ఇప్పుడు మేల్కొన్నారు!
ఇప్పుడు మేల్కొన్నారు!
Published Sat, Dec 31 2016 1:09 AM | Last Updated on Tue, Oct 9 2018 7:08 PM
అనంతపురం మెడికల్ : ఇన్నాళ్లూ నిద్రమత్తులో ఉన్న వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఇప్పుడు మేల్కొన్నారు. రెండ్రోజులుగా తెగ హడావుడి చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. జిల్లాలో 80 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. కొత్తగా అనంతపురం రూరల్ మండలం కురుగుంట, విడపనకల్లు మండలం పాల్తూరు, యాడికి మండలం రాయలచెరువు, ముదిగుబ్బ మండలం బి.పప్పూరు, బెళుగుప్ప మండలం శ్రీరంగాపురం, గోరంట్ల మండం కొండాపురంలో పీహెచ్‌సీలు నిర్మించారు. వీటిలో ఒక్కో పీహెచ్‌సీలో ఇద్దరు మెడికల్ ఆఫీసర్లు, ముగ్గురు స్టాఫ్‌నర్సులు, ఒక ల్యాబ్‌టెక్నీషియన్, ఒక ఫార్మసిస్ట్ పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. దీంతో ఈ ఏడాది ఆగస్టులో నోటిఫికేష¯ŒS ఇచ్చారు. 14 వైద్యుల పోస్టులకు 79, స్టాఫ్‌నర్సు పోస్టులు 21కి గానూ 1319, ఏడు ల్యాబ్‌టెక్నీషియన్ పోస్టులకు 420, ఏడు ఫార్మసిస్ట్‌కు 305 మంది దరఖాస్తు చేసుకున్నారు. సెప్టెంబర్ నాటికే స్క్రూటినీని అధికారులు ముగించారు. చేయాల్సిందల్లా జాబితాను ఒకసారి పరిశీలించి మెరిట్ ప్రకటించడమే. అయితే అధికారులు అందుబాటులో లేరని ఇన్నాళ్లూ దరఖాస్తులను మూలకు పెట్టేశారు. తిరిగి రెండ్రోజుల నుంచి స్క్రూటినీ ప్రక్రియను మళ్లీ ప్రారంభించారు. స్క్రూటినీని ఫైనల్ చేయడం కోసం డీఐఓ డాక్టర్ పురుషోత్తం, పీఓడీటీటీ సుజాత, డీఎంఓ దోసారెడ్డి, ఏఓ భీమానాయక్, డెమో హరిలీలాకుమారిని నియమించారు. శుక్రవారం పీఓడీటీటీ సుజాత ’స్వాస్థ విద్యావాహిని’ కార్యక్రమ ఏర్పాట్ల కోసం వెళ్లిపోగా.. దోసారెడ్డి, పురుషోత్తం వారి పనుల్లో వారు నిమగ్నమయ్యారు.
Advertisement
Advertisement