దివంగత పారిశ్రామిక దిగ్గజం.. టాటా గ్రూప్ మాజీ చైర్మన్ రతన్ టాటా వారసుడిగా 'నోయల్ టాటా' ఇప్పటికే నియమితులయ్యారు. అయితే తాజాగా ఆయన టాటా సన్స్ బోర్డులో అడుగుపెట్టారు. ఈ విషయాన్ని బోర్డు అధికారికంగా వెల్లడించింది.
2011 తర్వాత టాటా సన్స్, టాటా ట్రస్ట్ బోర్డులు రెండింటిలోనూ టాటా కుటుంబ సభ్యుడు స్థానం పొందడం ఇదే మొదటిసారి. కాబట్టి ఇది ఒక ముఖ్యమైన ఘట్టాన్ని సూచిస్తుంది. టాటా సన్స్‌లో 66 శాతం వాటాను కలిగి ఉన్న టాటా ట్రస్ట్స్, ఇప్పుడు నోయెల్ టాటా సారథ్యంలో ముందుకు సాగుతుంది. నోయెల్ టాటా సర్ రతన్ టాటా ట్రస్ట్, సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్ బోర్డులలో కూడా పనిచేస్తున్నారు.
ఉప్పు నుంచి టెక్నాలజీ వరకు అన్ని రంగాల్లో టాటా గ్రూప్ వ్యాపార సామ్రాజ్యం విస్తరించి ఉంది. ఇప్పటి వరకు నోయల్ టాటా.. టీటా గ్రూపుకు చెందిన రిటైల్ బిజినెస్ చూసుకున్నారు. ఇకపైన టాటా వ్యాపార సామ్రాజ్యాన్ని నడిపించనున్నారు.
ఎవరీ నోయల్ టాటా
నోయల్ టాటా.. రతన్ టాటా సవతి తల్లి సిమోన్ టాటా కుమారుడు. టాటా ఇంటర్నేషనల్‌లో కెరియర్ ప్రారంభించిన నోయెల్ 1999లో రిటైల్ వ్యాపారం ట్రెంట్‌కి మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. నోయల్ టాటా గ్రూపుతో 40 సంవత్సరాల అనుభవం ఉంది. కంపెనీలోని వివిధ బోర్డుల్లో వివిధ పదవులను నిర్వహించారు. అప్పటికి కేవలం ఒకటే స్టోర్ ఉన్న ట్రెంట్.. నోయల్ సారథ్యంలోకి వచ్చాక గణనీయంగా వృద్ధి చెంది 700 పైచిలుకు స్టోర్స్‌కి విస్తరించింది. ముఖ్యంగా వెస్ట్‌సైడ్ రిటైల్ చెయిన్‌ను కొనుగోలు చేసిన తర్వాత ఇది మరింత వేగవంతమైంది.
ఇదీ చదవండి: రూ. 34కే బియ్యం.. మళ్ళీ భారత్ బ్రాండ్ సేల్స్
2003లో వోల్టాస్, టైటాన్ ఇండస్ట్రీస్ డైరెక్టర్‌గా ఆయన కొత్త బాధ్యతలు చేపట్టారు. టాటా ఇంటర్నేషనల్ ఆయన సారథ్యంలో 500 మిలియన్ డాలర్ల టర్నోవర్ నుంచి 3 బిలియన్ డాలర్లకు ఎదిగింది. ప్రస్తుతం ట్రెంట్, టాటా ఇంటర్నేషనల్, వోల్టాస్ అండ్ టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్లకు చైర్మన్‌గా, టాటా స్టీల్, టైటాన్‌లకు వైస్ చైర్మన్‌గా నోయెల్ వ్యవహరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment