కార్యక్రమంలో కేంద్రమంత్రి వైష్ణవ్, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, టాటా సన్స్ చెర్మన్ ఎన్ చంద్రశేఖరన్ తదితరులు
టాటా, సీజీ పవర్ సెమీకండక్టర్ల ప్లాంట్ల శంకుస్థాపనలో కేంద్ర మంత్రి వైష్ణవ్ వెల్లడి
ధోలేరా (గుజరాత్): టాటా ఎల్రక్టానిక్స్ తలపెట్టిన ధోలేరా (గుజరాత్) ప్లాంటు నుంచి చిప్‌ల తొలి బ్యాచ్ 2026 డిసెంబర్ నాటికి అందుబాటులోకి రాగలదని కేంద్ర ఐటీ, కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ తెలిపారు. ఈ ప్లాంటులో 28, 50, 55 నానోమీటర్ నోడ్‌ల చిప్స్ తయారు కానున్నాయని పేర్కొన్నారు. టాటా గ్రూప్‌నకు చెందిన రెండు, సీజీ పవర్‌కి చెందిన ఒక చిప్ ప్లాంటుకు ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం శంకుస్థాపన చేసిన సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు.
ఈ మూడింటిపై కంపెనీలు మొత్తం రూ. 1.26 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నాయి. మూడు భారీ సెమీకండక్టర్ల ప్లాంట్లకు ఒకే రోజున శంకుస్థాపన చేయడం రికార్డని మంత్రి చెప్పారు. 2029 నాటికి టాప్ 5 సెమీకండక్టర్ల వ్యవస్థల్లో భారత్ ఒకటిగా నిలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. టాటా ఎల్రక్టానిక్స్ సెమీకండక్టర్ల ప్రాజెక్టులతో అస్సాంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 72,000 పైచిలుకు ఉద్యోగాల కల్పన జరగగలదని టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment