bull fighting
-
బెట్.. కొట్లాట రసపట్టు
సాక్షి, అమరావతి: శునకం.. వరాహం.. అశ్వం.. ఎద్దు.. ఒంటె.. కోడి.. బుల్ బుల్ పిట్ట.. పక్షా, జంతువా కాదు.. బరిలో ఉందంటే దుమ్ము దులపాల్సిందే. ప్రత్యర్థిని మట్టికరిపించాల్సిందే. అనాది కాలం నుంచి మన దేశంలో జంతువులు, పక్షుల పోటీలు జరుగుతూనే ఉన్నాయి. దేశంలో అనేక రాష్ట్రాలు... ఆయా రాష్ట్రాల్లోని ప్రాంతాల వారీగా ప్రత్యేక సందర్భాలను పురస్కరించుకుని జంతువులు, పక్షులతో పోటీలు సంప్రదాయమైంది. జంతు హింసను నిరోధించే చట్టాలున్నప్పటికీ ఏళ్ల తరబడి అదే ఆనవాయితీ కొనసాగుతోంది. అనేక రాష్ట్రాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన జంతువుల పందేలు, పోటీలపై ఓ లుక్కేద్దాం.. పౌరుషానికి ప్రతీక కోడి పుంజులు కోడి పందేలకు ఘనమైన చరిత్రే ఉంది. సింధు నాగరికత నుంచి మొదలెడితే.. భారత్, చైనా, పర్షియా, గ్రీకు నాగరికతల్లోను వీటిని నిర్వహించిన ఆధారాలున్నాయి. పల్నాడు, బొబ్బిలి యుద్ధంలో కోడి పుంజుల పోరు చరిత్ర అందరికీ తెలిసిందే. కోడి పుంజుల పందేలను పౌరుషానికి ప్రతీకగా భావిస్తారు. ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి బరిలోకి దించుతారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళలో వీటిని ఎక్కువగా నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ప్రముఖంగాను, మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ భోగి, సంక్రాంతి, కనుమ పండుగల రోజు కోడి పందేలు నిర్వహించడం సంప్రదాయంగా మారింది. తమిళంలో ‘వెట్రికాల్’ అని, తుళులో ‘గోరిక్ కట్ట’ అని కోడి పందాలను పిలుస్తారు. కర్ణాటకలోని ఉడుపి, కేరళలోని కాసర్గోడ్లలోనూ కోడి పందాలను నిర్వహిస్తుంటారు. కోడి పందాల పేరుతో కోడి పుంజులను దారుణంగా హింసిస్తున్నారని యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా కూడా నివేదించింది. జంతు సంరక్షణ చట్టం ఉల్లంఘిస్తున్న కోడి పందేలను సుప్రీం కోర్టు నిషేధించింది. అయినా సంప్రదాయం, సరదా పేరుతో కోడి పందేలు.. బెట్టింగ్‌లు కొనసాగుతున్నాయి. కంబాళ.. భళా భళ దున్నలను కాడికి కట్టి రేసు నిర్వహించడాన్ని కన్నడ భాషలో కంబాళ అంటారు. ఖాత్రి కంబాళ అనేది మంగళూరు ఖాత్రిలోని మంజునాథ ఆలయ పరిసరాల్లో నిర్వహించేవారు. దీన్నే థీవర కంబాళ అని కూడా పిలిచేవారు. 300 ఏళ్ల క్రితం నిర్వహించిన ఈ వేడుకకు ఆనాటి అలూబ రాజులు కూడా హాజరయ్యేవారు. ఇప్పటికీ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కంబాళను నిర్వహిస్తుంటారు. సాధారణంగా బురద నేలలు, వరి పొలాల్లో ఈ రేసు నిర్వహిస్తారు. వీటిలో పాల్గొనే రైతులు కొరడా ఝుళిపిస్తూ రెండు దున్నలతో వేగంగా పరుగులు తీస్తారు. పందెంలో గెలిచిన వారికి బంగారం, వెండి నాణేలతో పాటు విలువైన బహుమతులు ఇస్తారు. ఈ పోటీపై పెద్దఎత్తున బెట్టింగ్‌లు వేస్తుంటారు. కేరళలోనూ వరికోతల తర్వాత ఈ పోటీలు నిర్వహిస్తుంటారు. ఈ పోటీల్లో కొరడాలను ఉపయోగించడంపై జంతు హక్కుల కార్యకర్తలు మొదట్నుంచీ ఆందోళనలు చేస్తున్నారు. దీంతో జల్లికట్టు, కంబాళ పోటీల్లో జంతువులను హింసించ కూడదని 2014 మే 7న సుప్రీం కోర్టు స్పష్టంచేసింది. ఒంటెల రేసు.. రాజస్థాన్‌లోని అజ్మీర్ జిల్లా పుష్కర్‌లో గుర్రం, ఒంటెల పరుగు (రేసు) పందేలు నిర్వహిస్తుంటారు. వీటిలో విజేతలకు నేరుగా రాజస్థాన్ ప్రభుత్వమే నగదు బహుమతిని అందిస్తుంటుంది. ఈ రేసులో గెలిచేందుకు ఒంటెలకు ప్రత్యేక శిక్షణ ఇస్తుంటారు. ఈ రేసులకు ముందుగా గిరిజనుల నృత్యాలు, ఒంటెల అందాల పోటీలు కూడా నిర్వహిస్తుంటారు. ఎక్కువ దూరం వేగంగా ప్రయాణించిన ఒంటెను విజేతగా ప్రకటిస్తారు. ఎద్దుల ఆట కట్టించే జల్లికట్టు.. బుసలు కొడుతూ పరుగులు తీసే బలమైన ఎద్దులను లొంగదీసుకునే క్రీడే జల్లికట్టు. సింధు నాగరికత, తమిళ్ సాహిత్యంలోను జల్లికట్టుకు సంబంధించిన ఆధారాలున్నాయి. ప్రాచీన తమిళనాడులోని ‘ముల్లై’ ప్రాంతంలో నివసించే తెగల్లో జల్లికట్టు సర్వసాధారణం. తమిళ పురాణాల ప్రకారం పూర్వకాలంలో మహిళలు జల్లికట్టులో విజేతలైన వారిని తమ భర్తలుగా ఎంచుకునే వారు. నీలగిరి జిల్లాకు చెందిన కరిక్కియూర్ అనే గ్రామంలో సుమారు 3,500 సంవత్సరాల వయసుగల శిలా ఫలకాలపై మనుషులు ఎద్దులను తరిమే దృశ్యాలు చెక్కి ఉన్నాయి. స్పెయిన్‌లో జరిగే బుల్ ఫైట్‌కు దగ్గరగా జల్లికట్టు ఉంటుంది. అయితే జల్లికట్టులో ఎద్దులను చంపరు. తమిళనాడులోని గ్రామాల్లో, ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలోను జల్లికట్టు నిర్వహిస్తారు. శునకాల కొట్లాట.. ఇంగ్లాండ్‌లో 18వ శతాబ్దంలో శునకాల కొట్లాట పోటీలను నిర్వహించేవారు. తర్వాత భారత్‌కు ఈ పోటీలు చేరాయి. ఈ పోటీల కోసం అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, ఆస్ట్రేలియాల నుంచి ప్రత్యేకంగా కుక్కలను తీసుకువస్తుంటారు. ఢిల్లీ శివారు ప్రాంతాలతోపాటు గురుగ్రామ్, నోయిడాలలోనూ ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. పంజాబ్, హరియాణాల్లో ధనవంతులు సరదా కోసం ఇలాంటి పోటీలను నిర్వహించే సంప్రదాయం పెరుగుతోంది. కుక్కల కొట్లాటలో రక్తస్రావం తీవ్రంగా ఉంటుంది. పందేల్లో దింపే కుక్కలను రోజుల తరబడి ఆహారం పెట్టకుండా బోనులో బంధిస్తారు. ఒక్కసారిగా వాటిని వదులుతారు. అప్పటికే ఆకలితో తీవ్ర కోపంతో రగిలిపోయే కుక్కలు ప్రత్యర్థి కుక్కలపై భయానకంగా దాడులు చేస్తాయి. ఒక్కోసారి వీటిలో ఒక్కోసారి ప్రత్యర్థి కుక్కలు చనిపోతుంటాయి. గెలిచిన కుక్క యజమానికి రూ.లక్షల్లో నగదు బహుమతులు అందిస్తుంటారు. వీటిపైనా సుప్రీం కోర్టు నిషేధం ఉంది. బుల్ బుల్ పక్షుల పోటీ పూర్వం అస్సాం రాజు స్వర్గదేవ్ బ్రహ్మథ సింఘ పక్షుల పోటీలు ఎంతో ఇష్టంగా నిర్వహించేవారని, ఈ పోటీల కోసం ప్రత్యేకంగా పక్షులను పెంచేవారని చరిత్ర చెబుతోంది. ఆ తర్వాతి కాలంలో ఇది ఒక సంప్రదాయంలా మారింది. సంక్రాంతి సమయంలోనే అస్సాంలో భోగలి బిహు వేడుక నిర్వహిస్తుంటారు. దీనిలో భాగంగా గువాహటికి 30 కిలోమీటర్ల దూరంలో హయగ్రీవ మాధవ ఆలయానికి సమీపంలో బుల్బుల్ పక్షుల పందేలు నిర్వహిస్తారు. ఈ పందాల కోసం పక్షులకు గ్రామస్తులు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఈ పోటీల్లో పక్షులు కూడా గాయపడుతుంటాయి. పోటీల్లో ఓడిపోయిన పక్షుల ముక్కు ముందు భాగాన్ని కత్తిరిస్తారు. దీంతో మరోసారి మళ్లీ ఇవి పోటీల్లో పాల్గొనే అవకాశం ఉండదు. ఈ పక్షుల పోటీపై నిషేధం విధించాలని జంతు ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు. అయితే, 2016లో ఈ పోటీ నిర్వహించకుండా గువాహటి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయినప్పటికీ చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ నిర్వహిస్తున్నారు. ఎద్దుల బండ్ల రేసు.. మహారాష్ట్రలో ఎద్దుల బండ్ల రేసులను శతాబ్దాల నుంచి నిర్వహిస్తున్నారు. దాదాపు 500 మీటర్ల దూరాన్ని ఎద్దుల బండ్లపై ఎవరైతే వేగంగా చేరుకుంటారో వారిని విజేతగా ప్రకటిస్తారు. ఈ పోటీల్లో చాలా మంది రైతులు పాల్గొంటారు. వినాయక చవితి సమయంలో ఎక్కువగా ఈ పోటీలను నిర్వహిస్తారు. ఇవి తమ సంప్రదాయమని నిర్వాహకులు చెబుతుంటారు. పోటీ కోసం కొన్ని ఎద్దులను ప్రత్యేకంగా సిద్ధం చేస్తారు. మహారాష్ట్రతో పాటు పంజాబ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్‌ల్లో కొన్ని ప్రాంతాల్లోనూ ఈ రేసు నిర్వహిస్తున్నారు. ఈ పోటీలను 2014లో సుప్రీం కోర్టు నిషేధం విధించింది. కానీ, స్థానిక నాయకుల ప్రోత్సాహంతో ఈ పోటీలు జరుగుతూనే ఉన్నాయి. -
సైరా..సై..ఎద్దుల కుమ్ములాట!
సాక్షి, యాదమరి(చిత్తూరు) : పాడుబడిన బావిలో పడిన వృషభ రాజాన్ని శ్రమలకోర్చి అగ్నిమాపక సిబ్బంది కాపాడిన సంఘటన బుధవారం రాత్రి కీనాటంపల్లెలో చోటుచేసుకుంది. వివరాలు..గ్రామానికి చెందిన రైతు పౌల్‌కు కొన్ని ఆవులతో పాటు రెండు ఎద్దులు ఉన్నాయి. వీటిలో ఒకటి మామూలు ఎద్దుకాగా మరొకటి పరుగు పందాల్లో సత్తా చాటేది. దీని విలువ రూ.2లక్షల వరకూ ఉంటోంది. గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలోని తన పొలం వద్ద పౌల్ ఆవులను కట్టేసి ఉంచేవాడు. ఈ నేపథ్యంలో పరుగు పందెం ఎద్దు, మరో ఎద్దు..కట్టుతాళ్లను తెంపుకుని రెండూ రోషంతో కుమ్ములాటకు తెగబడ్డాయి. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేరు. ఈ పోట్లాటలో పరుగు పందెం ఎద్దుపై మరో ఎద్దు కాస్తా ఆధిక్యత కనబరచింది. దీని ధాటికి పందెం ఎద్దు పరుగులు తీసింది. అప్పటికీ ఆ ఎద్దు శాంతించక దానికి వెంబడించింది. దీంతో పందెం ఎద్దు పరుగులు తీస్తూ అదుపు తప్పింది. చీకట్లో 100 అడుగుల లోతు ఉన్న పాడుపడిన బావిలో పడిపోయింది. పందెం ఎద్దును బావి నుంచి బయటకు తీస్తున్న అగ్నిమాపక సిబ్బంది కొంతసేపటికి పౌల్ తన పొలం వద్దకు వచ్చి చూస్తే పందెం ఎద్దు కనబడకపోవడంతో దాని కోసం గాలించాడు. పొలం వద్ద పాడుబడిన బావి నుంచి ఎద్దు అరుపులు వస్తుండడం గుర్తించి అక్కడికి చేరుకున్నాడు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ ద్వారా సమాచారం చేరవేశాడు. వారు హుటాహుటిన వచ్చి పరిశీలించారు. బావి లోతు ఎక్కువగా ఉండడంతో తాళ్లతో వెలికితీయడం అసాధ్యమని గ్రహించి, క్రేన్ తెప్పించారు. ఫ్లడ్ లైట్ల వెలుగులో ‘ఆపరేషన్ పందెం ఎద్దు’ పనులు మొదలెట్టారు. బావిలోంచి పిచ్చిమొక్కలు, చెట్లు ఏపుగా పెరిగిపోయి ఉండడంతో ఎద్దు సరిగా కనిపించలేదు. కొంతమంది సిబ్బంది ధైర్యం చేసి బావిలోకి దిగారు. లైట్ల సాయంతో ఎద్దును గుర్తించారు. క్రేన్ కొక్కీని బావిలోకి విడవడంతో దానికి ఎద్దును సురక్షితంగా కట్టారు. చెట్ల కొమ్మల మధ్య నుంచి ఆ ఎద్దును పైకి తీశారు. అదృష్టశాత్తు చెట్ల కొమ్మలే పందెం ఎద్దు ప్రాణాలతో బైటపడటానికి కారణమయ్యాయి. చెట్ల కొమ్మలను తగులుకుంటూ సినీ ఫక్కీలో అది బావిలో పడటంతో బలమైన గాయాలు కలగలేదు. చెట్ల కొమ్మలు లేకపోయిన పక్షంలో సరాసరి నేరుగా పడి మరణించి ఉండేదని అగ్నిమాపక సిబ్బంది చెప్పారు. మొత్తానికి ఎద్దు వెలికితీతకు దాదాపు మూడున్నర గంటలకు పైగా పట్టింది. గ్రామస్తులకు ఈ ఆపరేషన్ ఉత్కంఠ కలిగించించింది. మొత్తం మీద పందెం ఎద్దు రాత బాగుందంటూ పలువురు వ్యాఖ్యానించడంతో పౌల్ అగ్నిమాపక సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపాడు. -
రోడ్డుపై ఆబోతుల పోట్లాట
తూర్పుగోదావరి , జగన్నాథపురం (కాకినాడ రూరల్): రానున్నది ఎన్నికల కాలం. ప్రత్యర్థుల మధ్య హోరాహోరీ పోటీ తథ్యం. ఈ విషయాన్ని ముందే కనిపెట్టాయో ఏమో.. రెండు ఆబోతులు ఆదివారం ఇంద్రపాలెం–మామిడాడ రహదారిలో ఆంధ్రా బ్యాంకు సమీపంలో హోరాహోరీగా పోట్లాడుకున్నాయి. అటుగా వెళ్తున్న ఒక వ్యక్తి వాటిని విడిపించడానికి టైర్ ట్యూబ్‌తో కొడుతుంటే ఒక్కసారిగా వాటిలోని ఒక ఎద్దు ఆ వ్యక్తిని ఎత్తి పడేసింది. దీంతో ఆ వ్యక్తి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. వెంటనే స్థానికులు అతడిని జీజీహెచ్‌కి తరలించారు. అటుగా ‘సాక్షి’ కెమెరా క్లిక్‌మనిపించింది. -
ఆంబోతు తలవంచింది
టైటానిక్ నౌక మునిగిపోతున్నప్పుడు లైఫ్బోట్లలోకి మొదట మహిళల్ని, పిల్లల్ని ఎక్కించారు. ఏదైనా దుర్ఘటన జరిగినప్పుడు మరణించిన వారిలో మహిళలు, పిల్లలు ఎంతమంది ఉన్నారో మొదట చెప్తారు. ప్రతిచోట, ప్రతి ప్రమాద సందర్భంలో మహిళలకు, పిల్లలకు ప్రాధాన్యం ఉంటుంది. పిల్లలు నిస్సహాయులు, మహిళలు తమ దేహధర్మాల కారణంగా చొరవ చూపలేనివారు అనే భావన వల్ల ఈ ప్రాధాన్యం లభించి ఉండొచ్చు. అలా కాకున్నా, మానవజన్మలోని ఒక మంచి సంప్రదాయం ఇది. బలహీనులకు రక్షణ, భద్రత కల్పించడం. అయితే ‘అవసరం అయి’ కల్పించడం వేరు. ‘అవసరం అనుకుని’ కల్పించడం వేరు. అవసరమై రక్షణ, భద్రత కల్పిస్తే ఎవరికైనా సంతోషమే కానీ ‘అవసరం అనుకుని’ పురుషులు, ప్రభుత్వాలు మహిళలకు రక్షణ కవచాలను, భద్రతా వలయాలను ఏర్పరుస్తున్నప్పుడు అవి తమ అవకాశాలకు, ఆసక్తులకు, అభివృద్ధికి అవరోధంగా మారుతున్నాయని మహిళలు భావించడం సహజమే. కఠినమైన పరిస్థితుల్లోకి, ప్రతికూలమైన పరిసరాల్లోకి స్త్రీలను అనుమతించకపోవడం వారి భద్రత కోసమే కావచ్చు. అయితే కఠినమని, ప్రతికూలం అని ఎవరికి వాళ్లకు అనిపించాలి. అలా అనిపించనప్పుడు ఆ పరిస్థితుల్లోకి, పరిసరాల్లోకి వారిని అనుమతించకపోవడం భద్రత కల్పించడం అవదు. ఆశల్ని నిర్బంధించడం అవుతుంది. ఎవరు మాత్రం ఇష్టపడతారు? భద్రత కోసమే అయినా ఆశలు బందీలైపోతుంటే! నేటికీ కొన్ని దేశాల్లో మహిళలు డ్రైవింగ్ చెయ్యడానికి లేదు. స్టేడియంకు వచ్చి మ్యాచ్‌లు చూడ్డానికి లేదు. మతపరమైన లాంఛనాలలో పాల్పంచుకోడానికి లేదు. వీటిలో కొన్ని వారి రక్షణ కోసమే అని చెప్పుకున్నా.. ఆచారాల్లో, సంప్రదాయాల్లో కూడా వారి భాగస్వామ్యాన్ని తిరస్కరించడం వారి ఆశల్ని నిర్బంధించడమే అవుతుంది. జపాన్‌లో మహిళల్ని నిరోధించే ఇలాంటి ఆచారమే ఒకటి ఉంది. బుల్‌ఫైటింగ్ రింగులలోకి ఆడవాళ్లను రానివ్వరు. మంచిదే కదా, ఎద్దులతో వాళ్లు తలపడటం దేనికి! అయితే అందుకు కాదు రానివ్వకపోవడం. బుల్‌ఫైటింగ్ మొదలవ్వడానికి ముందు ఆ రింగ్‌ని ఉప్పునీటితో, మద్యంతో శుద్ధి చేస్తారు. ఇక ఆ శుద్ధస్థలంలోకి మహిళలు అడుగుపెట్టడానికి లేదు. పెడితే వలయం అపవిత్రం అయిపోతుందట! పోటీకి ముందు యజమానులు ఎవరి ఎద్దును వారు తీసుకొచ్చి ప్రదర్శించే వలయం అది. ఇన్నాళ్లూ అక్కడికి మహిళల్ని రానివ్వకూడదని నిబంధన ఉండేది. శుక్రవారం ఆ నిబంధనను తొలగించారు. తొలిసారిగా అకీకో మొరియమ అనే మహిళ తన ఎద్దును ఆ శుద్ధస్థలంలోకి తెచ్చి వలయం అంతా తిప్పింది. ఆ సమయంలో ఆమె.. ఆశల్ని నిర్బంధించే రక్షణ నిబంధనలకు, లైంగిక వివక్షాపూరిత ఆచారాలకు ముకుతాడు తగిలించి లాక్కెళుతున్నట్లుగా చిరునవ్వులు చిందిస్తూ ఉంది. -
నేపాల్‌లో జోరుగా ఎద్దుల పోట్లాట!
-
చారిత్రక సంప్రదాయం.. ఎద్దుల పోట్లాట!
నూవకోట్(నేపాల్): పొరుగుదేశం నేపాల్లోనూ పండుగ సందడి నెలకొంది. చంద్రమాన క్యాలెండర్ పదోనెల ‘మాఘ్’ ప్రారంభోత్సవం సందర్భంగా నేపాల్ అంతటా మోలాసెస్ వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఇక, కఠ్మాండుకు 75 కిలోమీటర్ల దూరంలో కొండల మధ్య నెలకొన్న నువాకోట్ జిల్లాలో ఈ పండుగ సందర్భంగా ప్రత్యేక సంప్రదాయ క్రీడలు జరుగుతున్నాయి. మన దగ్గర కోళ్ల పందేలు జరిగినట్టే.. ఇక్కడ కోడెద్దుల పందేం జరుగుతుంది. మధించిన ఎద్దుల మధ్య పోరాటాన్ని నిర్వహించడం ఇక్కడి ప్రత్యేకత. ఇక్కడ ఎద్దుల పోరాటానికి 225 ఏళ్ల చరిత్ర ఉంది. ప్రతి ఏడాది హోరాహోరీగా జరిగే ఈ బుల్‌ఫైటింగ్‌ను చూసేందుకు చుట్టుపక్కల జిల్లాల నుంచి పెద్ద ఎత్తున జనం తరలివస్తారు. చారిత్రక ప్రాధాన్యం.. నూవాకోట్ జిల్లాలో నిర్వహించే ఎద్దుల కొట్లాటకు చారిత్రక ప్రాధాన్యం ఉంది. 1887లో అప్పటి రాజకుమారుడు బఝాంగ్ జాయ్ పృథ్వీ బహదూర్ సింగ్ తొలిసారి ఈ క్రీడను ప్రవేశపెట్టారు. ఆయన తొలిసారి అత్తగారింటికి వచ్చిన సందర్భంగా వినోదం కోసం తొలిసారి ఎద్దుల మధ్య పోరాటం నిర్వహించారు. అప్పటి నుంచి సంప్రదాయంగా ఈ ఎద్దుల ఫైటింగ్ జరుగుతుంది. తమిళనాడులో జల్లికట్టు, స్పానిష్‌లో బుల్‌ఫైటింగ్ తరహాలో ఇక్కడ కూడా ఎద్దుల కొట్లాట హోరాహోరీగా సాగుతుంది. -
దున్నపోతు కుమ్మేసింది..!