young age
-
ప్రపంచంలోనే ‘పిన్న’ బిలియనీర్‌గా లివియా
వాషింగ్టన్: ప్రపంచంలోనే అత్యంత చిన్న వయసులోనే ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో స్థానం సంపాదించి 19 ఏళ్ల కాలేజీ అమ్మాయి లివియా వొయిట్ చరిత్ర సృష్టించింది. 20 ఏళ్లుకూడా నిండని ఈమెకు అత్యంత సంపన్నుడైన తాత నుంచి వారసత్వంగా కోట్ల షేర్లు దక్కడంతో ఒక్కసారిగా వేల కోట్ల అధిపతి అయ్యింది. బ్రెజిల్‌కు చెందిన డబ్ల్యూఈజీ కంపెనీని లివియా తాత వెర్నెర్ రికార్డో వొయిట్ మరో ఇద్దరితో కలిసి స్థాపించారు. ఫోర్బ్స్ సంస్థ 33 ఏళ్ల వయసులోపు ఉన్న 25 మంది యువ బిలియనీర్ల జాబితాను తాజాగా విడుదలచేసింది. ఇందులో లివియా పేరు కూడా ఉంది. దాదాపు రూ.9,165 కోట్ల(1.1 బిలియర్ డాలర్ల) సంపదతో ప్రపంచంలో బిలియనీర్ అయిన అత్యంత చిన్న వయసు్కరాలుగా ఈమె పేరు రికార్డులకెక్కింది. కోట్లకు పడగలెత్తినా ఇంకా ఆమె కంపెనీ బోర్డులో సభ్యురాలిగా చేరలేదు. ఆస్తులతో నాకేం పని అన్నట్లుగా నిరాడంబరంగా లివియా ప్రస్తుతం బ్రెజిల్ విశ్వవిద్యాలయంలో డిగ్రీ చదువుతోంది. -
టాటా కంపెనీలో మొదటి మహిళా ఇంజినీర్ - ఎవరో చెప్పుకోండి చూద్దాం!
ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి భార్య 'సుధామూర్తి' (Sudha Murthy) గురించి దాదాపు తెలియని వారు ఉండరు అంటే ఏ మాత్రం అతిశయోక్తి కాదు. ఎన్నో సామజిక కార్యక్రమాలు చేస్తూ ఎంతోమందికి రోల్ మోడల్‌గా నిలిచిన ఈ ఆదర్శమూర్తి ఇప్పుడు ఎలా ఉంటారనేది అందరికి తెలుసు. అయితే చదువుకునే వయసులో ఎలా ఉండేదో ఇక్కడ చూడవచ్చు. సుధామూర్తి 1974లో బెంగుళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసి అప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి నుంచి గోల్డ్ మెడల్ కూడా పొందింది. 150 మంది విద్యార్థులలో ఈమె ఒక్కరే మహిళ కావడం గమనార్హం. అప్పట్లో ఎన్నో ఆటంకాలను సైతం ఎదుర్కోగలిగిన ధీశాలి. మహిళల హక్కుల కోసం పాటుపడి అప్పట్లో ఏకంగా జేఆర్డీ టాటాకు లేఖ రాసింది. ఈ రోజు టాటా కంపెనీలో మహిళలు పనిచేస్తున్నారంటే దాని వెనుక సుధామూర్తి హస్తం ఉండటమే. ఇప్పటికే కళ, సంస్కృతి, ప్రజా పరిశుభ్రత, ఆరోగ్య సంరక్షణ, పేదరికం తగ్గింపు, మహిళా సాధికారత వంటి అనేక రంగాల్లో తనదైన రీతిలో సామజిక ఈమె సేవ చేసింది. ఇదీ చదవండి: ఎంతమంది ఉద్యోగాలు పోయినా వీరు చాలా సేఫ్.. జీతాలు కోట్లలో! సుధామూర్తి హార్వర్డ్ యూనివర్శిటీలో మూర్తి క్లాసికల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాను స్థాపించింది. అనేక అనాథాశ్రమాలను స్థాపించింది, గ్రామీణాభివృద్ధి ప్రయత్నాలలో పాల్గొంది, అన్ని కర్ణాటక ప్రభుత్వ పాఠశాలలకు కంప్యూటర్ అండ్ లైబ్రరీ మౌలిక సదుపాయాలను అందించాలనే ఉద్యమానికి మద్దతు ఇచ్చింది. నిరాడంబరమైన సేవను గుర్తించిన భారత ప్రభుత్వం ఈమెకు పద్మ భూషణ్ అవార్డుతో సన్మానించింది. -
బాల్యంలో స్మార్ట్ ఫోన్‌తో యవ్వనంలో మతి చెడుతోంది
సాక్షి, అమరావతి: చిన్నతనంలోనే స్మార్ట్ ఫోన్‌ను వినియోగించడం మొదలుపెట్టిన వారికి యవ్వనంలో మానసిక సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయని ఓ అధ్యయనం వెల్లడించింది. స్మార్ట్‌ఫోన్ ఎంత ఆలస్యంగా అలవాటు చేసుకుంటే అంత మానసిక ప్రశాంతత లభిస్తుందని ఆ అధ్యయనం హెచ్చరించింది. వాషింగ్టన్కు చెందిన స్వచ్ఛంద సంస్థ సపియన్ ల్యాబ్స్ ‘గ్లోబల్ మైండ్ ప్రాజెక్టు’లో భాగంగా 41 దేశాల్లో 18–24 ఏళ్ల మధ్య వయసున్న 27,969 మందిపై అధ్యయనం చేసింది. వీరిలో చిన్న వయసులోనే స్మార్ట్ ఫోన్ వినియోగించడం మొదలు పెట్టిన వారి మానసిక స్థితి బలహీనంగా ఉందని పేర్కొంది. యువకుల కంటే యువతుల్లోనే ఎక్కువ మానసిక రుగ్మతల ప్రభావాన్ని గుర్తించింది. ఉత్తర అమెరికా, యూరప్, లాటిన్ అమెరికా, ఓషియానియా, దక్షిణాసియా, ఆఫ్రికా ప్రాంతాల్లోని యువత మానసిక స్థితిగతులను 47 అంశాల ఆధారంగా లెక్కించారు. వయసు పెరిగితే దుష్ప్రభావం తక్కువ యువకులు 6 ఏళ్ల వయసు నుంచి ఫోన్ వాడకం మొదలు పెట్టిన వారు 42 శాతం, 18 ఏళ్ల వయసుల్లో ఫోన్ వాడకం మొదలు పెట్టిన వారిలో 36 శాతం మానసిక అనారోగ్య సవాళ్లను ఎదుర్కొంటున్నట్టు గుర్తించారు. అయితే మహిళల్లో ఆరేళ్ల వయసు నుంచి ఫోన్ వాడుతున్న వారిలో 74 శాతం, వయోజనులైన తర్వాత 46 శాతం వివిధ మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. వయసు పెరిగిన తర్వాత స్మార్ట్‌ఫోన్ వినియోగం మొదలైతే దాని దు్రష్పభావం కొంత వరకు తక్కువగా ఉన్నట్టు అధ్యయనంలో తేలింది. అలాగే పురుషుల్లో ఆత్మవిశ్వాసం, సామాజిక దృక్పథం, ఇతరులతో సానుకూల సంబంధాలు కలిగి ఉండే సామర్థ్యాలు పెరిగినట్లు, మహిళల్లో మానసిక స్థితి, స్థితప్రజ్ఞత మెరుగ్గా ఉన్నట్లు అధ్యయనం పేర్కొంది. ముఖ్యంగా ఆత్మహత్య ఆలోచనలు, దుందుడుకు భావాలు, వాస్తవికత నుంచి వేరుగా ఉన్నారనే భావనలు గణనీయంగా తగ్గాయి. వారంలో ఒక రాత్రి నిద్ర కోల్పోతున్నారు స్మార్ట్‌ఫోన్ వినియోగిస్తున్న 10 ఏళ్ల వయసు్కల్లో 12.5 శాతం మంది నోటిఫికేషన్లు చూసుకోవడానికి అర్ధరాత్రి మేల్కొంటున్నారు. దీంతో సగటున వారానికి ఒక రాత్రి నిద్ర కోల్పోతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. వాస్తవానికి సామాజిక మాధ్యమాల్లో రోజుకు మూడు గంటలు గడిపే కౌమారదశ పిల్లల్లో డిప్రెషన్, ఆందోళన లక్షణాలు ఎక్కువగా ఉండటంతో పాటు రెట్టింపు మానసిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. విద్యార్థుల్లోని 13–17 ఏళ్ల మధ్య వయసు్కల్లో దాదాపు 95 శాతం మంది సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలోనే భారతదేశంలో సుమారు 200 మిలియన్ల మంది చిన్నారులు, తల్లిదండ్రులు స్మార్ట్ ఫోన్ల వినియోగంపై అవగాహన పెంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. -
హీరోలా ఉన్న ఈ బిజినెస్మెన్ ఎవరో గుర్తుపట్టారా?
భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి, ప్రముఖ పారిశ్రామిక వేత్త 'రతన్ టాటా' (Ratan Tata) ఈ రోజు ఎలా ఉంటాడనేది అందరికి తెలుసు. అయితే ఒకప్పుడు యువకుడుగా ఉన్న సమయంలో ఎలా ఉండేవాడని చాలా మందికి తెలియకపోవచ్చు. టాటా గ్రూప్ ఉన్నతికి ఎంతో కృషి చేసిన ఈయన యంగేజ్‌లో హీరోలా ఉండటం ఇక్కడ చూడవచ్చు. కరోనా సమయంలో దేశ ప్రజల కోసం వేల కోట్లు వెచ్చించిన ఈ నిరాడంబరురుని సేవను గుర్తించిన భారత ప్రభుత్వం పద్మవిభూషణ్, పద్మభూషణ్ పురస్కారాలను కూడా ప్రధానం చేసింది. సామాన్య ప్రజలకు సైతం కారు అందుబాటులో ఉండాలనే సదుద్దేశ్యంతో నానో కారుని ప్రవేశపెట్టిన ఘనత కూడా ఈయన సొంతమే. ఇదీ చదవండి: ఇంటర్నెట్‌ని షేక్ చేస్తున్న దుబాయ్ షేక్ కారు.. వీడియో వైరల్ ప్రస్తుతం టాటా నానో ఎలక్ట్రిక్ కారుగా విడుదలకావడానికి సిద్దమవుతున్నట్లు సమాచారం. రతన్ టాటా కలల కారు ఎలక్ట్రిక్ వెర్షన్లో విడుదలైతే బడా సంస్థలకు కూడా గట్టిపోటీ ఇస్తుండటంలో ఎటువంటి సందేహం లేదు. ఎనిమిది పదుల వయసు దాటిన తరువాత కూడా దేశం కోసం ఆలోచించే మహానుభావుడు రతన్ టాటా అనటంలో ఎటువంటి సందేహం లేదు. -
16 ఏళ్ల వయసులో ఇలా ఉందేంటీ?.. ఇప్పుడు స్టార్ హీరోయినా?
స్టార్ హీరోయిన్ అనే హోదా అందరికీ రాదు. చాలా కొద్దిమందికే అలాంటి అదృష్టం కలిసి వస్తుంది. గ్లామర్ ఫీల్డ్‌లో కొన్నేళ్లపాటు స్టార్‌గా ఉండాలంటే అంతా సులభం కాదు. మరీ ఎక్కువగా హీరోయిన్లు నిలదొక్కుకోవడం సవాళ్లతో కూడుకున్న విషయం. అలాంటిది 13 ఏళ్లుగా మూవీస్‌లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆమె నటించిన సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. అంతే కాకుండా ఓ టాలీవుడ్ స్టార్ హీరో కూమారుడిని పెళ్లి చేసుకుంది. కానీ ఆ తర్వాత విడాకులు తీసుకుని.. మళ్లీ సినిమాలతో బిజీ అయిపోయింది. ప్రాణాంతక వ్యాధి చుట్టుముట్టినా కూడా కోలుకుని ముందడుగేసింది. ఎంత బాధలో ఉన్నా కూడా సినిమాలపై దృష్టి సారించింది. ఇంతకీ ఎవరు అనుకుంటున్నారా? ఆమె మరెవరో కాదు.. ఇటీవలే శాకుంతలం సినిమాతో మెప్పించిన సమంత. ఆమె నటించిన శాకుంతలం థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. 'ఏ మాయ చేశావే' అనే సినిమాతో 2010లో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టింది సామ్. బృందావనం, దూకుడు , ఈగ, ఎటో వెళ్ళిపోయింది మనసు , సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అత్తారింటికి దారేది లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. అయితే తాజాగా సమంత పోస్ట్ చేసిన ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. తాను 16 ఏళ్ల వయసులో ఉన్న అరుదైన ఫోటోను తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పంచుకుంది. ఇది చూసిన ఫ్యాన్స్ ఆ వయసులో సమంత లుక్ చూసి సంబర పడిపోతున్నారు. మీరు ఆ పిక్ చూస్తే ఇప్పుడు స్టార్ హీరోయిన్ సమంతనా అనకుండా ఉండలేరు. -
18 ఏళ్ల కుర్రాడిగా కనిపించాలని..! ఎంత ఖర్చు చేస్తున్నాడంటే..
వయసుపై బడే కొద్దీ అందంగా, ఫిట్‌గా కనిపించేందుకు.. ఆరోగ్యంగా ఉండేందుకు రకరకాల మార్గాలను ఆశ్రయిస్తుంటారు కొందరు. అయితే.. ఈ మార్గాల్లో కాకుండా విరుద్ధమైన మార్గాలను ఎంచుకుంటూ వార్తల్లో నిలుస్తున్న వాళ్లనూ తరచూ చూస్తున్నాం. రివర్స్ ఏజింగ్.. అంటే వయసు వెనక్కి తీసుకెళ్లడం. అసలు అది సాధ్యమేనా? అనే విషయం పక్కనపెడితే.. వైద్యసాంకేతిక విధానాల ద్వారా సుసాధ్యం చేయొచ్చనే ప్రయోగాలు గత కొన్నేళ్లుగా కొనసాగుతున్నాయి. తాజాగా.. అలాంటి ప్రక్రియతో వార్తల్లోకి ఎక్కిన ఓ సాఫ్ట్వేర్ మిలియనీర్ ప్రయత్నం గురించి బ్లూమ్‌బర్గ్ కథనం ఆధారంగా. బ్రయాన్ జాన్సన్.. వయసు 45 ఏళ్లు. బయోటెక్ మేధావిగా ఈయనకంటూ యూఎస్‌లో ఓ పేరుంది. పైగా సంపాదనతో మిలియనీర్‌గా ఎదిగాడు. అయితే 18 ఏళ్ల టీనేజర్‌గా కనిపించేందుకు ఈయనగారు ఏడాదికి 2 మిలియన్ డాలర్లు ఖర్చు పెట్టేశారు. మన కరెన్సీలో అది 16,29,68,990 రూపాయలు. ఈ ట్రీట్మెంట్లో భాగంగా.. శరీర తత్వం 18 ఏళ్లుగా కనిపించాలని, గుండె 37 ఏళ్ల వ్యక్తికి ఉండేలా, చర్మం 28 ఏళ్ల వ్యక్తి ఉండేలా కనిపించేందుకు చికిత్సలు తీసుకుంటున్నాడట. అంతేకాదు.. ప్రతీరోజూ 30 మంది వైద్యులు, ఆరోగ్య నిపుణులు అతని శరీర పనితీరును పర్యవేక్షిస్తున్నారట. ఈ రివర్స్ ఏజింగ్ ప్రక్రియ మొత్తం 29 ఏళ్ల ఫిజిషియన్ ఒలీవర్ జోల్మాన్ నేతృత్వంలో జరుగుతోంది. విశేషం ఏంటంటో.. జోల్మాన్తో పాటు జాన్సన్‌కు కూడా వృద్ధాప్యం, దీర్ఘాయువు లాంటి అంశాలపై ఆసక్తి ఎక్కువట. అందుకే.. గినియా పందులపై చేయాల్సిన ప్రయోగాలను నేరుగా తనపైనే చేయించుకునేందుకు ముందుకు వచ్చాడతను. అందుకోసం కాలిఫోర్నియా వెనిస్లోని తన నివాసాన్నే ప్రయోగశాలగా మార్చేశాడతను. అధికారికంగా యాంటీ ఏజింగ్ కోసం అతను చేస్తున్న ఖర్చు(వ్యక్తిగతంగా) ఒక ప్రపంచ రికార్డు నెలకొల్పింది కూడా. ఒకవైపు వైద్య నిపుణుల పర్యవేక్షణలో చికిత్సతో పాటు.. రెగ్యులర్‌గా చేయాల్సిన ఎక్స్ర్సైజులు, తీసుకోవాల్సిన ఆహారం.. ఇలాంటివన్నీ షరామాములుగా కాకుండా వైద్యుల సమక్షంలోనే ప్రత్యేకంగా చేస్తున్నాడు. గత ఏడాది కాలంగా.. 2 మిలియన్ డాలర్ల డబ్బు ఖర్చు చేశాడతను. ఈ ఏడాదిలో బ్రెయిన్, లంగ్స్, లివర్, కిడ్నీలు, పళ్లు, చర్మం, జుట్టు, మర్మాంగం.. ఇతర అవయవాలన్నింటిని 18 ఏళ్ల వ్యక్తిగా మార్చుకునేందుకు యత్నిస్తున్నాడతను. ఈ ప్రయోగంలో తన ప్రాణాలకు ముప్పు వాటిల్లినా పర్వాలేదని, ఒకవేళ ప్రయోగం సక్సెస్ అయితే నవయవ్వనంగా కనిపించాలనుకుంటున్న మనిషి కోరిక నెరవేరేందుకు ఒక మార్గం దొరుకుతుందని అంటున్నాడు బ్రయాన్ జాన్సన్. -
పెళ్లికి ముందే బిడ్డకు జన్మనిచ్చిందని దారుణం.. కుటుంబీకులే..!
సాక్షి, చెన్నై : తిరుచ్చికి చెందిన యువతి ఆత్మహత్య కేసు మలుపు తిరిగింది. ఆమె పెళ్లికి ముందే బిడ్డకు జన్మనివ్వడంతో కుటుంబ సభ్యులు బలవంతంగా విషం తాగించి పరువు హత్య చేసినట్టు శుక్రవారం వెలుగులోకి వచ్చింది. గత వారం స్థానికులు తిరుచ్చి ముక్కొంబు వద్ద ముళ్ల పొదళ్లల్లో ఓ మగ శిశువును గుర్తించి ఆస్పత్రికి తరలించారు. శిశువును ఎవరు పడేశారన్న విషయంపై జీఏ పురం పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ పరిస్థితులలో విషం సేవించిన స్థితిలో తిరుచ్చి ఆస్పత్రిలో చేరిన ఒక యువతి గురువారం రాత్రి మృతిచెందింది. ఆమె మరణంలో మిస్టరీ ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. వైద్యుల పరిశోధనలో ఆమె బిడ్డకు జన్మనిచ్చిందని తేలింది. ఆ బిడ్డే ముళ్ల పొదళ్లలో పడేసిన శిశువుగా గుర్తించారు. విచారణలో కేసు పరువు హత్యగా మలుపు తిరిగింది. 19 ఏళ్ల ఈ యువతి ఓ కళాశాలలో బీకాం చదువుతోంది. కూలీ కారి్మకుడిని ప్రేమించి పెళ్లికి ముందే గర్భం దాల్చింది. కుటుంబీకులు కొన్ని నెలలుగా ఆమెను చిత్ర హింసలు పెడుతూ వచ్చారు. ఆ కూలి కార్మికుడి కోసం ఆరా తీస్తూ వేధించారు. గత వారం ఆమె మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డను ముళ్ల పొదల్లో పడేశారు. అనంతరం ఆమె చేత బలవంతంగా విషం తాగించినట్టు తేలింది. దీంతో యువతి తల్లిదండ్రులు, మేనత్త తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
నడిరోడ్డుపై ఆకతాయికి చెప్పుదెబ్బలు.. ఆపై పోలీస్‌స్టేషన్‌కు..
సాక్షి, కామారెడ్డి: ప్రేమపేరుతో వెంటపడి వేధించిన యువకుడిని నడిరోడ్డుపై ఓ యువతి చెప్పుతో కొట్టి దేహశుద్ధి చేసిన ఘటన కామారెడ్డిలో జరిగింది. గత నెల రోజులుగా యువతిని శంకర్ అనే ఆకతాయి యువకుడు ఫాలో అవుతూ వేధించాడు. ఈ క్రమంలోనే మంగళవారం ప్రేమిస్తున్నానంటూ యువతిని ఫోన్ నంబర్ అడటంతో యువతి ఆగ్రహంతో అపరకాళి అవతారమెత్తింది. జనం సమక్షంలోనే చెప్పుతోకొట్టి, దేహ శుద్ధి చేసి ఆ యువకుడిని పోలీసులకు అప్పగించింది. చదవండి: (హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి) -
వెంటపడి వేధించడంతో చెప్పుదెబ్బలు
-
రాజకీయాల్లోనూ యువతను ప్రోత్సహించాలి
భారతదేశ జనాభాలో 15–29 ఏళ్ల మధ్య ఉన్న యువత 27.5 శాతం ఉన్నారు. యువత జాతి ప్రగతికి సోపానం. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల్లో వృద్ధుల సంఖ్య పెరుగు తోంది. మన దేశంలో యువత శాతం పెరుగుతోంది. 2020 నాటికి ప్రపంచములో అత్యంత ఎక్కువ మంది యువత ఉన్న దేశంగా భారత్ నిలిచింది. దేశ అభివృద్ధిలో ఈ యువ మానవ వనరు కీలక పాత్ర పోషిస్తుంది. కేవలం వారిని ఆర్థిక లేదా ఉత్పత్తి రంగంలోనే ఉపయోగించుకోవడం సరికాదు. ఎంతో ప్రాముఖ్యం ఉన్న రాజకీయాల్లోనూ యువతకు తగిన స్థానం కల్పించవలసి ఉంది. అప్పుడే నిజమైన నవ సమాజ నిర్మాణం సాధ్యమ వుతుంది. ప్రస్తుతం విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు అనేక పార్టీలకు అనుబంధంగా ఉంటున్నాయి. వీటి నుంచే చాలా రాజకీయ పార్టీలకు నాయకులు లభించిన, లభిస్తున్న సంగతి తెలిసిందే. కేవలం ఆయా సంఘాలలో పనిచేసేవారికే కాక... చురుకుగా పని చేయ గలిగిన సామాజిక స్పృహ ఉన్న యువతనంతా అన్ని రాజకీయ పక్షాలూ ప్రోత్సహించాలి. ఎన్ని కల సమయంలోనో... లేదా ఏవో కొన్ని ఉద్య మాల సందర్భంగానో యువతను, వారి ఆవేశాన్నీ వాడుకుని వదిలేస్తుండటం రాజకీయ పక్షాల్లో కనిపిస్తున్న ట్రెండ్. ఈ ధోరణిని రాజకీయ పార్టీలు విడనాడాలి. మైఖేల్ గ్రీస్ రాసిన ‘సామాజిక రాజకీయ మార్పులో క్రియాశీలక ప్రతినిధులుగా యువత’ అనే పుస్తకంలో యువతలో సానుకూల దృక్పథం కలిగించి, అభివృద్ధికి అనువుగా మలుచు కోవ డాన్ని ఎప్పటికప్పుడు విస్తృత స్థాయిలో బలీ యమైన ఉద్యమంగా చేపట్టాల్సి ఉంటుందని పేర్కొన్నారు. రాజకీయ పార్టీలు ఈ విషయాన్ని గమ నించాలి. ఇప్పటివరకూ యువతను సంకుచిత రాజకీయాల కోసం వాడుకుంటున్న పార్టీలకు ఇకనైనా కనువిప్పు కలగాలి. రాజకీయ పార్టీలు యువతకు అన్ని స్థాయుల్లో జరిగే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలి. గ్రామ వార్డు మెంబర్ నుంచీ అత్యు న్నత పార్లమెంట్ సభ్యుని వరకూ వారికి అవకాశం ఇవ్వాలి. యువతీ యువకులు భవి ష్యత్ రాష్ట్ర, జాతీయ స్థాయి ప్రజా ప్రతి నిధులుగా ఎదగడానికి శిక్షణా ప్రాంగణాలుగా స్థానిక సంస్థలు ఉపయోగపడతాయి. అలాగే అట్టడుగు స్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల పట్లా ఎన్నికైన యువ ప్రతినిధులకు అవగాహన కలగడానికి అవి ఉపయోగపడ తాయి. వార్డు మెంబర్లుగా, గ్రామ సర్పంచ్ లుగా, ఎంపీటీసీలుగా, మండల ప్రజాపరిషత్ అధ్యక్షులుగా, మున్సిపల్ ఛైర్మన్లుగా, జిల్లా పరిషత్ ఛైర్మన్లుగా, కార్పొరేటర్లుగా, మహా నగరాలకు మేయ ర్లుగా... ఇలా వివిధ పదవులను పొంది... పాలనలో ప్రాథమిక అనుభవం పొంద డానికి రాజకీయ పార్టీలు ముందు యువతకు అవకాశం కల్పించాలి. ఆ తర్వాత అసెంబ్లీ, శాసన మండలి, పార్లమెంట్ ఉభయ సభలకూ పోటీ చేయించాలి. దీనివల్ల కింది స్థాయి నుంచీ ఢిల్లీ వరకూ వివిధ పాలనా వ్యవస్థల పట్ల యువతకు అవగాహన పెరిగి మంచి పాలకులుగా ఎదుగుతారు. నేదునూరి కనకయ్య వ్యాసకర్త అధ్యక్షులు, తెలంగాణ ఎకనామిక్ ఫోరం ‘ 94402 45771 -
సర్వేలో చేదు నిజాలు.. యువతలో గుండె సమస్యలు తీవ్రం
ఆరోగ్య రాజధాని బెంగళూరులో యువత గుండె ఒత్తిడితో సమతమవుతోంది. మంచి చదువులు, ఉద్యోగం, ఇంకా రకరకాల లక్ష్యాలతో విశ్రాంతి లేకుండా పనిచేయడం వల్ల వయసుకు మించిన ఒత్తిడిని హృదయం అనుభవిస్తుంది. దీనికి తోడు అధిక కొవ్వు, చక్కెరలతో కూడిన ఆహారం వల్ల ఆరోగ్యం ఆస్పత్రి పాలయ్యే ప్రమాదం పెరిగింది. నగరంలోని ప్రముఖ గుండె వైద్య ఆస్పత్రులకు పెరిగిన రోగుల తాకిడే దీనికి నిదర్శనమంటున్నారు. బనశంకరి: ఐటీ బీటీ సిటీలో ఉద్యోగాలంటేనే ఉరుకులు, పరుగులు లాంటి యాంత్రిక జీవనానికి సరి సమానం. ఎంతో ఒత్తిడితో కూడుకున్న జీవనశైలితో రాజధాని నగర ప్రజలను తీవ్రమైన గుండె సమస్యలు వెంటాడుతున్నాయి. ప్రముఖ హృద్రోగ ఆసుపత్రుల్లో రోగుల సంఖ్య కూడా గణనీయ ప్రమాణంలో పెరగడం దీనికి నిదర్శనంగా భావించాలి. అందులోనూ యువత, మధ్య వయసువారే ఎక్కువగా గుండె పోటుకు గురికావడం ఆందోళన కలిగిస్తోంది. గ్రామీణుల కంటే 30 శాతం అధికం బెంగళూరు మహానగర వాసులు గ్రామీణ ప్రాంతాలవారి కంటే 30 శాతానికి పైగా గుండె సమస్యలతో బాధపడుతున్నారు. దేశంలోని మహానగరాల్లో ఒకటైన బెంగళూరు నగరంలో హెచ్చుమీరిన వాయు కాలుష్యం, ట్రాఫిక్, ఒత్తిడితో కూడుకున్న జీవితంతో చిన్ని గుండె త్వరగా అలసిపోతోంది. దీంతో పాటు వందలో 50 శాతం మంది శారీరక కదలికలు లేని ఉద్యోగాలు, వ్యాయామం చేయకపోవడం వల్ల గుండె బలహీనానికి లోనవుతోందని వైద్య నిపుణులు తెలిపారు. కరోనా తరువాత మరింత ఎక్కువ నగరంలోని ప్రముఖ హృద్రోగ ఆసుపత్రి నారాయణమల్టీ స్పెషాలిటిలో కరోనా అనంతరం 55 ఏళ్లు వయసు కంటే తక్కువ వయసు ఉన్నవారు గుండె సమస్యలతో రావడం 30 శాతం పెరిగింది. గత ఒక ఏడాదిలో నమోదైన మొత్తం రోగుల్లో 70 శాతం మంది 25–55 వయసు మధ్యవారేనని తెలిపారు. జయదేవ హృద్రోగ ఆసుపత్రిలో ఏడాదికి సరాసరి 6 లక్షల మందికి పైగా ఆసుపత్రికి వైద్యం కోసం వస్తున్నారు. యాంజియోగ్రాం, యాంజియోప్లాస్టితో పాటు 40 వేల శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి. ఇక్కడికి వచ్చే ప్రతి 100 మందిలో 30 మంది 40 ఏళ్లు లోపు వయసు వారు సగం మంది ఉన్నారు. 40 ఏళ్లు దాటితే స్కాన్ చేయించాలి గుండెపోటు ఒకేసారి రాదు కనీసం 10 ఏళ్లకు ముందుగానే గుండెరక్తనాళాల్లో రక్తప్రసరణ తలెత్తుతుంది. 40 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ 10 ఏళ్లకు ఒకసారి గుండె కు సీటీ స్కాన్ తీయించుకోవాలి. ఈ పరీక్షతో 5 శాతం రక్తనాళాలు బ్లాక్ అయి ఉంటే తెలుస్తుంది. దీంతో ప్రారంభ సమయంలోనే చికిత్స తీసుకుంటే గుండె జబ్బుల నుంచి దూరంగా ఉండవచ్చునని ప్రముఖ గుండెవైద్య నిపుణుడు డాక్టర్ దేవీ శెట్టి సలహా ఇచ్చారు. ఒత్తిడి జీవన విధానమే కారణం ప్రస్తుతం ప్రజలు అత్యంత ఒత్తిడితో కూడుకున్న జీవనశైలితో జీవనం గడుపుతున్నారు. ఒక ఏడాది పని ఒక నెలలో పూర్తిచేయాలనే మానసిక స్థితిని కలిగి ఉన్నారు. విద్యార్థి దశ నుంచి ఒకేసారి రెండు మూడు కోర్సులు ప్రారంభించి, మంచి ఉద్యోగం, మరింత డబ్బు సంపాదించాలనే ఆరాటానికి గురవుతున్నారని జయదేవ హృద్రోగ సంస్థ డైరెక్టర్ డాక్టర్ సీఎన్. మంజునాథ్ తెలిపారు. ఓ సర్వేలో చేదు నిజాలు సమగ్ర ఆరోగ్య కేంద్ర సంస్థ ప్రాక్టో దేశంలోని ప్రముఖ మహానగరాల్లో జరిపిన పరిశోధనల్లో మూడునెలల్లో బెంగళూరులో గుండెపోటుకు సంబంధించిన ఆరోగ్య పరీక్షలు, చికిత్సలు 200 శాతం పెరిగినట్లు తెలిపింది. గత రెండేళ్లలో గుండె జబ్బులతో అనేక మంది ప్రముఖులు మృత్యవాత పడ్డారు. దీంతో ప్రజల్లో జాగ్రత్త పెరిగి గత మూడునెలల్లో గుండె పరీక్షల కోసం ఆస్పత్రులకు వచ్చేవారి సంఖ్య అత్యధికంగా పెరిగింది. ఇందులో 56 శాతం మంది 30–39 ఏళ్లులోపు వారు ఉన్నారు. -
ఐఏఎస్‌కు సిద్ధమవుతూ.. ‘పిచ్చి ప్రేమ’తో బిచ్చగాడిలా..
ప్రేమ.. కొందరి జీవితాల్లో ఇది మధుర జ్ఞాపకం.. మరికొందరకి ఇది మరణశాసనం. అవును.. జీవితమనే వైకుంఠపాళిలో ఆశల నిచ్చెనలతో పాటూ.. మింగేసే అనకొండలూ ఉంటాయి.. ముఖ్యంగా వలపు వలలో చిక్కి.. బయటపడలేక దుర్భర జీవితాలు అనుభవించే అభాగ్యులెందరో..ఈ లోకంలో! మనసిచ్చిన మగువ చీత్కరిస్తే.. వలచిన వనిత నిర్ధయగా వదిలేస్తే.. ఆ బతుకు నిత్యనరకం.. అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటూ.. స్వచ్ఛమైన ప్రేమకోసం పిచ్చివాడిగా మారిన ఓ యువకుడి దీనగాథకు మూడేళ్ల కాలం సాక్ష్యంగా.. నిలిచింది.. ఈ కన్నీటి వ్యథను మీరూ చదవండి..! సాక్షి ప్రతినిధి, చెన్నై: అతడు ఉన్నత విద్యావంతుడు. ఎంతో కొంత అందగాడు కూడా.. పీజీ పూర్తి చేసి ఐఏఎస్ కావాలనే కలను సాకారం చేసుకునే క్రమంలో ప్రేమలో పడ్డాడు. అయితే రెండు సార్లూ విఫలం కావడంతో.. బంగారంలాంటి ఉద్యోగాన్ని వదిలేసి రోడ్డున పడ్డాడు. మతితప్పిన స్థితిలో చెన్నై నుంచి కాలినడకన కన్యాకుమారికి చేరుకుని బిచ్చగాడిలా మారిపోయాడు. సమీప బంధువు కంట బడడంతో మూడేళ్ల దుర్భర జీవితం నుంచి బయటపడి తోబుట్టువుల చెంతకు చేరుకున్నాడు. వివరాలు.. ప్రముఖ పర్యాటక ప్రాంతమైన కన్యాకుమారిలో 35 ఏళ్ల యువకుడు ఒకరు మతితప్పిన స్థితిలో మూడేళ్లుగా సంచరిస్తున్నాడు. కన్యాకుమారి రైల్వేస్టేషన్ సమీపంలోని బ్యాంకు ఫ్లాట్‌ఫారంనే నివాసంగా చేసుకుని జీవిస్తున్నాడు. ఎప్పుడు ఇంగ్లీష్ వార్తాపత్రికలను చదువుతూ గడుపుతుంటాడు. ఆ మార్గంలో వచ్చిపోయే వారు.. ఇచ్చే ఆహార పదార్థాలను తింటూ ఆకలి తీర్చుకుంటాడు. ఇదిలా ఉండగా, తెన్‌కాశీ జిల్లా తెన్నమలై ప్రాంతానికి చెందిన మురుగన్ అనే వ్యక్తి ఈనెల 17వ తేదీన తన కుటుంబ సభ్యులతో పర్యాటక యాత్ర కోసం కన్యాకుమారికి వచ్చాడు. చినిగిపోయిన బట్టలు కట్టుకుని, ఏళ్ల తరబడి క్షవరం చేసుకోకుండా, బాగా పెరిగిపోయిన మాసిన గడ్డంతో, మానసిక వైకల్యంతో రోడ్డుపై ఉన్న యువకుడిని గమనించాడు. కొన్నేళ్లుగా కనిపించకుండా పోయిన తన సమీప బంధువేమోననే సందేహంతో గమనించాడు. నిర్ధారించుకునే క్రమంలో అతడి దగ్గరకు వెళ్లి పలుకరించాడు. మాట కలిసి.. మలుపు తిరిగి ఆ యువకుడు మొదట విముఖత చూపినా కొద్దిసేపటికి మురుగన్‌తో మాట కలిపాడు. అతడు తన ఊరు, పేరు చెప్పగానే నిర్ధారౖణెంది. వెంటనే సమీపంలో భద్రత విధుల్లో ఉన్న పోలీసుల సహాయంతో సెలూన్‌కు తీసుకెళ్లగా వారు ఆ యువకుడికి ఏపుగా పెరిగిన క్రాపు, గడ్డం కత్తిరించి గుండుకొట్టించారు. తరువాత స్నానం చేయించి కొత్త గుడ్డలు తొడిగి తెన్నమలైలోని అతడి బంధువులకు సమాచారం ఇచ్చారు. బంధువులు వచ్చి అతడు తెన్‌కాశీ జిల్లా తెన్నమలైకి చెందిన ముత్తు (35)గా గుర్తించారు. ఈ క్రమంలో ముత్తు రాజపాళయంలో బీకాం, మద్రాసు యూనివర్సిటీలో ఎంబీఏ డిగ్రీ పుచ్చుకున్న వైనం బయటపడింది. అంతేగాక చెన్నైలోని ఓ కార్యాలయంలో ఉన్నత ఉద్యోగం చేస్తూ 2018 నవంబర్ 13వ తేదీన తాను ఉంటున్న వర్కింగ్ బాయ్స్ హాస్టల్ నుంచి అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడు. ముత్తు బంధువులు అనేక చోట్ల వెతికినా, పోలీసులకు సమాచారం ఇచ్చినా అతడి జాడకానరాలే దు. ఈ నేపథ్యంలోనే మురుగన్ ద్వారా ముత్తు ఆచూకీ బంధువులకు తెలియగా,వారు తగిన ఆధారాలు చూపి న తరువాత పోలీసులు ముత్తును అప్పగించారు. రెండుసార్లు ప్రేమ విఫలం కావడంతోనే.. ఈ సందర్భంగా ముత్తు సోదరుడు అయ్యనార్ మీడియాతో మాట్లాడుతూ, చెన్నైలోని మద్రాసు యూనివర్సిటీలో చదివేటప్పుడు ఓ విద్యారి్థనిని, ఉద్యోగం చేసేటప్పుడు తనతోటి ఉద్యోగిని ప్రేమించాడు, అయితే ఈ రెండు ప్రేమలు విఫలం కావడంతో జీవితంపై విరక్తి చెంది 2018లో హాస్టల్ నుంచి ఎటో వెళ్లిపోయాడని ఆయన చెప్పాడు. తమ సమీప బంధువైన మురుగన్ వల్ల మూడేళ్ల తరువాత ఆచూకీ లభించిందని చెమర్చిన కళ్లతో ఆనందం వ్యక్తం చేశా డు. చెన్నై నుంచి కాలినడకనే కన్యాకుమారి వరకు చేరి రోడ్డుపై బిచ్ఛగాడిలా ఇన్నాళ్లూ గడిపాడు. ఐఏఎస్ కావాలనే లక్ష్యంతో గతంలో ప్రత్యేక శిక్షణ కూడా పొందాడని అన్నాడు. కన్యాకుమారి పోలీ సులు ఎంతో మానవత్వంతో తన సోదరుడిని క్షేమంగా ఇంటికి చేర్చారని కృతజ్ఞతలు తెలిపాడు. -
కజకిస్తాన్‌లో కర్నూలు యువకుడి మృతి
కర్నూలు(సెంట్రల్): కజకిస్తాన్‌లో ఎంబీబీఎస్ చదువుతున్న కర్నూలు యువకుడు ప్రమాదవశాత్తు మృతిచెందాడు. ఈతకు వెళ్లగా ఈ ఘటన జరిగినట్లు కాలేజీ నుంచి తల్లిదండ్రులకు ఫోన్ వచ్చింది. వివరాల్లోకి వెళ్లితే.. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం పొట్లపాడుకు చెందిన పి.ప్రసాదు, మేరీ కుమారి దంపతులకు ఇద్దరు సంతానం. వీరి కుమారుడు పి.వినయ్‌కుమార్(23) కజకిస్తాన్‌లోని ఆల్మమట్టి నగరంలో ఉన్న కజక్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చేస్తున్నాడు. రెండు రోజుల క్రితం మూడో సంవత్సరం పరీక్షలు ముగిశాయి. ఈ క్రమంలో భారత కాలమానం ప్రకారం గురువారం స్నేహితులతో కలసి సమీపంలో ఉన్న కుంటలో ఈతకు వెళ్లాడు. అయితే నీటిలోకి దూకే సమయంలో అదుపు తప్పి రాయికి తలకొట్టుకోవడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఈ విషయాన్ని మొదట స్నేహితులు వినయ్‌కుమార్ తల్లిదండ్రులకు తెలిపారు. తరువాత మెడికల్ కాలేజీ యూనివర్సిటీ కూడా యువకుడి మరణాన్ని ధ్రువీకరించి సమాచారం ఇచ్చింది. జేసీ ఎస్.రామ్‌సుందర్‌రెడ్డికి వినతిపత్రం ఇస్తున్న వినయ్ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో ఉన్నత చదువు కోసం కజకిస్తాన్ వెళ్లిన వినయ్‌కుమార్ మృతి చెందడాన్ని తల్లిదండ్రులు, బంధుమిత్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. కుమారుడిని తలుచుకొని విలపిస్తున్న తల్లిని నిలువరించడం బంధుమిత్రులకు సాధ్యం కావడంలేదు. కడసారి చూపుకోసం తమ కుమారుడి మృతదేహాన్ని రప్పించాలని ఉన్నతాధికారులకు తల్లిదండ్రులు విన్నవించారు. శుక్రవారం కలెక్టరేట్లో కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో జేసీ ఎస్.రామ్‌సుందర్‌రెడ్డిని కలిసి వినతిపత్రం ఇచ్చారు. విదేశాంగ శాఖతో మాట్లాడిన కలెక్టర్... ఎంతో భవిష్యత్ ఉన్న పి.వినయ్‌కుమార్ కజకిస్తాన్ లో చనిపోవడంపై కలెక్టర్ విచారం వ్యక్తం చేశారు. వెంటనే అతడి మృతదేహాన్ని ఇండియాకు తెప్పించేందుకు చర్యలు చేపట్టారు. విదేశాంగ శాఖ అధికారులు, ఏపీ భవన్ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు కజకిస్తాన్‌లోని ఎంబసీ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లినట్లు కలెక్టర్ తెలిపారు. వినయ్‌కుమార్ మృతదేహాన్ని స్వస్థలానికి తెప్పించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. -
అనన్యా .. సారీ! నువ్వు నాతో సంతోషంగా బతకలేవు
‘అనన్య సారీ.. నువ్వు నాతో సంతోషంగా ఉండలేవు.. బాపు, అమ్మా.. తమ్ముడు సారీ.. నాకు బతకాలని లేదు. అప్పులు బాగా పెరిగిపోయాయి. నాతో ఐతలేదు. మీకు చెప్పేధైర్యం వస్తలేదు. నా చావుకు కారణం ముద్రకోల రామాంజనేయులు. అవసరానికి అప్పు చేశాను. వడ్డీకి వడ్డీ వేశాడు. రూ.20 లక్షలు కట్టుమంటుండు. నా రక్తం తాగుతుండు. బయట పది లక్షలు అప్పుతెచ్చి కట్టిన. ఇంకో రూ.20 లక్షలు కట్టుమంటుండు. నీతో కాకుంటే పొలం అమ్ము అంటుండు. తమ్ముడూ... అమ్మ, బాపును, అమ్మమ్మను మంచిగ చూసుకో. నేను పెద్ద తప్పు చేశా అప్పు చేసి. పెళ్లి చేసుకొని ఇంకా పెద్ద తప్పు చేశా. బతుకుడు నాతో ఐతలేదు. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్న’ అంటూ లేఖ రాసి మానకొండూర్ మండలం అన్నారం గ్రామానికి చెందిన మార్క ప్రశాంత్ ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. కరీంనగర్ (మానకొండూర్) : అన్నారం గ్రామానికి చెందిన మార్క అంజయ్య– పద్మ దంపతుల పెద్ద కొడుకు ప్రశాంత్ (26). డిగ్రీ పూర్తిచేశాడు. ప్రయివేటు ఉద్యోగం చేస్తున్నాడు. ఎనిమిది నెలల క్రితం అనన్యతో వివాహమైంది. అవసరం నిమి త్తం ఇదే గ్రామానికి చెందిన వడ్డీ వ్యాపారి ముద్రకోల రామాంజనేయులు వద్ద 10, 12, 15 శాతం వడ్డీకి అప్పు తీసుకున్నాడు. కొన్నాళ్లకు చెల్లించాలని వేధించడంతో మరోచోట అప్పుచేసి రూ.10 లక్షలు చెల్లించాడు. మరో రూ.20 లక్షలు చెల్లించాలని వేధిస్తూ వచ్చాడు. పొలం అమ్మి అయినా అప్పు చెల్లించాలని, విషయం ఎవరికీ చెప్పవద్దని బెదిరించాడు. వేధింపులు భరించలేని ప్రశాంత్ ఈ నెల 26న రాత్రి సూసైడ్ రాసి గ్రామ శివారులో పురుగుల మందు తాగాడు. విషయాన్ని ఫోన్‌ద్వారా కుటుంబసభ్యులకు చెప్పాడు. వారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం వేకువజామున చనిపోయాడు. గ్రామంలో ఉద్రిక్తత.. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని అన్నారం గ్రామానికి తీసుకొచ్చా రు. రామాంజనేయులు ఇంటిఎదుట మృతదేహంతో ఆందోళనకు యత్నించగా.. సీఐ క్రిష్ణారెడ్డి అక్కడికి చేరుకుని మృతుడి కుటుంబసభ్యులు, బంధువులు, గ్రామ పెద్దలతో మాట్లాడారు. అయినా.. వినకుండా కుటుంబసభ్యులు రామాంజనేయులు ఇంటి వద్ద బైటాయించారు. చివరికి సీఐ నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. తీసుకున్న అప్పు ఏం చేశాడు..? ప్రశాంత్ డిగ్రీ పూర్తిచేయగా.. ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అందరితో కలివిగా ఉండే వ్యక్తి. అధిక వడ్డీలకు అప్పు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ‘రామాంజనేయులుకు అప్పు చెల్లించవద్దని.. విక్రంబావకు రూ.3 లక్షలు, శ్రీకాంత్ అల్లుడికి రూ.3 లక్షలు, దేవన్నకి రూ.1.50 లక్షలు, చింటుకు 1.50 లక్షలు, ముద్రకోల మధుకు రూ.లక్ష చెల్లించు’ అంటూ నోట్లో అతడి తమ్ముడు అజయ్‌కి సూచించాడు. ‘అప్పు ఎందుకు చేశాడో తెలియదు.. ఎంత చేశాడో తెలియదు.. బాగానే ఉంటాడు అనుకున్నాం.. ఇంతలో ఇలా జరిగింది’ అని అతని తల్లిదండ్రులు అంజయ్య– పద్మ చెబుతున్నారు. ప్రాణాలు తీస్తున్న అధిక వడ్డీలు.. అధిక వడ్డీకి అప్పులు ప్రాణాలు తీస్తున్నాయి. ఇప్పటికే జిల్లాలో పలు ఘటనలు చోటుచేసు కోగా.. పోలీసులు సైతం ఈ అంశంపై దృష్టి సారించారు. ఇప్పటి వరకు పట్టణాల్లోనే ఉందనుకున్న దందా పల్లెలకు సైతం పాకడంతో ఆందోళన కలిగిస్తోంది. అనన్య ఐదు నెలల గర్భిణి ప్రశాంత్‌కు రామడుగు మండలం గుండికి చెందిన అనన్యతో 8 నెలల క్రితం వివాహం అయ్యింది. ప్రస్తుతం ఐదునెలల గర్భిణి. ప్రశాంత్ మృతితో అనన్య రోదనలు అరణ్య రోదనలు అయ్యాయి.‘నిండు నూరేళ్లు కలిసి ఉంటావనుకుంటే ఎనిమిది నెలలకే తీరని లోకాలకు వెళ్లిపోయావా.. నువ్వులేని నా జీవితం ఎలా గడుస్తుంది. కడుపులో బిడ్డ గుర్తుకురాలేదా’ అంటూ అనన్య రోదనలు గ్రామస్తులను కంటతడి పెట్టించాయి. ‘అప్పు ఉందంటే మేము కట్టేవాళ్లం కదా కొడుకా.. మాకు దిక్కెవరు బిడ్డా అంటూ..’ తల్లిదండ్రులు, తమ్ముడు అజయ్ గుండెలవిసేలా రోదించారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
యువకుడిపై గొడ్డలితో దాడి
కొత్తగూడెం రూరల్: పాత కక్షలు మనసులో ఉంచుకున్న కొందరు పుట్టినరోజు వేడుకలకు పిలిచి ఓ యువకుడిపై గొడ్డలితో దాడి చేసిన ఘటన గురువారం అర్ధరాత్రి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం ఇందిరానగర్ కాలనీలో చోటుచేసుకుంది. కొత్తగూడెం పట్టణంలోని గణేశ్ ఆలయం ప్రాంతానికి చెందిన మిర్యాల శ్రీకాంత్‌కు, లక్ష్మీదేవిపల్లి మండలం ఇందిరానగర్ కాలనీలోని సంపత్‌కు మధ్య పాతకక్షలున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం సంపత్ పుట్టినరోజు కావటంతో మిర్యాల శ్రీకాంత్‌ను ఇందిరానగర్ వద్దకు గురువారం అర్ధరాత్రి పిలిచారు. కేక్ కోసిన అనంతరం సంపత్‌తోపాటు అతడి స్నేహితులు భరత్, అఖిల్, మరికొందరు ముందుగా తెచ్చుకున్న గొడ్డలి, కర్రలతో శ్రీకాంత్‌పై దాడి చేసి అక్కడ్నుంచి పారిపోయారు. శ్రీకాంత్ శరీరంపై 14 చోట్ల గాట్లు పడి తీవ్రంగా రక్తస్రావమైంది. కేకలు విని చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకుని క్షతగాత్రుడిని కొత్తగూడెం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా..మెరుగైన చికిత్స కోసం అక్కడ్నుంచి ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై శ్రీకాంత్ సోదరి సింధు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
‘నేను చనిపోతేనే నీకు ప్రేమ విలువ తెలుస్తుంది’
సాక్షి, అమీర్‌పేట: ‘నేను చనిపోతేనే నీకు ప్రేమ విలువ తెలుస్తుంది’అంటూ సెల్ఫీ వీడియో రికార్డు చేసి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ఆర్నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆదివారం ఉదయం వెలుగు చూసింది. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూర్ మండలం కేపీ పాలెం గ్రామానికి చెందిన గొర్రె సుధాకర్ (29) హైదరాబాద్‌కు వచ్చి ఎస్సై ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడు. బీకేగూడ వేంకటేశ్వర దేవాలయం సమీపంలో గదిని అద్దెకు తీసుకుని స్నేహితులతో కలిసి ఉంటున్నాడు. శనివారం రాత్రి రూమ్మేట్ భార్గవ్ గది తలుపులు తట్టగా, ఎంతసేపటికీ తలుపు తీయక పోవడంతో పై పోర్షన్లోకి వెళ్లి బాల్కనీ ద్వారా గదిలోకి వెళ్లి చూడగా సుధాకర్ ఉరికి వేలాడుతూ కనిపించాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ జరిపారు. సెల్ఫోన్లో తీసుకున్న సెల్ఫీ వీడియోను గుర్తించారు. ప్రేమ విఫలం కావడంతోనే సుధాకర్ ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నారు. మృతుడి బాబాయ్ శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
Shocking: కాటేసిన పాముతో ఆసుపత్రికి పరుగు.. భయపడిపోయిన వైద్యులు..
సాక్షి, కంప్లి(కర్ణాటక) : మెట్రి పంచాయతీ పరిధిలోని ఉప్పారహళ్లి గ్రామంలో కాడప్ప అనే యువకుడికి ఆదివారం నాగుపాము కాటేసింది. దీంతో కంగారు పడకుండా కాడప్ప చాకచక్యంగా పామును పట్టుకుని మెట్రి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేరుకున్నాడు. అక్కడ సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో ఓ యువకుడి సాయంతో ద్విచక్ర వాహనంలో కంప్లి ఆస్పత్రికి చేరుకున్నాడు. పాము చేతపట్టుకుని ఆస్పత్రికి వస్తున్న కాడప్పను చూసి ఆస్పత్రికి వచ్చిన వారు భయపడ్డారు. వైద్యులు హుటాహుటిన ప్రాథమిక చికిత్స చేసి బళ్లారి విమ్స్‌కు తరలించారు. చదవండి: మెట్రోలో సీటు కోసం.. ఎంత పని చేశాడు! వైరల్ వీడియో -
కవిటం గ్రామం: 24 ఏళ్లకే సర్పంచ్..
పోడూరు (పశ్చిమగోదావరి జిల్లా): కవిటం గ్రామంలో అతిచిన్న వయస్సులో సర్పంచ్‌గా ఎన్నికై చరిత్ర సృష్టించారు చుట్టుగుళ్ల పూర్ణిమ. ఆమె వయసు 24 ఏళ్లు. పూర్ణిమ తల్లిదండ్రులు నాగేశ్వరరావు, మంగ వ్యవసాయ కూలీలు. సర్పంచ్ పదవి ఎస్సీ మహిళకు రిజర్వ్ కావడంతో గ్రామపెద్దలు వైఎస్సార్ సీపీ అభిమాని నాగేశ్వరరావు కుమార్తె పూర్ణిమతో నామినేషన్ వేయించారు. ఏకగ్రీవం కోసం యత్నించారు. ఎన్నిక అనివార్యమైంది. పూర్ణిమ ప్రత్యర్థి ఉండ్రాజవరపు రత్నకుమారిపై 1,891 ఓట్ల భారీమెజార్టీతో గెలుపొందారు. పూర్ణిమ ఇంటర్మీడియెట్ పూర్తిచేశారు. చదవండి: వీరికి లక్కుంది..! టీడీపీ నేతల అనుచిత ప్రవర్తన -
చిన్న వయసులోనే.. పెద్ద రికార్డు
మన దేశంలో లోక్‌సభ ఎంపీగా, అసెంబ్లీకి ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే రాజ్యాంగం నిర్దేశించిన కనీస వయసు 25 సంవత్సరాలు. అయితే 25 ఏళ్లకే ఎన్నికల్లో గెలిచి చట్టసభల్లో అడుగుపెట్టి పలువురు రికార్డు సృష్టించారు. 25 ఏళ్లకే ఎమ్మెల్యేలుగా..: 2009లో ఆంధప్రదేశ్‌లోని ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం నుంచి సీపీఐ తరఫున గెలిచిన బాణోతు చంద్రావతి వయసు అప్పటికి 25 ఏళ్లు మాత్రమే. ఎన్నికలకు కొద్ది నెలల ముందు ఆమె విశాఖలో మెడిసిన్ ఫైనలియర్ పూర్తి చేశారు. తాత బీక్యానాయక్ సీపీఐలో చురుకుగా పనిచేసేవారు. పార్టీకి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఆ కుటుంబం నుంచి ఎవరికైనా టికెట్ ఇవ్వాలని పార్టీ భావించింది. దీంతో చంద్రావతికి టికెట్ దక్కింది. చిన్న వయసులోనే మంత్రిగా సుష్మా స్వరాజ్ రికార్డు..: చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా గెలుపొందిన వారిలో సుష్మా స్వరాజ్ ఒకరు. ఆమె 1977లో 25 ఏళ్ల వయసులోనే హరియాణా నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అలాగే 25 ఏళ్లకే మంత్రి పదవి చేపట్టారు. 1962లో రాజస్తాన్‌లోని బార్మర్ నుంచి ఉమేద్‌సింగ్ , 2012లో ఉత్తరప్రదేశ్‌లోని సదర్ నియోజకవర్గం నుంచి అరుణ్ వర్మ 25 ఏళ్లకే ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. 29 ఏళ్లకే సీఎంగా..: దేశంలో అతిచిన్న వయసులో ముఖ్యమంత్రి పీఠం అధిరోహించింది ఎం.ఓ.హసన్ ఫరూక్ మరికర్. 1967లో 29 ఏళ్లకే ఆయన పుదుచ్చేరి సీఎంగా పనిచేశారు. ఆ తర్వాతి స్థానాల్లో ప్రేమ్ ఖండూ 36 ఏళ్లకు అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా, హేమంత్ సోరెన్ 37 ఏళ్లకు జార్ఖండ్ సీఎంగా, అఖిలేశ్ యాదవ్ 38 ఏళ్లకే యూపీ సీఎంగా పనిచేశారు. చిన్నవయసులోనే ఎంపీగా దుష్యంత్..: దేశంలో అతిపిన్న వయసులో ఎంపీగా గెలుపొందిన ఘనత దుష్యంత్ చౌతాలాకు దక్కింది. ఐఎన్ఎల్డీ నుంచి 2014లో హరియాణాలోని హిసార్ నుంచి ఆయన కాంగ్రెస్ అభ్యర్థి కుల్దీప్ బిష్ణోయ్‌పై గెలుపొందారు. ఎంపీ అయ్యేనాటికి వయసు 25 ఏళ్లు మాత్రమే. దుష్యంత్ మాజీ ఉప ప్రధాని దేవీలాల్ మునిమనవడు కాగా.. హరియాణా మాజీ సీఎం ఓం ప్రకాశ్ చౌతాలాకు మనువడు. ఉంగాండా నుంచి 19 ఏళ్లకే ఎంపీ..: ప్రపంచంలోనే అతి పిన్న వయసుగల ఎంపీని ఎన్నుకున్న ఘనత ఆఫ్రికా దేశమైన ఉగాండాకు దక్కింది. ఉగాండాకు చెందిన ప్రోస్కోవియా ఓరోమయిట్ హైస్కూలు పూర్తవుతూనే నేరుగా పార్లమెంటుకు ఎన్నికయ్యారు. 2012లో జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించేనాటికి ఆమె వయసు 19 ఏళ్లు మాత్రమే. 31 ఏళ్లకే దేశ ప్రధానిగా..: చిన్న వయసులోనే ఒక దేశాధినేతగా ఎన్నికై సెబాస్టియన్ కర్జ్ రికార్డు సృష్టించారు. 2017 డిసెంబర్లో 31 ఏళ్లకే ఆయన ఆస్ట్రియా చాన్సలర్ పదవిని అధిష్టించారు. – సాక్షి, ఎలక్షన్ డెస్క్ -
మాస్టర్ సైంటిస్ట్
అవసరాలే ఆవిష్కరణలకు మూలం అనేది అనాది సత్యం. ఆవిష్కరణలు చేయాలంటే ఏళ్ల తరబడి పరిశోధనల్లో తలలు పండిన శాస్త్రవేత్తలే ప్రతిసారీ దిగిరానక్కర్లేదు. ఒక్కోసారి చిన్న వయసులోనే కొందరు చిచ్చర పిడుగులు వినూత్న ఆవిష్కరణలతో, అద్భుత విజయాలతో అబ్బురపరుస్తుంటారు. చాలా చిన్న వయసులోనే శాస్త్ర సాంకేతిక నైపుణ్యాలలో ప్రతిభ చూపిన కొందరు తర్వాతి కాలంలో శాస్త్ర సాంకేతిక రంగాల్లో చరిత్రాత్మక విజయాలు సాధించిన దాఖలాలు ఉన్నాయి. అలా చిన్న వయసులోనే ప్రతిభ చూపిన వారు కొద్దిమంది మాత్రమే. ఏళ్ల తరబడి అకుంఠిత దీక్షతో పరిశోధనలు సాగించి, శాస్త్ర సాంకేతిక రంగాల్లో పురోగతి సాధించిన వారే ఎక్కువ మంది. చిన్న వయసులోనే శాస్త్ర సాంకేతిక రంగాల్లో వినూత్న ఆవిష్కరణలతో ఇటీవలి కాలంలో ప్రపంచం దృష్టిని తమ వైపు తిప్పుకున్న వారిలో కొందరు మన దేశంలోనూ ఉన్నారు. వారిలో కొందరి విజయగాథలు ఫిబ్రవరి 28 ‘నేషనల్ సైన్స్ డే’ సందర్భంగా.. చిన్నారి శస్త్రవైద్యుడు ఏడేళ్ల వయసులోనే ఆ పసివాడు విజయవంతంగా తొలి శస్త్రచికిత్స చేశాడు. తన కంటే ఏడాది పెద్ద అయిన బాలిక అగ్ని ప్రమాదానికి గురైంది. చర్మం బాగా కాలిపోవడంతో చేతి వేళ్లు ఒకదానికొకటి అతుక్కుపోయాయి. ఆమె తల్లిదండ్రులు నిరుపేదలు. శస్త్రచికిత్స చేయించే స్తోమత లేనివారు. తోటి బాలిక పరిస్థితిని గమనించిన ఆ బాలుడు చలించిపోయి, శస్త్రచికిత్స చేయడానికి ముందుకొచ్చాడు. దాదాపు గంటసేపు శ్రమించి, చాకచక్యంగా శస్త్రచికిత్స చేసి, అతుక్కుపోయిన వేళ్లను వేరు చేశాడు. ఆ బాలుడి పేరు ఆకృత్ జస్వాల్. ఆకృత్ శస్త్రచికిత్స చేస్తుండగా, అతడి తల్లిదండ్రులు ఆ దృశ్యాలను వీడియో తీశారు. తర్వాత ఆన్లైన్లో పెట్టారు. ఆకృత్ పేరు ప్రపంచమంతా మార్మోగింది. ప్రపంచంలోనే అత్యంత పిన్నవయస్కుడైన శస్త్రవైద్యుడిగా ఆకృత్ పేరు రికార్డులకెక్కింది. తొలి శస్త్రచికిత్స చేసిన నాలుగేళ్లకు ఆకృత్ తన పదకొండేళ్ల వయసులోనే పంజాబ్ యూనివర్సిటీలో ప్రవేశం పొందాడు. అక్కడ చదువుకుంటున్న కాలంలోనే ప్రత్యేక ప్రసంగం కోసం లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీ నుంచి ఆహ్వానం పొందాడు. శరీర నిర్మాణ శాస్త్రంపైన, శస్త్రచికిత్సలపైన ఆకృత్ ఆసక్తిని గమనించిన చండీగఢ్ స్థానిక వైద్యులు తాము శస్త్రచికిత్సలు చేసే సమయంలో దగ్గర ఉంటూ పరిశీలించేందుకు అతడిని అనుమతించేవారు. వారు చేసే శస్త్రచికిత్సలను చూస్తూ ఆకృత్ తన బాల్యంలోనే శస్త్రచికిత్సల్లోని మెలకువలను వంటబట్టించుకున్నాడు. వైద్య పరిశోధనల్లోని అధునాతన పరిణామాలపై అతడు చేసిన ప్రసంగానికి లండన్ మేధావులు మంత్రముగ్ధులయ్యారు. ఓప్రా విన్ఫ్రే షోలో కూడా మాట్లాడాడు. ఓప్రా విన్ఫ్రేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, క్యాన్సర్‌ను నయం చేసే మార్గం కనుగొనడమే తన లక్ష్యమని చెప్పాడు. జన్యులోపాలను సరిదిద్దేందుకు నోటి ద్వారా తీసుకునే మందులను తయారు చేయడం సాధ్యమవుతుందని, దీనికి తన వద్ద ఒక సిద్ధాంతం ఉందని, ఏదో ఒకనాటికి తాను దీనిని సాధిస్తానని ఆత్మవిశ్వాసం ప్రకటించాడు. ఇదే గనుక నిజమైతే వైద్యరంగంలో ఆకృత్ ఒక ఘనమైన మైలురాయిని చేరుకున్నట్లే అవుతుంది. ఆకృత్ ప్రస్తుతం ఐఐటీ కాన్పూర్‌లో బయో ఇంజనీరింగ్ చదువుకుంటున్నాడు. తేనెటీగలను కాపాడే రోబో ప్రకృతిని, పర్యావరణాన్ని బాగా అర్థం చేసుకున్నవారికి తేనెటీగల ప్రాధాన్యం తెలిసినంతగా మామూలు జనాలకు తెలియదు. అందుకే ఇళ్లల్లో ఎక్కడ తేనెపట్టు కనిపించినా, అర్జంటుగా పురుగుమందులు చల్లి వాటిని అక్కడికక్కడే నాశనం చేసేస్తారు. తేనెపట్టులు కనిపించినప్పుడల్లా పురుగు మందులు చల్లి వాటిని నాశనం చేస్తూ పోతే భవిష్యత్తులో మానవాళి మనుగడకే ముప్పు వాటిల్లగలదని, వాటిని కాపాడటానికి ఏదో ఒకటి చెయ్యాలని గట్టిగా ఆలోచించింది కావ్యా విఘ్నేశ్. న్యూఢిల్లీలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఇప్పుడామె ఎనిమిదో తరగతి చదువుకుంటోంది. తేనెటీగలను కాపాడటానికి గత ఏడాది ఆమె రూపొందించిన రోబో అంతర్జాతీయంగా ప్రశంసలందుకుంది. డెన్మార్క్‌లో జరిగిన బాలల రోబోటిక్స్ పోటీలో బహుమతిని సాధించింది. ఆ పోటీలో అరవై దేశాల నుంచి దాదాపు రెండు లక్షల మంది బాల శాస్త్రవేత్తలు పాల్గొనడం విశేషం. కావ్యా విఘ్నేశ్ పూర్తిగా పర్యావరణ అనుకూలంగా, మట్టిలో కలిసిపోయే పదార్థాలతో ఈ రోబోను రూపొందించింది. ఈ రోబో నిజానికి ఒక ద్రోన్. ఇందులో త్రీడీ కెమెరా, సాఫ్ట్వేర్, భుజాల్లా పనిచేసే నాలుగు రెక్కలు ఉంటాయి. ఇళ్లలో ఉండే తేనెపట్టులను త్రీడీ కెమెరా ఫొటో తీస్తుంది. ఇందులోని సాఫ్ట్వేర్ తేనెపట్టు కొలతలను కచ్చితంగా అంచనా వేస్తుంది. ఆ అంచనా ప్రకారం ద్రోన్లోని రెండు భుజాలు తేనెపట్టును పూర్తిగా కప్పివేసేలా జాగ్రత్తగా చేజిక్కించుకుంటాయి. మూడో భుజానికి ఉన్న బ్లేడ్ తేనెపట్టును అది అంటిపెట్టుకుని ఉన్న గోడ నుంచి సురక్షితంగా వేరు చేస్తుంది. ఈ మొత్తం ప్రక్రియలో తేనెపట్టుకు గాని, అందులోని తేనెటీగలకు గాని ఎలాంటి హాని జరగదు. గోడ నుంచి వేరు చేసిన తేనెపట్టును తేనె సేకరణ కేంద్రాలకు చెందిన వాహనంలోకి చేరుస్తుంది. మనం తినే ఆహారంలో దాదాపు 85 శాతం ఆహార పదార్థాలను అందించే వృక్షజాతులన్నీ తేనెటీగల సహకారంతో జరిగే పరపరాగ సంపర్కం వల్లనే మనుగడ సాగించగలుగుతున్నాయని, తేనెటీగలను చంపేస్తూ పోతే పాడిపంటల మనుగడకు ముప్పు వాటిల్లి కరువు కాటకాలు ఏర్పడగలవని, చివరకు మానవాళి మనుగడకే ప్రమాదం కలుగుతుందని కావ్యా విఘ్నేశ్ చెబుతుంది. మానవాళి మనుగడకు ముప్పు నివారించడానికే తనవంతుగా ఈ రోబోకు రూపకల్పన చేశానని ఆమె వివరిస్తుంది. తక్కువ ఇంధనం.. ఎక్కువ మైలేజీ ఇప్పటి ప్రపంచాన్ని చూస్తే ఇం‘ధన’మేరా అన్నిటికీ మూలం అనుకోక తప్పదు. ఆర్థిక వ్యవస్థను చాలా వరకు శాసించేది ఇంధనమే. ఇందిరాగాంధీ ఢిల్లీ టెక్నికల్ యూనివర్సిటీ ఫర్ విమెన్‌లో మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకుంటున్న ఇరవైమంది యువతులు ఇంధన సమస్యకు తమదైన శైలిలో ఒక పరిష్కారాన్ని ఆవిష్కరించగలిగారు. ప్రపంచంలోనే అత్యధిక మైలేజీ ఇవ్వగల కారును రూపొందించారు. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న ఎలాంటి కార్లయినా వాటి గరిష్ఠ మైలేజీ ఇరవై, పాతిక కిలోమీటర్లకు మించదు. అలాంటిది వీరు రూపొందించిన కారు ఏకంగా మూడువందల కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. అంటే లీటరు పెట్రోలు పోస్తే, ఏకంగా మూడువందల కిలోమీటర్లు ప్రయాణించగలదు. సింగపూర్‌లో రెండేళ్ల కిందట జరిగిన షెల్ ఎకో మారథాన్, ఆసియా ప్రదర్శనలో ‘టీమ్ పాంథేరా’ పేరుతో బృందంగా వెళ్లిన ఈ యువతులు తాము రూపొందించిన కారును ప్రదర్శించారు. ఈ వాహనానికి వారు గ్రీకుదేవత పేరిట ‘ఐరిస్ 2.0’గా నామకరణం చేశారు. ఇది గంటకు 55 కిలోమీటర్ల గరిష్ఠవేగంతో ప్రయాణించగలదు. దీనికంటే ముందు ఈ బృందం ప్రయోగాత్మకంగా తయారు చేసిన కారు లీటరు పెట్రోలుతో 177 కిలోమీటర్లు ప్రయాణించగలిగేది. మరింత మెరుగైన మైలేజీ గల వాహనాన్ని రూపొందించాలనే సంకల్పంతో వారు ‘ఐరిస్ 2.0’ కారును రూపొందించారు. దీని తయారీకి వారు ఉక్కు, అల్యూమినియం, కార్బన్ ఫైబర్ ఉపయోగించారు. ‘ఐరిస్ 2.0’ తయారీలో కీలక పాత్ర పోషించిన వారిలో మృణాలీ పాండే, మోనా, కీర్తి, శివానీ రావల్, ఆంచల్ సక్సేనా, అదితి ఝా, శ్రుతి శ్రీవాస్తవ, కౌమోది శిరోహి, వంశిక పుందిర్, ప్రకృతి సైనీ, ఓజస్వినీ సరాఫ్, ఆరుషి సింగ్, కోమల్ మోర్, ఆరుషి సింగ్, కశికా త్రిపాఠి తదితరులు ఉన్నారు. ఈ బృందంలోని వివిధ విభాగాలకు మనుప్రియ వత్స్, పన్యా రావత్, దివ్యా ధన్‌ఖార్, శ్రేయా బగౌలీ నాయకత్వం వహించారు. అంధులకు దారిచూపే కళ్లద్దాలు అంధుల అవస్థలను చూసినప్పుడల్లా వారికి దారి చూపేందుకు ఏదైనా చేయాలనుకున్నాడు ఆ బాలుడు. ఒకవైపు చదువు కొనసాగిస్తూనే ఆ దిశగా రకరకాల ప్రయోగాలు సాగించేవాడు. పదకొండో తరగతిలో ఉన్నప్పుడు అంధులకు దారి చూపే కళ్లద్దాలను రూపొందించాడతడు. అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన ఆ బాలుడి పేరు అనంగ్ టాడర్. అంధులకు ఉపయోగపడేలా అతడు రూపొందించిన కళ్లద్దాలకు గబ్బిలాలే స్ఫూర్తి. కారుచీకటిలో పరిసరాలను గబ్బిలాలు ఎలా గుర్తిస్తాయో, దాదాపు అదే తీరులో పనిచేసే ‘ఎకో లొకేషన్ టెక్నాలజీ’ పరిజ్ఞానంతో అనంగ్ ఈ కళ్లద్దాలను రూపొందించాడు. వీటిని ధరిస్తే, పరిసరాల్లోని రెండు మీటర్ల దూరంలో ఉన్న అవరోధాలను గుర్తించి, అప్రమత్తం చేస్తుంది. ఈ కళ్లద్దాల్లో ఉన్న సౌలభ్యం వల్ల వీటిని ధరించే అంధులు ఎక్కడికైనా నిరాటంకంగా నడిచి వెళ్లేందుకు వీలవుతుంది. ఈ కళ్లద్దాలు రూపొందించినందుకు అనంగ్కు ‘దీనానాథ్ పాండే స్మార్ట్ ఐడియా ఇన్నోవేషన్’ అవార్డు లభించింది. అంతేకాదు, అనంగ్ రూపొందించిన ఈ కళ్లద్దాలను నమూనాకు మరింత మెరుగులు దిద్ది, మార్కెట్లోకి విడుదల చేసేలా రూపొందించడానికి యూనిసెఫ్ సంసిద్ధత ప్రకటించడం విశేషం. ‘నాసా’కెక్కిన ఘనత అంతరిక్ష పరిశోధనల్లో అమెరికాలోని నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) ప్రపంచంలోనే అగ్రగామి సంస్థ. అక్కడ పనిచేసే శాస్త్రవేత్తలంతా కొమ్ములు తిరిగిన మేధావులు. తమిళనాడుకు చెందిన పద్దెనిమిదేళ్ల రిఫత్ షారుక్ సాధించిన ఘనతకు ‘నాసా’ శాస్త్రవేత్తలే ప్రశంసలు కురిపించారు. ఇంతకీ రిఫత్ ఏం సాధించాడంటారా? ప్రపంచంలోనే అత్యంత చిన్న ఉపగ్రహానికి రూపకల్పన చేశాడు. మాజీ రాష్ట్రపతి, శాస్త్రవేత్త అయిన అబ్దుల్ కలాం గౌరవార్థం దీనికి ‘కలామ్‌శాట్’ అని నామకరణం చేశాడు. ఎంత చిన్న ఉపగ్రహమైనా కనీసం ఒక గ్లోబ్ సైజులోనైనా ఉండదా అనుకుంటారా? అంత కూడా ఉండదు. కేవలం మునివేళ్ల మధ్య ఈజీగా ఇమిడిపోతుంది. దీని బరువు కేవలం 64 గ్రాములు, ఘన పరిమాణం 3.8 ఘనపు సెంటీమీటర్లు మాత్రమే. ‘నాసా’ రిఫత్ ఘనతను గుర్తించింది. అందుకే వాలప్స్ ఐలాండ్‌లోని ‘నాసా’ ఉపగ్రహ ప్రయోగ కేంద్రం నుంచి అతడు రూపొందించిన ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రయోగించేందుకు ముందుకొచ్చింది. ఒక భారతీయ విద్యార్థి రూపొందించిన ఉపగ్రహాన్ని ‘నాసా’ ప్రయోగించడం చరిత్రలో ఇదే తొలిసారి. ‘స్పేస్ కిడ్స్ ఇండియా’ సౌజన్యంతో చేపట్టిన ప్రాజెక్టులో భాగంగా రిఫత్ దీనికి రూపకల్పన చేశాడు. త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ ద్వారా రీఇన్ఫోర్స్డ్ కార్బన్ ఫైబర్ పాలిమర్‌ను ఉపయోగించి, అరచేతిలో ఇమిడిపోయే ఈ ఉపగ్రహాన్ని తయారు చేశాడు. రిఫత్ రూపొందించిన ‘కలామ్‌శాట్’ ఉపగ్రహం ప్రపంచంలోనే అత్యంత తేలికైన, అత్యంత చిన్నదైన ఉపగ్రహంగా రికార్డులకెక్కింది. నానో టెక్నాలజీతో రూపొందించిన ‘కలామ్‌శాట్’ అంతరిక్షంలోని రేడియేషన్ పరిమాణాన్ని కొలవగలుగుతుంది. గుండెపోటు గుర్తించే స్కిన్‌ప్యాచ్ ప్రపంచంలోనే అత్యధిక మరణాలకు దారితీసే కారణాల్లో గుండెపోటుదే మొదటి స్థానం. గుండెపోటు లక్షణాలు బయటకు కనిపిస్తే, తగిన చికిత్స అందించడం ద్వారా ప్రాణాలను కాపాడేందుకు ఎంతో కొంత వీలు ఉంటుంది. కొన్నిసార్లు బయటకు ఎలాంటి లక్షణాలు లేకుండానే, అకస్మాత్తుగా వచ్చే గుండెపోటును ముందుగానే గుర్తించి, నివారించే మార్గమేదీ ఇంతవరకు అందుబాటులో లేకపోవడం ఆ పన్నెండో తరగతి కుర్రాడిని కుదురుగా ఉండనివ్వలేదు. గుండెపోటును ముందుగానే గుర్తించే అవకాశం ఉంటే ప్రపంచవ్యాప్తంగా ఎన్నెన్ని మరణాలనో నివారించవచ్చు కదా అని ఆలోచించాడు. తమిళనాడుకు చెందిన ఆకాశ్ మనోజ్ ఇదే దిశగా ప్రయోగాలు సాగించి, ముందస్తు సూచనలు లేకుండా వచ్చే గుండెపోటును ముందుగానే గుర్తించగల స్కిన్ప్యాచ్కు రూపకల్పన చేశాడు. దీనిని అమర్చుకోవడంలో ఎలాంటి నొప్పి, ఇబ్బంది ఉండదు. ఈ ప్యాచ్‌ను మణికట్టుకు లేదా చెవితమ్మ వెనుక వైపు అతికించుకుంటే చాలు. గుండెపోటుకు కారణమయ్యే ‘ఎఫ్‌ఏబీపీ3’ ప్రొటీన్ మోతాదుకు మించి ఉన్నట్లయితే వెంటనే అప్రమత్తం చేస్తుంది. అలాంటప్పుడు దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి వెళ్లి వైద్య సహాయం పొందినట్లయితే ప్రాణాలు దక్కించుకోవడానికి వీలు ఉంటుంది. అకస్మాత్తుగా వచ్చిన గుండెపోటు కారణంగా తన తాత కుటుంబ సభ్యుల కళ్లెదుటే పోయారని, అందుకే గుండెపోటు కారణంగా సంభవించే ఆకస్మిక మరణాలను వీలైనంత మేరకు నివారించడానికి ఏదైనా చేయాలనుకున్నానని చెబుతాడు ఆకాశ్ మనోజ్. తాను ఎనిమిదో తరగతిలో ఉన్నప్పటి నుంచే కార్డియాలజీ అధ్యయనం ప్రారంభించానని, ఇందుకోసం బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) లైబ్రరీలో గంటల కొద్దీ గడిపేవాడినని చెబుతాడు. ఢిల్లీలోని ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో చదువుకుని, అక్కడ పరిశోధనలు సాగించాలనేదే తన ఆశయమని చెబుతాడు ఆకాశ్. అతడు రూపొందించిన ఈ స్కిన్ ప్యాచ్‌పై వైద్య నిపుణులు క్లినికల్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆ పరీక్షల్లో ఆమోదం పొందితే ఇది త్వరలోనే అందుబాటులోకి రాగలదు. దీని ధర దాదాపు రూ.900 వరకు మాత్రమే ఉంటుంది. అంటే, సుగర్ టెస్ట్ కోసం ఉపయోగించే గ్లూకోమీటర్ కంటే చాలా చౌక. – పన్యాల జగన్నాథదాసు -
అసెంబ్లీలో తగ్గిన ‘యువ’ ప్రాతినిథ్యం
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ శాసనసభలో యువతకు ప్రాతినిధ్యం తగ్గింది. 25 నుంచి 40 ఏళ్ల మధ్య వయసుగల ఎమ్మెల్యేలు 2014 సభలో 12 మంది ఉండ గా, కొత్త శాసనసభలో వీరి సంఖ్య 5కు తగ్గింది. పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ ఈ మేరకు గురువారం ఒక నివేదిక విడుదల చేసింది. ఐదు రాష్ట్రాలకు కొత్త శాసనసభలు కొలువుదీరనున్న నేపథ్యంలో ఆయా గణాంకాలు విశ్లేషించింది. 61 శాతం ఎమ్మెల్యేలు తిరిగి ఎన్నికయ్యారని వివరించింది. గత సభలోని వారు 73 మంది తిరిగి ఎన్నికవగా 46 మంది కొత్తగా ఎన్నికయ్యారని తెలిపింది. 2014లో 9 మంది మహిళలు ఎన్నికవగా ఈసారి ఆ సంఖ్య 5 మాత్రమే. ఇక 41–55 మధ్య వయస్కుల్లో 2014లో 67 మంది ఎన్నికవగా.. ఈ సభలోనూ 67 మంది ఎమ్మెల్యేలు ఇదే కేటగి రీలో ఉన్నారు. 56–70 మధ్య వయస్కులు పాత సభలో 40 మంది ఉండగా, ఈసారి 45 మంది ఉన్నారు. 71 ఏళ్ల వయసు పైబడినవారు గత సభలో ఎవరూ లేరు. ఈసారి ఇద్దరు ఉన్నారు. విద్యకు సంబంధించిన గణాంకాలు పరిశీలిస్తే పోస్ట్ గ్రాడ్యుయేట్, ఆపైన విద్యార్హత ఉన్న వారి సంఖ్య 19 నుంచి 26కు పెరి గింది. డిగ్రీ విద్యార్హత కలిగిన వారి సంఖ్య 60 నుంచి 43కు తగ్గింది. 12వ తరగతి వరకు విద్యార్హత కలిగిన వారి సంఖ్య 37 నుంచి 45కు పెరిగింది. ఛత్తీస్‌గఢ్‌లో 25–40 మధ్య వయçస్కుల్లో గత సభలో కేవలం ఆరుగురు ఉండగా.. ఈసారి 25కు పెరిగింది. ఛత్తీస్‌గఢ్‌లో మహిళల ప్రాతినిధ్యం 10 నుంచి 13కు పెరి గింది. 90 స్థానాలకు 13 మంది మహిళల ప్రాతిని థ్యం ఉండటం విశేషం. మిజోరంలో మాత్రం గత సభలో ఒక మహిళా సభ్యురాలు ఉండగా ఈసారి ప్రాతినిధ్యం లేకపోవడం గమనార్హం. -
మత్తుకు ‘ఫిక్స్’
సత్తుపల్లి(ఖమ్మం): మత్తుకు అలవాటు పడి..కొందరు వింతగా చెప్పులు, ఎలక్ట్రికల్, ప్లాస్టిక్ వస్తువులను అతికించేందుకు వినియోగించే ‘బోన్‌ఫిక్స్’ అనే పదార్థాన్ని నిషాకు పీలుస్తున్నారు. ఒకప్పుడు తక్కువ అమ్మకాలు ఉండే బోన్‌ఫిక్స్ బేరాలు ఒక్కసారిగా జోరందుకున్నాయి. రూ.12 విలువ చేసే ఇది ఒక ద్రవ పదార్థంలాగా ఉంటుంది. దీనిని..గట్టి కాగితంలోకి తీసుకుని..ముక్కుతో పీల్చడం ద్వారా..ఒకేసారి పెగ్గుమద్యం తాగినంత నిషా ఉంటుందని కొందరు చెబుతుంటారు. మత్తుకు బానిసైన యువత రోజుకు మూడు నుంచి నాలుగు బోన్ఫిక్స్లు కొనుగోలు చేస్తున్నారు. కిట్టీ పార్టీల తరహాలో పార్టీలు జరుగుతున్నాయనే ప్రచారం ఉంది. సత్తుపల్లిలో ఎక్కువగా జోగుతున్నారని ప్రచారముంది. బోన్‌ఫిక్స్ లిక్విడ్‌ను పీల్చడం వల్ల ఒళ్లంతా మత్తులో తేలియాడుతుంది. దీంట్లో ఉండే ఆల్కాహాలిక్ మోతాదు నాడి వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. నరాలు, ఊపిరితిత్తులు దెబ్బతింటాయి. కంటిచూపు, శ్వాసకోశ వ్యాధులకు గురవుతారు. తక్షణం జ్ఞాపకశక్తిపై తీవ్ర ప్రభావం పడుతుంది. తల వెంట్రుకలు ఊడిపోతాయి. కండరాల నొప్పులు ఉంటాయి. మోతాదుకు మించి పీల్చడం వల్ల కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంది. దీని వాడటం వల్ల ఆయుష్షు క్షీణించి 5 నుంచి 10 ఏళ్లలోపే మృత్యువాత పడతారు. ముఖానికి కర్చీప్‌లు కట్టుకొని.. బోన్ఫిక్స్లోని అల్కహాల్ మోతాదుకు యువత మత్తులో జోగుతోంది. కేవలం రూ.12లకే లభిస్తుండటంతో మత్తు కోసం ఆశ్రయిస్తున్నట్లు పరిశీలనలో తేలింది. బోన్‌ఫిక్స్ ట్యూబ్‌లోని లిక్విడ్‌ను ఖర్చీప్‌లో వేసుకొని, ముక్కుకు దగ్గరగా గట్టిగా పీల్చుతూ.. అదే దస్తీని ముఖానికి కట్టుకొని తిరగుతుంటారు. ఇలాంటి మత్తు మందు వినియోగించే వారి ముఖం పాలిపోయి..పెదవులు పగిలిపోయి కన్పిస్తుంటారు. దేనిపైనా ఏకాగ్రత చూపించరు. ప్రతి చిన్నదానికి చిరాకు పడుతూ ఘర్షణలకు దిగుతుంటారు. ముఖ్యంగా వివిధ కారణాలతో సతమతమవుతున్నవారు, మద్యం, ఇతర మత్తు పదార్థాలకు అలవాటు పడిన వారు దీనికి బానిసలవుతున్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ మత్తు పొందొచ్చని ఇలా అలవాటుపడి అనారోగ్యం పాలవుతున్నారు. ముఖ్యంగా శివారు ప్రాంతాల్లో గుట్టుచప్పుడు కాకుండా ఇలా పీల్చేసి, మత్తులో జోగుతున్నట్లు తెలిసింది. పోలీసులు..దృష్టి పెడితే ఇలా పెడదోవపడుతున్న వారు అనేకమంది బయటపడతారని, విద్యార్థులు, యువకులు చెడిపోకుండా కాపాడవచ్చని పలువురు అంటున్నారు. సెమీడ్రగ్స్లా వాడుతున్నారు.. బోన్‌ఫిక్స్‌ను యువత మత్తుపదార్థంగా వినియోగిస్తున్నట్లు దృష్టికి వచ్చింది. సెమిడ్రగ్స్లా వాడుతున్నారు. బోన్ఫిక్స్పై నియంత్రణ అవసరం. కెమికల్ వాసనకు అలవాటుపడి బానిసలుగా మారుతున్నారు. దీని దుష్ప్రభావం నాడి వ్యవస్థపై పడి దెబ్బతింటుంది. ఇటీవలే ఇది వెలుగు చూడటంతో దీనిపై అధ్యయనం చేశాం. మనిషిని ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఇలాంటి మత్తు పదార్థాల వాడకం పట్ల అప్రమత్తత అవసరం. ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లల అలవాటుపై పూర్తిస్థాయి నిఘా పెడితేనే దీనిని నివారించవచ్చు. – డాక్టర్ పి.వసుమతీదేవి, ప్రభుత్వ వైద్యురాలు, సత్తుపల్లి నిఘా పెంచుతాం.. బోన్‌ఫిక్స్‌ను మత్తుపదార్థంగా వినియోగిస్తున్నారనే సమాచారంపై నిఘాను పెంచుతాం. పిల్లలను గమనిస్తూ ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. దీనిపై మాకు సమాచారం అందిస్తే నియంత్రణకు అవకాశం ఉంటుంది. – బి.రాంప్రసాద్, ఎక్సైజ్ సీఐ, సత్తుపల్లి -
నా చందమామ
ఖాళీగా ఉన్న ఆ రోడ్ల మీద డాడీతో చేతిలో చెయ్యేసి కబుర్లు చెప్తూ నడిస్తే ఎంత బాగుండు అనిపిస్తుంది. ఆ చందమామని చూస్తే అంత అందమైనది కదా, అబ్బాయా అమ్మాయా అని ఆలోచిస్తుంటా. అబ్బాయి అయితే బాగుండు అని చిన్న ఫీల్. కానీ అమ్మాయిలని పోల్చుతామే చందమామతో! ఏవేవో ఆలోచనలు చుట్టుముడుతున్నాయి. చందమామ లోపల ఒక ముసలావిడ ఉంటుందని మా అమ్మమ్మ చిన్నప్పుడు చెప్పేది. నిజంగా ఉంటుందా! ఉంటే ఎంత లక్కీనో కదా!ఆ ముసలావిడ ఆ చందమామని చూసి ప్రేమలో పడి, అక్కడకు వెళ్లి కూర్చుందా! ఎందుకు అతనికి అంత ఈగో! పాపం ఆమె ప్రేమని యాక్సెప్ట్ చెయ్యొచ్చు కదా. ఎంత దూరం నుంచి వచ్చిందో. యంగ్ ఏజ్‌లో వచ్చిందేమో ముసల్ది. ఏమో నాకు తెలీకుండానే వాళ్లిద్దరూ కబుర్లు చెప్పుకుంటున్నారేమో! ఆమె వల్లే అతను అప్పుడప్పుడు తెగ ప్రకాశిస్తాడేమో. తన వాడితో ప్రతి అమ్మాయీ ప్రేమలో పడిపోతోందని ఆమె బుంగ మూతి పెడితే సర్ది చెప్పడానికి అందరినీ వదిలేసి దాక్కుంటున్నాడేమో అప్పుడప్పుడు. అవును! ఒకవేళ చందమామ కూడా ముసలివాడే అయితే? ఏం పర్లేదు. జెమిని గణేశనే 70 ఏళ్ల వయసులో 35 ఏళ్ల అమ్మాయిని ఫ్లైట్ జర్నీ అయిపోయేలోపు పడేశాడు. పైగా ఆ అమ్మాయే ప్రపోజ్ చేసిందంట. ప్రేమ గుడ్డిది అని ఇందుకే అంటారేమో! ప్రేమకి వయసుతో సంబంధం లేదు. రాత్రిపూట ఇంత చక్కటి వెలుగినిస్తాడు నా చందమామ. ఎంత మంది మనసులు దోచుకున్నాడు. గొప్పవాడేగా మరి! ‘అవునూ! నీకేమనిపిస్తుంది చందమామని చూస్తే? తప్పకుండా జలస్ ఫీల్ అవుతావు! అబ్బాయిలందరూ అలాగే ఫీలవుతారులే. అందుకే అమ్మాయితో పోల్చేసుకొని సాటిస్ఫై అవుతారు. మరి అందమైన అబ్బాయిని ఎవరితో పోల్చాలని ఆలోచిస్తా. సూర్యుడు గుర్తొస్తాడు. అమ్మో! ఎప్పుడూనిప్పులు కక్కుతాడు. అతనలా ఎప్పుడూ ఎందుకు నిప్పులు కక్కుతాడో తెల్సా, అతనూ అబ్బాయేగా. సూర్యుడి మీద జలసీ’. ఒక్కోసారి అనిపిస్తుంది.... ఆ చందమామ నాతో వచ్చేయవచ్చు కదా అని. మళ్లీ ఆ వెంటనే నాకంటే ముందు ఎంతమంది ఎన్ని యుగాలనుంచి ఎదురుచూస్తున్నారో కదా అనిపిస్తుంది. కానీ ఎందుకో నేను తనని ఇప్పటికే చూశాననిపిస్తోంది. నిజం. ఆ చందమామ నా కంటబడ్డాడు. నేను చూశాను. నాకు మాత్రమే కనిపించాడు. ఎందుకంటావ్? మేబీ అందరికంటే నేనే అతన్ని ఎక్కువ ప్రేమిస్తున్నానేమో. నేను చందమామని చూసినరోజు చాలాసేపు ఆ నవ్వునే చూస్తూ, తనేనా కాదా అని ఆలోచిస్తూ ఉన్నా. సరిగ్గా కుదురుగా నిలబడి చూశా. తనే. తనే నేను రోజూ చూసి ఇష్టపడే చందమామ. ఏమని మాట్లాడాలి తనతో! అసలే సిగ్గుతో మురిసిపోతున్న నాకు చటుక్కున ఒక ఐడియా వచ్చింది. అది తన పుట్టినరోజు కదా, శుభాకాంక్షలు చెప్తే బాగుంటుందని. అదే తనతో నేను మాట్లాడిన మొదటిమాట. థ్యాంక్స్ చెప్పి వెళ్లిపోయాడు. ఇప్పుడేం చెయ్యాలి? తన పేరేంటో తెలీదు.చందమామ అని పిలిస్తే ఎలా ఉంటుంది? చుట్టూ లోకం ఏమనుకుంటుందో! వద్దు. పేరు కనుక్కొనే పిలుస్తా. అనుకున్న వెంటనే పక్కన ఉన్న కుర్రాడిని అడిగా. పేరు చెప్పాడు ఆ పిల్లాడు. పేరు వినగానే ఏదో ఫీల్ లోపల. ప్రేమే అయి ఉంటుంది కచ్చితంగా. కానీ ఎందుకు అంత టెక్కు చందమామకి? అలా వెళ్లిపోయాడు. తప్పులేదు. అసలే ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ కదా. మరి నాకేం తక్కువ? కనీసం తిరిగి చూడలేదు. పోనీలే! సిగ్గేమో. నేను ఎలాగూ మగాడిలా బిహేవ్ చేశానని భయపడ్డాడు కావొచ్చు. ఈసారి తన దృష్టిలో పడి ఎలా అయినా మార్కులు కొట్టేయాలని ఆతృత నాలో రోజురోజుకీ చాలా పెరిగిపోతోంది. నన్ను ఇంతకుముందు చూసి ఉంటాడా! కచ్చితంగా చూసే ఉంటాడు. అసలే బాగా వినిపించే పేరు నాది. అలా రెండు వారాలు గడిచాయి. ఇక లాభం లేదు. నేనే మొదలెట్టాలి అనుకున్నా. మొదలుపెట్టేశా మాట్లాడటం. అబ్బాయిలే పడిపోవాలి అమ్మాయిలని చూసి, అబ్బాయిలే ముందు మాట్లాడాలి అన్న యుగయుగాలుగా వస్తున్న ఆచారాన్ని బద్దలు కొట్టా. అసలే అక్కడ చందమామ. ఎలా పడిపోకుండా ఉంటా! గొప్పోడు కదా. తనకి ఎవరో చెప్పారంట ఒకమ్మాయి తనను ఇష్టపడుతోందని. ఆ అమ్మాయే ఇప్పుడు మాట్లాడుతోందంటే ఏమనుకున్నాడో ఏంటో. నాకేమో భయంగా ఉంది కానీ తను చాలా బాగా మాట్లాడాడు. అస్సలు ఊహించలేదు. నా చందమామతోనేనా నేను మాట్లాడింది అని గిల్లి చూసుకున్నా కూడా. రక్తమొచ్చే అంతలా గిల్లుకున్నా నమ్మకం కుదర్లేదు. మరి నేనెలా నమ్మేది? ఒక ఉపాయం తట్టింది. తనే నన్ను గిల్లితే నమ్ముతానేమో. అనుకున్నదే తడవుగా కలవాలని అడగటం మొదలుపెట్టా. ఏమనుకున్నాడో ఏమో ఒక రెండు రోజుల తర్వాత సరేనన్నాడు. నన్ను కరుణించాడనుకున్నా. ఎందుకో తెల్సా, ఆ ముసలావిడ కన్నా నేనే లక్కీ. నేను అంతదూరం వెళ్లాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇంకో ఆలోచనలో పడ్డాను. ఆ ముసలావిడ మళ్లీ మాట్లాడి నా చందమామను లాక్కొనిపోతే!?లక్కీగా ముహూర్తం పెట్టినట్టే పండగరోజు కలిశాం. ఆ రోజు తనని మళ్లీ చూసే అవకాశంలో ఉన్న ఆనందం కొన్ని కోట్లు పెట్టి కొనుక్కున్నా రాదేమో. అంతలా ప్రేమించా అతణ్ని. మా అమ్మమ్మ ట్రైనింగే ఇదంతా. ఆమె గోరుముద్దలు తినిపిస్తూ మరీ అతణ్ని చూడమనేది. ఆరుబయట పడుకున్నప్పుడు కూడా వదలడే ఈ అబ్బాయి. ఇంట్లో అందరూ కలిసి నన్ను అతని ప్రేమలోకి తోశారు. ఆ రూపం ఇప్పుడు కళ్లముందు. ఎలా ఆపాలి సిగ్గును. పొంగి పొర్లుతోంది. పండగరోజు కదా, పైగా అమ్మాయిలు అంటేనే తెగ రెడీ అయిపోతారు. ఆ రోజేంటో మరీ మరీ బాగా రెడీ అయి మెరిసిపోయా. తనకోసం ఎదురుచూసిన ప్రతి సెకండ్లో ఎంత మురిసిపోయానో. రానే వచ్చాడు నా చందమామ. తనతో తన పక్కనే కూర్చున్నాను. ఏంటో మరి, రాజు పక్కన రాణి కూర్చున్నంతలా ఫీలయ్యా. నేను రాణి కాకపోయినా తను రాజే! అదే చిరునవ్వు. నన్ను తెగ కవ్వించేస్తోంది. బోలెడు కబుర్లు చెప్పుకున్నాం. మళ్లీ కలుస్తాడో లేదో. తన ఇష్టాలు తెలుసుకోవాలన్న ఆత్రుత. తన జీవితంలో జరిగిందంతా ఒక్క మీటింగ్‌లో తెలుసుకోవాలనే పిచ్చి. ఇన్ని రోజులు పైన ఉండి ఆ ముసలావిడ కబుర్లు విని విని బోర్ కొట్టేసినట్టుంది. నా మాటలు బాగానే విన్నాడు. తెగ సంతోషమేసింది. వెళ్లిపోదామని ఎక్కడ అంటాడోనని ఒక భయం నన్ను కలచివేస్తోంది. దాన్ని నా చిరునవ్వుతో కప్పేశా. తనేం చెప్పాడో నాకు తెలియదు కానీ నేను మాత్రం నా గురించి పూర్తిగా చెప్పేశా. ఎవరో అబ్బాయి చటుక్కున మా మాటల మధ్యలో దూరి, ‘‘నువ్వు చాలా అందంగా ఉన్నావు’’ అన్నాడు. అంతే! తన ముందు నన్నొకరు పొగిడారని ఆనందపడ్డాను. మార్కులు కొట్టేయాలిగా మరి! ఇంతలో ఒక అందమైన అమ్మాయి వచ్చి తనతో చనువుగా మాట్లాడటం చూశా. అసూయ కలిగింది. సెకండ్లో నా చిన్ని బుర్రలో వేల ప్రశ్నలు వెలువడ్డాయి. ఆ అమ్మాయి తనకి ఎలా తెలుసు? అసలే చనువుగా మాట్లాడింది, ఏమో ఏంటో అనే ఆలోచన. ఎందుకంటే నా వాడు అని ఫిక్స్ అయిపోయా కదా, ఊహ తెలిసిన దగ్గర్నుంచి. అసలే నాకు మనసులో అనుకున్నది బయటకు చెప్పేవరకు నిద్రపట్టదు. అడిగేశాను. వాళ్ల పరిచయం పెద్దగా లేదని అర్థమైంది. ఊపిరి పీల్చుకున్నాను. ఎన్ని సంవత్సరాలైనా అక్కడే కూర్చుని కబుర్లు చెప్పాలనిపించింది. కానీ వెళ్లిపోవాల్సిన సమయం వచ్చేసింది. అదేదో ‘అర్జున్ రెడ్డి’ సినిమా అంట. జనాలు తెగ హుషారుగా ఉన్నారు చూడటానికి. చందమామకి కాల్ వచ్చింది. ‘‘థియేటర్ వాడు టికెట్స్‌కి ఓకే చెప్పాడు, ఇక వెళ్లిపోవాలి’’ అన్నాడు నాతో. నన్ను కూడా తనతో తీసుకెళ్తే ఎంత బాగుండు అనుకున్నాను. కానీ అది ‘ఏ’ రేటెడ్ సినిమా. మామూలుగా సినిమాలో హీరో, హీరోయిన్లు ముద్దు పెట్టుకుంటేనే నేను కళ్లు మూసుకుంటా. ఇక తన ఆ సినిమాకు వెళ్లాలా? ఆలోచిస్తున్నా. అప్పుడే నా కోతిమూక కూడా మెసేజ్ చేసింది, సినిమాకు వెళ్దాం అని. గంతులేశా తనను మళ్లీ చూడొచ్చని. పిచ్చి జనాలు చందమామను వదిలేసి ఎవర్నో చూడటానికి వెళ్తున్నారు. నేను మాత్రం తనని మరొకసారి చూడొచ్చని వెళ్దామనుకున్నా. కూర్చున్న చోటు నుండి బయటకు కదిలాం. ఆ రోజు తారీఖు 25. సరిగ్గా తనతో వేసిన అడుగులు 7. విచిత్రం 2+5=7. నా పిల్లతనానికి నవ్వొచ్చింది. నాలుగు గంటలు తనతో ఎలా గడిచాయో ఏంటో కానీ తనతో నడిచిన ఆ కొన్ని క్షణాలు నాలో ఒక నమ్మకాన్ని పెంచాయి. గబగబా వెళ్లి పొద్దున నుండి ఒంటి మీద వేసుకున్న బరువుని తీసేసి ఎప్పట్లాగే మగరాయుడిలా తయారై బయలుదేరా. సినిమా హాల్ లోపలికి వెళ్లగానే ఆ అబ్బాయే కనిపించాడు. నా చందమామ. అతని వెనక రెండో వరుసలో నా సీట్. సినిమా స్టార్టయింది. హీరో బాగున్నాడు కానీ ముందు కూర్చున్న నా చందమామ నుండి స్క్రీన్ మీదకు నా కళ్లు పోలేదు. తన వీపుకి నా చూపులు గుచ్చుకున్నాయో లేదో తెలియదు కానీ సినిమా అయిపోయేంతవరకు నా చూపులు తన వైపే! పక్కనే ఉన్న స్నేహితులు ఏమనుకుంటారో అని ఒక్కోసారి స్క్రీన్ వైపు కూడా చూశాను. వాళ్లు నవ్వుతున్నప్పుడు అర్థం కాకపోయినా నేను కూడా నవ్వాను. సినిమా అయిపోయింది.అందరం వెళ్లిపోయాం. ఎంత నిరాశ కలిగిందో, రాత్రి తనని చూడలేదని. అలా బయట కూర్చొని పైకి చూశా. ఏదో ఆకారం కనిపించింది. చూస్తే చందమామ. మరి ఇక్కడ ఉన్నదెవరు? నేను చెప్పిన మాటలు నచ్చలేదేమో అందుకే ముసలావిడ దగ్గరకు మళ్లీ వెళ్లిపోయాడనే బాధ. మెసేజ్ చేశాను రూమ్‌కి వెళ్లి. మళ్లీ బాగా మాట్లాడాడు. నా ఆనందానికి హద్దులు లేవు ఇక. ఆరోజు మా ఇద్దరి మధ్య జరిగిన ఒక నాలుగు గంటల సంభాషణని చుట్టూ లోకం అదేదో తప్పులా చూసింది. అందువల్ల చందమామ చాలా ఎఫెక్ట్ అయినట్టున్నాడు. నాతో సరిగ్గా మాట్లాడటం మానేశాడు. చూడు లోకం ఎంతమంది పాపాత్ములతో నిండిపోయిందో అనుకున్నాను. అనవసరంగా చందమామ కిందకి వచ్చాడే... అనుకున్నాను. నా వల్ల తను ఇబ్బంది పడుతున్నాడు. ప్రతి క్షణం ఇదే ఆలోచన. తనకు అర్థమయ్యేలా చెప్పాలనుకున్నాను. అలా రోజులు గడిచాయి. ఒకరోజు చందమామను ఆపి చెప్పాను – ‘‘ఇక పైన నేను నిన్ను చూడను. మాట్లాడను’’ అని. ఏదో చెప్పాను కానీ ప్రతిరోజూ తనని తల్చుకుంటూనే బతికాను కొన్నిరోజులపాటు. ఎప్పుడు కనిపిస్తాడా అని నా కళ్లు వెతకని చోటు లేదు. కొన్ని నెలలు గడిచాయి. ఒకరోజు చందమామ నుండి కబురొచ్చింది. పట్టలేనంత ఆనందం. ఎందుకు నాకు మాత్రమే ఏదేదో అయిపోతోంది? తన నుండి కబురొచ్చిన ప్రతివారికీ ఇలానే అవుతుందా, నాకు మాత్రమేనా! మరి నా జవాబు కోసం అతను పరితపిస్తున్నాడా లేదా!ఏదయితే అనుకున్నానో అలాగే జరిగింది. తనేమీ పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఆ రోజు మొదలైంది మళ్లీ. తను వేరే ఏదో దేశంలో ఉన్నాడంట. నాకు మాత్రం తను మాట్లాడే మాటలకు నా పక్కనే ఉన్నట్టు ఉంది. ఎంత ముద్దు చేస్తున్నాడో నన్ను. ఆ రోజు సాయంత్రం మొదలు తెల్లవారుజామున కోడి కూసే వరకూ ముచ్చట్లే ముచ్చట్లు. ఎన్నో మాట్లాడుకున్నాం. ఈసారి ఒకర్ని ఒకరం ఎక్కువ తెలుసుకున్నాం. తనకి కూడా నేనంటే ఇష్టమని తెలిసింది. కానీ అది ప్రేమ మాత్రం కాదు. ఆ తియ్యటి చేదు మాటలు కొత్త రుచిని చూపించాయి. చందమామ ముఖం చూస్తే చాలు, అన్నం తినకున్నా కడుపు నిండిపోయేది. రాత్రి మాత్రమే కబుర్లు చెప్పేవాడు ఆ చందమామ. మరి పొద్దున చెప్పడే! సూర్యుడనే ఈ లోకానికి భయపడి దాక్కుంటున్నాడు. ఏ మచ్చలేని చందమామ అనుకున్నాను కానీ నిజం కాదని అతనే చెప్పాడు. ఆశలు నిరాశలు చేశాడు. కానీ నా ముందు తన నిజస్వరూపం చూపించాడనే ఒక విషయం నన్ను మళ్లీ తన ప్రేమలో పడేలా చేసింది. తనకి నచ్చినట్టుగా ఉండటం నాకు సంతోషాన్నిచ్చేది. ఎందుకంటే ఆ కొద్దిసేపు మాట్లాడే రాత్రుళ్లు కూడా ఎక్కడ మాట్లాడకుండా పోతాడో అని. అసలే ఎంతో మంది కాచుకు కూర్చున్నారు చందమామ కోసం! వదిలేసానో చేతికి చిక్కడు మళ్లీ. నాలో ఓపిక నశించింది. ఎలా అయినా తెలుసుకోవాలి తనలో కొద్దిగా అయినా నా మీద ప్రేమ ఉందా అని అనిపించింది. అది తెలుసుకునే ప్రయత్నంలో నన్ను నేను కోల్పోయాను. చందమామ మళ్లీ మాట్లాడటం మానేశాడు. ఎన్నిరోజులు ఇలా బతకడం అనిపించింది. ఎంతోమంది చెప్పారు, చందమామకి ఇంకెవరో ఇష్టమని. స్వచ్ఛమైన ప్రేమ కదా, ఆ విషయం తెలిసినా కూడా ఏం మాట్లాడలేకపోయా. మళ్లీ నెలలు గడిచాయి. నేను చందమామని మర్చిపోయే పనిలో ఉన్నా. అలా అనుకున్నాను కానీ తనని మర్చిపోవడం ఎలా జరుగుతుంది? రోజూ అలా కనిపిస్తుంటే ఆకాశంలో! చుట్టూ ఎన్నో నక్షత్రాలు ఉన్నాయి. మరి అవేం తక్కువ తిన్నాయి? అవి కూడా బాగానే ఉన్నాయిగా. మరి నేను మాత్రమే ఎందుకు చందమామ వెంటనే పడుతున్నా అనుకుని ఈసారి నక్షత్రాలని చూద్దామనుకున్నా. కానీ వాటిని చూసే ప్రతిసారీ ఏదో తెలియని వెలితి. ఒక్క రోజు చందమామని చూడకపోతే ఊపిరి ఆడేది కాదు. ఎందుకో తెలీదు, అతడు ఏం చేసినా మౌనంగా ఉండిపోతాను. ఈసారి చందమామ నుండి వేసవి కాలంలో కబురొచ్చింది. వెన్నెలలా మారి నాకు తెలియని మత్తులో ముంచాడు. ఆ తర్వాతే తెలిసింది. నాది ప్రేమ. తనది లస్ట్. రెండిటి మధ్యలో చివరికి ఏది గెలుస్తుందో చూడాలి! - స్నేహారెడ్డి (ఢిల్లీ) -
పాతికేళ్లకే టీబీ
ఒకప్పుడు రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వృద్ధులు, చిన్నారులు, ఎయిడ్స్ రోగుల్లో మాత్రమే టీబీ లక్షణాలు కన్పించేవి. అయితే ప్రస్తుత వాతావరణ కాలుష్యం.. చిన్న తనంలోనే స్మోకింగ్‌కు అలవాటు పడటం, విటమిన్ డి లోపం తదితర కారణాలతో యుక్తవయసులోనే వెలుగు చూ స్తుండటంపైసర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ నెల 24న ప్రపంచటీబీ దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం..! సాక్షి, సిటీబ్యూరో: ఓ వైపు నగరాన్ని స్వైన్‌ఫ్లూ, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వణికిస్తుండగా ఇప్పుడా స్థానాన్ని ట్యూబరిక్లోసిస్(టీబీ)ఆక్రమించింది. నగరంలో క్షయ బాధితుల సంఖ్య నానాటికి పెరుగుతుండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. అధికారిక లెక్కల ప్రకారం గ్రేటర్లో ఏటా కొత్తగా సుమారు 15 వేల కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. అనధికారికంగా ఈ సంఖ్య రెట్టింపు స్థాయిలో ఉన్నట్లు సమాచారం. ఎయిడ్స్, గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్, మధుమేహం తర్వాత అత్యంత ప్రమాదకరమైన జబ్బుగా క్షయను పరిగణిస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో లక్ష మందికి పైగా ఎయిడ్స్ రోగులు ఉండగా, వీరిలో మూడొంతుల మంది టీబీతో బాధపడుతున్నట్లు ఎర్రగడ్డ ఛాతి ఆస్పత్రి వైద్యుల సర్వేలో వెల్లడైంది. గతేడాది హైదరాబాద్‌లో 7 వేలు, రంగారెడ్డి జిల్లాలో 6 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. బాధితుల్లో 40 ఏళ్లలోపు వారే ఎక్కువగా ఉండటం విశేషం. వీరిలో 12 ఏళ్లలోపు వారు 10 శాతం ఉంటే, 25–50 ఏళ్లలోపు వారు 60 శాతం మంది ఉన్నారు. 50 ఏళ్లు పైబడిన వారిలో 40 శాతం మంది ఉన్నారు. హైదరాబాద్ జిల్లాలో 41, రంగారెడ్డిలో 48 క్షయ నిర్ధారణ కేంద్రాలు ఉండగా, వీటిలో చాలా చోట్ల ల్యాబ్ టెక్నిషియన్లు లేరు. వ్యాధి నిర్ధారణకు అవసరమైన వైద్య పరికరాలు అందుబాటులో లేకపోవడం గమనార్హం. ఒకరి నుంచి 15 మందికి..: ప్రపంచ వ్యాప్తంగా ఏటా కొత్తగా తొమ్మిది మిలియన్ల మంది టీబీ బారిన పడుతుండగా వీరిలో సుమారు 1/3 వంతు బాధితులు మన దేశంలోనే ఉన్నారు. ప్రపంచంలోనే టీబీ ఎక్కువ ఉన్న దేశం మనదే కావడం గమనార్హం. దేశంలో ప్రతి సెకనుకు ఒకరు టీబీ బారిన పడుతుండగా, ప్రతి మూడు నిమిషాలకు ఇద్దరు చొప్పున..రోజుకు వెయ్యి మంది చనిపోతున్నారు. ఈ లెక్కన్న దేశంలో ఏటా మూడు లక్షల మంది టీబీతో మృత్యువాత పడుతున్నట్లు గణాంకాలు పేర్కొంటున్నాయి. ఒక్కో టీబీ రోగి తను చనిపోయేలోగా మరో 15 మందికి వ్యాధిని వ్యాపింపజేస్తున్నాడు. సంతానలేమితో బాధపడుతున్న చాలా మందిలో గర్భాశయ టీబీ కనుగొనబడుతుంది. టీబీ సోకిన వ్యక్తి మాట్లాడినప్పుడు, తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు బ్యాక్టీరి యా వాతావరణంలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఒకరి నుంచి మరొకరికి విస్తరిస్తుంది . ఇలా ఒకసారిగాలిలో కి ప్రవేశించిన బ్యాక్టీరియా 18–20 గంటల పాటు జీవిస్తుంది. ప్రతి వ్యక్తికి టీబీ ఉన్నా, రోగ నిరోధక శక్తి తగ్గినప్పుడు మాత్రమే అది బయట పడుతుంది. మనిషి శరీరంలో ఎంత కాలమైనా ఇది జీవిస్తుంది. శీతల గదిలో 8–10 రోజులు జీవిస్తుంది. గోర్లు, వెంట్రుకలకు మినహా శరీరంలోని అన్ని అవయవాలకు టీబీ సోకుతుంది. లక్షణాలు ఇలా గుర్తించవచ్చు ♦ సాయంత్రం, రాత్రిపూట తరచూ జ్వరం రావడం, రాత్రిపూట చెమటలు పట్టడం. ♦ ఆకలి, బరువు తగ్గడం, నీరసం,ఆయాసం, ఛాతిలో నొప్పి ఉంటుంది. ♦ తెమడ పరీక్ష ద్వారా వ్యాధినినిర్ధారిస్తారు. ♦ ఆరు మాసాలు విధిగా మందులువాడాలి. ♦ బహిరంగ ప్రదేశాల్లో తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు చేతి రుమాలు వాడాలి. ♦ బలవర్థకమైన ప్రొటీన్ల(గుడ్లు, పప్పు, పాలు)తో కూడిన ఆహారం తీసుకోవాలి. ♦ వ్యక్తిగత పరిశుభ్రత, సాంఘిక స్పహ కలిగి ఉండాలి.– డాక్టర్ రమణప్రసాద్, కిమ్స్ -
దేశంలో అతిపిన్న వయసున్న మంత్రిని నేనే
పర్చూరు: భారతదేశంలో అతి తక్కువ వయసున్న మంత్రిని తానేని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారు. 34 ఏళ్ల వయసుకే తాను మంత్రి అవుతానని ఏనాడూ ఊహించలేదన్నారు. మంత్రి గా బాధ్యతలు చేపట్టిన అనంతం లోకేష్ తొలిసారిగా మంగళవారం ప్రకాశం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్బంగా మార్టూరులో ఏర్పాటు చేసిన సభలో లోకేష్ మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో 794 కిలోమిటర్లు మేర సీసీ రోడ్లు వేశామన్నారు. జిల్లాలో వంద శాతం సీసీ రోడ్లు వేయాలంటే 1200 కిలోమీటర్లు వేయాలని 2019 నాటికి సీసీ రోడ్లు పూర్తి చేస్తామన్నారు. చెత్త పేరుకుపోకుండా 2018 నాటికి రాష్ట్రంలోని 12,918 గ్రామాల్లో డంపింగ్ యార్డులు పూర్తి చేస్తామన్నారు. ఐదు వేల జనాభా వున్న గ్రామాల్లో భూగర్భ డ్రైనేజీ నిర్మాణం చేపడతామన్నారు. అంతకు ముందు ఆయన మార్టూరు మండలం కోనంకి గ్రామంలో ప్రయోగాత్మకంగా చేపట్టిన ఘన వ్యర్థాల నుంచి వర్మి కంపోస్టు యూనిట్ పరిశీలించారు. గ్రామంలో ఎన్టీఆర్ గృహ నిర్మాణాల కోసం శంకుస్థాపన చేసి, లేఅవుట్ పత్రాలను పంపిణీ చేశారు. గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుసాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం అద్దంకి నియోజకవర్గ ంలో పర్యటించారు.