సౌమ్య (ఫైల్)
రాంగోపాల్‌పేట్: ప్రసూతి కోసం వచ్చిన గర్భిణీ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యంతో మరణించిందని ఆస్పత్రి ముందు బంధువులు ఆందోళన చేశారు. బాధితుల కథనం మేరకు.. మణికొండకు చెందిన సౌమ్య (25) కాన్పు కోసం గత నెల 27 నవోదయ ఆస్పత్రికి వచ్చింది.ఆమెకు మరుసటి రోజు సిజేరియన్ చేయగా పాప, బాబు కవల పిల్లలు జన్మించారు. మెరుగైన చికిత్స కోసం బర్కత్‌పురలోని నవోదయ శాలిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ సౌమ్యకు మళ్లీ శస్త్ర చికిత్స చేశారు.తరువాత ఆస్పత్రి సిబ్బంది పట్టించుకోకపోవడంతో బంధువులు సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి తీసుకుని వచ్చారు.
అక్కడ చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం మృతి చెందింది. దీంతో బంధువుల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మృతదేహా తీసుకుని వచ్చి నవోదయ ఆస్పత్రి ముందు ఉంచి ఆందోళనకు దిగారు. రాంగోపాల్‌పేట్, సైఫాబాద్ పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. శస్త్ర చికిత్స విఫలం కావడంతో పాటు వైద్యులు ఏ మాత్రం పట్టించుకోకుండా ఉండటంతోనే సౌమ్య మరణించిందని బంధువులు ఆరోపించారు. సుమారు రూ.12లక్షలు ఖర్చు పెట్టినా బ్రతికించలేకపోయారని వాపోయారు.
Comments
Please login to add a commentAdd a comment