సర్ రతన్ టాటా ఇండస్ట్రియల్ ఇనిస్టిట్యూట్ (SRTII) ట్రస్టీల బోర్డులో టాటా ట్రస్ట్ చైర్మన్ నోయెల్ టాటా కుమార్తెలు మాయ, లేహ్ నియమితులయ్యారు. వీరిరువురు అర్నాజ్ కొత్వాల్, ఫ్రెడ్డీ తలతి స్థానంలో బాధ్యతలు చేపట్టనున్నారు.
మాయ, లేహ్ టాటాల నియామకం అర్నాజ్ కొత్వాల్‌తో అంతర్గత విభేదాలకు దారితీసింది. టాటా ట్రస్ట్స్‌లో ఎగ్జిక్యూటివ్‌గా ఉన్న 'తారాపోరేవాలా'కు పంపిన ఈమెయిల్‌లో, నోయెల్ టాటా పట్టుబట్టడంతో.. అతను కోరినట్లుగా ఆమె రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఇదే సమస్యకు సంబంధించి సర్ దొరాబ్జీ.. టాటా ట్రస్ట్ అండ్ సర్ రతన్ టాటా ట్రస్ట్ ట్రస్టీ అయిన మెహ్లీ మిస్త్రీ నుంచి కూడా తనకు కాల్ వచ్చిందని కూడా ఆమె పేర్కొన్నారు. దీనిపై టాటా ట్రస్ట్‌లు స్పందించ లేదు.
SRTII అనేది సర్ రతన్ టాటా ట్రస్ట్ యూనిట్, ఇది మహిళలకు ఉపాధి కల్పించే లక్ష్యంతో పనిచేస్తోంది. రతన్ టాటా మరణానంతరం అక్టోబర్‌లో టాటా ట్రస్ట్‌ల ఛైర్మన్‌గా నియమితులైన నోయెల్ టాటాకు.. లేహ్ (39), మాయ (36), నెవిల్లే (32) ముగ్గురు పిల్లలు. వీరు టాటా ట్రస్ట్‌లలో ఇప్పటికే వివిధ బాధ్యతలను నిర్వర్తించారు.
లేహ్ టాటా
లేహ్ టాటా.. ఇండియన్ హోటల్స్ కంపెనీలో వైస్ ప్రెసిడెంట్. అంతే కాకుండా ఈమె గేట్‌వే హోటల్స్ బ్రాండ్‌ను నిర్వహిస్తోంది. టాటా సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్, టాటా ఎడ్యుకేషన్ ట్రస్ట్, జేఆర్డీ అండ్ థెల్మా జే టాటా ట్రస్ట్ బోర్డులలో కూడా ఉన్నారు.
మాయ టాటా
మాయా టాటా.. టాటా క్యాపిటల్‌లోని ప్రముఖ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్, టాటా ఆపర్చునిటీస్ ఫండ్‌లో తన వృత్తిని ప్రారంభించింది. ఆమె టాటా ఎడ్యుకేషన్ ట్రస్ట్, ఆర్‌డీ టాటా ట్రస్ట్ మరియు జెఆర్‌డి మరియు థెల్మా జే టాటా ట్రస్ట్ బోర్డులలో పని చేస్తున్నారు.
నెవిల్లే టాటా
నెవిల్లే టాటా గత సంవత్సరం టాటా గ్రూప్ రిటైల్ వ్యాపారాలను కలిగి ఉన్న ట్రెంట్ హైపర్ మార్కెట్ యూనిట్.. స్టార్ బజార్ అధిపతిగా బాధ్యతలు స్వీకరించారు. అతను టాటా సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్, జేఆర్డీ టాటా ట్రస్ట్ అండ్ ఆర్డీ టాటా ట్రస్ట్ బోర్డులలో ఉన్నారు.
నోయల్ టాటా
దివంగత పారిశ్రామిక దిగ్గజం.. టాటా గ్రూప్ మాజీ చైర్మన్ రతన్ టాటా వారసుడిగా 'నోయల్ టాటా' ఇప్పటికే నియమితులయ్యారు. అయితే ఆయన టాటా సన్స్ బోర్డులో కూడా అడుగుపెట్టారు. 2011 తర్వాత టాటా సన్స్, టాటా ట్రస్ట్ బోర్డులు రెండింటిలోనూ టాటా కుటుంబ సభ్యుడు స్థానం పొందడం ఇదే మొదటిసారి. కాబట్టి ఇది ఒక ముఖ్యమైన ఘట్టాన్ని సూచిస్తుంది.
ఇదీ చదవండి: ఆర్‌బీఐ కీలక నిర్ణయం.. ఆలస్యమైతే రోజుకు రూ.100
టాటా సన్స్‌లో 66 శాతం వాటాను కలిగి ఉన్న టాటా ట్రస్ట్స్, ఇప్పుడు నోయెల్ టాటా సారథ్యంలో ముందుకు సాగుతుంది. నోయెల్ టాటా సర్ రతన్ టాటా ట్రస్ట్, సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్ బోర్డులలో కూడా పనిచేస్తున్నారు. ఉప్పు నుంచి టెక్నాలజీ వరకు అన్ని రంగాల్లో టాటా గ్రూప్ వ్యాపార సామ్రాజ్యం విస్తరించి ఉంది. ఇప్పటి వరకు నోయల్ టాటా.. టీటా గ్రూపుకు చెందిన రిటైల్ బిజినెస్ చూసుకున్నారు. ఇప్పుడు టాటా వ్యాపార సామ్రాజ్యాన్ని నడిపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment