phc
-
ఇంత క్రూరత్వమా..?.. పోసాని పట్ల ప్రభుత్వ దాష్టీకం
సాక్షి కడప : రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని ప్రయోగించి 67 ఏళ్ల వయస్సులో ఉన్న ప్రముఖ సినీనటుడు, రచయిత, నిర్మాత పోసాని కృష్ణమురళిని అక్రమ కేసులో ఇరికించి, అరెస్టు చేయడమే కాకుండా, ఆయన ఆరోగ్యం పట్ల కూడా ప్రభుత్వం కుట్రపూరితంగానే వ్యవహరించింది. బుధవారం రాత్రి హైదరాబాద్‌లో అరెస్టు చేసిన పోసాని మురళిని గురువారం రాత్రి కోర్టులో హాజరుపరిచి, శుక్రవారం రాజంపేట సబ్‌జైలుకు తీసుకెళ్లారు. అక్కడ విరేచనాలు అయినట్లు కుటుంబ సభ్యులకు పోసాని తెలిపారు. శనివారం గుండెల్లో, కడుపులో నొప్పిగా ఉందని చెప్పడంతో ముందుగా అక్కడి పీహెచ్‌సీకి తరలించారు. అక్కడ ప్రాథమికంగా పరీక్షలు చేయించి, వైద్యుల సూచన మేరకు కడపలోని రిమ్స్‌కు తరలించారు. ఇక్కడ కూడా ఆయన పట్ల ప్రభుత్వం, పోలీసులు అత్యంత క్రూరంగా వ్యవహరించారు. గుండెల్లో, కడుపు నొప్పితో బాధపడుతున్నా అంబులెన్సులో కాకుండా పోలీసు వాహనంలోనే తీసుకెళ్లడం క్రూరత్వమే. పైగా, ఆయనది అనారోగ్యం కాదని, నటన అంటూ రైల్వే కోడూరు రూరల్ సీఐ వెంకటేశ్వర్లు రిమ్స్ ఆవరణలోనే మీడియాతో మాట్లాడుతూ చెప్పడం అందరినీ విస్మయపరిచింది. 67 ఏళ్ల వయస్సులో ఉన్న ఓ ప్రముఖుడు, సీనియర్ సిటిజన్ పట్ల ఓ సీఐ ఇంత దారుణంగా మాట్లాడటం ప్రభుత్వ కర్కశత్వానికి నిదర్శనమని పలువురు మండిపడుతున్నారు. ఇదే తరుణంలో పోసోని మురళీకృష్ణకు ఏదైనా జరగరానిది జరిగితే బా«ద్యత ఎవరిదంటూ ఆయన అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఇలాగేనా ఆస్పత్రికి తీసుకెళ్లేది? పోసానికి ఇప్పటికే ఓసారి గుండె ఆపరేషన్ అయింది. మరికొన్ని ఆరోగ్య సమస్యలూ ఉన్నాయి. ఓబులవారి పల్లె పోలీసు స్టేషన్లో స్థానిక పీహెచ్సీ వైద్యులు పరీక్షించినప్పుడు ఆయనకు కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నట్లు వెల్లడించారు. గుండెకు సంబంధించే కాకుండా ఇతర అరోగ్య సమస్యలు ఉన్నట్లు కుటుంబ సభ్యులు కూడా పేర్కొంటున్నారు. బుధవారం రాత్రి హైదరాబాద్‌లో అరెస్టు చేసిన ఆయన్ని పోలీసు వాహనంలో తిప్పీ తిప్పీ గురువారం మధ్యాహ్నం ఓబులవారిపల్లె పోలీసు స్టేషన్‌కు తీసుకొచ్చారు. అక్కడ 9 గంటలు విచారణ జరిపి, ఆ తర్వాత రైల్వేకోడూరు కోర్టులో హాజరుపరిచారు. కోర్టులో రాత్రంతా వాదనలు జరిగాయి. శుక్రవారం రాజంపేట సబ్‌జైలుకు తీసుకొచ్చేవరకు.. అంటే రెండు రాత్రులు, రెండు పగళ్లు ఆయనకు విశ్రాంతి, నిద్ర లేవు. ఆయన బాగా అలసిపోయారు. జైలుకు తీసుకొచ్చేప్పటికే బాగా నీరసించిపోయారు. సబ్‌జైలుకు తరలించిన తర్వాత విరేచనాలు అయినట్లు, ఇతర సమస్యలు ఎదుర్కొన్నట్లు ఆయన ములాఖత్‌లో సన్నిహితులకు తెలిపారు. శనివారం గుండెల్లో, కడుపులో నొప్పితో బాధపడ్డారు. ఇలాంటి తరుణంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన జైలు, పోలీసు అధికారులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు స్పష్టంగా కనిపించింది. ఇలాంటి సమస్యలతో ఉన్న వారిని ఆస్పత్రికి తీసుకెళ్లాలంటే తప్పనిసరిగా ఆక్సిజన్, ఇతర అత్యవసర వైద్య సౌకర్యాలు ఉన్న అంబులెన్సులోనే తీసుకెళ్లాలి. వైద్యులు వెంట ఉండాలి. రాజంపేట పీహెచ్సీలో ఈసీజీ, ఇతర ప్రాథమిక వైద్య పరీక్షల అనంతరం మెరుగైన వైద్య సేవల కోసం కడపలోని రిమ్స్‌కు తీసుకెళ్లాలని వైద్యులు సూచించడం ఒకింత తీవ్రతకు నిదర్శనమే. అయినా పోలీసులు ఆయన్ని రాజంపేట పీహెచ్సీ నుంచి కడప రిమ్స్‌కు అంబులెన్స్‌లో కాకుండా పోలీసు వాహనంలో తీసుకెళ్లారు. అదీ.. సరిగా గాలి కూడా ఆడకుండా ఇద్దరు పోలీసుల మధ్య కూర్చోబెట్టి తీసుకెళ్లారు. రిమ్స్‌లో కూడా స్ట్రెచర్ కానీ, వీల్ చెయిర్ కానీ ఏర్పాటు చేయలేదు. వాహనం నుంచి ఆస్పత్రిలోకి నడిపించుకుంటూనే తీసుకెళ్లారు. రిమ్స్ వైద్యులు పరీక్షల అనంతరం పోసాని కిడ్నీలో రాయి ఉన్నట్లు చెప్పారు.ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడైనా కడపులో నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు కూడా అంబులెన్సులో కాకుండా పోలీసు వాహనంలోనే తిరిగి రాజంపేటకు తరలించారు. పోసాని పట్ల ప్రభుత్వం క్రూరత్వానికి ఇదే నిదర్శనమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కుటుంబ సభ్యులు అభిమానుల్లో ఆందోళన పోసాని కృష్ణమురళి ఆరోగ్యంపై కుటుంబ సభ్యులతోపాటు అభిమానుల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. అనారోగ్యంతో ఉన్న ఆయన్ని పోలీసు వాహనాల్లో తీసుకెళ్తున్నారని, ఏదైనా అత్యవసరం అయితే పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. శనివారం ములాఖత్‌లో రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్రెడ్డి ఆయన్ని సబ్ జైలులో కలిశారు. అనంతరం ఆయన అనారోగ్యంతో బాధపడుతున్న తీరును సబ్‌జైలు అధికారులకు కూడా ఆకేపాటి వివరించారు. పోసాని ఛాతినొప్పి, ఇతర అరోగ్య సమస్యలతో బాధపడుతున్న నేపథ్యంలో ఏదైనా జరిగితే బాధ్యత వహించాల్సి ఉంటుందని కూడా అధికారులను హెచ్చరించారు. ఈ నేపథ్యంలో అధికారులు పోసానిని పీహెచ్‌సీకి తీసుకెళ్లి, అక్కడి నుంచి కడప రిమ్స్‌కు వైద్యం కోసం తరలించారు. -
పీహెచ్‌సీల్లో స్పెషలిస్టు వైద్య సేవలు
సాక్షి, యాదాద్రి: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నిపుణులైన డాక్టర్లతో వైద్య సేవలు అందించే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పీహెచ్సీలలో ప్రాథమిక వైద్యంతో పాటు స్పెషలిస్ట్ వైద్య సేవలను రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టుగా యాదాద్రి భువనగిరి జిల్లాలో శుక్రవారం ప్రారంభించారు. ఇందులో భాగంగా ఈ నెల 26వ తేదీ వరకు పీహెచ్సీలలో వారానికి మూడు రోజులు క్యాంపులు నిర్వహి స్తారు. వైద్య, ఆరోగ్యశాఖ, వైద్య విధాన పరిషత్‌లు సంయుక్తంగా చేపట్టిన ఈ కార్య క్రమంలో 21 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 29 మంది నిపుణులైన వైద్యులు పీహెచ్‌సీలకు వెళ్లి 12 రకాల వైద్య సేవలు అందిస్తారు.ఇందుకోసం భువనగిరి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక షెడ్యూల్‌ను రూపొందించింది. భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రి, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో పనిచేస్తున్న స్పెషలిస్ట్ వైద్యులు ఆయా పీహెచ్‌సీలకు వెళతారు. వీలైతే అక్కడే వైద్యం చేసి మందులను ఇస్తారు. అవసరాన్ని బట్టి మెరుగైన వైద్యం కోసం భువనగిరి మెడికల్ కళాశాల, జిల్లా కేంద్ర ఆస్పత్రి, జనరల్ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తారు. ఈ ప్రత్యేక వైద్య శిబిరాల్లో పీడియాట్రిక్, గైనకాలజీ, ఆప్తమాలజీ, ఆర్థోపెడిక్, జనరల్ మెడిసిన్, పల్మనాలజీ, ఈఎన్టీ, సైక్రియాట్రిక్, దంత వైద్యం, ఫిజియోథెరపీ, చర్మవ్యాధులు, సాధారణ శస్త్ర చికిత్సలకు పరీక్షలు నిర్వహిస్తామని భువనగిరి జిల్లా వైద్యాధికారి డాక్టర్ మనోహర్ తెలిపారు. -
సీఎంను తాకిన వైద్యుల నిరసన సెగ
సాక్షి, అమరావతి: పీజీ వైద్య విద్యలో ఇన్ సర్విస్ కోటా కుదింపును వ్యతిరేకిస్తూ పీహెచ్సీ వైద్యులు చేపట్టిన నిరసన సెగ సీఎం చంద్రబాబును తాకింది. బుధవారం విజయవాడలోని ఎన్డీఆర్ జిల్లా కలెక్టర్రేట్లో వరద బాధితులకు పరిహారం పంపిణీ కార్యక్రమానికి సీఎం హాజరయ్యారు. దీంతో వందలాది పీహెచ్సీ వైద్యులు ఉదయాన్నే కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ఇన్సర్విస్ కోటా కుదింపు జీవో 85ను రద్దు చేయడంతో పాటు, ఇతర సమస్యలను పరిష్కరించాలంటూ ఫ్ల కార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. కలెక్టరేట్ పరిసరాల్లో నిరసన తెలపడానికి వీల్లేదని, అక్కడి నుంచి వెళ్లిపోవాలని వైద్యులను పోలీసులు అడ్డుకున్నారు. సీఎంను కలిసి తమ సమస్యలు ఆయన దృష్టికి తీసుకువెళ్లే వరకూ అక్కడి నుంచి వెళ్లేది లేదని వైద్యులు తెగేసి చెప్పారు. సీఎంను కలవడానికి ఇంత మందిని అనుమతించబోమని, ఇద్దరు మాత్రమే రావాలని పోలీసులు చెప్పారు. పోలీసుల షరతుకు అంగీకరించి, ఇద్దరు వైద్యులే సీఎంను కలిశారు. మిగిలిన వైద్యులందరూ అక్కడే రోడ్డుపై గంటల తరబడి పడిగాపులు కాశారు. జీవో రద్దు చేయం వైద్యుల ప్రతినిధులు సీఎంను కలిసి జీవో 85 రద్దు చేయాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరారు. అయితే, జీవో 85ను రద్దు చేయడం కుదరదని సీఎం తేల్చి చెప్పినట్టు తెలిసింది. జీవోలో సవరణకు ఇప్పటికే సానుకూలత తెలిపామని అన్నట్లు సమాచారం. జీవో రద్దుకు పట్టుబడితే కుదరదని సున్నితంగా హెచ్చరించినట్టు వైద్యులు చెప్పారు.ఇన్సర్విస్ కోటా కుదించిన బాబు సర్కారు పీజీ వైద్య విద్యలో గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోని పీహెచ్‌సీల్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ (సీఏఎస్)లుగా సేవలందించే ఎంబీబీఎస్ వైద్యులకు ఇన్‌సర్వీస్ రిజర్వేషన్ సౌకర్యం ఉంది. గత ప్రభుత్వం క్లినికల్ పీజీ కోర్సుల్లో 30 శాతం, నాన్–క్లినికల్ కోర్సుల్లో 50 శాతం రిజర్వేషన్ ఇచ్చింది. చంద్రబాబు ప్రభుత్వం క్లినికల్‌లో ఎంపిక చేసిన స్పెషాలిటీల్లో 15 శాతం, నాన్–క్లినికల్ కోర్సుల్లో 30 శాతానికి ఈ కోటా కుదించింది. దీంతో 2023–24లో క్లినికల్‌లో 389, నాన్–క్లినికల్‌లో 164 పీజీ సీట్లు పొందిన వైద్యులు, ఇప్పుడు క్లినికల్‌లో 270, నాన్ క్లినికల్‌లో 66 చొప్పున సీట్లను కోల్పోతున్నారు. ఈ క్రమంలో ఈ నెల 10 నుంచి వైద్యులు ఉద్యమం చేపట్టారు. 15వ తేదీ నుంచి పీహెచ్‌సీల్లో వైద్య సేవలకు సైతం దూరంగా ఉన్నారు. -
సమ్మె విరమించేది లేదు
సాక్షి, అమరావతి: పీజీ వైద్య విద్యలో ఇన్ సర్వీస్ కోటా కుదిస్తూ జారీ చేసిన జీవో 85ను రద్దు చేసే వరకూ సమ్మె విరమించబోమని పీహెచ్సీ వైద్యులు తేల్చిచెప్పారు. బుధవారం మంత్రి సత్యకుమార్‌తో చర్చల్లో సమ్మెల విరమణకు అంగీకరించిన పీహెచ్సీ వైద్యుల సంఘం ప్రతినిధులపై వైద్యులందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరి ప్రధాన డిమాండ్ అయిన జీవో రద్దుకు ప్రభుత్వం అంగీకరించకుండా సమ్మె విరమిస్తామని ప్రభుత్వానికి ఎలా చెబుతారని నిలదీశారు.సచివాలయంలో జరిగిన ఈ చర్చల్లో మంత్రితో పాటు వైద్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ చర్చల్లో జీవో 85 రద్దు, పదోన్నతులు, ఇంక్రిమెంట్లు సహా పలు అంశాలను వైద్యుల సంఘం నేతలు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. జీవో రద్దుకు ప్రభుత్వం అంగీకారం తెలపలేదు. జీవో సవరణ చేస్తామని మంత్రి హామీ ఇచ్చినట్టు ప్రకటన విడుదల చేశారు. ఎంపిక చేసిన కోర్సుల్లోనే కాకుండా అన్ని క్లినికల్ కోర్సుల్లోనూ అవకాశం కల్పిస్తున్నట్టు ప్రకటించారు. చర్చల అనంతరం విజయవాడ మాకినేని బసవ పున్నయ్య ఫంక్షన్ హాల్లో సుమారు 1500 మంది వైద్యులతో సంఘం నేతలు సమావేశమయ్యారు. మరోమారు ప్రభుత్వం సోమ, మంగళవారాల్లో చర్చలకు పిలుస్తుందని, ఈ క్రమంలో సమ్మె విరమిస్తామని ఒప్పుకున్నట్టు వెల్లడించారు. జీవో రద్దు చేయకుండా సమ్మె ఎలా విరమిస్తామంటూ వైద్యులందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమ్మె కొనసాగించాల్సిందేనని చెప్పారు. వైద్యులను అవమానించిన పోలీసులుధర్నా చౌక్‌లో నిరసన తెలుపుతున్న వైద్యులను పోలీసులు అవమానించారు. ఇన్‌సర్వీస్ కోటా కుదింపును వ్యతిరేకిస్తూ విజయవాడ ధర్నా చౌక్‌లో నిరసనకు పోలీస్ శాఖను వైద్యులు అనుమతి కోరారు. మంగళ, బుధవారాల్లో నిరసన తెలపడానికి పోలీస్ కమిషనర్ అనుమతి ఇచ్చారు. బుధవారం ప్రభుత్వం చర్చలకు పిలిచినందున ధర్నాచౌక్‌లో అనుమతి రద్దు చేశామంటూ వైద్యులను పోలీసులు అడ్డుకున్నారు. నిల్చోడానికి కూడా వీల్లేకుండా వెళ్లిపోవాలంటూ బలవంతంగా పంపేశారు. చేసేదేమీ లేక బసవపున్నయ్య ఫంక్షన్ హాల్ అద్దెకు తీసుకుని అక్కడ సమావేశమయ్యారు. పోలీసుల చర్య తమను అవమానించడమేనని వైద్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు -
నేడు పీహెచ్సీ వైద్యుల చలో విజయవాడ
సాక్షి, అమరావతి: పీజీ వైద్యవిద్యలో ఇన్‌సర్వీస్ కోటా కుదింపును నిరసిస్తూ మంగళవారం చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఏపీ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల వైద్యుల సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ యూనస్‌మీర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. చర్చలకు ప్రభుత్వం పిలుస్తామని చెప్పడంతో సోమవారం వేచి చూసినట్లు తెలిపారు. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో ముందు నిర్దేశించుకున్నట్లు మంగళవారం చలో విజయవాడ నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పీహెచ్సీ వైద్యులు విజయవాడలో ర్యాలీ నిర్వహించి ధర్నాచౌక్‌లో శాంతియుత నిరసనలు తెలుపుతారని పేర్కొన్నారు. ఇంకా ప్రభుత్వం స్పందించకపోతే బుధవారం నుంచి నిరవధిక నిరాహార దీక్షకు దిగుతామని తెలిపారు. సమ్మె నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని పీహెచ్‌సీల్లో వైద్యసేవలు అందించబోమని స్పష్టం చేశారు. -
వైద్యుల నిరసన... చలో విజయవాడ
-
పీహెచ్‌సీల్లో నిలిచిన సేవలు
సాక్షి, అమరావతి: పీజీ వైద్య విద్యలో ఇన్ సర్వీస్ కోటాను రాష్ట్ర ప్రభుత్వం కుదించటానికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (పీహెచ్సీ) డాక్టర్లు వైద్య సేవలను శనివారం నిలిపివేశారు. దీంతో ప్రజలు తీవ్ర అవస్థలకు గురయ్యారు. జీవో నంబర్ 85 వెంటనే రద్దు చేయాలని వైద్యులు డిమాండ్ చేశారు. అత్యవసర సేవలు మినహా ఇతర వైద్య సేవలన్నింటికి దూరంగా ఉంటూ పీహెచ్సీ డాక్టర్లు సమ్మె చేపట్టారు. చర్చలకని పిలిచిన రాష్ట్ర ప్రభుత్వం తమను తీవ్ర అవమానానికి గురి చేసిందని పీహెచ్సీ వైద్యుల సంఘం పేర్కొంది. ప్రభుత్వానికి స్పెషలిస్ట్ వైద్యుల అవసరం లేదని, ప్రభుత్వాస్పత్రుల్లో కంటే ప్రైవేట్ ఆస్పత్రుల్లోనే మెరుగైన వైద్యం అందిస్తున్నారని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ హరికిరణ్ హేళనగా మాట్లాడారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇందుకు నిరసనగా మెరుగైన వైద్యం కోసం ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లాలంటూ కృష్ణబాబు పేరిట పీహెచ్‌సీలన్నింటిలో నోటీసులను ప్రదర్శించారు. ప్రభుత్వానికి స్పెషలిస్ట్ వైద్యులు అవసరం లేదని ఎలా చెబుతారని నిలదీశారు. పెరుగుతున్న వైద్య అవసరాలకు అనుగుణంగా డాక్టర్లసంఖ్యను ప్రభుత్వం పెంచదా? అని ప్రశ్నించారు. డాక్టర్ల సమ్మె తీవ్రతరం కావడంతో వైద్య సంఘం ప్రతినిధులకు సాయంత్రం ఫోన్ చేసిన కమిషనర్ ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఆదివారం తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమం వాయిదా పడింది. పీహెచ్సీ వైద్యులు చేపట్టిన సమ్మెకు ఏపీ ప్రభుత్వ వైద్యుల సంఘం మద్దతు తెలుపుతున్నట్లు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జయధీర్ ప్రకటించారు. ఏపీ ఎన్జీవో, స్టాఫ్ నర్స్, సీహెచ్‌వో, ఎంఎల్‌హెచ్‌పీ సంఘాలు కూడా సమ్మెకు మద్దతుగా నిలిచాయని వెల్లడించారు. నిరవధిక నిరాహార దీక్షలో పాల్గొంటామని స్పష్టం చేశారు. పేదల వైద్య సేవలపై తీవ్ర ప్రభావంపీజీ వైద్య విద్యలో ఇన్‌సర్వీస్ కోటా కుదింపు నిర్ణయం దళిత, గిరిజన, బలహీన వర్గాలకు వైద్య సేవలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఏపీ పేర్కొంది. గ్రామీణ, గిరిజన ప్రజలకు అత్యున్నత వైద్య సేవలు అందాలనే లక్ష్యంతో ఇన్‌సర్వీస్ కోటాను తెచ్చినట్టు గుర్తు చేశారు. కోటాను గత సర్కారు క్లినికల్‌లో 30 శాతం, నాన్ క్లినికల్‌లో 50 శాతానికి పెంచగా, ఈ ప్రభుత్వం క్లినికల్‌లో 15, నాన్ క్లినికల్‌లో 30 శాతానికి తగ్గించటాన్ని నిరసిస్తున్నామన్నారు. స్పెషలిస్ట్ వైద్యుల అవసరం లేదని ప్రభుత్వం వాదిస్తోందని, అదే నిజమైతే 488 స్పెషలిస్ట్ పోస్టులకు ఎందుకు నోటిఫికేషన్ ఇచ్చారని ప్రశ్నించారు. మరోసారి చర్చలకు పిలుస్తాం..వైద్యులతో చర్చల సందర్భంగా ఇన్ సర్వీస్ కోటా కుదించటానికి కారణాలను వివరించినట్లు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ హరికిరణ్ ఒక ప్రకటనలో తెలిపారు. చర్చల సారాంశాన్ని మంత్రికి తెలియచేశామన్నారు. త్వరలో మళ్లీ చర్చలకు పిలుస్తామని, విధులు కొనసాగించాలని కోరారు.రేపు చలో విజయవాడ..మరోసారి చర్చలకు పిలుస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో 24 గంటలు సమయం ఇస్తున్నట్లు పీహెచ్సీ వైద్యుల సంఘం రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ యూనిస్మీర్ ప్రకటించారు. ‘చలో విజయవాడ’ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహిస్తామన్నారు. సెకండరీ హెల్త్, ప్రభుత్వ వైద్యుల సంఘం, నర్స్, వైద్య సిబ్బంది సంఘాలు ఇందులో పాల్గొంటాయన్నారు. సోమవారం సాయంత్రంలోగా చర్చలు జరిపి తమ డిమాండ్లను ఆమోదించని పక్షంలో నిరవధిక నిరాహార దీక్షకు దిగుతామని ప్రకటించారు. -
నేటి నుంచి ఏపీ పీహెచ్సీలలో వైద్య సేవలు బంద్
-
నేటి నుంచి పీహెచ్‌సీల్లో వైద్య సేవలు బంద్
సాక్షి, అమరావతి: పీజీ వైద్య విద్యలో ఇన్‌సర్వీస్ కోటా కుదింపును వ్యతిరేకిస్తూ పీహెచ్సీ వైద్యులు చేపట్టిన ఆందోళనను తీవ్రం చేశారు. శనివారం నుంచి పీహెచ్‌సీల్లో అత్యవసర వైద్య సేవలు, మినహా మిగిలిన సేవలను అందించబోమని ఏపీ పీహెచ్సీ వైద్యుల సంఘం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఇన్‌సర్వీస్ కోటా కుదింపు జీవో 85ను రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 10 నుంచి వైద్యులు ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం శుక్రవారం వైద్యులతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. వైద్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ హరికిరణ్ వైద్యులతో సచివాలయంలో సుమారు రెండు గంటల పాటు చర్చలు జరిపారు. తమ సమస్యల పరిష్కారంపై అధికారులు కనీస ఆసక్తి చూపించలేదని వైద్యుల సంఘం అభిప్రాయపడింది. స్పెషలిస్ట్ వైద్యుల కొరత ఉంది అని చెబుతూ తాము చూపిన ప్రత్యామ్నాయాల్లో వేటినీ స్వీకరించకపోవడం తీవ్ర మనోవేదనకు గురి చేసిందని సంఘం తెలిపింది. ప్రభుత్వంలోకంటే ప్రైవేటులో మెరుగైన సేవలు అందుతున్నాయని అధికారులు అనడం శోచనీయమంది. ఈ క్రమంలో ఆదివారం చలో విజయవాడ, సోమవారం డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కార్యాలయానికి భారీ ర్యాలీ చేపడతామని తెలిపింది. మంగళవారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభిస్తామని వెల్లడించింది. పీహెచ్సీ వైద్యులు కోల్పోతున్న మొత్తం సీట్లు 336336 సీట్లు నష్టపోతున్న వైద్యులు ప్రభుత్వాస్పత్రుల్లో స్పెషలిస్ట్ వైద్యుల సంఖ్యను పెంచడం కోసం పీహెచ్‌సీల్లో సేవలు అందించే ఎంబీబీఎస్ వైద్యులను ఇన్‌సర్వీస్ కోటాలో పీజీ చేయించి, అనంతరం వారి సేవలను ఆస్పత్రుల్లో వినియోగిస్తుంటారు. కాగా, గత ప్రభుత్వంలో అన్ని ఆస్పత్రుల్లో పూర్తి స్థాయిలో స్పెషలిస్ట్‌లను అందుబాటులో ఉంచే లక్ష్యంతో ఇన్‌సర్వీస్ కోటాను పెంచారు. -
ప్రభుత్వాస్పత్రుల్లో మందుల కొరత
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వాస్పత్రులను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. మందుల సరఫరాను పూర్తిగా వదిలేసింది. కనీసం దూది, గ్లౌజులు, కాన్యులాలు కూడా లేక ఆస్పత్రులు విలవిల్లాడుతున్నాయి. ప్రాథమిక వైద్య సేవలందించే పీహెచ్‌సీల నుంచి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల వరకూ ఇదే పరిస్థితి నెలకొంది. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల రెండో క్వార్టర్ మందుల సరఫరా విషయంలో కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగానే ఈ పరిస్థితి నెలకొంది. వాస్తవానికి రెండో క్వార్టర్ మందులు, సర్జికల్స్ ఈపాటికే ఆస్పత్రులకు అందాలి. అయినా ప్రభుత్వం మందుల సరఫరాపై దృష్టే పెట్టలేదు. దీంతో మందులు సరఫరా చేయాల్సిన ఏపీఎంఎస్ఐడీసీ కూడా నిస్తేజంగా మారిపోయింది. పైకి ప్రజారోగ్యానికి అత్యధిక ప్రాధాన్యం అంటూ చెబుతున్నా, ఆస్పత్రుల్లో పరిస్థితి అత్యంత దయనీయంగా మారుతోంది. అన్ని ఆస్పత్రుల్లో నిబంధనల ప్రకారం ఉండాల్సిన మందులకంటే అతి తక్కువగా అందుబాటులో ఉన్నాయి.గ్లౌజ్‌లు.. కాటన్‌కూ కొరత..ఆస్పత్రులకు వచ్చే రోగులు, వారికి అందించే చికిత్సల ఆధారంగా జిల్లా, బోధనాస్పత్రుల్లో 608 రకాల మందులు, 372 సర్జికల్స్, వ్యాధి నిర్ధారణ కిట్లు ఉండాలి. ప్రస్తుతం రాష్ట్రంలోని జిల్లా, బోధనాస్పత్రుల్లో వందకు పైగా రకాల మందులు లేవు. చాలా ఆస్పత్రుల్లో కనీసం గ్లౌజ్‌లు, కాటన్, ఐవీ కాన్యులా, అనస్తీషియా కోసం వాడే స్పైనల్ నీడిల్స్, శస్త్ర చికిత్సలు, క్షతగాత్రులకు కుట్లు వేయడానికి మెటీరియల్ కూడా అందుబాటులో లేవు. రాష్ట్రవ్యాప్తంగా 13 సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ (సీడీసీ)లు ఉన్నాయి. వీటిల్లోనే డ్రగ్స్, సర్జికల్స్ లేవని, ఇండెంట్ పెడదామంటే నిత్యం అవసరమైన కొన్ని రకాల మందులు కూడా చూపించడం లేదని ఆస్పత్రుల్లోని ఫార్మాసిస్ట్లు వాపోతున్నారు. లివర్, కిడ్నీ, గుండె, మెదడు సంబంధిత రోగులకు వాడే ఖరీదైన యాంటిబయోటిక్స్, ఆల్బుమిన్, ఇమ్యూనోగ్లోబ్యులిన్స్కు గుంటూరు, కర్నూలు, వైజాగ్ సహా పలు ఆస్పత్రుల్లో కొరత ఉంది. నెల్లూరు జీజీహెచ్‌లో గ్యాస్ సమస్యకు ఇచ్చే పాంటప్రజోల్ వంటి మాత్రలకు సైతం కొరత ఉంది. డెంటల్ విభాగంలో పంటి నొప్పితో వచ్చిన రోగులకు సిమెంట్ మెటీరియల్ కూడా లేదు. అదే విధంగా చెవిలో వాడే డివాక్స్ ఇయర్ డ్రాప్స్ సైతం బయటకు రాస్తున్నారు. థైరాయిడ్ పరీక్షల వంటివి చేయడం లేదు. తెనాలి జిల్లా ఆస్పత్రిలో క్యానులా, గ్లౌజ్‌ల కొరత వేధిస్తోంది. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని పీహెచ్‌సీల్లో నాన్ కమ్యూనికబుల్ డీసీజెస్ (ఎన్సీడీ) మందులు, పెయిన్ కిల్లర్ మాత్రలు అందుబాటులో లేవు. దీంతో బీపీ, షుగర్ రోగులకు 30 మాత్రలకు బదులు 10 లేదా 15 మాత్రమే వైద్యులు ప్రిస్క్రైబ్ చేస్తున్నారు. -
435 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్ అర్హతతో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. ఈ మేరకు తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సరీ్వసెస్ రిక్రూట్మెంట్ బోర్డు శుక్రవారం నోటిఫికేషన్ జారీచేసింది. మొత్తం పోస్టులు 435 కాగా, అందులో 351 ప్రాథమికఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ)లో మెడికల్ ఆఫీసర్ పోస్టులు, మరో 80 పోస్టులు డీఎంఈ పరిధిలో ఆస్పత్రుల్లో ఆర్ఎంఓ పోస్టులు. ఐపీఎంలో భర్తీ చేసే పోస్టులు నాలుగు. ఈ పోస్టులకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానించారు. బోర్డు వెబ్సైట్( https://mhsrb. telangana.gov.in)లో దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చే నెల రెండో తేదీన ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవుతుంది. దరఖాస్తులు సమర్పించడానికి చివరితేదీ అదే నెల 11వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు అవకాశం కల్పించారు. ఆన్లైన్లో సమర్పించిన దరఖాస్తులను మాత్రమే ఆమోదిస్తారు. ఈ పోస్టులకు పేస్కేల్ రూ.58,850 నుంచి రూ.1,37,050 మధ్య ఉంటుంది. ఫలితాల ప్రకటన వరకు సంబంధితశాఖ నుంచి ఖాళీలు ఏవైనా ఉంటే వాటిని చేర్చడం లేదా తొలగించడం జరుగుతుంది. ఎంపికైన అభ్యర్థులు ప్రైవేట్ ప్రాక్టీస్‌కు అర్హులు కాదని స్పష్టం చేశారు. అభ్యర్థులను 100 పాయింట్ల ఆధారంగా ఎంపిక చేస్తారు. గరిష్టంగా 80 పాయింట్లు అర్హత పరీక్షలో పొందిన మార్కుల శాతం ప్రకారం ఇస్తారు.అంటే ఎంబీబీఎస్‌లో అన్ని సంవత్సరాలలో పొందిన మొత్తం మార్కులు 80 శాతంగా మార్చుతారు. విదేశాల్లో ఎంబీబీఎస్ చేసిన అభ్యర్థులకు సంబంధించి, ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ పరీక్ష (ఎఫ్ఎంజీఈ)లో పొందిన మార్కులశాతాన్ని పరిగణనలోకి తీసుకొని 80 శాతంగా మార్చుతారు. కాంట్రాక్ట్/ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వ ఆస్పత్రులు/సంస్థల్లో పనిచేసే వారికి గరిష్టంగా 20 పాయింట్లు ఇస్తారు. గిరిజన ప్రాంతాల్లో పనిచేసిన వారికి 6 నెలలకు 2.5 పాయింట్లు, ఇతర ప్రాంతాల్లో పనిచేసిన వారికి 6 నెలలకు 2 పాయింట్లు ఇస్తారు. అక్కడ పనిచేస్తున్నట్టు అనుభవ ధ్రువ పత్రాన్ని సంబంధిత అధికారి ద్వారా తీసుకోవాలి. అనుభవ ధ్రువ పత్రాన్ని పొందిన తర్వాత అభ్యర్థి ఈ పోస్టులకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.ఇతర ముఖ్యాంశాలు... » ఆన్లైన్లో దరఖాస్తు చేయడానికి ముందు, దరఖాస్తుదారులు సాఫ్ట్‌కాపీని దగ్గర ఉంచుకోవాలి. » ఆధార్ కార్డు, పదోతరగతి సర్టిఫికెట్ (పుట్టిన తేదీ రుజువుకు), ఎంబీబీఎస్ సమగ్ర మార్కుల మెమో, సర్టిఫికెట్, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ రిజి్రస్టేషన్ సర్టిఫికెట్, అనుభవ ధ్రువపత్రాలు, స్థానికతను తెలియజేసే స్టడీ సర్టిఫికెట్లు (1 నుంచి 7వ తరగతి), ఎస్సీ, ఎస్టీ, బీసీ కమ్యూనిటీ సర్టిఫికెట్, బీసీల విషయంలో నాన్–క్రీమిలేయర్ సర్టిఫికెట్, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోరేవారు తాజా ఆదాయ, ఆస్తి సర్టిఫికెట్, స్పోర్ట్స్ కేటగిరీ వారు స్పోర్ట్స్ సర్టిఫికెట్, దివ్యాంగులు సదరం సర్టిఫికెట్, మాజీ సైనికులు వయస్సు సడలింపునకు సరీ్వస్ సర్టిఫికెట్, ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్ కోసం సర్వీస్ సర్టిఫికోట్ అప్లోడ్ చేయాలి. » నోటిఫికేషన్ తేదీ నాటికి దరఖాస్తుదారులు తప్పనిసరిగా ఎంబీబీఎస్ లేదా తత్సమాన అర్హత చదివి ఉండాలి. సరి్టఫికెట్ల వెరిఫికేషన్ సమయంలో, ఏదైనా దరఖాస్తుదారుడు అవసరమైన అర్హత కాకుండా ఇతర అర్హతలు ఉంటే (అర్హతకు సమానమైనవి) వాటిని ’నిపుణుల కమిటీ’కి సిఫార్సు చేస్తారు. నిపుణులకమిటీ’ నివేదిక ప్రకారం బోర్డు నిర్ణయిస్తుంది.» తెలంగాణ కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన దర ఖాస్తుదారులు ఎలాంటి రిజర్వేషన్లకు అర్హులు కారు. » పోస్టులను మల్టీ–జోనల్‌గా వర్గీకరించారు. » మల్టీ జోన్–1లో జిల్లాలు: ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్, నిర్మ ల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, హన్మకొండ, వరంగల్. » మల్టీ జోన్–2 : సూర్యాపేట, నల్లగొండ, యాదాద్రి, జనగాం, మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, నారాయణపేట, జోగులాంబ–గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్ -
రాష్ట్రవ్యాప్తంగా తీవ్రమవుతున్న డయేరియా
సాక్షి, అమరావతి/జగ్గయ్యపేట/గూడూరు రూరల్ (తిరుపతి జిల్లా): కలుషిత నీరు, లోపించిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో డయేరియా ముప్పు నానాటికీ అధికమవుతున్నది. జూన్ ఒకటో తేదీ నుంచి 22వ తేదీ మధ్య వివిధ జిల్లాల్లో ఏకంగా 20 డయేరియా ఘటనలు చోటు చేసుకున్నాయి. 634 కేసులు నమోదవ్వగా.. ముగ్గురు మృత్యువాత పడినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వైద్య శాఖ లెక్కల ప్రకారం కాకినాడ జిల్లా ఎ.వి.నాగారం పీహెచ్సీ పరిధిలో 86 కేసులు నమోదవ్వగా ఒకరు మృతి చెందగా, ఇదే జిల్లాలోని వేటపాలెం పీహెచ్సీ పరిధిలో 32 కేసులు ఒక మరణం నమోదైంది. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట ప్రాంతంలో 79 కేసులు, ఒక మరణం సంభవించింది. తాజాగా మంగళవారం నాటికి పట్టణంతో పాటు జగ్గయ్యపేట, వత్సవాయి మండలాల్లో మరో 11 మంది వాంతులు, విరేచనాలతో ప్రభుత్వాస్పత్రిలో చేరారు. జగ్గయ్యపేట పట్టణంలో డయేరియా కేసులు అధికంగా నమోదవుతున్న నేపథ్యంలో.. మంగళవారం మున్సిపల్ రీజనల్ డైరెక్టర్ (రాజమండ్రి) నాగ నరసింహారావు పారిశుద్ధ్య నిర్వహణపై స్థానిక అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు సచివాలయాల్లో సిబ్బందికి డ్రెస్ కోడ్ లేకపోవడంతో ఒకరోజు వేతనం కట్ చేయాలని మున్సిపల్ కమిషనర్ నాగమల్లేశ్వరరావును ఆదేశించారు. ప్రభుత్వాస్పత్రికి డయేరియా కేసులు వస్తుండడంతో డీఎంహెచ్‌వో సుహాసిని పర్యవేక్షిస్తూ.. అవసరమైతే మెరుగైన వైద్యం నిమిత్తం విజయవాడకు తరలిస్తున్నారు. అలాగే మూడు రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురైన తిరుపతి జిల్లా గూడూరు మండలం చెన్నూరులోని గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థులను జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ధ్యాన్‌చంద్ మంగళవారం ఆకస్మికంగా పరామర్శించారు. విద్యార్థుల ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలని, అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని సంబంధిత అధికారులను హెచ్చరించారు. ఇదిలా ఉండగా రాష్ట్రవ్యాప్తంగా డయేరియా బారినపడిన వ్యక్తులు, మృతుల సంఖ్య అనధికారికంగా ఇంకా అధికంగా ఉన్నట్లు తెలుస్తున్నది. కాగా, కొత్త ప్రభుత్వం రాష్ట్రంలో కొలువుదీరడంతో వివిధ శాఖల అధికారులు మంచి పోస్టింగ్‌లు తెచ్చుకోవడం, ఇప్పటికే ఉన్న పోస్టింగ్‌ల్లో కొనసాగేలా పెద్దలను ప్రసన్నం చేసుకునే పనుల్లో పడ్డారు. దీంతో క్షేత్రస్థాయిలో పాలన గాడి తప్పింది. గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్యం లోపిస్తున్నది. తొలకరి నేపథ్యంలో నదులు, చెరువులు, బావుల్లోని నీరు కలుషితమై అతిసార వ్యాప్తి చోటు చేసుకుంటున్నది. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని పూర్తిస్థాయిలో సీజనల్ వ్యాధుల నియంత్రణకు ప్రణాళికతో అడుగులు వేయాలని ప్రజలు కోరుతున్నారు. -
స్పెషలిస్ట్ వైద్యానికి మంగళం
సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సంరక్షణ కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (పీహెచ్సీ) వైఎస్సార్సీపీ హయాంలో ప్రవేశపెట్టిన స్పెషలిస్ట్ క్లినిక్‌లకు టీడీపీ ప్రభుత్వం ఉద్వాసన పలికింది. క్లినిక్‌ల నిర్వహణ కోసం 8 స్పెషాలిటీల్లో నియమించిన 152 మంది వైద్యులను ఈ నెలాఖరుకు తొలగించాలని వైద్య శాఖ అన్ని జిల్లాల డీఎంహెచ్వోలను ఆదేశించింది. ఎన్హెచ్ఎం కింద కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఈ కార్యక్రమానికి 2024–25లో అనుమతులు ఇవ్వనందున స్పెషలిస్టు వైద్యులను తొలగించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. స్పెషలిస్ట్ వైద్య సేవల కోసం గ్రామీణ ప్రాంత ప్రజలు వ్యయ ప్రయాసలకోర్చి పట్టణాలు, నగరాల్లోని సీహెచ్‌సీ, ఏరియా, జిల్లా ఆస్పత్రులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా గతంలో దీన్ని ప్రవేశపెట్టారు. ఈమేరకు డెర్మటాలజీ, ఈఎన్టీ, జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, గైనకాలజీ, పల్మనాలజీ, ఆర్థోపెడిక్స్, పీడియాట్రిక్స్ విభాగాల్లో వైద్యులను 2021లో నియమించారు. వీరిలో ఒక్కో వైద్యుడు రోజుకు రెండు పీహెచ్‌సీల్లో రెండేసి గంటల చొప్పున స్పెషలిస్ట్ క్లినిక్‌లు నిర్వహిస్తూ వచ్చారు. ఇలా వారంలో 12 పీహెచ్‌సీల్లో సేవలు అందించేవారు. తద్వారా మధుమేహం, రక్తపోటు లాంటి జీవన శైలి జబ్బులను ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి అవసరమైన చికిత్స అందించేవారు. వివిధ వ్యాధిగ్రస్తులపై ప్రభావం రక్తపోటు, మధుమేహం, ఎముకలు, గైనిక్ సంబంధిత సమస్యలతో బాధపడే గ్రామీణ ప్రజలు స్పెషలిస్ట్ వైద్యులను సంప్రదించాలంటే ఏరియా, జిల్లా ఆస్పత్రులు లేదంటే బోధనాస్పత్రులకు వెళ్లాల్సి ఉంటుంది. వృద్ధులు, మహిళలు, నడవలేని స్థితిలో ఉన్న వారు ప్రయాణాలు చేసి పట్టణాలు, నగరాలకు వెళ్లాలంటే ఇది ఇబ్బందికరంగా మారింది. ఈ అవస్థలను నివారించేందుకు గత ప్రభుత్వం స్పెషలిస్టు క్లినిక్‌లను అందుబాటులోకి తెచ్చింది. టీడీపీ ప్రభుత్వం తొలగించిన స్పెషలిస్టు డాక్టర్లు ఇలాస్పెషాలిటీ వైద్యుల సంఖ్య డెర్మటాలజీ 17 ఈఎన్టీ 16 జనరల్ సర్జరీ 18 జనరల్ మెడిసిన్ 22 పల్మనాలజీ 10 గైనకాలజీ 22 ఆర్థోపెడిక్స్ 29 పీడియాట్రిక్స్ 18 -
రామోజీ ఏడుపుగొట్టు రాతలు
-
45 మంది విద్యార్థినులకు ఫుడ్‌పాయిజన్
మన్ననూర్: బాలికల గిరిజన ఆశ్రమపాఠశాలలో 45 మంది విద్యార్థినులు ఫుడ్ పాయిజన్‌తో అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన గురువారంరాత్రి నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూర్‌లో చోటుచేసుకున్నది. మన్ననూర్లోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో 400 మంది వరకు విద్యార్థినులు ఉన్నారు. గురువారంరాత్రి భోజనం చేసి నిద్రకు ఉపక్రమించారు. కొద్దిసేపటికే 10 మంది బాలికలు తీవ్ర అస్వస్థతకు గురై ఊపిరి ఆడకపోవడం, కడుపులో తీవ్రమైన నొప్పి వస్తోందని అల్లాడిపోయారు. దీంతో సమీపంలోని పీహెచ్‌సీకి తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స అందించిన తర్వా త అచ్చంపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఇదే సమయంలో వసతిగృహంలో ఒకరి తర్వాత మరొకరు అస్వస్థతకు గురవుతుండటంతో 4 అంబులెన్స్‌లలో సుమారు 45 మందిని అచ్చంపేటకు తరలించారు. ఆ తర్వాత లారీ తీసుకువచ్చి సుమారు వంద మంది విద్యార్థినులను అచ్చంపేటకు తీసుకెళ్లారు. ఇందులో ఇద్దరు బాలికల పరిస్థితి విషమంగా ఉండటంతో నాగర్‌కర్నూల్ ఆస్పత్రికి తరలించారు. -
అవాస్తవాలతో రామోజీ ‘ప్రసవ వేదన’
సాక్షి, అమరావతి: రామోజీరావుకు, ఆయన విష పత్రిక ఈనాడుకు ఒకటే ఏకసూత్ర ఎజెండా. తమకు నచ్చినవారిని నెత్తిన ఎక్కించుకోవడం.. నచ్చనివారిపై అదేపనిగా విషం కక్కడం. అందులోనూ పేద, బడుగు, బలహీనవర్గాల వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రామోజీ కాలకూట విషం చిమ్ముతున్నారు. రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (పీహెచ్సీ) నెలకు 15 శాతం వరకు ప్రసవాలు జరుగుతున్నాయి. స్వయంగా కేంద్ర ఆరోగ్య శాఖ ఆంధ్రప్రదేశ్‌లో వంద శాతం పీహెచ్‌సీలు 24/7 పనిచేస్తున్నాయని ప్రశంసలు కురిí³ంచింది. అయితే రామోజీకి ఇవేమీ కనిపించవు.. ఎందుకంటే ఆయన ‘లెక్కలు’ వేరే. ఆ లెక్కలు తన ముద్దుల చంద్రబాబుకు ఉపయోగపడాలి. అంతే.. ఇందుకోసం వాస్తవాలకు పాతరేసి అవాస్తవాలను అడ్డంగా ఈనాడులో అచ్చేస్తారు.. దుష్ప్రచారం చేయడంలో గోబెల్స్‌ను మించిపోతారు. ఇందులో భాగంగానే మంగళవారం ఈనాడులో ‘ప్రసవ వేదన’ అంటూ అవాస్తవాలు, అభూత కల్పనలతో ఒక కథనాన్ని వండివార్చారు. దీనికి సంబంధించి వాస్తవాలు ఇవిగో.. 13 నుంచి 15 శాతం ప్రసవాలు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ప్రతి పీహెచ్ïÜలో ఇద్దరు వైద్యులు, ముగ్గురు స్టాఫ్ నర్సులు కలిపి 14 మందిని నియమించింది. దీంతో పీహెచ్‌సీల వైద్య సేవలు గతంలో కంటే ఇప్పుడు బాగా మెరుగయ్యాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఒక వైద్యుడు మాత్రమే అందుబాటులో ఉండేవారు. ఆ వైద్యుడు సెలవు పెట్టినా.. విధులకు గైర్హాజరయినా ఇక రోగులు చుక్కలు చూడాల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో పీహెచ్‌సీల్లో ప్రస్తుతం సగటున నెలకు 13 నుంచి 15 శాతం ప్రసవాలు నిర్వహిస్తున్నారు. 2021–22లో 12.98%, 2022–23లో 13.05% ప్రసవాలు జరిగాయి. వాస్తవాలు ఇలా ఉంటే రామోజీ మాత్రం పీహెచ్‌సీల్లో కేవలం 2.5% ప్రసవాలు మాత్రమే జరుగుతున్నాయనిదుర్మార్గపు రాతలకు తెగబడ్డారు. మాతృ మరణాల కట్టడే లక్ష్యంగా.. ప్రభుత్వం గర్భిణులు, బాలింతల ఆరోగ్య రక్షణకు అనేక కార్యక్రమాలను అమలు చేస్తోంది. ఈ క్రమంలోనే హైరిస్క్ గర్భిణులకు సురక్షిత ప్రసవాలు నిర్వహించేలా ప్రత్యేక కార్యక్రమాన్ని గతేడాది డిసెంబర్ నుంచి అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా పీహెచ్‌సీల వారీగా హైరిస్క్ గర్భిణులను ముందే గుర్తించి వారిని ప్రసవ తేదీకి ముందే పెద్దాస్పత్రులకు తరలించి సురక్షిత ప్రసవాలు చేపడుతున్నారు. ఇలా హైరిస్క్ గర్భిణులు 22,825, అధిక రక్తహీతన సమస్యతో బాధపడుతున్న 1,584 మందికి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. చిన్న చిన్న సమస్యలకే పెద్దాస్పత్రులకు పీహెచ్‌సీల నుంచి గర్భిణులను రిఫర్ చేస్తున్నారని ‘ఈనాడు’ అవాస్తవాలను పేర్కొంది. వాస్తవానికి గర్భిణికి అధిక రక్తపోటు, మధుమేహం ఉండటం, బిడ్డ అడ్డం తిరగడం, బిడ్డ గుండె చప్పుడు అధికంగా/ తక్కువగా ఉన్న ఘటనల్లోనే పెద్దాస్పత్రులకు రిఫర్ చేస్తున్నారు. ఇలా రిఫర్ చేసిన వారిని వైఎస్సార్ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాల ద్వారా పెద్దాస్పత్రులకు తరలిస్తున్నారు. సాధారణ ప్రసవాలు పెంచడానికి, మాతృ మరణాల నియంత్రణకు మిడ్ వైఫరీ శిక్షణను ప్రారంభించి 60 మంది స్టాఫ్ నర్సులకు 18 నెలల పాటు శిక్షణ ఇచ్చారు. అలాగే 4,388 మంది స్టాఫ్ నర్సులు, వైద్యులకు స్కిల్ బర్త్ ఆట్టెన్టెంట్, దక్షత శిక్షణ అందించారు. అదే విధంగా హైరిస్క్ గర్భిణులను గుర్తించి వారికి సరైన వైద్యం అందించడానికి 17,110 స్టాఫ్ నర్సులు, 30 మంది వైద్యులకు శిక్షణ ఇచ్చి వీరి ద్వారా 6,095 సెషన్స్‌లో 1,56,099 గర్భిణులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇవన్నీ రామోజీకి పడితే ఒట్టు! ప్రసవానంతరం బాలింతలకు ఆరోగ్య ఆసరా.. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద ప్రసవానంతరం బాలింతలకు ఆరోగ్య ఆసరా కింద రూ.5 వేలు చొప్పున భృతి అందిస్తున్నారు. అంతేకాకుండా ఆరోగ్యశ్రీ కింద రెండు స్కానింగ్, ఒక టిఫా స్కాన్‌ను ఉచితంగా నిర్వహిస్తున్నారు. ఇలా ప్రభుత్వం తీసుకున్న వివిధ చర్యల ఫలితంగా ప్రసూతి మరణాలు పూర్తిగా తగ్గిపోయాయి. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాలు పెంచడానికి గతేడాది 2,42,106 మంది బాలింతలకు రూ. వెయ్యి చొప్పున ప్రోత్సాహకాలను అధికారులు అందించారు. ప్రభుత్వం ఇలా ఎన్నో చేస్తున్నా రామోజీరావు విషపు రాతలు రాయడం తన ముద్దుల చంద్రబాబుకు ప్రయోజనం చేకూర్చడానికి కాదా? క్షేమంగా తల్లీబిడ్డను ఇంటికి చేరుస్తున్న ప్రభుత్వం ప్రసవానికి ముందు గర్భిణుల ఆరోగ్య పరిరక్షణకు అనేక చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం ప్రసవానంతరం కూడా వారిని క్షేమంగా ఇంటికి చేర్చడానికి అంతే శ్రద్ధ కనబరుస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవానంతరం వైఎస్సార్ తల్లీబిడ్డా ఎక్స్‌ప్రెస్ వాహనాల్లో క్షేమంగా తల్లీబిడ్డను ఇంటికి చేరుస్తున్నారు. నాడు–నేడులో భాగంగా 279 తల్లీబిడ్డ వాహనాల స్థానంలో 500 వాహనాలను అందుబాటులోకి తెచ్చారు. గతంలో ఒక ట్రిప్పుకు ఇద్దరు బాలింతలను తరలిస్తుండగా ప్రస్తుతం ఒక ట్రిప్పుకు ఒక బాలింత, ఆమె సహాయకులను ఏసీ సదుపాయం ఉన్న వాహనంలో ఇంటి వరకూ తీసుకువెళ్లి సురక్షితంగా దింపుతున్నారు. దీంతో అప్పట్లో ఒక ట్రిప్పుకు కేవలం రూ.499 మాత్రమే ఖర్చు చేయగా.. ఈ ప్రభుత్వం హయాంలో ఒక ట్రిప్పుకు రూ.895 ఖర్చు చేస్తున్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ ప్రశంసలను కూడా పట్టించుకోరా? దేశంలో 100% పీహెచ్‌సీలను 24/7 నడుపుతున్న కొద్ది రాష్ట్రాల్లో ఏపీ ఒకటి అని కేంద్ర ఆరోగ్య శాఖ తన నివేదికల్లో కొనియాడింది. ఇవేమీ తనకు పట్ట వనుకున్న రామోజీ 24 గంటల సేవలు అంతంత మాత్రమేనని ఈనాడులో బురద రాతలకు దిగజా రారు. 24/7 పీహెచ్‌సీలు పనిచేసేలా వైద్య, ఆరో గ్య శాఖ పర్యవేక్షణ కొనసాగిస్తోంది. ముగ్గురు స్టాఫ్ నర్సులు, ఇద్దరు డాక్టర్లను ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ ద్వారా పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో శ్రీకాకుళం జిల్లాలో పలు పీహెచ్‌సీల్లో వైద్యులు ఒక్క పూటకు పరిమితం అవుతున్నారని ‘ఈనాడు’ పేర్కొనడం హాస్యాస్పదం కాక మరేమిటి! 2019 నుంచి వైద్య రంగం బలోపేతానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఇలా.. ♦ నాలుగేళ్లలో ఏకంగా దాదాపు 53 వేలకు పైగా వైద్య పోస్టుల భర్తీ. ఎప్పటి ఖాళీలకు అప్పుడే యుద్ధప్రాతిపదికన నియామకం. ఇందుకోసమే ప్రత్యేకంగా రిక్రూట్మెంట్ బోర్డ్ ఏర్పాటు. ♦ రూ.16,800 కోట్లతో 17 కొత్త వైద్య కళాశాలలు, వివిధ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణంతో పాటు నాడు–నేడు ద్వారా ప్రభుత్వాస్పత్రుల బలోపేతం ♦ గ్రామాల్లో 10,032 వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు. 12 రకాల వైద్య సేవలు, 14 రకాల పరీక్షలు, 105 రకాల మందులతో సొంత ఊళ్లలోనే ప్రజలకు వైద్య సేవలు ♦ దేశంలోనే తొలిసారిగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమలు. నెలకు రెండుసార్లు గ్రామాలకు పీహెచ్సీ వైద్యులు. ♦ టీడీపీ హయాంలో నిర్వీర్యమైన ఆరోగ్యశ్రీ బలోపేతం. వైఎస్సార్ ఆరోగ్యశ్రీలో ప్రొసీజర్లు 1,059 నుంచి ఏకంగా 3,257కి పెంపు. 40 లక్షల మందికి ఉచిత వైద్యం కోసం రూ.8 వేల కోట్ల వ్యయం. వైఎస్సార్ ఆరోగ్య ఆసరాతో విశ్రాంతి సమయంలో జీవన భృతి చెల్లింపు. ఇప్పటివరకూ 17.25 లక్షల మందికి రూ.1,074.69 కోట్లు అందించిన ప్రభుత్వం ♦ 108 (768 వాహనాలు), 104 (936) వాహనాలతో వైద్య సేవలు బలోపేతం. మరో 500 తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలతో కలిపి మొత్తం 2,204 వాహనాలతో ప్రజలకు ఉచిత వైద్య సేవలు. ఇలా మరే ప్రభుత్వంలోనూ లేవు. టీడీపీ ప్రభుత్వ హయాంలో కేవలం 108 అంబులెన్స్‌లు 531 మాత్రమే ఉండగా ఇందులో 336 మాత్రమే మనుగడలో ఉండేవి. ♦ ప్రభుత్వ ఆస్పత్రుల్లో జీఎంపీ, డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాలు కలిగిన మందులు ఉచితంగా అందించేలా ప్రభుత్వం చర్యలు -
బురదరోడ్లు.. ఆపై వైద్యులు లేరు..
బజార్హత్నూర్: వర్షానికి పాడైన రోడ్లు.. సమయానికి అందుబాటులో లేని డాక్టర్లు .. వెరసి ఓ బాలుడి నిండు జీవితం బలైంది. బురద రోడ్డుపై మోటార్‌సైకిల్‌పై ఆ స్పత్రికి చేరడం ఆలస్యం కావడం.. సమ యానికి వైద్యులూ అందుబాటులో లేక ఆ బాలుడు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలం డేడ్ర గ్రామానికి చెందిన గిరిజన దంపతులు పంద్ర లక్ష్మణ్, జమునల కుమారుడు పరుశురాం(3) బుధవారం రాత్రి నుంచి తీవ్ర జ్వరం, వాంతులు, విరేచనాలతో బాధపడ్డాడు. గ్రామం నుంచి పీహెచ్‌సీకి 16కిలోమీటర్ల దూరం ఉండగా.. వర్షాలకు అధికభాగం రోడ్డు బురదమయమైంది. అదే రోడ్డుపై గురువారం ఉదయం 6 గంటలకు బయలుదేరి మోటార్‌సైకిల్‌పై పీహెచ్‌సీకి బాలుడిని తీసుకువచ్చారు. అయితే ఆ సమయంలో వైద్యులు అందు బాటులో లేరని, కింది స్థాయి సిబ్బంది పట్టించుకోలేదని, రిమ్స్‌కు తీసుకెళ్లాలని సూచించారని లక్ష్మణ్ తెలిపాడు. కొద్దిసేపటికే బాబు మృతిచెందాడని, వైద్యులు అందుబాటులో ఉంటే తన కుమారుడు బతికేవాడని ఆవేదన వ్యక్తం చేశాడు. దంపతులిద్దరూ మోటార్‌సైకిల్‌పైనే మృతదేహంతో గ్రామానికి చేరుకున్నారు. చనిపోయిన తర్వాతే తీసుకొచ్చారంటూ మెడికల్ ఆఫీసర్ వితండవాదన కాగా, ఈ విషయమై మెడికల్ ఆఫీసర్ భీంరావ్‌ను ఫోన్లో సంప్రదించగా.. బాలుడు మృతిచెందిన తర్వాతే ఆస్పత్రికి తీసుకొచ్చారని తెలిపారు. ఆసుపత్రిలో వైద్యులే లేరు కదా మృతిచెందినట్లు ఎవరు నిర్ధారించారని అడగ్గా.. సమాధానం చెప్పలేదు. -
ఒక్క ప్రసవం చేస్తే ఒట్టు... రెండు పీహెచ్‌సీలు ఉన్నా జరగని కాన్పులు
బషీరాబాద్: కర్ణాటక సరిహద్దులోని బషీరాబాద్ మండలంలో రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నా ప్రసవాలు మాత్రం చేయడం లేదు. తాండూరు జిల్లా ఆస్పత్రికి 25కి.మీ. దూరంలో మండలం ఉండడంతో ఇక్కడి ప్రజలకు వైద్య సేవలు చేరువ చేయాలనే సంకల్పంతో బషీరాబాద్, నవల్గా గ్రామాల్లో పీహెచ్‌సీలను ఏర్పాటు చేశారు. బషీరాబాద్‌లో 24 గంటల వైద్య సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇక్కడి సిబ్బంది ఉదయం10కి వచ్చి సాయంత్రం 5గంటలకు ఇళ్లకు వెళ్లి పోతున్నారు. రాత్రి వేళ గర్భిణులు వచ్చినా, యాక్సిడెంట్ కేసులు, పాము కాటు కేసు బాధితులను తాండూరు జిల్లా ఆస్పత్రికి రెఫర్ చేస్తున్నారు. ఇన్ పేషెంట్లు వస్తే సాయంత్రం వరకు వైద్యం చేసి రాత్రికి ఇంటికి పంపుతున్నారు. లేబర్ రూమ్ సరిగ్గా లేకపోవడంతో మూడు నెలలుగా ప్రసవాలు నిలిచిపోయాయి. కొంతమంది గర్భిణులు తాండూరు పీహెచ్సీలో, మరికొందరు ప్రైవేటు ఆస్పత్రుల్లో పురుడు పోసుకుంటున్నారు. నవల్గ్గాలో మరీ దారుణం నవల్గ్గా పీహెచ్సీలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఈ పీహెచ్సీ పరిధిలో మూడు గ్రామాలు ఉండగా ఒక్క కాన్పు కూడా జరగలేదు. అడపాదడపా వచ్చే రోగులకు ఓపీ చూసి సాయంత్రం కాగానే ఇంటి ముఖం పడుతున్నారు. దీంతో ప్రజలకు వైద్యం అందని ద్రాక్షగా మారింది. ఏదైన ప్రమాదం జరిగితే తాండూరు వెళుతున్నారు కానీ, పీహెచ్‌సీకి రావడం లేదని ఆస్పత్రి వర్గాలే చెబుతున్నాయి. బషీరాబాద్ మెడికల్ అధికారిగా పనిచేస్తున్న వైద్యుడు గోపాల్ ఇక్కడ ఇన్చార్జ్ బాధ్యతలు చూస్తున్నాడు. స్కానింగ్‌కు ప్రైవేటు సెంటర్లకు మండలంలోని రెండు పీహెచ్‌సీల్లో అల్ట్రా సౌండ్ స్కానింగ్ మిషన్లు లేకపోవడంతో గర్భిణులు తాండూరులోని ప్రైవేటు ఆస్పత్రులకు వెళుతున్నారు. జిల్లా ఆస్పత్రిలోనూ ఒకే కేంద్రం ఉండడంతో అక్కడ స్కానింగ్‌కు సమయం పడుతోంది. దీంతో గర్భిణులు బయట కేంద్రాల బాట పడుతున్నారు. పీహెచ్‌సీల్లో స్కానింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. అత్యవసర వైద్యం అందడం లేదు బషీరాబాద్ పీహెచ్సీలో 24 గంటలు వైద్య సేవలు అందించాల్సి ఉంది. అయితే ఇక్కడి సిబ్బంది ఆరేడు గంటలు మాత్రమే విధుల్లో ఉంటున్నారు. అత్యవసర వైద్యం అందడం లేదు. ప్రసవాల కోసం వచ్చినా, ప్రమాదాలు జరిగినా తాండూరు జిల్లా ఆస్పత్రికి రెఫర్ చేస్తున్నారు. రాత్రి వేళ ప్రైవేటు ఆస్పత్రులే దిక్కవుతున్నాయి. గతంలో పాము కాటుకు గురైన యువకుడు ఆస్పత్రికి వస్తే ఇంజక్షన్ ఇచ్చేవారు లేక ప్రైవేటు ఆస్పత్రిలో చేరి మృతి చెందాడు. – లక్ష్మణ్, యువజన సంఘం నాయకుడు, బషీరాబాద్ -
వైద్యరంగంలో మరింతగా ముందడుగులు వేస్తున్న వైఎస్ జగన్
-
ఏపీలో గ్రామీణ పీహెచ్ సీల పనితీరు అద్భుతమని కేంద్రం వెల్లడి
-
రాయలచెరువు పీహెచ్ సీలో మహిళా సిబ్బంది దుస్తులు మార్చుకుంటుండగా సెల్ ఫోన్ తో చిత్రీకరణ
-
Family Doctor: పల్లె తలుపు తట్టి.. ప్రజల నాడి పట్టి..
(చిట్యాల, వేములపల్లి గ్రామాల నుంచి సాక్షి ప్రతినిధి వడ్డే బాలశేఖర్) ‘‘ఆరోగ్యం ఎలా ఉంది? సమయానికి మందులు వాడుతున్నారా?’’ ‘‘బాగానే ఉంది..’’ సైగల ద్వారా కోటేశ్వరరావు సమాధానం. ‘‘పెద్ద డాక్టర్ రాసిచ్చిన మందులతో పాటు పోయినసారి మీరిచ్చిన బీపీ మందులు సమయానికి ఇస్తున్నామమ్మా.. ఫర్వాలేదు.. నా బిడ్డ ఆరోగ్యం బాగానే ఉంది’’ ఇదీ.. తమ ఇంటికే వచ్చి పరామర్శిస్తున్న డాక్టర్‌తో ఆనందంగా కోటేశ్వరరావు తల్లి నాగమ్మ సమాధానం. ‘‘సరే.. గుండె కొట్టుకోవడం, పల్స్ రేట్, బీపీ, షుగర్.. అన్నీ బాగానే ఉన్నాయి. ప్రస్తుతం వాడుతున్న మందులు అలానే కొనసాగించండి. ఏదైనా సమస్య వస్తే సిబ్బందిని సంప్రదించండి. లేదంటే నాకు ఫోన్ చేయండి. ధైర్యంగా ఉండండి..’’ డాక్టర్ భరోసా. ఇలా ‘ఫ్యామిలీ డాక్టర్’ విధానంతో ఉన్న ఊరికే వైద్యులు వచ్చి ఆరోగ్య వివరాలను వాకబు చేస్తుండటంతో ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సిన అవస్థలు తొలగాయని గ్రామీణ ప్రాంత ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్నం వరకు ఓపీ (అవుట్ పేషంట్) సేవలు అందించి, ఆ తర్వాత నడవలేని స్థితిలో ఉన్న వారి ఇళ్ల వద్దకే వెళ్లి వైద్యం అందిస్తున్నారు. గ్రామీణ ప్రజలకు ప్రభుత్వ వైద్యాన్ని మరింత చేరువ చేయడంతో పాటు మెరుగైన ఆరోగ్య సంరక్షణ కోసం ‘ఫ్యామిలీ డాక్టర్’ అనే సరికొత్త కార్యక్రమానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. గత అక్టోబర్ 21న వైద్య శాఖ రాష్ట్ర వ్యాప్తంగా ట్రయల్ రన్ ప్రారంభించగా ‘సాక్షి’ క్షేత్ర స్థాయిలో పర్యటించి అమలు తీరును పరిశీలించింది. ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి పీహెచ్సీ డాక్టర్ సుష్మ ప్రియదర్శిని చిట్యాల గ్రామంలో నివసించే పక్షవాత బాధితుడు కోటేశ్వరరావు ఇంటిని నెలకు ఒకసారి సందర్శిస్తున్నారు. ‘గతంలో బీపీ, షుగర్ పరీక్షల కోసం ఆస్పత్రికి ప్రత్యేకంగా ఆటోలో వెళ్లాల్సి రావడంతో డబ్బులు ఖర్చయ్యేవి. ఇప్పుడు ఆ ఇబ్బందులు లేవు’ అని ఆ కుటుంబం చెబుతోంది. ఇదే గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ వి.కృష్ణ గత ఆగస్టులో రోడ్డు ప్రమాదానికి గురి కావడంతో కాలు విరిగింది. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వమే ఉచితంగా శస్త్ర చికిత్స నిర్వహించి ఉచితంగా మందులతో పాటు మూడు నెలల విశ్రాంతి సమయంలో వైఎస్సార్ ఆసరా కింద రూ.12,500 ఆర్థిక సాయం చేసింది. పీహెచ్సీ డాక్టర్ ఇంటికే వెళ్లి ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య వివరాలను వాకబు చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం వేములపల్లి గ్రామానికి చెందిన కె.లక్ష్మి ఐదు నెలల గర్భిణి. గతంలో వైద్య పరీక్షల కోసం ప్రతి నెల 9వ తేదీన పెండ్యాల పీహెచ్‌సీకి వెళ్లేది. మిగిలిన రోజుల్లో ఎప్పుడైనా అవసరమైతే గ్రామంలోని వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌కు వెళ్లేది. అయితే ప్రస్తుతం నెలలో రెండు రోజులు పీహెచ్సీ వైద్యురాలు గ్రామానికే వస్తున్నారు. ఆమెకే కాకుండా విలేజ్ క్లినిక్ పరిధిలోని 21 మంది గర్భిణులకు వైద్య సేవలు ఇంటి వద్దే అందుతున్నాయి. తొలగిన వ్యయ ప్రయాసలు దాదాపు 1,800 మంది నివసించే చిట్యాలలో 2019కి ముందు ప్రాథమిక ఆరోగ్య సేవల కోసం ఆరు కి.మీకి పైగా ప్రయాణించి వత్సవాయి పీహెచ్‌సీకి వెళ్లాల్సి వచ్చేది. స్పెషలిస్ట్ డాక్టర్ కోసం 30 కి.మీ పైగా దూరంలో ఉండే నందిగామ లేదంటే 80 కి.మీ పైనే ఉన్న విజయవాడకు వెళ్లక తప్పదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక గ్రామంలోనే విలేజ్ క్లినిక్ సేవలు ప్రారంభం అయ్యాయి. 12 రకాల వైద్య సేవలు, 14 పరీక్షలు, 67 రకాల మందులు అక్కడే అందుబాటులోకి వచ్చాయి. టెలీ మెడిసిన్ ద్వారా గైనిక్, పీడియాట్రిషన్, ఇతర స్పెషాలిటీ వైద్యుల కన్సల్టెన్సీ లభిస్తుంది. తాజాగా ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం ద్వారా పీహెచ్సీ డాక్టర్ ప్రతి నెలా గ్రామానికే వస్తున్నారు. గ్రామంలో 239 మంది బీపీ, షుగర్ బాధితులున్నారు. 13 మంది గర్భిణులు, ఏడుగురు బాలింతలు, 18 మంది అనీమియా బాధితులకు డాక్టర్ సేవలు అందుతున్నాయి. వేములపల్లిలో 220 మంది బీపీ, షుగర్ బాధితులు, 21 మంది గర్భిణులు, 9 మంది బాలింతలకు పీహెచ్సీ డాక్టర్ నెలలో రెండు దఫాలు గ్రామానికే వచ్చి వైద్య సేవలు అందిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా వేములపల్లిలోని వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లో వైద్య సేవలు పొందుతున్న రోగులు అంగన్వాడీలు, స్కూళ్లకు కూడా.. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌లో భాగంగా రాష్ట్రంలోని 1,142 పీహెచ్‌సీల్లో ఇద్దరు చొప్పున వైద్యులకు ఆయా పరిధిలోని గ్రామ సచివాలయాలను కేటాయించారు. ఒక్కో సచివాలయం పరిధిలో నెలకు రెండుసార్లు సందర్శించి గ్రామంలోనే వైద్య సేవలు అందిస్తున్నారు. 104 ఎంఎంయూతో పాటు వెళ్లి విలేజ్ క్లినిక్‌లలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ ఓపీ సేవలు అందిస్తున్నారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకూ గ్రామంలో మంచానికే పరిమితం అయిన వృద్ధులు, దివ్యాంగులు, పక్షవాత బాధితులు, ఆరోగ్యశ్రీ కింద శస్త్ర చికిత్సలు చేయించుకున్న వారి ఇళ్లకే వెళ్లి పరామర్శించి అవసరమైన సేవలు అందచేస్తున్నారు. అంగన్వాడీలు, ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి చిన్నారులు, పిల్లల ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారు. ఇప్పటి వరకు 12.72 లక్షల మందికి వైద్యం రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యామిలీ డాక్టర్ ట్రయల్‌రన్ అక్టోబర్ 21న ప్రారంభం కాగా ఇప్పటి వరకు పీహెచ్సీ వైద్యులు 7,166 విలేజ్ క్లినిక్‌లను నెలలో రెండుసార్లు, 2,866 క్లినిక్‌లను నెలలో ఒకసారి సందర్శిస్తున్నారు. ఇలా ఇప్పటి వరకూ 12,72,709 మందికి వైద్య సేవలు అందించారు. ‘ఫ్యామిలీ డాక్టర్’తో గ్రామాల్లో అందే వైద్య సేవలు ► జనరల్ అవుట్ పేషెంట్ సేవలు ► బీపీ, షుగర్, ఊబకాయం లాంటి జీవనశైలి జబ్బుల కేసుల ఫాలోఅప్ ► గర్భిణులకు యాంటినేటల్ చెకప్స్, బాలింతలకు పోస్ట్‌నేటల్ చెకప్స్, ప్రసవానంతర సమస్యల ముందస్తు గుర్తింపు. చిన్నపిల్లలో పుట్టుకతో వచ్చిన లోపాల గుర్తింపు. ► రక్తహీనతతో బాధపడుతున్న మహిళలు, చిన్న పిల్లలకు వైద్య సేవలు ► ఆరోగ్యశ్రీ కింద శస్త్ర చికిత్స జరిగిన రోగులు, క్యాన్సర్, ఇతర ధీర్ఘకాలిక జబ్బులతో మంచానికే పరిమితం అయిన వారికి, వృద్ధులకు ఇంటి వద్దే వైద్యం. ► పాలియేటివ్ కేర్ ► తాగునీటి వనరుల్లో క్లోరినేషన్ నిర్ధారణ గ్రామాల్లోనే 14 రకాల పరీక్షలు ► గర్భం నిర్ధారణకు యూరిన్ టెస్ట్ ► హిమోగ్లోబిన్ టెస్ట్ ► ర్యాండమ్ గ్లూకోజ్ టెస్ట్ (షుగర్) ► మలేరియా టెస్ట్ ► హెచ్ఐవీ నిర్ధారణ ► డెంగ్యూ టెస్ట్ ► మల్టీపారా యూరిన్ స్ట్రిప్స్ (డిప్ స్టిక్) ► అయోడిన్ టెస్ట్ ► వాటర్ టెస్టింగ్ ► హెపటైటిస్ బి నిర్ధారణ ► ఫైలేరియాసిస్ టెస్ట్ ► సిఫ్లిస్ ర్యాపిడ్ టెస్ట్ ► విజువల్ ఇన్స్పెక్షన్ ► స్పుటమ్ (ఏఎఫ్‌బీ) పెద్ద భారం తప్పింది నాకు 72 ఏళ్లు. నడుము నొప్పి ఉంది. కర్ర సాయంతో కొద్ది దూరం నడవగలను. బీపీ, షుగర్‌కు నెల నెలా డాక్టర్‌కు చూపించుకునేందుకు నా కుమార్తె పట్ణణానికి తీసుకెళ్లేది. ఇప్పుడు వేములపల్లెకు ప్రభుత్వ డాక్టర్ నెలకు రెండు సార్లు వస్తున్నారు. డాక్టరమ్మ బాగా చూస్తోంది. మందులు రాసిచ్చింది. దగ్గరే కాబట్టి ఒక్కదాన్నే వస్తున్నా. పెద్ద భారం తొలగింది. లేదంటే నా కుమార్తె రోజంతా తన పని వదులుకోవాల్సి వచ్చేది. – వసంత నాగేంద్రమ్మ, ఎస్.అమరవరం, ఎన్టీఆర్ జిల్లా బాలింతకు వైద్య సేవలు.. ఇటీవల పాప పుట్టింది. నాకు పుట్టుకతోనే ఫిట్స్ సమస్య ఉంది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ప్రసవానికి నిరాకరించడంతో వత్సవాయి పీహెచ్సీ డాక్టర్ విజయవాడకు రిఫర్ చేశారు. అక్కడి వైద్యులు కాన్పు చేశారు. ఫిట్స్ సమస్యకు కూడా వైద్యం చేశారు. డిశ్చార్జి అయి ఇంటికి వచ్చాక వైద్యులు రెండు సార్లు మా ఇంటికి వచ్చి మా ఆరోగ్యం గురించి వాకబు చేశారు. అవసరమైన మందులిస్తున్నారు. – అద్దంకి మౌనిక, చిట్యాల, ఎన్టీఆర్ జిల్లా కొత్త అనుభూతి.. నెలలో ఏ రోజు ఏ గ్రామానికి వెళ్లాలో మాకు ముందుగానే టైమ్ టేబుల్ నిర్దేశించారు. ఉదయమే 104 ఎంఎంయూతో పాటు గ్రామానికి వెళ్తాం. ముందు రోజే సంబంధిత గ్రామ ప్రజలకు ఆరోగ్య సిబ్బంది సమాచారం ఇస్తారు. ప్రజల వద్దకే వెళ్లి సేవ చేస్తుండటం ఓ కొత్త అనుభూతి. – డాక్టర్ సుష్మ ప్రియదర్శిని, వత్సవాయి పీహెచ్సీ, ఎన్టీఆర్ జిల్లా నిరంతరం సమీక్షిస్తున్నాం సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టిన ప్రతిష్టాత్మక ఫ్యామిలీ డాక్టర్ ట్రయల్‌రన్ విజయవంతంగా నడుస్తోంది. నిరంతర సమీక్షతో క్షేత్ర స్థాయిలో సమస్యలు గుర్తించి పరిష్కరిస్తున్నాం. మరింత సమర్థవంతంగా ప్రజలకు చేరువయ్యేలా చర్యలు చేపడుతున్నాం. రోగులు, వైద్యం వివరాలను ప్రత్యేక యాప్‌లో నమోదు చేస్తున్నాం. దీని ద్వారా ప్రతి వ్యక్తి ఆరోగ్య చరిత్ర ‘ఆయుష్మాన్ భారత్’ డిజిటల్ ఖాతాల్లో నిక్షిప్తం అవుతుంది. – ఎం.టి.కృష్ణ బాబు, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి వైద్య రంగంలో సమూల మార్పులు ఒకప్పుడు గ్రామీణ ప్రజలు ప్రభుత్వ వైద్యులు ఎక్కడున్నారో వెతుక్కుంటూ వెళ్లాల్సిన దుస్థితి ఉండేది. ఆ పరిస్థితులను సీఎం జగన్ సమూలంగా రూపుమాపారు. వైద్య, ఆరోగ్య శాఖలో సంస్కరణలు చేపట్టారు. ఇందులో భాగంగా ఫ్యామిలీ డాక్టర్ అనే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. డాక్టర్లు ప్రజలకు అందుబాటులోకి వెళ్లి వైద్య సేవలు అందిస్తున్నారు. టీడీపీ హయాంలో పీహెచ్‌సీల్లో వైద్యులు, సిబ్బంది, మందులు ఉండేవి కాదు. ఇప్పుడు విలేజ్ క్లినిక్‌ల ద్వారా 67 మందులు, 14 వైద్య పరీక్షలు, వైద్య సేవలను ప్రజలకు అందుబాటులో ఉంచాం. – విడదల రజని, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి -
ప్రభుత్వ వైద్యం.. పల్లెల దైన్యం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతా ల్లో ప్రభుత్వ వైద్యం అంతంతే అందుతోంది. జనాభా పెరుగుతున్నా ఆ మేరకు వైద్య సేవలు విస్తృతం కావట్లేదు. పల్లెల్లో అనుకున్నంత సంఖ్యలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీ), సామాజిక ఆరోగ్య కేంద్రాలు (సీహెచ్‌సీ) అందుబాటులో లేవు. ఈ వివరాలన్నింటినీ కేంద్ర ఆరో గ్య, కుటుంబ సంక్షేమ శాఖ తాజాగా విడుదల చేసిన దేశంలో ‘గ్రామీణ వైద్య గణాంకాలు 2020– 21’లో వెల్లడించింది. ఇందులో రాష్ట్రాల వారీగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ వైద్య సేవల తీరును ప్రస్తావించింది. పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు పెరగాలి గ్రామీణ జనాభాకు అనుగుణంగా రాష్ట్రంలో 721 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అవసరం ఉండగా ప్రస్తుతం 636 మాత్రమే ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. సామాజిక ఆరోగ్య కేంద్రాలు 180 అవసరం ఉండగా 85 మాత్రమే కొనసాగుతున్నాయంది. పలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో మంజూరు చేసిన పోస్టుల కంటే పనిచేస్తున్న వారి సంఖ్య తక్కువగా ఉందని చెప్పింది. సిబ్బంది సంఖ్య కూడా మరింత పెరగాలని, గ్రామీణ వైద్య సేవలు మెరుగు పడాల్సిన అవసరం ఉందని పేర్కొంది. రాష్ట్రంలో 33 జిల్లాలున్నాయి. వీటి పరిధిలో 5 వేల ఆరోగ్య ఉప కేంద్రాలున్నాయి. ఇవి 863 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో కొనసాగుతున్నాయి. వీటితో పాటు 95 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, 37 సబ్ డివిజినల్ ఆస్పత్రులు, 5 జిల్లా ఆస్పత్రులున్నాయి. గ్రామీణ ఆస్పత్రుల పరిస్థితి ఇలా.. ♦రాష్ట్రంలోని 5 జిల్లా ఆస్పత్రుల్లో 319 వైద్యుల పోస్టులు ప్రభుత్వం మంజూరు చేయగా 266 మంది డాక్టర్లే పని చేస్తున్నారు. సబ్ డివిజినల్ ఆస్పత్రుల్లో 1,421 వైద్యుల పోస్టులకు 681 మందే విధుల్లో ఉన్నారు. 85 గ్రామీణ సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో జనరల్ సర్జన్లు, గైనకాలజిస్టులు, జనరల్ ఫిజీషియన్లు, పీడియాట్రీషియన్లు కలుపుకొని మొత్తం 625 స్పెషలిస్టు పోస్టులు మంజూరవగా 367 ఖాళీగా ఉన్నాయి. వీటిలో 53 మంది జనరల్ సర్జన్లు, 141 మంది గైనకాలజిస్టులు, 49 మంది జనరల్ ఫిజీషియన్లు, 124 మంది పిల్లల వైద్యుల పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయలేదు. సీహెచ్‌సీల్లో 219 అనస్థటిస్ట్ పోస్టులకు 126.. అలాగే 44 కంటి వైద్యుల పోస్టులకు 19 భర్తీ కాలేదు. ♦సీహెచ్‌సీల్లో జనరల్ డ్యూటీ వైద్యులకు సంబంధించి ఆయుష్ కేటగిరీలో 29 ఖాళీలు, అల్లోపతిలో 122 ఖాళీలు భర్తీ కావాల్సి ఉంది. సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో కనీసం ఒక్కొక్కరు చొప్పున స్పెషలిస్టు ఆయుష్ వైద్యులను నియమించాల్సి ఉండగా ఒక్క పోస్టు కూడా మంజూరు చేయలేదు. ♦ఆరోగ్య ఉప కేంద్రాలకు 8,996 ఏఎ¯న్ఎం పోస్టులు మంజూరు చేస్తే 1,053 ఖాళీగా ఉన్నాయి. పురుషుల కేటగిరీలో 1,911 ఆరోగ్య కార్యకర్తల పోస్టులను 689 నింపాల్సిఉంది. ♦పీహెచ్‌సీల్లో 1,254 మంది అల్లోపతి వైద్య పోస్టులకు 41 ఖాళీగా ఉన్నాయి. ఆయుష్ వైద్యుల పోస్టులు 394 మంజూరవగా 151 భర్తీ కాలేదు. ♦పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలకు 2,412 నర్సుల పో స్టులు మంజూరవగా 336 ఖాళీగా ఉన్నాయి. జిల్లా ఆస్పత్రుల్లో పారామెడికల్ పోస్టులు 869 మంజూరవగా 708 మాత్రమే భర్తీ చేశారు. ప్రాంతీయ ఆస్పత్రుల్లో 1,217 పోస్టులకు 979 మాత్రమే భర్తీ అయ్యాయి. -
పల్లెల్లో ఆరోగ్య భాగ్యం.. ప్రజల చెంతకే సర్కారీ వైద్యం
►నాడు: ప్రభుత్వాస్పత్రి అంటే చిన్నచూపు.. ప్రజలకు ఏదైనా జబ్బు వస్తే పెద్దాసుపత్రికి వెళ్లాల్సిందే. పెద్ద రోగమొస్తే పేదలు ప్రాణాలపై ఆశ వదులుకోవాల్సిందే.. ఆపరేషన్ చేయించుకోవాలంటే అప్పు కోసం పరుగు తీయాల్సిన పరిస్థితి. ప్రభుత్వాస్పత్రికి వెళదామంటే గ్రామం నుంచి కిలోమీటర్ల మేర ప్రయాణించాలి. తీరా వెళ్లినా అక్కడ వైద్య సేవలు అందేవి కావు. ►నేడు: పేదలకు ఆరోగ్య భాగ్యాన్ని అందించేలా ప్రభుత్వం ఆరోగ్యశ్రీ అమలు చేస్తోంది. పల్లెల్లో డాక్టర్ వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్, పట్టణాల్లో అర్బన్ హెల్త్ క్లినిక్స్ ఏర్పాటుచేసి వైద్యాన్ని ప్రజలకు చేరువ చేసింది. ఆయా క్లినిక్స్‌లో 12 రకాల వైద్యసేవలు అందుతున్నాయి. ఆపరేషన్ అవసరమైతే ఆరోగ్యశ్రీ భరోసాగా నిలుస్తోంది. ఆపరేషన్ అనంతరం కూడా వైఎస్సార్ ఆరోగ్య ఆసరా ద్వారా ఆర్థిక సాయం అందుతోంది. ఏలూరు టౌన్(ఏలూరు జిల్లా: రాష్ట్రంలో వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వాస్పత్రులు, పీహెచ్‌సీలను అభివృద్ధి చేయడంతో పాటు అధునాతన పరికరాలు, మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు వైద్య నిపుణులు, సిబ్బందిని నియమిస్తున్నారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని పటిష్టపర్చడంతో పాటు ఆరోగ్యశ్రీలో ఆపరేషన్ చేయించుకున్న వారికి వైఎస్సార్ ఆరోగ్య ఆసరా ద్వారా చేయూత అందిస్తున్నారు. చదవండి: AP: నూతన మంత్రుల ప్రమాణ స్వీకారం.. సీఎస్ కీలక ఆదేశాలు నాలుగు గదులతో.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రా లకు అనుబంధంగా ప్రతి గ్రామంలో డాక్టర్ వైఎ స్సార్ విలేజ్ క్లినిక్‌ను ప్రభుత్వం ఏర్పాటుచేస్తోంది. సమీప పీహెచ్సీ వైద్యుడి పర్యవేక్షణలో బీఎస్సీ నర్సింగ్ చదివిన నర్సింగ్ సిబ్బంది, ఒక ఏఎన్ఎం, సచివాలయం పరిధిలో ఆరోగ్య కార్యకర్త క్లినిక్‌లో అందుబాటులో ఉంటారు. ఇక్కడ అన్నిరకాల మందులు అందించేందుకు చర్యలు చేపట్టారు. విలేజ్ క్లినిక్‌లో వెయిటింగ్ రూమ్, ఓపీ రూమ్, కట్లు కట్టే గది, పరీక్షలకు మరో గదిని ఏర్పాటు చేస్తున్నారు. ఏలూరు జిల్లాలో 60 పీహెచ్‌సీలు: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు 938 విలేజ్ క్లినిక్‌లు మంజూరయ్యాయి. వీటిలో ఏలూరు జిల్లాలో 375 ఉండగా కైకలూరు, నూజివీడు నియోజకవర్గాల్లోని 159తో కలిసి మొత్తం 534కు చేరాయి. ఉమ్మడి జిల్లాలో 152 విలేజ్ క్లినిక్‌ల భవన నిర్మాణాలు పూర్తయ్యాయి. ఉమ్మడి జిల్లాలో రూరల్ పీహెచ్‌సీలు 94 ఉండగా ఏలూరు జిల్లాలో 43, కైకలూరు, నూజివీడు నియోజకవర్గాల్లోని పీహెచ్‌సీలు 17తో కలిపి ఆ సంఖ్య 60కు చేరింది. ఉమ్మడి జిల్లాలో అర్బన్ పీహెచ్‌సీలు 34 ఉండగా, ఏలూరు జిల్లాకు 12, నూజివీడు, కైకలూరు నియోజకవర్గాల్లోని 2 పీహెచ్‌సీలతో కలిపి 14 ఉన్నాయి. మెరుగైన సేవలు గ్రామాల్లో పేదలకు నాణ్యమైన మెరుగైన సేవ లు అందించేందుకు ప్ర భుత్వం విలేజ్ క్లినిక్స్ ఏర్పాటుచేస్తోంది. కేంద్రాలకు భవనాల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇప్పటికే 104 సంచార వైద్యశాలలతో గ్రామాల్లో వైద్య పరీక్షలు చేయడంతో పాటు మందులు అందిస్తున్నాం. పీహెచ్‌సీలను బలోపేతం చేస్తున్నాం. విలేజ్, అర్బన్ క్లినిక్స్ తో వైద్య సేవలు మరింత విస్తృతంగా ప్రజలకు చేరువకానున్నాయి. – డాక్టర్ బి.రవి, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి -
పీహెచ్‌సీలపై పీజీల మోజు
►ఆయన పేరు డాక్టర్ రంగారావు (పేరు మార్చాం). రంగారెడ్డి జిల్లాలోని ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(పీహెచ్సీ)లో మెడికల్ ఆఫీసర్. ఎంబీబీఎస్ పూర్తయ్యాక ఆయన ఈ పోస్టులో చేరారు. ఆ తర్వాత ఎండీ ఫల్మనరీ పూర్తిచేశారు. పీహెచ్‌సీకి రెగ్యులర్‌గా వెళ్లకుండా మేనేజ్ చేసుకుంటూ హైదరాబాద్ పరిధిలో కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నారు. ►ఆమె పేరు డాక్టర్ ప్రభావతి(పేరు మార్చాం). ఎంబీబీఎస్ పూర్తయ్యాక ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని ఓ పీహెచ్సీలో పనిచేస్తున్నారు. తర్వాత ఎండీ గైనిక్ చదివారు. వారానికి ఒకట్రెండు రోజులు పీహెచ్‌సీకి వెళ్లి వస్తూ హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో కన్సల్టెంట్‌గా పనిచేస్తూ నెలకు రూ.2 లక్షలు సంపాదిస్తున్నారు. సొంతంగా ప్రాక్టీస్ చేసుకుంటూ దాదాపు రూ.5 లక్షల వరకు సంపాదిస్తున్నారు. సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్ చదివాక పీహెచ్‌సీల్లో మెడికల్ ఆఫీసర్‌గా చేరినవారు, ఆ తర్వాత పీజీ పూర్తయ్యాక కూడా అక్కడే తిష్ట వేస్తున్నారు. మెడికల్ పీజీలో కార్డియాలజీ, జనరల్ సర్జన్, ఆర్థోపెడిక్, రేడియాలజీ, అనస్థీషియా ఇలా స్పెషలైజేషన్ పీజీ పూర్తయిన తర్వాత పీహెచ్‌సీల నుంచి పెద్దాసుపత్రులకు మారాలి. ప్రస్తుతం 290 మంది ఇలా పీహెచ్‌సీల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ స్పెషలిస్టు వైద్యులను పని ఉన్నచోటుకు మార్చాలని, ఈ నెల 23, 24 తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహించాలని వైద్య, ఆరోగ్య శాఖ భావిస్తోంది. వారు కౌన్సెలింగ్‌కు రాకున్నా, విధుల్లో చేరడానికి అయిష్టత చూపినా, షోకాజ్ నోటీసులిచ్చి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులు భావిస్తున్నట్లు తెలిసింది. పెద్దాసుపత్రులకు మారితే ప్రైవేట్ వైద్యానికి కష్టం పెద్దాసుపత్రులకు మారితే ఆయా స్పెషలిస్ట్ వైద్యుల రోజువారీ సమయమంతా అక్కడే సరిపోతుంది. ఉన్నతాధికారుల నిఘా కూడా బాగానే ఉంటుంది. దీంతో ప్రైవేట్ ప్రాక్టీస్ కానీ, కార్పొరేట్ ఆసుపత్రుల్లో కన్సల్టెంట్‌గా వైద్యసేవలు అందించడంకానీ కుదరదు. పీహెచ్‌సీల్లో అయితే వారానికి ఒకసారి అలా సరదాగా వెళ్లొచ్చినా అడిగే నాథుడు ఉండడు. స్పెషలిస్ట్ వైద్యులుగా పెద్దాసుపత్రులకు వచ్చినా అందే జీతం ప్రైవేట్ ప్రాక్టీస్ ముందు దిగదుడుపే. అవసరమైతే ప్రభుత్వ ఉద్యోగం వదులుకోవడానికైనా కొందరు స్పెషలిస్ట్ వైద్యులు సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ సమస్యను ఎలా పరిష్కరించాలన్న దానిపై వైద్య, ఆరోగ్యశాఖ కసరత్తు చేస్తోంది. పెద్దాసుపత్రులకు వెళ్లాల్సిందే.. పీహెచ్‌సీల్లో పనిచేస్తున్న పీజీ స్పెషలిస్ట్ వైద్యులు పెద్దాసుపత్రుల్లో సేవలు అందించాలి. ఎంతమంది ఎక్కడెక్కడ పనిచేస్తున్నారో జాబితా తయారు చేశాం. వారిని సామాజిక, ఏరియా, జిల్లా, బోధనాసుపత్రులకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నాం. కానీ, చాలామంది పీహెచ్‌సీలను వదలడానికి అంతగా ఆసక్తి చూపించడం లేదని మా దృష్టికి వచ్చింది. దానికి అనుగుణంగా చర్యలు చేపడతాం. – డాక్టర్ శ్రీనివాసరావు, ప్రజారోగ్య సంచాలకుడు -
చిత్తూరు జిల్లాలో రూ.50 కోట్లతో ప్రభుత్వ ఆస్పత్రుల నాడు నేడు
-
AP: పీహెచ్‌సీల బలోపేతం చేస్తున్న సర్కార్
సాక్షి, అమరావతి: పల్లె ప్రజల ఆరోగ్య పరిరక్షణలో కీలకమైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల(పీహెచ్సీ)ను రాష్ట్ర ప్రభుత్వం బలోపేతం చేస్తోంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన పరిస్థితులకు చెక్ పెడుతూ.. ‘నాడు–నేడు’ కార్యక్రమంలో భాగంగా పీహెచ్‌సీలను సీఎం వైఎస్ జగన్ సర్కార్ ఆధునీకరిస్తోంది. భవనాలకు మరమ్మతులు చేయడంతో పాటు, శిథిలావస్థలో ఉన్న భవనాల స్థానంలో కొత్త భవనాలను నిర్మిస్తోంది. ఇందు కోసం రూ. 670 కోట్లు ఖర్చు చేస్తోంది. 978 భవనాలకు మరమ్మతులు రాష్ట్ర వ్యాప్తంగా 1,124 పీహెచ్‌సీలు ఉన్నాయి. వీటిలో 978 పీహెచ్‌సీల భవనాలకు మరమ్మతులు చేస్తున్నారు. 146 పీహెచ్‌సీలకు కొత్త భవనాల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపడుతోంది. మరమ్మతుల కోసం రూ. 408.5 కోట్లను ప్రభుత్వం వెచ్చించింది. ఇప్పటికే 532 భవనాలకు మరమ్మతులు పూర్తయ్యాయి. ఆయా పీహెచ్‌సీల్లో అవసరమైన ప్రహరీలు, వైద్యులు, వైద్య సిబ్బంది సమావేశ గదులు, రోగులకు అవసరమైన ఇతర అదనపు నిర్మాణాలు చేపట్టారు. ఆసుపత్రి ప్రాంగణంలో ఆహ్లాద వాతావరణం ఉండేలా మొక్కలు నాటడంతో పాటు ఇతర చర్యలు చేపట్టారు. రూ.261.5 కోట్లతో 146 కొత్త భవనాలను జాతీయ ప్రమాణాలతో, అన్ని వసతులు ఉండేలా నిర్మిస్తున్నారు. నూతనంగా నిర్మిస్తున్న భవనాల్లో వసతులు ఇలా ► మహిళలు, పురుషులకు వేర్వేరుగా జనరల్ వార్డులు ► ఆపరేషన్ థియేటర్.. ప్రసూతి గది ► ఇద్దరు వైద్యాధికారులతో పాటు, ఆయుష్ వైద్యుడికి వేరు వేరుగా కన్సల్టేషన్ గదులు, స్టాఫ్ నర్సుల కోసం ప్రత్యేక గది. ► మెడిసిన్ స్టోర్, ల్యాబ్ గదులు, ఆసుపత్రికి వచ్చే రోగులకు మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యాలు కల్పన. వచ్చే ఏప్రిల్‌కు అందుబాటులోకి నాడు–నేడు కింద పీహెచ్‌సీల్లో మరమ్మతులు, నూతన భవనాల నిర్మాణం రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది. వచ్చే ఫిబ్రవరి నెలాఖరుకు 978 భవనాల మరమ్మతులు, ఏప్రిల్ నెలాఖరుకు 146 కొత్త భవనాల నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యం నిర్దేశించాం. ఈ లోపు పనులు పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. – మురళీధర్‌రెడ్డి, ఏపీఎంఎస్ఐడీసీ వైస్ చైర్మన్, ఎండీ -
విద్యార్థులను కర్రలతో చితకబాదిన టీచర్లు..
సాక్షి, అనంతగిరి(విశాఖపట్నం): స్టడీ అవర్‌కు రాలేదని విద్యార్థులను చితకబాదిన ఘటన విశాఖ జిల్లా అనంతగిరి మండలం గుమ్మకోట గురుకుల పాఠశాలలో శుక్రవారం చోటుచేసుకుంది. గురుకుల పాఠశాలలో గుమ్మకోట పంచాయతీ భీమవరం గ్రామానికి చెందిన 8మంది విద్యార్థులు చదువుతున్నారు. పాఠశాలకు సమీపంలో గ్రామం ఉండటంతో వారంతా రాత్రివేళ పడుకునే సమయంలో ఇంటికి వెళ్లి వస్తుంటారు. గురువారం వెళ్లి ఇంటికెళ్లిన విద్యార్థులు శుక్రవారం ఉదయం స్టడీ అవర్‌కు రాకపోవడంతో సోషల్ టీచర్ పీతాంబరం, పీఈటీ నాగభూషణం విద్యార్థులను కర్రలతో చితకబాదారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయులను నిలదీశారు. అనంతరం విద్యార్థుల్ని పీహెచ్‌సీకి తీసుకునివెళ్లి చికిత్స చేయించారు.విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తామని ప్రిన్సిపాల్ వేణుప్రసాద్ చెప్పారు. -
Andhra Pradesh: వేగం పెంచండి
క్యాన్సర్ రోగులకు సమగ్రంగా వైద్యం అందించడంపై మరింత శ్రద్ధ పెట్టాలి. నాలుగైదు విడతల్లో చికిత్స (కీమోథెరపీ) అందించాల్సి ఉంటుంది. అప్పుడే ఈ వ్యాధిని నయం చేయగలం. అయితే గత ప్రభుత్వంలో ఒకటి రెండు సార్లు చికిత్స అందించి వదిలేసే వారు. దీంతో కొన్నాళ్లకు మళ్లీ వ్యాధి తిరగబెట్టేది. పేదలు చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేది. అలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదనే ఉద్దేశంతోనే మనందరి ప్రభుత్వం క్యాన్సర్‌కు ఆరోగ్యశ్రీ కింద పూర్తి స్థాయిలో ఎన్ని విడతల్లో వైద్యం అవసరమైతే అన్ని విడతల్లోనూ ఉచితంగా అందించేందుకు ఏర్పాట్లు చేసింది. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: గ్రామాలు, వార్డుల్లోని ప్రజలకు వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు చేపట్టిన వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 10,011 వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్ నిర్మాణం చేపడుతున్నామని, ఇప్పటికే 8,585 చోట్ల పనులు మొదలయ్యాయని ఈ సందర్భంగా అధికారులు వెల్లడించారు. పీహెచ్‌సీల్లో నాడు–నేడు కార్యక్రమాలు వేగంగా ముందుకు సాగుతున్నాయని, డిసెంబర్ నాటికి మరమ్మతు పనులు పూర్తవుతాయని చెప్పారు. అవసరమైన చోట 146 కొత్త భవనాల నిర్మాణం 2022 మార్చి నాటికి పూర్తి చేస్తామని చెప్పగా.. వీటి నిర్మాణాలు మరింత వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సీహెచ్‌సీల్లో, ఏరియా ఆస్పత్రుల్లో నాడు–నేడు పనులు చురుగ్గా సాగుతున్నాయని, అత్యవసర పనులు ఇప్పటికే పూర్తి చేశామని అధికారులు తెలిపారు. మిగిలిన పనులను కూడా వేగంగా ముందుకు తీసుకెళ్లాలని సీఎం సూచించారు. రాష్ట్రంలో కొత్తగా చేపట్టిన 16 మెడికల్ కాలేజీల్లో పనుల ప్రగతిని అధికారులు వివరించారు. ఇప్పటికే నాలుగు చోట్ల పనులు మొదలయ్యాయని, మిగిలిన చోట్ల నిర్మాణాలకు సన్నాహాలను పూర్తి చేస్తున్నామని తెలిపారు. కర్నూలు జిల్లా నంద్యాల, విశాఖ జిల్లా అనకాపల్లి మెడికల్ కాలేజీ స్థలాలపై కోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయని చెప్పారు. ఈ కేసులను త్వరగా పరిష్కరించేలా చూడాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ఇవికాకుండా 9 చోట్ల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని చెప్పారు. క్యాన్సర్ రోగులకు పూర్తి స్థాయిలో ఉచితంగా ఆరోగ్య శ్రీ కింద వైద్యం అందించడాన్ని మరింత పటిష్టంగా అమలు చేయాలని ఆదేశించారు. నిరంతర ప్రక్రియగా వైఎస్సార్ కంటి వెలుగు వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమం కింద ఇంతకు ముందు ఎవరైనా పరీక్షలు చేయించుకోని వారికి కంటి పరీక్షలు చేయించాలని సీఎం ఆదేశించారు. కంటి సమస్యలు గుర్తించిన వారికి కళ్లజోడు ఇవ్వాలని, అవసరమైన వారికి శస్త్ర చికిత్సలు చేయించాలని సూచించారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేయాలని, దీనికోసం ఒక వారం రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని ఆదేశించారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని విలేజ్ హెల్త్ క్లినిక్స్‌కు, 104కు అనుసంధానంచేసి.. నిరంతర ప్రక్రియగా కొనసాగించాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఇప్పటి వరకు కంటి వెలుగు కార్యక్రమం అమలు ప్రగతిని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఇప్పటికే 66,17,613 మంది పిల్లలకు పరీక్షలు చేశామని, వారిలో 1,58,227 మందికి కంటి అద్దాలు ఇచ్చామని తెలిపారు. 60 ఏళ్ల పైబడ్డ 13,58,173 మందికి పరీక్షలు చేశామన్నారు. ఇందులో 7,60,041 మందికి కంటి అద్దాలు ఇవ్వాల్సి ఉండగా 4,69,481 మందికి ఇచ్చామని, మరో 1,00,223 మందికి శస్త్ర చికిత్సలు చేయించామని వివరించారు. మరో 26,437 మందికి కాటరాక్ట్ సర్జరీలు చేయించాలన్నారు. కోవిడ్ పరిస్థితుల కారణంగా కంటి వెలుగు కార్యక్రమానికి అవాంతరాలు ఏర్పడ్డాయని తెలిపారు. త్వరిత గతిన హెల్త్ హబ్స్ ఏర్పాటు వైద్యం కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే అందుబాటులో అత్యాధునిక వైద్యం అందుబాటులోకి తెచ్చేందుకు జిల్లా కేంద్రాలు, కార్పొరేషన్లలో హెల్త్ హబ్స్‌ను త్వరగా ఏర్పాటు చేయాలని సీఎం తెలిపారు. మొత్తం 16 చోట్ల ఏర్పాటయ్యే హెల్త్ హబ్స్‌కు సంబంధించి, ఇప్పటికే 13 చోట్ల స్థలాలు గుర్తించామని, మిగిలిన చోట్ల కూడా త్వరగా ఆ పని పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి (వైద్య ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గణనీయంగా పెరిగిన వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సేవలు ► 2019 జూన్‌కు ముందు ఆరోగ్య శ్రీ కింద ఉన్న 1059 వైద్య ప్రక్రియలు 2019 జూన్ తర్వాత 2,446కు పెంపు. ► 2019 జూన్‌కు ముందు ఆరోగ్యశ్రీ కింద ఉన్న 919 కవరేజీ ఆస్పత్రులు.. ఆ తర్వాత 1,717కు పెంపు. ► కొత్తగా 3,18,746 మందికి ఆరోగ్యశ్రీ కింద లబ్ధి ► 2019 జూన్‌కు ముందు ఆరోగ్య శ్రీద్వారా సగటున రోజుకు 1,570 మందికి లబ్ధి కలిగితే.. ప్రస్తుతం 3,300 మందికి లబ్ధి. ► బధిర, మూగ వారికి ఉచితంగా శస్త్రచికిత్సలు. ► ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన రోజునే ఆరోగ్య ఆసరా కింద డబ్బు చెల్లింపు. ఇప్పటి వరకు 7,82,652 మందికి ఆరోగ్య ఆసరా కింద రూ.439.4 కోట్లు చెల్లింపు. ► శస్త్ర చికిత్స చేయించుకున్న వారికి విశ్రాంతి సమయంలో ఇల్లు గడవడం కోసం రోజుకు రూ.225 చొప్పున లేదా గరిష్టంగా నెలకు రూ.5 వేలు ఆరోగ్య ఆసరా పథకం కింద ప్రభుత్వం ఇస్తున్న విషయం తెలిసిందే. కోవిడ్, వ్యాక్సినేషన్ పరిస్థితి ఇలా.. ► మొత్తం పాజిటివ్ కేసులు 3,366 ► పాజిటివిటీ రేటు 0.7 శాతం ► పాజిటివిటీ రేటు 0 నుంచి 2 లోపు ఉన్న జిల్లాలు 12 ► పాజిటివిటీ రేటు 2 కంటే ఎక్కువగా ఉన్న జిల్లా 1 ► అందుబాటులో ఉన్న ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ 23,457 ► అందుబాటులో ఉన్న ఆక్సిజన్ డీ–టైప్ సిలిండర్లు 27,311 ► డిసెంబర్ 15 నాటికి ఆక్సిజన్ జనరేషన్ (పీఎస్ఏ) ప్లాంట్లు మొత్తం 140 ► సింగిల్ డోసు వ్యాక్సినేషన్ పూర్తయిన వారు 1,17,71,458 ► రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయిన వారు 2,17,88,482 ► మొత్తం వ్యాక్సినేషన్ చేయించుకున్న వారు 3,35,59,940 ► మొత్తం వ్యాక్సినేషన్ కోసం ఉపయోగించిన డోసులు 5,53,48,422 -
కాగజ్‌నగర్ :PHC లో ఊడిపడ్డ పెచ్చులు :
-
థాంక్యూ.. సీఎం జగన్ సార్!
సాక్షి, కారంచేడు(ప్రకాశం): సీఎం వైఎస్ జగన్‌కి కారంచేడు పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ నర్తు భాస్కరరావు కృతజ్ఞతలు తెలుపుతూ మంగళవారం వీడియో సందేశం పంపించారు. డాక్టర్ భాస్కరరావు కోవిడ్ విధుల్లో ఉండగా ఏప్రిల్ 24న కరోనా సోకింది. ఆయన భార్య డాక్టర్ బొమ్మినేని భాగ్యలక్ష్మి విజయవాడ, ఆ తరువాత మెరుగైన వైద్యం నిమిత్తం హైదరాబాద్ తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిన్నాయని, వాటిని మార్చాలని అందుకు రూ.1.50 కోట్లు ఖర్చవుతుందని చెప్పారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం విషయాన్ని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన మంత్రి బాలినేని విషయాన్ని ముఖ్యమంత్రికి చెప్పడంతో..భాస్కరరావు వైద్య ఖర్చులు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని సీఎం హామీ ఇచ్చారు. గత నెల 14న హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్లో ఊపిరితిత్తుల మార్పిడి ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ తరువాత సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ వీడియో రికార్డు చేసి దాన్ని భాస్కరరావు ఆయన భార్య డాక్టర్ భాగ్యలక్ష్మితో ‘సాక్షి’కి పంపించారు. వైద్య ఖర్చుల కోసం సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. -
వైద్యానికి వచ్చి అంధురాలై..
కాకినాడ క్రైం: రామచంద్రపురం డివిజన్ పరిధి కుందూరు పీహెచ్సీలో ఓ బాలికకు 2015లో అటెండర్ వైద్యం చేయడంతో చూపు కోల్పోయిన ఘటనపై శనివారం కాకినాడ డీఎంహెచ్ఓ కార్యాలయంలో విచారణ జరిగింది. రాష్ట్ర కుటుంబ సంక్షేమ, వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి అనీల్ సింఘాల్ ఆదేశాల మేరకు జరిగిన విచారణలో విచారణాధికారిగా జోన్–1 ఆర్‌డీఎంహెచ్‌ఎస్ జి.సావిత్రి, సహాయ విచారణాధికారిగా జోన్–1 ఇన్చార్జి డీడీ శ్రీనివాస్‌కుమార్ వ్యవహరించారు. చార్జి మెమోలు పొందిన వారిలో నాటి డీఎంహెచ్ఓ ఎం.సావిత్రమ్మ, స్టాఫ్ నర్సులు జె.ఉమా, వి.సుగుణ, ఎస్పీహెచ్ఓ దుర్గాప్రసాద్, మెడికల్ అధికారి బీజే ప్రవీణతో పాటు ఆఫీస్ సబార్డినేట్ (అటెండర్) ఎస్.ప్రవల్లిక ఉన్నారు. ఆ ఆరుగురి నుంచి లిఖిత పూర్వకంగా వివరణ తీసుకున్నామని సావిత్రి తెలిపారు. కుడి కన్ను కోల్పోయిన బాలిక గొల్లపల్లి ఉదయశ్రీ నాటి ఘటనపై లిఖిత పూర్వక సమాచారాన్ని అందించిందన్నారు. విచారణ నివేదికను ప్రభుత్వానికి పంపనున్నట్లు తెలిపారు. జరిగింది ఇదీ.. 2015 జనవరి 22న జరిగిన ఈ ఘటన రాష్ట్ర స్థాయిలో సంచలనమైంది. ఆ రోజు సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో కుందూరు పీహెచ్‌సీకి కంట్లో బురద నీరు పడటంతో అదే గ్రామానికి చెందిన గొల్లపల్లి ఉదయశ్రీ కుటుంబ సభ్యులతో కలసి వచ్చింది. ఆ సమయంలో వైద్యులు, నర్సులు గానీ అందుబాటులో లేరు. అక్కడే ఉన్న ఆఫీస్ సబార్డినేట్ (అటెండర్)గా పనిచేస్తున్న ఎస్.ప్రవల్లిక వైద్యం చేయాలని సిద్ధపడింది. సిరంజీకి సూదిగుచ్చి తోచిన వైద్యం చేయడానికి పూనుకుంది. ఈ క్రమంలో ఆ సూది నేరుగా బాలిక కుడి కంట్లో దిగబడిందని చెబుతున్నారు. తీవ్ర రక్తస్రావమై ఉదయశ్రీ తన కుడి కన్నును కోల్పోయింది. అప్పటి కలెక్టర్ అరుణ్‌కుమార్ ఘటనను సుమోటాగా స్వీకరించి విచారణకు ఆదేశించారు. ప్రవల్లికతో పాటు అప్పటి డీఎంహెచ్ఓ, ఇద్దరు స్టాఫ్ నర్సులు, ఎస్పీహెచ్ఓ, ఎంఓపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. అయితే వైద్యాధికారి ప్రవీణ అధికారిక పనులతోనే బయటకు వెళ్లడంతో క్రిమినల్ కేసు నుంచి ఆమెకు విముక్తి లభించింది. ఈ ఘటనపై ఇప్పటికే ఆర్డీఓ, కలెక్టర్ విచారణలు జరగ్గా శనివారం శాఖాపరమైన విచారణ పూర్తయింది. చదవండి: జనం ముందు కత్తులు.. తెర వెనుక పొత్తులు నాలుగో దశ: పెనుగొలనులో టీడీపీకి ఎదురుదెబ్బ -
కోటనందూరు పీహెచ్సీలో శిశుమరణం
సాక్షి, కోటనందూరు: కోటనందూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శిశుమరణం సంభవించింది. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా శిశువు మృతి చెందినట్టు బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ సోమవారం స్థానిక పీహెచ్సీ ఎదుట ఆందోళనకు దిగారు. వైద్యాధికారి, వైద్య, పారామెడికల్ సిబ్బంది విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. ఇదీ పరిస్థితి ఈనెల 26వ తేదీ శనివారం కోటనందూరుకు చెందిన గర్భిణి లక్ష్మీ రాధను కుటుంబ సభ్యులు మధ్యాహ్నం ఒంటిగంటకు స్థానిక పీహెచ్‌సీకి తీసుకొచ్చారు. రెగ్యులర్ స్టాఫ్‌నర్సు సెలవులో ఉండడంతో ఆ స్థానంలో విధులు నిర్వహిస్తున్న హెచ్వీ, ఏఎన్ఎంలు, ఫార్మాసిస్టు కేసును చేర్చుకున్నారు. సాయంత్రం ఐదు గంటల వరకు వారి పర్యవేక్షణలోనే లక్ష్మీరాథ ఉంది. సాయంత్రం ఆరు గంటలకు నైట్ డ్యూటీ స్టాఫ్‌నర్సు విధులకు హాజరయ్యారు. రాత్రి ఎనిమిది గంటల వరకూ గర్భిణీ పరిస్థితి అంతా సవ్యంగానే ఉంది. డెలివరీ సమయం సమీపించడంతో హెచ్వీ, ఫార్మాసిస్టు సహకారంతో స్టాఫ్‌నర్సు రాత్రి 10.15 నిమిషాలకు ప్రసవం చేసారు. పసికందు పరిస్థితి విషమంగా ఉండడంతో 108 వాహనంలో తుని ఏరియా ఆసుపత్రికి తరలించినట్టు వైద్యసిబ్బంది తెలిపారు. అప్పటికే శిశువు మృతి చెందినట్టు అక్కడ డాక్టర్లు ధ్రువీకరించారు. ఎటువంటి సమాచారం లేదు: వైద్యాధికారి ఈ విషయంపై వైద్యాధికారి ఇందిరాప్రియదర్శిని వివరణ కోరగా శనివారం అంతా ఎన్సీడీసీడీ సర్వేలో ఉన్నామని, ఈ కేసు సమాచారం తనకు తెలియదని చెప్పారు. జరగాల్సిన నష్టం జరిగాక రాత్రి 12.30 గంటలకు సమాచారమిచ్చారన్నారు. ఆదివారం ఉదయం వచ్చి కేసును పరిశీలించానన్నారు. డీడీఓ వైద్యాధికారి డిప్యుటేషన్‌పై వెళ్లడంతో పనిభారం పెరిగిందని, ప్రసవాల విషయంలో అప్రమత్తంగా ఉంటామని వివరించారు. (చదవండి: అనగనగా ఒక పోలీసు! ఆ కథ విందామా..) సిబ్బంది నిర్లక్ష్యంతోనే ఇలా.. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే శిశువు మృతి చెందిందని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. శనివారం వైద్యాధికారి విధుల్లో లేరని, సిబ్బంది, మెడికల్ అధికారి మధ్య సమన్వయం కొరవడడంతోనే సమస్య తలెత్తిందని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు శిశువు బొడ్డు దగ్గర ప్రేగు మెడకు చుట్టుకోవడం, చేయి మడత పడి ఉండడం వల్ల శిశువు ఇబ్బందులకు గురైందని వైద్య సిబ్బంది తెలిపారు. ఈ విషయం స్కానింగు రిపోర్ట్‌లో ఎక్కడా లేకపోవడం, డెలివరీ సమయం సమీపించడంతో ఇక్కడ ప్రసవం చేసామని వివరించారు. స్కానింగ్ రిపోర్ట్ అంతా సవ్యంగా ఉండడంతోనే ఆసుపత్రిలో చేర్చుకున్నట్టు చెప్పారు. -
పీహెచ్‌సీల్లో కోవిడ్–19 చికిత్స
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ నిర్ధారణ, కోవిడ్–19 చికిత్సలు ఇకపై ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలోనే నిర్వహిస్తామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ప్రాథమిక దశలోనే కరోనా వైరస్‌ను నిర్ధారించి చికిత్స అందిస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. ఈ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, కరోనా వైరస్ నియంత్రణలోకి వచ్చే వరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని వెల్లడించారు. బీఆర్కే భవన్లో ఫార్మా కంపెనీలు, డీలర్లతో శనివారం ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జ్వరం తదితర లక్షణాలు వచ్చిన వారిని ఉపకేంద్రాల స్థాయిలో గుర్తించి పీహెచ్‌సీకి తరలిస్తామని, అక్కడే కరోనా వైరస్ పరీక్షలు నిర్ధారణ చేసి ప్రాథమిక చికిత్స కూడా చేస్తామన్నారు. హోంఐసోలేషన్ అవసరమైన వారికి మందులు పంపిణీ చేసి నిరంతర పర్యవేక్షణ చేస్తామన్నారు. అవసరమైన వారిని పెద్దాసుపత్రికి తరలిస్తామని వివరించారు. కోవిడ్–19 రోగులకు ఇచ్చే మందులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచుతామని మంత్రి ప్రకటించారు. రాష్ట్రంలో మందులకు కొరత లేదని, అవసరమైన మందులను ఎంత ఖర్చు అయినా కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. మందులు బ్లాక్‌మార్కెట్‌కు తరలితే సహించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామస్థాయి నుంచి ప్రతి మందుల షాప్‌లో మందులు అందుబాటులో ఉండేలా చూడాలని, ప్రతి ప్రభుత్వ ఆసుపత్రికి విధిగా అవసరమైన మందులు సరఫరా చేయాలని కోరారు. ఎక్కువ ఖరీదు ఉన్న మందులు కూడా అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. కరోనా చికిత్సలో అవసరమైన అన్నిరకాల మందులు ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలని డ్రగ్ కంట్రోల్ డైరెక్టర్‌ను ఆదేశించారు. వైరస్ లోడ్‌ను తగ్గించడానికి వినియోగిస్తున్న రెమ్‌డెసివిర్ మందును తయారు చేస్తున్న హెటిరో కంపెనీ యాజమాన్యంతో ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా మాట్లాడారని, రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా మందులను సరఫరా చేయాలని కోరారని, కాబట్టి త్వరలోనే ఆ మందు ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని మంత్రి తెలిపారు. ప్రజల ప్రాణాలే ముఖ్యం ఆసుపత్రుల వారీగా నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కార్యాచరణ సిద్దం చేస్తోందని మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. శనివారం కోఠిలోని వైద్యశాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఆస్పత్రుల్లో అవసరమైన సిబ్బందిని నియమించుకునే అవకాశాన్ని సూపరింటెండెంట్లకు ఇస్తున్నట్లు వెల్లడించారు. సిబ్బంది, పరికరాలు అడిగిన 24 గంటల్లోనే ఇస్తామని మంత్రి హామీ ఇచ్చారు. టీం వర్క్‌తో పనిచేసి ప్రజల ప్రాణాలు పోకుండా చూడాలని వైద్యశాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారు. హాస్పిటల్‌కి వచ్చిన ఏ ఒక్క పేషంట్‌ను కూడా వెనక్కి తిరిగి పంపించ కూడదని.. ప్రాథమిక చికిత్స అందించి కరోనా నిర్ధారణ పరీక్షలు చేసి అవసరమైన హాస్పిటల్‌కి పంపించేలా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆస్పత్రులు చుట్టూ పేషెంట్లు తిరుగుతున్నారని వస్తున్న వార్తలకు స్వస్తి పలకాలన్నారు. ఉస్మానియా ఆసుపత్రిపై కూడా ఈటల సమీక్ష నిర్వహించారు. హైటెక్ యుగంలో పురాతన కట్టడాలతో ప్రజల ప్రాణాలు తీసే హక్కు ఎవరికీ లేదని, ప్రజలు ప్రాణాలు హరించే విధంగా ఉన్నా ఉస్మానియా ఆసుపత్రిని ఆధునీకరించాలని అనేక విజ్ఞప్తులు వస్తున్నాయని వాటికి అనుగుణంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని మంత్రి అన్నారు. -
అవినీతి రోగం కుదిరింది!
పాడేరు: మండలానికి ప్రధాన ఆరోగ్య కేంద్రమైన మినుములూరు పీహెచ్సీలో యూడీసీ (సీనియర్ అసిస్టెంట్) శోభారాణి అవినీతిని ఇద్దరు ఏఎన్ఎంలు బట్టబయలు చేసి ఏసీబీ అధికారులకు పట్టించారు. ఆమె అవినీతి బాగోతంతో విసిగిపోయిన ఏఎన్ఎంలు ఏసీబీని ఆశ్రయించడంతో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సోమవారం ఉదయాన్నే విశాఖ ఏసీబీ అడిషనల్ ఎస్పీ షకీలా భాను, డీఎస్పీ గంగరాజు, ఇతర సీఐలు, సిబ్బంది అంతా మినుములూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేరుకున్నారు. ఆ సమయంలో తన గదిలో విధులు నిర్వహిస్తున్న యూడీసీ శోభారాణికి ఇద్దరు ఏఎన్ఎంలు పుష్పవతి, భాగ్యవతిలు రూ.19వేల నగదును లంచంగా ఇస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. అంతవరకు నిశ్శబ్దంగా ఉన్న ఆరోగ్య కేంద్రం ప్రాంగణం ఒక్కసారిగా ఏసీబీ దాడులతో ఉలిక్కిపడింది. గత ఏడాది నుంచి యూడీసీ శోభారాణి అవినీతి అక్రమాలపై ధర్నాలు, ఆందోళన కార్యక్రమాలు వైద్య సిబ్బంది చేపడుతూనే ఉన్నారు. ఇక్కడ వైద్యాధికారి ప్రవీణ్‌కుమార్, యూడీసీ శోభారాణి తమను అన్ని విధాల ఇబ్బందులు పెడుతున్నారని వైద్య సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇద్దరు ఏఎన్ఎంలు యూడీసీ అవినీతి అక్రమాలపై ఇటీవల ఏసీబీ అధికారులను స్వయంగా కలిసి ఫిర్యాదు చేశారు. ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న 11 మంది ఏఎన్ఎంలకు 2017–18, 2018–19, 2019–20 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి ఫీల్డ్ ట్రావెలింగ్ అలవెన్సుల బిల్లులను ఇటీవల యూడీసీ శోభారాణి మంజూరు చేయించింది. ఏఎన్ఎంల ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ.30 వేల చొప్పున ఎఫ్‌టీఏల సొమ్ము జమ అయింది. అయితే ఈ సొమ్ములో ఒక్కొక్కరు రూ.7,500ల చొప్పున తనకు లంచం ఇవ్వాలని యూడీసీ డిమాండ్ చేయడంతో కొంత మంది ఆమె అడిగిన సొమ్మును ఇచ్చారు. అయితే పుష్పవతి, భాగ్యవతి, మెటర్నటిలీవ్‌లో ఉన్న కె.భవానీ యూడీసీ అడిగినంత నగదును ఇచ్చేందుకు ఇష్టపడలేదు. అంత పెద్దమొత్తంలో లంచాన్ని ఇవ్వలేమంటు పుష్పవతి, భాగ్యవతి చెప్పడంతో కనీసం రూ.7వేలు చొప్పునైనా ఇవ్వాలని యూడీసీ పట్టుబట్టింది. అలాగే మెటర్నటి లీవ్‌లో ఉన్న భవాని కూడా ఆర్థిక ఇబ్బందులు దృష్ట్యా రూ.5వేలు ఇచ్చేందుకు సిద్ధమైంది. లంచం ఇవ్వడానికి ఇష్టపడని భాగ్యవతి, పుష్పవతిలు ఇటీవల ఏసీబీని ఆశ్రయించి యూడీసీ శోభారాణి నిత్యం చేస్తున్న అవినీతి అక్రమాలను అధికారులకు సమగ్రంగా విన్నవించారు. దీంతో వ్యూహం ప్రకారం ఏసీబీ అధికారులు సోమవారం మెరుపుదాడి చేసి ఏఎన్ఎంల నుంచి లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. భాగ్యవతి, పుష్పవతి ఇచ్చిన రూ.14వేలు, లీవ్‌లో ఉన్న కె.భవాని ఇచ్చిన రూ.5వేలు మొత్తం 19 వేలు స్వాధీనం చేసుకున్నామని ఏసీబీ డీఎస్పీ గంగరాజు విలేకరులకు తెలిపారు. ఏసీబీ అధికారులు యూడీసీ గదిలోని అన్ని రికార్డులను స్వాధీనం చేసుకోవడంతో పాటు ఇక్కడ వైద్యాధికారి, ఇతర వైద్య సిబ్బందిని విచారించారు. పాడేరు డీఎస్పీ రాజ్‌కమల్, సీఐ ప్రేమ్‌కుమార్, ఇతర సిబ్బంది కూడా మినుములూరు ఆస్పత్రికి చేరుకుని ఏసీబీ అధికారులకు సహకారం అందించారు. లంచం తీసుకున్న నేరం కింద యూడీసీ శోభారాణిపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఆమెకు మినుములూరు ఆస్పత్రిలోనే వైద్య సిబ్బంది కోవిడ్–19 పరీక్షలతో పాటు ఇతర వైద్య పరీక్షలను కూడా జరిపిన అనంతరం అరెస్టు చేసి విశాఖలోని ఏసీబీ కోర్టులో హాజరు పరిచేందుకు తీసుకువెళ్లారు. -
డెంగీపై జర పైలం
దేశంలో అత్యధికంగా డెంగీ కేసులు నమోదైన ప్రాంతంలో ఒకటిగా వనపర్తి జిల్లా పొలికిపాడు పీహెచ్సీ పరిధిలోని ఆముదాలకుంట తండా నిలిచింది. గత నెల ఒకే ఒక్క రోజు ఇక్కడ 19 మందికి డెంగీ సోకింది. దీంతో ఆ గ్రామంలో ఆరోగ్య నిఘా పెంచారు. నీటి నిల్వ ఉండటం వల్లే ఈ పరిస్థితి నెలకొందని తేలింది. హైదరాబాద్‌లో గత బుధవారం ఒక్క రోజే దాదాపు 500 మందికి డెంగీ సోకినట్లు అంచనా. ప్లేట్లెట్లు 20 నుంచి 30 వేలకు పడిపోతున్నాయి. కార్పొరేట్ ఆసుపత్రులతో పాటు ఉస్మానియా, గాంధీ, నిలోఫర్ ఆసుపత్రులకు డెంగీ కేసులు వందల్లో వస్తున్నాయి. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని డెంగీ వణికిస్తోంది. వేలాది మంది డెంగీ జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. ప్లేట్లెట్లు పడిపోతుండటం ప్రాణాలమీదకు వస్తోంది. వైద్య, ఆరోగ్యశాఖ మాత్రం.. ఈ జనవరి నుంచి గత బుధవారం వరకు 1,687 డెంగీ కేసులే నమోదైనట్లు పేర్కొంది. మొత్తం 11 వేల మందిని పరీక్షించగా ఆ కేసులు నమోదైనట్లు తెలిపింది. అయితే ప్రైవేటు ఆసుపత్రులకు వస్తున్న రోగుల సంఖ్య ఎంతనేది వైద్య, ఆరోగ్యశాఖ లెక్కగట్టకపోవడం, నిఘా పెంచకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఆముదాలకుంట తండాలో ఒకేసారి అన్ని కేసులు నమోదు కావడంతో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని అలర్ట్ చేసింది. అయినా ఇక్కడి అధికార యంత్రాంగం అప్రమత్తం కాలేదని ప్రస్తుత పరిస్థితి చూస్తే తెలుస్తోంది. డెంగీ ప్రభావం ఇలా.. ఎడిస్ అనే దోమ వల్ల డెంగీ వస్తుంది. ఇది పగలే కుడుతుంది. ఉన్నట్టుండి తీవ్ర జ్వరం, భరించలేని తలనొప్పి వస్తుంది. కళ్లు తెరవడం కష్టంగా ఉంటుంది. కదిపితే నొప్పి వస్తుంది. జ్వరం విపరీతంగా ఉన్నప్పు డు కూడా ప్లేట్లెట్ సంఖ్య తగ్గదు. జ్వరం తగ్గిన తర్వాత ప్లేట్లెట్లు గణనీయంగా పడిపోతాయి. చాలా మంది ఇది గమనించక ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కొందరికి తీవ్ర రక్తస్రావం అవుతుంది. ముక్కు, మలం ద్వారం లేదా బ్రష్ వేసేప్పుడు పళ్ల మధ్య నుంచి రక్తస్రావం అవుతుంది. ఇలా అధిక రక్తస్రావం అయితే ప్రమాదకరం. మహిళలకు పీరియడ్స్ సమయంలో సాధారణ రక్తస్రావం కంటే అదనంగా అయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయాల్లో వెంటనే ప్లేట్లెట్లు ఎక్కించాలి. 15 వేల కన్నా తగ్గినా గుర్తించకపోతే డెంగీ మరణాలు సంభవిస్తాయి. ప్లేట్లెట్ల గుర్తింపులో మతలబు.. ప్లేట్లెట్ గుర్తించేందుకు మెషీన్ కంటే మైక్రోస్కోప్ పరీక్ష మంచిదని పలువురు సూచిస్తున్నారు. ఒక రోగికి ప్లేట్లెట్ పరీక్ష చేస్తే మెషీన్ కౌంట్‌లో 32 వేలు చూపిస్తే, మైక్రోస్కోప్ ద్వారా మాన్యువల్‌గా లెక్కిస్తే 65 వేల వరకు ఉండటం గమనార్హం. దీనికి ప్రధాన కారణం రక్త కణాలు ఒక్కోసారి మూడునాలుగు కలిపి ముద్దగా ఉంటాయి. దాన్ని మెషీన్ ఒకే రక్త కణంగా లెక్కిస్తుంది. అదే మైక్రోస్కోప్ పద్ధతిలో పరిశీలిస్తే నాలుగు రక్త కణాలుగా చూపిస్తాయి. డెంగీని ముందుగా గుర్తిస్తే 80 శాతం వరకు ఎటువంటి ప్రమాదం లేకుండా వైద్యుల చికిత్స పొందవచ్చు. కానీ కొందరికి తీవ్రమైన రక్తస్రావం అవుతుంది. అలాంటి సమయాల్లో ప్లేట్లెట్ల సంఖ్య 50 వేలున్నా తప్పనిసరిగా ప్లేట్లెట్లు ఎక్కించాలి. రక్తస్రావం కానప్పుడు 20 వేల వరకు ప్లేట్లెట్లు పడిపోయినా ప్రమాదం కాదు. అప్పుడు ప్రత్యేకంగా ప్లేట్లెట్లు ఎక్కించి రోగిని సాధారణ స్థితికి తీసుకొని రావచ్చు. – డాక్టర్ కె.కృష్ణప్రభాకర్, సిటీ న్యూరో ఆసుపత్రి -
ఆక్సిజన్ అందక బిడ్డ మృతి
సాక్షి, కారంపూడి : సకాలంలో వైద్యం అందక పురిటిలోనే శిశువు మృతి చెందిన ఘటన కారంపూడి పీహెచ్సీలో మంగళవారం జరిగింది. మండలంలోని చింతపల్లి గ్రామానికి చెందిన బి.మరియకుమారి పురిటినొప్పులతో బాధపడుతుండగా మంగళవారం తెల్లవారు జామున 108లో ఆమె బంధువులు కారంపూడి పీహెచ్‌సీకి తీసుకు వచ్చారు. అక్కడ ఆమెకు సరైన వైద్యసేవలు సకాలంలో లభించలేదు. ఇంటి దగ్గర నుంచి వచ్చిన డ్యూటీ నర్స్ కాన్పు చేయించే యత్నం చేశారు. ఈ క్రమంలో మరియకుమారి పురిటి నొప్పులతో రెండు గంటల పాటు అల్లాడిపోయింది. అలా మగళవారం తెల్లవారుజాము 3.30 నుంచి ఉదయం 5.30 వరకు బాధపడుతుండగా నర్స్, ఆయాలు కాన్పు చేయించేందుకు ప్రయత్నించారు. బయటకు పంపితే తాము నిర్లక్ష్యం చేశామని, ఏమైనా అవుతుందేమోనన్న ఆందోళనతో అతికష్టం మీద కాన్పు చేశారు. అయితే కాన్పు తర్వాత బిడ్డకు ఆక్సిజన్ సరిగా అందడంలేదని 108 అంబులెన్స్‌లో ఆక్సిజన్ అందించే యత్నం చేశారు. తర్వాత స్థానికంగా ఉన్న ప్రైవేటు వైద్యశాలకు బిడ్డను తీసుకెళ్లారు. పరీక్షించిన డాక్టర్ అప్పటికే శిశువు మృతి చెందినట్లు చెప్పారు. వాస్తవంగా శిశువును పిడియాక్ట్రిక్ డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్లాలి. కారంపూడిలో ఆ డాక్టర్ లేరు. రాత్రి పూట వచ్చిన ఇలాంటి క్రిటికల్ కేసులు చూడటానికి డాక్టర్ స్థానికంగా అందుబాటులో లేకపోవడం వల్ల ఈ ఘటన చోటుచేసుకుంది. ఉదయం తొమ్మిది గంటలకు డ్యూటీకి వచ్చిన డాక్టర్ దుర్గారావు మరియకుమారిని పరీక్షించి ఆమె ఆరోగ్యపరిస్థితి బాగానే ఉందని ఇంటికి పంపించారు. ఆ తర్వాత ఆమె బంధువులతో ఆస్పత్రికి వచ్చి తన బిడ్డ మృతికి సరైన వైద్యసేవలు అందకపోవడమే కారణమని పీహెచ్సీ ముందు బైఠాయించింది. వాస్తవంగా తల్లి ఆరోగ్య పరిస్థితి బాగా లేదు. అయినా ఇంటికి పంపారు. తర్వాత బంధువులు ఆందోళనకు దిగడంతో నరసరావుపేట ఆస్పత్రికి తరలించారు. సిబ్బంది నిర్లక్ష్యమేనా.. డ్యూటీ నర్స్‌లు ఆస్పత్రిలో ఉండకపోవడం చాలా కాలంగా జరుగుతోంది. అలాగే క్రిటికల్ కేసులు వచ్చినప్పుడు డాక్టర్లు అందుబాటులో లేకుండా వేరే పట్టణాలలో ఉంటుండంతో ఈ పరిస్థితి వచ్చింది. డాక్టర్లు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకే డ్యూటీ చేస్తున్నారు. వాస్తవంగా వారు స్థానికంగా అందుబాటులో ఉండి ఇలాంటి కేసులు వచ్చినప్పుడు చాడాలి. అయితే తాను డెప్యూటేషన్‌పై గుంటూరు జీజీహెచ్‌లో డ్యూటీలో ఉన్నానని వైద్యాధికారి బాలకిషోర్‌నాయక్ చెప్పారు. మరోవైపు బిడ్డ పుట్టగానే మృతి చెందిదని, ఈ విషయం తల్లికి బంధువులు తెలిస్తే ఎక్కడ గొడవ చేస్తారోనని ఆస్పత్రి సిబ్బంది నాటకం అడినట్లు తెలుస్తోంది. బాధితులు స్థానిక ఎస్ఐ రవికృష్ణకు ఫిర్యాదు చేశారు. -
వైద్యశాఖకు అవినీతి జబ్బు
సాక్షి, నెల్లూరు: అవినీతి, అక్రమాలకు అడ్డాగా మారిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ప్రక్షాళన చేస్తున్నా ఆశించిన ఫలితాలు కానరావడంలేదు. వైద్యశాఖ అధికారులు, ఉద్యోగుల్లో మార్పు రావడం లేదు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై ఇటీవల ‘సాక్షి’లో వరుస కథనాలు ప్రచురితం కావడంతో స్పందించిన కలెక్టర్ శేషగిరిబాబు బాధ్యులైన ఉన్నతాధికారిపై వేటేశారు. డీఎంహెచ్ఓ వరసుందరాన్ని డైరెక్టర్ ఆఫ్ హెల్త్‌కు సరెండర్ చేశారు. ఓ వైపు ప్రక్షాళన చేస్తున్నా వైద్యశాఖ కార్యాలయంలో మార్పు రావడం లేదు. పనిచేసే వారికి పనిష్మెంట్లు ఇస్తూ, చేయని వారిని అందలమెక్కిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రాజీనామా చేసిన మహిళకే పోస్ట్ ఇచ్చేందుకు యత్నం ముత్తుకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్టాఫ్‌నర్స్‌గా పనిచేస్తూ రాజీనామా చేసిన మహిళకే మరోసారి పోస్టింగ్ ఇచ్చేందుకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయాధికారులు యత్నాలు చేస్తున్నారు. 2010లో ఎన్ఆర్హెచ్ఎం (జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్) ద్వారా కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేసేందుకు స్టాఫ్‌నర్స్‌ల పోస్టుల భర్తీ ప్రక్రియను చేపట్టారు. ఇందులో భాగంగా ముత్తుకూరు పీహెచ్సీలో స్టాఫ్‌నర్స్ పోస్ట్ కోసం ముగ్గురు మహిళలు దరఖాస్తు చేసుకోగా, అందులో అర్హత ఉన్న ఒకర్ని నియమించారు. అయితే సదరు మహిళ ఆర్నెల్ల పాటు సక్రమంగా విధులు నిర్వర్తించి ఆపై తరచూ విధులకు గైర్హాజరయ్యేవారు. ఇలా నాలుగేళ్ల పాటు కొనసాగింది. చివరికి సదరు మహిళ 2014లో రాజీనామా చేశారు. దీంతో అక్కడి పీహెచ్సీలో స్టాఫ్‌నర్స్ లేక ఇబ్బందులు నెలకొన్నాయి. విషయాన్ని గుర్తించిన అక్కడి పీహెచ్సీ వైద్యాధికారి, హెచ్‌డీఎస్ చైర్మన్ ముత్తుకూరు పీహెచ్సీలో స్టాఫ్‌నర్స్‌ను వెంటనే నియమించాలని జిల్లా అధికారులను కోరినా ఫలితం లేకుండాపోయింది. ఇదే పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకున్న ముగ్గురు మహిళల్లో అర్హత కలిగిన కామాక్షమ్మ ఖాళీ అయిన స్టాఫ్‌నర్స్ పోస్ట్‌ను తనకు ఇవ్వాలంటూ అధికారులకు విన్నవించుకున్నారు. వాస్తవానికి రోస్టర్ ప్రకారం కామాక్షమ్మనే నియమించాల్సి ఉంది. అయితే అధికారులు మాత్రం నిబంధనలకు విరుద్ధంగా కామాక్షమ్మకు పోస్ట్ ఇవ్వమని తెగేసిచెప్పారు. రాజీనామా చేసిన స్టాఫ్ నర్స్ తిరిగి పోస్ట్ కోసం వైద్య ఆరోగ్య కార్యాలయంలో రూ.ఐదు లక్షల వరకు ముట్టజెప్పారని సమాచారం. ఈ క్రమంలోనే డీఎంహెచ్ఓ కార్యాలయాధికారులు ముత్తుకూరు పీహెచ్సీ వైద్యాధికారిని రాజీనామా చేసిన స్టాఫ్‌నర్స్‌కు ఆరోగ్యం బాగొలేని కారణంగా సెలవు పెట్టిందని లెటర్ రాసివ్వాలని కోరగా, అందుకు ఆ వైద్యాధికారి ససేమిరా అన్నారు. ఈ నేపథ్యంలో ఆర్నెల్ల క్రితం పోస్ట్ ఇచ్చేందుకు డీఎంహెచ్ఓ కార్యాలయం వారు జేసీకి ఫైల్ పెట్టగా తిరస్కరించారు. పనిచేసే వారికే శిక్ష పనిచేసే వారికేమో పనిష్మెంట్లు.. చేయని వారినేమో అందలమెక్కించడం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయాధికారుల తీరుగా మారింది. గండిపాళెం పీహెచ్సీలో రెండో ఏఎన్ఎంగా విధులు నిర్వరిస్తున్న జమ్మాయమ్మపై ఎలాంటి ఆరోపణలు లేకున్నా అనవసరంగా అదే పీహెచ్‌సీకి సంబంధించిన ఎస్వీ చింతాల సబ్సెంటర్కు ఇటీవల బదిలీ చేశారు. ఇలాంటి ఉదంతాలు చాలా ఉన్నాయి. జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై అధికారులు దృష్టి సారిస్తే మరిన్ని వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని ఆ శాఖలోని ఉద్యోగులే వ్యాఖ్యానిస్తున్నారు. పోస్టింగ్‌లు, డిప్యుటేషన్లు, ఉద్యోగుల సర్వీస్ మ్యాటర్లు, తదితర అంశాలకు సంబంధించిన ఫైళ్లను లోతుగా పరిశీలిస్తే అవినీతిపరుల భరతం పట్టే అవకాశం ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు. డిప్యుటేషన్ల రద్దు ఒట్టి మాటే జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయానికి సంబంధించి అడ్డగోలుగా జరిగిన డిప్యుటేషన్లను రద్దు చేస్తున్నట్లు గత డీఎంహెచ్ఓ వరసుందరం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ముడుపులివ్వని కొందరి డిప్యుటేషన్లను మాత్రమే రద్దు చేశారు. ముడుపులిచ్చిన దాదాపు 25 మంది వారు కోరుకున్న స్థానాల్లో డిప్యుటేషన్‌పై ఇప్పటికీ కొనసాగుతున్నారు. వీరిలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో దాదాపు 10 మందికిపైగా, బయట పీహెచ్‌సీల్లో 15 మంది వరకు కొనసాగుతున్నట్లు సమాచారం. ఉదయగిరిలో ఒకే పోస్ట్‌లో ఇద్దరు ఉద్యోగులను నియమించి పనిచేయిస్తున్నారు. -
గ'మ్మత్తు' వైద్యం
పశ్చిమగోదావరి, తాడేపల్లిగూడెం రూరల్: కనిపించే దైవంగా రోగులు వైద్యులను భావిస్తుంటారు. అటువంటి వైద్యుడే మద్యం మత్తులో సేవలందించడం విస్మయానికి గురి చేస్తోంది. అంతే కాకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న రోజువారీ కూలీ, ఆమె తల్లి పట్ల అమర్యాదగా ప్రవర్తించడం గమనార్హం. ఈ ఘటన మండలంలోని వెంకట్రామన్నగూడెం పీహెచ్సీలో గురువారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. వెంకట్రామన్నగూడెం పీహెచ్సీలో శాశ్వత ప్రాతిపదికన రెండో వైద్యుడిగా పనిచేస్తున్నారు. ఈయన గత నెల 25న పీహెచ్సీలో వైద్యుడిగా బాధ్యతలు చేపట్టారు. అతను మద్యం మత్తులో విధులకు హాజరవుతున్నట్టు డీఎంహెచ్ఓకు ఫిర్యాదు చేయగా, గత నెల 28న విచారించినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్‌పర్సన్‌కు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని సహచర సిబ్బంది వాపోయారు. మద్యం మత్తులో విధులకు హాజరు కావడంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఆసుపత్రిలో రోజువారీ కూలీగా పనిచేస్తున్న మనెల్లి స్వర్ణలత తన కుమార్తెకు యాక్సిడెంట్ కావడంతో గురువారం ఆమె తల్లిని ఆసుపత్రిలో పనికి పంపించింది. ఉదయం 6.30 గంటలకు ఆసుపత్రికి వచ్చిన రెండో డాక్టర్ ఆమెను నిలదీశారు. కుమార్తెను దగ్గరుండి తీసుకురమ్మని చెప్పడంతో ఆమె తన తల్లితో ఆసుపత్రికి వెళ్లింది. తన కుమార్తెకు యాక్సిడెంట్ కావడంతో తన తల్లిని పంపించానని చెప్పినట్లు పేర్కొంది. డాక్టర్ యాక్సిడెంట్ నీకు కాదు కదా జరిగింది అని చులకనగా మాట్లాడారని, ఇంగ్లిష్‌లో తిట్టారని ఆమె ఆరోపించింది. ఈ మేరకు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపింది. ఈ విషయమై రూరల్ ఎస్సై బి.శ్రీనివాస్‌ను వివరణ కోరగా, ఇప్పటి వరకు తమకు లిఖితపూర్వకంగా ఎటువంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. అయితే రూరల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది ఒకరు వెంకట్రామన్నగూడెం పీహెచ్సీ వద్ద హడావుడి చేయడం గమనార్హం. ఫిర్యాదు చేయకుండా పోలీస్ సిబ్బంది పీహెచ్‌సీకి ఎలా వచ్చారనేది విశేషం. వెంకట్రామన్నగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం రెండో డాక్టర్‌పై చర్యలకు సిఫార్స్ చేశాం డాక్టర్ దుర్గాప్రసాద్ గత నెల 25న విధుల్లో చేరారు. అప్పట్నించి మద్యం తాగి విధులకు రావడంతో ఆసుపత్రి అభివృద్ధి కమిటి సమావేశంలో దుర్గాప్రసాద్‌ను తొలగించి వేరే డాక్టర్‌ను నియమించాలని కోరుతూ తీర్మానించాం. ఆయనను విచారణ కూడా చేశారు. ఇంకా నివేదిక రాలేదు. మరలా మద్యం తాగి వచ్చ నాతోనూ, దిగువ స్థాయి సిబ్బందితో గొడవపడటం, నోటికొచ్చినట్లుగా మాట్లాడటం చేస్తున్నారు. దుర్గాప్రసాద్ స్థానంలో కొత్త వారిని నియమించాలి.– కె.రవికుమార్, సీనియర్ డాక్టర్, వెంకట్రామన్నగూడెం పీహెచ్సీ విచారణ చేస్తున్నాం వెంకట్రామన్నగూడెం పీహెచ్సీ రెండో వైద్యాధికారి దుర్గాప్రసాద్‌పై స్వీపర్ స్వర్ణలత ఫిర్యాదు చేశారు. ఆమెతోపాటు డాక్టర్‌ను విచారణ చేస్తున్నాం.– బి.శ్రీనివాస్, ఎస్సై,తాడేపల్లిగూడెం రూరల్ పీఎస్ -
పడకేసిన ప్రాథమిక వైద్యం
సాక్షి, హైదరాబాద్: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ)లో వైద్య సేవలు పడకేశాయి. పూర్తిస్థాయిలో వైద్య సిబ్బంది లేక గ్రామాల్లో ప్రజలకు ఆరోగ్య సేవలు అందడం లేదు. సిబ్బంది ఖాళీలను పూర్తి స్థాయిలో భర్తీ చేయకపోవడంతో వైద్యం చేసే నాథుడు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరికొన్ని చోట్ల వైద్య సిబ్బంది విధులకు డుమ్మా కొడుతుండటంతో రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పలుచోట్ల ఆస్పత్రులకు వస్తున్న గర్భిణులు సైతం అక్కడ వైద్య సిబ్బంది లేక వెనుదిరుగుతున్నారు. దీంతో స్థానికంగా ఉండే ఆర్‌ఎంపీలపైనే ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో వైద్యుల ఖాళీలను భర్తీ చేయాలని పలువురు కోరుతున్నారు. 294 వైద్య పోస్టుల ఖాళీలు.. పీహెచ్‌సీలు గ్రామాల్లో ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు అందిస్తుంటాయి. చిన్నచిన్న అనారోగ్య సమస్యలు మొదలు ఒకస్థాయి వరకు అక్కడ వైద్య సేవలు పొందొచ్చు. మరోవైపు టీకాలు వేయడం కూడా పీహెచ్‌సీల ద్వారానే జరుగుతోంది. తెలంగాణ సామాజిక అభివృద్ధి నివేదిక–2017 ప్రకారం రాష్ట్రంలో 668 పీహెచ్‌సీలున్నాయి. వాటిల్లో 24 గంటలు పనిచేసేవి కూడా కొన్ని ఉన్నాయి. వాటిల్లో ప్రసవాలు సైతం చేస్తారు. అత్యవసర వైద్య సేవలూ అందుబాటులో ఉంటాయి. వీటిల్లో ఇద్దరు వైద్యులు, ముగ్గురు నర్సులు, ఒక సహాయకుడు ఉండాలి. కానీ అనేకం ఖాళీగా ఉన్నాయి. మొత్తం పీహెచ్‌సీల్లో 1,318 అల్లోపతి వైద్యుల పోస్టులకు గాను, 1,024 మంది వైద్యులు మాత్రమే పనిచేస్తున్నారు. ఇంకా 294 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కొన్ని ఖాళీలను భర్తీ చేసినా పట్టణ పీహెచ్‌సీలతో కలుపుకుంటే 350 ఖాళీలున్నట్లు ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు ‘సాక్షి’కి తెలిపారు. పైగా చాలా ఆస్పత్రుల్లో వైద్యులు కూడా విధులకు వెళ్లకపోవడంతో పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వారిపై పర్యవేక్షణ కూడా లేదు. దీంతో గ్రామాల్లో ప్రాథమిక వైద్యం అందడం గగనంగా మారింది. కేసీఆర్ కిట్ పథకం ప్రవేశ పెట్టిన తర్వాత ప్రసవాల కోసం గర్భిణులు ఎక్కువగా 24 గంటల పీహెచ్‌సీలకు వస్తున్నారు. అయితే అక్కడా సరైన వైద్య సేవలు అందుబాటులో లేకపోవడంతో వారు దూర ప్రాంతాలకు వెళ్లలేక ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. ఇతర వైద్య సిబ్బంది ఖాళీలూ అధికమే పీహెచ్‌సీలతోపాటు సబ్సెంటర్లలో 9,141 మంది ఆరోగ్య కార్యకర్తలు పనిచేయాల్సి ఉండగా, ప్రస్తుతం 7,705 మంది మాత్రమే ఉన్నారు. ఇంకా 1,436 ఖాళీలున్నట్లు సదరు నివేదిక తెలిపింది. అంతేకాదు పీహెచ్‌సీల్లో ఆరోగ్య సహాయకులు 1,111 మంది ఉండాల్సి ఉండగా, 944 మంది మాత్రమే పనిచేస్తున్నారు. ఇంకా 167 ఖాళీలున్నాయి. సీహెచ్‌సీలు మొదలుకుని పీహెచ్‌సీల్లో లేబొరేటరీ టెక్నీషియన్లు 765 మంది ఉండాల్సి ఉండగా, 566 మందే పనిచేస్తున్నారు. ఇంకా 199 ఖాళీలున్నాయి. వాటిల్లో నర్సులు 1,666 మంది ఉండాల్సి ఉండగా, 1,453 మందే ఉన్నారు. ఇంకా 213 ఖాళీలున్నాయి. పీహెచ్‌సీల్లో బ్లాక్ ఎక్స్టెన్షన్ ఎడ్యుకేటర్ పోస్టులు 633 ఉండాల్సి ఉండగా, 544 మంది పనిచేస్తున్నారు. ఇంకా 89 ఖాళీలున్నట్లు నివేదిక తెలిపింది. పీహెచ్‌సీల్లో ఖాళీలున్నమాట వాస్తవమేనని, త్వరలో సర్దుబాటు చేసి వాటిని పటిష్టం చేస్తామని శ్రీనివాసరావు తెలిపారు. -
అమానవీయం..!
ఉద్యోగం అంటే టైమ్ టు టైమ్ జాబ్. అయితే రెవెన్యూ లాంటి కొన్ని శాఖల్లో అలా సమయపాలన కుదరదు. పని ఉంటే అహోరాత్రులూ పనిచేయాల్సి రావచ్చు. ముఖ్యంగా వైద్య శాఖలో గర్భిణి ప్రసవం కోసం వస్తే నా టైం అయిపోయిందని చేతులు దులుపుకొని వెళ్లిపోవడం మానవత్వం ఉన్న మనిషి చేసే పనికాదు. పెదనందిపాడు పీహెచ్సీలో ఇటువంటిదే ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. గుంటూరు, ప్రత్తిపాడు: పెదనందిపాడు పీహెచ్సీ స్టాఫ్ నర్సులు గర్భవతులతో బంతాట ఆడుతున్నారు. స్టాఫ్ నర్సుల నిర్వాకానికి తోడు స్థానిక ఆరోగ్య సిబ్బంది కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో నిండు గర్భిణులకు ప్రసవ వేదన తప్పడం లేదు. అందుకు నిదర్శనమే ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన. వివరాల్లోకి వెళితే ఈనెల 25వ తేదీ సాయంత్రం సుమారు ఆరుగంటల సమయంలో మండల కేంద్రమైన పెదనందిపాడుకు చెందిన నిండు గర్భిణి ఫాతిమాకు నొప్పులు రావడంతో బంధువులు ఆమెను తీసుకుని అదే గ్రామంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లారు. అక్కడ విధుల్లో ఉన్న స్టాఫ్‌నర్సు నా డ్యూటీ టైం అయిపోయిందని (సాయంత్రం ఆరుగంటలకే), తరువాత డ్యూటీకి వచ్చే స్టాఫ్‌నర్సుతో చేయించుకోండంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పింది. ఫాతిమా బాధ చూడలేని ఆమె బంధువులు అలా అంటే ఎలాగమ్మా.. నీ తరువాత ఆమె ఎప్పుడు డ్యూటీకొస్తుందో.. ఎంత టైం అవుతుందో తెలియదు కదా, అప్పటిదాకా ఉంటే బిడ్డకు ఏమైనా అవుతుందేమో.. మీరు కాస్త జాలి చూపి కాన్పు చేయాలని బతిమాలారు. అయినా చలించని స్టాఫ్‌నర్సు నేను ఇప్పుడు చెయ్యను.. కావాలంటే మీరు ప్రత్తిపాడుకు పోండంటూ తేల్చిచెప్పింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో స్థానిక ఆశ కార్యకర్తను తీసుకుని వారు గర్భిణి ఫాతిమాను ఆటోలో ప్రత్తిపాడు సామాజిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువచ్చారు. వాస్తవానికి స్టాఫ్‌నర్సులు రాత్రి ఎనిమిది గంటల సమయంలో డ్యూటీ రిలీవ్ అయి నైట్ డ్యూటీ వారికి చార్జ్ అప్పగిస్తారు. కానీ ఆరు గంటలకే నా డ్యూటీ టైం అయిపోయిందంటూ కాన్పు చేయకుండా నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడం విమర్శలకు దారితీస్తోంది. ఏఎన్ఎంకు ఫోన్ చేసినా... ప్రత్తిపాడు సీహెచ్‌సీలో విధుల్లో ఉన్న స్టాఫ్ నర్సు గర్భవతి పరిస్థితిని చూసి వివరాలు తెలుసుకునేందుకు సంబంధిత గ్రామ ఏఎన్ఎంకు ఫోన్ చేశారు. వివరాలను అడిగి తెలుసుకున్న తరువాత ఫాతిమాకు మూడవ కాన్పు కావడంతో ప్రత్తిపాడు సీహెచ్‌సీకి వచ్చి కాన్పుకు సాయం అందించాలని స్టాఫ్ నర్సు ఏఎన్ఎంను కోరారు. అందుకు ఏఎన్ఎం విముఖత వ్యక్తం చేయడంతో స్టాఫ్ నర్సు విషయాన్ని సీహెచ్‌సీ గైనకాలజిస్ట్ ఇంద్రాణికి సమాచారం అందించారు. వెంటనే ఆమె ఆస్పత్రికి చేరుకుని కాన్పు చేశారు. ప్రస్తుతం తల్లీ, బిడ్డా సురక్షితంగానే ఉన్నారని డాక్టర్ ఇంద్రాణి తెలిపారు. -
పురిట్లో పసికందు మృతి
తూర్పుగోదావరి, రాజవొమ్మంగి: రాజవొమ్మంగి పీహెచ్సీలో పుట్టిన కొద్ది సేపటికే పసికందు మృతి చెందింది. బుధవారం రాత్రి జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత కుటుంబీకుల కథనం ప్రకారం.. మండలంలోని అప్పలరాజుపేట గ్రామానికి చెందిన చిన్ని (కోలంకి) రాజామణికి మంగళవారం సాయంకాలం పురిటినొప్పులు రాగా రాజవొమ్మంగి పీహెచ్‌సీకి తరలించారు. బుధవారం దాదాపు మూడు గంటల అనంతరం అతికష్టం మీద రాజామణి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. పుట్టిన బిడ్డలో కదలిక లేకపోడంతో పురుడుపోసిన వైద్యులు మోనీషా, వంశీలు తల్లీబిడ్డలను ఏలేశ్వరం కమ్యూనిటీ ఆసుపత్రికి అంబులెన్స్ సహాయంతో పంపారు. వారు ఆసుపత్రికి చేరుకొనే లోపు బిడ్డ మరణించినట్టు అక్కడి వైద్యులు తెలపడంతో రాజామణి కుటుంబీకుల కన్నీరుమున్నీరయ్యారు. కాన్పుకు ముందు తల్లి రక్తం లేక బాగా నీరసంగా ఉందని వైద్యులు తెలిపారని, నొప్పులు ఇవ్వడానికి కష్టపడుతున్న తన బిడ్డను వెంటనే మైదాన ప్రాంతంలోని ఆసుపత్రికి పంపి ఉంటే తమ పసిబిడ్డ తమకు దక్కేదని రాజామణి తల్లి రమణమ్మ విలేకరుల వద్ద వాపోయింది. నిండు గర్భిణిని రాజవొమ్మంగి పీహెచ్సీలో 24 గంటలకు పైగా ఉంచి, తీరా పురిటిలో బిడ్డ మరణించాక తల్లీబిడ్డలను మైదానప్రాంతం ఏలేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేసి చేతులు దులుపుకొన్నారని విలపించింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమకు ఈ దుస్థితి కలిగిందని వాపోయింది. -
పీహెచ్‌సీల్లో విజిలెన్స్
సాక్షి విశాఖపట్నం , నెట్వర్క్: విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గురువారం జిల్లాలోని తొమ్మిది పీహెచ్‌సీలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రుల పనితీరు, ప్రభుత్వం అందిస్తున్న ఆరోగ్య, సంక్షేమ పథకాల అమలుపై ఆరా తీశారు. జిల్లా ఎస్పీ డి.కోటేశ్వరరావు ఆధ్వర్యంలో బృందాలు అనంతగిరి, గొలుగొండ, నర్సీపట్నం, రావికమతం, బుచ్చెయ్యపేట, అచ్యుతాపురం, పరవాడ, రాంబిల్లి, దేవరాపల్లి పీహెచ్‌సీల్లో ఏక కాలంలో తనిఖీలు చేపట్టాయి. ముఖ్యంగా వైద్య, ఆరోగ్య సిబ్బంది అందుబాటులో ఉంటున్నదీ లేనిదీ పరిశీలించారు. మౌలిక సదుపాయాలు, రోగులకు సేవలు ఎలా అందిస్తున్నదీ అడిగి తెలుసుకున్నారు. రికార్డులు, ల్యాబ్, మందుల గదులను పరిశీలించారు. పరవాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విజిలెన్స్ అధికారిణి పైల రేవతి ఆస్పత్రి వైద్యాధికారి ఆర్.ప్రమీలను పలు వివరాలు అడిగి తెలుసుకొన్నారు. ఆస్పత్రిలో నిర్వహిస్తున్న ప్రసవాలపై ఆరా తీశారు. నిత్యం ఆస్పత్రికి వస్తున్న రోగుల సంఖ్య, వారికి అందుతున్న వైద్య సేవలపై పలువురు రోగులను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. అపరిశుభ్రంగా ఉన్న ఆస్పత్రి పరిసరాల మెరుగుకు చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ అధికారి రేవతి సూచించారు. గొలుగొండలో విజిలెన్స్ అధికారి సత్యకుమార్ వైద్యాధికారి పద్మప్రియను పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. అనంతగిరిలో సీఐ మల్లికార్జున్ నేతృత్వంలోని అధికారులు వైద్యాధికారి షాహినాబేగంతో మాట్లాడి పూర్తిస్థాయిలో మందులున్నదీ లేనిదీ తెలుసుకున్నారు. డీఎస్పీ పీఎం నాయుడుతో కూడిన బృందం రావికమతం పీహెచ్సీలో తనిఖీలు చేపట్టింది. సరఫరా అయిన మందులు, వాటిలో కాలం చెల్లినవి ఏమైనా ఉన్నాయా అని క్షుణ్ణంగా పరిశీలించారు. వైద్యాధికారి, స్టాఫ్‌నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్ సహా సగం మంది సిబ్బంది విధులకు గైర్హాజరైనట్టు గుర్తించారు. సిబ్బంది సమయపాలన పాటించకపోవడంతో రోగులకు సక్రమంగా సేవలు అందడం లేదని గుర్తించారు. రాంబిల్లి, అచ్యుతాపురం పీహెచ్‌సీలను విజిలెన్స్ ఎస్పీ కోటేశ్వరరావు తనిఖీ చేశారు. అంతకు ముందు విజిలెన్స్ అధికారి సత్యవతి రికార్డులు పరిశీలించారు. ముందుగా తయారుచేసుకున్న చెక్‌లిస్ట్ ప్రకారం వివిధ అంశాలపై ఆరా తీశారు. పాఠశాలలు, వసతిగృహాల్లో నెలవారీ వైద్య శిబిరాలు నిర్వహించిందీ లేనిదీ తెలుసుకున్నారు. డెంగ్యూ, విష జ్వరాలప్పుడు గ్రామాల్లో చేపట్టిన వైద్యశిబిరాల్లో వినియోగించిన మందుల వివరాలు అడిగారు. ఆస్పత్రి కోసం కొనుగోలు చేసిన పరికరాలను ఆమె పరిశీలించారు. నర్సీపట్నం మండలం వేములపూడి పీహెచ్సీలో విజిలెన్స్ జియాలజిస్ట్ బైరాగినాయుడు తనిఖీలు చేపట్టారు. మందులు, స్టాక్ రిజిస్టర్‌ను సరి చూశారు. ఎంత మంది సిబ్బంది, ఎక్కడెక్కడ నుంచి ఎన్ని గంటలకు వస్తున్నదీ వైద్యాధికారి ఎ.సౌమ్యను అడిగి తెలుసుకున్నారు. వివిధ పీహెచ్‌సీల్లో సిబ్బంది కొరతతో పూర్తి స్థాయిలో సేవలు అందని వైనాన్ని తెలుసుకున్నారు. అన్ని వివరాలతో కూడిన పూర్తి స్థాయి నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని అధికారులు తెలిపారు. -
ఏఎన్ఎంల సేవలు గోరంతే..!
ఆదిలాబాద్‌టౌన్: పేదలకు నాణ్యమైన సర్కారు వైద్యం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులను వెచ్చిస్తోంది. ప్రభుత్వ ఆలోచన మంచిదే అయినప్పటికీ ఆశించిన ఫలితాలు ఆచరణలో మాత్రం కానరావడం లేదు. వైద్యాధికారుల నిర్లక్ష్యమో లేక ఏఎన్ఎంల అలసత్వమేమో కానీ గర్భిణులు, బాలింతలు,చిన్నారులకు వైద్య సేవలు సక్రమంగా అందడం లేదని తెలుస్తోంది. గత వారం రోజుల క్రితం సిరిసిల్ల జిల్లాకు చెందిన రెండు బృందాలు జిల్లాలోని పలు సబ్ సెంటర్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సబ్ సెంటర్లలోని సౌకర్యాలు, వసతులపై ఆరా తీశారు. కొంతమంది ఏఎన్ఎంలకు రక్త పరీక్షలు చేయడం రాదని, గర్భిణులు, బాలింతల వివరాలు పొంతన లేని విధంగా నమోదు చేసినట్లు వారి పరిశీలనలో బయటపడింది. ఈ వివరాలతో కూడిన నివేదికను ఆ బృందాలు డీఎంహెచ్‌ఓతోపాటు రాష్ట్ర ఉన్నతాధికారులకు సమర్పించారు. వారి తప్పులను సవరించుకునే విధంగా వైద్యశాఖ చర్యలు చేపడుతోంది. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై శాఖ పరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. జిల్లాలో తనిఖీ బృందాల పర్యటన.. జిల్లాలో 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో 126 సబ్ సెంటర్లు ఉండగా, సిరిసిల్ల జిల్లాకు చెందిన ఆరుగురు సూపర్వైజర్ సభ్యులు ప్రభలత, రాజునాయక్, జె.రత్నాకర్‌రావు, రమేష్, సుశీల, యాదగిరి రెండు బృందాలుగా ఏర్పడి అక్టోబర్ 30 నుంచి నవంబర్ 3వ తేదీ వరకు జిల్లాలోని 32 సబ్ సెంటర్లలో పర్యటించారు. బేల, చప్రాల, భోరజ్, ఆనంద్‌పూర్, బోరిగాం, కోకస్మన్నూర్, తర్నం, ముత్నూర్, ఖానాపూర్, లోకారి, పరస్వాడ(బి), కుచ్లాపూర్, భరంపూర్, రాంపూర్, భీంసరి, మావల, కేశవపట్నం, ఘన్పూర్, కేస్లాపూర్, యేందా, నాగల్కొండ, కప్పర్ల, అందర్‌బంద్, గిరిగావ్, గుడిహత్నూర్, మన్నూర్, మర్లపల్లి, బోథ్, గిర్నూర్, జాతర్ల, రాంపూర్(కె), లక్కారం సబ్ సెంటర్లను పరిశీలించారు. వీటిలో గాదిగూడ పీహెచ్సీ పరిధిలోని పరస్వాడ, ఝరి పీహెచ్సీ పరిధిలోని లోకారి, ఇచ్చోడ పీహెచ్సీ పరిధిలోని బోరిగాం, సైద్పూర్ పీహెచ్సీ పరిధిలోని చప్రాల, బేల పీహెచ్సీ పరిధిలోని బేల సబ్‌సెంటర్, అంకోలి పీహెచ్సీ పరిధిలోని మావల, నర్సాపూర్ పీహెచ్సీ పరిధిలోని కేశవపట్నం, సొనాల పీహెచ్సీ పరిధిలోని ఘన్పూర్ సబ్‌స్టేషన్‌లో పనిచేసే ఏఎన్ఎంల పనితీరుపై అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. వీరిలో కొంతమందికి హెమోగ్లోబిన్ రక్త పరీక్షలు చేయరాకపోవడం, ఆశ కార్యకర్తలు గర్భిణులను ప్రసవం కోసం ఆస్పత్రికి తీసుకెళ్లకపోవడం, అంగన్వాడీల రికార్డులకు ఏఎన్ఎంల రికార్డులకు బాలింతలు, గర్భిణుల వివరాల పొంతన లేకుండా ఉండడం, వ్యాక్సినేషన్ సరిగా లేకపోవడంతోపాటు వివిధ కారణాలను చూపుతూ ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించారు. వైద్యసేవలు అంతంతే.. జిల్లాలోని సబ్సెంటర్లలో విధులు నిర్వర్తించే కొంతమంది ఏఎన్ఎంల సేవలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఈ విషయం రాష్ట్ర తనిఖీ బృందం పరిశీలనలోనే తేటతెల్లమైంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పీహెచ్సీ పరిధిలోని మెడికల్ ఆఫీసర్ పర్యవేక్షణ లేకపోవడంతో కొంతమంది ఏఎన్ఎంలు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. ఆరోగ్య కేంద్రాల ఆవరణలో పారిశుధ్యం అస్తవ్యస్తంగా ఉండడం, సమయపాలన పాటించకపోవడం, వారంలో ఒకట్రెండు రోజులు మాత్రమే ఉప కేంద్రాలను తెరవడం, గ్రామాల్లో ప్రజలకు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించకపోవడం, నామమాత్రంగానే విధులు నిర్వహిస్తున్నారనే విషయాలన్ని బృందం సభ్యుల దృష్టికి వచ్చింది. జాబ్ చార్ట్ ప్రకారం సబ్సెంటర్కు ఇద్దరు ఏఎన్ఎంలు ఉంటే ఒకరు సబ్సెంటర్లో ఉండాలి, మరొకరు గ్రామాల్లో ప్రజలకు సీజనల్ వ్యాధులు, తదితర వాటిపై అవగాహన కల్పించాలి. గర్భిణులకు ఐరన్ మాత్రలు అందజేయాలి. మాతా, శిశు మరణాల రేటును తగ్గించేందుకు కృషి చేయాలి. గర్భిణులకు హెమోగ్లోబిన్ రక్త పరీక్షలు చేయాలి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవం చేసుకునేలా గర్భిణులను ప్రోత్సహించాలి. కుటుంబ నియంత్రణ పాటించేలా చర్యలు తీసుకోవడంతోపాటు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాల్సి ఉంటుంది. పీహెచ్సీ పరిధిలోని వైద్యులతో వైద్య శిబిరాలను ఏర్పాటు చేయించాలి. ఉదయం నుంచి సాయంత్రం 4గంటల వరకు విధులు నిర్వహించాలి. కిషోర బాలికలకు వ్యక్తిగత పరిశుభ్రత, రుతుచక్రం గురించి అవగాహన కల్పించాలి. కానీ జిల్లాలో కొంతమంది ఏఎన్ఎంలు ఇవేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు ఇటీవల సిరిసిల్ల సూపర్వైజర్ల బృందం జిల్లాలోని 32 సబ్ సెంటర్లను పరిశీలించింది. ఇందులో నుంచి కొన్ని సెంటర్లలో కొంతమంది ఏఎన్ఎంలకు హెచ్‌బీ పరీక్షలు చేయడం రాదనే విషయాన్ని బృందం సభ్యులు నివేదికలో పొందుపర్చారు. గర్భిణులు, బాలింతల వివరాలు వేర్వేరుగా నమోదు చేసిన అంగన్వాడీ, ఏఎన్ఎంల రికార్డుల్లో వ్యత్యాసం ఉంది. కొంతమంది ఆశ కార్యకర్తలు గర్భిణులను ప్రసవం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లడం లేదనే విషయాన్ని నివేదికలో తెలిపారు. వీటిని పరిశీలించి చర్యలు తీసుకుంటాం. విధుల్లో ఎవరైన నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శాఖపరమైన చర్యలు తప్పవు. – రాజీవ్‌రాజ్, డీఎంహెచ్ఓ, ఆదిలాబాద్ -
ఆయువు తీసిన అనాస మందు
తూర్పుగోదావరి, రాజవొమ్మంగి (రంపచోడవరం): బిడ్డ తాగిన పాలు కక్కేస్తుందని ఆ తల్లి వారపు సంతలో కొని తెచ్చుకొన్న అనాస మందును పట్టించడంతో పొత్తిళ్లలోని బిడ్డ చనిపోగా ఆ తల్లికి కడుపుకోత తప్పలేదు. రాజవొమ్మంగి మండలం లోతట్టు గ్రామం అమ్మిరేఖల గ్రామానికి చెందిన బోనెం లోవకుమారికి తొలి కాన్పులో పుట్టిన మూడు నెలల పసిపాప గురువారం కాకినాడ జీజీహెచ్‌లో చనిపోయింది. బాధితుల కథనం ప్రకారం.. సూర్యకుమారి జూలై 22న రాజవొమ్మంగి పీహెచ్సీలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ పాప పూర్తి ఆరోగ్యంతో ఉండగా రెండు రోజుల క్రితం వాంతులు, రొంప, ఊపిరి అందక ఇబ్బంది పడింది. తన బిడ్డ రొంపతో బాధపడుతూ పాలు కక్కేసుకొంటోందని ఈనెల 3వ తేదీ బుధవారం రాజవొమ్మంగి పీహెచ్‌సీకు వైద్యం కోసం వెళ్లింది. ఆ పాపను పరీక్షించిన స్థానిక పీహెచ్సీ వైద్యాధికారి వంశీ పాప ఆరోగ్యంగానే ఉందని కొన్ని మందులు ఇచ్చి పంపారు. ఇంటికి వెళ్లిన పాప ఆ రాత్రి కంటిపై కునుకు లేకుండా ఏడవడంతో ఏం చేయాలో తెలియక వారపు సంతలో కొని తెచ్చిన అనాస మందు పొట్లాన్ని పాపకు పాలలో కలిపి పట్టించింది. తెల్లారేసరికి పాప పరిస్థితి విషమించడంతో వెంటనే మరోసారి రాజవొమ్మంగి పీహెచ్‌సీకి తీసుకువెళ్లారు. పాప పరిస్థితిని గమనించిన డాక్టర్ వంశీ అంబులెన్స్ ఇచ్చి కాకినాడ జీజీహెచ్‌కు పంపారు. అక్కడ వైద్య నిపుణులు పాపను బతికించేందుకు శతవిధాలా ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. మరణించిన పాపతో సూర్యకుమారి గురువారం ఇంటికి చేరింది. -
శ్రమకు దక్కిన ఫలితం..
భీమదేవరపల్లి(హుస్నాబాద్)/కమలాపూర్ : వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్, కమలాపూర్ మండలం ఉప్పల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు(పీహెచ్సీ) జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. పీహెచ్‌సీలకు వచ్చే రోగులకు నాణ్యమైన వైద్య సేవలందిస్తూ జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఉత్తమ పీహెచ్‌సీలుగా గుర్తింపు పొందిన ఈ రెండు పీహెచ్‌సీలకు తాజాగా జాతీయ నాణ్యతా ప్రమాణాల హామీ సంస్థ(ఎన్‌క్వాస్)గుర్తింపు లభిం చినట్లు జిల్లా వైద్యారోగ్యశాఖ వర్గాలు తెలిపా యి. దీంతో ఆయా పీహెచ్సీ వైద్యసిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ప్రభుత్వ దవాఖానాల్లో వైద్య సేవలు రోగులకు సక్రమంగా అందేవి కావు. దీనికి తోడు ప్రభుత్వ ఆస్పత్రి, పీహెచ్సీలలో కనీస వసతులు లేకపోవడంతో ప్రభుత్వ దవాఖానా అంటేనే రోగులకు ఒకింత అసహనభావం ఏర్పడేది. కానీ మారుతున్న పరిస్థితులకనుగుణంగా ప్రభుత్వ ఆస్పత్రులు, పీహెచ్‌సీలు సైతం ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తు ప్రజామన్ననలు పొందుతున్నాయి. కార్పొరేట్ ఆస్పత్రులను తలదన్నేలా జాతీయ స్థాయిలో పీహెచ్‌సీలు గుర్తింపును కైవసం చేసుకోవడంపై స్థానికంగా హర్షం వ్యక్తం అవుతుంది. ప్రభుత్వ పథకాల అమలు తీరు భేష్.. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్ పథకంతో పీహెచ్‌సీలు, ప్రభుత్వ వైద్యశాలలో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగాయి. దీంతో పాటుగా జిల్లాలో ముల్కనూర్, ఉప్పల్ పీహెచ్‌సీలు ‘కాయకల్ప’ అవార్డులు సైతం లభించిన విషయం విధితమే. నెల రోజుల క్రితమే రెండు పీహెచ్సీలలో కేంద్ర బృందం తనిఖీ చేసింది. కాగా ఈ రెండు పీహెచ్‌సీలకు జాతీయ స్థాయి గుర్తింపు సర్టిఫికెట్తో పాటుగా మూడేళ్ల పాటుగా ఏడాదికి రూ. 3లక్షలు చొప్పున అభివృద్ధి నిధులు మంజూరు కానున్నాయి. కాగా ముల్కనూర్ వైద్యాధికారి కేశవరావు, ఉప్పల్ వైద్యాధికారి రాకేష్‌తో పాటు సిబ్బందిని జిల్లా వైద్యాధికారి హరీష్‌రాజు అభినందించారు. -
కుకునూరుపల్లి పీహెచ్సీలో కేంద్ర బృందం
కొండపాక(గజ్వేల్): మండల పరిధిలోని కుకునూరుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం కేంద్ర బృందం పరిశీలించింది. ఈ ఆరోగ్య కేంద్రం పనితీరులో మంచి ఫలితాలను పొందడంతో జిల్లా, రాష్ట్ర స్థాయిలో అవార్డులను అందుకుంది. ఈ నేపథ్యంలో ఆసుపత్రి పనితీరు, పరిసరాల పరిశుభ్రత, ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, కాన్పుల సంఖ్య, మౌలిక వసతులు, రోజుకు వచ్చిపోయే రోగుల సంఖ్య, తదితర అంశాలను రెండు రోజుల పాటు కేంద్ర బృందం పరిశీలిస్తుంది. ఈ క్రమంలో సోమవారం మొదటి రోజున ఆసుపత్రి ఆవరణలో కలియతిరుగుతూ పరిసరాలను చూశారు. ఆసుపత్రికి ఎలాంటి వైద్యం కోసం ప్రజలు వస్తున్నారో స్వయంగా పరిశీలించారు. దీంతో పాటు వైద్య పరీక్షలు పొందిన వారిని వైద్యం అందుతున్న తీరుతెన్నులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో సిబ్బంది హాజరు రిజిష్టరు, సమయ పాలన, రోగులతో సిబ్బంది ప్రవర్తన స్వయంగా పరిశీలించారు. ఆసుపత్రిలో డెలివరీ గదిని, ల్యాబ్ పరికరాలను, ఇన్ పేషంట్లకు ఏర్పాటు చేసే గదులను పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చే గ్రామాల స్థితిగతులు, ప్రజల జీవన ప్రమాణాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర బృందం సభ్యులు మీనాక్షి, సుందరంలు మాట్లాడుతూ ఆసుపత్రిలో తిరిగి గుర్తించిన విషయాలను కేంద్ర ప్రభుత్వంకు నివేదిస్తామన్నారు. ప్రస్తుతం ఆసుపత్రి పనితీరు బాగానే ఉందని ప్రాథమికంగా కితాబిచ్చారు. కార్యక్రమంలో కేంద్ర బృందం సభ్యులు అనిల్, కుమార్ రాష్ట్ర క్వాలిటీ బృందం ధరంసింగ్, జిల్లా సభ్యులు అవోక్, డిప్యూటీ డీఎంఅండ్ హెచ్ఓ బలరాం, వైద్యులు కృష్ణారావు, పవన్, సిబ్బంది లింగమూర్తి, నర్సింహారెడ్డి, అండాలు, శ్రీనివాస్‌రెడ్డి, సుమిత్ర, లలిత, శ్యామల తదితరులు పాల్గొన్నారు. -
పీహెచ్‌సీల్లో ఈసీజీ సేవలు
నిజాంసాగర్(జుక్కల్) : కార్పొరేట్ ఆస్పత్రులతో పాటు జిల్లా కేంద్ర ఆస్పత్రులకే పరిమితమైన అధునాతన వైద్య సదుపాయాలు ప్రస్తుతం పల్లెలకు విస్తరిస్తున్నాయి. అమ్మఒడి, కేసీఆర్ కిట్లు, ఆరోగ్యలక్ష్మి తదితర ప్రతిష్టాత్మక పథకాలు తీసుకొచ్చిన .. ప్రా«థమిక ఆరోగ్య కేంద్రాల్లో అధునాతన సదుపాయాలను కల్పిస్తోంది. జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఈసీజీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆరోగ్య కేంద్రాల్లో ఈసీజీ సేవలు అందుబాటులోకి రావడంతో గ్రామీణ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఛాతినొప్పి, గుండెనొప్పితో బాధ పడుతున్న రోగులు ఈసీజీ కోసం పట్టణ ప్రాంతాల్లోని ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లాల్సి వచ్చేది. ఈసీజీ పరీక్షల కోసం వందల రూపాయలు వెచ్చించాల్సి వచ్చేది. నొప్పి వచ్చినప్పుడల్లా పట్టణాలకు పరుగులు తీస్తూ జేబులు గుల్ల చేసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. అయితే, సర్కారు ఆరోగ్య కేంద్రాలను బలోపేతం చేసే క్రమంలో భాగంగా వైద్య సేవలను విస్తృతం చేస్తోంది. పీహెచ్సీలలో వసతులను మెరుగు పరిచిన ప్రభుత్వం.. మండల కేంద్రాల్లో ఉన్న ఆరోగ్య కేంద్రాలకు రూ.50 వేల విలువ గల ఈసీజీ యంత్రాన్ని, ఇతర పరికరాలను సరఫరా చేసింది. దాంతో ఆయా మండల కేంద్రాల్లో ఉన్న ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ఈసీజీ పరీక్షలు అందుబాటులోకి వచ్చాయి. గుండెనొప్పి వ్యాధిగ్రస్తులతో పాటు 45 సంవత్సరాల వయస్సు పై బడిన వారు ఈసీజీ పరీక్షలను చేయించుకుంటున్నారు. ఆరోగ్య కేంద్రాల్లో ఈసీజీ యంత్రాల ద్వారా రోగులకు స్థానిక వైద్యులు పరీక్షలు చేస్తున్నారు. పల్లెల్లో ఈసీజీ సేవలు అందుబాటులోకి రావడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆరోగ్య కేంద్రాల్లోనే పరీక్షలు మండల కేంద్రాల్లోని ఆరోగ్య కేంద్రాల్లో ఈసీజీ పరీక్షలను ఉచితంగా చేస్తున్నాం. గుండెనొప్పి సంబంధిత వ్యాధుల నిర్దారణకు ఈసీజీ సేవలు దొహదపడుతున్నాయి. ఆరోగ్య కేంద్రాల్లో ఈసీజీ పరీక్షల ద్వారా రోగుల సంఖ్య పెరుగుతుంది. ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో నమ్మకమూ పెరుగుతుంది. – స్పందన, ఆరోగ్య కేంద్రం వైద్యురాలు, నిజాంసాగర్ -
చిన్నారి మృతికి కారకులపై చర్యలేవి..?
ఇల్లందకుంట(హుజూరాబాద్): ‘నెలసూదికని.. చిన్నారిని ఆస్పత్రికి తీసుకొస్తే.. వైద్యులు నిర్లక్ష్యంతో వ్యవహరించి ప్రాణం తీశారని, బాధ్యులపై చర్య తీసుకోవాలని ఎనిమిది నెలలుగా పోరాడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని’ సదరు చిన్నారి తల్లిదండ్రులు, బంధువులు శుక్రవారం ఇల్లందకుంట పీహెచ్సీ ఎదుట ఆందోళన చేశారు. పీహెచ్సీ భనవం ఎక్కి 8 గంటలు నిరసన వ్యక్తం చేశారు. బాధితుల వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన అప్పా ల విజయ్– హారిక దంపతులకు 45రోజుల కూతురు ఉండేది. గతేడా ది అక్టోబర్11న ప్రభుత్వాస్పత్రిలో వేసిన ఇంజక్షన్ వికటించి మృతి చెం దింది. చిన్నారి మృతికి కారణమైన వారిపై చర్య తీసుకోవాలని అప్పటి నుంచి తిరుగుతున్నా అధికారులు వచ్చి నివేదికలు పంపిస్తున్నారు తప్పా.. తమ కూతురు మృతికి గల కారణాలు తెల్పడం లేదని చిన్నారి తండ్రి ఆరోపిస్తున్నాడు. అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేసిన చిన్నారి బంధువులు, తల్లిదండ్రులు పీహెచ్సీ ఎదుట ఆందోళన చేశారు. భనవం పైకి ఎక్కి దాదాపు 8 గంటలు నిరసన వ్యక్తం చేశారు. సీఐ నారాయణ అక్కడకు చేరుకుని వారితో మాట్లాడారు. జిల్లా వైద్యాధికారికి పరిస్థితితి వివరించారు. 15రోజుల్లో నివేదిక అందిస్తామని జిల్లా ప్రత్యేకాధికారి సుధాకర్ ఇచ్చిన హామీతో ఆందోళన విరమించారు. -
ప్రభుత్వాసుపత్రిలో ఊడి పడిన ఫ్యాన్
మణుగూరుటౌన్: మున్సిపాలిటీ పరిధిలోని శివలింగాపురం పీహెచ్సీలో సీలింగ్ ఫ్యాన్ ఊడి పడడంతో బాలింత తలకు తీవ్ర గాయమైంది. ఇది మంగళవారం జరిగింది. బాధితురాలు తెలిపిన వివరాలు... సమితి సింగారం పంచాయతీ సీతానగరం గ్రామానికి చెందిన కొప్పుల స్వాతి, పురిటి నొప్పులతో మధ్యాహ్నం రెండు గంటలకు ఆసుపత్రిలో చేరింది. సాయంత్రం ఏడు గంటల సమయంలో చిన్న ఆపరేషన్ ద్వారా పాపకు జన్మనిచ్చింది. ఆ తరువాత సిబ్బంది ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. తొమ్మిది గంటల సమయంలో వార్డులోని సీలింగ్ ఫ్యాన్ హఠాత్తుగా ఊడి, కొప్పుల స్వాతి తలపై పడింది. ఆమె తలకు తీవ్ర గాయమైంది. ఆ సమయంలో అక్కడ ఆసుపత్రి సిబ్బంది ఎవరూ లేరు.. ఆ తరువాత కూడా రాలేదు. -
మెట్పల్లి ప్రభుత్వాస్పత్రిలో రికార్డు ప్రసవాలు
మెట్పల్లి(కోరుట్ల): మెట్పల్లి ప్రభుత్వాస్పత్రి ప్రసవాల్లో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. వైద్యవిధాన పరిషత్ పరిధిలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్(సీహెచ్‌సీ)లల్లో అన్నింటికన్నా ఎక్కువ ప్రసవాలు జరిగిన ఆస్పత్రిగా మెట్పల్లి రికార్డు సృష్టించింది. 2017–18(ఏప్రిల్ నుంచి మార్చి వరకు) మొత్తం 660 ప్రసవాలు లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 1444 ప్రసవాలు జరిగాయి. 50 పడకలతో ఉన్న ఈ ఆస్పత్రిలో రెండు, మూడు సంవత్సరాల క్రితం నామమాత్రంగా ప్రసవాలు జరిగేవి. ఈఏడాది ప్రభుత్వం ‘కేసీఆర్ కిట్’ పథకాన్ని అమలు చేస్తుండడంతో ప్రసవాల సంఖ్య భారీగా పెరిగింది. దీంతో పాటు ఓపీ, ఇన్‌పేషంట్ తదితర సేవల్లోనూ రాష్ట్రంలోని సీహెచ్‌సీల్లో రెండో స్థానంలో నిలవడం విశేషం. దీనిపై సూపరిండెంట్ ఆమరేశ్వర్ స్పందిస్తూ ఆస్పత్రిలో సిబ్బంది కొరత ఉన్నప్పటికీ ప్రస్తుతం ఉన్న సిబ్బంది సమష్టిగా పని చేస్తూ మంచి సేవలందిస్తుండడంతో రికార్డు ప్రసవాలు జరిగాయని వివరించారు. ఆస్పత్రి రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలవడంపై సంతోషం వ్యక్తం చేశారు. -
నాణ్యమైన సేవలందించాలి
జైనథ్(ఆదిలాబాద్): సమయానుసారం పీహెచ్సీలో అందుబాటులో ఉంటూ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలందించాలని జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ అన్నారు. శుక్రవారం సాయంత్రం ఆమె ఆకస్మికంగా మండల కేంద్రంలోని పీహెచ్‌సీని తనిఖీ చేశారు. వార్డ్, లేబర్ రూం, ఆపరేషన్ థియేటర్, స్కానింగ్ మెషిన్, మందుల గదిని పరిశీలించారు. యాంటీ స్నేక్ వీనం, యాంటీ రేబీస్ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయా? అని ప్రత్యేకంగా ఫార్మసిస్ట్ రవీందర్‌ను అడిగారు. పీహెచ్‌సీకి స్టాఫ్ నర్స్ పోస్ట్ లేకపోవడంతో చాలా ఇబ్బందిగా ఉందని, వైద్యురాలు చైతన్య స్రవంతి ఆమెకు విన్నవించారు. త్వరలోనే పోస్ట్ మంజూరుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అన్నారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు పీహెచ్‌సీని రౌండ్ ది క్లాక్గా మార్చాలని విన్నవించారు. పాత భవనం శిథిలావస్థకు చేరినందున కొత్త భవనం మంజూరు చేయాలని కలెక్టర్‌కు విన్నవించారు. విధులపై నిర్లక్ష్యం వహించరాదు.. కలెక్టర్ దివ్య దేవరాజన్ పీహెచ్‌సీని తనిఖీ చేసిన తరువాత, డీఎంహెచ్‌వో సైతం ప్రత్యేకంగా సిబ్బందితో మాట్లాడారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు ఇబ్బందులు లేకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. జూనియర్ అసిస్టెంట్ లేకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. విధులు సక్రమంగా నిర్వహించని వారిని ఉపేక్షించేది లేదని, కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట సూపర్వైజర్ సుభాష్, ఇతర సిబ్బంది ఉన్నారు. -
నవజాత శిశువు మృతి
ఇల్లంతకుంట(మానకొండూర్): ఇల్లంతకుంట పీహెచ్సీలో అప్పడే పుట్టిన శిశువు కరీంనగర్ తరలిస్తుండగా మృతి చెందింది. ఇందుకు వైద్యుల నిర్లక్ష్యమే కారణం అంటూ బంధువులు ఆందోళన చేశారు. వివరాల్లోకి వెళితే.. ఇల్లంతకుంట మండలం పత్తికుంటపల్లికి చెందిన ఓరుగంటి వర్షిత(29) శనివారం పుటిరినొప్పులతో ఇల్లంతకుంట పీహెచ్‌సీకి ప్రసవానికి వచ్చింది. సిబ్బంది సుఖప్రసవం కోసం ప్రయత్నించారు. సాయంత్రం 5గంటలకు విధుల్లో ఉన్న స్టాఫ్‌నర్సులు జగదీశ్వరీ, రేణుక, రాజశ్రీలు సిరిసిల్ల జేసీ మీటింగ్‌లో ఉన్న వైద్యాధికారి లతకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. దీంతో సుఖప్రసవం చేయాలని వారికి ఆదేశించారు. రాత్రి 7గంటలకు ప్రసవం చేశారు. మగశిశువు ఉమ్మనీరు మింగడంతో పాటు, మెడకు బొడ్డుపేగు చుట్టుకుని జన్మించాడు. గంట తరువాత కరీంనగర్ తరలించగా అప్పటికే మృతిచెందాడు. మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ప్రసవం చేయకపోవడంతోనే శిశువు మృతిచెందిందని, స్టాఫ్‌నర్సులు వైద్యాధికారికి ఫోన్ చేసి ఆమె చెప్పిన ప్రకారం ప్రసవం చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆదివారం పీహెచ్‌సీకి చేరుకుని వైద్యాధికారులు లత, రామకృష్ణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ఓ పక్క శిశువు మరణించాడనే పుట్టెడు దు:ఖంలో ఉన్న వర్షితకు కేసీఆర్ కిట్ ఇచ్చేందుకు స్టాఫ్‌నర్సులు ప్రయత్నించారు. దీంతో వారిపై ‘నా కొడుకును చంపేశారు... కిట్ ఇస్తున్నారా..?’ అంటూ వర్షిత ఆగ్రహం వ్యక్తం చేసింది. -
పైన పటారం లోన లొటారం
శామీర్‌పేట్ : సీఎం కేసీఆర్ దత్తత గ్రామాలు కలిగిన మండలం... నూతనంగా ఏర్పడిన మేడ్చల్ జిల్లాకు శామీర్‌పేట మండలంలో నూతన కలెక్టర్ కార్యాలయ నిర్మాణం... హైదరబాద్–కరీంనగర్ జాతీయ రహదారి... కనీసం వారంలో ఒక్క రోజైన తెలంగాణ ముఖ్య మంత్రి ప్రయాణించే మార్గం... ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ మండలానికి ప్రాథమి క ఆరోగ్య కేంద్రం ఓ మచ్చలా కనబడుతోందని స్థానికులే అంటున్నా రు. ఎందుకంటే ఆరోగ్య కేంద్రం ఎప్పుడూ అపరిశుభ్రత, వసతు లు లేమితో కనబడుతోంది. శామీర్‌పేట మండల ప్రథమిక ఆరోగ్య కేంద్రానికి ఏడాదిలో రెండుసార్లు రంగులు వేశారు. ఆసుపత్రి బయటి నుంచి చూస్తే మాత్రం రంగులతో కళకళలాడుతోంది. కానీ ఆసుపత్రిలోని సౌకర్యాలు మాత్రం లేవు. రోగుల సౌకర్యార్థ ఏర్పాటు చేసిన మూత్రశాలలు అధ్వానంగా తయారయ్యాయి. ఆసుపత్రి వెనక భాగంలో పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి. పాడైన మాత్రలు, పత్తి, ఇతర చెత్తను ఆసుపత్రి ఆవరణలోనే పడేస్తున్నారు. ఆస్పత్రిలోని వాటర్ ప్లాంట్ పాడైపోయింది. ఇన్ని సమస్యలు ఉన్నా ఏ అధికారి పట్టించుకున్న పాపానపోలేదు. రోగులతో దురుసుగా ప్రవర్తిస్తారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని వైద్యులు రోగుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారు. నగరానికి చేరువలో ఉండటంలో మండలంలో వివిధ గ్రామాల ప్రజలే కాకుండా పక్క మండలాల ప్రజలూ వస్తుంటారు. ఆసుపత్రి సిబ్బంది ప్రవర్తనతో ఇక్కడికి వచ్చే రోగులు మానసికంగా కూడా బాధ పడుతున్నారు. ఈ తీరును వైద్యులు, ఆస్పత్రి సిబ్బంది మార్చుకోవాలి. – ఇర్రి రవీందర్‌రెడ్డి, జగన్‌గూడ గ్రామ ఎంపీటీసీ సీఎం హామీలు ప్రకటనలకే పరిమితం సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్ పక్క మండలమైన శామీర్‌పేటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అధ్వానంగా ఉండటం బాధాకరం. ఇక్కడే ఇలా ఉందంటే రాష్ట్రం లో ఆరోగ్య కేంద్రాల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రత్యేక నిధులు కేటాయించి మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు కేవలం ప్రకటనలకే పరిమితం అయ్యాయి. ఇప్పటికైన సంబంధిత అధికారులు మేల్కొని ఆసుపత్రిలో సౌకర్యాలు కల్పించి అభివృద్ధి చేయాలి. – వి.సుదర్శన్, కాంగ్రెస్ మండలం అధ్యక్షులు గాంధీ ఆసుపత్రి అందించే సేవలు ఇక్కడా ఉండేవి అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం వల్లే అభివృద్ధిలో వెనుకబడిపోయింది. రాజీ వ్రహదారి పక్కనే ఈ ఆసుపత్రి ఉం డటంతో రోగులు అధిక సంఖ్య లో వస్తుంటారు. ఇప్పటికైనా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి మెరుగైన సేవలు అందించడానికి చొరవ తీసుకోవాలి. – కృష్ణయాదవ్, తూంకుంట గ్రామస్తుడు -
నిధుల వరద
గద్వాల న్యూటౌన్ : ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేసే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. అన్ని వసతులు ఉండి, ఉన్నతమైన ప్రమాణాలు పాటిస్తూ.. పరిసరాలు అత్యంత పరిశుభ్రంగా ఉంచుకునే ఆస్పత్రులకు క్వాలిటీ అస్యూరెన్స్ అక్రిడేషన్ (ఉత్తమమైందిగా గుర్తింపు) తోపాటు కాయ కల్ప పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఈ ఆస్పత్రులకు ప్రోత్సాహకాన్ని అందిస్తుంది. దీనిని జిల్లాలోని అన్ని ఆస్పత్రులకు దశలవారీగా సాధించేందుకు వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు మూడు నెలల క్రితం నుంచి కసరత్తు ప్రారంభించారు. అధికారుల కృషి కొంతమేర సఫలమైంది. క్వాలిటీ అస్యూరెన్స్ సాధించడంలో భాగంగా పీహెచ్‌సీల్లో వసతుల కల్పనకు అవసరమైన నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. దీంతో వాటి అభివృద్ధికిగాను తాజాగా రూ.1,75,76,000 మంజూరు చేసింది. జాతీయ క్వాలిటీ అస్యూరెన్స్ అక్రిడేషన్ కలెక్టర్ చైర్మన్‌గా డీఎంహెచ్ఓ, కోకన్వీనర్, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ సభ్యుడిగా జాతీయ క్వాలిటీ అస్యూరెన్స్ కమిటీ ఉంటుంది. వీరితోపాటు జిల్లా క్వాలిటీ అస్యూరెన్స్ మేనేజర్ ఉంటారు. ఈయన పీహెచ్‌సీల్లో అన్ని విషయాలు అధ్యయనం చేసి ప్రమాణాలు పెంచేందుకుగాను అవసరమైన ప్రణాళికను రూపొందిస్తారు. దీనికి అనుగుణంంగా కమిటీ చర్యలు తీసుకుంటుంది. పీహెచ్‌సీల్లో ప్రమాణాలు పెంచిన అనంతరం ప్రభుత్వానికి నివేదిక అందజేస్తారు. రాష్ట్రస్థాయి బృందం ఈ ఆస్పత్రులను పరిశీలిస్తుంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కనీసం 70శాతం ఉన్నతమైన ప్రమాణాలు ఉండటంతోపాటు స్వచ్ఛతలో 80శాతం స్కోర్ చేయగలిగితే...æ బృందం సభ్యులు (గుర్తింపు) అక్రిడేషన్ కార్డు జారీ చేస్తారు. ఇది పొందిన పీహెచ్‌సీలకు ఏడాదికి రూ.మూడు లక్షలు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అందించడమేగాక అదనంగా ఒక్కో పడకకు రూ.పది వేలు చొప్పున ఇస్తుంది. ప్రమాణాలు ఇలా ఉండాలి ప్రభుత్వ ఆస్పత్రికి రాకపోకలు సాగించే రోడ్డుమార్గం సరిగ్గా ఉండి, అంబులెన్స్ రావడానికి, వెళ్లడానికి ఇబ్బందులు లేకుండా మార్గం ఉండాలి. భవనం చుట్టూ విద్యుద్దీపాలు, ప్రహరీ ఉండాలి. ఆస్పత్రికి బోర్డుతోపాటు లోపల వివిధ విభాగాలకు సూచికల బోర్డులుండాలి. పీహెచ్సీ స్థాయికి కావాల్సిన వైద్య పరికరాలు, నీటి వసతి ఉండాలి. వైద్యులు, ఇతర సిబ్బంది చచ్చితంగా డ్రెస్‌కోడ్ పాటిస్తూ ఐడీలు ధరించాలి. వైద్యులు, ఇతర సిబ్బంది అన్ని ఆరోగ్య కార్యక్రమాలపై శిక్షణ పొంది ఉండాలి. తగినన్ని మూత్రశాలలు, మరుగుదొడ్లు ఉండాలి. పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉండటంతోపాటు బయోమెడికల్ వేస్టేజీని వేయడానికి కంపోస్ట్ పిట్ ఉండాలి. ఇలా అన్నీ ఉంటే అక్రిడేషన్ జారీ చేస్తారు. 3నెలల నుంచి చర్యలు క్వాలిటీ అస్యూరెన్స్ కమిటీ సూచన మేరకు జిల్లా క్వాలిటీ మేనేజర్ వంశీ తొమ్మిది పీహెచ్‌సీలను పరిశీలించారు. కేసీఆర్ కిట్ అమలైన నాటి నుంచి అయిజ పీహెచ్సీలో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దీంతో ప్రస్తుతమున్న భవనం ఏ మాత్రం సరిపోవడంలేదని 30పడకలకు సరిపడేలా భవనం విస్తరించాలని గుర్తించారు. ఇంకా ప్రహరీలు, కంపోస్ట్ పిట్ లేని వాటిని, తగినన్ని మూత్రశాలలు, మరుగుదొడ్లు లేని వాటిని, వైద్య పరికరాలు ఎక్కడెక్కడ అవసరమో ఇలా విభాగాల వారీగా గుర్తించారు. వీటి ఆధారంగా ఆయా పీహెచ్‌సీల్లో ప్రమాణాలు పెంచేందుకుగాను అవసతరమైన వసతుల కల్పనకు ప్రణాళికను రూపొందించారు. అన్ని పీహెచ్‌సీలకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్, పాలసీలతో కూడిన వివరాలను అందించారు. వసతుల కల్పనకు రూపొందించిన నివేదికను ఈపాటికే కలెక్టర్ రజత్‌కుమార్‌సైనికి అందించారు. ఆయన అనుమతితో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి తగిన ప్రతిపాదనలు పంపించగా ఈ నిధులను మంజూరు చేసింది. -
ప్రారంభించి.. తాళమేశారు..
రెండేళ్ల క్రితం నిర్మించిన పీహెచ్‌సీల దుస్థితి ఇదీ.. ► రూ.78 లక్షలతో ఒక్కో భవనం నిర్మాణం ► సిబ్బందిని మాత్రం నియమించని ప్రభుత్వం ► దీంతో నిరుపయోగంగా54 పీహెచ్‌సీలు ► ప్రభుత్వ వైద్యం అందక.. పట్నం పోతున్న పేదలు సాక్షి, హైదరాబాద్: సిద్ధాపురం.. వరంగల్‌కు 8 కిలోమీటర్ల దూరంలోని ఓ గ్రామం. ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా వరంగల్‌కు రావా ల్సిందే. చుట్టు్టపక్కల ఉన్న మరో ఐదు ఊళ్లదీ ఇదే పరిస్థితి. రెండేళ్ల క్రితం సిద్ధాపురంలో రూ.78 లక్షలతో అత్యాధునిక వసతులతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (పీహెచ్సీ) నిర్మించి.. వైద్య అధికారులు ఘనంగా ప్రారం భోత్సవం నిర్వహించారు. అయితే అదే రోజు సాయంత్రమే ఆ ఆస్ప త్రికి పెద్ద తాళం వేసి వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ పీహెచ్సీ తెరుచుకో లేదు. పది వేల మందికి వైద్య సేవలు అందించేం దుకంటూ నిర్మించిన ఆ ఆస్పత్రిలో ఒక్కరూ చికిత్స పొందలేదు. ఒక్క సిద్ధాపురంలోనే కాదు.. రాష్ట్రంలోని మరో 53 ప్రాంతాల్లోనూ ఇదే దుస్థితి. రాష్ట్రవ్యాప్తంగా రూ.కోట్లు ఖర్చు చేసి 54 కొత్త పీహెచ్‌సీలను నిర్మించారు. అయితే వైద్యులు, సిబ్బందిని నియమించడం మాత్రం మరిచిపోయారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలకు వైద్య సేవలు అందడంలేదు. అనివార్యంగా ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి.. చికిత్సలు చేయించుకుంటున్నారు. పడావుగా ఉన్న పీహెచ్‌సీలు ఇవే.. మైసిగండి, చారకొండ, రాచలూర్, ఎలిమినే డు, లేమూరు, మైలార్దేవరపల్లి (రంగారెడ్డి), రామయ్యగూడ, కోట్‌పల్లి, కరీంపూర్ (వికారా బాద్), కుషాయిగూడ (మేడ్చల్), బొడ్డుపల్లి, ఎ.డి.పల్లి (నల్లగొండ), తంగడపల్లి, వెలివెత్తి (భువనగిరి), రామక్కపేట, సిరిగిరిపల్లి, రాజ్‌గోపాల్‌పేట, అక్కన్నపేట (సిద్దిపేట), బొల్లారం, తుర్కపల్లి (సంగారెడ్డి), పులిమా మిడి (మహబూబ్‌నగర్), రాజోల్ (గద్వాల), శ్రీరంగాపూర్ (వనపర్తి), తోటపల్లి(నాగర్‌కర్నూలు), గోవింద్‌పేట, పెగడపల్లి, బినోల, ఎర్గట్ల (నిజామాబాద్), దేవన్‌పల్లి, పుల్కల్ (కామారెడ్డి), పైడిపల్లి, కొండపర్తి, సిద్ధాపూర్ (వరంగల్ అర్బన్), మల్యాల, కురవి (మహబూబాబాద్), ఒబుల్ కేశవపూర్, తాటికొండ, ఇప్పగూడ (జనగామ), దెందుకూ రు, చెన్నూరు, బొడులబండ, వల్లభి(ఖమ్మం), ఆసిఫ్‌నగర్, చన్నంపల్లి, గుములాపూర్ (కరీంనగర్), కూనారం, బేగంపేట (పెద్దపల్లి), నేరెళ్ల (జగిత్యాల), హన్మాజిపేట, లింగంపేట(సిరిసిల్ల), తాళ్లగురిజాల (మంచిర్యాల), బట్పల్లి, ఉషేగామ్ (ఆసిఫాబాద్), మహగామ్ (నిర్మల్). రూ.39.85 కోట్లతో.. 54 పీహెచ్‌సీలు 13వ ఆర్థిక సంఘం (2010–15) నిధులతో 54 పీహెచ్‌సీలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల కల్పన సంస్థకు ఈ బాధ్యతలు అప్పగించింది. 2016లో భవనాల నిర్మాణం పూర్తయింది. ఒక్కో పీహెచ్‌సీకి రూ.78 లక్షలు.. మొత్తంగా 39.85 కోట్లు ఖర్చు చేశారు. కొత్తగా భవనాలు నిర్మించిన 51 పీహెచ్‌సీలు, భవనాలు లేని మరో 3 పీహెచ్‌సీలు కలిపి మొత్తం 54 పీహెచ్‌సీల నిర్వహణకు వైద్యులు, ఇతర సిబ్బంది పోస్టుల మంజూరీ లో జాప్యం జరిగింది. మహబూ బ్‌నగర్, సిద్దిపేట, కరీంనగర్ జిల్లాల్లోని ఒక్కో పీహెచ్సీలో మాత్రమే వారంలో కొన్ని రోజు లు సేవలందిస్తున్నారు. ఇతర పీహెచ్సీ లోని వైద్యులకు అదనపు బాధ్యతలు అప్పగించి ఇక్కడ సేవలు కొనసాగిస్తున్నా రు. ఆస్పత్రిని నిర్మించి వదిలేసిండ్లు. ప్రారంభించిన రోజే అందరు వచ్చిండ్లు. ఆ తర్వాత ఎవరు రాలే. బిల్డింగ్ మొత్తం పడావు పడిపోతాంది. – కందుల నర్సయ్య, సిద్ధాపురం, వరంగల్ అర్బన్ జిల్లా ఎక్కువ మంది గిరిజనులు ఉన్న ప్రాంతం మాది. పీహెచ్‌సీని ప్రారంభిస్తే ఎంతో మేలు జరుగుతుంది. ప్రజాప్ర తినిధులు చొరవ చూపి సేవలు ప్రారంభించాలి. మా కష్టాల ను తీర్చాలి – ఆంగోతు మంగ్తానాయక్, అడవిదేవులపల్లి కడ్తాల్ మండలం మైసిగండిలో ఆస్పత్రిని ప్రారంభిం చారు. వైద్య సేవలు మాత్రం అందించడం లేదు. ప్రభుత్వం కొత్తగా డాక్టర్లను నియమించలేదట. ఈ విషయంపై పలుసార్లు ఆందోళనలు చేసినా పట్టించుకోవడంలేదు. – శ్రీనివాస్‌గౌడ్, మైసిగండి, రంగారెడ్డి జిల్లా. వైద్యం దూరమైతాంది ఏ చిన్న సమస్య వచ్చినా వరంగల్‌కు పోవాలి. ఇక్కడ ప్రభుత్వం ఆస్పత్రిని నిర్మించినందుకు సంతోషమే. అయితే డాక్టర్లు లేరు. ఎవరు లేరు. ఆస్పత్రిని నిర్మించినా మళ్లీ పాత సమస్యలే. – బొక్క రాజు, సిద్ధాపురం, వరంగల్ అర్బన్ జిల్లా -
ఐఏఎస్.. పీహెచ్సీలో డెలివరీ..
ఏరియా ఆస్పత్రిలో సబ్‌కలెక్టర్ ప్రసవం ప్రభుత్వ వైద్యంపై భరోసా కల్పించేందుకేనన్న పీఓ దినేష్‌కుమార్ రంపచోడరవరం : రాజమహేంద్రవరం సబ్‌కలెక్టర్ విజయకృష్ణన్ రంపచోడవరం ప్రభుత్వాసుపత్రిలో బుధవారం ఉదయం పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఆమె భర్త ఏఎస్ దినేష్‌కుమార్ రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా పనిచేస్తున్నారు. దంపతులిద్దరూ ఐఏఎస్ అధికారులైనప్పటికీ కార్పొరేట్ ఆస్పత్రులను పక్కన పెట్టి ప్రభుత్వ ఆస్పత్రిలో బిడ్డకు జన్మనివ్వడం ద్వారా పలువురికి ఆదర్శంగా నిచిచారు. ప్రభుత్వాస్పత్రిల్లో సైతం మెరుగైన వైద్యం అందుతుందనే భరోసా సామాన్యుల్లో కల్పించే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పీఓ దినేష్‌కుమార్ తెలిపారు. ఏరియా ఆస్పత్రిలో వసతులపై నమ్మకం ఉందన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. ఏరియా ఆస్పత్రిలో ప్రసూతి వైద్య నిపుణులు, మత్తు వైద్యుడు, చిన్న పిల్లల వైద్యుడు అందుబాటులో ఉండడంతో మెరుగైన వైద్య సేవలు అందుతున్నట్లు తెలిపారు. ఇటీవల కాలంలో ఏజెన్సీ ఆస్పత్రిల్లో వసతులు, వైద్య సేవలు మెరుగుపరిచినట్లు తెలిపారు. రంపచోడవరం ఏరియా ఆసుపత్రి కార్పొరేట్ ఆస్పత్రికి స్థాయికి తగ్గకుండా వసతులు ఉన్నట్లు వెల్లడించారు. ఏరియా ఆస్పత్రి ఇన్చార్జి కార్తీక్ మాట్లాడుతూ సబ్ కలెక్టర్ రెండు నెలలుగా రెగ్యులర్ చెకప్ చేయించుకుంటున్నారని తెలిపారు. ఏరియా ఆస్పత్రి వైద్య బృందంలోని గైనకాలజిస్ట్ వీరబ్బాయి తదితరులు పాల్గొన్నట్లు తెలిపారు. రంపచోడవరం ఏఎస్పీ అద్నాన్ నయీం ఆస్మీ, స్థానిక సర్పంచ్ వై.నిరంజనీదేవి పీఓను కలసి అభినందించారు. డీసీహెచ్ రమేష్‌కిషోర్, ఏజెన్సీ వైద్య ఆరోగ్యశాఖ అధికారి పవన్‌కుమార్ పర్యవేక్షించారు. -
23 మందికి నియామక ఉత్తర్వులు
అనంతపురం మెడికల్: జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మెడికల్ ఆఫీసర్ల నియామకానికి సంబంధించి గురువారం డీఎంహెచ్ఓ కార్యాలయంలో కౌన్సిలింగ్ చేపట్టారు. మొత్తం 37 మందికి గాను 23 మంది హాజరుకాగా, వారందరికీ నియామక ఉత్తర్వులు అందజేశారు. వారం రోజుల తర్వాత వీరిలో ఎంత మంది విధుల్లో చేరుతారో చూసి మరోసారి మెరిట్ ప్రాతిపదికన ఖాళీ పోస్టులు భర్తీ చేయనున్నట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ తెలిపారు. కౌన్సిలింగ్ ప్రక్రియలో ఇన్చార్జ్ జేసీ–2 వెంకటేశం, డీసీహెచ్ఎస్ డాక్టర్ రమేష్‌నాథ్, సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జగన్నాథ్ తదితరులు పాల్గొన్నారు. -
రూ. కోటి సంగతి పట్టదేమీ..?
► రెండేళ్లుగా డీఎంహెచ్‌వో ఖాతాలో మూలుగుతున్న నిధులు ► పీహెచ్‌సీల్లో మందుల కొరతతో రోగుల ఇక్కట్లు ► అత్యవసర మందుల కొనుగోలుకు టెండర్లు కూడా పిలవని వైనం ► సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నా దృష్టి సారించని వైనం గుంటూరు: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో 83 పీహెచ్‌సీలు ఉన్నాయి. ఏటా వీటిలో మందుల కొనుగోలుకు ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేసినా, అవి చాలక అత్యవసర మందుల కొనుగోలుకు డబ్బు లేక ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. అయితే పీహెచ్‌సీల్లో అత్యవసర మందుల కొనుగోలుకు గాను జిల్లా వైద్యారోగ్యశాఖకు 2015లో ప్రత్యేకంగా సుమారు రూ.కోటి నిధులు మంజూరయ్యాయి. వెంటనే టెండర్లు పిలిచి అత్యవసర మందులు కొనుగోలు చేసి పీహెచ్‌సీలకు పంపాల్సిన జిల్లా అధికారులు పట్టించుకోకపోవడంతో నిధులు ఖాతాలోనే మురుగుతూ వచ్చాయి. గత డీఎంహెచ్‌వో ఆధ్వర్యంలో టెండర్లు.. 2015లో అప్పటి జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిణి పద్మజారాణి టెండర్లు పిలిచినప్పటికీ వాటిని అప్పగించకుండానే వదిలేశారు. అప్పటి నుంచి నిధులు ఖాతాలో మూలుగుతున్నాయి. 2017 జనవరి 2న ఆమెను ప్రభుత్వానికి సరెండర్ చేయగా ఫుల్ అడిషనల్ చార్జి తీసుకొని రెడ్డి శ్యామల ఇన్చార్జి డీఎంహెచ్‌వోగా నియమితులయ్యారు. అప్పటి నుంచి ఇన్చార్జి పాలనలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నడుస్తుండటంతో పాలన గాడితప్పింది. ఇన్చార్జి కావడంతో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోలేదని విమర్శలూ లేకపోలేదు. కొచ్చర్ల పీహెచ్సీ నిర్లక్ష్యం వెలుగు చూసినా.. ఈపూరు మండలం కొచ్చర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు ట్రాన్స్పోర్ట్ కార్యాలయం ద్వారా వినుకొండకు మందులు పంపారు. తొమ్మిది నెలలుగా వాటిని వైద్యారోగ్యశాఖ అధికారులు తీసుకోకపోవడంపై ‘సాక్షి’ బుధవారం కథనం ప్రచురించింది. దీనిపై సీరియస్‌గా స్పందించిన కలెక్టర్ కోన శశిధర్ అప్పట్లో కొచ్చర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ అధికారిగా పనిచేసిన డాక్టర్ ప్రశాంతిని సస్పెండ్ చేశారు. డీఎంహెచ్‌వోకు షోకాజ్ నోటీసు ఇచ్చిన విషయమూ తెలిసిందే. ఇంత జరిగినా వైద్యారోగ్య శాఖ అధికారుల్లో మాత్రం చలనం రావడం లేదు. రాజధాని జిల్లాలో పదిరోజులుగా వర్షాలు కురుస్తూ గ్రామీణ ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలినా మార్పు మాత్రం రావడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
వచ్చారు... వెళ్లారు...
రాష్ట్ర మంత్రి వస్తున్నారంటే... మారుమూల పల్లెవాసుల్లో ఏదో తెలియని ఆశ. ఏమైనా ప్రకటిస్తారేమో... తమ సమస్యలు తీరుస్తారేమో... ఏవైనా వరాలు ఇస్తారేమో... ఇలా ఎవరైనా అనుకుంటారు. కానీ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ మాత్రం తూతూ మంత్రంగా పర్యటించారు. ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న ఆస్పత్రుల్లో అసౌకర్యాలను తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి ఏమీ హామీ ఇవ్వలేదు. అనారోగ్యం పాలైనవారి గురించి ఆరా తీస్తారనుకున్నా... అవేమీ ఆయన పర్యటనలో చోటు చేసుకోలేదు. జియ్యమ్మవలస/కురుపాం/గుమ్మలక్ష్మీపురం: ఏజెన్సీలోని ఆస్పత్రులను రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ బుధవారం పరిశీలించారు. తొలుత ఆయన జియ్యమ్మవలసలోని పీహెచ్‌సీని పరిశీలించారు. గిరిజనుల ఆరోగ్య స్థితిగతులు తెలుసుకుంటారని అంతా భావించినా ఆయన కేవలం ఆస్పత్రులనే తనిఖీ చేశారు. అసౌకర్యాలపై వాకబు చేశారు కానీ ఏవిధమైన నిర్ణయాన్నీ ప్రకటించలేదు. ఇక్కడి పీహెచ్సీలో సిబ్బంది కొరత ఉందనీ, డాక్టర్ సమయానికి రావట్లేదని సీపీఎం నాయకులు వినతిపత్రాన్ని అందించారు. ఈ తరుణంలో నిడగల్లుగూడ గ్రామానికి చెందిన బిడ్డిక అడ్డయ్య ‘ఓట్లకోసం వస్తారు... కనీసం ఇళ్ల బిల్లులైనా మంజూరుచేయరు’ అంటూ నిష్టూరమాడగా... మంత్రి ఒకింత అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రశ్నలే తమకు వస్తాయనీ... గతం కంటే ఎక్కువగానే ఇచ్చామని ఆయన్ను కసరుకున్నారు. అదే గ్రామానికి చెందిన మండంగి అభిరాం(11 నెలలు) తల్లి మతి స్థిమితం లేక పిల్లవాడిని విడిచిపెట్టేస్తే మండంగి సుమతి, వెంకటరావు దంపతులు ఆ బాబును పెంచుకుంటున్నారు. రోడ్డు పక్కనే ఇల్లు ఉండడంతో వారిదగ్గరకు వెళ్లి బాబుకు అంగన్వాడీ సరుకులు అందుతున్నాయా అని ప్రశ్నించారు. ఎందుకు అనారోగ్యంగా ఉన్నాడని అడిగారు. అయితే ఆయనేమైనా సాయం చేస్తారేమోనని ఆశపడినా ఆయన వారి సమాధానం వినకుండానే వెళ్లిపోయారు. మంత్రి వస్తారని... తమ సమస్యలు చెప్పుకుందామనీ అనుకున్నా... ఆ అవకాశం రాలేదని కిరిగేషు, రావాడ గిరిజనులు తెలిపారు. గిరిజనాభ్యుదయసంఘ అధ్యక్షుడు ఆరిక సింహాచలం మాత్రం గిరిజన గ్రామాల్లోని సమస్యలపై ఓ వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలోనే కురుపాం ఆస్పత్రి దయనీయం రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఉన్న 1400 పీహెచ్‌సీల్లో అత్యంత దయనీయమైనది కురుపాం ఆస్పత్రేనని... ఏజెన్సీనుంచి రోగులు బారులు తీరుతున్నా సౌకర్యాలు లేక పోవడం బాధాకరమని మంత్రి వ్యాఖ్యానించారు. కురుపాం సీహెచ్‌సీలో రోగుల వద్దకు వెళ్లి అందుతున్న సౌకర్యాలపై ఆరా తీసారు. దీర్ఘకాలం రాజకీయాల్లో ఉండి కేంద్ర మంత్రిగా పనిచేసినా ఈ ఆస్పత్రిని పట్టించుకోకపోవడం శోచనీయమని పరోక్షంగా వైరిచర్ల కిశోర చంద్రదేవ్‌ను ఉద్దేశించి అన్నారు. ఈ ఆస్పత్రిలో అవసరమైన వైద్యులు లేకుండా అనవసరమైన విభాగాలకు వైద్యులు ఉన్నారని తెలిపారు. త్వరలోనే ఆసుపత్రిలో లేబర్‌రూమ్, చిన్నపిల్లల వైద్యులు, గైనిక్ వైద్యులను నియమించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆస్పత్రిలో నలుగురు వైద్యులున్నా షిఫ్ట్ డూటీలతో అత్యవసర సమయాల్లో అందుబాటులో ఉండటంలేదని, వైద్యులకు క్వార్టర్స్ ఉన్నా అందులో ఉండట్లేదని మంత్రికి ఫిర్యాదు చేశారు. వెంటనే ఉన్న ఐటీడీఏ పీఓ లక్ష్మీషాను వారం రోజుల్లోగా ఆస్పత్రి క్వార్టర్స్‌ను సద్వినియోగంలోకి తేవాలని సూచించారు. డాక్టర్ సస్పెన్షన్‌కు ఆదేశం నిరుపయోగంగా ఉన్న క్వార్టర్స్ పునరుద్ధరిస్తే స్థానికంగా ఉంటారా అని మంత్రి కామినేని కురుపాం సీహెచ్‌సీ డాక్టర్ గౌరీశంకరరావును ప్రశ్నించగా తాము ఉండలేమని నేరుగా చెప్పడంతో అసంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి వెంటనే ఆయన్ను సస్పెండ్ చేయాలని ఆదేశించారు. చిత్తశుద్ధితో పనిచేయకుంటే సెలవుపై వెళ్లి ప్రైవేటు వైద్యం చేసుకోండని హెచ్చరించారు. మలేరియా కేసులు ఎక్కువే... గుమ్మలక్ష్మీపురం మండలం భద్రగిరి భద్రగిరి సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన మంత్రి ఓపీ వివరాలు, మలేరియా కేసులు, ఆస్పత్రిలో సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన భద్రగిరి పీవో కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఐటీడీఏ పరిధిలో సుమారు 83 వేల కేసులు నమోదైతే 250 పాజిటివ్‌గా గుర్తించామనీ, పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో సుమారు 81 వేల కేసులు నమోదవ్వగా 1200 పాజిటివ్‌గా గుర్తించామన్నారు. ఆసుపత్రుల్లో 24 గంటల పాటు రోగులకు వైద్య సేవలందించాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నదానిపై చర్చిస్తున్నట్లు చెప్పారు. ఏజెన్సీలో 80 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారనీ, దానిని అధిగమించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామనీ చెప్పారు. ఈయన వెంట పార్వతీపురం ఐటీడీఏ పీవో లక్ష్మీషా, డిప్యూటీ డీఎం అండ్ హెచ్‌వో రవికుమార్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పెద్దింటి జగన్మోహనరావు, పార్వతీపురం ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు, కురుపాం బీజేపీ ఇన్చార్జ్ నిమ్మక జయరాజు, మాజి ఎమ్మెల్యే వీ.టి.జనార్థన్థాట్రాజ్ స్థానిక అధికారులు పాల్గొన్నారు. -
శంకర్‌దాదా ఆర్ఎంపీ
► పీహెచ్‌సీల్లో అందుబాటులో ఉండని వైద్యులు ► ఆర్ఎంపీల వద్దకు పరుగులు పెడుతున్న పల్లె జనం ► వచ్చీరాని వైద్యంతో మందులిస్తున్న ఆర్ఎంపీలు ► ఫిరంగిపురంలో చూపు కోల్పోయిన వివాహిత ► జిల్లాలోని అన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఇదే దుస్థితి పొద్దుగాల నుంచి చంటోడు ఒకటే ఏడుస్తున్నడు..వళ్లు పట్టుకుంటే కాలిపోతాంది. చేతిలోనా పైసల్లేవు. గవర్నమెంట్ ఆస్పత్రికి వెళదాం పదయ్యా..ఊరుకోవే..అక్కడికెళితే ఎవరుంటరే..బిడ్డను పట్టించుకునే నాథుడుంటడా..యాడో ఒక చోట అప్పు పట్టకొస్తా..ఊళ్లో ఉన్న డాక్టర్ బాబు దగ్గరకెళదాం..అంటూ పిల్లాడిని చంకనెత్తుకుని పరుగులు పెట్టారు దంపతులు. ఇదీ ప్రస్తుతం జిల్లాలోని ప్రతి గ్రామంలో నిరుపేదల దుస్థితి. వైద్య ఆరోగ్యశాఖ మొద్దునిద్రలో జోగుతుంటే..ఆర్ఎంపీలే ఎంబీబీఎస్లైపోతున్నారు. తలనొప్పిగా ఉందంటే మోకాలుకు మందులిచ్చి డాక్టర్ బాబులుగా బిల్డప్ ఇచ్చేస్తున్నారు. మొత్తంగా ప్రజల ప్రాణాలను గాలిలో దీపాలుగా మారుస్తున్నారు. సాక్షి, గుంటూరు: జిల్లాలో పల్లె జనానికి ఏ జబ్బు వచ్చినా ఆర్ఎంపీలే దిక్కు. దీనికి కారణం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సక్రమంగా పని చేయకపోవడమే. అందుబాటులో ఉండని ప్రభుత్వ వైద్యులకంటే ఇంటి వద్దకు వచ్చి వైద్య సేవలందించే ఆర్ఎంపీలే నయమనే స్థితికి పల్లె జనం వచ్చేశారు. రాజధాని నిర్మాణం జరుగుతున్న గుంటూరు జిల్లాలోని వందలాది గ్రామాలు ఇప్పటికీ ఆర్ఎంపీల వైద్యంపైనే ఆధార పడుతున్నాయంటే వైద్య, ఆరోగ్య శాఖ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో వేలాది మంది ఆర్ఎంపీలు తమకు తెలిసిన స్థాయిలో వైద్య సేవలు అందిస్తున్నప్పటికీ.. వీరిలో కొందరు మాత్రం అనుభవం లేకపోయినా ఆర్ఎంపీలుగా చెలామణి అవుతున్నారు. ఎంబీబీఎస్ వైద్యుల మాదిరిగా ఇష్టానుసారం మందులు రాస్తున్నారు. నిబంధనలకు చెల్లు చీటీ ఆర్ఎంపీలు నిబంధనలకు అనుగుణంగా పని చేయాల్సి ఉన్నప్పటికీ వీరిలో కొందరు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. డెలివరీలు, చిన్న చిన్న ఆపరేషన్లు నిర్వహిస్తూ ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తున్నారు. ఆర్ఎంపీలు వైద్యసేవలు అందించేందుకు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఇవేమీ పట్టించుకోకుండా గ్రామాల్లో క్లినిక్‌ల పేరుతో ఆసుపత్రులను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఆర్ఎంపీల వల్ల ఇబ్బందులు పడి అనేక మంది ప్రాణాలకు ముప్పు తెచ్చుకున్నారు. ఆర్ఎంపీ వైద్యంతో చూపు కోల్పోయిన మహిళ ఈ నెల 13వ తేదీ జిల్లాలోని ఫిరంగిపురానికి చెందిన పరగటి కుమారి అనే వివాహిత జ్వరంతో బాధపడుతూ స్థానిక ఆర్ఎంపీ అమర్లపూడి ఇమ్మానియేల్‌ను ఆశ్రయించింది. ఆమెను పరీక్షించిన ఆర్ఎంపీ కొన్ని మందులు రాసి ఇచ్చాడు. అవి వాడిన వెంటనే మహిళ ముఖం కాలినట్లుగా నల్లగా మారి, కంటిచూపు సైతం కోల్పోయింది. అయితే దీనిపై ఆర్ఎంపీని ప్రశ్నించగా.. తాను జ్వరం తగ్గేందుకు మందులు ఇచ్చానని, వాటితో కళ్లకు ఎటువంటి ప్రమాదం ఉండదని సమాధానం ఇచ్చాడు. బాధితురాలు మాత్రం తాను వైద్యం వికటించడం వల్లే కంటిచూపు కోల్పాయానంటూ ఫిరంగిపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు బాధితురాలిని వైద్య చికిత్స కోసం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. ఇలాంటి ఘటనలు మారుమూల పల్లెల్లో ఎక్కువగా జరుగుతున్నా బాధితులు బయటపడడం లేదు. ఆర్ఎంపీలు ఇచ్చిన మందులతో సైడ్ ఎఫెక్ట్ వచ్చినా రోగులు గుర్తించలేక ప్రైవేటు వైద్యశాలలను ఆశ్రయిస్తున్నారు. ఈ పాపం వైద్యులదే.. గుంటూరు జిల్లాలో మొత్తం 83 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకుగాను సుమారు 20 వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పని చేస్తున్న 80 శాతం మంది సిబ్బంది జిల్లా కేంద్రమైన గుంటూరు నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో ఉదయం 9 గంటలకు ఆసుపత్రిలో ఉండాల్సిన వైద్యులు 12 గంటలకు చేరుకుంటున్నారు. తిరిగి మధ్యాహ్నం భోజన సమయానికి వెళ్లిపోతుండటంతో రోగులకు వైద్య చికిత్సలు అందడం లేదు. పనిచేసే చోటే నివాసం ఉండాలన్న నిబంధనలు ఉన్నప్పటికీ వైద్యులు దాన్ని లెక్క చేయడంలేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుని పల్లెల్లో మెరుగైన వైద్యసేవలు అందేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. -
వర్గోన్నతితో సరి.. వైద్యం హరీ
9 పీహెచ్‌సీలను సీహెచ్‌సీలుగా ప్రకటించి ఆరేళ్లు మరుగునపడిన నరసాపురం, పాలకొల్లు, భీమవరం, కొవ్వూరు ఆస్పత్రుల ఆప్‌గ్రేడేషన్ వర్గోన్నతి ఆస్పత్రుల్లో భర్తీకాని పోస్టులు సదుపాయాల సంగతి సరేసరి కొవ్వూరు : పేదోళ్లకు వైద్య సేవలు అందించే విషయంలో సర్కారు నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. జిల్లాలో ప్రభుత్వ ఆస్పత్రుల వర్గోన్నతి (ఆప్‌గ్రెడేషన్)ప్రకియను కాగితాలకే పరిమితం చేసింది. మౌలిక సదుపాయాల కల్పన, వైద్యులు, సిబ్బంది కొరత తీర్చడంపై దృష్టి సారించడం లేదు. ఫలితంగా పేదలు అరకొర వైద్యసేవలతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది. జిల్లాలో నిడదవోలు, గోపాలపురం, ఆచంట, పెనుగొండ, ఆకివీడు, భీమడోలు, బుట్టాయగూడెం, దెందులూరు, పోలవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సామాజిక ఆరోగ్య కేంద్రాలు (30 పడకల ఆస్పత్రులు)గా ఆప్‌గ్రేడ్ చేసి ఆరేళ్లు పూర్తి కావస్తోంది. డైరెక్టర్ ఆఫ్ హెల్త్ పరిధిలో ఉన్న 9 ఆస్పత్రులను కమిషనర్ ఆఫ్ వైద్య విధాన షరిషత్లో విలీనం చేశారు. వర్గోన్నతి ప్రకారం ఈ ఆస్పత్రులకు అవసరమైన వైద్యులు, సిబ్బంది నియామకం, వైద్య పరికరాలు సమకూర్చటంపై ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. కొయ్యలగూడెంలో ఆప్గ్రేడ్డె పీహెచ్‌సీని 50 పడకల ఆస్పత్రిగా మార్చాలని ఎప్పటినుంచో ప్రతిపాదన ఉంది. మంత్రి పీతల సుజాత ప్రాతినిధ్యం వహిస్తున్న చింతలపూడిలో ప్రస్తుతం ఉన్న 30 పడకల ఆస్పత్రిని 100 పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేయాలన్న ప్రతిపాదన కార్యరూపం దాల్చడం లేదు. సీహెచ్‌సీల్లో 10 డాక్టర్ పోస్టులు ఖాళీ జిల్లాలోని మొత్తం 14 సీహెచ్‌సీల్లో 10 డాక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని కాంట్రాక్ట్ వైద్యులతో నెట్టుకొస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్యుల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేసినా భర్తీ ప్రక్రియ పూర్తి కావడానికి మరింత సమయం పడుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. వెక్కిరిస్తున్న బోర్డులు పేదలకు వైద్య సేవలను మరింత అందుబాటులోకి తేవాలని భావించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జిల్లాలోని నరసాపురం, పాలకొల్లు, భీమవరం, కొవ్వూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల(సీహెచ్‌సీ)ను ఏరియా ఆస్పత్రులుగా అప్‌గ్రేడ్ చేయాలని నిర్ణయించారు. ఆయన మరణానంతరం 2010 నవంబర్ 19న ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి. వీటికి భవనాలు ఏర్పాటు చేశారు. కొన్నాళ్లు రికార్డుల్లో ఈ నాలుగు ఏరియా ఆస్పత్రులుగానే నడిచాయి. అవసరమైన వైద్యులు, సిబ్బంది, మౌలిక సదుపాయాలు, వైద్య పరికరాలు సమకూర్చకపోవడంతో వీటిని తిరిగి సీహెచ్‌సీ జాబితాలోకి నెట్టేశారు. ఏరియా ఆస్పత్రులుగా పేర్కొంటూ ఈ నాలుగు ఆస్పత్రులకు ఏర్పాటు చేసిన బోర్డులు ప్రభుత్వ వైఫల్యాన్ని చాటుతున్నాయి. ఈ నాలుగు ఆస్పత్రుల్లోను ఆ స్థాయికి తగినంతమంది వైద్యులు, సిబ్బంది లేరు. వైద్య సేవలు పూజ్యం జిల్లాలో ఆరేళ్ల క్రితం ఏర్పడిన తొమ్మిది సీహెచ్‌సీల్లో మెడికో లీగల్ కేసుల (ఎంఎల్సీ)కు వైద్యం అందించే పరిస్థితి లేదు. దీంతో రోడ్డు ప్రమాదాలు, ఆత్మహత్యలు, ఇతర ప్రమాదాల బారినపడిన వారికి అవస్థలు తప్పడం లేదు. క్షతగాత్రులను ప్రభుత్వ, ప్రవేటు ఆస్పత్రులకు తరలించేలోపు కొందరి ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. మృతదేహాలకు నిడదవోలు, పోలవరంలో మినహా మిగిలిన ఏడు సీహెచ్‌సీల్లో పోస్టుమార్టం చేయటం లేదు. పోస్టుమార్టంకు అవసరమైన షెడ్లు, ఇతర ఏర్పాట్లు, సిబ్బంది, సరిపడినంత మంది వైద్యులు లేకపోవటమే దీనికి కారణం. దీంతో గోపాలపురం మండలం నుంచి సుమారు 40 కిలోమీటర్లు దూరంలోని కొవ్వూరు ఆస్పత్రికి, బుట్టాయగూడెం మండలం నుంచి జంగారెడ్డిగూడేనికి, దెందులూరు, భీమడోలు మండలాల నుంచి ఏలూరుకు, ఆచంట, పెనుగొండ మండలాల నుంచి పాలకొల్లు, ఆకివీడు మండలం నుంచి భీమవరం ఆస్పత్రులకు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించాల్సి వస్తోంది. అప్‌గ్రేడ్ చేసిన ఆస్పత్రుల్లో సదుపాయాల కల్పనతోపాటు వైద్యుల పోస్టులు భర్తీ చేస్తే ఈ సమస్యలకు తెరపడే అవకాశం ఉంటుంది. ఎన్టీఆర్ వైద్య సేవకు దూరం ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా అందించే 133 వైద్య సేవలు జిల్లాలో కేవలం మూడు ఏరియా ఆస్పత్రులు, జిల్లా కేంద్ర ఆస్పత్రిలోనే అందిస్తున్నారు. కొన్ని సీహెచ్‌సీల్లో ఈ సేవలు అందిస్తున్నామని అధికారులు చెబుతున్నా అవి నామమాత్రమే. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ వైద్య సేవలు అందుబాటులో లేక రోగులు అవస్థ పడుతున్నారు. నాలుగు సీహెచ్‌సీలను ఏరియా ఆస్పత్రులుగా అప్‌గ్రేడ్ చేయడం ద్వారా ఒక్కో ఆస్పత్రికి నలుగురు సివిల్ సర్జన్లు, 10 మంది అసిస్టెంట్ సివిల్ సర్జన్లతోపాటు 24 మంది స్టాఫ్ నర్సులు, నలుగురు హెడ్ నర్సుల పోస్టులు సమకూరతాయి. తద్వారా ఎన్టీఆర్ వైద్య సేవలతో పాటు, ఉద్యోగులకు ప్రభుత్వపరంగా అందించే వైద్య సేవలు, ఆపరేషన్లు అందుబాటులోకి వస్తాయి. ప్రతిపాదనలు పంపాం ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి మరో రెండు నెలలు పడుతుంది. గత ఏడాది వైద్య విధాన పరిషత్‌లో కలిసిన తొమ్మిది సీహెచ్‌సీల్లో ఏడు చోట్ల పోస్టుమార్టం షెడ్లు లేవు. ఈ ఆస్పత్రుల్లో 100 మంది పారిశుధ్య కార్మికులు, 50 మంది సెక్యూరిటీ గార్డులు, 9 మంది సూపర్వైజర్లను నియమిస్తున్నాం. త్వరలో పూర్తిస్థాయిలో వైద్య పరికరాలు అందుబాటులోకి వస్తాయి. కొవ్వూరు, భీమవరం, నరసాపురం, పాలకొల్లు ఆస్పత్రులను ఏరియా ఆస్పత్రులుగా, చింతలపూడి ఆస్పత్రిని 100 పడకలు, కొయ్యలగూడెం ఆస్పత్రిని 50 పడకల ఆస్పత్రులుగా మార్చాలని ప్రతిపాదనలు పంపింంచాం. వైద్యుల పోస్టులు భర్తీ చేస్తే ఎన్టీఆర్ వైద్య సేవలు అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లోను అందుబాటులోకి వస్తాయి. డాక్టర్ కె.శంకరరావు, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రుల సమన్వయకర్త -
పేదలంటే అంత చులకనా..
- ప్రభుత్వాస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం - గైనకాలజిస్ట్ తీరుపై తీవ్ర నిరసన - ప్రసూతి సేవలపై వైఎస్సార్ సీపీ ఆధర్యంలో ధర్నా కంబాలచెరువు (రాజమహేంద్రవరం) : పేదలంటే అంతచులకనా..వారి దయనీయ పరిస్థితి చూసి జాలికలగదా.. ప్రభుత్వాస్పత్రిలోనే ప్రసవం సురక్షితమంటు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదా? తీరా ఆస్పత్రికి వస్తే హీనాతిహీనంగా చూడడం..ఇదేనా మీ తీరు అంటూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో సోమవారం జరిగిన ధర్నాలో పలువురు వైద్యులు అనుసరిస్తున్న విధానాలను దుయ్యబట్టారు. కొద్ది రోజులుగా రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రిలో రోగులతో వైద్యులు ప్రవర్తిస్తున్న విధానంపై వైఎస్సార్ సీపీ ఆస్పత్రి అ«ధికారులను ప్రశ్నిస్తోంది. ఎటువంటి చర్యలు లేకపోవడంతో సోమవారం ఆస్పత్రి వద్ద ధర్నా నిర్వహించారు. పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ ఆస్పత్రిలోని ప్రసూతి విభాగంలో గర్భిణులు పడుతున్న అవస్థలు ప్రత్యక్షంగా చూశామన్నారు. వివిధ ప్రాంతాల నుంచి ప్రసవానికి వస్తున్న వారితో గైనకాలజిస్ట్ డాక్టర్ విష్ణువర్థిని అవమానకరంగా మాట్లాడుతున్నారన్నారు. పార్టీ నాయకులు రౌతు సూర్యప్రకాశరావు మాట్లాడుతూ గైనకాలజీ విభాగంలో జరుగుతున్న తంతుపై సమగ్ర విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పార్టీ జిల్లా అధికార ప్రతిని«ధి మేడపాటి షర్మిలారెడ్డి మాట్లాడుతూ గర్భిణులతో అనుచితంగా ప్రవర్తిస్తున్న డాక్టర్ విష్ణువర్థినిపై చర్యలు తీసుకోవాలని లేకుంటే ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామన్నారు. వైద్యులు అందించాల్సిన సేవలను సిబ్బందితో చేయిస్తూ రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారన్నారు. వెంటనే సిబ్బంది కొరత నివారించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. అనంతరం ఆస్పత్రి ఆర్ఎంఓ డాక్టర్ పద్మశ్రీకి వినతిపత్రం అందించారు. ఆమె స్పందిస్తూ జరిగిన పరిణామాలపై విచారణ చేస్తామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆస్పత్రి ఆవరణలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ప్రదర్శించిన ‘నేనురాను బిడ్డో ఈ సర్కారు «దవాఖానకు’ అనే నృత్యం రూపకం అందరినీ ఆకట్టుకుంది. పార్టీ నాయకులు కందుల దుర్గేష్, ఆకుల వీర్రాజు, మిందే నాగేంద్ర, గుత్తుల మురళీధరరావు, బొంతా శ్రీహరి, కొల్లి నిర్మల, మార్త లక్ష్మి, నరవా గోపాలకృష్ణ, పోలు విజయలక్ష్మి, పోలు కిరణ్‌మోహన్‌రెడ్డి, సుంకర చిన్ని, గుర్రం గౌతమ్, దంగేటి వీరబాబు, తోరాడ ప్రభు పాల్గొన్నారు. -
పోలియో చుక్కలు వికటించి చిన్నారి మృతి!
పూసపాటిరేగ(విజయనగరం జిల్లా): పూసపాటిరేగ మండలం పూసపాటిపాలెంలో విషాదం చోటుచేసుకుంది. వివరాలు.. ఆదివారం వైద్యసిబ్బంది గ్రామంలో పోలియో చుక్కలు వేస్తుండటంతో రౌతు గెట్లయ్య, రౌతు స్వాతి అనే దంపతులు కూడా తమ 5 నెలల చిన్నారికి వేయించారు. అనంతరం చిన్నారి అస్వస్థతకు గురి కావడంతో సమీప పీహెచ్‌సీకి తరలించగా చికిత్సపొందుతూ మృతిచెందింది. పోలియో చుక్కలు వికటించడం వల్లే మృతిచెందిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అందరు పిల్లలకు వేసినట్లే వేశామని, చిన్నారికి బలవంతంగా పాలు పట్టడం వల్ల, పాలు ఊపిరితిత్తులలోకి వెళ్లి ఊపిరాడక మృతిచెందినట్లు పోలియో చుక్కలు వేసిన సిబ్బంది చెబుతున్నారు. చిన్నారి గత రాత్రి నుంచి పాలు తాగడం లేదని సమాచారం. -
పీహెచ్‌సీలకు పురుటి నొప్పులు
ప్రసూతి కేసులు ప్రైవేటు ఆస్పత్రులకే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు మృగ్యం అన్నిచోట్లా అధ్వాన్న పరిస్థితులే సాక్షి ప్రతినిధి, ఏలూరు : జిల్లాలోని ప్రభుత్వాస్పత్రులు ప్రసూతి సేవలు అందించలేక చేతులెత్తేస్తున్నాయి. కాన్పు కోసం వచ్చే గర్భిణులను ప్రైవేటు ఆస్పత్రులకు తరిమేస్తున్నాయి. జిల్లాలో ప్రసూతి వైద్యసేవలు అందించే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 79 ఉండగా.. మూడు ఏరియా ఆస్పత్రులు, 11 కమ్యూనిటీ వైద్య కేంద్రాలతోపాటు ఏలూరులో జిల్లా కేంద్ర ఆస్పత్రి ఉన్నాయి. గత ఏడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు జిల్లా వ్యాప్తంగా 41,372 ప్రసవాలు నమోదు కాగా.. వీటిలో 19,622 జననాలు మాత్రమే ప్రభుత్వాస్పత్రుల్లో జరిగాయి. 21,750 మంది గర్భిణులు ప్రసూతి సేవల కోసం ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వచ్చింది. జిల్లాలోని ప్రభుత్వాస్పత్రుల్లో నెలకొన్న పరిస్థితులపై ’సాక్షి’ బృందం బుధవారం పరిశీలన జరపగా.. వాస్తవ పరిస్థితులు కళ్లకు కట్టాయి. ప్రైవేటు సేవలే దిక్కు ప్రసవాలన్నీ ప్రభుత్వాస్పత్రుల్లోనే జరగాలని చెబుతున్నా.. వాటిలో సదుపాయాల లేమి, వైద్యుల కొరత కారణంగా గర్భిణులు ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించక తప్పని పరిస్థితులు తలెత్తుతున్నాయి. మౌలిక సదుపాయాలు లేకపోవడంతో గర్భిణులు అత్యవసర సమయాల్లో పట్టణాల్లోని ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తోంది. ’ప్రభుత్వాస్పత్రిలో ప్రసవం.. తల్లీబిడ్డ సురక్షితం’ అంటూ అధికారులు బోర్డులు తగిలించి చేతులు దులుపుకుంటున్నారు. గర్భిణులకు ప్రసూతి సేవలు, శస్త్ర చికిత్స, మందులు, ఆరోగ్య పరీక్షలు, ఆహారం, రక్తం, రవాణా సదుపాయాలన్నీ ఉచితమని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటనలు ఇస్తోంది. అంతేకాకుండా ప్రభుత్వాస్పత్రుల్లో పురుడు పోసుకున్న తల్లులకు జననీ సురక్ష యోజన కింద రూ.వెయ్యి పారితోషికం ఇస్తామని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఆస్పత్రులకు భవనాలు నిర్మించినా ప్రసూతి సమయంలో అవసరమైన సర్జికల్ మెటీరియల్ అందుబాటులో లేదు. చాలాచోట్ల పుట్టిన బిడ్డల్లో కొందరిని అత్యవసరంగా ఇంక్యుబేటర్ సేవలు అవసరమవుతోంది. అలాంటి సేవలు చాలాచోట్ల అందుబాటులో లేవు. వార్మర్స్, ఊయలను నేటికీ ప్రభుత్వం అందించలేదు. చాలాచోట్ల వైద్య పరికరాలు బిగించక నిరుపయోగంగా మారాయి. దీంతో పీహెచ్‌సీలకు వచ్చే గర్భిణుల్లో అధిక శాతం మందిని ప్రైవేట్ ఆస్పత్రులను రిఫర్ చేస్తున్నారు. బాలింతలకు, వారితో వచ్చే కుటుంబీకులకు భోజనం సదుపాయం కల్పించడంతోపాటు పాలు ఇవ్వాల్సి ఉంది. ప్రసవాల సంఖ్య ఆధారంగా, స్థానికంగా ఉన్న సౌకర్యాలు బట్టి వాటిని ఏర్పాటు చేస్తున్నారు. లేదంటే ఆ ఖర్చులను కూడా చెక్కుల రూపంలో చెల్లిస్తున్నారు. బిడ్డ సంరక్షణకు చైల్డ్ కిట్‌ను ప్రస్తుతం అందజేస్తున్నారు. ఎక్కడ చూసినా సమస్యలే.. ఏలూరులోని జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రిలో రూ.10 కోట్లు వెచ్చించి నిర్మించిన 100 పడకల మాతా,శిశు సంరక్షణ కేంద్రంలో వసతులున్నా వైద్యులు, సిబ్బంది కొరత కారణంగా అలంకారప్రాయంగా మారింది. 11 మంది గైనకాలజిస్ట్లు అవసరం కాగా.. కేవలం నలుగురు మాత్రమే పనిచేస్తున్నారు. ఆపరేషన్ చేసే సమయంలో గర్భిణికి మత్తు ఇచ్చే వైద్యులు లేనేలేరు. ఆపరేషన్ థియేటర్లో వైద్యులకు సహకరించేందుకు ఆరుగురు టెక్నీషియన్ అవసరం కాగా, ఆ విషయాన్ని పూర్తిగా గాలికొదిలేశారు. అత్యవసర సమయాల్లో విద్యుత్ కోత విధిస్తే.. జనరేటర్ కూడా లేదు. జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న చాటపర్రు, గుడివాకలంక కేంద్రాల్లో ప్రసూతి సేవలు అందడం లేదు. అక్కడ వైద్య పరీక్షలకే పరిమితం కావడంతో ప్రసవం కోసం గర్భిణులు ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం ప్రాఽథమిక ఆరోగ్య కేంద్రంలో నెలకు 3 నుంచి 5 డెలివరీలు మాత్రమే జరుగుతున్నాయి. ఈ పీహెచ్సీలో ఏడాదిగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరగడం లేదు. డాక్టర్లు లేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. వీరవాసరం, కొణితివాడ పీహెచ్‌సీల్లో ఆపరేషన్ థియేటర్లు ఉన్నా.. పూర్తిస్థాయి పరికరాలు, గైనకాలజిస్ట్లు లేరు. ఆపరేషన్లు అవసరమైతే పాలకొల్లులోని సీహెచ్‌సీకి గర్భిణులను పంపిస్తున్నారు. 24 గంటలూ ప్రసూతి సేవలు అందించే కాళ్ల పీహెచ్సీ భవనం శిథిలావస్థకు చేరింది. ఇందులోనే వైద్య సేవలు అందిస్తున్నారు. ఇక్కడ సిబ్బంది కొరత కూడా ఉంది. ఫస్ట్ ఏన్‌ఎం పోస్టులు 5, సెకండ్ ఏఎన్ఎం పోస్టులు 2 ఖాళీగా ఉన్నాయి. ఒక స్టాఫ్ నర్స్, ఒక ఫార్మసిస్ట్, ఒక ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులను సైతం భర్తీ చేయాల్సి ఉంది. తాడేపల్లిగూడెం మండలం వెంకట్రామన్నగూడెం, మాధవరం గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. వెంకట్రామన్నగూడెం పీహెచ్సీలో సాధారణ ప్రసవాలకు మాత్రమే సేవలందిస్తున్నారు. అత్యవసర కేసులను తాడేపల్లిగూడెం ఏరియా ఆస్పత్రికి రిఫర్ చేస్తున్నారు. ఈ రెండు పీహెచ్సీలలో ప్రసవ ఆపరేషన్ (సిజేరియన్)లకు సదుపాయాలు లేవు. భీమడోలు మండలం పూళ్ల పీహెచ్సీలో 16 మంది పని చేయాల్సి ఉండగా ఏడుగురు ఏఎన్ఎంలు మాత్రమే ఉన్నారు. స్టాఫ్ నర్సు పోస్టు ఖాళీగా ఉంది. ఇక్కడ పురుడు పోసుకున్న 66 మందిలో జననీ సురక్ష యోజన ప్రోత్సాహకం నిమిత్తం 48 మంది వివరాలు మాత్రమే ఆన్లైన్లో నమోదయ్యాయి. బుట్టాయగూడెం మండలం పులిరామన్నగూడెం, కేఆర్‌పురం, నందాపురం, అంతర్వేదిగూడెం, దొరమామిడిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. అయితే, వీటిలో గైనకాలజిస్ట్, పిల్లలకు వైద్యసేవలందించే డాక్టర్ల పోస్టులు ఒక్కటి కూడా భర్తీ కాలేదు. భీమవరం ప్రభుత్వాస్పత్రిలో బాలింతలను ఉంచే గదులు అధ్వానంగా ఉన్నాయి. బూజులు పట్టిన గోడలు, పగిలిపోయిన కిటికీలు, చిరిగిపోయి గట్టిపడిన మంచాలతో చూడటానికే ఇబ్బందిగా ఉన్నాయి. ఽచిరిగిన మంచాలపైనే బాలింతలు ఇబ్బందులు పడుతూ పడుకుంటున్నారు. రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత ప్రాతినిధ్యం వహిస్తున్న చింతలపూడి నియోజకవర్గంలోని చాలా ఆస్పత్రుల్లో వైద్యుల కొరత అధికంగా ఉంది. సౌకర్యాల లేమి స్పష్టంగా కనిపిస్తోంది. చింతలపూడి మండలం రాఘవాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులున్నా ఆపరేషన్ థియేటర్ లేదు. -
ఇప్పుడు మేల్కొన్నారు!
అనంతపురం మెడికల్ : ఇన్నాళ్లూ నిద్రమత్తులో ఉన్న వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఇప్పుడు మేల్కొన్నారు. రెండ్రోజులుగా తెగ హడావుడి చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. జిల్లాలో 80 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. కొత్తగా అనంతపురం రూరల్ మండలం కురుగుంట, విడపనకల్లు మండలం పాల్తూరు, యాడికి మండలం రాయలచెరువు, ముదిగుబ్బ మండలం బి.పప్పూరు, బెళుగుప్ప మండలం శ్రీరంగాపురం, గోరంట్ల మండం కొండాపురంలో పీహెచ్‌సీలు నిర్మించారు. వీటిలో ఒక్కో పీహెచ్సీలో ఇద్దరు మెడికల్ ఆఫీసర్లు, ముగ్గురు స్టాఫ్‌నర్సులు, ఒక ల్యాబ్‌టెక్నీషియన్, ఒక ఫార్మసిస్ట్ పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. దీంతో ఈ ఏడాది ఆగస్టులో నోటిఫికేష¯ŒS ఇచ్చారు. 14 వైద్యుల పోస్టులకు 79, స్టాఫ్‌నర్సు పోస్టులు 21కి గానూ 1319, ఏడు ల్యాబ్‌టెక్నీషియన్ పోస్టులకు 420, ఏడు ఫార్మసిస్ట్‌కు 305 మంది దరఖాస్తు చేసుకున్నారు. సెప్టెంబర్ నాటికే స్క్రూటినీని అధికారులు ముగించారు. చేయాల్సిందల్లా జాబితాను ఒకసారి పరిశీలించి మెరిట్ ప్రకటించడమే. అయితే అధికారులు అందుబాటులో లేరని ఇన్నాళ్లూ దరఖాస్తులను మూలకు పెట్టేశారు. తిరిగి రెండ్రోజుల నుంచి స్క్రూటినీ ప్రక్రియను మళ్లీ ప్రారంభించారు. స్క్రూటినీని ఫైనల్ చేయడం కోసం డీఐఓ డాక్టర్ పురుషోత్తం, పీఓడీటీటీ సుజాత, డీఎంఓ దోసారెడ్డి, ఏఓ భీమానాయక్, డెమో హరిలీలాకుమారిని నియమించారు. శుక్రవారం పీఓడీటీటీ సుజాత ’స్వాస్థ విద్యావాహిని’ కార్యక్రమ ఏర్పాట్ల కోసం వెళ్లిపోగా.. దోసారెడ్డి, పురుషోత్తం వారి పనుల్లో వారు నిమగ్నమయ్యారు. -
పడకేసిన పీహెచ్‌సీలు!
అత్యవసర మందులకే దిక్కులేని దుస్థితి పరిశుభ్రత, నీటి సౌకర్యం శూన్యం 140 పీహెచ్‌సీలు, 300 ఉప కేంద్రాల్లో వైద్యాధికారుల తనిఖీల్లో వెలుగులోకి... సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీ) కుంటుపడ్డాయి. ఈ విషయాన్ని స్వయానా వైద్య ఆరోగ్యశాఖ అధికారులే పేర్కొనడం గమనార్హం. ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ వాకాటి కరుణ ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి వైద్యాధికారుల బృందం ఇటీవల యాదాద్రి, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల, రంగారెడ్డి జిల్లాల్లోని 140 పీహెచ్‌సీలు, 300 ఉప కేంద్రాలను తనిఖీ చేసింది. అనంతరం ప్రభుత్వాని కి నివేదిక సమర్పించింది. నివేదిక ప్రకారం అనేక పీహెచ్‌సీల్లో నీటి వసతే లేదు. మరుగుదొడ్ల పరిస్థితి అత్యంత ఘోరంగా ఉంది. పీహెచ్‌సీల చుట్టూ చెట్లు, పొదలే దర్శనమిస్తున్నాయి. విద్యుత్ సరఫరా అంతంతే. చాలా పీహెచ్‌సీల్లో మెడికల్ ఆఫీసర్లు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఇతర పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కొందరు వైద్య సిబ్బంది ఇష్టారీతిన గైర్హాజరవుతుండగా మరికొందరైతే పూర్తిగానే రావడం మానేశారు. అత్యవసర మందులు లేని పరిస్థితి... చాలా పీహెచ్‌సీల్లో అత్యవసర మందులే లేవని ఉన్నతస్థాయి బృందం నివేదించింది. గర్భిణులకు ఇచ్చే మందులు, పిల్లలకు ఇచ్చే విటమిన్ మాత్రలు లేవని తేల్చింది. ఐఎఫ్ఏ మాత్రలు, విటమిన్ ఏ సిరప్, విజమిన్ కె అందుబాటులో లేవని పేర్కొం ది. అత్యవసర మందులను తెప్పించుకోవడం లోనూ పీహెచ్‌సీలు విఫలమవుతున్నాయని... ఔషధాలను నిల్వ ఉంచుకునే సరైన వ్యవస్థ కూడా అక్కడ లేదని బృందం పేర్కొంది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లకు అవసరమైన పరికరాలు లేవని తేల్చింది.ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో లేవు. షుగర్, మలేరియా, మూత్రం వంటి పరీక్షలు మినహా హెచ్ఐవీ వంటి పరీక్షలు చేసే పరిస్థితి లేదు. చాలా పీహెచ్‌సీలు రోగులను పరీక్షించి అందుబాటులో ఉన్న మందులు ఇచ్చి పంపడం వరకే పరిమితమయ్యాయి. 60 శాతం పీహెచ్‌సీలు కొన్నేళ్లుగా ప్రసవాలు చేయడం లేదని బృందం విమర్శించింది. కేవలం 10 శాతం పీహెచ్‌సీలు తమ లక్ష్యం మేరకు ప్రసవాలు చేస్తున్నాయి. హై రిస్క్ ప్రెగ్నెన్సీలను ఎలా గుర్తించాలనే ప్రశ్నకు చాలా మంది వైద్య సిబ్బంది సమాధానం ఇవ్వలేక పోయారని బృందం పేర్కొంది. పరికరాల నిర్వహణ, మరమ్మతు యంత్రాంగం లేదని వివరించింది. చాలా ఉప వైద్య కేంద్రాలు అద్దె గదుల్లోనే నిర్వహిస్తున్నారని, ఒక పీహెచ్‌సీలోనైతే కాలం తీరిన వ్యాక్సిన్‌ను ఉపయోగించినట్లు తేల్చింది. -
తెలుగు రాష్ట్రాల్లో భారీగా వైద్య సిబ్బంది ఖాళీలు
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(పీహెచ్సీ), సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో (సీహెచ్‌సీ) వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, ఫార్మసీ సిబ్బంది పోస్టులు భారీ సంఖ్యలో ఖాళీగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి ఫగన్ సింగ్ కులస్తే తెలిపారు. శుక్రవారం లోక్‌సభలో వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ వై.ఎస్.అవినాష్ రెడ్డి, టీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు ఆయన రాతపూర్వకం గా సమాధానం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లోని పీహెచ్‌సీల్లో 2270 డాక్టర్ పోస్టులకు గాను 858 ఖాళీలు ఉన్నాయని, పీహెచ్సీ, సీహెచ్‌సీల్లో 1279 ఫార్మసిస్ట్ పోస్టులకు గాను 328 ఖాళీలు ఉన్నాయని తెలిపారు. 1053 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు గాను 277 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. 2300 నర్సింగ్ పోస్టులకు గాను 294 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు వివరించారు. తెలంగాణలో..: తెలంగాణలోని పీహెచ్‌సీల్లో 1318 డాక్టర్ పోస్టులకు గాను 294 ఖాళీలు ఉన్నట్లు తెలిపారు. అలాగే పీహెచ్సీ, సీహెచ్‌సీల్లో1799 ఫార్మసిస్ట్ పోస్టులకు గాను 237 ఖాళీలు ఉన్నాయని వివరించారు. 765 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు గాను 199 ఖాళీలు ఉన్నట్టు తెలిపారు. 1666 నర్సింగ్ సిబ్బంది పోస్టులకు గాను 213 ఖాళీలు ఉన్నట్టు తెలిపారు. -
మాతాశిశు మరణాలు తగ్గించేందుకు చర్యలు
– చాపిరేవుల పీహెచ్‌సీని తనిఖీ చేసిన డీఎం అండ్‌హెచ్‌ఓ – పీహెచ్సీ వైద్యుడు నటరాజ్‌పై ఆగ్రహం నంద్యాలరూరల్: జిల్లాలో మాతాశిశు మరణాలు తగ్గించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని డీఎం అండ్ హెచ్ఓ ఎం.స్వరాజ్యలక్ష్మి చెప్పారు. శుక్రవారం మండల పరిధిలోని చాపిరేవుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీహెచ్‌సీలకు నిధుల కొరత, మందుల కొరత లేదని, కొందరు వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంతోనే పేద రోగులకు వైద్యం అందడం లేదన్నారు. చాపిరేవుల పీహెచ్సీ అపరిశుభంగా ఉండటంతో వైద్యుడు నటరాజ్‌పై డీఎంఅండ్ హెచ్ఓ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత నిర్లక్ష్యంగా ఉంటే పేద రోగులకు ఎలా వైద్యం అందిస్తారని, పద్ధతి మార్చుకోకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. మూడు నెలలకు ఒకసారి పీహెచ్సీ సలహా కమిటీ సమావేశం ఏర్పాటు చేసి తక్షణమే తాత్కాలిక మరమ్మతులు చేపట్టి రోగులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు విధులు నిర్వహించలేరా అంటూ వైద్యుడిని నిలదీశారు. ఓపీ లేకపోవడాన్ని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎంపీహెచ్ఈఓ జయశంక్‌రెడ్డి నాలుగు రోజులుగా విధులకు హాజరు కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వేతనాన్ని నిలుపుదల చేస్తున్నట్లు చెప్పారు. ఇక నుంచి హాజరును రోజువారీగా బయోమెట్రిక్ ద్వారా జిల్లా కేంద్రానికి అందించాలని ఆదేశించారు. మళ్లీ రెండు వారాల్లో తనిఖీ వస్తానని ఆలోగా ఆసుపత్రిలో మార్పు కనిపించకపోతే ఇంటికి పంపుతానని డాక్టర్‌ను డీఎంహెచ్ఓ హెచ్చరించారు. -
పుట్టిన ప్రతి బిడ్డకూ ఆధార్
అన్ని ఆస్పత్రులు, పీహెచ్సీలలో అమలు చేయాలి: కేంద్ర ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: ఇకపై పుట్టిన ప్రతి బిడ్డకూ ఆధార్ నమోదు తప్పనిసరి కానుంది. రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ (పీహెచ్సీ) ఆధార్ నమోదుకు చర్యలు చేపట్టాలని కేంద్రం ఆదేశించింది. నవజాత శిశువులతోపాటు అంగన్వాడీ కేంద్రాల్లోని పిల్లలు, పాఠశాలల విద్యార్థుల ఆధార్ నమోదుకు అవసరమైన కిట్లను అందుబాటులోకి తేవాలని పేర్కొంది. వాటి కొనుగోలుకు అవసరమైన వివరాలతో సమగ్ర నివేదికను సమర్పించాలని సూచించింది. రాష్ట్రంలో 100 శాతం ఆధార్ నమోదు లక్ష్య సాధనకు చర్యలు చేపట్టాలంటూ కేంద్ర ఐటీ శాఖ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. 2017 మార్చి వరకు రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రుల్లో ఆధార్ నమోదుకు చర్యలు చేపట్టాలని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ నిర్ణీత గడువులోగా 100 శాతం ఆధార్ నమోదుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించింది. ఇప్పటివరకు రాష్ట్రంలో ఆధార్ నమోదు ఇంకా లక్ష్యాన్ని చేరుకోలేదని... ముఖ్యంగా 0-5 ఏళ్లలోపు పిల్లల ఆధార్ నమోదు జరగడం లేదని కేంద్రం పేర్కొంది. మరోవైపు 5 నుంచి 15 ఏళ్లలోపు పిల్లల బయోమెట్రి క్ వివరాలను కచ్చితంగా అప్డేట్ చేయాలని స్పష్టం చేసింది. విద్యార్థుల ఆధార్ సమాచారాన్ని అప్డేట్ చేసేందుకు మహిళ, శిశు అభివృద్ధి శాఖ, పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టాలని సూచించింది. ఆధార్ యాక్టు-2016 నోటిఫికేషన్‌ను ఇప్పటికే జారీ చేసిన నేపథ్యంలో దేశంలో 100 శాతం ఆధార్ అమలుకు కేంద్రం శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ పథకాల సబ్సిడీలు, సంక్షేమ పథకాల ప్రయోజనాలు, పౌర సేవలన్నింటినీ ఆధార్‌కు అనుసంధానించేందుకు చర్యలు చేపట్టింది. కాగా, జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రభుత్వాస్పత్రుల్లో పుట్టిన ప్రతి బిడ్డ ఆధార్ నమోదుకు పైలట్ ప్రాజెక్టు కింద ఇప్పటికే చర్యలు చేపట్టిన ప్రభుత్వం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా మరో 25 ఆస్పత్రుల్లో ఆధార్ నమోదుకు ప్రణాళికలు రూపొందించింది. -
పీహెచ్సీలో చిన్నారి కిడ్నాప్‌కు యత్నం
వేలూరు: స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలోని చిన్నారిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లినట్లు గుర్తించిన రోగులు మహిళను పట్టుకొని దేహశుద్ధి చేశారు. వేలూరు అడుకంబరైలోని ప్రభుత్వ ఆసుపత్రికి రోజూ వేలసంఖ్యలో రోగులు వస్తుంటారు. కాగా ఆసుపత్రిలోని ప్రసవ వార్డులో ఆర్కాడు తాలుకా కలవైకి చెందిన కల్పన ఎనిమిది రోజుల క్రితం ఆడ శిశువుకు జన్మనిచ్చింది. కల్పన శనివారం ఉదయం చిన్నారిని బెడ్‌పైనే ఉంచి మరుగుదొడ్డికి వెళ్లింది. అనంతరం బయటకు వచ్చిన ఆమెకు చిన్నారి కనిపించలేదు. ఈ విషయాన్ని వెంటనే ఆమె చుట్టుపక్కల వారికి తెలిపింది. సమాచారం తెలుసుకున్న ఆసుపత్రి సిబ్బంది వెంటనే చిన్నారి కోసం గాలింపు చేపట్టారు. ఇదిలాఉండ గా చిన్నారిని ఒక మహిళ ఆసుపత్రి నుంచి బయటకు తీసుకెళ్లినట్లు సెక్యూరిటీ సిబ్బంది తెలిపారు. దీంతో రోడ్డుపై వెళుతున్న సదరు మహిళను అడ్డుకుని సహరోగులు విచారించారు. విచారణలో తన పేరు మహేశ్వరి అని, చిన్నారి తన కుమార్తెకు జన్మించినందువల్లే తీసుకెళుతున్నట్లు తెలిపింది. అయితే మహేశ్వరి కుమార్తె ఎనిమిది నెలల గర్భవతి గుర్తించిన వారు చిన్నారిని ఆమె నుంచి తీసుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం ఆమెను పోలీసులకు అప్పగించారు. ఇదిలా ఉండగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఇదే తరహాలోనే తరచూ చిన్నారులు మాయమవుతున్న నేపథ్యంలో అధికారులు చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. -
వైకల్యాన్ని శాపంగా చూడొద్దు
సర్వశిక్ష అభియాన్ జిల్లా మానిటరింగ్ అధికారి శ్రీనివాస్ నకిరేకల్ : ప్రత్యేక అవసరాలు గల పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లల వైకల్యాన్ని చూసి శాపంగా కాకుండా అదృష్టంగా భావించుకుని ప్రభుత్వం వారికి కల్పించే వివిధ వనరులను సద్వినియోగం చేసుకోవాలని సర్వశిక్ష అభియాన్ అకాడమిక్ మానీటరింగ్ జిల్లా అధికారి అండెం శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. నకిరేకల్‌లోని భవిత కేంద్రంలో గురువారం ప్రత్యేక అవసరాలు పిల్లల తల్లిదండ్రులకు ఒక రోజు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విద్య పరంగా సామాన్య పిల్లలతో మాదిరిగా వీరు కూడా ఉన్నత స్థానాల్లో ఉండేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను ప్రవేశపెడుతున్నాయన్నారు. అందరితో విద్య – అందరికి విద్య అనే సర్వశిక్ష అభియాన నినాదం ప్రకారం ప్రత్యేక అవసరాల గల పిల్లలను వేరు చేయకుండా సామాన్య పిల్లలతో కలిసి చదువుకునే అవకాశాలు కల్పిస్తుందన్నారు. స్థానిక ఐఈఆర్టీ సల్లోజు శ్రీనివాస్ మాట్లాడుతూ రియో ఒలంపిక్‌లో జరిగిన పోటీల్లో సాధారణ క్రీడాకారులు వెండి, కంచు పతకాలు సాధిస్తే దివ్యాంగులైన క్రీడాకారులు రెండు స్వర్ణపతకాలు సాధించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మేడబోయిన శ్రీనివాస్, సబిత, రాపర్తి నర్సమ్మ, ఎల్మకంటి సైదమ్మ, మాదగోని సైదులు, మదార్ నాయక్, అబ్బగోని సైదులు, మారయ్య, రామేశ్వరి, అనూష, సైదమ్మ తదితరులు ఉన్నారు. -
జ్వరాల నియంత్రణలో ప్రభుత్వం విఫలం
వైఎస్సార్ సీపీ వైద్య విభాగం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెహబూబ్ షేక్ విజయవాడ (లబ్బీపేట) : రాష్ట్రంలో సీజనల్ వ్యాధులను అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్సార్ సీపీ వైద్య విభాగం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెహబూబ్ షేక్ పేర్కొన్నారు. డెంగీ, విషజ్వరాలతో ప్రజలు మరణిస్తున్నా.. కనీస చర్యలు తీసుకోవడం లేదని ఆయన బుధవారం ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తంచేశారు. జ్వరాల అదుపునకు క్షేత్ర స్థాయిలో చర్యలు చేపట్టాల్సి ఉండగా, దోమలపై యుద్ధం.. అంటూ ప్రచార కార్యక్రమాలకే పరిమితం కావడం సిగ్గుచేటని పేర్కొన్నారు. ఇప్పటికే జిల్లాలో వేలాది మంది జ్వరపీడితులు ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. పలువురు మరణించారని పేర్కొన్నారు. రాష్ట్ర రాజధాని నగరమైన విజయవాడలోనే జ్వరం వస్తే నిర్ధారణ పరీక్షలు చేయలేని దుస్థితిలో పట్టణ ఆరోగ్య కేంద్రాలు ఉండటం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి క్షేత్ర స్థాయిలో చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని, జ్వరాలు ప్రబలిన గ్రామాల్లో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. -
పల్లెకు సుస్తీ!
పీహెచ్‌సీల్లో అరకొర వైద్యం – భారీగా వైద్యులు, సిబ్బంది ఖాళీలు – గ్రామాల్లో పని చేసేందుకు ఆసక్తి చూపని వైద్యులు – ఉన్న వారిలో అధిక శాతం డుమ్మా – డిప్యూటేషన్ ఆసుపత్రుల్లో దేవుడే దిక్కు – ఉన్నతాధికారుల పర్యవేక్షణ శూన్యం ‘‘గ్రామీణ ప్రాంతాలకు వెళ్తాం. పల్లె జనానికి ఉత్తమ వైద్య సేవలందిస్తాం.’’ వైద్య పట్టా పుచుకునే సమయంలో యువ వైద్యులు చేస్తున్న ప్రమాణం ఆ తర్వాత అపహాస్యమవుతోంది. పల్లెల్లో సేవలందించేందుకు ఏ ఒక్కరూ ముందుకురాని పరిస్థితి. ఒకవేళ్ల వచ్చినా.. పీజీ కోర్సుపైనే దృషి. ఇక యథారాజా.. తథా ప్రజ అన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ తీరు ఉంటోంది. ఇలా వచ్చి.. అలా వెళ్తున్న పరిస్థితుల్లో ప్రజారోగ్యం క్షీణిస్తోంది. కర్నూలు(హాస్పిటల్): జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో 83 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉండగా.. వీటిలో 24 గంటలు పనిచేసే పీహెచ్‌సీలు 40. ఇవే కాకుండా వైద్య విధాన పరిషత్ పరిధిలో 20 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు పని చేస్తున్నాయి. వైద్యులు, పారామెడికల్, ఉద్యోగులతో కలిపి 2,130 మందికి పైగా విధులు నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఉదయం 9 గంటలకు విధులకు హాజరై సాయంత్రం 4 గంటల వరకు సేవలందించాలి. ఉద్యోగుల హాజరు నమోదుకు దాదాపు అన్ని పీహెచ్‌సీల్లో బయోమెట్రిక్ మిషన్లను ఏర్పాటయ్యాయి. వీటిని సీఎం డ్యాష్‌బోర్డ్‌కు అనుసంధానించారు. ఏ సమయంలోనైనా ఎవరైనా ఏ జిల్లాలో ఎంత మంది, ఏ వేళకు హాజరయ్యారో తెలుసుకునే వీలుంది. పీహెచ్‌సీల్లో పనిచేసే కొందరు మెడికల్ ఆఫీసర్లు, ఎంపీహెచ్ఏలు క్షేత్రస్థాయికి వెళ్లి వైద్యసేవలు అందిస్తారు. ప్రతి ఒక్కరూ పీహెచ్‌సీకి హాజరైన తర్వాత క్షేత్రస్థాయికి వెళ్లాలని అధికారులు స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు. ఉన్న ఉద్యోగులు సక్రమంగా విధులకు హాజరు కాకపోగా, ఖాళీలు సైతం రోగులను వెక్కిరిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో పనిచేసే ఆరోగ్య కార్యకర్తల పోస్టులు భారీగా ఖాళీ ఏర్పడ్డాయి. దీనికితోడు 24 గంటలపాటు సేవలందించే పీహెచ్‌సీల్లో స్టాఫ్‌నర్సు పోస్టులు సైతం భర్తీ కాని పరిస్థితి. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు కూడా చేపట్టడం లేదు. పెరిగిన జనాభాకు.. ఉన్న పీహెచ్సీ సిబ్బందికి పొంతన ఉండటం లేదు. 15 ఏళ్ల క్రితం 75 పీహెచ్‌సీలు ఉండగా.. ఇప్పుడు ఆ సంఖ్య 83కు చేరింది. మరో ఐదు పీహెచ్‌సీలు మంజూరైనా సిబ్బందిని కేటాయించకపోవడం గమనార్హం. ఉద్యోగుల హాజరు ఇలా.. ప్రతిరోజూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఉద్యోగులు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు విధుల్లో ఉండాలి. వీరు వచ్చేటప్పుడు ఉదయం 9.30 గంటల్లోగా, సాయంత్రం వెళ్లేటప్పుడు 4.30 గంటల్లోగా బయోమెట్రిక్ హాజరు నమోదు చేసుకోవాలి. జిల్లాలో మొత్తం 2,130 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో గురువారం 2,041 మంది హాజరయ్యారు. 9 గంటల్లోపు కేవలం 908 మంది మాత్రమే హాజరైనట్లు సీఎం డ్యాష్‌బోర్డు చూపుతోంది. గురువారం బయోమెట్రిక్ నివేదిక ప్రకారం ఉదయం 9 గంటల్లోపు 22 శాతం, 9 నుంచి 9.30 గంటల వరకు 25 శాతం, 9.30 నుంచి 10 గంటల్లోపు 18 శాతం, మిగిలిన వారు 10 తర్వాత హాజరయ్యారు. అంటే నిర్ణీత సమయంలోపు 72 శాతం ఉద్యోగులు విధులకు హాజరయ్యారు. ఉద్యోగులపై పర్యవేక్షణ కరువు బయోమెట్రిక్ భయంతో సగం మంది నిర్ణీత వేళలకు హాజరవుతున్నా, వీరిలో అధికశాతం హాజరు నమోదు చేసుకుని తిరిగి సొంత పనుల్లో నిమగ్నమవుతున్న వారే ఎక్కువగా ఉన్నారని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఉదయం 12 గంటల తర్వాత, సాయంత్రం 3 గంటల తర్వాత వెళితే ఏ ఒక్కరూ అందుబాటులో ఉండటం లేదు. కేవలం ఫార్మాసిస్ట్లు, ఏఎన్ఎంల సేవలే వారికి దిక్కవుతున్నాయి. 30 పడకల ఆసుపత్రులైన గోనెగండ్ల, కోసిగి, బదినేహాలు, లద్దగిరితో పాటు పత్తికొండ, ఆలూరు తదితర ఆసుపత్రుల్లో సైతం వైద్యులు అందుబాటులో ఉండటం లేదంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పీజీ వైద్యం కోసమే.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే వారికి పీజీ కోర్సులో చేరేందుకు మార్గం సుగమం అవుతుందనే ఉద్దేశంతో వైద్యులు చేరుతున్నారు. కానీ వీరిలో అధిక శాతం పీజీ ప్రవేశ పరీక్షకు సిద్ధమయ్యేందుకే అధిక సమయం కేటాయిస్తూ విధులను నిర్లక్ష్యం చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. దీనికితోడు ఇలా విధుల్లో చేరి పీజీ కోర్సు రాగానే వెళ్లిపోయే వారి స్థానాలను ఖాళీగా చూపకపోవడంతో, వారి స్థానంలో పక్క పీహెచ్‌సీల వైద్యులను డిప్యూటేషన్‌పై నియమిస్తున్నారు. ఈ కారణంగా కొందరు వైద్యులు ఎక్కడా విధులు నిర్వహించక డుమ్మా కొడుతున్న సందర్భాలు అనేకం. -
డీఎంహెచ్‌వో ఆకస్మిక తనిఖీ
పెదపాడు: పెదపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డీఎంహెచ్‌వో కె.కోటేశ్వరి బుధవారం ఆకస్మికంగా తనికీ చేశారు. జ్వరాలపై ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. మండలంలోని అన్ని గ్రామాల్లో లార్వా ఎక్కడ ఉందో సర్వే చేయాలని, అవసరమైన చోట వైద్య శిబిరాలు నిర్వహించాలన్నారు. పీహెచ్సీలో మరో వైద్యుడిని నియమిస్తామని చెప్పారు. అనంతరం ఆమె వార్డులను పరిశీలించి వైద్య సేవలపై రోగులను ఆరా తీశారు. పెదపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వ్యాధినిరోధక టీకాలు అందిస్తున్న తీరును పరిశీలించారు. పంచాయతీ విస్తరణాధికారి కె.మహాలక్ష్మి, తహసీల్దార్ జీజేఎస్ కుమార్, ఎంపీపీ మోరు శ్రావణితో సమీక్షించారు. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఎస్తేరమ్మ, హెల్త్ ఎడ్యుకేటర్ కృష్ణమోహన్, డాక్టర్ వి.రాంబాబు ఆమెతో ఉన్నారు. -
హెల్త్ విజిటర్పై డీఎంహెచ్‌వో విచారణ
చింతలపూడి : విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించడంతో సస్పెన్షన్‌కు గురైన హెల్త్ విజిటర్ వ్యవహారంపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిణి డాక్టర్ కె.కోటేశ్వరి శుక్రవారం విచారణ జరిపారు. రాఘవాపురం పీహెచ్సీలో హెల్త్ విజిటర్‌గా పనిచేస్తున్న బి.శాంతకుమారి విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో గత జూలైలో స్ధానిక సుప్రీంపేటకు చెందిన తల్లీబిడ్డా మృతి చెందారు. ఈ ఘటనలోకలెక్టర్ కాటంనేని భాస్కర్ ఆదేశాలతో వైద్య ఆరోగ్య శాఖ రీజనల్ డైరెక్టర్ ఆగస్టులో శాంతకుమారిని సస్పెండ్ చేశారు. దీంతో తనకు న్యాయం చేయాలని శాంతకుమారి ఏపీ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. జరిగిన ఘటనపై స్వయంగా విచారించి నివేదిక ఇవ్వాలని ట్రిబ్యునల్ డీఎంఅండ్‌హెచ్‌వోను ఆదేశించడంతో రాఘవాపురం పీహెచ్సీలో విచారణ చేపట్టారు. వైద్యులను, ఏఎన్ఎంలను, ఆశా వర్కర్లను విడివిడిగా విచారించారు. -
శిశువు మృతిపై వైద్యాధికారుల విచారణ
వేల్పూరు (తణుకు టౌన్) : తణుకు మండలం వేల్పూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఇటీవల శిశువు మృతి ఘటనపై శుక్రవారం అడిషనల్ డీఎంఅండ్‌హెచ్‌వో ఉమాదేవి విచారణ చేపట్టారు. వేల్పూరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చిన ఆమె శిశువు తల్లిదండ్రులు పోలుమాటి ప్రమోద్, లిల్లీడాలీలను ప్రశ్నించి వివరాలు నమోదు చేసుకున్నారు. అదే సమయంలో పీహెచ్సీ వైధ్యాదికారిని, ఇతర సిబ్బందిని విచారించారు. అనంతరం తణుకులోని ప్రైవేట్ ఆస్పత్రిలోని సిబ్బందిని విచారించారు. వివరాలను నమోదు చేసుకుని నివేదికను జిల్లా కలెక్టర్‌కు అందజేస్తామని తెలిపారు. ఈ విచారణలో తణుకు ఏరియా ఆస్పత్రి వైద్యురాలు డాక్టర్ అరుణ, పిల్లల వైద్యులు సత్యనారాయణ పాల్గొన్నారు. -
పీయూలో పీహెచ్‌సీని ఏర్పాటుచేయాలి
పాలమూరు యూనివర్సిటీ: పీయూలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటుచేయాలని, సమస్యలను పరిష్కారించాలని కొరుతూ ఎస్ఎఫ్ఐ నాయకులు సోమవారం పీయూ వీసీ భూక్యా రాజారత్నంకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ అధ్యక్షుడు ఆంజనేయులు మాట్లాడుతూ పీయూలో వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలని, గ్రంథాలయం, ఫార్మసీ కళాశాలలో ఉన్న కంప్యూటర్లకు ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వాలని తెలిపారు. ఫార్మసీ ఆడిటోరియాన్ని పూర్తిచేయాలని, అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ, ఫార్మసీ హాస్టల్స్ సమీపంలో మైదానం నిర్మించాలని, ప్రతి హాస్టల్లో మంచినీటి సౌకర్యం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో అంజి, రవి, రజినికాంత్, రాఘవేందర్, సందీప్ పాల్గొన్నారు. -
నైపుణ్యం పెంచుకోవాలి
వైద్య శాఖ సిబ్బందికి ఏడీఎంహెచ్ఓ సూచన ఎంజీఎం : సీహెచ్‌సీ, పీ హెచ్సీల్లో పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆర్గనైజర్లు, హెల్త్ ఎడ్యుకేటర్లు, ఆరోగ్య విస్తరణాధికారులు వృత్తిలో నైపుణ్యం మెరుగుపరచుకోవాలని అడిషనల్ డీఎంహెచ్ఓ శ్రీరాం సూచించారు. నగరంలోని డీఎంహెచ్ఓ కార్యాలయంలో వై ద్యారోగ్య శాఖలోని పలు పథకాల నిర్వహణపై శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీరాం మాట్లాడుతూ.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో ఉంచుకోవాలని, ఇతర ప్రభుత్వ విభాగాలతో సమన్వయంతో పనిచేయాలని అన్నారు. మాతా శిశు మరణాలు నమోౖ§ð నప్పుడు వైద్యాధికారి, ఇతర అధికారులు వాటి కారణాలను పూర్తిగా విశ్లిషించాలని సూచించారు. కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన కాయకల్ప్ కార్యక్రమంలో భాగంగా పీహెచ్సీ, సీహెచ్‌సీల్లో మౌలిక వసతుల ఏర్పాటు, సుందరీకరణ, మెరుగైన వైద్యసేవల వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని అక్టోబర్ 2న అవార్డులు ఇస్తామని ప్రకటించారు. దీనిపై శనివారం ఐఎంఏ హాల్లో వైద్యాధికారులకు వర్క్‌షాప్ నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో మాస్ మీడియా అధికారి అశోక్‌రెడ్డి, స్టాటిస్టికల్ అధికారి కాంతారావు, డిప్యూటీ డెమోలు నాగరాజు, స్వరూపరాణి పాల్గొన్నారు. -
అన్ని పీహెచ్‌సీల్లో బయోమెట్రిక్ విధానం
వారంలోగా ఏర్పాటు చేయకుంటే చర్యలు తప్పవు సెప్టెంబర్ నుంచి క్లస్టర్ స్థాయి సమావేశాలు హన్మకొండ అర్బన్ : జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సెప్టెంబర్ ఒకటి నాటికి పూర్తిస్థాయి లో బయోమెట్రిక్ హాజరు యంత్రాలు వినియోగంలో ఉండాలని కలెక్టర్ వాకాటి కరుణ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో పీహెచ్సీ వైద్యాధికారులతో సోమవారం రాత్రి నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ బయోమెట్రిక్ విషయంలో గతంలో చెప్పినప్పటికీ అధికారులు చాలావరకు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటì కే చాలా సమయం ఇచ్చాను.. ఇకపై ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. బయోమెట్రిక్ అమలు బాధ్యతలు జిల్లా సమాచార అధికారి విజయ్‌కుమార్‌కు అప్పగించారు. జిల్లాలో 75శాతం పీహెచ్‌సీల పనితీరు మెరుగున పడిందని, మిగతా 25శాతం కూడా దారిలోకి రావాల్సి ఉందని ఆమె పేర్కొన్నారు. పీహెచ్‌సీల్లోని పాత సామగ్రిని తొగించే విషయంలో అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. అలాగే సెప్టెబర్‌లో క్లస్టర్ల వారీగా సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని డీఎంహెచ్ఓ సాంబశివరావును ఈ సందర్భంగా ఆదేశించారు. జిల్లాను వైద్యరంగంలో రాష్ట్రానికి ఆదర్శంగా తీర్చిదిద్దడంలో అందరూ భగస్వాములు కావాలని కలెక్టర్ కోరారు. -
డాక్టర్ సార్ ఎప్పుడొస్తారయ్యా..?
బాలాయపల్లి : బాలాయపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. డాక్టర్ ఉంటేనే సిబ్బందికి వైద్య సేవలు అందిస్తున్నారు. ఒకవేళ వైద్యుడు రాకపోతే ఆపూట రోగులకు చికిత్స చేయడం ఆపేస్తున్నారు. మంగళవారం కేంద్రానికి ఇన్చార్జి డాక్టర్ రాకపోవడంతో రోగులుపడ్డ ఇబ్బందులు అన్నిఇన్నీ కావు. ఈ సందర్భంగా పలువురు రోగులు మాట్లాడుతూ డాక్టర్ లేకపోతే మందులు లేవు వెంకటగిరి, బంగారుపేటకు వెళ్లాలని సిబ్బంది చెబుతున్నారని ఆవేనద వ్యక్తంచేశారు. పిగిలాం కొత్తపాళెం, చుట్టి, మన్నూరు గ్రామం నుంచి జ్వరంతో వస్తే సూది మందు ఇవ్వాకుండా పంపేశారని కన్నీరు పెట్టుకున్నారు. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లే స్తోమత లేక ఇక్కడికే వస్తున్నామని, సిబ్బంది రోగులపట్ల దురుసుగా ప్రవరిస్తున్నారని వాపోయారు. జిల్లా అధికారులు స్పందించాలని కోరారు. దీనిపై సూపర్వైజర్ లింగమూర్తిని వివరణ కోరగా ఇన్చార్జి డాక్టర్ వారంలో రెండు రోజులు వస్తారని, వైద్య సిబ్బందితో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. -
నో.. స్టాక్!
నిజామాబాద్ అర్బన్ : జిల్లా కేంద్రంలో సీజనల్ వ్యాధుల ప్రభావం తీవ్రంగా ఉంది. మురికివాడల ప్రాంతాల్లో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. పట్టణ ఆరోగ్య కేంద్రాలు మందుల కొరతతో ఇబ్బందులు పడుతున్నాయి. నగరంలో 10 పట్టణ ఆరోగ్య కేంద్రాల (యూహెచ్‌సీ)తో పాటు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఉంది. ఒక్కో పట్టణ ఆరోగ్యకేంద్రంలో 40–50 మంది వైద్య సేవల కోసం వస్తుండగా, జనరల్ ఆస్పత్రిలో ఆ సంఖ్య 320కి పైగా ఉంది. ఇందులో జ్వరాలు, డయేరియా, మలేరియా, డెంగీ తదితర కేసులే అధికంగా ఉన్నాయి. నగరంలోని మాలపల్లిలో వారం క్రితం ఐదు డెంగీ కేసులు నమోదయ్యాయి. జనరల్ ఆసుపత్రిలో 100–150 వరకు జ్వరాలకు సంబంధించి కేసులు నమోదవుతుండగా, డయేరియా కేసులు 50 వరకు ఉంటున్నాయి. పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో 10–15 విష జ్వరాలు, డయేరియా కేసులు నమోదవుతున్నాయి. వీరికి తప్పనిసరిగా ఆర్ఎల్ సైలెన్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇవి అందుబాటులో లేవు. సిప్రో ప్లబ్ జేషన్ యాంటీ బయోటిక్ మెట్రోమోడజైల్ (ఐవీ వ్లూయిడ్స్) ఎన్ఎస్ సెలైన్ బాటిళ్లు కావాల్సినంత స్టాక్ లేవు. జెంటిమెడిసిన్ (యాంటి బయోటిక్) 100 ఎం.జీ. కొరతగా ఉంది. నొప్పులకు ఉపయోగించే మాత్రలు కూడా అందుబాటులో లేవు. వచ్చిన రోగుల కల్లా పారాసెటిమల్ మాత్రలు చేతిలో పెట్టి పంపిస్తున్నారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో మందుల కొరత ప్రభావం తీవ్రంగా ఉంది. రోజూ 600–700 ఆర్ఎల్ సెలైన్ బాటిళ్లు అవసరం కాగా, ప్రస్తుతం 100లోపే అందుబాటులో ఉన్నాయి. ఐవీ ఫ్లూయిడ్స్ 25 వేలు అవసరం ఉండగా, స్టాక్ అస్సలే లేదు. ఏప్రిల్ నుంచి ఆస్పత్రికి మందుల కొరత ఉన్నా అధికారులు స్పందించలేదు. అత్యవసర మందులను ప్రతిరోజు కొనుగోలు చేస్తున్నారు. మందులు అందుబాటులో లేక రోగులు బయటకు వెళుతున్నారు. మందులను కొనుగోలు చేస్తున్నాం.. ఆస్పత్రిలో మందుల కొరత ఉంది. అవసరమైన మందులను కొనుగోలు చేస్తున్నాం. ఇబ్బందులు రాకుండా చూస్తున్నాం, మరో 2–3 రోజుల్లో అవసరమైన మందులు అందుబాటులోకి రానున్నాయి. కొరత తీరనుంది. – నరేంద్రకుమార్, సూపరింటెండెంట్, జనరల్ ఆస్పత్రి -
10న పైలేరియా నివారణ మందుల పంపిణీ
ఎంజీఎం : జిల్లాలో పైలేరియా అధికంగా ఉన్న 17 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఉన్న 8,28,260 మందికి ఈ నెల 10న ఇంటింటికీ తిరుగుతూ మాత్రలు అందించేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు డీఎంహెచ్ఓ సాంబశివరావు తెలిపారు. బుధవారం టీఎన్జీవోస్ భవన్లో 17 పీహెచ్‌సీల పరిధిలోని ఎస్పీహెచ్ఓలు, వైద్యాధికారులు, కమ్యూనిటీ హెల్త్ అధికారులు, హెచ్‌ఈఓలు, సబ్ యూనిట్ అధికారులు, హెల్త్సూపర్వైజర్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పీహెచ్‌సీల పరిధిలో ఉన్న 5623 మంది పైలేరియా వ్యాధిగ్రస్తులతో మిగతా వారికి ఈ వ్యాధి సోకకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా సాముహిక మాత్రల పంపిణీ కార్యక్రమం చేపడుతున్నట్లు వివరించారు. ఈ వ్యాధిగ్రస్తులలో 1/3 మంది భారతీయులేననన్నారు. వ్యాధి నివారణ కోసం 2004 నుంచి సామూహిక మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. సమావేశంలో జోనల్ మలేరియా అధికారి జయశ్రీ, జిల్లా మలేరియా అధికారి పైడిరాజు, లక్ష్మణ్, సీనియర్ ఎంటమాలజిస్టు రమణమూర్తి, మాస్‌మీడియా అధికారి అశోక్‌రెడ్డి, ఎస్పీహెచ్ఓలు రామ్మోహన్, సుధీర్, రామారావు పాల్గొన్నారు. -
కొనసాగుతున్న రెండో ఏఎన్ఎంల సమ్మె
కాగజ్‌నగర్ : కాగజ్‌నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో పని చేస్తున్న రెండో ఏఎన్ఎంల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చేస్తున్న సమ్మె బుధవారం కూడా కొనసాగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అపరిష్కత సమస్యలను వెంటనే పరిష్కరించి, న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు లక్ష్మి, వెంకట లక్ష్మి, సురేఖ, విజయ తదితరులు పాల్గొన్నారు. -
మూలుగుతున్న గూడేలు..
జ్వరాలతో విలవిలలాడుతున్న ఏజెన్సీ రోజురోజుకు పెరుగుతున్న రోగుల సంఖ్య డాక్టర్ల కొరత.. అంతంతమాత్రంగానే మందులు స్థానికంగా ఉండని వైద్యులు.. గిరిజనుల అవస్థలు జిల్లాలోని పలు పీహెచ్‌సీలను పరిశీలించిన ‘సాక్షి’ విస్తారంగా కురుస్తున్న వర్షాలు.. ప్రబలుతున్న జ్వరాలు.. గిరిజన గూడేలు.. పల్లెల్లో ఎక్కడ చూసినా మంచంపట్టిన ఆదివాసీలు.. మలేరియా, టైఫాయిడ్, ఇతర జ్వరాలతో మూలుగుతున్నారు.. చికిత్స కోసం పీహెచ్‌సీలకు వెళ్తున్నా.. అందుబాటులో డాక్టర్లు లేక.. ఉన్నా దూర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తుండటంతో సకాలంలో వైద్యం అందని పరిస్థితి.. ముక్కుతూ మూలుగుతూ ఆస్పత్రుల ఎదుట బారులుదీరుతూ వైద్యం కోసం గిరిజనులు అవస్థలు పడుతున్నారు. ఆస్పత్రుల్లో సిబ్బంది కొరతతో వైద్య సేవలు అందడం లేదు. మంగళవారం జిల్లావ్యాప్తంగా పలు పీహెచ్‌సీలను ‘సాక్షి’ పరిశీలించగా.. రోగుల ఇబ్బందులు వెలుగులోకి వచ్చాయి. – సాక్షిప్రతినిధి, ఖమ్మం జిల్లావ్యాప్తంగా 14 క్లస్టర్ల పరిధిలో 57 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(పీహెచ్‌సీలు) ఉన్నాయి. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలో 2,760 పోస్టులు భర్తీ చేయాల్సి ఉండగా.. ప్రస్తుతం రెగ్యులర్ ఉద్యోగులు 1,422, కాంట్రాక్టు ప్రాతిపదికన 678 మంది పనిచేస్తుండగా.. 659 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సివిల్ సర్జన్లు 6, ఎస్పీహెచ్ఓలు 7, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు 18, అసిస్టెంట్ పారామెడికల్ ఆఫీసర్లు 61, సెకండ్ ఏఎన్ఎంలు 104, హెల్త్ అసిస్టెంట్లు(మహిళలు) 81, పురుషులు 167, డ్రైవర్లు 17, ఫీల్డ్ వర్కర్లు 27, ఆఫీస్ సబార్డినేట్లు 13.. ఇలా సుమారు 50 రకాల పోస్టులకు మొత్తం 659 భర్తీ చేయాల్సి ఉంది. వర్షాకాలం కావడంతో సాధారణంగా ప్రతి ఏటా ఏజెన్సీలో విషజ్వరాలు విజృంభిస్తాయి. మలేరియా, టైఫాయిడ్ వస్తే.. చికిత్స అత్యవసరంగా చేయించుకోవాల్సిందే. అయితే డాక్టర్ పోస్టులు పీహెచ్‌సీల్లో ఖాళీగా ఉండటంతో.. అక్కడికి వెళ్లిన రోగులకు వెంటనే వైద్యం అందని పరిస్థితి నెలకొంది. అంతేకాక విషజ్వరాలకు సరైన మందులు కూడా పీహెచ్సీలలో ఉండటం లేదు. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏజెన్సీలో అలసత్వం ఐటీడీఏ పరిధిలో ఏజెన్సీ వైద్యంపై అలసత్వం నెలకొంది. ఇక్కడ విషజ్వరాలు వస్తే ఆదివాసీలు, గిరిజనులకు పీహెచ్‌సీలే దిక్కు. కానీ.. డాక్టర్లు స్థానికంగా ఉండకుండా భద్రాచలం, కొత్తగూడెం, పాల్వంచ, ఖమ్మం నుంచి కూడా రాకపోకలు చేస్తుండటంతో సకాలంలో విధులకు హాజరుకావడం లేదు. స్థానికంగా ఉండే స్టాఫ్‌నర్సులు, అటెండర్లు, వాచ్‌మన్‌లే రోగులకు తోచిన వైద్యం చేసి పంపిస్తున్నారు. వందల సంఖ్యలో ఓపీ వస్తున్నా.. పట్టనట్లుగానే వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వ్యవహరిస్తుండటం గమనార్హం. అంతేకాక వైద్యం కోసం పీహెచ్సీలో చేరే రోగులకు వసతులు కూడా సరిగా లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇల్లెందు మండలం కొమురారం పీహెచ్సీలో బల్లాలపై పరుపులు లేకపోవడం దీనికి నిదర్శనం. పరుపులున్న చోట చిరిగిపోయి.. దుర్వాసన వెదజల్లుతోంది. మణుగూరు మండలం మొత్తానికి ఒకే పీహెచ్సీ ఉంది. రోజుకు 200 మంది వరకు ఓపీ వస్తుండగా.. కేవలం ఒక్కరే వైద్యుడున్నారు. గుండాల మండలంలో రోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వాగులు, వంకలు పొంగుతుండటంతో జ్వరం వస్తే గూడేల్లోనే మగ్గిపోవాల్సి వస్తోంది. వైద్యం కోసం వాగులు దాటి పీహెచ్‌సీకి వెళ్లినా మందులు లేక.. సరైన వైద్యం అందడం లేదు. 504 మలేరియా కేసులు జిల్లాలో వందల సంఖ్యలో మలేరియా కేసులు ప్రతి వారం నమోదవుతున్నా.. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తక్కువగా చూపుతున్నారు. ఇప్పటివరకు 504 మలేరియా, 18 డెంగీ కేసులు నమోదైనట్లు పేర్కొంటున్నారు. గత ఏడాది 439 డెంగీ కేసులు నమోదయ్యాయి. అయితే ఏటా ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్నా.. లెక్కల్లో మాత్రం అధికారులు తక్కువగా చూపుతుండటం గమనార్హం. డెంగీ, మలేరియా, టైఫాయిడ్ పరీక్షలు చేసే పరికరాలు చాలా పీహెచ్‌సీల్లో లేకపోవడంతో నామమాత్రపు సంఖ్యలో నమోదు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. పీహెచ్‌సీలకు వచ్చే రోగులకు మొదటి విడత పారాసిటమాల్ తదితర ట్యాబ్లెట్లు ఇచ్చి పంపిస్తున్నారు. అయితే జ్వరం ఎంతకూ తగ్గకపోవడంతో మళ్లీ మళ్లీ పీహెచ్‌సీలకు వెళ్తున్నారు. ఆర్థికంగా ఉన్న వారు మాత్రం ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. విషజ్వరాల కేసుల నమోదు ఇలా.. మలేరియా 504 డెంగీ 18 -
కను‘పాప’లకేది రక్షణ ?
–జిల్లాలో రెండు నెలలుగా నిలిచిన విటమిన్ ఏ సరఫరా – అంధత్వ నివారణకు వేసే సిరప్ లేక ఇబ్బందులు – ఆందోళన చెందుతున్న చిన్నారుల తల్లిదండ్రులు నల్లగొండ టౌన్: చిన్నారులను అంధత్వం నుంచి కాపాడేందుకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వేస్తున్న ఏ సిరఫ్ రెండు నెలలుగా నిలిచిపోయింది. దీని కోసం పీహెచ్‌సీలు, సబ్‌సెంటర్లు, పట్టణ ఆరోగ్యకేంద్రాల చుట్టూ చిన్నారుల తల్లిదండ్రులు ప్రదక్షిణలు చేస్తున్నారు. వ్యాధి నిరోధక టీకాలతో పాటు విటమిన్ ఏ సిరఫ్ను జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా సరఫరా చేస్తుంటారు. విటమిన్ ఏ సిరప్‌ను చిన్నారులకు తాగించడం వలన వారికి ఎలాంటి కంటి జబ్బులు రాకుండా కాపాడవచ్చు. జిల్లాలో అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు , సబ్‌సెంటర్లు, పట్టణ ఆరోగ్య కేంద్రాలలో వ్యాధి నిరోధక టీకాలతో పాటు విటమిన్ ఏ సిరప్‌ను కూడా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అందుబాటులో ఉంచుతుంది. 9 నెలలు దాటిన చిన్నారికి 1 యూనిట్(1 ఎంఎల్) విటమిన్ ఏ ను తాగిస్తారు. అనంతరం ప్రతి ఆరు నెలలకు ఒక సారి 2 యూనిట్లు(2 ఎంఎల్) సిరప్‌ను 5 సంవత్సరాల వయస్సు వరకు తాగించడం ద్వారా ఆ చిన్నారులను రేచీకటి, అంధత్వం రాకుండా కాపాడవచ్చు. అయితే జిల్లాలో ప్రతి నెలా 4లక్షల యూనిట్లు( 4లక్షల ఎంఎల్) విటమిన్ ఏ సిరప్ అవసరం ఉంటుందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొంటున్నారు. రెండు నెలలుగా ఈ సిరప్‌ను ప్రభుత్వం సరఫరా చేయకపోవడంతో దీని కోసం ఆస్పత్రుల చుట్టూ చిన్నారుల తల్లిదండ్రులు తిరుగుతున్నారు. ప్రై వేట్ ఆస్పత్రులకు వెళ్లి సిరఫ్ వేయించాలంటే పెద్ద ఖర్చుతో కూడుకున్న పనేనని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం చిన్నారుల పట్ల ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇమ్యునైజేషన్కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఇచ్చే నిధులతో సరఫరా చేయాల్సిన విటమిన్ ఏ ను ఎందుకు పంపిణీ చేయడం లేదని పలువును చిన్నారుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి విటమిన్ ఏ ను జిల్లాకు తెప్పించి చిన్నారులను కాపాడాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం సరఫరా చేయగానే పంపిస్తాం జిల్లాకు ప్రభుత్వం నుంచి రావాల్సిన విటమిన్ ఏ సిరప్ గత రెండు నెలలుగా సరఫరా నిలిచిపోయింది. ప్రభుత్వం నుంచి రాగానే అన్ని పీహెచ్‌సీలు, సబ్‌సెంటర్లు, పట్టణ ఆరోగ్యకేంద్రాలకు పంపిస్తాము. – డాక్టర్ భానుప్రసాద్‌నాయక్, డీఎంహెచ్ఓ -
కొనసాగుతున్న రెండో ఏఎన్ఎంల సమ్మె
మూడో రోజుకు చేరిన సమ్మె నియోజకవర్గ వ్యాప్తంగా సమ్మెలో ఏఎన్ఎంలు కాగజ్‌నగర్ : కాగజ్‌నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రెండో ఏఎన్ఎంలుగా సేవలందిస్తున్న ఉద్యోగుల సమ్మె బుధవారం మూడో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఏఎన్ఎంలు మాట్లాడుతూ ప్రభుత్వం తమను రెగ్యూలర్ చేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా 10వ పీఆర్సీని అమలు చేయాలని, యునిఫాం అలవెన్సులు చెల్లించాలని కోరారు. అపరిష్కతంగా ఉన్న సమస్యలు సత్వరమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమ్మెలో రెండవ ఏఎన్ఎంలు లక్ష్మి, వెంకటలక్ష్మి, సురేఖ, విజయ తదితరులు పాల్గొన్నారు. కౌటాల : మండలంలోని కాంట్రాక్ట్ రెండో ఏఎన్ఎంలను రెగ్యూలర్ చేయాలని రజక సంఘం మండల అధ్యక్షులు రాచకొండ అశోక్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలో గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నా రెండో ఏఎన్ఎంలకు సరిౖయెన జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. -
మంచం పట్టిన మన్యం
మన్యంలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. పీహెచ్‌సీలన్నీ రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. కలుషిత నీరు, పారిశుద్ధ్యం లోపించడం, దోమతెరలు పంపిణీ కాకపోవడం వంటి సమస్యలతో గిరిజనులు రోగాల బారినపడుతున్నారు. గ్రామాల్లో ఎప్పటికప్పుడు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయకపోవడంతో గిరిజనులంతా పీహెచ్‌సీలకు పరుగులు తీస్తున్నారు. మరోవైపు పూర్తిస్థాయిలో వైద్యులు లేకపోవడం, మందులు అరకొరగా ఉండటంతో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. * ఏజెన్సీని చుట్టుముడుతున్న రోగాలు * రోగులతో నిండిన పీహెచ్‌సీలు * కలుషిత నీటితో తప్పని అవస్థలు సీతంపేట: ఏజెన్సీలో రోగాలు ముసురుకుంటున్నాయి. అడపాదడపా కురుస్తున్న వర్షాలకు గెడ్డల్లో కొత్తనీరు చేరి కలుషితమవుతుంది. కొన్ని గ్రామాల ప్రజలు తాగునీటి కోసం గెడ్డనీటిపైనే ఆధారపడటంతో గిరిజనులు టైఫాయిడ్ వంటి విషజ్వరాల వ్యాధుల బారిన డుతున్నారు. మరికొన్ని గ్రామాల్లో పారిశుద్ధ్యం క్షీణించడంతో దోమలు స్వైరవిహారం చేస్తూ మలేరియా వంటి వ్యాధులను కలుగజేస్తున్నాయి. దీంతో ఏజెన్సీ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు రోగులతో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఇప్పటివరకు 250కిపైగా మలేరియా కేసులు నమోదైనట్టు అధికారులు చెబుతుండగా వాటి సంఖ్య ఇంకా ఎక్కువ ఉండవచ్చని అనధికార అంచనా. టైఫాయిడ్, డయేరియా కేసులు అధికంగా నమోదవుతున్నాయి. అరకొరగా వైద్య సిబ్బంది.. ఐటీడీఏ పరిధిలో 27 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. మరో 151 ఉప ఆరోగ్య కేంద్రాలు, 2 ఏరియా ఆస్పత్రులు, 10 సీహెచ్‌సీలు 10 ఉన్నాయి. హైరిస్క్ ప్రాంతమైన సీతంపేట ఏజెన్సీలో సీతంపేట, దోనుబాయి, కుశిమి, మర్రిపాడు గ్రామాల్లో పీహెచ్‌సీలు ఉన్నాయి. రోజుకు ఒక్కో పీహెచ్సీలో 50 నుంచి 100 మంది వరకు ఓపీ నమోదవుతోంది. వారపు సంత రోజుల్లో ఆ సంఖ్య 200 వరకు ఉంటుందని వైద్యసిబ్బంది చెబుతున్నారు. వీరికి వైద్యసేవలు అందించేందుకు పూర్తిస్థాయిలో సిబ్బంది లేరు. గ్రామాల్లో ఎప్పటికప్పుడు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాల్సి ఉన్నా ఎక్కడా కానరావడం లేదు. సీతంపేటలో ఇద్దరు వైద్యాధికారులు మాత్రమే ఉన్నారు. గతంలో నలుగురు వైద్యులు ఉండేవారు. దోనుబాయి, కుశిమి పీహెచ్‌సీల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మందులు బయటకొనాల్సిందే.. పీహెచ్‌సీల్లో అరకొరగానే మందులు ఉంటున్నాయి. అత్యవసర సమయాల్లో రోగులు బయట కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. సెలైన్ బాటిళ్లు, ఇతర యాంటీబయాటిక్ మందులను బయట కొనుగోలు చేయాల్సి వస్తోందని రోగులు వాపోతున్నారు. మలేరియా నిర్మూలనకు ఇప్పటి వరకు దోమతెరలు పంపిణీ చేయలేదు. నాలుగేళ్లుగా ఇదే పరిస్థితి ఉండటంతో మలేరియా కేసులు అధికంగా నమోదవుతున్నాయని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చర్యలు తీసుకుంటున్నాం.. ఈ విషయమై డిప్యూటీ డీఎంహెచ్‌వో ఎంపీవీ నాయిక్ వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా గిరిజనులకు సక్రమంగా వైద్యసేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పూర్తిస్థాయిలో మందులను అందుబాటులో ఉంచామన్నారు. ఎటువంటి కొరత లేదని తెలిపారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలి గిరిజన గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పా టు చేయాలి. గ్రామా ల్లో ఇప్పుడు వైరల్, మలేరియా, టైఫాయిడ్ జ్వరాలు వ్యాప్తి చెందుతున్నాయి. ఏ గ్రామం లో చూసినా జ్వర పీడితులే కనిపిస్తున్నారు. వీరందరికీ వైద్యసేవలు అందించాలి. - ఎస్.లక్ష్మి, ఎంపీపీ, సీతంపేట వైద్యులను నియమించాలి అన్ని పీహెచ్‌సీలకు పూర్తిస్థాయిలో వైద్యులను నియమించి వైద్యసేవలు అందించాలి. మందులన్నీ అందుబాటులో ఉంచే లా చర్యలు తీసుకోవా లి. గిరిజనులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలి. - ఎ.భాస్కరరావు, గిరిజన సంఘ నాయకుడు అదుపులోకి రాని డయేరియా వాబ(సారవకోట): మండలంలోని అన్నుపురం పంచాయతీ వాబ గ్రామంలో విజృంభించిన డయేరియా(అతిసార) శుక్రవారం నాటికీ అదుపులోకి రాలేదు. దీంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. స్థానిక పీహెచ్సీ డయేరియా రోగులతో నిండిపోయివడంతో శిథిలావస్థకు చేరిన పాత భవనంలోనే వైద్య సేవలందించారు. గ్రామంలో సుమారు 40 మంది వ్యాధి బారిన పడటంతో అక్కడ కూడా వైద్య శిబిరం కొనసాగిస్తున్నారు. గ్రామానికి చెందిన దినేష్, మధుల పరిస్థితి విషమించడంతో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. చోడసముద్రం, పురుషోత్తుకర్ర, చిన్నకిట్టాలపాడు, గొర్రిబంద గ్రామాల్లోనూ అతిసార వ్యాపించినట్లు సమాచారం. సారవకోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పూర్తిస్థాయిలో సిబ్బంది ఉన్నా కంటిజెంట్ వర్కర్ రోగులకు సెలైన్లు ఇస్తుండటం గమనార్హం. -
సేవలు అద్వితీయం
♦ కంగ్టి పీహెచ్‌సీకి అరుదైన అవార్డు ♦ ఉత్తమ సేవలకు గుర్తింపు ♦ రేపు అవార్డు అందుకోనున్న డాక్టర్ భాస్కర్ కంగ్టి : మారుమూల ప్రాంతమని నిర్లక్ష్యం వహించకుండా.. నిరంతర శ్రమ, సేవలతో ఉత్తమ అవార్డుల జాబితాలో చేరింది కంగ్గి పీహెచ్సీ. మెరుగైన సేవల పరంగా రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచింది. ఆరు పడకలే ఉన్నా ప్రతినెలా 40-45 మంది గర్భిణులకు డెలివరీలు అవుతున్నాయి. ఈ విభాగంలో కంగ్టి పీహెచ్సీ జిల్లాలోనే మొదటి స్థానంలో ఉండగా రాష్ర్టంలో రెండోస్థానం సాధించి ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. రేపు అవార్డు స్వీకరణ.. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం రాష్ర్ట ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని డీఎంఈ సెంటర్లో మదర్ అండ్ చైల్డ్ సర్వీసెస్ (ఎంసీఎస్)లో బెస్ట్ పీహెచ్సీ అవార్డు ప్రదానం చేస్తారని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ భాస్కర్ తెలిపారు. ఆసుపత్రిలో గర్భిణులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న నేపథ్యంలో ప్రసవం కోసం కంగ్టి పీహెచ్‌సీకి గర్భిణులు అధిక సంఖ్యలో వస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. స్టాఫ్ నర్సులు, ఏఎన్ఎంలు, సిబ్బంది వైద్య సేవలకుగాను ఈ అవార్డు దక్కడం సంతోషంగా ఉందన్నారు. గత ఏడాది అత్యధికంగా515 డెలివరీలు.. గత ఆర్థిక సంవత్సరంలో ఇక్కడి పీహెచ్సీలో 515 మంది గర్భిణులకు డెలివరీలు నిర్వహించిన రికార్డు ఉంది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు పెద్దశంకరంపేటలో నిర్వహిస్తుండడంతో మండలానికి చెందిన కొందరు మహిళలు అంతదూరం వెళ్లలేక పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ర్టకు వెళ్తున్నారు. సిబ్బంది పెరిగితే మరిన్ని సేవలు పీహెచ్సీలో దాదాపు సగం పోస్టులు ఖాళీగా ఉన్నాయ. సిబ్బంది పెరిగితే సేవలు మరింత మెరుగుపడనున్నాయి. మండలంలో 8 ఆరోగ్య ఉపకేంద్రాలు ఆరోగ్య సిబ్బంది అందుబాటులో లేక అలంకారప్రాయంగా మారాయి. పీహెచ్సీలో, సబ్ సెంటర్లలో అవసరం మేర సిబ్బంది నియమకాలు జరిగితే వైద్య సేవలు ఇంకను మెరుగుపడతాయని వైద్యాధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అవార్డుల పరంపర... ఈ ఆసుపత్రిలో అందించిన సేవలను గుర్తించి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ విధులు నిర్వహించిన సిబ్బంది జిల్లా స్థాయి ఉత్తమ సేవల పురస్కారాలు అందుకుంటున్నారు. కంగ్టి పీహెచ్‌సీకి చెందిన ముగ్గురు స్టాఫ్ నర్సులు, ముగ్గురు ఏఎన్ఎంలు, ఇద్దరు మెడికల్ ఆఫీసర్లు ఉత్తమ అవార్డులు అందుకొన్నారు. కాగా ఏఎన్ఎం కమల వరుసగా మూడు సార్లు ఉత్తమ అవార్డు అందుకోవడం విశేషం -
వారంలో రెండు రోజులు ఐపీవీ పోలియో టీకా
అన్ని పీహెచ్‌సీల్లో అందుబాటులోకి వైద్య ఆరోగ్య శాఖ వెల్లడి సాక్షి, హైదరాబాద్: ఇప్పటివరకు చుక్కల మందుకే పరిమితమైన పోలియో వ్యాక్సిన్... ఇక నుంచి ఐపీవీ (ఇనాక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్) రూపంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా అందుబాటులోకి తేవాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. తెలంగాణలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీ), పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (యూపీహెచ్సీ)లో ఈ వ్యాక్సిన్‌ను అందించేందుకు ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం ప్రతి బుధ, శనివారాల్లో చుక్కల మందు వేస్తున్నారు. వారంలో ఈ రెండు రోజులూ చుక్కల మందుతో పాటు ఇకపై ఐపీవీ కూడా అందుబాటులో ఉంచుతారు. అలాగే శనివారం అంగన్వాడీ, ఆరోగ్య ఉప కేంద్రాల్లోనూ ఐపీవీ వేస్తారని రాష్ట్ర ఇమ్యునైజేషన్ ప్రత్యేకాధికారి డాక్టర్ జి.శ్రీనివాసరావు ‘సాక్షి’కి తెలిపారు. నెలన్నర, మూడున్నర నెలల పిల్లలకు ఈ వ్యాక్సిన్ వేయించుకోవచ్చన్నారు. ఐపీవీని రాష్ట్రంలో అందరికీ అందుబాటులోకి తీసుకురావడం ఇదే మొదటిసారి. ఇంజెక్షన్ రూపంలో ఇచ్చే ఐపీవీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో తప్ప మరెక్కడా అందుబాటులో ఉండదు. ఐపీవీ సురక్షితం... ప్రస్తుతం చుక్కల మందు రూపంలో పోలియో వ్యాక్సిన్‌ను పిల్లలకు వేస్తున్నారు. ఇక నుంచి రాష్ట్రంలో ఐపీవీని కూడా విస్తృతంగా అందుబాటులోకి తెస్తున్నారు. చుక్కల మందు కంటే కూడా ఐపీవీ మరింత సురక్షితమని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. చుక్కల మందులో సజీవ వైరస్ ఉంటుందని... అది రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న పిల్లల నుంచి బయటకు వచ్చే అవకాశాలున్నాయంటోంది. చుక్కల మందు కంటే ఐపీవీ టీకా సురక్షితమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కూడా చెబుతోంది. పోలియో కలిగించే మూడు రకాల వైరస్‌లకు ఇది చెక్ పెడుతుంద ని నిపుణులు చెబుతున్నారు. చుక్కల మందు 1, 3 రకాల వైరస్‌లను నాశనం చేస్తుందని... ఐపీవీ ఇంజెక్షన్ మాత్రం మూడు రకాల వైరస్‌లనూ నాశనం చేస్తుందంటున్నారు. ఈ క్రమంలో 2018 నుంచి పూర్తిగా ఐపీవీ టీకానే ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ముగిసిన ప్రత్యేక కార్యక్రమం... హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో చిన్న పిల్లల కోసం ఈ నెల 20న ప్రారంభించిన ఐపీవీ టీకా ప్రత్యేక కార్యక్రమం ఆదివారంతో ముగిసింది. మొత్తం రెండున్నర లక్షల మంది పిల్లలకు టీకా వేయాలని లక్ష్యంగా పెట్టుకోగా... ఏకంగా 3,10,968 మందికి వేసినట్లు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ, యునిసెఫ్‌కు చెందిన 9 మంది ప్రత్యేక ప్రతినిధులు హైదరాబాద్ వచ్చారన్నారు. మొత్తం కార్యక్రమాన్ని రికార్డు చేయడమే కాకుండా డాక్యుమెంటరీ రూపొందించారు. వివిధ దేశాలకు ఈ డాక్యుమెంటరీ పంపించి అక్కడ ప్రజలను చైతన్యం చేస్తారు. -
పీహెచ్సీలో మహిళా రోగి మృతి
గొల్లప్రోలు: తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మహిళా రోగి మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. బాధితురాలి కుటుంబ సభ్యుల కథనం మేరకు.. గొల్లప్రోలుకు చెందిన మెండి పార్వతి (54)కి వడదెబ్బ తగలడంతో ఆదివారం సాయంత్రం అస్వస్థతకు గురైంది. కుటుంబ సభ్యులు ఆమెను పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ పార్వతి సోమవారం చనిపోయింది. వైద్యురాలు విధుల్లో ఉన్నప్పటికీ పట్టించుకోకపోవడం వల్లే పార్వతి చనిపోయిందని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. అయితే వైద్యురాలు మాత్రం తాను విధుల్లో లేనని, వేరొక పనిమీద పీహెచ్ సీకి వచ్చానని చెబుతున్నారు. -
గ్రామీణ వైద్యానికి గ్రహణం
విశ్లేషణ గ్రామీణ ప్రజలకు సంచార వైద్య సేవల (104) వంటి ఉత్తమ పథకం వైఎస్ మరణానంతరం అటకెక్కింది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలూ ప్రజలకు మంచి చేసే లక్ష్యంతో సాగిపోతున్నామని చెబుతున్నాయి. కాబట్టి అవి గ్రామీణ ప్రజల ఆరోగ్య సంరక్షణకు ఉపయోగపడే ఇటువంటి పథకాలపై దృష్టి పెట్టాలి. ఆసుపత్రుల ఫీజులు కట్ట లేని రోగి చావాల్సిందేనా? నేడు ఈ ప్రశ్న తరచుగా విన బడుతోంది. జవాబు ఇచ్చే వాళ్లే లేరు. అందుకే ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ఆరోగ్య, వైద్య సేవల గురించి విశ్లేషిం చుకోవాల్సి వస్తోంది. ప్రభు త్వాలు ఏటా కోట్లాది రూపాయలు వైద్య ఆరోగ్య రంగంపై ఖర్చు చేస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీలు) కొంత మేరకు ప్రజ లకు ఆరోగ్య సేవలను అందిస్తున్నా గ్రామీణ ప్రజల ఆరోగ్యం సమస్యగానే మిగిలిపోతున్నది. వైద్య శాస్త్ర పట్టభద్రులు పల్లెల్లో వైద్యం చేయడానికి సిద్ధంగా లేరు. ఇక మందుల విషయం చెప్పనక్కరలేదు. పీహెచ్‌సీలకు దూరంగా ఉన్న పల్లెల్లోని ప్రజలకు ఈ అరకొర సదుపాయమూ అందుబాటులో లేదు. ఇక అంత సులువుగా చేరుకోలేని కొండకోనల్లోని ఆది వాసులకు రోగం రొస్టూ వస్తే ఇక ఇంతే సంగతులు. వారికి మలేరియా, అతిసార వంటి వ్యాధులేగాక మధుమేహం, రక్తపోటు, ఉబ్బసం, కీళ్ల వ్యాధులతో కూడా బాధపడుతుంటారు. అయినా వారు ఎలాంటి వైద్య పరీక్షలు ఎన్నడూ చేయించుకుని ఎరుగరు. కనుక వారికి తమ జబ్బుల గురించే తెలియదు. ఆరోగ్య మంత్రిత్వ శాఖను వైద్య, ఆరోగ్యశాఖ అంటారు. ఆరోగ్యాన్ని కాపాడుకోగలిగితే, వైద్యం అవసరం రాదన్న అర్థం అందులో నిగూఢంగా ఉంది. తాగే నీరు, తినే ఆహారం, నివసించే వాతావరణం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంటాయి. ఈ ప్రాథమిక అంశాలకు ప్రభుత్వాలు ప్రాధాన్యం ఇస్తే రోగాల సంఖ్యా, రోగుల సంఖ్యా తగ్గిపోతాయి. వైద్య రంగంపై ప్రభుత్వం, వ్యక్తులు చేసే ఖర్చు గణనీ యంగా తగ్గిపోతుందని నిపుణుల అభిప్రాయం. ఈ సదుద్దేశంతోనే కొద్దికాలం క్రితం హెచ్ఎంఆర్ఐ అనే స్వచ్ఛంద సంస్థ కొంత కృషి చేసింది. సుదూర గ్రామీణ ప్రాంతాల్లో కనీస వైద్య సదుపాయాలు లేక, నాటు వైద్యంపైనే ఆధారప డుతున్న ప్రజలకు సంచార వైద్య కేంద్రాల ద్వారా వారి గ్రామాలకే వెళ్లి, వైద్యసేవలను అందించడమే తమ లక్ష్యమని ఆ సంస్థ నాటి ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డికి వివరించింది. సంచార వైద్య కేంద్రాలు గ్రామీణ ప్రజానీకానికి క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు, రోగ నిర్ధారణ జరిపి తగిన మందులిస్తే చాలా రోగాలకు సులువుగా సురక్షితమైన వైద్యాన్ని అందించవచ్చని, పక్షవాతం వంటి జబ్బుల బారిన పడకుండా వారిని కాపాడవచ్చని తెలిపారు. స్వత హాగా వైద్యుడయిన నాటి ముఖ్యమంత్రి అలాంటి వైద్య సేవల ఆవశ్యకతను గుర్తించారు. అలా ప్రభుత్వ -ప్రైవేటు భాగస్వామ్యం ప్రాతిపదికన ఉమ్మడి రాష్ట్రంలో హెచ్ఎంఆర్ఐ సంస్థ కార్యకలాపాలు మొదలయ్యాయి. పీహెచ్‌సీలకు మూడు కిలోమీటర్ల ఆవల ఉండే ప్రతి పల్లెకు నెల నెలా వెళ్లి అక్కడి ప్రజలకు వైద్య పరీక్షలను, మందులను ఉచితంగా అందించే 104 సంచార వైద్య వాహనానికి రూపకల్పన చేశారు. ఇక 108 అంబులెన్స్ పథకం ప్రమాదం అంచున ఉన్నవారి ప్రాణాలను కాపాడేందుకు ఉద్దేశించినది. ఈ పథకం కింద లబ్ధి పొందే వారి సంఖ్యను లెక్కలోకి తీసుకుంటే ఒక్కొక్కరిపై పెట్టే ఖర్చు ఏడాదికి ఎనభై రూపాయలే. వైద్య ఆరోగ్య రంగం బడ్జెట్లో పది శాతం కన్నా తక్కువ. ఈ 104 వాహనం ప్రతి నెలా ఒక నిర్దేశిత దినం నాడు క్రమం తప్పకుండా ఒక గ్రామాన్ని సందర్శించేది. ఈ వాహనంలో ఉండే మొత్తం ఏడుగురు సిబ్బంది గర్భిణులను, బాలిం తలను పరీక్షించి మందులు ఇచ్చేది. గర్భిణుల కడుపులో పిండం పెరుగుదలను బట్టి, తగు జాగ్రత్తలు సూచించేది. అవసరమని భావిస్తే 108 అంబులెన్స్‌ను రప్పించి రోగిని ఆస్పత్రిలో చేర్పించే వారు. రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధులున్న వారికి నెలవారీ పరీక్షలు నిర్వహించి, ఎప్పటికప్పుడు తగు మార్పులు చేస్తూ అక్కడికక్కడే మందులు ఉచితంగా పంపిణీ చేసేవారు. రోగుల వివరాలను ఎప్పటికప్పుడు సవివరంగా కంప్యూటర్లలో నిక్షిప్తం చేసేవారు. ‘దర్వాజాలో దవాఖానా’ వంటి ఈ పథకం తదనంతర రాజకీయ పరిణామాల ఫలితంగా అర్ధంతరంగా అటకెక్కింది. దేశానికే ఆదర్శంగా నిలవాల్సిన ఓ అద్భుత పథకం, వైఎస్ ఆకస్మిక మరణానంతరం కొందరి నిర్వాకాలకు, మరికొందరి స్వార్థాలకు బలైపోయింది. ఇంత అత్యుత్తమ పథకం మూలన పడినా అంతా ఏమీ జరగనట్టే ఉండటానికి కారణం... ఈ పథకం వల్ల లబ్ధిపొందుతున్న వారు నోరూవాయీ లేని నిరుపేదలు కావడమే. నిరక్ష రాస్యులైన వారి గురించి రాసేవారూ లేరు. చదవడం రాని వారి గురించిన వార్తలు ఎవరికీ పట్టవు. వారి దుర్భర జీవితాలు బుల్లి తెరలపైకీ ఎక్కవు. ఎందు కంటే అలాంటి ఆధునిక సౌకర్యాలకు దూరంగా ఉన్న అభాగ్యుల గోడు వినిపిస్తే చూపిస్తే రేటింగులూ పెరగవు. సమాజంలోని అట్టడుగు బడుగులకు బాగా ఉపయోగపడే ఒక మంచి ఆరోగ్య పథకం పురిట్లోనే సంధికొట్టిన రీతిగా అదృశ్యమైంది. ఇది ఉమ్మడి రాష్ట్రం చివరాఖరు దశలో జరిగిన కథ. ఇప్పుడు రెండు కొత్త రాష్ట్రాల ముఖ్యమంత్రులూ తమదైన రీతిలో ప్రజలకు మంచి పనులు చేసే లక్ష్యంతో సాగిపోతున్నామని పదేపదే చెబుతున్నారు. వారికి ఆ తపన ఉంటే అలాంటి ఆరోగ్య పథకాలను సమర్థంగా అమలు చేసి చూపిస్తాం అనే సంస్థలకు కొదవలేదు. కాబట్టి ఇకనైనా రెండు తెలుగు ప్రభుత్వాలూ గ్రామీణ ప్రజల ఆరోగ్య సంరక్షణకు ఉపయోగపడే ఇటువంటి పథకాలపై దృష్టి పెడితే బాగుంటుంది. తుది పలుకు: పాలకులు వస్తుంటారు, పోతుంటారు. కానీ వారు చేసిన మంచి పనులు మాత్రం కలకాలం నిలిచి చిరకాలం వారిని గుర్తు చేస్తుంటాయి. ‘కారే రాజులు రాజ్యముల్ కలుగవే...’అంటూ బలి చక్రవర్తి కాలంలో చెప్పింది నేటికీ వర్తించే వాస్తవం. రేపు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు భండారు శ్రీనివాసరావు మొబైల్ : 98491 30595 -
పీహెచ్‌సీల్లో కాన్పుల సంఖ్య పెంచాలి
సమీక్షలో కలెక్టర్ వాకాటి కరుణ ఎంజీఎం : జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ)లో సేవలు మెరుగపరుచుకుని కా న్పుల సంఖ్యను పెంచకపోతే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ కరుణ హె చ్చరించారు. శనివారం కలెక్టరేట్లో ప్రోగ్రాం అధికారులతో పాటు ఎన్‌పీహెచ్ , పీహెచ్సీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సం దర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో 36 పీహెచ్సీలలో కేవలం 8 నుంచి 10 పీహెచ్సీలలో మాత్రమే కాన్పులు జరగడమేమిటని ప్రశ్నించారు. మిగతా వాటిలో కూడా కాన్పు లు తక్కువగా జరగడానికి కారణాలను సమీక్షించుకుని తగిన సౌకర్యాలు మెరుగుపరచుకోవాలని సూచించారు. సమావేశంలో డీఎం హెచ్ఓ సాంబశివరావు, అడిషనల్ డీఎంహెచ్ఓ శ్రీరాం, డీఐఓ హ రీశ్రాజు, డిప్యూటీ డీఎంహెచ్ఓ దయానందస్వామి పాల్గొన్నారు. వైద్యసేవల్లో జిల్లాను మొదటి స్థానంలో నిలపాలి హన్మకొండ అర్బన్ : కమ్యూనిటీ హెల్త్ సెంట ర్లకు చెందిన డాక్టర్లు, సిబ్బంది ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించి రాష్ట్రంలో జిల్లాను మొదటి స్థానంలో నిలపాలని కలెక్టర్ వాకాటి కరుణ అన్నారు. హన్మకొండలోని కలెక్టరేట్లో సీహెచ్‌సీ సూపరింటెండెంట్లు, గైనకాలజిస్టులతో శ నివారం కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమీక్షల ద్వారా జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ పనితీరు కొంత మెరుగు పడిందన్నారు. దాదాపు అన్ని సీహెచ్‌సీల్లో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందాయని చెప్పారు. అన్ని ఆస్పత్రుల్లో లేబర్ టేబుల్స్ కొనుగోలు చేశామన్నారు. డోర్ కర్టెన్లు, బెడ్షీట్లు అందుబాటులో ఉన్న నిధులతో కొనుగోలు చేయాలని అధికారులకు సూచించారు. ఆస్పత్రుల ఆవరణలో పచ్చదనం పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలోని 8 సీహెచ్‌సీలు, 2 ఏరియా ఆస్పత్రుల్లో 6 హెల్త్ సెంటర్లు నిర్ణీత లక్ష్యాలు సాధించాయని వివరించారు. చేర్యాల, పరకాల, గూడూరు, చిట్యాల హెల్త్ సెంటర్ల పనితీరు సరిగాలేదని, చేర్యాల ఆస్పత్రిని తాను ఇటీవల మూడు సార్లు సందర్శిస్తే.. సిబ్బంది, డాక్టర్లు ఎవరూ అందుబాటులో లేరని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న చేర్యాల ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని ఆమె సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే పరకాల గైనకాలజిస్టును బదిలీ చేయాలని పేర్కొన్నారు. విధులను నిర్లక్ష్యం చేస్తే చర్యలు.. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే వైద్యాధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వాకాటి కరుణ హెచ్చరించారు. ఆస్పత్రులకు వచ్చే పేదలకు మానవత్వంతో వైద్యసేవలు అందించాలన్నారు. త్వరలో జనగామ, ములుగు, నర్సంపేట ఆస్పత్రులకు స్కా నింగ్ మిషన్లు కొనుగోలు చేస్తామన్నారు. న ర్సంపేటలో బ్లడ్‌స్టోరేజీ యూనిట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని క మ్యూనిటీ హెల్త్ సెంటర్లు ఏప్రిల్, మే, జూన్ నె లలకు సంబంధించి డ్రగ్స్ ఆవశ్యకతపై నివేదిక అందజేయాలన్నారు. ఎండ తీవ్రత ఎక్కువ ఉ న్నందున అన్ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో ఏసీలు కొనుగోలు చేస్తామన్నారు. డీసీహెచ్ఎస్ సంజీవయ్య, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల సూపరింటెండెంట్లు,ై గెనకాలజిస్టులు పాల్గొన్నారు. -
ప్రైవేటుకు ‘డయాగ్నస్టిక్’లపై పునరాలోచన
♦ నిధులు పక్కదారి పడతాయన్న విమర్శలతో వెనక్కి తగ్గిన సర్కారు ♦ పీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రుల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలోనే.. ♦ జిల్లా, ఆపై స్థాయి ఆస్పత్రుల్లో మాత్రం ప్రైవేటుకు ఇవ్వాలనే యోచన ♦ వారం పది రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఆసుపత్రుల్లో నెలకొల్పాలనుకున్న డయాగ్నస్టిక్ (వైద్య పరీక్షల) కేంద్రాలను ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించాలన్న ప్రతిపాదనపై ప్రభుత్వం పునరాలోచనలో పడింది. ఈ ప్రతిపాదనపై విమర్శలు వ్యక్తం కావడం, అధికారుల్లోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంతో... ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించింది. పీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రుల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలోనే డయాగ్నస్టిక్ కేంద్రాలను ఏర్పాటు చేసి... జిల్లా, బోధనాస్పత్రుల వంటి వాటిలో ప్రైవేటుకు అప్పగిస్తే సరిపోతుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వం త్వరలోనే తుది నిర్ణయం వెలువరించనుంది. అన్ని ఆసుపత్రుల్లోనూ.. పీహెచ్‌సీల నుంచి రాష్ట్రస్థాయి ఆసుపత్రుల వరకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించాలని, మందులు సరఫరా చేయాలని జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) రాష్ట్రాలను ఆదేశించింది. ఈ మేరకు డయాగ్నస్టిక్ కేంద్రాలను నెలకొల్పాలని సూచించింది. ఇందుకు నిధులను ఎన్హెచ్ఎం ఇస్తున్నా... డయాగ్నస్టిక్ కేంద్రాల ఏర్పాటు అంశాన్ని రాష్ట్రాలకే అప్పగించింది. దీనికి సంబంధించి తమిళనాడు ప్రభుత్వం ఆ రాష్ట్రంలోని ఆసుపత్రుల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలోనే డయాగ్నస్టిక్ కేంద్రాలను నెలకొల్పాలని నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొత్తంగా ప్రైవేటు ఏజెన్సీకే అప్పగిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం కూడా తొలుత ‘ప్రైవేటు’ బాట పట్టాలనే నిర్ణయిం చింది. కానీ విమర్శలు రావడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఈ విషయంలో ఒకట్రెండు ప్రత్యామ్నాయ ఆలోచనలు చేస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి చెప్పారు. ఈ అంశంపై ఏర్పాటైన నిపుణుల కమిటీ వారం పది రోజుల్లో ఒక కీలక నిర్ణ యం తీసుకుని మార్గదర్శకాలు ఖరారు చేస్తుందని ఆయన తెలిపారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ ఆధ్వర్యంలో.. పీహెచ్‌సీలు, ఏరియా ఆసుపత్రుల్లో ప్రైవేటు ఏజెన్సీలకు డయాగ్నస్టిక్‌లు అప్పగిస్తే వాటిని పర్యవేక్షించే పరిస్థితి ఉంటుందా అని అధికారులకు సందేహం తలెత్తింది. ‘ప్రైవేటు’కు అప్పగిస్తే వైద్య సిబ్బందితో కుమ్మక్కై... వైద్య పరీక్షలు చేయకుండానే చేసినట్లు చూపితే నిధులు పక్కదారి పడతాయని కొందరు అధికారులు సర్కారు దృష్టికి తీసుకొచ్చారు. అందువల్ల పీహెచ్‌సీలు, ఏరియా ఆసుపత్రుల్లో ప్రభుత్వమే డయాగ్నస్టిక్ కేంద్రాలను నెలకొల్పి, ఇప్పటికే ఉన్న టెక్నీషియన్స్‌తో నడిపించాలని యోచిస్తున్నట్లు శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. రూ. 4 లక్షలు విలువచేసే ఒక ఆటోమేటిక్ వైద్య పరీక్షల యంత్రాన్ని ఏర్పాటు చేస్తే... రక్త, మూత్ర పరీక్షలను ఆటోమేటిక్‌గా చేసి రిపోర్టులు ఇస్తుందని చెప్పారు. ఆ యంత్రం కూడా ఆస్పత్రిలోనే ఉండిపోతుందని పేర్కొన్నారు. ఇక జిల్లా, బోధనాసుపత్రులు, ఆపై స్థాయి ఆసుపత్రుల్లో మాత్రం డయాగ్నస్టిక్ కేంద్రాలను ప్రైవేటు ఏజెన్సీకే అప్పగించాలని యోచిస్తున్నారు. ఇక్కడ పర్యవేక్షణ ఇబ్బంది కాదని... చిన్న, పెద్ద అని కాకుండా ప్రతీ వైద్య పరీక్షకు నిర్ణీత సొమ్మునే చెల్లించాలని భావిస్తున్నారు. రక్త పరీక్ష చేసినా, అధిక ఖర్చయ్యే బయాప్సీ పరీక్ష చేసినా అన్నింటికీ రూ. 230 చొప్పున ప్రైవేటు ఏజెన్సీకి ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలిసిం ది. వాస్తవానికి ఉచిత వైద్య పరీక్షలు, మం దుల కోసం రూ.70 కోట్ల మేరకు ఎన్హెచ్ఎం కేటాయించనుందని సమాచారం. వైద్య ఉద్యోగ సంఘాలు, కొందరు అధికారులు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే డయాగ్నస్టిక్‌లు నెలకొల్పాలని కోరుతున్నారు. -
ప్రజారోగ్యానికి ‘త్రీడీ’ వ్యవస్థ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీ) మొదలు రాష్ట్రస్థాయిలోని ఉస్మానియా, గాంధీ, నిమ్స్ వరకు అన్ని ఆసుపత్రుల్లోనూ ప్రజారోగ్యమే ప్రధానంగా ముందుకు వెళ్లాలని వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ప్రజారోగ్యానికి అత్యంత కీలకమైన డయాగ్నస్టిక్ (వైద్య పరీక్షలు), డ్రగ్స్ (మందులు), డాక్టర్లు (వైద్యులు).. ఈ మూడింటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని నిర్ణయించింది. ఈ మూడింటి మొదటి అక్షరాలు ఇంగ్లిషు అక్షర మాలలో ‘డి’తో ఉన్నందున ‘త్రీడీ’ వ్యవస్థగా నామకరణం చేశారు. కొత్త సంవత్సరంలో ప్రభుత్వం త్రీడీపై దృష్టి కేంద్రీకరిస్తుందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. ఇదీ పరిస్థితి... రాష్ట్రంలో సుమారు 740 పీహెచ్‌సీలు ఉన్నాయి. మరో 5 వేల వరకు ఉప కేంద్రాలు ఉన్నాయి. సామాజిక ఆరోగ్య కేంద్రాలు 115, ఏరియా ఆసుపత్రులు 42, జిల్లా ఆసుపత్రులు 10, బోధనాసుపత్రులు 18, మెటర్నిటీ ఆసుపత్రులు 5 ఉన్నాయి. కానీ ఎక్కడా కూడా ప్రజారోగ్యం సక్రమంగా లేదు. అన్ని చోట్లా వైద్య పరీక్షలు, మందులు, వైద్యులు.. పూర్తిస్థాయిలో అందుబాటులో లేవన్నది సర్కారు అంచనా. ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల్లో రోజుకు 2 వేల మందికిపైగా రోగులు ఓపీలో చికిత్స పొందుతుంటారు. రోజూ 250 మంది వరకు ఆసుపత్రిలో చేరుతుంటారు. ప్రతీ రోజూ 200 వరకు ఆపరేషన్లు జరుగుతుంటాయి. అయితే ఆపరేషన్ కోసం వారాల తరబడి వేచి ఉండే పరిస్థితి ఉంది. ఇక ఎంఆర్ఐ, సిటీస్కాన్, అల్ట్రాసౌండ్ తదితర రోగ నిర్ధారణ పరీక్షల కోసమైతే నెలల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితులున్నాయి. ఇలా కింది నుంచి పై స్థాయి ఆసుపత్రి వరకూ దారుణమైన పరిస్థితి ఉంది. ఇక మందుల కొరత సరేసరి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏవీ పూర్తిస్థాయిలో దొరకడంలేదు. ఇదిలావుంటే పీహెచ్‌సీల్లో కనీసం ఇద్దరు వైద్యులుండాల్సి ఉండగా... ఒక్కరితోనే నెట్టుకొస్తున్నారు. నిమ్స్‌లో 172 వైద్య పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే నర్సింగ్ పోస్టులు 158 వరకు ఖాళీ ఉన్నాయి. మరో 116 పారామెడికల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వైద్య విధాన పరిషత్‌లో 385 వైద్యులు, 429 నర్సింగ్, 765 పారామెడికల్ పోస్టులు ఖాళీగా ఉున్నాయి. ప్రజారోగ్యంలో 298 వైద్యులు, నర్సింగ్‌లో 205, పారామెడికల్ విభాగంలో 765 ఖాళీగా ఉన్నాయి. వైద్య విద్యలో 426 వైద్యులు, 324 నర్సింగ్, 784 పారామెడికల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అందుకే త్రీడీ వ్యవస్థ... వైద్య పరీక్షలు, మందులు, డాక్టర్లను పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచేం దుకు ప్రభుత్వం నడుం బిగించింది. ఇక వైద్య పరీక్షలను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతిలో ఔట్సోర్సింగ్ వ్యవస్థకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) నుంచి నిధులు వస్తాయి. ప్రతీ పరీక్షకు కొంత చొప్పున ఔట్సోర్సింగ్ ఏజెన్సీకి ప్రభుత్వం ఇస్తుంది. రోగులకు ఉచితంగా అన్ని పరీక్షలు చేస్తారు. ఇక సాధారణ మందులు, అత్యవసర మందులకూ ఎన్హెచ్ఎం నిధులు కేటాయిస్తుంది. ఆ ప్రకారం మందులను అందుబాటులో ఉంచుతారు. మరోవైపు వైద్య సిబ్బంది కొరత తీర్చేందుకు ఇప్పటికే కాంట్రాక్టు పద్ధతిలో ప్రయత్నం మొదలైంది. ఇలా త్రీడీ వ్యవస్థను మెరుగుపరిచి వైద్యరంగాన్ని పూర్తిస్థాయిలో గాడిలో పెట్టాలని ప్రభుత్వ పెద్దలు నిర్ణయించారు. సీఎం ఆదేశాల మేరకు ప్రతీ జిల్లాలో వెయ్యి పడకలతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం చేపట్టనున్నారు. ఉస్మానియా, గాంధీ, నిలోఫర్ ఆసుపత్రులను రెండు వేల పడకల ఆసుపత్రులుగా అభివృద్ధి చేయనున్నారు. ఆసుపత్రుల్లో పూర్తిస్థాయి సిబ్బంది, పరికరాల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అధికారులు చెబుతున్నారు. -
పీహెచ్సీ ముందు రోగుల ఆందోళన
విజయనగరం: ఆసుపత్రిలో ఉన్న ఒక్క డాక్టరూ సెలవు పెట్టడంతో రోగుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. బుధవారం గ్రామస్థులు, రోగులు పెద్ద ఎత్తున ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. దీనికి విజయనగరం జిల్లా జామి మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వేదికైంది. ఇప్పటికే ప్రభుత్వాసుపత్రిలో వైద్యులు లేక రోగులు నానా అవస్థలు పడుతున్నారు. దీనికి తోడు ఉన్న ఒక్క వైద్యుడు గత మూడురోజులుగా సెలవులో ఉన్నాడు. అతని స్థానంలో ఇంఛార్జ్ వైద్యుడిని నియమించకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో బుధవారం ఉదయం పీహెచ్సీ గేటుకు తాళం వేసి స్థానికులు, రోగులు ఆందోళన చేశారు. -
కదిలిన ఎమ్మెల్యే సోలిపేట
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/దుబ్బాక: నాలుగు రోజులుగా ‘సాక్షి’లో ‘వైద్య విధ్వంసం’పై వస్తున్న వరుస కథనాలు రాష్ట్ర అంచనా పద్దుల కమిటీ చైర్మన్, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డిని కదిలించాయి. రెండురోజులుగా ఆయన దుబ్బాకలోని ప్రభుత్వ ఆసుపత్రిలోనే మకాం వేసి.. అక్కడి పరిస్థితి, కావాల్సిన మౌలిక వసతులను పరిశీలించారు. తన నియోజకవర్గంలోని ఎంపీపీలు, సర్పంచులు ఇతర ప్రజాప్రతినిధులను అక్కడికే పిలిపించారు. ఆసుపత్రిలో మౌలిక వసతుల కోసం తన వంతుగా రూ.1.50 లక్షలు విరాళంగా ఇచ్చారు. మిగిలిన ప్రజా ప్రతినిధులు కూడా తలో చేయి వేసి రూ.5 లక్షలు పోగేశారు. ముందుగా ఆసుప్రతి ఆపరేషన్ థియటర్‌కు అవసరమైన పరికరాలు తెప్పించారు. ఆపరేషన్ థియేటర్లో వైరస్ సోకకుండా వాల్ కోటింగ్ వేయించారు. థియేటర్‌కు, ప్రసూతి వార్డుకు మూడు ఏసీలు అమర్చారు. శస్త్రచికిత్సకు అవసరమైన పరికరాలు తెప్పించారు. పాడైపోయిన ఫ్యాన్లను రిపేర్ చేసి పునరుద్ధరించారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఫీజుల నియంత్రణ కోసం మంత్రి హరీశ్‌రావు సహకారంతో తన నియోజకవర్గం పరిధి వరకు ఒక మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేయాలని సోలిపేట నిర్ణయించారు. ‘సాక్షి’ కథనాలు నూటికి నూరుపాళ్లు నిజం: సోలిపేట ‘‘మా ప్రాంతంలో అంతా పేదలే. గర్భిణిలు ప్రసవం కోసం ప్రైవేటు ఆసుపత్రికి వెళ్తే రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేస్తున్నారు. వైద్యంపై ‘సాక్షి’ వరుస కథనాలు నూటికి నూరుపాళ్లు నిజం. నిజంగా నన్ను కదిలించాయి. కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లిన పేషంట్లను కబేళాలకు తరలించిన పశువుల్లా చూస్తున్నారు. నేను తొలినుంచీ దుబ్బాక కమ్యూనిటీ ఆసుప్రతి అభివృద్ధికి కృషి చేస్తున్నా. ‘సాక్షి’ కథనాలతో పనులు వేగం పెంచాం. రాష్ట్రంలోనే దుబ్బాక పీహెచ్‌సీని నెంబర్‌వన్ చేయాలనేది నా లక్ష్యం. -
సబ్ సెంటర్లలో విధిగా ఓపీ నిర్వహించాలి
శ్రీకాకుళం: మండల కేంద్రాల్లోని ఆరోగ్య ఉప కేంద్రాల్లో ప్రతి రోజూ ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ఓపీ(అవుట్ పేషెంట్) సేవలు నిర్వహించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి శ్యామల సిబ్బందిని ఆదేశించారు. బుధవారం ఆమె కొత్తూరు పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీచేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైద్యులు, ఇతర ఆరోగ్య సిబ్బంది సమయపాలన పాటించాలని, రోగులకు సేవా దృక్పధంతో వైద్యసేవలు అందించాలని ఆదేశించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించేవారిని కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. ఆమె వెంట డిప్యూటీ డీఎంహెఓ కృష్ణమోహన్ ఉన్నారు. -
ప్రభుత్వ ఆసుపత్రిలో సబ్ కలెక్టర్ తనిఖీలు
నెల్లూరు : నెల్లూరు జిల్లా గూడూరు ప్రభుత్వ ఆస్పత్రిని సబ్‌కలెక్టర్ గిరీష్ శనివారం ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో రక్తం బాటిళ్లు సంఖ్య చాలా తక్కవగా ఉండటంతో ఆయన వైద్య సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే విధులకు ఆలస్యంగా వచ్చిన సిబ్బందిపై మండి పడ్డారు. ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా ఉండాలని ఆయన వారికి సూచించారు. ఆసుపత్రిలో కనీసం మంచి నీరు కూడా అందుబాటులో లేకపోవడంపై రోగులు సబ్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. -
టేకులపల్లిలో మెగా ఉచిత వైద్య శిబిరం
ఖమ్మం : ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలం పరిధిలోని సులానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం మెగా ఉచిత ఆరోగ్య శ్రీ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఖమ్మం, కొత్తగూడెం, హైదరాబాద్‌లకు చెందిన వివిధ కార్పొరేట్ ఆస్పత్రులకు చెందిన వైద్యులు ఈ శిబిరంలో పాల్గొని వైద్య సేవలు అందించారు. ఈ సందర్భంగా రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ వైద్య శిబిరానికి మండలంలోని 12 గ్రామాల నుంచి ప్రజలు వచ్చి వైద్యం చేయించుకుంటారని నిర్వహాకులు అంచనా వేస్తున్నారు. -
పెన్షన్ రాకపోవడంతో వికలాంగుడు అత్మహత్య
-
ఇదేం ఆస్పత్రి..!
పాపన్నపేట : అటెండెన్స్ రిజిష్టర్ లేదు.. డాక్టర్లులేరు.. 11 మంది సిబ్బందికి ముగ్గురే ఉన్నారు. ఇలాంటి ఆస్పత్రిలో నిరుపేదలకు ైవైద్యసేవలు ఎలా అందజేస్తారంటూ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి ఆగ్రహాం వ్యక్తం చేశారు. బుధవారం ఆమె పాపన్నపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహం రెండు గంటలకి కూడా డాక్టర్ రాకపోవడంపై ఆమె మండి పడ్డారు. ఆస్పత్రిలో 11 మంది సిబ్బంది ఉండగా, ఒక నేత్రవైద్యుడు, నర్స్, మరో ఉద్యోగి మాత్రమే విధులకు హాజరు కావడంపై ఆమె విస్తుపోయారు. అటెండెన్స్ రిజిష్టర్ తీసుకరమ్మని సిబ్బందిని ఆదేశించగా, వారు అరగంటకు పైగా వెతికి ఖాళీ చేతులతో తిరిగివచ్చారు. దీంతో పద్మాదేవెందర్‌రెడ్డి తమాషా చేస్తున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగులకు అందుతున్న సేవలను ఆమె అడిగి తెలుసుకున్నారు. తమకు సరైన సేవలందడంలేదంటూ బాధితుల వాపోయారు. దీంతో ఆమె జిల్లా వైద్యాధికారికి ఫోన్‌చేసి గైర్హాజరైన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతుకుముందు నార్సింగి వద్ద మార్కెట్ కమిటీ నిర్మాణం కోసం భూమిని చదును చేస్తున్న ప్రాంతాన్ని ఆమె పరిశీలించారు. ఆమె వెంట టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దేవెందర్‌రెడ్డి, ఎంపీపీ పవిత్ర, వైస్ ఎంపీపీ విష్ణువర్దన్‌రెడ్డి తదితరులు ఉన్నారు. -
వైద్యం... చోద్యం!
గుంటూరు మెడికల్ : జిల్లావ్యాప్తంగా 77 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(పీహెచ్సీ), 680 ఉప ఆరోగ్య కేంద్రాలు, 17 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, 24 గంటలు వైద్యసేవలు అందించే ఆరోగ్య కేంద్రాలు 32 ఉన్నాయి. ప్రభుత్వం ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసేందుకు 177 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను మంజూరు చేయగా 43 ఖాళీలు ఉన్నాయి. పుష్కరకాలంగా వైద్యుల పోస్టులు భర్తీ కాక, ఉన్న వైద్యులు పని భారంతో అల్లాడిపోతున్నారు. స్పెషాలిటీ వైద్యుల పోస్టులను ఆరు కేటాయించగా కేవలం ఒక్క వైద్యుడు మాత్రమే పనిచేస్తున్నారు. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ పోస్టులు 21 ఖాళీగా ఉన్నాయి. ఆస్పత్రికి వచ్చే రోగులకు మందులు ఇచ్చేందుకు ఫార్మసిస్టులు కూడా లేని ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయంటే ఎలాంటి దుస్థితి నెలకొని ఉందో అర్థం చేసుకోవచ్చు. ఫార్మసిస్టులు 88 పోస్టులకు 52 మంది మాత్రమే రెగ్యులర్ ఉద్యోగులు ఉన్నారు. రక్తపరీక్షలు చేసి జ్వరం ఉందా లేదా అని నిర్ధారించి చెప్పేందుకు ల్యాబ్ టెక్నిషియన్లు కూడా లేకపోవటంతో గ్రామీణు రోగులకు కష్టాలు తప్పటం లేదు. 35 ల్యాబ్ టె క్నిషియన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఖాళీగా ఏఎన్ఎం పోస్టులు ... గ్రామాల్లో ఇంటింటికి తిరిగి ఆరోగ్య కార్యక్రమాల గురించి వివరించి రోగాల బారిన పడకుండా అవగాహన కల్పించటంలో కీలకమైన ఏఎన్ఎం పోస్టులు కూడా అధిక సంఖ్యలో ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వం 679 పోస్టులు కేటాయించగా 126 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మిగిలిన 553 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఏళ్లతరబడి చాలీచాలని జీతంతో నెట్టుకొస్తున్నారు. మల్టీపర్పస్‌హెల్త్ వర్కర్ పోస్టులు 447 ఖాళీగా ఉండగా, 200 మంది కాంట్రాక్ట్ పద్ధతిన పని చేస్తున్నారు. నాల్గవ తరగతి ఉద్యోగుల పోస్టులు 133, డ్రైవర్ పోస్టులు 18, అసిస్టెంట్ పారామెడికల్ ఆఫీసర్ పోస్టులు 39 ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా వివిధ కేడర్లకు చెందిన 3,677 పోస్టులను ప్రభుత్వం కేటాయించగా 947 ఖాళీగా ఉన్నాయి. సమయపాలన పాటించరు... పని చేసే చోటే నివాసం ఉండాలనే నిబంధనను ఏ ఒక్కరూ పాటించడం లేదు. ఉదయం 10 గంటలకు రావాల్సిన వైద్యులు, సిబ్బంది మధ్యాహ్నం 12 గంటలకు కూడా ఆసుపత్రులకు చేరుకోవడం లేదు. తిరిగి 2 గంటలకు ఇళ్లకు పయనమవుతు న్నారు. దీంతో ఆసుపత్రికి వచ్చే రోగులకు నర్సులు, ఆయాలే వైద్య చికిత్సలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. అన్ని రకాల మందులు అందుబాటులో ఉండటం లేదు. 24 గంటలు వైద్యసేవలు అందించే ఆరోగ్య కేంద్రాల్లో రాత్రి వేళల్లో వైద్యం అంతంత మాత్రంగానే ఉంది. పారిశుద్ధ్యం చెప్పకోతగిన రీతిలో ఉండటం లేదు. మూత్రశాలలు రోగులు వినియోగించేందుకు ఏ మాత్రం అనుకూలంగా లేవు. ఇప్పటికైనా జిల్లా అధికారులు సమ స్యలపై స్పందించి నాణ్యమైన వైద్యసేవలు అందించేలా కృషి చేయాలని రోగులు కోరుతున్నారు. -
జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు నాబార్డు నిధులు
అనకాపల్లి: వైద్య ఆరోగ్య సేవలను మరింత విస్తృతం చేసేందుకు నాబార్డు నిధులు మంజూరు చేసిందని, జిల్లాకు దీనిలో 32 కోట్లు కేటాయించినట్లు ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు తెలిపారు. అనకాపల్లి మండలంలోని తగరంపూడి పీహెచ్సీ నూతన భవనాన్ని ఆదివారం మధ్యాహ్నం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖకు నాబార్డు 340 కోట్లు కేటాయించిందని, విశాఖ జిల్లాకు 32 కోట్లు కేటాయించగా, ఆ నిధుల్లో 6 కోట్లను ఎన్టీఆర్ ఆస్పత్రికి కేటాయించినట్లు ఆయన తెలిపారు. ఈ నిధులే కాకుండా వైద్య ఆరోగ్య సేవల కోసం త్వరలో ఎన్ఆర్హెచ్ఎమ్ నిధులు విడుదల కానున్నాయన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల పట్ల ప్రతి ఒక్కరూ మనదే అన్న భావన కలిగి ఉండాలన్నారు. ఆస్పత్రుల పరిసరాల్లో మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా వైద్య పోస్టులను భర్తీ చేసి వైద్యుల కొరత లేకుండా చేస్తామన్నారు. ఆస్పత్రి చుట్టూ ప్రహారీ గోడ నిర్మించాలని సూచించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మంత్రులు కామినేని శ్రీనివాస్, విద్యామంత్రి గంటా శ్రీనివాసరావులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, జిల్లా పరిషత్ చైర్పర్సన్ లాలం భవాని, ఎమ్మెల్యేలు కె.ఎస్.ఎన్. రాజు, పల్లా శ్రీనివాస్, విష్ణుకుమార్‌రాజు, డీఎంఅండ్‌హెచ్‌వో సావిత్రి, జెడ్పీటీసీ పల్లెల గంగాభవాని, ఎంపీటీసీ అప్పలరాజు, సర్పంచ్ ముమ్మన రాములమ్మ, తెలుగుదేశం, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. -
ఎంసీఐ తనిఖీలు
- కేఎంసీ, అనుబంధ ఆస్పత్రుల్లో పరిశీలన - నేడు సీకేఎం, జీఎంహెచ్, టీబీ ఆస్పత్రుల సందర్శన ఎంజీఎం : కాకతీయ మెడికల్ కళాశాల అనుబంధ వరంగల్‌లోని మహాత్మాగాంధీ మెమోరియల్ ఆస్పత్రితోపాటు వర్ధన్నపేట పీహెచ్సీ ఆస్పత్రుల్లో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుల బృందం శుక్రవారం తనిఖీలు నిర్వహించింది. కేఎంసీ కళాశాలలో 150 సీట్లతో పాటు అదనంగా పెంచిన 50 సీట్లకు అనుగుణంగా విద్యార్థులకు సౌకర్యాలు ఉన్నాయా.. లేదా అని సభ్యులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఢిల్లీకి చెందిన డాక్టర్ ఎన్.మండల్ మౌలానా అజాద్, కోల్‌కతాకు చెందిన బట్ బయల్, గుజరాత్‌కు చెందిన సయ్యద్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన సత్యజిత్ వర్మ ఉదయాన్నే కేఎంసీకి చేరుకుని తనిఖీలు ప్రారంభించారు. మొదటగా కళాశాలలోని 16 విభాగాలకు చెందిన సిబ్బంది పూర్తి స్థాయిలో ఉన్నారా.. అని రికార్డులు పరిశీలించారు. అనంతరం గత సంవత్సరం ఎంసీఐ బృందం ఎత్తిచూపిన లోపాలను ప్రత్యేకంగా పరిశీలించారు. ఈ సందర్భంగా రూ.18.25 కోట్లతో నిర్మాణం చేపట్టిన బాయ్స్, గర్ట్స్ హాస్టల్స్ నూతన భవనాలను పరిశీలించారు. విద్యార్థుల కోసం ప్రత్యేకంగా నిర్మిస్తున్న అకాడమిక్ హాల్ భవనం, లెక్చరర్స్ హాల్, గ్రంధాలయాల భవనాలను సందర్శించారు. -
పీహెచ్‌సీలకు సోలార్ విద్యుత్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ)కు సోలార్ విద్యు త్ సౌకర్యం కల్పించాలని వైద్య, ఆరోగ్యశాఖ యోచిస్తోంది. ఒక్కో పీహెచ్‌సీకి రూ. 5 లక్షల చొప్పున 705 పీహెచ్‌సీలకు రూ. 35.25 కోట్లు అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపింది. అనుమతి లభించిన వెంటనే వేసవిలోగా పనుల పూర్తికి అధికారులు సిద్ధమవుతున్నారు. 13వ ఆర్థిక సంఘం నిధులతో ఏర్పాటైన 55 పీహెచ్‌సీల్లో ఇప్పటికే సోలార్ విద్యుత్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. కరెంటు కోతలతో సమస్యలు... గ్రామాల్లో కరెంటు కోతలతో రోగులు తీవ్ర ఇబ్బందులు పాలవుతోన్నారు. జనరేటర్లు ఉన్నా పనిచేయడంలేదు. ఆపరేషన్ల సమ యంలో విద్యుత్ తప్పనిసరి. కరెంటు కోతతో రోగులను పెద్దాసుపత్రులకు పంపిస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లోనైతే పరిస్థితి మరీ ఘోరం. పెద్ద ఆసుపత్రులకు వెళ్లేందుకు కొండలు గుట్టలగుండా సుదూర ప్రయాణం చేయాల్సి వస్తోంది. ఒక్కో పీహెచ్సీ కింద ఉండే 7 నుంచి 10 సబ్ సెంటర్లకు 4 వేల డోసుల వరకు వ్యాక్సిన్లను పీహెచ్‌సీల ఫ్రిజ్‌ల్లోనే నిల్వ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా నిరంతరం ఫ్రిజ్‌లో నిల్వ చేయాల్సిన వ్యాక్సిన్లకు విద్యుత్ కోతలతో తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. ఈ పరిస్థితి నుంచి పీహెచ్‌సీలను గట్టెక్కించాలంటే సోలార్ విద్యుత్తే ప్రత్యామ్నాయమని అధికారులు నిర్దారణకు వచ్చారు. -
బాలింత మృతికి కారణమైన వైద్యులను శిక్షించాలి
జగిత్యాల : బాలింత మృతికి కారణమైన రాయికల్ పీహెచ్సీ వైద్యులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలంటూ మృతురాలి బంధువులు శుక్రవారం జగిత్యాల తహశీల్ చౌరస్తాలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. మల్లాపూర్ మండలం వేంపల్లివెంకట్రావ్పేటకు చెందిన మోత్కుల విజయ(20)ను తొలికాన్పు కోసం కుటుంబసభ్యులు రాయికల్ పీహెచ్సీలో చేర్పించారు. రెండు రోజులు ఆసుపత్రిలో ఉంచగా, గురువారం సాయంత్రం నొప్పులు రావడంతో అపరేషన్ చేశారు. మగబిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తీవ్రరక్తస్రావం కాగా, జగిత్యాల ఆసుపత్రికి తరలిస్తుండగా విజయ మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యంపై ఆగ్రహించిన బంధువులు వెంటనే రాయికల్ ఆసుపత్రిపై దాడి చేశారు. విజయ మృతికి కారణమైన వైద్యులపై విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలని శుక్రవారం జగిత్యాల ఆర్డీవో కార్యాలయం ఎదుట ఆందోళన చేయడానికి గ్రామస్తులు, బంధువులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆర్డీవో కార్యాలయంలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో స్థానిక తహశీల్ చౌరస్తాలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. సదరు వైద్యులు, సిబ్బంది వెంటనే విధుల నుంచి తొలగించాలని, వారిపై కేసు నమోదు చేయాలని, విజయ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న వారి వద్దకు జగిత్యాల ఆర్డీవో ఎస్.పద్మాకర్ వచ్చి విజయ మృతికి కారణాలు తెలుసుకున్నారు. ఫిర్యాదు స్వీకరించి, కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. ఈ ఘటనపై విచారణ కోసం వైద్యుల బృందాన్ని నియమించినట్లు వెల్లడించారు. కలెక్టర్‌తో మాట్లాడి బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరపున సాయం అందించడానికి చర్యలు తీసుకుంటామని చెప్పడంతో ఆందోళన విరమించారు. నేడు త్రీమెన్ కమిటీ విచారణ రాయికల్ : విజయ మృతిపై విచారణ కోసం కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య ఆదేశాల మేరకు త్రిసభ్య కమిటీని నియమించారు. ఈ కమిటీలో డాక్టర్లు కొండల్‌రెడ్డి, వెంకటేశ్వర్రావు, భానుప్రియ ఉన్నారు. వీరు శనివారం రాయికల్ ఆసుపత్రిలో విజయ మృతిపై విచారణ చేపట్టనున్నారు. -
జాబ్‌చార్ట్‌ను కొనసాగించాలని వినతి
రాజంపేట:క్లస్టర్, పీహెచ్సీ పరిధిలో విధి నిర్వహణలో తమకు కేటాయించిన జాబ్‌చార్ట్‌ను కొనసాగించాలని సీహెచ్ఓ, ఎంపీహెచ్‌ఓలు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పీ పిచ్చయ్య ఆధ్వర్యంలోజిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బీ.రాజా, నారాయణ డీఎంఅండ్‌హెచ్‌ఓ నారాయణనాయక్‌కు విన్నవించారు. జిల్లా కేంద్రంలోని ఆయన కార్యాలయంలో మంగళవారం డీఎంఅండ్‌హెచ్‌ఓను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా రాజంపేటలో పిచ్చయ్య విలేకర్లతో మాట్లాడుతూ జిల్లాలో వివిధ క్లస్టర్ పరిధిలో పనిచేసే సీహెచ్ఓ, ఎంపీహెచ్ఓల విధుల నిర్వహణ గురించి సరైన మార్గదర్శకాలను జారీ చేయాలని కోరారు. పీహెచ్‌సీల్లో పనిచేస్తున్న క్షేత్రస్థాయి సిబ్బంది సాధారణ సెలవును మంజూరు చేసే అధికారం తమకే ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. పీహెచ్‌సీల్లో (సబ్‌సెంటర్) ఎన్ఆర్ హెచ్ఎం స్కీం కింద విడుదలైన నిధులను ప్రస్తుతం మహిళ ఆరోగ్య కార్యకర్తలు, పబ్లిక్ హెల్త్ నర్సులు, పంచాయతీ కార్యదర్శులకు జాయింట్ అకౌంట్ కింద ఖర్చు చేస్తున్నారని వివరించారు. సంబంధిత మగ, ఆడ ఆరోగ్య పర్యవేక్షకులు, మహిళ ఆరోగ్య కార్యకర్తలు జాయింట్ అకౌంట్ కింద నిధులు ఖర్చు చేసేందుకు అనుమతివ్వాలని కోరినట్లు తెలిపారు. కార్యక్రమంలో సీహెచ్‌ఓల సంఘం ఉపాధ్యక్షులు మురళీ, దిబ్బన్న, నాగరాజస్వామి, అసోసియేట్ అధ్యక్షుడు టీపీ రెడ్డయ్య, జాయింట్ సెక్రటరీ కుసుమకుమారి, జిల్లా నేతలు వేణు, స్వామిదాస్, సురేంద్రరాజు పాల్గొన్నారు. -
‘మార్పు’ లేనిదే నివారణ సాధ్యమేనా?
జిల్లాలో ‘మార్పు’ పథకం అమలు ప్రహసనంగా మారింది. మాతాశిశు మరణాల నివారణ కోసం అమలు చేస్తున్న ఈ పథకం అబాసుపాలవుతోంది. ప్రైవేటు ఆస్పత్రులు, నర్సింగ్ హోమ్‌లలో డెలివరీ అయిన కేసులను కూడా పీహెచ్‌సీల్లో ప్రసవించినట్లు నమోదు చేస్తూ కాకి లెక్కలతో మాయ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. గర్భిణుల గుర్తింపు సర్వే కూడా వాస్తవాలకు, అధికారిక లెక్కలకు పొంతన ఉండటం లేదు. ఈ విషయం ఇటీవల కేంద్ర బృందం పరిశీలనలో తేలడంతో వైద్య, ఆరోగ్య శాఖలో కలకలం రేగింది. - ఆగని మాతా శిశు మరణాలు - పీహెచ్‌సీల్లో కనీస సౌకర్యాలు మృగ్యం - ప్రభుత్వానికేది గురి... - సమీక్షలతోనే సరి... విజయవాడ : జిల్లాలో మాతా శిశు మరణాలను నివారించేందుకు ‘మార్పు’ పేరుతో మదర్ అండ్ చైల్డ్ ట్రాకింగ్ ప్రోగ్రామ్‌ను చేపట్టారు. అందులో భాగంగా ప్రతి గర్భిణీని గుర్తించి రిజిస్ట్రేషన్ చేయడంతో పాటు, ఆమెకు అవసరమైన పోషకాహారం అందించాల్సి ఉంది. ప్రతిరోజు పాలు, కోడిగుడ్డు, ఇతర పోషకాహారం అందించాలి. ప్రసవం ఖచ్చితంగా ప్రభుత్వాస్పత్రిలోనే జరగాలనేది ప్రభుత్వ నిబంధన. ఈ ప్రోగ్రామ్‌ను అమలు చేసేందుకు జిల్లాలో ఓ ప్రత్యేక అధికారిని నియమించారు. రెండుళ్లుగా పథకం అమలు జరుగుతున్నా.. ఫలితం మాత్రం శూన్యమనే చెప్పాలి. కనీస సౌకర్యాలూ కరువే... జిల్లాలో సుమారు 75 వరకూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలుండగా, వాటిలో సగానికిపైగా నెలలో ఒకటి, రెండు ప్రసవాలు మాత్రమే చేస్తున్న పరిస్థితి ఉంది. ఆ పీహెచ్‌సీల పరిధిలో ప్రసవం కోసం గర్భిణీలు వచ్చినా సౌకర్యాలు లేకపోవడంతో మచిలీపట్నం, విజయవాడ ప్రభుత్వాస్పత్రులకు తరలించేస్తున్నారు. కొన్ని పీహెచ్సీలో డెలివరీ టేబుల్స్ కూడా లేని దయనీయ స్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎలా ప్రసవాలు చేయాలని అక్కడి వైద్యులు సిబ్బందిప్రశ్నిస్తున్నారు. ఏరియా ఆస్పత్రుల పరిస్థితి కూడా దాదాపు అలాగే ఉంది. దాదాపు కేసులన్నీ ప్రభుత్వాస్పత్రికే... ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా, జిల్లా ఆస్పత్రుల్లో కనీస సౌకర్యాలు లేక పోవడంతో అన్ని ప్రాంతాల నుంచి ప్రసవం కోసం ప్రభుత్వాస్పత్రికి రిఫర్ చేస్తున్నారు. అంతేకాక పశ్చిమగోదావరిజిల్లా ఏలూరు జిల్లా ఆస్పత్రి, భీమవరం, తాడేపల్లిగూడెం నుంచి సైతం నిత్యం డెలివరీ కేసులు వస్తున్నాయి. దీంతో గర్భిణీలు పడుకునేందుకు పడకలు కూడా లేని దుస్థితి నెలకొంది. మరోవైపు ప్రసవాలు చేసే లేబర్ వార్డులో సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాము ప్రసవాలు చేయలేమని, తక్షణమే యూనిట్లు పెంచడంతో పాటు, వైద్యులు, సిబ్బంది నియామకాలు చేపట్టాలని కోరుతూ ఆ విభాగం వైద్యులు ప్రిన్సిపాల్, ఆస్పత్రి సూపరింటెండెంట్లకు లేఖ రాశారు. తప్పుడు నివే దికలు...! మార్పు పథకంలో బాగంగా ఖచ్చితంగా ప్రభుత్వాస్పత్రిలోనే ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని నిబంధన ఆరోగ్య కార్యకర్తలపై తీవ్ర వత్తిడి పెంచుతోంది. నర్శింగ్హోమ్లలో జరిగిన వాటిని కూడా పీహెచ్‌సీల్లో జరుగుతున్నట్లు నమోదు చేయడం ఇటీవల వివాదస్పదంగా మారింది. మాతశిశు మరణాల నివారణకు తీసుకుంటున్న చర్యలపై ఇటీవల కేంద్ర బృందం జిల్లాలో పర్యటించింది. వారి విచారణలో నర్శింగ్హోమ్లో ప్రసవించిన వారు పీహెచ్సీలో ప్రసవం జరిగినట్లు నమోదు చేసినట్లు వారు గుర్తించినట్లు సమాచారం. ఇటీవల ప్రతి గర్భిణీ ఆధార్‌కార్డును అనుసంధానం చేయాలని ఆదేశించడంతో, ఒక్కో గర్భిణీ రెండుసార్లు నమోదయినట్లు తేలింది. ఇలా విజయవాడలోనే అధికంగా జరిగినట్లు సమాచారం. -
వైద్య సౌకర్యాల కోసం రూ.113 కోట్లు
- పీహెచ్‌సీలను కార్పొరేట్ ఆస్పత్రులుగా తీర్చిదిద్దుతాం - విధుల పట్ల నిర్లక్ష్యం వహించే వైద్యులపై చర్యలు - మెదక్ ఏరియా అస్పత్రిని 200 పడకలుగా మారుస్తాం - డిప్యూటీ సీఎం రాజయ్య మెదక్: ప్రభుత్వ ఆస్పత్రులను కార్పొరేట్లకు దీటుగా తీర్చి దిద్దుతామని డిప్యూటీ సీఎం రాజయ్య పేర్కొన్నారు. శనివారం మెదక్ పట్టణానికి వచ్చిన ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాల కల్పనకు రూ.113 కోట్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ సిఫారసుల మేరకు కావల్సిన సౌకర్యాలు కల్పిస్తామన్నారు. వరంగల్‌లో ఏర్పాటు చేసిన కాళోజీ మెడికల్ పీజీ యూనివర్సిటీ తెలంగాణకు ఒక వరమన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో నిపుణులైన వైద్యులు ఉన్నారన్న విషయాన్ని గ్రామీణులు తెలుసుకోవాలన్నారు. అన్ని మందులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. వైద్యులు విధుల పట్ల నిర్లక్ష ్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైద్య సిబ్బంది ఖాళీలను త్వరలో భర్తీ చేస్తామన్నారు. ఇటీవలే 1,273 వైద్యుల పోస్టులకు నోటిఫికేషన్ జారీచేశామన్నారు. దంత వైద్యులు, పారామెడికల్ పోస్టులను కూడా భర్తీ చేస్తామన్నారు. అన్ని ఆస్పత్రులలో మెస్ చార్జీలు, శానిటేషన్ చార్జీలు పెంచనున్నట్లు ప్రకటించారు. ప్రతి పీహెచ్‌సీని 30 పడకల ఆస్పత్రిగా, నియోజకవర్గ ఆస్పత్రిని 100 పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేస్తామన్నారు. మెదక్ ఏరియా ఆస్పత్రిని 200 పడకల స్థాయికి పెంచుతామన్నారు. దీంతోపాటు బ్లడ్‌బ్యాంకును ఏర్పాటుచేసి, అవసరమైన పోస్టులను మంజూరు చేస్తామన్నారు. ఈ సందర్భంగా మెదక్ ఏరియా ఆస్పత్రి వైద్యుల బృందం సమస్యలపై డిప్యూటీ సీఎంకు వినతి పత్రం సమర్పించారు. 104 ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని 104 కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నుస్రత్, సంతోష్ప్రసాద్లు వినతి పత్రం సమర్పించారు. అనంతరం వైద్యులు, కౌన్సిలర్లు డిప్యూటీ సీఎం రాజయ్యను సన్మానించారు. -
అంబులెన్సులు వస్తున్నాయి..
ఉట్నూర్ : ఏజెన్సీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు(పీహెచ్సీ) అంబులెన్సు సౌకర్యం ఆగస్టు 1 నుంచి అందుబాటులోకి రానుంది. ఈ మేరకు ఐటీడీఏ ఇన్చార్జి పీవో ప్రశాంత్ పాటిల్ పీహెచ్‌సీలకు అంబులెన్సు సౌకర్యం కోసం ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం ఏజెన్సీ పీహెచ్‌సీల అంబులెన్సులను గత జనవరి నుంచి ఎత్తి వేసిన తీరును, అద్దె అంబులెన్సులకు విడుదల చేసిన రూ.80 లక్షల నిధులు ఉపయోగాన్ని వివరిస్తూ ‘సాక్షి’ జిల్లా ప్రధాన సంచికలో జూన్ 26న ‘ఎడ్లబండే.. అంబులెన్సు..’, జూలై 25న ‘జ్వర వలయం’ అనే శీర్షికలతో కథనాలు ప్రచురితమయ్యాయి. దీంతో స్పందించిన అధికారులు వ్యాధుల సీజన్ అయిన ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ మూడు నెలలపాటు అద్దె ప్రతిపాదికన అంబులెన్సుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. మూడు నెలల తర్వాత పరిస్థితిని బట్టి మరో మూడు నెలలు పొడిగించే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. 28 పీహెచ్‌సీలకు అద్దె అంబులెన్సులు ఏజెన్సీ ప్రాంతంలోని 31 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సీజనల్ వ్యాధుల ప్రభావం అంతగా ఉండని మందమర్రి, తాళ్లపెట్, దండేపల్లి పీహెచ్‌సీలను మినహాయించి మిగతా 28 పీహెచ్‌సీలకు అంబులెన్సు సౌకర్యం ఆగస్టు 1 నుంచి కల్పించనున్నారు. శ్యాంపూర్, జైనూర్, సిర్పూర్(యు), గిన్నెధరి, అంకొళి పీహెచ్‌సీలకు ఎన్ఆర్హెచ్ఎంకు చెందిన అంబులెన్సులు ఉండటంతో వీటికి మాత్రం నెలకు డీజిల్ ఖర్చు కింద రూ.10 వేలు చెల్లించనున్నారు. మిగతా పీహెచ్‌సీల అంబులెన్సులకు నెలకు అద్దె కింద రూ.24 వేలు చెల్లిస్తారు. మాక్స్, ట్రాక్స వంటి అంబులెన్సు సౌకర్యం సమకూర్చుకునే బాధ్యతను సంబంధిత పీహెచ్సీ వైధ్యాధికారికి అప్పగించారు. జనవరిలో అంబులెన్సులు ఎత్తివేసిన సమయంలోనే వైద్యశాఖ ప్రత్యామ్నాయంగా అద్దె అంబులెన్సులు సమకుర్చుకునేందుకు సంవత్సరం కోసం రూ.80 లక్షలు విడుదల చేసిన విషయం విధితమే. ఐటీడీఏ నిర్లక్ష్యం వల్ల పీహెచ్‌సీలకు అద్దె అంబులెన్సులు లేకపోవడంతో ఆరోగ్య రక్షణకు చర్యలు తీసుకొవడంలో వైద్య సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎట్టకేలకు ‘సాక్షి’ కథనాలతో ఐటీడీఏ అధికారులు స్పందించి పీహెచ్‌సీలకు అద్దె అంబులెన్సుల సౌకర్యం కల్పించడంతో గిరిజనులకు అత్యవసర వైద్యం అందుబాటులోకి రానుంది. -
వారానికో పీహెచ్సీ సందర్శన
జిల్లా కలెక్టర్ యువరాజ్ ఆకస్మిక తనిఖీలు సబ్బవరం తహసీల్దార్‌పై ఆగ్రహం సబ్బవరం: జిల్లాలోని పీహెచ్‌సీలను ఒక గాడిన పెట్టేందుకు జిల్లా కలెక్టర్ ఎన్. యువరాజ్ నడుం బిగించారు. ప్రతి వారం ఒక పీహెచ్‌సీని సందర్శించేందుకు నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు. మండలంలోని గుళ్లేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని కూడా ఆయన సందర్శించారు. పీహెచ్‌సీని తనిఖీ చేసిన ఆయన ఆస్పత్రిలో సమస్యలను గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పీహెచ్సీలో ల్యాబ్ టెక్నీషియన్, స్వీపర్లు, అటెండర్లు అవసరమని పీహెచ్సీ వైద్యురాలు డాక్టర్ సుజాత కలెక్టర్ దృష్టికి తెచ్చారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్ రికార్డులను పరిశీలించారు. రికార్డులు సక్రమంగా లేవని అసంతృప్తి వ్యక్తం చేసి తహసీల్దార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆధార్ కార్డులతో రేషన్ కార్డులు అనుసంధానం, పట్టాదారు పాస్‌పుస్తకాలు ఆన్లైన్ ఎలా జరుగుతోందని ఆర్ఐని అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ యువరాజ్ విలేకర్లతో మాట్లాడుతూ జిల్లాలో వైద్య నిపుణులు కొరత ఉందని ఈ సమస్యను అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. జిల్లాలో 2866 మంది బడికి రాని బడిఈడు పిల్లలను గుర్తించామన్నారు. ప్రభుత్వ భూములను పరిరక్షిస్తామని కలెక్టర్ ఈ సందర్భంగా తెలిపారు. అనంతరం సర్వే నెంబరు 255లో ఆక్రమణకు గురయిన ప్రభుత్వ భూమిని పరిశీలించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ ఎమ్. నాగభూషణరావు, ఎంపీడీఓ ఎస్. త్రినాథరావు, ఆర్ఐలు అరుణ్‌కుమార్, రమేష్ ఉన్నారు. -
మంత్రి గారూ.. మీ ఊరి దవాఖానలో
ఈ కష్టాలు చూడండి స్టేషన్‌ఘన్‌పూర్ టౌన్ : ఆరోగ్య శాఖ మంత్రి రాజయ్య నియోజకవర్గ కేంద్రంలోని పీహెచ్సీలో బుధవారం కుటుంబ నియంత్రణ శిబిరం ఏర్పాటు చేశారు. ఇందులో 86 డీపీఎల్, 6 వేసెక్టమీ మొత్తం 92 మందికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారు. అయితే ఆస్పత్రిలో కేవలం 30 పడకలే ఉన్నాయి. శిబిరం కోసం ప్రత్యేకంగా మరో 30 పడకలు తెప్పించారు. ఆపరేషన్ చేయించుకున్నది 92 మంది కావడంతో పడకలు సరిపోలేదు. ఆపరేషన్ చేసిన వారిని బెడ్ వద్దకు తీసుకెళ్లేందుకు స్ట్రెచ్చర్ ఒక్కటే ఉంది. అది కూడా సరిగా లేకపోవడంతో బెడ్లు దొరకవనే ఆత్రుతతో పలువురు మహిళలను వారి కుటుంబ సభ్యులు చేతులపై మోసుకుని తీసుకెళ్లారు. చాలా మందికి నేలే దిక్కవడంతో నరకయాతన అనుభవించారు. సిబ్బంది తక్కువగా ఉండడంతో ఆపరేషన్ చేసుకున్న వారికి సెలైన్ బాటిల్ పెట్టడంలో ఆలస్యం కావడంతో బంధువులే బాటిల్ పెట్టడం కనిపించింది. సరైన ఏర్పాట్లు చేపట్టకుండా కుటుంబ నియంత్రణ శిబిరం ఏర్పా టు చేయడంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పీహెచ్సీలో సౌకర్యాలను మెరుగుపర్చాలని, 100 పడకల ఆస్పత్రిగా మార్చాలని ప్రజలు కోరుతున్నారు. -
నిర్లక్ష్య రోగం!
విజయనగరం ఆరోగ్యం:ప్రభుత్వం సరఫరా చేసిన దోమల నివారణ మందును ఇప్పటికే గ్రామాల్లో పిచికారీ చేయాలి. అయితే అలా జరగలేదు. ఆ మందు ఇంకా పీహెచ్‌సీల్లో మూలుగుతోంది. తాము ఎప్పుడో మందును సరఫరా చేశామని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. అయితే ఈనెలలోనే వచ్చినట్టు వైద్యాధికారులు అంటున్నారు. ఏది నిజయో తెలియని పరిస్థితి నెలకొంది. ఏప్రిల్‌లోనే మందు సరఫరా సీజనల్‌గా వచ్చే మలేరియా, డెంగీ, చికెన్ గున్యా, ఫైలేరియా వంటి వ్యాధులును వ్యాప్తిని అరికట్టడం కోసం ప్రభుత్వం ఈఏడాది ముందుస్తు చర్యలు చేపట్టింది. వ్యాధులను కలగజేసే దోమల ను సమూలంగా నిర్మూలించాలనే ఉద్దేశ్యంతో ప్రతీ పల్లె, పట్టణాల్లో పిచికారీ చేయడం కోసం దోమల నివారణకు ఉపయోగించే లార్విసెడ్, మలథీయాన్‌మందును ఏప్రిల్ నెలలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు సరఫరా చేసింది. వీటిని పీహెచ్‌సీలు ద్వారా గ్రామాలకు సరఫరా చేయాల్సి ఉంది. అయితే ఆ మందులు ఇంకా పీహెచ్‌సీల్లోనే మూలుగుతున్నా యి. వైద్య ఆరోగ్యశాఖ సరఫరా చేసినమూటలను కూడా సబంధిత సిబ్బంది ఇంకా చాలా గ్రామాల్లో విప్పినట్టు లేదు. గంట్యాడ మండలంలోని పరిధిలోని పెదవేమలి, మురపాక, సిరిపురం, గ్రామాలను పరిశీలించగా ఇంకా ఆయా పంచాయతీలకు మందు చేరలేదు. అదేవిధంగా విజయనగరం మండలంలోని జొన్నవలస, పినవేమలి, రాకోడు గ్రామాలకు కూడా మందు చేరలేదు. జిల్లాకు సరఫరా అయిన మందు వివరాలు గ్రామాల్లో పిచికారీ చేయడానికి 1200 లీటర్లు లార్విసెడ్ కెమికల్, పట్టణాలకు 840 లీటర్లు మలాథి యాన్ , 330 లీటర్ల లార్విసెడ్ కెమికల్‌ను సరఫరా చేశారు. మందును జిల్లాలో ఉన్న 68 పీహెచ్‌సీలు ద్వారా జిల్లాలోని అన్ని గ్రామాలకు సరఫరాచేయాలి. మున్సిపాల్టీలకు మలేరియా సబ్ యూని ట్ సిబ్బంది అందజేయాలి. మందు సరఫరా అయి రెండు నెలలు అవుతున్న ఇంతవరకు మూటలు కూడా విప్పని పరిస్థితి. దీంతో గ్రామాల్లో మందును పిచకారీ చేయకపోవడంతో దోమలు విజృంభిస్తున్నాయి. జిల్లా వాసులకు మలేరియా, వైరల్,డెంగీ వంటి వ్యాధులు సోకుతున్నాయి. వారానికి ఒకసారి పిచికారీ చేయాలి గ్రామాలు, పట్టణాల్లో లార్విసెడ్, మలథీయా న్ మందును కాల్వల్లో వారానికి ఒకసారిపిచికారీ చేయాలి. ఇప్పటికే ఈకార్యక్రమాన్ని ప్రారంభిం చాల్సి ఉంది. కాని ఇంతవరకు ప్రారంభం కాలేదు. జిల్లాలో దాదాపు అన్ని గ్రామాల్లో పారిశుధ్యం ఆధ్వాన్నంగా ఉంది. దీంతో దోమల వ్యాప్తి అధికంగా ఉంది. మందు పిచికారీ చేసి ఉంటే దోమల తగ్గేవి. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలు వల్ల దోమలు మరింత అధికమయ్యే ప్రమాదం ఉంది. ఏప్రిల్‌లోనే సరఫరా చేశాం... లార్విసెడ్, మలాథియాన్ మందులను ఏప్రిల్ నెలలోనే పీహెచ్‌సీలకు సరఫరా చేసేశాం. వాటిని గ్రామాలకు అందజేయమని ఆదేశాలు కూడా జారీ చేశాం. గ్రామాలకు సరఫరా కాని విషయం ఇంతవరకు నాకు తెలియదు. తక్షణమే గ్రామాలకు వెళ్లేలా చర్యలు తీసుకుంటాం. - యు.స్వరాజ్యలక్ష్మి, డీఎంహెచ్. ఈ నెలలోనే మందు వచ్చింది మా పీహెచ్సీ పరిధిలో 19 పంచాయతీలున్నాయి. మాకు ఈనెల 5వతేదీన 5 లీటర్లు లార్విసెడ్ మందు ఇచ్చారు. మందు పూర్తి స్థాయిలో సరిపోతుందో లేదోనని తర్జన భర్జన పడ్డాం. ఒకటి రెండు రోజుల్లో పంచాయతీలకు పంపిస్తాం - డాక్టర్ రాజశేఖర్, గంట్యాడ పీహెచ్సీ వైద్యాధికారి -
నర్సుపై సీనియర్ ఉద్యోగి లైంగిక వేధింపులు
ఠాణే :గోవిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న ఓ నర్సు తనపై ఓ సీనియర్ క్లర్క్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పీహెచ్సీ విభాగంలో క్లర్క్‌గా పనిచేస్తున్న నిందితుడు మోహన్ దౌడ్ తరచూ నర్సుల సెక్షన్లోకి వెళ్లి ఆమెపై వేధింపులకు పాల్పడుతున్నాడు.శుక్రవారం సాయంత్రం వేధింపులు తీవ్రం కావడంతో భరించలేక బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కల్యాణ్ తాలూకా పోలీస్‌స్టేషన్ అధికారి ఏపీఐ వీఆర్ అండాలే పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చి నుంచి జూన్ మధ్యలో నిందితుడి లైంగిక వేధింపులు తీవ్రమయ్యాయని బాధితారాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు నిందితుడిపై ఐపీసీ 354 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
వైద్య నారాయణులేరీ...?
- పెదబయలు పీహెచ్సీలో వైద్యాధికారి కరువు - గోమంగి, రూడకోటకు ఇన్‌చార్జిలే దిక్కు - వారానికో రోజే వైద్యుల దర్శనం - మౌలిక సదుపాయాలు లేవు పెదబయలు : మన్యంలోని గిరిజనులకు వైద్యసేవలు మరింత చేరువగా అందించే లక్ష్యంగా ఏర్పాటైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యాధికారులు, మౌలిక సదుపాయాల కొరత పీడిస్తోంది. పెదబయలు పీహెచ్సీలో 10 రోజుల నుంచి వైద్యాధికారి లేరు. గోమంగి, రూడకోట పీహెచ్‌సీల్లో ఇన్చార్జి వైద్యులు ఉన్నారు. గోమంగి పీహెచ్సీ వైద్యాధికారి మూడు పీహెచ్‌సీల్లో, రూడకోట వైద్యాధికారి రెండు పీహెచ్‌సీల్లో విధులు నిర్వహిస్తున్నారు. దీంతో ఏ ఒక్క చోటా పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించే పరిస్థితి లేదు. ప్రస్తుత ఎపిడమిక్ సీజన్లో కూడా పీహెచ్సీ వైద్యులు లేకపోవడంతో మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెదబయలు పీహెచ్సీ స్లాబు నుంచి వర్షాలకు నీరు లీకేజీ అవుతుంది. రోగులకు సరిపడిన బెడ్లు, బెంచీ లు, రన్నింగ్ వాటర్ సదుపాయం వంటివి కానరావు. గోమంగి పీహెచ్సీలో ప్రారంభం నుంచి నీటి సదుపాయం, విద్యుత్ సదుపాయం లేదు. పూర్తి స్థాయి వైద్యాధికారి లేరు. రూడకోట పీహెచ్సీలో నీటి నీటి ఎద్దడి, పూర్తి స్థాయి వైద్యాధికారి, సిబ్బం ది కొరత ఉంది.ఆస్పత్రిలో స్టాఫ్‌నర్స్ , ఎల్టి మా త్రమే విధులు నిర్వహిస్తున్నారు. గత నెలలోనే పె దబయలు, మారుమూల రూడకోట పీహెచ్‌సీలకు తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్, ఐటీడీఏ పీవోను కలిసిన రూడకోట గ్రామస్తులు పూర్తి స్థాయి వైద్యాధికారిని నియమించాలని కోరా రు. దీనికి కలెక్టర్ స్పందించి వారం రోజుల్లో నియమిస్తానని హామీ ఇచ్చారు. అయితే మూడు వారాలు గడిచినా వైద్యాధికారి రాలేదు. ఇప్పటికైన అధికారులు స్పందించి మూడు పీహెచ్‌సీల్లో పూర్తి స్థాయి వైద్యులు, పీహెచ్‌సీల్లో మౌలిక సదుపాయాలు, కల్పించాలని మండల వాసులు కోరుతున్నారు. పూర్తి స్థాయి వైద్యుల్ని నియమించాలి పెదబయలు, గోమంగి, రూడకోట పీహెచ్‌సీల్లో ఎపిడమిక్ సీజన్లో వైద్యులు లేకపోవడం విచారకరం. అలాగే పీహెచ్‌సీల్లో రోగులకు కనీస సదుపాయాలు లేవు. సిబ్బంది కొరత ఉంది. 24 గంటల ఆస్పత్రిలో వైద్యాధికారి లేరు. రెండు రోజుల వ్యవధిలో వైద్యాధికారిని నియమిస్తామని ఐటీడీఏ పీవో హామీ ఇచ్చారు. వారం రోజులైనా వైద్యాధికారి రాలేదు. - సల్లంగి ఉమామహేశ్వరరావు, ఎంపీపీ, పెదబయలు మండలం -
పాలమూరుకు సేవచేయడం నా అదృష్టం
- వందరోజుల ప్రణాళికతో సమస్యలకు పరిష్కారం - రెండేళ్లు పూర్తిచేసుకున్న కలెక్టర్ కలెక్టరేట్: ‘జిల్లా అన్నిరంగాల్లో వెనుకబడిపోవడం కొంత విచారమే.. అభివృద్ధి చేసేందుకు కావాల్సిన వనరులు ఉన్నాయి. దీనికితోడు ప్రేమ ఆప్యాయతలు కలిగిన ప్రజలున్న పాలమూరు జిల్లాకు కలెక్టర్‌గా సేవచేయడం నా అదృష్టంగా భావిస్తున్నా..’అని కలెక్టర్ ఎం.గిరిజాశంకర్ అన్నారు. జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన ఆదివారంతో రెండేళ్లు పూర్తిచేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆదివారం ‘సాక్షి’తో మాట్లాడారు. రెండేళ్ల పాలన రెండురోజులా గడిచిపోయిందని, అవకాశం ఉంటే ఇక్కడే సేవచేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. తాను జిల్లాకు వచ్చిన కొత్తలో అన్నిశాఖల్లో ఖాళీలతోపాటు పెండింగ్ సమస్యలతో కొంత ఇబ్బంది కలిగిందని, వాటిపై దృష్టిసారించడంతో 80శాతం పురోగతి సాధించామన్నారు. ప్రతీశాఖకు విధించిన వందరోజుల ప్రణాళికతో చాలా ఫలితాలు వచ్చాయన్నారు. ఆయన పాలనానుభవాలు కలెక్టర్ మాటల్లోనే.. సాక్షి: రెండేళ్లలో పరిష్కరించిన ముఖ్యమైన సమస్యలేవి? కలెక్టర్: ప్రారంభంలో 800కు పైగా గ్రామాల్లో తాగునీటిసమస్య ప్రధానంగా ఉండేది. దీనిపై ప్రత్యేక దృష్టిసారించడంతో పరిష్కరించగలిగా..ఇప్పుడు కేవలం 68 గ్రామాల్లో మాత్రమే ఆ సమస్య ఉంది. దీన్ని కూడా అధిగమించేందుకు ప్రణాళికబద్ధంగా చర్యలు తీసుకుంటున్నాం. సాక్షి: ముఖ్యమైన రంగాల్లో సాధించిన ప్రగతి ఏమిటి? కలెక్టర్: డీఆర్డీఏ శాఖను ముందుకు తీసుకొచ్చేందుకు కొత్త ప్రణాళికను సిద్ధంచేశాం. మహిళలను ఆర్థికంగా ఆదుకునేందుకు రూ.737కోట్ల రుణాలు ఇప్పించి ప్రథమస్థానంలో నిలిచాం. అదేవిధంగా ఇళ్లనిర్మాణంలో 19వ స్థానంలో ఉన్న జిల్లా నాలుగోస్థానంలో నిలబెట్టాం. సాక్షి: జిల్లా అభివృద్ధికి తీసుకున్న ప్రత్యేకచర్యలు ఉన్నాయా? కలెక్టర్: జిల్లా పరిస్థితులను చూశాక బాధేసింది. ఇందుకోసం వెంటనే ప్రతీ శుక్రవారం ‘పల్లెవికాసం’ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రతీగ్రామానికి అన్ని శాఖల అధికారులను పంపించి సమస్యలు పరిష్కరించాను. అలాగే ‘పాలమూరు పచ్చదనం’ కార్యక్రమంతో 10 లక్షల మొక్కలు నాటాం.. ‘మన ఊరు- మన పీహెచ్సీ’ కార్యక్రమంతో గ్రామాల్లోని ప్రతీ ఇంటికి వైద్యాన్ని తీసుకెళ్లాం. దీంతోపాటు పాలమూరు సేవాట్రస్ట్తో విరాళాలు సేకరించి 30 మంది పేద ఆడపిల్లలకు ఉన్నత విద్యను అందించేందుకు ఆర్థిక సహాయం అందించాం. రెవెన్యూశాఖపై బాగా కసరత్తు చేశా. పెండింగ్ సమస్యలతోపాటు రికార్డుల నిర్వాహణ, ఆన్లైన్ విధానాన్ని ఓ కొలిక్కి తీసుకొచ్చా. ఇప్పు డు రిజిస్ట్రేషన్, రెవెన్యూ రికార్డుల నమో దు ‘ఆన్లైన్’లో జరిగేలా చేస్తున్నాం. సాక్షి: జిల్లాలో మిగిలిపోయిన కార్యక్రమాలు ఏమైనా? కలెక్టర్: సోలార్ పవర్ యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు గట్టు, ధరూర్ మండలాల్లో ఐదువేల ఎకరాల భూమిని సిద్ధంచేశాం. ఆ భూమిలో ఎవరైనా ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తే జిల్లాకు 24గంటల పాటు అక్కడినుంచే విద్యుత్‌ను అందించే అవకాశం ఉంది. కానీ ప్రభుత్వ నిర్ణయం కావడంతో పెండింగ్‌లోనే ఉండిపోయింది. సాక్షి: రాజకీయపరమైన ఒత్తిళ్లను ఎలా అధిగమించారు? కలెక్టర్: ఒత్తిళ్లు సహజం. కానీ వాటికి లోనుకాకుండా నిబంధనల ప్రకారం నడుచుకున్నా.. ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేశాను. సాక్షి: ఈ ఏడాది ఏ ప్రణాళికతో ముందుకెళ్తున్నారు? కలెక్టర్: ప్రధానంగా ఎస్సీల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను అర్హులైన వారందరికీ అందించేందుకు కృషిచేస్తున్నా.. జిల్లాలో ఉన్న వనరులను వినియోగంలోకి తెచ్చి ఎక్కువమందికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నా..వాటిని కచ్చితంగా అమలుచేసి తీరుతాం. -
ఎడ్లబండే.. అంబులెన్సు..
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వాహనాల ఎత్తివేత అత్యవసర వైద్యం అందని ద్రాక్షే.. పునరుద్ధరించాలని గిరిజనుల వేడుకోలు ఉట్నూర్ :ఐటీడీఏ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో(పీహెచ్సీ) గిరిజనులకు అత్యవసర వైద్యం అందించడానికి నేషనల్ షెడ్యూల్డ్ ట్రైబల్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఎన్ఎస్ఎఫ్డీసీ) ద్వారా పదిహేనేళ్ల క్రితం అంబులెన్సులు ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి సేవలు అందిస్తున్న అంబులెన్సులకు సకాలంలో నిధులు మంజూరు కాకపోవడంతో సేవలు నిలిచాయి. అంబులెన్సులు కొనుగోలు చేసి చాలా ఏళ్లు కావడంతో కాలం చెల్లాయి. కొన్నింటికి విడిభాగాలు దొరకని పరిస్థితి. గత అక్టోబర్‌లో రాష్ట్ర స్థాయిలో జరిగిన వైద్యశాఖ మినిట్స్ అఫ్ ది మీటింగ్‌లో ఏజెన్సీ పీహెచ్‌సీల అంశం ప్రస్తావనకు వచ్చింది. సాధ్యాసాధ్యాలను చర్చించిన యంత్రాంగంఅంబులెన్స్లను ఎత్తివేయాలని నిర్ణయించారు. దీం తో జనవరి నుంచి ఇచ్చోడ, దండేపల్లి, బజార్హత్ను ర్, నర్సాపూర్(టి), నేరడిగొండ, గుడిహత్నూర్, భీం పూర్, నార్నూర్, వాంకిడి, దంతన్‌పల్లి, ఝర్రి, పిట్టబొంగరం పీహెచ్‌సీల అంబులెన్సులు ఎత్తివేశారు. అద్దె అంబులెన్సులకు రూ.80 లక్షలు విడుదలైనా.. అంబులెన్సు సేవలను నిలిపివేసిన వైద్యశాఖ ప్రత్యామ్నాయంగా ఏజెన్సీలోని 31 పీహెచ్‌సీల్లో వ్యాధుల తీవ్రత అంతగా ఉండని మందమర్రి, లోన్వెల్లి, ఈజ్గాం పీహెచ్‌సీలను మినహాయించి మిగతా 28 పీహెచ్‌సీలకు అద్దె ప్రతిపాదికన ఏడాది పాటు అంబులెన్సులు సమకుర్చుకోవాలని రూ.80 లక్షలు విడుదల చేసింది. ఏజెన్సీలో ప్రసవ సమయంలో గర్భవతులను ఆరోగ్య కేంద్రాలకు, ఇళ్లకు తరలించడానికి ఐటీడీఏ ఐఏపీ ద్వారా కొనుగోలు చేసిన ఆరు అంబులెన్సులను ఉపయోగిస్తుంది. వీటి నిర్వహణకు విడుదలైన రూ.80 లక్షల నిధులు ఖర్చు చేస్తుండటంతో ఐటీడీఏ పీహెచ్‌సీలకు అద్దె అంబులెన్సులు ఏర్పాటు చేయడం లేదు. దీంతో పీహెచ్‌సీలకు అంబులెన్సులు లేక పోవడంతో ఆరోగ్య రక్షణకు చర్యలు తీసుకోవడంలో సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొటున్నారు. అంబులెన్సు వాహన సౌకర్యం లేక పీహెచ్‌సీల పరిధిలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం, ర్యాపిడ్ ఫీవర్ సర్వేల నిర్వహణ, విద్యార్థుల ఆరోగ్య పరీక్షలకు వసతి గృహల పర్యటన, అత్యవసర వైద్య శిబిరాల ఏర్పాటు, బీసీడీఎస్ నుంచి పీహెచ్‌సీలకు మందుల రవాణా తదితర పనులు చేయలేని పరిస్థితి ఏర్పడుతోంది. వ్యాధుల సీజన్ ప్రారంభం కావడంతో పీహెచ్‌సీలకు అంబులెన్సు సౌకర్యం కల్పిస్తే అత్యవసర సమయంలో గిరిజనుల ప్రాణాలు కాపాడగలుగుతామని వైద్య సిబ్బంది పేర్కొంటున్నారు. తొమ్మిది పీహెచ్‌సీలకే అంబులెన్సులు ప్రతి ఏడాది వ్యాధుల సీజన్లో ఐటీడీఏ దాదాపు 24 పీహెచ్‌సీలకు అంబులెన్సు సౌకర్యం కల్పించి మిగతా పీహెచ్‌సీలను అంబులెన్సు ఉన్న కేంద్రాలకు అనుసంధానం చేసి గిరిజనులకు అత్యవసర వైద్యం అందిస్తోంది. పీహెచ్‌సీలకు అంబులెన్సులు ఎత్తివేయడంతో గిరిజనులకు అత్యవసర వైద్యం అందని ద్రాక్షగా మారింది. ఏజెన్సీలో ఎన్ఆర్హెచ్ఎంకు చెందిన మూడు అంబులెన్సులు జైనూర్, సిర్పూర్(యు), తిర్యాణి పీహెచ్‌సీల్లో ఉన్నాయి. అదికాక 2012-13 ఆర్థిక సంవత్సరంలో ఐఏపీ పథకంలో భాగంగా రూ.60 లక్షల వ్యయంతో కొనుగోలు చేసిన ఆరు అంబులెన్సుల్లో కాసిపేట, అంకోళి, గిన్నెధరి పీహెచ్‌సీలకు మూడు, ఆస్రా హెచ్ఎమ్ఆర్ఐ అనే సంస్థ అధినంలోని ఇంద్రవెల్లి, తిర్యాణి పీహెచ్‌సీలకు రెండు అంబులెన్సులు, మరొక్కటి హెల్త్ సెల్ నిర్వహణకు వాంకిడి పీహెచ్సీలో ఉంది. ఇలా ఏజెన్సీలోని 31 పీహెచ్‌సీల్లో తొమ్మిదింటికే ఇతర పథకాల ద్వారా వచ్చిన అంబులెన్సులు మినహా అంబులెన్సులు లేక పోవడంతో గిరిజనుల పాలిట శాపంగా మారుతుంది. అంబులెన్సు సౌకర్యాలు లేక పరిస్థితి విషమిస్తే ఎడ్లబండ్లే దిక్కు అవుతున్నాయని గిరిజనులు వాపోతున్నారు. సీజన్ మొదలు కావడంతో ఐటీడీఏ విడుదల చేసిన నిధులతో ప్రతి పీహెచ్‌సీకి అద్దె అంబులెన్సు సౌకర్యం కల్పించాలని గిరిజనులు కోరుతున్నారు. చర్యలు తీసుకుంటున్నాం.. - ప్రభాకర్‌రెడ్డి, ఏజెన్సీ అదనపు వైద్యాధికారి జనవరి నుంచి పీహెచ్‌సీలకు అంబులెన్సులు తొలగించబడ్డాయి. అద్దె అంబులెన్సుల కోసం వైద్యశాఖ రూ.80 లక్షలు నిధులు కేటాయించింది. గర్భిణీ, బాలింతల మరణాల నివారణకు కేటాయించిన అంబులెన్సుల ఖర్చులకు నిధులు ఉపయోగిస్తున్నాం. వ్యాధుల సీజన్ ప్రారంభం కావడంతో పీహెచ్‌సీలకు అంబులెన్సుల సౌకర్యం కల్పించడానికి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకుంటాం. -
అభివృద్ధి పనులకు వెంటనే క్లియరెన్స్
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులకు ఫారెస్ట్ క్లియరెన్స్ వచ్చేలా కృషి చేస్తానని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. జిల్లాను అన్నిరంగాల్లో ముందుకు తీసుకెళ్లడం తన బాధ్యత అని పేర్కొన్నారు. మంత్రిగా నియామకమైన తర్వాత ఆయన శనివారం తొలిసారిగా జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అహ్మద్‌బాబు జిల్లాలో నెలకొన్న సమస్యలు, పలు ప్రధాన శాఖల వారీగా పనితీరును మంత్రికి వివరించారు. సుమారు గంటన్నరపాటుగా శాఖలవారీగా అంశాలను కలెక్టర్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అంతకుముందు డీపీఆర్వో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను తిలకించారు. ఈ సందర్భంగా మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ.. గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకు శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు రాష్ట్ర స్థాయిలో చర్చిస్తానన్నారు. వ్యవసాయం, వైద్య, విద్య, వనరులపై దృష్టి సారిస్తానని, జిల్లా నుంచి మంత్రి లేకపోవడంతో ఇన్నాళ్లు అభివృద్ధిలో వెనుకబడిందని పేర్కొన్నారు. ప్రభుత్వ పనులకు ఫారెస్ట్ క్లియరెన్స్‌లు అవసరమైతే వెంటనే ఇవ్వడం జరుగుతుందని, దీనిపై ప్రిన్సిపల్ సెక్రెటరీలతో చర్చిస్తామని చెప్పారు. అంతకుముందు కలెక్టర్ అహ్మద్‌బాబు పలు సమస్యలు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా శాఖల్లో ఖాళీలు, ల్యాండ్ అక్విషన్, వైద్యం, విద్య, నీటి పారుదల, జిల్లా గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, ఉపాధి హామీ తదితర వాటిపై చర్చించారు. 34 మంది జిల్లా స్థాయి అధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, డీడీటీడబ్ల్యూ, డీటీవో, అదనపు డీఎంహెచ్‌వో లాంటి పోస్టులు ఖాళీగా ఉండడంతో ఒక్కొక్కరు మూడు చోట్ల ఇన్‌చార్జీలుగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఈసారి ఏడాది పొడవున విద్యపై దృష్టి పెట్టేలా ప్రణాళిక తయారు చేశామన్నారు. ముఖ్యంగా 7, 8, 9, 10 తరగతి విద్యార్థుల కోసం ప్రతి మండలానికి పర్యవేక్షణ కోసం ఇతర శాఖ అధికారిని నియమించినట్లు వివరించారు. భూములు లేక వివిధ ప్రాజెక్టు పనులు సైతం నిలిచిపోయాయన్నారు. ఆర్వోఎఫ్ఆర్ కింద 430 పట్టాలు పంపిణీ చేయడానికి అనుమతులు రావాల్సి ఉందన్నారు. మంచిర్యాలలో వ్యవసాయానికి సంబంధించి ఫర్టిలైజర్ రేక్ సెంటర్ ఏర్పాటు చేయాలన్నారు. గ్రామీణ నీటిసరఫరాలో పనిచేస్తున్న టెక్నికల్ కన్సల్టెన్సీలకు ఎనిమిది నెలల నుంచి వేతనాలు రావడం లేదని తెలిపారు. బాసర ట్రిపుల్ ఐటీలో వాటర్, విద్యుత్ సమస్యలు ఉన్నాయన్నారు. పర్యాటకానికి వచ్చేవారికి నిర్మల్, ఇచ్చోడ మధ్యలో హరిత హోటల్ ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. గాంధీపార్కులో శిల్పారామం ఏర్పాటు చేస్తున్నామని, ఇందుకు రూ. 2.05 కోట్లు పడుతుందన్నారు. 47 వేల రేషన్‌కార్డుల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు. అనంతరం పీహెచ్సీలో ఎక్కువ కాన్పులు చేయించిన సిబ్బందికి మంత్రి జోగు రామన్న రూ.5 వేల చెక్కులను అందజేశారు. కళ్యాణి (ఇచ్చోడ), కోవ లక్ష్మి (జైనూర్), అనితా (ఇంద్రవెల్లి), ప్రణీత (నార్నూర్), సింధు (కెరమెరి), దీప (వాంకిడి)కు చెక్కులిచ్చారు. సమావేశంలో బోథ్ ఎమ్మెల్యే సోయం బాపురావు, జేసీ లక్ష్మీకాంతం, ఐటీడీఏ పీవో జనార ్దన్ నివాస్, సబ్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఓఎస్డీ పనాసరెడ్డి, ఆర్డీవో సుధాకర్‌డ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
వైద్య ఉద్యోగులపై కలెక్టర్ ఆగ్రహం
పనితీరు మారకుంటే చర్యలు తప్పవని హెచ్చరిక రిమ్స్‌క్యాంపస్, న్యూస్‌లైన్: వైద్యాధికారులు, వైద్యశాఖ ఉద్యోగుల పనితీరుపై కలెక్టర్ సౌరభ్‌గౌర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్పురాకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. డీఎంహెచ్‌వో కార్యాలయ సమావేశ మందిరంలో వైద్యాధికారులు, ఎస్పీహెచ్వోలతో శుక్రవారం సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అత్యంత ముఖ్యమైన విధులు నిర్వర్తించాల్సిన వైద్య ఉద్యోగులు నిర్లక్ష్యంగా వ్యవహరించటం ఎంతమాత్రం సరికాదన్నారు. దోనుబాయి పీహెచ్‌సీని ఇటీవల అకస్మికంగా తనిఖీ చేయగా..ఆ సమయంలో తాళాలు వేసి ఉందన్నారు. 24 గంటలు తెరచి ఉండాల్సిన పీహెచ్‌సీకి తాళాలు వేయడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. మరికొన్ని పీహెచ్‌సీలను తనిఖీ చేయగా వైద్యులు, సిబ్బంది సరిగ్గా ఉండకపోవటం వంటి సమస్యలను గుర్తించానన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాల్సిన వారు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎలా అని నిలదీశారు. చాలామంది ఉద్యోగులు బాధ్యతరహితంగా పనిచేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎంహెచ్‌వో కార్యాలయంలోని గుమస్తాలను పిలిచి ఎవరెవరు ఏ విధులు నిర్వహిస్తున్నారో కలెక్టర్ ఆరా తీశారు. అయితే కొంతమంది తడబడటంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకపై ఎవరెవరు ఏ విధులు నిర్వహించాలో తానే నిర్ణయించి జాబ్ షీట్ వేస్తానని చెప్పారు. ‘మార్పు’ కార్యక్రమం బాగా నిర్వహించినందుకు జిల్లాకు రాష్ట్రంలో ద్వితీయ స్థానం దక్కిందన్నారు. ఇందుకు సీతంపేట, నరసన్నపేట పీహెచ్‌సీల సిబ్బంది బాగా సహకరించారని ఆయా పీహెచ్‌సీల వైద్యాధికారులను కలెక్టర్ అభినందించారు. అనంతరం ఎన్.ఆర్.హెచ్.ఎం వివరాలను పొందుపరిచేందుకు గాను కొత్తగా వచ్చిన ల్యాప్‌టాప్‌లను పీహెచ్‌సీల వైద్యాధికారులకు పంపిణీ చేశారు. కాగా సమావేశానికి వస్తున్నప్పడు కార్యాలయంలోని లిఫ్ట్ పని చేయకపోవటాన్ని గమనించి అసంతృప్తి వ్యక్తం చేశారు. రూ. 25 వేలు ఖర్చు పెట్టి లిఫ్ట్ బాగు చేసుకోకపోతే ఎలా అంటూ వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను ప్రశ్నించారు. అలాగే కార్యాలయంలో బూజు పట్టి ఉండటం చూసి ప్రశ్నించారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన అధికారులు ఉంటున్న కార్యాలయం ఇలా ఉండటం సరికాదని కలెక్టర్ వ్యాఖ్యానించారు. సమావేశంలో ఏజేసీ మహ్మద్ షరీఫ్, డీఎంహెచ్‌వో ఆర్.గీతాంజలి, ఏవో ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. -
ఎన్ఆర్హెచ్ఎం నిధులకు గ్రహణం
ఉట్నూర్, న్యూస్‌లైన్ : పీహెచ్సీ, సీహెచ్‌సీ, ఏరియా ఆస్పత్రుల్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. ప్రతి ఆర్థిక సంవత్సరం ఎన్ఆర్హెచ్ఎం(జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్) విడుదల చేసే నిధులకు గ్రహణం పట్టడమే అందుకు కారణం. 2013-14 ఆర్థిక సంవత్సరం ముగిసి నాలుగు నెలలు కావస్తున్నా నిధుల విడదల జాడ లేదు. మాతృ శిశు మరణాలను కనీస స్థాయికి తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం 2005లో ఎన్ఆర్హెచ్ఎంకు శ్రీకారం చుట్టింది. జిల్లాలోని ప్రతీ పీహెచ్‌సీకి రూ.1.75లక్షలు, సీహెచ్‌సీకి రెండు లక్షలు, ఏరియా ఆస్పత్రులకు రూ.ఐదు లక్షల చొప్పున కేటాయిస్తుంది. వీటిని ఆస్పత్రుల్లో మౌలిక వసతుల కల్పన, వైద్యశిబిరాలు, రోగుల తరలింపు, అత్యవసర మందుల కొనుగోళ్లకు వెచ్చించాల్సి ఉంటుంది. 2013-14 ఆర్థిక సంవత్సరం నిధుల విడుదల కోసం ఆయా వైద్య కేంద్రాలు ఎదురు చూస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా 72 పీహెచ్‌సీలకు గాను ఏజెన్సీలోని గిరిజన ప్రాంతాల్లో 31 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. వీటికి సుమారు రూ.1.26 కోట్లు విడుదల కావాల్సి ఉండగా.. రూ.54.25 లక్షలు ఏజెన్సీ పీహెచ్‌సీలకు విడుదల కావాలి. ఉట్నూర్, లక్సెట్టిపేట, బోథ్, ఆసిఫాబాద్, ఖానాపూర్, బెల్లంపల్లి, ముథోల్, సిర్పూర్(టి) సామాజిక ఆస్పత్రులకు రూ.రెండు లక్షల చొప్పున, నిర్మల్, మంచిర్యాల, భైంసా ఏరియా ఆస్పత్రులకు రూ.5లక్షల చొపుపన విడుదల కావాల్సి ఉంది. జిల్లాలోని 469 సబ్‌సెంటర్లకు అన్‌టైడ్ ఫండ్స్ రూ.పది వేల చొప్పున రూ.46.90లక్షలు విడుదలకు నోచుకొలేదు. ఏజెన్సీలో పలు పీహెచ్‌సీల్లో కిటికీలు, నీటి సమస్యలు, మరుగుదొడ్లు తదితర సమస్యలు తాండవం చేస్తున్నాయి. నిధులు విడుదల కాక సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. అత్యవసర మందులు లేక వైద్యం కోసం వచ్చేవారిని బయటే కొనుక్కోవాలని చెప్పాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు ఏజెన్సీలోని గిరిజనులు గ్రామాల్లో జ్వరాలు, అతిసార తదితర వ్యాధులతో సతమతం అవుతున్నారు. సర్కారు ఆస్పత్రుల్లో మందుల్లేక.. ప్రైవేటు వైద్యం చేయించుకునే స్థోమత లేక దేవుడిపై భారం వేసి మృత్యు ఒడికి చేరుతున్నారు. యూసీ ఖర్చులు, వసతుల నివేదికలు సంబంధిత ఆస్పతులు సకాలంలో పంపించకపోవడంతోనే నిధుల విడుదలలో జాప్యమైనట్లు తెలుస్తోంది. ఈ విషయమై జిల్లా ఏజెన్సీ అదనపు వైద్యాధికారి ప్రభాకర్‌రెడ్డిని సంప్రదించగా.. నిధులు విడుదల కాలేదని స్పష్టం చేశారు. పూర్తి స్థాయిలో నివేదికలు పంపించాలని వైద్యాధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. నిధులు విడుదలయ్యేలా చర్యలు చేపట్టామని తెలిపారు. -
అద్దె భవనాలతో అవస్థలు
సోంపేట : పీహెచ్‌సీలకు అనుబంధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండి వైద్య సేవలు అందించేందుకు ఉద్దేశించి ఏర్పాటు చేసిన సబ్ సెంటర్లు అద్దె కొంపల్లో నిర్వహిస్తుండడంతో పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందడం లేదు. సొంత భవనాలకు నోచుకోవడం లేదు. సోంపేట మండలంలో 12 ఆరోగ్య ఉప కేంద్రాలు ఉన్నాయి. వీటిలో ఏ ఒక్క ఆరోగ్య ఉప కేంద్రానికి కూడా సొంత భవనానికి నోచుకోలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. గ్రామాల్లో సరైన అద్దె భవనాలు కూడా దొరక్క పోవడంలో ఆరోగ్య సిబ్బంది విధులున ఇర్విహ ంచేందుకు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో రోగులకు సక్రమంగా వైద్య సేవలు అందడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సోంపేట- 1, సోంపేట-2, జింకిభద్ర, కొర్లాం, పాలవలస, కొరంజిభద్ర, మాఖన్నపురం, బారువ-1, బారువ-2, బట్టిగళ్లూరు, మామిడిపల్లి, తాళభద్ర గ్రామాల్లో ఆరోగ్య ఉప కేంద్రాలను నిర్వహిస్తున్నారు. ఆరోగ్య ఉప కేంద్రాలకు సొంత భవనాలు లేకపోవడంతో కొన్ని చోట్ల అద్దె భవనాల్లో, మరికొన్ని గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాల్లో వైద్య సేవలు అందిస్తున్నారు. గర్భిణులకు వైద్య సేవలు, విషజ్వరాలు, డయేరియా వంటి అత్యవసర సమయాల్లో రోగులు సోంపేట, బారువ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. భవనాలు నిర్మిస్తే అత్యవసర సమయాల్లో వైద్య సేవలు అందే అవకాశం ఉంటుందని పలువురు అంటున్నారు. అద్దె భవనాలు లేని గ్రామాల్లో కనీసం ఆరోగ్య సిబ్బంది మందులు ఉంచుకునే అవకాశం కూడా సాధ్యం కావ డం లేదు. ప్రభుత్వం వేలాది రూపాయల మందులు సరఫరా చేస్తున్న సొంత భవనాలు లేక పోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వివిధ గ్రామాల్లో గర్బిణులు, బాలింతలకు టీకాలు వేసేం దుకు అంగన్వాడీ కేంద్రాలను ఆశ్రయించాల్సి వస్తోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆరోగ్య ఉప కేంద్రాలకు సొంత భవనాలను ఏర్పాటు చేసి గ్రామాల్లోనే వైద్య సేవలు అందేవిధంగా చర్యలు చేపట్టాలని పలు గ్రామాలప్రజలు అధికారులను వేడుకుంటున్నారు. -
రైలు బెర్తులు కాదు...
సరుబుజ్జిలి, న్యూస్‌లైన్ :ఇదేమిటి ఒకరికొకరు ఎదురెదురుగా కూర్చున్నారు. ఇదేమైనా రైలు బెర్తులపై కూర్చుని ప్రయాణిస్తున్నారు అని మనం అనుకుంటే పప్పులో కాలేసినట్టే. సరుబుజ్జిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం ఆశ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. వసతి ఇరుకుగా ఉండడంతో తప్పని సరిస్థితుల్లో ఆస్పత్రి బెడ్లపై ఇలా ఎదురెదురుగా కూర్చున్నారు. వసతి సమస్య కారణంగా పీహెచ్సీలో ఏ సమావేశం నిర్వహించినా ఇలాంటి పరిస్థితే ఎదురవుతుంది -
రేపటి నుంచి చుక్కల మందు
ఆదిలాబాద్ రిమ్స్, న్యూస్‌లైన్: పోలియో రహిత సమాజం కోసం ప్రభుత్వం చేపట్టిన పల్స్ పోలియో కార్యక్రమం ఆదివారం జిల్లాలో ప్రారంభం కానుంది. ఇందుకోసం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. పల్స్ పోలియో చుక్కల డబ్బాలను ఆయా పీహెచ్‌సీలకు పంపిణీ చేశారు. మొదటి ఈనెల 19న బూత్‌లలో పోలియో చుక్కలు వేస్తారు. 20,21 తేదీల్లో సిబ్బంది ఇంటింటికి తిరుగుతారు. ఇంకా బస్టాండ్, రైల్వేస్టేషన్, ఆటోస్టాండ్, పారిశ్రామిక ప్రాంతాల్లో, ఇటుక బట్టీల వద్ద వలస కూలీల పిల్లలకు, జనావాసాలు ఉన్నచోట పోలియో చుక్కలు వేయనున్నారు. ఒక్కో బూత్‌లో నలుగురు సేవలందించనున్నారు. కాగా జిల్లాలో మూడేళ్ల నుంచి ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. 19న పట్టణంలోని హమాలివాడలోని అర్బన్ హెల్త్‌సెంటర్‌లో కలెక్టర్ బాబు కార్యక్రమం ప్రారంభించనున్నారు. -
నిధులివ్వరు ..నిర్వహణ ఎలా?
సాక్షి, రంగారెడ్డి జిల్లా: సర్కారు వైద్యశాలలకు సుస్తీ చేసింది. ఏడాది కాలంగా నిధుల లేమితో ఆస్పత్రుల నిర్వహణ గాడి తప్పింది. ప్రభుత్వం ఏటా విడుదల చేసే నిర్వహణ నిధులు ఈ ఏడు ఇప్పటికీ జాడలేవు. జాతీయ ఆరోగ్య మిషన్ కింద వివిధ పద్దుల కింద ఇచ్చే వార్షిక నిర్వహణ నిధులు వాస్తవానికి ఆరోగ్య కేంద్రాలకు ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే విడుదల చేయాలి. కానీ మరో రెండున్నర నెలల్లో ఆర్థిక సంవత్సరం ముగియనున్నప్పటికీ.. నిధుల ఊసే లేదు. అసలే అరకొర వైద్యం అందించే సర్కారు దవాఖానాల్లో నిధుల సమస్యను సాకుగా చూపిస్తున్న వైద్యశాఖ.. ఏకంగా ఆస్పత్రుల నిర్వహణను గాలికొదిలే సింది. రావాల్సింది రూ.1.02 కోట్లు జిల్లాలో 48 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీ) ఉన్నాయి. ఇవికాకుండా మరో 7 పట్టణ ఆరోగ్య కేంద్రాలు (యూహెచ్‌సీ) ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఆరోగ్య కేంద్రానికి ఏటా వివిధ పద్దుల కింద గరిష్టంగా రూ.1.75లక్షల నిధులు ఇస్తోంది. అవ సరాన్ని బట్టి నిధుల విడుదలలో హెచ్చుతగ్గులు పాటిస్తోంది. ఈ నిధులను ఆస్పత్రి అభివృద్ధి సొసైటీ ఖాతాలో జమ చేస్తుంది. ఈ నిధులతో ఆస్పత్రి అభివృద్ధి కార్యక్రమాలకోసం రూ.లక్ష వినియోగించాల్సి ఉంటుంది. వీటితో చిన్నపాటి మరమ్మతులు, పెయింటింగ్, పరికరాల కొనుగోలు తదితర వాటికి వినియోగించాలి. మరో రూ.50వేలు ఏడాది పొడవునా ఆస్పత్రి నిర్వహణకు ఖర్చు చేయాలి. మిగిలిన రూ.25వేలను ఆస్పత్రిలో పారిశుద్ధ్యం మెరుగుకోసం వెచ్చించాలి. అయితే ఈ ఏడాది మూడు పద్దులకు సంబంధించి రూ.1.02 కోట్లు రావాల్సిందిగా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ప్రణాళికలు రూపొందించి ప్రభుత్వానికి సమర్పించారు. అయితే నిధులు ఇప్పటికీ విడుదల కాకపోవడంతో ఆస్పత్రుల్లో పరిస్థితులు అధ్వానంగా, వైద్యసేవలు అరకొరగా మారాయి. ఆఖరి నిమిషంలో జేబుల్లోకి! ఆస్పత్రి అభివృద్ధి సొసైటీకి కేటాయించే నిధులను ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో విడుదల చేస్తే ప్రణాళికాబద్ధంగా ఖర్చవుతాయి. అయితే నిధుల విడుదల ప్రక్రియ గాడి తప్పుతుండడంతో ఒకవైపు ఆస్పత్రి నిర్వహణ అధ్వానంగా మారుతుండగా.. మరోవైపు ప్రజాధనం దుర్వినియోగమవుతోంది. మరో రెండున్నర నెలల్లో ఆర్థిక సంవత్సరం ముగియనుంది. దీంతో ఇప్పటికిప్పుడు నిధులు విడుదలచేస్తే.. ఆదరాబాదరగా నిధులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కొన్ని చోట్ల అక్రమాలు జరిగే అవకాశం ఉందని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. నకిలీ బిల్లులతో గతంలో అక్రమాలు వెలుగుచూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో త్వరలో నిధులు విడుదలైతే వినియోగంపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. -
పీహెచ్‌సీల్లో బయోమెట్రిక్
రిమ్స్ క్యాంపస్, న్యూస్‌లైన్: గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(పీహెచ్సీ) సకాలంలో తెరుచుకొని.. సిబ్బంది అందుబాటులో ఉండేందుకు వీలుగా ఆ శాఖ అధికారు లు చర్యలు చేపడుతున్నారు. రిజిస్టర్లలో హాజ రు నమోదు చేసే ప్రక్రియ స్థానంలో బయోమెట్రిక్ విధానాన్ని అమల్లోకి తేనున్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తొలి విడతగా 20 పీహెచ్‌సీల్లో ఈ విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుతం పీహెచ్‌సీల్లో వైద్యాధికారులతో సహా సిబ్బంది ఎప్పుడు వస్తున్నారో.. ఎప్పుడు పోతున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. హాజరు పట్టీల్లో మాత్రం సంతకాలు ఉంటున్నాయి. సమయపాలన లేకపోవడం వల్ల పేదలకు వైద్యం అందడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ పరిస్థితిని నివారించి రోగులకు సకాలంలో వైద్యం అందేలా చూసేందుకు బయోమెట్రిక్ విధానం అమలు చేయాలని నిర్ణయించారు. పీహెచ్‌సీల్లో ఏర్పాటు చేసే బయో మెట్రిక్ యంత్రాల్లో అక్కడి వైద్యాధికారితో సహా సిబ్బంది అందరూ వేలిముద్ర వేయాల్సిందే. అప్పుడే వారి హాజరు, సమయం నమోదవుతాయి. సీసీ కెమెరాల ఏర్పాటు సన్నాహాలు బయో మెట్రిక్ విధానం నుంచి తప్పించుకునేందుకు ఇప్పటికే అది అమల్లో ఉన్న ఇతర శాఖలు, కార్యాలయాల్లో ప్రయత్నాలు జరుగుతున్నాయి. వేలి ముద్ర వేసే నెపంతో యంత్రాన్ని గట్టిగా నొక్కడం, ఇష్టానుసారం స్వీచ్‌లు నొక్కేసి యంత్రం పాడయ్యేలా చేయడం చాలా చోట్ల జరుగుతోందని పలువురు అధికారులు పేర్కొంటున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని పీహెచ్‌సీల్లో ఏర్పాటు చేయనున్న బయోమెట్రిక్ యంత్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించారు. ఈ సీసీ కెమెరాల్లోని దృశ్యాలు ఆన్లైన్ ద్వారా డీఎంహెచ్‌వో కార్యాలయంలో రికార్డు అయ్యేవిధంగా ఏర్పాట్లు చేయనున్నారు. దీని వల్ల బయోమెట్రిక్ యంత్రాన్ని ఎవరు పాడు చేసినా తెలిసిపోతుంది. తొలి విడతలో అమలయ్యే పీహెచ్‌సీలు జిల్లాలో తొలి విడతగా 20 పీహెచ్‌సీల్లో బయోమెట్రిక్ విధానం అమల్లోకి రానుంది. ఈ పీహెచ్‌సీలను కూడా అధికారులు ఖరారు చేశారు. మాకివలస, తిలారు, పోలాకి, గుప్పెడుపేట, ఉర్లాం, జలుమూరు, అచ్చుతాపురం, సారవకోట, దూసి, తొగరాం, గుత్తావల్లి, ఎల్.ఎన్.పేట, అక్కులపేట, సరుబుజ్జిలి, ఎచ్చెర్ల, పొన్నాడ, సింగుపురం, గార, కళింగపట్నం, శ్రీకూర్మం ఆరోగ్య కేంద్రాలు ఈ జాబితాలో ఉన్నాయి. త్వరలోనే అమలు:డీఎంహెచ్‌వో జిల్లాలోని 20 పీహెచ్‌సీల్లో తొలివిడతగా బయోమెట్రిక్ విధానాన్ని త్వరలోనే అమలు చేయనున్న విషయాన్ని డీఎంహెచ్‌వో గీతాంజలి ధ్రువీకరించారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తునామన్నారు. యంత్రాల కోసం ఇండెంట్ పెట్టామని, అవి రాగానే అమర్చి పూర్తిస్థాయిలో అమలు చేస్తామన్నారు. -
స్కానింగ్ సెంటర్లను నిరంతరం పర్యవేక్షించాలి
విజయనగరం ఆరోగ్యం,న్యూస్‌లైన్: స్కానింగ్ సెంటర్లను నిరంతరం పర్యవేక్షించాలని డీఎంహెచ్ఓ స్వరాజ్యలక్ష్మి సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో మంగళవారం ఎస్పీహెచ్ఓలతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పీహెచ్సీ సిబ్బందితో సమావేశం నిర్వహించి, వాటిలో చర్చించిన మినిట్స్ వివరాలను పంపించాలని కోరారు. జనవరి 19నుంచి పల్స్ పోలియో కార్యక్రమం ఉంటుందని, దీనికి సంబంధించిన ప్రణాళికను సిద్ధం చేయాలని చెప్పారు. ఇటుక బట్టీలు, ప్రాజెక్టుల వద్ద పనిచేస్తున్న వలస కుటుంబీకుల పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఈ ఏడాది పోలియో కేసు నమోదు కాకుండా చూడగలిగితే పోలియో రహిత దేశంగా మన దేశాన్ని ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రకటిస్తుందని చెప్పారు. నిబంధనలను అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆస్పత్రుల్లో ప్రసవాలు అధికంగా జరిగేలా చూడాలన్నారు. ఇంటి ప్రసవాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈసమావేశంలో డీటీసీఓ రామారావు, డీఐఓ కిషోర్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
పీహెచ్‌సీల్లో సిబ్బంది ఇష్టారాజ్యం
-
సర్కార్ వైద్యం అరకొరే..
నర్సాపూర్, న్యూస్‌లైన్: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యం అందని ద్రాక్షగానే మారింది. పలు పీహెచ్సీలో వైద్యుల కొరత కారణంగా... మరికొన్ని కేంద్రాల్లో వైద్యులు, సిబ్బంది ఉన్నా వారి నిర్లక్ష్యం కారణంగా వైద్య సేవలు అందడం లేదు. పీహెచ్‌సీలు రోజూ ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు అవుట్ పేషెంట్లకు వైద్యం అందించాలి. ఈ నిబంధన ఎక్కడా అమలు కావడం లేదు. ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య వైద్య సేవలు ఆరంభమై మధ్యాహ్నం 2 గంటలలోపు ముగిస్తున్నారు. మధ్యాహ్నం తర్వాత వెళ్తే చాలా పీహెచ్‌సీలకు తాళాలే దర్శనమిస్తున్నాయి. సెలవు రోజుల్లోనూ తెరుస్తారో లేదో తెలియని పరిస్థితి. నియోజక వర్గంలోని చాలా పీహెచ్సీలలో పనిచేసే వైద్యులు స్థానికంగా ఉండకపోవడమే గాక సమయ పాలన పాటించడం లేదన్న ఆరోపణలున్నాయి. వైద్యం కోసం ఎంతో ఆశతో వచ్చే పేదలు పీహెచ్‌సీల దుస్థితిని చూసి వెనుదిరుగుతున్నారు. నర్సాపూర్‌లో ఉంటూ పీహెచ్‌సీలను పర్యవేక్షించాల్సిన అధికారి సైతం స్థానికంగా ఉండకపోవడం గమనార్హం. నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి పీహెచ్సీలో ఇద్దరు డాక్టర్లు ఉండగా ఒకరు సెలవుల్లో వెళ్లగా మరొకరు వారానికి మూడు రోజులు దౌల్తాబాద్ పీహెచ్‌సీకి డిప్యుటేషన్‌పై వెళ్తున్నారు. ఆ డాక్టర్ వెళ్లే మూడురోజులు రెడ్డిపల్లి పీహెచ్సీలో ఏఎన్ఎంలే వైద్యం చేస్తారు. దౌల్తాబాద్ పీహెచ్సీలో వారంలో మూడు రోజులు పోను మిగతా రోజులు సిబ్బందే వైద్యమందిస్తుంటారు. రెడ్డిపల్లి పీహెచ్‌సీకి పక్కా భవనం ఉన్నా అక్కడ డెలివరీలు చేయడానికి ప్రాధాన్యం ఇవ్వడం లేదు. హత్నూరలో 24 గంటల పీహెచ్సీలో డాక్టరు లేకపోవడంతో సీనియర్ నర్సు వైద్యం చేస్తున్నారు. కొల్చారం, రంగంపేట పీహెచ్సీలలో వైద్యులు ఒక్కొక్కరు మాత్రమే ఉండడంతో వైద్య సేవలు పూర్తి స్థాయిలో అందడం లేదు. డెలివరీ కోసం కొల్చారం వస్తే మెదక్‌కు పంపుతూ చేతులు దులుపుకుంటున్నారు. రంగంపేటలో సాయంత్రమైతే వైద్యసేవలకు బ్రేకు పడుతుంది. కౌడిపల్లిలో 24 గంటల పీహెచ్సీ ఉన్నా రాత్రిపూట ఇద్దరు డాక్టర్లు ఉండకపోవడంతో ఏఎన్ఎంలే వైద్య సేవలందిస్తున్నారు. వెల్దుర్తిలో ఇద్దరు వైద్యులున్నా వంతుల వారీగా విధులు నిర్వహిస్తున్నట్టు సమాచారం. ఇక్కడ సెలవు రోజుల్లో పీహెచ్‌సీని తెరుస్తారో, తెరువరో తెలియని పరిస్థితి. శివ్వంపేటలో ఒకే డాక్టరు ఉండడంతో డెలివరీలు, కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల జోలికి వెళ్లడం లేదు. -
వైద్యం.. మృగ్యం
సాక్షి, సంగారెడ్డి:జబ్బు చేయకూడదు. అనుకోని ఆపద రాకూడదు. వస్తేగిస్తే ఆదివారం మాత్రం రాకూడదు. రాత్రివేళ అస్సలు రాకూడదు. సెలవు రోజుల్లో జబ్బు చేస్తే ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందే. వైద్యుల గైర్హాజరీ రోగుల ప్రాణాలను తోడేస్తోంది. శనివారం నుంచే వైద్య నారాయణలు పత్తా లేకుండాపోతున్నారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులు, విష పురుగుల కాటుకు గురైన బాధితులు, ప్రసవ వేదనతో బాధపడే గర్భిణులకు సకాలంలో అత్యవసర వైద్య సేవలందడం లేదు. పీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రుల్లో వైద్యులు అందుబాటులో లేరని రోగులను జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఇక్కడ సైతం నాడి పట్టి పరీక్షించకుండానే ‘గాంధీకి పోండి..’ అని రిఫర్ చేసి చేతులు దులుపుకుంటున్నారు. అక్కడికి చేరుకునేలోపే రోగుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక ఉన్న వైద్యులు సర్కారీ వైద్యం కంటే సొంత క్లినిక్‌లపైనే మక్కువ చూపుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. క్లస్టర్లు.. కష్టాలు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో 10 క్లస్టర్ హెల్త్ అండ్ న్యూట్రీషియన్ సెంటర్లున్నాయి. ఒక్కో క్లస్టర్‌కు సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ నేతృత్వం వహిస్తున్నారు. క్లస్టర్ పరిధిలోని పీహెచ్సీ, సీహెచ్‌సీ, సబ్ సెంటర్ల పనితీరును నిరంతరం సమీక్షించడం, స్థానిక ప్రజలకు మెరుగైన వైద్య సేవలందే విధంగా పర్యవేక్షణ జరపడం క్లస్టర్ వైద్యాధికారుల బాధ్యత. జిల్లాలో 66 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(పీహెచ్‌సీలు), 2 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు(సీహెచ్‌సీ)న్నాయి. సాధారణ రోజుల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు, సెలవు రోజుల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పీహెచ్‌సీలు పనిచేయాల్సి ఉండగా.. ఎక్కడా నిర్దేశించిన వేళల్లో వైద్య సేవలందడం లేదు. ఇద్దరు వైద్యాధికారులున్న పీహెచ్‌సీల్లో సైతం సెలవు రోజుల్లో కనీసం ఒక్కరైనా విధులకు హాజరు కావడంలేదు. సాధారణ రోజుల్లో ఒంటి పూట డ్యూటీలకే పరిమితమవుతున్నారు. వైద్యుల గైర్హాజరీతో స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, అటెండర్లు, స్వీపర్లు వచ్చి రాని వైద్యంతో నెట్టుకొస్తున్నారు. పీహెచ్‌సీల్లో ప్రసవాలు, కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు జరగడం లేదు. ఆరోగ్య ఉప కేంద్రాల్లో ఏఎన్ఎంలు, ఆశా వర్కర్ల పనితీరు సైతం గాడిలో పడడం లేదు. టీకాలు వేయడం, స్థానికుల ఆరోగ్య పరిరక్షణ చర్యలు తీసుకోవడంలో వీరి పాత్ర కీలకం. కానీ, జిల్లాలో 525 ఉప కేంద్రాలున్నా వైద్య సేవలందక మాతా శిశు మరణాల రేటు తగ్గడం లేదు. ఏఎన్ఎంలు, ఎంపీహెచ్‌ఓ, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు, హెల్త్ సూపర్వైజర్లు, ఆశా వర్కర్ల పనితీరును నిరంతరం పర్యవేక్షించాల్సిన స్థానిక పీహెచ్సీ వైద్యాధికారులే గైర్హాజరు అవుతుండడంతో దిగువ స్థాయిలో ఇష్టారాజ్యం నెలకొంది. సంగారెడ్డిలోని జిల్లా కేంద్ర ఆస్పత్రితో పాటు వివిధ ప్రాంతాల్లో ఉన్న 12 ఏరియా ఆస్పత్రులు రోగులను రిఫర్ చేస్తూ వదిలించుకోడానికే పెద్దపీట వేస్తున్నాయి. ఈ ఆస్పత్రుల్లో సైతం 24 గంటల సేవలు మృగ్యమయ్యాయి. ఆస్పత్రి సేవల జిల్లా కో-ఆర్డినేటర్(డీసీహెచ్ఎస్) వీణాకుమారి ఫోన్లో సైతం అందుబాటులో ఉండరని విమర్శలున్నాయి. కాగా గ్రామీణ ప్రాంతాల్లో కనీసం రెండేళ్లు వైద్య సేవలందిస్తేనే పీజీ వైద్య విద్యకు అర్హత లభిస్తుంది. పీజీ అర్హత కోసమే ప్రభుత్వ సర్వీసుల్లో చేరి విధులకు గైర్హాజరవుతున్న వైద్యాధికారులు కోకొల్లలుగా ఉన్నారు.