హెల్త్ విజిటర్‌పై డీఎంహెచ్‌వో విచారణ
Published Sat, Sep 3 2016 2:14 AM | Last Updated on Mon, Sep 4 2017 12:01 PM
చింతలపూడి : విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించడంతో సస్పెన్షన్‌కు గురైన హెల్త్ విజిటర్ వ్యవహారంపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిణి డాక్టర్ కె.కోటేశ్వరి శుక్రవారం విచారణ జరిపారు. రాఘవాపురం పీహెచ్‌సీలో హెల్త్ విజిటర్‌గా పనిచేస్తున్న బి.శాంతకుమారి విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో గత జూలైలో స్ధానిక సుప్రీంపేటకు చెందిన తల్లీబిడ్డా మృతి చెందారు. ఈ ఘటనలోకలెక్టర్ కాటంనేని భాస్కర్ ఆదేశాలతో వైద్య ఆరోగ్య శాఖ రీజనల్ డైరెక్టర్ ఆగస్టులో శాంతకుమారిని సస్పెండ్ చేశారు. దీంతో తనకు న్యాయం చేయాలని శాంతకుమారి ఏపీ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. జరిగిన ఘటనపై స్వయంగా విచారించి నివేదిక ఇవ్వాలని ట్రిబ్యునల్ డీఎంఅండ్‌హెచ్‌వోను ఆదేశించడంతో రాఘవాపురం పీహెచ్‌సీలో విచారణ చేపట్టారు. వైద్యులను, ఏఎన్‌ఎంలను, ఆశా వర్కర్లను విడివిడిగా విచారించారు.
Advertisement
Advertisement