sudhakar
-
దేశభక్తి నేపథ్యంలో ‘అభినవ్’
‘ఆదిత్య, విక్కీస్ డ్రీమ్, డాక్టర్ గౌతమ్’ వంటి సందేశాత్మక బాలల చిత్రాలు తీసిన దర్శక–నిర్మాత భీమగాని సుధాకర్ గౌడ్ రూపొందించిన మరో బాలల చిత్రం ‘అభినవ్’. సమ్మెట గాంధీ, సత్య ఎర్ర, మాస్టర్ గగన్ , గీతా గోవింద్, అభినవ్, చరణ్, బేబీ అక్షర కీలక పాత్రల్లో నటించారు. శ్రీలక్ష్మి ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ సమర్పణలో సంతోష్ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఈ చిత్రం రూపొందింది. శుక్రవారం నిర్వహించిన ప్రెస్మీట్లో భీమగాని సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ– ‘‘పిల్లల్లో చిన్నప్పటి నుంచే దేశభక్తిని పెంపొందించాలనే లక్ష్యంతో ఈ సినిమాను రూపొందించాను. దురదృష్టవశాత్తూ పిల్లలు గంజాయి, డ్రగ్స్ వంటి వ్యసనాలకు అలవాటు పడుతున్నారు. ఎన్సీసీ, స్కౌట్స్, యోగా, ధ్యానం నేర్చుకోవడం ద్వారా పిల్లలు ఇలాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉంటారు’’ అన్నారు. -
కర్ణాటకలో మద్యం పంపిణీ వివాదం: ‘ఇది బీజేపీ కల్చర్’
బెంగళూరు: కర్ణాటక బీజేపీ ఎంపీ కే సుధాకర్ మద్దతుదారులు ఆయన ఎన్నికల్లో గెలిచినందుకు విజయోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పోలీసుల చేత బహిరంగంగా మద్యం పంపిణీ చేయించటం తాజాగా వివాదాస్పదం అయింది. దీంతో ఎంపీ సుధాకర్‌పై కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించింది. దీనిపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందించారు.‘‘బీజేపీ ఎంపీ విజయోత్సవ కార్యక్రమంలో బహిరంగంగా మద్యం పంపిణీ చేయటంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పష్టత ఇవ్వాలి. అయితే ఈ వ్యవహారంలో స్థానిక నేతలు సమాధానం ఇవ్వటం కాదు.. జాతీయ అధ్యకక్షుడే స్పష్టత ఇవ్వాలి. ఇది బీజేపీ బీజేపీ కల్చర్’’ అని అన్నారు. అదేవిధంగా రాష్ట్ర ఎక్సైజ్ పాలసీ కింద ప్రభుత్వం ఈవ్యవహారంలో ఏమైనా చర్యలు తీసుకుంటుందా? అని మీడియా అడిగిన ప్రశ్నకు.. చర్యలు తీసుకోవటం అనేది తర్వాత అంశం. ముందు బీజేపీ పార్టీ ఈ వ్యవహారంపై సమాధానం చెప్పాలని అన్నారు.చిక్కబళ్లాపూర్‌లో నిర్వహించిన బీజేపీ ఎంపీ సుధాకర్ విజయోత్సవ కార్యక్రమంలో పోలీసు మద్యం పంచిన దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే ఈ కార్యక్రమం గురించి సదరు ఎంపీ పోలీసులకు మందుగానే లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో ఆహారం, మద్యం పంచటంలో సాయం అందించాలని ఆయన ఆ లేఖలో పేర్కొనటం గమనార్హం. అయితే ఇలాంటి కార్యక్రమానికి పోలీసులు ఎలా అనుమతి ఇచ్చారు. అదీకాక పోలీసులే మద్యం పంచటంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.మద్యం పంపిణీ వ్యవహారం వివాదం రేపటంతో మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే సీఎన్ అశ్వనాథ్ నారాయణ్ స్పందించారు. ‘ఈ విషయాన్ని పూర్తిగా పరిశీలించకముందే మేము ఎవరీని నిందించలేము. ఇటువంటి వ్యవస్థ ఉన్నందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఈ కార్యక్రమంలో తప్పు జరిగిందని భావిస్తే.. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి’ అని అన్నారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో చిక్కబళ్లాపూర్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ తరఫున సుధాకర్ గెలుపొందారు. సుమారు 1.6 లక్షల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంఎస్ రక్షా రామయ్య ఓడించారు. -
గ్లాసుతో సైకిల్‌కు గుబులు
వరుస షాకులతో కొట్టుమిట్టాడుతున్న టీడీపీకి కావలిలో మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ రెబల్ అభ్యర్థిగా, ఇండిపెండెంట్‌గా బరిలో నిలిచిన పసుపులేటి సుధాకర్ పక్కలో బల్లెంలా తయారయ్యారు. పోటీలో ఆయన ఉండటంతో ఓట్లు భారీగా చీలుతాయనే ఆందోళనతో ఉన్న కావలి టీడీపీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డికి తాజా పరిణామం అశనిపాతంలా పరిణమించింది. సుధాకర్‌కు అనూహ్యంగా జనసేన గాజు గ్లాస్ గుర్తు లభించడంతో కావ్య శిబిరం ఒక్కసారిగా డీలాపడిపోయింది.కావలి: టీడీపీ రెబల్‌గా, స్వతంత్య్ర అభ్యర్థిగా కావలి నుంచి రంగంలోకి దిగిన పసుపులేటి సుధాకర్‌కు ఎన్నికల కమిషన్ గ్లాస్ గుర్తును కేటాయించడంతో టీడీపీ శిబిరంలో కలకలం రేగింది. ఈ పరిణామంతో ఓట్లు భారీగా చీలిపోతాయనే భయంతో కావ్య శిబిరం ఒక్కసారిగా కుదుపునకు గురైంది. బీసీల ప్రతినిధిగా రాజకీయాల్లోకి.. బీసీల ప్రతినిధిగా.. పీఎస్సార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కావలి రాజకీయాల్లో పసుపులేటి సుధాకర్ అడుగుపెట్టారు. 2019 ఎన్నికల్లో జనసేన తరఫున గ్లాస్ గుర్తుపై పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం బీజేపీలో చేరి కొంతకాలం రాష్ట్ర పదవిలో కొనసాగారు. ఈ క్రమంలో ఆయన్ను టీడీపీ అధినేత చంద్రబాబు పిలిపించుకొని కావలిలో పార్టీ కోసం పనిచేయాలని కోరారు. ఈ తరుణంలో బీజేపీకి రాజీనామా చేసి టీడీపీ కోసం పనిచేశారు. చంద్రబాబు అరెస్ట్ సమయంలో సుధాకర్ తన వర్గీయులతో నిరసన ప్రదర్శనలతో పాటు రాజమహేంద్రవరంలో ర్యాలీలను చేపట్టారు. దీంతో కావలి టీడీపీ టికెట్ సుధాకర్కేనని అందరూ భావించారు. అప్పటి వరకు కావలి ఇన్చార్జిగా ఉన్న మాలేపాటి సుబ్బానాయుడు సైతం సుధాకర్ అభ్యరి్థత్వాన్ని బలపర్చారు. రెబల్‌గా పోటీకి సై.. ఈ తరుణంలో కావ్య కృష్ణారెడ్డి ఆర్థిక బలంతో కావలి టికెట్‌ను దక్కించుకున్నారు. నియోజకవర్గంలోని సీనియర్ నేతలు, కేడర్ తీవ్రంగా వ్యతిరేకించినా, ఆయనవైపే చంద్రబాబు మొగ్గు చూపారు. దీంతో కంగుతిన్న పసుపులేటి సుధాకర్ కావలిలో రెబల్‌గా పోటీ చేసేందుకు డిసైడయ్యారు. ట్రస్ట్ ద్వారా చేపడుతున్న సేవా కార్యక్రమాలు, టీడీపీ, జనసేన కేడర్ అండగా నిలుస్తుందనే నమ్మకంతో సొంత మేనిఫెస్టోను రూపొందించుకొని బరిలోకి దిగారు. దీంతో టీడీపీ, జనసేన నేతలు, పవన్ కల్యాణ్ అభిమానులు సైతం పసుపులేటికి మద్దతు తెలిపి ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో సుధాకర్‌కు గ్లాస్ గుర్తు కేటాయించడంతో ఆయన వర్గీయుల్లో హర్షం వ్యక్తమవుతోంది. భగ్గుమంటున్న కావ్య పసుపులేటి సుధాకర్‌కు గ్లాస్ గుర్తు కేటాయించడంతో కావ్య కృష్ణారెడ్డికి మైండ్ బ్లాౖకైంది. ప్రెస్‌మీట్ పెట్టి మరీ పసుపులేటిపై తిట్ల దండకం అందుకున్నారు. ఆయనపై ఎనిమిది కేసులున్నాయని, 420 అంటూ నోరుపారేసుకున్నారు. ప్రతాప్‌కుమార్‌రెడ్డి, పసుపులేటి సుధాకర్ ఇద్దరూ కలిసి తనపై పోటీకి దిగారని ఆరోపించారు. రామనారాయణరెడ్డికి గ్లాస్ గుర్తు ఆత్మకూరు: అదేంది.. రామనారాయణరెడ్డికి గ్లాసు గుర్తు కేటాయించారా.. ఈ మతలబేమిటబ్బాననే సందేహం కలగక మానదు. అయితే దీన్ని కేటాయించింది ఆత్మకూరు టీడీపీ అభ్యర్థి ఆనం రామనారాయణరెడ్డికి కాదండోయ్. అక్కడే స్వతంత్ర అభ్యరి్థగా పోటీలో నిలిచిన ధనిరెడ్డి రామనారాయణరెడ్డికి గ్లాసు గుర్తు కేటాయించడంతో ఓట్లు ఎక్కడ చీలుతాయోననే ఆందోళన తమ్ముళ్లలో నెలకొంది. -
నిర్మాత సుధాకర్ కన్నుమూత
నిర్మాత, కెమెరామేన్ మన్నం సుధాకర్ (62) అనారోగ్యంతో ఆదివారం ఉదయం మృతి చెందారు. మూడు నెలల క్రితం చెన్నైలోని స్వగృహంలో బాత్రూంలో ప్రమాదవశాత్తు పడటంతో తలలో తీవ్ర రక్తస్రావమైంది. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆయన ఆ తర్వాత ఇంటిలో విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆదివారం కన్నుమూశారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం కారుమంచి ఆయన స్వస్థలం. ప్రముఖ కెమెరామేన్ వీయస్ఆర్ స్వామి దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన సుధాకర్ ‘సితార, వారాలబ్బాయి, పుట్టినిల్లా మెట్టినిల్లా’ వంటి పలు చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. మహాగణపతి ఫిలింస్ బ్యానర్ స్థాపించి ‘తారకరాముడు, నా మనసిస్తారా, వాలి, సేవకుడు, ఆక్రోశం’ వంటి సినిమాలు నిర్మించారు సుధాకర్. టంగుటూరు ప్రాంతం నుంచి పలువురిని సినీ రంగానికి పరిచయం చేశారాయన. సుధాకర్‌కి భార్య దేవరపల్లి లక్ష్మమ్మ, కుమారులు మన్నం హరీష్ బాబు, మన్నం సతీష్ బాబు ఉన్నారు. కాగా ఆయన కుమార్తె మన్నం స్వాతి గతంలోనే చనిపోయారు. కారుమంచిలో మన్నం సుధాకర్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. -
రజనీ చాయ్
సూపర్‌స్టార్ రజనీకాంత్ ఒక్కోసారి విసుగుపుట్టి హిమాలయాలకు వెళుతుంటారు. ఈసారి కొచ్చిన్‌లో టీ అమ్ముకుంటున్నారా? అవుననే కొంతమంది కంగారు పడ్డారు. తీరా చూస్తే ‘దక్కేది దక్కకుండా పోదు... దక్కనిది ఎప్పటికీ దక్కదు’ అని డైలాగ్ కొడుతూ తనకు దక్కిన టీ స్టాల్‌ను నడుపుకుంటున్న ఓ వ్యక్తి... ఇంకేముంది... నెట్లో హల్చల్. కొచ్చిన్‌లో ఏదో షూటింగ్ కోసం వెళ్లిన సినిమా యూనిట్ వారు అతణ్ణి చూసి ఆగిపోయారు. రజనీకాంత్! టీ అమ్ముతూ. రజనీకాంత్ సాధారణ జీవితాన్ని ఇష్టపడతాడని అందరికీ తెలుసు. కొంపదీసి టీ అమ్ముతున్నాడా? పరిశీలించి చూశారు. కాదు. రజనీకాంత్లానే ఉన్నాడు. పలకరిస్తే అచ్చు రజనీకాంత్లానే నవ్వుతున్నాడు. పేరు సుధాకర్ ప్రభు. ఫోర్ట్ కొచ్చిన్ పట్టాలం రోడ్డులో ‘వెంకటేశ్వర హోటల్’ అనే ప్యూర్ వెజిటేరియన్ హోటల్ నడుపుతున్నాడు. లెమన్ టీ చేయడంలో దిట్ట. మొన్న మొన్నటి వరకూ ఎవరూ అతణ్ణి రజనీకాంత్‌తో పోల్చలేదు కాని ఈ మధ్య గెడ్డానికి రంగేయడం మాని, కళ్లద్దాలు మార్చేసరికి అచ్చు రజనీ గెటప్‌లోకి వచ్చేశాడు. నాదిర్షా అనే మలయాళం డైరెక్టర్ ఇతణ్ణి ఫేస్బుక్లో పెట్టేసరికి వైరల్ అయ్యాడు. అప్పటినుంచి ఇతని వీడియోలు వైరల్ అవుతున్నాయి. కేరళలో ఇతణ్ణి ఫంక్షన్స్‌కు కూడా ఆహ్వానిస్తున్నారు. ‘మా పిల్లలు పెద్దగా పట్టించుకోరుగాని నేను రజనీ అన్ని సినిమాలు చూస్తుంటా’ అంటాడు. ఈ పాపులారిటీ పెరిగి అతని హోటల్‌కు కస్టమర్లు పెరిగితే అదే పది ప్లేట్లు. -
ట్రాన్స్ఫార్మర్పై మరమ్మతులు చేస్తూ.. కరెంట్ షాక్‌తో విద్యుత్ ఆపరేటర్ మృతి
సాక్షి, సూర్యాపేట, నడిగూడెం: ట్రాన్స్ఫార్మర్కు మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై విద్యుత్ ఆపరేటర్ మృతిచెందాడు. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం తెల్లబల్లి గ్రామ పరిధిలో గురువారం జరిగిన ఈ సంఘటనపై గ్రామస్తులు తెలిపిన వివరాలివి. తెల్లబల్లి గ్రామానికి చెందిన నెమ్మాది సుధాకర్ (40) మునగాల మండలం రేపాల విద్యుత్ సబ్‌స్టేషన్‌లో ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. సుధాకర్ గురువారం విధులకు వెళ్లేందుకు సిద్ధమవుతుండగా.. తెల్లబల్లి గ్రామానికి చెందిన పలువురు రైతులు రత్నవరం రహదారిలోని ట్రాన్స్ఫార్మర్ పనిచేయడం లేదని అతన్ని తీసుకెళ్లారు. ఆ ట్రాన్స్ఫార్మర్ మునగాల మండలం ఆకుపాముల విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలో ఉందనుకొని అక్కడి నుంచి సుధాకర్ ఎల్సీ తీసుకున్నాడు. కానీ ఆ ట్రాన్స్ఫార్మర్ నడిగూడెం విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలో ఉంది. ఈ విషయం తెలియకపోవడంతో సుధాకర్ ట్రాన్స్ఫార్మర్ ఎక్కి మరమ్మతులు చేసే క్రమంలో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులున్నారు. కాగా ఈ ఘటనపై ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. -
పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యాపారంపై ఎమ్మెల్యే సుధాకర్ ఫైర్
-
నేను ఆరోగ్యంగా ఉన్నాను.. ఆ వార్తలు నమ్మకండి: నటుడు సుధాకర్
సీనియర్ నటుడు, కమెడియన్ సుధాకర్ చనిపోయినట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. సుధాకర్ అనారోగ్యంతో బాధడపడుతున్నారని, ఐసీయూలో ఉన్నారంటూ గత వారం రోజులుగా సోషల్ మీడియాలో రూమర్స్ వినిపిస్తున్నాయి. దీనికి తోడు పరిస్థితి విషమించి ఆయన చనిపోయినట్లు ఒక్కసారిగా వార్తలు ఊపందుకున్నాయి. తాజాగా ఈ తప్పుడు వార్తలపై సుధాకర్ స్వయంగా స్పందించారు. కొంతకాలంగా తన ఆరోగ్యంపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలని తెలిపారు. తాను ఆరోగ్యంగా, సంతోషంగా ఉన్నానని, తప్పుడు వార్తలను దయచేసి నమ్మవద్దని కోరారు. ఈ మేరకు స్వయంగా ఓ వీడియోను రిలీజ్ చేశారు. దయచేసి ఇలాంటి రూమర్స్‌ను క్రియేట్ చేయొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. కాగా నటుడు సుధాకర్ చనిపోయినట్లు వార్తలు రావడం ఇదేం తొలిసారి కాదు. గతంలోనూ ఆయన ఆరోగ్యంపై రకరకాల వార్తలు సర్యులేట్ అయ్యాయి. ఈమధ్యే నటుడు కోట శ్రీనివాసరావు కూడా చనిపోయినట్లు తప్పుడు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన కూడా స్వయంగా వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, బతికున్న మనుషుల్ని కూడా చంపేస్తున్నారంటూ సినీ ప్రముఖులు, అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
'తెలంగాణ యాసలో డైలాగులు పలకడం కష్టం అనిపించింది'
మహానటి... బొద్దుగా కనిపించడానికి ప్రోస్థటిక్ మేకప్. రంగ్ దే... గర్భవతిగా కనిపించడానికి కడుపు చుట్టూ కుషన్ సాని కాయిదమ్... చింపిరి జుత్తు, కమిలిపోయిన చర్మం... ఇప్పుడు ‘దసరా’.. డార్క్ మేకప్. కీర్తీ సురేష్ ఓ ఐదారు సినిమాలు చేస్తే అందులో పైన చెప్పినట్లు లుక్ పరంగాను.. నటన పరంగానూ చాలెంజ్ చేసే పాత్రలే ఎక్కువ. ‘క్యారెక్టర్ కోసం ఎంత కష్టపడితే అంత ఆత్మసంతృప్తి దక్కుతుంది’ అంటారు కీర్తి. నాని, కీర్తి జంటగా శ్రీకాంత్ ఒదెల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మించిన ‘దసరా’ ఈ 30న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా కీర్తీ సురేష్ చెప్పిన విశేషాలు. మహానటి, రంగ్ దే, సాని కాయిదమ్ (తెలుగులో ‘చిన్ని’) వంటి చిత్రాల్లో చాలెంజింగ్ రోల్స్ చేశారు. ఇప్పుడు ‘దసరా’లో చేసిన వెన్నెల క్యారెక్టర్ పెట్టిన కష్టాల గురించి? వెన్నెల క్యారెక్టర్ ఫిజికల్‌గా కొంచెం కష్టం అనిపించింది. డార్క్ మేకప్‌తో కనిపిస్తాననే సంగతి తెలిసిందే. ఈ మేకప్ వేయడానికి గంట పట్టేది. తీయడానికి ఇంకా ఎక్కువ టైమ్ పట్టేది. చాలా ఓపిక అవసరం. ఇక బొగ్గు గనుల బ్యాక్‌డ్రాప్ కాబట్టి లొకేషన్లో ఒకటే దుమ్ము. ఇలా ఫిజికల్ కష్టాలు చాలానే. ఇక నటనపరంగా చాలెంజ్ ఏంటంటే.. ఈ చిత్రంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన అమ్మాయిని కాబట్టి ఇప్పటివరకూ చేసిన పాత్రలకన్నా వ్యత్యాసం చూపించాల్సి వచ్చింది. తెలంగాణ యాసని పట్టుకోగలిగారా? నిజానికి దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ కథ చెప్పినప్పుడు నాకస్సలు అర్థం కాలేదు. నాలుగు గంటలు ఓపికగా కథ చెప్పారు. అయినా తికమకగానే అనిపించింది. మరోసారి చెప్పాక అర్థం అయింది. అలాగే తెలంగాణ యాసలో డైలాగులు పలకడానికి కాస్త కష్టం అనిపించింది. కొన్ని రోజులు ఇబ్బందిపడ్డాను. ఆ తర్వాత పట్టుకోగలిగాను. శ్రీకాంత్ ఓదెల అసోసియేట్ శ్రీనాథ్‌కు తెలంగాణ యాస మీద పట్టుంది. ఆయనే నేర్పించారు. అలాగే ఒక ప్రొఫెసర్ చిన్న చిన్న వివరాలను కూడా యాడ్ చేశారు. డబ్బింగ్ చెప్పారా? ఇంతకుముందు క్యారెక్టర్లకు చెప్పినంత త్వరగా చెప్పగలిగారా? నా గత క్యారెక్టర్స్‌కి మూడు రోజుల్లో డబ్బింగ్ పూర్తి చేసేదాన్ని. వెన్నెలకు చెప్పడం అంత సులువు కాదు. ఈ పాత్రకు ఐదారు రోజులు పట్టింది. ఇప్పటివరకు చేసిన పాత్రలకన్నా ‘వెన్నెల’ క్యారెక్టర్‌కే ఎక్కువ శ్రమపడ్డారనుకోవచ్చా? అలా ఏం కాదు. శ్రమ పెట్టిన పాత్రల్లో ఇదొకటి. అయితే ఈ సినిమా చేసేటప్పుడు నాకు చాలా సందర్భాల్లో ‘మహానటి’ గుర్తొచ్చింది. ‘మహానటి’ గుర్తుకు రావడానికి కారణం? జనరల్‌గా ఒక సినిమా చేసినప్పుడు ఒక ఫీల్ ఉంటుంది. ఆ సినిమా పూర్తయినా దానితో ఒక ఎమోషనల్ కనెక్షన్ ఉంటుంది. అన్ని సినిమాలకూ ఇలా జరుగుతుందని చెప్పను. ‘మహానటి’ విషయంలో అలాంటి ఓ కనెక్షన్ ఉండేది. ఇప్పుడు ‘దసరా’కి ఆ ఫీల్ వచ్చింది. అందుకే ‘దసరా’ చేస్తున్నప్పుడు ‘మహానటి’ వైబ్స్ వచ్చాయన్నాను. అంటే.. ఆ సినిమాకి వచ్చినట్లే ‘దసరా’కి కూడా మీకు జాతీయ అవార్డు వస్తుందనుకోవచ్చా? యాక్చువల్‌గా ‘మహానటి’కి అవార్డుని ఆశించలేదు. వచ్చింది... చాలా ఆనందపడ్డాను. ఇప్పుడు ఈ సినిమాకి కూడా అవార్డులు ఎదురు చూడటంలేదు. నేను ఏ సినిమా చేసినా బెస్ట్‌గా చేయాలనుకుంటాను. ఆ సినిమా బాగా ఆడాలని కోరుకుంటాను.. అంతే. ఈ సినిమాలో ‘చమ్కీల అంగీలేసుకొని...’ పాట చాలా పాపులర్ అయ్యింది.. ఇది ముందే ఊహించారా? ఆ పాట వినగానే అన్ని పెళ్లి వేడుకల్లో ఇదే పాట మారుమ్రోగుతుందని అనుకున్నాం. పాటలో ఆ వైబ్రేషన్ ఉంది. లిరిక్స్ చాలా బాగుంటాయి. ట్యూన్ అద్భుతంగా కుదిరింది. పెద్ద హిట్ అవుతుందని అనుకున్నాం. మేం ఊహించినదానికంటే పెద్ద విజయం సాధించింది. శ్రీకాంత్ ఓదెల గురించి.. ‘దసరా’ కథని శ్రీకాంత్ అద్భుతంగా రాసుకున్నారు. ఏ పాత్ర ఎలా ఉండాలో అయనకి చాలా క్లారిటీ వుంది. నా విషయానికి వస్తే.. కథ, నా పాత్ర, డైరెక్టర్ని అర్థం చేసుకుంటాను. దర్శకుడు నా నుంచి ఎలాంటి నటన కోరుకుంటున్నారో అలా చేస్తాను. కష్టానికి తగిన ప్రతిఫలం అంటారు.. మరి సింపుల్ క్యారెక్టర్లు చేసినప్పుడు తీసుకునే పారితోషకమే చాలెంజింగ్ రోల్స్‌కీ తీసుకుంటారా.. పెంచుతారా? రెమ్యునరేషన్ లెక్కలు వేయను. ఆ లెక్కలు వేసుకుని సినిమా ఒప్పుకోను. ఏదైనా క్యారెక్టర్ ఒప్పుకునే ముందు నాకు లభించే ఆత్మసంతృప్తి గురించి మాత్రమే ఆలోచిస్తాను. ‘దసరా’ పాన్ ఇండియా మూవీ... మామూలుగా పాన్ ఇండియా చిత్రాలకు హీరోలకు భారీ రెమ్యునరేషన్ ఉంటుందంటారు.. మరి ఈ చిత్రానికి మీ రెమ్యునరేషన్... అలా ఒక్క సినిమాకే పెంచేస్తామా? ఈ సినిమాతో పాన్ ఇండియా ప్లాట్ఫామ్లోకి వచ్చాను. అయినా ఒక మంచి సినిమా చేసేటప్పుడు రెమ్యునరేషన్ పట్టింపు కాదు. ఏ సినిమాకైనా ఇంతే. ఆ సినిమా వల్ల నాకెంత ఆనందం, ఆత్మసంతృప్తి లభించాయన్నదే నాకు ముఖ్యం. ‘మహానటి’ తర్వాత మీకు హిందీ నుంచి ఆఫర్స్ వచ్చినా మీరు వెళ్లలేదు.. కారణం? హిందీలో కొన్ని కథలు విన్నాను. అయితే ఆ కథల్లో నాది బలమైన పాత్ర అనిపించలేదు. బాలీవుడ్లో మంచి పాత్రలు వస్తే చేయాలనే ఉంది. కథ కూడా చాలా ముఖ్యం. -
Am Aha Review: అం అః మూవీ రివ్యూ
టైటిల్ : అం అః నటీనటులు : సుధాకర్ జంగం, లావణ్య, సిరి కనకన్, రామరాజు, రవిప్రకాష్, రాజశ్రీ నాయర్, దువ్వాసి మోహన్, శుభోదయం సుబ్బారావు, తాటికొండ మహేంద్ర నాథ్, గని, ఉన్నికృష్ణన్, మునీశ్వరరావు తదితరులు నిర్మాణ సంస్థలు: రంగస్థలం మూవీ మేకర్స్, శ్రీ పద్మ ఫిలిమ్స్ నిర్మాత:జోరిగె శ్రీనివాస్ రావు దర్శకత్వం:శ్యామ్ మండల సంగీతం : సందీప్ కుమార్ కంగుల సినిమాటోగ్రఫీ:శివా రెడ్డి సావనం ఎడిటర్:జె.పి విడుదల తేది: సెప్టెంబర్ 16,2022 ప్రస్తుతం ఆడియెన్స్‌ను ఆకట్టుకోవడం, థియేటర్లకు రప్పించడం చాలా కష్టంగా మారింది. డిఫరెంట్ కంటెంట్ ఉంటే తప్పా ప్రేక్షకులు సినిమాలను ఆదరించడం లేదు. ఇలాంటి తరుణంలోనే డిఫరెంట్ టైటిల్, నేటితరం ఆడియన్స్ కోరుకునే థ్రిల్లింగ్ సబ్జెక్టుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది 'అం అః'. సుధాకర్ జంగం, లావణ్య హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రాన్ని రంగస్థలం మూవీ మేకర్స్, శ్రీ పద్మ ఫిలిమ్స్ బ్యానర్స్‌పై జోరిగె శ్రీనివాస్ రావు నిర్మించారు. ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే విడుదల చేసిన టీజర్, పాటలు, ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. మంచి అంచనాల మధ్య ఈ శుక్రవారం(సెప్టెంబర్ 16) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. కల్యాణ్ (సుధాకర్ జంగం), బల్లు(రాజా),అరవింద్(ఈశ్వర్) ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులు. చిలిపి పనులు చేస్తూ సరదాగా గడిపే ఈ బ్యాచ్ అనుకోకుండా నగరంలో పేరు మోసిన డాన్ జీఆర్(రామరాజు) కుమారుడు గౌరవ్ మర్డర్ కేసులో ఇరుక్కుంటారు. ఈ కేసు నుంచి బయట పడేసేందుకు రూ.20 లక్షలు డిమాండ్ చేస్తాడు సీఐ ఫణీంద్ర(రవి ప్రకాశ్). ఆ డబ్బు కోసం కావ్య(సిరి)అనే అమ్మాయిని కిడ్నాప్ చేస్తారు. ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి రూ.20 లక్షలు డిమాండ్ చేస్తారు.మరి అంత డబ్బును కావ్య తల్లిదండ్రులు ఇచ్చారా? మర్డర్ కేసు నుంచి ఈ ముగ్గురు ఎలా బయటపడ్డారు? అసలు హత్య చేసిందెవరు? వారి వెనుక ఉన్నదెవరు? అనేది తెలియాలంటే థియేటర్స్‌లో ‘అం అః’ చూడాల్సిందే. ఎలా ఉందంటే.. క్రైం థ్రిల్లర్ సినిమాలకు అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ ఉంటుంది. ఆడియన్స్‌ని ఎంగేజ్ చేసే కథలను ఎంచుకొని ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే రాసుకుంటే చాలు ఆ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుంది. అందుకే కొత్త దర్శకులు ఎక్కువగా సస్పెన్స్ క్రైమ్ కథలను ఎంచుకుంటారు. దర్శకుడు శ్యాం కూడా తన డెబ్యూ ఫిలింని ఓ ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్‌ని ఎంచుకున్నాడు.సస్పెన్స్‌తో పాటు రొమాంటిక్ సన్నివేశాలు, యూత్ ఆడియన్స్ మెచ్చే అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సాధారణ స్టూడెంట్స్ చుట్టూ మలుపులతో కూడిన స్క్రీన్ ప్లేతో కథనాన్ని నడిపించాడు. ఓ వైపు రెండు గ్యాంగ్ స్టార్స్ మధ్య వార్ ను చూపిస్తూనే…మధ్యలో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ క్రైంలో ఇన్వాల్వ్ అయిన తీరు, కిడ్నాప్ డ్రామాను ఆసక్తికరంగా చూపించాడు. అయితే ఈ సినిమాలో పేరు మోసిన నటీనటులు ఉంటే ఫలితం వేరేలా ఉండేది. ఎవరెలా చేశారంటే.. ఈ మూవీలో ప్రధాన పాత్రల్లో నటించిన ముగ్గురు కొత్త కుర్రాల్లే.అయినప్పటికీ చక్కగా నటించారు. ఎస్పీ పాత్రలో నటించిన రాజేశ్వరీ నాయర్ క్లైమాక్స్‌లో ఇచ్చే ట్విస్ట్ బాగుంటుంది.విలన్ పాత్రల్లో రామరాజు, శుభోదయం సుబ్బారావు ఆకట్టుకుంటారు. సీఐ పాత్రలో కనిపించే రవిప్రకాశ్ పాత్ర కూడా సస్పెన్స్ కొనసాగుతుంది.కావ్య పాత్రకి సిరి న్యాయం చేసింది. హీరోయిన్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు కానీ ఉన్నంతో పర్వాలేదనిపించింది. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే..సందీప్ కుమార్ కంగుల సంగీతం పర్వాలేదు.ఇలాంటి కథలకు నేపథ్య సంగీతం చాలా ముఖ్యం. అది కొంత మిస్ అయిందనే చెప్పొచ్చు. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఎడిటర్ జె.పి పని తీరు బాగుంది. ట్విస్టులతో కూడిన ఈ కథను చివరిదాకా సస్పెన్స్ కొనసాగించేలా ఎడిటింగ్ చేశాడు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. -
‘క్రైమ్ థ్రిల్లర్‌గా 'అం అః’.. రిలీజ్ డేట్ ఫిక్స్
ప్రస్తుతం ప్రేక్షకులను థియేటర్స్‌కి రప్పించడం చాలా కష్టంగా మారింది. కథలో కొత్తదనం ఉంటే తప్పా.. ప్రేక్షకులు సినిమాలను ఆదరించడం లేదు. . ఇలాంటి తరుణంలోనే డిఫరెంట్ టైటిల్, నేటితరం ఆడియన్స్ కోరుకునే థ్రిల్లింగ్ సబ్జెక్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది 'అం అః'. ‘ఎ డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్’ అనేది ట్యాగ్‌లైన్. సుధాకర్ జంగం, లావణ్య హీరో హీరోయిన్లుగా ఈ చిత్రానికి శ్యామ్ మండల దర్శకత్వం వహిస్తున్నారు. రంగస్థలం మూవీ మేకర్స్, శ్రీ పద్మ ఫిలిమ్స్ బ్యానర్స్‌పై జోరిగె శ్రీనివాస్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. . చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా రీసెంట్గా విడుదలైన 'నీ మనసే నాదని' వీడియో సాంగ్ , టీజర్‌కి మంచి స్పందన లభించింది.సస్పెన్స్‌కి తోడు రొమాంటిక్ సన్నివేశాలు, యూత్ ఆడియన్స్ మెచ్చే అంశాలతో రూపొందిన ఈ చిత్రం విడుదల తేదీని మేకర్లు తాజాగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 16న భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాతలు ప్రకటించారు. -
థర్డ్‌వేవ్ వచ్చేసినట్లే.. హెల్త్ మినిస్టర్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, శివాజీనగర(కర్ణాటక): ప్రజలు ఏదైతే జరగకూడదని కోరుకున్నారో అదే జరుగుతోంది. ఆరోగ్యమంత్రి మాటలే అందుకు నిదర్శనం. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ రేటును గమనిస్తే థర్డ్ వేవ్ వచ్చినట్లు ఖరారైందని ఆరోగ్య శాఖ మంత్రి కే.సుధాకర్ అన్నారు. గత ఆరు నెలల నుంచి పాజిటివ్ రేటు 0.1 శాతం కూడా లేదని, ప్రస్తుతం 1.06 శాతానికి పెరిగిందని, అంటే మూడో దశ ఆరంభమైనట్లు అర్థమని తెలిపారు. మంగళవారం బెంగళూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఒమిక్రాన్ రోజు రోజుకు పెరుగుతోంది, సోమవారం ఒకే రోజు 1.06 శాతానికి చేరింది, బెంగళూరులో అధికంగా సోకితులు ఉన్నారని చెప్పారు. బెంగళూరులో మైక్రో కంటైన్మెంట్లు? బెంగళూరులో కేసులు వచ్చినచోట మైక్రో కంటోన్మెంట్ జోన్ చేయడంపై సీఎంతో చర్చించనున్నట్లు తెలిపారు. బెంగళూరు ఇప్పటికే రెడ్ జోన్లో ఉండగా, కొన్ని కఠిన నిర్ణయాలు అవసరమన్నారు. సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని, ప్రజల బతుకులను యథాస్థితికి తెచ్చేలా కరోనాను నియంత్రించడం పెద్ద సవాల్‌గా మారిందని వాపోయారు. బెంగళూరుకు అధికంగా విదేశీయులు వస్తున్నారు. అందుచేత వైరస్ అతి వేగంగా విస్తరిస్తోందన్నారు. జనవరి 15 తరువాత మూడో అల రావచ్చని అనుకుంటే అంతకంటే ముందుగానే వచ్చేసిందని మంత్రి అన్నారు. కాంగ్రెస్‌నేతలు మేకెదాటు పాదయాత్రను విరమించుకోవాలని కోరారు. -
బిగ్‌బాస్-6లో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఫేం సుధాకర్?
Actor Sudhakar Reaction On His Entry In Bigg Boss Telugu OTT: బిగ్‌బాస్ సీజన్-6 మరో రెండు నెలల్లో ప్రారంభం కానుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఓటీటీలో ప్రసారం కానుంది. 24 గంటల పాటు లైవ్ స్ట్రీమింగ్ కానుంది. దీంతో ఈ షోపై మరింత ఆసక్తి పెరిగింది. ఇక షోలో ఎవరెవరు పాల్గొనబోతున్నారు? షో కాన్సెప్ట్ ఎలా ఉండనుంది అనేదానిపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ప్రస్తుతం కంటెస్టెంట్ల సెలక్షన్ జరుగుతున్న నేపథ్యంలో ఈసారి కూడా ముందుగానే లీకువీరులు ఈ లిస్ట్‌ను రివీల్ చేసే పనిలో పడ్డారు.ఇప్పటికే కొందరుపేర్లను బయటపెట్టేశారు. తాజాగా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఫేమ్ నటుడు(నాగరాజు) సుధాకర్ సైతం బిగ్‌బాస్ సీజన్-6లో పాల్గొంటారనే వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. తాజాగా దీనిపై తాజాగా సుధాకర్ స్పందించాడు. ఇది ఫేక్‌న్యూస్. ఈ వార్తలో ఏమాత్రం నిజం లేదంటూ కొట్టిపారేశాడు. దీంతో సీజన్-6లో సుధాకర్ ఎంట్రీ లేనట్టే. కాగా సీజన్-4లో అభిజిత్‌కు సుధాకర్ సపోర్ట్ చేసిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by sudhakarkomakula (@sudhakarkomakula) -
‘కట్నం’ వేధింపులు తట్టుకోలేక..
మెట్పల్లి: అదనపు కట్నం కోసం అత్తింటివారు పెట్టే వేధింపులు భరించలేక ఓ మహిళ తన ఐదేళ్ల కూతురుతో కలసి ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్సై సుధాకర్ కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం ఆత్మనగర్‌కు చెందిన వేములవాడ రాజశేఖర్‌కు నిర్మల్ జిల్లా కడెం మండలం మద్దిపడిగ గ్రామానికి చెందిన వనజ (26)తో వివాహం జరిగింది. వీరికి సాన్వి అనే ఐదేళ్ల కూతురు ఉంది. కొంతకాలంగా భర్తతోపాటు అత్త లింగవ్వ, ఆడపడుచులు.. మరికొంత కట్నం తీసుకురావాలంటూ వనజను వేధించడం ప్రారంభించారు. పెద్దమనుషుల సమక్షంలో రూ.లక్ష ఇచ్చినా వేధింపులు ఆగలేదు. మరింత కట్నం కావాలంటూ వనజను వేధిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో శనివారం ఉదయం కుటుంబ సభ్యుల మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన వనజ, తన కూతురును తీసుకుని ఇంట్లోంచి బయటకు వెళ్లింది. సమీపంలోని వరద కాల్వలో దూకి ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కాల్వలో వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. ఆదివారం తల్లీకూతుళ్ల మృతదేహాలు నీటిపై తేలాయి. పోలీసులు మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. వనజ తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఇంకెన్నాళ్లు డిసైడ్ చేస్తారు..స్త్రీని స్వేచ్ఛగా ఎదగనివ్వండి
గతంలో సినిమాల్లో ‘ఆధునిక మహిళ’ అనగానే కబ్బుల్లో ఉంటారని చూపించేవారు. వాళ్లు మోడర్న్ దుస్తులు ధరిస్తారు... స్మోక్ చేస్తారు.. కాపురాలు పట్టించుకోరు.. ఇప్పుడు కర్నాటకకు చెందిన ఒక మినిస్టరు ‘వారు పెళ్లి చేసుకోవడానికి పిల్లల్ని కనడానికి ఇష్టపడటం లేదు’ అన్నాడు. మహిళ ఆధునికం కావడం అంటే అభివృద్ధిలో, ఉత్పత్తిలో, ఉపాధిలో భాగం కావడం. వారిని ‘స్టీరియోటైప్’ చేయడం ఎన్నాళ్లు? వారిని చూసి భయపడటం ఎందుకు? ఆధునిక పురుషుడికి లేని విమర్శ మహిళకు ఎందుకు? మొదట ఆధునిక పురుషుడు ఏం చేస్తాడో చూద్దాం. అతడు రాజకీయవేత్త అవుతాడు. వ్యాపారవేత్త అవుతాడు. సిఇఓ, సినిమా స్టార్ అవుతాడు. సూట్ వేసుకుంటాడు. విరామంలో గోల్ఫ్ ఆడతాడు. చిన్న షార్ట్స్ వేసుకుని సముద్రంలో ఈత కొడతాడు. సరదాగా ఫ్రెండ్స్‌తో డ్రింక్ చేస్తాడు. బిజినెస్ ట్రిప్‌లకు వెళతాడు. సంపాదిస్తాడు. ఖర్చు పెడతాడు. వీటన్నింటికి సమాజం నుంచి ఆమోదం ఉంది. ఎందుకు? అతడు మగాడు. స్త్రీలు? వారూ చదువుతారు. సిఇఓలు అవుతారు. వ్యాపార సామ్రాజ్యాలను నిర్మిస్తారు. స్పోర్ట్స్ ఆడతారు. మెడల్స్ తెస్తారు. కారు డ్రైవ్ చేస్తారు. ఆఫీస్ పనుల మీద టూర్లు వెళతారు. కాని వీటికి విమర్శ వస్తుంది. ‘సంసారాన్ని వదిలేసి అలా ఎలా తిరుగుతుంది’. పశువు మెడలో తాడు కట్టేసి ఆ తాడును ఎంత దూరం వదిలినా ఆ పశువు తిరిగి తిరిగి మళ్లీ గుంజ దగ్గరకు చేరాలి అన్నట్టుగా భారతీయ సమాజం స్త్రీ ఎంత దూరం వెళ్లినా, ఎంత ఉన్నతి సాధించినా తిరిగి ‘సంసారం’, ‘మాతృత్వం’ వంటి ప్రాథమిక బాధ్యతల వద్దకే తిరిగి రావాలని భావిస్తుంది. స్త్రీని సంసారం నుంచి ‘ఆధునికత’ విముక్తం చేస్తుందనే భయం ఉంది– అందుకు ఏ రకమైన అధ్యయనం, ఆధారం లేకపోయినా. స్త్రీలు ఇల్లు కదలడం, చదువుకోవడం, మొదట స్టెనోలుగానో, టైపిస్ట్లుగానో చిన్న చిన్న ఉద్యోగాలు చేయడం, తమ కోసం మహిళా సంఘాలు పెట్టుకోవడం మొదలెట్టినప్పటి నుంచి వారిని ‘కేరికేచర్లుగా’ చూపిస్తూ, హేళన చేయదగ్గ స్త్రీలుగా చూపిస్తూ సమాజం వారిని అదుపు చేయాలని చూసింది. చూస్తోంది. పాత సినిమాల్లో ఆధునిక స్త్రీ అంటే విగ్గులు పెట్టేసి, చేతికి హ్యాండ్‌బ్యాగు వేలాడదీసి, క్లబ్బులో పేకముక్కలు చేతికి ఇచ్చేవారు. ఇప్పుడు పబ్బుల్లో చూపిస్తున్నారు. ఇవాళ బాగా చదువుకున్న ప్రతి స్త్రీ, ఉద్యోగ, ఉపాధి, వ్యాపార రంగాల్లో ఉన్న ప్రతి స్త్రీ ఆధునిక స్త్రీనే. ఆ చదువుకున్న స్త్రీ గృహిణిగా ఉంటున్నా ఆధునిక స్త్రీనే. అయితే ఛాందస వాదుల నిందలు, విమర్శలు ఏమంటే ‘వీరు కుటుంబాన్ని (భర్తను, పిల్లలను) నిర్లక్ష్యం చేస్తారు’ అని. అలా అని చెప్పి వీరి మీద ఒక ఒత్తిడి తెస్తారు. నిజానికి పురుషుడు ఎంత ఎదిగినా ఎలా కుటుంబంలోకి వస్తున్నాడో స్త్రీలు కూడా ఎంత ఎదిగినా కుటుంబంలోకి వస్తారు. వారికి తల్లిగా, భార్యగా ఇంటిని ఎలా నిర్వహించుకోవాలో తెలుసు. కాని పురుషుడికి ఉండే వెసులుబాటు వారికి ఉండదు. తన కెరీర్ కోసం పురుషుడు ముందు వెళ్లాలంటే స్త్రీ కుటుంబ నిర్వహణ కోసం తనను తాను కుదించుకోవాలి లేదా త్యాగం చేయాలి. ‘ఆధునిక మహిళ’ ఇక్కడ ప్రశ్నను లేవదీస్తుందని, నీకున్న హక్కు నాకు ఎందుకు లేదు అంటుందని, తద్వారా ‘పిల్లల్ని కంటూ ఇంటి దగ్గర పడుండే’ స్త్రీ పాత్ర నుంచి ఆమె విముక్తమవుతుందని సమాజానికి భయం. అందుకే సినిమాల్లో, అడ్వర్టైజ్మెంట్లలో, చవకబారు సాహిత్యంలో, కార్టూన్లలో అలాంటి స్త్రీలను హేళన చేయడం కనిపిస్తూ ఉంటుంది. ‘స్టెనోలందరూ బాస్ ఒళ్లో కూచుని ఉంటారు’ అని ఇప్పటికీ కార్టూన్లు గీస్తూ స్త్రీలను అవమానించే కార్టూనిస్టులు ఉద్యోగాల్లో తమను తాము నిరూపించుకోవాలనుకుంటున్న స్త్రీలకు ఎంత అన్యాయం చేస్తున్నారో ఊహించలేరు. ఇక టీవీ పెట్టగానే వచ్చే అడ్వర్టైజ్మెంట్లు ‘ఉప్పు గురించి’, ‘మసాలా దినుసుల గురించి’, ‘టీ గురించి’, ‘అత్తయ్యకు నచ్చిన హెయిర్ ఆయిల్ గురించి’ మాట్లాడే గృహిణులను చూపి చూపి నీ ఆర్థిక స్తోమత, చదువు ఎంతున్నా నువ్వు ఎంగేజ్ కావాల్సింది ఈ పనుల్లోనే అని కండిషన్ చేస్తూ వస్తుంటాయి. రాజకీయాల్లో ఉండే స్త్రీలను, టీవీ డిబేట్లలో మాట్లాడే స్త్రీలను, ఉద్యమాల్లో ఉండే స్త్రీలను, మేధావులుగా ఉండే స్త్రీలను, ఆత్మవిశ్వాసంతో ఉండే స్త్రీలను, ఫ్యాషన్– గ్లామర్ రంగాల్లో ఉండే స్త్రీలను, ఎన్.జి.ఓ రంగాల్లో ఉండే స్త్రీలను సమాజానికి ఉండే ‘సగటు పురుష స్వభావం’ అంగీరించే పరిస్థితులు నేటికీ కనిపించకపోవడానికి కారణం అలాంటి స్త్రీలు తెల్లారితే గిన్నెలు కడుక్కుంటూ కనిపించరేమోనన్న భయం. పిల్లల్ని బాగా చూసుకుంటూ, కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూ, ఇంటి బయట తాను ఎంచుకున్న కార్యరంగంలో స్త్రీ ఎదగడం మొదలెట్టి చాలా కాలం అయ్యింది. అయినా సరే ఆమెను వేలెత్తి చూపడం మానడం లేదు... కుటుంబ వ్యవస్థ స్థిరీకరణకు స్త్రీతో పాటు పురుషుడు సమాన బాధ్యత వహించాల్సి ఉన్నా. తాజాగా కర్నాటక ఆరోగ్యశాఖా మంత్రి సుధకార్ ‘ఆధునిక స్త్రీ సింగిల్‌గా ఉండటానికి ఇష్టపడుతోంది, ఆమె పిల్లల్ని కనడానికి ఇష్టపడటం లేదు’ అని వ్యాఖ్యానించాడు. నిజానికి స్త్రీకి తన శరీరం మీద హక్కు తనకే ఇంకా దక్కలేదు. పిల్లల్ని కనడం కనకపోవడం గురించి ఆమెకు వైవాహిక వ్యవస్థలో పూర్తిగా స్వేచ్ఛ లేదు. ఆమె ఏం చదవాలో, ఏ ఉద్యోగం చేయాలో కుటుంబమే డిసైడ్ చేస్తూ ఉంటుంది. ఆమె వివక్ష అనుభవిస్తూనే ఎదగాల్సి వస్తోంది. ఇన్ని జరుగుతున్నా ఆమె కుటుంబ చట్రానికి ఆవల వెళుతుందేమోనన్న భయంతో బ్లేమ్ కొనసాగుతూనే ఉంది. ఆధునిక స్త్రీ సమాజ హితం, కుటుంబ హితం కోరుతూనే ఉంది. అయితే దానికి సంబంధించిన రూల్స్ ఆమె మార్చదలుచుకుంటే వాటి మీద కదా చర్చ జరగాలి. అందాక నిందలు, విమర్శలు మానాలని అందరికీ చెబుదాం. పిల్లల్ని బాగా చూసుకుంటూ, కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూ, ఇంటి బయట తాను ఎంచుకున్న కార్యరంగంలో స్త్రీ ఎదగడం మొదలెట్టి చాలా కాలం అయ్యింది. అయినా సరే ఆమెను వేలెత్తి చూపడం మానడం లేదు... కుటుంబ వ్యవస్థ స్థిరీకరణకు స్త్రీతో పాటు పురుషుడు సమాన బాధ్యత వహించాల్సి ఉన్నా. -
‘నేను చనిపోతేనే నీకు ప్రేమ విలువ తెలుస్తుంది’
సాక్షి, అమీర్‌పేట: ‘నేను చనిపోతేనే నీకు ప్రేమ విలువ తెలుస్తుంది’అంటూ సెల్ఫీ వీడియో రికార్డు చేసి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ఆర్నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆదివారం ఉదయం వెలుగు చూసింది. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూర్ మండలం కేపీ పాలెం గ్రామానికి చెందిన గొర్రె సుధాకర్ (29) హైదరాబాద్‌కు వచ్చి ఎస్సై ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడు. బీకేగూడ వేంకటేశ్వర దేవాలయం సమీపంలో గదిని అద్దెకు తీసుకుని స్నేహితులతో కలిసి ఉంటున్నాడు. శనివారం రాత్రి రూమ్మేట్ భార్గవ్ గది తలుపులు తట్టగా, ఎంతసేపటికీ తలుపు తీయక పోవడంతో పై పోర్షన్లోకి వెళ్లి బాల్కనీ ద్వారా గదిలోకి వెళ్లి చూడగా సుధాకర్ ఉరికి వేలాడుతూ కనిపించాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ జరిపారు. సెల్ఫోన్లో తీసుకున్న సెల్ఫీ వీడియోను గుర్తించారు. ప్రేమ విఫలం కావడంతోనే సుధాకర్ ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నారు. మృతుడి బాబాయ్ శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
చిరంజీవిని కలిసిన లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ నటుడు
-
తప్పుగా మాట్లాడా.. క్షమించండి: డాక్టర్ సుధాకర్
సాక్షి, నర్సీపట్నం: విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంకు చెందిన ఎనస్తీషియా వైద్యుడు డాక్టర్ సుధాకర్ ఘటనకు సంబంధించి వైద్య విధాన పరిషత్ రాష్ట్ర కమిషనర్ యు.రామకృష్ణరాజు ఆదేశాల మేరకు వైద్య విధాన పరిషత్ జిల్లా కోఆర్డినేటర్ వి.లక్ష్మణ్‌రావు మంగళవారం శాఖాపరమైన విచారణ నిర్వహించారు. విచారణకు డాక్టర్ సుధాకర్ హాజరయ్యారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ నీలవేణిదేవి, ప్రసూతి వైద్యనిపుణులు గౌతమి, అప్పట్లో సూపరింటెండెంట్‌గా పనిచేసిన హెచ్‌వి.దొర, జనరల్ సర్జన్ సింహాద్రి, వైద్యులు, వైద్య సిబ్బందిని కోఆర్డినేటర్ విచారించారు. అనంతరం లక్ష్మణ్‌రావు విలేకరులతో మాట్లాడుతూ.. రూల్ నంబర్ 20 ప్రకారం ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారని డాక్టర్ సుధాకర్‌పై వచ్చిన అభియోగంతోపాటు ఆయన ప్రవర్తనపై విచారించామన్నారు. విచారణ నివేదికను కమిషనర్‌కు నివేదిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ సుధాకర్ విలేకరులతో మాట్లాడుతూ.. ‘తప్పు మాట్లాడి ఉంటే క్షమించండి.. అవగాహన లేక ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశా’ అని చెప్పారు. ‘నాకు తెలియకనే అలా మాట్లాడానని విచారణ అధికారికి విన్నవించాను.. ప్రభుత్వానికి చెడ్డపేరు తేవాలని మాట్లాడలేదు.. ఆరోగ్యం బాగులేని కారణంగా ఆ రోజు అలా మాట్లాడాను తప్ప కావాలని కాదు’ అని లిఖితపూర్వకంగా రాసిచ్చినట్టు తెలిపారు. డాక్టర్ సుధాకర్ విశాఖపట్నంలో మద్యం సేవించి నడిరోడ్డుపై న్యూసెన్స్ సృష్టించిన విషయం తెలిసిందే. -
ప్లాస్మా దానం చేసిన ఎమ్మెల్యే సుధాకర్
సాక్షి, కర్నూలు: ఇటీవల కరోనా బారినపడి కోలుకున్న కర్నూలు జిల్లా కోడుమూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ మంగళవారం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ప్లాస్మా దానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా వచ్చిందని భయపడకూడదని, అలాగని అజాగ్రత్తగా కూడా ఉండకూడదన్నారు. తనకు గత నెల 20న కరోనా వచ్చిందని, ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నానని చెప్పారు. ప్లాస్మా దానం వల్ల మరో ముగ్గురు కరోనా బాధితులకు ప్రాణదానం చేయవచ్చన్నారు. (ఆత్మస్థైర్యంతో జయించా) -
కరోనా :ఆత్మస్థైర్యంతో జయించా.. ఎమ్మెల్యే
కర్నూలు(హాస్పిటల్): సంజామల మండలం నొస్సం గ్రామంలో నివాసముండే రాజస్థాన్‌కు చెందిన యువకునికి ఈ ఏడాది మార్చి 28న కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. జిల్లాలో ఇదే తొలి కేసు. ఇది వెలుగు చూసిన వారం రోజుల తర్వాత నుంచి కేసులు క్రమంగా పెరగడం ప్రారంభమైంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా అధికారులు కరోనా కట్టడి చర్యలు చేపట్టారు. అయితే.. జూన్ ఒకటి నుంచి లాక్డౌన్ సడలింపులు ఇవ్వడంతో ప్రజలు సాధారణ జీవితానికి తిరిగి అలవాటు పడ్డారు. ఈ క్రమంలో కొందరు మాస్క్‌లు ధరించకపోవడం, చేతులను శుభ్రం చేసుకోకపోవడం, భౌతిక దూరం పాటించకపోవడంతో కేసుల సంఖ్య మళీ పెరుగుతోంది. జిల్లాలోనే కాదు.. దేశవ్యాప్తంగానూ ఇదే ధోరణి కన్పిస్తోంది. అయితే.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా జిల్లాలో రికవరీ అయ్యే బాధితుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉండటం గమనార్హం. కరోనా మహమ్మారిని ఆత్మస్థైర్యంతో జయించానని కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ తెలిపారు. 21 రోజుల పాటు హోం క్వారంటైన్లో ఉండి కరోనాను జయించిన ఆయన బుధవారం ‘సాక్షి’తో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘నాకు కరోనా పాజిటివ్‌గా జూన్ 25న నిర్ధారణ అయ్యింది. మొదట్లో భయపడ్డా. కుటుంబం, పార్టీ కార్యకర్తలు, నియోజకవర్గ ప్రజలు కళ్లముందు మెదిలారు. మొదట్లో కరోనాను జయిస్తానా అన్న ప్రశ్న తలెత్తింది. కానీ మంచి ఆహారం, ప్రాణాయామం, సరైన నిద్ర, డాక్టర్ల సూచనలు పాటించడం ద్వారా హోం క్వారంటైన్‌లోనే ఉండి వైరస్‌ను జయించా. స్పెషలిస్ట్ డాక్టర్ల నుంచి ఫోన్లో ఎప్పటికప్పుడు వైద్య సహాయం తీసుకున్నా. ఆహారం విషయంలోనూ శ్రద్ధ చూపా. ఉదయం నూనె లేకుండా టిఫిన్, రెండు గుడ్లు, అల్లం టీ, మధ్యాహ్నం చికెన్, అన్నం, సాయంత్రం తాజా పండ్లు, డ్రైఫ్రూట్స్, నిమ్మకాయ నీళ్లు, రాత్రి అల్పాహారం, పసుపు, మిరియాలు కలిపిన పాలు తీసుకున్నా. వేడినీళ్లు ఆవిరి పట్టా. ప్రతిరోజూ వేడినీళ్లు మాత్రమే తాగేవాడిని. శ్వాసకు సంబంధించిన 15 రకాల వ్యాయామాలు చేశా. ఒంటరితనం నుంచి బయటపడడానికి వీలుగా వైఎస్సార్, అంబేడ్కర్ జీవిత చరిత్రలు చదివా. ఇలా క్రమశిక్షణ, మనోధైర్యంతో మహమ్మారిని జయించా. నా ఆరోగ్యం కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటా. కరోనా వచ్చిన తర్వాత బాధపడడం కంటే రాకుండా జాగ్రత్తలు తీసుకోవడమే ఉత్తమం.’ -
కోడుమూరు ఎమ్మెల్యేకు కరోనా
కోడుమూరు: కర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్‌కు గురువారం కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. రెండు రోజులుగా తీవ్ర జ్వరంతో ఆయన హోమ్క్వారంటైన్లో ఉన్నారు. కె.నాగలాపురం దగ్గర ఉన్న విశ్వభారతి ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డుకు ఎమ్మెల్యేను తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా తెలంగాణలోనూ పలువురు ఎమ్మెల్యేలు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. -
'సుధాకర్ విషయంలో టీడీపీది మొసలి కన్నీరు'
సాక్షి, విశాఖపట్నం : దేశ చరిత్రలో ఎన్నడు లేని విధంగా వైఎస్సార్సీపీ అఖండ విజయం సాధించిందని మంత్రి అవంతి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఆదివారం విశాఖపట్నంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక దాదాపు 4లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి దక్కుతుందని తెలిపారు. అమ్మఒడి ద్వారా ఏపీ అక్షరాస్యతలో కేరళను అధిగమించిందన్నారు. అమ్మఒడి ద్వారా అక్షరాస్యతతో పాటు అభివృద్ధి కూడా సాధ్యమన్నారు. కరోనా సమయంలో గ్రామ వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది సేవలు మరువలేనివన్నారు. రాబోయే రోజుల్లో గ్రామ వాలంటీర్లకు సమచిత స్థానం కల్పించబోతున్నామని పేర్కొన్నారు. నూటికి నూరు శాతం అవినీతికి తావు లేకుండా ప్రభుత్వం పని చేస్తుంది. (డాక్టర్ సుధాకర్ వ్యవహారం: మంత్రి సవాల్) వలంటీర్లు, సచివాలయ సిబ్బంది విధులకు ఆటంకం కలిగిస్తే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడానికి వెనుకాడదని హెచ్చరించారు. రాష్ట్రంలో అభివృద్ధికి చంద్రబాబు కొన్ని వ్యవస్థలను తన ఆధీనంలో ఉంచుకుని రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి అడుగడుగునా అడ్డు పడుతున్నారు. విద్యుత్ ఛార్జీలపై మాట్లాడే నైతిక హక్కు ఆయనకు లేదని విమర్శించారు. ప్రమాదకర పరిశ్రమల విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గేది లేదని, నిబంధనలు పాటించని పరిశ్రమలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. ప్రజలెవరూ ఆందోళన చెందనవసరం లేదని తెలిపారు. టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయం మేరకే భూములు వేలం వేస్తున్నారు. గత ప్రభుత్వ హయంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారని.. కావాలనే ఇప్పుడు దీనిని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు పర్యటన విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. డాక్టర్ సుధాకర్ విషయంలో టీడీపీ మొసలి కన్నీరు కారుస్తుందని, అతని సస్పెన్షన్ శాఖాపరమైన నిర్ణయం అని అవంతి వెల్లడించారు. (ఏపీలో 2627కు చేరిన కరోనా కేసులు) -
సుధాకర్ వ్యవహారంలో సీబీఐ దర్యాప్తు
సాక్షి, అమరావతి: మద్యం తాగి ఉభయ రాష్ట్రాల సీఎంలను, ప్రధానమంత్రిని అసభ్య పదజాలంతో దూషిస్తూ రోడ్డుపై న్యూసెన్స్ చేసినందుకు అనస్తీషియా వైద్యుడు సుధాకర్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన వ్యవహారంలో హైకోర్టు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. దీనిపై 8 వారాల్లో మధ్యంతర నివేదిక ఇవ్వాలని సీబీఐకి నిర్దేశించింది. ఈ కేసుకు సంబంధించిన అన్ని వీడియో క్లిప్పులను, ప్రభుత్వ కౌంటర్, మెజిస్ట్రేట్ నివేదికలతో అన్ని రికార్డులను సీబీఐ అడిగినప్పుడు ఇవ్వాలని రిజిస్ట్రా్టర్ జనరల్‌కు స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రాకేష్‌కుమార్, జస్టిస్ కంచిరెడ్డి సురేష్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఆదేశాలిచ్చింది. ఈ కేసులో పోలీసులు ఎంత నిజాయతీగా, నిష్పాక్షికంగా దర్యాప్తు జరిపినా, ఎవరో ఒకరు వేలెత్తి చూపుతారని, అందువల్ల సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తున్నట్లు ధర్మాసనం ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. ► డాక్టర్ సుధాకర్ విషయంలో అధికారులు అమానుషంగా ప్రవర్తించారని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత హైకోర్టుకు లేఖ రాశారు. లేఖతోపాటు ఓ వీడియోనూ జత చేశారు. ఆ వీడియోను ఎడిట్ చేసి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఫొటోను జత చేశారు. దీన్ని హైకోర్టు సుమోటో పిల్‌గా పరిగణించడం తెలిసిందే. ► దీనిపై జస్టిస్ రాకేష్‌కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారణ జరిపింది. ఈ నెల 16న విశాఖలో డాక్టర్ సుధాకర్ మద్యం సేవించి సిగరెట్లు తాగి పోలీసులపైకి విసరడం.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను, ప్రధానమంత్రిని అసభ్య పదజాలంతో దూషించడం.. తదితరాలకు సంబంధించిన వీడియో క్లిప్పింగులను పోలీసులు ధర్మాసనం ముందుంచారు. పోలీసుల పట్ల అత్యంత అభ్యంతరకరంగా సుధాకర్ వ్యవహరించారని ప్రభుత్వ న్యాయవాది వైఎన్ వివేకానంద నివేదించారు. ► ఈ క్లిప్పింగులను పరిశీలించిన ధర్మాసనం.. ఇవి గానీ, అనిత పంపిన వీడియో క్లిప్పింగులు గానీ పరిపూర్ణంగా లేవని, వీటి ఆధారంగా నిర్దిష్టమైన నిర్ణయానికి రావడం సాధ్యం కాదంది. ► అనంతరం డాక్టర్ సుధాకర్ వాంగ్మూలాన్ని నమోదు చేసి విశాఖ నాల్గవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి పంపిన నివేదికనూ పరిశీలించిన ధర్మాసనం.. ఇందులోని అంశాలకు, ప్రభుత్వ కౌంటర్లోని అంశాలకు మధ్య తేడాలున్నాయంది. సుధాకర్ ఒంటిపై ఆరు గాయాలున్నట్లు మేజిస్ట్రేట్ నివేదికలో ఉందని, అయితే వైద్యులు ఒక గాయమే ఉన్నట్లు పేర్కొన్నారని తెలిపింది. ఇవన్నీ పలు అనుమానాలకు తావిస్తున్నాయని, అందువల్ల ఓ స్వతంత్ర దర్యాప్తు సంస్థతో దర్యాప్తు జరిపించడం మేలంటూ సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. -
స్థానికులే చేతులు కట్టేశారు
సాక్షి, విశాఖపట్నం/పెదవాల్తేరు (విశాఖ తూర్పు): నర్సీపట్నంలోని ప్రభుత్వాస్పత్రిలో మత్తు వైద్యుడిగా పనిచేస్తూ సస్పెండైన డాక్టర్ సుధాకర్ శనివారం సాయంత్రం మద్యం సేవించి స్థానికులు, పోలీసులపై దురుసుగా ప్రవర్తించడంతో స్థానికులే చేతులు కట్టేశారని అడిషనల్ డీజీపీ, విశాఖ నగర పోలీస్ కమిషనర్ రాజీవ్‌కుమార్ మీనా ఆదివారం మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. డాక్టర్ సుధాకర్‌పై 353, 427 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామన్నారు. స్థానికుల ఫిర్యాదు మేరకు డాక్టర్‌ను లాఠీతో కొట్టారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశామని చెప్పారు. వైద్యుల పరిశీలనలో సుధాకర్ డాక్టర్ సుధాకర్ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారని ప్రభుత్వ మానసిక ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాధారాణి తెలిపారు. ఆదివారం ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ఆయన ‘ఎక్యూట్ హ్యాండ్ యాడ్ కామెంట్ సైకోసిస్’ సమస్యతో బాధపడుతున్నారని చెప్పారు. ఇదిలావుండగా, డాక్టర్ సుధాకర్ తల్లి కావేరిభాయి ఆస్పత్రి వద్ద మీడియాతో మాట్లాడుతూ.. తన కుమారుడిపై అన్యాయంగా పిచ్చివాడిగా ముద్ర వేశారని ఆరోపించారు. -
అనస్థీషియా వైద్యుడి వీరంగం
సాక్షి, అమరావతి/విశాఖపట్నం/సీతమ్మధార (ఉత్తర): నర్సీపట్నం అనస్థీషియా (మత్తు) వైద్యుడు సుధాకర్ మరోసారి వీరంగమాడారు. జాతీయ రహదారిపై కారు ఆపి నానా హంగామా సృష్టించారు. పోలీసులు చెప్పిన వివరాల మేరకు.. నర్సీపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో మత్తు డాక్టర్‌గా విధులు నిర్వర్తిస్తూ ఇటీవల సస్పెన్షన్‌కు గురైన డాక్టర్ సుధాకర్ శనివారం సాయంత్రం మర్రిపాలెం నుంచి బాలయ్యశాస్త్రి లేఅవుట్లోని తన ఇంటికి వెళుతున్నారు. మార్గంమధ్యలో పోర్టు ఆస్పత్రి వద్ద జాతీయ రహదారిపై తన కారాపి స్థానికులను, ఆటో డ్రైవర్లను దుర్భాషలాడటం ప్రారంభించారు. దీంతో వారు 100కు ఫోన్ చేయడంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా వినకుండా వారిపై తిరగబడ్డాడు. చొక్కా విప్పి నడిరోడ్డుపై పడుకుని పోలీసుల్ని, స్థానికుల్ని, ప్రజాప్రతినిధుల్ని నోటికొచ్చినట్టు తిట్టడం ప్రారంభించారు. డాక్టర్ ప్రవర్తనను వీడియో తీస్తున్న హెడ్ కానిస్టేబుల్ రమణ చేతిలోంచి సెల్‌ను లాక్కుని రోడ్డుకేసి కొట్టారు. వైద్యుడిని అదుపు చేసేందుకు పోలీసులు అతని చేతులను తాళ్లతో కట్టారు. మద్యం మత్తులో ఉన్నట్టు అనుమానించి ఎమ్ఎల్సీ చేయించడం కోసం కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ రక్త నమూనాలు సేకరించి వైద్యులు రిఫర్ చేయడంతో ప్రభుత్వ మానసిక వైద్యశాలకు తరలించినట్టు ఈస్ట్ ఏసీపీ కులశేఖర్ చెప్పారు. వైద్యుడిపై 353 సెక్షన్ కింద కేసు నమోదు చేశామని, డాక్టర్‌ను లాఠీతో కొట్టారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేసినట్టు సీపీ ఆర్కే మీనా చెప్పారు. నిందితులను అరెస్ట్ చేయాలి: చంద్రబాబు విశాఖపట్నంలో డాక్టర్ సుధాకర్‌పై జరిగిన దాడి.. దళితులపై దాడి, వైద్య వృత్తిపై దాడి అని ప్రతిపక్ష నేత చంద్రబాబు ఒక ప్రకటనలో తెలిపారు. నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి తక్షణమే అరెస్ట్ చేయాలని కోరారు. -
ముందు జాగ్రత్తే మందు
సాక్షి, అమరావతి: కరోనా మహమ్మారి నివారణకు ముందు జాగ్రత్తే మందని అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ ఒరిజిన్ (ఆపి) ప్రెసిడెంట్ డాక్టర్ సుధాకర్ జొన్నలగడ్డ అభిప్రాయపడ్డారు. కరోనా వైరస్‌కు మందు లేనందున ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. కరోనా లక్షణాలున్న వారు సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్లడాన్ని సామాజిక బాధ్యతగా గుర్తించాలని చెప్పారు. లాక్డౌన్ విధింపు, భౌతిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకున్నాకే ప్రపంచ దేశాల్లో ఈ వైరస్ వ్యాప్తికి ఎంతో కొంత అడ్డుకట్ట పడిందని బుధవారం ఆయన ‘సాక్షి’తో చెప్పారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. ► ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్ల ద్వారా రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు ప్రయత్నించాలి. ► ఆహారంలో విటమిన్ సీ, డీ, జింక్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ► అమెరికాలోని భారతీయులు, ఇతర దేశాలవారిని కరోనా నుంచి రక్షించేందుకు ఆపి తరఫున అనేక చర్యలు చేపట్టాం. ► వైద్యపరమైన సాయం, సలహాలు, సూచనలు అందిస్తున్నాం. ► భారతీయ విద్యార్థులు, భారత సంతతి ప్రజలకు, వారి కుటుంబాలకు హెల్ప్‌లైన్ ద్వారా సహాయ సహకారాలు అందిస్తున్నాం. ► హైడ్రాక్సిన్ క్లోరోక్విన్ ఔషధం కోవిడ్ –19 రోగులకు ఇవ్వడం ట్రీట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత ఆశాజనకంగా లేదని తమ సంస్థ వైద్యుల పరిశీలనలో తేలింది. ► రెమిడెస్విర్ వంటి యాంటీ వైరల్ మందులు పనిచేస్తున్నట్టుగా మా పరిశీలనలో తేలింది. ► కోవిడ్–19 బారినపడి కోలుకున్న రోగి నుంచి ప్లాస్మా మార్పిడి ఆశాజనకంగా ఉన్నట్టు తేలింది. -
పొట్టి చిత్రాల పి.సి.శ్రీరామ్
జూబ్లీహిల్స్: చలన చిత్రం.. ఈ పరిశ్రమ ఎందరికో కలల ప్రపంచం. ఇందులో రాణించాలని వేలాది మది ఉవ్విళ్లూరుతుంటారు. అదే కలగా జీవిస్తుంటారు. కొందరు విజయం సాధిస్తుంటారు.. ఇంకొందరు అవకాశాలు రాక వెనుదిగుతుంటారు. కొందరు మాత్రమే తాము అనుకున్న లక్ష్యానికి చేరుకునేందుకు ప్రతి అవకాశాన్నీ అందిపుచ్చుకుని తమకు అనుకూలంగా మలచుకుంటారు. అలాంటి వారిలో ఒకడు ‘సుధాకర్’. కెమెరాపై ప్రేమ పెంచుకున్న ఈ యువకుడు పీసీ శ్రీరామ్ అంతటి సినీమాటోగ్రాఫర్‌గా ఎదగాలని గ్రామం నుంచి సిటీకి వచ్చాడు. తన జర్నీలో భాగంగా పొట్టి (షార్ట్ ఫిలింమ్స్) చిత్రాలు రూపొందించడంలో తనదైన ముద్ర వేశాడు ఈ సూర్యాపేట కుర్రాడు. యాత్ర అలా మొదలైంది.. సూర్యాపేటకు చెందిన సుధాకర్‌కు చిన్నప్పటి నుంచీ ఫొటోగ్రఫీ అంటే పిచ్చి. తండ్రి కొనిచ్చిన చిన్ని కెమెరాతో రకరకాల ప్రయోగాలు చేస్తూ ఫొటోగ్రఫీలో మెళకువలు నేర్చుకున్నాడు. క్రమంగా స్మార్ట్ ఫోన్ల రావడం.. వాటిలో అత్యుత్తమ నాణ్యత గల కెమరాలు ఉండడంతో ఫోన్‌తోనూ లఘు చిత్రాలు తీసి భళా అనిపించుకున్నాడు. పెద్ద చిత్రాలను షూట్ చేసే క్రమంలో ప్రయోగాలకు అంత అవకాశం ఉండదు. ఎంతో ఎత్తుకు ఎదిగితేగాని అలా చేయలేం. దాంతో పొట్టి చిత్రాలు రూపొందించేందుకు వచ్చిన ప్రతి అవకాశాన్ని తన ఫొట్రోగ్రఫీ ప్రయోగాలకు అనువుగా మార్చుకున్నాడు. ప్రతి లఘు చిత్రాన్ని దేనికదే కొత్తదనంతో తీర్చిదిద్దాడు. అలా ఇప్పటిదాకా సుధాకర్ దాదాపు 200కు పైగా షార్ట్ ఫిలిమ్స్‌కు కెమెరామెన్‌గా పనిచేసాడు. సుధాకర్ ఫొటోగ్రఫీ అందించిన ‘హెలినా, అనుక్షణం, రాధాకృష్ణ, శ్వాసనువ్వే, రుధిరం, సిక్త్స్ సెన్స్’ వంటి లఘుచిత్రాలు యూట్యూబ్‌లో పెద్దహిట్. వీటితో మంచి గుర్తింపు సైతం తెచ్చుకున్నాక.. ఇతడి ప్రతిభను గుర్తించిన నిర్మాతలు ఇటీవల విడుదలైన ‘రహస్యం’ చలనచిత్రానికి పూర్తిస్థాయి సినిమాటోగ్రాఫర్‌గా అవకాశం కల్పించారు. మరో రెండు సినిమాలకు కూడా ఛాయా గ్రాహకుడిగా అవకాశాలు అందిపుచ్చుకున్నాడు సుధాకర్. ఆర్జీవీ స్ఫూర్తిగా.. ఫొటోగ్రఫీ తిలక్ వద్ద నేర్చుకున్నాను. మావూరి వంట కార్యక్రమానికి అసిస్టెంట్‌గా పనిచేసాను. రామ్‌గోపాల్ వర్మ స్ఫూర్తిగా డబ్బులు కూడబెట్టుకుని 5డీ కెమెరా కొని షార్ట్ఫిలిమ్స్కు పనిచేశాను. వాటితో మంచి గుర్తింపు వచ్చింది. పెద్ద చిత్రాలకు పనిచేసే అవకాశాలు ఇప్పుడిప్పుడే పెరుగుతున్నాయి. నాఫేస్బుక్ పేజ్‌కు 5వేల మంది, ఇన్‌స్ట్రాగామ్ పేజ్‌కు 4వేల మంది అభిమానులు ఉన్నారు. ఈ రంగంలో మంచి సినిమాటోగ్రాఫర్‌గా ఎదగడానికి ప్రయత్నిస్తున్నాను. – సుధాకర్, షార్ట్ఫిలిమ్స్ సినిమాటోగ్రాఫర్ -
రోడ్డు ప్రమాదంలో హీరోకు గాయాలు.. మహిళ మృతి
సాక్షి, మంగళగిరి : శేఖర్‌కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ చిత్రంతో వెండితెరకు పరిచయమైన సుధాకర్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. మంగళగిరి మండలం చినకాకాని జాతీయ రహదారిపై శనివారం జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా, సుధాకర్ గాయపడ్డాడు. సుధాకర్ తాజాగా ‘నువ్వు తోపురా’ చిత్రంలో నటించారు. ఈ చిత్ర ప్రచారంలో భాగంగా హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై మొక్కలకు నీళ్లు పెడుతున్న మహిళను సుధాకర్ కారు ఢీకొంది. ఈ ఘటనలో ఆ మహిళ అక్కడికక్కేడే మృతి చెందగా, కారులో ఉన్న నటుడు సుధాకర్ గాయపడ్డారు. కాగా హరినాథ్ బాబు దర్శకత్వంలో సుధాకర్ నువ్వు తోపు రా అనే సినిమాలో సుధాకర్ నటించాడు. ఈ సినిమా వచ్చే నెల 3న విడుదల కానుండగా.. సినిమా ప్రమోషన్ కోసం హైదరాబాద్ నుంచి గుంటూరుకు వెళ్తోన్న క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం తెలుసుకొని ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఇమడలేకే లొంగిపోయాను!
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలు గతి తప్పాయని, ప్రజలకు దూరమైన మావోయిస్టులు వారిపైనే దాడులకు పాల్పడుతూ, అక్రమ వసూళ్లకు తెగబడుతున్నారని ఆ పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు సత్వాజీ అలియాస్ సుధాకర్, అలియాస్ కిరణ్ అలియాస్ శశికాంత్ పేర్కొన్నారు. బుధవారం సుధాకర్ ఆయన భార్య అరుణ (అలియాస్ నీలిమ అలియాస్ మాధవి)తో కలసి డీజీపీ మహేందర్‌రెడ్డి ఎదుట లొంగిపోయాడు. తాము లొంగిపోవడానికి కారణాలను సుధాకర్ మీడియాకు వివరించారు. ‘బిహార్, జార్ఖండ్ ప్రాంతాల్లో ప్రజలకు పార్టీ పూర్తిగా దూరమైంది. అక్కడి పార్టీ శ్రేణుల్లో కుటుంబ పాలన, బంధుప్రీతి, అక్రమ వసూళ్లు పెరిగిపోయాయి. తెలంగాణలో మావోయిస్టు పార్టీలో వివిధ హోదాల్లో పని చేసిన నాకు ఎక్కడా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు కానరాలేదు. సెంట్రల్ కమిటీ సభ్యుడిగా బిహార్, జార్ఖండ్‌లో పనిచేసిన సమయంలో అడుగడుగునా సిద్ధాంతాల ఉల్లంఘన కన్పించింది. తొలుత ఇది కిందిస్థాయి వరకే పరిమితమైందనుకున్నా.. అగ్రనాయకుల దృష్టికి కూడా దీన్ని తీసుకెళ్లా. వారికి కూడా అక్కడి అకృత్యాలపై నియంత్రణ లేదన్న సంగతి చాలా ఆలస్యంగా నాకు అర్థమైంది. పార్టీ విధానం మారాలని, ప్రజలకు దూరమవుతున్నామని పలుమార్లు సీనియర్లకు చెప్పి చూశాను. అయినా లాభం లేకపోయింది. పైగా ప్రజలపైనే దాడులు, వారి వద్దే అక్రమ వసూళ్లు నాలో కలత రేపాయి. పార్టీలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల్లో శారీరక వేధింపుల్లేవు. కానీ సంప్రదాయ సమాజంలో అనాదిగా వస్తున్న పితృస్వామ్యమే అక్కడా తిష్టవేసింది. దీనివల్ల మహిళా సభ్యులకు వివిధ రూపాల్లో ఒత్తిడి పెరుగుతోంది. ఫలితంగా వాళ్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పోలీసులకు పట్టుబడ్డ సమయంలో మా సోదరుడి వద్ద దొరికిన రూ.25 లక్షలు పార్టీవే. దానికి అన్ని లెక్కలు పార్టీ అకౌంట్స్ వద్ద ఉన్నాయి. నేనెప్పుడూ నా వ్యక్తిగత ప్రయోజనాల కోసం డబ్బు వసూళ్లకు పాల్పడలేదు. నన్ను పార్టీ సస్పెండ్ చేయలేదు. పార్టీ విధానాలు నచ్చకే తప్పుకొంటున్నట్లు ఏడాదిగా చెబుతున్నా. నా భార్యతో కలిసి బయటకి వస్తున్నట్లు లేఖ రాసి వచ్చా’అని వివరించారు. అనారోగ్యం, విభేదాలే కారణం: అరుణ పార్టీలో పలువురి ఆధిపత్య ధోరణి నచ్చకే తాము బయటికి వచ్చామని అరుణ వివరించారు. వాస్తవ సిద్ధాంతాలకు పూర్తి వ్యతిరేకంగా పార్టీ నడుచుకుంటోందని, దీనిపైనే విభేదించే పార్టీని వీడినట్లు తెలిపారు. పార్టీలో మహిళలపై శారీరకంగా అఘాయిత్యాలు జరగట్లేదని, అయితే ఆధిపత్యం చెలాయించడం, ఒత్తిళ్లు చేయడం వల్లే పలువురు మహిళా మావోయిస్టులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పారు. వేధింపులతోనే మహిళా మావోలు ఆత్మహత్యలు: డీజీపీ మావోయిస్టు పార్టీ బలహీనపడిందని, మిలీషియా సంఖ్య 500కు పడిపోయిందని డీజీపీ మహేందర్‌రెడ్డి చెప్పారు. అగ్రనేతల్లో విభేదాలు తీవ్ర స్థాయికి చేరాయని పేర్కొన్నారు. మహిళా దళ సభ్యులపై అకృత్యాలు పెరిగిపోయినట్లు తమకు సమాచారం ఉందని చెప్పారు. ఈ కారణంగానే పలువురు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, అయితే ఇవేమీ ఇంతకాలం వెలుగుచూడలేదన్నారు. ‘సత్వాజీ లొంగుబాటు వెనుక చాలా పెద్ద తతంగమే నడిచింది. ఏడాది కింద అతడి సోదరుడు లొంగిపోయిన సమయంలోనే పార్టీ తీరుపై సెంట్రల్ కమిటీ సభ్యుడు సత్వాజీ అలియాస్ సుధాకర్ అసంతృప్తితో ఉన్నట్లు తెలుసుకున్నాం. ఈ క్రమంలోనే ‘ఇంటర్ స్టేట్ పోలీస్ కో–ఆర్డినేషన్ అండ్ కో–ఆపరేషన్’లో భాగంగా తెలంగాణ పోలీసులు జార్ఖండ్ పోలీసులకు ఈ సమాచారాన్ని చేరవేసి వారి సహకారంతో సత్వాజీ లొంగుబాటు సఫలీకృతం చేయగలిగాం. మావోయిస్టు పార్టీ అధినాయకత్వంలో భేదాభిప్రాయాలు ఉన్నాయి. కీలకమైన దండకారణ్యంలోనూ ముఖ్యనేతలు సోనూ, దేవూజీల మధ్య, స్థానిక గిరిజన నేతలకు తెలంగాణ నాయకులకు మధ్య విభేదాలున్నాయి. మావోయిస్టు అగ్రనేత సంబాల కేశవరావు భార్య రామక్క (అలియాస్ శారద) 2010లో వేధింపుల కారణంగానే ఆత్మహత్య చేసుకుంది. బస్తర్‌కు చెందిన డీవీసీఎం చందన, కమాండర్ చుక్కీ, కోదాడకు చెందిన దళ సభ్యురాలు గడ్డం భాగ్యలక్ష్మి ఆత్మహత్య చేసుకున్న వారిలో ఉన్నారు. పార్టీ విధానాలు గతి తప్పుతున్న క్రమంలో చాలామంది పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. ఇంకా మావోయిస్టుల్లో కొనసాగుతున్న వారు లొంగిపోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. సుధాకర్ దంపతులపై ఉన్న రివార్డు (సుధాకర్‌పై రూ.25 లక్షలు, అరుణపై రూ.10 లక్షలు) మొత్తం రూ.35 లక్షలను వీరికే ఇస్తాం. ఆ డబ్బుతో వీరు కొత్త జీవితం మొదలుపెట్టొచ్చు. ఇక ఇతనిపై ఉన్న ఎన్ఐఏ కేసు మాత్రం సుధాకర్ న్యాయపరంగా ఎదుర్కోవాల్సిందే’అని డీజీపీ వివరించారు. సమావేశంలో ఇంటెలిజెన్స్ ఐజీ నవీన్‌చంద్, అడిషనల్ డీజీపీ జితేందర్ తదితరులు పాల్గొన్నారు. అరుణ నేపథ్యమిదీ.. బిహార్, జార్ఖండ్ స్టేట్ కమిటీ సభ్యురాలుగా కొనసాగిన వైదుగుల అరుణ (అలియాస్ మాధవి, నీలిమ)ది వరంగల్ రూరల్ జిల్లా దుగ్గొండి మండలం మామడపురం గ్రామం. 3వ తరగతి చదువుతున్నపుడే ఈమెకు బాల్య వివాహం జరిగింది. ఆ పెళ్లి అరుణకు ఇష్టం లేదు. 8వ తరగతిలో తమ గ్రామానికి వచ్చి విప్లవపాటలు పాడే మావోయిస్టు దళానికి ఆకర్షితురాలై దళంలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. 1998లో సుధాకర్‌ను వివాహం చేసుకున్నారు. సుధాకర్ ప్రస్థానం ఇదీ! నిర్మల్ జిల్లా సారంగపూర్ గ్రామానికి చెందిన సుధాకర్‌ది బీద కుటుంబం. 7వ తరగతి వరకు గ్రామంలోనే చదువుకున్న సుధాకర్.. నిర్మల్‌లో 8 నుంచి ఇంటర్‌వరకు చదివాడు. 1983లో ఇంటర్ చదువుతున్న క్రమంలోనే రాడికల్ స్టూడెంట్ యూనియన్ (ఆర్ఎస్యూ)లో చేరి చదువు ఆపేశారు. ఆర్ఎస్యూ జిల్లా కమిటీ కార్యదర్శి కటకం సుదర్శన్ వద్ద చేరి దళంలో కొరియర్‌గా చేరారు. ఇర్రి మోహన్‌రెడ్డి వద్ద ఆయుధాల తయారీలో శిక్షణ పొందాడు. బెంగళూరులోని స్థావరంలో ఆయుధాలు తయారుచేసి దేశంలోని పలు దళాలకు చేరవేసేవాడు. 1986లో అరెస్టయి 1989 వరకు జైలు శిక్ష అనుభవించారు. జైలులో ఉన్న సమయంలో వరవరరావుతో పరిచయం ఏర్పడింది. జైలు నుంచి బయటి కొచ్చాక వరవరరావుతో కలసి రైతు కూలీ సంఘంలో పనిచేశారు. 1990లో చెన్నారెడ్డి హయాంలో మావోలపై నిషేధం ఎత్తివేసినపుడు అజ్ఞాతం నుంచి బయటకొచ్చారు. ఇంద్రవెల్లి అమరుల స్మారక స్తూపం నిర్మాణంలో కీలకంగా వ్యవహరించాడు. పోలీసుల ఒత్తిడితో తిరిగి అజ్ఞాతంలోకి వెళ్లారు. అక్కడి నుంచి 1990లో దళంలో సభ్యుడిగా చేరిన సుధాకర్ 1999 నాటికి ఉత్తర తెలంగాణ స్పెషల్ జోన్ కమిటీలో, సబ్ కమిటీ ఆన్ మిలిటరీ అఫైర్స్‌లో సభ్యుడిగా ఎదిగాడు. 2001–03లో దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా ఛత్తీస్‌గఢ్‌లో, 2003–13 వరకు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా మిలిటరీ కమిషన్‌లో పనిచేశారు. 2013లో పదోన్నతిపై సెంట్రల్ కమిటీ సభ్యుడిగా ఈస్టర్న్ రీజనల్ బ్యూరో (ఈఆర్బీ)కి బదిలీ అయి బిహార్ రీజినల్ కమిటీలో పనిచేశారు. -
‘అప్పుడేమో విరక్తితో.. ఇప్పుడు వేధింపులతో..’
సాక్షి, హైదరాబాద్ : నిర్మల్ జిల్లాకు చెందిన మావోయిస్టు అగ్రనేత సట్వాజి అలియాస్ సుధాకర్, అతని భార్య వైదుగుల అరుణ అలియాస్ నీలిమ తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... 1983 నుంచి 1985 వరకు సుధాకర్ ఆదిలాబాద్‌లో కొరియర్‌గా పనిచేసినట్లు తెలిపారు. అనంతరం డీసీఎస్ కనకం సుదర్శన్ సహకారంతో మావోయిస్టుల్లో చేరినట్లు పేర్కొన్నారు. ‘బెంగళూరు కేంద్రంగా సుధాకర్ ఆయుధాలు సరఫరా చేసేవాడు. ఈ క్రమంలో ఒకసారి జైలుకు వెళ్లాడు. అక్కడే సుధాకర్‌కు వరవరరావు పరిచయం అయ్యారు. 1990 నుంచి సుధాకర్ అఙ్ఞాతంలోకి వెళ్లి 1992-94 మధ్య మావోయిస్టు దళ సభ్యుడిగా పనిచేశాడు. అప్పటి నుంచి అంచెలంచెలుగా ఎదిగి అనేక పదవుల్లో పనిచేశాడు. 2003 నుంచి 2013 వరకు స్టేట్ మిలటరీ కమిషన్ సభ్యుడిగా... 2014 నుంచి 2019 వరకు కేంద్ర కమిటీ సభ్యుడిగా... మిలటరీ కమిషన్ సభ్యుడిగా బిహార్, జార్ఖండ్ కేంద్రంగా పనిచేశాడు’ అని సుధాకర్‌కు సంబంధించిన విషయాలు డీజీపీ వెల్లడించారు. (చదవండి : కొరియర్ నుంచి కేంద్ర కమిటీ దాకా) బాల్య వివాహం కారణంగా విరక్తితో.. సుధాకర్ భార్య అరుణ(43) వరంగల్ జిల్లాకు దుగ్గొండి చెందిన వారని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. బాల్య వివాహం కారణంగా విరక్తి చెందిన ఆమె.. దళ సభ్యుల పాటలకు ఆకర్షితురాలై దళంలో చేరినట్లు పేర్కొన్నారు. ‘మావోయిస్టులైన అనేక మంది మహిళలు ఆత్మహత్య చేసుకున్నారు. అక్కడి వేధింపుల కారణంగానే తాను పార్టీని వీడుతున్నట్లు ఆమె చెప్పారు. సట్వాజీ మీద పేరు మీద రూ. 25 లక్షల రివార్డు ఉంది. అతడి భార్య పేరు మీద రూ. 10 లక్షల రివార్డు ఉంది. వారిద్దరి పేరుతో ఉన్న ఈ రివార్డును వారికి అందజేస్తాము’ అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా లొంగిపోయిన మావోయిస్టులకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని.. కాబట్టి మావోయిస్టులు అందరూ జనజీవన స్రవంతిలో కలిసి ప్రశాంత జీవనం గడపాలని డీజీపీ పిలుపునిచ్చారు. (చదండి : లొంగుబాటలో) కాగా నిర్మల్‌లోని సారంగాపూర్ మండలానికి చెందిన సుధాకర్ ఇంటర్‌లోనే రాడికల్ స్టూడెంట్స్ నాయకుల ప్రభావంతో మావోయిస్టు కొరియర్‌గా చేరారు. పలు హింసాత్మక ఘటనల్లో కీలక పాత్ర పోషించి కీలక నేతగా ఎదిగారు. 2013 నుంచి మావోయిస్టు కేంద్ర పొలిట్‌బ్యూరో సభ్యుడిగా కొనసాగుతూ, సెంట్రల్ మిలటరీ సభ్యుడిగా, బిహార్- జార్ఖండ్ స్పెషల్ ఏరియా కమిటీ ఇన్చార్జిగా వ్యవహరించిన సుధాకర్‌పై కోటి రూపాయల రివార్డు(జార్ఖండ్ ప్రభుత్వం ప్రకటించింది) కూడా ఉంది. దళంలోనే పరిచయమైన నీలిమ అలియాస్ మాధవిని ఆయన పెళ్లిచేసుకున్నారు. కాగా తన తమ్ముడు నారాయణ రాంచీలో పోలీసులకు పట్టుబడటం, నిర్మల్ జిల్లా పోలీసులు తన తల్లి ద్వారా ఒత్తిడి పెంచడం, మావోయిస్టు పార్టీలో అంతర్గత సంక్షోభం కారణంగా భార్యతో సహా ఆయన పోలీసులకు లొంగిపోయినట్లు తెలుస్తోంది. -
మీడియా ముందుకు మావోయిస్టు అగ్రనేత సుధాకర్
-
మరికాసేపట్లో మీడియా ముందుకు సుధాకర్
సాక్షి, హైదరాబాద్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు సట్వాజీ అలియాస్ సుధాకర్‌ను డీజీపీ మహేందర్ రెడ్డి బుధవారం మీడియా ఎదుట ప్రవేశపెట్టనున్నారు. జార్ఖండ్ మావోయిస్టు కార్యక్రమాల్లో క్రియాశీలకంగా ఉన్న సుధాకర్ భార్యతో సహా రాంచీ పోలీసుల ఎదుట లొంగిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరికాసేపటల్లో ఆయన మీడియా ముందుకు రానున్నారు. (చదవండి : లొంగు‘బాట’లో..) కాగా నిర్మల్‌లోని సారంగాపూర్ మండలానికి చెందిన సుధాకర్ ఇంటర్‌లోనే రాడికల్ స్టూడెంట్స్ నాయకుల ప్రభావంతో మావోయిస్టు కొరియర్‌గా చేరారు. పలు హింసాత్మక ఘటనల్లో కీలక పాత్ర పోషించి కీలక నేతగా ఎదిగారు. 2013 నుంచి మావోయిస్టు కేంద్ర పొలిట్‌బ్యూరో సభ్యుడిగా కొనసాగుతూ, సెంట్రల్ మిలటరీ సభ్యుడిగా, బిహార్- జార్ఖండ్ స్పెషల్ ఏరియా కమిటీ ఇన్చార్జిగా వ్యవహరించిన సుధాకర్‌పై కోటి రూపాయల రివార్డు(జార్ఖండ్ ప్రభుత్వం ప్రకటించింది) కూడా ఉంది. దళంలోనే పరిచయమైన నీలిమ అలియాస్ మాధవిని ఆయన పెళ్లిచేసుకున్నారు. కాగా తన తమ్ముడు నారాయణ రాంచీలో పోలీసులకు పట్టుబడటం, నిర్మల్ జిల్లా పోలీసులు తన తల్లి ద్వారా ఒత్తిడి పెంచడం, మావోయిస్టు పార్టీలో అంతర్గత సంక్షోభం కారణంగా భార్యతో సహా ఆయన పోలీసులకు లొంగిపోయినట్లు తెలుస్తోంది. ఇంటర్‌లోనే ఆకర్షితుడై.. సారంగపూర్ మండల కేంద్రానికి చెందిన దేవుబాయి, కాశీరాం దంపతుల పెద్ద కుమారుడు ఒగ్గు సట్వాజీ పదోతరగతి వరకు స్థానిక పాఠశాలలో చదివారు. 1981–83 మధ్య ఇంటర్మీడియెట్ నిర్మల్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పూర్తి చేశారు. ఇంటర్ చదువుతున్న రోజుల్లోనే రాడికల్ స్టూడెంట్స్ యూనియన్(ఆర్ఎస్యూ) నాయకులతో సంబంధాలు కొనసాగించారు. వారి మాటలు, పాటలతో పాటు విప్లవ సాహిత్యానికి ఆకర్షితుడయ్యారు. అప్పటి నుంచే ఆర్ఎస్యూ(అండర్‌గ్రౌండ్) కొరియర్‌గా, రాడికల్స్ ఆర్గనైజర్‌గా వ్యవహరించారు. 1984లో పూర్తిస్థాయిలో అడవి బాట పట్టి పీపుల్స్‌వార్‌లో చేరి నక్సలైటుగా మారారు. జనంలోకి వచ్చి..మళ్లీ దళంలోకి.. పీపుల్స్‌వార్‌లో చేరిన రెండేళ్లకే కీలకంగా వ్యవహరిస్తున్న సమయంలో 1986లో కర్ణాటకలోని గుల్బర్గాలో సట్వాజీ పోలీసులకు చిక్కారు. 1989 చివరి వరకు జైలులోనే ఉన్నారు. మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పీపుల్స్‌వార్‌పై నిషేధం ఎత్తివేయడంతో బయటకు వచ్చారు. అప్పుడు ఇంటి వద్దే ఉంటూ నిర్మల్‌లో భారీ స్తూపం నిర్మింపజేశారు. మళ్లీ ప్రభుత్వం నక్సల్స్‌పై నిషేధం విధించడంతో 1991నుంచి తిరిగి దళంలోకి వెళ్లారు. ఇక అప్పటి నుంచి ఆయన జనంలోకి రాలేదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వివిధ దళాల కమాండర్‌గా, జిల్లా కమాండర్‌గా కొనసాగారు. 2001 నుంచి రాష్ట్ర కమిటీలో చేరి దండకారణ్య మిలటరీ కమిషన్ ఇన్చార్జిగా, ఉత్తర తెలంగాణ స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడిగా పనిచేశారు. అక్కడి నుంచి కేంద్ర కమిటీకి, జార్ఖండ్ రాష్ట్ర ఇన్చార్జి బాధ్యతలకు వెళ్లారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు సింగరేణిలో జరిగిన దాదాపు అన్ని హింసాత్మక ఘటనల్లో సట్వాజీ అలియాస్ సుధాకర్ కీలకపాత్ర పోషించినట్లు పోలీసులు చెబుతుంటారు. చెన్నూరు, జైపూర్, నీల్వాయి, కోటపల్లి తదితర పోలీసు స్టేషన్ల పరిధిలో ఈయనపై కేసు లు ఉన్నాయి. దళంలోనే మూడున్నర దశాబ్దాలు సట్వాజీ దాదాపు మూడున్నర దశాబ్దాల తన జీవితాన్ని అజ్ఞాతంలోనే గడిపారు. 1998లోనే తండ్రి కాశీరాం చనిపోయినా ఇంటికి రాలేదు. తమ్ముళ్లు నారాయణ, రామన్నలు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇద్దరు చెల్లెళ్లు కాల్వ పోసవ్వ, దాసరి పోసవ్వలకు పెళ్లిళ్లయ్యాయి. తల్లి దేవుబాయి ఒక్కరే సారంగపూర్‌లో ఉంటున్నారు. ఇటీవలే అనారోగ్యానికి గురైన ఆమెను నిర్మల్ ఎస్పీ శశిధర్‌రాజు, ఏఎస్పీ దక్షిణామూర్తి స్వయంగా ఆమె వద్దకు వెళ్లి పలకరించారు. తన అన్నను కలసి వస్తుండగా సట్వాజీ తమ్ముడు నారాయణ మరో వ్యక్తితో కలసి 2017 ఆగస్టులో రాంచీ రైల్వేస్టేషన్లో పోలీసులకు పట్టుబడ్డాడు. అప్పటి నుంచి కుటుంబంపై పోలీసుల ఒత్తిడి పెరగడం, పార్టీలో అంతర్గత సంక్షోభాల కారణంగా సుధాకర్ రాంచీలో పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. కేంద్ర కమిటీ దాకా ఎదిగి.. పీపుల్స్‌వార్ (మావోయిస్టు పార్టీ)లో తెలంగాణ నుంచి ఎదిగిన కీలక నేతల్లో సట్వాజీ అలియాస్ సుధాకర్ కూడా ఉన్నారు. రాష్ట్ర కమిటీ కొరియర్‌గా పని ప్రారంభించిన సట్వాజీ అంచెలంచెలుగా కేంద్ర కమిటీ సభ్యుడి దాకా ఎదిగారు. ముందుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కమిటీ సభ్యుడిగా, అనంతరం జిల్లా కమాండర్ (కార్యదర్శి)గా వ్యవహరించారు. ఆ తర్వాత ఉత్తర తెలంగాణ జోనల్ కమిటీ సభ్యుడయ్యారు. అనంతరం రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఉంటూ దండకారణ్యంలో మిలటరీ కమిషన్ ఇన్చార్జిగా నియమితులయ్యారు. ప్రస్తుతం 2013 నుంచి మావోయిస్టు పార్టీ కేంద్ర పొలిట్‌బ్యూరో సభ్యుడిగా కీలకంగా వ్యవహరిస్తూనే సెంట్రల్ మిలటరీ సభ్యుడిగా, బిహార్–జార్ఖండ్ స్పెషల్ ఏరియా కమిటీ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. -
నా కెరీర్లో గుర్తుండిపోయే చిత్రం ఇది
శర్వానంద్, సాయిపల్లవి జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పడిపడి లేచె మనసు’. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 21 విడుదలైంది. ఈ సందర్భంగా చిత్రబృందం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో హీరో శర్వానంద్ మాట్లాడుతూ– ‘‘చాలా ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఈ సినిమా చేశాం. నా కెరీర్లో గుర్తుండిపోయే చిత్రం ఇది. ఇలాంటి సినిమా చేసినందుకు గర్వంగా ఉంది. క్రిటిక్స్ రివ్యూస్ చదివాను. వారు ఫీల్ అయ్యింది రాశారు. వారి అభిప్రాయాలను గౌరవిస్తున్నాను. కొందరు ఆడియన్స్ కూడా ఫోన్ చేశారు. సినిమాలో ఫస్ట్‌హాఫ్ భాగుందని, సెకండ్ హాఫ్‌లో కొన్ని ఎత్తుపల్లాలు ఉన్నాయని చెప్పారు. మరో మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తాను’’ అని అన్నారు. ‘‘ఈ సినిమా జర్నీలో పాలుపంచుకున్న నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ థ్యాంక్స్. చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ అన్నారు నిర్మాత సుధాకర్. ‘‘ఈ సినిమాలో కొత్త శర్వాను చూశాం. ఎమోషనల్ అండ్ సెంటిమెంట్ సీన్స్‌లో శర్వా నటన అద్భుతం. హనుగారు బాగా తీశారు. ఇందులో నాకు డిఫరెంట్ క్యారెక్టర్ ఇచ్చిన దర్శక–నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు నటుడు శత్రు. ‘‘ఇలాంటి సినిమాలు అరుదుగా వస్తుంటాయి. సెన్సిబుల్ అండ్ మ్యూజికల్ హిట్ మూవీ. ఇందులో సూర్య పాత్రలో శర్వా, వైశాలి పాత్రలో సాయిపల్లవి బాగా నటించారు. హీరోయిన్ స్నేహితురాలు శాలిని పాత్రలో నటించే అవకాశం నాకు ఇచ్చిన దర్శక–నిర్మాతలకు ధన్యవాదాలు. సుధాకర్‌గారు మరిన్ని విజయాలు అందుకోవాలి’’ అన్నారు కల్పిక. -
కృషితో నాస్తి దుర్భిక్షం
అది ఆరవ తరగతి గది.‘‘ఏం అవినాష్ నిన్న నువ్వు స్కూల్‌కి ఎందుకు రాలేదు?’’ అడిగాడు సైన్స్ టీచర్ సుధాకర్ అవినాష్ వంక చూస్తూ.‘‘సార్..! మరి మన ఊర్లోకి ‘ఆనంద బాబా’ వచ్చారు కదా! ఆయన్ని చూడ్డానికి మా గల్లీలో వాళ్లంతా వెళ్తుంటే... మా అమ్మానాన్నా నన్ను కూడా తీసుకెళ్లారు సార్!’’ అన్నాడు అవినాష్.‘‘అవునా! అయితే నీకు పనేముంది ఆ బాబాతో’’ అడిగాడు సుధాకర్ సార్!‘‘సార్ మరేమో ‘ఆనంద బాబా’ చాలా మహిమలు కలిగినవాడట. ఆయన మంత్రం చదివి తాయత్తు కడితే... ఎంత పెద్ద కష్టమైనా తీరిపోతుందట. అందుకే నేను కూడా తాయత్తు కట్టించుకోవడానికి వెళ్లాను’’ అంటూ తనచేతికున్న తాయత్తు చూపించాడు అవినాష్.‘‘ఏం లాభమటా ఈ తాయత్తుతో?’’ వెటకారంగా అడిగాడు సుధాకర్‘‘మరి ఈ తాయత్తు కట్టుకుంటే పరీక్షల్లో మంచి మార్కులు, ర్యాంకులు వస్తాయట సార్!’’ఎంతో అమాయకంగా చెప్పాడు అవినాష్.వాళ్లిద్దరి సంభాషణ క్లాస్‌లోని మిగతా పిల్లలంతా వింటున్నారు. ‘‘అరే మనం కూడా ఆ తాయత్తు కట్టించుకుంటే ర్యాంకులు తెచ్చుకోవచ్చు కదరా’’అనుకుంటున్నారంతా.సుధాకర్ సార్ పిల్లల మనసులోని ఆలోచనలను ఇట్టే పట్టేశాడు. ‘‘అయితే పిల్లలు మీరు కూడా అవినాష్లాగే తాయత్తు కట్టించుకోవాలనుకుంటున్నారా?’ అన్నాడు.‘‘అవును సార్!’’ అన్నారు పిల్లలంతా ముక్తకంఠంతో..‘అయ్యో కష్టపడి పనిచేసి విజయాన్ని సాధించాలి కానీ ఇలా మాయలు, మంత్రాలు, తాయత్తులను నమ్మి పిల్లలు కృషిచేయకుండా సోమరిపోతుల్లా తయారవుతారని, ఇది వారి భవిష్యత్త్‌కు ఎంతో ప్రమాదమ’ని మనసులోనే అనుకున్నాడు సుధాకర్.అంతే కాకుండా ఆ ‘ఆనంద బాబా’ జనాలకు కష్టాలు తీరుతాయి. అనుకున్నవి జరుగుతాయని తాయత్తులిచ్చి వారి దగ్గర నుంచి పెద్దమొత్తంలో పైసలు గుంజే విధానం అప్పటికే తను విని ఉన్నాడు కనుకఎలాగైనా పిల్లల మనస్సులోని ఆ ఆలోచనలను మార్చాలని నిర్ణయించుకున్నాడు. ‘ఆనంద బాబా’ చేసే మోసాలను పిల్లలకు ప్రత్యక్షంగా చూపించాలనుకున్నాడు. ఆ వెంటనే సుధాకర్ సార్.. స్కూల్లోని మిగతా టీచర్లతో ఈ విషయం గురించి చర్చించి చివరికి అంతా కలిసి ఓ నిర్ణయం తీసుకున్నారు.పిల్లల దగ్గరి కొచ్చి ‘‘చూడండి పిల్లలు..! ఇప్పుడు మనమంతా ఆ ఆనంద బాబా దగ్గరకెళ్దాం. మన నాగరాజు సార్‌కి అమ్మాయి వేషం వేసి తీసుకెళ్దాం. అక్కడ బాబాను కొన్ని ప్రశ్నలు వేసి మనం పరీక్షిద్దాం.అతను కరెక్ట్‌గా సమాధానం చెబితే మీరంతా తాయత్తు కట్టుకోండి. లేదంటే ఆ బాబాకు ఏం తెలియదని, అతను చెప్పేదంతా బూటకమని తేలితే మీరు ఆయన చెప్పేది నమ్మకుండా కష్టపడి చదువుకోవాలి సరేనా?’’ అన్నాడు సుధాకర్ సార్. పిల్లలకు ఇందంతా తామాషాగా అనిపించింది. ‘‘అలాగే సార్!’’ అంటూ పిల్లలంతా గట్టిగా అరిచారు.సోషల్ టీచర్ నాగరాజు సార్‌కి అచ్చం అమ్మాయిలా ఉండేటట్లు చీర కట్టి, విగ్గు పెట్టి అమ్మాయిలా వేషం వేసి, పొట్టదగ్గర కనిపించకుండా బట్టలు చుట్టి.. కడుపు ఎత్తుగా వచ్చేటట్లు చేశారు.అవినాష్‌ని ఇంకా మిగిలిన పిల్లలను తీసుకుని ఆ రోజు స్కూల్ అయిపోయిన తర్వాత ఆనంద బాబా ఉండే చోటుకు వెళ్లారు.పువ్వులతో అలంకరించిన ఆసనంమీద ఆనంద బాబా కూర్చోని ఉన్నాడు.భక్తులంతా తన్మయత్వంతో అతను చెప్పే మాటలు వింటున్నారు.కాసేపటి తర్వాత భక్తులు ఒక్కొక్కరిగా వెళ్లి ఆయన కాళ్లకు మొక్కి తమ కష్టాలను చెప్పుకుంటున్నారు. ఆయన వాళ్లకి విభూతి, తాయత్తులు ఇస్తున్నాడు.సుధాకర్ సార్ కూడా ఆడవేషంలో ఉన్న నాగరాజు సార్‌ని తీసుకుని ‘ఆనందబాబా’ దగ్గరకు వెళ్లాడు. అనుమానం రాకుండా ఆనందబాబా కాళ్లను మొక్కారు.అప్పుడు సుధాకర్ సార్... ‘‘బాబా ఈమె నా భార్యకమల. మాకు పెళ్లై పదేళ్ల తర్వాత ఇప్పుడు తను గర్భం దాల్చింది. బాబా మీ మహిమలతో నా భార్య గర్భంలో ఉండేది ఏ బిడ్డో చెప్పండి’’ అన్నాడు.ఆనంద బాబా ఆడవేషంలో ఉన్న నాగరాజు సార్‌ని చూసి, అతని తలమీద చెయ్యి పెట్టి కళ్లు మూసుకుని ఏవో మంత్రాలు ఉచ్ఛరించాడు. తర్వాత కళ్లు తెరచి నవ్వుతూ ‘‘నాయనా..! నీ భార్యకు పండంటి మగబిడ్డ పుడతాడు. ఈ తాయత్తు ఆమె చేతికి కట్టునాయనా!’’ అన్నాడు. అంతే అక్కడ కూర్చున్న పిల్లలంతా పెద్దపెద్దగా నవ్వారు. వెంటనే పిల్లలవైపు తిరిగి.. ‘‘ఇప్పుడు చూశారు కదా పిల్లలూ..! ఈ బాబాకి ఎంత మహిమ ఉందో.. మన నాగరాజు సార్‌కి మగబిడ్డ పుడతాడట. ఇప్పుడు తెలిసింది కదా ఈ బాబా దగ్గర ఏ మాయలు, మహిమలు లేవని. ఇకనైనా మీరు ఇటువంటి దొంగబాబాల మాయమాటలు నమ్మడం మానేసి కష్టపడి చదువుకోవాలి. ‘కృషితో నాస్తి దుర్భిక్షం’ అన్నారు పెద్దలు. కృషి పట్టుదల ఉంటే సాధించలేనిది అంటూ ఏమీ ఉండదు ఈ లోకంలో. అలా కాకుండా ఇలాంటి మోసగాళ్ల మాటలు నమ్మి మీరు సోమరిపోతులుగా తయారుకాకూడదు. మీ శ్రమనే మీరు నమ్ముకోవాలని మీకు తెలియజెప్పడానికే నేను ఈ నాటకం ఆడాల్సి వచ్చింది’’ అన్నాడు.అర్థమైనట్లుగా పిల్లలంతా తలలు ఊపారు. ఆ తర్వాత బాబా మోసాలని గ్రహించిన గ్రామస్తులు ఆ బాబాని తరిమితరిమి కొట్టారు. - వి. రోహిణి -
లఘుచిత్రాల సినిమాటోగ్రాఫర్
జూబ్లీహిల్స్: చిట్టీలు వేసి డబ్బులు జమ చేసి చిన్న 5డీ కెమెరాను కొనుగోలు చేసిన సుధాకర్... షార్ట్ఫిలిమ్స్ సినిమాటోగ్రాఫర్‌గా రాణిస్తున్నాడు. యూసుఫ్‌గూడ వెంకటగిరిలో నివసించే సుధాకర్ ఇప్పటికే వందలాది ఫార్ట్ఫిలిమ్స్ను తెరకెక్కించాడు. నల్లగొండ జిల్లా సూర్యాపేటకు చెందిన సుధాకర్‌కు చిన్నప్పటి నుంచి ఫొటోగ్రఫీపై మక్కువ. తండ్రి కొనిచ్చిన చిన్న కెమెరాతో రకరకాల ప్రయోగాలు చేస్తూ ఫొటోగ్రఫీలో మెళకువలు నేర్చుకున్నాడు. క్రమంగా సెల్ఫోన్లలో అత్యుత్తమ నాణ్యతతో కెమెరాలు రావడంతో... ఫోన్లోనే షార్ట్ఫిలిమ్స్ చిత్రీకరించి శెభాష్ అనిపించుకున్నాడు. 150కి పైగా షార్ట్ఫిలిమ్స్... నాలుగైదేళ్లుగా షార్ట్ఫిలిమ్స్ ట్రెండ్ పెరగడంతో ఫొటోగ్రఫీని ఉపాధిగా మార్చుకున్నాడు సుధాకర్. షార్ట్ఫిలిమ్ మేకింగ్‌లో పట్టు సాధించి ఇప్పటి వరకు దాదాపు 150కి పైగా లఘుచిత్రాలకు కెమెరామెన్‌గా పని చేశాడు. త్వరలో విడుదల కానున్న ‘రహస్యం’ సినిమాకు పూర్తిస్థాయి సినిమాటోగ్రాఫర్‌గా పని చేశాడు. మరో రెండు సినిమాలకు అవకాశాలు వచ్చాయి. ఈ రంగంలో పలు ప్రైవేట్ సంస్థల అవార్డులు అందుకున్నాడు. సుధాకర్ తెరకెక్కించిన హెలినా, అనుక్షణం, రాధాకృష్ణ ,శ్వాసనువ్వే, రుధిరం తదితర లఘు చిత్రాలకు మంచి పేరొచ్చింది. వర్మ స్ఫూర్తితో.. తిలక్ దగ్గర ఫొటోగ్రఫీ నేర్చుకున్నాను. ‘మా ఊరి వంట’ కార్యక్రమానికి అసిస్టెంట్‌గా పని చేశాను. రామ్‌గోపాల్‌వర్మ స్ఫూర్తితో చిట్టీలు వేసి డబ్బులు జమ చేసుకొని 5డీ కెమెరా కొనుగోలు చేశాను. షార్ట్ఫిలిమ్స్కు పనిచేస్తూ పేరు సంపాదించాను. మంచి సినిమాటోగ్రాఫర్‌గా ఎదగడానికి ప్రయత్నిస్తున్నాను.– సుధాకర్ -
బలిదానాలతో కాదు.. ఉద్యమాలతో హోదా సాధించాలి
-
రజనీ ఫ్యాన్ సుధాకర్.. రియల్ హీరో
సాక్షి, ముంబై: రజనీకాంత్ వీరాభిమాని ఒకరు చేసిన సాహసం వైరల్ అవుతోంది. బైక్‌పై పారిపోతున్న స్నాచర్లను వెంటాడి మరీ పట్టుకుని రియల్ హీరో అనిపించుకున్నారు. వివరాల్లోకి వెళ్తే... తమిళనాడుకు చెందిన సుధాకర్ నాడర్ ముంబైలో ఉంటూ ఓ తమిళ న్యూస్‌పేపర్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. రజనీకి ఆయన హార్డ్‌కోర్ అభిమానిగా గతంలో చాలాసార్లు ఆయన వార్తల్లో నిలిచాడు కూడా. శుక్రవారం ఉదయం తన కొడుకును స్కూల్ దించి ఆఫీస్‌కు వెళ్తున్నాడు. ఈ క్రమంలో కింగ్స్ సర్కిల్ వద్దకు చేరుకోగానే క్రమంలో ఓ మహిళ( ఖాస్లా కాలేజీ వైస్ ప్రిన్స్‌పాల్ దేవెందర్ కౌర్ భాసిన్ అని తర్వాత తేలింది) ‘దొంగ’ అని అరవటం నాడర్‌కు వినిపించింది. క్షణం ఆలస్యం చేయకుండా.. దూసుకుపోతున్న బైకర్లను ఆయన ఛేజ్ చేశారు. ఇది గమనించిన ఓ పోలీస్ కానిస్టేబుల్ వారిని అనుసరించాడు. చివరికి సంగమ్ నగర్ వద్ద ఓ బైకర్ ఆయన్ని ఢీకొట్టి పారిపోగా.. పరిగెత్తుకుంటూ వెళ్లి మరో బైకర్‌ను నాడర్ పట్టుకోగలిగారు. ముందు తనకేం తెలీదన్న ఆ మైనర్ బాలుడు.. సీసీ ఫుటేజీలో రికార్డయ్యిందనే సరికి నేరం ఒప్పుకున్నాడు. భాసిన్ కృతజ్ఞతలతోపాటు.. డిప్యూటీ కమీషనర్ అంబిక, సుధాకర్ నాడర్‌ను సత్కరించారు. ఇదిలా నాడర్ ఫ్యామిలీకి ఇలాంటి సాహసాలు కొత్తేం కాదు. రెండేళ్ల క్రితం నాడర్ కూతురు-కొడుకు విన్సీ-మాథ్యూలు కూడా ఓ ఫోన్ దొంగను వెంటాడి పట్టుకుని వార్తల్లో పోలీస్ శాఖ అభినందనలు అందుకున్నారు కూడా. సుధాకర్ నాడర్ కూతురు.. కొడుకు -
‘అర్జున్ రెడ్డి’ చేతుల మీదుగా..
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. తన అభిమానులను రౌడీస్ అంటూ సంబోధిస్తుంటారు విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్‌నైట్ స్టార్‌గా ఎదిగిన విజయ్.. చకచకా ప్రాజెక్ట్‌లను ఓకే చేస్తూ.. వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ‘నువ్వు తోపు రా’ మూవీ టీజర్‌ను విజయ్ చేతులమీదుగా రిలీజ్ చేయించనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. నాటి హీరోయిన్ నిరోష చాలాకాలం తరువాత నటిస్తోన్న ఈ మూవీ టీజర్‌ను జూలై 14న విడుదల చేయనున్నారు. సుధాకర్, నిత్యా శెట్టిలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. -
అసలే దొంగ బాబా.. ఆపై హత్యాయత్నం
నెల్లూరు(వేదాయపాళెం): మంత్ర పీఠికల పేరిట భక్తులను మోసం చేసిన అనంతబొట్ల సుధాకర్‌రావు అలియాస్ సుధాకర్ మహరాజ్‌ను ఎట్టకేలకు నెల్లూరు రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక పోలీసు స్టేషన్లో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో రూరల్ డీఎస్పీ కేవీ రాఘవరెడ్డి వివరాలను వెల్లడించారు. నగరంలోని మైపాడుగేట్ ప్రశాంతినగర్ వద్ద సుధాకర్ ఆశ్రమం ఉంది. ఇందులో 108 రోజుల పాటు యాగం నిర్వహించ తలపెట్టాడు. మంత్ర పీఠికలు కోసం భక్తుల నుంచి నగదు డిపాజిట్లు తీసుకున్నాడు. సుమారు రూ.10 కోట్ల వసూలు చేయగా అందులో కొంత మొత్తాన్ని పలువురికి డిపాజిట్ సొమ్ము కన్నా అదనంగా చెల్లించాడు. సుధాకర్‌కు ఆశ్రమంలోని నాగవాసవి, మరికొందరు సహకరించారు. సుధాకర్ మోసం బయటపడటంతో ఆశ్రమంలోనే పురుగు మందు తాగి హైడ్రామా ఆడి సింహపురి ఆస్పత్రిలో చేరాడు. బుధవారం ఆస్పత్రి నుంచి డిచార్జి అవుతున్న విషయం తెలుసుకుని నెల్లూరు రూరల్ సీఐ పి.శ్రీనివాసరెడ్డి సుధాకర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి రూ.28 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు డీఎస్పీ తెలిపారు. మోసానికి పాల్పడిన వ్యక్తుల నుంచి ఆస్తుల రికవరీ చేసి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. -
పోలీసుల అదుపులో బురిడీ బాబా
సాక్షి, నెల్లూరు : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన బురిడీ బాబా కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నెల్లూరులోని సింహపురి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బురిడీ బాబా అలియాస్ సుధాకర్ బాబాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 28 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. త్వరలోనే మిగిలిన వారిని కూడా అరెస్టు చేస్తామని, బాబా చేతిలో మోసపోయిన వారికి న్యాయం చేస్తామని డీఎస్పీ రాఘవరెడ్డి అన్నారు. నగరంలోని కిసాన్‌నగర్‌లో నివాసముంటున్న సుధాకర్ మహరాజ్ అలియాస్ టీచర్ సుధాకర్ గత ఏడాది డిసెంబర్ 13 నుంచి 108 రోజులు పాటు నిర్వహించే విధంగా నవనాథ సంప్రదాయ దత్తాత్రేయ మహామంత్ర ఇష్టకామ్య మహా యాగాన్ని ప్రారంభించారు. యాగం ప్రారంభం సమయంలో భక్తులకు వెయ్యి పుస్తకాలు ఉచితంగా పంపిణీ చేశారు. పుస్తకంలో తాము ఇచ్చిన మంత్రం రాసి ఇవ్వాలని, హోమంలో వేయాలని ప్రచారం చేశారు. ఈ క్రమంలో భక్తుల నుంచి స్పందన తక్కువగా ఉండటంతో ఉచితంగా ఇవ్వడం ఆపేశారు. తర్వాత పుస్తకానికి వెయ్యి రూపాయల ధర నిర్ణయించారు. 14 రోజుల పాటు పుస్తకంలో మంత్రం రాసి తిరిగి పుస్తకం ఇస్తే వెయ్యికి నాలుగు వందలు అదనంగా కలిపి రూ.1,400 ఇస్తామని ప్రచారం చేశారు. ప్రచార తీవ్రతతో వేల మంది భక్తులు వచ్చారు. శివరాత్రి సమీపిస్తుండటంతో చివరి రెండు రోజుల్లో రూ.1,400ను రూ.1,500 గా ప్రకటించటంతో భక్తులు సుమారు రూ.3.70 కోట్ల విలువైన పుస్తకాలు కొనుగోలు చేశారు. దీంతో శివరాత్రికి ముందు రెండు రోజులు.. అంటే గత నెల 14,15 తేదీల్లో సుమారు రూ.2 కోట్లు వసూలు చేశారు. సుధాకర్‌కు సహాయకురాలిగా వచ్చిన వాసవి రూ. కోట్లు డబ్బు కనిపించటంతో 15వ తేదీ రాత్రి ఆ నగదుతో పరారైంది. దీంతో భక్తులంతా డబ్బుల కోసం ప్రశ్నించటంతో సుధాకర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. -
మేలో తెరపైకి..
తమిళసినిమా: ఓడవుమ్ ముడియాదు ఒళియవుమ్ ముడియాదు చిత్రం నిర్మాణ కార్యక్రయాలను శరవేగంగా జరుపుకుంటోంది. మే నెలలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. మంచి కథాంశంతో కూడిన చిత్రాలను అందించండి అంటున్నారు క్లాప్‌బోర్డు ప్రొడక్షన్స్ అధినేత, నటుడు వీ.సత్యమూర్తి. ఈయన తాజాగా నిర్మిస్తూ, ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ఓడవుమ్ ముడియాదు ఒళియవుమ్ ముడియాదు. యూట్యూబ్ చిత్రం ఎరుమాసాని ఫేమ్ రమేశ్ వెంకట్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అదే విధంగా యూట్యూబ్‌లో సందడి చేస్తున్న మెడ్రాస్ సెంట్రల్ ఫేమ్ గోపి, సుధాకర్, ఎరుమసాని ఫేమ్ విజయ్, హరిజా, పుట్ చట్నీ ఫేమ్ అగస్థ్యన్, టెంపుల్ మంకీస్ ఫేమ్ షారా, అబ్దుల్, బిహెండ్వుడ్స్ ఫేమ్ వీజే.ఆశిక్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. చిత్రం గురించి నిర్మాత, నటుడు వీ.సత్యమూర్తి తెలుపుతూ షూటింగ్‌ను 60 రోజుల్లో పూర్తి చేయడానికి ప్రణాళికను సిద్ధం చేసుకున్నప్పటికీ, దర్శకుడు 45 రోజుల్లోనే పూర్తి చేశారని, ఆయన ప్లానింగ్, నటీనటులు, సాంకేతిక వర్గం సహకారమే ఇందుకు కారణమన్నారు. దర్శకుడితో సహా పలువురు నటీనటులు, సాంకేతిక వర్గం యూట్యూబ్ చిత్రాల నుంచి వెండితెరకు ఈ చిత్రం ద్వారా పరిచయం అవుతున్న వారేనని తెలిపారు. ఓడవుమ్ ముడియాదు ఒళియవుమ్ ముడియాదు చిత్రం మంచి కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న జనరంజక చిత్రంగా ఉంటుందన్నారు. దీనికి జోశ్వా జే.పెరోజ్ ఛాయగ్రహణ, కౌశిక్ గిరీశ్ సంగీతం అందిస్తున్నారని తెలిపారు. షూటింగ్ పూర్తయిన ఈ చిత్రాన్ని మెలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు వీ.సత్యమూర్తి తెలిపారు. -
హాలీవుడ్ కాన్సెప్ట్‌తో...
‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్‘ ఫేమ్ సుధాకర్ హీరోగా హరనాథ్ బాబు.బి దర్శకత్వంలో యునైటెడ్ ఫిలింస్ బ్యానర్ పై డి.శ్రీకాంత్ నిర్మిస్తున్న చిత్రం ‘నువ్వు తోపురా’. షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ సందర్భంగా హీరో సుధాకర్ మాట్లాడుతూ ‘‘ఈ సినిమాలో నా క్యారెక్టర్ అన్ని ఎమోషన్స్‌తో కూడి ఉంటుంది. యూత్ తమని తాము చూసుకునే రోల్ ఇది. ఫస్ట్ సినిమా అయినా కూడా మంచి సినిమా అందించాలని నిర్మాణంలో ఎక్కడా రాజీ పడలేదు. ఈ సినిమా నాకు మంచి పేరు తీసుకు వస్తుందని ఆశిస్తున్నాను’’ అన్నారు.‘‘ఈ సినిమాను 70 శాతం అమెరికాలో, 30 శాతం ఇండియాలో షూట్ చేశాం. హాలీవుడ్ కాన్సెప్ట్‌తో దర్శకుడు హరినాథ్ రూపొందించాడు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలోనే గ్రాండ్‌గా రిలీజ్ చేస్తాం’’ అన్నారు నిర్మాత శ్రీకాంత్. -
బురిడీ బాబా హైడ్రామా
నెల్లూరు (వేదాయపాళెం): ఆధ్యాత్మిక ముసుగులో భక్తులను నయవంచనకు గురిచేసిన సుధాకర్ మహరాజ్ అలియాస్ టీచర్ సుధాకర్ అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు హైడ్రామా ఆడుతున్నారు. గత 13 రోజులుగా నగరంలోని సింహపురి ఆస్పత్రిలో వైద్యం పేరిట అజ్ఞాతంలోకి వెళ్లారు. వైద్య చికిత్సలకు సంబంధించి ఎప్పటికప్పుడు పరిస్థితిని బహిర్గతం చేయాల్సిన వైద్యులు ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. నెల్లూరురూరల్ పోలీసులు కూడా కేసు దర్యాప్తును నీరుగారుస్తున్నారని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. నగరంలోని ప్రశాంతినగర్‌లో ఉన్న సుధాకర్ మహరాజ్ ఆశ్రమంలో మంత్ర పీటం పేరిట 262 భక్తుల నుంచి రూ.3.72 కోట్ల వసూళ్లకు పాల్పడిన వ్యక్తులు అజ్ఞాతంలోకి వెళ్లిన వైనం గత నెల 15న వెలుగుచూసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి మోసపోయిన బాధితులు న్యాయం కోసం నెల్లూరు రూరల్ పోలీస్‌స్టేషన్, జిల్లా ఎస్పీలను కలిసి కోరుతున్నారు. అయితే నెల్లూరూరల్ పోలీసులు సుధాకర్‌మహరాజ్‌తోపాటు ఇందులో భాగస్వామ్యమైన వాసవి, భాస్కర్, నారాయణరెడ్డి, యశ్వంత్ సింగ్‌పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సుధాకర్ మహరాజ్ ఆశ్రమం కార్యాలయంలో పనిచేసే సాయి, శ్రీనుపై కూడా విచారణ చేపడుతున్నారు. రాజకీయ నాయకులు, ప్రముఖులతో సుధాకర్‌కు పరిచయాలు, సాన్నిహిత్యం ఉన్న నేపథ్యంలో వీరి ఒత్తిడి పోలీసులపై ఉన్నట్లు తెలుస్తోంది. వాసవి, మిగతా వ్యక్తులు 13 రోజుల పాటు అజ్ఞాతంలో ఉన్నప్పటికీ పోలీసులు వీరి జాడను గుర్తించలేకపోతున్నారు. కళ్ల ముందు కనిపించే సుధాకర్‌ను సైతం ప్రశ్నించేందుకు చొరవ చూపడం లేదు. ఆస్పత్రిలో చేరిన కొద్ది రోజులు ఇంటెన్సీవ్ కేర్‌లో ఉన్న సుధాకర్‌ను ఇటీవల ప్రత్యేక గదిలోకి మార్చారు. సుధాకర్ అల్లుడు సంపత్ ఆస్పత్రి వద్ద ఉంటూ ఎవరినీ గదిలోకి పంపటం లేదు. నెల్లూరురూరల్ సీఐ శ్రీనివాసులు రెడ్డి ఒకటి రెండు సార్లు సుధాకర్‌ను విచారించేందుకు గదిలోకి వెళ్లినప్పటికీ సుధాకర్ సైగలు చేస్తూ సమాధానం చెప్పకపోవడంతో సీఐ వెనుదిరగాల్సి వచ్చింది. చిన్నపాటి దొంగతనాలు చేసే వ్యక్తులతో ఎంతో కఠనంగా వ్యవహరించే పోలీసులు బడా మోసానికి పాల్పడిన సుధాకర్‌ను తమదైన శైలిలో పోలీసులు ఎందుకు విచారణ సాగించడం లేదనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదిలా ఉంటే సింహపురి ఆస్పత్రి యాజమాన్యం, వైద్యులను సుధాకర్ ఆరోగ్య పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని పోలీసులు కోరుతున్నప్పటికీ పోలీసులకు ఎలాంటి నివేదికలు అందలేదు. ఆస్పత్రిలో ఆశ్రయం పొందుతూ వైద్యం పేరిట సుధాకర్ బాధితుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కోర్టు ద్వారా బెయిల్ కోసం ప్రముఖ లాయర్లు ద్వారా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. బెయిల్ వచ్చే వరకు ఆస్పత్రిలోనే ఉంటూ కాలయాపన చేయాలనే భావనలో ఉన్నట్లు తెలుస్తుంది. బాధితులకు న్యాయం చేసే దిశగా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేయాల్సిన అవసరం ఉంది. మీడియా ప్రతినిధులు భాగస్వాములే నగరంలోని కొన్ని చానళ్ల ప్రతి నిధులు, పత్రికల విలేకరులు కూడా సుధాకర్ మహరాజ్‌కు కొమ్ము కాశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఓ చానల్లో పనిచేస్తున్న భాస్కర్ అనే వ్యక్తి భక్తుల నుంచి భారీగా వసూళ్లకు పాల్పడ్డాడు. నెల్లూరురూరల్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయివుంది. నిందితుడు ఫరారీలో ఉన్నాడు. ఇదే తరహాలో పలు పత్రికల విలేకరుల కూడా సుధాకర్‌తో కుమ్మక్కు అయినట్లు తెలుస్తుంది. సుధాకర్‌తో సంబంధాలు ఉన్న మీడియా వారి వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. పురుగు మందు ఆశ్రమంలోకి ఎలా వచ్చింది!. సుధాకర్ ఆశ్రమంలో మోసాలు వెలుగు చూడడంతో ఒక్కసారిగా సుధాకర్ పురుగుమందు తాగాడని పెద్ద ఎత్తున హైడ్రామా ఆడుతూ హుటాహుటిన సింహపురి ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. ప్రశాంతతకు నెలవైన ఆశ్రమంలో పురుగు మందు డబ్బా ముందుగా ఎందుకు తేవాల్సి వచ్చిందో తెలియాల్సి ఉంది. ముందుగానే ఓ పథకం ప్రకారం పురుగు మందు డబ్బాను తెచ్చి ఉంచినట్లు తెలుస్తుంది. పరిస్థితి తల కిందులైనప్పుడు హైడ్రామాకు పురుగు మందు డబ్బా ఉపయోగపడుతుందని ముందస్తు వ్యూహంలో భాగంగానే వ్యవహరించారని తెలుస్తుంది. -
ఇంకా అజ్ఞాతంలోనే సూత్రధారి వాసవి
నాడు రెండు గదుల చిన్న ఇంటికి అద్దె చెల్లించటానికి తంటాలు పడ్డాడు. నేడు సినీ, రాజకీయ ప్రముఖులు అతని ఇంటి ముందు బారులు తీరారు. దీనిని గమనించిన అమాయక ప్రజలు తండోపతండాలుగా వచ్చారు. వెంటనే క్యాష్ కౌంటర్లు తెరుచుకున్నాయి. రోజుల వ్యవధిలో రూ.3.70 కోట్లు వసూలు చేశారు. చివరకు అంతా మాయ అని తేలటంతో బాబా ఆస్పత్రి బాట పట్టగా వసూలు చేసిన కీలక సూత్రధారి రాష్ట్రాలు దాటేసింది. చివరకు బాబును నమ్మి డబ్బులు కట్టిన జనం ఆయన ఇంటి ముందు న్యాయం చేయాలని రిలే నిరహారదీక్షలు ప్రారంభించారు. ఇది నెల్లూరు కిసాన్‌నగర్ సమీపంలోని ప్రశాంతినగర్‌లోని నయా బాబా సుధాకర్ మహరాజ్ మోసం. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నగరంలోని కిసాన్‌నగర్‌లోని ప్రశాంతి నగర్లో ఉన్న సుధాకర్ మహరాజ్ అలియాస్ టీచర్ సుధాకర్ గత ఏడాది డిసెంబర్ 13 నుంచి 108రోజులు పాటు నిర్వహించే విధంగా నవనాథ సంప్రదాయ దత్తాత్రేయ మహామంత్ర ఇష్టకామ్య మహా యాగాన్ని ప్రారంభించారు. యాగం ప్రారంభం సమయంలో భక్తులకు వెయ్యి పుస్తకాలు ఉచితంగా పంపిణీ చేశారు. పుస్తకంలో తాము ఇచ్చిన మంత్రం రాసి ఇవ్వాలని, హోమంలో వేయాలని ప్రచారం చేశారు. ఈ క్రమంలో భక్తుల నుంచి స్పందన తక్కువగా ఉండటంతో ఉచితం ఆపేశారు. పుస్తకానికి రూ.వెయ్యి ధర నిర్ణయించారు. 14 రోజుల పాటు పుస్తకంలో మంత్రం రాసి తిరిగి పుస్తకం ఇస్తే వెయ్యికి మూడు వందలు అదనంగా కలిపి రూ.1,400 ఇస్తామని ప్రచారం చేశారు. ప్రచార తీవ్రతతో వేల మంది భక్తులు వచ్చారు. శివరాత్రి సమీపిస్తుండటంతో చివరి రెండు రోజుల్లో రూ.1,400ను రూ.1,500 గా ప్రకటించటంతో భక్తులు సుమారు రూ.3.70 కోట్ల విలువైన పుస్తకాలు కొనుగోలు చేశారు. దీంతో శివరాత్రికి ముందు రెండు రోజులు.. అంటే గత నెల 14,15 తేదీల్లో సుమారు రూ.2 కోట్లు వసూలు చేశారు. సుధాకర్‌కు సహాయకురాలిగా వచ్చిన వాసవి రూ.కోట్లు డబ్బు కనిపించటంతో 15వ తేదీ రాత్రి ఆ నగదుతో పరారైంది. దీంతో భక్తులంతా డబ్బుల కోసం ప్రశ్నించటంతో సుధాకర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కొంతసేపు హైడ్రామా నడుమ బాబాను అతని అనుచరులు సింహపురి హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం అక్కడే చికిత్స పొందుతున్నాడు. రాజకీయ అండతో బాబాగా.. 15 ఏళ్ల క్రితం ముదివర్తిపాళెంలో ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా చేరిన సుధాకర్ ఇంటి అద్దె చెల్లించటానికి నానా ఇబ్బందులు పడేవాడు. అక్కడ బాకీలు పడి ప్రశాంతినగర్‌కు మకాం మార్చారు. నగరంలో ఒక ప్రముఖ సినీ థియేటర్ యజమానితో స్నేహంతో అక్కడ 20 అంకణాల స్థలం కొనుగోలు చేసి ఇల్లు నిర్మించాడు. కాలక్రమంలో ఇంటిపై రెండు ఫ్లోర్లు నిర్మించాడు. అంతా సాయి కృప అని చెప్పుకుంటూ ఇంటి సమీపంలోని స్థలాల్లో తరచూ హోమాలు నిర్వహిస్తుండేవాడు. టీడీపీ నేతలు ఆనం వివేకానందరెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డితో పాటు అనేక మంది రాజకీయ ప్రముఖులు సుధాకర్‌కు భక్తులుగా మారిపోయారు. ఈ క్రమంలో సినీ పరిశ్రమలోకి ఇతని పరిచయాలు విస్తరించారు. దీంతో ఇద్దరు పాత తరం హీరోలు, ప్రొడ్యూసర్లు, సంగీత దర్శకులు బాబా వద్దకు క్యూకట్టారు. అలాగే చెన్నై, హైదరాబాద్‌లోనూ ఇదే తరహాలో హోమాలు నిర్వహించి అక్కడ సర్కిల్‌ను పెంచుకున్నాడు. చివరకు 108 రోజుల మహాయాగం పేరుతో వసూళ్లకు పాల్పడటం, వసూలు చేసిన నగదుతో సూత్రధారిగా ఉన్న వాసవి పరారు కావటంతో సుధాకర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. 270 దాటిన ఫిర్యాదులు సుధాకర్బాబాపై నమ్మకంతో భక్తులు తమ ఇళ్లలోని బంగారం, ఇంటి పత్రాలు తాకట్టు పెట్టి మరీ ఆశ్రమంలో నగదు చెల్లించారు. వీరిలో అత్యధికంగా మహిళలే ఉన్నారు. ఇప్పటి వరకు 270 మంది నెల్లూరు రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సుమారు రూ.3.70 కోట్లు వసూలైనట్లు నిర్ధారించారు. వాసవి కోసం సీరియస్‌గా నగదుతో పరారైన వాసవి విషయాన్ని తొలుత పోలీసులు సీరియస్‌గా తీసుకునున్నారు. అయితే వారం దాటినా కనీస పురోగతి లేదు. సుధాకర్ హాస్పిటల్లో ఉండటం, వాసవి పరారీలో ఉండటంతో న్యాయం చేయాలని బాబా భక్తులు ఆయన ఇంటి వద్ద రిలే నిరాహార దీక్షలు ప్రారంభించి గురువారానికి నాలుగో రోజుకు చేరుకున్నాయి. వాసవిది ఒంగోలు నగరంలోని మిర్యాలపాళెంలో నివసిస్తోంది. ఆమె ఇద్దరు వ్యక్తులను పెళ్లిచేసుకుని ప్రస్తుతం వేరుగా ఉంటోంది. ఒంగోలులోని ఓ వ్యక్తితో సహజీవనం చేస్తుందని ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో వాసవి రూ.కోట్ల సంచులను విజయవాడలోని ఓ రైల్వే అధికారికి, తన కుటుంబ సభ్యులు, సహజీవనం చేసే వ్యక్తికి అందజేసిందని భక్తులు భావిస్తున్నారు. కాగా వాసవికి ఓ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధి సహకారం అందించినట్లు సమాచారం. -
భారత అథ్లెటిక్స్ రిలే జట్టులో సుధాకర్
న్యూఢిల్లీ: ఆసియా క్రీడలకు సన్నాహకంగా నిర్వహించే అంతర్జాతీయ అథ్లెటిక్స్ మీట్లో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. ఇండోనేసియాలోని జకార్తాలో ఫిబ్రవరి 11 నుంచి 14 వరకు ఈ మీట్ జరుగుతుంది. పురుషుల 4 గీ 100 మీటర్ల రిలేలో తెలంగాణ అథ్లెట్ సీహెచ్ సుధాకర్‌కు స్థానం లభించింది. సుధాకర్‌తోపాటు ఈ రిలే జట్టులో మొహమ్మద్ సాదత్, ఏకలవ్య దాసన్, విద్యాసాగర్, అనురూప్ జాన్, సత్నామ్ సింగ్ సభ్యులుగా ఉన్నారు. కొంతకాలంగా జాతీయ అథ్లెటిక్స్ స్ప్రింట్ రేసుల్లో సుధాకర్ నిలకడగా రాణిస్తున్నాడు. గతేడాది గుంటూరులో జరిగిన జాతీయ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఖమ్మం జిల్లాకు చెందిన సుధాకర్ 100 మీటర్ల విభాగంలో కాంస్య పతకాన్ని సాధించాడు. -
ప్రియుడి సాయంతో మాజీ ప్రియుడిని..
సాక్షి, గుంటూరు : తాడేపల్లి ఎన్టీఆర్ కరకట్ట వద్ద దారుణం వెలుగు చూసింది. ప్రియుడిని ఓ మహిళ మరో ప్రియుడి సాయంతో చంపేసి సెప్టిక్ ట్యాంక్‌లో శవాన్ని పడేసింది. కరకట్ట ప్రాంతానికి చెందిన గాయత్రి అనే మహిళ విజయవాడ చెందిన రాజయ్య అనే వ్యక్తితో సన్నిహితంగా ఉండేది. వారిమధ్య విభేదాలు తలెత్తటంతో సుధాకర్ అనే మరో యువకుడితో కలిసి రాజయ్యను ఇంట్లోనే చంపేసింది. అనంతరం మృతదేహాన్ని తన ఇంటి సెప్టిక్ ట్యాంకులో పడేసింది. మృతుని కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు గాయత్రిని అదుపులోకి తీసుకున్నారు. ఆమె ఇచ్చిన సమాచారం మేరకు సెప్టిక్ ట్యాంకులో మృతదేహాన్ని వెలికి తీయించనున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి
ధర్మవరం టౌన్: రోడ్డు ప్రమాదంలో సుధాకర్ (20) అనే లారీ డ్రైవర్ మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. కర్ణాటక రాష్ట్రం చిక్బళ్లాపూర్కు చెందిన లారీడ్రైవర్ సుధాకర్ శనివారం ధర్మవరం నుంచి సిమెంటు లోడుతో బెంగుళూర్‌కు బయల్దేరాడు. పట్టణ శివారు ప్రాంతంలోని ఎల్‌సీకేపురం రహదారి వద్ద డ్రైవర్ కునుకు తీయడంతో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ అక్కడిక్కడే మృతి చెందాడు. క్లీనర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. డ్రైవర్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
రైతు ఆత్మహత్య
కర్నూలు: అప్పుల బాధ తాళలేక ఓ మిర్చి రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం బంటుహాలు గ్రామానికి చెందిన సుధాకర్(35) తనకున్న మూడెకరాలతో పాటు మరో మూడున్నర ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని మిర్చిపంట సాగు చేశాడు. వచ్చిన పంటను సోలాపూర్‌కు చెందిన వ్యాపారులకు విక్రయించాడు. కాగా.. వ్యాపారులు సకాలంలో డబ్బులు ఇవ్వకపోవడంతో.. తెచ్చిన అప్పులు తీర్చలేకపోయాడు. ఈ మధ్య కాలంలో అప్పుల వారి బాధలు పెరిగిపోవడంతో.. వాటిని తీర్చే దారి కానరాక వ్యవసాయ భూమి వద్ద చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
మహనీయుల ఆశయసాధనకు జాతర కమిటీలు
జడ్చర్ల టౌన్: బహుజనుల హక్కుల సాధనకు పాటుపడిన సాహు మహరాజ్, జ్యోతిరావుపూలే, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, పెరియార్ లాంటి మహనీయుల ఆశయ సాధన కోసం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అంబేద్కర్ జాతర కమిటీలు వేయనున్నామని మహబూబ్‌నగర్ అంబేద్కర్ జాతర కమిటీ సీనియర్ నాయకులు సుధాకర్ అన్నారు. ఆదివారం జడ్చర్ల ప్రభుత్వ అతిథి గృహంలో మహబూబ్‌నగర్, గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్, రంగారెడ్డి జిల్లాల అంబేద్కర్ జాతర కమిటీ అధ్యక్షులు, ముఖ్య నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం ఆయన విలేకరులకు వివరాలను వెల్లడించారు. మహబూబ్‌నగర్ జిల్లాలో అంబేద్కర్ జాతర కమిటీ ఏర్పాటు చేసి 18 ఏళ్లవుతుందని, ఇకపై తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ కమిటీలు వేయాలని నిర్ణయించామన్నారు. బహుజనులకు రాజ్యాధికారం దక్కాలంటే మహనీయుల గూర్చి వివరిస్తూ వారి ఆశయాలు, లక్ష్యాలు గ్రామ గ్రామానికి చేరవేయాల్సిన అవసరం ఉందని గుర్తించామన్నారు. అక్టోబర్ 14న అంబేద్కర్ బౌద్ధమతం స్వీకరించిన రోజు కావడంతో ఆ రోజు వరకు రాష్ట్రవ్యాప్తంగా కమిటీలు పూర్తిచేస్తామన్నారు. తర్వాత హైదరాబాద్ నిజాం గ్రౌండ్లో భారీ జాతర నిర్వహిస్తామని, ఇందుకోసం చేయాల్సిన కార్యక్రమాలపై సమావేశంలో చర్చించినట్లు చెప్పారు. జాతర కమిటీల అధ్యక్షులు శంకర్, రామచందర్, రహ్మన్, బలరాం, నాయకులు విజయ్‌కుమార్, ఆనంద్, చంద్రమోహన్, శేఖర్ పాల్గొన్నారు. -
క్లాసురా.. మాసురా!
హీరో లుక్, టైటిల్ ఊర మాస్... దర్శక–నిర్మాతలు చెబుతున్న వివరాలు క్లాస్... మరి, సినిమా ఎలా ఉంటుందో చూడాలి! ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ ఫేమ్ సుధాకర్ కోమాకుల హీరోగా బి. హరినాథ్‌బాబు దర్శకత్వంలో డి. శ్రీకాంత్ నిర్మిస్తున్న సినిమా ‘నువ్వు తోపురా’. నిత్యా శెట్టి హీరోయిన్.శుక్రవారం హీరో ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ‘‘కృష్ణవంశీ, వైవీయస్ చౌదరిల శిష్యుడైన హరినాథ్‌బాబు హాలీవుడ్ తరహా కాన్సెప్ట్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. మే 23న చిత్రీకరణ ప్రారంభమైంది. అమెరికాలో 70 శాతం, ఇండియాలో 30 శాతం చిత్రీకరణ జరుపుతాం. ఈ నెల 9న టీజర్ విడుదల చేస్తాం’’ అన్నారు నిర్మాత. ఈ సినిమాకు కథ–మాటలు: అజ్జు మహంకాళి, ప్రొడక్షన్ డిజైనర్: తోట తరణి, సౌండ్ డిజైనర్: పీఏ దీపక్, సమర్పణ: బేబి జాహ్నవి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: దంతులూరి వర్మ, అమెరికా ఎగ్జిక్యూటివ్ నిర్మాత: జేమ్స్ కొమ్ము, సహ నిర్మాత: రితేశ్‌కుమార్. -
ప్రేమ లేని 'లవ్'
తల్లిదండ్రుల దగ్గర ప్రేమ ఉంది. అది వాళ్లు ఇవ్వలేదు. వాడి దగ్గర లవ్ ఉంది. కానీ అందులో ప్రేమలేదు. లవ్‌లో ప్రేమ లేకపోవడం ఏంటి? అంతేమరి! ఈ రోజుల్లో లవ్‌కి డెప్త్ ఉండడం లేదు. నాలుగు రోజులు కలిస్తే చాలు ‘ఐ లవ్ యూ’ చెప్పేస్తున్నారు. ఆ తర్వాత... బాధ్యత తీసుకునే సమయానికి... ఆ లవ్ లో ప్రేమ లేదని అర్థమౌతుంది. ప్రేమ ఒక ఫాస్ట్ ఫుడ్ అయింది. శాటిస్ఫ్యాక్షన్ తప్ప, న్యూట్రిషన్ ఉండడం లేదు. ప్రేమ ఒక ఫ్యాషన్ స్టేట్మెంట్ అయింది. చూపులకు తప్ప, మనసుకు అందడం లేదు. ఎమోషనల్‌గా నిలబెట్టే ప్రేమ తల్లిదండ్రుల దగ్గర మాత్రమే ఉంటుంది. ఆ రుచిని పిల్లలకు ఒక్కసారి చూపిస్తే... పిల్లలు గుర్తిస్తారు.. అర్థం చేసుకుంటారు.. బయటి ప్రేమలకు... బలి కాకుండా ఉంటారు. కారు వేగంగా వెళ్తోంది.సుధాకర్ దంపతుల ఆలోచనలు అంతకంటే వేగంగా సాగుతున్నాయి. ‘డ్రైవర్ త్వరగా పోనివ్వు’ అంది వసుంధర. ‘ఈ తొందర అప్పుడే పడి ఉంటే అపూర్వకి ఈ కష్టం వచ్చేది కాదు’ అన్నాడు సుధాకర్. ‘సరే... నేను తొందరగా తెలుసుకోలేదు మరి మీకేమైంది’ రెట్టించింది వసుంధర. ‘నాకేమైందా? ఆఫీసు, బిజినెస్సు సెట్ చేయకపోతే మనకివన్నీ ఉండేవా?’ సుధాకర్ గొంతులో అసహనం. ‘అయితే... నేను చేసిన పని... పని కాదా? నేను లేకుండానే ఇవన్నీ సమకూర్చగలిగారా’ వసుంధర స్వరంలో ఆవేశం. ‘వద్దులే... వసుంధరా! నీకు ఎన్నిసార్లు చెప్పినా ఇదే గొడవ’ ‘అవును. గొడవంతా నాదే... అందుకే ఆపూర్వకి ఇంత కష్టం వచ్చింది’ ఏడుపు ఆపుకుంటోంది వసుంధర. ఇంతలో కారు అపూర్వ ఇంటి ముందాగింది. ‘‘అమ్మా..’’ అంటూ ఒక్కసారిగా అమ్మ మీద వాలిపోయింది అపూర్వ. కూతుర్ని గట్టిగా హత్తుకుంది వసుంధర. కూతుర్ని చూసి షాక్ తిన్నాడు సుధాకర్. అపూర్వ ముఖమంతా ఎర్రగా కందిపోయి ఉంది. కళ్ల దగ్గర చర్మం నల్లగా కమిలిపోయి ఉంది. కూతుర్ని ఇద్దరూ కాసేపు అనునయించారు. సోఫాలో కూర్చోబెట్టారు. కూతురికి ఇటొకరు, అటొకరు కూర్చున్నారు. ‘‘రాహుల్ ఎక్కడ?’’ అని అడిగాడు సుధాకర్. ‘‘తెలీదు.. కొట్టేసి, వెళ్లిపోయాడు’’ అంది అపూర్వ. ఆమె ఒళ్లంతా వాతలు తేలి ఉన్నాయి. గదిలో వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. అపూర్వ ఏడుపు ఆపుకోలేకపోతోంది. ‘‘వెళ్లిపోదాం... నేనూ మీతో వచ్చేస్తా’’ అంటోంది అమ్మానాన్నలతో. ‘‘ఏమైంది అపూర్వా?’’ అని అడిగింది వసుంధర. ఏమైందో తెలుసుకోవాలంటే కథ కొద్దిగా వెనక్కు నడవాలి. లవ్ ఎట్ ఫస్ట్ ఫైట్ అపూర్వ బీటెక్ థర్డ్డ్ ఇయర్. రాహుల్ ఫైనలియర్. ఆ యేడే కాలేజీ మారి కొత్త కాలేజీకి వచ్చింది. అపూర్వ, రాహుల్ క్యాంటిన్లోనో, లైబ్రరీలోనో ఒకరికొకరు ఎదురుపడేవారు తప్ప పరిచయం లేదు. ఓ రోజు అనుకోకుండా ఆ పరిచయమూ జరిగిపోయింది. కాలేజ్ క్యాంపస్‌లోనే అపూర్వను కొంతమంది సీనియర్స్ ఏవో కామెంట్స్ చేశారు. అంతే! అక్కడే ఉన్న రాహుల్... వాళ్లని లాగి ఒక్కటిచ్చాడు. ఆ స్టంట్‌కి మిగతా వాళ్లు బిత్తరపోయారు. అపూర్వ అబ్బురపడింది. రెండో రోజు కాలేజీకి మంచి గిఫ్ట్‌తో వచ్చింది. రాహుల్‌కి ఇచ్చింది. రాహుల్ ఆశ్చర్యపోయాడు. ‘వాళ్లనెందుకు కొట్టావ్?’ అని అడిగింది. ‘నిన్ను ఏడిపించారు కదా!’ అన్నాడు. ‘నన్ను ఏడిపిస్తే మీకేంటి?’ అని రెట్టించింది. ‘నీతో ఫ్రెండ్షిప్ చేయకపోయినా... నిన్ను రోజూ చూస్తుంటాను. ఎప్పుడూ ఫ్రెండ్స్‌తో భలే సందడిగా ఉంటావ్. అది నాకు నచ్చింది’ అన్నాడు. మరికొంత సేపు ఇద్దరి మధ్యా సంభాషణ నడిచింది. ‘ఫ్రెండ్స్?’ అంటూ చేయి చాపింది. ‘ఫ్రెండ్స్’ అంటూ చేయి కలిపాడు. ఆ రోజు నుంచి ఆ ఇద్దరి మధ్యా స్నేహం బలపడింది. అపూర్వ మీద అమితమైన అటెన్షన్ చూపేవాడు రాహుల్. ఆమెకు నచ్చింది చేసేవాడు. మెచ్చింది తెచ్చేవాడు. సొంత అమ్మానాన్న కూడా అపూర్వ మీద ఎప్పుడూ అంత అటెన్షన్ పే చెయ్యలేదు. ఏదైనా చెబుతుంటే కనీసం వినేవాళ్లు కాదు. నాన్న బిజీ, అమ్మ బిజీ. కోరినవన్నీ సమకూర్చేవారు. కూతురితో టైమ్ మాత్రం స్పెండ్ చేసేవాళ్లు కాదు. ఇలా.. ప్రతి విషయంలో తన పేరెంట్స్‌ని రాహుల్‌తో పోల్చి చూసుకోవడం అలవాటైంది అపూర్వకు. అమ్మానాన్నల కంటే రాహులే తనకు దగ్గరగా ఉన్నట్లు అనిపించేవాడు.సినిమాలు, షికార్లు, పార్టీలు, పబ్‌లు.. అపూర్వ ఏది అడిగినా క్షణాల్లో వచ్చి వాలేవాడు రాహుల్. ఫ్రెండ్షిప్ కాస్తా లవ్‌గా మారిపోయింది. చివరికి ఒకరిని విడిచి ఒకరం ఉండలేమనే నిశ్చయానికీ వచ్చేశారు. పెళ్లి చేసుకోవాలని ప్రామిస్ చేసుకున్నారు. రాహుల్ ఫైనలియర్ ఎగ్జామ్స్ అవగానే పెళ్లి చేసుకున్నారు... ఇరువైపుల పెద్దల అనుమతి లేకుండానే... వాళ్లు రాకుండానే! పెళ్లయ్యాక సెకండ్ ఫైట్ ఫైనలియర్ రిజల్ట్స్ రాకముందే ఫ్రెండ్ సహాయంతో చిన్న కంపెనీలో ఉద్యోగంలో చేరాడు రాహుల్. ఓ నెల రోజులు బాగా గడిచాయి. రెండో నెలలో కీచులాటలు మొదలయ్యాయి. మూడో నెలలో మాటల యుద్ధం ప్రారంభమైంది. పెళ్లికి ముందు అపూర్వ మీద చూపించిన అటెన్షన్‌ను పెళ్లి తర్వాత ఉద్యోగం మీద చూపించాల్సి వచ్చింది రాహుల్‌కి. చాలీచాలని జీతంతో అపూర్వను సంతోష పెట్టడం కత్తి మీద సామైంది రాహుల్‌కి. పార్ట్ టైమ్ జాబూ వెదుక్కున్నాడు. ఆ ఒత్తిడితో తరచు అపూర్వను విసుక్కుంటున్నాడు. పెళ్లికి ముందు ఏం చేసినా మెచ్చుకున్న రాహుల్ ఇప్పుడు ఏం చేయకపోయినా తప్పు పడుతున్నాడు. తనతో గంటలుగంటలు గడిపిన అతను ఇప్పుడు ఒక్క నిముషంగా కూడా టైమ్ ఇవ్వలేకపోతున్నాడు. అలసిపోయి ఇంటికొచ్చిన భర్తను తనకు తెలీకుండానే సతాయించేది. ఒక వైపు పని ఒత్తిడి.. ఇంకోవైపు.. తన కన్నా పెద్దవాళ్లు అక్క, అన్న ఉండగానే డబ్బున్న అమ్మాయి దొరికిందని పెళ్లి చేసుకొని తన దారి తాను చూసుకున్నాడనే నిందలు! అవన్నీ పట్టించుకోక ఇంటికొస్తే అపూర్వ సాధింపు. తట్టుకోలేక తాగుడికి అలవాటుపడ్డాడు. ఇంట్లో అపూర్వ కొంచెం గట్టిగా మాట్లాడినా.. ఎదురుగా ఉన్న వస్తువులను నేలకేసి కొట్టేవాడు. కోపం ఆవేశంగా మారి చివరకు అపూర్వను చేయి చేసుకునేదాకా వెళ్లింది. కొద్దిరోజులకే అది సర్వసాధారణం అయింది. కొట్టానన్న బాధతో మళ్లీ బార్కి వెళ్లేవాడు. బర్త్‌డే రోజు ఫైనల్ ఫైట్ తాగి ఆఫీస్‌కి వస్తున్నాడని ఒకరోజు రాహుల్‌ని ఉద్యోగంలోంచి తీసేశారు. ఆరోజు అపూర్వ బర్త్‌డే. సాయంకాలం తన కోసం సర్ప్రైజ్ గిఫ్ట్ తెస్తాడని ఆశగా ఎదురు చూసింది. కాని అక్కడ సీన్ మారింది. ఉద్యోగం ఊడిపోయిన బాధలో ఫుల్లుగా తాగొచ్చాడు రాహుల్. ఆ విషయాన్ని గ్రహించక... ఒట్టి చేతులతో వచ్చిన భర్త మీద విరుచుకు పడింది. తనంటే కాకుండా తన వెనకున్న డబ్బును చూసి పెళ్లి చేసుకున్నావంటూ తిట్టింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న పెళ్లాం బర్త్‌డేకి ఓ గిఫ్ట్ కొనివ్వలేని నువ్వే భర్తవంటూ ఈసడించుకుంది. దానికి అపూర్వ మీద పిడిగుద్దులతో సమాధానమిచ్చింది రాహుల్ ఆవేశం. హతాశురాలైంది. భరించలేకపోయింది. వెంటనే ఆమ్మానాన్నలకు ఫోన్ చేసింది. ఆలోచనలో అమ్మానాన్న రాహుల్‌కి ఫోన్ చేసి, కొన్నాళ్లు అపూర్వ తమతో ఉంటుందని చెప్పి, అతడి అనుమతితో కూతుర్ని ఊరికి తెచ్చేసుకున్నారు సుధాకర్, వసుంధర. లోపల గదిలో అపూర్వ నిద్రపోతోంది. భార్యాభర్తలిద్దరూ ఆలోచనలో పడిపోయారు. ఇద్దరి ఆలోచనలూ ఒకే విధంగా సాగుతున్నాయి. కూతురి జీవితం ఇలా కావడానికి తామే కారణం అని వారికి అనిపిస్తోంది. అవును... ఆ పిల్ల మీద ఎప్పుడు శ్రద్ధ పెట్టారని? సొంత కంపెనీని డెవలప్ చేసే పనిలో పడి అపూర్వను పట్టించుకోనేలేదిద్దరూ. నానమ్మ, అమ్మమ్మ, ఆయాల వంతుల వారీ పెంపకంతో అమ్మానాన్న ప్రేమకు దూరమైంది అపూర్వ. విలువైన సమయానికి బదులు ఖరీదైన కానుకలతో కూతురిని సంతోషపెట్టే ప్రయత్నం చేశారు. దాంతో పెంకితనం అలవడింది. ఏదడిగితే అది క్షణాల్లో హాజరవకపోతే హఠం చేసేది. ఫ్రెండ్స్‌తో ఎక్కువ గడపడం మొదలుపెట్టింది. పరాయి వాళ్లు తన మీద ఏ కాస్త శ్రద్ధ పెట్టినా.. ఇట్టే చనువు పెంచేసుకునేది. నమ్మేసేది. ఆ క్రమంలోనే రాహుల్ పరిచయం అయ్యాడు. వాళ్ల ప్రేమ వ్యవహారం తెలిసి వారించేసరికే పరిస్థితి చేయి దాటి పోయింది. కూతురి ఆలోచనను కుదురు చేయాల్సింది పోయి పరువు తీసిందని పరాయిదాన్ని చేశారు. ఇంట్లోకి రానివ్వకుండా కట్టడి చేశారు. ఎంత తప్పు చేశారు? అపూర్వ నిద్రలో కాస్త కదిలింది. కూతురి కురుల్ని సవరించింది వసుంధర. చక్క దిద్దాల్సిన వాటి గురించి ఆలోచిస్తున్నాడు సుధాకర్. -
ట్రాన్స్‌కో ఉద్యోగి ఆత్మహత్య
అనంతపురం సెంట్రల్: నగరంలో హౌసింగ్‌బోర్డు కాలనీలో నివాసముంటున్న ట్రాన్స్‌కో చిరుద్యోగి ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసుల వివరాల మేరకు.. ట్రాన్స్‌కోలో పోల్ టూ పోల్ ఆపరేటర్‌గా పని చేస్తున్న సుధాకర్(35) ఆదివారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కొంతకాలం నుంచి సుధాకర్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. చికిత్స కోసం భారీగా డబ్బులు ఖర్చు పెట్టడంతో అప్పులపాలయ్యాడు. దీంతో మనస్థాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు. వన్‌టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
హీరో అభిమాన సంఘం నిర్వాహకుడి అరెస్ట్
తమిళసినిమా : రాజకీయ నాయకులు శాశ్వతం కాదని, దేశం మాత్రమే శాశ్వతమని విలక్షణ నటుడు కమలహాసన్ వ్యాఖ్యానించారు. ఇటీవల తమిళ రాజకీయాలపై కమల్ తనదైన బాణిలో స్పందిస్తున్న విషయం తెలిసిందే. శాసన సభ్యులు మీ గ్రామాలకు వస్తున్నారు. వారికి తగిన మర్యాద ఇవ్వండి అంటూ ప్రజలనుద్దేశించి చేసిన వ్యాఖ్యలు వ్యంగ్యంగా ఉన్నాయంటూ కమల్‌పై పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. కాగా పుదుకొట్టయ్ లో కమలహాసన్ అభిమాన సంఘం నిర్వాహకుడు సుధాకర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. జల్లికట్లు పోరాటంలో సుధాకర్ రాష్ట్రమంత్రిని అవమానపరచే విధంగా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణపై కేసు నమోదు చేశారు. ఆ చర్యలను తీవ్రంగా ఖండించిన కమల్ తన ట్విట్టర్లో పేర్కొంటూ.. ‘ఇక ప్రజల నీతిని దేశం కాపాడుకుంటుంది. నేను విమర్శించకుండా, శాంతియుతంగానే నడుచుకోవాలని భావించాను. కానీ నా అభిమాన సంఘం కార్యకర్తల అరెస్ట్ మాట్లాడించేలా చేసింది. జల్లికట్టు అంశంలో నా సంఘ కార్యకర్తతో పాటు మరి కొందరిని అరెస్ట్ చేశారు. అది నా సహనాన్ని, రాజకీయ హింసాత్మక ధోరణిని చూపుతోంది. నా సంఘానికి చెందిన వారు కాస్త నిబద్ధత పాటించాల్సిన సమయం ఇది. రాజకీయ నాయకులు వస్తుంటారు, పోతుంటారు. పార్టీకి చెందిన వారు మోసాలకు పాల్పడినా అందుకు అతీతంగా సేవ చేసే మనం ఎలాంటి కూలి ఆశించకుండా జీవం ఉన్నంత వరకూ ప్రజలకు సేవ చేద్దాం. రాజకీయ నాయకులు శాశ్వతం కాదు. మన దేశం శాశ్వత’మని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. -
కురుబ సంఘం జిల్లా ఉపాధ్యక్షునిగా సుధాకర్
అనంతపురం న్యూటౌన్ : జిల్లా కురుబ సంఘం జిల్లా అధ్యక్షునిగా ఉరవకొండ నియోజకవర్గానికి చెందిన కురుబ సుధాకర్‌ను ఎంపిక చేశారు. మంగళవారం సాయంత్రం కనకదాస కల్యాణమండపంలో జరిగిన సమావేశంలో కురుబ సంఘం జిల్లా అధ్యక్షులు రాగే పరుశురామ్ ఈ మేరకు సుధాకర్‌కు నియామకపత్రాలనందించారు. సంఘం బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో వెంకటశివ, మంజునాథ్, రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
బతికున్న తండ్రిని ‘చంపేశాడు’!
రుణం తీసుకోవడానికి తనయుడి నిర్వాకం నకిలీ పత్రాలు సృష్టించి స్థిరాస్తి ‘విక్రయం’ ఫైనాన్స సంస్థ నుంచి రూ.89 లక్షల రుణం నిందితుడి అరెస్టు సిటీబ్యూరో: తండ్రి ఆస్తిపై రుణం తీసుకోవడానికి ఓ సుపుత్రుడు భారీ స్కెచ్ వేశాడు. బతికున్న తండ్రి చనిపోరుునట్లు నకిలీ పత్రాలు సృష్టించడంతో పాటు స్నేహితుడికి స్థిరాస్తిని విక్రరుుస్తున్నట్లు ఒప్పందం చేసుకున్నాడు. మరో ఆరుగురితో కలిసి కథనడిపి ఫైనాన్స సంస్థ నుంచి రూ.89 లక్షల రుణం తీసుకున్నాడు. వారుుదాలు చెల్లించకపోవడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో సీసీఎస్ పోలీసులు నిందితుడిని గురువారం అరెస్టు చేసినట్లు డీసీపీ అవినాష్ మహంతి తెలిపారు. సికింద్రాబాద్‌లోని కాకగూడ వాసవీనగర్‌కు చెందిన కె.వెంకటేశ్వరరావు కొన్నాళ్లుగా మస్కట్‌లో ఉంటున్నారు. ఈయన కుమారుడైన కె.సుధాకర్ ఫార్మాసిస్ట్‌గా పని చేస్తున్నాడు. వీరికి కాకగూడలో ఉన్న ఇంటిపై కన్నేసిన సుధాకర్ దాన్ని తాకట్టు పెట్టి రుణం తీసుకోవాలని భావించాడు. దీని కోసం తన స్నేహితుడైన ఎ.వరప్రసాద్‌తో పాటు ఎ.రాజ్యలక్ష్మి, కిరణ్, వెంటకరెడ్డి, సుధాకర్‌రెడ్డి, కనకాంబరరావు, నాగేంద్రలతో కలిసి రంగంలోకి దిగాడు. తొలుత తన తండ్రి వెంకటేశ్వరరావు చనిపోరుునట్లు ఓ మరణ ధ్రువీకరణ పత్రాన్ని తయారు చేశారు. సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ బోర్డ్ దీన్ని జారీ చేసినట్లు రూపొందించాడు. దీంతో పాటు ఇతర పత్రాలను సృష్టించిన సుధాకర్ వాసవినగర్‌లో ఉన్న ఇంటిని తన స్నేహితుడు వరప్రసాద్‌కు విక్రరుుస్తున్నట్లు సేల్‌డీడ్ చేశాడు. వీటి ఆధారంగా అంతా కలిసి మాగ్న ఫైనాన్స సంస్థ నుంచి రూ.89 లక్షల రుణం తీసుకున్నారు. దీని వారుుదాలు చెల్లించడంలో విఫలం కావడంతో కంపెనీకి చెందిన వారు ఆరా తీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో వారు సీసీఎస్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఏసీపీలు జోగయ్య, కె.రామ్‌కుమార్ పర్యవేక్షణలో కేసు దర్యాప్తు చేసిన ఇన్స్పెక్టర్ బి.రవీందర్‌రెడ్డి గురువారం సుధాకర్‌ను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మిగిలిన ఏడుగురు నిందితుల కోసం గాలిస్తున్నారు. -
అమ్మ ఆరోగ్యం కోసం పాలాభిషేకం
తిరువళ్లూరు: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం మెరుగుపడాలని కోరుతూ కడంబత్తూరు యూనియన్‌లోని కడంబవన మురుగన్ ఆలయానికి పాలాభిషేకం నిర్వహించారు. తిరువళ్లూరులో జిల్లా వ్యాప్తంగా అమ్మ ఆరోగ్యం మెరుగుపడాలని కోరుతూ పూజలు, యాగాలు, పాలాభిషేకాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కడంబత్తూరు యూనియన్‌లోని కడంబవన మురుగన్ ఆలయానికి అన్నాడీఎంకే నేతలు పాలాబిషేకం నిర్వహించారు. ఈ అభిషేక కార్యక్రమానికి యూనియన్ కార్యదర్శి సుధాకర్ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా జిల్లా కన్వీనర్ పొన్నేరి ఎమ్మెల్యే బలరామన్ హాజరు కాగా అరక్కోణం ఎంపీ హరి, మాజీ మంత్రి రమణ పాల్గొన్నారు. ఆరోగ్యం మెరుగు పడాలని కోరుతూ ముందుగా పూజలు నిర్వహించిన అన్నాడీఎంకే నేతలు అనంతరం వంద టెంకాయలు కొట్టి పూజలు చేశారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. ఈ పూజలకు అన్నాడీఎంకే నేతలు పలువురు కార్యకర్తలతో పాటు ప్రముఖులు పాల్గొన్నారు. -
వ్యక్తి ఆత్మహత్యాయత్నం
గార్లదిన్నె : మండల పరిధిలోని పి. కొత్తపల్లిలో గురువారం ఓ వ్యక్తి పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన చోటుచేసుకుంది. 108 సిబ్బంది తెలిపిన వివరాలు మేరకు... సుధాకర్ (30) అనే వ్యక్తి పురుగుమందు తాగి అపస్మారకస్థితిలో పడిఉండగా స్థానికులు గమనించి బంధువులకు సమాచారం అందించారన్నారు. వెంటనే వారు చికిత్స నిమిత్తం 108కు సమాచారం అందించడంతో అనంతపురము ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని చెప్పారు. అయితే సుధాకర్ ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. -
రాఘవపురం గ్రామాన్ని సందర్శించిన యునిసెఫ్ రాష్ట్ర ప్రతినిధి సుధాకర్‌రెడ్డి
రాఘవపురం(పాలకుర్తి) : ఉత్తమ పంచాయతీ అవార్డు పొందిన మండలంలోని రాఘవపురం గ్రామానికి యునిసెఫ్ జాతీయ ప్రతినిధి జేమ్స్ ఈ నెల 10న రానున్నారని రాష్ట్ర ప్రతినిధి సుధాకర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన గ్రామా న్ని సందర్శించి సర్పంచ్ నల్ల నాగిరెడ్డితో పాటు ప్రజలను కలిసి మాట్లాడారు. నూరు శాతం మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు, పారిశుధ్య పనులు చేపట్టిన ఈ గ్రామాన్ని జేమ్స్ సందర్శిస్తారని పేర్కొన్నారు. ఆయన వెంట ఆర్డబ్ల్యూఎస్ డీఈ గోపాల్‌రెడ్డి, ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్, గ్రామ కార్యదర్శి లింగయ్య, ఉప సర్పం చ్ ముస్కు కొంరెల్లి, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలి
షాద్‌నగర్ : షాద్‌నగర్‌ను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని షాద్‌నగర్ రెవెన్యూ డివిజన్ సాధన సమితి అధ్యక్షుడు సుధాకర్ డిమాండ్ చేశారు. సోమవారం పట్టణంలోని ఆర్అండ్బీ అతిథి గహంలో ఆయన మాట్లాడారు. షాద్‌నగర్‌ను రెవెన్యూ డివిజన్‌గా మార్చడానికి అన్ని హంగులు ఉన్నాయన్నారు. అదేవిధంగా పరూఖ్‌నగర్ మండలంలోని చించోడ్, కొందుర్గు మండలంలోని చౌదర్‌గూడను మండల కేంద్రాలు చేయాలన్నారు. షాద్‌నగర్ పరిసర ప్రాంతాల్లో అధికశాతం వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారన్నారు. వారికి అనుకూలంగా ఉండడానికి షాద్‌నగర్‌ను రెవెన్యూ డివిజన్ చేయాలన్నారు. శంషాబాద్ రెవెన్యూ డివిజన్‌గా ఉంటే కొందుర్గు మండలంలో ఉన్న దూర గ్రామాలకు శంషాబాద్ 100 కిలోమీటర్ల అవుతుందన్నారు. షాద్‌నగర్ పాలమూరు జిల్లాలో ఉన్నపుడు చివరకే ఉందని, ఇప్పుడు శంషాబాద్ జిల్లాలో కూడా చివరికే ఉందన్నారు. షాద్‌నగర్ శంషాబాద్ జిల్లాలో కలపడం వల్ల కష్ణానీటికి, మహనీయులను మరిచిపోయే ప్రమాదముందన్నారు. వ్యక్తులపై ఆధారపడి జిల్లాలను విభజించొద్దన్నారు. షాద్‌నగర్‌ను రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయకపోతే ప్రాణత్యాగాలు, నిరాహార దీక్ష, ఉద్యమాలు చేయడానికి కూడా వెనుకాడమన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అగ్గనూరి విశ్వం, యాదయ్యయాదవ్, కట్ట వెంకటేష్, చెంది మహేందర్‌రెడ్డి, చెన్నయ్య, శంకర్, రామకష్ణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పరిశోధనలే ప్రాణంగా..
చారిత్రక సంపద అన్వేషణకు కృషి చేస్తున్న గిరిపుత్రుడు వివిధ రాష్ట్రాల్లో పలు పరిశోధనలు సామాజిక సేవతో ప్రత్యేక గుర్తింపు ప్రముఖుల ప్రశంసలు పొందుతున్న సుధాకర్ మరిపెడ : చరిత్ర మూలాలు తెలుసుకునేందుకు ఆయన పడే తపన అంతా ఇంతాకాదు. రాళ్లు, రప్పలు, గుట్టలు, చెట్లు ఇలా ఎన్నో ప్రాంతాలను సందర్శిస్తూ జాతి సంపదను వెలికితీసేందుకు కృషి చేస్తున్నాడు. కాలగర్భంలో కలిసిపోయిన చారిత్రక ఆనవాళ్లను వెలికితీస్తూ నేటి తరానికి వాటి ఆవశ్యకతను తెలియజేసేందుకు పాటుపడుతున్నాడు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వినూత్న పరిశోధనలు చేస్తూ ఓరుగల్లు కీర్తిని నలుదిశలా చాటుతున్న గిరిపుత్రుడు ఇస్లావత్ సుధాకర్‌పై కథనం. విద్యతోనే సమాజంలో గుర్తింపు ఉంటుందని పాలకులు, అధికారులు చెబుతుంటారు. అయితే చదువుతోపాటు పరిశోధనలతో కూడా పేరు సంపాదించుకోవచ్చని ఓ విద్యార్థి నిరూపిస్తూ ముందుకుసాగుతున్నాడు. కురవి మండలంలోని సీరోలు శివారు రేకులతండాకు చెందిన ఇస్లావత్ సుధాకర్ చిన్నప్పటి నుంచే చదువులో ప్రతిభ కనబరుస్తున్నాడు. 1 నుంచి 10వ తరగతి వరకు కురవి జిల్లా పరిషత్ పాuý శాలలో, ఇంటర్ మానుకోటలో చదివిన సుధాకర్ మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాడు. డిగ్రీలో ప్రారంభం 2012లో ఖమ్మంలోని ఎస్ఆర్అండ్ బీజీఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుతున్న సమయంలో అధ్యాపకులు, విద్యార్థులు బృహత్ శిలా యుగపునాటి తవ్వకాలు జరిపారు. ఈ సందర్భంగా సుధాకర్ కూడా అందులో చురుగ్గా పాల్గొన్నాడు. ఈ క్రమంలో ఖమ్మం జిల్లా గుండాల మండలం పడుకోనిగూడెం అడవుల్లో పది కిలోమీటర్ల లోపల ఉన్న రాక్షసగూళ్లపై ఆయన పరిశోధన చేశాడు. అలాగే మరిపెడ మండలం జయ్యారంలో కూడా బృహత్ శిలలు ఉన్నాయని ఇటీవల కనుగొన్నాడు. కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో నవీనా శిలా యుగానికి చెందిన ఆదిమానవుల సంస్కృతి, అవశేషాలను గుర్తించి వాటిపై కూడా పరిశోధన చేశాడు. వీటితోపాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలోని అడవులు, గుట్టల్లోని బృహత్ శిలాయుగం నాటి సమాధులు, నవీనా శిలాయుగపు సాంస్కృతిక అవశేషాలను కనుగొన్నాడు. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాలో గోల్కోండ నయా ఖిల్లా తవ్వకాల్లో అసిస్టెంట్ ఆర్కియాలజిస్ట్‌గా సుధాకర్ పరిశోధనలు జరిపి అధికారుల మన్ననలు పొందాడు. సుధాకర్ అందుకున్న అవార్డులు హిస్టరీ, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ద్వారా పరిశోధనల్లో ఉత్తమ ప్రతిభ కనబరుస్తూ ప్రాచీన, పూర్వయుగపు సంస్కృతిని భావితరాలకు తెలియజేసేందుకు కృషి చేస్తున్న సుధాకర్‌కు 2015 నవంబర్ 14న ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రతిభా పురస్కార్ అవార్డు అందజేశారు. అలాగే ఖమ్మంలోని ఎస్ఆర్అండ్ బీజీఎన్ఆర్ ప్రభుత్వ కాలేజీ నుంచి ఎన్సీసీ కేడెట్‌గా సామాజిక సేవలు అందించి 2010లో బెస్ట్ కేడెట్ అవార్డు అందుకున్నాడు. కాగా, 2010లో నేషనల్ బెస్ట్ కేడెట్ అవార్డును డిప్యూటీ డైరెక్టర్ జనరల్ చేతుల మీదుగా సికింద్రాబాద్ క్యాంపులో అందుకున్నాడు. ఎన్ఐసీ (నేషనల్ ఇంటిగ్రేటెడ్ క్యాంపు) తిరుపతిలో బెస్ట్ కేడెట్ అవార్డు, ఆలిండియా ట్రెక్కింగ్ క్యాంపు కేరళలో బెస్ట్ కేడెట్ అవార్డు, వరల్డ్ టూరిజం డే సందర్భంగా బౌల్డ్ రింగ్ బెస్ట్ ఫర్మామెన్స్ అవార్డు, స్టేట్ ఎన్ఎస్ఎస్ మెగా క్యా ంపులో బెస్ట్ వలంటరీ అవార్డు, నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంపులో బెస్ట్ కేడెట్ అవార్డు అందుకున్నారు. వీటితోపాటు క్రీడా విభాగంలో వెయిట్ లిఫ్టింగ్‌లో నాగార్జున యూనివర్సిటీలో 110 కేజీల విభాగంలో ప్రతిభ కనబరిచి అక్కడి వీసీ చేతుల మీదుగా ప్రథమ బహుమతి అందుకున్నాడు. చరిత్ర మూలాలు తెలుసుకునేందుకే.. మన పూర్వీకులు భావితరాల కోసం భద్రపరిచిన జాతిసంపదను కాపాడేందుకే నేను పరిశోధనలు చేస్తున్నాను. చారిత్రక అన్వేషణ చేయడమే నా లక్ష్యం. ప్రాచీన శిలాయుగం, నవీన శిలాయుగం, బృహత్ శిలాయుగం నాటి ఆదిమానవుల అవశేషాలు, వారి సంస్కృతిపై శాస్త్ర పరిశోధన చేస్తున్నాను. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలోని హిస్టరీ విభాగానికి చెందిన డాక్టర్ ఎస్.మురళీమోహన్ దగ్గర రీసెర్చ్ స్కాలర్‌గా పనిచేస్తున్నాను. – ఇస్లావత్ సుధాకర్, రీసెర్చ్ స్కాలర్ -
ఏకోపాధ్యాయ పాఠశాలగా సాహిత్య పీఠం
రెండేళ్ల నుంచీ నిధుల కొరత డీన్‌గా ఎండ్లూరి సుధాకర్ రాజమహేంద్రవరం కల్చరల్ : ‘పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, తెలుగు సాహిత్యపీఠం ఏకోపాధ్యాయ పాఠశాలగా మారిపోయింది. నేను ఒక్కడినే పూర్తిస్థాయి అధ్యాపకుడిని, మరో నలుగురు సందర్శకాచార్యులు (విజిటింగ్ప్రొఫెసర్లు’) ఉన్నారు’ అని ఇటీవలే డీన్‌గా బాధ్యతలు స్వీకరించిన ఎండ్లూరి సుధాకర్ పేర్కొన్నారు. తెలుగు సాహిత్య పీఠానికి ఉన్న ఘనమైన చరిత్ర, ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలపై ఆయన ఆదివారం ‘సాక్షి’తో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. ఎన్టీఆర్ మానస పుత్రిక దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు మానస పుత్రికైన పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 1985 డిసెంబర్లో ఆవిర్భవించింది. ఎన్టీఆర్ ఆశీస్సులతో నాటి విద్యామంత్రి ఎర్నేని సీతాదేవి పూనుకోవడంతో 1987లో బొమ్మూరులో తెలుగు సాహిత్యపీఠం ఏర్పడింది. బోధన, పరిశోధనలే ప్రధాన అంశాలుగా 48 ఎకరాల్లో సాహిత్యపీఠం నెలకొంది. ఆచార్య బాలాంత్రపు రజనీకాంత రావు, కొత్తపల్లి వీరభద్రరావు, ఆచార్య బేతవోలు రామబ్రహ్మం, ఆర్వీఎస్ సుందరం తదితర మహనీయుల సారథ్యంలో నడిచింది. విద్యార్థుల ప్రగతికి బాటలు ఇప్పటివరకు సుమారు 513 మంది విద్యార్థులు తెలుగులో ఎంఏ పట్టా అందుకున్నారు. 390 మంది ఎంఫిల్ పూర్తిచేశారు. సుమారు 341 మంది పరిశోధకులకు డాక్టరేట్ లభించింది. దేశవిదేశాల నుంచి ఎందరో వచ్చి ఇక్కడ పరిశోధనలు చేశారు. ద్వానా శాస్త్రి, అద్దేపల్లి రామ్మెహనరావు, గరికిపాటి నరసింహారావు, ఆర్ఎస్ వెంకటేశ్వరరావు, అబ్బిరెడ్డి పేరయ్య నాయుడు, కేసాప్రగడ సత్యనారాయణ తదితరులు ఇక్కడ పరిశోధనలు చేసి డాక్టరేట్ అందుకున్నవారే. జీతాలు సక్రమంగా రాక.. ఒకప్పుడు ఎంఏ చదివే విద్యార్థులు ఏటా 40కి పైగా ఉండేవారు. నిరంతరం సాహితీ కార్యక్రమాలు జరిగేవి. ఇప్పుడు ఆ వాతావరణం లేదు. ప్రస్తుతం 9 మంది తెలుగు ఎంఏ చదువుతున్న విద్యార్థులు, ముగ్గురు పరిశోధకులు ఉన్నారు. రాష్ట్రవిభజన నేపథ్యంలో ప్రవేశ ప్రకటన ఆలస్యంగా వెలువడింది. పనిచేస్తున్నవారికి జీతాలు సక్రమంగా అందడం లేదు. సీఎం ప్రకటన సాకరమైతే.. రాజమహేంద్రవరం ప్రధానకేంద్రంగా పూర్తిస్థాయి తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అది సాకారమయ్యే రోజు కోస ంఎదురు చూస్తున్నాం. పూర్తిస్థాయి విశ్వవిద్యాలయం ఏర్పడితే లలితకళలకు సంబంధించిన అన్ని విభాగాలు ఇక్కడికి వస్తాయి. జాషువా కళాపీఠం, కుసుమ ధర్మన్న కళాపీఠం, బోయి భీమన్న కళాపీఠం ఏర్పడటానికి ప్రతిపాదనలు ఉన్నాయి. అలాగే పూర్తిస్థాయి ఉపకులపతిని నియమించాలి. రెండేళ్ల నుంచీ పీఠం నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతోంది. -
దరఖాస్తుల ఆహ్వానం
సంగారెడ్డి జోన్: వికలాంగుల సంక్షేమం కోసం పని చేస్తున్న వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు వికలాంగ, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు సుధాకర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఉత్తమ ఉద్యోగి, సెల్ఫ్ ఎంప్లాయ్ విత్ డిసేబుల్, బెస్ట్ ఎంప్లాయర్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ ఆర్ ఏజెన్సీ, బెస్ట్ ఇండివిడ్యువల్ అండ్ ఇనిస్టిట్యూషన్స వర్కింగ్ ఫర్ కేస్ ఆఫ్ పర్సన్స విత్ డిసెబులిటీ , రోల్ మోడల్ తదితర అంశాల్లో అర్హులైన వారి నుంచి భారత ప్రభుత్వం దరఖాస్తులను కోరుతోందన్నారు. ఇతర వివరాలు www. disabilityaffairs.gov.in వెబ్సైట్ ద్వారా తెలుసుకోవాలని సూచించారు. పూర్తి చేసిన దరఖాస్తులను వచ్చేనెల 5లోగా కలెక్టరేట్లోని జిల్లా కార్యాలయంలో అందజేయాలన్నారు. ఈ అవకాశాన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు, వికలాంగులు వినియోగించుకోవాలన్నారు. -
నయీం అనుచరుల లొంగుబాటు
నల్లగొండ: మావోయిస్టు వ్యతిరేక ఉద్యమ నాయకులు పాశం శ్రీను, సుధాకర్ శుక్రవారం నల్లగొండ ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి ఎదుట లొంగిపోయారు. వీరిపై ఇటీవల పోలీసులు పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేశారు. రెండు నెలలుగా అజ్ఞాతంలో ఉన్న వీరిద్దరూ తమను పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో లొంగిపోయినట్లు తెలుస్తోంది. వీరిద్దరిపై సుమారు 100 కేసులున్నట్లు సమాచారం. మావోయిస్టు కొనాపూరి సాంబశివుడు, రాములు హత్యకేసుల్లో వీరిద్దరు ప్రధాన ముద్దాయిలుగా ఉన్నారు. కాగా సుధాకర్ టీఆర్ఎస్ పార్టీ నుంచి భువనగిరి జడ్పీటీసీ సభ్యుడిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. పాశం శ్రీను, సుధాకర్‌లు మావోయిస్టు వ్యతిరేక ఉద్యమ నేత నయీంకు ముఖ్య అనుచరులుగా ఉన్నారు. -
ఇద్దరు కార్మికుల ఘర్షణ: ఒకరి మృతి
* మరొకరికి తీవ్రగాయాలు * పారతో మోది హత్య * పోలీసుల అదుపులో నిందితుడు ఇబ్రహీంపట్నం: ఇటుక బట్టీలో పనిచేసే ఇద్దరు కార్మికులు ఘర్షణకు దిగారు. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందాడు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్ పరిధిలోని కర్ణంగూడ శివారులో ఈ ఘటన ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. ఎస్ఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాకు చెందిన సుధాకర్ సాల్వే(38), ఒడిశా రాష్ట్రంలోని బాలంపేట్ జిల్లాకు చెందిన చైతన్య మండలంలోని కర్ణంగూడ సమీపంలోని మల్యాద్రికి చెందిన ఇటుక బట్టీలో పనిచేస్తున్నారు. చైతన్యకు వరసకు అన్న అయిన బెహురు ఇదే బట్టీలో పనిచేసేవాడు. అతడు గత బుధవారం స్వస్థలం ఒడిశాకు బయలుదేరాడు. అతను ఇంటికి చేరుకోకపోవడంతో కార్మికులకు హెడ్ అయిన సుధాకర్ సాల్వేను ఈవిషయమై రెండు రోజులుగా చైతన్య ప్రశ్నిస్తున్నాడు. ఈక్రమంలోనే ఆదివారం ఉదయం కూడా మరోమారు అడిగాడు. సుధాకర్ సాల్వే హేళన చేస్తూ సమాధానం చెప్పాడనే కక్షతో చైతన్య అతడిపై పిడిగుద్దులు కురిపించాడు. అనంతరం అక్కడే ఉన్న పారతో తలపై తీవ్రంగా మోదాడు. వీరిద్దరి గొడవ గమనించిన ఇటుక బట్టీ సూపర్వైజర్ బ్రహ్మనాయుడు వెళ్లడంతో చైతన్య అతడిపై కూడా దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం ఓ గొడ్డలి తీసుకొని గదిలోకి వెళ్లి దాక్కున్నాడు. హత్య సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. అనంతరం చైతన్య వద్దకు వెళ్లగా అతడు వారిని బెదిరించాడు. బయటకు రాకుంటే కాల్చేస్తామని పోలీసులు హెచ్చరించడంతో చైతన్య బయటకు వచ్చి లొంగిపోయాడు. తీవ్రంగా గాయపడిన సుధాకర్‌సాల్వేను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. బ్రహ్మనాయకుడి తలకు గాయాలయవడంతో చికిత్స చేస్తున్నారు. హతుడు సుధాకర్ సాల్వే భార్య, ముగ్గురు పిల్లలు నాందేడ్‌లో ఉంటున్నారు. నిందితుడు చైతన్య భార్య ఒడిశాలో ఉంటుంది. ఈమేరకు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఇబ్రహీంపట్నం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ జగదీశ్వర్ తెలిపారు. -
ఇటుకబట్టీ కార్మికుల మధ్య ఘర్షణ..ఒకరి మృతి
ఇబ్రహీంపట్నం మండలం కర్ణగూడెం వద్ద దారుణం చోటుచేసుకుంది. ఇటుకబట్టి కార్మికుల మధ్య ఓ విషయంలో తలెత్తిన వివాదం ఘర్షణకు దారి తీసి ఒకరిని బలితీసుకుంది. ఈ ఘటనలో మహారాష్ట్రకు చెందిన సుధాకర్ అనే వ్యక్తి ఆసుపత్రిలో మృతిచెందగా..ఒడిషాకు చెందిన బ్రహ్మయ్య అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది. -
వివాహిత గొంతుకోసి...
- అనంతరం ఆత్మహత్య చేసుకున్న నిందితుడు కదిరి అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో ఘోరం జరిగింది. వివాహేతర సంబంధం ఓ మహిళ హత్యకు దారితీసింది. మంగళవారం అర్ధరాత్రి సమయంలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు పోలీసుల కథనం మేరకు ఇలా ఉన్నాయి. మూర్తినగర్ ప్రాంతంలో నివసించే భారతి అనే మహిళకు అదే ప్రాంతానికి చెందిన గొల్ల సుధాకర్‌తో వివాహేతర సంబంధం ఉంది. కాగా, మంగళవారం మధ్యాహ్నం సుధాకర్ భారతి ఇంటికి వెళ్లగా... ఆ సమయంలో ఆమె మరొకరితో సన్నిహితంగా ఉండడాన్ని చూసి అతడు జీర్ణించుకోలేకపోయాడు. పథకం ప్రకారం... అర్ధరాత్రి ఆమె భర్త కదిరి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు వెళ్లగా... అదే సమయంలో సుధాకర్ భారతి ఇంటికి వేటకొడవలితో వెళ్లాడు. ఆమె గొంతుకోసి హత్య చేశాడు. అనంతరం తన గొంతుకూడా కోసుకుని రక్తపు మడుగులో పడిపోయాడు. అతడ్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా... పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురం జిల్లా ఆస్పత్రికి తరలించారు. -
పోలీస్ కార్ల ఫ్లాగ్‌పోల్స్ దొంగల అరెస్టు
పంజగుట్ట ఆఫీసర్స్ కాలనీలో ఉన్నతాధికారుల 8 కార్లకు చెందిన బ్రాస్ ఫ్లాగ్‌పోల్స్ తొలగించిన ఇద్దరు నిందితులను, వాటిని కొనుగోలు చేసిన మరో వ్యక్తిని పోలీసులు అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు. డీసీపీ వెంకటేశ్వర్రావు తెలిపిన వివరాలప్రకారం ... పంజగుట్ట ఐఏఎస్, ఐపీఎస్ కాలనీలో ఈ నెల 2వ తేదీన 8 మంది ఐఏఎస్ అధికారుల కార్లు బయటపెట్టగా తెల్లారేసరికి వాటికి ఉన్న ప్లాగ్‌పోల్స్ (కారు ముందు భాగంలో జెండా అమర్చే పరికరం) కనిపించకుండా పోయాయి. ఓ ఐఏఎస్ అధికారి కారు డ్రైవర్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అదే కాలనీలో ఓ ఉన్నతాధికారి ఇంట్లో పనిచేస్తూ అక్కడే నివాసం ఉండే ఓ మహిళ కొడుకు రాజేష్ ఖన్నా అలియాస్ రాకేష్ (19) బ్యాండ్ కొడుతూ జీవనం కొనసాగిస్తుంటాడు. ఇతని స్నేహితుడు డి. శ్రీనివాస్‌తో కలిసి ఫ్లాగ్‌పోల్స్ దొంగతనం చేసి ద్వారకాపూరి కాలనీలో స్క్రాప్ దుకాణం నిర్వహించే సుధాకర్‌కు అమ్మారు. దీనిని గుర్తించిన పోలీసులు ఇద్దరు నిందితులను, సుధాకర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
డిప్యూటీ తహశీల్దారు ఆత్మహత్యాయత్నం
చిత్తూరు (అగ్రికల్చర్): చిత్తూరు కలెక్టరేట్లో ఎలక్షన్ విభాగంలో డిప్యూటీ తహశీల్దారుగా పనిచేస్తున్న సుధాకర్ బుధవారం విధి నిర్వహణలోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. డిప్యూటీ తహశీల్దారు సుధాకర్ ఉదయం 10 గంటలకు విధులకు హాజరయ్యారు. కొంత సమయానికే తాను కూర్చున్న సీటు పైనుంచి సృ్పహ కోల్పోయి కింద పడిపోయారు. తోటి సిబ్బంది వెంటనే ఆయన అరగొండ అపోలో ఆస్పత్రికి తరలించారు. నిద్రమాత్రలు మింగడంతో ఆయన స్పృహ కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. అవినీతి ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు ఆయనపై చర్యలు చేపట్టినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న సుధాకర్ కార్యాలయంలోనే నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై డీఆర్వో విజయ్‌చందర్‌ను వివరణ అడగ్గా కుటుంబ కలహాల కారణంగా సుధాకర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిపారు. -
పోలీసుల అదుపులో అంతర్జాతీయ నేరస్తుడు
అంతర్జాతీయ నేరస్తుడు మేడ్చల్‌కు చెందిన ముల్లంగి సుధాకర్‌ను పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. భుటాన్ దేశంలో 10 తులాల బంగారం దొంగతనం కేసుతో పాటు 11 హత్యకేసుల్లో నిందితుడిగా ఉన్న అతడు పరారీలో ఉన్నారు.. సైబరాబాద్ పరిధిలో కూడా అతడిపై అనేక కేసులు ఉన్నాయి.పోలీసులకు చిక్కిన సుదాకర్ వద్ద నుంచి 75 తులాల బంగారం, ఎఫ్‌జెడ్ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. -
క్షణికావేశంలో తోసేసిన కొడుకు..
కన్నుమూసిన తండ్రి చిన్నచిన్న గొడవలు.. క్షణికావేశం.. వెరసి బంధాలు, బంధుత్వాలను లెక్క చేయడం లేదు. ఆ కోపంలో ప్రవర్తించిన తీరు ప్రాణాలపైకి తెస్తుండగా.. పచ్చని సంసారాల్లో చిచ్చు పెట్టే పరిస్థితి నెలకొంటోంది. అరుుతే, ఇక్కడ ఓ కొడుకు కారణమేమిటో తెలియకున్నా తండ్రి తలపై గొడ్డలితో బాదడంతో ఆయన కన్నుమూయగా.. మరో ఘటనలో దత్తత తీసుకుని కన్నబిడ్డలా పెంచి పోషించాడన్న విషయూన్ని మరిచిపోరుున మరో వ్యక్తి... తండ్రిని నెట్టివేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. నెల్లికుదురు : క్షణికావేశానికి లోనైన కుమారుడు తోసెయ్యడంతో తండ్రి మృతి చెందిన ఘటన ఇది. మండలంలోని రామన్నగూడెం గ్రామంలో బుధవారం చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు స్థానికుల కథనం ప్రకారం ఇలా ఉన్నారుు. గ్రామానికి చెందిన గార బిక్షం(65)-ఎల్లమ్మ దంపతులు అదే గ్రామంలోని పేర్నాక సుధాకర్‌ను దత్తత తీసుకుని పెంచి పోషించారు. ఈక్రమంలో సుధాకర్ తన వ్యవసాయ భూమివద్ద వ్యవసాయ పనులు చేస్తున్నాడు. అరుుతే, బిక్షం తన కుమారుడికి టిఫిన్ బాక్స్ తీసుకువెళ్లడంలో మంగళవారం కాస్తా ఆలస్యం జరిగింది. దీంతో సుధాకర్ ఆగ్రహం వ్యక్తం చేయగా.. ఇరువురి నడుమ మాట మాట పెరిగింది. ఈ సందర్భంగా క్షణికావేశాని కి లోనైన సుధాకర్.. బిక్షంను తోసేసి పట్టించుకోకుండా వెళ్లిపోయాడు. సాయంత్రం వరకు కూడా ఇంటికి రాకపోయేసరికి బావి వద్ద పడుకున్నాడని అందరూ భావించారు. అరుుతే, బుధవారం వెళ్లి చూసేవరకు బిక్షం మృతి చెందినట్లు తెలుసుకున్న ఎల్లమ్మ తమకు ఫిర్యాదు చేసిందని ఎస్సై బందం ఉపేందర్‌రావు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు వివరించారు. -
నళిది, సుధాకర్లది ప్రేమ వివాహం
ఆ పిటిషన్ ద్వారా కాపురాన్ని నిలబెట్టుకుంది! కేస్ స్టడీ నళిది, సుధాకర్లది ప్రేమ వివాహం. పెద్దలను ఎదిరించి పెండ్లి చేసుకున్నారు. ఇరువైపులవారూ ఆగ్రహించి, వీరి పెళ్లికి హాజరు కాలేదు. ఇద్దరూ ఆర్థికంగా స్థిరపడిన వారైనందున మంచి ఇల్లు తీసుకొని కాపురం పెట్టారు. ఒక సంవత్సరం బాగా గడిచింది. తర్వాత సుధాకర్ పేరెంట్స్ అతడితో మాటలు సాగించారు. తమ ఇంటికి వస్తూ పోతుండేలాగా రిలేషన్ మొదలుపెట్టారు. ఈ విషయాలు నళినికి తెలియకుండా జాగ్రత్త పడ్డారు. సుధాకర్‌ను కూడా నళినికి చెప్పనీయకుండా కట్టడి చేసి బ్రెయిన్ వాష్ చేశారు. ఫలితంగా సుధాకర్ నళినిని సం॥నుండి వదిలివేసి వేరే ఉంటున్నాడు. నళిని ఎంతగానో ప్రయత్నించింది సుధాకర్లోని మార్పు తెలుసుకోవడానికి. కానీ కుంటిసాకులు తప్ప, అసలు విషయం చెప్పలేదు. చేసేది లేక నళిని ‘రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్’ పిటిషన్ వేసుకుంది (కాపురాన్ని నిలుపుకోవాలని). సుధాకర్ కోర్టుకు హాజరై తనకు అప్పటికే ‘ఎక్స్‌పార్టీ’ డైవర్స్ వచ్చిందని చెప్పాడు. షాక్ తిన్న నళిని తనకు నోటీసు రాలేదని చెప్పుకొని, అతను పంపిన కోర్టు నోటీస్‌లు సెక్షన్లో విచారిస్తే ఆమె సంతకం చేసినట్లుగా ఉన్నది. కానీ ఆ సంతకం ఆమెది కాదు. సుధాకర్ ఫోర్జరీ చేసి, మేనేజ్ చేశాడు. అతనిపై ఫోర్జరీ, ఛీటింగ్ కేసు పెట్టి విడాకుల ఆర్డర్‌ను ‘సెట్ఎసైడ్’ చేయమని పిటిషన్ దాఖలు చేసింది. తర్వాత తెలిసింది కోట్ల కట్నంతో సుధాకర్ రెండో పెళ్లికి సిద్ధపడ్డాడని. ఇ.పార్వతి అడ్వొకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సెలర్ -
విద్యార్థులకు సంఘీభావం తెలిపిన సిపిఐ నేత ’సురవరం’
-
చిన్నారిపై అత్యాచారయత్నం
అభం శుభం తెలియని ఓ చిన్నారిపై అఘాయిత్యం చేయడానికి ప్రయత్నించాడో కామాంధుడు.. ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిని ఎత్తుకెళ్లి అత్యాచారయత్నం చేశాడు. ఈ సంఘటన నగరంలోని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని జవహర్ నగర్లో ఆదివారం వెలుగుచూసింది. కాలనీకి చెందిన సుధాకర్(30) ఇంటి ముందు ఆడుకుంటున్న ఐదేళ్ల చిన్నారిని ఎత్తుకెళ్లి అత్యాచారం చేయడానికి ప్రయత్నించగా.. బాలిక కేకలు వేసింది. ఇది గుర్తించిన స్థానికులు అప్రమత్తమై నిందితుడికి దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
బ్రిడ్జిపైనుంచి పడి కానిస్టేబుల్ మృతి
అనంతపురం జిల్లా గుత్తి సమీపంలోని ఉప్పవంక వద్ద విధినిర్వహణలో ఉన్న ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ సుధాకర్(50) బ్రిడ్జిపైనుంచి ప్రమాదవశాత్తూ పడి మృతిచెందాడు. ఈ సంఘటన శనివారం వేకువజామున జరిగింది. ఉదయం బ్రిడ్జి కింద శవం పడి ఉండటాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
అనంతలో ఏఆర్ కానిస్టేబుల్ దందా
కాల్‌మనీ రాకెట్ అనంతలోనూ కోరలు చాచింది. ఓ ఏఆర్ కానిస్టేబుల్ వడ్డీ దందాను భరించలేక టీచర్ల దంపతులు న్యాయం చేయాలంటూ మీడియాకు తమ గోడు వెళ్లబోసుకున్నారు. పట్టణానికి చెందిన నాగరాజు, అతని భార్య టీచర్లుగా పనిచేస్తున్నారు. వీరు ఏఆర్ కానిస్టేబుల్ అయిన సుధాకర్ నుంచి 2009లో రూ.2 లక్షలు అప్పుగా తీసుకున్నారు. వడ్డీ కింద రూ.5 లక్షలు చెల్లించారు. అయినా అప్పు తీరలేదు. శాలరీ అటాచ్‌మెంట్‌తో సుధాకర్ మరో రూ.85వేలు వడ్డీ గుంజాడు. మొత్తం రూ.6 లక్షలు వడ్డీ కిందే చెల్లించామని, ఇక అసలు కట్టలేమని నాగరాజు దంపతులు తేల్చి చెప్పారు. దీంతో సుధాకర్ మరికొంత మంది పోలీసులతో కలసి మూడు నెలల క్రితం బాధితుడి ఇంటికి వెళ్లి బెదిరించాడు. విషయం జిల్లా ఎస్పీకి తెలియడంతో టూటౌన్‌కు కేసు అటాచ్ చేశారు. దీనిపై ఇంతవరకు చర్యలు తీసుకోకపోగా, మరోవైపు సుధాకర్ రెండు రోజులుగా నాగరాజు దంపతులపై అప్పు విషయమై ఒత్తిడి తీసుకొస్తున్నాడు. దీంతో తమకు న్యాయం చేయాలని నాగరాజు దంపతులు మీడియా ముందు వాపోయారు. -
టీచర్ దాడితో కుప్పకూలిన విద్యార్థి
కృష్ణా: కృష్ణాజిల్లా కంకిపాడు మండలం గొడవర్రులో దారుణం చోటు చేసుకుంది. హోంవర్క్ చేయలేదని ఎనిమిదో తరగతి బాలుణ్ని చితకబాదాడు. సుధాకర్ అనే ఉపాధ్యాయుడు హోంవర్క్ చేయలేదని ఆ విద్యార్థిపై ఆగ్రహంతో మెడపై కొట్టాడు. దీంతో ఆ బాలుడి నరాలు దెబ్బతినడంతో కాళ్లు, చేతులు పనిచేయలేదు. దీంతో ఆ బాలుడి తల్లిదండ్రులు వెంటనే గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
ఏసీబీ వలలో కార్పొరేషన్ ఆర్ఐ
కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కార్పొరేషన్ రెవెన్యూ ఇన్ స్పెక్టర్ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక విభాగం (ఏసీబీ) అధికారులకు దొరికిపోయాడు. వివరాలు.. కాకినాడ నగరానికి చెందిన ఓ వ్యక్తి ఇంటి పేరు మార్పిడి కోసం రాగా ఆర్ఐ సుధాకర్ రూ.20 వేలు లంచం అడిగాడు. చివరకు రూ.10 వేలకు బేరం కుదిరింది. ఆ మేరకు బాధితుడు ఏసీబీ అధికారులకు సమాచారం అందించాడు. వారిచ్చిన సూచన మేరకు సోమవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో కార్పొరేషన్ కార్యాలయంలో లంచం తీసుకుంటుండగా సుధాకర్‌ను పట్టుకున్నారు. మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. -
ఉత్తముడైన గోపీ!
ఒక దశలో తమిళంలో టాప్ హీరోగా వెలుగొందారు సుధాకర్. ఆ తర్వాత తెలుగులోకి ఎంటరయ్యారు. ‘యముడికి మొగుడు’ తర్వాత తన కామెడీతో బాక్సాఫీస్‌ను ‘పిచ్చకొట్టుడు’ కొట్టారు. హీరో ఎవరైనా సరే, అప్పట్లో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ అంటే సుధాకర్ పర్మినెంట్. ‘శుభాకాంక్షలు’లో జగపతిబాబు ఫ్రెండ్‌గా సుధాకర్ తనదైన శైలి ఎక్స్‌ప్రెషన్స్‌తో, డైలాగ్ డెలివరీతో నవ్వులు విరబూయించారు. సినిమా పేరు : శుభాకాంక్షలు (1998) డెరైక్ట్ చేసింది : భీమనేని శ్రీనివాసరావు సినిమా తీసింది : ఎన్.వి. ప్రసాద్,శానం నాగ అశోక్‌కుమార్ మాటలు రాసింది : మరుధూరి రాజా ‘‘గంగా భాగీరథీ సమానుడైన చందూకి... మీ లవింగ్ వైఫ్ నిర్మలా మేరీ బాల్‌పాయింట్ పెన్నుతో రాయునది. మీరు క్షేమంగానే ఉన్నారని అనుమానిస్తాను. ముఖ్యంగా మనిషి జన్మకు కావల్సింది మంచి స్నేహితుడు. ఉత్తముడైన గోపి మీ స్నేహితుడు కావడం మీ జన్మజన్మల అదృష్టం.డియర్ చందూ! మీకు నిద్రలో పక్క తడిపే అలవాటు ఎక్కువ. అసలే మీ స్నేహితుడు గోపి చాలా ఓపిగ్గా ఉండే వ్యక్తి. ఆయన పక్కన పడుకుని ఆయనను తడపకండి. పెళ్లైనా మీకు దూరంగా ఉండడం వల్ల మీరెంత బాధపడుతున్నారో - పెళ్లి కాకపోయినా గోపీ దూరమై, నేనూ అంతే బాధపడుతున్నాను. మీకు ఇల్లు ఇచ్చిన నాదబ్రహ్మ ‘ఆంధ్రా అన్నమయ్య’ అని రాశారు. ఆయన పాటే అంత బాగుంటే, ఆయనెంత బాగుంటారో కదా అనిపిస్తోంది. ఆయన పాటను క్యాసెట్ చేసి, దాంతోపాటు ఆయన ఫొటో పంపండి. ఫొటో చూస్తూ... పాట వింటూ చచ్చిపోవాలని ఉంది. ఉత్తముడైన గోపీని మరీ మరీ అడిగినట్టు చెప్పండి’’ ఇట్లు నిర్మలా మేరీ చందూ అనబడే ఓ భర్తకు... నిర్మలా మేరీ అనబడే ఓ భార్య రాసిన ఉత్తరం ఇది. ఈ ఉత్తరంలో మీకు ఏం కనిపిస్తోంది? భర్త మీద అనురాగం... ప్రేమ... తొక్క... తోటకూర... ఇవేమీ కనబడడం లేదు కదూ! ఎందుకు కనిపిస్తాయి? పానకంలో పుడక లాగా, బెల్లం జిలేబీలో కారప్పొడి లాగా మధ్యలో ఈ గోపీగాడు కొట్టొచ్చినట్టు, తన్నొచ్చినట్టు కనబడుతుంటే! అసలు ఎవడీ గోపీ? సారీ... ఎవడీ ఉత్తముడైన గోపీ? అయితే మీకు ముందు చందూ గురించి చెప్పాలి. చందు శారీ అయితే, ఈ గోపి బ్లౌజు. ఛీఛీ.. బ్యాడ్ కంప్యారిజన్. చందు ప్యాంటు అయితే, ఈ గోపీ అండర్వేర్. గోపీ లేకుండా చందూ ఎక్కడికీ వెళ్లలేడు.. ఏం చేయలేడు. అలాగని గోపి అరివీర భయంకరుడో, అపర మేధావో అనుకునేరు. గోపీకి బ్రెయినుంది కానీ, అది మోకాలి దగ్గరే ఉందని ప్రపంచంతో పాటు అతనికీ తెలుసు. బోడి సలహాలివ్వడంలో స్పెషలిస్టులకే స్పెషలిస్టు. కొంచెం మీరూ టేస్టు చేయండి... చందు... గోపి... ఇద్దరూ బ్యాచ్లర్సే. మేడ మీద గది. పైన పటారం లోన లొటారం అన్నట్టుగా ఉంటుంది. బాత్రూమ్కు గడియ కూడా ఉండదు. ఎన్నోసార్లు పనిమనిషికి తన దివ్యమంగళ రూపాన్ని ప్రదర్శించేశాడు మన గోపి. ఓసారి వీళ్లను విపరీతమైన ఆర్థిక సంక్షోభం చుట్టుముట్టేసింది. నెలకు రెండువేలు కూడా అద్దె కట్టలేని పరిస్థితి. అలాంటి సమయంలో ఓ గురకారావు తగులుతాడు. అతను ఎంత రెంట్ ఇచ్చినా ఎవ్వరూ రూమ్ రెంట్కివ్వరు. అంత కిరాతకమైన గురక అతనిది. గోపీకో ఐడియా వచ్చింది. ఆ గురకారావుని బుట్టలో వేసుకుని రూమ్‌లో షేర్ ఇచ్చాడు. అతనొచ్చి రూమంతా తేరిపార చూశాడు. ‘రూమ్‌లో ఫ్యాన్లు లేవా?’ అడిగాడు మొహం అదోలా పెట్టి. ‘‘నేను బాలకృష్ణ ఫ్యాన్‌ని. ఈ చందూగాడు రమ్యకృష్ణ ఫ్యాన్. మన ఇంటి ఓనర్ వాళ్ల పనిమనిషికి ఫ్యాన్... ఇన్ని ఫ్యాన్లుండగా ఇంక కొత్త ఫ్యాన్లెందుకు?’’ చాలా తెలివిగా సమాధానం చెప్పాడు గోపి. గురకారావుకి బాగా కాలింది - ‘నేను రూమ్లోఉండనంటే ఉండను’ అని తిరుగు టపా కట్టబోయాడు. గోపీ వదులుతాడా... వెంటనే ఓ అస్త్రం వదిలాడు. ‘‘ఇదే రూమ్‌లో కె. రాఘవేంద్రరావు, ఎ. కోదండరామిరెడ్డి ఉండేవారు. వాళ్లెంత పైకొచ్చారో తెలుసు కదా’’ అని చెప్పాడు గోపి. అసలే సినిమా ఫీల్డ్‌లో రైటర్‌గా ట్రై చేస్తున్న ఆ గురకారావు ఆ దెబ్బకు ఫ్లాట్. ఇంతవరకూ బాగానే ఉంది కానీ, అసలు స్టోరీ.. నైట్ టైమ్ స్టార్టయ్యింది. విమానం ఇంజిను మింగేసినట్టుగా ఒకటే గురక. వీళ్లిద్దరికీ నిద్ర కరవు, మనశ్శాంతి కరవు...‘ఇదేంట్రా బాబూ’ అని వాపోయాడు చందు. గోపీకి బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది. వెంటనే అప్లయ్ చేసేశాడు. గురకపెట్టి నిద్రపోతున్న ఆ గురకారావు పక్కనే పడుకుని, మీద కాలు వేశాడు. ఆ తర్వాత చేయి వేసి హత్తుకున్నాడు. ఈ దెబ్బకు ఆ గురకారావు ఉలిక్కిపడి లేచాడు. గోపీ అదోరకంగా చిలిపిగా చూశాడు. అతగాడు కంగారుపడిపోయాడు. ‘ఏంటి... నువ్వు ఆ టైపా?’ అనడిగాడు. గోపీ కవ్వింపుగా నవ్వుతూ - ‘మనిద్దరం మేడ్ ఫర్ ఈచ్ అదర్‌లా ఉన్నాం. రా... ఇద్దరం మనసు విప్పి మాట్లాడుకుందాం’ అని ఆహ్వానించాడు.గురకారావుకి నిద్రమత్తు వదిలిపోయింది. ‘‘అమ్మో... ఇప్పుడు మనసు విప్పి మాట్లాడదామంటావ్. తర్వాత బట్టలు విప్పి మాట్లాడదామంటావ్. నా వల్ల కాదు’’ అని ఒక్క ఉదుటున బయటకు పరిగెత్తాడు. గోపీ విజయగర్వంతో చందూ వైపు చూశాడు. ఓ ప్రేమ జంటను కలపడం కోసం చందు ఓ ఊరు వెళతాడు. తోడుగా గోపీ కూడా! అక్కడ వీళ్లకు ఎవరూ గది అద్దెకు ఇవ్వరు. చివరకు నానాతంటాలు పడి నాదబ్రహ్మ ఇంట్లో ఆశ్రయం పొందుతారు. ఓ విపత్కర పరిస్థితి నుంచి కాపాడే ప్రయత్నంలో చందూకి పెళ్లయిందని అబద్ధం చెబుతాడు గోపి. దాన్ని కవర్ చేయడం కోసం తనే నిర్మలా మేరీ పేరుతో చందూకి ఉత్తరాలు రాస్తుంటాడు. ఆ ఉత్తరాల నిండా చందు యోగక్షేమాల కన్నా తన గొప్పతనాన్ని పొగుడుకోవడమే సరిపోతుంది. ఓ రోజు - ఇలా దొంగ ఉత్తరం రాసి, పోస్ట్ డబ్బాలో చేయిపెడతాడు గోపి.ఇంతలో ఓ షాకింగ్ న్యూస్ తెలుస్తుంది. తను సరదాగా అబద్ధమాడి చెప్పిన నిర్మలా మేరీ అనే క్యారెక్టర్ నిజంగానే ఎంటరైపోతుంది. గోపీకి కాళ్లూ చేతులూ ఆడలేదు. ఈ గందరగోళంలో గోపీ చేయి పోస్టుడబ్బాలో ఇరుక్కుపోయింది. అలా పోస్టుడబ్బాతోనే పరిగెత్తాడు. వెనుక పోస్ట్‌మ్యాన్ పరుగులు. తీరా అతగాడొచ్చి, పోస్టుడబ్బాలోని ఉత్తరాలు తీసుకుని వెళ్లిపోయాడు. ‘పోస్టు మావా... పోస్టు మావా... ఇరుక్కున్న నా చేతిని నరక్కుండా విడిపించవా?’ అని దీనంగా వేడుకున్నాడు. ఆ పోస్టుమ్యాన్ చాలా నిర్లక్ష్యంగా ‘సారీ! అది నా డ్యూటీ కాదు. పోస్టుమాస్టర్ గారికి లెటర్ రాస్తే, ఆయన డిప్యూటీ సూపరింటెండెంట్‌కి రాస్తారు. ఆయనేమో సెంట్రల్‌కి రాస్తారు’ అని సలహా ఇచ్చి వెళ్లిపోయాడు. ‘ఓరి దేవుడో... ఇంత హంగామా ఉందా? అనవసరంగా సెంట్రల్ గవర్నమెంట్ నోట్లో చెయ్యిపెట్టానే’ అని లబోదిబోమన్నాడు గోపీ. ఇలా ఉంటాయండీ గోపీ పనులన్నీ. ఏదైనా చింపి చేట చేస్తాడు. అతని దగ్గర సలహా తీసుకుంటే.. మీ బతుకు మేకలు చింపిన వాల్పోస్టరైపోద్ది!బీ కేర్‌ఫుల్! సీ కేర్ ఫుల్!! డీ కేర్ ఫుల్!!! - పులగం చిన్నారాయణ పోస్ట్‌బాక్స్ కామెడీ హైలైట్ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావుకు నేనంటే ప్రత్యేక అభిమానం. ఆయన సినిమాల్లో నాకు మంచి పాత్రలిచ్చారు. పవన్ కల్యాణ్ ‘సుస్వాగతం’లో ‘త న్ము ఖ త ర్మ’ అంటూ నత్తిగా మాట్లాడే పాత్ర ఎంతో పేరు తెచ్చింది. అప్పట్లో నేనెక్కడికి వెళ్ళినా అందరూ ఆ పాత్రని గుర్తు చేసుకొనేవారు. అందులోని నత్తి మేనరిజవ్ును అనుకరించేవారు. ఈ పెద్ద హిట్ తర్వాత భీమనేని నాకిచ్చిన మరో మంచి పాత్ర ఈ ‘గోపి’. హీరో పక్క నుండే ఫ్రెండ్‌గా ఈ సినిమా నాలో మరో కొత్త కోణాన్ని చూపించింది. నేను రాసే దొంగ ఉత్తరాలు, నా చేయి ఇరుక్కొనే పోస్ట్‌బాక్స్ కామెడీ జనానికి బాగా నచ్చాయి.. మరుధూరి రాజా రాసిన మాటలు, స్క్రిప్ట్ పెట్టుకొని, డెరైక్టర్‌తో సెట్స్ మీద అప్పటికప్పుడు డిస్కస్ చేసేవాళ్ళం. అలా ఆన్ ది స్పాట్ చేసిన ఇంప్రూవ్ మెంట్లు కూడా బాగా పేలాయి. నా కెరీర్లో ఇదొక మెమరబుల్ క్యారెక్టర్. - సుధాకర్ సుధాకర్ కామెడీని బాగా ఎంజాయ్ చేశారు తమిళంలో ఘనవిజయం సాధించిన ‘పూవే ఉనక్కాగ’కు రీమేక్‌గా ఈ సినిమా చేశాం. తెలుగు నేటివిటీకి అనుగుణంగా చాలా మార్పులూ చేర్పులూ చేశాం. తమిళంలో విజయ్ పక్కన చార్లీ అనే కమెడియన్ చేశారు. ఇక్కడ మనకు జగపతిబాబు పక్కన సుధాకర్ చేశారు. సుధాకర్ తన పెర్ఫార్మెన్స్తో ఈ గోపీ పాత్రను ఎక్కడికో తీసుకెళ్లిపోయారు. తమిళంలో కన్నా ఫుల్ బెటర్‌గా తీర్చిదిద్దామీ పాత్రను. సుధాకర్ కామెడీని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేశారు. ఈ సినిమా సూపర్ హిట్ కావడంలో సుధాకర్ పాత్ర చాలా ఉంది. అప్పట్లో నా సినిమాలన్నింటిలోనూ సుధాకర్ కంపల్సరీగా ఉండేవారు. - భీమనేని శ్రీనివాసరావు -
ఇంటికే పుష్కర జలం
⇒ శుద్ధి చేసి సీసాలో నింపి సరఫరా ⇒ ప్రైవేటు సంస్థతో తపాలా శాఖ ఒప్పందం ⇒ గోదావరి పుష్కరాలకువెళ్లలేనివారికి వెసులుబాటు ⇒ 500 ఎంఎల్ సీసా ఖరీదు రూ.20 సాక్షి, హైదరాబాద్: ఊరూరికి గోదావరి జలాలు... తపాలా శాఖ తాజా నినాదమిది. పుష్కరాల సందర్భంగా గోదావరిలో పుణ్యస్నానం చేయాలన్న తపన ఉండి వెళ్లలేకపోయేవారి ఇంటికి గోదావరి నీటిని సరఫరా చేస్తామంటూ తపాలా శాఖ ముందుకొచ్చింది. వృద్ధాప్యం, అనారోగ్యం, పేదరికం, పని ఒత్తిడి తదితర కారాణాలతో పుష్కర నదీ స్నానానికి వెళ్లలేకపోయినవారు తమకు ఆర్డర్ ఇస్తే మెరుగైన పద్ధతిలో శుద్ధి చేసిన గోదావరి జలాన్ని ఇంటికే బట్వాడా చేస్తామంటోంది. ఇందుకోసం రాజమండ్రిలోని ఓ ప్రైవేట్ సంస్థతో తపాలా శాఖ ఒప్పందం చేసుకుంది. సీసా ఖరీదు రూ.20 మనుగడే ప్రశ్నార్థకమైన తరుణంలో నిలదొక్కుకునేందుకు రకరకాల కార్యక్రమాలు చేపడుతున్న తపాలాశాఖ ఇప్పుడు గోదావరి పుష్కరాల వేళ ‘గాడ్ జల్’ (ఆంగ్లంలో గోదావరి సంక్షిప్తరూపం గాడ్(జీఓడీ)) పేరుతో నీటి సీసాలను సరఫరా చేయాలని నిర్ణయించింది. కావాల్సిన వారు స్థానిక తపాలా కార్యాలయానికి వెళ్లి సీసాకు రూ.20 చొప్పున చెల్లించి చిరునామా అందజేసి టికెట్ కొనాల్సి ఉంటుంది. బుకింగ్స్‌ను బుధవారం నుంచే మొదలు పెట్టారు. పుష్కరాలు మొదలయ్యే జూలై 14 వరకు బుకింగ్స్‌కు అవ కాశం. పుష్కరాలు జరిగే జూలై 14 నుంచి 25 వరకు రాజమండ్రిలోని గోదావరి నది నీటిని సేకరించి వాటిని శాస్త్రీయ పద్ధతిలో శుద్ధి చేసి 500 మిల్లీలీటర్ల పరిమాణంలో సీసాల్లో నింపి ఆయా చిరునామాలకు చేరుస్తారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పరిధిలోని 95 హెడ్ పోస్టాఫీసులు, 2,360 సబ్‌పోస్టాఫీసులు, 13,611 బ్రాంచి పోస్టాఫీసుల్లో ఈ వెసులుబాటు కల్పించారు. విదేశాలకూ సరఫరా పోస్టాఫీసుకు వెళ్లకుండా ఆన్లైన్ (www.appost.in/eshop) ద్వారా కూడా ఆర్డర్ చేసే వెసులు బాటు కల్పించారు. విదేశాల నుంచి వచ్చే ఆర్డర్లను కూడా తీసుకునే ఏర్పాటు చేశారు. అయితే నగదు మార్పిడి వెసులుబాటును దృష్టిలో పెట్టుకొని అమెరికన్ ఎక్స్‌ప్రెస్, డైనస్ క్రెడిట్ కార్డులకే అనుమతి ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. ఆదాయం రూ. 57 లక్షలు ఏడు లక్షల సీసాల సరఫరాకు మొత్తం రూ.1.50 కోట్లు ఖర్చు అవుతుంది. ఇందులో తపాలా శాఖకు రూ.57 లక్షల ఆదాయం సమకూరుతుందని అంచనా. పుష్కరాల సమయంలో గోదావరి నది ప్రవహించే జిల్లాల్లోని ప్రత్యేకతలకు సంబంధించి రోజుకో ఇతి వృత్తంతో పోస్ట్ కవర్‌ను విడుదల చేయనున్నారు. స్టాంపులపై మన ఫొటో ముద్రించి విక్రయించే ‘మై స్టాంప్’ పథకంలో పుష్కరాల సమయంలో పూల బొమ్మ బదులు గోదావరి బొమ్మను ముద్రించనున్నారు. 12 స్టాంపులకు రూ.300 చెల్లించాల్సి ఉంటుంది. ఆన్లైన్లో నీటి సేకరణ దృశ్యాలు రాజమండ్రిలోని సఫైర్ అన్న ఐఎస్ఐ గుర్తింపు ఉన్న సంస్థతో తొలుత 7 లక్షల సీసాల సరఫరాకు ఒప్పందం చేసుకున్నాం. కానీ 20 లక్షల ఆర్డర్లు వస్తాయని అంచనా వేస్తున్నాం. వీలైనంత వరకు అందరికీ సరఫరా చేసే ప్రయత్నం చేస్తాం. మేం అందజేసే నీళ్లు కచ్చితంగా పుష్కరాల సమయంలో గోదావరి నుంచే సేకరిస్తాం. ఆ దృశ్యాలను చిత్రీకరించి ఎప్పటికప్పుడు మా వెబ్సైట్లో, పోస్టాఫీసులో అందుబాటులో ఉంచుతాం. - సుధాకర్, చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ -
పోలండ్ అమ్మాయి.. హైదరాబాద్ అబ్బాయి..
బంజారాహిల్స్: ఖండాతరాలు దాటిన ప్రేమ.. పెళ్ళికి దారి తీసింది. పోలండ్‌కు చెందిన యువతితో హైదరాబాద్‌కు చెందిన సుధాకర్ వివాహం గురువారం మోతీనగర్‌లోని కమ్యూనిటీ హాల్లో ఘనంగా జరిగింది. లండన్‌లో ఉద్యోగం చేస్తున్న సుధాకర్‌కు తనతో పాటు పని చేస్తున్న మరియతో పరిచయం ఏర్పడింది. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు, వివాహ నేపథ్యానికి ముగ్ధురాలైన మరియ తన పెళ్ళిని హైదరాబాద్‌లో హిందూ సంప్రదాయం ప్రకారం చేసుకోవాలని నిశ్చయించుకొని ఆమేరకు ఇక్కడే పెళ్ళి చేసుకుంది. పెద్దల సమక్షంలో జరిగిన ఈ వేడుకల్లో భాగంగా మరియ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. మెహిదీపట్నం చెందిన చెన్నూరి శ్రీనివాసులు, చెన్నూరి లక్ష్మి దంపతుల కుమారుడు సుధాకర్ తాను ప్రేమించిన యువతితో పెళ్ళి జరగడం ఆనందంగా ఉందని చెప్పారు. మూడు ముళ్లు.. ఏడు అడుగులు, తలంబ్రాలు.. వేదమంత్రాలు.. పెద్దల ఆశీస్సుల మధ్య ఇలా పెళ్ళి చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని మరియ తెలిపింది. పట్టుచీరలో ధగధగ మెరిసిపోతూ ఆమె సందడి చేసింది.