posts fillup
-
గురుకుల కొలువుల్లో ‘ఆమె’కు అందలం!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మహిళా అభ్యర్థులకు అద్భుత అవకాశంలా పరిణమించింది. సాధారణంగా ఉద్యోగాల భర్తీలో మహిళలకు 33శాతం పోస్టులు రిజర్వ్ చేస్తూ ప్రభుత్వం అవకాశం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. కానీ తాజాగా తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు(టీఆర్‌ఈఐఆర్‌బీ) ద్వారా భర్తీ చేస్తున్న గురుకుల విద్యా సంస్థల్లో మహిళలకు అత్యంత ప్రాధాన్యత దక్కింది. నూతన జోనల్ విధానం అమలు తర్వాత రాష్ట్రంలోని గురుకుల విద్యాసంస్థల్లో ఏకంగా 9,231 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చిం ది. ఇందులో భాగంగా టీఆర్‌ఈఐఆర్‌బీ ఈనెల 5వ తేదీన ఒకేసారి 9 నోటిఫికేషన్లను వెబ్‌నోట్ ద్వారా విడుదల చేసింది. తాజాగా పూర్తిస్థాయి నోటిఫికేషన్లను కూడా గురుకుల నియామకాల బోర్డు వెబ్సైట్లో అందుబాటులోకి తెచ్చిం ది. ప్రకటించిన పూర్తిస్థాయి నోటిఫికేషన్ల ద్వారా 9,210 పోస్టులు మాత్రమే భర్తీ చేయనుంది. ఈ ఉద్యోగ ఖాళీల్లో మహిళలకు ఏకంగా 77.62శాతం పోస్టులు రిజర్వ్ కావడం గమనార్హం. ఆర్ట్ టీచర్ కేటగిరీలో 2 పోస్టులు తగ్గగా... క్రాఫ్ట్ టీచర్ కేటగిరీలో 4 పోస్టులు, టీజీటీ కేటగిరీలో 14 పోస్టులు తగ్గాయి. అక్కడా ఇక్కడా అత్యధికమే... గురుకుల విద్యా సంస్థల్లో బాలుర గురుకులాలు, బాలికల గురుకులాలు విడివిడిగా ఉన్నాయి. రెండు కేటగిరీల్లో ఉన్న విద్యా సంస్థల్లోనూ మహిళలకు అత్యధిక పోస్టులు రిజర్వ్ అయ్యాయి. బాలికల విద్యా సంస్థల్లో ఉన్న ఉద్యోగాలన్నీ పూర్తిగా మహిళలతోనే భర్తీ చేయాలనే నిబంధన ఉంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా బాలికల గురుకుల విద్యా సంస్థల్లో 4,647 ఉద్యోగాల భర్తీకి టీఆర్‌ఈఐఆర్‌బీ నోటిఫికేషన్లో ప్రకటించింది. ఇక బాలుర విద్యా సంస్థల్లో 4,563 ఉద్యోగ ఖాళీలను చూపగా... ఇందులో జనరల్ కేటగిరీకి కేవలం 2,061 పోస్టులు మాత్రమే రిజర్వ్ కాగా... మిగతా 2,502 పోస్టులు మహిళలకు రిజర్వ్ అయ్యాయి. ఈ లెక్కన జనరల్ కేటగిరీకి 45.17శాతం పోస్టులు, మహిళలకు 54.83శాతం పోస్టులు దక్కాయి. నూతన జోనల్ విధానం అమల్లోకి రావడంతో రాష్ట్రంలో నియామకాల ప్రక్రియ రోస్టర్ పాయింట్ మొదటి నుంచి ప్రారంభమైంది. దీనికి తోడు మహిళలకు హారిజాంటల్ విధానంలో పోస్టుల కేటాయింపు జరగడంతో మహిళలకు ఎక్కువ పోస్టులు కేటాయించినట్లయింది. గురుకుల విద్యా సంస్థల్లో మొత్తం 9,210 పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల కాగా.. ఇందులో మహిళలకు 7,149 పోస్టులు రిజర్వ్ కాగా... జనరల్ కేటగిరీలో 2,061 పోస్టులు మాత్రమే రిజర్వ్ అయ్యాయి. ప్రకటించిన మొత్తం పోస్టుల్లో జనరల్ కేటగిరీకి కేవలం 22.38శాతం పోస్టులు దక్కగా... మహిళలకు మాత్రం 77.62శాతం ఉద్యోగాలకు దక్కనున్నాయి. ఇక అర్హత పరీక్షల్లో మెరిట్ సాధించిన వారిలో మహిళలుంటే జనరల్ కేటగిరీలోని పోస్టులు సైతం వారికి దక్కే అవకాశం ఉంది. ఈలెక్కన ప్రస్తుతం రిజర్వ్ అయిన పోస్టులకంటే మరిన్ని ఎక్కువ ఉద్యోగాలు మహిళలకు దక్కే అవకాశం ఉంది. -
ఇష్టమైన చోట డాక్టర్లకు పోస్టింగ్.. వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: కొత్తగా నియమితులయ్యే డాక్టర్లకు వారికిష్టమైన చోట పోస్టింగ్‌లు ఇవ్వాలని వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయించింది. భర్తీకి ముందు నిర్వహించే కౌన్సెలింగ్ సందర్భంగా డాక్టర్లు ఆప్షన్లు సమర్పిస్తే అందులో ప్రాధాన్యం ప్రకారం పోస్టింగ్ లభిస్తుందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ప్రజారోగ్య సంచాలకుడి పరిధిలో 751 సివిల్ అసిస్టెంట్ సర్జన్, తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలో 211 జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం)లో 7 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి గత నెలలో రాష్ట్ర మెడికల్, హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేయడం తెలిసిందే. ప్రస్తుతం ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ జరుగుతుంది. ఈ 14న సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. తదుపరి దరఖాస్తుల గడువు పొడిగించే అవకాశం లేదని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 1,600 మంది దరఖాస్తు... మొత్తం 969 పోస్టులకుగాను ఇప్పటివరకు 1,600 మంది డాక్టర్లు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. గడువు ముగిసే నాటికి మొత్తం 3 వేల వరకు దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. అంటే ఒక పోస్టుకు ముగ్గురు పోటీ పడే అవకాశముంది. అయితే అనుకున్న స్థాయిలో దరఖాస్తులు వచ్చే అవకాశాలు కనిపించడంలేదు. అందుకు ప్రైవేట్ ప్రాక్టీస్ రద్దు నిబంధన ప్రధాన అడ్డంకిగా భావిస్తున్నారు. ఎంబీబీఎస్ పూర్తి చేసిన వారిలో చాలా మంది పీజీ మెడికల్ కోర్సు చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఒకవేళ ఇప్పుడు ఈ పోస్టులో చేరితే మూడేళ్ల వరకు పీజీ చేసే అవకాశం ఉండదు. ఎందుకంటే వారు ఉద్యోగంలో చేరాక ఇన్‌సర్వీస్ కోటా పీజీ మెడికల్ సీట్లకు అర్హత పొందాలంటే మూడేళ్లు ఆగాలి. ఆలోగా నీట్లో పీజీ సీటు వస్తే చేరేందుకు ఉద్యోగాన్ని వదులుకోవాల్సిందేనని అధికారులు అంటున్నారు. ఈ కారణాలతో కొందరు ఎంబీబీఎస్ అభ్యర్థులు దరఖాస్తుకు దూరంగా ఉంటున్నారని తెలిసింది. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ వారికే ఎక్కువ చాన్స్... దరఖాస్తు గడువు ముగిసిన దాదాపు నెలకు అంటే వచ్చే నెల రెండో వారంలో పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను బోర్డు ప్రకటించనుంది. రూల్ ఆఫ్ రిజర్వేషన్, సర్వీస్ రూల్స్, అనుభ వం, ఔట్సోర్సింగ్ లేదా కాంట్రాక్టు వెయిటేజీని అనుసరించి అభ్యర్థులను ఎంపిక చేయనుంది. దరఖాస్తు చేసుకుంటున్న వారిలో ఎక్కువ మంది ఇప్పటికే కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నందున వారే ఎక్కువగా ఈ పోస్టులకు ఎంపికయ్యే అవకాశం ఉంది. -
మెసెంజర్ పోస్ట్‌కు పీహెచ్డీ అభ్యర్థులు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని పోలీసుశాఖలో పోస్ట్‌మ్యాన్ తరహా విధులు నిర్వహించడానికి జారీ చేసిన 62 పోస్టులకు ఏకంగా 93,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. పోలీసు టెలికం విభాగం పంపే సందేశాలను ఒక ఆఫీసు నుంచి మరో ఆఫీసుకు అందించే మెసెంజెర్ (పోస్టుమ్యాన్) ఉద్యోగాలకు రాష్ట్రసర్కారు నోటిఫికేషన్ ఇచ్చింది. కనీస విద్యార్హత ఐదో తరగతి. పీహెచ్డీ చేసిన 3,700 మంది ఈ పోస్టుకు దరఖాస్తుచేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న వారిలో 28,000 మంది పోస్టు గ్రాడ్యుయేట్లు, 50 వేల మంది గ్రాడ్యుయేట్లున్నారు. ఇక 5 నుంచి 12వ తరగతి వరకు విద్యార్హత ఉన్నవారు 7,400 మంది ఉన్నారు. నెలజీతం రూ.20 వేలు. ఎక్కువ దరఖాస్తులు రావడంతో రాత పరీక్ష నిర్వహించాలని అధికారులు యోచిస్తున్నారు. -
సబ్ఇన్స్పెక్టర్ పోస్టులు భర్తీ చేయండి
భువనేశ్వర్ : రాష్ట్ర పోలీసు విభాగంలో ఖాళీగా ఉన్న సబ్ఇన్స్పెక్టర్, పోలీసు డ్రైవర్ పోస్టుల్ని తక్షణమే భర్తీ చేయాలని ఆ విభాగం మంత్రిగా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ బుధవారం ఆదేశించారు. రాష్ట్ర పోలీస్ విభాగంలో 184 సబ్ఇన్స్పెక్టర్, 231 పోలీస్డ్రైవర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు ప్రకటించారు. వీటిలో 92 సబ్ఇన్స్పెక్టర్, 231 పోలీస్ డ్రైవర్ ఉద్యోగాల ఖాళీల్ని భర్తీ చేసేందుకు ఒడిశా స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ తక్షణమే కార్యాచరణ ప్రారంభించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. -
ఇప్పుడు మేల్కొన్నారు!
అనంతపురం మెడికల్ : ఇన్నాళ్లూ నిద్రమత్తులో ఉన్న వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఇప్పుడు మేల్కొన్నారు. రెండ్రోజులుగా తెగ హడావుడి చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. జిల్లాలో 80 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. కొత్తగా అనంతపురం రూరల్ మండలం కురుగుంట, విడపనకల్లు మండలం పాల్తూరు, యాడికి మండలం రాయలచెరువు, ముదిగుబ్బ మండలం బి.పప్పూరు, బెళుగుప్ప మండలం శ్రీరంగాపురం, గోరంట్ల మండం కొండాపురంలో పీహెచ్‌సీలు నిర్మించారు. వీటిలో ఒక్కో పీహెచ్సీలో ఇద్దరు మెడికల్ ఆఫీసర్లు, ముగ్గురు స్టాఫ్‌నర్సులు, ఒక ల్యాబ్‌టెక్నీషియన్, ఒక ఫార్మసిస్ట్ పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. దీంతో ఈ ఏడాది ఆగస్టులో నోటిఫికేష¯ŒS ఇచ్చారు. 14 వైద్యుల పోస్టులకు 79, స్టాఫ్‌నర్సు పోస్టులు 21కి గానూ 1319, ఏడు ల్యాబ్‌టెక్నీషియన్ పోస్టులకు 420, ఏడు ఫార్మసిస్ట్‌కు 305 మంది దరఖాస్తు చేసుకున్నారు. సెప్టెంబర్ నాటికే స్క్రూటినీని అధికారులు ముగించారు. చేయాల్సిందల్లా జాబితాను ఒకసారి పరిశీలించి మెరిట్ ప్రకటించడమే. అయితే అధికారులు అందుబాటులో లేరని ఇన్నాళ్లూ దరఖాస్తులను మూలకు పెట్టేశారు. తిరిగి రెండ్రోజుల నుంచి స్క్రూటినీ ప్రక్రియను మళ్లీ ప్రారంభించారు. స్క్రూటినీని ఫైనల్ చేయడం కోసం డీఐఓ డాక్టర్ పురుషోత్తం, పీఓడీటీటీ సుజాత, డీఎంఓ దోసారెడ్డి, ఏఓ భీమానాయక్, డెమో హరిలీలాకుమారిని నియమించారు. శుక్రవారం పీఓడీటీటీ సుజాత ’స్వాస్థ విద్యావాహిని’ కార్యక్రమ ఏర్పాట్ల కోసం వెళ్లిపోగా.. దోసారెడ్డి, పురుషోత్తం వారి పనుల్లో వారు నిమగ్నమయ్యారు.