టీనేజ్ అమ్మాయి జీవితంలో మలుపులు | Suspence thriller movie makes as named by `Hang Up` | Sakshi
Sakshi News home page

టీనేజ్ అమ్మాయి జీవితంలో మలుపులు

Published Mon, Nov 25 2013 12:28 AM | Last Updated on Sat, Sep 2 2017 12:57 AM

టీనేజ్ అమ్మాయి జీవితంలో మలుపులు

టీనేజ్ అమ్మాయి జీవితంలో మలుపులు

‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ ఫేమ్ సుధాకర్ కోమాకుల, హాలీవుడ్ స్టార్ నటాలీ రూట్, సుజానే అదితి మాస్టర్ ముఖ్యతారలుగా ‘హాంగ్ అప్’ పేరుతో ఓ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం రూపొందుతోంది. హైదర్ బిల్‌గ్రామ్, తిర్తంకార్ దాస్ సంయుక్త దర్శకత్వంలో మాగ్న పిక్స్ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. నిర్మాత తిర్తంకార్ దాస్ మాట్లాడుతూ -‘‘ఓ టీనేజ్ అమ్మాయి జీవితంలో అనుక్షణం ఊహించని పరిణామాలు జరుగుతుంటాయి. ఏ క్షణంలో ఏం జరుగుతుందనే ఉత్కంఠను ప్రతి క్షణం ప్రేక్షకులు ఫీలవుతారు. అత్యాధునిక సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. అలాగే ఈ సినిమాతో తెలుగు తెరకు సరికొత్త డిజిటల్ టోన్‌ని, కలర్స్‌ని పరిచయం చేస్తున్నాం. పలు హాలీవుడ్ చిత్రాల్లో నటించిన నటాలీ రూట్ ఇందులో నాయికగా చేశారు. త్వరలో పాటలను, చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: హైదర్ బిల్‌గ్రామీ, పాటలు: కృష్ణ చైతన్య, లైన్ ప్రొడ్యూసర్: పరోక్ ధార్వాలా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement