సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(పీహెచ్‌సీ), సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో (సీహెచ్‌సీ) వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, ఫార్మసీ సిబ్బంది పోస్టులు భారీ సంఖ్యలో ఖాళీగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి ఫగన్ సింగ్ కులస్తే తెలిపారు. శుక్రవారం లోక్‌సభలో వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ వై.ఎస్.అవినాష్ రెడ్డి, టీఆర్‌ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు ఆయన రాతపూర్వకం గా సమాధానం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లోని పీహెచ్‌సీల్లో 2270 డాక్టర్ పోస్టులకు గాను 858 ఖాళీలు ఉన్నాయని, పీహెచ్‌సీ, సీహెచ్‌సీల్లో 1279 ఫార్మసిస్ట్ పోస్టులకు గాను 328 ఖాళీలు ఉన్నాయని తెలిపారు. 1053 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు గాను 277 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. 2300 నర్సింగ్ పోస్టులకు గాను 294 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు వివరించారు.
తెలంగాణలో..: తెలంగాణలోని పీహెచ్‌సీల్లో 1318 డాక్టర్ పోస్టులకు గాను 294 ఖాళీలు ఉన్నట్లు తెలిపారు. అలాగే పీహెచ్‌సీ, సీహెచ్‌సీల్లో1799 ఫార్మసిస్ట్ పోస్టులకు గాను 237 ఖాళీలు ఉన్నాయని వివరించారు. 765 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు గాను 199 ఖాళీలు ఉన్నట్టు తెలిపారు. 1666 నర్సింగ్ సిబ్బంది పోస్టులకు గాను 213 ఖాళీలు ఉన్నట్టు తెలిపారు.
తెలుగు రాష్ట్రాల్లో భారీగా వైద్య సిబ్బంది ఖాళీలు
Published Sat, Dec 3 2016 4:00 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM
Advertisement
Advertisement