
బాలింత శిరీష (ఫైల్)
తూర్పుగోదావరి, రాజవొమ్మంగి (రంపచోడవరం): బడదనాంపల్లి గ్రామానికి చెందిన గిరిజన బాలింత చిర్లం శిరీష్ (22) కాకినాడ జీజీహెచ్‌లో రక్తహీనతతో సోమవారం రాత్రి మరణించింది. ఈమె ఈ నెల 4న రాజవొమ్మంగి పీహెచ్‌సీలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. బీపీతో నీరసంగా ఉందని ఆమెను వైద్యులు ఆస్పత్రిలోని బర్త్ వెయిటింగ్ రూంలోనే 6వ తేదీ వరకు ఉంచారు. ఆమెకు ఫిట్స్ రావడంతో కాకినాడ తరలించారు. ఆమెకు కామెర్లు ఉన్నాయని గుర్తించిన వైద్యులు చికిత్స ప్రారంభించారు. ఆమెకు కిడ్నీలు మందగించడంతో చికిత్స పొందుతూ మరణించిందని మృతురాలి భర్త సత్తిబాబు విలేకరులకు తెలిపారు. రాత్రి అంబులెన్స్ లేకపోవడంతో వారు రూ.5 వేలు ఖర్చు చేసి అతికష్టంతో మృతదేహాన్ని మంగళవారం స్వగ్రామానికి తరలించారు. ఆమె మృతితో తొలి కాన్పులో పుట్టిన రెండేళ్ల పాప, 8 రోజుల పసికందు తల్లిలేని వారయ్యారని గ్రామస్తులు వాపోయారు.