
మాధవి మృతదేహం ఆలస్యంగా వచ్చిన అంబులెన్స్
మల్కాజిగిరి: సరైన రహదారి సౌకర్యం లేని కారణంగా సకాలంలో అంబులెన్స్ చేరలేకపోవడంతో ఎనిమిది నెలల గర్భిణి చికిత్స అందక మృతి చెందింది.ఈ విషాత సంఘటన గౌతంనగర్ డివిజన్ పరిధిలోని ఇందిరా నెహ్రూనగర్‌లో గురువారం రాత్రి చోటు చేసుకుంది. వీరిది మెదక్ జిల్లా గరిగట్ల పల్లి గ్రామానికి చెందిన శేఖర్ –మాధవి దంపతులు నగరానికి వలసవచ్చి ఇందిరానెహ్రూనగర్‌లో నివాసం ఉంటున్నారు. గత సంవత్సరం వీరికి వివాహం జరిగింది. శేఖర్ కూలి పని చేస్తూ జీవనం సాగిస్తుండగా, మాధవి ఇంట్లోనే ఉండేది. 8 నెలల గర్భంతో ఉన్న మాధవికి గురువారం రాత్రి 10 గంటల సమయంలో నొప్పులు రావడంతో 108 కు ఫోన్ చేశారు. రైల్వే ట్రాక్ మరమ్మతుల కారణంగా ఇందిరానెహ్రూనగర్‌కు సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో సికింద్రాబాద్ తుకారాం గేట్ మీదుగా 108 వాహనం అక్కడికి చేరుకోవడంలో ఆలస్యమైంది. దీంతో సకాలంలో చికిత్స అందక మాధవి మృతి చెందింది.
Comments
Please login to add a commentAdd a comment