ఇక్కడ ఫొటోలో చూడగానే ఎక్కడో చూసామనే భావన చాలా మందికి కలుగుతుంది. పుస్తకం చేతపట్టిన సరస్వతీ పుత్రుడుగా కనిపించే ఈయన దేశం గరించదగ్గ మహానుభావుడు, ఉన్నదాంట్లో అంతా దానం చేయగల విశాలమైన హృదయం ఉన్న వ్యక్తి. ఇప్పటికే ఈయనవరో దాదాపు అర్థమైపోయి ఉంటుంది. ఆయనే మన 'రతన్ టాటా'.
ప్రముఖ పారిశ్రామిక వేత్త, పరోపకారి, టాటా సన్స్ మాజీ ఛైర్మన్ 'రతన్ టాటా' గురించి భారతదేశంలో మాత్రమే కాకుండా.. ప్రపంచంలోని చాలా దేశాల ప్రజలకు తెలుసు. 1990 నుంచి 2012 వరకు టాటా గ్రూప్‌కు ఛైర్మన్‌గా ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చిన ఈయన 2016 అక్టోబర్ నుంచి 2017 ఫిబ్రవరి వరకు కంపెనీ కంపెనీ తాత్కాలిక ఛైర్మన్‌గా ఉన్నారు.
1937 డిసెంబర్ 28న పార్సీ జొరాస్ట్రియన్ కుటుంబంలో జన్మించిన రతన్ టాటాకు 10 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు, అతని తల్లిదండ్రులు విడిపోయారు, ఆ తరువాత ఆయన్ను అమ్మమ్మ నవాజ్‌బాయి పెంచారు. చదువు పూర్తయిన తరువాత టాటా గ్రూప్‌లో అడుగుపెట్టి అంచెలంచెలుగా ఎదిగారు.
రతన్ టాటా చాలా వరకు ఎక్కువ మొత్తంలో డబ్బును సమాజ సేవకు వెచ్చిస్తారు. విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి వంటి వాటికి ఎక్కువ ఖర్చు చేసి వాటి పురోగతికి పాటు పడ్డారు, భారతదేశంలో కరోనా విజృంభించిన సమయంలో వేలకోట్లను విరాళంగా ఇచ్చి తన ఉదారతను మరోసారి చాటుకున్నారు.
ఇదీ చదవండి: యూపీఐ పేమెంట్స్ ఏ దేశాల్లో చేయొచ్చో తెలుసా..
పారిశ్రామిక రంగంలో రతన్ టాటా చేసిన కృషి అనన్య సామాన్యం.. ఆయన దాతృత్వం అపారం. ఇవన్నీ గుర్తించిన భారత ప్రభుత్వం రతన్ టాటాకు 2000లో పద్మభూషణ్, 2008లో పద్మవిభూషణ్ అవార్డులతో సత్కరించింది. ఇవి మాత్రమే కాకుండా ఈయనకు 2006 మహారాష్ట్ర భూషణ్, దశాబ్దపు పరివర్తన నాయకుడు, ఓస్లో బిజినెస్ ఫర్ పీస్ అవార్డు వంటి లెక్కకు మించిన అవార్డులు ఆయన్ను వరించాయి.
Comments
Please login to add a commentAdd a comment