న్యూఢిల్లీ: కాలం చెల్లిన ఫోన్లు అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్‌పై వ్యంగ్య బాణాలతో విరుచుకుపడ్డారు. హ్యాంగ్ అయిన కాంగ్రెస్‌ను ప్రజలు ఏనాడో వదిలేశారంటూ విమర్శలు గుప్పించారు. ఇండియా మొబైల్ కాంగ్రెస్ (India Mobile Congress-2023) ఏడో ఎడిషన్‌ను ప్రధాని మోదీ శుక్రవారం ప్రారంభించారు.
2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని భారీ మెజార్టీతో గెలిపించి కాలం చెల్లిన ఫోన్‌లను ప్రజలు వదులుకోవడానికి ఎంచుకున్నారని ప్రధాని మోదీ విమర్శించారు. రీస్టార్ట్ చేసినా, బ్యాటరీకి ఛార్జ్ చేసినా చివరకు బ్యాటరీ మార్చినా అవి పనిచేయవు. ఎందుకంటే అవి కాలం చెల్లిన ఫోన్లు. స్తంభించిన స్క్రీన్‌లు, పనిచేయని పాత ఫోన్‌ల మాదిరిగానే పది పన్నెండేళ్ల క్రితమే కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం హ్యాంగ్ అయిపోయింది. అందుకే ప్రజలు మార్పు కోరు కున్నారంటూ వ్యాఖ్యానించారు. అఖండ మెజారిటీతో దేశానికి సేవ చేయడానికి తమకు అవకాశం ఇచ్చారన్నారు. 2014 కేవలం ఒక సంఖ్య మాత్రమే కాదు, మార్పునకు సంకేతమంటూ కాంగ్రెస్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఈ సందర్భంగా సాంకేతిక రంగంలో భారత్ సాధించిన విజయాలను ప్రధాని గుర్తుచేశారు. రాబోయే కాలం పూర్తిగా భిన్నంగా ఉండబోతోంది. మన యువ తరం దేశ భవిష్యత్తును, సాంకేతికతను ముందుండి నడిపించడంపై సంతోషం ప్రకటించారు. యాపిల్, గూగుల్ లాంటి దిగ్గజ కంపెనీలు కంపెనీలు భారత దేశానికి క్యూ కడుతున్నాయంటూ కొన్ని గణాంకాలను విడుదల చేశారు. అలాగే గూగుల్ మేడిన్ ఇండియా పిక్సెల్ ఫోన్‌ను ప్రకటించిన సంగతిని గుర్తు చేశారు.
ఇంకా శాంసంగ్ ఫోల్డ్ 5 మొబైల్ ఫోన్ , యాపిల్ ఐఫోన్ 15 భారతదేశంలోనే తయరవుతోందని,ప్రపంచమంతా మేడ్ ఇన్ ఇండియా ఫోన్లను ఉపయోగిస్తుండటం గర్వంగా ఉందని మోదీ కొనియాడారు. మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్‌లో భారత్ గత 11వ ర్యాంక్ నుండి 43వ స్థానానికి చేరుకుందని ప్రధాని వెల్లడించారు. 2014కి ముందు, భారతదేశంలో దాదాపు 100 స్టార్టప్‌లు ఉన్నాయి, అయితే ఈ సంఖ్య ఇప్పుడు లక్షకు చేరిందని ప్రకటించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను కూడా ప్రధాని మోదీ సందర్శించారు.
ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2023లో రిలయన్స్ జియో ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో జియో స్పేస్‌ఫైబర్ భారతదేశపు తొలి ఉపగ్రహ ఆధారిత గిగాఫైబర్ సేవను ప్రదర్శించింది. భారతీ ఎయిర్‌టెల్ వ్యవస్థాపకుడు సునీల్ భారతీ మిట్టల్, పారిశ్రామికవేత్త, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు ఆకాష్ అంబానీ కొత్త టెక్నాలజీపై మోదీతో ముచ్చటించారు.
#WATCH | While addressing the 7th edition of the India Mobile Congress, Akash Ambani, Chairman of Reliance Jio Infocomm Ltd, says, "Our visionary Prime Minister has given my generation an aspirational vision of transforming our country into developed India... You are always… pic.twitter.com/rKCQ8DYlub
— ANI (@ANI) October 27, 2023
Comments
Please login to add a commentAdd a comment