మోర్తాడ్(బాల్కొండ) : వైద్య ఆరోగ్య శాఖ నుంచి సామాజిక ఆస్పత్రులను వైద్య విధాన పరిషత్‌లో విలీనం చేసినప్పటికీ తగినంత మంది వైద్యులు, సిబ్బంది లేకపోవడంతో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందడం లేదు. మోర్తాడ్, బాల్కొండ, డిచ్‌పల్లి, ధర్పల్లి, వర్ని, నవీపేట్‌లలో 30 పడకలు ఉన్న ఆస్పత్రులు ఉన్నాయి. ఆర్మూర్‌లో వంద పడకల ఆస్పత్రి ఉంది. భీమ్‌గల్‌లో వంద పడకల ఆస్పత్రి నిర్మాణం కొనసాగుతోంది. 30 పడకల ఆస్పత్రిలో వివిధ రకాల వైద్యం అందించే 14 మంది వైద్యులు, 18 మంది వివిధ హోదాలలో పని చేసే సిబ్బందిని నియమించాల్సి ఉంది.
వంద పడకల ఆస్పత్రిలో 48 మంది వైద్యులు, 73 మంది సిబ్బంది పోస్టు లను ఖరారు చేశారు. భీమ్‌గల్ ఆస్పత్రి నిర్మాణం ఇంకా పూర్తికానందున మిగిలిన ఆస్పత్రులలో వైద్యులు, సిబ్బంది పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం నోటిఫికేషన్‌ను జారీ చేశారు. జిల్లాలో మొత్తం 132 మంది వైద్యులు, 181 మంది సిబ్బందిని నియమించాల్సి ఉంది. ఇప్పటి వరకు పోస్టుల భర్తీపై దృష్టి సారించకపోగా నోటిఫికేషన్ జారీతోనే సరిపెట్టారు.
వైద్య విధాన పరిషత్ పరిధిలోకి ఆస్పత్రులు చేరడం వల్ల వైద్య సేవలు ఎంతో మెరుగైతాయని అందరు భావించారు. పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలుపడంలో జాప్యం కారణంగా పోస్టులు అన్ని ఖాళీగానే ఉన్నాయి. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిని, వైద్యులను డిప్యుటేషన్ పద్ధతిపై కమ్యునిటీ ఆస్పత్రులలో కొనసాగిస్తున్నారు.
గర్భిణులకు..
ఆర్మూర్, బోధన్, నిజామాబాద్‌లలోని ఆస్పత్రుల లో మినహా ఇతర సామాజిక వైద్యశాలల్లో గర్భిణు లకు ప్రసవ సేవలు అందడం లేదు. సర్జన్‌లు, గైనకాలజిస్టులు లేకపోవడంతో శస్త్రచికిత్స ప్రసవ సేవలను పూర్తిగా నిలిపివేశారు. మోర్తాడ్ ప్రాంతం నుంచి ప్రసవాల కోసం మెట్‌పల్లి ఆస్పత్రికి తరలించా ల్సి వస్తుంది. ఆర్మూర్‌లో నిర్ణీత సంఖ్యలోనే ప్రసవ సేవలు అందిస్తుండటంతో పొరుగు జిల్లా ఆస్పత్రిని ఆశ్రయించక తప్పడం లేదు. ప్రభుత్వం వైద్య సేవలను విస్తృత పరచాలని పలువురు కోరుతున్నారు.
త్వరలోనే భర్తీ కావచ్చు..
సామాజిక ఆస్పత్రులలో వైద్యులు, సిబ్బంది నియామకాలు త్వరలోనే పూర్తి కావచ్చు. గతంలో నోటిఫికేషన్ జారీ చేశాం. మరోసారి నోటిఫికేషన్ ఇచ్చి పో స్టుల భర్తీ కోసం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందగానే పోస్టుల భర్తీకి చర్యలు చేపడుతాం. – డాక్టర్ శివశంకర్
Comments
Please login to add a commentAdd a comment