Hang Up
-
2014లోనే కాలం చెల్లిన ఫోన్లను వదిలేశారు: ప్రధాని మోదీ వ్యంగ్యాస్త్రాలు
న్యూఢిల్లీ: కాలం చెల్లిన ఫోన్లు అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్‌పై వ్యంగ్య బాణాలతో విరుచుకుపడ్డారు. హ్యాంగ్ అయిన కాంగ్రెస్‌ను ప్రజలు ఏనాడో వదిలేశారంటూ విమర్శలు గుప్పించారు. ఇండియా మొబైల్ కాంగ్రెస్ (India Mobile Congress-2023) ఏడో ఎడిషన్‌ను ప్రధాని మోదీ శుక్రవారం ప్రారంభించారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని భారీ మెజార్టీతో గెలిపించి కాలం చెల్లిన ఫోన్లను ప్రజలు వదులుకోవడానికి ఎంచుకున్నారని ప్రధాని మోదీ విమర్శించారు. రీస్టార్ట్ చేసినా, బ్యాటరీకి ఛార్జ్ చేసినా చివరకు బ్యాటరీ మార్చినా అవి పనిచేయవు. ఎందుకంటే అవి కాలం చెల్లిన ఫోన్లు. స్తంభించిన స్క్రీన్లు, పనిచేయని పాత ఫోన్ల మాదిరిగానే పది పన్నెండేళ్ల క్రితమే కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం హ్యాంగ్ అయిపోయింది. అందుకే ప్రజలు మార్పు కోరు కున్నారంటూ వ్యాఖ్యానించారు. అఖండ మెజారిటీతో దేశానికి సేవ చేయడానికి తమకు అవకాశం ఇచ్చారన్నారు. 2014 కేవలం ఒక సంఖ్య మాత్రమే కాదు, మార్పునకు సంకేతమంటూ కాంగ్రెస్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ సందర్భంగా సాంకేతిక రంగంలో భారత్ సాధించిన విజయాలను ప్రధాని గుర్తుచేశారు. రాబోయే కాలం పూర్తిగా భిన్నంగా ఉండబోతోంది. మన యువ తరం దేశ భవిష్యత్తును, సాంకేతికతను ముందుండి నడిపించడంపై సంతోషం ప్రకటించారు. యాపిల్, గూగుల్ లాంటి దిగ్గజ కంపెనీలు కంపెనీలు భారత దేశానికి క్యూ కడుతున్నాయంటూ కొన్ని గణాంకాలను విడుదల చేశారు. అలాగే గూగుల్ మేడిన్ ఇండియా పిక్సెల్ ఫోన్‌ను ప్రకటించిన సంగతిని గుర్తు చేశారు. ఇంకా శాంసంగ్ ఫోల్డ్ 5 మొబైల్ ఫోన్ , యాపిల్ ఐఫోన్ 15 భారతదేశంలోనే తయరవుతోందని,ప్రపంచమంతా మేడ్ ఇన్ ఇండియా ఫోన్లను ఉపయోగిస్తుండటం గర్వంగా ఉందని మోదీ కొనియాడారు. మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్‌లో భారత్ గత 11వ ర్యాంక్ నుండి 43వ స్థానానికి చేరుకుందని ప్రధాని వెల్లడించారు. 2014కి ముందు, భారతదేశంలో దాదాపు 100 స్టార్టప్‌లు ఉన్నాయి, అయితే ఈ సంఖ్య ఇప్పుడు లక్షకు చేరిందని ప్రకటించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను కూడా ప్రధాని మోదీ సందర్శించారు. ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2023లో రిలయన్స్ జియో ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో జియో స్పేస్‌ఫైబర్ భారతదేశపు తొలి ఉపగ్రహ ఆధారిత గిగాఫైబర్ సేవను ప్రదర్శించింది. భారతీ ఎయిర్టెల్ వ్యవస్థాపకుడు సునీల్ భారతీ మిట్టల్, పారిశ్రామికవేత్త, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు ఆకాష్ అంబానీ కొత్త టెక్నాలజీపై మోదీతో ముచ్చటించారు. #WATCH | While addressing the 7th edition of the India Mobile Congress, Akash Ambani, Chairman of Reliance Jio Infocomm Ltd, says, "Our visionary Prime Minister has given my generation an aspirational vision of transforming our country into developed India... You are always… pic.twitter.com/rKCQ8DYlub — ANI (@ANI) October 27, 2023 -
సిల్వెస్టర్ స్టాలిన్ ఇంట్లో షూటింగ్...
సాయంత్రం ఆరు నుంచి మర్నాడు ఉదయం ఆరు గంటల లోపు జరిగే సంఘటనల సమాహారంతో రూపొందిన చిత్రం ‘హ్యాంగ్ అప్’. సుధాకర్ కొమాకుల, నటాలియా రౌత్, మహేష్ శ్రీరామ్ ముఖ్య తారలుగా హైదర్ బిల్ గ్రామి, తీర్థంకర్ దాస్ దర్శకత్వం వహించారు. ఫరూక్ దర్వాలా లైన్ ప్రొడ్యూసర్. ఈ నెల 14న చిత్రాన్ని విడుదల చేయనున్నామని హైదర్ బిల్ చెబుతూ -‘‘హాలీవుడ్ నటుడు సిల్వెస్టర్ స్టాలిన్ స్వగృహంలో ఈ సినిమా షూటింగ్ చేశాం. హిందీ, తెలుగు భాషల్లో ఏకకాలంలో రూపొందించినప్పటికీ ముందు తెలుగులో ఆ తర్వాత మూడు నెలలకు హిందీలో రిలీజ్ చేస్తాం’’ అని చెప్పారు. సుధాకర్ మాట్లాడుతూ -‘‘ ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’కి ముందే ఈ సినిమా అంగీకరించా. థ్రిల్లర్ జానర్లో సాగే సినిమా. ఒక్క రోజులో జరిగే కథ కోసం 40 రాత్రులు షూటింగ్ చేశాం. ఆ ఒక్క రాత్రి ఏం జరిగింది? అనేది ఆసక్తికరమైన విషయం’’ అన్నారు.బేసికల్‌గా క్లాసికల్ డాన్సర్‌ని అని, కేంబ్రిడ్జ్లోనే మెడిసన్ చదువుకున్నానని, యూఎస్‌లోనే ఈ సినిమా తీయడం వల్ల యాక్ట్ చేయగలిగానని, తెలుగులో మరిన్ని అవకాశాలు వస్తే చేస్తానని నటాలియా తెలిపారు. -
లేడీ ఓరియెంటెడ్ థ్రిల్లర్...
‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ ఫేం సుధాకర్ కొమాకుల, నాట్లీ, ఏంజలీ కుమార్ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం ‘హాంగ్ అప్’. ఈ చిత్రానికి తీర్థాంకర్ దాస్ దర్శకత్వం వహిస్తూ, హైదర్ బిల్గ్రామితో కలిసి నిర్మిస్తున్నారు. దాస్, శ్యామ్వయ్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఆర్పీ పట్నాయక్ ఆడియో సీడీని ఆవిష్కరించి, జయంత్ సి.పరాన్జీకి అందించారు. టి.ప్రసన్నకుమార్ ప్రచార చిత్రాలను విడుదల చేశారు. ఈ లేడీ ఓరియెంటెడ్ థ్రిల్లర్‌లో సౌండ్ డిజైనింగ్ కొత్తగా ఉంటుందని, తెలుగులో హాలీవుడ్ సినిమా చూసిన ఫీల్‌ని కలిగించే సినిమా ఇదని సుధాకర్ చెప్పారు. -
హ్యాంగ్ అప్ మూవీ ఆడియో లాంచ్
-
టీనేజ్ అమ్మాయి జీవితంలో మలుపులు
‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ ఫేమ్ సుధాకర్ కోమాకుల, హాలీవుడ్ స్టార్ నటాలీ రూట్, సుజానే అదితి మాస్టర్ ముఖ్యతారలుగా ‘హాంగ్ అప్’ పేరుతో ఓ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం రూపొందుతోంది. హైదర్ బిల్గ్రామ్, తిర్తంకార్ దాస్ సంయుక్త దర్శకత్వంలో మాగ్న పిక్స్ మీడియా ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. నిర్మాత తిర్తంకార్ దాస్ మాట్లాడుతూ -‘‘ఓ టీనేజ్ అమ్మాయి జీవితంలో అనుక్షణం ఊహించని పరిణామాలు జరుగుతుంటాయి. ఏ క్షణంలో ఏం జరుగుతుందనే ఉత్కంఠను ప్రతి క్షణం ప్రేక్షకులు ఫీలవుతారు. అత్యాధునిక సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. అలాగే ఈ సినిమాతో తెలుగు తెరకు సరికొత్త డిజిటల్ టోన్‌ని, కలర్స్‌ని పరిచయం చేస్తున్నాం. పలు హాలీవుడ్ చిత్రాల్లో నటించిన నటాలీ రూట్ ఇందులో నాయికగా చేశారు. త్వరలో పాటలను, చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: హైదర్ బిల్‌గ్రామీ, పాటలు: కృష్ణ చైతన్య, లైన్ ప్రొడ్యూసర్: పరోక్ ధార్వాలా.