
విడదీసేందుకు యత్నించిన వ్యక్తిని గాలిలోకి ఎగరేస్తున్న ఆబోతు
తూర్పుగోదావరి , జగన్నాథపురం (కాకినాడ రూరల్): రానున్నది ఎన్నికల కాలం. ప్రత్యర్థుల మధ్య హోరాహోరీ పోటీ తథ్యం. ఈ విషయాన్ని ముందే కనిపెట్టాయో ఏమో.. రెండు ఆబోతులు ఆదివారం ఇంద్రపాలెం–మామిడాడ రహదారిలో ఆంధ్రా బ్యాంకు సమీపంలో హోరాహోరీగా పోట్లాడుకున్నాయి. అటుగా వెళ్తున్న ఒక వ్యక్తి వాటిని విడిపించడానికి టైర్ ట్యూబ్‌తో కొడుతుంటే ఒక్కసారిగా వాటిలోని ఒక ఎద్దు ఆ వ్యక్తిని ఎత్తి పడేసింది. దీంతో ఆ వ్యక్తి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. వెంటనే స్థానికులు అతడిని జీజీహెచ్‌కి తరలించారు. అటుగా ‘సాక్షి’ కెమెరా క్లిక్‌మనిపించింది.
Comments
Please login to add a commentAdd a comment