రాఘవపురం గ్రామాన్ని సందర్శించిన యునిసెఫ్ రాష్ట్ర ప్రతినిధి సుధాకర్‌రెడ్డి
Published Sat, Oct 8 2016 12:50 AM | Last Updated on Mon, Sep 4 2017 4:32 PM
రాఘవపురం(పాలకుర్తి) : ఉత్తమ పంచాయతీ అవార్డు పొందిన మండలంలోని రాఘవపురం గ్రామానికి యునిసెఫ్ జాతీయ ప్రతినిధి జేమ్స్ ఈ నెల 10న రానున్నారని రాష్ట్ర ప్రతినిధి సుధాకర్‌రెడ్డి తెలిపారు.
శుక్రవారం ఆయన గ్రామా న్ని సందర్శించి సర్పంచ్ నల్ల నాగిరెడ్డితో పాటు ప్రజలను కలిసి మాట్లాడారు. నూరు శాతం మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు, పారిశుధ్య పనులు చేపట్టిన ఈ గ్రామాన్ని జేమ్స్ సందర్శిస్తారని పేర్కొన్నారు. ఆయన వెంట ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ గోపాల్‌రెడ్డి, ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్, గ్రామ కార్యదర్శి లింగయ్య, ఉప సర్పం చ్ ముస్కు కొంరెల్లి, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement