
ఊడి పడిన సీలింగ్ ఫ్యాన్, గాయపడిన బాలింత స్వాతి
మణుగూరుటౌన్: మున్సిపాలిటీ పరిధిలోని శివలింగాపురం పీహెచ్‌సీలో సీలింగ్ ఫ్యాన్ ఊడి పడడంతో బాలింత తలకు తీవ్ర గాయమైంది. ఇది మంగళవారం జరిగింది. బాధితురాలు తెలిపిన వివరాలు...
సమితి సింగారం పంచాయతీ సీతానగరం గ్రామానికి చెందిన కొప్పుల స్వాతి, పురిటి నొప్పులతో మధ్యాహ్నం రెండు గంటలకు ఆసుపత్రిలో చేరింది. సాయంత్రం ఏడు గంటల సమయంలో చిన్న ఆపరేషన్ ద్వారా పాపకు జన్మనిచ్చింది. ఆ తరువాత సిబ్బంది ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. తొమ్మిది గంటల సమయంలో వార్డులోని సీలింగ్ ఫ్యాన్ హఠాత్తుగా ఊడి, కొప్పుల స్వాతి తలపై పడింది. ఆమె తలకు తీవ్ర గాయమైంది. ఆ సమయంలో అక్కడ ఆసుపత్రి సిబ్బంది ఎవరూ లేరు.. ఆ తరువాత కూడా రాలేదు.
Comments
Please login to add a commentAdd a comment