హత్యగా అనుమానిస్తున్న పోలీసులు
రాఘవాపురం: గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని ఆదిలాబాద్ జిల్లా రాఘవాపురం గ్రామ సమీపంలోని ముక్కిడి గుట్టలో సోమవారం ఉదయం కనుగొన్నారు. మృతదేహాన్ని చూసిన గొర్రెల కాపరులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. రామన్నపేట సీఐ బాలగంగిరెడ్డి, క్లూస్ టీం పోలీసు జాగిలంతో సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పోలీసు జాగిలం మృతదేహం ఉన్న వద్ద నుంచి గుట్ట పరిసర ప్రాంతాలను అటు ఇటుగా కలియ తిరిగింది. తర్వాత గుట్ట దిగి రాఘవాపురం - నర్సాపురం రోడ్డు వద్ద గల ట్రాన్స్‌ఫార్మర్ వద్ద వరకు వచ్చి ఆగిపోయింది.
హత్యగానే అనుమానం
గుర్తు తెలియన మహిళ మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి ఉంది. సంఘటన వద్ద లభించిన ఆధారాలను పరిశీలించినట్లయితే హత్యగానే పోలీసులు భావిస్తున్నారు. ఈ నెల 6న ఉదయం 5:51నిముషాలకు శంషాబాద్ నుంచి శివరాంపల్లికి బయలు దేరినట్లుగా మహేశ్వరం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు టికెట్ సంఘటన స్థలానికి కొద్ది దూరంలో లభ్యమైంది. సంఘటన స్దలంలో పది రూపాయల నోట్లు రెండు, జోడాబైల్ ఖైనీ ప్యాకెట్లు రెండు లభ్య అయ్యాయి. ముఖం కనిపించకుండా ముఖానికి లుంగీ కట్టి మెడకు చున్నీ చుట్టి ఉరి తీసి చెట్ల పొదల్లో పడేసినట్లుగా ఉంది. దీన్ని బట్టి ఎవరో హత్యే చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మృతురాలి వయసు సుమారు 28 ఏళ్లు ఉంటుందని పలువురు భావిస్తున్నారు. అనంతరం సంఘటన స్దలం వద్దనే పోస్టుమార్టం నిర్వహించి అక్కడే ఖననం చేశారు.
గుర్తుతెలియని మహిళ శవం లభ్యం
Published Mon, Aug 10 2015 4:29 PM | Last Updated on Sun, Sep 3 2017 7:10 AM
Advertisement
Advertisement