
భారత ఆర్థిక వ్యవస్థ వైవిధ్యంతో ఎంతో బలంగా ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) తాజా నివేదిక తెలిపింది. వేగవంతమైన ఆర్థిక వృద్ధితో విపత్తును (కరోనా) తట్టుకుని నిలబడిందని పేర్కొంది. ప్రపంచబ్యాంక్‌తో కలసి ఐఎంఎఫ్ భారత ఆర్థిక వ్యవస్థపై సమగ్ర విశ్లేషణ చేసింది. ఈ నివేదికను విడుదల చేయగా ఆర్‌బీఐ దీన్ని స్వాగతిస్తున్నట్టు ప్రకటించింది.
‘భారత ఆర్థిక వ్యవస్థ 2010 తర్వాత ఎన్నో కష్టాలను అధిగమించింది. మహమ్మారిని తట్టుకుని నిలబడింది. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థల రుణ వితరణ పెరిగింది’ అని ఈ నివేదిక వివరించింది. తీవ్రమైన స్థూల ఆర్థిక వాతావరణంలోనూ మోస్తరు రుణ వితరణకు మద్దతుగా బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీల వద్ద తగినన్ని నిధులున్నట్టు పేర్కొంది. ఎన్‌బీఎఫ్‌సీలకు సైతం బ్యాంకుల మాదిరే లిక్విడిటీ కవరేజీ రేషియో (ఎల్‌సీఆర్)ను అమలు చేయడాన్ని ప్రశంసించింది. రిస్క్‌ల నివారణ, నిర్వహణ పరంగా అంతర్జాతీయ విధానాలకు అనుగుణంగా సెక్యూరిటీల మార్కెట్ నియంత్రణలు మెరుగుపడినట్టు పేర్కొంది. భారత బీమా రంగం సైతం బలంగా వృద్ధి చెందుతున్నట్టు తన నివేదికలో ప్రస్తావించింది.
ఇదీ చదవండి: ఎన్‌పీఏల వేలానికి ప్రత్యేక పోర్టల్
సైబర్ భద్రతా పర్యవేక్షణ
బ్యాంకుల్లో వ్యవస్థలు, మార్కెట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పరంగా భద్రతా చర్యలను సైతం ఐఎంఎఫ్ విశ్లేషించింది. బ్యాంక్‌లకు సంబంధించి అత్యాధునిక సైబర్ భద్రతా పర్యవేక్షణను భారత అధికారులు కలిగి ఉన్నట్టు తెలిపింది. కొన్ని ప్రత్యేకమైన టెస్ట్‌ల నిర్వహణ ద్వారా దీన్ని మరింత బలోపేతం చేయొచ్చని సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment