భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి, ప్రముఖ పారిశ్రామిక వేత్త 'రతన్ టాటా' (Ratan Tata) ఈ రోజు ఎలా ఉంటాడనేది అందరికి తెలుసు. అయితే ఒకప్పుడు యువకుడుగా ఉన్న సమయంలో ఎలా ఉండేవాడని చాలా మందికి తెలియకపోవచ్చు. టాటా గ్రూప్ ఉన్నతికి ఎంతో కృషి చేసిన ఈయన యంగేజ్‌లో హీరోలా ఉండటం ఇక్కడ చూడవచ్చు.
కరోనా సమయంలో దేశ ప్రజల కోసం వేల కోట్లు వెచ్చించిన ఈ నిరాడంబరురుని సేవను గుర్తించిన భారత ప్రభుత్వం పద్మవిభూషణ్, పద్మభూషణ్ పురస్కారాలను కూడా ప్రధానం చేసింది. సామాన్య ప్రజలకు సైతం కారు అందుబాటులో ఉండాలనే సదుద్దేశ్యంతో నానో కారుని ప్రవేశపెట్టిన ఘనత కూడా ఈయన సొంతమే.
ఇదీ చదవండి: ఇంటర్నెట్‌ని షేక్ చేస్తున్న దుబాయ్ షేక్ కారు.. వీడియో వైరల్
ప్రస్తుతం టాటా నానో ఎలక్ట్రిక్ కారుగా విడుదలకావడానికి సిద్దమవుతున్నట్లు సమాచారం. రతన్ టాటా కలల కారు ఎలక్ట్రిక్ వెర్షన్‌లో విడుదలైతే బడా సంస్థలకు కూడా గట్టిపోటీ ఇస్తుండటంలో ఎటువంటి సందేహం లేదు. ఎనిమిది పదుల వయసు దాటిన తరువాత కూడా దేశం కోసం ఆలోచించే మహానుభావుడు రతన్ టాటా అనటంలో ఎటువంటి సందేహం లేదు.
Comments
Please login to add a commentAdd a comment