doctors scarecity
-
తెలుగు రాష్ట్రాల్లో భారీగా వైద్య సిబ్బంది ఖాళీలు
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(పీహెచ్సీ), సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో (సీహెచ్‌సీ) వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, ఫార్మసీ సిబ్బంది పోస్టులు భారీ సంఖ్యలో ఖాళీగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి ఫగన్ సింగ్ కులస్తే తెలిపారు. శుక్రవారం లోక్‌సభలో వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ వై.ఎస్.అవినాష్ రెడ్డి, టీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు ఆయన రాతపూర్వకం గా సమాధానం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లోని పీహెచ్‌సీల్లో 2270 డాక్టర్ పోస్టులకు గాను 858 ఖాళీలు ఉన్నాయని, పీహెచ్సీ, సీహెచ్‌సీల్లో 1279 ఫార్మసిస్ట్ పోస్టులకు గాను 328 ఖాళీలు ఉన్నాయని తెలిపారు. 1053 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు గాను 277 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. 2300 నర్సింగ్ పోస్టులకు గాను 294 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు వివరించారు. తెలంగాణలో..: తెలంగాణలోని పీహెచ్‌సీల్లో 1318 డాక్టర్ పోస్టులకు గాను 294 ఖాళీలు ఉన్నట్లు తెలిపారు. అలాగే పీహెచ్సీ, సీహెచ్‌సీల్లో1799 ఫార్మసిస్ట్ పోస్టులకు గాను 237 ఖాళీలు ఉన్నాయని వివరించారు. 765 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు గాను 199 ఖాళీలు ఉన్నట్టు తెలిపారు. 1666 నర్సింగ్ సిబ్బంది పోస్టులకు గాను 213 ఖాళీలు ఉన్నట్టు తెలిపారు. -
‘సింగరేణి’లో వైద్యులను నియమించాలి
ప్రభుత్వానికి యాజమాన్యం లేఖ సాక్షి, హైదరాబాద్: సింగరేణి ఆసుపత్రుల్లోనూ తప్పనిసరి వైద్యులను నియమించాలని ఆ సంస్థ యాజమాన్యం తెలంగాణ ప్రభుత్వానికి రాసిన ఒక లేఖలో కోరింది. ఐదుగురు ఆర్థోపెడిక్ సర్జన్లను, ఏడుగురు జనరల్ ఫిజీషియన్లు, ముగ్గురు రేడియాలజిస్టులు, ఆరుగురు గైనకాలజిస్టులు, ఆరుగురు జనరల్ సర్జన్లు, నలుగురు కంటి వైద్య నిపుణులు, ఇద్దరు ఛాతీ వైద్య నిపుణులను... మొత్తం 33 మంది స్పెషలిస్టు డాక్టర్లను ఏడాదిపాటు తప్పనిసరి నిబంధన కింద నియమించాలని విజ్ఞప్తి చేసింది. తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏటా సుమారు 600 మంది పీజీ, 130 మంది పీజీ డిప్లొమా వైద్యులు తప్పనిసరి వైద్య సేవలు అందిస్తున్నారని, ఈ నేపథ్యంలో తమ ఆసుపత్రులకూ అవకాశం కల్పించాలని కోరింది. సింగరేణి కాలరీస్ ఉద్యోగులకు వైద్య సేవలు అందించడానికి అక్కడ ఏడు ప్రాంతీయ ఆసుపత్రులు, 24 డిస్పెన్సరీలు ఉన్నాయి. వాటిల్లో 200 మంది వైద్యులు పనిచేస్తున్నారు. సింగరేణి కోరిన అంశాలపై తెలంగాణ ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఒకవేళ సానుకూలంగా నిర్ణయం తీసుకుంటే వచ్చే ఏడాది పీజీ తప్పనిసరి కౌన్సెలింగ్‌లో సింగరేణికి అవకాశం కల్పిస్తారు.