raghavapuram
-
శివాలయంలో బౌద్ధ సంతాన దేవత విగ్రహం
సాక్షి, హైదరాబాద్: బౌద్ధంలో సంతాన దేవతగా పేర్కొనే హారీతి శిల్పాన్ని యాదాద్రి భువనగిరి జిల్లా కొలనుపాక సమీపంలో దక్షిణ కాశీగా అభివర్ణించే రాఘవాపురం శివాలయంలో గుర్తించారు. 8 లేదా 9వ శతాబ్దం నాటిదని భావిస్తున్న ఈ విగ్రహాన్ని కొత్త తెలంగాణ చరిత్ర బృందం పరిశోధకులు శ్రీరామోజు హరగోపాల్, ఎల్లేటి చంటి, రవి గుర్తించారు. జైనం, బౌద్ధం, హైందవంలో ప్రత్యేకంగా సంతాన దేవతలను అర్చించే విధానం ఉంది. దీంతో విగ్రహం లక్షణాల ఆధారంగా చరిత్ర పరిశోధకులు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి, బద్దెల రామచంద్రారెడ్డి, డాక్టర్ స్మితారెడ్డి, టి.మహేశ్ తదితరులతో సంప్రదించి బౌద్ధ సంతాన దేవత హారీతిగా గుర్తించినట్టు హరగోపాల్ వెల్లడించారు. చదవండి: Yadagirigutta: బలిపీఠానికి బంగారు తొడుగు పాకిస్థాన్‌లోని లాహోర్, అజంతా రెండో గుహ, ఒడిశాలోని లలితానగర్‌లో వెలుగు చూసిన హారీతి విగ్రహాలతో ఇది సరిపోలి ఉందని వెల్లడించారు. తలపై కిరీటం లేకుండా పెద్ద సిగ, మెడలో ముత్యాలహారం ఉన్నాయన్నారు. దేవత కుడి తొడమీద శిశువును కూర్చోబెట్టుకున్నట్టు ఉందని, ఎడమ చేతిలో మూలిక లాంటిది కనిపిస్తోందని పేర్కొన్నారు. జైనం రాకముందు 9వ శతాబ్దం దాకా బౌద్ధ నిర్మాణాలుండేవని తెలుస్తోందన్నారు. ఈ విగ్రహం వెలుగు చూసిన నేపథ్యంలో రాఘవాపురంలో హారీతిదేవికి ఆలయం ఉండేదని తెలుస్తోందని వివరించారు. ఆలయంలో ఇటీవల కొత్తగా అన్నపూర్ణాదేవి విగ్రహాన్ని ప్రతిష్టించినట్టు వెల్లడించారు. చదవండి: తెలంగాణలో కొత్తగా 12 ఒమిక్రాన్ కేసులు -
కొమురన్న.. ఎల్లన్న.. బాగున్నారా?
సాక్షి, సిద్దిపేటజోన్: ఏం కొమురన్న... గొర్రెలు ఎట్లున్నాయి? బేరం మంచిగా నడుస్తుందా.. మీరందరూ బాగుండాలనేదే ముఖ్యమంత్రి కేసీఆర్ కోరిక అందుకే ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో గొర్లకురుమలకు ఆర్థిక భరోసాతో పాటు కుటుంబాల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకు గొర్రెల పంపిణీ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఏం ఎల్లన్న.. నీ ఆరోగ్యం ఎట్లుందే... ఊరు బాగుండాలి, మీరు బాగుండాలి అంటే గొర్రెల షెడ్లు నిర్మించుకోవాలి. అంటూ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు గొల్లకురుమలతో మాటామంతి కలిపారు. మంగళవారం తన నివాసంలో సిద్దిపేట మండలం రాఘవాపూర్ గ్రామ గొల్లకురుమలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ గొల్లకురుమల కోసం గొర్రెల పంపిణీ పథకాన్ని చేపట్టి ఆర్థికంగా ఎదుగుదలతో పాటు స్వయం సంవృద్ధికోసం ప్రయత్నాలు చేస్తున్నాడన్నారు. ఇదే సమయంలో గొర్రెల పెంపకందారులు కూడా ఆర్థికంగా నిలదోక్కుకునేలా పెద్దఎత్తున గొర్రెల పెంపకానికి నిధులు ఇవ్వడం జరిగిందన్నారు. ప్రతి గ్రామంలో గొల్లకురుమలు ఆనందంగా ఉండాలని, సామూహిక గొర్రెల షెడ్లు నిర్మించుకోవాలని అందుకు అవసరమైన స్థలాన్ని చూడాలంటూ సర్పంచ్, తహసీల్దార్లకు సూచించారు. ఒక్కొక్కరితో ఆప్యాయంగా.. గొల్లకురుమల సమావేశానికి వచ్చిన కురుమ పెద్దలను హరీశ్‌రావు ఒక్కొక్కరిని పేరుపెట్టి ఆప్యాయంగా పిలుస్తూ వారితో ముచ్చటించారు. గ్రామానికి చెందిన కొమురయ్యతో పథకం గూర్చి ఆరా తీశారు. కొమురన్న గొర్రెలు ఎట్లున్నయి, ఎన్ని పిల్లలు అయినయి మంచిగా చూసుకుంటున్నావా అంటూ ఆరా తీశారు. ఒక దశలో కొమురయ్య బదులిస్తూ మీ దయతో గొర్రెలు మంచిగానే ఉన్నాయని వాటిని బాగానే సాదుకుంటున్నట్లు పేర్కొన్నారు. అక్కడే ఉన్న సాయిలు అనే వ్యక్తిని పలకరిస్తూ బాగున్నావా సాయిలు బేరం చేస్తున్నావా, ధరఎంత పలుకుతుంది అంటూ స్థితిగతులపై ఆరా తీశారు. అలా సమావేశానికి వచ్చిన ప్రతి గొల్లకురుమను పలుకరిస్తూ గొర్రె పిల్లల స్థితిగతులు, వ్యవసాయ సాగు వివరాలు, రైతుబంధు అమలుతో పాటు కుటుంబ సభ్యుల గూర్చి పిల్లల చదువు గూర్చి ఆప్యాయంగా అడిగి తెలుసుకున్నారు. మీ ఆర్థిక ఎదుగుదలకు, జీవనోపాధి కోసం ప్రభుత్వం గొర్రెలను ఇస్తుందని, మీ పిల్లలను వాటికి కాపాల కోసం పంపకుండా మంచిగా చదివించాలని భవిష్యత్తులో ఈ ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటుచేస్తున్నామని బాగా చదివితే ఉపాధి అవకాశాలు ఉంటాయని దిశనిర్దేశం చేశారు. అదేవిధంగా ప్రతి ఒక్కరు ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాలని సిద్దిపేటలో ప్రభుత్వ ఆస్పత్రిని బాగా చేశామని, అన్ని సౌలతులు ఉన్నాయని తెలిపారు. అదేవిధంగా గ్రామాల్లో మొక్కలు నాటాలని, ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించి పరిశుభ్రమైన గ్రామంగా మార్చుకునే అవకాశం మన చేతుల్లోనే ఉందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సుడా చైర్మన్ రవీందర్‌రెడ్డి, జెడ్పీటీసీ గ్యార వజ్రవ్వయాదగిరి, ఎంపీపీ యాదయ్య, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు శ్రీనివాసరావు, గొర్లకురుమ సంఘం జిల్లా నాయకులు శ్రీహరియాదవ్, రాఘవాపూర్ సర్పంచ్ ఎర్వ రమేష్ పాల్గొన్నారు. -
రాఘవపురం గ్రామాన్ని సందర్శించిన యునిసెఫ్ రాష్ట్ర ప్రతినిధి సుధాకర్‌రెడ్డి
రాఘవపురం(పాలకుర్తి) : ఉత్తమ పంచాయతీ అవార్డు పొందిన మండలంలోని రాఘవపురం గ్రామానికి యునిసెఫ్ జాతీయ ప్రతినిధి జేమ్స్ ఈ నెల 10న రానున్నారని రాష్ట్ర ప్రతినిధి సుధాకర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన గ్రామా న్ని సందర్శించి సర్పంచ్ నల్ల నాగిరెడ్డితో పాటు ప్రజలను కలిసి మాట్లాడారు. నూరు శాతం మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు, పారిశుధ్య పనులు చేపట్టిన ఈ గ్రామాన్ని జేమ్స్ సందర్శిస్తారని పేర్కొన్నారు. ఆయన వెంట ఆర్డబ్ల్యూఎస్ డీఈ గోపాల్‌రెడ్డి, ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్, గ్రామ కార్యదర్శి లింగయ్య, ఉప సర్పం చ్ ముస్కు కొంరెల్లి, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
హెల్త్ విజిటర్పై డీఎంహెచ్‌వో విచారణ
చింతలపూడి : విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించడంతో సస్పెన్షన్‌కు గురైన హెల్త్ విజిటర్ వ్యవహారంపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిణి డాక్టర్ కె.కోటేశ్వరి శుక్రవారం విచారణ జరిపారు. రాఘవాపురం పీహెచ్సీలో హెల్త్ విజిటర్‌గా పనిచేస్తున్న బి.శాంతకుమారి విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో గత జూలైలో స్ధానిక సుప్రీంపేటకు చెందిన తల్లీబిడ్డా మృతి చెందారు. ఈ ఘటనలోకలెక్టర్ కాటంనేని భాస్కర్ ఆదేశాలతో వైద్య ఆరోగ్య శాఖ రీజనల్ డైరెక్టర్ ఆగస్టులో శాంతకుమారిని సస్పెండ్ చేశారు. దీంతో తనకు న్యాయం చేయాలని శాంతకుమారి ఏపీ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. జరిగిన ఘటనపై స్వయంగా విచారించి నివేదిక ఇవ్వాలని ట్రిబ్యునల్ డీఎంఅండ్‌హెచ్‌వోను ఆదేశించడంతో రాఘవాపురం పీహెచ్సీలో విచారణ చేపట్టారు. వైద్యులను, ఏఎన్ఎంలను, ఆశా వర్కర్లను విడివిడిగా విచారించారు. -
గుర్తుతెలియని మహిళ శవం లభ్యం
హత్యగా అనుమానిస్తున్న పోలీసులు రాఘవాపురం: గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని ఆదిలాబాద్ జిల్లా రాఘవాపురం గ్రామ సమీపంలోని ముక్కిడి గుట్టలో సోమవారం ఉదయం కనుగొన్నారు. మృతదేహాన్ని చూసిన గొర్రెల కాపరులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. రామన్నపేట సీఐ బాలగంగిరెడ్డి, క్లూస్ టీం పోలీసు జాగిలంతో సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పోలీసు జాగిలం మృతదేహం ఉన్న వద్ద నుంచి గుట్ట పరిసర ప్రాంతాలను అటు ఇటుగా కలియ తిరిగింది. తర్వాత గుట్ట దిగి రాఘవాపురం - నర్సాపురం రోడ్డు వద్ద గల ట్రాన్స్ఫార్మర్ వద్ద వరకు వచ్చి ఆగిపోయింది. హత్యగానే అనుమానం గుర్తు తెలియన మహిళ మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి ఉంది. సంఘటన వద్ద లభించిన ఆధారాలను పరిశీలించినట్లయితే హత్యగానే పోలీసులు భావిస్తున్నారు. ఈ నెల 6న ఉదయం 5:51నిముషాలకు శంషాబాద్ నుంచి శివరాంపల్లికి బయలు దేరినట్లుగా మహేశ్వరం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు టికెట్ సంఘటన స్థలానికి కొద్ది దూరంలో లభ్యమైంది. సంఘటన స్దలంలో పది రూపాయల నోట్లు రెండు, జోడాబైల్ ఖైనీ ప్యాకెట్లు రెండు లభ్య అయ్యాయి. ముఖం కనిపించకుండా ముఖానికి లుంగీ కట్టి మెడకు చున్నీ చుట్టి ఉరి తీసి చెట్ల పొదల్లో పడేసినట్లుగా ఉంది. దీన్ని బట్టి ఎవరో హత్యే చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మృతురాలి వయసు సుమారు 28 ఏళ్లు ఉంటుందని పలువురు భావిస్తున్నారు. అనంతరం సంఘటన స్దలం వద్దనే పోస్టుమార్టం నిర్వహించి అక్కడే ఖననం చేశారు.