pregnent woman
-
ఆర్టీసీ బస్సులో పురుడు పోసుకున్న మహిళ
-
2 గర్భసంచులు.. 2 రోజులు..2 ప్రసవాలు
అమెరికా మహిళ అరుదైన రికార్డు అద్భుతాలకే అద్భుతంగా చెప్పదగ్గ ఈ ఉదంతం అమెరికాలో జరిగింది. అలబామాకు చెందిన కెల్సీ హాచర్ అనే 32 ఏళ్ల మహిళ పురిటి నొప్పులతో డిసెంబర్ 19న యూనివర్సిటీ ఆఫ్ అలబామాలోని బర్మింగ్‌హాం ఆస్పత్రి (యూఏబీ)లో చేరింది. 10 గంటల పురిటి నొప్పుల తర్వాత సాధారణ కాన్పులో పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. కానీ పురిటి నొప్పులు మాత్రం అలాగే కొనసాగాయి. మరో 10 గంటల తర్వాత సిజేరియన్ ద్వారా మరో ఆడపిల్లకు జన్మనిచ్చి అబ్బురపరిచింది. కెల్సీకి రెండు గర్భసంచులుండటం, రెండింట్లోనూ ఒకేసారి గర్భధారణ జరగడం వల్ల ఈ అద్భుతం సాధ్యమైంది. మహిళల్లో ఇలా రెండు గర్భసంచులుండే ఆస్కారమే కేవలం 0.3 శాతమట! వారిలోనూ రెండింట్లోనూ ఒకేసారి గర్భం ధరించే ఆస్కారమైతే 10 లక్షల్లో ఒక్క వంతు మాత్రమేనట! అరుదైన ఈ జంట అద్భుతాలు రెండూ కలిసి రావడంతో కెల్సీ ఇలా అత్యంత అరుదైన రికార్డును సొంతం చేసుకుంది!! తొలి మూడు కాన్పులు సాధారణమే... కెల్సీకి రెండు గర్భసంచులు ఉన్నట్టు 17వ ఏట బయట పడింది. కానీ పెళ్లి తర్వాత తొలి కాన్పుల్లోనూ సాధారణంగా ఒక్కొక్కరే పుట్టారు. ఈసారీ అలాగే జరగనుందని నెల తప్పినప్పుడు కెల్సీ అనుకుందట. ‘‘కానీ అల్ట్రా సౌండ్ చేయిస్తే రెండు గర్భసంచుల్లోనూ పిండాలున్నట్టు తెలిసి చెప్పలేనంత థ్రిల్‌కు లోనయ్యా. అసలలాంటిది సాధ్యమని మొదట నమ్మకమే కుదర్లేదు’’ అని సంబరంగా చెప్పుకొచ్చిందామె! అక్కణ్నుంచి కెల్సీ తన అసాధారణ జంట గర్భధారణ గాథను ఇన్‌స్టాగ్రాంలో రెగ్యులర్‌గా ఎప్పటికప్పుడు పంచుకుంటూ వచి్చంది. చూస్తుండగానే నెలలు నిండటం, ఆస్పత్రిలో చేరడం, వరుసగా రెండు రోజుల్లో ఇద్దరు పాపాయిలకు జన్మనిచ్చి రికార్డులకెక్కడం చకచకా జరిగిపోయాయి. ఈ అరుదైన కాన్పుల కోసం ఆస్పత్రి డబుల్ ఏర్పాట్లు చేయడం విశేషం! డబుల్ మానిటరింగ్, డబుల్ చారి్టంగ్ మొదలుకుని కాన్పు కోసం రెండింతల సిబ్బందిని నియమించడం దాకా అన్నీ ‘రెట్టింపు స్పీడు’తో జరిగాయి. ఇద్దరు పాపాయిలూ గర్భంలో ఆరోగ్యంగా పెరిగినట్టు కాన్పు చేసిన వైద్య బృందానికి సహ సారథ్యం వహించిన ప్రొఫెసర్ రిచర్డ్ డేవిస్ తెలిపారు. ‘‘ఒకే గర్భసంచిలో రెండు పిండాలు పెరిగిన బాపతు సాధారణ గర్భధారణ కాదిది. పిల్లలిద్దరూ ఒకే అపార్ట్మెంట్లో వేర్వేరు ఫ్లాట్లలో మాదిరిగా ఎవరి గర్భసంచిలో వారు స్వేచ్ఛగా ఎదిగారు’’ అని చెప్పుకొచ్చారు. ‘‘డిసెంబర్ 19న రాత్రి 7.45 గంటలకు తొలి పాప పుట్టింది. 10 గంటల పై చిలుకు పురిటి నొప్పుల తర్వాత డిసెంబర్ 20న ఉదయం 6.10 గంటలకు సిజేరియన్ చేసి రెండో పాపను బయటికి తీశాం. ఇంతటి అరుదైన ఘటనకు సాక్షులుగా నిలిచామంటూ మా వైద్య బృందమంతా కేరింతలు కొట్టాం’’ అని వివరించారు. పిల్లల బుల్లి రికార్డు...! నవజాత శిశువులు కూడా రికార్డుల విషయంలో తమ తల్లికి ఏ మాత్రమూ తీసిపోలేదు. వేర్వేరు గర్భసంచుల్లో పెరగడమే గాక ఏకంగా వేర్వేరు పుట్టిన రోజులున్న అత్యంత అరుదైన కవలలుగా రికార్డులకెక్కారు. అంతేకాదు, వీరు ఎవరికి వారు వేర్వేరు అండం, వీర్య కణాల ఫలదీకరణ ద్వారా కడుపులో పడటం మరో విశేషం! ఇలాంటి కవలలను ఫ్రాటర్నల్ ట్విన్స్‌గా పిలుస్తారని ప్రొఫెసర్ రిచర్డ్ తెలిపారు. మొత్తానికి రికార్డులు సృష్టించడంలో తల్లికి తీసిపోమని పుట్టీ పుట్టగానే నిరూపించుకున్నారంటూ అంతా ముక్కున వేలేసుకుంటున్నారు! బంగ్లా మహిళ బంపర్ రికార్డు! ఇలాంటి అరుదైన ‘జంట జననాలు’ అత్యంత అరుదే అయినా అసలు జరగకుండా పోలేదు. 2019లో బంగ్లాదేశ్‌లో జరిగిన ఇలాంటి ఘటన దీన్ని తలదన్నేలా ఉండటం విశేషం! రెండు గర్భసంచుల్లోనూ గర్భం దాలి్చన ఓ మహిళ తొలి కాన్పు తర్వాత ఏకంగా నెల రోజుల తర్వాత రెండో పాపాయికి జన్మనిచ్చిందట! ఆ పురుళ్లు పోసిన వైద్యుడు అప్పట్లో ఈ వింతను బీబీసీతో పంచుకున్నాడు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వైద్యులు లేరు.. మెరుగు పడని సేవలు
మోర్తాడ్(బాల్కొండ) : వైద్య ఆరోగ్య శాఖ నుంచి సామాజిక ఆస్పత్రులను వైద్య విధాన పరిషత్‌లో విలీనం చేసినప్పటికీ తగినంత మంది వైద్యులు, సిబ్బంది లేకపోవడంతో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందడం లేదు. మోర్తాడ్, బాల్కొండ, డిచ్పల్లి, ధర్పల్లి, వర్ని, నవీపేట్లలో 30 పడకలు ఉన్న ఆస్పత్రులు ఉన్నాయి. ఆర్మూర్‌లో వంద పడకల ఆస్పత్రి ఉంది. భీమ్‌గల్‌లో వంద పడకల ఆస్పత్రి నిర్మాణం కొనసాగుతోంది. 30 పడకల ఆస్పత్రిలో వివిధ రకాల వైద్యం అందించే 14 మంది వైద్యులు, 18 మంది వివిధ హోదాలలో పని చేసే సిబ్బందిని నియమించాల్సి ఉంది. వంద పడకల ఆస్పత్రిలో 48 మంది వైద్యులు, 73 మంది సిబ్బంది పోస్టు లను ఖరారు చేశారు. భీమ్‌గల్ ఆస్పత్రి నిర్మాణం ఇంకా పూర్తికానందున మిగిలిన ఆస్పత్రులలో వైద్యులు, సిబ్బంది పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం నోటిఫికేషన్‌ను జారీ చేశారు. జిల్లాలో మొత్తం 132 మంది వైద్యులు, 181 మంది సిబ్బందిని నియమించాల్సి ఉంది. ఇప్పటి వరకు పోస్టుల భర్తీపై దృష్టి సారించకపోగా నోటిఫికేషన్ జారీతోనే సరిపెట్టారు. వైద్య విధాన పరిషత్ పరిధిలోకి ఆస్పత్రులు చేరడం వల్ల వైద్య సేవలు ఎంతో మెరుగైతాయని అందరు భావించారు. పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలుపడంలో జాప్యం కారణంగా పోస్టులు అన్ని ఖాళీగానే ఉన్నాయి. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిని, వైద్యులను డిప్యుటేషన్ పద్ధతిపై కమ్యునిటీ ఆస్పత్రులలో కొనసాగిస్తున్నారు. గర్భిణులకు.. ఆర్మూర్, బోధన్, నిజామాబాద్‌లలోని ఆస్పత్రుల లో మినహా ఇతర సామాజిక వైద్యశాలల్లో గర్భిణు లకు ప్రసవ సేవలు అందడం లేదు. సర్జన్లు, గైనకాలజిస్టులు లేకపోవడంతో శస్త్రచికిత్స ప్రసవ సేవలను పూర్తిగా నిలిపివేశారు. మోర్తాడ్ ప్రాంతం నుంచి ప్రసవాల కోసం మెట్పల్లి ఆస్పత్రికి తరలించా ల్సి వస్తుంది. ఆర్మూర్‌లో నిర్ణీత సంఖ్యలోనే ప్రసవ సేవలు అందిస్తుండటంతో పొరుగు జిల్లా ఆస్పత్రిని ఆశ్రయించక తప్పడం లేదు. ప్రభుత్వం వైద్య సేవలను విస్తృత పరచాలని పలువురు కోరుతున్నారు. త్వరలోనే భర్తీ కావచ్చు.. సామాజిక ఆస్పత్రులలో వైద్యులు, సిబ్బంది నియామకాలు త్వరలోనే పూర్తి కావచ్చు. గతంలో నోటిఫికేషన్ జారీ చేశాం. మరోసారి నోటిఫికేషన్ ఇచ్చి పో స్టుల భర్తీ కోసం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందగానే పోస్టుల భర్తీకి చర్యలు చేపడుతాం. – డాక్టర్ శివశంకర్ -
పురిటిలో మృత్యు ఘోష.. వైద్యుల నిర్లక్ష్యం.. తల్లి, కవలలు మృతి
వైద్యో నారాయణ హరి అన్న నానుడికి కళంకం తెస్తున్నారు కొందరు వైద్యసిబ్బంది. ఏమాత్రం కనికరం లేకుండా వైద్యాన్ని నిరాకరించడం తమ గొప్పగా భావిస్తారు వీరు. నిరుపేద గర్భిణి కాన్పు కోసం వస్తే వైద్యం చేయడానికి బదులు, దయాదాక్షిణ్యం లేకుండా వెనక్కి పంపేశారు. ఇంట్లో ఆ అభాగ్యురాలు కవలలకు జన్మనిచ్చి తుదిశ్వాస విడిచింది. అమ్మ లేని లోకం దండగ అనుకున్నారో ఏమో.. ఆ శిశువులు కూడా తల్లి వెంటే వెళ్లారు. ఈ దారుణం ఏ మారుమూలో పల్లెలోనో కాదు, విద్యా వైద్య సేవలకు పేరుగన్న తుమకూరు నగరంలో చోటుచేసుకుంది. సాక్షి, బెంగళూరు: తుమకూరు నగరంలో ఉన్న జిల్లా ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్ల నిండు బాలింత ప్రాణం గాలిలో కలిసింది. పురుటి నొప్పులు రావడంతో ప్రసవం కోసం ఆస్పత్రికి వచ్చింది, అయితే నీకు ఆరోగ్య కార్డు లేదు, చికిత్స చేయలేం అని వైద్యసిబ్బంది కఠినంగా తిరస్కరించారు. దీంతో ఆమె ఇంటికి వెళ్లిపోగా, అక్కడ కవల పిల్లలు జన్మించారు, కానీ తీవ్ర రక్తస్రావం జరిగి కన్నుమూసింది. వైద్యసిబ్బంది అలసత్వం ముగ్గురి ప్రాణాలు తీసిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేశారు. తెల్లవారుజామున ఆస్పత్రికి వెళ్లగా ఈ అమానుష సంఘటన తుమకూరులో జరిగింది. భారతీ నగరలోని అభయాంజనేయ స్వామి దేవాలయం వీధిలో కస్తూరి (30) అనే మహిళ నివసిస్తోంది. తమిళనాడుకు చెందిన కస్తూరి ఇక్కడకు వచ్చి నెల రోజులు అవుతోంది. ఆమె ఆరేళ్ల కుమార్తె ఉంది. ఆర్థిక సమస్యలతో భర్త 4 నెలల కిందట బెంగళూరులో ఆత్మహత్య చేసుకున్నాడు. నిండు గర్భిణి అయిన కస్తూరికి గురువారం తెల్లవారుజామున 4 గంటలకు ప్రసవ వేదన ప్రారంభం కావడంతో చుట్టుపక్కల మహిళలు ఆమె చేతికి కొంత డబ్బిచ్చి ఒక వృద్ధురాలిని తోడిచ్చి ఆటోలో జిల్లా ఆస్పత్రికి పంపించారు. జిల్లా ఆస్పత్రికి వెళ్తే డాక్టర్లు వైద్యం చేయడానికి బదులుగా గర్భం దాల్చినప్పుడు ఆస్పత్రిలో నమోదు చేసుకుని కార్డు తీసుకున్నారా? అని అడగ్గా ఆమె లేదు అని చెప్పింది. ఆధార్, రేషన్ కార్డు అడిగారు. ఆధార్ కార్డు అడ్రస్ చూపగా తమిళనాడు చిరునామాతో ఉంది. అంతే.. మేం వైద్యం చేయం, బెంగళూరు నగరంలోని విక్టోరియా ఆస్పత్రికి వెళ్లండి అని వైద్యసిబ్బంది సలహా ఇచ్చారు. తీవ్ర రక్తస్రావమై దిక్కుతోచని కస్తూరి ఆటోలో ఇంటికి తిరిగివచ్చింది. కొంతసేపటికి ఆమెకు ప్రసవమై ఇద్దరు మగ పిల్లలు పుట్టారు. కానీ తీవ్రంగా రక్తస్రావం కావడంతో పాటు చూసేవారెవరూ లేకపోయారు. కొంతసేపటికి విలవిలలాడి తల్లీ బిడ్డలు అక్కడే ప్రాణాలు కోల్పోయారు. తల్లిని కోల్పోయి కూతురు విలపిస్తూ ఉండగా అందరూ అక్కడకు చేరారు. ముగ్గురు సస్పెండ్ అంతా జరిగాక ఉన్నతాధికారులు చర్యలకు దిగారు. డాక్టర్ ఉషా, మరో ఇద్దరి సిబ్బందిని సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా వైద్యాధికారి మంజునాథ్ ప్రకటించారు. రాత్రికి ఆరోగ్యమంత్రి సుధాకర్ చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మేయర్, కార్పొరేటర్ల నిరసన ఈ దారుణంపై స్థానిక ప్రజలతో పాటు ప్రజా ప్రతినిధులు వైద్యుల నిర్లక్ష్యంపై మండిపడ్డారు. 22వ వార్డు కార్పొరేటర్ శ్రీనివాస్, మేయర్ ప్రభావతి, ఉప మేయర్ టి.కే.నరసింహమూర్తి, కార్పొరేటర్ నయాజ్ అహ్మద్‌లు బాధితురాలి ఇంటికి వెళ్లి చుట్టుపక్కలవారి నుంచి వివరాలు తెలుసుకున్నారు. తల్లీపిల్లల మృతదేహానికి నివాళులర్పించారు. జిల్లా ఆస్పత్రి వైద్యులు, డిహెచ్ఈ ఇక్కడికి వచ్చేదాకా మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించేది లేదని తెలిపారు. ఆస్పత్రిలో ఉన్న సిబ్బంది, వైద్యులు అందరు లంచాలకు అలవాటు పడి సక్రమంగా వైద్యం చేయడంలేదని, ఆస్పత్రి మొత్తం అవినీతిలో కూరుకుపోయిందని మండిపడ్డారు. జిల్లా ఆస్పత్రి సర్జన్ డాక్టర్ వీణా వచ్చి ప్రజాప్రతినిధులతో మాట్లాడారు. కస్తూరికి తల్లి కార్డు లేక పోవడంతో వెనక్కి పంపించారని చెప్పారు. గర్భిణి ప్రతినెలా ఆస్పత్రిలో ఆరోగ్య పరీక్షలు చేయంచుకునే సమయంలో వారికి తల్లి కార్డు ఇస్తారని అన్నారు. ఇకపై ఇలా జరగుకుండా చూసుకుంటామని, దీనికి ఎవరు బాధ్యులు అనేదానిపై పరిశీలించి చర్యలు తీసుకుంటామని ఆమె చెప్పారు. -
కాకినాడలో దారుణం.. వివాహేతర సంబంధమే కారణమా?
సాక్షి, కాకినాడ: ఏలేశ్వరం మండలంలో దారుణం జరిగింది. అప్పన్నపాలెంలో ఓ ఉన్నాది ఏడు నెలల గర్భిణీ అని కూడా చూడకుండా ఆమెను కిరాతకంగా కత్తితో పొడిచి చంపాడు. ఈ ఘటనతో గ్రామ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వివరాల ప్రకారం.. అప్పన్నపాలెంకు చెందిన దూసర నాగరత్నంకు వివాహమైంది. ప్రస్తుతం ఆమె ఆరు నెలల గర్భవతి. కాగా, సోమవారం వారి బంధువుల ఇంట్లో ఫంక్షన్ ఉండటంతో భర్త, కుటుంబ సభ్యులు వేరే ఊరికి వెళ్లారు. ఈ క్రమంలో నాగరత్నం మాత్రమే ఇంట్లో ఉండగా.. అదే అదునుగా పిల్లి రాజు అనే వ్యక్తి ఆమెను కత్తితో పొడిచి చంపేశాడు. కాగా, వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉందని తెలుస్తోంది. ఎవరూలేని సమయంలో నాగరత్నం వద్దకు పిల్లిరాజుతో రావడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు పిల్లిరాజుకు కూడా వివాహం కాగా.. ఓ కుమారుడు ఉన్నాడు. హత్య సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని పరారీలో ఉన్న పిల్లిరాజు కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. అయితే, పిల్లి రాజుపై అంతకుముందు కూడా పలు నేరాలపై పోలీసు కేసులు ఉన్నట్టు తెలుస్తోంది. -
డబ్బు ఇవ్వలేదని.. జబ్బు అంటగట్టింది
ప్రొద్దుటూరు: కాన్పు చేసినందుకు డబ్బు ఇవ్వలేదనే అక్కసుతో బాలింతకు ఏకంగా ఎయిడ్స్ వ్యాధిని అంటకట్టింది ఒక ఎఫ్ఎన్ఓ (స్టాఫ్‌నర్స్ సహాయకురాలు). దీంతో భార్య, పసికందు తనకు వద్దని భర్త తీవ్ర ఆవేదనతో ఆస్పత్రి నుంచి వెళ్లిపోయాడు. కొద్ది సేపటి తర్వాత తీరిగ్గా వచ్చిన ఎఫ్ఎన్ఓ ఆమెకు ఎయిడ్స్ లేదని, డబ్బు ఇవ్వలేదనే కోపంతో ఆ వ్యాధి సోకినట్లు చెప్పానని తెలిపింది. ఈ సంఘటన వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రిలో చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. చాపాడు మండలం, సోమాపురం గ్రామానికి చెందిన బొజ్జ సుభాషిణి పురిటి నొప్పులు రావడంతో ఆదివారం జిల్లా ఆస్పత్రికి వచ్చింది. అదే రోజు రాత్రి ఆమె సాధారణ ప్రసవమై ఆడపిల్లకు జన్మనిచ్చింది. కొంత సేపటి తర్వాత ఎఫ్ఎన్ఓ లత వారి వద్దకు వచ్చి రూ. 2 వేలు ఇవ్వాలని అడిగింది. ప్రస్తుతానికి తన వద్ద డబ్బులు లేవని, ఉదయం భర్త రాగానే ఇస్తానని సుభాషిణి తెలిపింది. ఈ క్రమంలో సుభాషిణి, పసికందును చూసేందుకు సోమవారం ఆమె భర్త గురుప్రసాద్, అత్త జిల్లా ఆస్పత్రికి వచ్చారు. ఇంతలోనే వారి వద్దకు వచ్చిన ఎఫ్ఎన్ఓ లత మీ భార్యకు ఎయిడ్స్ ఉందని గురుప్రసాద్‌కు చెప్పింది. భార్య, పాప వద్దని రోదిస్తూ వెళ్లిపోయిన భర్త భార్యకు ఎయిడ్స్ ఉందని ఆమె చెప్పడంతో భర్త తీవ్ర ఆవేదనకు లోనయ్యాడు. రోదిస్తూ ఆస్పత్రిలోనే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. కొద్ది సేపటి తర్వాత తేరుకొని నాకు భార్య, బిడ్డ వద్దని ఆస్పత్రి నుంచి వెళ్లిపోయాడు. దీంతో సుభాషిణి ఏడుస్తూ ఉండిపోయింది. కొద్ది సేపటి తర్వాత ఆమె వద్దకు వచ్చిన ఎఫ్ఎన్ఓ లత నాకు డబ్బులు ఇవ్వనందుకే నీకు ఎయిడ్స్ ఉందని చెప్పానని, ఎలాంటి వ్యాధి లేదని తెలిపింది. ఈ విషయం మీ అత్త, భర్తకు చెప్పు అని సూచించి తిన్నగా అక్కడి నుంచి జారుకుంది. లతపై గతంలో కూడా అనేక ఆరోపణలు వచ్చాయి. కాన్పు అయిన వారి వద్ద డబ్బు డిమాండు చేస్తోందని పలు మార్లు ఆస్పత్రి ఉన్నతాధికారులకు ఫిర్యాదులు కూడా వెళ్లాయి. ఆరోపణలు వచ్చిన ప్రతిసారి అధికారులు చర్యలు తీసుకోకుండా మందలించి పంపిస్తూ వచ్చారు. సుభాషిణి గర్భం దాల్చిన నాటి నుంచి జిల్లా ఆస్పత్రిలోనే పరీక్షలు చేయించుకునేది. ఈ క్రమంలోనే ఆమెకు ఈ ఏడాది జనవరి 31 హెచ్ఐవీ పరీక్షలు చేయగా నెగిటివ్‌గా నిర్ధారణ అయింది. సోమవారం కూడా ఆమెకు మరోసారి పరీక్షలు చేయగా నెగిటివ్ రిపోర్టు వచ్చింది. మా అత్తోళ్లు నన్ను వద్దంటున్నారు..ఇప్పుడేం చేయాలి ‘డబ్బులు కావాలంటే ఇస్తాం కదా.. రూ. 2 వేల కోసం నా జీవితాన్ని నాశనం చేస్తారా.. ఇప్పుడు నా పరిస్థితి ఏంటీ’ అని సుభాషిణి రోదించసాగింది. డబ్బు ఇవ్వలేదనే అక్కసుతో ఉదయం నుంచి ఎఫ్ఎన్ఓ నోటికి వచ్చినట్లు దుర్భాషలాడుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. మా అత్తోళ్లు నన్ను వద్దంటున్నారని గుండె పగిలేలా విలపిస్తోంది. డబ్బు కోసం లేని జబ్బును తనకు అంట కట్టిందని ఆమె తెలిపింది. తనను, తన కుంటుంబ సభ్యులను మానసిక క్షోభకు గురి చేసిన ఎఫ్ఎన్ఓ లతపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని సుభాషిణి జిల్లా అధికారులను వేడుకుంటోంది. ఈ విషయమై ఆమె టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. లతపై కేసు నమోదు చేయాలని పోలీసులను కోరింది. విచారణ చేసి చర్యలు తీసుకుంటాం ఈ విషయమై ఇప్పటికే విచారణ చేశాను. బాధితురాలితో మాట్లాడి వివరాలు సేకరించాం. జనవరి 31న, ఈ రోజు హెచ్ఐవీ పరీక్షలు చేయగా ఆమెకు నెగిటివ్ అని రిపోర్టు వచ్చింది. జరిగిన విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాను. పూర్తి స్థాయి విచారణ చేసి చర్యలు తీసుకుంటాను. – డేవిడ్ సెల్విన్‌రాజ్, జిల్లా ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ -
నరకం చూపించిన భర్త.. ఐదు నెలల గర్భిణి ఆత్మహత్య
దొడ్డబళ్లాపురం (బెంగళూరు): ఎన్నో ఆశలతో పుట్టింటికి వెళ్లిన యువతికి భర్త నరకం చూపించాడు. ఇది తట్టుకోలేక 5 నెలల గర్భిణి తనువు చాలించిన విషాద సంఘటన రామనగర పట్టణ పరిధిలోని మంజునాథనగరలో చోటుచేసుకుంది. జాహ్నవి (23) ఆత్మహత్యకు పాల్పడ్డ వివాహిత. రామనగరకు చెందిన జాహ్నవిని 9 నెలల క్రితం పాండవపుర తాలూకా బల్లేనహళ్లి గ్రామానికి చెందిన కర్ణతో వివాహం జరిపించారు. ప్రస్తుతం 5 నెలల గర్భిణి. కర్ణ నిత్యం మద్యం తాగివచ్చి భార్యతో గొడవపడి చిత్రహింసలకు గురిచేసేవాడు. ఇది తట్టుకోలేక ఆమె నెల రోజుల క్రితం రామనగరలోని పుట్టింటికి వచ్చింది. అయినా భర్త నిత్యం ఫోన్ చేసి మాటలతో హింసిస్తుండడంతో విరక్తి చెంది ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఐజూరు పోలీసులకు ఆమె తల్లిదండ్రులు కర్ణపై ఫిర్యాదు చేశారు. చదవండి: (యువ దంపతుల ఆత్మహత్య .. అదే కారణమా..?) -
వివాహమైనా తమ కళ్లెదుటే ఉండాలనుకున్నారు.. కానీ..
సాక్షి, గోపాల్పేట (వనపర్తి): నాలుగు నెలల ఆ గర్భిణి, కుటుంబసభ్యులు ఎంతో సంతోషంగా కాలం గడుపుతుండగా వాటర్ హీటర్ రూపంలో మృత్యువు గర్భిణిని కబళించింది. ఈ విషాదకర సంఘటన వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం బుద్దారంలో శనివారం చోటుచేసుకుంది. ఎస్ఐ నవీద్ తెలిపిన వివరాలిలా.. బుద్దారానికి చెందిన అంజన్నమ్మ, తిరుపతిగౌడ్ కూతురు రవిసుధ (22)ను మూడేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన నరేందర్‌గౌడ్‌కు ఇచ్చి వివాహం చేశారు. వివాహ జీవితం సంతోషంగా సాగుతోంది. వారికి ఇప్పటికే 14నెలల బాబు ఉండగా.. ప్రస్తుతం రవిసుధ నాలుగు నెలల గర్భిణి. ఈక్రమంలో రోజులానే ఇంట్లో శనివారం నీరు వేడి చేసేందుకు నీటితో నిండిన బకెట్లో హీటర్‌ను ఉంచారు. అదే సమయంలో ఇల్లు శుభ్రం చేస్తున్న రవిసుధ చెయ్యి అనుకోకుండా హీటర్ ఉంచిన బకెట్‌కు తగిలింది. దీంతో ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందింది. చదవండి: (చిట్టమ్మ పెంచుకున్న పొట్టేలే.. ‘ఊపిరి’ తీసింది!) భర్త నరేందర్‌గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఇదిలా ఉండగా, రవిసుధ తల్లిదండ్రులు.. తమ కూతురు వివాహమైనా తమ కళ్లెదుటే ఉండాలన్న ఆశతో సొంత గ్రామానికి చెందిన యువకుడికి ఇచ్చి వివాహం చేశారు. కానీ, అనుకోని రీతిలో తమ కూతురు వారిని వీడిపోవడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. -
TS: ఆర్టీసీ బస్సులో ప్రసవం!
కోస్గి: వైద్య పరీక్షల కోసం డాక్టర్ వద్దకు వెళ్లొస్తున్న ఓ గర్భిణి ఆర్టీసీ బస్సులోనే ప్రసవించింది. వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలం అల్లాపురం గ్రామానికి చెందిన బుడగ జంగం లక్ష్మి ఏడు నెలల గర్భవతి. మంగళవారం కడుపులో నొప్పి రావడంతో తల్లితో కలిసి కోస్గి ప్రభుత్వాస్పత్రికి వెళ్లింది. వైద్యుల సూచన మేరకు అక్కడి నుంచి మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రికి వెళ్లింది. వైద్యులు పరీక్షించి, ఇంటికి వెళ్లాల్సిందిగా సూచించారు. దాంతో గర్భిణి, ఆమె తల్లి కలిసి రాత్రి 9.15 గంటలకు ఆర్టీసీ బస్సులో స్వగ్రామానికి బయలుదేరారు. బస్సు కోస్గి పరిధిలోని సంపల్లి శివార్లలో ఉండగా లక్ష్మికి పురిటినొప్పులు వచ్చాయి. తోటి ప్రయాణికులు 108కు సమాచారం ఇవ్వగా.. 108 సిబ్బంది అబ్దుల్ అసద్, దేవేందర్ నాయక్ వెంటనే అక్కడికి చేరుకుని.. బస్సులోనే కాన్పు చేశారు. కవల ఆడపిల్లలు జన్మించారు. తర్వాత తల్లీబిడ్డలను 108 వాహనంలో కోస్గి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వారు క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. -
అన్నాచెల్లెళ్ల గొడవ.. సోదరుడు తిట్టాడని నిండు గర్భిణి ఆత్మహత్య
వక్కలగడ్డ (చల్లపల్లి) : అన్న తిట్టాడని మనస్తాపంతో నిండు గర్భిణి ఆత్మహత్య చేసుకున్న ఘటన కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం వక్కలగడ్డ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. మెరైన్ కానిస్టేబుల్ గొరిపర్తి పాండు రంగారావు కుమార్తె నాగ భార్గవికి (20) 15 నెలల క్రితం హైదరాబాద్‌లో చార్డెడ్ అకౌంటెంట్‌గా పని చేసే నెరుసు సాయి శంకర్‌తో వివాహమైంది. భార్గవి గర్భం దాల్చటంతో పుట్టింటికి వచ్చి ఉంది. తరచూ నాగభావర్గవి అన్న నిఖిల్ తన తల్లి, చెల్లితో ఏదొక విషయంలో వాదన పడుతూ ఉంటాడు. ఈ క్రమంలో ఆదివారం భార్గవికి, నిఖిల్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. అన్న నిఖిల్ తిట్టడంతో మనస్థాపానికి గురైంది. దీంతో వంటింట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బయట ఉన్న తల్లి ఇంట్లోకి వెళ్లి చూసేసరికి నిండు చూలాలైన కుమార్తె నాగభార్గవి ఉరికి వేలాడుతూ కనిపించడంతో హతాశురాలైంది. ఇరుగు పొరుగును పిలిచి వెంటనే మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మార్గమధ్యలోనే భార్గవి మృతి చెందింది. మృతురాలి తల్లి నాగలక్ష్మి ఫిర్యాదు మేరకు ఎస్ఐ డి.సందీప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భార్గవి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అవనిగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
ఎడ్ల బండిలోనే మహిళ ప్రసవం : అదిలాబాద్
-
విషాదం: వైద్యుల నిర్లక్ష్యంతో తల్లీబిడ్డల మృతి?
సాక్షి, భద్రాచలం: ఏపీ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా యటపాక మండలం చెన్నంపేట గ్రామానికి చెందిన పూనెం సమ్మక్క(25) ప్రసవం అనంతరం తీవ్ర రక్తస్రావంతో మృతి చెందింది. పుట్టిన బిడ్డ కూడా చనిపోయింది. దుమ్ముగూడెంలో మంగళవారం జరిగిన ఈ సంఘటన బుధవారం వెలుగుచూసింది. మృతురాలి తండ్రి దుమ్ముగూడెం మండలం రేగుంట గ్రామస్తుడు పాయం ఎర్రయ్య తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పూనెం సమ్మక్కను ప్రసవం కోసం మంగళవారం దుమ్ముగూడెం పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. అక్కడి వైద్యాధికారి ప్రసవం చేయగా బాబు జన్మించాడు. అనంతరం తల్లికి తీవ్ర రక్తస్రావం అవుతుండటంతో 108 ద్వారా భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో తరలించే క్రమంలో తల్లి, బాబులు ఇద్దరు మృతి చెందారు. వైద్యుల నిర్లక్ష్యంతో తల్లీ బిడ్డ చనిపోయారని, వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని ఎర్రయ్య డిమాండ్ చేశారు. దీనిపై దుమ్ముగూడెం పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ బాలాజీ నాయక్‌ను వివరణ కోరగా.. పూనెం సమ్మక్కను ప్రసవం కోసం మంగళవారం ఉదయం పీహెచ్‌సీకి తీసుకురాగా పరీక్షించి గర్భాశయంలో బిడ్డ ఎదురుకాళ్లతో ఉండటంతో సాధారణ ప్రసవం కష్టమని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి పంపినట్లు తెలిపారు. మళ్లీ సాయంత్రం తీసుకురాగా.. భద్రాచలం ఎందుకు తీసుకెళ్లలేదని ప్రశ్నించామని పేర్కొన్నారు. కాన్పుకు ఇంకా కొన్ని రోజుల సమయం ఉందని ఏరియా ఆస్పత్రి వైద్యులు చెప్పడంతో ఇంటికి వచ్చామని, ఇంటికి వచ్చాక నొప్పులు రావడంతో మళ్లీ ఆస్పత్రికి వచ్చినట్లు మృతురాలి కుటుంబీకులు తెలిపారని డాక్టర్ వివరించారు. మంగళవారం సాయంత్రం ఆస్పత్రికి వచ్చేసరికే బిడ్డ రెండు కాళ్లు బయటికి వచ్చిన క్రమంలో తప్పనిసరి పరిస్థితులలో అత్యవసరంగా ప్రసవం చేశామని, రక్తస్రావం అవుతుంటే 108 ద్వారా స్టాఫ్‌నర్స్‌ను తోడుగా పంపామని పేర్కొన్నారు. ముందుగానే గర్భిణి తండ్రి, కుటుంబీలకు పరిస్థితిని వివరించామని, ఇందులో తమ నిర్లక్ష్యం ఏమి లేదని తెలిపారు. చదవండి: 20 లక్షలు ఖర్చు చేసినా దక్కని ప్రాణాలు -
Coronavirus: తగ్గిపోయాక పాలివ్వచ్చా?
నేను బాలింతరాలిని. రెండున్నర నెలల బాబు ఉన్నాడు. నాకు కరోనా వచ్చింది. ఈ ఉత్తరం మీకు అందే సమయానికి నాకు కరోనా తగ్గిపోతుండొచ్చు. అయినా నాకు వచ్చిన సందేహం చాలా మంది తల్లులకూ ఉండి ఉంటుంది. కరోనా సమయంలో.. తగ్గిపోయాక కూడా బిడ్డకు పాలు పట్టొచ్చా? – ఏ. రమ్యశ్రీ, డిచ్పల్లి తల్లికి కరోనా వైరస్ సోకితే, వైరస్ తల్లిపాల వలన బిడ్డకు చేరే అవకాశాలు పెద్దగా లేవు. ఇప్పటి వరకు గమనించిన అంశాలను బట్టి కరోనా వైరస్ తల్లి పాలలో ఉన్నట్లు రుజువు కాలేదు. కరోనా వచ్చిన తొలి రోజులలో దాని గురించి మనకు పెద్దగా తెలియదు కాబట్టి, తల్లిపాల వలన బిడ్డకు కరోనా సోకుతుందనే భయంతో బిడ్డను తల్లి నుంచి వేరు చేసి, డబ్బాపాలు పట్టడం జరిగింది. తర్వాత కేసులు పెరగడంతో, కరోనా బారినపడ్డవాళ్లలో జరిగే మార్పులు, వాటిలోని అనేక అంశాలను గమనించి తల్లిపాలను తాగడం వలన బిడ్డకు కరోనా సోకదు అని తేల్చారు శాస్త్రవేత్తలు, విశ్లేషకులు, డాక్టర్లు. కాకపోతే బిడ్డ పుట్టిన తర్వాత తల్లి ముక్కు, నోటి నుంచి బిడ్డకు కరోనా రావడం జరుగుతుంది. అలాగే బిడ్డ ఆలనాపాలన చూసుకునే వారికి కరోనా ఉంటే వారి వలన కూడా బిడ్డకు కరోనా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ చంటి పిల్లలకు సోకినా 80 -90 శాతం మందిలో ఎటువంటి లక్షణాలు లేకుండానే తల్లిపాలలోని యాంటీబాడీస్‌తో రోగనిరోధక శక్తి పెరిగి వైరస్ అంతరించిపోతుంది. చాలా తక్కువ మంది పిల్లల్లో మాత్రమే 5-6 రోజులకు జ్వరం, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయి. 0.5-1శాతం పిల్లలోనే న్యుమోనియా, శ్వాస సమస్యలు ఏర్పడి సరైన చికిత్స ఇప్పించకపోతే ప్రాణాంతకం అయ్యే అవకాశాలు ఉంటాయి. తల్లిపాలల్లో అనేక రకాల విటమిన్స్, రోగనిరోధక శక్తిని పెంచే యాంటిబాడీస్ ఉంటాయి. కాబట్టి తల్లిపాలు బిడ్డ తాగడం వలన ఇవి బిడ్డకు చేరి, బిడ్డలో చాలా వరకు కరోనాతోపాటు, ఇతర ఇన్ఫెక్షన్లు వచ్చినా రోగక్రిములకు వ్యతిరేకంగా పోరాడే శక్తి వంటి లాభాలు చేకూరి బిడ్డ ఆర్యోగ్యంగా ఉంటుంది. కాబట్టి తల్లికి కరోనా సోకినప్పటికీ, తగిన జాగ్రత్తలు పాటిస్తూ బిడ్డకు పాలివ్వచ్చు. సబ్బుతో చేతులను శుభ్రంగా 20 సెకన్లపాటు కడుక్కోవాలి. లేదా కనీసం 60 శాతం ఆల్కహాల్ ఉండే శానిటైజర్‌తో చేతులు పూర్తిగా తుడుచుకోవాలి. ముక్కు, మూతి పూర్తిగా కవర్ అయ్యేలా మాస్క్ ధరించాలి. వీలయితే ఎన్95 లేదా సర్జికల్ మాస్క్, డబుల్ మాస్క్‌లు ధరించడం మంచిది. పాలిచ్చిన తర్వాత బిడ్డను కనీసం ఆరు అడుగులు (2 మీటర్లు) దూరంలో ఉంచడం మంచిది. తల్లి పాలు పట్టలేని స్థితిలో ఉంటే, ఎవరైనా శుభ్రంగా చేతులు కడుక్కొని తల్లి పాలు పిండి బిడ్డకు పట్టించవచ్చు. చేతితో పాలు పిండడం కుదరకపోతే మాన్యుయల్ లేదా ఎలక్ట్రానిక్ బ్రెస్ట్ పంప్ ఉపయోగించొచ్చు. బిడ్డకు వాడే బాటిల్స్, బ్రెస్ట్ పంప్ వంటి వస్తువులు, అలాగే తల్లి ఉండే గదిలో కూడా తల్లి ముక్కు, మూతి నుంచి తుంపర్లు పడే అవకాశాలు ఉన్న టేబుల్, బెడ్ వంటి వాటినీ ఎప్పటికప్పుడు శుభ్రపరుచుకుంటూ ఉండాలి. కాన్పు తర్వాత వీలయినంత వరకు కొంతకాలం పాటు అతిథులను అనుమతించక పోవడం మంచిది. కావాలనుకుంటే వీడియోకాల్ ద్వారా తల్లి,బిడ్డను చూపించవచ్చు. తల్లికి కరోనా పూర్తిగా తగ్గిపోయిన తర్వాత తల్లిలో ఏర్పడే యాంటిబాడీస్, తల్లిపాల ద్వారా బిడ్డకూ చేరి బిడ్డనూ కరోనా వైరస్ బారి నుంచి కాపాడుతాయి. కాబట్టి తగిన జాగ్రత్తలతో, పౌష్టికాహారం తీసుకుంటూ తల్లి బిడ్డకు పాలు ఇవ్వడం వలన తల్లీ, బిడ్డ ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి అరుదుగా వచ్చే దుష్ఫలితాల కంటే ప్రయోజనాలే ఎక్కువ. బిడ్డకు తన పాలు పట్టడం వలన తల్లిలో ఉన్న భయాందోళనలూ తగ్గి ఊరట, సంతృప్తి కలుగుతాయి. బిడ్డకు తన పాలు ఇవ్వకుండా దూరం పెట్టడం వలన తను మానసిక సంక్షోభంలోకి వేళ్లే అవకాశాలు ఉంటాయి. మాకు ఈ మధ్యనే అంటే కరోనా కాలంలోనే పెళ్లయింది. నిజానికి ఫ్యామిలీ ప్లానింగ్ ఏమీ అనుకోలేదు. కాని ఈ పాండమిక్ సిట్యుయేషన్లో గర్భం దాల్చలనీ లేదు. అయినా మీ సలహా కోసం ఈ ఉత్తరం రాస్తున్నాను. గర్భం దాల్చడం.. వైద్య పరీక్షల కోసం డాక్టర్స్ దగ్గరకు వెళ్లడం క్షేమమే అంటారా? లేక ఫ్యామిలీ ప్లానింగ్ ఫాలో అవమంటారా? – మాచిరాజు రాకేశ్, విఖాఖ పట్టణం ఈ కరోనా పాండమిక్ సమయంలో గర్భం దాల్చడం గురించి, గర్భం దాలిస్తే ఎలాంటి సమస్యలు ఉంటాయి వంటి ఎన్నో ప్రాక్టికల్ సందేహాలు చాలా మంది దంపతులను తికమక పెడుతూ ఆందోళనకు గురి చేస్తున్నాయి. కోవిడ్ మొదలయిన ఒకటిన్నర సంవత్సర కాలంలో కరోనా వైరస్ ప్రభావం మనుషుల పైన ఎలా ఉంటోంది? అలాగే గర్భవతులు మీదా ఎలా ఉండబోతోంది అనే విషయాలు తెలుసుకోవడం జరిగింది. అలాగే దాని ప్రభావం, దుష్ఫలితాలు అంతుచిక్కని కొత్త కొత్త లక్షణాలు సమస్యలు కూడా బయటపడుతున్నాయి. ఈ సెకండ్ వేవ్‌లో కరోనా వైరస్ తొందరగా వ్యాప్తి చెందుతోంది. అలాగే లక్షణాలు కూడా కొందరిలో తొందరగా తీవ్రమయి ఇబ్బంది పెడుతున్నాయి. కుటుంబ సభ్యులు అందరూ మానసికంగా , శారీరకంగా, ఆర్థికంగా వ్యథకు గురవుతున్నారు. అల్లాడిపోతున్నారు. ఇలాంటి సమయంలో గర్భం దాలిస్తే తల్లి, లోపల శిశువు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. డాక్టర్ చెకప్స్‌కి ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకున్నా, కొన్నిసార్లు చెకప్స్‌కి ఆసుపత్రికి వెళ్లవలసి ఉంటుంది. దాని వలన కొందరిలో కరోనా వైరస్‌కి ఎక్స్పోజ్ అయ్యే అవకాశాలు పెరుగుతాయి. ఈ సెకండ్ వేవ్‌లో ఇంట్లో ఉన్నా, ఏదో ఒక విధంగా కొందరిలో వైరస్ వ్యాప్తి చెందుతుంది. కరోనా సోకినప్పుడు మాములు వారితో పోలిస్తే గర్భీణీలలో కొద్దిగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. కాబట్టి, వీరిలో కాంప్లికేషన్స్ రిస్క్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. ఆస్తమా, డయాబెటీస్, బీపీ వంటి దీర్ఘకాలిక సమస్యలున్న వారిలో ఈ రిస్క్ మరీ ఎక్కువ. అదృష్టం కొద్ది 80–90 శాతం గర్భీణీలలో తొందరగా గుర్తించి, ఇంట్లోనే ఉంటూ తగిన చికిత్స, జాగ్రత్తలు తీసుకుంటే ఏ సమస్యలు లేకుండా బయటపడుతున్నారు. కొందరిలో మాత్రమే వారి శారీరక తత్వాన్ని బట్టి, ఆరోగ్య సమస్యలను బట్టి ఆలస్యంగా గుర్తించినా, నిర్లక్ష్యం చేసినా, ఆసుపత్రిలో ఆడ్మిట్ చేసి చికిత్స తీసుకోవలసి వస్తుంది. 3–5 శాతం మందిలో వ్యాధి లక్షణాలు ముదిరి, రక్తనాళాలలో రక్తం గడ్డకట్టడం, ఊపిరితిత్తులు సరిగి పనిచేయకపోవటం, గుండెపై ప్రభావం, ఇతర అవయవాలు దెబ్బతినడంతో ప్రాణాంతకంగా మారవచ్చు. కొందరిలో మాత్రం అధిక జ్వరం వలన అబార్షన్లు, బిడ్డ బరువు సరిగా పెరగకపోవటం, నెలలు నిండకుండా కాన్పులు వంటి అవకాశాలుంటాయి కొద్దిగా. కాబట్టి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని గర్భం గురించి నిర్ణయం తీసుకోవటం మంచిది. వయసు, ఎత్తు, బరువు , పీరియడ్స్ సక్రమంగా వస్తున్నాయా లేదా అనే విషయాలు తెలియవలసి ఉంటుంది. 30 ఏళ్ల కంటే తక్కువ వయస్సుండి , ఇతర సమస్యలు లేకపోతే బిడ్డను కనే ఆలోచనను కొన్ని నెలల పాటు వాయిదా వేసుకోవడం మంచిది. ఒకవేళ అధిక బరువుతోపాటు ఇతర హార్మోన్ సమస్యలు ఏమైనా ఉంటే, ఈ లోపల వాటిని సరిదిద్దుకుని, తర్వాత పిల్లల కోసం ప్లాన్ చేసుకోవటం మంచిది. ఒకవేళ అనుకోకుండా గర్భం వస్తే, తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మానసికంగా, శారీరకంగా ఆనందంగా, ఆరోగ్యంగా, ధైర్యంగా ఉండే ప్రయత్నం చేయాలి. -డా. వేనాటి శోభ గైనకాలజిస్ట్ హైదరాబాద్ చదవండి: ఫాస్టెస్ట్ ఉమన్: ఎవరెస్టును ఎక్కిన తొలి మహిళ -
కరోనా: కాబోయే అమ్మకు కష్టమే
నెలరోజుల క్రితం భీంపూర్ మండలానికి చెందిన ఓ గర్భిణి ప్రసవం నిమిత్తం రిమ్స్ ఆస్పత్రిలో చేరింది. కరోనా టెస్టులు చేయడంతో పాజిటివ్ వచ్చింది. దీంతో వైద్యులు ఆమెకు ప్రసవం చేసేందుకు నిరాకరించారు. ఆ తర్వాత డీఎంహెచ్‌వో, రిమ్స్ డైరెక్టర్ వైద్యులను ఒప్పించడంతో సిజేరియన్ చేశారు. రెండు నెలల క్రితం ఓ గర్భిణికి కూడా పాజిటివ్ రావడంతో ఆదిలాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రులు, రిమ్స్‌లో వైద్యం నిరాకరించారు. కుటుంబసభ్యులు మహారాష్ట్రలోని యావత్మాల్కు తీసుకెళ్లి ప్రసవం చేయించారు. వీరే కాదు. జిల్లాకు చెందిన మరికొందరికి పాజిటివ్ రావడం.. వైద్యులు నిరాకరించడంతో గాంధీ ఆస్పత్రికి తరలించిన సంఘటనలు ఉన్నాయి. సాక్షి, ఆదిలాబాద్‌టౌన్: కరోనా మహమ్మారి గర్భిణులపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. కోవిడ్ కేసుల ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. దీంతో మారుమూల గ్రామాల్లో గర్భిణులు, బాలింతలు ఆస్పత్రులకు వెళ్లి వైద్య పరీక్షలు చేసుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. కొన్ని ఆస్పత్రుల్లో గర్భిణులకు నెల వారీ పరీక్షలు కూడా చేసుకునేందుకు అవకాశం లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. మరికొంత మంది కోవిడ్ భయంతో ఇంటికే పరిమితమవుతున్నారు. దీంతో ప్రసవానికి ముందు అనేక ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. జిల్లాలో దాదాపు వందకుపైగా గర్భిణులకు కోవిడ్ సోకింది. పాజిటివ్ వస్తే జిల్లా లోని ఆస్పత్రుల్లో ప్రసవాలు చేయడం లేదు. దీంతో హైదరాబాద్, నాగాపూర్, యావత్మాల్, తదితర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇబ్బందులు పడుతున్న గర్భిణులు గర్భిణులు ప్రతీనెల పీహెచ్‌సీలు, ఆస్పత్రులకు వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈనెల 12 నుంచి లాక్డౌన్ విధించింది. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే మినహాయింపు ఇచ్చింది. ప్రైవేట్ వాహనాలకు అనుమతి లేదు. మారుమూల గ్రామాలకు సైతం బస్సులు నడవడం లేదు. దీంతో ఆస్పత్రులకు వెళ్లేందుకు ఇబ్బందులకు గురవుతున్నారు. అంతేకాకుండా ప్రైవేట్ ఆస్పత్రుల్లోని గైనకాలజిస్టులు గర్భిణులకు వైద్య పరీక్షలు చేసేందుకు నిరాకరిస్తున్నారు. రిమ్స్‌లో కూడా వీరికి పూర్తిస్థాయిలో వైద్యం అందడం లేదని తెలుస్తోంది. ఇద్దరు మృత్యువాత జిల్లా వ్యాప్తంగా 5,282 మంది గర్భిణులు, 5,676 మంది బాలింతలు ఉన్నారు. దాదాపు 110 మందికి పైగా గర్భిణులకు కరోనా పాజిటివ్ వచ్చింది. వారిలో కొంతమంది ప్రైవేట్ ఆస్పత్రులు, రిమ్స్‌లో చికిత్స పొందారు. మరొ కొంతమంది హోం ఐసోలేషన్‌లో ఉండి కరోనాను జయించారు. ఆదిలాబాద్ పట్టణంలోని ఖుర్షీద్నగర్కు చెందిన గర్భిణికి కరోనా పాజిటివ్ వచ్చింది. చికిత్స పొందినప్పటికీ పరిస్థితి విషమించడంతో మృతి చెందింది. పట్టణంలోని భుక్తాపూర్ ఏరియాలోని ఓ ప్రైవేట్ నర్సింగ్ హోంలో ప్రసవం జరిగిన తర్వాత మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఊపిరి ఆడకపోవడంతో ఆమె పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే చాలా మంది గర్భిణులు కోవిడ్ నిబంధనలు పాటించకపోవడం, మాస్కులు ధరించకపోవడంతో వైరస్ బారిన పడుతున్నట్లు తెలుస్తోంది. అప్రమత్తంగా ఉండాలి కోవిడ్ నేపథ్యంలో గర్భిణులు అప్రమత్తంగా ఉండాలి. వారికి రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. కుటుంబ సభ్యులు తొమ్మిది నెలల పాటు కంటికి రెప్పలా చూసుకోవాలి. తప్పని సరిగా నెలవారి పరీక్షలు చేయించాలి. కోవిడ్ సోకినప్పటికీ అధైర్య పడవద్దు. – సాధన, గైనకాలజిస్ట్, డెప్యూటీ డీఎంహెచ్‌వో -
సోనూసూద్ స్ఫూర్తితో.. ఆటోవాలా ఔదార్యం
సాక్షి, బంజారాహిల్స్: ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనూసూద్ సేవా కార్యక్రమాలు గత ఏడాది కాలంగా అందరూ కళ్లారా చూస్తున్నారు. సోనూసూద్ ఇతరులకు సహాయ కార్యక్రమాలు చేస్తుంటే ఆయన ఆదర్శంగా మనమెందుకు చేయకూడదని ఓ ఆటోవాలా భావించాడు. తన చేతిలో ఉన్న కళను సేవా కార్యక్రమాలకు వినియోగించుకుంటూ సోనూసూద్‌పై అభిమానం చాటుకుంటున్నాడు. సోనూసూద్ అభిమాని అయిన ఈ ఆటో డ్రైవర్ వికలాంగులకు, గర్భిణులకు, అవిటివారికి తన ఆటోలో ఉచితంగా ప్రయాణం కల్పిస్తూ సేవాతత్పరత చాటుకుంటున్నాడు. ఆయన చేస్తున్న ఈ సేవ ప్రతి ఒక్కరినీ కదిలించడమే కాకుండా సోనూసూద్‌ను మరోసారి గుర్తు చేస్తుంది. చదవండి: పాజిటివ్ వచ్చింది.. సేవకు మరింత టైం దొరికింది.. -
యువకుల వివాదం.. గర్భవతి అని చూడకుండా..
సాక్షి, సైదాబాద్: చిన్న విషయంలో చెలరేగిన వాగ్వివాదం యువకుడిపై దాడికి దారి తీసింది. సైదాబాద్ ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. సింగరేణికాలనీలో నివసించే ప్రశాంత్ అలియాస్ రాజు (24) జీహెచ్ఎంసీ కార్మికుడిగా పని చేస్తున్నాడు. ఈనెల 2న రాత్రి 9గంటలకు రాజుకు అదే ప్రాంతంలో నివసించే అహ్మద్‌తో స్వల్ప విషయమై గొడవ జరిగింది. రాజు అక్కడి నుంచి వెళ్లిన తరువాత అహ్మద్ తన కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి రాజు ఇంటికి వెళ్లారు. రాజు ఎక్కడున్నాడని అడుగుతూ వారితో వచ్చిన మహిళలు రాజు వదిన గర్భవతి అయిన సలోమిని చితకబాదారు. విషయం తెలుసుకున్న రాజు చంపాపేటలో స్నేహితుడి ఇంటి వద్ద తలదాచుకున్నాడు. మరుసటి రోజు రాజును చంపాపేటలో కలుసుకున్న అహ్మద్ రాజీ చేసుకుందామని సింగరేణికాలనీకి తీసుకువచ్చారు. అక్కడ అతడిపై అహ్మద్ అతని కుటుంబసభ్యులు కర్రలతో చితకబాదారు. ఆ దృశ్యాలను అక్కడి యువకుడు సోషల్ మీడియాలో పెట్టడంతో అవి వైరల్ అయ్యాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బాధితుడిని అతడి వదినను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయించారు. అనంతరం వారి ఫిర్యాదుతో నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: బారికేడ్లో ఇరుక్కున్న బాలుడు చత్తీస్‌గఢ్ ఎన్కౌంటర్: ఎవరీ హిడ్మా -
గర్భంలోని శిశువు మాయం.. మహిళ ఆందోళన
సాక్షి, తిరుపతి : గర్భంలోని శిశువును మాయం చేశారంటూ ఓ మహిళ ఆరోపించడంతో తిరుపతి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట కు చెందిన శశికళ అనే మహిళ ఇటీవల తిరుపతిలో ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రికి వచ్చారు. పలుమార్లు చికిత్స కూడా తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం మరోసారి ఆస్పత్రికి వచ్చిన ఆమె... వింత వాదనతో ఆస్పత్రి సిబ్బందిపై ఆరోపణలు చేశారు. కాన్పు కోసం వచ్చిన తనకు గర్భం రాలేదని అంటున్నారంటూ ఆస్పత్రి నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు. గర్భంలోని శిశువును మాయం చేశారంటూ వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రి తీరును తప్పుపడుతూ నిరసన వ్యక్తం చేశారు. మహిళ తీరుపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన ప్రసూతి ఆసుపత్రి వైద్యులు అలిపిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కడుపులో గాలి బుడగలను గర్భంగా భావించిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. వైద్యుల ఫిర్యాదు మేరకు ఆస్పత్రికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సదరు మహిళ మానసిక స్థితిపై వివరాలను సేకరిస్తున్నారు. -
అమెరికాలో మహిళకి మరణశిక్ష అమలు
టెర్రెహాట్: పదిహేడేళ్ల క్రితం నిండు గర్భిణిని హత్య చేసి, ఆమె కడుపు కోసి గర్భంలో ఉన్న శిశువుని ఎత్తుకుపోయిన నేరానికి కాన్సాస్‌కి చెందిన లీసా మాంట్గొమెరీ అనే మహిళకు మరణశిక్ష అమలు చేశారు. అమెరికాలో ఒక మహిళకు మరణశిక్షను అమలు చేయడం 1953 సంవత్సరం తర్వాత ఇదే మొదటిసారి. ఇండియానాలోని టెర్రెహాట్ జైలులో 52 ఏళ్ల వయసున్న లీసాకి ప్రాణాలు తీసే ఇంజెక్షన్ ఇచ్చారు. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 1.31 గంటలకు ఆమె తుది శ్వాస విడిచినట్టుగా జైలు అధికారులు వెల్లడించారు. మరణశిక్ష అమలు చేయడానికి ముందు లీసా కాస్త ఆందోళనతో కనిపించినట్టు జైలు అధికారులు చెప్పారు. ఇంజెక్షన్ ఇవ్వడానికి ముందు జైలులోని మహిళా అధికారి లీసా దగ్గరగా వచ్చి, ఆమె ముఖాన్ని కప్పి ఉంచిన మాస్కు తీసి, చివరగా చెప్పాల్సినదేమైనా ఉందా అని ప్రశ్నించారు. దానికి లీసా నెమ్మదిగా, వణుకుతున్న గొంతుతో ‘‘నో’’అని బదులిచ్చారు. మిస్సోరి పట్టణంలో నివాసం ఉన్న లీసా 2004 సంవత్సరం డిసెంబర్లో ఇంటర్నెట్లో కుక్క పిల్లల అమ్మకానికి ఉన్నాయన్న ప్రకటన చూసింది. ఆ ప్రకటన ఇచ్చిన బాబీ జో స్టిన్నెట్ (23) మహిళని కాంటాక్ట్ చేసింది. స్టిన్నెట్ ఇంటికి వెళ్లిన లీసా ఉన్మాదంతో ప్రవర్తించింది. అప్పటికే ఎనిమిదో నెల గర్భిణి అయిన స్టిన్నెట్ మెడకి తాడు బిగించి దారుణంగా హత్య చేసింది. ఆ తర్వాత వంటగదిలో ఉన్న కత్తిని తీసుకువచ్చి ఆమె గర్భాన్ని చీల్చి లోపల ఉన్న శిశువుని అపహరించింది. -
కరోనా పరీక్షలు చేస్తారనే భయంతో
ఉండవెల్లి (అలంపూర్): చెక్‌పోస్టు వద్ద కరోనా పరీక్షలు చేస్తారేమోనని భయపడి అడ్డదారిలో వచ్చేందుకు యత్నించి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. మార్గమధ్యలో ఒక్కసారిగా పెరిగిన వాగు ఉధృతిలో కారు కొట్టుకుపోగా.. అందులో ప్రయాణిస్తున్న మహిళ గల్లంతైంది. మరో ఇద్దరు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఈ సంఘటన శనివారం తెల్లవారుజామున జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం పరిధిలోని ఉండవెల్లి మండలం కలుగొట్ల గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఏపీ రాష్ట్రం కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన నాగ సింధూరెడ్డి (28)కి హైదరాబాద్‌కు చెందిన శివశంకర్‌రెడ్డితో ఏడాది క్రితం వివాహమైంది. ప్రస్తుతం ఆమె గర్భవతి. శివశంకర్‌రెడ్డి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అయితే, భార్యాభర్తలతో పాటు శివశంకర్‌రెడ్డి స్నేహితుడు జిలానీ బాషా కలసి బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు కారులో బయల్దేరారు. జాతీయ రహదారి మీదుగా కర్నూలు దాటి తెలంగాణ రాష్ట్రంలోని పుల్లూరు చెక్‌పోస్టు సమీపం వరకు వచ్చారు. అయితే, చెక్‌పోస్టు వద్ద కరోనా పరీక్షలు చేస్తారేమో అనే భయంతో పాటు ఆలస్యమవుతుందని భావించి డ్రైవింగ్ చేస్తున్న జిలానీబాషా జాతీయ రహదారి నుంచి కారును గ్రామాల మీదుగా మళ్లించాడు. ఒక్కసారిగా పెరిగిన వాగు ఉధృతి తెల్లవారుజామున ఐదు గంటల ప్రాంతంలో ఉండవెల్లి మండలం పుల్లూరు నుంచి కలుగొట్ల మీదుగా కారుని పోనిచ్చాడు. జోరువాన.. పైగా చీకట్లో కలుగొట్ల వాగు ఉధృతిని అంచనా వేయలేక వేగంగా వాగు దాటించే ప్రయత్నం చేశాడు. ఒక్కసారిగా పెరిగిన వాగు ఉధృతికి కారు అదుపుతప్పి కొట్టుకుపోయింది. నిద్రలో ఉన్న సింధూరెడ్డి వాగులో పడి నీటిలో మునిగిపోగా.. శివశంకర్‌రెడ్డి, జిలానీబాషా డోర్ తెరుచుకొని ముళ్లకంప సాయంతో ఎలాగోలా బయటపడ్డారు. సింధూను పట్టుకునే ప్రయత్నం చేసినా.. చీకటి, మరోవైపు నీటి ఉధృతి అధికంగా ఉండటంతో ఆమె గల్లంతైంది. గాలింపు చర్యలు వేగవంతం సమాచారం అందుకున్న ఎస్పీ రంజన్‌రతన్, అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, ఆర్డీఓ రాములు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితులతో మాట్లాడి వారి వివరాలు సేకరించారు. ప్రొక్లెయినర్ సాయంతో కారును బయటికి తీయించారు. మహిళ ఆచూకీ కోసం గాలింపు చర్యలు వేగవంతం చేశారు. ఈ వాగు, మరో పెద్దవాగు అయిన బొంకూరు గుండా వాహనాలను రానివ్వకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇదిలా ఉండగా, ఘటన చోటుచేసుకన్న కలుగొట్ల వాగు నుంచి తుంగభద్ర నది 500 మీటర్ల దూరం మాత్రమే ఉంది. కాగా, ఎమ్మెల్యే అబ్రహం బాధితులను పరామర్శించారు. నిత్యం వాహనాలు ఇదే రోడ్డులో తిరుగుతాయని, ఇంతవరకు ఇలాంటి ఘటన చోటుచేసుకోలేదని పేర్కొన్నారు. సింధూ గర్భవతి ఇదిలా ఉండగా, తన కూతురు నాగసింధు ప్రస్తుతం గర్భిణి అని ఆమె తండ్రి రామాంజనేయ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో ఉంటున్న అత్తగారింటికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. తుంగభద్ర నది అధికంగా ప్రవహిస్తుండటంతో గల్లంతైన మహిళ ఆచూకీ దొరకడం లేదని,, గాలింపు చర్యలు ముమ్మరం చేశామని సీఐ వెంకట్రామయ్య తెలిపారు. -
కేరింతల దేవాలయం
కోవిడ్ కాలంలో మామూలు తలనొప్పి వస్తేనే లోపలికి రానివ్వడం లేదు. మామూలు డెలివరీ కేసులను కూడా వెనక్కు పంపిస్తున్నారు. మరి కోవిడ్ పాజిటివ్ గర్భిణుల సంగతి ఏం కాను? ముంబైలోని నాయర్ హాస్పిటల్ వారి పట్ల దేవాలయంగా మారింది. మంగళవారం ఉదయానికి అక్కడ 500 కోవిడ్ పాజిటివ్ తల్లులు సురక్షితంగా పిల్లలకు జన్మనిచ్చారు. మంగళవారం (జూలై 21) ఉదయం 10.04 గంటలకు ముంబైలోని నాయర్ హాస్పిటల్‌లోని ప్రసూతి వార్డు కరతాళధ్వనులతో మారుమోగిపోయింది. అప్పుడే జన్మించిన పసికందును చేతుల్లోకి తీసుకున్న డాక్టర్ అనురూప నాయక్ పెదాల మీద ఒక సంతృప్తికరమైన చిరునవ్వు కనిపించింది. దానికి కారణం ఆ పసికందు ఆ హాస్పిటల్లో కోవిడ్ పాజిటివ్ తల్లులకు జన్మించిన పిల్లల వరుసలో 500వ వాడు కావడమే. ఈ లాక్డౌన్ కాలం లో తల్లుల ఇక్కట్లను తీర్చి వారి ఒడిలో పిల్లలను ఉంచుతున్న ఆ హాస్పిటల్, అందులోని సిబ్బంది ప్రశంసలకు పాత్రమవుతున్నారు. కోవిడ్ వ్యాప్తి తర్వాత మార్చి– ఏప్రిల్ కాలానికి చాలా స్థానిక క్లినిక్స్, నర్సింగ్ హోమ్‌లు మూత పడ్డాయి. గర్భిణులకు ప్రసవాలు సందిగ్ధంలో పడ్డాయి. ఇక కోవిడ్ సోకిన గర్భిణుల పరిస్థితి వర్ణనాతీతంగా మారింది. ఈ నేపథ్యంలో ముంబైలోని బి.వై.ఎల్. నాయర్ చారిటబుల్ హాస్పిటల్ కోవిడ్ పాజిటివ్ వచ్చిన తల్లుల ప్రసవాలకు ముందుకు వచ్చింది. దానికంటే ముందు అది స్పెషల్ కోవిడ్ హాస్పిటల్‌గా మారినా గైనకాలజీ డిపార్ట్మెంట్ కోవిడ్ పాజిటివ్ తల్లులకు తమ అవసరాన్ని గుర్తించి ప్రత్యేక ఏర్పాట్లతో రంగంలో దిగింది. అక్కడ కోవిడ్ లేని తల్లుల కోసం ఒక లేబర్ రూమ్, కోవిడ్ ఉన్న తల్లుల కోసం ఒక లేబర్ రూమ్ విడిగా ఏర్పాటు చేశారు. ‘ఒక తల్లి నుంచి మరో తల్లికి కోవిడ్ వ్యాప్తి చెందకుండా చూడటం మా ముఖ్య లక్ష్యం’ అని ఆ హాస్పిటల్ పీడియాట్రిక్స్ హెడ్ డాక్టర్ సుష్మ మలిక్ చెప్పారు. గత మూడు నెలలుగా నాయర్ హాస్పిటల్లో 723 కోవిడ్ పాజిటివ్ గర్భిణులు చికిత్స పొందారు. వీరిలో 656 మంది డిశ్చార్జ్ అయ్యారు. వీరిలో ప్రసవాలు జరిగిన 500 మందిలో 467 మంది తమ పిల్లలతో ఇంటికి చేరుకున్నారు. ఈ మొత్తం కోవిడ్ పాజిటివ్ ప్రసవాల్లో ఎనిమిది జతల కవలలు. ఒక ట్రిప్లెట్ కూడా ఉన్నారు. 191 సిజేరియన్లు అవసరమైనా వెనుకంజ వేయకుండా చేశారు. పుట్టిన అందరు పిల్లల్లో కేవలం 10 మంది పిల్లలకే కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ఆ తర్వాత వారు నెగెటివ్ అయ్యారు. ప్రాణాంతకమైన ఈ వ్యాధి సమయంలో మాతృభిక్ష పెడుతున్న ఈ డాక్టర్లు ఉన్నది హాస్పిటల్ అనడానికి వీల్లేదు. అది దేవాలయమే. -
ఆస్పత్రుల నిర్లక్ష్యం : ఆటోలో గర్భిణి మృతి
ముంబై : నిండు గర్భిణికి చికిత్స అందించేందుకు పలు ఆస్పత్రులు నిరాకరించడంతో ఆటోలోనే బాధితురాలు మరణించిన ఘటన మహారాష్ట్రలోని థానేలో చోటుచేసుకుంది. గర్భిణిని ఆస్పత్రిలో చేర్చుకునేందుకు నిరాకరించిన మూడు ఆస్పత్రులపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. మే 25 ఆర్ధరాత్రి జరిగిన ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగుచూసింది. గర్భిణి అస్మా మెహంది (26)కి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులతో కలిసి ఆస్పత్రికి వెళ్లగా ఆమెను చేర్చుకునేందుకు నిర్వాహకులు నిరాకరించారు. వరుసగా మూడు ఆస్పత్రుల్లోనూ వారికి నిరాశే ఎదురైంది. బిలాల్ హాస్పిటల్, ప్రైమ్ క్రిటికేర్, యూనివర్సల్ హాస్పిటల్లకు వెళ్లగా ఆమెను చేర్చుకునేందుకు నిరాకరించారు. ఆస్పత్రుల చుట్టూ తిరిగే క్రమంలో నొప్పులు అధికమై గర్భిణి ఆటోలోనే మరణించారు. కుటుంబ సభ్యులు నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి మూడు ఆస్పత్రులపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఆస్పత్రుల్లో చేర్చుకునేందుకు నిరాకరించడంతో మహిళ రోడ్డుపైనే మరణించడం దిగ్భ్రాంతికరమని మహారాష్ట్ర బీజేపీ నేత రామ్ కదం ఆందోళన వ్యక్తం చేశారు. ముంబైలో రోగులకు ఆస్పత్రుల్లో బెడ్లు దొరక్క రోడ్డుపైనే మరణిస్తున్నారని అన్నారు. చదవండి : ఒక్కరోజులో 8,000 మంది డిశ్చార్జ్ -
కరోనా పాజిటివ్.. బిడ్డకు జన్మనిచ్చిన మహిళ
సాక్షి, పశ్చిమగోదావరి: కరోనా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయిన నెలలు నిండిన గర్భిణి ఏలూరు ఆశ్రం కోవిడ్-19 ఆస్పత్రిలో మంగళవారం మగబిడ్డకు జన్మనిచ్చారు. పలు జాగ్రత్తలతో డాక్టర్లు చేసిన సిజేరియన్ ఆపరేషన్ విజయవంతమైంది. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసుకు మొట్టమొదటి సిజేరియన్ అని డాక్టర్లు తెలిపారు. తల్లి బిడ్డ ఆరోగ్యం ఉన్నారని పేర్కొన్నారు. జిల్లాలోని పేదపాడు మండలం తోటగూడెంకు చెందిన మహిళ అని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. (బాసుంది వికటించి) తల్లికి కరోనా పాజిటీవ్ కావడంతో బిడ్డ నమూనాలను కరోనా పరీక్షలకు పంపామని రిపోర్టు రావల్సి ఉందని వైద్యులు చెప్పారు. కరోనా సమయంలో రాష్ట్రంలోనే మొట్ట మొదటి శస్త్రచికిత్స కాన్పుగా పేర్కొన్నారు. ‘కొద్ది రోజుల క్రితం డెలివరీ కోసం ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చిన పెదపాడుకు మండాలనికి చెందిన ఓ గర్భిణీ మహిళకు ముందు జాగ్రత్త చర్యగా కరోనా పరీక్షలు నిర్వహించాము. ఆమెకు కరోనా పాజిటీవ్ నిర్ధారణ కావడంతో ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తూ మంగళవారం సిజేరియన్ ఆపరేషన్ నిర్వహించాము. ఆమె మగ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారు’ అని ఆశ్రం కోవిడ్ -19 ఇంచార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఏఈఆర్ మోహన్ తెలిపారు. (ఏపీలో మరో 48 కరోనా కేసులు) -
శభాష్ కొండమ్మ..
సాక్షి, కనిగిరి : తెల్లవారుజామున గర్భిణికి నొప్పులు రావడంతో దివ్యాంగురాలైన అంగన్వాడీ కార్యకర్త ఆమెను తన ట్రై సైకిల్ స్కూటీపై ఎక్కించుకుని మండల కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రికి చేర్చిన ఘటన కనిగిరి మండలం నడింపల్లిలో ఆదివారం జరిగింది. నడింపల్లిలో గర్భిణి అయిన బి.ఏసమ్మకు తెల్లవారుజామున 3 గంటల సమయంలో ప్రసవ నొప్పులు వచ్చాయి. దీంతో కుటుంబ సభ్యులు స్థానిక అంగన్వాడీ కార్యకర్త అయిన కొండమ్మకు సమాచారం ఇచ్చారు. ఆమె 108 వాహనానికి కాల్ చేసింది. ఈ ప్రాంతంలో ఉన్న రెండు 108 వాహనాల్లో ఒక వాహనం టైరు పంక్చరై ఉండగా, మరొక వాహనంలో ఒక గర్భిణిని తీసుకుని ఒంగోలు తరలిస్తున్నారని, రావడం ఆలస్యమవుతుందని తెలిసింది. చదవండి: సుధాకర్‌కు ఎమ్మెల్యే సీటు ఇస్తామని.. లాక్డౌన్ కావడంతో ఇతర వాహనాలు కూడా అందుబాటులో లేవు. ఈక్రమంలో ఏసమ్మకు నొప్పులు తీవ్రమయ్యాయి. దీంతో దివ్యాంగురాలైన అంగన్వాడీ కార్యకర్త తన ట్రై సైకిల్ స్కూటీపై ఆమెను ఎక్కించుకుని కనిగిరి ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చింది. అక్కడ పరీక్షించిన వైద్యులు లోపల బిడ్డ పరిస్థితి బాగా లేదని ఒంగోలు తీసుకెళ్లాలని సిఫార్సు చేశారు. గర్భిణి పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానిక ఓ ప్రైవేటు వైద్యశాలలో చేర్చారు. ఏసమ్మకు సాధారణ ప్రసవం జరిగి తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నట్లు సీడీపీవో లక్ష్మీ ప్రసన్న తెలిపారు. అంగన్వాడీ కార్యకర్త చేసిన కృషిని, సేవను గుర్తించిన ఐసీడీఎస్ అధికారులు, గ్రామస్తులు అభినందించారు. చదవండి: లంకె బిందెల పేరుతో లైంగిక దాడి -
కరోనా పాడుగాను.. ఎంత కష్టమొచ్చే
భోపాల్ : కరోనా పాడుగాను.. వలస జీవుల బతుకులను ఎంత ఇరకాటంలోకి నెట్టిందో. రెక్కాడితే కానీ డొక్కాడని జీవితాలను రోడ్డు పాలు చేసింది. ఉపాధి కోసం సొంతూళ్లను వదిలి వేరే రాష్ర్టాలకు వెళ్లిన కార్మికులు ఈ లాక్డౌన్ సమయంలో ఎదుర్కుంటున్న ఇబ్బందులను చూస్తే కడుపు తరుక్కుపోతుంది. మరీ ముఖ్యంగా పిల్లలు, గర్భిణీ స్త్రీలు, వయసు పైబడిన వారి కష్టాలు వర్ణణాతీతం. ఈ పయనంలో నెలలు నిండిన గర్భిణీలు రోడ్డు పక్కనే బిడ్డలకు జన్మనిస్తున్నారు. అలాంటి ఓ విషాదకర సంఘటన వివరాలు.. మధ్యప్రదేశ్ సాత్నా జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన రాకేశ్ కౌల్, శకుంతల దంపతులు.. కొన్నాళ్ల క్రితం మహారాష్ట్రలోని నాసిక్‌కు ఉపాధి కోసం వలస వెళ్లారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమల్లో ఉండటంతో వారికి ఉపాధి కరువైంది. దాంతో ఇక్కడే ఉండి ఆకలితో అలమటించే కన్నా సొంతూరు వెళ్లి అయిన వారితో కలిసి ఉందామనుకున్నారు. అయితే శకుంతల నిండు గర్భిణీ. అయినప్పటికీ వారు సొంత ఊరు వెళ్లాలనే నిర్ణయించుకున్నారు. దాంతో ఈ నెల 5వ తేదీన మహారాష్ట్ర నాసిక్ నుంచి మధ్యప్రదేశ్ సాత్నాకు నడక ప్రారంభించారు. ఈ క్రమంలో మంగళవారం శకుంతలకు నొప్పులు ప్రారంభమయ్యాయి. దాంతో ఆమె రోడ్డు మీదనే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత రెండు గంటల పాటు విశ్రాంతి తీసుకుని.. మళ్లీ నడక ప్రారంభించింది. తన పసిబిడ్డను ఎత్తుకుని.. ఎర్రటి ఎండలో 150 కిలోమీటర్లకు పైగా నడిచింది ఆ బాలింత. ఈ విషయం గురించి సాత్న వైద్య అధికారి ఏకే రాయ్ మాట్లాడుతూ.. ‘శకుంతల దంపతుల గురించి మాకు తెలిసిన వెంటనే సరిహద్దు వద్ద వారి కోసం బస్సు ఏర్పాటు చేశాం. అనంతరం తల్లీబిడ్డలను ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించాం. ఇద్దరు క్షేమంగా ఉన్నారు’ అని తెలిపారు. చదవండి: కరోనా వదలదు.. ప్రభుత్వాలకు పట్టదు -
కరోనా ఉన్న గర్భిణీకి డెలివరీ చేసిన వైద్యులు
సాక్షి, హైదరాబాద్ : ప్రాణాంతక కరోనా వైరస్‌పై యుద్ధంలో వైద్యులు ప్రాణాలను పణంగా పెట్టి సేవ చేస్తున్నారు. ఓ వైపు కరోనా బాధితులకు చికిత్స అందిస్తూనే మరోవైపు అత్యవసర సేవల్లోనూ పాల్పంచుకుంటున్నారు. కరోనా వైరస్ సోకిన ఓ గర్బణీకి గాంధీ ఆస్పత్రి వైద్యులు డెలివరీ చేశారు. పలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని ఆపరేషన్ చేసి తల్లీబిడ్డలను క్షేమంగా కాపాడగలిగారు. దీంతో డెలివరీ చేసిన వైద్యులను పలువురు అధికారులు అభినందిస్తున్నారు. వైరస్ సోకినా తల్లీబిడ్డలు క్షేమంగా ఉండటంతో ఆమె కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వైరస్ నుంచి కోలుకున్న తరువాత వారిని స్వస్థలానికి పంపుతామని వైద్యులు తెలిపారు. (దేశంలో కొత్తగా 3390 పాజిటివ్ కేసులు) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1401284236.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
భారత్‌కు వచ్చేస్తానంటూ కోర్టుకెక్కిన గర్భిణీ
దుబాయ్: తనను ఎలాగైనా స్వదేశానికి పంపించాలంటూ ఓ గర్భిణీ మహిళ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. లాక్డౌన్ వల్ల విమానాలు కూడా ఎగరనందున తక్షణమే భారత ప్రభుత్వం తనకు సాయం చేయాలంటూ వేడుకుంది. కేరళలోని కోజికోడ్‌కు చెందిన మహిళ అతిరా గీతా శ్రీధరన్ దుబాయ్‌లో ఇంజనీర్‌గా పనిచేస్తుంది. ఆమె భర్త నిర్మాణ రంగంలో పనిచేస్తున్నాడు. ఆ దేశంలో విధించిన లాక్డౌన్లో ఈ రంగానికి మినహాయింపునివ్వకపోవడంతో అతనికి కనీసం సెలవు కూడా దొరకట్లేదు. ఇదిలా వుంటే ప్రస్తుతం ఆమె గర్భిణీ. (హమ్మయ్య!.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు) అక్కడ ఆమెకు సంరక్షణ బాధ్యతలు చూసేవాళ్లు ఎవరూ లేనందున భారత్ తీసుకురావాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. జూలైలో డెలివరీ జరగాల్సి ఉన్నందున మే మొదటి, రెండు వారాల్లో భారత్‌కు వస్తానని అభ్యర్థించింది. కరోనా ప్రబళుతున్న సమయంలో ఆమె తన స్వస్థలానికి చేరుకోవడం అత్యంత అవసరమనిన పిటిషన్లో పేర్కొంది. అయితే ఇప్పటివరకు భారత ప్రభుత్వం మాత్రం ఆమెను తీసుకొస్తామని ఎలాంటి ప్రకటన చేయలేదు. మరోవైపు దుబాయ్‌లో నివసిస్తున్న ఇతర కార్మికులు సైతం తమను భారత్‌కు తీసుకురావాలని వేడుకుంటున్నారు. (కోవిడ్‌తో ఆకలికేకలు రెట్టింపు) -
ఆ ప్రభావం బేబీపై పడుతోందా?
∙మా పెద్దమ్మ కూతురు ప్రెగ్నెంట్. అయితే ఆమెకు కొన్ని మానసిక సమస్యలు ఉన్నాయి. ‘మెంటల్ డిజార్డర్’ ప్రభావం బేబీపై ప్రతికూలంగా ఉంటుందా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో దయచేసి తెలియజేయగలరు. – జీఆర్, తాడేపల్లిగూడెం ఆమె మానసిక సమస్యలకు మందులు ఏమైనా వాడుతోందా లేదా తెలియవలసి ఉంది. అనేక రకాల మానసిక సమస్యలను మెంటల్ డిజార్డర్ అంటారు. మానసిక సమస్యలకు ముందు నుంచే మందులు వాడుతున్నట్లయితే, ఇప్పుడు గర్భంలోని శిశువుపై వాటిలోని కొన్ని రకాల మందుల వల్ల దుష్ప్రభావం పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఒకసారి డాక్టర్ని సంప్రదించి, వాటిలో ఏమైనా మార్పులు చెయ్యాలా, మోతాదు తగ్గించాలా అనే దానిపై సలహా తీసుకోవడం మంచిది. ఒకవేళ మందులు ఏమీ వాడకుండా ఉంటే కూడా డాక్టర్‌ను సంప్రదించి, వ్యాధి తీవ్రతను బట్టి, అవసరమనుకుంటే డాక్టర్ పర్యవేక్షణలో అతి తక్కువ దుష్ప్రభావాలు ఉన్న మందులను అతి తక్కువ మోతాదులో తీసుకోవడం మంచిది. లేకపోతే మానసిక సమస్యలు ఉన్నప్పుడు గర్భం దాల్చినప్పుడు సరిగా వారి పర్యవేక్షణ చూసుకోకపోవడం, ఆహారంపై శ్రద్ధ లేకపోవడం వంటి వాటి వల్ల బిడ్డ సరిగా బరువు పెరగకపోవడం, నెలలు నిండకుండా కాన్పులు, పుట్టిన బిడ్డలో కూడా కొందరిలో మానసిక సమస్యలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీరికి ముఖ్యంగా కుటుంబ సభ్యుల సహకారం తగినంతగా ఉండాలి. వీరిని జాగ్రత్తగా చూసుకుంటూ, సరైన పోషకాహారం తినిపిస్తూ, మందులు తగిన సమయానికి ఇవ్వడం వల్ల పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ∙నాకు హెయిర్ డై వేసుకునే అలవాటు ఉంది. ప్రస్తుతం నేను ప్రెగ్నెంట్. గర్భిణులు హెయిర్ డై వేసుకుంటే పుట్టబోయే పిల్లలపై ప్రతికూల ప్రభావం పడుతుందని, మూత్రాశయ క్యాన్సర్, లుకీమియా లాంటివి రావచ్చు అని విన్నాను. ఇది ఎంతవరకు నిజం? – కె.శైలజ, నందిగామ తెల్ల వెంట్రుకలకు వేసుకునే హెయిర్ డైలో ఉన్న కెమికల్స్ తలపై చర్మంలో నుంచి శరీరంలోకి, రక్తంలోకి చాలా సూక్ష్మంగా చేరుతాయి. అక్కడి నుంచి బిడ్డకు మరింత సూక్ష్మంగా చేరవచ్చు. ఇంత కొంచెం కెమికల్స్ కడుపులోని బిడ్డకు ఏ హానీ చెయ్యవు. అయినా ఎందుకు రిస్క్ తీసుకోవడం అనుకుంటే, గర్భంలోని బిడ్డలో అవయవాలు ఏర్పడే మొదటి ఐదు నెలల కాలం డై జోలికి వెళ్లకపోవడం మంచిది. ఆరో నెల నుంచి వేసుకోవచ్చు. వీలైనంత వరకు కాన్పు తర్వాత వేసుకోవడం మంచిది. డై బదులు హెన్నా పెట్టుకోవచ్చు. డై మాడుకు తగలకుండా కేవలం జుట్టుకే వేసుకోవడం వల్ల తలపై చర్మంలోంచి శరీరంలోకి, రక్తంలోకి కెమికల్స్ వెళ్లే అవకాశాలు ఉండవు. హెయిర్ డై వేసుకోవాలనుకుంటే, బాగా గాలి ఆడే గదిలో డై వేసుకోవడం మంచిది. ఈ డైని వీలైనంత తక్కువసేపు ఉంచుకుని, బాగా నీటిలో జుట్టుని, మాడును శుభ్రపరచుకోవడం మంచిది. చేతికి గ్లౌస్ వేసుకుని డై వేసుకోవడం మంచిది. కొద్దిగా ప్యాచ్ టెస్ట్ చేసుకుని, డై వేసుకోవడం మంచిది. హెయిర్ డై వల్ల బిడ్డలో మూత్రాశయ క్యాన్సర్, లుకీమియా వంటివేమీ రావు. కొన్ని పరిశోధనల్లో ఎక్కువగా హెయిర్ డై వాడే సెలూన్స్‌లో పనిచేసే వారిలో, డై కెమికల్స్ ఎక్కువగా పీల్చుకోవడం వల్ల మూత్రాశయ క్యాన్సర్, లుకీమియా వంటివి వచ్చే అవకాశాలు, మిగిలిన వారితో పోల్చితే కొద్దిగా ఎక్కువగా ఉంటాయని వెల్లడించడం జరిగింది. -
గర్భిణిని జోలీలో మోసిన ఎమ్మెల్యే
జయపురం : ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు కాకితో కబురంపితే చాలు.. వచ్చి ఆదుకుంటానని మాట ఇచ్చిన ఎమ్మెల్యే అదే మాటపై నిలబడ్డారు. పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణిని 5 కి.మీ. దూరం జోలీలో మోసుకుంటూ తీసుకెళ్లి ఆస్పత్రిలో చేర్చి మానవత్వాన్ని, తన బాధ్యతను చాటుకున్నారు. ఒడిశా రాష్ట్రం నవరంగపూర్ జిల్లా పపడహండి సమితి కుసుముగుడకు చెందిన జెమ బెహర నిండు గర్భిణి. ఆమె సోమవారం ఉదయం నుంచి పురిటి నొప్పులతో బాధపడుతోంది. అయితే ఆ గ్రామానికి రహదారి లేనందున అంబులెన్స్ రాలేని పరిస్థితి. ఈ విషయం తెలిసిన డాబుగాం ఎమ్మెల్యే మనోహర రొంధారి వెంటనే గ్రామానికి చేరుకున్నారు. గ్రామస్తులు ఏర్పాటు చేసిన జోలీలో గర్భిణిని ఉంచి వారితో పాటు జోలీని మోసుకుంటూ తీసుకెళ్లి ఆమెను ఆస్పత్రిలో చేర్చారు. తమ కోసం దిగొచ్చి జోలీ మోసిన ఎమ్మెల్యేకు గ్రామస్తులు కృతజ్ఞతలు చెప్పారు. -
దారుణం: నిండు గర్భిణిపై అత్యాచారం
సాక్షి, కమాన్‌చౌరస్తా: కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ వ్యక్తి నిండు గర్భిణిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. రూరల్ సీఐ శ్రీనివాసరావు కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా రామడుగు మండలానికి చెందిన మహిళ కుటుంబం కొన్నేళ్లుగా కరీంనగర్ మండలం బొమ్మకల్ గ్రామంలో నివాసం ఉంటోంది. ఆమె భర్త సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఈ నెల 9వ మధ్యాహ్నం డిష్ రిపేర్ పేరిట ఒంటరిగా ఉన్న మహిళ ఇంట్లోకి వచ్చిన కనపర్తి రామకృష్ణ తొమ్మిది నెలల గర్భిణిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ సమయంలో ఆమె మెడలోని పుస్తెల తాడు తెగిపోయింది. కొద్దిసేపటి తర్వాత సదరు మహిళ భర్త ఇంటికి రాగానే పుస్తెలు మళ్లీ కట్టుకుంటూ, బట్టలు చిందరవందరగా పడి ఉండటంతో అనుమానం వచ్చి అడుగగా జరిగిన అఘాయిత్యం గురించి వివరించింది. ఈ విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని ఆలోచించారు. చివరకు సోమవారం కరీంనగర్ రూరల్ పోలీసులకు మహిళ భర్త ఫిర్యాదు చేశాడు. దీంతో నిందితుడు కనపర్తి రామకృష్ణపై అత్యాచారం, ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, అత్యాచారం చేసిన సమయంలో నిందితుడు తన సెల్‌ఫోన్ ద్వారా వీడియో చిత్రీకరించాడని మహిళ కుటుంబ సభ్యులు ఆరోపించారు. -
దారుణం: గర్భవతిపై పిడిగుద్దులతో దాడి..
సిడ్నీ : గర్భవతి అని కూడా చూడకుండా ఓ వ్యక్తి మహిళ పట్ల క్రూరంగా ప్రవర్తించాడు. ఇష్టారీతిన ఆమెను కొట్టి.. కిందపడేసి తన్నాడు. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన ఈ దృశ్యాలు ప్రతి ఒక్కరి మనసును కలిచి వేస్తున్నాయి. ఈ దారుణ ఘటన ఆస్ట్రేలియాలోని సిడ్నీలో బుధవారం చోటుచేసుకుంది. వివరాలు.. నగరంలోని ఓ కేఫ్‌లో ముగ్గురు మహిళలు ముఖానికి స్కార్ప్ ధరించి కూర్చుని ఉండగా.. గుర్తు తెలియని ఓ వ్యక్తి వచ్చి ఒక్కసారిగా అందులోని ఓ మహిళపై దాడికి తెగబడ్డాడు. 38 వారాల గర్భవతిగా ఉన్న ఆమెపై ఆవేశంతో చేతితో పిడిగుద్దులు కురిపించి, ఆపై కాలితో తన్ని కింద పడేశాడు. ఘటనాస్థలిలో ఉన్న వారు దుండగుడిని ఆపినప్పటికీ.. అతడు రెచ్చిపోయాడు. ఈ దాడిలో సదరు మహిళ కళ్లు తిరిగి పడిపోయింది. ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం తన పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అనంతరం ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని మహిళను శారీరకంగా హింసించినందుకు అతనిపై కేసు నమోదు చేశారు. అంతేగాక ఇలాంటి చర్యలకు పాల్పడినందుకు నిందితుడికి కనీసం బెయిల్ కూడా మంజూరు చేయలేమని పోలీసులు స్పష్టం చేశారు. ఆస్ట్రేలియన్ ఫెడరేషన్ ఆఫ్ ఇస్లామిక్ కౌన్సిల్స్ (ఏఎఫ్‌ఐసీ) దీనిపై స్పందిస్తూ... ఈ ఘటనకు ముందు బాధితురాలు తన స్నేహితులతో కలిసి ఇస్లామిక్ మతానికి వ్యతిరేకంగా ప్రసంగించిందని, అందుకే ఆమెపై కోపం పెంచుకున్న నిందితుడు ఇలా ప్రవర్తించాడని తెలిపారు. ఇది జాత్యంహకారంతో చేసిన చర్య అని, సమాజంలో ఇలాంటి దాడులను ఆపకపోతే ఇలాంటివారు రెచ్చిపోయే ప్రమాదం ఉందని అన్నారు. కాగా ఆస్ట్రేలియాలో ఓ విశ్వవిద్యాలయం జరిపిన పరిశోధనల ప్రకారం శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురవుతున్న ప్రతి 113 మందిలో 96 మంది ముఖానికి స్కార్ఫ్ ధరించి ఉన్నవారేనని వేధించింది. చదవండి : డ్యాన్స్ టీచర్ వల్ల మైనర్ బాలుడికి హెచ్ఐవీ -
ఔరా అనిపిస్తోన్న రెస్క్యూ టీం సాహసం
తిరువనంతపురుం: భారీ వర్షాలు కేరళను అతలాకుతలం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఓ వైపు భారీ వరదలు.. మరోవైపు కొండ చరియలు విరిగిపడుతుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం హై అలర్ట్‌ని ప్రకటించింది. ఈ క్రమంలో తీర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు చేర్చడం కోసం రెస్క్యూ టీం తీవ్రంగా శ్రమిస్తోంది. వరదల కారణంగా పాలక్కడ్ జిల్లాలోని భవానీ నది ఉగ్రరూపం దాల్చింది. నది ఒడ్డున ఉన్న ఇళ్లను వరద నీరు చుట్టుముట్టింది. దాంతో ఆ ఇళ్లలో ఉన్న వారిని రక్షించేందుకు రంగంలోకి దిగిన సహాయక సిబ్బంది చేసిన ఓ సాహసం ఔరా అనిపిస్తుంది. సహాయక చర్యల్లో భాగంగా భవాని నది ప్రాంతంలో ఉంటున్న ఓ కుటుంబాన్ని తీరం దాటించడం రెస్క్యూ టీమ్‌కు పెద్ద సవాలుగా మారింది. ఎందుకంటే ఆ ఇంట్లో ఇద్దరు ముసలి వాళ్లు, ఓ ఎనిమిది నెలల గర్భిణి, ఒకటిన్నర ఏళ్ల చిన్నారి ఉన్నారు. వీరిని సురక్షిత ప్రాంతానికి చేర్చడం నిజంగా సవాలు లాంటిదే. అయితే సహాయక బృందాలు ముసలి వారిని క్షేమంగానే నది దాటించగలిగారు. కానీ గర్భిణిని, ఆమె కొడుకును నది దాటించడం పెద్ద సమస్యగా మారింది. దాంతో గర్భిణిని తాళ్లు, బెల్టు సాయంతో తాడుకు వెళ్లాడదీసి క్షేమంగా నదిని దాటించారు. అలానే ఆ చిన్నారిని నది దాటించడం కోసం ఓ రెస్క్యూ టీం మెంబర్‌ను కూడా తాళ్లు, బెల్టు సాయంతో కట్టి.. బాలుడిని అతడి ఒడిలో కూర్చొపెట్టి సురక్షితంగా నదిని దాటించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రెస్క్యూ టీం సమయస్ఫూర్తిని తెగ అభినందిస్తున్నారు నెటిజనులు. #WATCH Pregnant woman rescued in flood-hit Palakkad district's Agali, in Kerala pic.twitter.com/hWcdvdkPYC — ANI (@ANI) August 10, 2019 -
గర్భిణి వేదన.. అరణ్య రోదన..
ఏటూరునాగారం: ఓ గర్భిణి డెలివరీ కోసం 4 రోజులపాటు ప్రభుత్వ ఆస్పత్రుల చుట్టూ తిరిగినా వైద్యులు స్పందించలేదు. చివరకు బిడ్డను గర్భంలోనే పోగొట్టుకున్నా ఆ మృత శిశువునూ తొలగించని ఘటన ములుగు జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ములుగు జిల్లా మంగపేట మండలం చెరుపల్లికి చెందిన ఎంపెల్లి స్వరూప రెండో కాన్పు కోసం ఈ నెల 1న మంగపేట ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లగా వరంగల్ ఎంజీఎంకు రెఫర్ చేశారు. అదేరోజు ఆమె ఎంజీఎంకు వెళ్లినా చేర్చుకోకపోవడంతో ఆరుబయటే వర్షంలోనే తడుస్తూ రేకులషెడ్డులో కాలం గడిపింది. మరుసటిరోజు వైద్యుల సూచన మేరకు బయట స్కానింగ్ తీసుకుని రిపోర్టులు తెచ్చాక 3వ తేదీ ఉదయం పరిశీలించి గర్భంలో శిశువు మరణించిందని వైద్యులు చెప్పారు. శిశువును కడుపులో నుంచి తొలగించకుండా, పరిస్థితి విషమం గా ఉందని హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి రెఫర్ చేశారు. చేతిలో చిల్లి గవ్వ లేని ఆ నిరుపేద దంపతులు ఎలాగోలా గాంధీ ఆస్పత్రికి చేరుకున్నారు. అక్కడి వైద్యులు ‘సమ్మెలో ఉన్నామని, ఎలాంటి ఆపరేషన్లు చేయబోమని’స్వరూపను బయటకు పంపించి గేట్లు మూసివేశారు. ఆశా వర్కర్ విజయలక్ష్మి సహాయంతో ఉన్నతాధికారులకు సమాచారమివ్వగా ములుగు ఆస్పత్రికి తీసుకురావాలని వారు చెప్పారు. తీరా అక్కడికి వెళ్లాక ఆదివారం సెలవు రోజు కావడంతో గైనకాలజిస్ట్, మత్తు వైద్యులు లేక డెలివరీ చేయలేదు. మృతశిశువు గర్భంలోనే ఉండడంతో ఆ బాధకు తట్టుకోలేక స్వరూప రోదిస్తున్నా పట్టించుకునేవారే లేకుండా పోయారు. -
పాపం.. కవిత
ఏడాది క్రితం గూడూరుకు చెందిన సునీల్, కవితలకు వివాహమైంది.. కవిత నవమాసాలు నిండి ప్రసవానికి ముందుగా ఆమెకు ఫిట్స్ రావడంతో ఆస్పత్రిలో చేరింది.. పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.. అయితే మళ్లీ ఫిట్స్ రావడంతో వైద్యులు పరీక్షించారు.. తలలో రక్తం గడ్డ కట్టిందని, వైద్యం చేయాలంటే రూ.10 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో నిరుపేదలైన ఆ కుటుంబానికి ఏం చేయాలో దిక్కుతోచలేదు.. ఆరోగ్యశ్రీ వర్తించదని చెప్పడంతో అప్పు చేసి కొంత, స్నేహితుల సాయంతో మరికొంత నగదు సమకూర్చి వైద్యం చేయించారు.. ఇంకా నగదు అవసరమై వైద్యం కోసం ఎదురుచూస్తున్న కవిత గత 10 రోజులుగా మృత్యువుతో పోరాడుతోంది. సాక్షి, గూడూరు: గూడూరు పట్టణంలోని కటకరాజవీధిలో అన్నం నాగమణి, సురేష్ దంపతులు జీవిస్తున్నారు. వారికి గాంధీ, సునీల్ అనే ఇద్దరు కుమారులు. వారిలో పెద్ద కుమారుడు గాంధీ పూర్తిగా మానసిక, శారీరక దివ్యాంగుడు. భర్త సురేష్ 2002లో అనారోగ్యంతో మృతిచెందాడు. దీంతో నాగమణి అన్నీతానైనే కుటుంబాన్ని పోషిస్తోంది. సునీల్ 10వ తరగతి వరకూ చదువుకుని గత మూడేళ్లుగా ఒక ఆటో మొబైల్ కంపెనీలో మెకానిక్ హెల్పర్‌గా పనిచేస్తున్నాడు. సునీల్‌కు 2018 జూన్ 25న నాయుడుపేట మండలం కాపులూరు గ్రామానికి చెందిన కవితతో వివాహమైంది. కవిత గర్భవతై నవమాసాలు నిండాయి. ఈ నెల 2వ తేదీ ఉన్నట్లుండి ఆమెకు ఫిట్స్ వచ్చాయి. హుటాహుటిన స్థానికంగా ఉండే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా కుమారుడు జన్మించాడు. 5వ తేదీన కవితకు మళ్లీ ఫిట్స్ రావడంతో వైద్యులు ఎమ్మారై తీయాలని సూచించారు. దీంతో ఆమెను గూడూరుకు తీసుకెళ్లి ఎమ్మారై తీయించగా తలలో రక్తం గడ్డకట్టిందని తెలిపారు. మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించగా వైద్యులు అదేరోజు రాత్రి ఇక మేమేం చేయలేం తీసుకెళ్లండని చెప్పారు. దీంతో ఏంచేయాలో దిక్కుతోచక వారు అక్కడ నుంచి మరో ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు దీనికి ఆరోగ్యశ్రీ వర్తించదని, వెంటనే రూ.50 వేలు చెల్లిస్తే వైద్యం ప్రారంభిస్తామని, అయినా గ్యారంటీ లేదని తెలిపారు. చేతిలో చిల్లిగవ్వలేని ఆ కుటుంబం ఏం చేయాలో తెలీక అప్పులు చేసి, సునీల్ స్నేహితులు అందజేసిన మొత్తంతో ఇప్పటివరకూ రూ.2.50 లక్షలు ఖర్చు చేసి వైద్యం అందించారు. అయినా రూ.10 లక్షల వరకూ ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. ఆ మొత్తం వారి వద్ద లేక.. రూ.లక్షలు తీసుకొచ్చి వైద్యం చేయించలేక.. కవితను ఎలా కాపాడుకోవాలో తెలీక.. అపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు. దాతలు సహకరించాలని వేడుకుంటున్నారు. సాయం చేయదలచిన వారు 8186810313(నాగమణి) ఫోన్నంబర్లో సంప్రదించాలని కోరారు. -
గుట్టుగా లింగనిర్ధారణ పరీక్షలు
సాక్షి, నల్లగొండ టౌన్: జిల్లా కేంద్రంలో లింగనిర్ధారణ పరీక్షల దందా మూడు పూలు..ఆరు కాయలు అన్న చందంగా కొనసాగుతోంది. జిల్లా కేంద్రం నడిబొడ్డులోనే అధికారుల కళ్లు గప్పి ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని లింగనిర్ధారణ పరీక్షలను కొనసాగిస్తూ లక్షల రూపాయలను దండుకుంటున్న తీరు విస్మయం కలిగిస్తోంది. తగ్గిపోతున్న ఆడపిల్లల సంఖ్యను పెంచుకుందామంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలను అమలు చేస్తున్నప్పటికీ లింగనిర్ధారణ పరీక్షలను నిర్వహించి ఆడపిల్ల అని తేలితే తల్లికడుపులోనే చిదిమేస్తున్న తీరు బాధాకరం. ఇప్పటికే ప్రతి వెయ్యిమంది బాలురకు కేవలం 922 మంది బాలికలు ఉన్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖగణాంకాలు వెల్లడిస్తున్నాయి. కొందరు వైద్యులు సిండికేట్‌గా ఏర్పడి జిల్లా కేంద్రంలో ఉన్న ఓ స్కానింగ్ సెంటర్‌ను ప్రోత్సహిస్తూ లింగనిర్ధారణ పరీక్షల కోసం కేసులను రెఫర్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. స్కానింగ్ సెంటర్లో భాగస్వాములుగా ఉన్న వైద్యులతోపాటు మరికొంత మంది వైద్యులు స్కానింగ్‌ల పేరుతో గర్భిణులను పంపించి గుట్టుచప్పుడు కాకుండా లింగనిర్ధారణ పరీక్షలను చేయిస్తున్నారన్నది విశ్వసనీయ సమాచారం. గర్భిణి వెంట వచ్చిన వారిని మాటల్లో కలిపి.. ప్రతి గర్భిణి నెలనెలా వైద్య పరీక్షల కోసం వైద్యుల వద్దకు వెళ్తుంటారు. బిడ్డ ఎదుగుదలకు వెళ్లిన సమయంలో డాక్టర్లు వారి అమాయకత్వాన్ని, బిడ్డ ఆడ, మగ తెలుసుకోవాలన్న ఆతృతను గమనిస్తుంటారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారిని టార్గెట్‌గా చేసుకుని స్కానింగ్ తీయించుకోమని ఉచిత సలహా ఇవ్వడంతోపాటు నిత్యం రద్దీగా ఉండే జిల్లా కేంద్రం నడిబొడ్డులో గల స్కానింగ్ సెంటర్‌కు రెఫర్ చేస్తున్నారు. చెకప్‌కు వచ్చే వారి తల్లినో, అత్తనో మాటలలో కలిపి ఆడపిల్ల, మగబిడ్డ అని తెలుసుకోవాలని ఉందా అని అడిగి..వారు ఒకే అన్న వెంటనే సదరు స్కానింగ్ సెంటర్ నిర్వాహకులకు ఫోన్‌ద్వారా సమాచారం ఇచ్చి స్కానింగ్‌లో లింగనిర్ధారణ చేసి తమకు సమాచారం ఇవ్వాలని చెబుతున్నట్లు తెలుస్తోంది. స్కానింగ్ సెంటర్ నిర్వాహకులు గర్భిణులకు విషయం తెలియజేయకుండా కేవలం రెఫర్ చేసిన వైద్యులకే లింగనిర్ధారణ రిజల్ట్‌ను వెల్లడిస్తారు. దీంతో అడపిల్ల అని తేలిందని, ఆడపిల్లకావాలా వద్దా అని వారిని అడిగి వద్దు అని సమాధానం వచ్చిన వెంటనే అబార్షన్ చేయించుకోవాలని, దానికి రూ.10 నుంచి రూ15 వేల వరకు, లింగనిర్ధారణలో ఆడ, మగ అని చెప్పినందుకు రూ. 6 నుంచి రూ.10 వేల వరకు వారి వారి స్థాయిని బట్టి వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో పాటు జాతీయ రహదారిపై ఉన్న పట్టణాలలో మొబైల్ స్కానింగ్ వాహనాలను తీసుకువచ్చి లింగనిర్ధారణ పరీక్షలను నిర్వహించడం విశేషం. ప్రతి నిత్యం పదుల సంఖ్యలో లింగనిర్ధారణ పరీక్షలను నిర్వహిస్తున్నప్పటికి సంబంధిత అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం విశేషం. అంతరించి పోతున్న ఆడపిల్లలను రక్షించుకోవాలనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆశయాలకు తూట్లు పొడుస్తున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు , లింగనిర్ధారణ పరీక్షలను నివారించకపోతే ఆడపిల్లలు అంతరించిపోయే ప్రమాదం ఉందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంటోంది. ఆర్ఎంపీలు కూడా అక్కడికే.. ఇప్పటికే ఒక ఆడపిల్ల ఉండి మరోమారు గర్భం దాల్చిన మహిళలు మగపిల్లాడు కావాలని కోరుకుంటారు. అలాంటి వారిని గ్రామాల్లోని ఆర్ఎంపీలు గుర్తించి వారికున్న పరిచయంతో ఆ స్కానింగ్ సెంటర్‌కే రెఫర్ చేస్తుండడం గమనార్హం. ఇలా ప్రతి కేసుకు సదరు ఆర్ఎంపీలకు కమీషన్ వెళ్తుంది. -
వైద్యురాలి నిర్లక్ష్యంతో దారుణం
శ్రీకాకుళం : జిల్లాలోని పలాసలో దారుణం చేటుచేసుకుంది. వైద్యురాలి నిర్లక్ష్యంతో ఓ తల్లీ, బిడ్డ మృత్యువాత పడ్డారు. ఈ విషాదకరమైన సంఘటన శివదుర్గ విష్ణు ప్రియ ప్రైవేటు ఆస్పత్రిలో సోమవారం జరిగింది. ఆదివారం బైనపల్లి రేవతి (24) అనే మహిళకు పురిటి నొప్పులు రావడంతో.. ఆమె కుటుంబసభ్యులు కాన్పు కోసమని స్థానిక ప్రైవేటు అస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం తల్లీ, బిడ్డ మృతి చెందారు. కాగా, ఆస్పత్రిలోని వైద్యులు నిర్లక్ష్యం కారణంగానే రేవతి మృతిచెందారని ఆమె భర్త నరేశ్ ఆరోపించారు. డాక్టర్ గాయత్రికి వైద్యురాలిగా కనీస అర్హత కూడా లేదని.. ఆమె భర్త డాక్టర్ రాజ్‌కుమార్ నీడన మహిళల ప్రాణాలతో చెలగాటం ఆడుతుందని మండిపడ్డారు. హాస్పిటల్లో చేరిన మహిళల వద్ద నుంచి లక్షల రూపాయాలు వసూలు చేస్తున్నారని మృతురాలి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఓటు వేసిన నిండు గర్భిణి
కర్ణాటక, బొమ్మనహళ్లి : మోదీ కోసం తాను ఓటు వేసి తీరాలని పట్టుబటిన ఓ నిండు గర్భిణి ఓటు వేసిన కొద్ది నిముషాల్లోనే డెలివరి అయిన ఘటన మంగళూరులోని ఉర్లాండిలో జరిగింది. గురువారం ఉదయం భర్త యోగానంద్‌తో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చిన మీనాక్షి ఓటు వేసి వెళ్లిన కొద్ది సేపటికే పురిటినొప్పులు రావడంతో ఆస్పత్రికి తరలించారు. కొద్ది సేపటికే పండంటి పాపకు మీనాక్షి జన్మనిచ్చింది. -
సకాలంలో చేరని 108.. చికిత్స అందక గర్భిణి మృతి
మల్కాజిగిరి: సరైన రహదారి సౌకర్యం లేని కారణంగా సకాలంలో అంబులెన్స్ చేరలేకపోవడంతో ఎనిమిది నెలల గర్భిణి చికిత్స అందక మృతి చెందింది.ఈ విషాత సంఘటన గౌతంనగర్ డివిజన్ పరిధిలోని ఇందిరా నెహ్రూనగర్‌లో గురువారం రాత్రి చోటు చేసుకుంది. వీరిది మెదక్ జిల్లా గరిగట్ల పల్లి గ్రామానికి చెందిన శేఖర్ –మాధవి దంపతులు నగరానికి వలసవచ్చి ఇందిరానెహ్రూనగర్‌లో నివాసం ఉంటున్నారు. గత సంవత్సరం వీరికి వివాహం జరిగింది. శేఖర్ కూలి పని చేస్తూ జీవనం సాగిస్తుండగా, మాధవి ఇంట్లోనే ఉండేది. 8 నెలల గర్భంతో ఉన్న మాధవికి గురువారం రాత్రి 10 గంటల సమయంలో నొప్పులు రావడంతో 108 కు ఫోన్ చేశారు. రైల్వే ట్రాక్ మరమ్మతుల కారణంగా ఇందిరానెహ్రూనగర్‌కు సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో సికింద్రాబాద్ తుకారాం గేట్ మీదుగా 108 వాహనం అక్కడికి చేరుకోవడంలో ఆలస్యమైంది. దీంతో సకాలంలో చికిత్స అందక మాధవి మృతి చెందింది. -
రక్తహీనతతో బాలింత మృతి
తూర్పుగోదావరి, రాజవొమ్మంగి (రంపచోడవరం): బడదనాంపల్లి గ్రామానికి చెందిన గిరిజన బాలింత చిర్లం శిరీష్ (22) కాకినాడ జీజీహెచ్‌లో రక్తహీనతతో సోమవారం రాత్రి మరణించింది. ఈమె ఈ నెల 4న రాజవొమ్మంగి పీహెచ్సీలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. బీపీతో నీరసంగా ఉందని ఆమెను వైద్యులు ఆస్పత్రిలోని బర్త్ వెయిటింగ్ రూంలోనే 6వ తేదీ వరకు ఉంచారు. ఆమెకు ఫిట్స్ రావడంతో కాకినాడ తరలించారు. ఆమెకు కామెర్లు ఉన్నాయని గుర్తించిన వైద్యులు చికిత్స ప్రారంభించారు. ఆమెకు కిడ్నీలు మందగించడంతో చికిత్స పొందుతూ మరణించిందని మృతురాలి భర్త సత్తిబాబు విలేకరులకు తెలిపారు. రాత్రి అంబులెన్స్ లేకపోవడంతో వారు రూ.5 వేలు ఖర్చు చేసి అతికష్టంతో మృతదేహాన్ని మంగళవారం స్వగ్రామానికి తరలించారు. ఆమె మృతితో తొలి కాన్పులో పుట్టిన రెండేళ్ల పాప, 8 రోజుల పసికందు తల్లిలేని వారయ్యారని గ్రామస్తులు వాపోయారు. -
అమానవీయం..!
ఉద్యోగం అంటే టైమ్ టు టైమ్ జాబ్. అయితే రెవెన్యూ లాంటి కొన్ని శాఖల్లో అలా సమయపాలన కుదరదు. పని ఉంటే అహోరాత్రులూ పనిచేయాల్సి రావచ్చు. ముఖ్యంగా వైద్య శాఖలో గర్భిణి ప్రసవం కోసం వస్తే నా టైం అయిపోయిందని చేతులు దులుపుకొని వెళ్లిపోవడం మానవత్వం ఉన్న మనిషి చేసే పనికాదు. పెదనందిపాడు పీహెచ్సీలో ఇటువంటిదే ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. గుంటూరు, ప్రత్తిపాడు: పెదనందిపాడు పీహెచ్సీ స్టాఫ్ నర్సులు గర్భవతులతో బంతాట ఆడుతున్నారు. స్టాఫ్ నర్సుల నిర్వాకానికి తోడు స్థానిక ఆరోగ్య సిబ్బంది కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో నిండు గర్భిణులకు ప్రసవ వేదన తప్పడం లేదు. అందుకు నిదర్శనమే ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన. వివరాల్లోకి వెళితే ఈనెల 25వ తేదీ సాయంత్రం సుమారు ఆరుగంటల సమయంలో మండల కేంద్రమైన పెదనందిపాడుకు చెందిన నిండు గర్భిణి ఫాతిమాకు నొప్పులు రావడంతో బంధువులు ఆమెను తీసుకుని అదే గ్రామంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లారు. అక్కడ విధుల్లో ఉన్న స్టాఫ్‌నర్సు నా డ్యూటీ టైం అయిపోయిందని (సాయంత్రం ఆరుగంటలకే), తరువాత డ్యూటీకి వచ్చే స్టాఫ్‌నర్సుతో చేయించుకోండంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పింది. ఫాతిమా బాధ చూడలేని ఆమె బంధువులు అలా అంటే ఎలాగమ్మా.. నీ తరువాత ఆమె ఎప్పుడు డ్యూటీకొస్తుందో.. ఎంత టైం అవుతుందో తెలియదు కదా, అప్పటిదాకా ఉంటే బిడ్డకు ఏమైనా అవుతుందేమో.. మీరు కాస్త జాలి చూపి కాన్పు చేయాలని బతిమాలారు. అయినా చలించని స్టాఫ్‌నర్సు నేను ఇప్పుడు చెయ్యను.. కావాలంటే మీరు ప్రత్తిపాడుకు పోండంటూ తేల్చిచెప్పింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో స్థానిక ఆశ కార్యకర్తను తీసుకుని వారు గర్భిణి ఫాతిమాను ఆటోలో ప్రత్తిపాడు సామాజిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువచ్చారు. వాస్తవానికి స్టాఫ్‌నర్సులు రాత్రి ఎనిమిది గంటల సమయంలో డ్యూటీ రిలీవ్ అయి నైట్ డ్యూటీ వారికి చార్జ్ అప్పగిస్తారు. కానీ ఆరు గంటలకే నా డ్యూటీ టైం అయిపోయిందంటూ కాన్పు చేయకుండా నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడం విమర్శలకు దారితీస్తోంది. ఏఎన్ఎంకు ఫోన్ చేసినా... ప్రత్తిపాడు సీహెచ్‌సీలో విధుల్లో ఉన్న స్టాఫ్ నర్సు గర్భవతి పరిస్థితిని చూసి వివరాలు తెలుసుకునేందుకు సంబంధిత గ్రామ ఏఎన్ఎంకు ఫోన్ చేశారు. వివరాలను అడిగి తెలుసుకున్న తరువాత ఫాతిమాకు మూడవ కాన్పు కావడంతో ప్రత్తిపాడు సీహెచ్‌సీకి వచ్చి కాన్పుకు సాయం అందించాలని స్టాఫ్ నర్సు ఏఎన్ఎంను కోరారు. అందుకు ఏఎన్ఎం విముఖత వ్యక్తం చేయడంతో స్టాఫ్ నర్సు విషయాన్ని సీహెచ్‌సీ గైనకాలజిస్ట్ ఇంద్రాణికి సమాచారం అందించారు. వెంటనే ఆమె ఆస్పత్రికి చేరుకుని కాన్పు చేశారు. ప్రస్తుతం తల్లీ, బిడ్డా సురక్షితంగానే ఉన్నారని డాక్టర్ ఇంద్రాణి తెలిపారు. -
శాడిస్టు భర్త
ఒంగోలు: భర్త చేతిలో తీవ్రంగా గాయపడి వైద్యం అందక ఓ మహిళ 30 రోజులుగా రిమ్స్‌లో నరకయాతన అనుభవిస్తోంది. ఆమెకు వైద్యం చేస్తే ఇబ్బందులు వస్తాయేమోనన్న అనుమానంతో చికిత్స చేసేందుకు వైద్యులు ముందుకు రావడం లేదు.పైగా ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. బాధిత మహిళ, ఆమె తల్లి గురువారం ‘సాక్షి’ ఎదుట తమ గోడు వెళ్లబోసుకున్నారు. చికిత్స అందించమని వైద్యులను కోరుతుఆన్న పట్టించుకోవడం లేదని, మరో వైపు వెలిగండ్ల పోలీసులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కేసు నమోదు చేయడం లేదని కన్నీటిపర్యంతమయ్యారు. ఇదీ..జరిగింది వెలిగండ్ల మండలం నరసాంబపురం గ్రామానికి చెందిన దుగ్గినపల్లి పరిశుద్ధమ్మకు ఆమె భర్త రూ.2 వేలు ఇచ్చి సంక్రాంతి సందర్భంగా కొత్త దుస్తులు కొనమని సూచించాడు. భర్తే అందులో వెయ్యి రూపాయలు తీసుకొని పూటుగా మద్యం తాగి ఇంటికి చేరాడు. ఈ విషయంలో దంపతుల మధ్య వివాదం చెలరేగింది. దుడ్డు కర్రతో ఇష్టం వచ్చినట్లు భార్యను బాదాడు. తల్లికి అడ్డు వచ్చి పదేళ్ల కుమార్తె సైతం తండ్రిని నిలదీసింది. ఇష్టం వచ్చినట్లు తాగుతుంటే బయట తలెత్తుకు తిరిగలేకపోతున్నామని ప్రశ్నించడంతో అదే కర్రతో కుమార్తెపైనా దాడికి తెగబడ్డాడు. పాప దీపిక ఎడమ చేయి విరిగింది. మరో వైపు పరిశుద్ధమ్మ కాలు విరిగింది. ఆ రోజు ఎవరూ పట్టించుకోలేదు. ఇద్దరు తీవ్ర నొప్పులతో రోదిస్తుండడంతో మరునాడు అంటే పండగ రోజు కనిగిరి ఏరియా ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడి వైద్యులు పరిశీలించి పోలీసులకు సమాచారం అందించారు. కనిగిరి పోలీసులు విచారిస్తే తల్లితో పాటు పాప కూడా తమను కొట్టిన విషయాన్ని బహిర్గత పరిచారు. తల్లి గర్భవతి కావడంతో మెరుగైన వైద్యం కోసం రిమ్స్‌కు రిఫర్ చేశారు. ఆమె డిసెంబర్ 25వ తేదీ అర్ధరాత్రి 11.30 గంటల సమయంలో రిమ్స్‌లో చేరింది. ఆమెను ఇన్‌పేషెంటుగా వార్డు నంబర్ 115లో చేర్చారుగానీ వైద్యం విషయంలో వైద్యులు వెనుకంజ వేస్తున్నారు. డాక్టర్లు కరుణించాలి నా బిడ్డలు ముగ్గురూ పదేళ్ల లోపు వారే. భర్త మద్యానికి బానిసయ్యాడు. ప్రస్తుత పరిస్థితిలో ఆయనే మా కుటుంబానికి ఆధారం. ఆస్పత్రిలో చేరి నెలకావొస్తున్నా కనీసం వచ్చి చూసింది లేదు. వెలిగండ్ల పోలీసులు కూడా నేనే మా ఆయన్ను కొట్టానని అంటున్నారట. ఇంతవరకు కేసు కూడా రిజిస్టర్ చేయలేదు. ఇక నా ఆపరేషన్ విషయంలో అబార్షన్ జరిగితే మా బాధ్యతని, నేను, మా అమ్మ ఇద్దరం అంగీకరించాం. మా అత్తతో కూడా సంతకం తీసుకున్నారు. నా భర్త ఆచూకీ గురించి అడిగితే అత్త కూడా చెప్పడం లేదు. -దుగ్గినపల్లిపరిశుద్ధమ్మ -
డెలివరీకి వెళ్లే ముందు డ్యాన్స్ వీడియో వైరల్..!
-
ప్రెగ్నెంట్ డ్యాన్స్.. వీడియో వైరల్..!
చండీగఢ్ : డెలివరీ ముందు మహిళలు ఎంత టెన్షన్‌గా ఉంటారో చూస్తూనే ఉంటాము. బిడ్డను కనే తల్లికి.. డెలివరీ చేసే డాక్టర్‌కి ఇద్దరికి టెన్షనే. కానీ ఈ వీడియోలో ఉన్న డాక్టర్, ప్రెగ్నెంట్ మహిళ మాత్రం మిగతావారందరికి భిన్నంగా డెలివరీకి వెళ్లే ముందు డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశారు. పంజాబ్ లుథియానాలో జరిగింది ఈ సంఘటన. సిజెరియన్ సర్జరీ చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్న మహిళ ప్రియాంక చోప్రా, అనుష్క శర్మ నటించిన ‘దిల్ ధడక్నే దో’ చిత్రంలోని గర్ల్స్ లైక్ టూ స్వింగ్ పాటకు డ్యాన్స్ వేయడం ప్రారంభించింది. ఇంతలో అక్కడికి డాక్టర్ వచ్చింది. పేషంట్ని డ్యాన్స్ చేయొద్దని చెప్పాల్సిన డాక్టర్ కాస్తా సదరు మహిళతో కలిసి డ్యాన్స్ చేయడం ప్రారంభించారు. డాక్టర్, పేషెంట్ ఇద్దరూ కలిసి డ్యాన్స్ చేస్తుండగా తీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. -
కారుచీకటిలో నెత్తుటి ధారలు
చిన్నప్పుడే తండ్రి ప్రేమకు దూరమైన కుమార్తెను అన్నీ తానై పెంచింది. ఉన్నంతలో ఘనంగా పెళ్లి చేసింది. తన చిట్టితల్లి.. తల్లి కాబోతోందని తెలిసి మురిసిపోయింది. పిల్లాపాపలతో నిండు నూరేళ్లు జీవించు తల్లీ అంటూ సీమంతం వేడుకలో తన బిడ్డను పెద్దలు దీవించడంతో ఉప్పొంగిపోయింది. మంగళవారం మంచిది కాదని బిడ్డను తీసుకుని సోమవారం అర్ధరాత్రి కారులో ఇంటికి ప్రయాణమైంది. ఆ కారే మృత్యుశకటమై తల్లీకూతుళ్ల ప్రాణాలను బలిగొంది. కడుపులో శిశువు ప్రాణం తల్లితో పాటే అనంతవాయువుల్లో కలిసిపోయింది. యడ్లపాడు మండలంలోని తిమ్మాపురం వద్ద జాతీయ రహదారిపై సోమవారం అర్ధరాత్రి ట్రాక్టర్‌ను కారు ఢీకొన్న ప్రమాదం ఆరుగురిని బలిగొంది. ఓ చిన్నారిని అనాథను చేసింది. మరొకరికి భార్యాబిడ్డలను దూరం చేసింది. మూడు కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. యడ్లపాడు: మండలంలోని తిమ్మాపురం 16వ నంబర్ జాతీయ రహదారిపై సోమవారం అ«ర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో మూడు కుటుంబాలకు చెందిన ఆరుగురు మృత్యువాత పడ్డారు. ముందు వెళ్తున్న ట్రాక్టర్‌ను కారు ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు మృత్యువాత పడ్డారు. ట్రాక్టర్‌పై ఉన్న ఇద్దరికీ గాయాలై చిలకలూరిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జునుజ్జయ్యింది. ప్రమాదం జరిగిందిలా... వేజర్ల జయశ్రీ (19), తల్లి అనసూయ(40), బంధువు సుంకర రమాదేవి (37), రమాదేవి కుమార్తె రమ్య (18), కుమారుడు శ్రీకాంత్ (21), అతని మిత్రుడు ఫ్రాన్సిస్ సుమారు రాత్రి 11.45 గంటల సమయంలో తిమ్మాపురం నుంచి కారులో గుంటూరు సమీపంలోని గోరంట్లకు బయలు దేరారు. తిమ్మాపురం జాతీయ రహదారిపై ప్రసూన వంశీకృష్ణ మిల్లు సమీపంలో రాగానే శావల్యాపురంలో వ్యవసాయ పనులు ముగించుకుని మాగాణి దమ్ము చక్రాల లోడుతో ముందు వెళ్తున్న ట్రాలీ ట్రాక్టర్‌ను కారు వెనగ్గా ఢీకొట్టింది. సుమారు 12.30 గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో వెనుక సీట్లో కూర్చున్న గర్భిణి జయశ్రీ, ఆమె తల్లి అనసూర్య అక్కడికక్కడే మృతి చెందారు. వారి పక్కనే ఉన్న సుంకర రమాదేవి, రమ్య, డ్రైవింగ్ చేస్తున్న శ్రీకాంత్, ఫ్రాన్సిస్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. వీరు గుంటూరులో చికిత్స పొందుతూ మృతి చెందారు. అర్ధరాత్రి ఆర్తనాదాలు... హైవేపై ఒక్కసారిగా వాహనాలు ఢీ కొన్న శబ్దం రావడం, గాయపడిన వారు ఆర్తనాదాలు చేయడంతో సమీప మిల్లుల్లోని కార్మికులు, తిమ్మాపురం ఎస్సీకాలనీ లూథరన్ చర్చి వద్ద క్రిస్మస్ వేడుకల్లో ఉన్న స్థానికులు పరుగున వచ్చారు. క్షతగాత్రులను కాపాడేందుకు పోలీసులతోపాటు చిమ్మ చీకట్లలోనే సెల్‌ఫోన్ లైట్లు వేసుకుని శ్రమించారు. ప్రమాదానికి గురైన వాహనాలను పక్కకు తప్పించి ట్రాఫిక్‌కు ఇబ్బందులు లేకుండ చూశారు. గాయాలైన వారందరనీ గుంటూరు, చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మూడు గ్రామాల్లో విషాదం.. జయశ్రీ అత్తిల్లు యడవల్లి, పుట్టిల్లు గోరంట్ల. ఫ్రాన్సిస్ స్వగ్రామమైన మేడికొండూరు మండలంలోని గుండ్లపాలెం గ్రామాల్లో క్రిస్మస్ పండుగ రోజున తీరని విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాదానికి కారణాలు.. ప్రమాదం జరిగిన వెంటనే యడ్లపాడు ఎస్ఐ జే శ్రీనివాస్, సీఐ ఎస్ విజయచంద్ర చేరుకుని బాధితుల్ని ఆసుపత్రికి తరలించే విషయంలో అప్రమత్తం కాగా, ఇన్చార్జి డీఎస్సీ కాలేషావలి సంఘటన స్థలాన్ని సందర్శించి ప్రమాద వివరాలను తెలుసుకున్నారు.అతివేగం..విపరీతమైన మంచు, ట్రాలీ వెనుకరేడియం స్టిక్కరు లేకపోవడంతో ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. పెళ్లయిన ఆరు నెలలకే.. చిలకలూరిపేట యడవల్లి గ్రామానికి చెందిన వేజర్ల వెంకట్రావు, రామాంజమ్మ దంపతుల కుమారుడైన నాగరాజుకు, గుంటూరు రూరల్ మండలానికి చెందిన తంగెళ్ల శ్రీనివాసరావు, అనసూయ కుమార్తె జయశ్రీ (19)కి ఈ ఏడాది ఆగస్టులో వివాహమైంది. ప్రస్తుతం ఆమె ఐదు నెలల గర్భిణి. జయశ్రీ మూడు నెలలుగా పుట్టింటిలోనే ఉంటుంది. సీమంతం నిమిత్తం సోమవారం అత్తగారింటి రావడంతో భార్యాభర్తలు ఎన్నొ ఊసులు చెప్పుకుంటూ ఆనందంగా కనిపించారు. నిండు నూరేళ్లు జీవించాలని, పండంటి బిడ్డకు జన్మనివ్వాలంటూ తల్లిదండ్రులు, అత్తమామాలు, బంధుమిత్రులు దంపతుల్ని అక్షింతలు చల్లి ఆశీర్వదించారు. అప్పటి వరకు సంతోషంగా గడిపిన ఆ కుటుంబంలో కొన్ని గంటల్లోనే విషాదం అలుముకుంది. తల్లీబిడ్డలు కానరాని లోకాలకు.. నా ఆటోలో తీసుకెళ్లినా బతికేవారయ్యా అంటూ సుంకర రమాదేవి భర్త ఆటోడ్రైవర్ పూర్ణచంద్రరరావు కన్నీరు మున్నీరయ్యారు. రాత్రి గోరంట్ల నుంచి ఆటోలో వెళ్లిన వారు సీమంతం జరిగిన అమ్మాయిని ఆటోలో తీసుకెళ్లవద్దని అక్కడి బంధువులు చెప్పారన్నారు. అర్ధరాత్రి పోలీసుల నుంచి ఫోన్ రావడంతో గుండెలు జారిపోయాయయ్యా అంటూ రోదించారు. అబ్బాయి శ్రీకాంత్ కారు డ్రైవర్, అమ్మాయి రమ్య గోరంట్ల సెయింట్ ఆన్స్‌లో డిగ్రీ ఫస్టియర్ చదువుతోంది. భార్యాబిడ్డలను కోల్పోయిన ఆయన గుండెలు బాదుకుంటున్నాడు. పండుగ నాడు మృత్యువు ఒడిలోకి.. గుంటూరు ఈస్ట్: సంతోషంగా క్రిస్మస్ పండుగ జరుపుకోవాల్సిన ఇంటిలో తీరని విషాదం అలుముకుంది. రోడ్డు ప్రమాదంలో ఇంట్లోని చిన్న కుమారుడు దుర్మరణం పాలవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. మేడికొండూరు మండలం గుల్లపాలెంకు చెందిన కొటికల ఫ్రాన్సిస్ తండ్రి గతంలోనే మృతి చెందారు. తల్లి సమాధానం కూలి పనుల కోసం ఇటీవల హైదరాబాద్ వెళ్ళింది. ఫ్రాన్సిస్ స్నేహితుడితో కారులో వెళ్లి దుర్మరణం పాలయ్యాడు. అన్న మల్లేశ్వరరావు, తల్లి సమాధానం గుంటూరు మార్చురీ వద్దకు చేరుకుని కన్నీరు మున్నీరయ్యారు. ట్రాక్టర్‌పై ఉన్న వారికీ గాయాలు ట్రాక్టర్ వెనక ట్రాలీని కారు ఢీకొనడంతో ట్రాలీ పల్టీలు కొడుతూ దూరంగా వెళ్లి పడింది. కారు సుమారు 50 మీటర్లు వరకు బలంగా తోసుకుంటూ వెళ్లడంతో కారు ముందు భాగం, టాపు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ట్రాక్టర్, ట్రాలీ కూడా దెబ్బతిన్నాయి. ట్రాక్టర్‌పై ఉన్న కొల్లిపర మండలం క్రాప గామానికి చెందిన బోసి హనుమంతరావు, కలపల రమేష్‌లకు గాయాలయ్యాయి. వీరిని చిలకలూరిపేట ప్రభుత్వ అసుపత్రికి తరలించారు. -
ప్రాణాలు తీసిన దారిద్య్రం
తిరుపతి తుడా, మంగళం : పేరుకు స్మార్టు సిటీ. ఇప్పటికీ చాలా ప్రాంతాలకు సరైన దారి సౌకర్యం లేని దుస్థితి. అంబులెన్స్ కూడా చేరుకోని పరిస్థితి. శుక్రవారం ఈ పరిస్థితి వల్ల ఓ నిండు గర్భిణీ ప్రాణం గాలిలో కలిసిపోయింది.అధికారుల నిర్లక్ష్యం ఈమెను బలి తీసుకుంది. పసికందును ప్రసవించి గర్భిణి కన్ను మూసిన వైనం స్థానికుల గుండెల్ని పిండేసింది. తిరుపతి నగర శివారు ప్రాంతం వినాయక సాగర్ సమీపంలోని వెంకటరెడ్డి కాలనీలో ఎస్టీ మహిళ లక్ష్మి గర్భిణి. ఈమెకు శుక్రవారం సాయంత్రం పురిటి నొప్పులు వచ్చాయి. వెంటనే భర్త 108కు ఫోన్ చేశాడు. కరకంబాడి రోడ్డు బొంతాలమ్మ ఆలయ సమీపానికి మాత్రమే ఆటో చేరుకోగలిగింది. వినాయక సాగర్ కట్ట నుంచి వెంకటరెడ్డి కాలనీకి వెళ్లేందుకు మార్గం అస్తవ్యస్తంగా ఉంది. దీంతో అంబులెన్స్ ముందుకు కదల్లేదు. మెయిన్ రోడ్డు వరకు ఆటోలో తీసుకురావాలని 108 సిబ్బంది సమాచారం ఇచ్చారు. దీంతో ఆటోలో లక్ష్మిని తరలిస్తుండగా గుంతల రోడ్డులో కుదుపులకు నరకయాతన అనుభవించింది. ఫలితంగా ఆటోలోనే ప్రసవించింది. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. క్షణాల్లోనే లక్ష్మి ప్రాణం విడిచింది. దీంతో పసికందును పట్టుకుని కుటుంబ సభ్యులుగుండెలవిసేలా రోదించారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ యువనాయకుడు భూమన అభినయ్ ఘటనా స్థలానికి చేరుకుని చలించిపోయారు. కాలనీకి వాహనాలు కూడా సరిగా రాలేని పరిస్థితి ఎదురవ్వడం దారుణమన్నారు. ఈ నిర్లక్ష్యానికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. రోడ్లు వేయాలని నెలల తరబడి గ్రామస్తులు వేడుకుంటున్నా పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. ఆ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలబడాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట పాముల రమేష్‌రెడ్డి, శివప్రసాద్, వెంకటేష్ తదితరులు ఉన్నారు. బాధ్యత ఎవరు వహించాలి.. తిరుపతిని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేశామని గొప్పలు చెప్పుకుంటున్న నాయకులకు, అధికారులకు ఈ ఘటన కనువిప్పు కలిగించాలి. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో విలీనమైన తిమ్మినాయుడుపాళెం అభివృద్ధి్దకి దూరంగా ఆగిపోయింది. వినాయకసాగర్ అవతలి గ్రామానికి వెళ్లే ప్రజలకు సరైన దారి సౌకర్యాం కల్పించలేకపోయారు. ఇటీవల తుడా, కార్పొరేషన్, ఇరిగేషన్ శాఖలు వినాయక సాగర్‌ను అభివృద్ధి చేశాయి. అభివృద్ధి పనులను పూర్తి స్థాయిలో చేయకనే మధ్యలో నిలిపేశారు. శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో పనులు ఆగిపోయాయి. కట్టను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఇరిగేషన్ పరిధికి వస్తుంది. తాము ఇప్పటికే పనులు చేశామని, ఇక కార్పొరేషన్ పూర్తి స్థాయి పనులను చేపట్టాలని చేతులు దులుపుకుంది. కార్పొరేషన్ యంత్రాం గం బాధ్యతలు తీసుకుని గ్రామాలకు రోడ్డును ఏర్పాటు చేయాలి. కానీ చేయలేదు. ఫలితంగా రోడ్డు గుంతలమయంగా తయారైంది. వాహన దారులు, పాదచారులు నరకయాతన పడుతున్నారు. తాజాగా గర్భిణి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. రోడ్డు గుంతలు సాకుగా చూపిన 108 సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడమూ ఆమె మృతికి కారణమైంది. -
గర్భిణికి చికిత్సపై వివాదం
కర్నూలు(హాస్పిటల్): గర్భిణికి రక్తం తక్కువ గా ఉందని వైద్యులు బయటకు పంపించారని కుటుంబ సభ్యులు ఆరోపించడంతో మంగళవారం పెద్దాసుపత్రిలో వివాదం నెలకొంది. శిరువెళ్ల మండలం ఎర్రగుంట్ల గ్రామానికి చెందిన మధు భార్య రామలక్ష్మి(24) ప్రసవం కోసం సోమవారం మధ్యాహ్నం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు వచ్చింది. కాన్పుల విభాగంలో ఆమెను వైద్యులు చేర్చుకుని చికిత్స ప్రారంభించారు. రక్తం హెచ్‌బీ 4 గ్రాములు మాత్రమే ఉందని, నాలుగు యూనిట్లు తెచ్చుకోవాలని ఆమెకు వైద్యులు సూచించారు. రక్తం తెచ్చుకోవడానికి ఎవ్వరూ లేరని ఆమె చెప్పగా దానికి తామేమి చేయాలని ప్రశ్నించి.. రక్తం తెచ్చుకున్న తర్వా త వచ్చి కలవండంటూ చెప్పి వెళ్లిపోయారు. ఆ తర్వాత మంగళవారం ఉదయం గర్భిణి కుటుంబసభ్యులు మీడియాతో మాట్లాడుతూ రక్తం తక్కువగా ఉండటంతో వైద్యులు బయటకు వెళ్లాలని చెప్పారని, ఈ కారణంగా రాత్రంతా బయటే ఉన్నామని చెప్పారు. ఈ విషయమై గైనకాలజి విభాగం హెచ్ఓడీ డాక్టర్ బి. ఇందిర మాట్లాడుతూ తాము గర్భిణి రామలక్ష్మిని బయటకు పంపించలేదని, రక్తం తెచ్చుకుని కలవాలని చెప్పామని అన్నారు. వారు వైద్యుల అనుమతి తీసుకోకుండా రా త్రంతా బయట ఉంటే దానికి తామెలా బాధ్యులమవుతామని ప్రశ్నించారు. 4 ఎంజీ రక్తంతో వస్తే చికిత్స ఎలా చేయాలని, అంత తక్కువ రక్తం ఉండేంత వరకు ఉండి, చివరి దశలో ఇక్కడికి వచ్చి గొడవ చేస్తే ఎలాగని అన్నారు. -
గర్భిణి ఆత్మహత్య!
కర్నూలు , ఆదోని: నాలుగు నెలల గర్భిణి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని జాలిమంచి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. తమ కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, అల్లుడే హతమార్చి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని మహిళ తల్లిదండ్రులు ఆరోపించారు. తల్లి మృతిచెందడం.. తండ్రి హత్యారోపణలు ఎదుర్కొంటుండటంతో వారి ఏడాదిన్న చిన్నారి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. మృతురాలి తల్లిదండ్రులు, పెద్దతుంబళం ఎస్ఐ రమేష్‌బాబు తెలిపిన వివరాలు.. ఎమ్మిగనూరు మండలం కోటెకల్లు గ్రామానికి చెందిన కామాక్షమ్మ, అయ్యప్ప దంపతుల కూతురు శాంతమ్మ (20)ను ఆదోని మండలం జాలిమంచి గ్రామానికి చెందిన గోవిందరాజులుకు ఇచ్చి మూడేళ్ల క్రితం వివాహం చేశారు. వీరికి ఏడాదిన్నర బాలుడు మహేంద్ర సంతానం కాగా శాంతమ్మ నాలుగు నెలల గర్భిణి. మంగళవారం రాత్రి యథావిధిగా భోజనం చేసి నిద్రకు ఉపక్రమించారు. ఉన్నట్టుండి మధ్యరాత్రి అరుపులు వినిపించడంతో చుట్టుపక్కల వారు వెళ్లి చూడగా తన భార్య శాంతమ్మ కొక్కికి ఉరేసుకుని మృతిచెందిందని భర్త గోవిందురాజులు, అతని సోదరుడు, వదిన బోరున విలపించారు. పెద్దతుంబళం పోలీసులు ఘటానా స్థలానికి చేరుకుని మృతురాలి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. రాత్రికి రాత్రే తల్లిదండ్రులతోపాటు బంధువులతో పాటు దాదాపు 200మంది కోటేకళ్లు గ్రామస్తులు జాలిమంచికి చేరుకున్నారు. తమ కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, అల్లుడే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు నాటకమాడుతున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉరివేసుకున్న ఆనవాళ్లు కూడా కనిపించడం లేదని బంధువులు సైతం అనుమానం వ్యక్తం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో మృతురాలి భర్త గోవిందరాజులు పరారయ్యాడు. తండ్రి ఫిర్యాదు మేరకు భర్త గోవిందరాజు, అతని సోదరుడు శ్రీనివాసులు, వదిన సావిత్రమ్మపై అదనపు వరకట్న వేధింపుల కేసు నమోదు చేశామని, పోస్ట్‌మార్టం నివేదిక ఆధారంగా కేసులో మార్పులు చేసే అవకాశం ఉందని ఎస్ఐ తెలిపారు. అయ్యో పాపం పసివాడు.. తల్లి శాంతమ్మ అనుమానస్పద స్థితిలో మృతి చెందడం, తండ్రి గోవిందరాజులు హత్యారోపణలు ఎదుర్కొంటుండటంతో వారి ఏడాదిన్నర బాలుడు మహేంద్ర భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. తల్లి అలా ఎందుకు పడుకుందో తెలియని చిన్నారి బుడిబడి నడకలతో అటూఇటూ తిరుగుతండటం చూసి పలువురు కంట తడిపెట్టారు. అయ్యో పాపం పసివాడికి తల్లిదండ్రుల ప్రేమ దూరమైందని అక్కడికి వచ్చిన వారంతా చర్చించుకోవడం కనిపించింది. -
అమ్మ కడుపు చల్లగా..
గర్భంలో శిశువు ఏర్పడిన తొలి రోజు నుంచి బిడ్డ పుట్టిన రెండేళ్ల వరకు జాతీయ పోషణ మిషన్ కింద ఆరోగ్య, పోషణ సంరక్షణ అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. మహిళ గర్భం దాల్చిన రోజే పేరు నమోదు చేసుకొని బిడ్డ పుట్టేంత వరకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధమైన ఆహారం తీసుకోవాలనే దానిపై అంగన్వాడీలచే అవగాహన కల్పించనుంది.ఇప్పటికే అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలకు అన్న అమృతహస్తం కింద పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. బాల సంజీవని పేరుతో నిరుపేద ఎస్సీ గర్భిణులు, బాలింతలకు బలవర్థకమైన పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో గర్భం దాల్చిన మహిళ సుఖ ప్రసవం జరిగే వరకు, సుఖ ప్రసవం అనంతరం బిడ్డ ఆరోగ్యంగా పుట్టేందుకు, ఆ తరువాత తల్లీ బిడ్డలసంరక్షణ కోసం జాతీయ పోషణ మిషన్ పేరుతో కేంద్ర ప్రభుత్వం సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తల ద్వారా ఈ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించింది. ఇప్పటికే అంగన్వాడీలకు రాష్ట్ర ప్రభుత్వం వేతనం పెంచగా, ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరో అడుగు ముందుకు వేసి దేశవ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలవేతనాలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. అక్టోబర్ ఒకటవ తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వం పెంచిన వేతనాలను అంగన్వాడీలు అందుకోనున్నారు. ఈ నేపథ్యంలో అడగకుండానే కేంద్ర ప్రభుత్వం అంగన్వాడీల వేతనాలు పెంచి జాతీయ పోషణ మిషన్లోవారిని పూర్తి స్థాయిలో భాగస్వాములను చేసేందుకు క్షేత్ర స్థాయిలో కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఒంగోలు టౌన్: జిల్లా మహిళా శిశు అభివృద్ధి సంస్థ పరిధిలో 21 ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఆ ప్రాజెక్టుల పరిధిలో 4244 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. అంగన్వాడీ కేంద్రాల్లో 16201 మంది గర్భిణులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. 20320 మంది బాలింతలు ఉన్నారు. ఒకటి నుంచి మూడేళ్లలోపు వయసు కలిగిన చిన్నారులు 1,03,852 మంది ఉన్నారు. జాతీయ ఆరోగ్య మిషన్‌లో భాగంగా కేంద్రాల పరిధిలోని గర్భిణులు, బాలింతల పోషణ స్థితిపై అంగన్వాడీలు ఎప్పటికప్పుడు సమగ్ర వివరాలు సేకరించనున్నారు. గర్భిణీ పేరు నమోదు చేసుకున్న తరువాత జాతీ య పోషణ మిషన్ ద్వారా ముద్రించిన స్టిక్టర్లను సంబంధిత గర్భిణీ ఇంటి తలుపుకు అంటించనున్నారు. ఆ గర్భిణీతో పాటు, బిడ్డ పుట్టిన తరువాత వారి పోషణ స్థితి వివరాలను ప్రత్యేకంగా ముద్రించిన స్లిప్పుల ద్వారా నమోదు చేసుకోనున్నారు. ఆ స్లిప్పులో బిడ్డ పేరు, తల్లి–తండ్రి పేరు, బిడ్డ వయసు, బరువు, ఎత్తు, గత నెలలో ఆ బిడ్డ ఎంత బరువు ఉంది, ఈ నెలలో ఎంత బరువు ఉంది, పెరుగుదల ఏ వి«ధంగా ఉంది, బిడ్డ పోషణ స్థితి ఎలాగుందో వివరాలు నమోదు చేసి వాటిని తమ అధికారుల ద్వారా ఉన్నతాధికారులకు తెలియజేయనున్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులకు అందించే పౌష్టికాహారంలో ఎలాంటి పోషక విలువలు ఉంటాయో తెలియజేయడంతో పాటు ఆరోగ్యపరమైనజాగ్రత్తలు, సంరక్షణ గురించి కూడా అంగన్వాడీలు గర్భిణులకు వివరించనున్నారు. పోషణకు సంబంధించి ఎక్కువగా పాలు తీసుకోవడం, పండ్లు, తాజా ఆకుకూరలు, కూరగాయలు, కోడిగుడ్లు తీసుకోవడం ద్వారా ఆ మహిళతోపాటు గర్భంలో పెరిగే శిశువు కూడా ఆరోగ్యంగా ఏ విధంగా ఉంటుందో తెలియజేయనున్నారు. నా హక్కు.. నా బాధ్యత.. జాతీయ ఆరోగ్య మిషన్‌లో భాగంగా గర్భిణులను కూడా చైతన్యవంతులను చేయనున్నారు. నా హక్కు, నా బాధ్యత పేరుతో గర్భిణీని కూడా భాగస్వాములను చేసేందుకు చర్యలు చేపట్టారు. అత్తగారింట్లో ఉన్నా, అమ్మగారింట్లో ఉన్నా సమీపంలోని అంగన్వాడీ కేంద్రంలో పేరు రాయించుకోవడం నా హక్కు. అంగన్వాడీ కేంద్రంలో ప్రతిరోజూ భోజనం, గుడ్డు, పాలు, ఇతర పోషకాహారం తీసుకోవడం నా హక్కు. క్రమం తప్పకుండా రక్త పరీక్షలు, వైద్య పరీక్షలు చేయించుకోవడం నా హక్కు. గర్భిణీగా ఉన్నప్పుడు ఐరన్, క్యాల్షియం మాత్రం పొందడం నా హక్కు. గర్భిణీగా ఉన్నప్పుడు, అలాగే బాలింతగా ఆరునెలల వరకు అంగన్వాడీ సేవలు పొందడం ్నా హక్కు. అంటూ గర్భిణీని కూడా ఇందులో భాగస్వాములను చేయనున్నారు. అదే విధంగా నా ఆరోగ్యం, నా బిడ్డ ఆరోగ్యం, సరైన పోషణ నా బాధ్యత. నాకు పుట్టబోయ బిడ్డ సరైన బరువుతో పుట్టేలా చూసుకోవడం నా బాధ్యత. నాకు బిడ్డ పుట్టిన గంటలోపు ముర్రుపాలు పట్టడం, ఆరునెలల వరకు తల్లిపాలు ఇవ్వడం నా బాధ్యత. నా బిడ్డకు ఆరునెలలు నిండిన తర్వాత బాలామృతం, వయసుకు తగిన ఇతర పోషకాహారం తినిపించడం నా బాధ్యత. ప్రతినెలా అంగన్వాడీ కేంద్రంలో బిడ్డ పెరుగుదల చూపించడం నా బాధ్యత అంటూ బాలింతను కూడా భాగస్వాములను చేయనున్నారు. -
నాలుగు నెలల గర్భిణిపై దాడి
పశ్చిమగోదావరి, తాడేపల్లిగూడెం (తాలూకాఆఫీస్ సెంటర్): నాలుగు నెలల గర్భిణిపై ఆమె బంధువులు దాడి చేసిన ఘటన ఉంగుటూరు మండలం ఉప్పాకపాడులో గురువారం రాత్రి చోటు చేసుకుంది. ఆ గర్భిణి పట్టణంలో ఏరియా ఆసుపత్రిలో చేరి వైద్యచికిత్స పొందుతుంది. ఆమె, ఆమె భర్త, బంధువులు తాడేపల్లిగూడెంలో తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉప్పాకపాడుకు చెందిన చదనపల్లి వీరదాసు, పావ ని శ్వేతలు వేర్వేరు కులాలకు చెందిన వారు. ఇరువురు తల్లిదండ్రులది ఉప్పాకపాడే. వీరిద్దరూ ప్రేమించుకుని మే 17న వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి వీరు వేరే ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. పావని శ్వేత గర్భం దాల్చింది. నాలుగు నెలల గర్భిణి అయిన ఆమె భర్తలతో కలిసి వినాయక చవితికి ముందు ఉప్పాకపాడు వెళ్లింది. వీరదాసు తండ్రి వారిని పండగ అయ్యే వరకు ఇక్కడే ఉండమనడంతో వారు అక్కడే ఉన్నారు. గురువారం రాత్రి పావని శ్వేత బంధువులు నలుగురు ఆమె భర్త, మామ లేని సమయం చూసి వీరదాసు ఇంటి వద్ద ఆమెపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో శ్వేత, అత్త రమణను, పిన్ని కుమారిని, మరిది కాళీ కృష్ణలపై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. శ్వేత గర్భిణి కావడంతో ఉదరంపై కాలితో బలంగా తన్నినట్లు చెప్పారు. దెబ్బలు తిన్న వీరిని హుటాహుటిన తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు వివరాలను సేకరించారు. -
వైద్యుల నిర్లక్ష్యం.. గర్భిణి మృతి!
పెద్దపల్లి : కాన్పు కోసం వచ్చిన లింగంపల్లి విజయ(30)అనే గర్భిణి మృతి చెందిన సంఘటన శుక్రవారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. దాంతో గర్బిణి బంధువుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఆమె చనిపోయిందంటూ ఆరోపించారు. వైద్యులు లేకపోవడంతో సిబ్బంది నర్సులతో వైద్యం చేపించి నిర్లక్ష్యంగా వ్యవహరించి గర్భిణీ ప్రాణాలు తీశారని బంధువుల ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతురాలికి ఇప్పటికే 6 సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. రెండవ కాన్పు కోసమని వస్తే బిడ్డ పుట్టకముందే మహిళ మరణించిందన్నారు. రోడ్డుపై మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. దాంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
పడకలపై ప్రాణాలు
ప్రభుత్వాస్పత్రులపై పాలకులు అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిండు ప్రాణాలు బలవుతున్నాయి. సాక్షాత్తూ సీఎం చంద్రబాబు హామీకే దిక్కులేకుండా పోయింది. ప్రసూతి విభాగంలో బెడ్లు పెంచుతానని చెప్పి నాలుగేళ్లవుతున్నా నేటికీ కార్యరూపం దాల్చలేదు. దీంతో బెడ్లు చాలక ఒకే బెడ్‌పై ఇద్దరు ముగ్గురు గర్భిణులు, బాలింతలు అవస్థలు పడుతున్నారు. ఆపరేషన్లు చేయించుకున్న మహిళల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఇంటికి వెళ్లకుండా ఆస్పత్రి పడకలపైనే ప్రాణాలు పోయేలా ఉన్నాయని ఆవేదన చెందుతున్నారు. లబ్బీపేట(విజయవాడతూర్పు) : పోస్టుమార్టం చేసేందుకు ఫోరెన్సిక్ వైద్యుడు డబ్బులు డిమాండ్ చేసిన ఘటన మరువకముందే విజయవాడ ప్రభుత్వాస్పత్రి ప్రసూతి విభాగంలో బెడ్‌పై నుంచి పడి బాలింత మృతి చెందడం చర్చనీయాంశంగా మారింది. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో పడకలు పెంచాలని నాలుగేళ్లుగా మొత్తుకుంటున్నా పాలకులు పట్టించకోని పాపానికి ఓ బాలింత బలవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. పురిటి నొప్పులు బాధిస్తున్నా పంటి బిగువున భరిస్తూ ఒకే మంచంపై ముగ్గురు నిండు గర్భిణులు సర్ధుకుని కూర్చోవాల్సిందే. బాలింత నొప్పులు.. ఆపరేషన్ కుట్లు మానక పోయిన ఒకే మంచంపై ఇద్దరు ఒదిగి ఒకవైపునకు పడుకోవాల్సిందే. ఇదీ విజయవాడ ప్రభుత్వాస్పత్రి ప్రసూతి విభాగంలోని దయనీయ పరిస్థితి. ఈ విషయాలన్నింటినీ సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు సైతం తెలుసు. నాలుగేళ్లలో రెండు సార్లు ఈ విభాగాన్ని పర్చటించి సమస్యలు తెలుసుకున్నారు. కానీ గర్భిణులు, బాలింతలు నరకయాతనకు మాత్రం విముక్తి కలగలేదు. ఆ ఫలితంగా బాలింత మృత్యువాతపడటం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో పాటు, సిబ్బందిని సైతం కలిచివేసింది. పడకలు 240...రోగులు 375.... ప్రసూతి విభాగంలో మంగళవారం అధికారిక లెక్కల ప్రకారం 375 మంది ఇన్‌పేషెంట్స్ ఉన్నారు. కానీ అ విభాగంలో అధికారిక, అనధికారిక పడకలు 240 మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వాటిలో 120 పడకలు ప్రసూతి రోగులకు సంబంధించినవి కాగా, మరో 120 స్త్రీల వ్యాదులు, గర్భకోశ వ్యాధులకు సంబంధించి కేటాయించారు. మంగళవారం ప్రసూతి రోగులు 275 మంది వరకూ ఉన్నారు. వైద్యులు చేసేదేమి లేక ఉన్న పడకలపైనే సర్దుబాటు చేయడంతో ఒక్కో బెడ్‌పై ఇద్దరు బాలింతలు. ముగ్గురు గర్భిణులున్నారు. నాలుగేళ్లుగా పట్టించుకోని వైనం... ప్రసూతి విభాగానికి వస్తున్న రోగులకు అనుగుణంగా ఆరు యూనిట్లుకు పెంచాలని కోరుతూ 2014 ఆగస్టులో అప్పటి సిద్ధార్థ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ ప్రభుత్వానికి లేఖ రాశారు. దానిని బుట్టదాఖలు చేసిన పాలకులు యూనిట్లు పెంపు విషయాన్ని పట్టించుకోకుండా వదిలేశారు. దీంతో అప్పటి నుంచి మంత్రులు ప్రసూతి విబాగాన్ని సందర్శించినప్పుడల్లా అనధికారికంగా పడకలు పెంచుతూ వచ్చారు. అలా అధికారిక పడకలు 90 కాగా, అనధికారికంగా 150 పడకలు ఏర్పాటు చేయడంతో ఆయా వార్డులను పర్యవేక్షించడంతో వైద్యులు, సిబ్బందికి కష్టతరంగా మారుతోంది. బాలింత మృతిపై మేజిస్టీరియల్ విచారణ.... పాత ప్రభుత్వాస్పత్రిలోని ప్రసూతి విభాగంలో బాలింత మంచంపై నుంచి కిందపడి మృతి చెందిన ఘటనపై జిల్లా కలెక్టర్ మేజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు. జేసీ విజయకృష్ణణ్ ఆధ్వర్యంలో కమిటీ పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు తెలిపారు. బాలింత మృతి సర్కారీ హత్యే... ప్రసూతి విభాగంలో ఒకే మంచంపై ఇద్దరు సర్దుకోలేక కిందపడి బాలింత మృతి చెందడమంటే కచ్చితంగా అది సర్కారీ హత్యేనని వైఎస్సార్ సీపీ నగర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లాది విష్ణు అన్నారు. పాత ప్రభుత్వాస్పత్రికి వెళ్లి ఆయన బాధితురాలి బంధువులను పరామర్శించారు. అనంతరం విష్ణు మాట్లాడుతూ ప్రభుత్వాస్పత్రిల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందన్నారు. -
నిండు గర్భిణి మృతి
గుంటూరు ఈస్ట్: తీవ్ర అనారోగ్యంతో ఉన్న నిండు గర్భిణీని గుర్తు తెలియని వ్యక్తి జీజీహెచ్ కాన్పుల వార్డుకు తీసుకొచ్చాడు. ఓపి చీటి తెస్తానని వెళ్లి తిరిగిరాలేదు. ఈ క్రమంలో ఆ మహిళ మృతి చెందడంతో ఆమె వివరాలు తెలియక మృతదేహాన్ని వైద్యులు మార్చురీకి తరలించారు. మానవత్వానికే మచ్చ తెచ్చే ఈ ఘటనపై పట్టాభిపురం పోలీసులు విచారణ చేపట్టారు. అవుట్ పోస్ట్ పోలీసుల కథనం ప్రకారం... సోమవారం గుర్తు తెలియని వ్యక్తి 35 సంవత్సరాల వయస్సు ఉన్న బుజ్జి అనే నిండు గర్భిణీని కాన్పుల వార్డుకు తీసుకువచ్చాడు. ఆమెకు అధికంగా రక్త స్రావం అవుతుండటంతో వైద్యులు వెంటనే వార్డులో చేర్చుకున్నారు. ఆమె వెంట వచ్చిన వ్యక్తిని ఓపి చీటి రాయించుకు రావాలని వైద్యులు కోరారు. ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. ఆ మహిళ తన పేరు బుజ్జి అని, వయస్సు 35 సంవత్సరాలు, తాను మారుతి నగర్లో నివసిస్తానని, ఇది 3వ కాన్పు అని చెప్పింది. కొద్దిసేపటికే బుజ్జి అపస్మారక స్థితిలోకి వెళ్లి మృతి చెందింది. ఆమె సంబంధికులు ఎవరూ రాకపోవడంతో మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. అవుట్ పోస్ట్ పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు పట్టాభిపురం పోలీసులు మృతి చెందిన మహిళ వివరాల కోసం దర్యాప్తు చేపట్టారు. ఫొటోలోని మహిళను గుర్తించిన వారు : 8519835949 నంబరుకు సమాచారం ఇవ్వాలని కోరారు. -
ప్రభుత్వాస్పత్రిలో బాలింత మృతి
చిత్తూరు, మదనపల్లె క్రైం : స్థానిక జిల్లా ప్రభుత్వాస్పత్రిలో బుధవారం తీవ్ర రక్తస్రావం కావడంతో బాలింత మృతి చెందింది. బాధితుల కథనం మేరకు.. నిమ్మనపల్లె మండలం కొండసానివారిపల్లెకు చెందిన చల్లా శేషాద్రి భార్య సుమతి (23) గర్భం దాల్చింది. మూడు రోజుల క్రితం పుట్టినిల్లు గుర్రంకొండ మండలం తరిగొండ రుద్రవారిపల్లెకు వెళ్లింది. మంగళవారం నొప్పులు రావడంతో ఆమెను కుటుంబ సభ్యులు మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఉమ్మినీరు తక్కువగా ఉందని, ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. కుటుంబ సభ్యుల అనుమతి మేరకు అదే రోజు రాత్రి తొమ్మిది గంటలకు సిజేరిన్ చేసి మగబిడ్డను తీశారు. బాలింతకు అధిక రక్తస్త్రావం అవుతుండడంతో డాక్టర్లు రాత్రి 10 గంటల సమయంలో తిరిగి ఆపరేషన్ చేశారు. ఆ సమయంలో గర్భసంచిని తొలగించడంతో రక్తస్త్రావం ఆగిపోయింది. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు సుమతికి బీపీ తగ్గి అస్వస్థతకు గురైంది. వెంటనే ఆమెను డాక్టర్లే అంబులెన్స్‌లో తిరుపతికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. డాక్టర్లు బాలింతను కాపాడలేకపోయారని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బిడ్డ మాత్రం ఆరోగ్యంగా ఉంది. -
డోంట్ వర్రీ.. ఈజీ డెలివరీ
గర్భం దాల్చిన రోజు నుంచే సిజేరియన్‌కు మానసికంగా సిద్ధమైపోతోంది ఆధునిక మహిళ. నార్మల్ డెలివరీ అనేది దాదాపు అసాధ్యం అనే స్థాయికి ఆలోచనలు స్థిరపడ్డాయి. ఈ నేపథ్యంలో వ్యాయామం అలవాటు నార్మల్ డెలివరీకి, చక్కని సంతానభాగ్యానికి హామీగా మారుతూ పలువురిలో కొత్త ఆశలు చిగురింపజేస్తోంది. సిజేరియన్ బాధ లేకుండా పిల్లల్ని కనాలనుకునే వివాహితలకు సహకరించడం దగ్గర్నుంచి గర్భిణిగా ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకూ, ప్రసవానంతరం తలెత్తే పలు ఆరోగ్య సమస్యల పరిష్కచారానికి, డెలివరీ అనంతరం శరీరాకృతి మెరుగు పరుచుకునేందుకు కూడా ఉపకరిస్తోంది. దీన్ని గుర్తిస్తున్న నగర మహిళ ఆ‘పరేషాన్’కి చెక్ పెట్టే దిశగా అడుగులు వేస్తోంది. సాక్షి, హైదరాబాద్ (సిటీబ్యూరో) : హిమాయత్ నగర్లో నివసించే రమ్య ఇటీవలే పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. గర్భవతిగా తగినంత వ్యాయామం చేస్తూ.. నార్మల్ డెలివరీ ద్వారా చక్కని పాపకు జన్మనిచ్చారు. గర్భిణిగా ఉన్నా అన్ని వ్యాయామాలు, ఆసనాలు సాధన చేయవచ్చని స‘చిత్ర’ సమేతంగా నిరూపిస్తూ గర్భం దాల్చిన దగ్గర్నుంచి బిడ్డ పుట్టేవరకూ ఆమె పెట్టిన సోషల్ మీడియా పోస్ట్‌లు ఎంతో మందికి స్ఫూర్తిని అందించాయి. ఈ నేపథ్యంలో ‘సాక్షి’తో ఆమె తన అనుభవాలను ఇలా పంచుకున్నారు. ఆసనాలు ఇలా వేయాలి.. సూర్యనమస్కారాలు కాస్త సులభతరం చేసి చేయాలి. ఇందులో కోబ్రా పోజ్ తప్ప అన్నీ చేయవచ్చు. వృక్షాసన, తాడాసన, సేతుబంధాసన (ఇది ఎక్కువ సేపు కాకుండా 2 శ్వాసల కాలం మాత్రమే) అథోముఖ శ్వాసాసన వంటివి చేయవచ్చు. బటర్‌ఫ్లై ఆసనం కూడా చేయవచ్చు. ఫార్వర్డ్ బెండ్స్ చేసేటప్పుడు సగం మాత్రమే బెండ్ అవాలి. నెలలు నిండుతుంటే... వైడ్ లెగ్ ఫార్వార్డ్ ఫోల్డ్ చేయాలి. శశాంకాసన వంటివి చేయకూడదు. మాలాసన బాగా చేయాలి. నొప్పులు రాని పరిస్థితిని నివారించేందుకు ఇదిఅవసరం. మాలాసన చాలా ఉపయుక్తం. ఇది నేచురల్ డెలివరీకి బాగా ఉపకరిస్తుంది. నా విషయంలో.. 37 వారాల తర్వాత బేబీ తల రివర్స్ అయింది. దీంతో మంచం మీద కాళ్లు పెట్టి తల కిందకు పెట్టి చేసే ఇన్వర్షన్స్ వర్కవుట్ చేశాను. ప్రాబ్లం సాల్వ్ అయింది. గర్భిణులకు ఆహారం తీసుకున్న తర్వాత అరుగుదల కాసింత ఆలస్యం అవుతుంది. కాబట్టి.. తిన్నాక కనీసం 4గంటల తర్వాత మాత్రమే వ్యాయామాలు/ఆసనాలు చేయడం మంచిది. లంచ్ అయ్యాక ఈవినింగ్ స్నాక్స్‌కి ముందు సమయం అయితే బెటర్. ఆరోగ్య సంతాన ‘ప్రాప్తి’కోసం.. సంతానభాగ్యానికి అడ్డుపడే ఆరోగ్యపరమైన ఇబ్బందులని తొలగించుకోవడానికి నడక వంటి వ్యాయామాలను, యోగాసనాలు ఉపకరిస్తాయి. వీటిని దినచర్యలో భాగం చేసుకోగలిగితే హార్మోన్ల సమతుల్యత పెంపొందడం, రక్తప్రసరణ సజావుగా సాగడం, పునరుత్పత్తి సామర్థ్యం మెరుగుపడతాయి. తద్వారా సంతానలేమికి కారణమైన సమస్యల నివారణకు అవకాశం ఎక్కువ. గర్భం దాల్చాలని ఆశిస్తున్న వివాహితలు తమ ఆరోగ్య పరిస్థితికి అనువైన అన్ని రకాల యోగాసనాలను సాధన చేయవచ్చు. అలాగే ప్రసవానంతరం కూడా... శరీరం వదులు కావడం వంటి కొన్ని సమస్యలు వస్తాయి. వాటికి కూడా యోగాయే సమాధానం. వాకింగ్‌తో క్వీన్.. గర్భధారణ సమయంలో కూడా ఎప్పటిలాగే చురుగ్గా ఉండాలి. గర్భవతులకు వాకింగ్ చాలా ఉపయుక్తం. తొలి రెండు త్రైమాసికాల్లో ప్రతిరోజూ స్లో వాకింగ్ చివర్లో బ్రిస్క్ వాకింగ్ చేయవచ్చు. దాదాపు 28 వారాలు నిండాక ప్రీమేటల్ ఏరోబిక్స్ కూడా చేయవచ్చు. బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు చాలా హెల్ప్‌ఫుల్. ప్రాణాయామ, అనులోమ, విలోమ ప్రాణాయామాలు చేయవచ్చు. ఎంత బాగా డీప్ బ్రీత్ తీసుకుంటే అంత చక్కగా శ్వాసని కడుపులోని బేబీకి పంపుతున్నట్టు అర్థం. మరో 2, 3 రోజుల్లో డెలివరీ ఉందనగా మెట్లు ఎక్కి దిగడం వంటివి చేస్తే ప్రసవం మరింత సులభం అవుతుంది. అలాగే డెలివరీ సమయంలో నొప్పుల్ని తగ్గించుకోవాలంటే... వేణ్నీళ్ల టబ్ ఒక మార్గం. నా డెలివరీ వాటర్ టబ్‌లోనే అయ్యింది. శారీరక శ్రమ అవసరమే.. అడుగు తీసి అడుగేయవద్దు, అటు పుల్ల ఇటు తీసి పెట్టొద్దు.. అసలే ఒట్టి మనిషివి కూడా కాదు వంటి అతి జాగ్రత్తలు గర్ణిణుల విషయంలో సర్వసాధారణం. అయితే అవి సరికాదు. నడక వంటి తేలికపాటి వ్యాయామాలతో పాటు, గర్భంలోని శిశువు సజావుగా పెరగడానికి, తల్లి ఆరోగ్యంలో అసాధారణ మార్పు చేర్పులు చోటు చేసుకోకుండా ఉండడానికి యోగాసనాల సాధన అత్యంత ఉపయుక్తం. మూడోనెల నుంచీ.. గర్భధారణ తర్వాత 3 నెలల తర్వాత నుంచి ఆసనాలు సాధన చేయవచ్చు. తగినంత యోగా నైపుణ్యం ఉన్నవారైతే ఇంకాస్త ముందుగానే మొదలుపెట్టవచ్చు. తేలికపాటి భంగిమలకు, ఆసనాలకు పరిమితం కావాలి. ముఖ్యంగా వెనుకకు బాగా వంగి చేసే ఆసనాలు వేయకూడదు. అలా చేస్తే ప్లెసెంటా డిటాచ్ అయ్యే అవకాశం ఉంటుంది. స్ట్రెచ్చింగ్లు (శరీరాన్ని సాగదీసే వ్యాయామ భంగిమలు) అన్నీ చేయవచ్చు కానీ అశ్వసంచలాసన లాంటి ట్విస్ట్స్ చేయకూడదు. ఓపెన్ ట్విస్ట్స్ చేయవచ్చు. భరద్వాజాసన లాంటివి చేయవచ్చు. దీనిలోనే క్లోజ్ ట్విస్ట్స్ చేయకూడదు. అధిక ఆహారం అవసరం లేదు.. కొంత మంది తల్లీ, బిడ్డ.. ఇద్దరి కోసం తింటున్నాం అనే భావనతో రోజువారీగా తీసుకునే ఆహారం అమాంతం పెంచేస్తారు. అది సరికాదు. సగటున మహిళకు సాధారణ పరిస్థితుల్లో.. 300 కేలరీల కంటే ఎక్కువ ఆహారం అవసరం లేదు. గర్భవతిగా ఉన్నప్పుడు అత్యధికంగా 10 నుంచి 12 కిలోల బరువు పెరగడం వరకూ ఫర్వాలేదు. అంతకన్నా ఎక్కువైతే ఇబ్బందులే. డ్రైఫ్రూట్స్, ఆకు కూరలు, ప్రొటీన్‌ఫుడ్ బాగా తీసుకోవాలి. స్వీట్స్ ఎక్కువ తింటే జెస్టేషనల్ డయాబెటిస్ రావచ్చు. స్వీట్స్ బాగా తక్కువగా తీసుకోవాలి. పన్నీర్, పెరుగు వంటి కాల్షియం పుష్కలంగా ఉండేవి తీసుకోవాలి. రక్తహీనత సమస్యను అధిగమించేందుకు ఖర్జూరం, బీట్రూట్.. క్యారెట్, పాలకూర, తోటకూర వంటివి బాగా తీసుకోవాలి. -
రవితేజ ఆసుపత్రిలో నిండు గర్భిణి మృతి
మాచర్ల: వైద్యురాలి నిర్లక్ష్యానికి నిండు గర్భిణి మృతి చెందిన ఘటన మాచర్ల పట్టణంలోని రామా టాకీస్‌కి వెళ్లే రహదారిలో రవితేజ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. దుర్గి మండలం ఆత్మకూరుకు చెందిన పేరువాల రాణి పురిటి నొప్పులతో బాధపడుతుండగా భర్త సాగర్, బంధువులు ఆమెను మాచర్లలోని రవితేజ ఆసుపత్రికి తరలించారు. అక్కడి డాక్టర్ ఆదివారం ఉదయం 8.30 గంటలకు ఆపరేషన్ చేశారు. అయితే, రాణి ఆపరేషన్ కాగానే మృతి చెందింది. ఆసుపత్రి నిర్వాహకులు 10.30గంటల వరకూ ట్రీట్మెంట్ చేస్తున్నట్లు వ్యవహరించారు. రక్తహీనత వల్ల తల్లి రాణి చనిపోయిందని, బిడ్డకు ఎటువంటి ఇబ్బంది లేదని తర్వాత చావు కబురు చల్లగా చెప్పారు. ఆస్పత్రి నిర్వాహకుల నిర్లక్ష్యంపై రాణి భర్త, బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ నేతల రంగప్రవేశం ఆ తరువాత ఆస్పత్రి నిర్వాహకులు అధికార పార్టీ నాయకులను పిలిపించుకొని మంతనాలు జరపడం మొదలుపెట్టారు. నష్టపరిహారం చెల్లిస్తామని నచ్చచెప్పబోయారు. ఈ సమయంలో కొంత మంది ఎస్సీ నాయకులు ఆసుపత్రి వద్దకు వచ్చి ఆందోళన చేశారు. ప్రాణాలు పోయినా బేరాలు చేస్తారా ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమయంలో అర్బన్ సీఐ సాంబశివరావు, పట్టణ ఎస్ఐ లక్ష్మయ్య సిబ్బందితో ఆసుపత్రికి వచ్చి వివరాలు సేకరించారు. బాధితుల నుంచి ఫిర్యాదు అందలేదని, శాంతిభద్రతలు దృష్టిలో పెట్టుకొని ఆసుపత్రికి వచ్చినట్లు చెప్పారు. ఆస్పత్రి నిర్వాహకులు బాధిత కుటుంబాన్ని బతిమాలుకుని కేసు పెట్టకుండా లక్ష రూపాయలు ముట్టజెప్పినట్లు తెలిసింది. చేసేదేమి లేక అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో బాధిత కుటుంబం నగదు తీసుకొని వెనుతిరిగి వెళ్లినట్లు సమాచారం. గతంలోనూ పలు ఆరోపణలు ఇదే వైద్యురాలు గతంలో ప్రభుత్వాసుపత్రిలో ప్రసవించే సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి ఓ మహిళ మరణానికి కారణమై జిల్లా వైద్యశాఖ ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురై సెలవుపై వెళ్లిపోయింది. ఆమె పట్టణంలో ప్రైవేటు ఆస్పత్రి నిర్వహిస్తూ మరో మహిళ నిండు ప్రాణాన్ని బలి తీసుకోవడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. -
బాలింత మృతిపై బంధువుల ఆందోళన
లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రభుత్వాస్పత్రిలో బాలింత మృతి వివాదాస్పదంగా మారింది. పండంటి కవల పిల్లలకు జన్మనిచ్చిన ఆ తల్లి గంటల వ్యవధిలోనే మృతి చెందడం బంధువులను కలచివేసింది. వైద్యుల సరిగ్గా పట్టించుకోకపోవడం వల్లే ఇలా జరిగిందని ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. కాగా ప్రీ ఎట్వాన్సియా అనే సమస్యతో హైరిస్క్ కండీషన్లో తమ వద్దకు వచ్చినట్లు వైద్యులు తెలిపారు. దీంతో సాయంత్రం 5 గంటల సమయంలో బాలింత మృతి చెందగా, అర్ధరాత్రి వరకూ ఆందోళన కొనసాగింది. వివరాలిలా ఉన్నాయి. గుడివాడ బైపాస్‌రోడ్డులో నివసించే ఎస్కే రిజ్వానాకు పురిటినొప్పులు రావడంతో సోమవారం సాయంత్రం ప్రసవం కోసం ప్రభుత్వాస్పత్రికి తీసుకువచ్చారు. మంగళవారం ఉదయం 11.30 గంటల సమయంలో సిజేరియన్ చేయగా పండంటి కవల పిల్లలు పుట్టడంతో బంధువులు మురిసిపోయారు. మధ్యాహ్నం 4 గంటల సమయంలో రక్తస్రావం కంట్రోల్ కాక పోవడంతో వైద్యులు ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లారు. సాయంత్రం 5 గంటల సమయంలో కార్డియాక్ అరెస్ట్ కావడంతో మృతి చెందారని వైద్యులు చెప్పడంతో అప్పటి వరకూ బంధువుల్లో ఉన్న ఆనందం ఒక్కసారిగా ఆవిరైంది. వైద్యులు పట్టించుకోక పోవడం వల్లే.. ప్రసవం కోసం వచ్చిన గర్భిణీకి జూనియర్ వైద్యులు ఆపరేషన్ చేయడం వల్లే అలా జరిగినట్లు భర్త హుస్సేన్, బంధువులు ఆరోపిస్తున్నారు. సాయంత్రం 5 గంటల సమయంలో భాలింత మృతి చెందగా, అర్ధరాత్రి వరకూ మృతదేహాన్ని ఆస్పత్రిలోనే ఉంచి ఆందోళన చేస్తున్నారు. పొంతన లేని సమాధానాలు చెబుతున్నారు బాలింత మృతిపై వైద్యులు పొంతన లేని సమాధానాలు చెబుతున్నారని వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు వెలంపల్లి శ్రీనివాస్ అన్నారు. హైబీపీతో వచ్చిందని , రక్తస్రావం అని చెపుతున్నట్లు పేర్కొన్నారు. ప్రసవం కోసం ప్రభుత్వాస్పత్రికి వస్తే రూ.16 వేలు ఖర్చు చేశారని అయినా ప్రాణాలతో దక్కలేదన్నారు. ప్రభుత్వాస్పత్రిల్లో సౌకర్యాలు మెరుగుపర్చాలన్నారు. హైరిస్క్‌తో చేరారు రిజ్వాన సోమవారం ప్రీ ఎట్వాన్షియా(హైబీపీ) అనే ప్రాబ్లమ్‌తో హైరిస్క్‌తో ఆస్పత్రిలో చేరారు. ఆ పరిస్థితుల్లో ఆమెను అబ్జర్వేషన్లో ఉంచారు. ఉదయం స్కాన్ చేయగా, కవల పిల్లలు ఉండటం, ఒక శిశువు ఎదురు కాళ్లతో ఉండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో సిజేరియన్ చేశారు. ఆపరేషన్ అనంతరం గర్భసంచి సంకోచించి నార్మల్ పరిస్థితికి రావాలి.కానీ ఆమెకు అలా జరగక పోవడంతో అధికరక్తస్రావమైంది. దానిని సరిద్దేందుకు వైద్యులు సిద్ధమవుతుండగా టోటల్ మెకానిజమ్ దెబ్బతినడంతో కార్డియాక్ అరెస్ట్ అయింది. – డాక్టర్ ఎస్.బాబూలాల్, సూపరింటెండెంట్ -
అంగన్వాడీ.. సమస్యల వేడి
అంగన్వాడీలలో సమస్యల వేడి రగులుతోంది. కేంద్రాలకు వచ్చే గర్భిణులు, బాలింతలకు సౌకర్యాలలేమి స్వాగతం పలుకుతోంది. కేంద్రాలు నిర్వహించే కార్యకర్తలు, ఆయాలకు వేతనాల సమస్య వేధిస్తోంది. చాలీచాలని గదుల్లో అద్దెల దరువు వణికిస్తోంది. పట్టించుకోవాల్సిన ప్రభుత్వం మొద్దు నిద్రలో జోగుతోంది. పర్యవేక్షించాల్సిన అధికార గణం నిర్లక్ష్యపు మత్తులో మునిగితేలుతోంది. గుంటూరు(లక్ష్మీపురం): ఐసీడీఎస్‌లో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని మహిళలు వాపోతున్నారు. ప్రభుత్వం 2017 జూలై 1వ తేదీన అన్ని జిల్లాలో అమ్మ అమృత హస్తం పథకం ప్రారంభించింది. ఈ పథకం ద్వారా జిల్లాలో 5 నుంచి 6 ఏళ్ల చిన్నారులకు పౌష్టికాహారాన్ని ప్రభుత్వం 2,14,562 మందికి అందిస్తున్నారు. వీరికి రోజుకు రూ.6 వెచ్చించింది. అనంతరం 2017 డిసెంబర్ నుంచి రూ. 8లకు పెంచింది. గర్భిణులకు 27,482 మంది బాలింతలకు 24,971 మందికి పౌష్టికాహారం అందజేస్తున్నారు. వీరికి రూ.17 ఒక్క రోజుకు ఖర్చు చేస్తారు. జిల్లా వ్యాప్తంగా 4405 అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి. రూరల్ జిల్లాలో 834, అర్బన్‌లో 3571 సెంటర్లు నడుస్తున్నాయి. వాటితోపాటు మినీ సెంటర్లు 54 ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 23 మంది సీడీపీవోలు, 16 మంది ఏసీడీపీవోలు పని చేస్తున్నారు. నామమాత్రంగా వసతుల కల్పన గ్రామీణ ప్రాంతాలలో గర్భిణులు పౌష్టికాహారం అందించేందుకుగాను వసతుల కల్పనకు గ్రామ పంచాయతీల నిధులలో రూ.5 వేలు ఖర్చు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే చాలా కేంద్రాల్లో వసతులు కల్పన మృగ్యంగా మారింది. దీంతో గర్భిణులు అంగన్వాడీ కేంద్రాలకు వచ్చేందుకు వెనుకంజ వేస్తున్నారు. అనేక చోట్ల కుర్చీలు లేక నేలపైనే ఆహారం తీసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. దీంతో వారు అంగన్వాడీ కేంద్రాల్లో ఆహారం తీసుకోవడం లేదు. అంగన్వాడీ టీచర్లకు ఇక్కట్లు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించినా అంగన్వాడీ సిబ్బందిని తరలిస్తున్నారు. సంబంధించి ప్రయాణ ఖర్చులుగానీ, భోజన వసతిగానీ కల్పించడం లేదు. మరో వైపు కేంద్రాలకు సకాలంలో అద్దెలు చెల్లించడం లేదు. దీంతో పాఠశాలల్లోని ఇరుకు గదుల్లోనే తరగతులు నిర్వహించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అందని జీతాలు అంగన్వాడీ కార్యకర్త, ఆయాలకు రెండు నెలలుగా వేతనాలు అందలేదు. దీంతో పూట గడవక ఇబ్బందులు పడుతున్నారు. మరో వైపు కేంద్రం నిర్వహణకుగాను ముందుగానే వెచ్చించాల్సి ఉండడంతో అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. విధులు ఫుల్.. అంగన్వాడీ కేంద్రంలో కార్యకర్తలు గర్భిణులు, బాలింతలకు పోషక ఆహారం, ఆరోగ్య పరీక్షలు, సలహాలు సంప్రదింపులు, వ్యాధి నిరోధక టీకాలు, ఆరోగ్య విద్య, పూర్వ ప్రాథమిక విద్యను అందిస్తారు. చిన్నారులకు సంరక్షణ, ఆటపాటలు, మద్యాహ్న భోజనం వంటి విధులు నిర్వర్తిస్తారు. కేంద్రాలలోని ఆయాలు వీరికి సహాయకులుగా ఉంటారు. అమలుకాని మెనూ గర్భిణులకు ప్రతి సోమవారం అన్నం, కూరగాయల సాంబారు, గుడ్డు కూర, పాలు, మంగళవారం..అన్నం, పప్పు, ఆకు కూర, గుడ్డు, పాలు, బుధవారం.. అన్నం, ఆకుకూరతో పప్పు, గుడ్డు, పాలు, గురువారం కూరగాయాలతో సాంబరు, గుడ్డు కూర, పాలు, శుక్రవారం.. అన్నం, పప్పు, ఆకు కూర, గుడ్డు, పాలు, శక్రవారం.. ఆకు కూరతో పప్పు, గుడ్డు, పాలు ప్రభుత్వం నిర్ణయించిన తూకం ప్రకారం అందించాలి. ఇదే తరహాలో ప్రీ స్కూల్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం అమలు చేయాలి. కానీ ఎక్కువ కేంద్రాల్లో ఈ మెనూ అమలు కావడం లేదు. కేంద్రాలపై సూపర్వైజర్ల పర్యవేక్షణ లేకపోవడంతో ఈ పరిస్థితి దాపురించింది. ప్రభుత్వం సక్రమంగా బిల్లులు అందించకపోవడంతోనే సమస్య ఉత్పన్నమవుతోందని అంగన్వాడీ నిర్వాహకులు వాపోతున్నారు. వసతులు కల్పిస్తున్నాం జిల్లాలో అన్ని కేంద్రాలలో పంచాయతీ నిధులతో వసతులు కల్పిస్తున్నాం. అర్బన్ జిల్లాలోనూ 75 శాతం కేంద్రాలలో సౌకర్యాలు పెంచాం. మిగిలిన వాటిలోనూ గర్భిణులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. అంగన్ వాడీ కేంద్రాలలో గర్భిణులకు, బాలింతలు, చిన్నారులకు మెనూ ప్రకారం ఆహారం అందించాల్సిందే. -శ్యామ్‌సుందరి,జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ -
ప్రాణాలు పోతున్నా వినరే...
గూడెంకొత్తవీధి(పాడేరు): మన్యంలో మాతాశిశు మరణాలను అరికట్టాలని వైద్య ఆరోగ్య శాఖ చేస్తున్న ప్రయత్నాలు గిరిజనుల అవగాహన లోపం కారణంగా సఫలం కావడం లేదు. ఏదో ఒక చోట మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. గిరిజనుల్లో అవగాహనలోపం అధికారుల సహనానికి పరీక్షగా మారుతోంది. తాజా ఓ గర్భిణి వైద్య సిబ్బందికి మూడు చెరువుల నీళ్లు తాగించింది. అయినా వారి ప్రయత్నాలు ఫలించలేదు వివరాల్లోకి వేళ్తే... మండలంలోని వంచుల పంచాయతీ సీహెచ్ చరపల్లి గ్రామానికి చెందిన సూకూరు విమలమ్మ ఎనిమిది నెలల గర్భిణి. ఈమె ఎనిమియాతో బాధపడుతోంది. కొద్ది రోజులు క్రితం కేజీహెచ్‌లో వైద్యసేవలు పొందేందుకు వెళ్లింది. అక్కడ రెండు గ్రాములు రక్తం ఎక్కించారు. అక్కడ నుంచి ఎవరికి చెప్పకుండా స్వగ్రామానికి వచ్చేసింది. దీంతో ఆర్వీ నగర్ పీహెచ్సీ వైద్య సిబ్బంది చరపల్లి వెళ్లి ప్రాథమిక పరీక్షలు నిర్వహించారు. ఆమెకు మూడు గ్రాముల రక్తం మాత్రమే ఉండడంతో కేజీహెచ్‌కు తీసుకువెళ్లేందకు సిబ్బంది ప్రయత్నించారు.ఇందుకు విమలమ్మ ససేమిరా అనడంతో వైద్యసిబ్బంది తలలు పట్టుకున్నారు. గతంలో కేజీహె చ్‌కు వెళ్లి వారం రోజులు ఉన్నామని రెండు ప్యాకెట్ల రక్తం ఎక్కించారని, వారం రోజులు పాటు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని, మళ్లీ కేజీహెచ్‌కు వెళ్లి బాధలు పడలేమని భర్త కొత్తన్న తెలిపారు. ఈమెకు ఇద్దరు పిల్లలుకూడా చిన్నవయసు కావడంతో వైద్యానికి సిబ్బంది ఎంత ప్రాధేయపడినా అంగీకరించలేదు. దీంతో ఆర్థికంగా సాయం చేసేందుకు సిబ్బంది ముందుకు వచ్చారు. అయినా వినకపోవడంతో చేసేదిలేక వెనదిరగక తప్పలేదు.ఈ విషయాన్ని వైద్యా ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులకు తెలియజేశారు.కేజీహెచ్‌కు వెళ్లాలని విమలమ్మను ప్రాధేయపడుతున్న వైద్య సిబ్బంది 099 -
108 ఉద్యోగి నిర్లక్ష్యం గాలిలో కలిసిన ప్రాణం
మదనపల్లె క్రైం: అత్యవసర సమయంలో ఆస్పత్రికి తరలించి వారి ప్రాణాన్ని నిలబెట్టాల్సిన 108 సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఓ నిండు గర్భిణి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఈ సంఘటన మదనపల్లెలో గురువారం జరిగింది. చత్తీస్‌ఘడ్‌కు చెందిన 10 కుటుంబాల వారు మూడేళ్ల క్రితం మదనపల్లె మండలం సీటీఎంలోని ఓ క్వారీలో పనిచేసేందుకు వచ్చారు. వారిలో రామ్‌సింగ్, శాంతి దంపతులు ఉన్నారు. వీరికి కొడుకు ధరమ్‌సింగ్ (4) ఉన్నాడు. శాంతి రెండోసారి గర్భం దాల్చింది. భర్త తాగి ఇంటికి వస్తున్నాడని బుధవారం సాయంత్రం మందలించింది. అతను పట్టించుకోకపోవడంతో భర్తను భయపెట్టేందుకు ఆమె పురుగుల మందుతాగింది. ఆమెను స్థానికులు, కుటుంబ సభ్యులు హుటాహుటిన మదనపల్లె ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు తిరుపతికి రెఫర్ చేశారు. వారికి ఆర్థిక స్థోమత లేకపోవడంతో 108ను ఆశ్రయించారు. ఆ సమయంలో 108 వాహనాలు అందుబాటులో లేవని హైదరాబాద్ నుంచి ఆర్గనైజర్ సమాచారం అందించారు. అప్పటికే ఆస్పత్రిలో ఉన్న వాల్మీకిపురం 108 సిబ్బంది భార్గవాచారిని తిరుపతికి తీసుకెళ్లాలని బాధితులు, ఆస్పత్రి సిబ్బంది కోరారు. అందుకు అతను నిరాకరించి ఖాళీ వాహనంతోనే వాల్మీకిపురం వెళ్లిపోయాడు. కొంతసేపటికి ఆస్పత్రికి వచ్చిన మదనపల్లె 108 సిబ్బంది గర్భిణి శాంతిని తీసుకుని వాల్మీకిపురం 108 సిబ్బందికి అప్పగించారు. వారు తిరుపతికి తీసుకెళ్లారు. సుమారు 3 గంటలు ఆలస్యం కావడంతో శాంతి పరిస్థితి మరింత విషమించింది. రుయా వైద్యులు మెరుగైన వైద్య చికిత్సలు అందించినా ప్రయోజనం లేకుండా పోయింది. శాంతి మృతి చెం దింది. ఈ విషయమై 108 జిల్లా సూపర్వైజర్ లోకేష్‌ను వివరణ కోరగా సిబ్బంది నిర్లక్ష్యంపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామన్నారు. మరో సారి అలాంటి తప్పిదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. -
మహిళా ఓటరు కన్నీరు
బనశంకరి: పోలింగ్ కేంద్రంలో ఓటుహక్కు వినియోగించుకోవడానికి అవకాశం కల్పించకపోవడంతో నిండుగర్భిణి వెక్కివెక్కి ఏడ్చిన ఘటన బనశంకరిలో శనివారం చోటుచేసుకుంది. బనశంకరి రెండవస్టేజ్ బీఎన్ఎం కాలేజీ 142 పోలింగ్ కేంద్రంలో శనివారం ఉదయం బనశంకరి రెండవస్టేజ్లో నివాసి చైత్ర ఓటుహక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రానికి వచ్చారు. పోలింగ్ కేంద్రంలో ఎన్నికల అధికారికి, చైత్ర ఓటరు గుర్తింపు కార్డు జిరాక్స్ చూపించడంతో కుదరదని ఓటింగ్‌కు నిరాకరించాడు. దీంతో ఆమె అక్కడే తీవ్ర ఆవేదనతో కన్నీటి పర్యంతమయ్యారు. చివరికి ఓ పాత్రికేయుడు జోక్యం చేసుకుని ఓటింగ్‌కు అవకాశం కల్పించారు. -
వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ మృతి
రాంగోపాల్‌పేట్: ప్రసూతి కోసం వచ్చిన గర్భిణీ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యంతో మరణించిందని ఆస్పత్రి ముందు బంధువులు ఆందోళన చేశారు. బాధితుల కథనం మేరకు.. మణికొండకు చెందిన సౌమ్య (25) కాన్పు కోసం గత నెల 27 నవోదయ ఆస్పత్రికి వచ్చింది.ఆమెకు మరుసటి రోజు సిజేరియన్ చేయగా పాప, బాబు కవల పిల్లలు జన్మించారు. మెరుగైన చికిత్స కోసం బర్కత్‌పురలోని నవోదయ శాలిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ సౌమ్యకు మళ్లీ శస్త్ర చికిత్స చేశారు.తరువాత ఆస్పత్రి సిబ్బంది పట్టించుకోకపోవడంతో బంధువులు సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి తీసుకుని వచ్చారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం మృతి చెందింది. దీంతో బంధువుల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మృతదేహా తీసుకుని వచ్చి నవోదయ ఆస్పత్రి ముందు ఉంచి ఆందోళనకు దిగారు. రాంగోపాల్‌పేట్, సైఫాబాద్ పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. శస్త్ర చికిత్స విఫలం కావడంతో పాటు వైద్యులు ఏ మాత్రం పట్టించుకోకుండా ఉండటంతోనే సౌమ్య మరణించిందని బంధువులు ఆరోపించారు. సుమారు రూ.12లక్షలు ఖర్చు పెట్టినా బ్రతికించలేకపోయారని వాపోయారు. -
చిత్తూరు ఆస్పత్రిలో బాలింత మృతి
చిత్తూరు అర్బన్: చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో సరైన సమయంలో వైద్యం అందక బుధవారం బాలింత మృతిచెందింది. ఇక్కడ పనిచేసే డాక్టర్లే తమ బిడ్డను చంపేశారంటూ మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. దీనిపై కలెక్టర్ సీరియస్ అయ్యారు. ఆస్పత్రిలో వరుస మరణాలపై డీసీహెచ్ఎస్ సరళమ్మపై మండిపడ్డారు. సత్యవేడు మండలం పెద్దపాండూరుకు చెందిన రమణయ్య, సుశీలమ్మ కుమార్తె కవితను చిత్తూరు నగరంలోని ఇరువారం హరిజనవాడకు చెందిన ప్రభుకు ఇచ్చి గతేడాది మార్చిలో వివాహం చేశారు. కవిత గర్భం దాల్చడంలో ప్రతి నెలా చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకుంటోంది. సోమవారం పురిటి నొప్పులు రావడంతో ఆస్పత్రిలో అడ్మిట్ అయింది. వైద్యులు మంగళవారం మధ్యాహ్నం సిజేరియన్ చేసి ఆడబిడ్డకు పురుడుపోశారు. బుధవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో కవిత కడుపు ఉబ్బిపోయింది. ఆస్పత్రిలో వైద్యులు లేరు. దీంతో కవిత అక్క ఝాన్సీరాణి వైద్యులకు ఫోన్ చేసి విషయం తెలిపింది. తెల్లవారుజామున 4 గంటలకు వైద్యులు వచ్చి కవితను పరీక్షించి కిడ్నీ పనితీరుపై రక్తపరీక్ష చేయాలని కేస్ షీట్లో రాసి వెళ్లిపోయారు. ఉదయం ఆరు గంటలకు మళ్లీ కవిత కడుపు ఉబ్బింది. ల్యాబ్ టెక్నీషియన్ లేరని, ప్రైవేట్ ల్యాబ్‌కు వెళ్లి పరీక్షలు చేయించుకుని రావాలని నర్సు రక్తనమూనాలు తీసి కవిత అక్కకు చెప్పారు. ఆమె నడుచుకుంటూ గాంధీ రోడ్డులోని ప్రైవేటు ల్యాబ్‌కు వెళ్లింది. వారు గంట తర్వాత ఇచ్చిన రిపోర్టును తీసుకుని వైద్యులకు అందచేసింది. అప్పటికే కవిత కడుపు మళ్లీ ఉబ్బడంతో 9 గంటల ప్రాంతంలో శస్త్ర చికిత్స చేశారు. ఆమెకు కడుపులో రక్తం లేకపోవడం, కాలేయం నుంచి వచ్చిన ద్రవం పూర్తిగా నిండి ఉండడాన్ని గుర్తించిన వైద్యులు ఆందోళనకు గురయ్యారు. పైగా శస్త్ర చికిత్స తరువాత మూత్ర విసర్జన కాలేదు. ఛాతీ నొప్పిగా ఉందని కవిత చెబుతూ స్పృహ కోల్పోయింది. వైద్యులు పరిశీలిస్తుండగా ఆమె చనిపోయింది. మృతురాలి బంధువుల ఆందోళన కవిత మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని పేర్కొంటూ బంధువులు ధర్నాకు దిగారు. రక్తనమూనాలను సహాయకుల వద్ద ఇచ్చి బయట పంపించడం, రెండోమారు ఆపరేషన్ గురించి తమకు చెప్పకపోవడం, సీఎంసీకి వెళతామని చెప్పినా డిశ్చార్జ్ చేయకపోవడం ఇక్కడి వైద్యుల పనితీరుకు నిదర్శమని కన్నీరుమున్నీరయ్యారు. ఇంత పెద్ద ఆస్పత్రిలో రాత్రిళ్లు వైద్యులు లేకపోవడం ఏమిటని ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం 9.30 గంటల ప్రాంతంలో తమ బిడ్డ చనిపోతే మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా చెప్పలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ ఆగ్రహం ఆస్పత్రిలో జరిగిన ఘటనపై కలెక్టర్ ప్రద్యుమ్న ఆగ్రహం వ్యక్తం చేశారు. డీసీహెచ్ఎస్ సరళమ్మను ఫోన్లో మందలించారు. ఆస్పత్రిలో వరుస మరణాలపై మండిపడ్డారు. బాధ్యులైన వైద్యులపై చర్యలకు సిఫార్సు చేయాలని ఆదేశించారు. రాత్రి విధులు చేయలేమని అపోలో వైద్యులు చెప్పడంతో ఇక్కడ డ్యూటీలు ఎవరూ చేయడం లేదని, అవుట్ సోర్సింగ్ లాబ్ టెక్నీషియన్ మురళి నిర్లక్ష్యం కనిపిస్తుండటంతో అతన్ని విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు సరళమ్మ పేర్కొన్నారు. -
వైద్యుల నిర్లక్ష్యంతో గర్భిణి మృతి
నార్నూర్(ఆసిఫాబాద్): ప్రభుత్వ ఆస్పత్రిలో గర్భిణులకు అన్నిరకాల వైద్యసౌకర్యాలు కల్పిస్తున్నాం.. ప్రతీకాన్పు సర్కారు దవాఖానాలో జరిగేలా చర్యలు తీసుకోవాలని గొప్పలు చెప్పుకోనే వైద్యశాఖ అధికారులు సౌకర్యాలు కల్పించడంలో మాత్రం విఫలం అవుతున్నారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మండలంలోని గుండాల గ్రామానికి చెందిన ఆత్రం లక్ష్మి (30) 9నెలల గర్భిణి శనివారం మధ్యాహ్నం మృతి చెందింది. మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన లక్ష్మికి జైనూర్ మండలం సీతాగొంది గ్రామానికి చెందిన సుందర్షావ్తో గతేడాది వివాహమైంది. ప్రస్తుతం ఆమె తొమ్మిది నెలల గర్భిణి. శనివారం ఆమెకు పురిటినొప్పులు రావడంతో మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ పరిశీలించిన వైద్యులు స్కానింగ్ చేశారు. కడుపులో బిడ్డ అడ్డం తిరిగినట్లు రిపోర్టు రావడంతో ఉట్నూర్ ఆస్పత్రికి రెఫర్ చేశారు. అక్కడ పరీక్షించిన వైద్యులు సైతం ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆస్పత్రికి రెఫర్ చేశారు. దీంతో మహిళ కుటుంబ సభ్యులు మధ్యాహ్నం మూడుగంటల ప్రాంతంలో రిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. రాత్రి 10 గంటల ప్రాంతంలో ప్రమాదమని భావించిన వైద్యులు ఆపరేషన్ కోసం తరలిస్తుండగా మహిళ మృతి చెందింది. సకాలంలో వైద్యం అందించి ఉంటే లక్ష్మి ప్రాణాలు దక్కేవని, వైద్యుల నిర్లక్ష్యంతోనే మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సర్కారు ఆస్పత్రిపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. -
ప్రభుత్వాసుపత్రిలో ఊడి పడిన ఫ్యాన్
మణుగూరుటౌన్: మున్సిపాలిటీ పరిధిలోని శివలింగాపురం పీహెచ్సీలో సీలింగ్ ఫ్యాన్ ఊడి పడడంతో బాలింత తలకు తీవ్ర గాయమైంది. ఇది మంగళవారం జరిగింది. బాధితురాలు తెలిపిన వివరాలు... సమితి సింగారం పంచాయతీ సీతానగరం గ్రామానికి చెందిన కొప్పుల స్వాతి, పురిటి నొప్పులతో మధ్యాహ్నం రెండు గంటలకు ఆసుపత్రిలో చేరింది. సాయంత్రం ఏడు గంటల సమయంలో చిన్న ఆపరేషన్ ద్వారా పాపకు జన్మనిచ్చింది. ఆ తరువాత సిబ్బంది ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. తొమ్మిది గంటల సమయంలో వార్డులోని సీలింగ్ ఫ్యాన్ హఠాత్తుగా ఊడి, కొప్పుల స్వాతి తలపై పడింది. ఆమె తలకు తీవ్ర గాయమైంది. ఆ సమయంలో అక్కడ ఆసుపత్రి సిబ్బంది ఎవరూ లేరు.. ఆ తరువాత కూడా రాలేదు. -
వెంటాడిన మృత్యువు
జంగారెడ్డిగూడెం రూరల్ :కొద్దిరోజుల్లో ఈ లోకాన్ని చూడాల్సిన ఓ చిన్నారి తన తల్లితో పాటు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. వీరి పాలిట ఓ లారీ వీరి జీవితాల్లో మృత్యువుగా కబళించింది. బంధువులు వచ్చారని మంచి కూరలు వండి పెడదామనుకుని మార్కెట్ వెళ్లే ప్రయత్నంలో రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు విడిచింది ఆ గర్భిణి. వివరాలు ఇలా ఉన్నాయి. జంగారెడ్డిగూడెం మండలం వేగవరం పెట్రోల్ బంక్ సమీపంలో మోటారు సైకిల్‌ను వెనుక నుంచి లారీ ఢీకొట్టిన ఘటనలో 9 నెలల నిండు గర్భిణి మృతి చెందింది. విశాఖ జిల్లా మూలపేట మండలం గడ్డిబంద గ్రామానికి చెందిన చీదర గణేష్, రాధ దంపతులు మండలంలోని వేగవరంలో మాదాసు శ్రీనుకు చెందిన కోళ్లఫారంలో మకాం పనులకు చేరారు. సంవత్సర కాలంగా వీరు ఇక్కడే నివసిస్తూ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరి ఇంటికి బంధువులు రావడంలో మార్కెట్‌కు వెళ్లి కూరగాయలు తెద్దామని గణేష్ బయలు దేరే క్రమంలో తాను కూడా వస్తానంటూ రాధ మోటారు సైకిల్ ఎక్కింది. వీరు ప్రయాణిస్తున్న మోటారుసైకిల్‌ను పెట్రోల్ బంక్ సమీపంలో పామాయిల్ గెలలు తరలించే లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. లారీ రాధ (27) తలపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. గణేష్ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. రాధ 9 నెలలు గర్భిణి కావడంతో కొన్నిరోజుల్లో ఆ చిన్నారి ఈ లోకాన్ని చూడాల్సి ఉంది. ఈ ప్రమాదంతో రెండు ప్రాణాలు పోవడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. రాధ మృతదేహాన్ని జంగారెడ్డిగూడెం ప్రభుత్వాస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం చేసి మృతి చెందిన మగబిడ్డను బయటకు తీశారు. మృతురాలికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. జంగారెడ్డిగూడెం ఎస్సై డీజె విష్ణువర్ధన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆగని అడవితల్లుల మృత్యుఘోష
రాజవొమ్మంగి (రంపచోడవరం): రాజవొమ్మంగి మండలం చినరెల్లంగిపాడు గ్రామానికి చెందిన గూడెపు నాగమణి(23) బాలింత తన మూడు నెలల ఆడబిడ్డను అనాథను చేస్తూ గురువారం రాత్రి కాకినాడ జీజీహెచ్‌లో కన్నుమూసింది. కుటుంబసభ్యులు ఆమె మృతదేహాన్ని శుక్రవారం సాయంకాలం స్వగ్రామానికి తరలించారు. ఈనెల 13వ తేదీ మొదలు ఇప్పటి వరకు ఇరువురు శిశువులు మృతి చెందగా, ఒక బాలింత మరణించిన సంగతి తెలిసిందే. నాగమణి మరణంతో ఈ సంఖ్య నాలుగుకి చేరింది. రెండో కాన్పులో ఆడబిడ్డకు జన్మనిచ్చిన నాగమణి అప్పటి నుంచి తీవ్ర రక్తహీనతతో బాధపడుతోంది. అయితే తీవ్ర అనారోగ్యానికి గురైన ఆమె కుటుంబ సభ్యుల సహాయంతో బుధవారం రాజవొమ్మంగి పీహెచ్‌సీకి చికిత్స కోసం వచ్చింది. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్య సిబ్బంది ఆమెను అదే రోజు కాకినాడ జీజీహెచ్‌కు రిఫర్ చేశారు. కాగా నాగమణి పరిస్థితి విషమించి చికిత్స పొందుతూ చివరికి మరణించింది. నాగమణికి మొదటి కాన్పులోనూ ఆడబిడ్డే జన్మించింది. ఇద్దరు ఆడపిల్లలు నాగమణి మృతితో దిక్కులేనివారయ్యారని భర్త కన్నీరుమున్నీరయ్యాడు. -
అబ్రకదబ్ర
మాకు అంగ న్ వాడీ సెంటరు లేదని గత జన్మభూమి గ్రామసభలో సమస్యను నివేదించాం. దీంతో మాపై అధికారులు అక్రమ కేసులు పెట్టారు. ఎంపీడీఓ నియంతలా వ్యవహరిస్తున్నారు. ‘మీ ప్రాంతంలో మూడు అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి.. వెళ్లి వెతుక్కోండి’ అంటూ దూషణలకు దిగారు. ఐసీడీఎస్ అధికారులు మా తారకరామానగర్ వైపు రావడమే లేదు. దీంతో విధిలేని పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి పోరాటానికి పూనుకున్నాం. – సత్యశ్రీ, వార్డు సభ్యురాలు, తారకరామానగర్ రేణిగుంట: మండలంలోని కరకంబాడి పంచాయతీ తారకరామానగర్ 20 వేల జనాభాతో చిన్నపాటి పట్టణాన్ని తలపించేలా ఉంటుంది.. సుమారు ఐదు వేల ఇళ్లు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడంతా రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేద కూలీలే అధికం. అయితే, కాలనీ ఏర్పడి 15 ఏళ్లు గడుస్తున్నా ఒక్క అంగన్వాడీ కేంద్రం కూడా ఇక్కడ లేకపోవడంతో నిరుపేద కుటుంబాల్లోని చిన్నపిల్లల సంరక్షణ ఇబ్బందికరంగా పరిణమించింది. స్థానికులు ఎన్నోసార్లు ఐసీడీఎస్, ఇతర అధికారులకు తమ గోడు నివేదించినా ఫలితం శూన్యం. విసిగి వేసారిన స్థానికులు పోరుబాట పట్టారు. అంగన్వాడీ కేంద్రాన్ని వెతికిపెట్టాలని పోలీసులకు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది. వాస్తవానికి తారకరామానగర్‌లో వందల సంఖ్యలో చిన్నారులు ఉన్నారు. పదుల సంఖ్యలో బాలింతలు, గర్భిణులు ఉన్నారు. వీరికి ప్రభుత్వ పౌష్టికాహారం అందడం లేదు. స్థానికులు పలు పర్యాయాలు సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇక్కడ అంగన్వాడీ కేంద్రాలను పర్యవేక్షించే వారే లేరు. పేరుకు ఇద్దరు సూపర్వైజర్లు ఉన్నా వారిలో ఒకరు అంగన్వాడీ కార్యకర్తగా కొనసాగుతూ అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మరొకరు చంద్రగిరి ప్రాజెక్టు కార్యాలయానికే పరిమితమయ్యారు. ఫలితంగా అంగన్వాడీ కేంద్రం విషయమై జన్మభూమి గ్రామసభల్లో స్థానికులు నిలదీసినా వారి గోడు వినేవారు కరువయ్యారు. మరోవైపు, ‘మీకు మూడు అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి.. అవి ఎక్కడున్నాయో వెళ్లి వెతుక్కోండి’ అని ఎంపీడీఓ సుధాకర్‌రావు సెలవివ్వడం ప్రస్తుతం వివాదాస్పదమైంది. దీంతో స్థానికులు అంగన్వాడీ కేంద్రాలను వెతికిపెట్టాలని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం గమనార్హం! -
బాలింత దారుణహత్య
కోనేటినాయునిపాళ్యం (కేఎన్ పాళ్యం)లో దారుణం జరిగింది. మంగళవారం తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్లిన బాలింత హత్యకు గురైంది. దుండగుడు గొడ్డలితో నరికి చంపిన ఆనవాళ్లు ఉన్నాయి. ఈ ఘటనతో గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కనగానపల్లి: కేఎన్ పాళ్యం గ్రామానికి చెందిన బోయ తిప్పన్న, అంజినమ్మ దంపతుల కుమార్తె భారతి (23)కి రెండేళ్ల కిందట ఇదే గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ లక్ష్మన్నతో వివాహమైంది. వీరికి ఆరు నెలల కుమారుడు ఉన్నాడు. బాలింత అయిన భారతి మంగళవారం తెల్లవారుజామున బహిర్భూమి కోసం సమీపంలోని ముళ్లపొదల వద్దకు వెళ్లింది. అప్పటికే అక్కడ కాపు కాచిన దుండుగుడు ఒక్కసారిగా ఆమెపైకి దూకాడు. అత్యాచారం చేయడానికి ప్రయత్నించగా ఆమె తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో అప్పటికే సిద్ధంగా ఉంచుకున్న గొడ్డలితో భారతిని విచక్షణారహితంగా నరికి చంపాడు. కాసేపటి తర్వాత హత్య విషయం బయటపడింది. రక్తపుమడుగులో పడి ఉన్న భారతిని చూసి కుటుంబ సభ్యులు బోరున విలపించారు. హత్యాస్థలిని పరిశీలించిన డీఎస్పీ బాలింత హత్యకు గురైనట్లు సమాచారం అందుకున్న ధర్మవరం డీఎస్పీ రామవర్మ, రామగిరి సీఐ యుగంధర్ వెంటనే కేఎన్ పాళ్యం గ్రామానికి చేరుకుని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహం పక్కనే రక్తపు మరకలున్న గొడ్డలి, పురుషుడి చెప్పులు పడి ఉన్నాయి. జాగిలాన్ని రప్పించి హత్యాస్థలిని క్షుణ్ణంగా పరిశీలింపజేశారు. జాగిలాలు నేరుగా గ్రామంలోని అంజి అనే యువకుడి ఇంటివద్దకు వెళ్లి ఆగాయి. అయితే ఆ సమయంలో అంజి లేకపోవడంతో అతడి తండ్రి రామప్పతోపాటు కుటుంబ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తిస్థాయిలో విచారణ చేసిన అనంతరం కేసు నమోదు చేస్తామని డీఎస్పీ వెల్లడించారు. గతంలో ఒకసారి అంజి అసభ్యంగా ప్రవర్తించడంతో భారతి తన కుటుంబ సభ్యులకు తెలియజేసింది. వారు అతడిని మందలించారు. అయినా అతడి ప్రవర్తనలో మార్పు రాలేదని తెలుస్తోంది. -
‘మళ్లీ ఆడపిల్ల’ భయంతో గర్భిణి ఆత్మహత్య
తూప్రాన్: ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలున్న ఆ తల్లి, మళ్లీ ఆడపిల్ల పుడుతుందనే భయంతో మనస్తాపంతో బలవర్మణానికి పాల్పడింది. ఈ సంఘటన ఆదివారం మెదక్ జిల్లా తూప్రాన్ పంచా యతీ పరిధిలోని పాత బాపన్‌పల్లిలో చోటుచేసుకుంది. ఎస్సై నాగార్జునగౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆ గ్రామానికి చెందిన కర్రె శ్రీశైలం యాదవ్, మమత దంపతులకు గతంలో ఇద్దరు ఆడ పిల్లలు జన్మించారు. ప్రస్తుతం ఆమె గర్భం దాల్చింది. తిరిగి ఆడపిల్లే జన్మిస్తుందన్న అనుమానంతో మనస్తాపం చెందిన మమత(25)ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారన్నారు. మృతదేహంను పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వాసుపత్రికి తరలించి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు. -
పురిటి నొప్పులతో అరిస్తే చెంపదెబ్బలు
పాకాలకు చెందిన స్వర్ణ రెండు రోజుల క్రితం పురిటి నొప్పులతో తిరుపతిలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో చేరింది. ఆదివారం నొప్పులు ఎక్కువయ్యాయి. నరకయాతన పడింది. పక్కనే ఉన్న నరుసమ్మ ఎందుకు అరుస్తున్నావ్..అంటూ రెండు చెంపలూ చెళ్లుమనిపించింది. అంతటితో ఆగకుండా పచ్చి బూతుల దండకం అందుకుంది. ఇది ఒక్క స్వర్ణ పరిస్థితే కాదు. ప్రసూతి ఆస్పత్రికి వస్తున్న పలువురు గర్భవతులు ఎదుర్కొంటున్న సమస్య.. తిరుపతి (అలిపిరి): ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో నిర్లక్ష్యం తాండవిస్తోంది. నిరుపేద గర్భవతులకు మెరుగైన వైద్య సేవలందించాల్సిన వైద్యులు, వైద్య సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారు. పురిటి నొప్పులతో బాధపడే మహిళలకు ఛీదరింపులు తప్పడంలేదు. గర్భవతుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ మానవత్వం మంటగలిసేలా ప్రవర్తిస్తున్నారు. పురిటి నొప్పులతో అల్లాడుతున్న మహిళలను ఓదార్చాల్సిన వైద్యసిబ్బంది పచ్చి బూతుల దండ కం అందుకుంటున్నారు. కేకలు పెడితే చెంప చెల్లుమనిపిస్తున్నారు. సభ్యసమాజం నివ్వెరపోయేలా ప్రసూతి ఆస్పత్రిలో వైద్య సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో వైద్య సిబ్బంది వైలెంట్ వైద్యానికి దిగుతున్నారు. రోజుకు 30 నుంచి 50 ప్రసవాలు తిరుపతి ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో పేద గర్భిణుల సంఖ్య పెరగడంతో 300 పడకలకు పెంచి సేవలందిస్తున్నారు. రోజుకు 30 నుంచి 50 ప్రసవాలను వైద్యబృందం చేస్తోంది. ఆస్పత్రిలో కాన్పునకు ముందు పేద గర్భిణులకు నరకం చూపిస్తున్నారు. యాంటినెటల్ వార్డులో పురిటి నొప్పులు ప్రారంభమైన మహిళలను ఉంచి వైద్యం చేస్తుంటారు. ఈ వార్డులో చేరే మహిళల పట్ల వైద్య సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. రాత్రయితే ప్రవేశం లేదు యాంటినెటల్ వార్డులో సేవలు పొందుతున్న గర్భిణులకు పుట్టెడు కష్టాలు తప్పడం లేదు. రాత్రయితే సహాయకులను బయటకు పంపేస్తున్నారు. గర్భవతులకు వైద్య సేవలందుతున్నాయా లేవా..? అన్న విషయాలు బంధువులకు చేరవేయడం లేదు. కాన్పు అయిన తర్వాత బంధువులకు తెలియజేస్తున్నారు. పురిటి నొప్పుల సమయంలో తనను కొట్టారు.. తిట్టారు అని బాలింత చెబితే తప్ప వారి బంధువులకు తెలిసే అవకాశం లేదు. రాయలసీమ ప్రాంత ప్రభుత్వ కాన్పుల ఆస్పత్రిలో వైద్యం అందుతున్న తీరు ఇది. పోస్ట్‌నెటల్ వార్డులో మరీ దారుణం కాన్పు అనంతరం బాలింతలను పోస్ట్‌నెటల్ వార్డులోకి తరలిస్తారు. అక్కడ బాలింతలు అవస్థలు పడక తప్పడం లేదు. పడకల సంఖ్య తక్కువగా ఉండడంతో ఒకే పడకపై ఇద్దరు బాలింతలు వైద్యసేవలు పొందాల్సివస్తోంది. ఎవరైనా ప్రశ్ని స్తే వారికి వైద్యం అందించడానికి నిరాకరిస్తున్నారు. బాలింతలకు మౌలికసదుపాయాలు కల్పించడంలోనూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. సిజేరియన్‌కు రూ.500 ప్రసూతి ఆస్పత్రిలో సాధారణ ప్రసవం సాధ్యంకాని పక్షంలో గర్భిణులకు సిజేరియన్లు చేసి శిశువును వెలికి తీస్తారు. ఇదే అదునుగా చేసుకుని కింది స్థాయి సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు. సిజేరియన్ అయిన మహిళ బంధువుల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు రూ.500 నుంచి రూ.1000 డిమాండ్ చేస్తున్నారు. గర్భిణుల బంధువులు చేసేది లేక వారి దగ్గర ఉన్న నగదులో ఎంతో కొంత ఇవ్వడం మామూలైపోయింది. సిబ్బంది చేతివాటంపై పలుమార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందినా ఫలితం లేకుండా పోయింది. గర్భవతి మృతి ప్రసూతి ఆస్పత్రి ఆపరేషన్ థియేటర్లో రాజంపేటకు చెందిన మణి (35) అనే గర్భవతి మృతి చెందింది. సోమవారం తెల్లవారుజామున 5.30 గంటలకు ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లిన గర్భవతి హఠాత్తుగా మృతి చెందింది. ఉమ్మనీరు రక్తనాళాలు, శ్వాస అవయావాలకు చేరడం వల్ల ఆమె మృతి చెందిందని ప్రసూతి ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ భవాని వెల్ల్లడిం చారు. నాలుగో కాన్పు కావడంతో పాటు మహిళ వయస్సు 35 సంవత్సరాలు దాటడడం కూడా మృతికి కారణమని చెప్పారు. బంధువులు మాత్రం వైద్యుల నిర్లక్ష్యం వల్లే్ల మృతి చెందిందని ఆరోపించారు. మెరుగైన వైద్య సేవలు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో గర్భుణులకు మెరుగైన వైద్య సేవలందిస్తున్నాం. వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంలేదు. కాన్పు సమయంలో మహిళ ఆరోగ్యం క్షీణిస్తే తప్ప మృతి చెందదు. మణి అనే గర్భిణి ఉమ్మనీరు రక్తనాళాలు, శ్వాస అవయవాల్లోకి వెళ్లడం వల్లే మృతి చెందింది. ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం లేదు.– డాక్టర్ విద్యావతి, ఆర్ఎంఓ,ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి, తిరుపతి -
డయేరియా మరణాలపై రాజకీయమా?
ఆమె ఏడు నెలల గర్భిణి.. కడపులో బిడ్డ కాళ్లతో తన్నుతున్నాడంటూ భర్తకు చెప్పి మురిసిపోయేది.. ఇప్పటికే బాబు ఉన్నందున పాప పుట్టాలని ఆ దంపతులు ఇద్దరూ కలలుకనేవారు. ఆ కలలను డయేరియా మహమ్మారి కల్లలు చేస్తూ భర్త ప్రాణాలను బలితీసుకుంది. ఆ గర్భిణికి తీరని కష్టాన్ని మిగిల్చింది. తండ్రి చనిపోయిన విషయం తెలియని మూడేళ్ల కుమారుడు అమ్మా.. నాన్న ఎప్పుడు నిద్రలేస్తాడంటూ వచ్చీ్చరాని మాట లతో పదే పదే ప్రశ్నిస్తుంటే ఏమని సమాధానం చెప్పాలో తెలియక గుండెలుఅవిసేలా రోదిస్తోంది. గుంటూరు ఈస్ట్: నగరంలోని ఆర్‌అగ్రహారం నిమ్మలపేటకు చెందిన పల్లపు రత్తయ్య (38) తోపుడు బండ్లపై పండ్లు అమ్ముకుని జీవనం సాగిస్తుంటాడు. రత్తయ్య గురువారం వాంతులు, విరేచనాలతో బాధపడుతుండటంతో కుటుంబ సభ్యులు జీజీహెచ్‌కు తరలించారు. చికిత్స పొందుతుండగానే పరిస్థితి విషమించడంతో శుక్రవారం మృతిచెందాడు. రత్తయ్య భార్య లక్ష్మి ఏడు నెలల గర్భిణి. ఆ దంపతులకు మూడేళ్ల కుమారుడు బాలాజీ ఉన్నాడు. రత్తయ్యకు సరైన వైద్యం చేయని కారణంగానే మృతి చెందాడని బంధువులు ఆరోపించారు. డయేరియాకు గురడవానికి ముందు వరకు రత్తయ్య ఆరోగ్యంగా ఉన్నాడని కుటుంబ సభ్యులు చెప్పారు. పండ్లు విక్రయించి వచ్చే రోజువారీ సంపాదనతోనే కుటుంబాన్నిపోషించే రత్తయ్య మృతితో భార్య లక్ష్మి భవిష్యత్తు అంధకారంలో పడింది. తండ్రి చనిపోయిన విషయం తెలియని కుమారుడు అమాయకంగా నాన్న ఎప్పుడు నిద్రలేస్తాడు అంటూ అడగడంతో ఏ సమాధానం చెప్పాలో లక్ష్మి పొగిలిపొగిలి ఏడుస్తోంది. లక్ష్మి విలపిస్తున్న తీరుతో కడుపులో బిడ్డకు ఏమవుతుందోనని బంధువులు ఆందోళన చెందుతున్నారు. రత్తయ్య మృతితో తమకు దిక్కెవరంటూ అతని తల్లి తిరుపతమ్మ కన్నీరుమున్నీరైంది. ఆనందపేట 8వ లైన్‌కు చెందిన పఠాన్ ఫాతిమూన్ (67) డయేరియాతో గురువారం అర్ధరాత్రి మృతి చెందారు. ఆమెకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. -
మాతృవేదన.. శిశు రోదన
పురిటి నొప్పులు పంటి బిగువున దిగమింగుకుని పుట్టిన శిశువును తనివితీరా ముద్దాడాలన్నదే మాతృమూర్తి ఆకాంక్ష. అయితే జిల్లాలో గర్భిణులకు ఆ కోరిక తీరడం లేదు. ఎంసీహెచ్ కార్డుల లేమి.. అందని నిధులు, వైద్యం, పౌష్టికాహారం వెరసి తల్లీబిడ్డలకు సంరక్షణ కరువైంది. ఫలితం మాతృవేదన.. శిశు రోదన తప్పడం లేదు. సాక్షి, తిరుపతి: తల్లీబిడ్డలకు సంరక్షణ కరువైంది. గ్రామీణ ప్రాంతాల్లోని మా తా శిశుసంరక్షణ కోసం కేటాయించే నిధులు వారికి అందడం లేదు. దీంతో గర్భి ణులు, బాలింతలు ఇక్కట్లు పడుతున్నా రు. జిల్లాలో ప్రతి వెయ్యి మంది కి ఒకరు గర్భిణులు ఉన్నారు. వీరికి ప్రభుత్వం ఎంసీహెచ్ కార్డు సరఫరా చేయకపోవడంతో గర్భిణులకు అందా ల్సిన నిధులు, పౌష్టికాహారం ఆగిపోయింది. జిల్లాలో 102 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 644 ఉప కేంద్రాలున్నాయి. కార్పొరేషన్, మున్సిపాలిటీ పరిధిలో మరో 10 కేంద్రాలున్నాయి. ప్రతి ఉపకేంద్రం పరిధిలో 10 నుంచి 15 మంది వరకు గర్భిణులు ఉన్నారు. ఈ లెక్కన జిల్లా వ్యాప్తంగా సుమారు 6,540 మందికిపైగా గర్భిణులు ఉన్నారు. తప్పని తిప్పలు గ్రామాల్లోని గర్భిణులను గుర్తించిన అనంతరం వారికి మాతా శిశు సంరక్షణ (ఎంసీహెచ్) కార్డులు తప్పనిసరిగా ఇవ్వాలి. ఈ కార్డును పరీక్షల కోసం ఆస్పత్రికి వెళ్లిన సమయంలో చూపిం చాల్సి ఉంది. అయితే జిల్లాలో ఏడాదిగా ఎంసీహెచ్ కార్డుల పంపిణీ చేయటం లేదు. ఈ విషయమై ఏఎన్ఎంలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం కనిపించటం లేదు. ఆస్పత్రికి వచ్చే గర్భిణులకు ఆన్లైన్లో ఉన్న ఎంసీహెచ్ కార్డులను జిరాక్స్ చేసి, వారి పేరు నమోదు చేసి ఇవ్వమని ఉచిత సలహా ఇస్తున్నారు. అందని వందనం పథకం నిధులు గ్రామీణ ప్రాంతాల్లోని గర్బిణుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి వందనం పథకం ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా ప్రతి ఒక్కరికి రూ.6 వేలు డిపాజిట్ చేస్తుంది. అయితే జిల్లాలో ఎంసీహెచ్ కార్డుల కొరత ఉండడంతో ప్రధానమంత్రి వందన పథకం ద్వారా మంజూరయ్యే నిధులు గర్భిణులకు అందడం లేదని పీహెచ్సీ వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే కార్డులు లేక అంగన్వాడీ కేంద్రాల నుంచి పౌష్టికాహారం కూడా తీసుకోలేని పరిస్థితి నెలకొంది. అభివృద్ధి నిధులు వెనక్కేనా? జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్వహణకు ప్రభుత్వం కేటాయించిన నిధులను అధికారులు ఖర్చు చేయలేదు. 2017–18 ఆర్థిక సంవత్సరానికి గాను జిల్లాకు రూ.5.46 కోట్లు మంజూరు చేశారు. ఇందులో కేవలం రూ.46 లక్షలు మాత్రమే ఖర్చు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. మిగిలిన రూ.5 కోట్లు ఈనెల 31లోపు ఖర్చుచేయకపోతే వెనక్కి వెళ్లే అవకాశం ఉందని ఖజనా శాఖ అధికారులు హెచ్చరించారు. ఆగని మాతా శిశు మరణాలు మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం వరకు అన్ని వివరాలను ఎంసీహెచ్ కార్డులో నమోదు చేయాల్సి ఉంది. ఈ కార్డులు లేకపోవడంతో గర్భిణులు, బాలింతలకు ప్రధానమంత్రి మాతృత్వ వందనం పథకం నిధులు అందడం లేదు. అలాగే వారు పౌష్టికాహారం తీసుకోలేని పరిస్థితి నెలకొంది. తల్లీబిడ్డలకు వైద్యం కరువైంది. ఫలితంగా మాతా శిశుమరణాలు ఆగడం లేదు. -
ఆమె గర్భిణి కాదు
టీ.నగర్: ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ దాడిలో మృతి చెందిన ఉష గర్భిణి కాదని పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. తంజావూరు జిల్లా పాపనాశం ప్రాంతానికి చెందిన రాజా (33) అతని భార్య ఉష (33). ఈ నెల 7వ తేదీ రాత్రి బైకులో వెళుతుండగా వాహన తనిఖీలు జరుపుతున్న ఇన్స్పెక్టర్ కామరాజ్ దాడి చేయడంతో ఉష మృతి చెందిన విషయం తెలిసిందే. ఉష మూడు నెలల గర్భిణిగా ప్రచారం జరిగింది. ప్రస్తుతం పోస్టుమార్టం నివేదికలో ఉష గర్భిణి కాదని వైద్యులు తేల్చారు. ఈ కేసు విచారణ జరుపుతున్న క్రైం బ్రాంచ్ డీఎస్పీ పుహళేంది, ఉష పోస్టుమార్టం నివేదికలోని వివరాలను సోమవారం వెల్లడించారు. -
అలా ఆలోచన...
‘ఆధునిక జీవనంలో మహిళలు అమ్మతనాన్నిఆస్వాదించలేకపోతున్నారు. మానసిక ఒత్తిడితో మాతృత్వపు ఆనందాన్ని కోల్పోతున్నారు. అలాంటి వారికోసమే మా ‘ది న్యూ మామ్జ్ హబ్’’ అని చెప్పారు డాక్టర్ హాసిని యాదవ్. నవతరం తల్లులకు అండగా నిలుస్తూ... చిన్నారుల పోషణలోసలహాలు, సూచనలు అందజేస్తోంది. ఈ సంస్థ ఆధ్వర్యంలో కేర్‌టేకింగ్, పేరెంటింగ్ నేర్పిస్తోంది. బాలానగర్: డాక్టర్ హాసిని డెంటల్ డాక్టర్. హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగింది. విద్యాభ్యాసమంతా ఇక్కడే కొనసాగింది. వివాహానంతరం భర్తతో కలిసి న్యూజిలాండ్ వెళ్లి బిజినెస్ అండ్ హాస్పిటలైజేషన్ కోర్సు పూర్తి చేసి ఉద్యోగం చేశారు. తాను తల్లి అవుతున్న విషయం తెలియడంతో ఓవైపు సంతోషం... మరోవైపు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియని ఆందోళన. యూట్యూబ్, వెబ్సైట్లలో చూసి జాగ్రత్తలు తెలుసుకుంది. అలా ఆలోచన... హాసినికి నెలలు నిండగానే ఆమె తల్లి ఇండియా నుంచి న్యూజిలాండ్‌కు వెళ్లింది. బాబు పుట్టిన కొద్ది కాలానికి హాసిని అమ్మమ్మ చనిపోవడంతో తల్లి ఇండియాకు వచ్చేశారు. దీంతో బాబును ఎలా పెంచాలి? పాలు ఇచ్చేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రాత్రి సమయంలో బాబు ఏడిస్తే ఏం చేయాలి? బాబుకు ఏం తినిపించాలి? తాను ఏం తీసుకోవాలి? ఇలా చాలా సమస్యలు హాసినికి ఎదురయ్యాయి. ఓ రోజు అర్ధరాత్రి బాబు బాగా ఏడ్చాడు. ఆమెకు ఎందుకో అర్థం కాలేదు. ఆకలి వేసి ఏడుస్తున్నాడా? లేదా ఏమైనా ఇబ్బందా? తెలియదు. ఇరుగుపొరుగు సహకారంతో ‘మామ్స్ హబ్’ ఉంటుందని తెలుసుకొని అక్కడ శిక్షణ తీసుకుంది. రెండో బాబు పుట్టిన తర్వాత హాసిని కుటుంబం ఇండియాకు తిరిగొచ్చింది. ఇక్కడ కొంతకాలం ఉద్యోగం చేసిన హాసినికి తనలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న తల్లుల కోసం ఏదైనా చేయాలని ఉండేది. దీంతో ఉద్యోగానికి రాజీనామా చేసి ‘ది న్యూ మామ్జ్ హబ్’ను స్థాపించారు. ‘మాతృ సఖి’ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల్లో తల్లులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఇదేంచేస్తుంది? సుమారు 6నెలలు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన హాసిని గైనకాలజిస్టులు, సైకాలజిస్టులు, పిల్లల డాక్టర్లను కలిసి ‘ది న్యూ మామ్జ్ హబ్’ స్థాపించారు. బాలింతలకు కౌన్సెలింగ్ ఇవ్వడంతో పాటు చిన్నారుల పోషణలో శిక్షణనిస్తోంది. 2017 జనవరిలో ఈ సంస్థ సేవలు ప్రారంభమయ్యాయి. ప్రతివారం ఒక సెషన్ ఉంటుంది. వారానికి ఒక అంశంపై నవతరం తల్లులందరితో మాట్లాడుతుంది. మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు యోగాసనాలు, శారీరక శ్రమ తగ్గటానికి ఎక్సర్సైజులు చేయిస్తారు. ఇప్పటి వరకు సుమారు 100 మందికి శిక్షణనిచ్చింది. బాబుకు జన్మనిచ్చిన తర్వాత ఒంట్లో ఓపిక లేకపోవడం, ఒత్తిడి ఎక్కువగా ఉండడం తదితర కారణాలతో చాలామంది నిరాశగా ఉంటారు. మాతృత్వపు మధురానుభూతులు ఆస్వాదించలేరు. అలాంటి వారికి సలహాలు, సూచనలు అందజేస్తూ సాంత్వన చేకూర్చుతోందీ హబ్. దీనికి వీరేం చార్జి వసూల్ చేయడం లేదు. ఎవరైనా ఇస్తే మాత్రమే తీసుకుంటున్నారు. మరిన్ని వివరాలకు www.thenewmumzhub.చూడొచ్చు. స్పష్టత వచ్చింది.. పిల్లల విషయంలో ఒత్తిడిని అధిగమించడం ఎలా? అనే అంశంపై నేను డాక్టర్ హాసిని యాదవ్‌ను సంప్రదించాను. ఆమె ఇచ్చిన సలహాలు, సూచనలతో ముందుకెళ్తున్నాను. ఉద్చ్యోగాన్ని బ్యాలెన్సింగ్ చేయడం ఎలా? అని ఇంతకముందు భయపడేదాన్ని. ఇప్పుడా కంగారు లేదు. చాలా విషయాలపై స్పష్టత వచ్చింది. ఇప్పుడు నా కూతురితో ఆనందంగా గడుపుతున్నాను. – లావణ్య, డిజైనర్ ఆత్మస్థైర్యం పెరిగింది... మాది వరంగల్ జిల్లా. ఉద్యోగరీత్యా బాలానగర్‌లో ఉంటున్నాం. మేము ఇద్దరం ఉద్యోగులమే. మా అమ్మాయి పుట్టిన నెల రోజుల వరకే నాకు సెలవులు ఉన్నాయి. తర్వాత ఆఫీస్‌కు వెళ్లాల్సిన పరిస్థితి. మా అమ్మానాన్న వ్యవసాయం చేస్తారు. ఇక్కడికి వచ్చి మాతో ఉండే పరిస్థితి లేకపోవడంతో.. మా అమ్మాయికి ఎలాంటి ఆహారం అందించాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తదితర అవగాహన లేదు. ‘ది న్యూ మామ్జ్ హబ్’కి వెళ్లాక నాలో ఆత్మస్థైర్యం పెరిగింది. ఇప్పుడన్నీ తెలుసుకున్నాను. – సుమశ్రీ, బాలానగర్ -
నమోదు నామమాత్రమే
గర్భిణుల కోసం ప్రవేశపెట్టిన బృహత్తర పథకం ప్రధాన మంత్రి మాతృత్వ వందన యోజన. ఈ పథకం కింద ప్రతి మహిళ మొదటి కాన్పుకు రూ.6వేలు ఇస్తారు. అయితే, వివిధ కారణాలతో గర్భిణుల నమోదు జిల్లాలో నామమాత్రంగా జరుగుతోంది. దీనికితోడు పీఎంఎంవీవై పథకం గురించి చాలా మంది మెడికల్ ఆఫీసర్లకే సరైన అవగాహన లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కర్నూలు(హాస్పిటల్): ఏడాది క్రితం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి మాతృత్వ వందన యోజన (పీఎంఎంవీవై) పథకం కర్నూలు జిల్లాలో రెండు నెలల నుంచి అమలవుతోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరీక్ష చేయించుకున్న వారికి మాత్రమే ఈ పథకాన్ని వర్తింపజేస్తారు. అది కూడా మొదటి కాన్పుకు మాత్రమే. మహిళ గర్భం దాల్చాక ప్రభుత్వ ఆసుపత్రికి పరీక్షకు వెళ్లిన మొదటిసారి రూ. 1000 ఇస్తారు. ఆ తర్వాత ఆరు నెలలకు పరీక్షకు వెళ్లిన సమయంలో మరో రూ.2వేలు ఇస్తారు. ప్రసవం అయ్యాక రూ.1000 శిశువుకు 6, 10, 14వారాల వ్యాక్సిన్ పూర్తయిన తర్వాత మిగిలిన రూ.2వేలు అందజేస్తారు. గర్భిణికి పోషకాహారం అందించి మాతాశిశు మరణాలు తగ్గించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ మొత్తాన్ని అందజేస్తోంది. రిజిస్ట్రేషన్‌కు ఇబ్బందులు జిల్లాలో గత నెల వరకు ఈ పథకం కింద 17శాతం మంది గర్భిణులు మాత్రమే నమోదు అయ్యారు. డీఎంహెచ్ఓ డాక్టర్ జేవీవీఆర్‌కే ప్రసాద్ ఒత్తిడి పెంచాక ఆ మొత్తం 30 శాతం దాటింది. పరీక్ష నిమిత్తం ఆసుపత్రికే వచ్చే గర్భిణులు ఆధార్‌కార్డు, బ్యాంకు అకౌంట్ల వివరాలను తీసుకురాకపోవడం, తెచ్చినా అందులో తప్పులు ఉండటం, ఆధార్‌కు, బ్యాంకు ఖాతాకు లింక్ కాకపోవడం వంటి సమస్యలు అధికంగా ఉత్పన్నమ వుతున్నాయి. దీనికితోడు ఇప్పటి వరకు ఈ పథకం ఒకటుందని చాలా మంది మెడికల్ ఆఫీసర్లకే అవగాహన లేకపోవడం.. సర్వర్ సమస్య వేధిస్తున్నాయి. దీంతో రోజుకు ఒక్కో పీహెచ్‌సీల్లో నలుగురు గర్భిణుల వివరాలు మించి నమోదు చేయలేకపోతున్నారు. నమోదు బాధ్యతను ఆయా ప్రభుత్వ ఆసుపత్రుల్లోని మెడికల్ ఆఫీసర్‌తో పాటు కంప్యూటర్ ఆపరేటింగ్ వచ్చిన ఎవ్వరైనా నమోదుచేయవచ్చు. కానీ చాలా చోట్ల వీటి నమోదు నామమాత్రంగా సాగుతుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదీ ఉద్యోగుల ఆవేదన ‘అయ్యా డీపీఎంఓ ఆఫ్ డీపీఎంయూ(ఎన్‌ఆర్‌హెచ్ సెక్షన్) గారూ.. పీఎంఎంవీవై అప్లికేషన్స్ అప్లోడింగ్ విషయంలో మీరు హైరానా పడిపోతూ పీహెచ్‌సీలను కంగారు పెట్టిస్తున్నారు. సీఎఫ్‌డబ్ల్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ, పీఎం సమీక్ష ఉందంటూ ఏడాదికి సంబంధించిన మొత్త్తం లబ్ధిదారుల వివరాలన్నీ ఒక్కసారిగా అప్లోడ్ అయిపోవాలంటే పనవ్వదు. డీఈఓలు పొద్దున్నుంచి సాయంత్రం వరకు కంప్యూటర్ల ముందు కూర్చున్నా సర్వర్ సమస్యతో నాలుగైదు దరఖాస్తులకు మించి అప్లోడ్ కావడం లేదు. మిమ్మలను ఎవరైతే కంగారు పెడుతున్నారో ముందు సర్వర్ కెపాసిటీ పెంచాలని చెప్పండి. ఈ సమస్య పరిష్కరించకుండా మాపై ఒత్తిడి పెంచడం న్యాయమా’..? అని ఉద్యోగులు అడుగుతున్నారు. ఈ మొర వాట్సాప్ గ్రూపుల్లో సైతం చక్కర్లు కొడుతోంది. గర్భిణుల రిజిస్ట్రేషన్ పెరిగింది ఆధార్, బ్యాంకు ఖాతాల్లో సమస్యలు ఉండటంతో ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ సమస్య ఏర్పడింది. వారం రోజుల నుంచి రిజిస్ట్రేషన్‌ను వేగంగా చేస్తున్నాము. వారం క్రితం 17 శాతం ఉన్న రిజిస్ట్రేషన్ శాతం ఇటీవల బాగా పెరుగుతోంది. మొత్తం గర్భిణులకు రూ.18,93,000 లను పంపిణీ చేశాము. –డాక్టర్ జేవీవీఆర్‌కె ప్రసాద్, డీఎంహెచ్ఓ -
పురిటిలోనే పసికందు మృతి
చీపురుపల్లి: ప్రసవం కోసం వస్తే పట్టించుకోలేదు....ఆస్పత్రిలో చేరితే కనీసం వైద్య పరీక్షలు చేయలేదు...ప్రసూతి వార్డు వైపు సిబ్బంది కన్నెత్తి చూడలేదు....సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా నిండు నూరేళ్లు బతకాల్సిన తమ బిడ్డ పురిటిలోనే లోకాన్ని విడచివెళ్లిపోయాడని కొత్తపేట గ్రామానికి చెందిన బాలింత పొదిలాపు స్వాతి, ఆమె భర్త రాంబాబు, తదితరులు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. కొత్తపేట గ్రామానికి చెందిన పొదిలాపు స్వాతికి శుక్రవారం ప్రసవ నొప్పులు రావడంతో పది గంటలు సమయంలో కుటుంబ సభ్యులు ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. స్కానింగ్ గదిలో ఓ వైద్యురాలు పరీక్షలు నిర్వహించి అప్పుడే ప్రసవం రాదని చెప్పి అంతవరకు ఆస్పత్రిలో చేరాలని సూచించారు. దీంతో వారు గర్భిణిని ప్రసూతి వార్డులో చేర్పించారు. ఆ తర్వాత గర్భిణిని ఎవ్వరూ పట్టించుకోలే దు. మధ్యాహ్న సమయంలో స్వాతి బాత్రూమ్కు వెళ్లగా అక్కడ ప్రసవ నొప్పులు ప్రారంభమయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు పెద్దగా కేకలు వేయడంతో దిగువస్థాయి సిబ్బంది వచ్చి ఆమెను బెడ్‌పై వేశారు. అప్పటికే ఆమె మగబిడ్డను ప్రసవించింది. అప్పటికీ వైద్యులు హాజరవ్వకపోవడంతో కాసేపట్లో బిడ్డ మృతి చెందింది. వైద్యులు పట్టించుకోకపోవడంతోనే తమ బిడ్డ చనిపోయినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇక్కడ చూడమని చెబితే ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లిపోయేవారమని, కేవలం సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ చనిపోయాడని చెబుతూ కన్నీటిపర్యంతమయ్యారు. -
‘కిట్టు’ హిట్టు
తెలంగాణ ప్రభుత్వం గర్భిణుల కోసం ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్టు పథకం సూపర్ హిట్టైంది. ఈ పథకం అమలు తర్వాత ప్రసవాల కోసం ప్రభుత్వ ఆస్పత్రుల్లోకి గర్భిణులు క్యూ కడుతున్నారు. దీంతో పాటు ప్రసవానంతరం పిల్లలను సంరక్షించేందుకు సైతం ఆర్థికసాయం అందజేస్తున్నారు. దీంతో పీహెచ్‌సీల్లోనూ ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీంతో పాటు వివిధ వైద్య పరీక్షల నిమిత్తం దవాఖానాలకు వచ్చే రోగులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కేసీఆర్ కిట్ల పంపిణీ, మౌలిక సదుపాయాల తీరుతెన్నులపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్.. సాక్షి, మెదక్: కేసీఆర్ కిట్ల పంపిణీ జిల్లాలో సత్ఫలితాలను ఇస్తోంది. ఈ పథకంతో మాతాశిశు మరణాలకు అడ్డుకట్ట పడింది. సర్కారీ దవాఖానాలపైనా ప్రజల్లో నమ్మకం పెరుగుతోంది. ఈ పథకంతో జిల్లాలో గతంలో కంటే ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగిందని వైద్యులు చెబుతున్నారు. నిరుపేద కుటుంబాలకు చెందిన గర్భిణులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం చేసుకునే సౌలభ్యం కల్పిస్తున్నారు. ప్రసవ అనంతరం ఆడపిల్ల పుడితే రూ.15 వేలు, మగపిల్లాడు పుడితే రూ.14వేల ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతోంది. పిల్లలు పుట్టిన వెంటనే కేసీఆర్ కిట్లను అందజేస్తున్నారు. రూ.2వేలు విలువ చేసే ఈ కిట్‌లో నవజాత శిశువుకు అవసరమైన వస్తువులుంటాయి. జిల్లాలో ఈ పథకాన్ని జూన్ 2, 2017న ప్రారంభించారు. జిల్లాలో మొత్తం 22 ప్రభుత్వ ఆస్పత్రులున్నాయి. జిల్లా కేంద్రమైన మెదక్‌లో ఏరియా ఆస్పత్రితో పాటు రెండు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లున్నాయి. అలాగే మండలాల్లో 19 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. పెరిగిన ప్రసవాలు ఈ పథకం అమలులోకి రాకముందు ప్రజలు ప్రైవేటు ఆస్పత్రుల్లోనే ప్రసవాలు చేయించేందుకు ఆసక్తి చూపించేవారు. జిల్లా వ్యాప్తంగా 2017 జనవరి నుంచి జూన్ వరకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కేవలం 1,662 ప్రసవాలు మాత్రమే జరిగాయి. ఈ పథకం అమలు తర్వాత ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇప్పటి వరకు 4,296 ప్రసవాలు జరిగాయి. ప్రభుత్వాస్పత్రుల్లో 90 శాతం ప్రసవాలు జరుగుతుంటే కేవలం 10 శాతం మాత్రమే ప్రైవేట్‌లో జరుగుతున్నాయి. ప్రైవేట్‌లో ఒక్కో ప్రసవానికి రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు వసూలు చేస్తున్నారు. అలాగే ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే గర్భిణులకు రెండు సార్లు ఉచితంగా భోజనం పెడుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులు, పీహెచ్సీ కేంద్రాలకు వైద్య పరీక్షలకు వచ్చే రోగులకు సైతం మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. ఈ భోజనం వడ్డించే బాధ్యతను అంగన్వాడీ సిబ్బందికి అప్పగించారు. వేధిస్తున్న సిబ్బంది కొరత.. ఈ పథకం సత్ఫలితాలను ఇస్తున్నప్పటికీ ఆస్పత్రులను సిబ్బంది కొరత వేదిస్తోంది. జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు ఇతర ఆస్పత్రుల్లో 90 ఖాళీలున్నాయి. ఇందులో 40 స్టాఫ్ నర్సులు, 12 వైద్యుల పోస్టులు, 5 ల్యాబ్ టెక్నిషియన్లతో పాటు సెకాలజిస్టులు, ప్రోగ్రాం ఆఫీసర్లు, కౌన్సిల్ మెంబర్లు, జనరల్ ఫిజియోథెరపీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆయా పోస్టులను త్వరగా భర్తీ చేసి మెరుగైన సేవలందించాలని ప్రజలు కోరుతున్నారు. 17 ప్రసవాలు మాత్రమే.. చిన్నశంకరంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవాల సంఖ్య అంతంత మాత్రంగానే ఉంది. ఈ ఆస్పత్రిలో 9 నెలల్లో కేవలం ఏడుగురికి మాత్రమే కేసీఆర్ కిట్స్‌ను అందించారు. ఇక్కడ ఇప్పటి వరకు 17 మందికి మాత్రమే ప్రసవాలు చేశారు. అస్పత్రిలో అన్ని వసతులు ఉన్నప్పటికీ డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో కాన్పు కోసం వచ్చేవారిని మెదక్ ఏరియా అస్పత్రికి పంపించి చేతులు దులుపుకుంటున్నారు. దీంతో ఇక్కడ ప్రసవాల సంఖ్య ఏమాత్రం పెరగడం లేదు. -
అంగన్వాడి.. ‘పోషకం’ ఏదీ?
సాక్షి, మెదక్: అంగన్వాడి కేంద్రాల్లో పిల్లలు, గర్భిణులు, బాలింతలకు సరైన పౌష్టికాహారం అందటం లేదు. చాలాచోట్ల పిల్లలు, గర్భిణులకు మధ్యాహ్న భోజనంలో దొడ్డు బియ్యం, నీళ్లచారునే వడ్డిస్తున్నారు. అంగన్వాడీలకు సన్నబియ్యం సరఫరా చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా.. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎక్కడా సరఫరా అవుతున్న దాఖలాలు లేవు. కొన్నిచోట్ల సన్నబియ్యం పేరుతో సరఫరా చేస్తున్న బియ్యం వండిన తరువాత ముద్దగా మారుతోంది. పలుచోట్ల పాలు సరఫరా కావంలేదు. దీనికితోడు పిల్లలు, బాలింతలు, గర్భిణులకు చిన్నసైజులో ఉన్న కోడిగుడ్డు అందజేస్తున్నారు. మరోవైపు కొన్ని అంగన్వాడీ కేంద్రాల్లో సిబ్బంది సరుకులను పక్కదారి పట్టించి సొమ్ము చేసుకుంటుంటే.. ఇంకొన్ని చోట్ల తక్కువ పరిమాణంలో సరుకులు అందచేసి లెక్కలు మాత్రం సరిగా రాయాలని అధికారులు ఒత్తిడికి గురిచేస్తున్న దాఖ లాలు బయటపడ్డాయి. ‘సాక్షి’ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు అంగన్వాడి కేంద్రాలను సందర్శించినపుడు పలు విషయాలు వెలుగుచూశాయి. లో‘పాల’ కాంట్రాక్టర్లు ఉమ్మడి మెదక్ జిల్లాలో 3,730 అంగన్వాడి కేంద్రాలు ఉన్నాయి. ఆయా కేంద్రాల్లో 1,99,213 మంది పిల్లలు ఉన్నారు. వీరితోపాటు 47,696 మంది గర్భిణులు, బాలింతలు ఉన్నారు. వీరందరికీ అంగన్వాడి కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందజేయాలి. ఆరు నెలల నుంచి మూడేళ్లలోపు పిల్లలకు బాలామృతం, 16 గుడ్లు అందజేస్తున్నారు. 3 నుంచి ఆరేళ్లలోపు పిల్లలకు మధ్యాహ్న భోజనంతోపాటు గుడ్లు అందజేస్తున్నారు. ఆరోగ్యలక్ష్మి పథకంలో భాగంగా బాలింతలు, గర్భి ణులకు మధ్యాహ్న భోజనం వడ్డిస్తున్నారు. అలాగే ఒక్కొక్కరికి రోజూ ఒక గుడ్డు, 200 మిల్లీలీటర్ల పాలు ఇస్తున్నారు. మెనూ ప్రకారం అన్నిరకాల కూరగాయలతో పిల్లలు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందజేయాల్సి ఉంటుంది. అయితే ఉమ్మడి మెదక్ జిల్లాలోని అంగన్వాడి కేంద్రాల్లో ఎక్కడా మెనూ పూర్తి స్థాయిలో అమ లు కావటం లేదు. దీంతో పిల్లలు, గర్భిణులకు సరైన పౌష్టికాహారం అందటంలేదు. చిన్నారుల హాజరు శాతాన్ని ఎక్కువ సంఖ్యలో చూపి అంగన్వాడి సిబ్బంది వారి పేరిట సరుకులను తీసుకుని అ మ్ముకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. గర్భిణి, బాలింతలకు ప్రతి ఒక్కరికి 200 మిల్లీలీటర్ల మేరకు పాలు ఇవ్వాలి. అసలు పాలు పూర్తి స్థాయిలో చాలా తక్కువ కేంద్రాలకు సరఫరా అవుతున్నాయి. మెదక్ మండలం అవుసలపల్లిలో మూడు మాసాలుగా గర్భిణీలు, బాలింతలకు పాలు ఇవ్వటంలేదు. దీనిని బట్టి పాల పంపిణీ ఎలా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. మెదక్ జిల్లాలో ఇలా... మెదక్ జిల్లాలో మొత్తం 1076 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఆయా అంగన్వాడీ కేంద్రాల్లో 39,525 మంది పిల్లలు, 10,624 మంది బాలింతలు, గర్భిణులు ఉన్నారు. ‘సాక్షి’ టేక్మాల్ మండలం ఎల్లంపల్లి అంగన్వాడి కేంద్రాన్ని పరిశీలించింది. ఇక్కడ దొడ్డు బియ్యాన్నే వండి వార్చారు. పప్పునీళ్లతోనే పిల్లలు కడుపు నింపుకున్నారు. గుడ్లు అందచేయలేదు. అల్గాదుర్గం మండలం గొల్లకుంట అంగన్వాడి కేంద్రంలో 19 పిల్లలకు 8 మంది మాత్రమే ఉన్నారు. ఇక్కడ విధులు నిర్వహించాల్సి ఆయా కొద్దిరోజులుగా స్థానికంగా ఉండడం లేదు. దీంతో పిల్లల ఆలనాపాలనా కరువవుతోంది. పాపన్నపేట మండలంలోని లక్ష్మాపూర్ అంగన్వాడి కేంద్రంలో ఉదయం 11 దాటినా అంగన్వాడి టీచర్ జాడలేదు.సెంటర్లో 14 మంది విద్యార్థులకు ఒక్కరే హాజరై ఆడుకుంటున్నాడు. నలుగురు గర్భిణులు ఇక్కడ పేర్లు నమోదు చేసుకోగా ఇద్దరు, నలుగురు బాలింతలకు ఇద్దరే వస్తున్నట్లు అంగన్వాడి టీచర్ స్వరాజ్యలక్ష్మి తెలిపారు. నర్సాపూర్ నియోజకవర్గంలోని కౌడిపల్లి, కొల్చా రం, కౌడిపల్లి, శివ్వంపేట, చిలప్‌చెడ్ మండలాల్లోని 60 శాతం అంగన్వాడి కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. వీటిలో మూత్రశాలలు, మరుగుదొడ్లు, నీటి సౌకర్యం లేకపోవడంతో పిల్లలు, బాలింతలు, గర్భిణులు ఇబ్బందులు పడుతున్నారు. ఆ రెండు జిల్లాల్లో దొడ్డు బియ్యం.. నీళ్ల చారు సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లోని అంగన్వాడి కేంద్రాల్లో చాలాచోట్ల పిల్లలు, గర్భిణులకు సరైన పౌష్టికాహారం అందజేయటం లేదు. కేంద్రాలకు వచ్చే మూడు నుంచి ఆరేళ్లలోపు పిల్లలకు మధ్యాహ్న భోజనం వడ్డించాలి. అయితే దొడ్డు బియ్యంతో వండిన అన్నం పెడుతుండటంతో తినేందుకు పిల్లలు ఇష్టపడటం లేదు. మధ్యాహ్న భోజనంలో కూరగాయలు లేదా పప్పు వడ్డించాలి. అయితే అంగన్వాడి సిబ్బంది నీళ్లచారుతోనే సరిపెడుతున్నారు. దానిని తినలేక పిల్లలు, గర్భిణులు ఇబ్బందులు పడుతున్నారు. కాంట్రాక్టర్లు నాసిరకమైన, నాణ్యతలేని సరుకులు సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. దీంతో అంగన్వాడిల్లో పిల్లలు, గర్భిణులకు పోషకాహారం గగనమవుతోంది. ముఖ్యంగా మెనూ ప్రకారం రోజూ వివిధ రకాల పౌష్టికాహారాన్ని అందజేయాలి. ఎక్కడా మెనూ సరిగా అమలవుతున్న దాఖలాల్లేవు. పిల్లలు, గర్భిణి, బాలింతలకు రోజూ గుడ్డు ఇవ్వాలి. గుడ్డు 50 గ్రాములు ఉండాలి. కాంట్రాక్టర్లు చిన్న సైజు గుడ్డును సరఫరా చేస్తున్నారు. పౌల్ట్రీల్లో తక్కువ ధరకు వచ్చే చిన్నసైజు కోడిగుడ్లను కొని వాటినే అం గన్వాడీలకు సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ రెండు జిల్లాల్లోని కేంద్రాలకు పా లు సక్రమంగా ఇవ్వటంలేదు. కాంట్రాక్టర్లు పా ల సరఫరాలో నిర్లక్ష్యం చేస్తున్నట్టు తేలింది. అరకొర వసతుల నడుమ.. జిల్లాలోని చిన్నశంకరంపేట మండలంలో అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ సక్రమంగా సాగడం లేదు. అంగన్వాడీలకు సొంత భవనాలకు లేకపోవడంతో చిన్న పిల్లలు, గర్బిణులు, బాలింతలకు ఇబ్బందులు తప్పడం లేదు. దీంతో వీరికి సక్రమంగా పౌష్టిక ఆహారం కూడా అందడం లేదు. అంగన్వాడీల నిర్వహణ తీరును పరిశీలించేందుకు బుధవారం ‘సాక్షి’ చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని మూడో అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించింది. ఈ కేంద్రం అద్దె భవనంలో కొనసాగుతుంది. చిన్నారుల హాజరు శాతం కూడా అంతంత మాత్రమే. హాజరు పట్టికలో ఉన్న సంఖ్యకు కేంద్రంలో ఉన్న చిన్నారుల సంఖ్యకు పొంతనేలేదు. 15 మంది విద్యార్థులకు గాను 8 మంది విద్యార్థులు మాత్రమే అక్కడ ఉన్నారు. ఇంకా ఇక్కడ చిన్నారులకు, గర్భిణులకు దొడ్డు బియ్యం అన్నం వడ్డిస్తున్నారు. బియ్యం నాణ్యత బాగాలేకపోవటంతో అన్నం తినేందుకు చిన్నారులు, గర్భిణులు, బాలింతలు సైతం దొడ్డు బియ్యం అన్నం తినేందుకు ఇబ్బంది పడుతున్నారు. దీనికితోడు మెనూ ప్రకారం కూరగాయలు, పప్పులు వడ్డించటంలేదు. రెండు మాసాలుగా పాలు ఇవ్వడంలోనూ ఇబ్బంది ఉండగా ప్రస్తుతం మాత్రం గర్భిణులకు, బాలింతలకు అందజేస్తున్నారు. అయితే కోడిగుడ్లు సరిగ్గా ఇవ్వడం లేదు. చిన్నసైజు కోడిగుడ్లనే ఇస్తున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు. అలాగే ఆహారం రుచిరకరంగా ఉండడం లేదని పిల్లలు, గర్భిణులు, బాలింతలు చెబుతున్నారు. ఈ విషయమై అంగన్వాడీ ఐసీడీఎస్ సూపర్వైజర్ శారదను వివరణ కోరగా అంగన్వాడీ కేంద్రాల్లో మెనూ ప్రకారం పిల్లలు, గర్భిణులకు, బాలింతలకు పౌష్టిక ఆహారం అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. -
పెళ్లిరోజే పరలోకాలకు..
వారు గతేడాది ఫిబ్రవరి 15న పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. తొమ్మిదిరోజుల క్రితం పండంటి పాపకు జన్మనిచ్చి తల్లిదండ్రులుగా మారారు. ఏడాది క్రితం ఇద్దరుగా ఉన్నతాము ముగ్గురిగా మారామని సంతోష పడ్డారు. ప్రసవం సమయంలో ఆ తల్లి ఆపరేషన్ కాగా.. వైద్యులు కొన్ని కుట్లు తొలగించి.. మరికొన్ని అలాగే ఉంచారు. బంధువులు, కుటుంబసభ్యుల మధ్య పెళ్లిరోజును ఘనంగా జరుపుకుందామని భావించి మిగిలిన కుట్లు తొలగించుకునేందుకు ఆ తల్లి ఆసుపత్రికి చేరింది. కుట్లు తొలగించిన తర్వాత ఇంటికి చేరిన ఆమె.. పదినిమిషాలు కూడా ఉండలేకపోయింది. కళ్లు తిరిగి పడిపోవడం.. ఆమెను బంధువులు ఆసుపత్రికి తరలించడం.. అక్కడ వైద్యులు పరీక్షించేలోపే.. కన్నుమూయడం నిమిషాల వ్యవధిలో జరిగిపోయాయి. జమ్మికుంటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో గురువారం జరిగిన ఈ సంఘటన కంటతడి పెట్టించింది. జమ్మికుంట(హుజూరాబాద్): కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామానికి చెందిన ఓగ్గు రమ్యకు అదే గ్రామానికి చెందిన అనిల్‌తో గతేడాది ఫిబ్రవరి 15న వివాహం జరిగింది. రమ్య గర్భం దాల్చినప్పటినుంచి పట్టణంలోని శ్రీవిజయసాయి ఆసుపత్రిలో వైద్య చికిత్స తీసుకుంటోంది. ఈ నెల 7న పురిటి నొప్పులు రావడంతో బంధువులు ఆమెను అదేరోజు ఆసుపత్రిలో చేర్పించారు. పరీక్షించిన వైద్యులు ఆపరేషన్ చేసి పండంటి పాపకు పురుడు పోశారు. ఆపరేషన్ సమయంలో కుట్లు వేసిన వైద్యులు.. ఈనెల 12న కొన్నికుట్లు విప్పి ఇంటికి పంపించారు. ఫిబ్రవరి 15న పెళ్లిరోజు కావడంతో బంధువుల మధ్య ఘనంగా జరుపుకుందామనే ఉద్దేశంతో రమ్య మిగితా కుట్లు విప్పించుకునేందుకు గురువారం ఆస్పత్రికి వచ్చింది. అనిల్ గోదావరిఖనిలో పండ్లు విక్రయించేందుకు వెళ్లాడు. కుట్లు విప్పిన తర్వాత రమ్యను ఇంటికి పంపించారు. ఏం జరిగిందోగానీ.. ఇంటికి వెళ్లిన కొద్ది సేపటికే రమ్య కళ్లు తిరుగుతున్నాయంటూ కుటుంబసభ్యులకు చెప్పడంతో వెంటనే ఆటోలో మళ్లీ ఆస్పత్రికి తీసుకువచ్చారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఆస్పత్రికి రాగా వైద్యుడు రమ్యను పరీక్షించి స్ట్రెచర్‌పై ఆక్సిజన్ ఏర్పాటు చేశాడు. కొద్ది సేపటికే మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యమేనంటూ ఆందోళన రమ్య మృతికి ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ మృతురాలి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. వైద్యులపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. కోపంతో ఆస్పత్రి అద్దాలు ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న ఎస్సై శ్రీనివాస్ సంఘటనస్థలానికి చేరుకుని ఆందోళనకారులను అదుపు చేశారు. మృతదేహం ఆస్పత్రిలోనే ఉంది. పెళ్లిరోజే పరలోకాలకు వెళ్లావా బిడ్డ.. సరిగ్గా ఏడాది క్రితం రమ్యకు అనిల్‌తో వివాహం కా గా.. తిరిగి అదేరోజు కన్నుమూయడంపై బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. ‘అయ్యో దేవుడా.. ఎంతపనిచేస్తివి.. పాపకు జన్మనిచ్చి.. కడుపార చూసుకోకముందే.. కానరాని లోకాలకు తీసుకెళ్లా వా..’ అంటూ బంధువులు, కుటుంబసభ్యులు రోదించిన తీరు కన్నీరు తెప్పించింది. గోదావరిఖని నుంచి వచ్చిన అనిల్ భార్య మృతదేహంపై ఏడుస్తుండగా ఆపడం ఎవరితరమూ కాలేదు. -
పరిమళించిన మానవత్వం
రైలులో వెళ్తుండగా ఓ గర్భిణికి పురిటి నొప్పులు రావడం.. అక్కడే ఉన్న ఓ కానిస్టేబుల్ స్పందించి ప్రయాణికుల సాయం కోరడం.. స్పందించిన ఓ నర్సింగ్ విద్యా ర్థిని కాన్పు చేయడం.. సదరు మహిళ పండంటి శిశువుకు జన్మనివ్వడం చకచకా జరిగిపోయాయి. ఈ ఘటన గురువారం కర్నూలు వెళ్లే ప్యాసింజర్ రైలులో చోటుచేసుకుంది. వెల్దుర్తి /డోన్: రైలులో పురిటినొప్పులతో బాధపడుతున్న గర్భిణికి సుఖప్రసవం చేయడం ద్వారా మానవత్వాన్ని చాటుకున్నారు తోటి ప్రయాణికులు. ప్రయాణికుల సమాచారం మేరకు.. తుగ్గలి మండలం గిరిగెట్ల గ్రామ మాజీ సర్పంచ్ లింగయ్య కుమార్తె సుమలతను బళ్లారికి చెందిన శివకు ఇచ్చి రెండేళ్ల క్రితం వివాహం జరిపించారు. సుమలత తన మొదటి కాన్పు నిమిత్తం పుట్టింటిలో ఉంటోంది. నెలలు నిండడంతో కాన్పు కోసం గుంతకల్లు నుంచి కర్నూలుకు వెళ్లే ప్యాసింజర్ రైలును తుగ్గలి రైల్వే స్టేషన్లో ఎక్కింది. రైలు డోన్ స్టేషన్ దాటిన తర్వాత సుమలతకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. దీంతో ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అదే రైలులో ప్రయాణిస్తున్న డోన్ సబ్‌జైలు కానిస్టేబుల్ లక్ష్మీనారాయణ వెంటనే అప్రమత్తమై రైలు బోగీల్లో ఉన్న ప్రయాణికులందరికీ విషయం చెబుతూ సాయం అర్థించాడు. దీంతో డోన్ మండలం యు. కొత్తపల్లెకు చెందిన, కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో నర్సింగ్ చేస్తున్న మునియల్ వెంటనే స్పందించి కాన్పు చేసేందుకు ముందుకు వచ్చింది. నర్సింగ్ విద్యార్థిని గర్భిణి, ఆమె కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ సుఖప్రసవం చేసింది. చివరకు సుమలత పండంటి శిశువుకు జన్మనివ్వడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. కానిస్టేబుల్, నర్సింగ్ విద్యార్థినికి కృతజ్ఞతలు తెలిపిన వారు కర్నూలు ప్రభుత్వాస్పత్రికి వెళ్లారు. -
గర్భిణులకు వరం
వైఎస్ఆర్ జిల్లా , బద్వేలు: మాతాశిశు మరణాలు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి మాత వందన యోజన (పీఎంఎంవీవై) గర్భిణులకు వరంగా మారింది. దీన్ని అందిపుచ్చుకోవాలంటే కొన్ని నిబంధనలు పాటించాల్సిందే. మొదటిసారి గర్భం దాల్చిన మహిళలు ఈ పథకానికి అర్హులు. ఈ పథకంలో నమోదైన వారికి మూడు విడతలుగా అర్థిక సాయం అందజేస్తారు. పీఎంఎంవీవై ద్వారా లబ్ధి పొందిన వారు ఆస్పత్రులలో ప్రసవించినా.. ప్రభుత్వం ఇచ్చే జననీ సురక్ష యోజన ద్వారా రూ.వెయ్యి కూడా పొందవచ్చు. 2017 జనవరి 1 తర్వాత గర్భిణిగా నమోదు చేయించుకున్న వారు తప్పనిసరిగా గర్భిణి పరీక్షలు (కనీసం ఒక పర్యాయం) చేయించుకోవాలి. పుట్టిన బిడ్డ జనన ధ్రువీకరణ పత్రం తీసుకోవాలి. ఆ బిడ్డకు మొదటి విడత పోలియో చుక్కలు, పెంటా వాలెంట్ వ్యాక్సిన్, రోటా వైరస్ వ్యాక్సిన్, ఐపీవీ వ్యాక్సిన్ వేయించి ఉండాలి. నిబంధనల మేరకు దరఖాస్తు చేసుకుంటే మూడు విడతలుగా లబ్ధిదారుల ఖాతాలోకి నగదు జమ అవుతుంది. దరఖాస్తు చేయడం ఇలా... దరఖాస్తుతోపాటు భార్యభర్తల ఆధార్‌కార్డు జిరాక్స్, దరఖాస్తుదారు బ్యాంకు అకౌంట్ జిరాక్స్ కాపీలు జత చేయాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలలో పని చేసే ఉద్యోగులు ఈ పథకానికి అనర్హులు. ఆశ కార్యకర్తలు, అంగన్వాడీలు, ఆయాలు ఈ పథకంలో నమోదు చేయించుకుని లబ్ధి పొందవచ్చు. 2017 జనవరి 1, ఆ తర్వాత నమోదు చేసుకున్న గర్భిణులలో కొందరు ప్రస్తుతం కాన్పు అయి ఉంటారు. నమోదు చేయించుకుని ప్రస్తుతం తల్లిగా ఉన్న వారు కూడా ఈ పథకానికి అర్హులే. ప్రతి గర్భిణి తమ గ్రామ ఏఎన్ఎంతో ఆర్సీహెచ్ పోర్టల్‌లో నమోదు చేయించుకోవాలి. 12 అంకెల ఆర్సీహెచ్ గుర్తింపు సంఖ్య.. వారి ఎంసీపీ కార్డు మీద తప్పనిసరిగా రాయించుకోవాలి. గర్భిణి ఆధార్‌కార్డుతో ఉన్న పేరుతో బ్యాంకు అకౌంట్ ఉండాలి. గర్భిణి లేదా కుటుంబ సభ్యులలో ఫోన్ నంబరు దరఖాస్తులో నమోదు చేయాలి. గర్భిణి నమోదు సమయంలో మొదటిగా పారం–1 ఏతో పాటు, సంబంధిత డాక్యుమెంట్స్ నకలు కాపీలు ఏఎన్ఎంకు ఇచ్చి వారి నుంచి రశీదు పొందాలి. మంజూరు అధికారులు గర్భిణుల దరఖాస్తులు పరిశీలించి ఆన్లైన్లో నమోదు చేస్తారు. బ్యాంక్ అకౌంట్లో జమ డాక్యుమెంట్స్ సక్రమంగా ఉన్న దరఖాస్తుదారులకు 30 రోజులలో మొదట విడతగా 30 రోజులలో వెయ్యి నగదు వారి అకౌంట్లో జమ అవుతుంది. తరువాత ఆరు నెలలకు ఫారం–బీతో సంబంధిత కాపీల నకలుతో దరఖాస్తు చేసుకుంటే మళ్లీ 30 రోజులలో వారి అకౌంట్లో రెండో విడతగా రూ.రెండు వేలు జమ చేస్తారు. ప్రసవం తర్వాత ఫారం–1సీతో దరఖాస్తు చేయాలి. 30 రోజులలో మూడో విడతగా మరో రూ.రెండు వేలు జమ అవుతాయి. అనివార్య కారణాలతో అబార్షన్ అయితే రెండోసారి గర్భం దాల్చిన తర్వాత.. రెండో ఇన్స్టాల్మెంట్ నుంచి సంబంధిత పరీక్షలు చేయించుకుని దరఖాస్తు చేసుకుని లబ్ధి పొందవచ్చు