
గొర్రె సుధాకర్
సాక్షి, అమీర్‌పేట: ‘నేను చనిపోతేనే నీకు ప్రేమ విలువ తెలుస్తుంది’అంటూ సెల్ఫీ వీడియో రికార్డు చేసి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్‌ఆర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆదివారం ఉదయం వెలుగు చూసింది. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూర్ మండలం కేపీ పాలెం గ్రామానికి చెందిన గొర్రె సుధాకర్ (29) హైదరాబాద్‌కు వచ్చి ఎస్సై ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడు. బీకేగూడ వేంకటేశ్వర దేవాలయం సమీపంలో గదిని అద్దెకు తీసుకుని స్నేహితులతో కలిసి ఉంటున్నాడు.
శనివారం రాత్రి రూమ్మేట్ భార్గవ్ గది తలుపులు తట్టగా, ఎంతసేపటికీ తలుపు తీయక పోవడంతో పై పోర్షన్‌లోకి వెళ్లి బాల్కనీ ద్వారా గదిలోకి వెళ్లి చూడగా సుధాకర్ ఉరికి వేలాడుతూ కనిపించాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ జరిపారు. సెల్‌ఫోన్‌లో తీసుకున్న సెల్ఫీ వీడియోను గుర్తించారు. ప్రేమ విఫలం కావడంతోనే సుధాకర్ ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నారు. మృతుడి బాబాయ్ శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment