమాచారం తెలిసిన వెంటనే తీసుకోవాల్సిన చర్యలన్నీ తక్షణమే తీసుకున్నాం. –డాక్టర్ శ్రీనివాసరావు, సూపరింటెండెంట్, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి -
స్వైన్‌ఫ్లూతో మహిళ మృతి
గుంటూరు, తాడేపల్లి రూరల్(మంగళగిరి): తాడేపల్లి మండలం గుండిమెడ గ్రామంలో స్వైన్‌ఫ్లూ లక్షణాలతో ఓ మహిళ మృతిచెందింది. గుండిమెడ గ్రామానికి చెందిన పునుకుపాటి నర్సమ్మ (34) కూలి పనులు చేసుకొని, భర్త పిల్లలతో నివాసం ఉంటోంది. రెండు వారాల క్రితం ఆమె జలుబు తీవ్ర జ్వరంతో బాధపడుతుండటంతో నరసరావుపేటలోని బంధువుల ఇంటికి వెళ్లి అక్కడ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యం చేయించుకుంది. అక్కడి వైద్యులు స్వైన్‌ఫ్లూ సోకిందని చెప్పారని బంధువులు తెలిపారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడం, కార్పొరేట్ వైద్యం చేయించేందుకు డబ్బులు లేకపోవడంతో బంధువులు గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆమె ప్రభుత్వస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతిచెందింది. ఆమె మృతదేహాన్ని గుండిమెడకు తీసుకొచ్చారు. స్వైన్‌ఫ్లూతో నర్సమ్మ మృతి చెందిందని ప్రచారం జరగడంతో తాడేపల్లి ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ రమేష్‌నాయక్ ఆమె ఇంటికి వెళ్లి గుంటూరు ప్రభుత్వ వైద్యులు ఇచ్చిన రిపోర్టులు పరిశీలించారు. నర్సమ్మ సుగర్ రోగి అని, థైరాయిడ్‌కు కూడా మందులు వాడుతోందని, ఎక్కడా స్వైన్‌ఫ్లూ టెస్ట్‌లు చేయలేదని, ప్రైవేటు వైద్యులు సస్పెక్టెడ్ స్వైన్‌ఫ్లూగా ట్రీట్మెంట్ ఇచ్చారని తెలిపారు. గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో మృతిచెందిన నర్సమ్మకు ఆల్కలైన్ ఎసిడోసిస్, బైలేటరల్ లంగ్స్ న్యూమోనియాగా నిర్ధారించారని వివరించారు. -
రక్తహీనతతో బాలింత మృతి
తూర్పుగోదావరి, రాజవొమ్మంగి (రంపచోడవరం): బడదనాంపల్లి గ్రామానికి చెందిన గిరిజన బాలింత చిర్లం శిరీష్ (22) కాకినాడ జీజీహెచ్‌లో రక్తహీనతతో సోమవారం రాత్రి మరణించింది. ఈమె ఈ నెల 4న రాజవొమ్మంగి పీహెచ్సీలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. బీపీతో నీరసంగా ఉందని ఆమెను వైద్యులు ఆస్పత్రిలోని బర్త్ వెయిటింగ్ రూంలోనే 6వ తేదీ వరకు ఉంచారు. ఆమెకు ఫిట్స్ రావడంతో కాకినాడ తరలించారు. ఆమెకు కామెర్లు ఉన్నాయని గుర్తించిన వైద్యులు చికిత్స ప్రారంభించారు. ఆమెకు కిడ్నీలు మందగించడంతో చికిత్స పొందుతూ మరణించిందని మృతురాలి భర్త సత్తిబాబు విలేకరులకు తెలిపారు. రాత్రి అంబులెన్స్ లేకపోవడంతో వారు రూ.5 వేలు ఖర్చు చేసి అతికష్టంతో మృతదేహాన్ని మంగళవారం స్వగ్రామానికి తరలించారు. ఆమె మృతితో తొలి కాన్పులో పుట్టిన రెండేళ్ల పాప, 8 రోజుల పసికందు తల్లిలేని వారయ్యారని గ్రామస్తులు వాపోయారు. -
డాక్టర్ల నిర్లక్ష్యానికి పసికందు బలి
నెల్లూరు(బారకాసు): జీజీహెచ్ వైద్యుల నిర్లక్ష్యంగా కారణంగా కాన్పుచేసిన కొద్దిసేపటికే శిశువు (మగ) మృతిచెందింది. తమ బిడ్డ మృతికి కారణం ప్రభుత్వ వైద్యులేనని బాధితులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన నెల్లూరు నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ప్రసూతి విభాగంలో గురువారం చోటుచేసుకుంది. బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నగరంలోని కొత్తూరు సమీపంలో ఉన్న శ్రీలంకకాలనీకి చెందిన రవికుమార్ తన భార్య సోనీని కాన్పుకోసం ఈనెల 14వ తేదీ సాయంత్రం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలోని ప్రసూతి విభాగంలో చేర్పించాడు. వైద్యులు ఆమెను పరీక్షించి సాధారణ కాన్పు చేస్తామని తెలియజేశారు. 16వ తేదీ అర్ధరాత్రి సోనీకి నొప్పులు అధికం కావడంతో కాన్పుకోసం ఆపరేషన్ థియేటర్‌కి తీసుకెళ్లారు. కడుపులో బిడ్డ అడ్డం తిరిగిందని సాధారణ కాన్పు చేయడం కష్టతరమని ఆపరేషన్ చేసి బిడ్డను తీయాల్సి వస్తోందని డాక్టర్లు రవికుమార్‌తోపాటు కుటుంబసభ్యులకు తెలిపారు. వారు సమ్మతించడంతో డాక్టర్ సోనీకి సిజేరియన్ ద్వారా కాన్పు చేసి బిడ్డను బయటకు తీశారు. శిశువుకు గుండె సమస్య ఉందని చెప్పిన వైద్యులు మరో అర్ధగంట తర్వాత మృతిచెందిందని బాధితులకు అప్పగించారు. రవికుమార్ కుటుంబసభ్యులు బాధపడుతూ శిశువు మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లారు. రక్తం రావడంతో.. గురువారం ఉదయం శిశువుకు దహన సంస్కారాలు చేసే సమయంలో బిడ్డ తల నుంచి రక్తం కారుతుండడాన్ని గుర్తించారు. వెంటనే శిశువుకు చుట్టిన తెల్లగుడ్డ తీసి చూడగా తలకు కత్తిగాటు కనిపించింది. వెంటనే రవికుమార్ కుటుంబసభ్యులు, బంధువులు శిశువుని తీసుకుని దర్గామిట్ట పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే బిడ్డ మృతిచెందిందని లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అక్కడి నుంచి జీజీహెచ్‌కి వెళ్లి వైద్యులు నిర్లక్ష్యంగా ఆపరేషన్ చేయడంతో శిశువు చనిపోయిందని ఆందోళనకు దిగారు. సదరు డాక్టర్లను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాసరావు ప్రసూతి విభాగం వద్దకు వచ్చి బాధితులతో మాట్లాడారు. విచారణ జరిపిస్తామని తప్పు చేసిన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని బాధితులకు తెలియజేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శిశువు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి దర్యాప్తు చేస్తున్నారు. విచారణ కమిటీ వేశాం శిశువు మృతి ఘటనపై కలెక్టర్, డీఎంఈకి నివేదిక పంపించాం. విచారణ కమిటీ నియమించడం జరిగింది. రెండురోజుల్లో విచారణ నివేదికను తనకు అందజేయాలని ఆదేశించా. నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ శ్రీనివాసరావు,సూపరింటెండెంట్ -
అతివేగం ప్రాణాలు తీసింది
సాక్షి, గుంటూరు/గుంటూరు రూరల్/గుంటూరు ఈస్ట్: అప్పటివరకూ ఆనందంగా గడిపిన స్నేహితులు కొన్ని క్షణాల్లో మృత్యుఒడిలోకి చేరుకున్నారు. సరదాగా షాపింగ్‌కు వెళదామని ప్రయాణమైన వారు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.కళాశాలకు వెళ్లొస్తానమ్మా అని చెప్పి వెళ్లిన తమ కుమారులను మృత్యువు కబళించింది అని తెలిసి ఆ తల్లిదండ్రులు శోకసంద్రంలోకి మునిగిపోయారు. కొన్ని నిమిషాల ముందు తరగతి గదిలో తమకు అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పిన స్నేహితులు ఇక తిరిగిరారని తెలుసుకున్న తోటి విద్యార్థులు కన్నీరు మున్నీరయ్యారు. మితిమీరిన వేగం.. తరగతులకు తిరిగి హాజరవ్వాలనే ఆతృత నలుగురి ప్రాణాలను బలి తీసుకుంది. గుంటూరు రూరల్ మండలంలోని లాలుపురం శివారు ప్రాంతంలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు బీటెక్ విద్యార్థులు దుర్మరణం పాలుకాగా, ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంలో గుంటూరు రూరల్ మండలం చౌడవరం గ్రామంలోని ఆర్వీఆర్ జేసీ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం (ఈసీఈ) చదువుతున్న గుంటూరు విద్యానగర్‌కు చెందిన సాదినేని వెంకట సుబ్బారావు కుమారుడు సాదినేని ధనుష్ (18), శావల్యాపురం మండలం కొత్తలూరు గ్రామ శివారు తుమ్మలగుంట గ్రామ మాజీ సర్పంచ్ గుంటూరు సాంబశివరావు కుమారుడు కోటేశ్వరరావు (19), పెదకూరపాడు మండలం, కంభంపాడు గ్రామానికి చెందిన చిరుమామిళ్ల రమేశ్ కుమారుడు సాయిరాం(18), పిడుగురాళ్లకు చెందిన షేక్ బాలసైదా కుమారుడు షేక్ గఫూర్ (18) మృతి చెందగా, గుంటూరు ఇన్నర్ రింగ్‌రోడ్డు ప్రాంతానికి చెందిన ఆలోకం తారక్ హీరేంద్ర, ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన దొప్పలపూడి సత్య కౌశిక్, ప్రకాశం జిల్లా సంతమాగులూరుకు చెందిన ఆళ్ల శివాజీ గాయపడ్డారు. సంఘటన జరిగిందిలా... ఉదయం కళాశాలకు వచ్చిన విద్యార్థులు ఇంగ్లిష్ క్లాస్ లేకపోవడంతో గుంటూరు నగరంలో న్యూఇయర్ షాపింగ్ చేసుకుని తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యే వేరే క్లాస్‌కు హాజరవుదామని తోటి విద్యార్థి దొప్పలపూడి సత్య కౌశిక్‌కు చెందిన ఏపీ27 బీటి 0567 నంబర్ గల ఐ–20 కారులో బయల్దేరారు. అయితే కారు గుంటూరు నగర శివారులోని బైపాస్ చేరుకోగానే విజయవాడలో షాపింగ్ చేద్దామని నిర్ణయించుకుని కారు ఎన్‌హెచ్16 మీదుగా అటువైపు మళ్లించారు. హైవే రెండు కిలోమీటర్లు ప్రయాణించాక ముందు వెళ్తున్న మున్సిపల్ చెత్త తరలించే లారీని ఓవర్టేక్ చేయబోయి లారీ వెనుక భాగంలో కారు బలంగా ఢీ కొంది. అప్పటికే 160 కి.మీ వేగంలో ఉన్న కారు పక్కనే ఉన్న డివైడర్ ఎక్కి సుమారు 30 మీటర్లు దూసుకెళ్లి డివైడర్‌లోని స్తంభాన్ని ఢీకొట్టింది. అనంతరం సుమారు 20–30 అడుగుల ఎత్తులో గాలిలో పల్టీలు కొట్టుకుంటూ 50 మీటర్ల దూరంలో పడింది. కారు ఢీకొట్టడంతో లారీ సైతం బైపాస్ ఎడమ వైపునున్న ఇనుప రెయిలింగ్‌ను ఢీకొని బోల్తాపడింది. దీంతో లారీ డ్రైవర్ దేవరపల్లి కిరణ్‌కుమార్, క్లీనర్ దూపాటి రాంచరణ్, మున్సిపల్ కార్మికుడు భూపతి రుద్రయ్య గాయపడ్డారు. వీరికి గుంటూరు జీజీహెచ్‌లో ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం డిశ్చార్జి చేశారు. ఘటనా స్థలంలో ముగ్గురి మృతి... కారు నుజ్జునుజ్జు కావడంతో ఘటనా స్థలంలోనే ముగ్గురు మృతి చెందారు. కారు వేగానికి వీరి మృతదేహాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. తీవ్ర గాయాలపాలైన షేక్ గఫూర్ గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. తీవ్ర గాయాలపాలైన తారక్ హీరేంద్రను మెరుగైన చికిత్స కోసం జీజీహెచ్ నుంచి స్థానిక రమేశ్ హాస్పిటల్‌కు తరలించారు. సీటు బెల్టు పెట్టుకుని డ్రైవింగ్ చేస్తున్న సత్య కౌశిక్ క్షేమంగానే ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు. సంఘటనా స్థలానికి గుంటూరు అర్బన్ జిల్లా ఎస్పీ సీహెచ్ విజయారావు, ఏఎస్పీ వైటీ నాయుడు వచ్చి పరిశీలించారు. మృతదేహాలను జీజీహెచ్ మార్చురీకి తరలించారు. సౌత్ డీఎస్పీ ఆర్వీఎస్ఎన్ మూర్తి, ఆర్డీవో వీరబ్రహ్మం, తహసీల్దారు నాగిరెడ్డి జీజీహెచ్‌కు వచ్చి విచారణ జరిపారు. జీజీహెచ్ వద్ద మిన్నంటిన రోదనలు రోడ్డు ప్రమాదం ఘటన సమాచారం తెలియగానే విద్యార్థుల తల్లిదండ్రులు, బంధువులు, సహ విద్యార్థులు, మిత్రులు పెద్ద సంఖ్యలో జీజీహెచ్‌కు చేరుకున్నారు. మృతిచెందిన, గాయపడిన విద్యార్థుల బంధువులు, తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. గఫూర్ తండ్రి బాలసైదా, తల్లి సైదాబి, బంధువులు తమ కుమారుడి మృతదేహం చూసి గుండెలవిసేలా రోదించారు. తాము ఇంకెవరి కోసం జీవించాలంటూ కన్నీరు మున్నీరయ్యారు. ధనుష్ తండ్రి వెంకటసుబ్బారావు ఇంటి వద్దే కుప్పకూలి పడిపోయారు. కోటేశ్వరరావు తండ్రి సాంబశివరావు, తల్లి మల్లేశ్వరి మార్చురీలోని కుమారుడి మృతదేహం చూసి పడిన వేదన వర్ణనాతీతం. చిరుమామిళ్ల సాయిరామ్ తండ్రి రమేష్‌బాబు గుండెలవిసేలా రోదించి స్పృహ తప్పిపడిపోగా, ఆయన్ను వాహనంలో కంభంపాడుకు తరలించారు. రోడ్డు ప్రమాదాల్లోనే ఇద్దరు కుమారులను కోల్పోయిన ధనుష్ తల్లిదండ్రులు పట్నంబజారు (గుంటూరు): ఆ కుటుంబంపై విధి చిన్నచూపు చూసింది. ఇద్దరు కుమారులినీ రోడ్డు ప్రమాదాలే బలితీసుకున్నాయి. ఏడాది క్రితం రోడ్డు ప్రమాదంలోనే మృతి చెందిన పెద్ద కుమారుడి స్మృతులను మరువలేకుండా ఉన్న సాధినేని వెంకట సుబ్బారావు, జ్యోతి దంపతులకు ఇప్పుడు చిన్న కుమారుడు ధనుష్ మృతి అంతులేని విషాధాన్ని మిగిల్చింది. బిల్డర్ అయిన వెంకటసుబ్బారావు ఇద్దరు సంతానం. పెద్దకుమారుడు శ్రీకళ్యాణ్ (24), చిన్నకుమారుడు ధనుష్. చెన్నైలో బీటెక్ నాలుగో సంవత్సరం అభ్యసిస్తున్న సమయంలో 2017 డిసెంబర్ 16న శ్రీకళ్యాణ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. పదిహేను రోజుల క్రితమే శ్రీకళ్యాణ్ సంవత్సరీకం జరిగింది. ఆ బాధను మరువక ముందే.. చిన్నకుమారుడు ధనుష్ కూడా రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడని విషయం తెలిసి ఆ దంపతులు కన్నీటి సంద్రంలో మునిగిపోయారు. మృత్యువాత పడ్డ షేక్ గఫూర్ తండ్రి బాల సైదా కారు డ్రైవర్‌గా పనిచేస్తూ కష్టపడి తన కుమారుడిని బీటెక్ చదివిస్తున్నాడు. చిన్నతనం నుంచే గఫూర్ చదువులో ప్రతిభ చూపేవాడని ఎంసెట్‌లో మంచి ర్యాంక్ సాధించాడని బంధువులు తెలిపారు. సివిల్స్ లక్ష్యమని ఎప్పుడూ చెబుతూ ఉండేవాడని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన వైఎస్ జగన్ గుంటూరు జిల్లాలో నలుగురు ఇంజనీరింగ్ విద్యార్థుల మృతి చెందారన్న విషయం తెలిసి ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చలించి పోయారు. ప్రమాదం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. -
సీఎం సారూ.. ఇవిగో వేదనాశ్రువులు
పేదల ఆస్పత్రిగా పేరు పొందిన గుంటూరు జీజీహెచ్‌లోఅడుగడుగునా సమస్యలు తిష్టవేశాయి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆస్పత్రి కీర్తి మసకబారుతోంది. వైద్య పరికరాలు సమకూర్చడంలో, వసతుల కల్పనలో ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యం పేదలను ఉచిత వైద్యానికి దూరం చేస్తోంది. అవసరమైన పడకలు లేక, వైద్య సిబ్బంది కరువై గుండెమార్పిడి, మోకీళ్ల ఆపరేషన్లు సైతం నిలిచిపోయాయి. సాక్షి, గుంటూరు: స్థానిక ప్రభుత్వ వైద్య కళాశాలలో చదువుకున్న అనేక మంది వైద్యులు జీజీహెచ్‌లో ఉచిత వైద్య సేవలు అందించేందుకు ముందుకు వస్తున్నారు. పీపీపీ విధానం ద్వారా ఇప్పటికే జీజీహెచ్ మిలీనియం బ్లాక్‌లో సహృదయ ట్రస్టు ఆధ్వర్యంలో డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే వైద్య బృందం 550 వరకూ గుండె ఆపరేషన్లు చేశారు. దాతల సాయం, సొంత డబ్బులతో నలుగురు నిరుపేద రోగులకు గుండె మార్పిడి ఆపరేషన్లు నిర్వహించి దేశంలోనే అత్యున్నత స్థాయిలో నిలిపారు. గుండె మార్పిడి ఆపరేషన్లు ఉచితంగా ఆరోగ్యశ్రీలో చేర్చాలని డాక్టర్ గోఖలే ఉన్నతాధికారులను కోరడంతో సరేనని నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. నిధులు మాత్రం మంజూరు చేయలేదు. ఆపరేషన్లు మాత్రం జరగడం లేదు. పడకలు, సిబ్బంది కొరతతో ఇక్కట్లు... జీజీహెచ్‌లో పడకల సంఖ్యను 50 శాతం పెంచాలని అధికారులు ప్రభుత్వానికి లేఖ రాశారు. ఆస్పత్రిలో 1177 పడకలు ఉండగా అదనంగా 589 పడకలు కావాలని కోరారు. అప్పటి ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ పడకలు పెంచుతామంటూ హామీ ఇచ్చారు. మూడేళ్లు గడిచినా అమలుకు మాత్రం నోచుకోలేదు. అదనపు పడకలు మంజూరు చేస్తే డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్, నాల్గో తరగతి ఉద్యోగుల పోస్టులు మంజూరవుతాయి. ప్రస్తుతం సరిపడా పడకలు లేకపోవటంతో ఒకే పడకపై ఇద్దరు లేదా ముగ్గురు రోగులు ఉండాల్సిన దుస్థితి నెలకొంది. రోజుకు 3500 నుంచి 4000 మంది రోగులు ఓపీలో చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రిలో 60 ఏళ్ల క్రితం మంజూరు చేసిన పడకలు, పోస్టులే నేటికీ ఉన్నాయి. ఆస్పత్రిలో 5 ప్రొఫెసర్, 30 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంది. నర్సులు కేవలం 186 మంది మాత్రమే ఉన్నారు. ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ నిబంధనల ప్రకారం సుమారు 400 మంది ఉండాలి. గుండె మార్పిడి, కిడ్నీ మార్పిడి, మోకీళ్ల మార్పిడి ఆపరేషన్లు పెద్దాసుపత్రిలో చేస్తూ ఉండటంతో రోగులు సంఖ్య రోజురోజుకు పెరిగిపోతూ ఉంది. గుండె మార్పిడి ఆపరేషన్లకు ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవటంతో సుమారు 25 మంది ఆపరేషన్ల కోసం ఎదురు చూస్తున్నారు. మోకీళ్ల మార్పిడి ఆపరేషన్లకు కోసం 700 మంది పేర్లు నమోదు చేసుకున్నారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవటంతో వీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మందులు బయట కొనుక్కోవాల్సిన దుస్థితి జీజీహెచ్‌లో రెండేళ్లుగా మందుల కొనుగోలుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం లేదు. సర్జికల్ బడ్జెట్ సైతం నిలిపివేయడంతో ఆపరేషన్ చేయించుకునే రోగులే సర్జికల్ బ్లేడ్లు, ఇంజెక్షన్లు, కాటన్ వంటివి కొనుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడింది. సర్జికల్, మెడిసిన్ కొనుగోలుకు మూడు నెలలకు రూ.60 లక్షల చొప్పున మంజూరు చేయాల్సి ఉండగా, 25 నెలలుగా సర్జికల్ బడ్జెట్, 14 నెలలుగా మెడికల్ బడ్జెట్‌ను నిలిపివేశారు. ఎంసీహెచ్ వార్డుకు రెండోసారి శంకుస్థాపన రూ.65 కోట్లతో మాతాశిశు సంరక్షణ కేంద్రం(ఎంసీహెచ్) నిర్మించేందుకు 2015 అక్టోబర్ 2Ðన సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి ఒక్క ఇటుక పడలేదు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరోసారి సీఎం శంకుస్థాపన చేస్తున్నారు. -
వైద్యుల గదిలో ఉన్మాది విధ్వంసకాండ
గుంటూరు ఈస్ట్: ఆత్మహత్యాయత్నం చేసి జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి ఉన్మాద స్థితిలో 103 వార్డులోని వైద్యుల గదిలో వస్తువులను ధ్వంసం చేసిన ఘటన శుక్రవారం రాత్రి కలకలం రేపింది. కొత్తపేట ఎస్హెచ్ఓ మధుసూదనరావు తెలిపిన వివరాలప్రకారం నంబూరులోని విజయభాస్కర్ కాలనీకిచెందిన దేవరకొండ ముక్తేశ్వరరావు అనే వ్యక్తి మద్యానికి బానిస అయ్యాడు.మద్యం మత్తులో ఈ నెల 10వ తేదీ విష గుళికలు మింగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు అతనిని జీజీహెచ్‌లో చేర్పించగా 103 వ వార్డులో చికిత్స పొందుతున్నాడు. శుక్రవారం రాత్రి వార్డులో నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. సెక్యూరిటీ గార్డులు అతనిని అడ్డుకున్నారు. ముక్తేశ్వరరావు వారితో ఘర్షణపడి వేగంగా 103 వ వార్డులోకి ప్రవేశించాడు. వైద్యులు ఉండే గదిలోకి వెళ్లి సెలైన్ రాడ్ తీసుకుని ఎల్ఈడీ టీవీ, కంప్యూటర్, సీలింగ్‌లను ధ్వంసం చేశాడు. అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది చాకచక్యంగా అతనిని పట్టుకున్నారు. కొత్తపేట ఎస్హెచ్ఓ మధుసూదనరావు, సిబ్బంది ముక్తేశ్వరరావును అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. -
రోడ్డుపై ఆబోతుల పోట్లాట
తూర్పుగోదావరి , జగన్నాథపురం (కాకినాడ రూరల్): రానున్నది ఎన్నికల కాలం. ప్రత్యర్థుల మధ్య హోరాహోరీ పోటీ తథ్యం. ఈ విషయాన్ని ముందే కనిపెట్టాయో ఏమో.. రెండు ఆబోతులు ఆదివారం ఇంద్రపాలెం–మామిడాడ రహదారిలో ఆంధ్రా బ్యాంకు సమీపంలో హోరాహోరీగా పోట్లాడుకున్నాయి. అటుగా వెళ్తున్న ఒక వ్యక్తి వాటిని విడిపించడానికి టైర్ ట్యూబ్‌తో కొడుతుంటే ఒక్కసారిగా వాటిలోని ఒక ఎద్దు ఆ వ్యక్తిని ఎత్తి పడేసింది. దీంతో ఆ వ్యక్తి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. వెంటనే స్థానికులు అతడిని జీజీహెచ్‌కి తరలించారు. అటుగా ‘సాక్షి’ కెమెరా క్లిక్‌మనిపించింది. -
ఆదుకుంటామన్నారు.. పట్టించుకోలేదు
తాడేపల్లి రూరల్(మంగళగిరి): వైద్యుల నిర్లక్ష్యం వల్ల బిడ్డను పోగొట్టుకొని అన్ని విధాలా నష్టపోయిన తమను ఆదుకుంటామన్న రాష్ట్ర ప్రభుత్వం ఆ తర్వాత పట్టించుకోలేదని.. ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసినా న్యాయం జరగలేదంటూ గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో ఎలుకలు కొరకడంతో మృతి చెందిన పసికందు తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. మరోవైపు కోర్టులో పెట్టిన కేసును విత్ డ్రా చేసుకోవాలంటూ గుంటూరు ప్రభుత్వాస్పత్రి వైద్యులు బెదిరింపులకు దిగుతున్నారని వాపోయింది. డిసెంబర్ 6న కోర్టు వాయిదా ఉందని.. దానికి వెళ్లాలంటేనే భయమేస్తోందని తెలిపింది. వీటిపై తన గోడు వెళ్లబోసుకునేందుకు సోమవారం ఆమె ఉండవలి–అమరావతి కరకట్ట వెంట ఉన్న సీఎం చంద్రబాబు నివాసం వద్దకు వచ్చింది. అయితే ఆమెకు మళ్లీ నిరాశే ఎదురైంది. దీంతో అక్కడే ఉన్న మీడియా వద్ద బాధితురాలు చావలి లక్ష్మి తన బాధ చెప్పుకున్నారు. ‘2015 ఆగస్టు 20న విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో డెలివరీ అయ్యింది. మగబిడ్డ పుట్టగా.. సమస్య ఉందంటూ మెరుగైన చికిత్స కోసం గుంటూరుకు పంపించారు. గుంటూరు వైద్యులు ఆపరేషన్ చేసి.. వార్డులోకి ఎవరినీ రానివ్వలేదు. 2015 ఆగస్టు 26న వార్డులో ఎలుకలు కొరకడంతో.. మా బిడ్డ చనిపోయాడు. దానిపై ప్రభుత్వం విచారణ చేయగా వైద్యులదే తప్పని తేలింది. అప్పటి వైద్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు, కలెక్టర్ కాంతిలాల్ దండే మమ్మల్ని పరామర్శించి.. నష్టపరిహారంగా రూ.10 లక్షలు అందజేస్తామన్నారు. కానీ రూ.5 లక్షలే ఇచ్చారు. ప్రభుత్వం మాత్రం మాకు రూ.10 లక్షలు ఇచ్చినట్టు ప్రచారం చేసుకుంటోంది. అలాగే పక్కా నివాసం, ఉద్యోగం ఇస్తామన్నారు. వీటి గురించి కృష్ణా జిల్లా కలెక్టర్‌ను ఎన్నిసార్లు కలిసినా ప్రయోజనం లేకుండా పోయింది. ముఖ్యమంత్రికి చెప్పుకుందామని ఏడుసార్లు ఆయన ఇంటి వద్దకు వచ్చాం. ఈ ఏడాది జూన్ 23న, ఆగస్టు 6న రెండు సార్లు సీఎంతో మాట్లాడాం. కలిసిన ప్రతిసారీ కలెక్టర్ దగ్గరకు వెళ్లాలని చెబుతున్నారు. కలెక్టర్‌ను కలిస్తే.. ఆయన తమకు ఉత్తర్వులేమీ రాలేదని చెబుతున్నారు. -
మృతదేహాలకు ట్యాగింగ్!
గుంటూరు మెడికల్ : రాష్ట్ర రాజధాని ఆస్పత్రి గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ చనిపోయిన వారికి పోస్టుమార్టం చేయాల్సినప్పుడు మృతదేహాం తారుమారు కాకుండా ఉండేందుకు ట్యాగింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసేందుకు ఆస్పత్రి అధికారులు రంగం సిద్ధం చేశారు. ఈ మేరకు గురువారం ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ దేవనబోయిన శౌరిరాజునాయుడు, ఆస్పత్రి అడ్మినిస్ట్రేటర్ బచ్చు ప్రవీణ్‌కుమార్, ఫోరెన్సిక్ వైద్య విభాగాధిపతి డాక్టర్ టీటీకె రెడ్డి ట్యాగ్లు ఏర్పాటు చేయటంపై చర్చించారు. కొన్ని రకాల ట్యాగింగ్‌లను పరిశీలించారు. కాగితాలపై నమోదుతో తారుమారు! గుంటూరు జీజీహెచ్‌లో రోడ్డు ప్రమాదంలో గాయపడి, కత్తిపోట్లకు గురై, శరీరం కాలి, విషప్రభావానికి గురై, కొట్లాటలో గాయపడి, ఇతర సందర్భాల్లో చికిత్స పొందుతున్న వ్యక్తి చనిపోయిన పిదప మెడికో లీగల్ కేసులను తప్పనిసరిగా పోస్టుమార్టం చేయాల్సి ఉంటుంది. జీజీహెచ్‌లో ప్రతిరోజూ పదిమందికి పోస్టుమార్టం చేస్తున్నారు. పోలీసులు వచ్చి విచారణ చేసి ఇంక్వెస్టు రిపోర్టు వైద్యులకు ఇచ్చే సరికి ఒక రోజు లేదా ఒక పూట సమయం పడుతుంది. కొన్ని క్లిష్టమైన కేసులకు రెండు రోజులు లేదా అంతకంటే ఎక్కువ సమయం పట్టవచ్చు. పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని శవాగారంలో భద్రం చేసేందుకు కాగితాలపై పెన్నుతో వివరాలు రాసి మృతదేహం ఉంచిన బాక్స్ వద్ద అంటిస్తున్నారు. ఆస్పత్రి శవాగారంలో 30 మృతదేహాలను నిల్వచేసే సామర్థ్యం ఉంది. మృతదేహాలు పాడవ్వకుండా అతిశీతలీకరణం చేయటం వల్ల కొన్నిసార్లు కాగితాలపై మృతదేహానికి సంబం«ధించిన వివరాలు చెరిగిపోతున్నాయి. దీని వల్ల మృతదేహాలకు సంబంధించిన వివరాలు కొన్నిసార్లు తారుమారు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తుగా ట్యాగ్లు ఏర్పాటు చేసేందుకు ఆస్పత్రి అధికారులు చర్యలు చేపట్టనున్నారు. ఉచితంగా చాపలు, వస్త్రాలు.. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు రెండు చాపల్లో చుట్టి, తెల్లటి గాజు వస్త్రంలో చుట్టి అందజేస్తారు. గతంలో చాపలు, వస్త్రాలను ఆస్పత్రి అధికారులే హెచ్‌డీఎస్ నిధుల నుంచి కొనుగోలు చేసి ఉచితంగా అందజేశారు. ఇలా చేయటం ద్వారా శవాగారంలో వస్త్రాలు, చాపలు, విస్రా బాటిల్స్ కోసం చనిపోయిన వారి బంధువుల నుంచి వైద్య సిబ్బంది డబ్బులు వసూలు చేయటాన్ని నిలువరించారు. మూడేళ్ళపాటు సత్ఫలితాలు ఇచ్చిన ఈ విధానాన్ని రెండున్నరేళ్ళ కిత్రం అర్ధాంతరంగా ఆపివేశారు. కొంతమంది ఆస్పత్రుల్లో పనిచేస్తున్న వైద్య సిబ్బంది చాపలు, వస్త్రాలను సైడ్ బిజినెస్‌గా నిర్వహిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. మార్చురీ ఎదురుగా ఉంటే షాపుల్లో వాటిని అందుబాటులో ఉంచి వైద్య సిబ్బంది అమ్మిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఇటీవల కాలంలో చాపలు, వస్త్రాల కోసం మార్చురీలో డబ్బులు అడుగుతున్నారనే కథనాలు మీడియాలో రావటంతో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్( డీఎంఈ) అధికారులు చాపలు, వస్త్రాలను ఉచితంగా అందించాలనే ఆలోచనలోకి వచ్చారు. గతంలో గుంటూరు జీజీహెచ్‌లో ఈ విధానం విజయవంతంగా అమలు చేయటంతో ఆస్పత్రి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు ఉన్నతాధికారులు ప్రకటించారు. ఇలా చేయటం ద్వారా పోస్టుమార్టం వద్ద జరిగే మాముళ్లను కట్టడి చేయవచ్చు. -
కాకినాడ జిల్లా ఆసుపత్రిలో గర్భశోకం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: హైకోర్టు ఆదేశాల్లో ఒకటి నేరుగా కాకినాడ జీజీహెచ్‌కు సంబంధించిన విషయం కాగా, మరొకటి రెండు రాష్ట్రాల్లో చోటు చేసుకున్న శిశు మరణాలపైన అనేది హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయంతో విదితమవుతోంది. ఈ రెండు అంశాలు జిల్లాకు కచ్చితంగా వర్తించినవే. ఇక్కడ చోటుచేసుకుంటున్న శిశు మరణాలు మరే జిల్లాలో చోటుచేసుకోవడం లేదు. అందుకు పేర్కొన్న శిశు మరణాల గణాంకాలే ఉదాహరణలు. గత నాలుగున్నరేళ్లలో 4474 శిశు మరణాలు సంభవించాయంటే పరిస్థితేమిటో అర్థం చేసుకోవచ్చు. ఒక్క కాకినాడ జీజీహెచ్‌లోనే 3889« శిశు మరణాలు చోటుచేసుకున్నాయి. శిశు మరణాలే కాదు మాతృ మరణాలు నమోదవుతున్నాయి. ఈ నాలుగున్నరేళ్లలో జిల్లా వ్యాప్తంగా ప్రసవ సమయంలో 298 మంది తల్లులు చనిపోయారు. ఇందులో ఒక్క జీజీహెచ్‌లోనే 180 మంది మృతి చెందారు. ఇవన్నీ అధికారిక లెక్కలు. వెలుగు చూడని, అధికారుల దృష్టికి రాని కేసులెన్నో ఆ పైవాడికే తెలియాలి. జిల్లా జడ్జి నివేదిక రప్పించుకున్నహైకోర్టు ప్రధాన న్యాయమూర్తి... ఆసుపత్రిలో తల్లులు వదిలేసిన మృత శిశువులు, పిండాలను వారానికోసారి మున్సిపల్ సిబ్బంది ప్రత్యేక వాహనంలో తీసుకెళ్లి ఖననం చేయాల్సి ఉండగా సంబంధిత వాహనం మరమ్మతులకు గురైన కారణంగా నాలుగు వారాలుగా మృత శిశువులను తీసుకెళ్లకుండా వదిలేశారు. మృతదేహాలు పాడవుతున్నా బయటికి రాకుండా ఆసుపత్రి వర్గాలు గోప్యంగా ఉంచడంపై హైకోర్టు సీరియస్ అయింది. దీంతో సంబంధిత అధికారులను ప్రతివాదులుగా చేర్చడమే కాకుండా జిల్లా జడ్జి నుంచి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాధాకృష్ణన్ నివేదిక తెప్పించుకున్నారు. శిశు మరణాలకు గల కారణాలపై లోతుగా అధ్యయనం చేయాలని కూడా ఆదేశించారు. లోపమిదేనా... సాధారణంగా గర్బం దాల్చిన వెంటనే ఆమె పేరు, ఆధార్, రేషన్ నెంబర్, చిరునామా లాంటి వివరాల్ని స్థానిక వైద్యాధికారులు నమోదు చేయాలి. గర్భిణికి హెచ్‌బీ, బీపీ, సుగర్, హెచ్‌బీఎస్‌ఎజీ, హెచ్ఐవీ వంటి పరీక్షలు నిర్వహించాలి. వాటిలో ఏ ఒక్క వ్యాధి ఉన్నా వారిని హైరిస్క్ గర్భిణిగా గుర్తించి ప్రసవమయ్యేవరకు నిరంతరం ఏఎన్ఎం, డాక్టర్లు పర్యవేక్షించాలి. గుర్తించిన హైరిస్క్ మదర్స్‌ను 9వ నెల వచ్చేలోపు నాలుగుసార్లు డాక్టర్ పురిశీలించాల్సి ఉంది. వారికి ఎస్కార్ట్ ఏర్పాటు చేయాల్సి ఉంది. ఏ ఆసుపత్రిలో డెలివరీ చేయించుకోవాలో చెప్పేందుకు బర్త్ ప్లానింగ్ వేయాలి. జిల్లాలో ఇదేమీ సరిగా జరగగడం లేదు. ప్రసవానికి ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కలిగించడం, రక్తహీనత తదితర సమస్యలను గుర్తించి సలహాలివ్వడం, అవసరమైన మందులు సమకూర్చడం వంటివి చేస్తేనే నెలలు నిండని, బలహీన శిశు మరణాలు తగ్గడం సాధ్యమవుతుంది. కానీ, జిల్లాలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. జీజీహెచ్‌లోనే ఎందుకిలా...అరకొర వైద్యులపై తీవ్ర పనిభారం... జిల్లాలో ప్రధాన ఆసుపత్రిగా కాకినాడ జీజీహెచ్ కొనసాగుతోంది. ఎక్కువ కేసులు ఇక్కడికే వస్తాయి. అలాంటప్పుడు ఇక్కడెన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్న దానిపై ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కానీ, అందుకు భిన్నమైన పరిస్థితులు కాకినాడ ఆసుపత్రిలో నెలకున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనబడుతోంది. ఇక్కడన్నీ లోపాలే. కాకినాడ ప్రభుత్వ బోధనాసుపత్రిలో పెరుగుతున్న ఓపీకి అనుగుణంగా వైద్యుల భర్తీ చేయడం లేదు. ముఖ్యంగా గైనిక్ వార్డులో పూర్తిస్థాయిలో గైనిక్ వైద్యులు లేకపోవడంతో ఉన్న వారిపై తీవ్ర పనిభారం పడుతోంది. వారంతా పూర్తి స్థాయిలో న్యాయం చేయలేకపోతున్నారు. ఫలితంగా ప్రాణాంతక సమయంలో సరైన వైద్య చికిత్సలందక ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు నెలకొన్నాయి. కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆస్పత్రి, మాతా,శిశు ప్రసూతి విభాగంలో సుమారు 300 పడకలున్నాయి. నిత్యం ఇక్కడ చికిత్స పొందేందుకు గర్భిణులు 500 నుంచి 550 వరకూ వస్తుంటారు. రోజుకి 50 వరకూ ప్రసవాలు జరగుతుండగా 20–25 వరకు సీజేరియన్ ప్రసవాలు జరుగుతున్నాయి.ప్రసూతి విభాగంలో ఆరు విభాగాల ఆ«ధ్వర్యంలో చేయాల్సిన పనిని కేవలం మూడు విభాగాల ద్వారానే చేపట్టడంతో దయనీయ పరిస్థితులు నెలకున్నాయి. తగిన స్థాయిలో సిబ్బంది లేకపోవడంతో ప్రస్తుతం ఉన్న వైద్యులు, సిబ్బందిపై తీవ్ర పనిభారం పడుతోంది. ఎంసీఐ మార్గదర్శకాల ప్రకారం ఒక్కో గైనిక్ విభాగంలో ఒక ప్రొఫెసర్, ఒక అసోసియేట్ ప్రొఫెసర్, ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్‌తో ఐదుగురు వైద్యులు పనిచేయాల్సి ఉంది. ఈ లెక్కన 27 మంది ఉండాల్సి ఉంది. ప్రస్తుతం ఇక్కడ మూడు విభాగాలకు కలిపి ఒక ప్రొఫెసర్, ఒక అసోసియేట్ ప్రొఫెసర్, ఆరుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు మాత్రమే ఉన్నారు. ఎంసీఐ నిబంధనల మేరకు ఒక్కో యూనిట్‌కి 30 బెడ్లతో మూడు యూనిట్లకు 90 బెడ్లుండాల్సి ఉండగా, ప్రస్తుతం 300 బెడ్లున్నాయి. దీనిబట్టి ఇక్కడెంత రద్దీ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఆ స్థాయిలో సౌకర్యాల్లేకపోవడంతో ప్రసవానికొచ్చిన తల్లులకు గర్భశోకమే మిగులుతోంది. పూర్తి స్థాయి కమిటీ ఏదీ....సమీక్షలేవీ...? సాధారణంగా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించాలి. వైద్య సేవలపైనా, వైద్యుల పనితీరుపైనా ఎప్పటికప్పుడు సమీక్షించాలి. అత్యవసర పరిస్థితులు ఏర్పడితే మరింత అప్రమత్తం కావాలి. మెరుగైన వైద్యసేవలందించేందుకు చర్యలు తీసుకోవాలి. శిశు మరణాలు ఎక్కువగా ఉన్న దృష్ట్యా లోపమెక్కడో గుర్తించి తదననుగుణంగా> మరణాల నియంత్రణకు కృషి చేయాలి. కానీ, కాకినాడ ఆసుపత్రికి అటువంటి యోగం లేదు. ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ నియామకమే జరగలేదు. ముగ్గురు అధికారులతో ‘మమ’ అనిపించేస్తున్నారు. పాలకుల ఒత్తిళ్ల కారణంగానో...మరేమిటో తెలియదు గాని ఇంతవరకు అçసుపత్రి కమిటీ ఏర్పాటు కాలేదు. దీంతో సమీక్షలు, సమావేశాలకు ఆస్కారం లేకుండా లేకుండాపోయింది. గత రెండున్నరేళ్లుగా ఆసుపత్రి పరిపాలనకు సంబంధించిన సమస్యలపై చర్చించిన దాఖలాలు లేవు. అసలు జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రాకు ఏమాత్రం పట్టడం లేదన్న విమర్శలున్నాయి. ఈయనొచ్చాక కాకినాడ జీజీహెచ్ ఆసుపత్రిలో వందల శిశు మరణాలు సంభవించాయి. గతం తెలియకపోయినా ఆయనొచ్చాక చోటుచేసుకున్న మరణాలైనా కదలించాలి. కచ్చితంగా స్పందించి ఇక్కడేం జరుగుతుందో తెలుసుకోవాలి. లోపమెంటో గుర్తించి, శిశు మరణాలు నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలి. కానీ, ఆ పరిస్థితి కనిపించడం లేదు. శిశు మరణాలను కలెక్టర్ సీరియస్‌గా తీసుకోవడం లేదన్న విమర్శలున్నాయి. చిన్నారుల మృతికి కారణాలివీ... గర్భిణి ప్రసవం కోసం వచ్చే సమయంలో పౌష్టికాహార లోపం, గుండె, ఉదర, శ్వాస కోసం, మెదడు, పక్షవాతం, ఉమ్మనీరు మింగేయడం వంటి ప్రాణాంతక, సంక్లిష్ట పరిస్థితుల్లో శిశువులు చనిపోతున్నారు. ఆ దిశగా ఏం చేయాలో ఆలోచించి వైద్య సేవలందించాలి. దానికి సరిపడా వైద్యుల్లేకపోవడంతో అరకొర వైద్య సేవలందుతున్న పరిస్థితి నెలకుంది. దీంతో శిశువులకు చావు తప్ప మరో ప్రత్యామ్నాయం లేకుండా పోతోంది. -
ఇంత నిర్లక్ష్యమా ?
జిల్లాలో ముసురుకుంటున్న రోగాలు ... చోటుచేసుకుంటున్న వరుస మరణాలపై వరుస కథనాలు ‘సాక్షి’లో ప్రచురితమవడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమయ్యింది. ఈ నెల 11వ తేదీన ‘వీడుతారా కుంభకర్ణ నిద్ర’ అనే శీర్షికతో జిల్లాలో ఇద్దరు మంత్రులున్నా ఏమి చేస్తున్నారంటూ ప్రశ్నిస్తూ కథనం ఇవ్వగా...12వ తేదీన ‘చస్తున్నా...చలనమేదీ’ శీర్షికతో పంచాయతీల్లో రూ.200 కోట్ల నిధులున్నా...14వ ఆర్థిక సంఘం నిధులు రూ.90 కోట్లున్నా పారిశుద్ధ్య పనులకు ఎందుకు వెచ్చించడం లేదంటూ ప్రచురితమయింది. కాకినాడ జీజీహెచ్‌లో కనీస సౌకర్యాల లేమి, అధ్వాన పరిస్థితులను వెలుగులోకి తేవడంతో శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆకస్మిక తనిఖీలు చేశారు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి, కాకినాడ రూరల్/సర్పవరం: మృత శిశువుల వివాదం నేపథ్యంలో కలెక్టర్ కార్తికేయ మిశ్రా శుక్రవారం కాకినాడ ప్రభుత్వాస్పత్రి(జీజీహెచ్)లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సుమారు మూడు గంటల పాటు అన్ని విభాగాల్లో తనిఖీలు చేశారు. రోగులు, వారి సహాయకులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్యసేవలు అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ వైర్లు, ఇంటెన్సివ్ కేర్ యూనిట్ల(ఐసీయూ)లో ఏసీ పని చేయకపోవడం, చాలామంది రోగులకు పీజీ డాక్టర్లే వైద్య సేవలు అందించడంపై మండిపడ్డారు. ఆస్పత్రిలో తమకు మెరుగైన వైద్యం అందడంలేదని ఈ సందర్భంగా పలువురు రోగులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. దీంతో కలెక్టర్ వైద్యుల తీరుపై మండిపడ్డారు. ప్రతి విభాగంలోనూ సిబ్బంది నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని, ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎలాగని ప్రశ్నించారు. పదేపదే విమర్శలు వస్తున్నా ఎప్పటికీ తీరు మార్చుకోరా అంటూ నిలదీశారు. కార్డియాలజీ, ఆర్థోపెడిక్, గైనిక్, మాతాశిశు విభాగం, మెడికల్, ఎమర్జెన్సీ, కేన్సర్, ఈఎన్టీ, కంటి, డెంటల్, సర్జికల్ విభాగాలు, సదరం సర్టిఫికెట్స్ మంజూరు విభాగం, ఆర్థోపెడిక్ విభాగంలోని ఆపరేషన్ థియేటర్, బ్లడ్‌బ్యాంకు వంటివాటన్నింటినీ కలెక్టర్ తనిఖీ చేశారు. వర్క్‌షాప్ భవనాన్ని పరిశీలించిన ఆయన వెంటనే దానిని కూల్చివేయాలని జీజీహెచ్ సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. మందులు భద్రపరిచే గదిని పరిశీలించిన కలెక్టర్ ఒక క్రమ పద్ధతి పాటించడం లేదని, మందులు పెట్టే ప్రదేశాలు అధ్వానంగా ఉన్నాయని అసహనం వ్యక్తం చేశారు. తాళం వేసిన ప్రతి గదినీ ఆయన ప్రత్యేకంగా పరిశీలించడం కనిపించింది. కలెక్టర్ వస్తున్నారన్న సాకుతో మాతా, శిశువులకు అన్నం తీసుకువెళ్లే తమను మాతా శిశు విభాగం ముందు మిట్ట మధ్యాహ్నం రెండు గంటలకు పైగా ఎండలో నిలబెట్టడంపై రోగుల సహాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తనిఖీల్లో ట్రైనీ కలెక్టర్ ధ్యాన్‌చంద్ర, జేసీ–2 సత్తిబాబు, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.రాఘవేంద్రరావు, రంగరాయ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్.మహాలక్ష్మి, సీఎం ఆర్ఎంవో డాక్టర్ బి.సత్య సుశీల, ఆర్ఎంవో డాక్టర్ సుధీర్ పాల్గొన్నారు. ముందస్తు సమాచారంతో జాగ్రత్త పడ్డ వైద్యులు కలెక్టర్ ఆకస్మిక తనిఖీకి వస్తున్నారన్న సమాచారం ముందుగానే తెలియడంతో జీజీహెచ్ అధికారులు అన్ని విభాగాల్లోనూ సిబ్బందిని అప్రమత్తం చేశారు. వైద్యులకు తెలియకుండా వస్తేనే ఆస్పత్రిలో నిర్లక్ష్యం బయటపడేదని పలువురు అన్నారు. పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంటోందని, కలెక్టర్ వస్తున్నారని ముందుగానే సమాచారం అందడంతో యంత్రాలతో శుభ్రం చేయించడం కనిపించిందని రోగుల వద్ద ఉన్న సహాయకులు చెప్పారు. కనీసం వారానికి ఒకసారైనా కలెక్టర్ తనిఖీలు చేస్తే రోగులకు సరైన వైద్యం అందుతుందని అన్నారు. కలెక్టర్ తనిఖీ ఉందని తెలియడంతో గార్డెన్లో గడ్డి తొలగించడం, ప్రతి వార్డులోకి కలెక్టర్ వెళ్లే ముందే స్ప్రేలు వినియోగించడం వంటివాటితో సిబ్బంది హడావుడి చేశారు. పీజీ వైద్యులు ఒకరిద్దరు తప్ప అన్ని వార్డుల్లోనూ వైద్యులు ఉండేలా అధికారులు జాగ్రత్తలు చేపట్టారు. మౌలిక సౌకర్యాలు కల్పిస్తాం : కలెక్టర్ జీజీహెచ్‌లోని అన్ని విభాగాల్లో రోగులకు అందిస్తున్న సేవలను పరిశీలించామని, కొన్నిచోట్ల వైద్య సేవలు సక్రమంగా లేవని, దీనిపై చర్యలు చేపడతామని కలెక్టర్ కార్తికేయ మిశ్రా వివరించారు. జీజీహెచ్‌ను పరిశీలించిన సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఆస్పత్రిలో మౌలిక సౌకర్యాల మెరుగుదలకు తక్షణ చర్యలు తీసుకుంటామన్నారు. ఆస్పత్రిలో ప్రతి విభాగానికీ ఒక జిల్లా స్థాయి అధికారిని ఇన్చార్జిగా నియమించి, మెరుగైన వైద్యసేవలు అందించడానికి చర్యలు తీసుకుంటామని వివరించారు. జీజీహెచ్‌లో అవసరమైన సదుపాయాల కల్పనకు నివేదిక రూపొందించాల్సిందిగా జాయింట్ కలెక్టర్ ఎ.మల్లికార్జునను ఆదేశించామన్నారు. రానున్న 15 రోజుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తాయన్నారు. ఆస్పత్రిలో 75 నుంచి 80 శాతం రోగులకు మందులు అందుబాటులో ఉన్నాయన్నారు. మహిళా, శిశు విభాగంలో పడకల కొరత ఉందని, ఇక్కడివారికి మానసిక వైద్యం అందించే వార్డులో ఖాళీగా ఉన్న పడకలను వినియోగించాలని ఆదేశించినట్లు కలెక్టర్ వివరించారు. స్మార్ట్ సిటీ పనుల్లో భాగంగా ఆస్పత్రిలో మల్టీ లెవెల్ పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలో మాతా శిశు మరణాలు తగ్గుముఖం పట్టాయన్నారు. ఆగస్టు నెలలో 62 మంది హైరిస్క్ గర్భిణులకు మెరుగైన వైద్యం అందించడం ద్వారా సుఖ ప్రసవాలు జరిగాయని కలెక్టర్ వివరించారు. తగ్గిన మలేరియా : జిల్లాలో 20117–18 సంవత్సరంలో 4 వేల మలేరియా కేసులు నమోదు కాగా, ఈ ఏడాది ఆగస్టు వరకూ 900 మాత్రమే నమోదయ్యాయని కలెక్టర్ మిశ్రా తెలిపారు. ఈ కేసులు 1,500కు మించకుండా చర్యలు తీసుకుంటున్నామని, వచ్చే ఏడాది మరింత తగ్గేలా చర్యలు చేపడతామని చెప్పారు.