
భువనేశ్వర్ : రాష్ట్ర పోలీసు విభాగంలో ఖాళీగా ఉన్న సబ్‌ఇన్‌స్పెక్టర్, పోలీసు డ్రైవర్ పోస్టుల్ని తక్షణమే భర్తీ చేయాలని ఆ విభాగం మంత్రిగా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ బుధవారం ఆదేశించారు. రాష్ట్ర పోలీస్ విభాగంలో 184 సబ్‌ఇన్‌స్పెక్టర్, 231 పోలీస్‌డ్రైవర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు ప్రకటించారు. వీటిలో 92 సబ్‌ఇన్‌స్పెక్టర్, 231 పోలీస్ డ్రైవర్ ఉద్యోగాల ఖాళీల్ని భర్తీ చేసేందుకు ఒడిశా స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ తక్షణమే కార్యాచరణ ప్రారంభించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.