IMF
-
భారత ఆర్థిక వ్యవస్థ భేష్
భారత ఆర్థిక వ్యవస్థ వైవిధ్యంతో ఎంతో బలంగా ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) తాజా నివేదిక తెలిపింది. వేగవంతమైన ఆర్థిక వృద్ధితో విపత్తును (కరోనా) తట్టుకుని నిలబడిందని పేర్కొంది. ప్రపంచబ్యాంక్‌తో కలసి ఐఎంఎఫ్ భారత ఆర్థిక వ్యవస్థపై సమగ్ర విశ్లేషణ చేసింది. ఈ నివేదికను విడుదల చేయగా ఆర్బీఐ దీన్ని స్వాగతిస్తున్నట్టు ప్రకటించింది.‘భారత ఆర్థిక వ్యవస్థ 2010 తర్వాత ఎన్నో కష్టాలను అధిగమించింది. మహమ్మారిని తట్టుకుని నిలబడింది. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థల రుణ వితరణ పెరిగింది’ అని ఈ నివేదిక వివరించింది. తీవ్రమైన స్థూల ఆర్థిక వాతావరణంలోనూ మోస్తరు రుణ వితరణకు మద్దతుగా బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీల వద్ద తగినన్ని నిధులున్నట్టు పేర్కొంది. ఎన్‌బీఎఫ్‌సీలకు సైతం బ్యాంకుల మాదిరే లిక్విడిటీ కవరేజీ రేషియో (ఎల్‌సీఆర్)ను అమలు చేయడాన్ని ప్రశంసించింది. రిస్క్‌ల నివారణ, నిర్వహణ పరంగా అంతర్జాతీయ విధానాలకు అనుగుణంగా సెక్యూరిటీల మార్కెట్ నియంత్రణలు మెరుగుపడినట్టు పేర్కొంది. భారత బీమా రంగం సైతం బలంగా వృద్ధి చెందుతున్నట్టు తన నివేదికలో ప్రస్తావించింది.ఇదీ చదవండి: ఎన్పీఏల వేలానికి ప్రత్యేక పోర్టల్ సైబర్ భద్రతా పర్యవేక్షణబ్యాంకుల్లో వ్యవస్థలు, మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా భద్రతా చర్యలను సైతం ఐఎంఎఫ్ విశ్లేషించింది. బ్యాంక్‌లకు సంబంధించి అత్యాధునిక సైబర్ భద్రతా పర్యవేక్షణను భారత అధికారులు కలిగి ఉన్నట్టు తెలిపింది. కొన్ని ప్రత్యేకమైన టెస్ట్‌ల నిర్వహణ ద్వారా దీన్ని మరింత బలోపేతం చేయొచ్చని సూచించింది. -
పీఐఏను మరోసారి అమ్మకానికి పెట్టిన పాకిస్తాన్
ఇస్లామాబాద్: ప్రభుత్వం ఆధీనంలోని పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (పీఐఏ)ను పాక్ ప్రభుత్వం మరోసారి విక్రయానికి పెట్టింది. గతేడాది అక్టోబర్‌లో చేసిన ప్రయత్నం విఫలం కావడంతో అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) ఒత్తిడి మేరకు జూలై నెలకల్లా ఎలాగోలా పీఐఏను అమ్మేస్తామని తాజాగా హామీ ఇచ్చింది. ఆర్థిక సంస్కరణల్లో భాగంగా తీవ్ర నష్టాల్లో నడుస్తున్న సంస్థల్లో ఒకటైన పీఐఏలోని 51 శాతం నుంచి 100 శాతం వరకు వాటాను విక్రయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.గతేడాది పాక్‌కే చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీ ఒకటి వెయ్యి కోట్ల రూపాయలకు కొనేందుకు ముందుకు వచ్చింది. మరెవరూ పీఐఏపై ఆసక్తి చూపడం లేదు. అయితే, దీన్ని విక్రయిస్తేనే 7 బిలియన్ డాలర్ల రుణం ఇస్తామంటూ ఐఎంఎఫ్ (IMF) మెలికపెట్టడంతో పాకిస్తాన్ (Pakistan) ప్రభుత్వం మరోసారి ప్రయత్నాలు ప్రారంభించింది.పాకిస్తాన్ ప్రభుత్వానికి షాకిచ్చిన అమెరికా ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రభుత్వానికి అమెరికా (America) షాకిచ్చింది. తుర్క్మెనిస్తాన్లో పాక్ రాయబారి కేకే అహ్సాన్ వాగన్‌ను తమ దేశంలోకి అనుమతించలేదు. సెలవుల రీత్యా లాస్ఏంజెలెస్ వెళ్లిన వాగన్‌ను ఇమ్మిగ్రేషన్ అధికారులు విమానాశ్రయంలోనే అడ్డుకున్నారు. చెల్లుబాటయ్యే వీసా, ప్రయాణ పత్రాలున్నా అమెరికాలోకి ప్రవేశించనివ్వకుండా తిప్పి పంపారు. ఇమిగ్రేషన్ అభ్యంతరాలే ఇందుకు కారణమని పాక్ విదేశాంగ శాఖ చెప్పుకొచ్చింది. దీనిపై విచారణకు లాస్ ఏంజెలెస్‌లోని తమ కాన్సులేట్‌ను ఆదేశించింది.చదవండి: రైలు హైజాక్.. రెస్క్యూలో పాకిస్తాన్ ఆర్మీ ప్లాన్ సక్సెస్! -
వేగవంతమైన ఆర్థిక వ్యవస్థగా భారత్
న్యూయార్క్: బలమైన ప్రైవేట్ పెట్టుబడులు, స్థూల ఆర్థిక స్థిరత్వం నేపథ్యంలో 2025–26లో 6.5 శాతం జీడీపీ వృద్ధిని సాధించడం ద్వారా.. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ తన స్థానాన్ని నిలుపుకుంటుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థ తెలిపింది. భారత బలమైన ఆర్థిక పనితీరు 2047 నాటికి అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా మారాలనే ఆశయాన్ని సాకారం చేసుకోవడానికి కీలక, సవాలుతో కూడిన నిర్మాణాత్మక సంస్కరణలను ముందుకు తీసుకెళ్లడానికి దేశానికి అవకాశాన్ని అందిస్తుందని వివరించింది.నిరంతర స్థూల ఆర్థిక, ఆర్థిక స్థిరత్వం నేపథ్యంలో ప్రైవేట్ వినియోగంలో బలమైన వృద్ధితో 2024–25, 2025–26లో వాస్తవ జీడీపీ 6.5% పెరుగుతుందని అంచనా. ఇటీవలి కాలంలో ఆర్థిక వ్యవస్థలో నియంత్రణ ఉన్న ప్పటికీ భారత ఆర్థిక వృద్ధి బలంగానే ఉంది. 2024–25 మొదటి అర్ధభాగంలో జీడీపీ వృద్ధి 6%గా ఉంది’ అని వివరించింది.నిరర్థక రుణాలు తగ్గాయి..అధిక నాణ్యత ఉద్యోగాలను సృష్టించడానికి, పెట్టుబడులను ఉత్తేజపరిచేందుకు, అధిక వృద్ధి అవకాశాలను అందుకోవడానికి సమగ్ర నిర్మాణాత్మక సంస్కరణలు చాలా ముఖ్యమైనవని ఐఎంఎఫ్ తెలిపింది. ‘కార్మిక మార్కెట్ సంస్కరణలను అమలు చేయడం, మానవ వనరుల బలోపేతం, శ్రామిక శక్తిలో మహిళల అధిక భాగస్వామ్యానికి మద్దతు ఇవ్వడంపై దృష్టి పెట్టాలి.ఆహార ధరల హెచ్చుతగ్గులు కొంత అస్థిరతను సృష్టించినప్పటికీ రిజర్వ్ బ్యాంక్ టాలరెన్స్ బ్యాండ్ (2 నుండి 6 శాతం) పరిధిలో ద్రవ్యోల్బణం విస్తృతంగా తగ్గింది. ఆర్థిక రంగం స్థితిస్థాపకంగానే ఉంది. నిరర్థక రుణాలు బహుళ సంవత్సరాల కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఆర్థిక ఏకీకరణ కొనసాగింది. సర్వీ సెస్ ఎగుమతుల్లో బలమైన వృద్ధి మద్దతు తో కరెంట్ ఖాతా లోటు చాలా అదుపులో ఉంది’ అని వివరించింది. -
భారత్‌లో అద్భుత అవకాశాలు
వాషింగ్టన్: అమెరికా ఇన్వెస్టర్లకు భారత్ అసాధారణ రీతిలో అవకాశాలు కల్పిస్తోందని ఐఎంఎఫ్‌లో భారత ఈడీగా పనిచేస్తున్న కేవీ సుబ్రమణియన్ అన్నారు. వచ్చే 20–25 ఏళ్లలో ఈ స్థాయి రాబడులు మరే ఆర్థిక వ్యవస్థ కల్పించలేదన్నారు. తాను రాసిన ఒక పుస్తకావిష్కరణ సందర్భంగా ఆయన మాట్లాడారు. భారత్‌వైపు చూస్తున్న ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను రెట్టింపు కాకుండా మూడింతలు చేయాలని సూచించారు. వారి పెట్టుబడులు 15–20 రెట్లు వృద్ధి చెందుతాయన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘ఇండియా @100: భవిష్యత్ ఆర్థిక శక్తిని ఊహించడం’ పేరుతో సుబ్రమణియన్ రచించిన ఈ పుస్తకంలో.. భారత్ 100వ స్వాతంత్ర దినోత్సవం నిర్వహించుకునే 2047 నాటికి, 25 ఏళ్లలోపే 55 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎలా అవతరించగలదన్నది వివరించారు. 2014 తర్వాత ఆర్థిక వ్యవస్థలో సంస్కరణలు, బలమైన విధానాలను ప్రవేశపెట్టడాన్ని ప్రస్తావించారు. కేవీ సుబ్రమణియన్ ప్రస్తుత పదవికి పూర్తం భారత మఖ్య ఆర్థిక సలహాదారుగా పనిచేయడం గమనార్హం. భారత్‌లో వేతన వృద్ధి ఎక్కువ.. భారత బ్యాంక్ ఖాతాల్లో పొదుపు చేసుకుంటే అమెరికా బ్యాంకుల కంటే ఎక్కువ రాబడి వస్తుందని భారత సంతతి వారికి సుబ్రమణియన్ సూచించారు. అమెరికాలో కంటే భారత్‌లో వేతన వృద్ధి ఎక్కువగా ఉంటుందన్నారు. ‘‘డాలర్ల రూపంలో 12 శాతం వృద్ధి ఉంటే, భారత్‌లో 17–18 శాతం మేర వృద్ధి చెందనుంది. అంటే ప్రతి ఐదేళ్లకు వేతనం రెట్టింపు అవుతుంది. 30 ఏళ్ల కెరీర్లో ఏడు వేతన రెట్టింపులు చూడొచ్చు. అంటే 100 రెట్ల వృద్ధి. అదే యూఎస్‌లో అయితే గరిష్టంగా ఏడెనిమిది రెట్ల వృద్ధే ఉంటుంది’’అని వివరించారు. 2047 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 55 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ధృడమైన విశ్వాసం వ్యక్తం చేశారు. -
2047 నాటికి 55 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ
కోల్‌కతా: డాలర్ ప్రాతిపదికన వార్షిక వృద్ధి రేటు 12 శాతంగా ఉంటే, 2047 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణం 55 ట్రిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశం ఉందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కృష్ణమూర్తి సుబ్రమణియన్ పేర్కొన్నారు. 2018 నుండి 2021 వరకు ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారుగా సుబ్రమణియన్ బాధ్యతలు నిర్వహించిన సంగతి తెలిసిందే.2020–2021 కోవిడ్ సంవత్సరాల్లో ఆర్థిక వ్యవస్థ పటిష్టత చెక్కుచెదరకుండా కీలకపాత్ర పోషించిన ఆయన, మహమ్మారిపై దేశం ప్రతిస్పందన ప్రపంచంలోని ఇతర ప్రాంతాల కంటే భిన్నంగా ఉందని ఈ సందర్భంగా అన్నారు. ఇక్కడ జరిగిన సీఐఐ కార్యక్రమంలో ఆయన చేసిన ప్రసంగంలో ముఖ్యాంశాలు..» 2016 నుండి ద్రవ్యోల్బణం కట్టడికి దేశం పటిష్ట చర్యలు తీసుకుంది. దీనితో దేశం సగటు ధరల పెరుగుదల రేటును ఐదు శాతం వద్ద కట్టడి జరిగింది. 2016 ముందు ఈ రేటు 7.5 శాతంగా ఉండేది. » ద్రవ్యోల్బణం కట్టడితో దేశం ఎనిమిది శాతం వృద్ధి సాధిస్తుందని విశ్వస్తున్నాం. దీనిని పరిగణనలోకి తీసుకోని నామినల్ గ్రోత్‌రేట్ 13 శాతంగా ఉంటుంది. ఐదు శాతం వద్ద ద్రవ్యోల్బణం కట్టడి కొనసాగుతుందని విశ్వసిస్తున్నాం. » పారిశ్రామికీకరణ, నూతన ఆవిష్కరణలు, ప్రైవేటు రుణ వ్యవస్థ పురోగతి ఎకానమీకి మూడు కీలక స్తంభాలు. ఇవి ఆర్థిక వ్యవస్థ ఎనిమిది శాతం వృద్ధికి సహాయపడతాయి. » దీర్ఘకాలంలో డాలర్‌తో పోలిస్తే భారత కరెన్సీ తరుగుదల రేటు ఒక శాతం కంటే తక్కువగా ఉండటంతో, ఆర్థిక వ్యవస్థ ఫండమెంటల్స్ పటిష్టంగా, స్థిరంగా కొనసాగుతున్నాయి. » డాలర్లో భారత్ వాస్తవ వృద్ధి రేటు 12 శాతంగా ఉంటుందని భావిస్తున్నాం. ఇదే జరిగితే ఆర్థిక వ్యవస్థ పరిమాణం ప్రతి ఆరు సంవత్సరాలకు రెట్టింపు అవుతుంది. ఈ లెక్కన ప్రస్తుత 3.8 ట్రిలియన్ డాలర్ల భారత్ ఎకానమీ 2047 నాటికి 55 ట్రిలియన్ డాలర్లకు చేరుతుంది. » అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలలో పెట్టుబడులతో సంబంధం లేకుండా, ఉత్పాదకత మెరుగుదల మాత్రమే వృద్ధికి కారణమవుతుంది. » ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ ఇంకా సగం నుంచి రెండు వంతులు ఇంకా అనధికారిక (అన్‌ఫార్మల్) రంగంలోనే ఉంది. » ఆర్థిక వ్యవస్థ ఎంత అధికారికంగా మారితే (ఫార్మల్గా) అది అంత అధిక ఉత్పాదకతకు దారి తీస్తుంది. ప్రపంచ సహచర దేశాలతో పోలిస్తే భారత్ ఫార్మల్ సెక్టార్లో ఉత్పాదకతను పెంచడానికి ఇంకా ఎంతో అవకాశం ఉంది. » భారతదేశ ద్రవ్యోల్బణం అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల చారిత్రక సగటు కంటే తక్కువగా ఉన్నందున, ప్రభుత్వం ‘సానుకూల ఫలితాల సాధన సాధ్యమేనన్న’ విశ్వాసంతో ఆర్థిక విధానాలను రూపొందించగలిగింది. ప్రస్తుత జీడీపీ తీరిది.. భారత్‌ను 2047 నాటికి అధిక ఆదాయ ఆర్థిక వ్యవస్థగా మార్చాలని ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా నిర్దేశించుకుని ఇందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు. అయితే వృద్ధి మందగమనం, అనిశ్చితమైన ప్రపంచ ఆర్థిక పరిస్థితులు భారత్ వృద్ధికి సవాళ్లుగా ఉన్నాయి. 25.5 ట్రిలియన్ డాలర్లతో అమెరికా ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద ఎకనామగా కొనసాగుతోంది. ప్రపంచం మొత్తం జీడీపీలో పావుశాతం వాటాను కలిగి ఉంది. ఇక 17.9 శాతం ప్రపంచ జీడీపీ వాటాతో 18 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా చైనా రెండవ స్థానంలో ఉంది. తరువాతి స్థానాల్లో జపాన్ (4.2 ట్రిలియన్ డాలర్లు), జర్మనీ (4 ట్రిలియన్ డాలర్లు)లు ఉన్నాయి.కాగా, 2022 నాటికి భారత్ ఎకానమీ బ్రిటన్, ఫ్రాన్స్‌ను అధిగమించగా, త్వరలో జర్మనీని అధిగమించే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. ప్రస్తుత దేశ ఎకానమీ విలువ 3.8 ట్రిలియన్ డాలర్లు. ఇక ప్రస్తుతం భారత్ తలసరి ఆదాయం దాదాపు 2,300 డాలర్లు. 2031 ఆర్థిక సంవత్సరం భారత్ తలసరి ఆదాయం 4,500 డాలర్లకు పెరగాలన్నది లక్ష్యం. ఇదే జరిగితే దేశం ఎగువ మధ్య–ఆదాయ దేశాల క్లబ్లో ప్రవేశిస్తుంది. ప్రస్తుతం అనుసరిస్తున్న ఆర్థిక సూత్రాల ప్రకారం... తలసరి ఆదాయం 1,036 డాలర్ల నుంచి 4,045 డాలర్ల మధ్య ఉన్న దేశాన్ని దిగువ మధ్య తరగతి ఆదాయ దేశంగా పరిగణిస్తారు. 4046 డాలర్ల నుంచి 12,535 డాలర్ల మధ్య ఆదాయ దేశాలను ఎగువ మధ్య తరగతి ఆదాయ దేశాలుగా పేర్కొంటారు. 12,000 డాలర్ల తలసరి ఆదాయం దాటితే అది అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది. -
‘ఆరేళ్లలో 14.8 కోట్ల ఉద్యోగాలు సృష్టించాలి’
దేశ జనాభా పెరుగుదల అంచనాల ప్రకారం 2030 నాటికి 14.8 కోట్ల ఉద్యోగాలు సృష్టించాలని అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్) డిప్యూటీ డైరెక్టర్ గీతాగోపీనాత్ తెలిపారు. ఉద్యోగాల కల్పనకు సంబంధించి జీ20 దేశాలతో పోలిస్తే భారత్ చాలా వెనకబడి ఉందన్నారు. కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్‌తో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ఈమేరకు వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా గీతాగోపీనాత్ మాట్లాడుతూ..‘భారత్‌లో జనాభా వృద్ధిరేటు అధికంగా ఉంది. జనాభా పెరుగుదల అంచనాల ప్రకారం 2030 నాటికి దేశంలో 6 నుంచి 14.8 కోట్లు ఉద్యోగాలు సృష్టించబడాలి. ప్రస్తుతం 2024లో ఉన్నాం. చాలా తక్కువ సమయంలోనే భారీగా జాబ్స్ క్రియేట్ చేయాలి. ఉద్యోగాల కల్పనలో జీ20 దేశాల్లో భారత్ వెనకబడింది. 2010 నుంచి ఇండియా సగటున 6.6 శాతం వృద్ధి నమోదు చేస్తోంది. అయితే ఉద్యోగకల్పన రేటు మాత్రం 2 శాతం లోపే ఉంది. కొత్త ఉద్యోగాలు పుట్టుకురావాలంటే ప్రైవేటు పెట్టుబడులు వచ్చేలా చూడాలి. భారత యువత నైపుణ్యాలను పెంపొందించుకోవాలి. భారత్‌తో పోటీ పడుతున్న ఇతర దేశాలతో పోలిస్తే స్థానికంగా దిగుమతి సుంకం అధికంగా ఉంది. దాన్ని తగ్గించాలి. కార్మిక చట్టాలను సమర్థంగా అమలు చేయాలి. ఇటీవల ప్రవేశపెట్టిన ‘మూలధన లాభాలపై పన్ను’ తాత్కాలికంగా ఖజానాకు డబ్బు సమకూర్చవచ్చు. కానీ అది భవిష్యత్తులో క్లిష్టంగా మారే అవకాశం ఉంది. జీఎస్టీ రేట్లను మరింత సరళీకరిస్తే అదనంగా 1.5 శాతం జీడీపీ వృద్ధికి అవకాశం ఉంది’ అన్నారు.ఇదీ చదవండి: ఇల్లు కొంటున్నారా..? ఒక్క క్షణం..! -
రుణం కోసం ఐఎంఎఫ్‌ను సంప్రదించిన పాక్!
పొరుగు దేశం పాకిస్తాన్ రుణ సాయం కోసం మరోమారు చేయి చాచింది. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆదివారం అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) చీఫ్ క్రిస్టాలినా జార్జివాను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన నగదు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న తమ దేశానికి కొత్త రుణం కోసం అభ్యర్థించారు.పాక్ మీడియా తెలిపిన వివరాల ప్రకారం వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యుఇఎఫ్) సమావేశంలో పాక్‌కు మూడు బిలియన్ యూఎస్ డాలర్లు ఎస్బీఏ కింద అందించేందుకు ఐఎంఎఫ్ మద్దతు ఇచ్చినందుకు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ వివరాలను పీటీవీ న్యూస్ సోషల్ మీడియా ప్లాట్ఫారం ‘ఎక్స్’లో తెలిపింది. కాగా స్టాండ్‌బై అరేంజ్మెంట్ (ఎస్బీఏ) కింద 1.1 బిలియన్ డాలర్ల రుణంపై తుది నిర్ణయం తీసుకునేందుకు ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ బోర్డు సోమవారం సమావేశం కానుంది.గత ఏడాది జూన్‌లో జరిగిన ఐఎంఎఫ్ కార్యక్రమంలో పాకిస్తాన్ మూడు బిలియన్ డాలర్ల రుణం అందుకుంది. తాజాగా జరిగిన డబ్ల్యుఈఎఫ్ ప్రత్యేక సమావేశంలో పాక్ ప్రధాని షరీఫ్ ‘ప్రపంచ ఆరోగ్య అజెండాను పునర్నిర్వచించడం’పై జరిగిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య సంరక్షణలో ప్రపంచ అసమానతలను ప్రస్తావించారు. 2003లో సౌదీ అరేబియా వెళ్లినప్పుడు తనకు క్యాన్సర్ సోకిందని షరీఫ్ తెలిపారు. ఆ తర్వాత న్యూయార్క్‌కు వెళ్లి వేల డాలర్లు వెచ్చించి శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చిందని తెలిపారు. ఇంతటి ఖరీదైన చికిత్సను తమ దేశంలోని ప్రజలు భరించలేరని తెలిపారు.తాను పాకిస్తాన్‌కు తిరిగి వచ్చినప్పుడు, పంజాబ్ ప్రావిన్స్‌కు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యానని, తమ ప్రభుత్వం కిడ్నీ, కాలేయ వ్యాధులతో పాటు క్యాన్సర్ చికిత్సకు సంబంధించిన ప్రత్యేక ఆసుపత్రులను నిర్మించిందని షాబాజ్ చెప్పారు. కరోనా మహమ్మారి ప్రపంచంలోని ఆరోగ్య అసమానతలను, లోపాలను బహిర్గతం చేసిందని షరీఫ్ పేర్కొన్నారు. -
ప్రపంచ ఎకానమీపై ఐఎంఎఫ్ కీలక ప్రకటన
ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి 2024 అవుట్‌లుక్‌ను అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అప్‌గ్రేడ్ చేసింది. ఒడిదుడుకులను ఎదుర్కొంటూ అమెరికా వృద్ధి పయనం, ద్రవ్యోల్బణం నెమ్మదించడం దీనికి ప్రధాన కారణాలుగా పేర్కొంది. తాజా అవుట్‌లుక్‌లో 2024 వృద్ధి రేటును ఇంతక్రితం 2.9 శాతం అంచనాల నుంచి 3.1 శాతానికి పెంచింది. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే.. ద్రవ్యోల్బణం అవుట్‌లుక్‌ను తగ్గించింది. 2023లో 6.8 శాతం ద్రవ్యోల్బణం ఉంటే, 2024లో ఇది 5.8 శాతానికి, 2025లో 4.4 శాతానికి తగ్గుతుందని అంచనావేసింది. ఇదీ చదవండి: బడ్జెట్ 2024-25 కథనాల కోసం క్లిక్ చేయండి అగ్రదేశాల్లో ద్రవ్యోల్బణం 2024లో 2.6 శాతం ఉంటే 2024లో 2 శాతానికి తగ్గుతుందని పేర్కొంది. ఇక ప్రపంచ వాణిజ్య వృద్ధి రేటు 2024లో 3.3 శాతంగా ఉంటే, 2025లో 3.6 శాతానికి పెరుగుతుందని తెలిపింది. చరిత్రాత్మాక వాణిజ్య వృద్ధి సగటు 4.9 శాతంగా ఉంది. -
అంతర్జాతీయ సవాళ్లపై సమాలోచనలు...
న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మొరాకో ఆర్థిక రాజధాని మారకేచ్‌లో ప్రపంచ ఆర్థిక విధాన నిర్ణేతలతో కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. పలు అంతర్జాతీయ ఆర్థిక అంశాలు, సవాళ్లు, వీటిని ఎదుర్కొనడం.. ఆమె చర్చల్లో ప్రధాన అంశాలుగా ఉన్నాయి. జీ20 ఆర్థికమంత్రులు, సెంట్రల్ బ్యాంకుల గవర్నర్ల (ఎఫ్‌ఎంసీబీజీ) సమావేశంతో పాటు ప్రపంచ బ్యాంక్–అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థ వార్షిక సమావేశంలో పాల్గొనడానికి ఆమె ఈ నెల 11న మారకేచ్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశాల్లో భాగంగా ఆమె 15వ తేదీ వరకూ మరకేచ్లోనే ఇండోనేషియా, మొరాకో, బ్రెజిల్, స్విట్జర్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్‌లతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. అంతర్జాతీయ సమస్యలు, సవాళ్లు, ఆర్థిక అనిశి్చతి, బహుళజాతి బ్యాంకుల పటిష్టత, క్రిప్టో కరెన్సీ వంటి అంశాలు ఈ సమావేశాల చర్చల్లో ప్రధాన భాగంగా ఉన్నాయి. సమావేశాల్లో భాగంగా అమెరికా ఆర్థికమంత్రి జనెత్ ఎలన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనడానికి ఐఎంఎఫ్‌కు నిధుల లభ్యతపై ప్రధానంగా చర్చ జరిగింది. ఐఎంఎఫ్ రుణ విధానాలు, పటిష్టత, కోటా విధానం, పేదరిక నిర్మూలన, ఐఎంఎఫ్ పాలనా నిర్వహణ విషయంలో సంస్కరణలపై ఆర్థికమంత్రి ప్రధానంగా చర్చించినట్లు ఆర్థికశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కే జార్జివా నేతృత్వంలోని బృందంతోపాటు, ఇంటర్–అమెరికన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రెసిడెంట్ ఇలాన్ గోల్డ్ఫాజ్్నతో కూడా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సమావేశమయ్యారు. జీ20 ఎజెండాను కొనసాగించేందుకు ఐఎంఎఫ్‌తో కలిసి పనిచేయాలన్న భారత్ ఆకాంక్షను ఆమె ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్‌తో జరిగిన సమావేశాల్లో వ్యక్తం చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. -
చైనా కన్నా స్పీడ్‌గా.. అంచనాలను పెంచిన ఐఎంఎఫ్
న్యూఢిల్లీ: భారత్ ఏప్రిల్ 2023తో ప్రారంభమయిన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–24)లో 6.3% స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిని నమోదుచేసుకుంటుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) తాజా ‘వరల్డ్ ఎకనమిక్ అవుట్‌లుక్’ అంచనా వేసింది. తొలి జూలై నెల అంచనా 6.1 శాతాన్ని ఈ మేరకు 20 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు 1%) పెంచింది. తొలి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) అంచనాలకు మించి వినియోగ గణాంకాలు నమోదవడం తాజా అప్‌గ్రేడ్‌కు కారణమని అవుట్‌లుక్ వివరించింది. 2024–25లో కూడా భారత్ వృద్ధి అంచనాలను ఐఎంఎఫ్ 6.3%గా పేర్కొంది. వృద్ధి స్పీడ్‌లో టాప్.. ప్రపంచంలోని రెండవ ఆర్థిక వ్యవస్థ చైనాకన్నా భారత్ వృద్ధి స్పీడ్ వేగంగా ఉండడం మరో అంశం. 2023లో చైనా వృద్ధి రేటు అంచనాలను ఐఎంఎఫ్ 20 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో ఈ రేటు 5%కి తగ్గింది. 2024లో అంచనాలను 30 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఫలితంగా ఈ రేటు 4.2%కి దిగింది. చైనాలో ప్రోపర్టీ మార్కెట్ సంక్షోభంలో ఉండటం కూడా వృద్ధి రేటు కోతకు కారణమని ఐఎంఎఫ్ పేర్కొంది. ప్రపంచ వృద్ధి అంచనా డౌన్ కాగా, 2023 ప్రపంచ వృద్ధి అంచనాలను మాత్రం ఐఎంఎఫ్ తగ్గించడం గమనార్హం. ఇంతక్రితం 3.2 శాతంగా ఉన్న గ్లోబల్ వృద్ధి అంచనాలను తాజాగా 3%కి కుదించింది. కొన్ని సంస్థల అంచనా ఇలా.. సంస్థ 2023–24 (వృద్ధి శాతాల్లో) ఆర్బీఐ 6.5 ప్రపంచబ్యాంక్ 6.3 ఎస్అండ్పీ 6.0 ఫిచ్ 6.3 మూడీస్ 6.1 ఏడీబీ 6.3 ఇండియా రేటింగ్స్ 6.2 ఓఈసీడీ 6.3 -
ఐఎంఎఫ్‌లో రాష్ట్ర విద్యార్థినికి గౌరవం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులుగా ఐక్యరాజ్యసమితి (యూఎన్) సదస్సుకు వెళ్లిన రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు మంగళవారం వాషింగ్టన్‌లోని ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ (ఐఎంఎఫ్) ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కృష్ణమూర్తి వి.సుబ్రమణ్యన్ విద్యార్థుల బృందంతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన నంద్యాలకు చెందిన లారీ డ్రైవర్ కుమార్తె చాకలి రాజేశ్వరికి తన చైర్ ఆఫర్ చేసి అందులో కూర్చోబెట్టారు. సుమారు 1.20 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో రాజేశ్వరి అదే చైర్లో కూర్చుంది. ఈ సందర్భంగా సుబ్రమణ్యన్ విద్యార్థులతో మాట్లాడుతూ.. కలలను నిజం చేసుకోవడానికి నిరంతరం కృషి చేయాలని, సమాజంలో మనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకోవడంతో పాటు దేశానికి చేతనైన సాయం చేయాలని సూచించారు. అనంతరం విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సుబ్ర మణ్యన్ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. ‘నేను నా కార్యాలయంలో ఏపీ నుంచి వచ్చిన తెలివైన విద్యార్థులను కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. వారంతా అత్యంత నిరాడంబరమైన నేప థ్యాల నుంచి వచ్చినవారు కావడం వల్ల భార తీయుడిగా గర్వపడుతున్నాను. విద్య ప్రాముఖ్యత ప్రతి భారతీయ కుటుంబం మనసులోకి ప్రవేశించింది’ అంటూ సుబ్రమ ణ్యన్ ట్వీట్ చేశారు. దీనిపై సీఎం జగన్ స్పందిస్తూ ‘వారిని ప్రోత్స హిస్తున్నందుకు ధన్యవాదాలు సుబ్రమణ్యన్గారూ! మిమ్మల్ని కలవడం, మీతో సంభాషించడం మన పిల్లలకు, ఏపీ పిల్లలందరికీ అపురూపమైన గౌరవం. మన పిల్లలు మన రాష్ట్రాన్ని, మన విద్యా విధానం సారాంశాన్ని ప్రపంచం మొత్తం చాటిచెప్పడాన్ని చూసి నేను గర్వపడుతున్నాను’ అంటూ రీట్వీట్ చేశారు. గీతాగోపీనాథ్‌కు సీఎం జగన్ ధన్యవాదాలు ఐఎంఎఫ్ ఫస్ట్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గీతాగోపీనాథ్‌కు కూడా సీఎం ధన్యవాదాలు తెలి పారు. ఐఎంఎఫ్ కార్యాలయంలో విద్యార్థులు గీతాగోపీనాథ్తో సమావేశమైన సందర్భంగా ఆమె ‘ఐఎంఎఫ్‌కి ఏపీ విద్యార్థులను స్వాగతించ డం నిజంగా ఆనందంగా ఉంది. వారి యూఎన్, యూఎస్ పర్యటనలో భాగంగా ఐఎంఎఫ్ ప్రధాన కార్యాలయానికి రావడం సంతోషిస్తున్నాను’ అంటూ ఏపీ సీఎంను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన సీఎం జగన్.. ‘మా పిల్లలను కలిసినందుకు, వారిని ఇంత ఆప్యాయంగా చూస్తు న్నందుకు ధన్యవాదాలు గీతా గోపీనాథ్ గారూ, వారి చిరునవ్వులు అన్నీ చెబుతున్నాయి! విద్య అనేది వ్యక్తిగత జీవితాలను మా ర్చడమే కాకుండా మొత్తం సమాజాన్ని మార్చడంలో అతిపెద్ద ఉత్ప్రేరకం అని నేను నిజంగా నమ్ముతున్నాను. మన పిల్లలే ఇందుకు నిదర్శనం. అంతర్జాతీయ వేదికపై ఆత్మవిశ్వాసంతో ప్రాతి నిధ్యం వహిస్తున్న మన పిల్లలను చూసినప్పుడు నేను గర్వంతో ఉప్పొంగిపోయాను’ అంటూ రీట్వీట్ చేశారు. -
విద్యార్థుల చిరునవ్వులు అన్నీ చెబుతున్నాయి: సీఎం జగన్
-
‘వాళ్ల చిరునవ్వులే ఆ విషయాన్ని చెప్తున్నాయ్’
సాక్షి, గుంటూరు: అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గీతా గోపీనాథ్ (Gita Gopinath)కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు. ఏపీ నుంచి వెళ్లిన విద్యార్థులు ఐఎంఎఫ్ కార్యాలయంలో సందడి చేశారు. వాళ్లను ఆహ్వానించి ముచ్చటించినందుకుగానూ సీఎం జగన్ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘‘మా పిల్లలను కలుసుకున్నందుకు, సాదరంగా వాళ్లను ఆహ్వానించినందుకు గీతాగోపినాథ్ గారికి థ్యాంక్స్. వాళ్ల చిరునవ్వులే ఆ విషయాన్ని చెబుతున్నాయ్’’ అని సీఎం జగన్ ట్వీట్ చేశారు. ‘‘చదువు అనేది వ్యక్తిగత జీవితాలను మార్చడమే కాకుండా మొత్తం సమాజాన్ని మార్చడంలో అతిపెద్ద ఉత్ప్రేరకం అని నేను నిజంగా నమ్ముతున్నాను. మా పిల్లలే ఇందుకు నిదర్శనం. అంతర్జాతీయ వేదికపై మన రాష్ట్రాన్ని ఎంతో గర్వంగా, ఆత్మవిశ్వాసంతో ప్రాతినిధ్యం వహిస్తున్న పిల్లలను చూసినప్పుడు నేను గర్వంతో నిండిపోయాను!’’ అని పోస్ట్ చేశారాయన. అంతకు ముందు గీతా గోపినాథ్ సైతం పిల్లలతో ఉన్న ఫొటోను తన ఎక్స్‌లో ట్వీట్ చేశారు. అమెరికా, ఐరాస పర్యటనలో భాగంగా.. వాళ్లను ఐఎంఎఫ్ ప్రధాన కార్యాలయం వద్ద కలుసుకున్నట్లు ఆమె పోస్ట్ చేశారు. వాళ్లను కలుసుకున్నందుకు సంతోషంగా ఉందని ఆమె ట్వీట్లో తెలియజేశారు. Thank you for meeting our children and receiving them with such warmth @GitaGopinath garu, their bright smiles say it all! I truly believe that education is the biggest catalyst in not just transforming individual lives but in transforming entire communities. Our children are… https://t.co/WKek9sMdh9 — YS Jagan Mohan Reddy (@ysjagan) September 27, 2023 -
బియ్యం కోసం కయ్యాలొద్దు: ఐఎంఎఫ్ చీఫ్ ఎకనామిస్ట్
Restrictions On Rice Export IMF To India బియ్యం ధరలకు కళ్లెం వేసేందుకు కేంద్ర సర్కార్ చర్యలు ఆస్ట్రేలియా, కెనడా దేశాల్లోనూ సంక్షోభం నెలకొంది. ఇటీవల బియ్యం కోసం విదేశాల్లో భారతీయులు క్యూ కట్టిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఆస్ట్రేలియా బియ్యం కొనుగోళ్లు విపరీతంగా పుంజు కున్నాయి. నెలలో కొనే బియ్యానికి రెట్టింపు పరిమాణంలో భారతీయులు బియ్యం కొనుగోలు చేస్తున్నారని ఆస్ట్రేలియాలోని దుకాణ దారులు చెబుతున్నారు. బాస్మతీయేతరరకాల బియ్యం ఎగుమతులపై నిషేధం విధించిన నేపథ్యంలోపెద్ద ఎత్తున నిల్వ చేసుకునేందుకు విదేశాల్లోని భారతీయులు ప్రయత్నిస్తున్నారు. ఫలితంగా ఒక్కసారిగా డిమాండ్ పెరగడంతో దాన్ని నియంత్రించేందుకు వ్యక్తికి 5 కిలోల బియ్యం మాత్రమే అమ్ముతున్న పరిస్థితి నెలకొంది. చాలామంది భారతీయులు తమ నిర్ణయం పట్ల తిరగబడుతున్నారని, అయినప్పటికీ తాము ఒకరికి 5 కిలోలకు మంచి అమ్మడంలేదని అక్కడి విక్రయదారులు వాపోతున్నారు. మరోవైపు బియ్యం ఎగుమతులపై పరిమితులను తొలగించాలని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ భారత ప్రభుత్వాన్ని కోరింది. ఈ కొరత ప్రపంచ ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపుతుందని , ఈ నేపథ్యంలో నిర్దిష్ట రకం బియ్యం ఎగుమతిపై పరిమితులను తొలగించాలని భారతదేశాన్ని కోరుతున్నామని పేర్కొంది. ప్రస్తుత వాతావరణంలో, ఈ రకమైన పరిమితులు ప్రపంచంలోని ఇతర దేశాలలో ఆహార ధరలపై అస్థిరతను పెంచే అవకాశం ఉంది. అంతేకాదు ఇది ప్రతీకార చర్యలకు కూడా దారితీస్తాయని ఐఎంఎఫ్ చీఫ్ ఎకనామిస్ట్ పియర్-ఒలివర్ గౌరించాస్ మీడియాతో అన్నారు. అటు ఈ నిషేధం కారణంగా అమెరికాలోని ఇండియన్ స్టోర్లలో పరిమితులు కొనసాగుతున్నాయి. దాదాపు స్టోర్లన్నీ ఖాళీ. టెక్సాస్‌లో పరిస్థితి దారుణంగా ఉంది. ఒక కుటుంబానికి ఒక బ్యాగ్‌ను మాత్రమే అనే బోర్డులు దర్శనమిచ్చాయి. దీనికి సంబంధించి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాబోయే పండుగ సీజన్లో దేశీయ సరఫరాను పెంచడానికి, రిటైల్ ధరలను అదుపులో ఉంచడానికి భారత ప్రభుత్వం జూలై 20న బాస్మతీయేతర తెల్ల బియ్యం ఎగుమతిని నిషేధించింది. దీన్ని తక్షణమే అమలులోకి తెచ్చింది.దేశం నుండి ఎగుమతి అయ్యే మొత్తం బియ్యంలో ఈ రకం బియ్యం 25 శాతం ఎగుమతి అవుతాయి. At the Indian store today for spices, I checked to see if rice prices went up due to the export ban. I was shocked to see this. Limits on quantities. Stock up on your staples NOW. Other countries are looking at the ban on rice and are stock piling. pic.twitter.com/kns8AtoQ3E — Lisa Muhammad (@iamlisamuhammad) July 23, 2023 Don't know if these empty shelves at Walmart today where Basmati rice is usually stocked, is related to the news of India's ban on rice exports but it wouldn't surprise me either. pic.twitter.com/GHXfI9RoAM — JJ Crowley (@JJCrowleyMusic) July 23, 2023 కాగా భారతదేశం నుండి బాస్మతీయేతర తెల్ల బియ్యం ఎగుమతులు 2022-23లో 4.2 మిలియన్ల డాలర్లు కాగా, అంతకుముందు సంవత్సరంలో 2.62 మిలియన్ డాలర్లుగా ఉంది. ఇండియానుంచి బాస్మతీయేతర తెల్ల బియ్యం ఎగుమతయ్యే దేశాల్లో ప్రధానంగా అమెరికా, థాయిలాండ్, ఇటలీ, స్పెయిన్ శ్రీలంక ఉన్నాయి. -
ఎంతకాలం అడుక్కుంటాం.. ముందు చేతిలో చిప్ప విసిరేయాలి
ఇస్లామాబాద్: అసలే అంతంత మాత్రంగా ఉన్న పాకిస్తాన్ దేశ ఆర్ధిక పరిస్థితి ఎప్పటికి కుదుటపడుతుందో తెలీయని అనిశ్చితిలో దొరికిన చోట దొరికినంత అప్పు చేస్తోంది. తాజాగా తన మిత్ర దేశమైన చైనా దగ్గర మరికొంత ఋణం తీసుకునేందుకు అంతా ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు సయ్యద్ అసీం మునీర్ స్పందిస్తూ మన చేతిలో ఉన్న చిప్పను అవతలకు విసిరేసి స్వాభిమానంతో బ్రతకడం అలవాటు చేసుకోవాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ గత కొంతకాలముగా ఆర్ధిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న సంగతి తెలిసిందే. ఒకపక్క ఉన్న ఆస్తులను అమ్ముకోవడంతో పాటు మరోపక్క రుణాల కోసం కూడా ప్రయత్నాలు చేస్తోంది. ఈ ప్రయాణంలో భాగంగా ఇటీవలే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) దగ్గర కొంత ఋణం తీసుకుంది. ఇప్పుడు మళ్లీ మిత్రదేశం చైనా దగ్గర మరికొంత రుణాన్ని పొందనుంది. చైనాకు పాకిస్తాన్ ఇప్పటికే 2.07 బిలియన్ డాలర్ల రుణపడి ఉండగా తాజాగా తీసుకోనున్న మరో 600 మిలియన్ డాలర్ల రుణంతో కలిపి ఆ మొత్తం 2.44 బిలియన్ డాలర్లకు చేరనుంది. దీంతో విపరీతంగా పెరుగుతున్న అప్పుల భారం దృష్ట్యా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ సయ్యద్ అసీం మునీర్ స్పందించారు. పాకిస్తాన్ ఆర్ధిక వ్యవస్థ బలపడేంత వరకు సైన్యం నిద్రపోకుండా పనిచేస్తుందని, అపార ప్రతిభావంతులను, ఉత్సాహవంతులైన వారిని చూసి పాకిస్తాన్ గర్విస్తోందని అన్నారు. ఎంతకాలం ఇలా పొరుగుదేశాల దగ్గర చిప్ప పట్టుకుని తిరుగుతాం. ముందు చేతిలోని ఆ చిప్పను విసిరేయాలి. రుణాల కోసం ఇతర దేశాల మీద మీద ఆధారపడటం మానేయాలి. సొంత కాళ్ళ మీద నిలబడి ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేయటానికి ప్రయత్నించాలని అన్నారు. ఇది కూడా చదవండి: అక్రమ వలసలకు చెక్.. ఐరోపా దేశాలు-ట్యునీషియా మధ్య ఒప్పందం -
దయనీయంగా పాక్ పరిస్థితి.. బాంబు పేల్చిన ఐఎంఎఫ్, ఇప్పట్లో కష్టమే!
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ రోజురోజుకి దయనీయంగా మారుతోంది. ఈ మేరకు పాకిస్తాన్ ఆర్ధిక స్థితిగతులపై అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ(ఐఎంఎఫ్) 120 పేజీల నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ప్రకారం ప్రస్తుతానికైతే పాకిస్తాన్ అప్పులతో ఏదో ఒక విధంగా నెట్టుకొస్తుంది కానీ భవిష్యత్తులో వారికి మరిన్ని కష్టాలు తప్పవని తేటతెల్లం చేసింది. ఇప్పటికే పాకిస్తాన్ దేశం ఎక్కడెక్కడో ఉన్న వారి ఆస్తులను అమ్ముకుని నిలదొక్కుకునేందుకు ప్రయత్నం చేస్తోంది. ఇదే క్రమంలో వాషింగ్టన్ లోని వారి ఎంబసీ భవనాన్ని అమ్మకానికి పెట్టింది. అలాగే కరాచీ, లాహోర్ విమానాశ్రయాలను కూడా లీజుకు ఇవ్వాలన్న ఆలోచన చేస్తోంది. ఇస్లామాబాద్ విమానాశ్రయాన్నైతే ఇప్పటికే అవుట్సోర్సింగ్ కు ఇచ్చేసింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఐఎంఎఫ్ ను ఆర్థిక సహాయం కోరిన విషయం తెలిసిందే. ఐఎంఎఫ్ కొంత నిధులను సమకూర్చినా కూడా పాకిస్తాన్ వారి ప్రస్తుత సంక్షోభం నుండి బయటపడాలంటే మరిన్ని నిధులు సమకూర్చుకోవాల్సిన అవసరం ఉందని తెలిపింది ఐఎంఎఫ్. పాకిస్తాన్ ఆర్థిక శాఖ మంత్రి ఇషాక్ దార్ తోనూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ గవర్నర్ జమీల్ అహ్మద్ తోనూ ఆర్థిక ద్రవ్య విధానాలపై వారు చేసిన ఒప్పందం ఆధారంగా నివేదిక తయారుచేశామని ఐఎంఎఫ్ ఈ నివేదికను వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం పాకిస్తాన్ ప్రస్తుత అంతర్గత విధానాలు, దీర్ఘకాలిక చెల్లింపులు దృష్ట్యా వెలుపల నుండి సహకారం అందిస్తున్నవారు మరికొంత కాలం పాక్ ఆర్ధిక వ్యవస్థకు వెన్నుదన్నుగా ఉండాల్సిన అవసరముందని తెలిపింది ఐఎంఎఫ్. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప పాకిస్తాన్ ఈ సంక్షోభం నుండి గట్టెక్కడం కష్టమని నివేదికలో చెప్పకనే చెప్పింది. మరోపక్క పెరుగుతోన్న నిత్యావసర వస్తువుల ధరలకు తాళలేక పాక్ ప్రజలు విలవిలలాడుతున్నారు. వీటితోపాటు ఇటీవలే యూనిట్ పై ఐదు పాకిస్తాన్ రూపాయల విద్యుత్ చార్జీలు, గ్యాస్ చార్జీలు 40% కూడా పెరగడంతో దిక్కుతోచని స్థితిలో జనం కొట్టుమిట్టాడుతున్నారు. ఇది కూడా చదవండి: బ్యూటీ పార్లర్ల నిషేధానికి నిరసనగా రోడ్డెక్కిన ఆఫ్ఘాన్ మహిళలు.. -
సాయం కాదు, సంక్షోభాలు ఆపాలి!
అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) సంస్థ వద్ద ఉన్న వనరులు ప్రపంచ జీడీపీలో 1.1 శాతం మాత్రమే. దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారం ద్వారా లభించే మొత్తాలు ఐఎంఎఫ్ ఇచ్చే రుణాల కంటే ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి ఐఎంఎఫ్ కేవలం పర్యవేక్షణకు, నిఘాకు మాత్రమే పరిమితం కావాలి. ఐఎంఎఫ్ తలకెత్తుకుంటున్న చాలా పనులు ఇతర సంస్థలు ఇంతకంటే మెరుగ్గా నిర్వహించగలవు. చేపట్టిన కార్యక్రమాల పరిమాణం, ఇచ్చిన రుణ మొత్తాల ఆధారంగా ఐఎంఎఫ్ విజయాలను లెక్క వేయకూడదు. అగ్నిమాపక దళం సమర్థతను ఎన్నిసార్లు మంటలు ఆర్పగలిగిందో చూడటం ద్వారా కాకుండా... అగ్ని ప్రమాదాలు జరక్కుండా నివారించగలగడంపై అంచనా వేయడమే సరైన పని. ఇదే సూత్రం ఐఎంఎఫ్కూ వర్తిస్తుంది. ఎలాగైతే వాతావరణ మార్పుల మీద ప్రపంచ బ్యాంక్ ఏమీ చేయలేకపోతున్నదో, దాని కవల అయిన ఇంటర్నేషనల్ మానెటరీ ఫండ్ (అంతర్జాతీయ ద్రవ్య నిధి) సంస్థ కూడా దాని ప్రధాన కార్యకలాపాలపై చేష్టలుడిగి చూస్తోంది. ప్రపంచ ఆర్థిక, వాణిజ్య వ్యవహారాలపై ఓ కన్నేసి ఉంచేందుకు ఏర్పాటు చేసుకున్న సంస్థ ఇది. కానీ అమెరికాలో బ్యాంకులు కుప్ప గూలాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ భారీ కుదుపులకు లోనవు తోంది. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు వడ్డీ రేట్లు పెంచడటంతో ఎదుగు తున్న మార్కెట్లలో రుణాలకు డిమాండ్ పెరిగిపోతోంది. అయినా వీటిని ఎదుర్కోవడంలో ఐఎంఎఫ్ ప్రధాన భూమిక పోషించడం లేదు. లింగవివక్ష, మానవాభివృద్ధి వంటి అంశాల మీద దృష్టి పెడుతూ– అభివృద్ధి చెందుతున్న మార్కెట్లు సంక్షోభాలను ఎదుర్కొ నేలా, తక్కువ ఆదాయమున్న దేశాలు వృద్ధిని పెంచుకునేలా, పేదరి కాన్ని తగ్గించుకునేలా రూపొందించే కార్యక్రమాల మీద ఐఎంఎఫ్ తన మొత్తం శక్తిని వెచ్చిస్తోంది. కానీ ఇతర సంస్థలు కూడా ఈ పనులు మెరుగ్గా నిర్వహించగలవు. నిఘా నామమాత్రం అభివృద్ధి చెందిన దేశాల్లోనూ ఐఎంఎఫ్‌పై ప్రధానంగా ఆరు అభ్యంతరాలు వినిపిస్తాయి! ఆర్థిక మార్కెట్ల అస్థిరత్వానికి దారితీసే ఓపెక్ కేపిటల్ మార్కెట్లకు అవసరానికి మించి మద్దతివ్వడం వీటిల్లో ఒకటి. ఇక రెండో విమర్శ... అభివృద్ధి చెందుతున్న, చెందిన దేశాలకు భిన్నమైన సలహాలివ్వడం. అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక వ్యవస్థలపై నిఘా నామమాత్రంగా సాగడం, ఆ దేశాల విధానాలపై విశ్లేషణ కూడా అంతంతమాత్రంగానే చేయడం మూడో విమర్శ. దీని ప్రభావం చిన్న దేశాలపై కూడా పడుతుందన్నది ఇక్కడ గమనించా ల్సిన విషయం. ప్రపంచస్థాయి సంక్షోభాలను ముందుగానే గుర్తించగలిగే ఐఎంఎఫ్ అసమర్థత కూడా దీనికి జత కలుస్తుంది. ఇప్పుడు నాలుగో విమర్శ విషయానికి వద్దాం. ఐఎంఎఫ్ చేపట్టే కార్యక్రమాల పరిమాణం ఏకపక్షంగా ఉంటుంది. గ్రీస్, పోర్చుగల్, ఐర్లాండ్ వంటి చిన్న యూరోపియన్ దేశాలు తమ కోటా కంటే 30 రెట్లు అదనంగా ఐఎంఎఫ్ ప్రయోజనాలు పొందుతూంటాయి. ఒక వైపు యుద్ధం జరుగుతూండగా, ఉక్రెయిన్‌లో సుమారు 1500 కోట్ల డాలర్ల విలువైన ప్రాజెక్టును హడావిడిగా ఆమోదించారు. ఇదే సమ యంలో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంక కేవలం 300 కోట్ల డాలర్ల సాయం కోసం నెలలు వేచి చూడాల్సి వచ్చింది. శ్రీలంకకు మిత్రుడని చాటుకున్న చైనా కూడా సాయం కోసం ఏడాదిపాటు నిరీక్షింపజేసిన విషయం గమనార్హం. జీ7 దేశాల రాజకీయ మద్దతు లేకుంటే ఇంతకంటే చాలా తక్కువ మొత్తాలకు కూడా చిన్న దేశాలు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. ఇలా చిన్న మొత్తాలను తీసుకున్నప్పుడు పొదుపునకు ప్రాధాన్యం ఎక్కువగా ఉంటుంది. అలాగే సంక్షోభం నుంచి పూర్తిగా బయటపడే అవకాశాలూ తక్కువగా ఉంటాయి. బకాయిల వల్ల రుణాలివ్వడం నిలిపేసిన తరువాత కూడా ఐఎంఎఫ్ వరుసగా రుణాలిస్తోందన్నది ఐదవ విమర్శ. ఈ రుణాలు దివాళా తీయడానికే కాకుండా, ద్రవ్య లభ్యత లేమికీ ఇస్తూండటం గమనార్హం. ఐఎంఎఫ్ తరచూ ప్రైవేట్ రుణదాతలకూ డబ్బులిస్తూంటుంది. అది కూడా వారి వాణిజ్య ప్రభుత్వాలకిచ్చిన రుణాలు ప్రజా రుణంగా మారిన తరువాత కూడా. ఈ రుణాలను చెల్లించాల్సిన బాధ్యత పౌరు లపై పడుతుంది. ఐఎంఎఫ్ సభ్యదేశాల్లో 25 శాతం (48) తమ సభ్యత్వ కాలంలో సగంకాలం రుణగ్రహీతలుగా కొనసాగుతున్నాయి. ఇంకోలా చెప్పాలంటే, ఐఎంఎఫ్ ప్రాపకంలో ఉన్నాయన్నమాట. చివరిగా ఐఎంఎఫ్‌పై ఉన్న ఆరో విమర్శ... ఐక్యరాజ్య సమితి లోని పలు విభాగాలు లేదా బ్యాంకులు చేయదగ్గ పనుల్లో ఐఎంఎఫ్ వేలు పెడుతూండటం. రెసిలియ¯Œ్స అండ్ ట్రస్ట్ ఫెసిలిటీ పేరుతో ఏర్పాటు చేసుకున్న కొత్త పథకం ద్వారా ఇరవై ఏళ్ల గరిష్ఠ పరిమితితో సామాజిక కార్యక్రమాలకు రుణాలిస్తోంది. ఇది కాస్తా ఐఎంఎఫ్‌ను ఏదో అంతర్జాతీయ సహాయ సంస్థ స్థాయికి మార్చేసిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రపంచస్థాయి సమస్యలకు పనికిరాదు? 2008–09 ఆర్థిక మాంద్యం, 2020 నాటి కోవిడ్, తాజాగా రష్యా– ఉక్రెయి¯Œ యుద్ధం... ఈ అంశాలపై ఐఎంఎఫ్ వ్యవహారశైలిని గమనిస్తే, తనకున్న నియమ నిబంధనలు, వనరులను దృష్టిలో ఉంచుకుంటే... అంతర్జాతీయ సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కోగల సత్తా ఈ సంస్థకు లేదనే చెప్పాల్సి వస్తుంది. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారం, ఆయా ప్రాంతాల్లోని దేశాలు చేసుకునే ఒప్పందాల ప్రకారం లభించే మొత్తాలు ఐఎంఎఫ్ ఇచ్చేదాని కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటున్నాయి. ఐఎంఎఫ్ వద్ద ఉన్న వనరులు ఇప్పుడు సుమారు లక్ష కోట్ల డాలర్లు లేదా ప్రపంచ జీడీపీలో 1.1 శాతం మాత్రమే. ఇది ఒకట్రెండు దేశాల ఆర్థిక సంక్షోభాలను గట్టెక్కించేందుకూ ఉపయోగపడని పరిస్థితి. అంతర్జాతీయ సంక్షోభాల మాట సరేసరి. ఈ మొత్తంలోనూ సగం సొంత వనరుల నుంచి సమ కూర్చున్నవి కాగా, మిగిలిన సగం విచక్షణపై లభించే రుణ ఏర్పాట్లు. ఐఎంఎఫ్ మూలధనాన్ని కనీసం రెట్టింపు చేయాల్సిన అవస రముంది. అలాగే జీడీపీ ఆధారంగా ఎప్పటికప్పుడు సర్దుబాట్లూ చేయాలి. రుణాలపై సంక్షోభం ఏర్పడే పరిస్థితులున్న ఈ తరు ణంలో ఇది మరీ ప్రాధాన్యం సంతరించుకుంటుంది. ఐఎంఎఫ్ ప్రాంతీయ స్థాయిలో లిక్విడిటీ ఏర్పాట్లు చేయడం ద్వారా సూక్ష్మ స్థాయిలో ఆర్థిక స్థిరత్వానికి తోడ్పాటునందించాలి. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్డీఆర్) కింద సుమారు 660.7 బిలియన్లుఉండగా(ఇది కరెన్సీ కాదు) ఇవి సుమారు 950 బిలియన్ డాలర్లకు సమానం. అంటే ప్రపంచ జీడీపీలో ఒక శాతం కంటే కొంచెం ఎక్కువ. ఒక్కో ఎస్డీఆర్ జారీ రాజకీయ ప్రభావానికి గురవుతూంటుంది. ఎస్‌డీఆర్‌లు ఐదేళ్లకు ఒకసారి ఆటోమెటిక్‌గా జారీ అయ్యేలా చూడాలి. అలాగే వీటి మొత్తం జీడీపీలో కనీసం ఒక్కశాతం ఉండేలా, తక్కువ ఆదాయమున్న దేశాలు ఎక్కువ షేర్లు కేటాయించేలా ఏర్పాట్లు చేయా ల్సిన అవసరముంది. అయితే ఈ అంశాలపై ఏకాభిప్రాయం ఇప్పు డున్న పరిస్థితుల్లో చాలా కష్టం. చిట్ట చివరి రుణ వితరణ సంస్థగా ఉండాలి ఆర్థిక వ్యవస్థకు కేంద్రబిందువుగా సంస్కరణలకు లోనైన ఐఎంఎఫ్ ఉండాలి. అలాగే ఇది కేవలం పర్యవేక్షణకు, నిఘాకు మాత్రమే పరిమితం కావాలి. చేపట్టిన కార్యక్రమాల పరిమాణం, ఇచ్చిన రుణ మొత్తాల ఆధారంగా ఐఎంఎఫ్ విజయాలను లెక్క వేయకూడదు. సూక్ష్మస్థాయిలో వాతావరణ మార్పుల ప్రభావాన్ని అంచనా వేయాలే గానీ... సాయం చేసే సంస్థగా మారకూడదు. ఐఎంఎఫ్‌ను చిట్టచివరి రుణ వితరణ సంస్థగా మాత్రమే పరిగణించాలి. ఉనికిలో ఉండేందుకు మాత్రమే కొత్త కొత్త పథకాలను సృష్టించడం, రుణ వితరణ చేపట్టడం చేయరాదు. అగ్నిమాపక దళం సమర్థతను ఎన్నిసార్లు మంటలు ఆర్ప గలిగిందో చూడటం ద్వారా కాకుండా... అగ్ని ప్రమాదాలు జరక్కుండా నివారించగలగడంపై అంచనా వేయడమే సరైన పని. సెంట్రల్ బ్యాంక్స్ పరస్పర సహకారాన్ని ఐఎంఎఫ్ ప్రోత్సహించాలి. అలాగే ప్రాంతీయ స్థాయిలో సహాయానికి కొన్ని వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలి. గతంలో ఇలాంటి ప్రయత్నాలను ఐఎంఎఫ్ నిరోధించిన మాట అందరికీ తెలిసిందే. అన్ని దేశాలకు సాయం చేసే ఏకైక సంస్థగా మారడం కాకుండా... ఆర్థిక సుస్థిరత కోసం బహుముఖీనంగా పని చేసే మరింత శక్తిమంతమైన వ్యవస్థగా ఎదిగేందుకు ఐఎంఎఫ్ ప్రయత్నించాలి. వ్యాసకర్త జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీలో విజిటింగ్ స్కాలర్ (‘ద బిజినెస్ స్టాండర్డ్’ సౌజన్యంతో) -
సాయం కాదు, సంక్షోభాలు ఆపాలి!
అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) సంస్థ వద్ద ఉన్న వనరులు ప్రపంచ జీడీపీలో 1.1 శాతం మాత్రమే. దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారం ద్వారా లభించే మొత్తాలు ఐఎంఎఫ్ ఇచ్చే రుణాల కంటే ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి ఐఎంఎఫ్ కేవలం పర్యవేక్షణకు, నిఘాకు మాత్రమే పరిమితం కావాలి. ఐఎంఎఫ్ తలకెత్తుకుంటున్న చాలా పనులు ఇతర సంస్థలు ఇంతకంటే మెరుగ్గా నిర్వహించగలవు. చేపట్టిన కార్యక్రమాల పరిమాణం, ఇచ్చిన రుణ మొత్తాల ఆధారంగా ఐఎంఎఫ్ విజయాలను లెక్క వేయకూడదు. అగ్నిమాపక దళం సమర్థతను ఎన్నిసార్లు మంటలు ఆర్పగలిగిందో చూడటం ద్వారా కాకుండా... అగ్ని ప్రమాదాలు జరక్కుండా నివారించగలగడంపై అంచనా వేయడమే సరైన పని. ఇదే సూత్రం ఐఎంఎఫ్కూ వర్తిస్తుంది. ఎలాగైతే వాతావరణ మార్పుల మీద ప్రపంచ బ్యాంక్ ఏమీ చేయలేకపోతున్నదో, దాని కవల అయిన ఇంటర్నేషనల్ మానెటరీ ఫండ్ (అంతర్జాతీయ ద్రవ్య నిధి) సంస్థ కూడా దాని ప్రధాన కార్యకలాపాలపై చేష్టలుడిగి చూస్తోంది. ప్రపంచ ఆర్థిక, వాణిజ్య వ్యవహారాలపై ఓ కన్నేసి ఉంచేందుకు ఏర్పాటు చేసుకున్న సంస్థ ఇది. కానీ అమెరికాలో బ్యాంకులు కుప్ప గూలాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ భారీ కుదుపులకు లోనవుతోంది. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు వడ్డీ రేట్లు పెంచడటంతో ఎదుగుతున్న మార్కెట్లలో రుణాలకు డిమాండ్ పెరిగిపోతోంది. అయినా వీటిని ఎదుర్కోవడంలో ఐఎంఎఫ్ ప్రధాన భూమిక పోషించడం లేదు. లింగవివక్ష, మానవాభివృద్ధి వంటి అంశాల మీద దృష్టి పెడుతూ– అభివృద్ధి చెందుతున్న మార్కెట్లు సంక్షోభాలను ఎదుర్కొ నేలా, తక్కువ ఆదాయమున్న దేశాలు వృద్ధిని పెంచుకునేలా, పేదరి కాన్ని తగ్గించుకునేలా రూపొందించే కార్యక్రమాల మీద ఐఎంఎఫ్ తన మొత్తం శక్తిని వెచ్చిస్తోంది. కానీ ఇతర సంస్థలు కూడా ఈ పనులు మెరుగ్గా నిర్వహించగలవు. నిఘా నామమాత్రం అభివృద్ధి చెందిన దేశాల్లోనూ ఐఎంఎఫ్‌పై ప్రధానంగా ఆరు అభ్యంతరాలు వినిపిస్తాయి! ఆర్థిక మార్కెట్ల అస్థిరత్వానికి దారితీసే ఓపెన్ కేపిటల్ మార్కెట్లకు అవసరానికి మించి మద్దతివ్వడం వీటిల్లో ఒకటి. ఇక రెండో విమర్శ... అభివృద్ధి చెందుతున్న, చెందిన దేశాలకు భిన్నమైన సలహాలివ్వడం. అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక వ్యవస్థలపై నిఘా నామమాత్రంగా సాగడం, ఆ దేశాల విధానాలపై విశ్లేషణ కూడా అంతంతమాత్రంగానే చేయడం మూడో విమర్శ. దీని ప్రభావం చిన్న దేశాలపై కూడా పడుతుందన్నది ఇక్కడ గమనించా ల్సిన విషయం. ప్రపంచస్థాయి సంక్షోభాలను ముందుగానే గుర్తించగలిగే ఐఎంఎఫ్ అసమర్థత కూడా దీనికి జత కలుస్తుంది. ఇప్పుడు నాలుగో విమర్శ విషయానికి వద్దాం. ఐఎంఎఫ్ చేపట్టే కార్యక్రమాల పరిమాణం ఏకపక్షంగా ఉంటుంది. గ్రీస్, పోర్చుగల్, ఐర్లాండ్ వంటి చిన్న యూరోపియన్ దేశాలు తమ కోటా కంటే 30 రెట్లు అదనంగా ఐఎంఎఫ్ ప్రయోజనాలు పొందుతూంటాయి. ఒక వైపు యుద్ధం జరుగుతూండగా, ఉక్రెయిన్ లో సుమారు 1500 కోట్ల డాలర్ల విలువైన ప్రాజెక్టును హడావిడిగా ఆమోదించారు. ఇదే సమయంలో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంక కేవలం 300 కోట్ల డాలర్ల సాయం కోసం నెలలు వేచి చూడాల్సి వచ్చింది. శ్రీలంకకు మిత్రుడని చాటుకున్న చైనా కూడా సాయం కోసం ఏడాదిపాటు నిరీక్షింపజేసిన విషయం గమనార్హం. జీ7 దేశాల రాజకీయ మద్దతు లేకుంటే ఇంతకంటే చాలా తక్కువ మొత్తాలకు కూడా చిన్న దేశాలు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. ఇలా చిన్న మొత్తాలను తీసుకున్నప్పుడు పొదుపునకు ప్రాధాన్యం ఎక్కువగా ఉంటుంది. అలాగే సంక్షోభం నుంచి పూర్తిగా బయటపడే అవకాశాలూ తక్కువగా ఉంటాయి. బకాయిల వల్ల రుణాలివ్వడం నిలిపేసిన తరువాత కూడా ఐఎంఎఫ్ వరుసగా రుణాలిస్తోందన్నది ఐదవ విమర్శ. ఈ రుణాలు దివాళా తీయడానికే కాకుండా, ద్రవ్య లభ్యత లేమికీ ఇస్తూండటం గమనార్హం. ఐఎంఎఫ్ తరచూ ప్రైవేట్ రుణదాతలకూ డబ్బులిస్తూంటుంది. అది కూడా వారి వాణిజ్య ప్రభుత్వాలకిచ్చిన రుణాలు ప్రజా రుణంగా మారిన తరువాత కూడా. ఈ రుణాలను చెల్లించాల్సిన బాధ్యత పౌరు లపై పడుతుంది. ఐఎంఎఫ్ సభ్యదేశాల్లో 25 శాతం (48) తమ సభ్యత్వ కాలంలో సగంకాలం రుణగ్రహీతలుగా కొనసాగుతున్నాయి. ఇంకోలా చెప్పాలంటే, ఐఎంఎఫ్ ప్రాపకంలో ఉన్నాయన్నమాట. చివరిగా ఐఎంఎఫ్‌పై ఉన్న ఆరో విమర్శ... ఐక్యరాజ్య సమితి లోని పలు విభాగాలు లేదా బ్యాంకులు చేయదగ్గ పనుల్లో ఐఎంఎఫ్ వేలు పెడుతూండటం. రెసిలియన్్స అండ్ ట్రస్ట్ ఫెసిలిటీ పేరుతో ఏర్పాటు చేసుకున్న కొత్త పథకం ద్వారా ఇరవై ఏళ్ల గరిష్ఠ పరిమితితో సామాజిక కార్యక్రమాలకు రుణాలిస్తోంది. ఇది కాస్తా ఐఎంఎఫ్‌ను ఏదో అంతర్జాతీయ సహాయ సంస్థ స్థాయికి మార్చేసిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రపంచస్థాయి సమస్యలకు పనికిరాదు? 2008–09 ఆర్థిక మాంద్యం, 2020 నాటి కోవిడ్, తాజాగా రష్యా– ఉక్రెయిన్ యుద్ధం... ఈ అంశాలపై ఐఎంఎఫ్ వ్యవహారశైలిని గమనిస్తే, తనకున్న నియమ నిబంధనలు, వనరులను దృష్టిలో ఉంచుకుంటే... అంతర్జాతీయ సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కోగల సత్తా ఈ సంస్థకు లేదనే చెప్పాల్సి వస్తుంది. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారం, ఆయా ప్రాంతాల్లోని దేశాలు చేసుకునే ఒప్పందాల ప్రకారం లభించే మొత్తాలు ఐఎంఎఫ్ ఇచ్చేదాని కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటున్నాయి. ఐఎంఎఫ్ వద్ద ఉన్న వనరులు ఇప్పుడు సుమారు లక్ష కోట్ల డాలర్లు లేదా ప్రపంచ జీడీపీలో 1.1 శాతం మాత్రమే. ఇది ఒకట్రెండు దేశాల ఆర్థిక సంక్షోభాలను గట్టెక్కించేందుకూ ఉపయోగపడని పరిస్థితి. అంతర్జాతీయ సంక్షోభాల మాట సరేసరి. ఈ మొత్తంలోనూ సగం సొంత వనరుల నుంచి సమ కూర్చున్నవి కాగా, మిగిలిన సగం విచక్షణపై లభించే రుణ ఏర్పాట్లు. ఐఎంఎఫ్ మూలధనాన్ని కనీసం రెట్టింపు చేయాల్సిన అవస రముంది. అలాగే జీడీపీ ఆధారంగా ఎప్పటికప్పుడు సర్దుబాట్లూ చేయాలి. రుణాలపై సంక్షోభం ఏర్పడే పరిస్థితులున్న ఈ తరుణంలో ఇది మరీ ప్రాధాన్యం సంతరించుకుంటుంది. ఐఎంఎఫ్ ప్రాంతీయ స్థాయిలో లిక్విడిటీ ఏర్పాట్లు చేయడం ద్వారా సూక్ష్మ స్థాయిలో ఆర్థిక స్థిరత్వానికి తోడ్పాటునందించాలి. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్డీఆర్) కింద సుమారు 660.7 బిలియన్లు ఉండగా(ఇది కరెన్సీ కాదు) ఇవి సుమారు 950 బిలియన్ డాలర్లకు సమానం. అంటే ప్రపంచ జీడీపీలో ఒక శాతం కంటే కొంచెం ఎక్కువ. ఒక్కో ఎస్డీఆర్ జారీ రాజకీయ ప్రభావానికి గురవుతూంటుంది. ఎస్‌డీఆర్‌లు ఐదేళ్లకు ఒకసారి ఆటోమెటిక్‌గా జారీ అయ్యేలా చూడాలి. అలాగే వీటి మొత్తం జీడీపీలో కనీసం ఒక్కశాతం ఉండేలా, తక్కువ ఆదాయమున్న దేశాలు ఎక్కువ షేర్లు కేటాయించేలా ఏర్పాట్లు చేయా ల్సిన అవసరముంది. అయితే ఈ అంశాలపై ఏకాభిప్రాయం ఇప్పు డున్న పరిస్థితుల్లో చాలా కష్టం. చిట్ట చివరి రుణ వితరణ సంస్థగా ఉండాలి ఆర్థిక వ్యవస్థకు కేంద్రబిందువుగా సంస్కరణలకు లోనైన ఐఎంఎఫ్ ఉండాలి. అలాగే ఇది కేవలం పర్యవేక్షణకు, నిఘాకు మాత్రమే పరిమితం కావాలి. చేపట్టిన కార్యక్రమాల పరిమాణం, ఇచ్చిన రుణ మొత్తాల ఆధారంగా ఐఎంఎఫ్ విజయాలను లెక్క వేయకూడదు. సూక్ష్మస్థాయిలో వాతావరణ మార్పుల ప్రభావాన్ని అంచనా వేయాలే గానీ... సాయం చేసే సంస్థగా మారకూడదు. ఐఎంఎఫ్‌ను చిట్టచివరి రుణ వితరణ సంస్థగా మాత్రమే పరిగణించాలి. ఉనికిలో ఉండేందుకు మాత్రమే కొత్త కొత్త పథకాలను సృష్టించడం, రుణ వితరణ చేపట్టడం చేయరాదు. అగ్నిమాపక దళం సమర్థతను ఎన్నిసార్లు మంటలు ఆర్ప గలిగిందో చూడటం ద్వారా కాకుండా... అగ్ని ప్రమాదాలు జరక్కుండా నివారించగలగడంపై అంచనా వేయడమే సరైన పని. సెంట్రల్ బ్యాంక్స్ పరస్పర సహకారాన్ని ఐఎంఎఫ్ ప్రోత్సహించాలి. అలాగే ప్రాంతీయ స్థాయిలో సహాయానికి కొన్ని వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలి. గతంలో ఇలాంటి ప్రయత్నాలను ఐఎంఎఫ్ నిరోధించిన మాట అందరికీ తెలిసిందే. అన్ని దేశాలకు సాయం చేసే ఏకైక సంస్థగా మారడం కాకుండా... ఆర్థిక సుస్థిరత కోసం బహుముఖీనంగా పని చేసే మరింత శక్తిమంతమైన వ్యవస్థగా ఎదిగేందుకు ఐఎంఎఫ్ ప్రయత్నించాలి. అజయ్ ఛిబ్బర్ వ్యాసకర్త జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీలో విజిటింగ్ స్కాలర్ (‘ద బిజినెస్ స్టాండర్డ్’ సౌజన్యంతో) -
భారత్ వృద్ధి రేటుకు ప్రపంచ బ్యాంక్ కోత
వాషింగ్టన్: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ఏప్రిల్‌తో ప్రారంభమైన ఆర్థిక సంవత్సరంలో (2023–24) 6.3 శాతానికి పరిమితమవుతుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. ఈ మేరకు క్రితం అంచనాలను 6.6 శాతం నుంచి 30 బేసిస్ పాయింట్లు తగ్గించింది. పెరుగుతున్న వడ్డీరేట్లు, ఆదాయ వృద్ధి మందగమనం, అధిక ధరలు, ప్రపంచ ఆర్థిక అనిశ్చితి పరిస్థితులు తన క్రితం అంచనాల తాజా తగ్గింపునకు కారణమని దక్షిణాసియాకు సంబంధించి ఆవిష్కరించిన నివేదికలో బహుళజాతి బ్యాంకింగ్ దిగ్గజం పేర్కొంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్), ప్రపంచ బ్యాంకు వార్షిక (స్ప్రింగ్) సమావేశాలకు ముందు వరల్డ్ బ్యాంక్ చీఫ్ ఎకనమిస్ట్ (దక్షిణాసియా) హన్స్ టిమ్మర్ ఈ నివేదిక విడుదల చేశారు. నివేదికలోని మరికొన్ని ముఖ్యాంశాలు... ♦ బలహీన వినియోగం, కఠిన వడ్డీరేట్ల వ్యవస్థ ముఖ్యంగా ప్రభుత్వ ప్రస్తుత వ్యయ నియంత్రణ అంచనాల డౌన్‌గ్రేడ్‌కు ప్రధాన కారణం. ♦ దక్షిణాసియాలోని అనేక ఇతర దేశాల కంటే భారతదేశంలో పరిస్థితి మెరుగ్గానే ఉంది. ఆర్థిక రంగంలో పరిస్థితి ఇతర దేశాల కంటే బాగుంది. భారతదేశంలోని బ్యాంకులు పటిష్ట స్థితిలో ఉన్నాయి. మహమ్మారి తర్వాత బ్యాంకింగ్ చక్కటి రికవరీ సాధించింది. ఆర్థిక వ్యవస్థలో తగిన రుణాలకుగాను లిక్విడిటీ బాగుంది. ఇటీవలి సంవత్సరాలతో పోలిస్తే ప్రైవేట్ పెట్టుబడులు చాలా బలంగా ఉన్నాయి. సమస్యల్లా దేశం తన సామర్థ్యాన్ని తక్కువ స్థాయిలో వినియోగించుకోవడమే. ♦ భారతదేశంలో మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యం 20 శాతం కంటే తక్కువకు పడిపోయింది. అసంఘటిత రంగం ఉత్పాదకత పెరుగుతోందన్న దాఖలాలు లేవు. అలాగని ఫలితాలూ మరీ అధ్వానంగానూ లేవు. ఆయా అంశాలను పరిశీలిస్తే అన్ని వర్గాల భాగస్వామ్యంతో వృద్ధిని మరింత పెంచడానికి భారత్ ముందు భారీ నిర్మాణాత్మక ఎజెండా ఉందని భావిస్తున్నాం. ♦ విదేశాల నుండి ప్రైవేట్ పెట్టుబడులు మరింత పెరగాలి. ముఖ్యంగా సేవల రంగాన్ని ఇక్కడ ప్రస్తావించుకోవాలి. ఇందుకుగాను సంస్కరణల ఎజెండాను మరింత ముందుకు తీసుకువెళ్లాలి. అలాగే అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా వాతావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ, ఉద్గారాల కట్టడికి పటిష్ట చర్యలు తీసుకోవాలి. దక్షిణాసియా దేశాలపై ఇలా.. స్వల్పకాలికంగా చూస్తే, భారత్ దక్షిణాసియాలో ఇతర దేశాలకంటే పటిష్ట ఎకానమీని కలిగి ఉంది. భూటాన్ మినహా ఈ ప్రాంతంలోని అన్ని దేశాలు తమ వృద్ధి అంచనాలను కుదించుకుంటున్నాయి. గత ఏడాది విపత్తు వరదల ప్రభావంతో పాకిస్తాన్ ఇంకా సతమతమవుతూనే ఉంది. సరఫరాల వ్యవస్థకు తీవ్ర అంతరాయాలు ఎదురవుతున్నాయి. పెట్టుబడిదారుల విశ్వాసం దిగజారుతోంది. అధిక రుణ, మూలధన వ్యయాలు భారమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పాక్ వృద్ధి ఈ ఏడాది 0.4 శాతానికి తగ్గుతుందన్న అంచనాలు ఉన్నాయి. ఇక రుణ సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంక ఎకానమీలో వృద్ధి లేకపోగా, ఇది ఈ ఏడాది 4.3% క్షీణిస్తుందన్నది అంచనా. పర్యాటకం ఊపందుకోవడం మాల్దీవులు, నేపాల్‌కు సానుకూల అంశాలైనా, అంతకుమించి అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి ప్రభావాలు ఈ దేశాలు ఎదుర్కొననున్నాయి. దక్షిణాసియాలో 2023లో 8.9 శాతం ద్రవ్యోల్బణం అంచనాలు ఉన్నాయి. 2024లో ఇది 7% లోపునకు తగ్గవచ్చు. అయితే బలహీన కరెన్సీలు పెద్ద సమస్యగా ఉంది. ద్రవ్యోల్బణం భయాలను పెంచే అంశమిది. వృద్ధి 6.4 శాతం: ఏడీబీ ఇదిలాఉండగా, 2023–24లో భారత్ వృద్ధి రేటు 6.4 శాతంగా ఉంటుందని ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) అవుట్‌లుక్ ఒకటి పేర్కొంది. 2023 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 6.8 శాతం వృద్ధి నమోదవుతుందని అంచనావేసిన ఏడీబీ, 2023–24లో ఈ రేటు తగ్గడానికి కఠిన ద్రవ్య పరిస్థితులు, చమురు ధరలు పెరగడాన్ని కారణంగా చూపింది. కాగా, 2024–25లో వృద్ధి రేటు 6.7 శాతానికి పెరుగుతుందని ఏడీబీ అంచనావేసింది. ప్రైవేటు వినియోగం, పెట్టుబడులు పెరగడం దీనికి కారణంగా చూపింది. రవాణా రంగం పురోగతికి, వ్యాపార పరిస్థితులు మెరుగుపడ్డానికి ప్రభుత్వం తీసుకునే చర్యలు ఫలితాలు ఇస్తాయని ఏడీబీ వివరించింది. అంతర్జాతీయంగా పలు దేశాలు మాంద్యం ముంగిట నుంచున్నప్పటికీ, భారత్ ఎకానమీ తన సహచర దేశాల ఎకానమీలతో పోల్చితే పటిష్టంగా ఉందని ఏడీబీ కంట్రీ డైరెక్టర్ టకియో కినీషీ పేర్కొన్నారు. -
ఫారెక్స్.. మూడోవారమూ కిందికే
ముంబై: భారత్ విదేశీ మారకద్రవ్య నిల్వలు (ఫారెక్స్) పరిమాణం వరుసగా మూడో వారం కూడా దిగువముఖంగానే పయనించింది. ఫిబ్రవరి 17తో తేదీతో ముగిసిన వారంలో ఫారెక్స్ నిల్వలు 5.681 బిలియన్ డాలర్లు తగ్గి, 561.267 బిలియన్ డాలర్లకు చేరాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) శుక్రవారం విడుదల చేసిన గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. 2021 అక్టోబర్‌లో భారత్ ఫారెక్స్ నిల్వలు 645 బిలియన్ డాలర్ల రికార్డు స్థాయికి చేరాయి. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో రూపాయి విలువ పడిపోకుండా చూసే క్రమంలో రిజర్వ్ బ్యాంక్ భారీగా డాలర్లు వ్యయం చేయడంతో గరిష్ట స్థాయి నుంచి 100 బిలియన్ డాలర్లుకుపైగా పడిపోయాయి. అయితే ఫిబ్రవరి 3కు ముందు వారానికి ముందు 21 రోజుల్లో పురోగతి బాటన పయనించాయి. అటు తర్వాతి వారం నుంచీ నిల్వలు తరుగుదలలో ఉన్నాయి. వివరాల్లోకి వెళితే.. అన్ని విభాగాలూ కిందకే... ♦ డాలర్ల రూపంలో పేర్కొనే ఫారిన్ కరెన్సీ అసెట్స్ ఫిబ్రవరి 17వ తేదీతో ముగిసిన వారంలో 4.515 బిలియన్ డాలర్లు తగ్గి, 496.07 బిలియన్ డాలర్లకు చేరాయి. ♦ పసిడి నిల్వలు వరుసగా మూడవ వారమూ తగ్తాయి. సమీక్షా వారంలో 1.045 బిలియన్ డాలర్లు తగ్గి 41.817 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ♦ అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థ వద్ద స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్డీఆర్) 87 మిలియన్ డాలర్లు పెరిగి, 18.267 బిలియన్ డాలర్లకు చేరింది. ♦ ఇక ఐఎంఎఫ్ వద్ద భారత్ రిజరŠవ్స్ పరిస్థితి 34 మిలియన్ డాలర్లు తగ్గి, 5.11 బిలియన్ డాలర్లకు చేరింది. -
శ్రీలంకలో కరెంట్ చార్జీల మోత.. ఐఎంఎఫ్ ఒత్తిడికి తలొగ్గి నిర్ణయం..
కొలంబో: అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) నిబంధనలు శ్రీలంక ప్రజల పాలిట పెనుభారంగా మారుతున్నాయి. ఐఎంఎఫ్ విధించిన నిబంధనలకు తలొగ్గిన శ్రీలంక ప్రభుత్వం విద్యుత్ చార్జీలను 66 శాతం పెంచేస్తూ నిర్ణయం తీసుకుంది. కరెంటు చార్జీలు పెంచడం గత ఆరు నెలల్లో ఇది రెండోసారి. బిల్లుల పెంపు నేపథ్యంలో విద్యుత్ కోతలకు గురువారం నుంచే తెరపడింది. ఇకపై నిరంతరాయంగా కరెంటు సరఫరా చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. శ్రీలంకలో గత ఏడాది కాలంగా కరెంటు కోతలు కొనసాగాయి. నిత్యం ఒక గంట నుంచి 14 గంటలదాకా కరెంటు సరఫరా నిలిపివేశారు. రుణం ఇవ్వాలంటే విద్యుత్ చార్జీలు పెంచాలని ఐఎంఎఫ్ స్పష్టం చేయడంతో శ్రీలంక ప్రభుత్వం ఒప్పుకోక తప్పలేదు. ఐఎంఎఫ్ నుంచి 2.9 బిలియన్ డాలర్ల రుణం తీసుకోనుంది. చదవండి: ఉక్రెయిన్‌పై మరోసారి క్షిపణలు వర్షం.. -
కోత పడింది.. ఈ ఏడాది వృద్ధి 6.1 శాతమే
వాషింగ్టన్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి(2022–23) దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి అంచనాలలో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) తాజాగా కోత పెట్టింది. 2022లో సాధించిన 6.8 శాతంతో పోలిస్తే 6.1 శాతం వృద్ధి నమోదుకాగలదని అభిప్రాయపడింది. మరోపక్క ప్రపంచ ఆర్థిక భవిష్యత్‌పట్ల జనవరి అంచనాలను వెలువరించింది. దీనిలో భాగంగా ప్రపంచ వృద్ధి అంచనాలను సైతం 3.4 శాతం నుంచి 2.9 శాతానికి తగ్గించింది. అయితే వచ్చే ఏడాది(2024)లో కొంత పుంజుకుని 3.1 శాతం పురోగతి నమోదుకాగలదని అంచనా వేసింది. నిజానికి అక్టోబర్‌లో ప్రకటించిన ఇండియా వృద్ధి ఔట్లుక్ 6.8 శాతంలో ఎలాంటి మార్పులేదని, విదేశీ అంశాల కారణంగా కొంతమేర మందగించి 6.1 శాతంగా నమోదుకాగలదని తాజాగా భావిస్తున్నట్లు ఐఎంఎఫ్ రీసెర్చ్ డిపార్ట్మెంట్ చీఫ్ ఎకనమిస్ట్, డైరెక్టర్ పియరీ ఒలీవియర్ గొరించాస్ పేర్కొన్నారు. తిరిగి వచ్చే ఏడాది(2023–24)లో 6.8 శాతం వృద్ధిని సాధించగలదని అంచనా వేశారు. విదేశీ సవాళ్లు ఎదురైనప్పటికీ ఇందుకు దేశీ డిమాండు సహకరించగలదని అభిప్రాయపడ్డారు. చదవండి: కేంద్ర బడ్జెట్‌పై గంపెడు ఆశలు..పేద, మధ్యతరగతి ప్రజలు ఏం కోరుకుంటున్నారు! -
సంక్షోభానికి చివరి అంచున నిలబడ్డ పాక్! చివరికి శ్రీలంకలానే..
పాక్‌లో ఆర్థిక పరిస్థితులు చాల ఘోరంగా ఉన్నాయి. మరోవైపు ఐఎంఎఫ్ అధికారులు నగదు విషయమై చర్చించేందుకు మంగళవారం పాకిస్తాన్లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో పాక్‌లో తీవ్ర ఆందోళనలో మొదలయ్యాయి. ఒక పక్క రూపాయి విలువ పతనమవ్వడం, ద్రవ్యోల్బణం పెరగడం వంటి కారణంగా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఆ దేశ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ అక్టోబర్‌లో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో ప్రజల్లో వ్యతిరేకత వస్తుందన్న భయంతో.. నెలల తరబడి అంతర్జాతీయ ద్రవ్య నిధి డిమాండ్ చేసిన పన్నుల పెంపు, సబ్సిడీ కోతలకు వ్యతిరేకంగా పోరాడారు. దీంతో ఇటీవల పాక్ దివాలా దిశగా అడుగులు వేసింది. అదీగాక స్నేహ పూర్వక దేశాలు సాయం చేసేందుకు రాకపోవడంతో పాక్ ఐంఎఫ్ డిమాండ్లకు తలొగ్గక తప్పలేదు. అంతేగా యూఎస్ డాలర్ల బ్లాక్‌మార్కెట్‌ని నియంత్రించడానికి ప్రభుత్వం రూపాయిపై నియంత్రణలను సడలించింది. దీంతో కరెన్సీ రికార్డు స్థాయికి పడిపోయింది. అలాగే తక్కువ ధరకే లభించే కృత్రిమ పెట్రోల్ ధరలను సైతం పెంచారు. ఈ మేరకు ప్రపంచ బ్యాంకు ఆర్థికవేత్త అబిద్ హసన్ మాట్లాడుతూ.."తాము సంక్షోభానికి చివర అంచులో ఉన్నాం. తమ ప్రభుత్వం ఐఎంఎఫ్ డిమాండ్లను నెరవేర్చడం గురించి ప్రజలకు తెలియజేయాలి. లేదంటే దేశం కచ్చితంగా సంక్షోభంలో మునిగిపోతుంది. చివరికి శ్రీలంకలా అయిపోతుంది. ఐతే మా పరిస్థితి మాత్రం బహుశా అక్కడికంటే ఘోరంగా ఉండొచ్చు." అని ఆవేదనగా చెప్పారు. కాగా, శ్రీలంక కూడా పాక్ మాదిరిగానే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయి, చివరికి ఆ దేశ నాయకుడు దేశం విడిచి పారిపోయే పరిస్థితికి దారితీసింది. అదీగాక పాకిస్తాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ ఎకనామిక్స్‌కి చెందిన విశ్లేషకుడు నాసిర్ ఇక్బాల్ రాజకీయ అనిశ్చితి కారణంగా ఆర్థిక వ్యవస్థ నిర్వహణ సరిగా లేదని, వాస్తవంగా కుప్పకూలిపోతుందని హెచ్చరించారు కూడా. కొనుగోలు చేయలేని స్థితిలో ప్రజలు ప్రపంచంలోనే ఎక్కువ వినియోగదారులు ఉన్న ఐదవ అతిపెద్ద స్టేట్ బ్యాంకులో సుమారు రూ. 30 వేల కోట్లు (3.7 బిలియన్ డాలర్లు) మాత్రమే ఉన్నాయి. ఇది కేవలం మూడు వారాల దిగుమతులను కొనుగోలు చేయడానికే సరిపోతుంది. దీంతో కొనుగోలు చేయలేని సరుకంతా కరాచీ పోర్టులోని వేలాది షిప్పింగ్ కంటైనర్లలోనే ఉంటుంది. రూపాయి పతనంలో పరిశ్రమలు కుదేలయ్యాయి. ప్రజా నిర్మాణ ప్రాజెక్టు ఆగిపోయాయి. టెక్స్టైల్స్ ప్యాక్టరీలు పాక్షికంగా మూతపడ్డాయి. దీంతో పెట్టుబడులు మందగించాయి. డజన్ల కొద్ది కూలీలు ఉపాధి లేక అల్లాడుతున్నారు. ఫలితంగా బిక్షాటన చేసే వారి సంఖ్య పెరిగింది. ద్రవ్యోల్బణం కారణంగా ప్రజల ఆదాయం మార్గాలు తగ్గడంతో నిత్యావసర వస్తువులను కొనుగోలు చేయలేని దారుణ స్థితిలో ఉన్నారు. గందరగోళంగా ఉన్న రాజకీయ పరిస్థితులు జూన్‌లో ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు 33 మిలియన్ డాలర్ల రుణాలు ఇతర విదేశీ చెల్లింపులు చెల్లించాల్సి ఉందని స్టేట్ బ్యాంకు గవర్నర్ జమిల్ అహ్మద్ గత నెలలో వెల్లడించారు. మరోవైపు దేశం తీవ్ర ఇంధన కొరతతో అల్లాడుతోంది. గత వారం ఖర్చుల కోత చర్యల కారణంగా.. విద్యుత్ గ్రిడ్‌లో సాంకేతిక లోపం సంభవించి.. ఒక రోజంతా అంధకారంలోనే ఉండిపోయింది. ఐతే పాక్ పెట్రోలియం మంత్రి ముసాదిక్ మాలిక్ ఏప్రిల్ నుంచి రష్యా చమురు దిగుమతులు ప్రారంభమవుతాయని, ఒప్పందంలో భాగంగా స్నేహ పూర్వక దేశాల మధ్య కరెన్సీలలో చెల్లింపులు జరుగుతాయని ఆశాభావంగా చెప్పారు. ఇదిలా ఉండగా పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ముందస్తు ఎన్నికల కోసం తన ప్రయత్నంలో భాగంగా పాలక కూటమిపై ఒత్తిడి పెంచారు. గతేడాది అవిశ్వాస తీర్మానం కారణంగా పదవి నుంచి తొలగించబడ్డ ఖాన్ 2019లో ఐఎంఎఫ్‌తో బహుళ బిలియన్ డాలర్ల రుణ ప్యాకేజీపై చర్చలు జరిపారు. ఐతే ఈ కార్యక్రమం అనుహ్యంగా నిలిచిపోయింది. ఇప్పటికే రెండు డజన్లకు పైగా ఖరారు చేసుకున్న ఐఎంఎఫ్ ఒప్పందాలు విచ్ఛిన్నమయ్యాయి. ఒకవేళ పాకిస్తాన్ ఈ పరిస్థితి నుంచి తాత్కాలికంగా తప్పించుకున్నప్పటికీ భవిష్యత్తులో పరిస్థితులు మరింత అధ్వాన్నంగా మారడమే గాక పేదరికి తీవ్రతరం అవుతుందని రాజీకీయ విశ్లేషకుడు మైఖేలే కుగెల్ మాన్ ట్విట్టర్లో పేర్కొన్నారు. దేశంలో పెద్దస్థాయిలో సంస్కరణలు తీసుకురాలేకపోతుందని, తదుపరి సంక్షోభాన్ని ఎదుర్కోనే దేశంగా చిట్టచివరి అంచున నిలబడి ఉందని అన్నారు. (చదవండి: పుతిన్‌నే ఎక్కువగా నమ్ముతా! ట్రంప్ సంచలన వ్యాఖ్యలు) -
బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న కేంద్రం.. భారత్‌పై ఐఎంఎఫ్ ప్రశంసల వర్షం!
కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న తరుణంలో ‘అంతర్జాతీయ ద్రవ్య నిధి’ (imf) భారత వృద్ధిరేటుకు సంబంధించి కీలక అంచనాలను వెల్లడించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి ప్రస్తుతం ఉన్న భారత ఆర్థిక వృద్ది రేటు 6.8 నుంచి 6.1 శాతానికి పడిపోతుందనే అభిప్రాయం వ్యక్తం చేసింది. కానీ తిరిగి పుంజుకుంటుందనే అంచనాల్ని ఉదహరిస్తూ ఓ నివేదికను విడుదల చేసింది. గ్లోబల్ వృద్ధి రేటు ఐఎంఎఫ్ అప్డేట్ చేసిన వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ అవుట్‌లుక్‌ను విడుదల చేసింది. ఆ అవుట్ లుక్‌లో 2022 గ్లోబల్ వృద్ధి రేటు 3.4 ఉండగా 2023లో 2.9 శాతానికి తగ్గి 2024లో 3.1శాతానికి పెరుగుతున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా భారత ఆర్థిక వ్యవస్థ వృద్ది రేటుపై ఐఎంఎఫ్ చీఫ్ ఎకనామిస్ట్, రీసెర్చ్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ పియరీ ఒలివర్ గౌరించాస్ మీడియా సమావేశంలో మాట్లాడారు. 6.8శాతంతో వృద్ది రేటు అక్టోబర్ అవుట్ లుక్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు ఎలాంటి మార్పులు చేయలేదన్నారు. కానీ మార్చి తర్వాత ఇండియన్ ఎకానమీ 6.1 శాతానికి దిగజారుతుందనే అంచనా వేసినట్లు తెలిపారు. అందుకు దేశంలోనే పరిస్థితులేనని అన్నారు. పురోగతి సాధ్యమే 2022లో భారత వృద్ది రేటు 6.8 శాతం ఉండగా.. 2023లో 6.1 శాతం తగ్గింది. అయితే దేశీయంగా స్థిరమైన డిమాండ్ కొనసాగనుందనే అంచనాలతో పురోగతి సాధిస్తూ 2024లో 6.8 శాతానికి చేరుకోనుంది. ఆసియా దేశాల్లో ఆసియా దేశాల్లో అభివృద్ది నిలకడగా కొనసాగుతున్న తరుణంలో ఐఎంఎఫ్ ఆర్ధిక వృద్ది రేటును పెంచింది. 2023లో వృద్ది రేటు 5.2శాతం ఉండగా 2024లో 5.5శాతానికి పెంచింది. 2022లో ఊహించిన దానికంటే లోతైన మందగమనం తర్వాత ఆసియా దేశమైన చైనా ఆర్థిక వ్యవస్థకు 4.3 శాతానికి తగ్గించింది ఐఎంఎఫ్. చైనా అభివృద్దిలో అడ్డంకులు 2022 నాల్గవ త్రైమాసికంలో చైనా జీడీపీ మందగించింది. వెరసీ 40 ఏళ్ల చరిత్రలో ప్రపంచ సగటు కంటే తక్కువగా ఉండటం చైనాకు ఇది మొదటిసారి. వ్యాపారంలో శక్తి సామర్ధ్యాలు తగ్గిపోవడం, క్షీణిత, నెమ్మదించిన నిర్మాణాత్మక సంస్కరణల కారణంగా 2022 క్యూ4లో 3.0 శాతంగా ఉన్న వృద్ది రేటును 0.2శాతానికి తగ్గించింది. అది అలాగే మరో రెండేళ్లు కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. ఇక అదే వృద్ది రేటు 2023లో 5.2 శాతం వరకు పెరగొచ్చని ఐఎంఎఫ్ అంచనా వేసింది. అభివృద్ధిలో ఆటుపోట్లు ఎదుర్కొనే అవకాశం ఉందనే అంచనాలతో 2024 కంటే ముందే వృద్ది రేటు 4శాతం తగ్గొచ్చంటూ సూత్రప్రాయంగా వెల్లడించింది. ఆర్థిక వ్యవస్థలో భారత్‌ది తిరుగులేని స్థానం మీడియా ప్రతినిధులు సంధించిన ఓ ప్రశ్నకు సమాధానంగా గౌరించాస్ ఓ బ్లాగ్ పోస్ట్‌లో తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్‌ది ప్రకాశవంతమైన స్థానమని అన్నారు. ప్రపంచ దేశాలతో పోలిస్తే ఈ ఏడాది ప్రపంచ ఆర్థిక వృద్ధిలో సగం వాటా భారత్, చైనాదేనని వెల్లడించారు. అదే అమెరికా, యూరోప్రాంతం కలిసి కేవలం 10 శాతం మాత్రమే ప్రపంచ ఆర్థిక వృద్ధికి దోహదం చేయనున్నట్లు పేర్కొన్నారు. -
పాకిస్తాన్‌కు దెబ్బ మీద దెబ్బ!
ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోతున్న పాకిస్తాన్‌కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. తినడానికి తిండి లేక ఆకలితో అలమటిస్తున్న దాయాది దేశానికి జల రవాణా స్తంభించినట్లు తెలుస్తోంది. పాక్ దిగుమతి చేసుకోవాలనుకున్న 2వేల లగ్జరీ కార్లతో పాటు నిత్యవసర వస్తువులు సైతం సముద్రమార్గాన నిలిచిపోయినట్లు పాక్ మీడియా సంస్థ డాన్ తెలిపింది. పాకిస్తాన్లో ఆర్ధిక సంక్షోభం మరింత ముదురుతోంది. ఇప్పటికే అప్పులిచ్చేందుకు ఆర్ధిక సంస్థలు వెనకాడుతుండగాగా..విదేశీ మారక నిల్వలు అడుగంటిపోతున్నాయి. గతేడాది డిసెంబర్ 30తో గడిచిన వారానికి పాకిస్తాన్ కేంద్ర బ్యాంక్ వద్ద విదేశీ మారక నిల్వలు 5.5 డాలర్లకు పడిపోయాయి.ఇది ఎనిమిదేళ్ల కనిష్టస్థాయి అని డాన్ ప్రచురించింది. ఖజనా ఖాళీ తాజాగా పాక్ ఖజనాలో విదేశీ మారక ద్రవ్యం లోటుతో అప్పులు, అవసరాల్ని తీర్చుకోలేక ఇతర దేశాల నుంచి వచ్చే దిగుమతుల్ని నిలిపివేసింది. ఆ దిగుమతుల్లో గతేడాది జులై నుంచి డిసెంబర్ మధ్య కాలానికి చెందిన 164 లగ్జరీ ఎలక్ట్రిక్ కార్లు ఉన్నాయి. వినియోగించిన లగ్జరీ వాహనాల దిగుమతులు కూడా పెరిగాయని డాన్ వార్తాపత్రిక నివేదిక పేర్కొంది. తగ్గిన కొనుగోలు శక్తి నివేదిక ప్రకారం, గత ఆరు నెలల్లో పాకిస్థాన్ దాదాపు 1,990 వాహనాలను దిగుమతి చేసుకుంది. జూలై నుండి సెప్టెంబర్ వరకు చాలా వరకు దిగుమతులు జరిగాయని, అక్టోబరు నుండి డిసెంబరు వరకు చాలా తక్కువ సంఖ్యలో కార్ల దిగుమతి అవుతున్నాయని సీనియర్ కస్టమ్స్ అధికారులు చెప్పినట్లు డాన్ పత్రిక నివేదించింది. కొనుగోలు శక్తి లేకపోవడం వల్ల వాహనాల దిగుమతులు తగ్గినట్లు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 5వేల కంటైనర్ల నిండా మరోవైపు, ఓడరేవుల వద్ద ఫుడ్,బేవరేజెస్,క్లోతింగ్,షూస్,గ్యాస్ ఆయిల్‌తో పాటు ఇండస్ట్రియల్ గూడ్స్ ప్రొడక్ట్‌లైన ఎలక్ట్రిక్ వస్తువులతో ఉన్న 5 వేల కంటే ఎక్కువ కంటైనర్లను ఉంచినట్లు హైలెట్ చేసింది. పాక్ పర్యటనలో ఐఎంఎఫ్ బృందం ఇక డిసెంబర్ నెల నాటికి పాకిస్తాన్ వద్ద విదేశీ మారక నిల్వలు 5.5 బిలియన్లు ఉండగా ప్రస్తుతం అవికాస్త కనిష్ట స్థాయిలో 3.7 బిలియన్లకు పడిపోయాయి. అయితే ఈ అప్పుల నుంచి బయట పడేసేందుకు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) ప్రతినిధుల బృందం ఈ వారం పాక్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనల్లో అక్కడి పరిస్థితుల్ని అంచనా వేసి రుణాల్ని అందించనుంది. -
నగదు బదిలీ అద్భుతం: ఐఎంఎఫ్
వాషింగ్టన్: కేంద్రం చేపట్టిన ప్రత్యక్ష నగదు బదిలీతో పాటు పలు సంక్షేమ కార్యక్రమాలు నిజంగా అద్భుతమంటూ అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) కొనియాడింది. అంతటి సువిశాల దేశంలో ఇంత భారీ పథకాలను అత్యంత కచ్చితత్వంతో అమలు చేయడం అద్భుతమేనని ఐఎంఎఫ్ డిప్యూటీ డైరెక్టర్ పావులో మారో అన్నారు. ‘‘ఈ విషయంలో భారత్ నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. సంక్టిష్ట సమస్యల పరిష్కారానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని అద్భుతంగా వాడుకుంటూ ప్రపంచానికి భారత్ స్ఫూర్తిదాయకంగా నిలిచింది’’ అని బుధవారం ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘ఈ పథకాల్లో చాలావరకు మహిళలకు సంబంధించినవే. మరికొన్ని వృద్ధులకు, రైతులకు ఉద్దేశించిన పథకాలూ ఉన్నాయి. వీటి సమర్థ అమలుకు ఆధార్‌ను చక్కగా వినియోగించుకోవడం అభినందనీయం’’ అన్నారు. కేంద్రం 2013 నుంచి ఇప్పటిదాకా రూ.24.8 లక్షల కోట్లను లబ్ధిదారుల ఖాతాలకు నేరుగా బదిలీ చేసింది. -
భయపెడుతున్న జోస్యం
అవును.. ఇది ప్రపంచాన్ని భయపెడుతున్న జోస్యం. ఉక్రెయిన్‌పై రష్యా దాడులు సహా అనేక కారణాల వల్ల వచ్చే 2023లో ప్రపంచ ఆర్థికవ్యవస్థ వృద్ధి మునుపు ఆశించినంత ఉండదట. అంతర్జా తీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) జూలైలో వేసిన అంచనా కన్నా 0.2 శాతం తగ్గి, 2.7 శాతమే వృద్ధి సాధిస్తుందట. 2001 నుంచి ఎన్నడూ లేనంతటి అత్యంత బలహీనమైన వృద్ధి ఇది. అదీ కాక, వచ్చే ఏడాది ఆర్థికమాంద్యం లాంటి గడ్డు పరిస్థితి ప్రపంచంలో అత్యధిక జనాభాకు తప్పదని ఐఎంఎఫ్ హెచ్చరించింది. జూలై నాటి అంచనాలను సవరించి, తాజాగా ‘వరల్డ్ ఎకనామిక్ అవుట్‌లుక్’ను ప్రకటించింది. మంగళవారం ప్రకటించిన ఈ అంచనాలు, ముందున్నది ముసళ్ళ పండగ అనే హెచ్చరికలు సహజంగానే నిరాశాజనకం. అదే సమయంలో ఆర్థిక రథసారథులకు మేలుకొలుపు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మూడోవంతు ఈ ఏడాది, లేదంటే వచ్చే ఏడాది కుంచించుకు పోతుందట. ప్రపంచంలోని మూడు అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, యూరోపియన్ యూనియన్, చైనాలు స్తంభిస్తాయట. ఉక్రెయిన్ యుద్ధంతో జర్మనీ, ఇటలీ లాంటి ఆధునిక ఆర్థిక వ్యవస్థలు సైతం మాంద్యంలో కూరుకుపోనున్నాయట. ఐరోపాలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ జర్మనీ పూర్తిగా రష్యా నుంచి వచ్చే ఇంధనం మీదే ఆధారపడడం ఇబ్బంది తెచ్చింది. పాశ్చాత్య దేశాల ఆంక్షలకు ప్రతిగా ఐరోపాకు చమురు సరఫరాలో రష్యా కోత జర్మనీకి తలనొప్పి అయింది. ఫలితంగా, ఐఎంఎఫ్ తాజా అంచనాల ప్రకారం వచ్చే 2023లో జర్మనీ ఆర్థిక వ్యవస్థ 0.3 శాతం మేర కుంచించుకుపోనుంది. చమురు దిగుమతులపై ఆధారపడ్డ ఇటలీ స్థూల జాతీయోత్పత్తి 0.2 శాతం మేర తగ్గనుంది. మొత్తానికి, ఈ ఏడాది ప్రపంచ ద్రవ్యోల్బణం 8.8 శాతం గరిష్ఠానికి చేరుతుందని ఐఎంఎఫ్ అంచనా. వచ్చే 2024కు అది 4.1 శాతానికి తగ్గవచ్చట. మిగిలిన ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే, భారత్ పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నా చిక్కులూ చాలా ఉన్నాయి. భారత ఆర్థిక వృద్ధి 2022 –23లో తగ్గుతుందంటూ గత వారం రోజుల్లో అటు ప్రపంచ బ్యాంక్, ఇటు ఐఎంఎఫ్ – రెండూ అంచనా వేశాయి. ఉక్రెయిన్ యుద్ధం, తత్ఫలితంగా ఇంధన సరఫరా ఇక్కట్లు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ దోవలో వివిధ కేంద్ర బ్యాంకులు ద్రవ్య వినియోగాన్ని కట్టుదిట్టం చేయడం లాంటివన్నీ ఇందుకు కారణాలే. గత ఆర్థిక సంవత్సరం 8.7 శాతం ఉన్న భారత వృద్ధి ఈసారి 6.8 శాతమే ఉండవచ్చని ఐఎంఎఫ్ తాజా మాట. ఏప్రిల్ నాటి అంచనా కన్నా ఇది 1.4 శాతం తక్కువ. ఇక, ప్రపంచ బ్యాంకు అయితే తన తాజా ‘దక్షిణాసియా ఆర్థిక అప్డేట్’ (ఎస్‌ఏఈయూ)లో మన దేశ వృద్ధిరేటు 1 శాతం మేర తగ్గి, 6.5 శాతం దాకా ఉండవచ్చంటోంది. భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ఒక్కటీ మాత్రం మిగిలినవాటికి భిన్నంగా, కాస్తంత మెరుగ్గా ఏడాది మొత్తం మీద 7 శాతం వృద్ధి ఉంటుందని అంచనా కట్టింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సైతం తాజాగా వాషింగ్టన్లో మాట్లాడుతూ ఈ ఏడాది మన వృద్ధి 7 శాతం ఉంటుందని బింకంగా చెప్పారు. కానీ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రభావానికి మనం అతీతులం కామని ఒప్పుకున్నారు. ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా పేరు తెచ్చుకున్న భారత్ ఈ ఏడాది ఆ కిరీటాన్ని సౌదీ అరేబియాకు కోల్పోయే సూచనలున్నాయి. వచ్చే ఏడాది మళ్ళీ ఆ ఘనత సాధిస్తామని భావిస్తున్నా, ఆశ పెట్టుకోలేం. ప్రపంచ పరిణామాలు, పర్యవసానాలు భారత్ పైనా ప్రభావం చూపుతాయి. అలా వృద్ధి 5.2 శాతానికి జారిపోతుందనే అనుమానం ఉంది. మిగిలిన వారితో పోలిస్తే పైకి బాగున్నట్టు కనిపిస్తున్నా, 2020లో తగిలిన దెబ్బతో దేశంలో అత్యధికంగా 5.6 కోట్ల మంది నిరుద్యోగులయ్యారు. దారిద్య్రరేఖ దిగువకు పడిపోయారు. ప్రమాదాలూ పొంచి వున్నాయి. ఇప్పుడు పెరిగే ముడిచమురు, ఎరువుల ధరలతో దేశీయ ద్రవ్యోల్బణం హెచ్చు తుంది. ప్రపంచ మందగమనం ఎగుమతుల్ని దెబ్బతీసి, వృద్ధిని నీరసింపజేసి, వాణిజ్యలోటును పెంచు తుంది. డాలర్ దెబ్బతో రూపాయి మారకం రేటుపై ఒత్తిడి పెరిగి, విదేశీమారక నిల్వలు తగ్గుతాయి. ఇప్పుడున్న నిరాశావహ ప్రపంచ వాతావరణంలోనూ పరిస్థితులు మెరుగవ్వాలంటే ఎప్పటి లానే విధాన నిర్ణేతలు చేయాల్సినవి చాలా ఉన్నాయి. ముందుగా ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తేవాలి. అందుకు తగ్గ ఆర్థిక విధానాన్ని అనుసరిస్తూ, ద్రవ్య వినియోగంపై పట్టు బిగించి జీవన వ్యయాన్ని అదుపు చేయాలి. పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి పగ్గాలు వేశామనీ, అదేమంత ఆందోళన చెందాల్సిన విషయం కాదనీ పాలకులు అంటున్నారు. కానీ, వాస్తవంలో జూలైలో కాస్తంత తెరిపి నిచ్చినా, ఆగస్ట్, సెప్టెంబర్లలో ధరలు పెరుగుతూనే పోయాయి. ద్రవ్యోల్బణం 7 శాతానికి పైనే ఉంటూ వచ్చింది. దేశంలో తలసరి ఆదాయం తక్కువ గనక, ధరలు ఆకాశాన్ని అంటుతుంటే ఇంటి ఖర్చులు చుక్కలు చూపిస్తాయి. అలాగే, ఆహార ధరలు రెక్కలు విప్పుకొన్న కొద్దీ ఆర్బీఐకి సవాలు పెరుగుతుంది. అందుకే, ఆహార ద్రవ్యోల్బణానికి కళ్ళెం వేయాలి. కేంద్రం, రాష్ట్రాలు తెలివైన ఆర్థిక చర్యలు చేపట్టాలి. ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల్లో ప్రైవేట్ రంగం పెట్టుబడులు పెట్టేందుకు సందేహిస్తుంది గనక, ప్రభుత్వాలు మూలధన వ్యయంలో కోతలు విధించకుండా ముందుకు సాగాలి. అది ఆర్థిక వృద్ధికి కారణమవుతుంది. ఏప్రిల్ – ఆగస్టు మధ్య భారత సర్కార్ 47 శాతం మేర మూలధన వ్యయాన్ని పెంచి, దోవ చూపడం ఆనందించాల్సిన విషయమే. కానీ, దేశ వృద్ధిగమనం నిదానిస్తున్న వేళ కళ్ళు తెరిచి, సత్వర కార్యాచరణకు దిగాలి. అదే మన తక్షణ కర్తవ్యం! -
భారత్ ఆశాకిరణం
వాషింగ్టన్: ప్రపంచంలో అన్ని దేశాలు వృద్ధి అధోగమనాన్ని చూస్తుంటే.. భారత్ మంచి పనితీరు చూపిస్తూ ఆశాకిరణంగా ఉందని ఐఎంఎఫ్ ఆసియా, పసిఫిక్ విభాగం డైరెక్టర్ కృష్ణ శ్రీనివాసన్ అన్నారు. ద్రవ్యోల్బణం పెరిగిపోతూ, ప్రపంచదేశాలు మందగమనంలోకి వెళుతున్నట్టు చెప్పారు. ‘‘ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భాగమైన మూడింట ఒక వంతు దేశాలు ఈ ఏడాది లేదా వచ్చే ఏడాది మాంద్యంలోకి వెళతాయని అంచనా వేస్తున్నాం. ద్రవ్యోల్బణం బలీయంగా ఉంది. ఇదే అంతర్జాతీయంగా నెలకొన్న వాస్తవ పరిస్థితి. దాదాపు ప్రతీ దేశ ఆర్థిక వ్యవస్థ నిదానిస్తోంది. ఈ విధంగా చూస్తే భారత్ మాత్రం మెరుగైన పనితీరు తో వెలిగిపోతోంది’’అని శ్రీనివాసన్ వివరించారు. వృద్ధి రేటు 6.8 శాతం భారత్ ఆర్థిక వ్యవస్థ 2022 సంవత్సరానికి 6.8 శాతం వృద్ధి రేటును నమోదు చేస్తుందని ఐఎంఎఫ్ తాజాగా పేర్కొంది. 2021లో జీడీపీ 8.7 శాతం వృద్ధిని నమోదు చేయడం తెలిసిందే. 2023 సంవత్సరానికి జీడీపీ 6.1 శాతం రేటు నమోదు చేస్తుందని పేర్కొంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక వంతు 2023లో క్షీణతను చూస్తుందని అంచనా వేసింది. అమెరికా, యూరప్, చైనా ఆర్థిక వ్యవస్థల్లో స్తబ్ధత కొనసాగుతుందని పేర్కొంది. 2023లో మాంద్యం వస్తుందని చాలా మంది భావిస్తున్నట్టు తెలిపింది. ‘‘ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు సెంట్రల్ బ్యాంకులు విధానాలను కట్టడి చేస్తుండడంతో ద్రవ్య పరిస్థితులు కూడా కఠినవుతున్నాయి. ఇది పెట్టుబడులపై ప్రభావం చూపిస్తుంది. ఉక్రెయిన్–రష్యా యుద్ధం వల్ల ఆహార ధాన్యాలు, కమోడిటీల ధరల పెరుగుదలకు దారితీసింది. మూడోది చైనా మందగమనాన్ని చూస్తోంది. ఈ అంశాలన్నీ ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో, ఆసియా, భారత్ వృద్ధి అవకాశాలపైనా చూపిస్తోంది. భారత్ వెలుపలి డిమాండ్ మందగమన ప్రభావాన్ని చూస్తోంది. అలాగే, దేశీయంగా ద్రవ్యల్బణ పెరుగుదలను చూస్తోంది’’అని ఐఎంఎఫ్ తన తాజా నివేదికలో పేర్కొంది. ద్రవ్యోల్బణం కట్టడికి అనుసరించే ద్రవ్య విధాన కఠినతరం పెట్టుబడులపై ప్రభావం చూపిస్తుందని తెలిపింది. భారత్ విధానాలు బాగు.. భారత్ ప్రతిష్టాత్మక మూలధన వ్యయాల ప్రణాళికను ఐఎంఎఫ్ మెచ్చుకుంది. దీన్ని కొనసాగించాలని, అది దేశీయంగా డిమాండ్ బలపడేందుకు దోహదం చేస్తుందని పేర్కొంది. అలాగే, పేదలు, సున్నిత వర్గాలపై ప్రభావం చూపిస్తున్న ద్రవ్యోల్బణ ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కూడా ప్రశంసించింది. ఎౖMð్సజ్ పన్నును తగ్గంచడాన్ని ప్రస్తావించింది. దీనివల్ల ధరలవైపు ఉపశమనం ఉంటుందని పేర్కొంది. డిజిటైజేషన్ దిశగా భారత్ అద్భుతమైన ప్రగతి చూపించిందని, పలు రంగాల్లో పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబడులకు ద్వారాలు తెరవడాన్ని కూడా ప్రశంసించింది. -
భారత్ వృద్ధికి ఐఎంఎఫ్ రెండో కోత
వాషింగ్టన్: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 2022–23 ఆర్థిక సంవత్సరంలో 6.8 శాతమని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) తన తాజా అవుట్‌లుక్‌లో పేర్కొంది. భారత్ వృద్ధి అంచనాలను ఐఎంఎఫ్ తగ్గించడం ఇది వరుసగా రెండోసారి. తొలుత ఈ ఏడాది జనవరిలో 2022–23లో వృద్ధి అంచనాలను 8.2 శాతంగా వెలువరించింది. అయితే జూలైలో దీనిని 7.4 శాతానికి కుదించింది. అంతర్జాతీయంగా అనిశ్చిత ఆర్థిక పరిస్థితులు, భౌగోళిక ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల పెంపు వంటి అంశాల నేపథ్యంలో రేటు అంచనాలను మరింతగా 6.8 శాతానికి ఐఎంఎఫ్ కుదించింది. ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంక్ వార్షిక సమావేశాల నేపథ్యంలో ఈ అవుట్‌లుక్ విడుదలైంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)సహా పలు జాతీయ, అంతర్జాతీయ దిగ్గజ ఆర్థిక, విశ్లేషణా సంస్థలు 2022–23 భారత్ వృద్ధి అంచనాలను కుదిస్తున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ, ప్రపంచంలోనే వేగంగా పురోగమిస్తున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ కొనసాగుతుండడం గమనార్హం. 2021–22లో భారత్ వృద్ధి రేటు 8.2 శాతం. ఐఎంఎఫ్ మంగళవారం విడుదల చేసిన వార్షిక ‘వరల్డ్ ఎకనమిక్ అవుట్‌లుక్’లో ఈ విషయాలను వెల్లడించింది. మొదటి త్రైమాసికంతో పోల్చితే రెండవ త్రైమాసికంలో (జూలై–సెప్టెంబర్) భారత్ ఆర్థిక వ్యవస్థలో క్రియాశీలత తగ్గిందని విశ్లేషించింది. అంతర్జాతీయ డిమాండ్ తగ్గడం కూడా ప్రతికూల ప్రభావానికి దారితీస్తోందని వివరించింది. ప్రపంచ వృద్ధి 3.2 శాతమే... 2021లో ప్రపంచ వృద్ధి 6 శాతం ఉంటే, 2022లో ఇది 3.2 శాతానికి పడిపోతుందని ఐఎంఎఫ్ అంచనావేసింది. 2023లో ఈ రేటు మరింతగా 2.7 శాతానికి పడిపోతుందని అవుట్‌లుక్ అంచనావేసింది. 2001 తర్వాత ప్రపంచ వృద్ధి ఈ స్థాయిలో బలహీనపడటం (అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం, కోవిడ్–19 తీవ్ర స్థాయి కాలాలతో పోల్చితే) ఇదే తొలిసారి. అవుట్‌లుక్ ప్రకారం, అమెరికా జీడీపీ 2022 తొలి భాగంలో క్షీణతలోకి జారింది. 2023లో ఒక శాతం వృద్ధి నమోదుకావచ్చు. -
దేశానికి భారీ పెట్టుబడులే లక్ష్యంగా, అమెరికా పర్యటనకు నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం అమెరికా బయలుదేరి వెళుతున్నారు. ప్రస్తుత అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితిపై చర్చించనున్న ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్ వార్షిక సమావేశాల్లో ఆమె పాల్గొంటారు. ఆరు రోజుల అమెరికా పర్యటనలో భాగంగా (అక్టోబర్ 11–16) సీతారామన్ జీ–20 ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంకుల గవర్నర్లు, వ్యాపార వేత్తలు, ఇన్వెస్టర్లతో భేటీ కానున్నారు. అమెరికా ఆర్థికమంత్రి జనెత్ ఎలెన్, ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు డేవిడ్ మెల్‌పాస్‌లతో ఆమె వేర్వేరుగా సమావేశం కానున్నారని ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. భారత్ ఆర్థిక ప్రయోజనాలు, దేశానికి భారీ పెట్టుబడులు ఆకర్షణే లక్ష్యంగా అర్థికమంత్రి అమెరికా యాత్ర జరగనున్నదని ఆ వర్గాలు పేర్కొన్నాయి. జీ–20 ఆర్థికమంత్రులతో సమావేశాలు.. జపాన్, దక్షిణ కొరియా, సౌదీ అరేబియా, ఆస్ట్రేలియా, భూటాన్, న్యూజిలాండ్, ఈజిప్ట్, జర్మనీ, మారిషస్, యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ (యూఏఈ), ఇరాన్, నెదర్లాండ్స్‌సహా పలు దేశాల మంత్రులతో ద్వైపాక్షిక సమావేశాలు కూడా మంత్రి పర్యటనలో భాగంగా ఉన్నాయి. ఓఈసీడీ, యూరోపియన్ కమిషన్, యూఎన్‌డీపీల చీఫ్‌లతో ఆమె భేటీ కానున్నారు. పర్యటన సందర్భంగా ఆర్థిక మంత్రి, వాషింగ్టన్‌లోని బ్రూకింగ్స్ ఇన్స్టిట్యూషన్లో ‘భారత ఆర్థిక అవకాశాలు –ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పాత్ర’ అన్న అంశంపై జరిగే సదస్సులో పాల్గొననున్నారు. అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో భారత్ ఈ సంవత్సరం చివర్లో జీ–20 దేశాల అధ్యక్ష బాధ్యతలను తీసుకోనుంది. డిసెంబర్ 1 నుంచి 2023 నవంబర్ 30 వరకూ నిర్వహించే ఈ బాధ్యతల సమయంలో భారత్ ప్రధానంగా అభివృద్ధి చెందిన దేశాల సవాళ్ల పరిష్కారంపై దృష్టి పెడుతుంది. ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రి జీ–20 ఆర్థికమంత్రులతో జరుపుతున్న సమావేశాలకు ప్రాధాన్యత సంతరించుకుంది. కీలకం కానున్న ఐఎంఎఫ్ కోటా అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థలో కోటాల 16వ సాధారణ సమీక్ష (జీఆర్‌క్యూ) సకాలంలో ముగించాల్సిన అవసరం ఉందని భారత్ స్పష్టం చేస్తున్న డిమాండ్ నేపథ్యంలో ఈ బహుళ జాతి సంస్థ వార్షిక సమావేశం జరగడం మరో విశేషం. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల అభిప్రాయాలకు తగిన ప్రాధాన్యత ఇవ్వడానికి ఇది ఎంతో అవసరమని ఆర్థికమంత్రి సీతారామన్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఐఎంఎఫ్ కోటా వ్యవస్థ బహుళజాతి రుణ సంస్థలో దేశాల ఓటింగ్ షేర్‌కు సంబంధించిన అంశం. ప్రస్తుతం ఐఎంఎఫ్‌లో భారతదేశ కోటా 2.75 శాతం. చైనా కోటా 6.4 శాతం కాగా, అమెరికా కోటా 17.43 శాతం. ఐఎంఎఫ్ తీర్మానం ప్రకారం, కోటాలకు సంబంధించి 16వ సాధారణ సమీక్ష 2023 డిసెంబర్ 15వ తేదీలోపు ముగియాలి. వర్థమాన దేశాల అభిప్రాయాలకు అధిక ప్రాధాన్యత లభించేలా కోటా షేర్లలో సర్దు బాటు జరగాలని, వాటి ఓటింగ్ హక్కులు పెరగాల్సిన అవసరం ఉందని భారత్ డిమాండ్ చేస్తోంది. -
ఓపెన్ ఎండెడ్ ఫండ్స్‌తో ఆర్థిక స్థిరత్వానికి రిస్క్
వాషింగ్టన్: అంతర్జాతీయంగా ఓపెన్ ఎండ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ గణనీయంగా వృద్ధి చెంది, 2022 మార్చి నాటికి 41 ట్రిలియన్ డాలర్లకు చేరుకున్నాయని.. వీటితో అస్సెట్ మార్కెట్లకు రిస్క్ పొంచి ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) ఆందోళన వ్యక్తం చేసింది. వీటి కచ్చితమైన నిర్వహణకు వీలుగా అంతర్జాతీయంగా నియంత్రణ సంస్థల మధ్య గొప్ప సమన్వయం అవసరమని అభి ప్రాయపడింది. అంతర్జాతీయ ఆర్థిక స్థిరత్వానికి సంబంధించి తాజా నివేదికను ఐఎంఎఫ్ విడుదల చేసింది. ఫైనాన్షియల్ మార్కెట్లలో ఓఎన్ ఎండ్ ఫండ్స్ ఎంతో కీలక పాత్ర పోషిస్తున్నట్టు పేర్కొంది. లిక్విడ్ ఆస్తులను నిర్వహిస్తూ, ఇన్వెస్టర్ల నుంచి రోజు వారీ పెట్టుబడుల ఉపసంహరణకు అనుమతిస్తున్నందున, ఏకపక్ష విక్రయాలతో మార్కెట్లలో తీవ్ర కుదుపులు చోటుచేసుకోవచ్చని తెలిపింది. దీనివల్ల ఆటుపోట్లు పెరిగి, ఫైనాన్షియల్ మార్కెట్ల స్థిరత్వానికి ముప్పు పెరగొచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. ఓపెన్ ఎండెడ్ ఫండ్స్ అన్నవి ఎప్పుడైనా పెట్టుబడులు పెట్టేందుకు, వాటిని వెనక్కి తీసుకునేందుకు సిద్ధంగా ఉండే పథకాలు. ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు ద్రవ్య విధానాన్ని కఠినతరం చేస్తున్న క్రమంలో ఈ ఫండ్స్ నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడుల ఉపసంహరణ చోటు చేసుకోవచ్చని, ఇది మార్కెట్లలో ఒత్తిళ్లకు దారితీయవచ్చని ఐఎంఎఫ్ అంచనా వేసింది. సమన్వయంతో నియంత్రించాలి: ‘‘ఈ ఫండ్స్ అంతర్జాతీయంగా కార్యకలాపాలు నిర్వహిస్తుంటాయి. కనుక వీటి విక్రయాల ప్రభా వం వివిధ దేశాల్లో ఉంటుంది. వీటి కచ్చితమైన నిర్వహణకు వీలుగా అంతర్జాతీయ స్థాయిలో లిక్వి డిటీ నిర్వహణ విధానాలు ఉండాలి. ఇందుకు ని యంత్రణ సంస్థల మధ్య గొప్ప సమన్వయం అవసరం’’అని ఐఎంఎఫ్ తన నివేదికలో సూచించింది. ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంకు వార్షిక సమావేశానికి ముందు ఈ నివేదిక విడుదలైంది. ఓపెన్ ఎండెడ్ ఫండ్స్ నుంచి పొంచి ఉన్న సంస్థాగత రిస్క్‌ను తగ్గించేందుకు ఎన్నో సాధనాలు అందుబాటులో ఉన్నట్టు గుర్తు చేసింది. ‘‘ప్రపంచ ఆర్థిక మాంద్యం తర్వాత ఓపెన్ ఎండెడ్ ఇన్వెస్ట్మెంట్ పథకాలు అనూహ్య వృద్ధిని చూశాయి. వాటి నిర్వహణలోని ఆస్తులు 2008 నుంచి 4 రెట్లు పెరిగి 2022 మార్చి నాటికి 41 ట్రిలియన్ డాలర్లకు చేరాయి’’అని వెల్లడించింది. -
రెసిషన్ భయాలు: రుపీ మరోసారి క్రాష్
సాక్షి, ముంబై: గ్లోబల్ మాంద్యం భయాలతో డాలర్‌తో పోలిస్తే దేశీయ కరెన్సీ రూపాయి మరోసారి బలహీనపడింది ప్రపంచ వ్యాప్తంగా దిగ్గజ దేశాలకు కూడా ఆర్థిక కష్టాలు తప్పవనే ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ వ్యాఖ్యల నేపథ్యంలో శుక్రవారం ఆరంభంలోనే రూపాయి పతనమైంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 11 పైసలు పడిపోయి 79.82 వద్దకు చేరింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ, ప్రపంచబ్యాంకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రధాన కేంద్ర బ్యాంకులు మాంద్యంలోకి వెళ్లవచ్చని తాజాగా హెచ్చరించాయి. దీనికి తోడు అమెరికాలోద్రవ్యోల్బణం స్థాయి కూడా ఊహించని రీతిలో ఉండటతో వచ్చేవారం ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేటువడ్డన భారీగా ఉంటుందనే అంచనాలు ఇన్వెస్టర్లను సెంటిమెంట్‌ను దెబ్బ తీసాయి. గురువారం ముగింపు 79.7012తో పోలిస్తే, కీలకమైన 80 స్థాయికి అతి వేగంగా జారిపోతోంది. దీనికి తోడు ఈక్విటీ మార్కెట్ల భారీ నష్టాలు కూడా రూపాయి క్షీణతకు దారి తీసింది.సె న్సెక్స్ ఒక దశలో ఏకంగా 750 పాయింట్లు కుప్పకూలి 60వేల దిగువకు, అనంతరం 59500 దిగువకు పడిపోయింది. అటు నిఫ్టీ కూడా కీలకమైన మద్దతుస్థాయిని 18వేలను, ఆ తరువాత 17750 స్థాయిని కూడా కోల్పోయింది. -
Financial Crises: పేకమేడలు... ఆర్థిక సంక్షోభం అంచున దేశాలు
ఆర్థిక సంక్షోభం తాలూకు విశ్వరూపాన్ని శ్రీలంకలో కళ్లారా చూస్తున్నాం. కనీసం మరో డజనుకు పైగా దేశాలు ఈ తరహా ఆర్థిక సంక్షోభం దిశగా వడివడిగా అడుగులు వేస్తూ ఆందోళన కలిగిస్తున్నాయి. కరోనా మహమ్మారి, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, ప్రభుత్వాల అస్తవ్యస్త విధానాలు... ఇలా ఇందుకు కారణాలు అనేకం. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే ప్రపంచ ఆర్థిక మాంద్యానికి దారి తీయవచ్చన్న ఆందోళనలూ వ్యక్తమవుతున్నాయి... అర్జెంటీనా అధ్యక్షుని నిర్వాకం పెను ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ఉంది. ద్రవ్యోల్బణం 30 ఏళ్ల గరిష్టానికి చేరుకుంది. జూన్‌తో పోలిస్తే జులైలో ధరలు 6 శాతం పెరిగాయి. అధిక ధరలు, నిరుద్యోగం, పేదరికం దేశాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. శ్రీలంక మాదిరిగానే ప్రజలు భారీగా రోడ్డెక్కి ఆందోళనకు దిగుతున్నారు. అధ్యక్షుడు అల్బెర్టో ఫెర్నాండెజ్‌కు వ్యతిరేకంగా నిరసనలు మిన్నంటుతున్నాయి. కరెన్సీ పెసో నల్ల బజారులో ఏకంగా 50 శాతం తక్కువ విలువకు ట్రెండవుతోంది. విదేశీ మారక నిల్వలు అడుగంటిపోతున్నాయి. బాండ్లు డాలర్‌కి 20 సెంట్లు మాత్రమే పలుకుతున్నాయి. కాకుంటే విదేశీ అప్పులను 2024 వరకు తీర్చాల్సిన అవసరం లేకపోవడం ఒక్కటే ప్రస్తుతానికి ఊరట. ఉపాధ్యక్షురాలు క్రిస్టినా ఫెర్నాండెజ్ సామర్థ్యం మీదే ప్రజలు ఆశతో ఉన్నారు. అంతర్జాతీయ ద్రవ్య నిధిపై ఒత్తిడి తెచ్చయినా దేశాన్ని రుణభారం నుంచి ఆమె గట్టెక్కిస్తారన్న అంచనాలున్నాయి. ఉక్రెయిన్ యుద్ధం చేసిన గాయం రష్యా దండయాత్రతో ఆర్థికంగా చితికిపోయింది. 20 వేల కోట్ల డాలర్ల పై చిలుకు అప్పుల్లో కూరుకుపోయింది. ఈ సెప్టెంబర్‌లోనే 120 కోట్ల డాలర్లు చెల్లించాల్సి ఉంది. అమెరికా, యూరప్ దేశాలు ఆర్థికంగా అండగా నిలుస్తూండటంతో అది పెద్ద కష్టం కాకపోవచ్చు. యుద్ధం ఇంకా కొనసాగేలా ఉండటంతో మరో రెండేళ్ల పాటు అప్పులు తీర్చకుండా వెసులుబాటు కల్పించాలని కోరే అవకాశముంది. ఉక్రెయిన్ కరెన్సీ హ్రిన్వియా విలువ దారుణంగా పడిపోయింది. పాకిస్తాన్ నిత్య సంక్షోభం మన దాయాది దేశం కూడా చాలా ఏళ్లుగా అప్పుల కుప్పగా మారిపోయింది. విదేశీ మారక నిల్వలు కేవలం 980 కోట్ల డాలర్లకు పడిపోయాయి. ఈ సొమ్ముతో ఐదు వారాలకు సరిపడా దిగుమతులు మాత్రమే సాధ్యం. గత వారమే అంతర్జాతీయ ద్రవ్య నిధితో ఆర్థిక ఒప్పందం కుదుర్చుకున్నా చమురు దిగుమతుల భారం తడిసి మోపెడవడంతో గంప లాభం చిల్లి తీసిన చందంగా మారింది. కరెన్సీ విలువ రికార్డు స్థాయికి పడిపోయింది. దేశ ఆదాయంలో ఏకంగా 40% తీసుకున్న వడ్డీలకే పోతోంది. విదేశీ నిల్వల్ని పెంచుకోవడానికి మరో 300 కోట్ల డాలర్లు అప్పు కోసం సిద్ధమైంది. ఇలా అప్పులపై అప్పులతో త్వరలో మరో లంకలా మారిపోతుందన్న అభిప్రాయముంది. ఈజిప్టు అన్నీ సమస్యలే ఈ శతాబ్దంలోనే అత్యంత దారుణమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రభావం ఆర్థికంగా కుంగదీసింది. గోధుమలు, నూనెలకు ఉక్రెయిన్‌పై ఆధారపడటంతో ధరలు విపరీతంగా పెరిగాయి. దేశ స్థూల జాతీయోత్పత్తి–రుణాల నిష్పత్తి 95 శాతానికి చేరింది! విదేశీ కంపెనీలెన్నో దేశం వీడుతున్నాయి. 1,100 కోట్ల డాలర్ల విదేశీ పెట్టుబడులు వెనక్కు వెళ్లినట్టు అంచనాలున్నాయి. ఐదేళ్లలో 10 వేల కోట్ల డాలర్ల రుణ చెల్లింపులు చేయాల్సి రావడం కలవరపెడుతోంది. కరెన్సీ విలువను 15 శాతం తగ్గించినా లాభంలేకపోవడంతో ఐఎంఎఫ్‌ను శరణు వేడుతోంది. ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మకానికి పెడుతోంది! దివాలా బాటన మరెన్నో దేశాలు ఈక్వడర్, బెలారస్, ఇథియోపియా, ఘనా, కెన్యా, ట్యునీషియా, నైజీరియా... ఇలా మరెన్నో దేశాలు ఆర్థిక సంక్షోభం ముంగిట్లో ఉన్నాయి. ఈక్వడర్ రెండేళ్లుగా రుణాలు చెల్లించే పరిస్థితిలో లేదు. ఘనా అప్పులకు వడ్డీలే కట్టలేకపోతోంది. నైజీరియా ఆదాయంలో 30 శాతం వడ్డీలకే పోతోంది. ట్యునీషియాది ప్రభుత్వోద్యోగులకు జీతాలివ్వలేని దుస్థితి! -
'ట్రెండ్‌ను బ్రేక్ చేస్తూ'..ఐఎంఎఫ్ గీతా గోపినాథ్ సరికొత్త రికార్డ్‌లు!
న్యూఢిల్లీ: భారతీయ సంతతికి చెందిన ప్రముఖ ఆర్థికవేత్త, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ– ఐఎంఎఫ్ మొదటి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గీతా గోపీనాథ్ మరో అరుదైన గుర్తింపును పొందారు. ఐఎంఎఫ్ ‘వాల్ ఆఫ్ ఫార్మర్ చీఫ్ ఎకనమిస్ట్స్’పై ఆమెకు చోటు లభించింది. ఈ గొప్ప స్థానాన్ని సంపాదించిన మొదటి మహిళ గీతా గోపీనాథ్‌కాగా, ఈ స్థానానికి చేరిన భారత్ సంతతికి చెందిన రెండవ వ్యక్తి. ఇంతక్రితం రఘురామ్ రాజన్ ఈ గౌరవం లభించింది. ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ 2003 నుంచి 2006 మధ్య ఐఎంఎఫ్ చీఫ్ ఎకనమిస్ట్ అండ్ డైరెక్టర్ ఆఫ్ రిసెర్చ్‌గా బాధ్యతలు నిర్వహించారు. గీతా గోపీనాథ్, 2018 అక్టోబర్‌లో ఐఎంఎఫ్ మొట్టమొదటి మహిళా చీఫ్ ఎకనమిస్టుగా నియమితులయ్యారు. గత ఏడాది డిసెంబర్లో ఐఎంఎఫ్ మొట్టమొదటి మహిళా డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా పదోన్నతి పొందారు. గోపీనాథ్ పరిశోధనలు అనేక అగ్ర ఆర్థిక శాస్త్ర పత్రికలలో ప్రచురితమయ్యాయి. ఐఎంఎఫ్ చీఫ్ ఎకనామిస్ట్‌గా నియామకానికి ముందు ఆమె హార్వర్డ్ యూనివర్శిటీలోని ఆర్థిక శాస్త్ర విభాగంలో అంతర్జాతీయ అధ్యయనాలు, ఆర్థికశాస్త్రంలో ప్రొఫెసర్‌గా ఉన్నారు.2005లో హార్వర్డ్ యూనివర్శిటీ ఫ్యాకల్టీలో చేరడానికి ముందు, ఆమె యూనివర్శిటీ ఆఫ్ చికాగోలోని బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఎకనామిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. బ్రేకింగ్ ది ట్రెండ్ ‘ట్రెండ్‌ను బ్రేక్ చేస్తూ, నేను ఐఎంఎఫ్ మాజీ చీఫ్ ఎకనామిస్ట్‌ల గోడపై చేరాను’ అని గీతా గోపీనాథ్ ఒక ట్వీట్లో పేర్కొన్నారు. మాజీ చీఫ్ ఎకనామిస్ట్‌ల గోడపై నెలకొలి్పన తన ఫొటో వద్ద ఫోజిచ్చిన్న చిత్రాన్ని కూడా ఆమె తన ట్వీట్‌కు జోడించారు. Breaking the trend 👊💥…I joined the wall of former Chief Economists of the IMF 😀 pic.twitter.com/kPay44tIfK — Gita Gopinath (@GitaGopinath) July 6, 2022 మూడేళ్ల పాటు ఐఎంఎఫ్ డిప్యూటీ ఎండీగా బాధ్యతలు నిర్వహిస్తున్న గీతా గోపినాథ్ మూడేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగనున్నారు. ఆ తర్వాత హార్వర్డ్ వర్సిటీలో ప్రొఫెసర్‌గా విధులు చేపట్టాలని అనుకున్నట్లు గీతా గోపినాథ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. -
సంపన్న ఎకానమీపై గీతా గోపీనాథ్ వ్యాఖ్యలు
దావోస్: అభివృద్ధి చెందిన ఎకానమీలు 2024 నాటికి తిరిగి ట్రాక్‌లోకి వస్తాయని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గీతా గోపీనాథ్ పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలు మళ్లీ పురోగతి పట్టాలెక్కకపోతే, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల వృద్ధి రేటు 5 శాతం దిగువనే ఉంటుందని కూడా ఆమె అభిప్రాయపడ్డారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సమావేశం 2022 సందర్భంగా ‘ప్రపంచ తదుపరి వృద్ధి ధోరణి’ అనే అంశంపై జరిగిన ప్రత్యేక సెషన్లో ఆమె చేసిన ప్రసంగంలో ముఖ్యాంశాలు... ♦ కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు తీవ్ర ప్రతికూల ప్రభావాలకు లోనయ్యాయి. నెమ్మదిగా తిరిగి కోలుకుంటున్నాయి. ఈ రికవరీకి ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధం మళ్లీ విఘాతంగా మారింది. ♦ యుద్ధం వల్ల ఇంధనం, ఆహారంతో సహా వస్తువుల ధరలు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నాయి. ప్రపంచం తీవ్ర ప్రతికూలతలను ఎదుర్కొంటోంది. దీనితో ప్రపంచ వృద్ధి ధోరణిపట్ల డౌన్‌గ్రేడ్ దృక్పధాన్ని కలిగి ఉన్నాము. ♦ ప్రధానంగా అధిక స్థాయి ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి సెంట్రల్ బ్యాంకులు ప్రయత్నిస్తున్నాయి. వడ్డీ రేట్లను తీవ్రంగా పెంచుతున్నాయి. ఈ చర్యలు తీసుకోవాల్సిన తప్పనిసరి పరిస్థితి ఉంది. అయితే ఆయా వడ్డీరేట్ల పెంపు నిర్ణయాలు ప్రపంచ ఆర్థిక, వాణిజ్య విభాగాలపై త్రీవ ప్రతికూల పరిణామాలకు దారితీసే వీలుంది. ♦ కోవిడ్, తదనంతరం యుద్ధ వాతావారణ పరిస్థితుల నేపథ్యంలో వృద్ధికి సంబంధించి ప్రపంచ దేశాల మధ్య తీవ్ర వ్యత్యాసాలు నెలకొన్నాయి. ఆర్థిక వనరుల వినియోగం, వ్యాక్సినేషన్ వంటి అంశాల్లో వైరుధ్యాలు దీనికి కారణం. ♦ ఆహారం, ఇంధనం, వనరుల సంక్షోభాలు ఇప్పుడు వృద్ధి అసమతౌల్యతకు దారితీసే అవకాశాలు ఏర్పడినందున దీర్ఘకాలిక ఆర్థిక శ్రేయస్సు, అంతర్జాతీయ పరస్పర సహకారం వంటి అంశాలపై తక్షణం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. -
భారత్‌ను బతిమాలుతున్నాం: ఐఎంఎఫ్ చీఫ్
దావోస్: ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలీనా జార్జియేవా(68) Kristalina Georgieva.. భారత్‌ను బతిమాలుతున్నారు. గోధుమ ఎగుమతులపై భారత ప్రభుత్వం నిషేధం విధించగా.. ఈ నిర్ణయంపై వీలైనంత త్వరగా పునరాలోచన చేయాలని ఆమె విజ్ఞప్తి చేస్తున్నారు. అంతర్జాతీయ ఆహార భద్రత, ప్రపంచ స్థిరత్వంలో భారత్ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నక్రిస్టలీనా.. వీలైనంత త్వరగా నిషేధాన్ని ఎత్తేయాలని కోరారు. వేసవి ప్రభావంతో గోధుమ ఉత్పత్తి తగ్గిపోవడం, దేశీయంగా ధరలు పెరిగిపోవడంతో భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే భారత్ తరపున ఈ పరిస్థితులను అర్థం చేసుకోగలమని పేర్కొన్న ఆమె.. ప్రపంచవ్యాప్తంగా ఏర్పడబోయే సంక్షోభ స్థితిని భారత్ అర్థం చేసుకోవాలని కోరారు. భారతదేశాన్ని వీలైనంత త్వరగా పునరాలోచించవలసిందిగా నేను వేడుకుంటున్నాను, ఎందుకంటే ఈ నిర్ణయంతో ఎక్కువ దేశాలు ఎగుమతి ఆంక్షలపైకి అడుగుపెట్టే అవకాశం ఉంది. మరికొన్ని దేశాలు కూడా ఆ ఆలోచన చేయొచ్చు. అప్పుడు.. ప్రపంచవ్యాప్తంగా ఏర్పడే సంక్షోభాన్ని ఎదుర్కోవటానికి కష్టతరంగా ఉంటుంది అని ఆమె అన్నారు. ఇప్పటికే ఓ పక్క యుద్ధ సంక్షోభం కొనసాగుతోంది. ఈజిప్ట్, లెబనాన్ లాంటి దేశాల ఆకలి తీర్చేది భారత్. అలాంటప్పుడు భారత్ నిర్ణయంతో ఆయా దేశాల్లో ఆకలి కేకలే కాదు.. ప్రపంచవ్యాప్తంగా సామాజిక అశాంతి నెలకొనే అవకాశం ఉంది అని ఆమె అభ్రిప్రాయపడ్డారు. స్విట్జర్లాండ్ దావోస్ వేదికగా ఓ భారతీయ మీడియాతో ఆమె పైవ్యాఖ్యలు చేశారు. -
భారత్‌కు మధ్యంతర నిర్మాణాత్మక సమస్యల్లో అవి కూడా: ఐఎంఎఫ్
వాషింగ్టన్: డిజిటల్ కరెన్సీతో పాటు క్రిప్టో ఆస్తులను నియంత్రించడం భారతదేశానికి మధ్యంతర నిర్మాణాత్మక సమస్యలలో కొన్నని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) ఫైనాన్షియల్ కౌన్సెలర్, మానిటరీ క్యాపిటల్ మార్కెట్స్ విభాగం డైరెక్టర్ టోబియాస్ అడ్రియన్ పేర్కొన్నారు. బ్యాంకింగ్ రంగంలో మిగిలిన నియంత్రణ సమస్యలను పరిష్కరించడం, గ్లోబల్ ఎకానమీతో ఏకీకృతం చేయడం వంటి సమస్యలూ జాబితాలో ఉన్నాయని ఆయన విశ్లేషించారు. అయితే భారతదేశాన్ని ఐఎంఎఫ్ ‘‘చాలా సానుకూల ధోరణి’’తో చూస్తోందని వెల్లడించారు. వృద్ధి పునరుద్ధరణకు తగిన అవకాశాలను భారత్‌లో ఉన్నాయని తాను భావిస్తున్నట్లు తెలిపారు. కొత్త వృద్ధి అవకాశాలు, పరిణామాలను సానుకూలంగా తీసుకోవడానికి భారత్ చాలా ఉత్సాహం ఉందని అన్నారు. ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంక్ వార్షిక స్పింగ్ సమావేశాల సందర్భంగా చేసిన ప్రసంగంలో అడ్రియన్ ఈ ప్రకటన చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే... ► మేము ఎల్లప్పుడూ వృద్ధి విస్తృత ప్రాతిపదికన అన్ని వర్గాలకు అందాలని కోరుకుంటాము. ఈ విషయంలో భారత్‌కు సంబంధించి మా దృక్పథం చాలా సానుకూలంగా ఉంది. ► క్రిప్టో కరెన్సీ నియంత్రణ కసరత్తు ప్రపంచవ్యాప్తంగా జరుగుతోంది. ఆర్థిక స్థిరత్వం కోణంలో తాము క్రిప్టో నిబంధనల కోసం ప్రపంచ ప్రమాణాలతో ముందుకు రావడానికి ప్రయత్నిస్తున్నాం. భారత్ కూడా ఈ దిశలో ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాము. ► క్రిప్టోలకు సంబంధించి భారతదేశం పన్ను విధానాన్ని ప్రవేశపెట్టడం స్వాగతనీయం. ► భారత్‌కు సంబంధించి రెండవ కీలక అంశం ఏమిటంటే, డిజిటల్ కరెన్సీ. అన్ని వర్గాలకూ వృద్ధి ఫలాలు అందడం, ఆర్థిక అభివృద్ధికి ఇది చాలా ముఖ్యమైనది. ఈ అంశానికి సంబంధించి భారత్ ఏమి చేస్తుందన్న అంశాన్ని చాలా నిశితంగా గమనిస్తున్నాము. ఈ విషయంలో భారత్ విధానపరమైన నిర్ణయాలను మేము స్వాగతిస్తున్నాము. ► ఫైనాన్షియల్ మార్కెట్లు, సంస్థలు అభివృద్ధికి కీలకం. బ్యాంకింగ్, నాన్–బ్యాంకింగ్ వ్యవస్థలో మిగిలిన నియంత్రణ సమస్యలను పరిష్కరించడం కూడా చాలా ముఖ్యం. ► ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో, వాణిజ్యంలో భాగం కావడం భారతదేశానికి చాలా ప్రయోజనకరమని నేను భావిస్తాను. భారతదేశం అనేక ఉత్పత్తులను ఎగుమతి చేయగలదు. ఉత్పత్తులను దిగుమతీ చేసుకోగలదు. అంతర్జాతీయంగా మూలధనాన్ని సమీకరించగలదు. అంతర్జాతీయంగా ప్రాజెక్టులకు నిధులు సమకూర్చగలదు. ప్రపంచవ్యాప్తంగా భారతీయ పెట్టుబడులు ఉన్నాయి. ► మా అంచనా ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా, ఆర్థిక సంబంధాల ఏకీకరణ చాలా ప్రయోజనకరంగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఏకీకృత ఆర్థిక విధానం, సంబంధాలు ఇటీవలి దశాబ్దాలలో లక్షలాది మంది ప్రజలను పేదరికం నుండి బయటపడేశాయి. కాబట్టి, మేము దీనిని ఎంతో స్వాగతిస్తున్నాము. భారతదేశం ఈ దిశలో కొనసాగడం ముఖ్యమని మేము భావిస్తున్నాము. సావరిన్ రుణ భారంపై ఆందోళన అక్కర్లేదు... సావరిన్ రుణాలపై ఐఎంఎఫ్ అధికారి టోబియాస్ అడ్రియన్ మాట్లాడుతూ మహమ్మారి పరిస్థితుల్లో అవలంభించిన ఉద్దీపన కార్యక్రమాల వల్ల భారత్‌కు సావరిన్ రుణ భారాలు పెరుగుతున్న విషయాన్ని తాము గమనిస్తున్నామన్నారు. సార్వభౌమ రుణానికి సంబంధించి బ్యాంకుల హోల్డింగ్‌ల పెరుగుదలను కూడా గమనిస్తున్నట్లు తెలిపారు. అయినప్పటికీ, భారతదేశంలో ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొన్నారు. అంతేకాకుండా, తమ అధ్యయనం ప్రకారం, బ్యాంకులపై సార్వభౌమ రుణాల స్థాయి కూడా తగిన స్థాయిలోనే ఉన్నట్లు తెలిపారు. కాబట్టి తము ప్రస్తుతం భారత్ సావరిన్ రుణాలకు సంబంధించి ఆందోళన చెందాల్సింది ఏదీ లేదని పేర్కొన్నారు. ఈ విషయంలో మేము ఆందోళన చెందుతున్న దేశాల జాబితాలో భారత్ లేదని స్పష్టం చేశారు. ఐఎంఎఫ్ మానిటరీ క్యాపిటల్ మార్కెట్స్ విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ రంజిత్ సింగ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, భారత్ ఆర్థిక, ఫైనాన్షియల్, సావరిన్ రుణాలకు సంబంధించి ప్రస్తుత పరిస్థితి ‘‘నిర్వహించగలిగిన’’ స్థాయిలో ఉందని అన్నారు. భారతదేశంలో సార్వభౌమ రుణంలో బ్యాంక్ హోల్డింగ్స్ స్థాయి వాస్తవానికి దాదాపు 29 శాతం వద్ద ఉందని తెలిపారు. అయితే ఇది అభివృద్ధి చెందుతున్న దేశాల 16 శాతం సగటు కంటే ఎక్కువ ఉందని పేర్కొన్నారు. భారతదేశ ప్రభుత్వ రుణం– జీడీపీ నిష్పత్తి దాదాపు 87 శాతంగా ఉందని ఆయన చెప్పారు. చదవండి: షాకింగ్ న్యూస్...వడ్డీరేట్లు పెరిగే అవకాశం...ప్రభావమెంతంటే..? -
భళా భారత్! ఐఎంఎఫ్ ఎండీ క్రిస్టలీనా జార్జీవా ప్రశంసల వర్షం!
భారత్ అధిక వృద్ధి రేటు ఆ దేశానికి మాత్రమే ఆరోగ్యకరం కాదని.. మొత్తం ప్రంపచానికే సానుకూలమని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) ఎండీ క్రిస్టలీనా జార్జీవా అన్నారు. 2022లో భారత 8.2 శాతం వృద్ధి రేటును సాధిస్తుందని, అత్యంత వేగవంతమైన వృద్ధిని సాధించే దేశంగా నిలుస్తుందని ఐఎంఎఫ్ ఈ వారం మొదట్లోనే అంచనాలు ప్రకటించింది. 2022లో అంతర్జాతీయ వృద్ధి రేటు 3.6 శాతానికి తగ్గించింది. 2021లో ఈ అంచనాలు 6.1 శాతంగా ఉన్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, అధిక ఇంధన, కమోడిటీల ధరల నేపథ్యంలో ఐఎంఎఫ్ అంచనాలు తగ్గించడం గమనార్హం. ‘‘అధిక వృద్ధి రేటు సాధిస్తున్న దేశాల్లో భారత్ ఒకటి. కొంత క్షీణత ఉన్నప్పటికీ. ఈ ఏడాదికి వృద్ధి రేటును 8.2 శాతంగా అంచనా వేయడం జరిగింది. ఇది ఇండియాకు ఆరోగ్యకరం. అంతేకాదు, వృద్ధి మందగమనాన్ని చూస్తున్న ప్రపంచానికి కూడా మంచిదే’’ అని జార్జీవా పేర్కొన్నారు. అంతర్జాతీయంగా భారత్ ఎంతో కీలక పాత్ర పోషిస్తోందన్నారు. కరోనా సంక్షోభంలో టీకాలను సరఫరా చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ‘‘భారత్ అంతర్జాతీయ సోలార్ కూటమితో కలసి పునరుత్పాదక ఇంధన వనరులను పెంచుకునేందుకు కట్టుబడి ఉంది. డిజిటల్ కరెన్సీల్లో, ముఖ్యంగా సెంట్రల్ బ్యాంకు డిజిటల్ కరెన్సీ విషయంలో ముందున్న దేశం. భారత ప్రజలు, వ్యాపారాలకు క్రిప్టో రిస్క్‌లను తగ్గించడంలోనూ చొరవ చూపిస్తోంది. వచ్చే ఏడాది జీ20 సమావేశానికి అధ్యక్షత వహించే భారత్‌తో కలసి ఎన్నో అంశాల విషయంలో పనిచేయాలనుకుంటున్నాం’’అని జార్జీవా చెప్పారు. సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కోగలదు కరోనా సంక్షోభం సమయంలో భారత్ అనుసరించిన స్థూల ఆర్థిక నిర్వహణ విజయవంతం కావడంతో వృద్ధి పరంగా వేగంగా కోలుకుందని ఐఎంఎఫ్ మిషన్ చీఫ్ (భారత్) నదాచౌరీ పేర్కొన్నారు. ఫలితంగా ఉక్రెయిన్ సంక్షోభం వల్ల ఎదురయ్యే ఆర్థిక సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొనే స్థితిలో ఉన్నట్టు చెప్పారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ 7 శాతం వాటా పోషిస్తుండడం, కొనుగోలు శక్తికితోడు వేగంగా వృద్ధి చెందుతుండడాన్ని ప్రస్తావించారు. కరోనా సమయంలో ఎన్నో కీలకమైన చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. -
ప్రపంచంలోనే మరే దేశానికి సాధ్యపడకుండా..జెట్ స్పీడ్‌లో దూసుకుపోతున్న భారత్..!
వాషింగ్టన్: భారత్ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 2022లో 8.2 శాతంగా ఉంటుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనావేసింది. ప్రపంచంలో మరే దేశ ఎకానమీ ఈ స్థాయిలో పురోగమించలేదని విశ్లేషించింది. దీనితో ప్రపంచంలో వేగవంతమైన ఎకానమీ కలిగిన దేశంగా భారత్ ఉంటుందని స్పష్టం చేసింది. ఇదే ఏడాది ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యసవ్థ చైనా 4.4 శాతం పురోగతి సాధిస్తుందని బహుళజాతి బ్యాంకింగ్ సంస్థ పేర్కొంది. ఈ మేరకు ఐఎంఎఫ్ విడుదల చేసిన వార్షిక వరల్డ్ ఎకనమిక్ అవుట్‌లుక్ నివేదికలోని కొన్ని అంశాలు... ► 2022 భారత్ ఎకానమీ వృద్ధి తాజా అంచనా 8.2 శాతం అయినప్పటికీ, ఇది క్రితం అంచనాల కన్నా 80 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) తక్కువ కావడం గమనార్హం. ► ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, కమోడిటీ, ఆహార ధరల పెరుగుదల, బలహీన దేశీ డిమాండ్, ప్రైవే టు వినియోగం, పెట్టుబడులు పుంజుకోకపోవడం వంటి అంశాలు వృద్ధి అంచనా తగ్గింపు కారణం. ► 2021లో భారత్ వృద్ధి 8.9 శాతం. 2023లో 6.9 శాతం వృద్ధి నమోదవుతుందని అంచనా. ప్రపంచ వృద్ధి 3.6 శాతం కాగా, 2022లో ప్రపంచ వృద్ధి రేటు 3.6 శాతానికి పరిమితం అవుతుందని ఐఎంఎఫ్ అవుట్‌లుక్ అంచనావేసింది. ఈ మేరకు క్రితం (జనవరిలో 4.4 శాతంగా అంచనా) అంచనాలకన్నా 80 బేసిస్ పాయింట్లు కుదించింది. భౌగోళిక ఉద్రిక్తతలను దీనికి కారణంగా చూపింది. 2021 ప్రపంచ వృద్ధి 6.1 శాతం. 2023లో ప్రపంచ వృద్ధి అంచనాలను 3.8 శాతం నుంచి 3.6 శాతానికి కుదించింది. ఇక 2021లో 8.1 శాతం పురోగమించిన చైనా వృద్ధి రేటు 2022లో 4.4 శాతానికి తగ్గుతుందని పేర్కొంది. 2023లో ఈ రేటు 5.1 శాతంగా ఉంటుందని అంచనావేసింది. అమెరికా 2022లో 3.7 శాతం వృద్ధి రేటు నమోదు చేసుకుంటుందని పేర్కొంది. 2023లో ఈ రేటు 2.3 శాతానికి తగ్గుతుందని అంచనావేసింది. ప్రపంచ వృద్ధి వేగం తగ్గడానికి రష్యా యుద్ధం ప్రధాన కారణంగా చూపిన ఐఎంఎఫ్, 2022లో ఆ దేశ ఎకానమీ 8.5 శాతం క్షీణిస్తుందని తెలిపింది. ఉక్రెయిన్ విషయంలో ఈ క్షీణత 35 శాతంగా అంచనా వేసింది. ఇక 19 దేశాల యూరో దేశాల ఎకానమీ 2022 వృద్ధి అంచనాలను 3.9 శాతం నుంచి 2.8 శాతానికి కుదించింది. చదవండి: భారత్‌కు పొంచి ఉన్న ముప్పు..! ఎకానమీపై తీవ్ర ప్రభావం..! -
పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకంపై ఐఎంఎఫ్ ప్రశంసలు..!
ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనపై అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) ప్రశంసలు కురిపించింది . ఆహార భద్రత పథకం దేశంలో తీవ్ర పేదరికం పెరగకుండా నిరోధించిందని కితాబిచ్చింది. 2019లో భారత్‌లో తీవ్ర పేదరికం ఒక శాతం కంటే దిగువన ఉందని.. కరోనా సమయంలోనూ అది స్థిరంగానే కొనసాగిందని ఐఎంఎఫ్ తన నివేదికలో పేర్కొంది. పేదరిక స్థాయిలు పెరగకుండా నిరోధించడంలో పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కీలకంగా మారిందని ఐఎంఎఫ్ తెలిపింది. 2014 నుంచి 2019 మధ్య కాలంలో దేశంలో పేదరికం అత్యంత వేగంగా క్షీణించిందని ఐఎంఎఫ్ తన నివేదికలో పేర్కొంది. కరోనా రాకతో ప్రజలంతా తమ ఇంటి వద్ద పరిమితమైన విషయం తెలిసిందే. వలస కూలీలు, పేదలకు ఆహార భద్రతను అందించేందుకుగాను...కేంద్ర ప్రభుత్వం 2020 మార్చిలో ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకాన్ని తీసుకువచ్చింది. కాగా ఈ ఉచిత రేషన్ పథకాన్ని సెప్టెంబర్ 2022 వరకు పొడిగిస్తూ కేంద్రం ఇటీవలే నిర్ణయం తీసుకుంది. చదవండి: ఇంధన ధరల పెంపుపై కేంద్రం క్లారిటీ..! -
శ్రీలంకలో ముదురుతున్న సంక్షోభం.. నూతన ఆర్థిక మంత్రి రాజీనామా
Sri Lanka finance minister Ali Sabry resigned: శ్రీలంక అప్పుల ఊబిలో చిక్కుకుంది. నివేదికల ప్రకారం శ్రీలంకకి సుమారు రూ. 3 లక్షల కోట్ల విదేశీ అప్పు ఉంది. అందులో సుమారు 400 కోట్లు ఈ ఏడాది చెల్లించవలసి ఉంది. శ్రీలంక తీవ్ర ఆర్ధిక సంక్షోభం ఎదుర్కుంటున్న తరుణంలో ఆర్థిక మంత్రి అలీ సబ్రీ ప్రమాణస్వీకారం చేసిన తదుపరి రోజే రాజీనామ చేశారు. ఆయన తన సోదరుడు బాసిల్ రాజపక్సేను ఆర్థిక మంత్రిగా తొలగించి న్యాయ మంత్రిగా ఉన్న అలీ సబ్రీని ఆర్థిక మంత్రిగా శ్రీలంక అధ్యక్షుడు గోటబయట రాజపక్సే నియమించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సబ్రీ మాట్లాడుతూ...నేను ఎల్లప్పుడూ దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే పనిచేశానని నమ్ముతున్నాను. దేశ సమస్యలను పరిష్కరించడానికి సత్వర చర్యలు అవసరం అని ఆయన అన్నారు. నిజానికి సబ్రీ అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్)తో శ్రీలంక ఆర్థిక పరిస్థితిని చర్చించేందుకు ఈ నెలాఖరులో అమెరికాను సందర్శించాల్సి ఉంది. అయితే అధ్యక్షుడు గోటబయట రాజపక్సే పిలుపునిచ్చిన ఐక్యత ప్రభుత్వాన్ని ప్రతిపక్షం తిరస్కరించడంతో పాలక సంకీర్ణం మెజారిటీని కోల్పోయింది. దీంతో సబ్రీ రాజీనామా చేశారు. ఈ క్రమంలో ఫ్రీడమ్ పార్టీ అధినేత మైత్రిపాల సిరిసేన మాట్లాడుతూ..‘మా పార్టీ ప్రజల పక్షాన ఉంది. స్వతంత్ర చట్టసభ సభ్యుల సహాయంతో శ్రీలంక ప్రభుత్వం ఇప్పటికీ పనిచేయగలదు. కానీ సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో దాని సామర్థ్యం మరింత బలహీనపడింది.అని అన్నారు. అంతేగాక ప్రధాన మంత్రి మహింద్ర రాజపక్స క్యాబినెట్‌లోని మొత్తం 26 మంది మంత్రులు రాజీనామా చేశారు. అదీగాక శ్రీలంక సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ అజిత్ నివార్డ్ కబ్రాల్ కూడా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వాన్ని నియంత్రిస్తున్న రాజపక్స కుటుంబంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్త మవుతోంది. ఈ క్రమంలో గత వారం శ్రీలంక అధ్యక్షుడు గోటబయట రాజపక్స ఇంటిని ముట్టడించేందుకు వందలాది మంది ప్రయత్నించారు కూడా. దీంతో నిరసనకారులు, పోలీసులకు మధ్య జరిగిన హింస కారణంగా డజనుకు పైగా జనాలు గాయపడ్డారు. తప్పనిసరై రాజపక్స జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించడమే కాకుండా సైన్యానికి అరెస్టు చేసే అధికారాన్ని ఆదేశించారు. వారాంతంలో దేశవ్యాప్తంగా కర్ఫ్యూ కూడా విధించారు. ఇప్పటికే భారత్ సుమారు రూ. 200 కోట్ల క్రెడిట్ లైన్లు, దాదాపు రూ. 30 వేల కోట్ల విలువైన ఇంధన సాయాన్ని అందించింది. (చదవండి: లంకలో కల్లోలం) -
భారత్‌కు ఆ సత్తా ఉంది,రష్యాతో పెట్టుకోవద్దు..అలా చేస్తే అమెరికాకే నష్టం!
ముంబై: ఎకానమీకి సాధారణంగా ప్రయోజనం చేకూర్చే మూలధన ప్రవాహాలు ఒక్కొక్కసారి నష్టాలకూ దారితీసే అవకాశం ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గీతా గోపీనాథ్ పేర్కొన్నారు. అయితే ఇలాంటి సవాళ్లను ఎదుర్కొనే సత్తా భారత్‌కు ఉందని కూడా ఆమె వివరించారు. కోవిడ్–19 సంక్షోభం ఉన్నప్పటికీ గత కొన్నేళ్లుగా రికార్డు స్థాయిలో భారత్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) ఆకర్షించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గోపీనాథ్ మాట్లాడుతూ, మూలధన ప్రవాహాల నుండి వచ్చే నష్టాలను తగ్గించడానికి భారత్ పలు రక్షణాత్మక విధానాలను అవలంభిస్తోందని అన్నారు. మూలధన ప్రవాహాలకు సంబంధించి సంస్కరణలు, నిర్వహణ అనే అంశంపై విడుదల చేసిన ఒక అధ్యయన నివేదిక సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. క్యాపిటల్ ఫ్లోస్‌కు సంబంధించి ‘అధ్యయనం ఆధారంగా’ పలు సలహాలను ఇచ్చారు. ఈ అంశాల గురించి ఆమె ఏమన్నారంటే... ►మూలధన ప్రవాహాలు అనేక ప్రయోజనాలను కలిగి ఉంటాయి. తద్వారా అవసరమైన పెట్టుబడలు అందుతాయి. ఎకానమీకి కొన్ని విధానాలు వచ్చే నష్టాలకు ఎదుర్కొనడానికి దోహదపడతాయి. భారతదేశానికి కూడా ఇదే తరహా ప్రయోజనాలు అందుతున్నాయి. ►అయితే నష్టాలూ ఇందులో ఇమిడి ఉన్నాయి. భారత్ విషయానికి వస్తే, మూలధన ప్రవాహాల విషయంలో దేశంలో ఇప్పటికే భారీగా పరిమితులు ఉన్నాయి. అంతర్జాతీయ ఆర్థిక వాతావరణం మారినప్పుడు భారత ప్రభుత్వం ఈ పరిమితులను చాలా చురుగ్గా ఉపయోగిస్తుంది. కార్పొరేట్లు చేసే అంతర్జాతీయ రుణాల మొత్తంపై పరిమితులు విధించడం ఇక్కడ కీలకంగా చెప్పుకోవాల్సిన అంశం. ► పటిష్ట విధానాలు, నియంత్రణలతో భారత్ దాని క్యాపిటల్ అకౌంట్ వ్యవస్థను సరళీకృతం చేసే ప్రక్రియలో ఉంది. భారత్ ఫైనాన్షియల్ మార్కెట్లు, సంస్థలు పరిపక్వతతో కూడిన నియంత్రణలో ఉండడం వల్ల దేశం మరిన్ని రూపాల్లో క్యాపిటల్ ఫ్లోస్‌ను అనుమతించే వీలుంది. ►అంతర్జాతీయంగా మహమ్మారి ప్రారంభంలో మేము చూసిన ‘నాటకీయ’ మూలధన ప్రవాహాలు మళ్లీ ఇప్పుడు ఉక్రెయిన్‌లో యుద్ధం తరువాత కొన్ని అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలోకి ప్రవేశిస్తున్నాయి. ఇది ఆర్థిక వ్యవస్థలపై చూపే ప్రభావం ఎలా ఉంటుందన్న అంశాలపై ఆయా దేశాల విధాన నిర్ణేతలు సమగ్ర విశ్లేషణ జరుపుకోవాల్సి ఉంటుంది. ► తీవ్ర ఆర్థిక సంక్షోభం తర్వాత, అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలలో వడ్డీ రేట్లు చాలా కాలంగా తక్కువగా ఉన్నందున, అధిక రాబడుల కోసం వర్ధమాన మార్కెట్లకు మూలధనం ప్రవహించింది. కొన్ని దేశాల్లో ఇది విదేశీ కరెన్సీలో ఆయా దేశాల అంతర్జాతీయ రుణాన్ని క్రమంగా పెంచడానికి దారితీసింది. విదేశీ కరెన్సీ ఆస్తులు లేదా హెడ్జ్‌ల ద్వారా పరిష్కారింపలేని స్థాయికి కొన్ని దేశాల ఫైనాన్షియల్ వ్యవస్థలను అస్థిరపరిచే స్థాయికి ఇది చేరింది. ►సరళతర వడ్డీరేట్ల వ్యవస్థ తిరోగమనం పట్టిన సందర్భాల్లో వర్ధమాన దేశాల మార్కెట్లలో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులకు దారితీసింది. అటువంటి గత అనుభవాలు, పరిశోధనల నుండి ఇప్పుడు నేర్చుకున్న పాఠాలు ఏమిటంటే, కొన్ని పరిస్థితులలో స్థూల ఆర్థిక వ్యవస్థను అలాగే ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడటానికి దేశాలు క్యాపిటల్ ఫ్లోస్‌పై తగిన ముందస్తు జాగ్రత్తలు, విధి విధానాలు తప్పనిసరిగా రూపొందించుకోవాలి. ఏదైనా అనుకోని పరిస్థితుల తలెత్తినప్పుడు ముందు జాగ్రత్తగా తీసుకున్న చర్యలు ఆర్థిక సంక్షోభం తీవ్రతను తగ్గిస్తాయి. ►అంతర్జాతీయ రుణ బాధ్యతలు క్రమంగా పెరుగుతూ ఉండడం వల్ల అనుకోకుండా ఆర్థిక స్థిరత్వానికి వచ్చే నష్టాలను ఈ అధ్యయనం వివరిస్తోంది. అంతర్జాతీయ విదేశీ మారకద్రవ్యానికి సంబంధించి అసమతుల్యతను ఎప్పటికప్పుడు జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. ►అసమతౌల్య క్యాపిటల్ ఇన్‌ఫ్లో పెరుగుదలను ఎలా గుర్తించాలి? మూలధన ప్రవాహాలను సరళీకరించడం అవసరమా? కాదా? అని నిర్ణయించుకోవడంతో సహా ఇందుకు సంబంధించి అన్ని అంశాలపై విధాన సలహాలు, ఆచరణాత్మక మార్గదర్శకత్వాన్ని నివేదిక విశ్లేషణాంశాలు అందిస్తాయి. డాలర్ ఆధిపత్యానికి ‘ఆంక్షలు’ గండి ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో రష్యాపై విధిస్తున్న ఆంక్షలు అమెరికా డాలర్ ఆధిపత్యాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందని గీతా గోపీనాథ్ విశ్లేషించారు. అయితే అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో డాలర్ తక్కువ ఆధిపత్యం చెలాయించే అవకాశం ఉన్నప్పటికీ, ప్రధాన ప్రపంచ కరెన్సీగా కొనసాగడంలో ఎటువంటి అవరోధం ఉండబోదని ఆమె స్పష్టం చేశారు. ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మరింత ‘విచ్ఛిన్నం’ చేసే అవకాశం ఉందని కూడా హెచ్చరించారు. భౌగోళిక ఉద్రిక్తత నేపథ్యంలో క్రిప్టో కరెన్సీ వినియోగమూ పెరిగే వీలుందని విశ్లేషించారు. ‘‘యుద్ధం నేపథ్యంలో క్రిప్టోకరెన్సీల నుండి స్టేబుల్కాయిన్లు– సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీల వరకు డిజిటల్ ఫైనాన్స్ ప్రాధాన్యత పెరిగే అవకాశం ఉంది. అందువల్ల డిజిటల్ ఫైనాన్స్‌పై అంతర్జాతీయ నియంత్రణ ప్రస్తుతం అవశ్యం’’ అని ఆమె అన్నారు. ఇక రష్యాపై పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షల వల్ల విభిన్న దేశాలు, దేశీయ గ్రూపుల మధ్య ప్రత్యేక వాణిజ్య అవగాహనలు, చిన్న కరెన్సీ బ్లాక్‌లు ఆవిర్భవించే అవకాశం ఉందని ఆమె అన్నారు. -
Bitcoin: బిట్‌కాయిన్ చెల్లదు.. చెప్తే అర్థం కాదా?
క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్ విషయంలో మొదటి నుంచి తీవ్ర వ్యతిరేకతను కనబరుస్తోంది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (IMF). ఆర్థిక, మార్కెట్ సమగ్రత దెబ్బ తినడంతో పాటు క్రిప్టో వినియోగదారుడికి రిస్క్ తప్పదనే ఆందోళన సైతం వ్యక్తం చేస్తోంది. ఈ తరుణంలో దూకుడుగా ముందుకెళ్తున్న మధ్యఅమెరికా దేశం ఎల్ సాల్వడర్‌కు సాలిడ్‌గా వార్నింగ్ ఇచ్చింది ఐఎంఎఫ్. బిట్‌కాయిన్‌కు చట్టబద్ధత ఇవ్వడం కరెక్ట్కాదని, ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ మరోసారి హెచ్చరించింది. కిందటి ఏడాది సెప్టెంబర్‌లో ప్రపంచంలోనే బిట్‌కాయిన్‌ను అధికారిక కరెన్సీగా అంగీకరించిన దేశంగా ఎల్ సాల్వడర్ నిలిచింది. అయితే ఈ నిర్ణయం చెల్లదంటూ గతంలోనే ఐఎంఎఫ్.. ఎల్ సాల్వడర్‌కు తేల్చి చెప్పింది. First steps... 🌋#Bitcoin🇸🇻 pic.twitter.com/duhHvmEnym — Nayib Bukele 🇸🇻 (@nayibbukele) September 28, 2021 అయినా కూడా తగ్గని ఎల్ సాల్వ్డర్ అధ్యక్షుడు నయిబ్ బుకెలె(40) దూకుడు నిర్ణయాలతో మొండిగా ముందుకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో దేశానికి ఆర్థికంగా భవిష్యత్తులో భారీ నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నాయని, పైగా తమ(ఐఎంఎఫ్) నుంచి రుణం పొందే ప్రయత్నాలకు క్రిప్టో కరెన్సీనే ప్రధాన ఆటంకంగా మారొచ్చని హెచ్చరించింది. ప్రస్తుతం ఎల్ సాల్వ్డర్లో అమెరికా డాలర్(2001 నుంచి)తో పాటు బిట్‌కాయిన్ అధికారిక కరెన్సీగా ఉంది. అయితే క్రిప్టోకరెన్సీకి చట్టబద్ధత ఇవ్వడం వల్ల తీవ్ర పరిణామాలు ఏర్పడతాయని, ఆ పరిణామాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని ఎల్ సాల్వడర్ను ఆర్థిక నిపుణులు చాలాకాలంగా హెచ్చరిస్తూ వస్తున్నారు. సంబంధిత వార్త: బిట్‌కాయిన్ అఫీషియల్ కరెన్సీ కాదు! కుండబద్ధలు కొట్టిన ఐఎంఎఫ్ ఇక ఎల్ సాల్వడర్ కోసం విడుదల చేసిన ప్రకటనలో ఐఎంఎఫ్ పలు కీలక అంశాల్ని సైతం ప్రస్తావించింది. ఆర్థిక చేరికను పెంచడం యొక్క ప్రాముఖ్యతను అంగీకరించిన ఐఎంఎఫ్.. చివో ఇ-వాలెట్ వంటి డిజిటల్ చెల్లింపు మార్గాలు ఈ పాత్రను పోషిస్తాయని అభిప్రాయపడింది. అయితే.. బిట్‌కాయిన్ వ్యవహారం ఇందుకు విరుద్ధమని, దీనికి చట్టబద్ధత తొలగించేందుకు అవసరమైన మార్గాలపై దృష్టి సారించాలని పలు దేశాల ఆర్థిక అధికార యంత్రాంగాలకు ఐఎంఎఫ్ కీలక సూచనలు చేసింది. బుధవారం నాటి డిజిటల్ మార్కెట్ పరిణామాల ఆధారంగా యూఎస్ మార్కెట్లో బిట్ కాయిన్ విలువ 37 వేల డాలర్లుగా కొనసాగుతోంది. మార్కెట్ వాల్యూ ప్రకారం.. ప్రపంచంలోనే విలువైన డిజిటల్కరెన్సీగా కొనసాగుతోంది బిట్ కాయిన్. కానీ, గత నవంబర్‌తో పోలిస్తే ప్రస్తుతం 50 శాతం పడిపోయింది వాల్యూ. 2021లో ఆల్ టైం హైగా 69 వేల డాలర్ల మార్క్‌ను తాకింది బిట్‌కాయిన్ వాల్యూ. ఆ తర్వాతి పరిణామాలు బిట్‌కాయిన్‌ను మళ్లీ పుంజుకోకుండా చేస్తున్నాయి. సంబంధిత వార్త: అగ్నిపర్వతాల నుంచి బిట్‌కాయిన్ తయారీ! ఎలాగంటే.. -
ఇమ్రాన్ ఖాన్ కామెడీ.. పాక్‌లో నవ్వులు
ఛాన్స్ దొరికితే చాలు.. ప్రతీ అంశంలోనూ భారత్‌ను లాగి.. అక్కసు వెల్లగక్కుతుంటాడు పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. అయితే తాజాగా ఆయన ఇచ్చిన ఓ స్టేట్మెంట్ నవ్వులు పూయించడమే కాదు.. రాజకీయ విమర్శలకు, ఇంటర్నెట్లో సొంత ప్రజల నుంచే సెటైర్లు పడేలా చేస్తోంది. ‘ప్రపంచ దేశాలతో పాకిస్థాన్ చౌక దేశంగా ఉంది. చాలా వస్తువులు చీప్‌గా దొరుకుతున్నాయి. కానీ, ప్రతిపక్షాలేమో మమ్మల్ని చేతకానీ ప్రభుత్వం అని విమర్శిస్తున్నారు. మేమేమో అన్ని సంక్షోభాల నుంచి దేశాన్ని రక్షిస్తున్నాం’ అంటూ రావల్పిండిలో జరిగిన ఓ వాణిజ్య సదస్సులో ఆయన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇక్కడితో పరిమితమైతే ఫర్వాలేదు. కానీ, అతిశయోక్తికి పోయి.. భారత్‌ను లాగడంతో అసలు వ్యవహారం మొదలైంది. చాలా దేశాల కంటే పాక్ ఆర్థిక స్థితి మెరుగ్గా ఉందని, ముఖ్యంగా భారత్ కంటే మెరుగ్గా ఉందంటూ కామెంట్ చేశాడు. అంతే.. బిల్లు దేని కోసం ఖాన్ సాబ్? ఇమ్రాన్ ఖాన్ అధికారంలోకి వచ్చాక పాక్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. చివరకు ప్రభుత్వ కార్యాలయాలకు అద్దె సైతం చెల్లించలేని స్థితికి చేరుకుంది. ఈ తరుణంలో ఆర్థిక గండం నుంచి గట్టెక్కేందుకు అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) సాయం కోసం ప్రాధేయపడుతున్నాడు. అంతేకాదు బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం కోసం ఐఎంఎఫ్ పెట్టిన ఎన్నో షరతులకు అంగీకరించిన ఇమ్రాన్ ఖాన్ సర్కారు.. సంబంధిత బిల్లుకు పార్లమెంటు ముద్ర వేయించేందుకు నానా పాట్లు పడుతున్నాడు. సొంత ప్రజలే ట్రోలింగ్ ఇమ్రాన్ ఖాన్ భారత్ మీద చేసిన కామెంట్‌పై పార్లమెంట్లో ప్రతిపక్షాలే సెటైర్లు పేలుస్తున్నాయి. ప్రతిపక్ష నేత పీఎంఎల్ ఎన్ అధ్యక్షుడు షెబాజ్ షరీఫ్ ఈ అంశాన్ని నేషనల్ అసెంబ్లీలో చర్చకు లేవనెత్తాడు. ఒక వైపు అణుశక్తి దేశంగా ఉంటూ.. మరోవైపు చిప్ప పట్టుకుని అడుక్కోవడం ఎలా సాధ్యమవుతోందని? పైగా భారత్ లాంటి దేశం కంటే ఆర్థికంగా మెరుగ్గా ఉన్నామంటూ ఎలా వ్యాఖ్యానిస్తారని ఇమ్రాన్ ఖాన్‌ను ఏకీపడేశాడు. ఇక దేశ ఆర్థిక పరిస్థితిని పీఎంగా ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం దివాలా తీయించిందని, కరోనా టైంలో అన్ని రంగాల్లో దెబ్బ తీసిందని, వ్యాక్సినేషన్ సంగతి ఏంటని?.. ఇంటర్నెట్లో పాక్ ప్రజలే ఇమ్రాన్‌పై మీమ్స్ వేస్తున్నారు. -
క్రిప్టోకరెన్సీపై కీలక వ్యాఖ్యలు చేసిన ఐఎమ్ఎఫ్ చీఫ్ ఎకనమిస్ట్ గీతా గోపినాథ్..!
పార్లమెంట్లో క్రిప్టోకరెన్సీపై నియంత్రణ బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమైన విషయం తెలిసిందే. వివిధ దేశాల్లోని సెంట్రల్ బ్యాంకులు క్రిప్టోకరెన్సీలను నిషేధించాలని కోరుతుండగా... ఈ నిర్ణయాలను అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎమ్ఎఫ్) మద్దతు తెలిపింది. కాగా త్వరలోనే ఐఎమ్ఎఫ్కు డిప్యూటీ మేనేజింగ్ డైరక్టర్ పదవి స్వీకరించనున్న ఐఎమ్ఎఫ్ చీఫ్ ఎకనమిస్ట్ గీతా గోపినాథ్ క్రిప్టోకరెన్సీపై కీలక వ్యాఖ్యలు చేసింది. చదవండి: చరిత్ర సృష్టించిన గీతా గోపినాథ్.. ఎక్కాలే రాని చిన్నారి.. ఇప్పుడు ఏకంగా ఐఎంఎఫ్‌లో నెం.2!! నిషేధం బదులుగా..నియంత్రణే మేలు..! నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ (NCAER) నిర్వహించిన కార్యక్రమంలో గీతా గోపినాథ్ క్రిప్టోకరెన్సీలపై వ్యాఖ్యానించారు. క్రిప్టోకరెన్సీలను నిషేధించే బదులుగా వాటిని నియంత్రణలోకి తీసుకురావడం చాలా మంచిదని అభిప్రాయపడ్డారు. అభివృద్ధి చెందే దేశాల ఆర్థిక వ్యవస్థలకు క్రిప్టోకరెన్సీలు ప్రత్యేక సవాలుగా నిలుస్తాయని తెలిపారు. అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే అభివృద్ధి చెందుతున్న మార్కెట్లకు క్రిప్టోకరెన్సీలు మరింత ఆకర్షణీయంగా ఉన్నాయని అన్నారు . అయితే అభివృద్ధి చెందుతున్న దేశాలు మారకపు రేటు నియంత్రణలను కలిగి ఉంటాయి. మూలధన ప్రవాహ నియంత్రణలను క్రిప్టోకరెన్సీలు ప్రభావితం చేసే అవకాశం ఉందని గీతా పేర్కొన్నారు. క్రిప్టోకరెన్సీలను ఇన్వెస్టర్లు ఒక పెట్టుబడి ఆస్తిలాగానే ఉపయోగిస్తున్నారని, ఆయా దేశాల్లో పెట్టుబడికి సంబంధించిన నియమాలను డిజిటల్ కరెన్సీపై కూడా వర్తించేలా చూడాలని గీతా సూచించారు. భారత ప్రభుత్వం క్రిప్టోకరెన్సీలకు సంబంధించిన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని చూస్తున్న తరుణంలో గోపీనాథ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 23తో ముగియనున్నాయి. కాగా క్రిప్టోకరెన్సీ బిల్లుపై కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. క్రిప్టోకరెన్సీపై కేంద్ర ప్రభుత్వం బిల్లును తెచ్చే వరకు వేచి చూడాల్సిందే. చదవండి: ప్రధాని మోదీని కలిసిన ఐఎంఎఫ్ చీఫ్ ఎకనమిస్ట్ -
ప్రధాని మోదీని కలిసిన గీతా గోపినాథ్
ఐఎంఎఫ్ చీఫ్ ఎకనమిస్ట్ గీతా గోపినాథ్ భారత ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. బుధవారం సాయంత్రం ఆమెతో భేటీ అయిన ఫొటోల్ని స్వయంగా ప్రధాని తన ట్విటర్లో పోస్ట్ చేశారు. ఇటీవలే గీతా గోపినాథ్‌ను ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ సంస్థకు ఫస్ట్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా ప్రమోట్ చేసిన విషయం తెలిసిందే. జనవరి 21, 2022న ఆమె బాధ్యతలు స్వీకరించాల్సి ఉంది. Chief Economist of the IMF, @GitaGopinath called on PM @narendramodi. pic.twitter.com/2B30CMvjja — PMO India (@PMOIndia) December 15, 2021 ఈ ప్రకటన తర్వాతే గౌరవపూర్వకంగా ఆమె ప్రధాని మోదీని కలిసినట్లు తెలుస్తోంది. నిజానికి వచ్చే ఏడాదిలో ఆమె ఐఎంఎఫ్‌ను వీడి.. హార్వార్డ్ యూనివర్సిటీకి వెళ్లాలనుకున్నారు. కానీ, ప్రస్తుతం ఉన్న ఫస్ట్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ జియోఫ్రె ఒకమోటో వచ్చే ఏడాది తన పదవికి రాజీనామా చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే గీతను ఆ ఉన్నత పదవికి సిఫార్సు చేసింది ఐఎంఎఫ్ బోర్డు. చదవండి: కోల్‌కతా టు న్యూయార్క్ వయా బెంగళూరు -
Gita Gopinath: అనూహ్య పరిణామం.. అంతర్జాతీయ వేదికపై మన ‘గీత’
అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF)లో ఓ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. భారత సంతతికి చెందిన గీతా గోపినాథ్‌కు కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు గురువారం ప్రకటించారు. అంతర్జాతీయ సంస్థ ఐఎంఎఫ్‌కు ఇంతకుముందు తొలి ఉమెన్ ఛీఫ్ ఎకనమిస్ట్‌గా చరిత్ర సృష్టించిన గీతా గోపినాథ్.. ఇప్పుడు మరో ఘనత దక్కించుకున్నారు. ఏకంగా ఫస్ట్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతలు చేపట్టబోతున్నారామె. ప్రస్తుతం ఈ అంతర్జాతీయ ఆర్థిక సంస్థకు నెంబర్ 2గా ఉన్నజియోఫ్రె విలియమ్ సెయిజి ఒకమోటో( ఫస్ట్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్).. వచ్చే ఏడాది మొదట్లో బాధత్యల నుంచి తప్పుకోనున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆ స్థానాన్ని గీతా గోపినాథ్‌తో భర్త చేయనుంది ఐఎంఎఫ్. నిజానికి ఆమె వచ్చే ఏడాది జనవరిలో ఐఎంఎఫ్‌ను వీడి.. హర్వార్డ్ యూనివర్సిటీలో చేరతానని ప్రకటించుకున్నారు. కానీ, అనూహ్యంగా ఆమెకు కీలక బాధ్యతలు అప్పగించింది ఐఎంఎఫ్. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్‌కు మేనేజింగ్ డైరెక్టర్ పదవిలో 68 ఏళ్ల క్రిస్టలీనా జార్జియేవా(బల్గేరియా) కొనసాగుతోంది. ఇక ఇప్పుడు రెండో పొజిషన్లో గీతా గోపినాథ్(49) నియమితురాలయ్యింది. దీంతో కీలకమైన ఒక అంతర్జాతీయ ఆర్థిక విభాగపు కీలక బాధ్యతల్ని ఇద్దరు మహిళలు చూసుకోబోతున్నారన్నమాట. మైసూర్ టు వాషింగ్టన్ గీతా గోపినాథ్.. పుట్టింది డిసెంబర్ 8, 1971 కోల్‌కతా(కలకత్తా)లో. అయితే ఆమె చదువు మొత్తం మైసూర్ (కర్ణాటక)లో సాగింది. చిన్నతనంలో గీతాకు చదువంటే ఆసక్తే ఉండేది కాదట. ముఖ్యంగా ఎక్కాల్లో ఆమె సుద్దమొద్దుగా ఉండేదని గీత తల్లి విజయలక్క్క్ష్మి ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు కూడా. ఇక ఏడో తరగతి నుంచి చదువులో మెరుగైన ప్రతిభ కనబరుస్తూ వచ్చిన గీత.. ఫ్లస్ టు సైన్స్‌లో విద్యను పూర్తి చేసింది. అయితే డిగ్రీకొచ్చేసరికి తనకు ఏమాత్రం సంబంధం లేని ఎకనమిక్స్‌ను ఎంచుకుని పేరెంట్స్‌ను సైతం ఆశ్చర్యపరిచిందామె. ఢిల్లీలోనే బీఏ, ఎంఏ ఎకనమిక్స్ పూర్తి చేసి.. ఆపై వాషింగ్టన్లో మరో పీజీ, ప్రిన్స్టన్ యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ పట్టా అందుకుంది. ఈ రీసెర్చ్‌కి గానూ ఆమెకు ప్రిన్స్టన్ వుడ్రో విల్సన్ ఫెలోషిప్ రీసెర్చ్ అవార్డు అందుకుంది. ఆపై చికాగో బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేశారామె. కీలక బాధ్యతలెన్నో.. 2018, అక్టోబర్‌లో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్‌కు ఛీఫ్ ఎకనమిస్ట్‌గా గీతా గోపీనాథ్ నియమించబడింది. అంతేకాదు ఐఎంఎఫ్‌లో కీలక బాధ్యతలు చేపట్టిన తొలి భారత సంతతి వ్యక్తి కూడా ఆమెనే!. ఇక ఆ పదవిలో కొనసాగుతూనే.. ఇంటర్నేషనల్ ఫైనాన్స్‌కు కో డైరెక్టర్‌గా, నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనమిక్ రీసెర్చ్‌లో మాక్రోఎకనమిక్స్ ప్రొగ్రామ్‌ను నిర్వహించారామె. ఇంతేకాదు ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్‌లో ఎకనమిక్ అడ్వైజరీ ప్యానెల్లో సభ్యురాలిగా, కేరళ ముఖ్యమంత్రికి ఆర్థిక సలహాదారుగా, ఈ ఏడాది జూన్‌లో వరల్డ్ బ్యాంక్-ఐఎంఎఫ్ హైలెవల్ అడ్వైజరీ గ్రూపులో కీలక సభ్యురాలిగా వ్యవహరించారు. గౌరవాలు 2011లో యంగ్ గ్లోబల్ లీడర్‌గా వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ నుంచి అవార్డుతో పాటు 2019లో భారత సంతతి వ్యక్తి హోదాలో ప్రవాసీ భారతీయ సమ్మాన్ పురస్కారం అందుకున్నారామె. కరోనా సంక్షోభంలో ఐఎంఎఫ్ తరపున ఆమె అందించిన సలహాలు, కార్యనిర్వహణ తీరు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. వ్యక్తిగత జీవితం గీతా గోపీనాథ్ భర్త ఇక్బాల్ సింగ్ ధాలివాల్.. మాజీ ఐఏఎస్ ఈయన. 1995 ఏడాది సివిల్స్ పరీక్షల్లో ఫస్ట్ ర్యాంకర్ ఆయన. కొంతకాలం విధులు నిర్వహించి.. ఆపై ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఈయన కూడా ఆర్థిక మేధావే. ప్రస్తుతం మస్సాచుషెట్స్ టెక్నాలజీ ఇనిస్టిట్యూట్, జే-పాల్లో ఎకనమిక్స్ విభాగంలో గ్లోబల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ జంటకు ఒక బాబు.. పేరు రోహిల్. గీతా గోపినాథ్‌కు ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియాతో పాటు అమెరికన్ పౌరసత్వం కూడా ఉంది. -సాక్షి, వెబ్‌స్పెషల్ -
Bitcoin: బిట్‌కాయిన్‌పై భారీ షాకిచ్చిన ఐఎంఎఫ్
Bitcoin Not Official Currency Says IMF: క్రిప్టోకరెన్సీ అయిన బిట్‌కాయిన్ విషయంలో మొదటి నుంచి దూకుడు ప్రదర్శిస్తోంది ఎల్ సాల్వడర్ దేశం. సంప్రదాయ విద్యుత్ బదులు ఏకంగా అగ్నిపర్వతాల శక్తిని ఉపయోగించి కంటికి కనిపించని క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్లను రూపొందిస్తూ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. అయితే ఇప్పుడు ఎల్ సాల్వడర్‌కు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) పెద్ద షాకిచ్చింది. బిట్‌కాయిన్‌ను చట్టబద్ధంగా ఉపయోగించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. క్రిప్టోకరెన్సీ ద్వారా రిస్క్ రేటు ఉన్నందున ఎట్టిపరిస్థితుల్లో దానిని చట్టబద్ధంగా అనుమతించడానికి వీల్లేదని ఎల్ సాల్వడర్‌కు స్పష్టం చేసింది ఐఎంఎఫ్. కాగా, మధ్యఅమెరికా దేశమైన ఎల్ సాల్వడర్ సెప్టెంబర్‌లో యూఎస్ డాలర్‌తో పాటుగా బిట్‌కాయిన్‌కు చట్టబద్ధత ప్రకటించింది. అయితే బిట్‌కాయిన్ చట్టాలకు అనుమతిస్తే ఆర్థిక నేరాలకు ఎక్కువ అవకాశం ఉంటుందని, దీనికి బదులు కొత్త పేమెంట్ వ్యవస్థలను తీసుకురావడం లేదంటే అభివృద్ధి చేయడం లాంటివి చేయాలని ఎల్ సాల్వడర్‌కు సూచించింది ఐఎంఎఫ్. బిట్‌కాయిన్‌కు చట్టబద్ధత ఇవ్వొద్దని, అది అఫీషియల్ కరెన్సీ కాదని కుండబద్ధలు కొట్టి తేల్చేసింది ఐఎంఎఫ్. చదవండి: బిట్‌కాయిన్‌కు చట్టబద్ధత! ఎలాగంటే.. ఇదిలా ఉంటే బిట్‌కాయిన్ బాండ్లతో ఏకంగా బిట్ కాయిన్‌సిటీ నిర్మాణానికి పూనుకుంటున్నట్లు ఎల్ సాల్వడర్ అధ్యక్షుడు నయిబ్ బుకెలె(40) ప్రకటించిన రెండు రోజులకే ఐఎంఎఫ్ నుంచి ఈ ప్రతికూల ప్రకటన వెలువడడం విశేషం. అయితే దేశ అవసరాలు, ఆసక్తి మేర కొన్ని నిర్ణయాలు తీసుకోక తప్పట్లేదని అధ్యక్షుడు బుకెలె చెప్తున్నాడు. బిట్‌కాయిన్ చట్టబద్దత కోసం మరికొన్ని దేశాలు ప్రయత్నిస్తున్న తరుణంలో.. ఐఎంఎఫ్ ప్రకటన ఆ ప్రయత్నాలకు అడ్డుపుల్ల వేసే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు కొందరు భావిస్తున్నారు. చదవండి: ఆ నిర్ణయం బిట్‌కాయిన్ కొంపముంచింది..! చదవండి: సంచలనం.. అగ్నిపర్వతాలతో బిట్‌కాయిన్ తయారీ -
ప్రపంచ దేశాల అప్పు ఎంతో తెలిస్తే షాకే...!
Global Debt Jumps To A New High: మన దగ్గర సరిపడా డబ్బులు లేకపోతే ఏం చేస్తాం..! మనకు తెలిసిన స్నేహితుల నుంచో లేదా బంధువుల నుంచి అప్పుగా తీసుకుంటాం. వారి దగ్గర అప్పు ఎందుకులే అనుకునే వారు బ్యాంకులను ఆశ్రయిస్తారు. అలాగే మన దేశంతో సహా ఇతర దేశాలు పలు అంతర్జాతీయ బ్యాంకులను ఆశ్రయిస్తాయి. ఇతర దేశాల నుంచి కూడా పలు దేశాలు అప్పును తీసుకుంటాయి. ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు, వరల్డ్ బ్యాంకు వంటి నుంచి పలుదేశాలు అప్పులను పొందుతాయి. ప్రపంచదేశాల అప్పు తెలిస్తే షాకే...! ఆయా దేశాల అభివృద్ధి కోసం వరల్డ్ బ్యాంకు, ఇతర సంస్థల నుంచి ప్రపంచదేశాలు అప్పులను పొందుతాయి. తాజాగా ప్రపంచదేశాల అప్పుపై ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్(ఐఎమ్ఎఫ్) కీలక వ్యాఖ్యలను చేసింది. ప్రపంచదేశాల అప్పు సుమారు 226 ట్రిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు బుధవారం రోజున ఐఎమ్ఎఫ్ వెల్లడించింది. కోవిడ్-19 రాకతో పలు దేశాలు భారీగా అప్పులను తీసుకున్నట్లు పేర్కొంది. గత ఏడాదితో పోలిస్తే 2021గాను భారత అప్పులు సుమారు 90.6 శాతానికి పెరిగినట్లు ఐఎమ్ఎఫ్ తెలిపింది. ప్రపంచవ్యాప్త రుణ సేకరణ విషయంలో అభివృద్ధి చెందిన దేశాలు, చైనా 90 శాతం మేర నిధులను సమకూర్చాయి. మిగిలిన అభివృద్ధి చెందుతున్న దేశాలు కేవలం ఏడు శాతం మేర నిధులను మాత్రమే అందించాయి. చదవండి: భారత్ ముందు చిన్నబోయిన అగ్రరాజ్యం..! ఇండియన్స్‌తో మామూలుగా ఉండదు..! కోవిడ్-19రాకతో వేగంగా...! కోవిడ్-19 రాకతో ప్రపంచదేశ ఆర్థిక వ్యవస్థలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో పలు అభివృద్ధి చెందుతున్నదేశాలు, ఇతర చిన్నచిన్న దేశాలు అప్పుల కోసం ఎగబడ్డాయి. కోవిడ్-19 ఎదుర్కొనే సమయంలో ఆయా దేశాల రుణస్థాయిలు వేగంగా పెరిగి అధిక స్థాయికి చేరాయని ఐఎమ్ఎఫ్ 2021 ఆర్థిక మానిటర్ నివేదిక విడుదల సందర్భంగా ఐఎమ్ఎఫ్ ఆర్థిక వ్యవహారాల శాఖ డైరెక్టర్ విటర్ గ్యాస్పర్ పేర్కొన్నారు. అంతేకాకుండా ఆయా దేశాల పబ్లిక్, ప్రైవేటు రుణాల పెరుగుదల వాటి ఆర్థిక స్థిరత్వం, పబ్లిక్ ఫైనాన్స ప్రమాదాల్లో పడే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ రాకతో 2021లో సుమారు 65 నుంచి 75 మిలియన్ల వరకు దారిద్ర్యంలోకి వెళ్లే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. చదవండి: ఎంత పనిచేశావు ఎలన్‌మస్క్..! నీ రాక..వారికి శాపమే..! -
చైనాకు ఊడిగం.. ఆమెకు పదవీగండం
డబ్ల్యూటీవో రూల్స్‌ను విస్మరించి.. ప్రపంచ మార్కెట్‌ను శాసించాలనే చైనా అత్యాశ వాళ్ల పీకకే చుట్టుకుంది. డూయింగ్ బిజినెస్ ర్యాకింగ్‌లో పైరవీల ద్వారా మెరుగైన ర్యాంక్ సంపాందించిన వ్యవహారం బట్టబయలు కావడంతో చైనా నవ్వుల పాలైన విషయం తెలిసిందే. ఈ తరుణంలో.. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలీనా జార్జియేవా(68)కు పదవీగండం పట్టుకుంది. గతంలో చైనాకు ఊడిగం చేశారన్న ఆరోపణలపై చేపట్టిన దర్యాప్తులో ఆమె పాత్ర దాదాపు ఖరారైనట్లే!. దీంతో ఆమెను కొనసాగించడమా? తీసేయడమా? అనే నిర్ణయం ఇప్పుడు ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్ బోర్డు చేతుల్లో ఉంది. చైనాకు మెరుగైన ర్యాంకింగ్ లభించేలా వరల్డ్ బ్యాంక్ సిబ్బందిపై ఒత్తిడి తెచ్చారని, డేటాను మార్చేశారని క్రిస్టలీనా (ఆ టైంలో ఆమె సీఈవోగా ఉన్నారు) ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంలో అప్పటి వరల్డ్ బ్యాంక్ మాజీ ప్రెసిడెంట్ జిమ్ యోంగ్ కిమ్ హస్తం ఉందని తేలింది. డూయింగ్ బిజినెస్ ర్యాకింగ్‌లో చైనా పైరవీల వ్యవహారం ఆరోపణలపై వరల్డ్ బ్యాంక్ ఎథిక్స్ కమిటీ దర్యాప్తు చేసింది. మరోవైపు విల్‌మెర్‌హేల్ లీగల్ సంస్థ దర్యాప్తులోనూ ఆమెపై ఆరోపణలు నిజమని నిరూపితంకాగా, గురువారం ఆ ఆరోపణల్ని ఖండిస్తూ ఐఎంఎఫ్ బోర్డ్ మెంబర్స్‌కు లేఖ రాసింది క్రిస్టలీనా. పైగా ఫ్రాన్స్, యూరోపియన్ దేశాల నుంచి ఆమెకు మద్దతు లభిస్తోంది. ఈ తరుణంలో తొందరపాటు నిర్ణయంగా కాకుండా.. ఆమెను పదవిలో కొనసాగించాలా? వద్దా? అనే నిర్ణయం తీసుకునేందుకు సోమవారం నుంచి వరుస భేటీలు కానున్నాయి వరల్డ్‌బ్యాంక్, ఐఎంఎఫ్ బోర్డులు. డూయింగ్ బిజినెస్ ర్యాకింగ్స్లో.. చైనా 2018 ఏడాదికి(హాంకాంగ్‌తో కలిసి ఐదవ స్థానం-వ్యక్తిగతంగా 78వ స్థానం, 2020లో హాంకాంగ్‌తో కలిసి మూడవ స్థానం-వ్యక్తిగతంగా 31వ స్థానానికి ఎగబాకింది. అయితే 2018, 2020తో పాటు మధ్యలో 2019లోనూ చైనా ఫేక్ ర్యాంకులు దక్కించుకుందనేది ప్రపంచ బ్యాంక్ అంతర్గత దర్యాప్తు సంస్థ వెల్లడించిన అంశం. చదవండి: చైనా మెడకు బిగుస్తున్న ఉచ్చు.. పాక్ పాత్ర కూడా! -
చైనా మెడకు బిగుస్తున్న ఉచ్చు.. పాక్ పాత్ర కూడా!
China Ease of doing business index Scam: డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్‌ల విషయంలో చైనా భారీ అవినీతికి పాల్పడిందన్న ఆరోపణలు.. ఇప్పుడు ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. ర్యాంకింగ్‌లో పురోగతి అనేది దేశ ఆర్థిక పురోగతిని, అంతర్జాతీయ మార్కెట్లో పెట్టుబడుల్ని ప్రభావితం చేసే అంశం. అయితే అంతటి బలమైన వ్యవస్థను.. చైనా అంతతేలికగా ఎలా ప్రభావితం చేయగలిగిందన్నది ఇప్పుడు ప్రధానంగా వ్యక్తం అవుతున్న అనుమానం. ఇక ఈ ఆరోపణలు వెలుగుచూడడంతో.. డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్‌ల విడుదలను నిలిపివేస్తూ(ఈ ఏడాదికి మాత్రమేనా? శాశ్వతంగానా?) ప్రపంచ బ్యాంక్ సంస్థ ప్రకటించడంతో అన్ని దేశాలు దిగ్భ్రాంతికి లోనయ్యాయి. డబ్ల్యూటీవో రూల్స్‌ను కాలి కింద తొక్కిపట్టి మరీ.. ప్రపంచ మార్కెట్‌ను శాసించాలనే అత్యాశ ఇప్పుడు పాముగా మారి డ్రాగన్ మెడకు చుట్టుకుంటోంది. డూయింగ్ బిజినెస్ ర్యాకింగ్స్లో అవకతవకలు బయటపడడంతో అంతర్జాతీయ సమాజం చైనాపై దుమ్మెత్తిపోస్తోంది. గ్లోబల్ ఇన్వెస్టర్లను ఆకర్షించేందుకు వీలుగా.. చైనా డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్‌లో పైరవీలు చేసి మెరుగైన ర్యాంకులు సంపాదించింది. డూయింగ్ బిజినెస్ ర్యాకింగ్స్లో.. 2018 ఏడాదికి(హాంకాంగ్‌తో కలిసి ఐదవ స్థానం-వ్యక్తిగతంగా 78వ స్థానం, 2020లో హాంకాంగ్‌తో కలిసి మూడవ స్థానం-వ్యక్తిగతంగా 31వ స్థానానికి ఎగబాకింది. అయితే 2018, 2020తో పాటు మధ్యలో 2019లోనూ ఫేక్ ర్యాంక్ దక్కించుకుందనేది ప్రపంచ బ్యాంక్ అంతర్గత దర్యాప్తు వెల్లడించిన అంశం. ఉన్నత పదవుల్లో అవినీతి, నివేదికల్లో డేటాపరమైన అవకతవకలు, బ్యాంకు సిబ్బంది నైతిక విలువలు పాటించకపోవడం వంటి వ్యవహారాలు చైనా ర్యాంక్‌ను ప్రభావితం చేశాయని దర్యాప్తు వెల్లడించింది. ఇవేకాదు.. అంతర్గతంగా విచారణ ద్వారా మరిన్ని నిజాల్ని నిగ్గు తేలుస్తామని ఇప్పటికే ప్రపంచ బ్యాంకు ప్రకటించుకుంది కూడా. గత రెండు దశాబ్దాలుగా ఐఎంఎఫ్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వంటి అంతర్జాతీయ సంస్థలపై పట్టు సాధించేందుకు చైనా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో తాజా పరిణామాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆరోపణలు నిజమని తేలితే.. చైనాపై కొంతకాలం కఠిన ఆంక్షలు విధించడంతో పాటు విదేశీ పెట్టుబడులకు అనుమతుల నిరాకరణకు ఆదేశించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వరల్డ్ బ్యాంక్ మాజీ ప్రెసిడెంట్ జిమ్ యోంగ్ కిమ్, సీఈవో(ప్రస్తుతం కూడా) క్రిస్టలీనా జార్జియేవా.. ఒత్తిళ్ల మేరకు చైనాకు మెరుగైన ర్యాంకింగ్ లభించేలా వరల్డ్ బ్యాంక్ సిబ్బంది డేటాను మార్చేశారని ఈ వ్యవహారంలో దర్యాప్తు చేపట్టిన న్యాయసేవల సంస్థ విల్మర్హేల్ నిర్ధారించింది. పాక్ పాత్ర కూడా.. ప్రస్తుతం డూయింగ్ బిజినెస్ ర్యాకింగ్‌లో చైనా పైరవీల వ్యవహారంపై వరల్డ్ బ్యాంక్ ఎథిక్స్ కమిటీ దర్యాప్తు చేస్తోంది. ఈ క్రమంలో పాకిస్థాన్ పాత్రను కూడా గుర్తించినట్లు సమాచారం. పాక్ లాంటి దేశాల వెన్నుదన్నుతోనే చైనా ఫేక్ ర్యాంకింగ్‌తో డూయింగ్ బిజినెస్ లిస్ట్‌లో ఎగబాకగలిగిందని ఎథిక్స్ కమిటీ సమర్పించిన 16 పేజీల నోట్లో ఓ ముఖ్యాంశంగా ఉంది. చైనాను హైలీ ప్రమోట్ చేయడం ద్వారా పాక్ సైతం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్నట్లు అయ్యింది. అంతేకాదు గ్లోబల్ ఇన్వెస్టర్లను చైనాకు మళ్లించేలా ప్రభావితం చేయడంతో పాటు చైనాతో పరస్పర సహకారం భారీ ముడుపులు పాక్ అందుకుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చైనాతో ఆర్థిక లావాదేవీల కొనసాగింపు, పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి, ఇస్లామాబాద్-ఫైసలాబాద్-కరాచీలలో భారీ పెట్టుబడుల హామీతోనే చైనాకు పాక్ మద్దతుగా నిలుస్తోందనేది ఆ నివేదికలోని సారాంశం. మరో విషయం ఏంటంటే.. ప్రపంచ ఆరోగ్య సంస్థను సైతం ప్రభావితం చేస్తూ చైనా ఈ తతంగాన్ని నడిపించిందని. కావాలంటే ఎంక్వైరీ చేస్కోండి చైనా ఈ ఆరోపణలు తోసిపుచ్చుతోంది. ఇదంతా అమెరికా కుట్రలో భాగమని అంటోంది. అంతర్గత దర్యాప్తు కాదు.. అవసరమైతే నిఘా వర్గాలతోనూ దర్యాప్తు జరిపించుకోండంటూ ప్రపంచ బ్యాంకుకు సవాల్ విసురుతోంది. మరోవైపు, ప్రపంచ బ్యాంకు ఈ ఆరోపణలపై సమగ్రమైన విచారణ నిర్వహించాలని, విశ్వసనీయతను పాటించాలని చైనా విదేశాంగ శాఖ అభిప్రాయపడింది. ఇక అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్)కి డైరెక్టరుగా ఉన్న జార్జియేవా ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. విచారణ నివేదికలో వెల్లడైన విషయాలతో విభేదిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇక ఆ టైంలో వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్‌గా పని చేసిన జిమ్ కిమ్ సైతం ఆరోపణల్ని తోసిపుచ్చారు. వరల్డ్ బ్యాంక్ ఎథిక్స్ కమిటీ.. ఈ ఆరోపణలపై దర్యాప్తు జరుపుతోంది. సెప్టెంబర్ 15న ‘ఇన్వెస్టిగేషన్ ఆఫ్ డేటా ఇర్రెగ్యులారిటీస్ ఇన్ డూయింగ్ బిజినెస్ 2018 అండ్ డూయింగ్స్ బిజినెస్ 2020.. ఇన్వెస్టిగేషన్ ఫైండింగ్స్ అండ్ రిపోర్ట్ టు ది బోర్డ్ ఆఫ్ మేనేజింగ్ డైరెక్టర్స్’ పేరుతో 16 పేజీల రిపోర్ట్‌ను తయారు చేసింది ఎథిక్స్ కమిటీ. . అవుట్‌డేటెడ్ మల్టీలాటెరల్ స్ట్రక్చర్స్, అవినీతి లాంటి చైనా ప్రయత్నాలపై ఈ నివేదిక వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఓవైపు ఆర్థికంగా వరుస దెబ్బలు.. తాజాగా డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్ ఆరోపణలు చైనాను మరింత ఇరకాటంలోకి నెట్టేయడం ఖాయంగా కనిపిస్తోంది. చదవండి: డూయింగ్ బిజినెస్ నివేదిక నిలిపివేత -
భారత వృద్ధి రేటు అంచనాలను తగ్గించిన ఐఎంఎఫ్
అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) సంస్థ భారత వృద్ధి అంచనాలను మరోసారి భారీగా కుదించింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ వృద్ధి రేటు అంచనాను 12.5 శాతం నుంచి 9.5 శాతానికి తగ్గించింది. దేశంలో కోవిడ్-19 మహమ్మారి సెకండ్ వేవ్ తర్వాత ఏకంగా మూడు పాయింట్లు తగ్గించింది. అయితే, వచ్చే ఆర్థిక సంవత్సరం 2022-23 సంవత్సరానికి భారతదేశం ఆర్థిక వృద్ధి రేటును ఏప్రిల్ 2021లో అంచనా వేసిన 6.9 శాతం నుంచి 8.5 శాతానికి ఐఎంఎఫ్ పెంచింది. "మార్చి-మేలో విజృంభించిన కరోనా సెకండ్ వేవ్ కారణంగా భారతదేశంలో వృద్ధి అవకాశాలు తగ్గించినట్లు, ఆ ఎదురుదెబ్బ నుంచి ఆర్ధిక వృద్ది నెమ్మదిగా రికవరీ కానున్నట్లు" ఐఎంఎఫ్ తాజా వరల్డ్ ఎకనామిక్ అవుట్ లుక్ (డబ్ల్యుఈఓ)లో తెలిపింది. ఐఎంఎఫ్ 2021 ప్రపంచ వృద్ధి అంచనాను మార్చకుండా 6 శాతం వద్దే ఉంచింది. వ్యాక్సిన్ రోల్ అవుట్ లో వ్యత్యాసం కారణంగా వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థల వృద్ది అంచనాలను సవరించింది. 2021 జూన్ 4న జరిగిన రెండో ద్వైమాసిక ద్రవ్య విధాన కమిటీ సమావేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) కూడా 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి దేశ స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) అంచనాను 10.5 శాతం నుంచి 9.5 శాతానికి తగ్గించింది. అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఐఎంఎఫ్ భారతదేశానికి ఆర్థిక వృద్ధి అంచనాలను మూడు శాతం, చైనాకు 0.3 శాతం, సౌదీ అరేబియాకు 0.5 శాతం తగ్గించింది. మెక్సికో, బ్రెజిల్, దక్షిణాఫ్రికాతో సహా మిగిలిన అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వృద్ధి అంచనాలను ఐఎంఎఫ్ పెంచింది. -
పీవీ నరసింహారావు, మన్మోహన్సింగ్ల మధ్య గొడవ.. దాని కోసమే !
ఓ వైపు పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం.. మరోవైపు అడుగంటిపోయిన విదేశీ మారక ద్రవ్యం. దేశ దిగుమతి అవసరాలు తీరాలంటే బంగారం తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి. అయితే ఆ క్షణంలో ప్రధానీ పీవీ నరసింహారావు, ఆర్థిక మంత్రి మన్మోహన్‌సింగ్‌లు ఎంతో ధైర్యంగా 1991 జులై 24న ఆర్థిక సంస్కరణల అమలు చేయబోతున్నట్టు బడ్జెట్లో తెలిపారు. నేటితో ఆర్థిక సంస్కరణలకు 30 ఏళ్లు పూర్తయ్యాయి. కఠినమైన కాలం 1991లో ఇండియా ఆర్థికంగా కుదేలైన సమయం. ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో ఇంటర్నెషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) సాయాన్ని భారత ప్రభుత్వం కోరింది. దీనికి సంబంధించిన అగ్రిమెంట్లో చాలా కఠిన నిబంధనలను ఐఎంఎఫ్ పొందు పరిచింది. ఒక్క అక్షర ముక్క కూడా మార్చడానికి వీలు లేదన్నట్టుగా ఐఎంఎఫ్ భీష్మించుకుని కూర్చుంది. చివరకు అగ్రిమెంట్లో లేబర్ అన్న చోట LOBOR అంటూ అమెరికన్ పద్దతిలో రాస్తే కనీసం మన పరిస్థితులకు తగ్గట్టు LOBOUR గా అయినా మార్చాలంటూ కోరింది భారత ప్రభుత్వం. కనీసం స్పెల్లింగ్ మార్చే స్థితిలో కూడా అప్పటి భారత ప్రభుత్వం లేదు. అలాంటి స్థితి నుంచి ట్రిపుల్ బిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా ఎదిగింది. దీనికి బీజం వేసిన ఇద్దరు వ్యక్తులు పీవీ నరసింహారావు, మన్మోహన్‌సింగ్‌లు. అయితే ఆర్థిక సంస్కరణలకు అమలు సమయంలో నెలకొన్న పరిస్థితులు ఏంటీ ? పీవీ, మన్మోహన్ ద్వయం ఎలా మార్కెట్‌ని ఓపెన్ చేశారనే వివరాలను అప్పుడు పీవీకి సహాయకుడిగా ఉన్న మాజీ కేంద్ర మంత్రి జైరాం రమేశ్, ఆఫ్ లయన్ పేరుతో పీవీ బయోగ్రఫీ రాసిన వినయ్ సీతాపతిలు ఇటీవల జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ వివరాలు మీకోసం.. రూపాయి విలువ తగ్గింపు 1991 జున్ 21న ప్రధానిగా పీవీ నరసింహరావు, ఆర్థిక మంత్రిగా మన్మోహన్‌సింగ్‌లు ప్రమాణ స్వీకారం చేశారు. బాధ్యతలు చేపట్టిందే ఆలస్యం ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే పనిలో పడ్డారు. అందులో భాగంగా జూన్ చివరి వారంలోనే రూపాయి విలువ తగ్గించాలంటూ ఆర్థిక మంత్రి మన్మోహన్సింగ్ ప్రతిపాదించారు. ఈ విషయంలో పీవీ నరసింహారావు, మన్మోహన్సింగ్ల మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తాయి. రూపాయి విలువ తగ్గిస్తే రాజకీయంగా ఇబ్బందులు ఎదురవుతాయని పీవీ వాదన, గతంలో 1966లో ఇందిరాగాంధీ ఇదే ప్రయత్నం చేసి చేదు ఫలితాలు చూశారు. అయితే విలువ తగ్గిస్తేనే మార్కెట్ పుంజుకుంటుందనేది మన్మోహన్ సింగ్ అభిప్రాయం. చివరకు రాజకీయ ఆటుపోట్లు తాను ఎదుర్కొంటానని చెబుతూ మన్మోహన్ సింగ్ నిర్ణయానికే ప్రధానీ పీవీ మద్దతు ఇచ్చారు. అభిప్రాయ బేధాలు రూపాయి విలువ తగ్గింపును రెండు అంచెల్లో ప్రవేశపెట్టనేది మన్మోహన్ సింగ్ వ్యూహం. ఒక్కసారి తగ్గింపుకే ప్రతిపక్షాలు గగ్గొలు పెడుతుంటే రెండు సార్లు తగ్గించడం ఎందుకంటూ పీవీ అభ్యంతరం వ్యక్తం చేశారు. మొదటిసారి తగ్గింపు మార్కెట్‌ను పరీక్షించేందుకని, ఆ ఫలితాలను బట్టి అసలైన నిర్ణయం రెండోసారి అంటూ మన్మోహన్ వివరణ ఇచ్చారు. అయినా సరే పీవీ సంతృప్తి చెందలేదు. ఆర్బీఐ అధికారులకు ఫోన్ చేసి రూపాయి విలువ తగ్గించవద్దంటూ కోరారు. అయితే అప్పటికే రూపాయి విలువ తగ్గిస్తున్నట్టు మార్కెట్‌కి చెప్పేశామంటూ అటు నుంచి బదులు వచ్చింది. ఫలితంగా అయిష్టంగానే మన్మోహన్ సింగ్ వ్యూహానికి పీవీ మద్దతు పలకాల్సి వచ్చింది. ఇలా ప్రధాని, ఆర్థిక మంత్రిల మధ్య అభిప్రాయ బేధాలతోనే ఆర్థిక సంస్కరణలకు అడుగులు పడ్డాయి. మరో రెండు నిర్ణయాలు రూపాయి విలువ తగ్గించడంతోనే ఈ ద్వయం ఆగిపోలేదు. 1991 జులై మొదటి వారంలో కొత్త ట్రేడ్ పాలసీని తీసుకువచ్చారు. దీని ప్రకారం ఎగుమతులను హేతుబద్ధీకరించడంతో పాటు ప్రోత్సహకాలు పెంచారు. అనంతరం ఇండస్ట్రియల్ పాలసీని ప్రవేశపెట్టారు. ఇందులో అప్పటి వరకు పారిశ్రామికవేత్తలను వేధిస్తూ వచ్చిన బ్యూరోక్రసీలో ఉండే రెడ్టెపిజానికి అడ్డుకట్ట వేశారు. దీంతో లైసెన్సులు త్వరగా వచ్చేలా మార్పులు చేసి, విదేశీ పెట్టుబడులకు అవకాశం కల్పించారు. విదేశీ ఎగుమతులు, దిగుమతులు సరళీకృతం చేశారు. ముందుమాటతో ఆర్థిక సంస్కరణలను వామపక్షాలు ముందు నుంచి తప్పుపడుతూనే ఉన్నాయి. అయితే ఇండస్ట్రియల్ పాలసీ, ట్రేడ్ పాలసీలకు సంబంధించి స్వపక్షం నుంచే పీవీకి సవాల్ ఎదురైంది. కేబినెట్ మంత్రులు, కాంగ్రెస్ పార్టీ నేతలెవరు పీవీకి అండగా నిలవలేదు. ముసాయిదా డ్రాఫ్ట్లని రిజెక్ట్ చేశారు. దీంతో నెల రోజులుగా పడ్డ కష్టమంతా వృథా అయ్యే పరిస్థితి నెలకొంది. చివరకు ‘పరిస్థితులకు తగ్గట్టుగా ఈ చట్టంలో మార్పులు చేర్పులకు అవకాశం ఉంది’ అంటూ ముందు మాటను చేర్చారు. డ్రాఫ్ట్‌లో ఒక్క అక్షరం కూడా మార్చలేదు. కానీ ఈ ఒక్క ముందుమాటతో అప్పటి వరకు ముసాయిదాను వ్యతిరేకించిన మంత్రులంతా శభాష్ అంటూ ప్రధాని పీవీ, ఆర్థికమంత్రి మన్మోహన్ సింగ్‌లను మెచ్చుకున్నారు. అలా గండం గట్టెక్కి పార్లమెంటు ముందుకు వచ్చాయి ఆర్థిక సంస్కరణలు. పీవీ నేర్పు ఆర్థిక సంస్కరణల అమలును ఎప్పటిలాగే విపక్షాలు తప్పు పట్టాయి. పీవీపై తీవ్రమైన దాడి చేశాయి. పార్టీ నేతల నుంచి ఆశించిన సహకారం రాలేదు. ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానం ఇస్తూ వినాశకాలే సముత్ పన్నే.. అంటూ చెప్పిన సంస్కృత పద్యంతో బీజేపీ నేతలు పీవీని అర్థం చేసుకుని మాటల దాడి తగ్గించారు. ఆ తర్వాత పని సులువుగా జరిగిపోయింది. నిజానికి ప్రైవేటీకరణ అనే మాటను ఉపయోగించకుండానే ఎంతో నేర్పుగా పీవీ వ్యవహరించారు. పీవీ చాణక్యం పీవీ తన రాజకీయ జీవితంలో కేంద్రంలో రక్షణ, విదేశీ వ్యవహరాలు, మానవ వనరులు, ఆరోగ్యశాఖలను నిర్వహించారు. ఏపీకి ముఖ్యమంత్రిగా పని చేసినా తనదైన ముద్ర వేయలేకపోయారు. భూసంస్కరణలు మధ్యలో ఆగిపోతే జై ఆంధ్ర ఉద్యమ సెగలు చవిచూడాల్సి వచ్చింది. కానీ అనూహ్యంగా ప్రధాని పదవి చేపట్టిన పీవీ దేశంపై తన ముద్ర వేయగలిగారు. ఆర్థిక సంస్కరణల పితామహుడిగా నిలిచారు. అస్థిర ప్రభుత్వాలు నడుస్తున్న సమయంలో మైనార్టీ ప్రభుత్వంతో ఎవ్వరూ సాహసించలేని నిర్ణయాలను అమలు చేయగలిగారు. భవిష్యత్ దర్శనం 1991 జులై 24న పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెడుతూ మన్మోహన్ సింగ్ చెప్పిన మాటలు వాస్తవ రూపం తీసుకున్నాయి.. ‘సరైన సమయం వచ్చినప్పుడు నూతన ఆలోచనలను ఏ శక్తి అడ్డుకోలేదు. ప్రపంచంలోనే ఇండియాను ఆర్థిక శక్తిగా నిలిపే చర్యలు తీసుకుంటున్నాం. అమలు చేయడమేది ముళ్ల బాట వంటిది. అయినా సరే ఆ పని చేసి తీరుతాం. ఈ పని చేసినందుకు భవిష్యత్తు తరాల వారు ఆర్థిక సంస్కరణల పితామహుడిగా పీవీ నరసింహరావుని గుర్తు పెట్టుకుంటారు’ అని తెలిపారు. ఈ రోజు దేశం మొత్తం పీవీ, మన్మోహన్ సింగ్‌లని స్మరించుకుంటోంది. - సాక్షి, వెబ్‌డెస్క్ -
మరింత చిక్కుల్లో పాక్.. మరోసారి ఆ జాబితాలోకి
పారిస్: ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) మరోసారి పాకిస్తాన్‌ను గ్రే లిస్ట్‌లో పెట్టింది. దీంతో అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) సహా అంతర్జాతీయ సంస్థల నుంచి ఆర్థిక సహాయాన్ని, పెట్టుబడులను పొందడానికి పాకిస్తాన్‌కు అవకాశాలు ఉండవు. ఈ జాబితా నుంచి బయటపడటం కోసం ఆ దేశం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. అంతర్జాతీయంగా ఉగ్రవాద సంస్థలకు అందుతున్న నిధులపై ఎఫ్ఏటీఎఫ్ నిఘా పెడుతుంది. ఈ సంస్థ ప్రకటించే గ్రే లిస్ట్‌లో పాకిస్థాన్ మూడేళ్ళ నుంచి ఉంది. ఎఫ్ఏటీఎఫ్ చర్యల ప్రణాళికను అమలు చేయడం, అదే సమయంలో, ఉగ్రవాదులకు రక్షణ కల్పించడం పాకిస్తాన్‌కు ఇబ్బందికరంగా మారింది. ఎఫ్ఏటీఎఫ్ సమావేశాలు పారిస్‌లో జూన్ 21 నుంచి 25 వరకు జరిగాయి. చదవండి: ‘గ్రీన్’కి అందని పాజిటివ్ సిగ్నల్స్ -
భారత్‌లో కరోనా కల్లోలం.. ఇతర దేశాలకు ఓ హెచ్చరిక: ఐఎంఎఫ్
న్యూఢిల్లీ: భారతదేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభణతో దేశ ప్రజలు ఆరోగ్యపరంగానే కాక ఆర్థికపరంగానూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఈ నేఫథ్యంలో భారత్ సంక్షోభాన్ని సూచిస్తూ ఐఎంఎఫ్ ప్రపంచంలోని ఇతర అల్ప, మధ్యాదాయ దేశాలకు ఇది ఒక హెచ్చరిక లాంటిదని తెలుపుతూ ఓ నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికను చీఫ్ ఎకనమిస్ట్ గీతా గోపీనాథ్, ఎకనమిస్ట్ రుచిర్ అగర్వాల్ సంయుక్తంగా రూపొందించారు. అల్పాదాయ దేశాలకు ఇది ఓ హెచ్చరిక నివేదిక ప్రకారం.. 2021 చివరినాటికి భారత జనాభాలో 35 శాతం వరకు మాత్రమే వ్యాక్సినేషన్ పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి. భారత్ లో కరోనా సెకండ్ వేవ్, బ్రెజిల్లో చెలరేగిన కరోనా కల్లోలం పరిస్థితులను గమనిస్తే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మరింత దారుణమైన పరిస్థితులు తలెత్తే అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది. కరోనా ఫస్ట్ వేవ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొని తట్టుకున్న భారత్ సెకండ్ వేవ్ వ్యాప్తిని అడ్డకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతోందని తెలిపింది. విపరీతమైన కేసులు కారణంగా ఆక్సిజన్, బెడ్లు , ఇతర వైద్య సౌకర్యాలు లేక అనేకమంది మరణిస్తున్నట్లు వివరించింది. ఇప్పటివరకు ఆఫ్రికాతో సహా పలు ప్రాంతాల్లో ఈ ముప్పును తప్పించుకోగలిగాయని పేర్కొంది. అయితే ప్రస్తుత భారత్ పరిస్థితి అల్పాదాయ, మధ్యాదాయ దేశాలకు ఓ హెచ్చరిక లాంటిదని ఈ నివేదికలో తెలిపింది . భారత్ 60 శాతం వ్యాక్సినేషన్ లక్ష్యం సాధించాలంటే తక్షణమే 100 కోట్ల డోసులకు ఆర్డరు చేయాల్సి ఉంటుందని సూచించింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో తక్కువ కాలంలో వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి అధికారులు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్‌లకు సుమారు 600 మిలియన్ డాలర్ల ఫైనాన్సింగ్ ప్రకటించడం స్వాగతించే అంశం అని పేర్కొంది. అలాగే అధికారులు 2021 చివరి నాటికి రెండు బిలియన్ డోసులను అందుబాటులో వస్తాయని అంచనా వేస్తున్నారని తెలిపింది. ప్రస్తుతం అధికారులు వైద్య పరమైన అవసరాల కోసం దేశీయంగా ఉన్న వనరులను ఉపయోగిస్తున్నారు. అయితే వీటి కోసం విదేశీయంగాను ఫైనాన్సింగ్ కోసం ప్రయత్నిస్తున్నందున, మా బడ్జెట్లో భారతదేశానికి అదనపు నిధులను కేటాయించలేమని ఐఎంఎఫ్ తేల్చింది. చదవండి: వెలుగులోకి కొత్త కరోనా.. కుక్కలనుంచి మనుషులకు! -
రికవరీ బాటన భారత్ ఎకానమీ: ఐఎంఎఫ్
వాషింగ్టన్: భారత్ ఆర్థిక వ్యవస్థ రికవరీ బాటన నడుస్తోందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) ప్రతినిధి గ్యారీ రైస్ పేర్కొన్నారు. ప్రపంచబ్యాంక్‌తో కలిసి వచ్చే నెల్లో ‘స్ప్రింగ్’ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేశారు. అలాగే ఏప్రిల్ 6వ తేదీన ఐఎంఎఫ్ తన వరల్డ్ ఎకనమిక్ అవుట్‌లుక్‌ను కూడా విడుదల చేయనుంది. ‘‘భారత్ ఆర్థిక వ్యవస్థ క్రమంగా రికవరీ అవుతోంది. 2020 నాల్గవ త్రైమాసికంలో (అక్టోబర్-డిసెంబర్) క్షీణతలోంచి బయటపడింది. మూలధనం, పెట్టుబడి వ్యయాలు పెరుగుతున్నాయి అని విలేకరుల సమావేశంలో గ్యారీ పేర్కొన్నారు. దీనికితోడు 2021 మొదటి త్రైమాసికంలో (జనవరి-మార్చి) పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్, రవాణాసహా ఆర్థిక వ్యవస్థకు సంబంధించి పలు ఇండికేటర్స్ సానుకూలంగా ఉన్నట్లు కూడా ఆయన తెలిపారు. అయితే కరోనా కొత్త స్ట్రెయిన్స్, స్థానిక లాక్డౌన్లు రికవరీబాటలో కొంత ఇబ్బందికరమైన పరిణామాలని కూడా ఆయన అన్నారు. చదవండి: దూసుకెళ్తున్న ఇండియా వృద్ధిరేటు! -
ఫిబ్రవరిలో ఎఫ్‌పిఐ పెట్టుబడులు వెల్లువ
భారత మార్కెట్లో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు(ఎఫ్ఐఐ) ఫిబ్రవరిలో ఇప్పటి వరకు రూ.24,965 కోట్లు పెట్టుబడి పెట్టారు. కోవిడ్ -19 వ్యాక్సిన్ పై ఆశావాదం, దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకోవడం వంటి కారణంగా పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తుంది. డిపాజిటరీస్ డేటా గణాంకాల ప్రకారం.. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్మెంట్ (ఎఫ్‌పిఐ) భారతీయ ఈక్విటీల్లోకి రూ.24,204 కోట్లు, రుణ విభాగంలోకి రూ.761 కోట్లు పెట్టుబడులుగా వెళ్లినట్లు తెలిపింది. గత నెలలో ఎఫ్‌పిఐలు ద్వారా నికరంగా రూ.14,649 కోట్లు భారత్‌కు వచ్చాయి. 2021లో భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) అంచనా వేసినందున ఎఫ్‌పిఐలు భారత మార్కెట్లపై సానుకూలంగా ఉన్నాయని ఎల్కెపి సెక్యూరిటీల పరిశోధన విభాగాధిపతి ఎస్. రంగనాథన్ తెలిపారు. పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు భారత వృద్ధి రేటు అంచనాలపై సానుకూలంగా ఉండడంతో ఎఫ్‌పీఐల పెట్టుబడులు ఫిబ్రవరిలోనూ కొనసాగుతున్నాయని గ్రో సంస్థ సీవోవో హర్ష జైన్ తెలిపారు. ఒక అంతర్జాతీయ ఏజెన్సీ భారతదేశ ఆర్థిక వృద్ధి రేటు 2022లో 11.5 శాతంగా ఉంటుంది అని అంచనా వేసింది. గతంలో పేర్కొన్న8.8 శాతం వృద్ధి రేటు అంచనాను సవరించింది. దీనితో కరోనావైరస్ మహమ్మారి మధ్య రెండంకెల వృద్ధిని నమోదు చేసిన ఏకైక ప్రధాన ఆర్థిక వ్యవస్థ భారతదేశం నిలవనుంది. చదవండి: పెట్రోల్ ధరలను తగ్గించిన నాలుగు రాష్ట్రాలు! -
కరోనా కట్టడి: భారత్‌పై ఐఎంఎఫ్ ప్రశంసలు
వాషింగ్టన్: కరోనా వైరస్ కట్టడితో పాటు దానివల్ల కుంటుపడిన ఆర్థికవ్యవస్థను గాడిలో పెట్టడం కోసం భారత్ నిర్ణయాత్మక చర్యలు తీసుకుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఫ్) ప్రశంసించింది. అంతేకాకుండా ఆర్థికవ్యవస్థలో సానుకూల మార్పులకు దోహదం చేసే చర్యలను ఈ సంవత్సరం కూడా కొనసాగించాలని సూచించింది. అంతర్జాతీయ మీడియా రౌండ్‌టేబుల్ సమావేశం సందర్భంగా ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టాలినా జార్జీవా మాట్లాడుతూ.. ‘కరోనా కాలంలో తీసుకున్న చర్యల ఫలితంగా ఈ సంవత్సరం భారత్‌లో ప్రతికూల ప్రభావం అంతగా ఉండకపోవచ్చని మా అభిప్రాయం. ఇక ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అప్డేట్ ఆవిష్కరణలో ఇదే విషయాన్ని ప్రముఖంగా వెల్లడించబోతున్నాం. వరల్డ్ ఎకనమిక్ అప్డేట్ను ఈ నెల 26న విడుదల చేస్తాం. దీన్ని ప్రతి ఒక్కరు శ్రద్దగా గమనించాలి’ అంటూ అన్ని దేశాలకు పిలుపునిచ్చారు. (చదవండి: రఘురామ్ రాజన్‌కు అరుదైన గౌరవం) ఇక ఈ సమావేశం సందర్భంగా భారత్‌లో కరోనా కట్టడి కోసం విధించిన లాక్డౌన్ గురించి జార్జీవా ప్రముఖంగా ప్రస్తావించారు. ఆ సమయంలో భారత్ విధించిన ఆంక్షలు, విధాన నిర్ణయాలు బాగా పని చేసినట్లు ప్రశంసించారు. అంతేకాక భారత్ ఈ ఏడాది 2021ని తన ఆర్థిక వ్యవస్థను మరింత మెరుగుపర్చుకోవడం కోసం వినియోగించుకుంటుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక భారత్‌లో చేపడుతున్న నిర్మాణాత్మక సంస్కరణలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని.. భవిష్యత్తులో కూడా వీటిని కొనసాగించి మరింత ముందుకు వెళ్లాలని క్రిస్టాలినా జార్జీవా సూచించారు. సాగు చట్టాలపై ఐఎంఎఫ్ స్పందన ఇక నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలపై ఐఎంఎఫ్ స్పందించింది. వ్యవసాయ సంస్కరణల్లో సాగు చట్టాలు ఓ ముందడుగని తెలిపింది. వీటి వల్ల మధ్యవర్తుల అవసరం లేకుండానే రైతులు నేరుగా తమ పంటను అమ్ముకోవచ్చన్నది. అయితే ఈ నూతన చట్టాల వల్ల నష్టపోయే అవకాశం ఉన్నవారికి సామాజకి భద్రతను కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని ఐఎంఎఫ్ స్పష్టం చేసింది. -
కోవిడ్-19 : మాంద్యం గుప్పిట్లో ప్రపంచం
న్యూయార్క్ : 1930ల నాటి గ్రేట్ డిప్రెషన్ తర్వాత తీవ్ర ఆర్థిక మాందాన్ని ప్రపంచం చవిచూస్తోందని ప్రపంచ బ్యాంక్ చీఫ్ డేవిడ్ మల్పాస్ అన్నారు. పలు వర్ధమాన, పేద దేశాలకు కోవిడ్-19 పెను ముప్పుగా ముంచుకొచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. వైరస్ విస్తృతితో ఆర్థిక వ్యవస్థ కుదేలైన క్రమంలో ఆయా దేశాలోల రుణ సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఐఎంఎఫ్, ప్రపంచబ్యాక్ వార్షిక సమావేశాలను పురస్కరించుకుని మల్పాస్ మీడియాతో మాట్లాడారు. చాలా లోతైన ఆర్థిక మాంద్యం ప్రపంచాన్ని చుట్టుముట్టిందని, పేదరికంతో కొట్టుమిట్డాడుతున్న దేశాలను ఇది భారీగా దెబ్బతీస్తుందని వ్యాఖ్యానించారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో ఆయా దేశాలకు భారీ వృద్ధి కార్యక్రమాన్ని ప్రపంచ బ్యాంక్ రూపొందిస్తోందని చెప్పారు. ఇక వ్యాక్సిన్లను సమకూర్చుకోలేని దేశాలకు వ్యాక్సిన్లు, మందుల సరఫరా కోసం 1200 కోట్ల డాలర్ల హెల్త్ ఎమర్జెన్సీ కార్యక్రమాల విస్తరణకు ప్రపంచ బ్యాంక్ బోర్డు ఇప్పటికే ఆమోదముద్ర వేసింది. కోవిడ్-19తో ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేయడం ద్వారా ఆర్థిక వ్యవస్థ సజావుగా సాగేందుకు సహకరిస్తున్నారని, అసంఘటిత రంగంలో ఉద్యోగాలు కోల్పోయిన వారికి సామాజిక భద్రతా పథకాలతో ప్రభుత్వాలు ఆదుకుంటున్నాయని చెప్పారు. పేద దేశాల్లో ప్రజలకు అదనపు సామాజిక భద్రత కలిగించే దిశగా ప్రపంచ బ్యాంక్ కసరత్తు సాగిస్తోందన్నారు. వ్యవసాయంలో ఎదురయ్యే సవాళ్ల పరిష్కారంపైనా పనిచేస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. చదవండి : భారత్‌పై వరల్డ్ బ్యాంక్ కీలక అంచనాలు -
షాకింగ్ : తలసరి జీడీపీలో భారత్‌ను దాటనున్న బంగ్లాదేశ్!
సాక్షి, న్యూఢిల్లీ : తలసరి జీడీపీలో ఈ కేలండర్ సంవత్సరంలో బంగ్లాదేశ్ భారత్‌ను అధిగమించనుంది. కరోనా మహమ్మారి, లాక్డౌన్ల నేపథ్యంలో భారత్ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడంతో తలసరి జీడీపీలో భారీ కోత తప్పదని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) వరల్డ్ ఎకనమిక్ అవుట్‌లుక్ (డబ్ల్యూఈఓ) నివేదిక స్పష్టం చేసింది. 2020లో బంగ్లాదేశ్‌లో తలసరి జీడీపీ 1888 డాలర్లతో 4 శాతం వృద్ధి చెందుతుందని, భారత్‌లో తలసరి జీడీపీ గత నాలుగేళ్ల కనిష్టస్ధాయిలో 10.5 శాతం తగ్గి 1877 డాలర్లకు పడిపోతుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. ఈ గణాంకాల ఆధారంగా చూస్తే దక్షిణాసియలో భారత్ మూడవ అత్యంత పేద దేశంగా నిలవనుంది. భారత్ తర్వాత పాకిస్తాన్, నేపాల్‌లు తక్కువ తలసరి జీడీపీని కలిగిఉండగా..బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంక, మాల్దీవులు భారత్ కంటే ముందున్నాయి. దక్షిణాసియాలో శ్రీలంక తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతిన్నదని డబ్ల్యూఈఓ గణాంకాలు స్పష్టం చేశాయి. కాగా నేపాల్, భూటాన్‌లు ఈ ఏడాది ఆర్థిక వృద్ధిని సాధిస్తాయని పేర్కొంది. అయితే 2020 ఆపైన పాకిస్తాన్‌కు సంబంధించిన గణాంకాలు, అంచనాలను ఐఎంఎఫ్ వెల్లడించలేదు. వచ్చే ఏడాది భారత్‌లో ఆర్థిక రికవరీ చోటుచేసుకుంటుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. అదే జరిగితే 2021లో తలసరి జీడీపీలో బంగ్లాదేశ్‌ను భారత్ అధిగమించే అవకాశం ఉంది. చదవండి : కోవిడ్-19 సంక్షోభం సమసిపోలేదు -
‘కోవిడ్-19 సంక్షోభం సమసిపోలేదు’
న్యూయార్క్ : కోవిడ్-19తో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తొలుత భయపడినంతగా కుప్పకూలకపోయినా అది సృష్టించిన సంక్షోభం ఇంకా సమసిపోలేదని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) చీఫ్ క్రిస్టాలినా జార్జివా పేర్కొన్నారు. కరోనా విధ్వంసంతో ప్రపంచం పెను ముప్పును ఎదుర్కొన్నాఈ ఏడాది అంతర్జాతీయ వృద్ధి అంచనాలు కొంతమేర పెంచే వెసులుబాటు కలిగిందని వచ్చేవారం జరగనున్న ఐఎంఎఫ్-ప్రపంచ బ్యాంక్ సమావేశాలకు ముందు ఆమె వ్యాఖ్యానించారు. ఈ భేటీలో తాజాపరిచిన వృద్ధి అంచనాలను ఐఎంఎఫ్ ప్రపంచబ్యాంక్‌కు సమర్పించనుంది. ప్రపంచ జీడీపీ వృద్ధి దాదాపు ఐదు శాతం తగ్గుతుందని ఐఎంఎఫ్ ఈ ఏడాది జూన్‌లో అంచనా వేయగా, రెండు, మూడు త్రైమాసాల్లో ఫలితాలు ఆశించిన దానికంటే మెరుగ్గా వెల్లడయ్యాయి. చదవండి : రఘురామ్ రాజన్‌కు అరుదైన గౌరవం కరోనా వైరస్‌తో ప్రభావితమైన వ్యక్తులు, సంస్ధలకు ప్రభుత్వాల నుంచి ఊతం లభించడంతో ప్రపంచ వృద్ధి రేటు పుంజుకుందని ఆమె పేర్కొన్నారు. అయితే కోవిడ్-19 నేపథ్యంలో ప్రభుత్వాలు చేస్తున్న సాయం ముందస్తుగా నిలిపివేయరాదని, వచ్చే ఏడాది వృద్ధిరేటు అంచనాలపై అనిశ్చితి నెలకొన్నందున అప్రమత్తంగా ఉండాలని ఆమె హెచ్చరించారు. పది లక్షల మందిని బలిగొన్న అనంతరం కూడా ఈ వైపరీత్యం ఇంకా సమసిపోయేందుకు చాలా దూరంగా ఉందని అన్నారు. అన్ని దేశాలు ఇప్పుడు సాధారణ స్థితికి చేరుకునేందుకు సుదీర్ఘ అసమాన పోరాటం చేయాల్సి ఉందని వ్యాఖ్యానించారు. అమెరికా, యూరప్‌ల్లో భయపడినంతగా ఆర్థిక సంక్షోభం లేదని, చైనా అనుకున్నదాని కంటే వేగంగా కోలుకుంటోందని అన్నారు. అల్పాదాయ దేశాల్లో మాత్రం పరిస్థితి భయానకంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగాలు, వ్యాపారాలను కాపాడుకునేందుకు ఖర్చు చేయాల్సిన రీతిలో వనరులు అల్పాదాయ దేశాలకు అందుబాటులో లేవని అన్నారు. నిధుల విడుదల, రుణ పునర్వ్యవస్థీకరణ వంటి చర్యలతో ఆయా దేశాలను ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. -
డిపాజిట్ల స్వీకరణకు ఎంఎఫ్‌ఐలను అనుమతించాలి
కోల్‌కతా: భారత్‌లో సూక్ష్మ రుణ సంస్థలను (ఎంఎఫ్ఐలు) ప్రజల నుంచి డిపాజిట్ల స్వీకరణకు అనుమతించాలని నోబెల్ పురస్కార గ్రహీత, బంగ్లాదేశ్ గ్రామీణ బ్యాంకు వ్యవస్థాపకుడు మహమ్మద్ యూనస్ అన్నారు. ప్యాన్‌ఐఐటీ గ్లోబల్ ఈ కాంక్లేవ్‌లో భాగంగా ఆయన మాట్లాడారు. భారత్‌లో ఎంఎఫ్ఐలు నిధుల కోసం బ్యాంకుల దగ్గరకు వెళ్లాల్సి వస్తోందన్నారు. ఆర్బీఐ చిన్న ఫైనాన్స్ బ్యాంకులను అనుమతించిందంటూ, అవి డిపాజిట్లను స్వీకరించే అవకాశం కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. ‘‘ప్రజలకు రుణం అన్నది ఆరి్థకపరమైన ఆక్సిజన్. బ్యాంకులకు ప్రత్యా మ్నాయ బ్యాంకింగ్ చానల్ (నిధుల కోసం) ఏర్పా టు చేయకుంటే, పేదలకు రుణాలు ఇచ్చేందుకు అవి ఆసక్తి చూపవు’’ అని యూనస్ పేర్కొన్నారు. -
ఊహించినదానికంటే లోతైన మాంద్యం : గీతా గోపీనాథ్
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఊహించిన దానికంటే చాలా లోతైన మాంద్యంలోకి వెళ్లిపోతోందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ చీఫ్ ఎకనామిస్ట్ గీతా గోపీనాథ్ వ్యాఖ్యానించారు. కరోనాతో దాదాపు అన్ని దేశాల్లో ఆర్థిక వ్యవస్థలు కుదేలవ్వడంతో వృద్ధిరేటు తగ్గునుందని పేర్కొన్నారు. ముఖ్యంగా 2020 ఆర్థిక సంవత్సరానికి భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు ఏకంగా 4.5 శాతం పడిపోయిందని, భారతదేశం వృద్ధి 2 సంవత్సరాలలో ఒక శాతం కంటే కొద్దిగా ఎక్కువ ఉంటుందన్నారు. కానీ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోలుకోవడంతో భారత్ కూడా నెమ్మదిగా కోలుకుంటుందని పేర్కొన్నారు. కరోనా కట్టడి విషయంలో భారత్ బాగానే వ్యవహరించినప్పటికీ, పరీక్షల సామర్థ్యాన్ని పెంచాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. అలాగే ప్రస్తుత సంక్షోభ సమయంలో పేదలకు నగదు బదిలీ, ప్రతి ఒక్కరికి అవసరమైన ఉద్యోగాలను సృష్టించడం చాలా ముఖ్యం అని గీతా గోపీనాథ్ పేర్కొన్నారు. (చైనా ఉత్పత్తుల బహిష్కరణ సాధ్యమేనా?) గీతా గోపీనాథ్ పేర్కొన్న కొన్ని కీలక అంశాలు దేశాలు ప్రపంచీకరణపై పునరాలోచనలో ఉన్నప్పటికీ ప్రపంచ సంక్షోభం ప్రపంచ సహకారంతోనే పరిష్కారమవుతుంది. రానున్న సమీపకాలంలో దేశాలు వైద్య ఎగుమతులపై ఆంక్షలు పెట్టబోతున్నాయి. కానీ ఈ విషయంలో ప్రపంచ దేశాల మధ్య సహకారం అవసరం. ప్రస్తుతం ప్రధాన సవాలు ఆరోగ్య సంక్షోభం. అధిక జనాభా గల దేశంలో పడకల సంఖ్య అంతర్జాతీయ సగటుకు దూరంగా ఉంది. కానీ, తీసుకున్న చర్యలు బావున్నాయి. ఇది చాలా కష్టమైన సమయం. ప్రధాన నగరాలన్నీ కరోనాతో పోరాడుతున్నాయి. ఆరోగ్య సామర్థ్యాలను, పరీక్షల సామర్థ్యాన్ని పెంచాలి. సామాజిక భద్రతా చర్యల్ని చేపట్టాలి. పేదలకు నగుదును అందుబాటులో వుంచాలి. ఎక్కువ ఉద్యోగ కల్పన అవసరమయ్యే సమగ్ర విధానాన్ని అవలంబించాలి. వలస కార్మికులు తిరిగి నగరాలకు రావటానికి ప్రస్తుతం ఇష్టపడరు. ఇది సమస్య అవుతుంది. ప్రభుత్వం వారికి నగదును అందించాల్సిన అవసరం ఉంది. స్థానికంగా వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఇది ఆర్థికవ్యవస్థ రికవరీకి చాలా సహాయపడుతుంది. అంతర్జాతీయ వాణిజ్యంలో భారతదేశం పాత్ర పెద్దది కనుక భారీ సంస్కరణలు అవసరం. డిజిటల్ ఫ్రంట్లోభారత్ చాలా బాగా రాణించింది. అదే తరహాలో వైద్యపరంగా కూడా రాణించాలి. సంస్కరణలను వేగవంతం చేయడం కచ్చితంగా దేశానికి సహాయపడుతుంది. (గణేష్ విగ్రహాలు కూడా చైనా నుంచేనా: నిర్మలా సీతారామన్) కాగా చరిత్రలోనే తొలిసారిగా 2020లో అన్ని ప్రాంతాల్లో ప్రతికూల వృద్ధిరేటును అంచనా వేస్తున్నామని బుధవారం గీతా గోపీనాథ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తొలి త్రైమాసికంలో కాస్త రికవరీ ఉన్నప్పటికీ చైనా వృద్ధిరేటును ఒక శాతంగా అంచనా వేశామన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ 4.5 శాతం తగ్గుతుందని, 1961 తర్వాత ఇదే అత్యంత తగ్గుదల అని ఆమె పేర్కొన్నారు. అయితే, 2021లో వృద్ధిరేటు 6 శాతానికి పుంజుకుంటుందన్నారు. -
ఐఎంఎఫ్ : పాతాళానికి వృద్ధి రేటు
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి విరుచుకుపడటంతో భారత వృద్ధి రేటు అంచనాలను పలు రేటింగ్ సంస్థలు, దేశీ, అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు కుదిస్తున్న క్రమంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) షాకింగ్ అంచనాలతో ముందుకొచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో భారత్ వృద్ధి రేటు కేవలం 1.9 శాతానికి పరిమితమవుతుందని ఐఎంఎఫ్ వెల్లడించింది. 1991 చెల్లింపుల సంక్షోభం తర్వాత భారత్ వృద్ధి రేటు ఇంతటి కనిష్టస్ధాయికి చేరుతుందనే అంచనా వెలువడటం ఇదే తొలిసారి. వృద్ధి రేటు దిగజారినా ప్రపంచంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్ధల్లో భారత్ ఒకటని ఐఎంఎఫ్ పేర్కొంది. మరోవైపు అగ్రదేశాల్లో ఈ ఏడాది అమెరికా (-5.9), జపాన్ (-5.2), బ్రిటన్ (-6.5), జర్మనీ (-7.1), ఫ్రాన్స్ (-7.2), ఇటలీ (-9.1), స్పెయిన్ -8 శాతం నెగెటివ్ వృద్ధి రేటు నమోదు చేస్తాయని ఐఎంఎఫ్ నివేదిక పేర్కొంది. ఇక చైనా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1.2 శాతం జీడీపీ వృద్ధి సాధిస్తుందని తెలిపింది. భారత్, చైనాలు మాత్రమే సానుకూల వృద్ధి రేటును సాధిస్తాయని వెల్లడించింది. కరోనా మహమ్మారి ప్రభావంతో పాశ్చాత్య దేశాల వృద్ధి రేటు మైనస్‌లోకి జారుకుంటుందని పలు సంస్ధలు అంచనా వేస్తున్నాయి. చదవండి : మహమ్మారితో మహా సంక్షోభం : ఐఎంఎఫ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వ్యవస్ధపై మహమ్మారి విధ్వంసంతో 1991లో సరళీకరణ అనంతరం భారత్‌లో తొలిసారిగా వృద్ధి రేటు కనిష్టస్ధాయికి పడిపోతుందని ప్రపంచ బ్యాంక్ సైతం వెల్లడించింది. దక్షిణాసియా ఆర్థిక దృక్కోణం నివేదికలో భారత్ 2020-21లో 1.5 శాతం నుంచి 2.8 శాతం మేరకు వృద్ధి రేటు సాధిస్తుందని ప్రపంచ బ్యాంక్ పేర్కొంది. మార్చి 31తో ముగిసిన గడిచిన ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధిరేటు 4.8 శాతం నుంచి 5 శాతం మధ్య ఉండవచ్చని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. ఈ ఏడాది అంతర్జాతీయ వృద్ధి రేటు -3 శాతంగా ఉంటుందని తాము అంచనా వేస్తున్నామని, మహమ్మారి వ్యాప్తితో స్వల్పకాలంలోనే వృద్ధి రేటును అనూహ్యంగా తగ్గించామని ఐఎంఎఫ్ ప్రధాన ఆర్థికవేత్త, ఇండో-అమెరికన్ గీతా గోపీనాథ్ పేర్కొన్నారు. -
రఘురామ్ రాజన్‌కు అరుదైన గౌరవం
వాషింగ్టన్ : ప్రముఖ ఆర్థికవేత్త, ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ (57) కీలక గౌరవాన్ని దక్కించుకున్నారు. కోవిడ్-19 సంక్షోభ సమయంలో భారత దేశంలో అనుసరించాల్సిన ఆర్థికవిధానాలపై పలు కీలక సూచనలు చేసిన ఆయన తాజాగా అంతర్జాతీయ ద్యవ్యనిథి సంస్థ (ఐఎంఎఫ్) ఆధ్వర్యంలో ఏర్పాటైన సలహా బృందంలో చోటు దక్కించుకన్నారు. ప్రపంచవ్యాప్తంగా 12మంది ఆర్థిక నిపుణులతో ఏర్పాటైన ఈ కమిటీలో రఘురామ్ రాజన్‌ను కూడా చేరుస్తూ ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టలినా జార్జీవా ఒక ప్రకటన జారీ చేశారు. గ్లోబల్ కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఉత్పన్నమైన అసాధారణ సవాళ్లు, పరిణామాలపై ప్రపంచ వ్యాప్తంగా దృక్పథాలను అందిస్తుందని ఐఎంఎఫ్ శుక్రవారం తెలిపింది. ఆర్థికమాంద్యంతో ఇబ్బందులు పడుతున్న తమ సభ్యదేశాలను ఆదుకునేందుకు, ఆర్థిక సహాయం, సంబంధిత విధానాల రూపకల్పనలో అసాధారణమైన నైపుణ్యం, అగ్రశ్రేణి నిపుణుల సలహాలు తమకిపుడు చాలా అవసరం అని ఆమె చెప్పారు. వీరంతా తమ అమూల్య సేవలను అందించేందుకు అంగీకరించడం తనకు గర్వంగా ఉందన్నారు. కరోనావైరస్ మహమ్మారి కారణంగా ప్రపంచం ఎదుర్కొంటున్న అసాధారణ సవాళ్లు, కీలక పరిణామాలు, ఇతర విధి విధానాలపై ఈ టీం సూచనలు చేయనుంది. సింగపూర్ సీనియర్ మంత్రి ,సింగపూర్ ద్రవ్య అథారిటీ చైర్మన్ షణ్ముగరత్నం, మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రొఫెసర్ క్రిస్టిన్ ఫోర్బ్స్, ఆస్ట్రేలియా మాజీ ప్రధాని కెవిన్ రూడ్, యుఎన్ మాజీ డిప్యూటీ సెక్రటరీ జనరల్ లార్డ్ మార్క్ మల్లోచ్ బ్రౌన్ తదితరులు కమిటీలో వున్నారు. (కరోనా : శరవేగంగా ఆర్థిక వ్యవస్థ పతనం) కాగా కోవిడ్-19 మహమ్మారి గడచిన శతాబ్దంలో ఎదురైన సంక్షోభాలన్నికంటే తీవ్రమైన సంక్షోభాన్నిఎదుర్కొంటున్నామంటూ ఇప్పటికే క్రిస్టలినా ఆందోళన వ్యక్తం చేశారు. తీవ్ర మందగనంలో ఉన్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఈ మహమ్మారి మరింత దెబ్బతీసిందని వ్యాఖ్యానించారు. ఐఎంఎఫ్ సభ్య దేశాల్లోని సుమారు 170 దేశాల్లో తలసరి ఆదాయం క్షీణించిందని పేర్కొన్నారు. 2016 సెప్టెంబర్ వరకు మూడేళ్లపాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) గవర్నర్‌గా పనిచేసిన రాజన్ ప్రస్తుతం అమెరికాలోని ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. (దేశంలో తీవ్ర అత్యవసర పరిస్థితి: రాజన్) నకిలీ వార్తలకు చెక్ చెప్పిన రతన్ టాటా, కరోనా : ఆరు నెలల్లో తొలి వ్యాక్సిన్ సిద్ధం -
వెంటాడిన కరోనా!
కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో స్టాక్ మార్కెట్ నష్టాలు కూడా పెరుగుతున్నాయి. మన దేశంలో కరోనా కేసులు వెయ్యికి పైగా మించడం, మరణాలు 31కు చేరడంతో సోమవారం స్టాక్ మార్కెట్ భారీగా నష్టపోయింది. ప్రపంచం మాంద్యంలోకి జారిపోయిందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎమ్ఎఫ్) పేర్కొనడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. బీఎస్ఈ సెన్సెక్స్ 1,375 పాయింట్లు పతనమై 28,440 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 379 పాయింట్లు నష్టపోయి 8,281 పాయింట్ల వద్ద ముగిశాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, వాహన, లోహ, రియల్టీ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఫిచ్ సొల్యూషన్స్, ఇండియా రేటింగ్స్ సంస్థలు వచ్చే ఆర్థిక సంవత్సరం భారత జీడీపీ అంచనాలను తగ్గించడం, డాలర్‌తో రూపాయి మారకం విలువ పతనం, ముడి చమురు ధరలు 18 ఏళ్ల కనిష్టానికి పడిపోవడం కూడా ప్రతికూల ప్రభావం చూపించాయి. రోజంతా నష్టాలే...: ఆసియా మార్కెట్ల బలహీనతతో మన మార్కెట్ కూడా నష్టాల్లోనే మొదలైంది. సెన్సెక్స్ 580 పాయింట్లు, నిఫ్టీ 274 పాయింట్ల నష్టాలతో ఆరంభమయ్యాయి. గంట తర్వాత నష్టాలు తగ్గినప్పటికీ, మధ్యాహ్నం తర్వాత మళ్లీ పెరిగాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 1,525 పాయింట్లు, నిఫ్టీ 416 పాయింట్ల మేర నష్టపోయాయి. రోజంతా నష్టాలు కొనసాగాయి. రూ. 3 లక్షల కోట్ల సంపద ఆవిరి స్టాక్ మార్కెట్ భారీగా నష్టపోవడంతో రూ.3 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.3 లక్షల కోట్ల మేర తగ్గి రూ.109.74 లక్షల కోట్లకు చేరింది. ఫైనాన్స్ షేర్లు ఢమాల్... కరోనా వైరస్ కల్లోలంతో బ్యాంక్, ఆర్థిక సంస్థల రుణ వృద్ధి గణనీయంగా పడిపోయే అవకాశాలున్నాయన్న ఆందోళనతో బ్యాంక్, ఆర్థిక సంస్థల షేర్లు భారీగా నష్టపోయాయి. నిఫ్టీ బ్యాంక్ సూచీల నష్టంలో ఒక్క ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌ల నష్టాల వాటాయే దాదాపు 75%. బజాజ్ ఫైనాన్స్ 12 శాతం నష్టంతో రూ.2,242 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. ఆల్‌టైమ్ హైకు అబాట్ ఇండియా అమెరికాకు చెందిన అబాట్ ల్యాబొరేటరీస్ అందుబాటులోకి తెచ్చిన 5 నిమిషాల కరోనా నిర్ధారణ పరీక్షకు ఆమోదం లభించింది. దీంతో అబాట్ ఇండియా 19% లాభంతో రూ.16,869ను వద్ద ఆల్‌టైమ్ హైను తాకింది. చివరకు 9% లాభంతో రూ.15,400 వద్ద ముగిసింది. మరిన్ని విశేషాలు.... ► సెన్సెక్స్ 30 షేర్లలో 6 షేర్లు–టెక్ మహీంద్రా, నెస్లే, యాక్సిస్ బ్యాంక్, హిందుస్తాన్ యూని లివర్, టైటాన్, ఇండస్ఇండ్ షేర్లు మాత్రమే లాభపడ్డాయి. మిగిలిన 24 షేర్లు నష్టాల్లో ముగిశాయి. ► దాదాపు 400కు పైగా షేర్లు ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. ఐషర్ మోటార్స్, టీమ్‌లీజ్ సర్వీసెస్, లక్ష్మీ మిల్స్, శ్రీరామ్ సిటీ యూనియన్, హావెల్స్ ఇండియా,సన్ టీవీ, ఫ్యూచర్ రిటైల్, టీవీఎస్ మోటార్, వేదాంత, ఐఓసీ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ► 300కు పైగా షేర్లు లోయర్ సర్క్యూట్లను తాకాయి. ఫ్యూచర్ రిటైల్, ఇండియాబుల్స్ వెంచర్స్, ఐడీఎఫ్సీ, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. నష్టాలకు కారణాలు... ఆగని కరోనా కల్లోలం.... దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమల్లో ఉన్నా, కరోనా కేసులు 1,100కు, మరణాలు 31కు పెరిగాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు 7 లక్షలకు పైగా, మరణాలు 34,000కు పైగా చేరాయి. దేశీయంగా, అంతర్జాతీయంంగా కేసులు మరింత పెరుగుతాయనే ఆందోళన నెలకొన్నది. ఐఎమ్ఎఫ్ మాంద్యం హెచ్చరిక కరోనా వైరస్ కల్లోలంతో ఇప్పటికే ప్రపంచం ఆర్థిక మాంద్యంలోకి జారిపోయిందని అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎమ్ఎఫ్) వెల్లడించింది. 2009 నాటి అర్థిక మాంద్యం కంటే ప్రస్తుత మాంద్యం మరింత అధ్వానంగా ఉంటుందని ఐఎమ్ఎఫ్ హెచ్చరించడం సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. జీడీపీ అంచనాల తగ్గింపు.... వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ 4.6%గానే ఉంటుందని ఫిచ్ పేర్కొంది. ఇండియా రేటింగ్స్ 5.5% నుంచి 3.6%కి తగ్గించింది. ప్రపంచ మార్కెట్లు పతనం. ప్రపంచ మార్కెట్ల నష్టాలు కొనసాగుతున్నాయి. అమెరికా, కొన్ని యూరప్ దేశాల్లో లాక్డౌన్ మరో ఆరు నెలలు పొడిగించే అవకాశాలున్నాయన్న వార్తల నేపథ్యంలో గత శుక్రవారం అమెరికా స్టాక్ సూచీలు 3–4 శాతం మేర నష్టపోగా, సోమవారం ఆసియా మార్కెట్లు 2 శాతం మేర పతనమయ్యాయి. యూరప్ మార్కెట్లు 3 శాతం మేర నష్టాలతో ఆరంభమయ్యాయి. ఆస్ట్రేలియాలో ఆరు నెలల పాటు లాక్‌డౌన్‌ను పొడిగించారు. 18 ఏళ్ల కనిష్టానికి చమురు ధరల పతనం పలు దేశాల్లో లాక్‌డౌన్‌తో చమురు వినియోగం బాగా పడిపోయింది. దీంతో బ్యారెల్ ముడి చమురు ధర సోమవారం ఇంట్రాడేలో 9 శాతానికి పైగా పతనమై 18 ఏళ్ల కనిష్టానికి (20 డాలర్ల దిగువకు) చేరాయి. జనవరి గరిష్ట స్థాయి నుంచి చూస్తే, చమురు ధరలు 68 శాతం మేర తగ్గాయి. రూపాయి 70పైసలు డౌన్.... డాలర్‌తో రూపాయి మారకం విలువ సోమవారం 70 పైసలు క్షీణించింది. రోజంతా 75.10–75.63 రేంజ్లో ట్రేడైన రూపాయి చివరకు 70 పైసల నష్టంతో 75.59 వద్ద ముగిసింది. ప్యాకేజీల ప్రభావం పరిమితమే ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వాల ప్యాకేజీల ప్రభావం అంచనాలకనుగుణంగా పరిమితంగానే ఉంది. కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో ఈ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై ఏ మేరకు ఉండగలదోనన్న భయాందోళనలు చెలరేగుతున్నాయి. ప్రపంచం మాంద్యంలోకి జారిపోయిందని ఇప్పటికే ఐఎమ్ఎఫ్ ప్రకటించింది. దీంతో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. – వినోద్ నాయర్, జియోజిత్ ఫైనాన్షియల్ కరోనా వైరస్‌కు సంబంధించి సానుకూల వార్తలు రానంత వరకూ మార్కెట్ కోలుకోవడం కష్టమే. నిఫ్టీ 8,500 పాయింట్ల దిగువకు పడిపోవడం నెగిటివ్ సిగ్నల్. 8,200 పాయింట్ల కిందకు క్షీణిస్తే, అది మరింత పతనానికి సూచిక. 8,000 పాయింట్లు, లేదా 7,800 పాయింట్లకు కూడా నిఫ్టీ పడిపోవచ్చు. –శ్రీకాంత్ చౌహాన్, కోటక్ సెక్యూరిటీస్ -
తీవ్ర ఆర్థికమాంద్యం, బంగారం కొనొచ్చా?
సాక్షి, ముంబై: ప్రపంచంలో తీవ్రమైన ఆర్థికమాంద్య పరిస్థితులు వచ్చేశాయన్న ఐఎంఎఫ్ చీఫ్ వ్యాఖ్యల నేపథ్యంలో బంగారం కొనుగోళ్లు పుంజుకుంటున్నాయి. దీర్ఘకాలిక మాంద్యం ఆందోళనలతో అంతర్జాతీయంగా బంగారు ధరలు లాభపడ్డాయి. దీంతో దేశీయంగా ఎంసీఎక్స్ మార్కెట్ లో గోల్డ్ ఏప్రిల్ ఫ్యూచర్స్ మార్చి 30 న స్వల్పంగా 0.02 శాతం లాభపడిన పది గ్రాముల పుత్తడి ధర రూ. 43,580 వద్ద వుంది. అయితే జూన్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు 0.6 శాతం పడి రూ. 43,302 కు చేరుకుంది. ఇదే బాటలో పయనించిన వెండి ధర (మే ఫ్యూచర్స్) కిలోకు 3 శాతం క్షీణించింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 39,758 వద్ద కొనసాగుతోంది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసిఎక్స్) లో, బంగారానికి సంబంధించిన ట్రేడింగ్ లో గత 12 ఏళ్లలో లేని విధంగా గత వారంలో ఉత్తమంగా నిలిచిందనీ, ఈ ర్యాలీ కొనసాగే అవకాశం ఉందని నిపుణుల అభిప్రాయం. బంగారం ధరలు క్షీణించిన ప్రతిసారీ పెట్టుబడిదారులు కొనుగోలుకు మొగ్గు చూపే అవకాశం వుందని ఎల్ కేపీ సెక్యూరిటీస్ రీసెర్చ్ అనలిస్ట్ జతీన్ త్రివేది అంచనా వేశారు. ట్రేడర్ల లాభాల స్వీకరణతో ఊగిసలాట ధోరణి ఉన్నప్పటికీ పది గ్రాముల ధర రూ. 39500 వద్ద సాంకేతిక మద్దతువుందని పేర్కొన్నారు. దేశీయంగా దిగి వచ్చిన ధర కరోనా మహమ్మారి విజృంభణతో కొనుగోళ్లు పడిపోవడంతో దేశీయంగా పసిడి ధర పతనమైంది. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ 1,925 తగ్గి 43,375కు చేరింది. అటు 22 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.1,940 రూ. 39,830కి పడిపోయింది. ఇక కేజీ వెండి ధర రూ.1,910కి తగ్గడంతో రూ.39,500కి పడిపోయింది. జువెలర్ల నుంచి డిమాండ్ తగ్గడమే బంగారం ధరలు తగ్గడానికి కారణమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. కాగా కోవిడ్ -19 సంక్షోభంతో 2009 నాటి కంటే ఘోరమౌపమాంద్యంలోకి జారుకున్నామని ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టాలినా జార్జివా మార్చి 27 నాటి విలేకరుల సమావేశంలో అన్నారు. కాగా భారతదేశంలో పసిడి ధర గత వారం 10 గ్రాములకు రూ. 3000 పెరిగాయి. మరోవైపు కరోనా సంక్షోభంతో చమురు ధరలు భారీగా క్షీణించాయి. సోమవారం బ్యారెల్ ధర 20 డాలర్లు దిగువకు చేరింది. అటు డాలరు ధర మార్చి 17న రికార్డు కనిష్టాన్ని నమోదు చేసింది. గ్రీన్ బ్యాక్ ఆరు కరెన్సీలతో పోలిస్తే డాలరు నేడు 0.34 శాతం స్వల్ప లాభంతో 98.69వద్ద వుంది. ఇలాగే దేశీయ కరెన్సీ వరుసగా రికార్డు పతనాన్ని నమోదు చేసింది. డాలరుమారకంలో 32 పైసలు పతనమై 75.21 వద్ద కొనసాగుతోంది. శుక్రవారం 74.89 వద్ద ముగిసింది. -
ప్రపంచంపై కరోనా పడగ
జెనీవా/టెహ్రాన్: కరోనా వైరస్ (కోవిడ్-19) ప్రపంచ దేశాలను వణికిస్తోంది. వైరస్ వెలుగు చూసిన చైనాలో కొత్త కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుండగా.. ఇరాన్, ఇటలీ, ఫ్రాన్స్, దక్షిణ కొరియా, అమెరికా సహా పలు దేశాల్లో విజృంభిస్తోంది. గురువారానికి ప్రపంచవ్యాప్తంగా 115 దేశాల్లో ఈ వైరస్ బాధితుల సంఖ్య 1,25, 293గా, మరణాలు 4,600గా తేలిందని ఏఎఫ్‌పీ వార్తాసంస్థ గణించింది. వీటిలో చైనా వెలుపల నమోదైన కేసులు 44,500 కాగా, మరణాల సంఖ్య 1431. మొత్తం కేసులు, గణాంకాలను పరిశీలిస్తే ఆసియాలో వైరస్ తీవ్రత అధికంగా ఉంది. (కరోనాతో గాయకుడి హనీమూన్ రద్దు!) ఆసియాలో 90,765 కేసులు నమోదు కాగా, 3,253 మరణాలు సంభవించాయి. యూరప్‌లో 22,969 కేసులు, 947 మరణాలు, మధ్యప్రాచ్యంలో 9,880 కేసులు, 364 మరణాలు, అమెరికా, కెనడాల్లో 1,194 కేసులు, 29 మరణాలు, ఆఫ్రికాలో 130 కేసులు, రెండు మరణాలు చోటు చేసుకున్నాయి. చైనా తరువాత ఎక్కువగా ఇటలీలో 12,462 కేసులు, 827 మరణాలు, ఇరాన్లో 10,075 కేసులు, 429 మరణాలు సంభవించాయి. కోవిడ్ –19ను ‘అదుపు చేయదగ్గ విశ్వవ్యాప్త మహమ్మారి’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. (భారత్‌లో తొలి మరణం) 5 బిలియన్ డాలర్లివ్వండి వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు, చికిత్స అందించేందుకు 5 బిలియన్ డాలర్ల అత్యవసర ఆర్థిక సాయం అందించాలని ఇరాన్ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్)ను ఆశ్రయించింది. ఐఎంఎఫ్‌ను ఇరాన్ సాయం కోరడం 1962 తరువాత ఇదే ప్రథమం. కరోనా భయంతో పాఠశాలలకు శ్రీలంక ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. యూరప్ దేశాలపై ట్రావెల్ బ్యాన్ కరోనా కల్లోలం నేపథ్యంలో యూకే మినహా ఇతర యూరప్ దేశాల నుంచి అమెరికాలోకి ఎవరూ అడుగుపెట్టవద్దని గురువారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అసాధారణ ఉత్తర్వులు జారీ చేశారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి 30 రోజుల పాటు యూకేయేతర యూరప్ దేశాల వారిపై ఈ నిషేధం ఉంటుందన్నారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంలో యూరోపియన్ యూనియన్ విఫలమైందని ఆయన విమర్శించారు. అమెరికా ట్రావెల్ బ్యాన్పై యూరప్ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. మరోవైపు, అమెరికా రక్షణ మంత్రి మార్క్ ఎస్పర్ భారత పర్యటన కూడా రద్దయింది. మార్చి 15, 16 తేదీల్లో ఆయన భారత్‌లో పర్యటించాల్సి ఉంది. (మహమ్మారి ముంచేసింది!) ట్రంప్‌ను కలిసిన వ్యక్తికి కోవిడ్–19 బ్రజీలియా: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు కూడా కోవిడ్–19 ముప్పు పొంచి ఉన్నట్లు కనిపిస్తోంది. గతవారం ట్రంప్‌ను కలిసిన బ్రెజిల్ కమ్యూనికేషన్స్ చీఫ్ ఫేబియోకు కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. బ్రెజిల్ అధ్యక్షుడు జాయిర్ బొల్సొనారొ గత వారం ట్రంప్‌తో భేటీ అయ్యారు. ఫేబియో, ఇతర అధికార బృందం కూడా ఆ భేటీలో పాల్గొన్నది. అనంతరం ఫేబియోకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. అయితే, దీనిపై ఆందోళన చెందడం లేదని ట్రంప్ వ్యాఖ్యానించారు. (కాన్స్ ఫెస్టివల్ క్యాన్సిల్ ?) యూఎస్ వర్సిటీలపై కరోనా ఎఫెక్ట్ వాషింగ్టన్: కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో అమెరికాలోని 100కు పైగా విశ్వవిద్యాలయాల్లో తరగతులను రద్దు చేశారు. ముఖ్యంగా విద్యార్థులు క్లాస్‌లకు ప్రత్యక్షంగా హాజరు కావడాన్ని నిలిపేస్తూ పలు యూనివర్సిటీలు నిర్ణయం తీసుకున్నాయి. ఆన్లైన్ క్లాస్‌లను ప్రోత్సహిస్తున్నాయి. పలు విద్యాలయాలు తమ క్యాంపస్‌ల్లో క్రీడలు సహా బోధనేతర కార్యక్రమాలను రద్దు చేశాయి. (ఇంటి పట్టునే ఉండండి) -
షాకింగ్ : ఆటోమేషన్తో 9 శాతం కొలువులు కోత..
సాక్షి, న్యూఢిల్లీ : ఆటోమేషన్తో భారత్‌లో 9 శాతం మంది ఉద్యోగులు తమ కొలువులు కోల్పోతారని ఐఎంఎఫ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ డేవిడ్ లిప్టన్ అంచనా వేశారు. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనమిక్ రీసెర్చ్ (ఎన్సీఏఈఆర్) నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆటోమేషన్ ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా 14 శాతం మంది అంటే దాదాపు 37.5 కోట్ల మంది ఉద్యోగులు ఉపాధి కోల్పోతారని అన్నారు. తక్కువ వేతనాలు, అధిక కార్మికులు అవసరమైన పరిశ్రమల్లో ఆటోమేషన్ కారణంగా ఉద్యోగాలు పోయే పరిస్థితి అధికంగా ఉంటుందని లిప్టన్ హెచ్చరించారు. బడ్జెట్లో భారత్ పలు ఉత్పత్తులపై దిగుమతి సుంకాన్ని పెంచడం ద్వారా పోటీతత్వంపై ప్రభావం ఉంటుందని, సమ్మిళిత ఆర్థిక వ్యవస్థకు ఇది విఘాతం కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. స్వల్పకాలంలో పోటీతత్వం కొంత ఇబ్బందికరమే అయినా దీర్ఘకాలంలో కంపెనీలు స్వతంత్రంగా ఎదిగేందుకు ఇది దోహదపడుతుందని అన్నారు. అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతల కారణంగా ప్రపంచ వృద్ధి రేటు మందగించిందని, దీని ప్రభావం ఇతర ఆసియా దేశాలతో పోలిస్తే భారత్‌పై పరిమితంగానే ఉంటుందని అంచనా వేశారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు న్యాయ, రెగ్యులేటరీ పరమైన చిక్కులను తొలగించాలని అన్నారు. గ్రామీణ వినిమయం తగ్గడం, ఎగుమతుల వృద్ధి పతనమవడం, నిరుద్యోగం దేశ ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందులుగా మారాయని చెప్పుకొచ్చారు. కరెంట్ ఖాతా లోటుపై భారత్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని దాన్ని పూడ్చుకునేందుకు మూలధన నిధులను ఆకర్షించాలని కోరారు. చదవండి : పనీపాటా లేని కుర్రకారు ఇక్కడే ఎక్కువ -
‘ఇక ఐఎంఎఫ్‌పై విరుచుకుపడతారు’
సాక్షి, న్యూఢిల్లీ : భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటును కుదించినందుకు అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్)తో పాటు ఐఎంఎఫ్ చీఫ్ ఎకనమిస్ట్ గీతా గోపీనాథ్‌పై విరుచుకుపడేందుకు కేంద్ర మంత్రులు సిద్ధమవుతారని కాంగ్రెస్ నేత, ఆర్థిక శాఖ మాజీ మంత్రి పీ చిదంబరం అన్నారు. నోట్ల రద్దును తొలిగా వ్యతిరేకించిన వారిలో ఐఎంఎఫ్ చీఫ్ ఎకనమిస్ట్ గీతా గోపీనాథ్ ఒకరని, ఐఎంఎఫ్..గీతా గోపీనాథ్‌లపై మంత్రుల దాడికి మనం సంసిద్ధం కావాలని చిదంబరం మంగళవారం ట్వీట్ చేశారు. కేవలం మూడు నెలల వ్యవధిలోనే భారత వృద్ధి రేటును 1.3 శాతం మేర కోత విధిస్తూ 4.8 శాతానికి ఐఎంఎఫ్ సోమవారం కుదించింది. రుణాల జారీలో తగ్గుదల, దేశీయ డిమాండ్ పడిపోవడంతో భారత వృద్ధిరేటు అంచనాను తగ్గిస్తున్నట్టు దావోస్‌లో ప్రపంచ ఆర్థిక పరిస్ధితిపై ఐఎంఎఫ్ విడుదల చేసిన నివేదికలో పేర్కొన్న సంగతి తెలిసిందే. భారత్‌లో వృద్ధి మందగమనం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటునూ ప్రభావితం చేస్తుందని, వరల్డ్ ఎకానమీ వృద్ధి అంచనాను కూడా 0.1 శాతం మేర సవరించామని గీతా గోపీనాథ్ పేర్కొనడం గమనార్హం. కాగా భారత వృద్ధి రేటును సవరిస్తూ ఐఎంఎఫ్ తాజా అంచనా మరింత తగ్గవచ్చని చిదంబరం వ్యాఖ్యానించడం గమనార్హం. చదవండి : వృద్ధి అంచనా కుదింపు : ఐఎంఎఫ్ హెచ్చరిక -
వృద్ధి అంచనా కుదింపు : ఐఎంఎఫ్ హెచ్చరిక
అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్)భారత వృద్ది అంచనాలను మరోసారి భారీగా కుదించింది. అతి తక్కువ వృద్ధిని అంచనా వేసింది. అలాగే భారతదేశ ఆర్థిక మందగమన పరిస్థితి గ్లోబల్ ఎకానమీని ప్రభావితం చేసిందని సోమవారం వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వృద్ది రేటును 4.8 శాతానికి సవరించింది. అంతేకాదు ఇది ప్రతికూల ఆశ్చర్యంగా పక్రటించింది. గత ఏడాది ఇదేకాలంలో ఐఎంఎఫ్ అంచనా 7.5 శాతం. అక్టోబర్‌లో 6.1 శాతానికి తగ్గించింది. ప్రపంచ ఆర్థిక వృద్ధి అంచనాలలో 0.1 శాతం తగ్గించిన ఐఎంఎఫ్ భారతదేశ ఆర్థిక మందగమనానిదే "సింహభాగం" అని ఐఎంఎఫ్ పేర్కొంది. దీనికి తోడు అమెరికా, ఇరాన్ మధ్య పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, సామాజిక అశాంతిని తీవ్రతరం చేయడం, అమెరికాతో ఇతర దేశాల వాణిజ్య సంబంధాలను దెబ్బతీయడం, అలాగే ఇతర దేశాల మధ్య ఆర్థిక ఘర్షణలులాంటివి ప్రముఖంగా ఉన్నాయని తెలిపింది. దేశీయంగా బ్యాంకుయేతర ఆర్థిక రంగంలో ఒత్తిడి ,రుణ వృద్ధి క్షీణత, దేశీయ వినిమయ డిమాండ్ ఊహించిన దానికంటే చాలా మందగించిందని వ్యాఖ్యానించింది. ఇదే వృద్ధి రేటును తగ్గించడానికి కారణమని తెలిపింది. మరోవైపు జపాన్ వృద్దిరేటును అంచనాలను బాగా పెంచింది ఐఎంఎఫ్. ప్రధానంగా జపాన్ ప్రధాని షింజో అబే గత నెలలో ప్రకటించిన స్టిములస్ ప్యాకేజీ కారణంగా వృద్ధి పురోగమిస్తుందని ఐఎంఎఫ్ అంచనావేసింది. 2020 నాటికి 0.7శాతం వృద్ధి నమోదు కానుందని తెలిపింది. గత అక్టోబరు లో ఇది 0.5 శాతంగా మాత్రమే వుంటుందని అంచనావేసింది. అలాగే అమెరికా-చైనా ట్రేడ్‌డీల్ కారణంగా చైనా వృద్ది రేటుకు పైకి సవరించింది. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారతదేశ వృద్ధి రేటు ఒక శాతం పెరిగి 5.8 శాతంగా ఉండి, వేగంగా అభివృద్ధి చెందుతున్న రెండవ ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ వుంటుందని తెలిపింది. 6.5 శాతం వృద్ధి రేటుతో చైనా (5.8 శాతం)ను అధిగమించి 2021 లో భారత్ మొదటి స్థానంలో నిలబడుతుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి దృక్పథాన్ని స్వల్పంగా క్రిందికి సవరించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్దిపై కొత్త అంచనాలు 2019 లో 2.9 శాతం, 2020 లో 3.3 శాతం, 2021 లో 3.4 శాతం వృద్ధినగా వుంచింది.. భారతదేశ ఆర్థిక వృద్ధి క్షీణత ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసిందని అభిప్రాయపడింది. అయితే దేశ వృద్ది 2020లో 5.8 శాతంగాను, 2021లో 6.5 శాతానికి మెరుగుపడుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యుఇఎఫ్) వార్షిక సదస్సు ప్రారంభోత్సవానికి ముందు, ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా మాట్లాడుతూ వృద్ధి మళ్లీ మందగించడం ప్రారంభిస్తే ప్రతి ఒక్కరూ మళ్లీ సమన్వయంతో పనిచేయడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. అయితే అమెరికా-చైనా వాణిజ్య ఒప్పంద పరిణామాలతో అక్టోబర్ నుంచి కొన్ని నష్టాలు పాక్షికంగా తగ్గాయని ఐఎంఎఫ్ చీఫ్ ఎకనామిస్ట్ గీత గోపీనాథ్ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశ వృద్ధి రేటు 5 శాతంగా ఉంటుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేస్తుండగా, ఐరాస 5.7 శాతంగా అంచనా వేసిన సంగతి తెలిసిందే. -
నిర్మాణాత్మక సంస్కరణలపై దృష్టి పెట్టాలి
వాషింగ్టన్: దేశీయంగా పడిపోయిన డిమాండ్‌ను పునరుద్ధరించేందుకు బ్యాంకుల ప్రక్షాళన, కార్మిక సంస్కరణలు తరహా నిర్మాణాత్మక సంస్కరణలపై భారత్ దృష్టి సారించాలని ఐఎంఎఫ్ ముఖ్య ఆర్థికవేత్త గీతా గోపీనాథ్ సూచించారు. భారత ఆర్థిక వ్యవస్థ సవాళ్లను ఎదుర్కొంటున్న నేపథ్యంలో.. దేశీయంగా మందగించిన డిమాండ్‌ను పునరుజ్జీవింపజేయడంతో పాటు, ఉత్పాదకత పెంపు ద్వారా ఉద్యోగాలను కల్పించేలా సంస్కరణలు ఉండాలన్నది తమ సూచనగా పేర్కొన్నారు. దేశ జీడీపీ సెప్టెంబర్ త్రైమాసికంలో ఆరేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయి 4.5 శాతంగా నమోదు కావటం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ఐదేళ్ల రెండో విడత పాలన ఆరంభంలో ఉన్నందున... సంస్కరణలను ముందుకు తీసుకెళ్లడానికి ఇదే సరైన తరుణమని ఆమె చెప్పారు. విశ్వసనీయమైన ద్రవ్యోలోటు తప్పనిసరి అని అభిప్రాయపడ్డారు.పెట్టుబడులు తగ్గిపోవడం, వినియోగ వృద్ధి నిదానించడమే వృద్ధి మందగమనానికి కారణాలని ఆమె ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. వినియోగం బలహీనం... వృద్ధి అంతంతే: భారత్‌పై మూడీస్ కుటుంబాల వినియోగ శక్తి బలహీనంగా ఉండడం భారత్ వృద్ధికి బ్రేక్‌లు వేస్తోందని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ తన తాజా నివేదికలో పేర్కొంది. రుణ వృద్ధి, చెల్లింపులపై కూడా ఇది ప్రతికూల ప్రభావం చూపుతోందని విశ్లేషించింది. 2020 మార్చితో ముగిసే ఆర్థిక సంవత్సరానికి స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు అంచనాను 5.8 నుంచి 4.9 శాతానికి తగ్గించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక పరిస్థితుల బాగోలేవని పేర్కొంది. ఉపాధి కల్పన పరిస్థితులు కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయని తెలిపింది. -
అంచనాలు తగ్గించినా.. భారత్‌దే అగ్రస్థానం
వాషింగ్టన్: అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) అంచనాలను కుదించినా.. ఇప్పటికీ అత్యంత వేగవంతమైన వృద్ధి సాధిస్తున్న దేశాల్లో భారత్ కూడా ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. అధిక వృద్ధి సాధన దిశగా ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంటోందని ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు వార్షిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆమె విలేకరులకు చెప్పారు. భారత్ వృద్ధి రేటు ఈ ఏడాది 6.1 శాతానికే పరిమితం కావొచ్చని, 2020లో 7 శాతానికి పెరగవచ్చని ఐఎంఎఫ్ ఒక నివేదికలో పేర్కొన్న నేపథ్యంలో నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘అంచనాలు కుదించినా అంతర్జాతీయంగా నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లోనూ భారత్ వేగవంతమైన వృద్ధి సాధిస్తోందన్న విషయం గుర్తుంచుకోవాలి. వృద్ధి రేటు మరింతగా ఉండాలని కోరుకుంటున్నాను. అందుకోసం అన్ని ప్రయత్నాలూ చేస్తాను‘ అని నిర్మల చెప్పారు. మరోవైపు, వివిధ రంగాలు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వం నుంచి ఆయా వర్గాలు ఏం ఆశిస్తున్నాయన్నది తెలుసుకుంటున్నామని.. తగు చర్యలు తీసుకుంటున్నామని ఆమె పేర్కొన్నారు. అమెరికాతో త్వరలో వాణిజ్య ఒప్పందం.. వాణిజ్యపరమైన అంశాలపై అమెరికాతో నెలకొన్న విభేదాలు క్రమంగా తగ్గుతున్నాయని, త్వరలోనే ఇరు దేశాలు ఒక ఒప్పందం కుదుర్చుకోగలవని నిర్మల తెలిపారు. విభేదాల పరిష్కారంపై వాణిజ్య శాఖ తీవ్రంగా కసరత్తు చేస్తోందని, వీటిపై చర్చలు త్వరలోనే పూర్తి కాగలవని ఆమె చెప్పారు. మరోవైపు, ఇటీవలి భారత పర్యటన సందర్భంగా రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మెరుగుపడేలా తమ వాణిజ్య మంత్రి విల్బర్ రాస్ కృషి చేసినట్లు అమెరికా వాణిజ్య శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. భారత పర్యటనలో వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్‌తో పాటు నిర్మలా సీతారామన్ తదితరులతో రాస్ సమావేశమయ్యారు. -
పెట్టుబడులతో రారండి..
వాషింగ్టన్ : పెట్టుబడులకు భారత్ కంటే ప్రపంచంలో మరో అనువైన ప్రాంతం లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఐఎంఎఫ్ ప్రధాన కార్యాలయంలో జరిగిన పెట్టుబడిదారుల సదస్సును ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ సంస్కరణలను చురుకుగా ముందుకు తీసుకువెళ్లేందుకు తమ ప్రభుత్వం నిరంతరాయంగా పనిచేస్తోందని స్పష్టం చేశారు. భారత్ ఇప్పటికీ ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోందని, ఇక్కడ నైపుణ్యంతో కూడిన మానవ వనరులు అందుబాటులో ఉన్నాయని, పెట్టుబడిదారులకు అనువైన సంస్కరణలు చేపట్టడంలో ముందున్నామని తెలిపారు. భారత్‌లో న్యాయవ్యవస్థ ప్రక్రియ కొంత జాప్యం నెలకొంటున్నా వేగవంతమైన సంస్కరణలు, పటిష్ట చట్టాలు, పారదర్శకత పెట్టుబడులను ఆకర్షించేందుకు ఉపకరిస్తాయని పేర్కొన్నారు. భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్య ఫోరం సహకారంతో ఫిక్కీ ఈ సదస్సును నిర్వహించింది. భారత్‌లో ఆర్థిక మందగమనాన్ని అధిగమించేందుకు ఎలాంటి చర్యలు చేపడుతున్నారని అడగ్గా ఒత్తిడికి గురువుతున్న రంగాలను చక్కదిద్దేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు.తదుపరి బడ్జెట్ కోసం వేచిచూడకుండా ఆయా రంగాల్లో సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. దేశంలో వినిమయ రంగం పుంజుకునేందుకు బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు గ్రామాలు, జిల్లాలను సందర్శించి విరివిగా అర్హులకు రుణాలు ఇవ్వాలని తాను ఇప్పటికే కోరానని చెప్పారు. -
భారత వృద్ధిరేటు : ఐఎంఎఫ్ కోత
అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) భారత వృద్ధిరేటు అంచనాలో మరోసారి కోత పెట్టింది. జూలైలో 7 శాతం అంచనా వేసిన సంస్థ 2020 ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి అంచనాను 90 బేసిస్ పాయింట్లు తగ్గించి 6.1 శాతంగా ఉండనుందని తెలిపింది. దేశీయ డిమాండ్ ఊహించిన దానికంటే బలహీనమైన దృక్పథాన్ని ప్రతిబింబిస్తుందని ఐఎంఎఫ్ వ్యాఖ్యానించింది. జూలైలో 7.2 శాతంగా ఉన్న అంచనాను 20 బిపిఎస్ పాయింట్లు (7 శాతం) తగ్గించిన సంగతి తెలిసిందే. ఆర్థిక మందగమనం, ఆర్థిక మాంద్యం, ఆర్థిక ఉద్దీపన, వాణిజ్యయుద్ధం, డీగ్లోబలైజేషన్పై తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోనే మాంద్యం ఏర్పడిందని ఐఎంఎఫ్ వెల్లడించింది. అయితే భారతదేశంలో ద్రవ్య విధాన సడలింపు, ఇటీవలి కార్పొరేట్ పన్ను రేటు తగ్గింపులు వృద్ధికి తోడ్పడతాయని ఐఎంఎఫ్ పేర్కొంది. అలాగే గ్రామీణ వినియోగానికి తోడ్పడే ప్రభుత్వ కార్యక్రమాలు కూడా వృద్ధికి తోడ్పడతాయని చెప్పింది. -
జీడీపీ వృద్ధి రేటు ‘కట్’కట!
వాషింగ్టన్: భారత్ దేశీయ వినియోగ డిమాండ్ అవుట్లుక్అంచనాలకన్నా బలహీనంగా ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) విశ్లేషించింది. భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)పై ఈ ప్రభావం పడుతుందని పేర్కొంది. ఈ కారణంగా 2019, 2020కి సంబంధించి జీడీపీ వృద్ధి రేటు అంచనాలను 0.3 శాతం (30 బేసిస్ పాయింట్లు) తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. 2019లో 7 శాతం, 2020లో 7.2 శాతం వృద్ధి రేట్లు మాత్రమే నమోదవుతాయన్నది తమ తాజా అంచనా అని తెలిపింది. అయితే ఈ స్థాయి వృద్ధి నమోదయినా, ప్రపంచంలో వేగవంతంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలుస్తుందని, చైనా తరువాతి స్థానంలోనే ఉంటుందని వాషింగ్టన్ కేంద్రంగా పనిచేసే అంతర్జాతీయ దిగ్గజ ద్రవ్య సంస్థ పేర్కొంది. తన తాజా వరల్ట్ ఎకనమిక్ అప్డేట్ నివేదికలో భాగంగా భారత్‌కు సంబంధించి ఐఎంఎఫ్ ఈ అంశాలను పేర్కొంది. భారత్ సంతతికి చెందిన ఐఎంఎఫ్ ప్రధాన ఆర్థికవేత్త గీతా గోపీనాథ్ ఆవిష్కరించిన నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ♦ పన్నుల భారాలు పెరగడం, అంతర్జాతీయ డిమండ్ బలహీనపడ్డం, అమెరికాతో వాణిజ్య ఉద్రిక్తతల వంటి అంశాలతో చైనా ఆర్థిక వ్యవస్థ తీవ్ర ప్రతికూలతలు ఎదుర్కొంటోంది. మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇవ్వడానికి చైనా పలు విధానపరమైన ఉద్దీపన చర్యలు తీసుకుంటోంది. ఆయా చర్యల ఫలితంగా చైనా 2019లో 6.2 శాతం 2020లో 6 శాతం వృద్ధి రేట్లను నమోదుచేసుకునే అవకాశం ఉంది. (ఏప్రిల్‌లో వెలువడిన వరల్డ్ ఎకనమిక్ అవుట్‌లుక్ అంచనాలకన్నా 10 బేసిస్ పాయింట్లు తక్కువ) ♦ అంతర్జాతీయంగా తీవ్ర ఆర్థిక అనిశ్చితి ఉంది. తీవ్ర ఒత్తిడిలో ఉన్న అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల పనితీరుమీద మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మెరుగుదల ఆధారపడి ఉంటుంది. ♦ ఈ ఏడాది జనవరి నుంచి మార్చి మధ్య ప్రపంచ వాణిజ్యం కూడా నెమ్మదించింది. ప్రపంచ వాణిజ్యం ఈ కాలంలో కేవలం 0.5 శాతం మాత్రమే పురోగమించింది. ఇంత తక్కువ స్థాయి వృద్ధి రేటు 2012 తర్వాత ఇదే తొలిసారి. ♦ అమెరికా–చైనాల మధ్య సుంకాల పోరు, ఆటో టారిఫ్‌లు, యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వెలుపలికి రావడానికి సంబంధించిన బ్రెగ్జిట్ అంశాలు అసలే అంతంతమాత్రంగా ఉన్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై మరింత ప్రతికూల ప్రభావం చూపుతాయి. పెట్టుబడులు, సరఫరా చైన్లను ఈ పరిస్థితి దెబ్బతీసే అవకాశం ఉంది. ♦ అయితే ఈ పరిస్థితిని ‘అంతర్జాతీయ మాంద్యంగా’ మాత్రం ఐఎంఎఫ్ పరిగణించబోవడం లేదు. ప్రపంచ వృద్ధికి ‘కీలక అవరోధాలు’గా మాత్రమే దీనిని ఐఎంఎఫ్ చూస్తోంది. ♦ అమెరికా–చైనా మధ్య వాణిజ్య సవాళ్లు 2020లో ప్రపంచ జీడీపీని 0.5 శాతం మేర తగ్గించే అవకాశం ఉంది. ♦ ద్వైపాక్షిక వాణిజ్య సమతౌల్యతలు, వాణిజ్యలోటు సమస్యల పరిష్కారానికి సుంకాలే మార్గమని భావించడం సరికాదు. ఆయా సవాళ్ల పరిష్కారానికి నిబంధనల ఆధారిత బహుళజాతి వాణిజ్య వ్యవస్థ మరింత పటిష్టం కావాలి. -
వృద్ధి వేగంలో భారత్ టాప్
వాషింగ్టన్: ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ మొదటి స్థానంలో ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) స్పష్టం చేసింది. 2019లో భారత్ వృద్ధిరేటు 7.3 శాతంగా ఉంటుందని, 2020లో ఈ రేటు 7.5 శాతంగా నమోదుకానుందని ఐఎంఎఫ్ విశ్లేషించింది. పెట్టుబడుల్లో వేగవంతమైన రికవరీ నమోదవుతోందని, వినియోగ పరిస్థితులు గణనీయంగా మెరుగుపడుతున్నాయని ఐఎంఎఫ్ పేర్కొంటూ, భారత్ వృద్ధి పటిష్టతకు ఈ అంశాలు కీలకపాత్ర పోషిస్తున్నాయని విశ్లేషించింది. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తంగా (2019–20) వృద్ధిరేటు అంచనాలను మాత్రం 7.4 శాతం నుంచి 7.3 శాతానికి తగ్గించింది. ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంక్ వార్షిక స్పింగ్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక పరిస్థితులపై సోమవారం ప్రపంచబ్యాంక్ అవుట్‌లుక్ విడుదలకాగా, మంగళవారం ఐఎంఎఫ్ కూడా ఈ మేరకు ఒక నివేదికను ఆవిష్కరించింది. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ►2018లో భారత్ వృద్ధి రేటు 7.1 శాతం. చైనా 6.6 శాతం వృద్ధిరేటుకన్నా ఇది అధికం. 2019, 2020ల్లో చైనా వృద్ధిరేట్లు వరుసగా 6.3 శాతం, 6.1 శాతం ఉంటాయని భావిస్తున్నాం. ►ద్రవ్యోల్బణం తక్కువగా ఉండడం, దీనితో వడ్డీరేట్ల తగ్గుదల భారత్ వృద్ధి జోరు కారణాల్లో కొన్ని. ►మధ్యకాలికంగా చూస్తే, 7 శాతం స్థాయిలో భారత్ వృద్ధి స్థిరీకరణ పొందే అవకాశం ఉంది. వ్యవస్థాగత సంస్కరణల అమలు, మౌలిక ప్రాజెక్టుల విషయంలో అవరోధాల తొలగింపు ఈ అంచనాలకు కారణం. ►భారత్‌లో వ్యవస్థాగత, ఫైనాన్షియల్ రంగాలకు సంబంధించి సంస్కరణలు కొనసాగుతాయని విశ్వసిస్తున్నాం. ► ప్రభుత్వ రుణం తగిన స్థాయిలో ఉంచడం వృద్ధి పటిష్టతకు దోహదపడే అంశాల్లో ఒకటి. ఈ అంశంసహా ద్రవ్యలోటు కట్టడికి భారత్ తగిన చర్యలు తీసుకుంటుందని విశ్వసిస్తున్నాం. ►ఫైనాన్షియల్ రంగం పటిష్టతకు వస్తే, కంపెనీల బ్యాలెన్స్ షీట్ల మెరుగునకు తగిన ప్రయత్నం జరగాలి. సరళీకృత దివాలా విధానాల పరిధిలో మొండిబకాయిలు (ఎన్పీఏ) ఉండాలి. అంటే ఎన్పీఏల సమస్య క్లిష్టత లేకుండా పరిష్కారమయ్యే అవకాశాలు ఉండాలి. బ్యాంకింగ్ రంగం మెరుగుపడే దిశలో ఈ చర్యలు ఉండాలి. ►భూ సంస్కరణలు, మౌలిక రంగ వృద్ధి వంటి అం శాల్లో వేగవంతమైన పురోగతి ఉండాలి. ఇది ఉ పాధి కల్పన మెరుగుదలకూ దోహదపడుతుంది. ఉద్దీపన చర్యలు తీసుకుంటున్నప్పటికీ, 2019, 2020ల్లో చైనా వృద్ధి నెమ్మదిగానే ఉండే వీలుంది. ►2018లో అంతర్జాతీయ వృద్ధి మందగమనంలోకి జారింది. చివరి ఆరు నెలల కాలంలో ఈ పరిస్థితి మరింత క్షీణించింది. చైనా–అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం అంశాలు దీనికి ప్రధాన కారణం. ప్రపంచ వృద్ధిరేటు అంచనాకు కోత 2019లో ప్రపంచ వృద్ధి రేటు అంచనాకు ఐఎంఎఫ్ కోత పెట్టింది. వృద్ధి 3.3 శాతమే నమోదవుతుందని తాజా అంచనాల్లో పేర్కొంది. 2020ల్లో ఈ రేటు 3.6 శాతంగా విశ్లేషించింది. ఇంతక్రితం ఈ రెండు సంవత్సరాల్లో 3.7 శాతం వృద్ధి నమోదవుతుందని ఐఎంఎఫ్ అంచనావేసింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ‘సున్నితమైన పరిస్థితి’’ని ఎదుర్కొంటోందని తెలిపింది. వాణిజ్య యుద్ధం, బ్రెగ్జిట్, చమురు ఉత్పత్తి దేశాల్లో ఉద్రిక్తతలు, ఉద్దీపనలను వెనక్కు తీసుకుంటే, జరగబోయే పరిణామాలపై అనిశ్చితి వంటి అంశాలను ఐఎంఎఫ్ ఈ సందర్భంగా ప్రస్తావించింది. పన్నుల వ్యవస్థలను ఆధునీకరించడం, విద్య, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలపై ఖర్చు చేయడం ద్వారా ప్రజా రుణాలు, సంపద అసమానతలను తగ్గించడం వంటి గత సూచనలను సభ్య దేశాలు ఆచరణలో పెట్టాలని ఐఎంఎఫ్ సూచించింది. 2019లో ప్రపంచ వ్యాప్తంగా చూస్తే, 70 శాతం ఆర్థిక వ్యవస్థలు మందగమన పరిస్థితులను ఎదుర్కొనవచ్చని త్రైమాసిక నివేదిక పేర్కొంటున్నట్లు ఐఎంఎఫ్ చీఫ్ ఎకనమిస్ట్ గీతా గోపీనాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. -
వృద్ధి వేగం... అయినా 6.8 శాతమే!
వాషింగ్టన్: ప్రపంచంలోనే భారత్ వేగవంతమైన వృద్ధిని నమోదుచేసుకుంటోందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) పేర్కొంది. అయితే వేగవంతమైన వృద్ధే అయినప్పటికీ, అంత భారీగా ఏమీ లేదని రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ తన తాజా అవుట్‌లుక్‌లో పేర్కొంది. 2019–2020 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు అంచనాలను 7 శాతం నుంచి 6.8 శాతానికి తగ్గించింది. ఊహించినదానికన్నా బలహీనమైన ఆర్థిక పరిస్థితులు దీనికి కారణంగా పేర్కొంది. భారత్ ఆర్థిక వ్యవస్థ గురించి ఐఎంఎఫ్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ గ్యారీ రైస్ వివరించిన అంశాలను, ఫిచ్ తాజా అవుట్‌లుక్‌ను క్లుప్తంగా చూస్తే... మరిన్ని సంస్కరణలు అవసరం: ఐఎంఎఫ్ ►గడచిన ఐదు సంవత్సరాలుగా భారత్ పలు ఆర్థిక సంస్కరణలను తీసుకువచ్చింది. మరిన్ని సంస్కరణలనూ తీసుకురావాల్సి ఉంది. అధిక వృద్ధిరేటు పటిష్టతకు ఇది అవసరం. ► ఐదు సంవత్సరాలుగా సగటున భారత్ వృద్ధి రేటు 7 శాతంగా ఉంది. ► భారత్‌లో యువత ఎక్కువగా ఉండడం దేశానికి కలిసివస్తున్న మరో అంశం. దీనిని మరింత వ్యూహాత్మకంగా వినియోగించుకోవాల్సి ఉంది. ► విధానపరమైన అంశాల్లో కొన్నింటికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. బ్యాంకుల మొండిబకాయిల సమస్య పరిష్కారం, కంపెనీ బ్యాలెన్స్ షీట్స్ పరిస్థితుల మెరుగునకు చర్యలు, కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో ద్రవ్యోల్బణం కట్టుతప్పకుండా చూడ్డం, అలాగే కార్మిక, భూ సంస్కరణల చర్యలు, వ్యాపార నిర్వహణా అంశాలను మరింత సులభతరం చేయడం ఇందులో ఉన్నాయి. ► వచ్చే నెల్లో ప్రపంచబ్యాంక్, ఐఎంఎఫ్ స్ప్రింగ్ సమావేశాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా వరల్డ్ ఎకనమిక్ అవుట్‌లుక్ (డబ్ల్యూఈఓ) సర్వే నివేదిక విడుదలకానుంది. ఈ నివేదికలో భారత్ ఆర్థిక వ్యవస్థ గురించి మరిన్ని అంశాలు వెల్లడికానున్నాయి. ప్రస్తుతం ఐఎంఎఫ్ చీఫ్ ఎకనమిస్ట్‌గా ఉన్న ఇండియన్ అమెరికన్ ఎకనమిస్ట్ గీతా గోపీనాథ్ నేతృత్వంలో ఈ నివేదిక రూపొందుతుండడం గమనార్హం. వృద్ధి అంచనాల కోత: ఫిచ్ ► మందగమన ఆర్థిక పరిస్థితులు నెలకొన్నాయని రేటింగ్ దిగ్గజం ఫిచ్ పేర్కొంది. ఈ నేపథ్యంలో వృద్ధి అంచనాలకు కోత పెడుతున్నట్లూ తన అవుట్‌లుక్‌లో తెలిపింది. ముఖ్యాంశాలు చూస్తే... ► మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి 7.2 శాతంగా తొలుత అంచనావేయడం జరిగింది. దీనిని 6.9 శాతానికి తగ్గిస్తున్నాం. కేంద్ర గణాంకాల కార్యాలయం అంచనాలకన్నా (7 శాతం) ఈ రేటు తక్కువగా ఉండడం గమనార్హం. ►అలాగే 2019–2020 ఆర్థిక సంవత్సరం వృద్ధి అంచనాలను 7 శాతంనుంచి 6.8 శాతానికి కోత. అయితే 2020–21ల్లో ఈ రేటు 7.1 శాతానికి పెరిగే వీలుంది. (2017–18లో భారత్ వృద్ధి రేటు 7.2 శాతం) ► తక్షణం వృద్ధి తగ్గిపోవడానికి తయారీ రంగంలో క్రియాశీలత లేకపోవడం కారణం. వ్యవసాయ రంగమూ పేలవంగానే ఉంది. దేశీయ అంశాలే దీనికి ప్రధాన కారణంగా పేర్కొనవచ్చు. ► రుణ లభ్యత దేశంలో తగ్గింది. రుణం కోసం బ్యాంకింగ్యేతర ఆర్థిక సంస్థలపై ఆధారపడాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆటోలు, ద్విచక్ర వాహనరంగాలు తీవ్ర ప్రతికూలతలను ఎదుర్కొంటున్నాయి. ► ఇక ఆహార ఉత్పత్తుల ధరలు తగ్గడం రైతుల ఆదాయాలపై ప్రతికూల ప్రభావం చూపింది. ► డాలర్ మారకంలో రూపాయిది బలహీన బాటే. 2018 డిసెంబర్లో ఇది 69.82గా ఉండవచ్చు. 2019 డిసెంబర్ నాటికి 72, 2020 డిసెంబర్‌కు 73ను తాకే అవకాశం ఉంది. ► ద్రవ్య, పరపతి విధానాలు వృద్ధికి స్నేహపూర్వకమైనవిగా ఉన్నాయి. వడ్డీరేట్ల విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సరళతర విధానాలను అనుసరించే వీలుంది. 2019లో మరో పావుశాతం రెపో (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 6.50 శాతం) తగ్గే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణం కట్టడిలో ఉండడం, అంతర్జాతీయంగా సరళతర ద్రవ్య పరిస్థితులు ఈ అంచనాలకు కారణం. ► 2019లో చమురు ధరలు బ్యారల్‌కు సగటున 65 డాలర్లుగా ఉంటాయి. 2020లో 62.5 డాలర్లుగా ఉండే వీలుంది. 2018లో ఈ ధర 71.6 డాలర్లు. ప్రపంచ వృద్ధి అంచనాలకూ కోత... 2018, 2019లో ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు 3.3 శాతం, 3.1 శాతంగా ఉండే అవకాశం ఉందన్న తొలి అంచనాలను వరుసగా 3.2 శాతం, 2.8 శాతానికి ఫిచ్ తగ్గించింది. చైనా వృద్ధి రేట్లు 2018, 2019ల్లో 6.6 శాతం, 6.1 శాతంగా ఉంటాయి. -
పనీపాటా లేని కుర్రకారు ఇక్కడే ఎక్కువ
న్యూఢిల్లీ: యువత ఎలాంటి పనీ లేకుండా ఖాళీగా ఉండటం భారత్‌లోనే అధికమని ఐఎమ్ఎఫ్ సీనియర్ ఆర్థిక వేత్త జాన్ బ్లూడోర్న్ పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలతో పోలిస్తే భారత్‌లోనే అధిక యువ జనం పనీపాటా లేకుండా ఉంటారని, ఏ పనీ లేకుండా ఖాళీగా ఉండే వారి సంఖ్య ఇక్కడ 30 శాతంగా ఉందని వివరించారు. బ్రూకింగ్స్ ఇండియా నిర్వహించిన సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని లేబర్ మార్కెట్లలో లింగ అసమానత్వం, టెక్నాలజీల మార్పు, ఉద్యోగ నాణ్యత అధ్వానంగా ఉండటం వంటి సమస్యలు ఉన్నట్లు చెప్పారాయన. టెక్నాలజీ మార్పులు, ఆటోమేషన్ సమస్యల ప్రభావం అభివృద్ధి చెందుతున్న దేశాల కంటే అభివృద్ధి చెందిన దేశాలపైనే అధికమన్నారు. కాగా భారత్‌లో గత నెలలో నిరుద్యోగం 7.2 శాతానికి పెరిగిందని ముంబైకి చెందిన సీఎమ్ఐఈ ఇటీవలే వెల్లడించింది. 2017లో భారత్‌లో నిరుద్యోగం 45 ఏళ్ల గరిష్ట స్థాయి, 6.1 శాతానికి చేరిందని ఎన్ఎస్ఎస్ఓ ముసాయిదా నివేదిక పేర్కొంది. -
ఆర్థిక వృద్ధి.. అంతకు మించి!
దావోస్: అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ, భారత్ మాత్రం ఈ ఆర్థిక సంవత్సరంలో 7.5 శాతం వృద్ధి సాధిస్తుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) అంచనా వేసినట్లు నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ వ్యాఖ్యానించారు. ఇది భారత్ సత్తాకు నిదర్శనమంటూ... తాము అంతకు మించిన ఆర్థిక వృద్ధిని సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇక్కడ జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో(డబ్ల్యూఈఎఫ్) మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పట్టణీకరణే కీలకం... భవిష్యత్తులో ఆర్థిక వృద్ధికి పట్టణీకరణ జోరే కీలకమని కాంత్ వివరించారు. వంద స్మార్ట్ సిటీల అభివృద్ధి జరుగుతోందని, ఇది పట్టణీకరణ జోరును మరింతగా పెంచగలదని పేర్కొన్నారు. ‘‘ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. మౌలిక సదుపాయాల కల్పన వేగవంతమైంది. సంస్కరణలు కొనసాగుతున్నాయి. దీంతో వృద్ధి మరింత జోరందుకుంటుంది. మరోవైపు ద్రవ్యోల్బ ణం, ద్రవ్యలోటు వంటి ఆర్థిక అంశాలు నియంత్రణలోనే ఉన్నాయి’’ అని ఆయన వివరించారు. వినియోగదారుడికే అగ్ర పీఠం... టెక్నాలజీ కారణంగా సరైన ఉత్పత్తులను, సేవలను వినియోగదారులకు అందించగలమని బజాజ్ ఫిన్సర్వ్ చీఫ్ సంజీవ్ బజాజ్ తెలిపారు. వినియోగదారుడికే అగ్రపీఠం అనే విధానాన్ని తాము అనుసరిస్తామని చెప్పారు. టెక్నాలజీని సరిగ్గా వినియోగించుకోవడం వల్లే వినియోగదారులకు తక్షణం రుణాలందించగలుగుతున్నామని తెలిపారు. చేయాల్సింది ఎంతో ఉంది... భారత్, చైనాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై మరింత ప్రభావం చూపడం మొదలైందని జర్మనీ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్ చెప్పారు. అంతర్జాతీయ సంస్థలు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొన్నారు. అమెరికా వంటి దేశాలు తమ స్వప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్నాయని.. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ బాగా పాడైందని, దీనిని బాగుకోసం చాలా చేయాల్సింది ఉందన్నారు. అమెరికా, చైనా, భారత్‌లు ముందుండాలి: జపాన్ ప్రధాని షింజో అబె ప్రపంచ వాణిజ్య వ్యవస్థపై మళ్లీ విశ్వాసం పెరిగేలా చూడాలని ప్రపంచ దేశాల నాయకులను జపాన్ ప్రధాన మంత్రి షింజో అబె కోరారు. ప్రపంచ వాణిజ్య సంస్థకు (డబ్ల్యూటీఓ) కొత్త జవసత్వాలు కల్పించడానికి అమెరికా, చైనా, భారత్ కృషి చేయాలని కోరారాయన. పెరిగిపోతున్న వృద్ధ జనాభా సమస్యను ఉమెనామిక్స్ (మహిళలకు ఎక్కువ అవకాశాలు కల్పించడం) ద్వారా అధిగమించామని, ఓటమినే ఓడించామని పేర్కొన్నారు. తమ దేశంలో 65 ఏళ్ల వ్యక్తులు కూడా పనిచేయడానికి ముందుకు వస్తారని, వంద మంది కాలేజీ పట్టభద్రులు ఉద్యోగాలు చేయడానికి సిద్ధంగా ఉంటే, 98 మందికి ఉద్యోగాలు లభిస్తాయని వెల్లడించారు. మిత్రులతో వ్యాపారం వద్దు: జాక్ మా వ్యాపార వీరులు పోటీ గురించి, ఒత్తిడి గురించి అస్సలు ఆలోచించరని చైనా ఆన్లైన్ దిగ్గజం ఆలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా వ్యాఖ్యానించారు. పిల్లలు సృజనాత్మకంగా, వినూత్నంగా ఆలోచించేలా చూడాలని, యంత్రాల మాదిరిగా వాళ్లు తయారు కాకూడదని పేర్కొన్నారు. భవిష్యత్తులో యంత్రాలకు చిప్‌లుంటాయని, కానీ మానవులకు హృదయం ఉంటుందని, ఈ దిశలో విద్యావిధానాలు ఉండాలని సూచించారు. పర్యావరణ హితంగా టెక్నాలజీ ఉండాలన్నారు. వ్యాపారం కంటే స్నేహం విలువైనదని, మీ మిత్రులను ఎప్పుడూ వ్యాపారంలో కలుపుకోవద్దని ఆయన సలహా ఇచ్చారు. -
ఐఎంఎఫ్ బాధ్యతలు స్వీకరించిన గీతా గోపీనాథ్
వాషింగ్టన్: అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) చీఫ్ ఎకనమిస్టుగా ప్రముఖ ప్రవాస భారతీయ ఆర్థికవేత్త గీతా గోపీనాథ్ (47) బాధ్యతలు చేపట్టారు. ఆమె ఈ పదవిలో నియమితులైన తొలి మహిళ కావడం విశేషం. అమెరికా పౌరసత్వం ఉన్న గీతా గోపీనాథ్.. హార్వర్డ్ వర్సిటీలో ఇంటర్నేషనల్ స్టడీస్ అండ్ ఎకనమిక్స్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. డిసెంబర్ 31న పదవీ విరమణ చేసిన ఐఎంఎఫ్ రీసెర్చ్ విభాగం ఎకనమిక్ కౌన్సిలర్, డైరెక్టర్ మారిస్ ఆబ్స్‌ఫెల్డ్ స్థానంలో ఆమె నియమితులయ్యారు. గతేడాది అక్టోబర్ 1న గీతా గోపీనాథ్ నియామకాన్ని ఐఎంఎఫ్ ఎండీ క్రిస్టీన్ లగార్డ్ ప్రకటించారు. గీతా గోపీనాథ్ ప్రపంచంలోనే అత్యుత్తమమైన ఆర్థికవేత్తల్లో ఒకరని లగార్డ్ కితాబిచ్చారు. బహుళజాతి సంస్థలు పెను సవాళ్లు ఎదుర్కొంటుండటం, ప్రపంచ దేశాలు గ్లోబలైజేషన్ను పక్కనపెట్టి దేశీయ అంశాలకే ప్రాధాన్యమిస్తుండటం వంటి ధోరణులు పెరుగుతున్న తరుణంలో ఐఎంఎఫ్ చీఫ్ ఎకనమిస్టుగా గీతా గోపీనాథ్ నియామకం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రపంచ దేశాలు గ్లోబలైజేషన్ నుంచి వెనక్కి తగ్గుతుండటాన్ని నివారించడం ఐఎంఎఫ్ ముందున్న పలు ప్రధాన సవాళ్లలో ఒకటని ది హార్వర్డ్ గెజిట్‌కిచ్చిన ఇంటర్వ్యూలో గీత తెలిపారు. ‘గ్లోబలైజేషన్లో భాగంగా గడిచిన 50–60 ఏళ్లలో ప్రపంచ దేశాలు టారిఫ్‌లు తగ్గించుకోవడం, వాణిజ్యం పెంచుకోవడం వంటివి చేశాయి. కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా గ్లోబలైజేషన్ నుంచి ప్రస్తుతం వెనక్కి తగ్గుతున్నాయి. చైనా తదితర దేశాలపై అమెరికా టారిఫ్‌లు విధించడం, ఆయా దేశాలు కూడా అదే రీతిలో స్పందించడం కొన్ని నెలలుగా చూస్తున్నాం. దీంతో వాణిజ్య విధానాలపై అనిశ్చితి పెరుగుతోంది. ప్రపంచ దేశాల మధ్య వాణిజ్యం పెరగడం వల్ల అంతర్జాతీయంగా పేదరికం తగ్గినా.. దాని ప్రభావంతో అసమానతలు పెరిగిపోయాయన్న ఆందోళన ఉంది. ఇలాంటి సందేహాలను నివృత్తి చేసేందుకు తగు చర్యల అవసరం‘ అని ఆమె పేర్కొన్నారు. అమెరికా వడ్డీ రేట్లను పెంచుతుండటం వల్ల వర్ధమాన దేశాలపై పడుతున్న ప్రభావాలు, వాణిజ్యంలో డాలర్ ఆధిపత్య ప్రభావాలు మొదలైన వాటిపై అధ్యయనం చేయాల్సి ఉందన్నారు. -
2018లో 7.3... 2019లో 7.4!
వాషింగ్టన్: భారత్ 2018లో 7.3 శాతం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటును సాధిస్తుందని అంచనాలను అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) వెలువరించింది. 2019లో ఈ రేటు 7.4 శాతంగా ఉంటుందని పేర్కొంది. అయితే తాజా అంచనాలు 2018 ఏప్రిల్‌లో ఇచ్చిన అంచనాలకన్నా కొంచెం తక్కువగా ఉండడం గమనార్హం. మొత్తంగా ఈ ఏడాది ‘ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ’ హోదాను భారత్ 2018లో కైవసం చేసుకుంటుందని వివరించింది. ఈ విషయంలో చైనాకన్నా (6.6%) భారత్ వృద్ధి రేటు 0.7 శాతం అధికంగా ఉండబోతున్నట్లు పేర్కొంది. 2017లో చైనాయే టాప్..: 2017లో భారత్ వృద్ధి రేటు 6.7%గా పేర్కొంది. 6.9 శాతంతో చైనా మొదటి స్థానంలో ఉంది. అయితే 2018లో చైనా 6.6%వృద్ధి రేటునే సాధిస్తుందన్నది తాజా ఐఎంఎఫ్ అంచనా. 2019లో ఈ రేటు 6.2 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. ‘భారత్ పలు కీలక సంస్కరణలను ఇటీవల చేపట్టింది. వస్తు సేవల పన్ను, లక్ష్యానికి కట్టుబడి ఉండేలా ద్రవ్యల్బణం విధానాలు, బ్యాంకింగ్‌కు సంబంధించి దివాలా చట్టాలు, విదేశీ పెట్టుబడుల సరళీకరణలకు తీసుకుంటున్న చర్యలు ఇక్కడ ప్రస్తావించుకోవచ్చు. దేశంలో వ్యాపార పరిస్థితులను ఆయా చర్యలు మెరుగుపరుస్తున్నాయి. తగిన వృద్ధి రేటుకు ఆయా పరిస్థితులు దోహదపడుతున్నాయి’’ అని ‘వరల్డ్ ఎకనమిక్ అవుట్‌లుక్’ పేరుతో విడుదలైన నివేదికలో ఐఎంఎఫ్ పేర్కొంది. ప్రపంచ వృద్ధి అంచనాలకూ కోత... వాణిజ్య యుద్ధం, క్రూడ్ ధరల పెరుగుదల వంటి పలు సమస్యలను ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటోంది. దీనితో ప్రపంచ వృద్ధి రేటునూ 0.2 శాతం మేర ఐఎంఎఫ్ తగ్గించింది. 2018, 2019లో ఈ రేట్లు 3.7 శాతంగా ఉంటాయని అంచనావేసింది. 2017లో కూడా ఇదే ప్రపంచ వృద్ధి రేటు నమోదయ్యింది. ఇక అమెరికా 2018లో 2.9 శాతం వృద్ధి రేటును 2019లో 2.5 శాతం వృద్ధి రేటును సాధిస్తుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. -
ప్రమాదంలో 18కోట్ల మహిళా ఉద్యోగాలు
అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ షాకింగ్ న్యూస్ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 180మిలియన్ల (18కోట్లు) మహిళా ఉద్యోగాలు అత్యంత ప్రమాదంలో ఉన్నాయని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) హెచ్చరించింది. బాలీలో జరిగిన ప్రపంచ బ్యాంకు వార్షిక సమావేశాల సందర్భంగా ఐఎంఎఫ్ ఈ వ్యాఖ్యలు చేసింది. ఆటోమేషన్ లాంటి కొత్త సాంతకేతికల కారణంగా ఈ ఉద్యోగాలు ఊడిపోన్నాయని తెలిపింది 30 దేశాల్లో నిర్వహించిన అధ్యయనంలో పురుషులతో పోలిస్తే ఈ నష్టం మహిళల్లో ఎక్కువగా ఉందని తేలిందని తెలిపింది. పురుషులతో (9శాతం)పోలిస్తే మహిళలు (11శాతం) ఆటోమేషన్ ప్రభావానికి గురవుతున్నారని తెలిపింది. ఈ నేపథ్యంలో మహిళా ఉద్యోగుల్లో సంబంధిత నైపుణ్యాలను పెంచాలని గ్లోబల్ లిడర్ షిప్‌ను కోరింది. అలాగే నాయకత్వ స్థానాల్లో ఉన్నలింగ వివక్షను రూపు మాపాలని సూచించింది. మహిళల్లో కొత్త నైపుణ్యాల పెంపొందించడం ద్వారా భారత్ లాంటి దేశాల్లో ఉత్పాదక సామర్ధ్యాలను పెంచుకోవడంతోపాటు లింగ సమానత వస్తుందని తెలిపింది. డిజిటల్ యుగంలో పురోభివృద్ధికి అవసరమైన కొన్ని నైపుణ్యాలు మహిళలు తక్కువగా ఉన్నారని ఐఎంఎఫ్ అభిప్రాయపడింది. ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్స్ టెక్నాలజీ రంగాల్లో ఉద్యోగాల వృద్ధి అంచనాలున్నప్పటికీ మహిళా ప్రాతినిధ్యం తక్కువ అని తెలిపింది. అలాగే ఆటోమేషన్‌కి తక్కువ అవకాశం ఉన్న ఆరోగ్యం, విద్య, సాంఘిక సేవలు లాంటి సాంప్రదాయ రంగాల్లో మహిళలు ఉద్యోగావకాశాలు వృద్ధి చెందుతున్నాయని పేర్కొంది. గత రెండు దశాబ్దాల్లో మహిళా కార్మికుల భాగస్వామ్యాన్ని పెంచుకోవడంలో పురోగతి జరిగినా, ఇంక అసమానత భారీగానే ఉందని తన పరిశోధనా పత్రంలో పేర్కొంది. -
మోదీకి ఐఎంఎఫ్ కితాబు
ఐక్యరాజ్యసమితి : మూడు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి భంగపాటు తప్పదన్న ఒపీనియన్ పోల్స్‌తో కుదేలైన పార్టీ శ్రేణులకు అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) కొంత ఊరట కల్పించింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో చేపట్టిన ఆర్థిక సంస్కరణలను ఐఎంఎఫ్ గుర్తిస్తూ ఈ ఏడాది, వచ్చే ఏడాది సైతం భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా దూసుకుపోతుందని వ్యాఖ్యానించింది. ఇండోనేషియాలోని బాలిలో జరగనున్న ఐఎంఎఫ్ వార్షిక భేటీకి ముందు విడుదల చేసిన వరల్డ్ ఎకనమిక్ అవుట్‌లుక్ (డబ్ల్యూఈఓ) నివేదికలో మోదీ సర్కార్‌పై ప్రశంసలు గుప్పించింది. ఇటీవల భారత్‌లో జీఎస్టీ, దివాలా చట్టం, విదేశీ పెట్టుబడుల సరళీకరణకు చర్యలు వంటి కీలక సంస్కరణలు చేపట్టడంతో భారత్‌లో వ్యాపారం సులభతరమైందని వ్యాఖ్యానించింది. పెరుగుతున్న ముడిచమురు ధరలు, అంతర్జాతీయ ఆర్థిక మందగమనంతో వచ్చే ఏడాది భారత ఆర్థిక వృద్ధి రేటును 0.1 శాతం మేర తగ్గించి 7.4 శాతంగా ఐఎంఎఫ్ అంచనా వేసింది. ఈ స్ధాయి వృద్ధి రేటు సైతం ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన వృద్ధి రేటు కావడం గమనార్హం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు 7.3 శాతంగా ఐఎంఎఫ్ పేర్కొంది. నోట్ల రద్దు, జీఎస్టీ నుంచి భారత్ ఆర్థిక వ్యవస్థ కోలుకుని భారీ వృద్ధిరేట్ల దిశగా అడుగులు వేస్తోందని డబ్ల్యూఈఓ నివేదిక పేర్కొంది. 2019 తర్వాత భారత్ 7.75 శాతం వృద్ధి రేటును నిలకడగా సాధించే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇక ఈ ఏడాది చైనా వృద్ధిరేటు 6.6 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. -
సంస్కరణలను కొనసాగించాల్సిందే
వాషింగ్టన్: సంస్కరణల మార్గం తప్పుతున్న దేశాలను అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) బుధవారం హెచ్చరించింది. దీనివల్ల అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో భద్రత తగ్గుతుందని, స్థిరత్వం అపాయంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. అంతర్జాతీయంగా దేశాలు పరస్పర సహకారంతో సంస్కరణలను తప్పనిసరిగా కొనసాగించాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది. అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం తర్వాత పదేళ్ల కాలంలో సంస్కరణల తీరు, భవిష్యత్తుకు సంబంధించి ఓ నివేదికను ఐఎంఎఫ్ విడుదల చేసింది. అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం అనంతరం 10 ఏళ్ల కాలంలో ప్రగతి స్పష్టంగా ఉందంటూ, సంస్కరణల ఎంజెడా తప్పనిసరిగా పూర్తి చేయాల్సిన అవసరం ఉందని సూచించింది. సంస్కరణలను ఉపసంహరించుకుంటే, రెగ్యులేటరీ ఆర్బిట్రేజ్ అవకాశాలు తగ్గిపోతాయని పేర్కొంది. ఇది నియంత్రణ, పర్యవేక్షణ మరింత పడిపోయేందుకు దారితీస్తుందని అభిప్రాయపడింది. సైబర్ సెక్యూరిటీ రిస్క్ పెరగడం వల్ల ఆర్థిక సంస్థలకు సవాళ్లు పొంచి ఉన్నాయని... ఈ విషయంలో నియంత్రణ, పర్యవేక్షణ సంస్థలు సదా అప్రమత్తంగా ఉండి, అవసరమైతే చర్యలు తీసుకోవాలని ఐఎంఎఫ్ సూచించింది. -
ఐఎంఎఫ్ ప్రధాన ఆర్థికవేత్తగా గీతా గోపీనాథ్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) ప్రధాన ఆర్థిక వేత్తగా భారత సంతతికి చెందిన గీతా గోపీనాథ్ నియమితులయ్యారు. ఈ ఏడాది చివర్లో రిటైరవుతున్న మౌరిస్ ఓస్ట్‌ఫెల్డ్ స్థానంలో ఆమె పదవీ బాధ్యతలు స్వీకరిస్తారని ఐఎమ్ఎఫ్ సోమవారం ఒక ట్వీట్ ద్వారా తెలియజేసింది. భారత్‌లో పుట్టి, పెరిగిన గీతా... ప్రస్తుతం హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి పట్టభద్రురాలైన ఆమె ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, వాషింగ్టన్ యూనివర్సిటీల నుంచి ఎమ్ఏ డిగ్రీలు సాధించారు. 2001లో ప్రిన్స్టన్ యూనివర్సిటీ నుంచి పీ.హెచ్డీ పట్టా పొందారు. 2016లో ఆమె కేరళ సీఎం పినరయి విజయన్‌కు ఆర్థిక సలహాదారుగా నియమితులయ్యారు. ఈ నియామకం వివాదాస్పదమైంది. మార్కెట్, ఉదారవాద విధానాలకు ప్రాధాన్యత ఇచ్చే ఆమెను ఆర్థిక సలహాదారుగా నియమించడాన్ని కొందరు కమ్యూనిస్టు నాయకులు తప్పుపట్టారు. కాగా ఆమె వివిధ ఆర్థికాంశాలపై 40 వరకూ పరిశోధన పత్రాలను సమర్పించారు. -
జీఎస్టీని సరళీకరించాలి: ఐఎంఎఫ్
-
జీఎస్టీని సరళీకరించాలి: ఐఎంఎఫ్
వాషింగ్టన్: సంక్లిష్టమైన జీఎస్టీ రేట్లను పాటించడంలోనూ, అమలు చేయడంలోనూ వ్యయాల భారం భారీగా పెరిగే అవకాశం ఉందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో వస్తు, సేవల పన్నుల (జీఎస్టీ) రేట్లను సరళతరం చేయాల్సిన అవసరం ఉందని.. రెండు రేట్ల విధానంతో అధిక ప్రయోజనాలుంటాయని పేర్కొంది. భారతపై రూపొందించిన వార్షిక నివేదికలో ఐఎంఎఫ్ ఈ అంశాలు ప్రస్తావించింది. 2017 జూలై 1 నుంచి జీఎస్టీ అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. భారత్ పన్ను సంస్కరణల్లో జీఎస్టీ ఒక ’మైలురాయి’ లాంటిదని ఐఎంఎఫ్ అభివర్ణించింది. ‘అయితే, పలు శ్లాబులు, మినహాయింపులు మొదలైన వాటితో దీని స్వరూపం సంక్లిష్టంగా ఉంది. రెండు రేట్ల విధానంతో.. పురోగామి స్వభావాన్ని త్యాగం చేయకుండానే అధిక ప్రయోజనాలు పొందేలా దీన్ని సరళతరం చేయొచ్చు‘ అని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి రేటు 7.3 శాతంగాను, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 7.5 శాతంగాను ఉండొచ్చని ఐఎంఎఫ్ అంచనా వేసింది. -
10 లక్షల శాతం పెరిగిన ఆ దేశ ద్రవ్యోల్బణం
లాటిన్ అమెరికా దేశం వెనిజులా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. అక్కడ ఆకలి కేకలు ప్రపంచమంతా మారు మోగిపోతున్నాయి. పెట్రోల్ ఉత్పత్తులు ధరలు క్రాష్ కావడంతో మొదలైన సంక్షోభం, అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ వచ్చాక మరింత ఎక్కువైంది. సామాన్యుడికి అందుబాటులో లేని ధరలతో... జనాలకు సరిగా తిండి లేకుండా పోయింది. ఒక్క బ్రెడ్ కోసం గంటల తరబడి క్యూలైన్లు కడుతున్నారు. ప్రస్తుతం వెనిజులా ఇంతటి దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఆ దేశ ద్రవ్యోల్బణ రేటు కూడా పది శాతం, వంద శాతం, రెండొందల శాతం కాకుండా... ఏకంగా 10 లక్షల శాతం మేర పెరిగిపోతుందట. 2018లో వెనిజులా ద్రవ్యోల్బణం 10 లక్షల శాతాన్ని తాకే అవకాశముందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ వెల్లడించింది. ఈ అధునాతన చరిత్రలో అత్యంత హీనాతిహీనమైన ద్రవ్యోల్బణ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న దేశం వెనిజులానే అని తన అధికారిక ప్రకటనలో తెలిపింది. 2014లో ఆయిల్ ధరలు క్రాష్ అవడంతో మొదలైన పతనం, అలా కొనసాగుతూనే ఉందని, వెనిజులానే కుప్పకూలేలా చేసిందని పేర్కొంది. ధరల పెంపుదలను, సౌమ్యవాద వ్యవస్థనువెనిజులా నియంత్రించలేకపోతుందని చెప్పింది. ‘1923లో జర్మనీ, 2000లో జింబాబ్వే ఎదుర్కొన్న మాదిరిగా వెనిజులా ప్రస్తుత పరిస్థితి ఉంది. దీని ద్రవ్యోల్బణం 2018 చివరి నాటికి 10 లక్షల మేర పెరిగే అవకాశముందని అంచనావేస్తున్నాం‘ అని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ పశ్చిమ అర్థగోళ విభాగపు డైరెక్టర్ అలెజాండ్రో వెర్నర్ ఏజెన్సీ బ్లాగ్ పోస్టులో పేర్కొన్నారు. అయితే ఐఎంఎఫ్ అంచనాలపై వెనిజులా సమాచార మంత్రిత్వ శాఖ ఇంకా స్పందించలేదు. ఈ ఏడాది వినియోగదారుల ధరలు 46,305 శాతం పెరిగాయి. వాషింగ్టన్ మద్దతుతో వ్యతిరేక వ్యాపారులు నిర్వహించే ఆర్థిక యుద్ధానికి వెనిజులా బలైపోయిందని ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో చెప్పారు. అయితే దీనికంతటికీ కారణం, అధికార నాయకులు తీసుకునే చెత్త పాలసీ నిర్ణయాలేనని ప్రత్యర్థులూ విమర్శిస్తున్నారు. నగదు సరఫరా విస్తరణను పరిశీలించకపోవడం, కరెన్సీని నియంత్రించలేకపోవడం, ముడి పదార్థాలను, మెషిన్ పార్ట్‌లను దిగుమతి చేసుకోలేకపోవడమే దీనికి కారణమని కూడా పేర్కొంటున్నారు. -
భారత్ : అంచనాలకు కోత అయినా టాప్‌లోనే..
న్యూఢిల్లీ : పెరుగుతున్న క్రూడ్ ఆయిల్ ధరలు, ఆందోళన పరుస్తున్న డాలర్-రూపాయి ఎక్స్చేంజ్ రేటు, ద్రవ్యోల్బణం దెబ్బకు కఠినతరమవుతున్న మానిటరీ పాలసీ ఇవ్వన్నీ దేశీయ వృద్ధి అంచనాలకు కోత పెడుతున్నాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ(ఐఎంఎఫ్) తాజాగా అప్డేట్ చేసిన వరల్డ్ ఎకానమిక్ అవుట్‌లుక్‌లో, దేశీయ వృద్ధి అంచనాలకు కోత పెట్టింది. 2018లో దేశీయ వృద్ధి అంచనాలను 10 బేసిస్ పాయింట్లు తగ్గించి, 7.3 శాతంగా ఉండనున్నట్టు తెలిపింది. అదేవిధంగా 2019లో వృద్ది అంచనాలను సైతం 30 బేసిస్ పాయింట్లు తగ్గించి 7.5 శాతం నమోదవబోతున్నట్టు పేర్కొంది. అంతకముందు ఇవి 2018లో 7.4 శాతం, 2019లో 7.8 శాతంగా ఉండనున్నట్టు ఐఎంఎఫ్ అంచనావేసింది. అయితే ఐఎంఎఫ్ వృద్ధి అంచనాలను తగ్గించినప్పటికీ, భారత్ అత్యంత వేగవంతంగా ఆర్థిక వ్యవస్థగానే ఉందని తెలిపింది. చైనా ఆర్థిక వ్యవస్థ రేటు ఈ ఏడాది 6.6 శాతం, వచ్చే ఏడాది 6.4 శాతంగానే ఉండనున్నట్టు పేర్కొంది. ఎన్నికల ఏడాదిలో భారత వృద్ధి స్టోరీ ప్రపంచ దేశాలకు పోటీగా ఉంటుందని, ఈ ఏడాది ప్రపంచ వృద్ధి 3.9 శాతంగా ఉండబోతున్నట్టు అంచనా వేసింది. ‘వరల్డ్ ఎకనామిక్ అవుట్‌లుక్‌లో భారత్ వృద్ధి అంచనాలను 2018, 2019ల్లో 0.1 శాతం, 0.3 శాతం చొప్పున తగ్గించాం. దేశీయంగా పెరుగుతున్న డిమాండ్‌తో ఆయిల్ ధరలు పెరగడం, ద్రవ్యోల్బణం దెబ్బకు అంచనాల కంటే కఠినతరంగా మానిటరీ పాలసీని రూపొందించడం ఇవన్నీ భారత్ వృద్ధి అంచనాలపై ప్రభావం చూపాయి’ అని తన ఐఎంఎఫ్ అప్డేట్లో పేర్కొంది. కాగ, గతవారం ప్రపంచ బ్యాంక్ విడుదల చేసిన రిపోర్టులో భారత్, ఫ్రాన్స్‌ను అధిగమించి ప్రపంచంలో ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించినట్టు తెలిసిన సంగతి తెలిసిందే. కాగ, ద్రవ్యోల్బణం పెరుగుతుందనే అంచనాలతో గత నాలుగున్నరేళ్లలో మొదటిసారి సెంట్రల్ బ్యాంక్ ఆర్బీఐ తన మానిటరీ పాలసీలో రెపో రేటును పెంచుతున్నట్టు ప్రకటించింది. 25 బేసిస్ పాయింట్లు పెంచి, రెపో రేటును 6.25 శాతంగా నిర్ణయించింది. ఆర్బీఐ భయపడిన విధంగానే టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం ఎన్నడు లేనంతగా 5.77 శాతానికి ఎగిసింది. ఈ ద్రవ్యోల్బణ భయాలతోనే అర్జెంటీనా, భారత్, ఇండోనేషియా, మెక్సికో, టర్కీ లాంటి ఎమర్జింగ్ మార్కెట్ ఎకానమీల సెంట్రల్ బ్యాంక్‌లు కూడా తమ పాలసీ రేట్లను పెంచాయి. -
విదేశీ నిల్వలు ఎక్కువగా ఉన్న దేశాలివే!
విదేశీ నిల్వలు.. ఇవి లేక కొన్నిసార్లు కుప్పకూలుతున్న ఆర్థిక వ్యవస్థలను కాపాడుకోలేని పరిస్థితులు చూసుంటాం. ఇవి దేశీయ కరెన్సీకి ఇచ్చే మద్దతు అంతా ఇంతా కాదు. ప్రపంచంలో ఒక ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడంలో వీటి పాత్ర చాలా కీలకం. దేశంలో ఎమర్జెన్సీ పరిస్థితులు నెలకొనప్పుడు విదేశీ నిల్వలుంటే చాలు, ఎలాగోఅలా గట్టెక్కే అవకాశాలుంటాయి. తాజాగా అంతర్జాతీయ ద్రవ్య సంస్థ ఓ డేటా రూపొందించింది. దీనిలో ఏ దేశంలో విదేశీ నిల్వలు అధికంగా ఉన్నాయో వెల్లడించింది. ఈ జాబితాలో చైనా టాప్‌లో ఉందట. 3.2 ట్రిలియన్ డాలర్ల రిజర్వులతో విదేశీ నిల్వల్లో చైనా అగ్రస్థానంలో ఉన్నట్టు పేర్కొంది. ఐఎంఎఫ్ డేటా ప్రకారం హోమ్మచ్.నెట్ లో పొందుపరిచిన జాబితా ఈ విధంగా ఉంది. ర్యాంకు దేశం విదేశీ నిల్వలు 1 చైనా 3,161.5 బిలియన్ డాలర్లు 2 జపాన్ 1,204.7 బిలియన్ డాలర్లు 3 స్విట్జర్లాండ్ 785.7 బిలియన్ డాలర్లు 4 సౌదీ అరేబియా 486.6 బిలియన్ డాలర్లు 5 హాంకాంగ్ 437.5 బిలియన్ డాలర్లు 6 భారత్ 397.2 బిలియన్ డాలర్లు 7 దక్షిణ కొరియా 385.3 బిలియన్ డాలర్లు 8 బ్రెజిల్ 358.3 బిలియన్ డాలర్లు 9 రష్యా 356.5 బిలియన్ డాలర్లు 10 సింగపూర్ 279.8 బిలియన్ డాలర్లు ఈ జాబితాలో అత్యంత కీలకమైన ఆర్థిక వ్యవస్థలు అమెరికా, యూరప్ దేశాలు లాంటి దేశాలను పరిగణలోకి తీసుకోలేదు. ఎందుకంటే అమెరికా డాలర్‌ను, యూరోను అంతర్జాతీయ లావాదేవీల్లో అత్యంత సాధారణ రిజర్వు కరెన్సీలుగా పరిగణించడమే దీనికి గల కారణం. దీంతో అమెరికా లాంటి దేశాలు ఎక్కువ రిజర్వులను కలిగి ఉండాల్సినవసరం లేదు. సెంట్రల్ బ్యాంకులు ఏ విదేశీ కరెన్సీని ఎక్కువగా కలిగి ఉన్నాయి.... ర్యాంక్ రిజర్వు కరెన్సీ గ్లోబల్ హోల్డింగ్స్ 1 అమెరికా డాలర్ 63.5 శాతం 2 యూరో 20.0 శాతం 3 జపనీస్ యెన్ 4.5 శాతం 4 బ్రిటీష్ పౌండ్ 4.5 శాతం 5 కెనడియన్ డాలర్ 2.0 శాతం 6 ఆస్సి డాలర్ 1.8 శాతం 7 చైనీస్ యువాన్ 1.1 శాతం 8 ఇతర కరెన్సీ 2.6 శాతం విదేశీ కరెన్సీ నిల్వలు ఎందుకు అవసరం ? విదేశీ నిల్వలు తమ దేశీయ కరెన్సీ విలువను ఒక స్థిర రేటు వద్ద నిర్వహించడానికి ఆ దేశానికి అనుమతిస్తాయి. ఆర్థిక సంక్షోభ సమయంలో లిక్విడిటీని నిర్వహించడానికి విదేశీ నిల్వలు సహకరిస్తాయి. విదేశీ పెట్టుబడిదారులకు ఈ రిజర్వులు నమ్మకాన్ని కల్పిస్తాయి. వారి పెట్టుబడులను కాపాడేందుకు సెంట్రల్ బ్యాంకు ఎప్పడికప్పుడు చర్యలు తీసుకుంటూ ఉంటుంది. బాహ్య చెల్లింపు బాధ్యతల కోసం విదేశీ కరెన్సీ నిల్వలు దేశానికి అదనపు బీమాగా ఉంటాయి మౌలిక సదుపాయాలు వంటి పలు రంగాలకు నిధులు ఇవ్వడానికి విదేశీ నిల్వలు ఉపయోగపడతాయి మొత్తంగా పోర్టుఫోలియోలో ప్రమాదకర పరిస్థితులను తగ్గించుకోవడం కోసం సెంట్రల్ బ్యాంకులకు ఇవి ఎంతో సహకరిస్తాయి. -
వృద్ధి స్థిరత్వానికి మూడు చర్యలు
వాషింగ్టన్: భారత్ అధిక వృద్ధి రేటు పటిష్టతకు అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) సంస్థ మూడు సూచనలు చేసింది. 15 రోజులకు ఒకసారి నిర్వహించే విలేకరుల సమావేశంలో శుక్రవారం ఐఎంఎఫ్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ గ్యారీ రైస్ మాట్లాడుతూ చేసిన మూడు సూచనలనూ పరిశీలిస్తే... ♦ బ్యాంకింగ్ రంగ సంస్కరణలను కొనసాగించాలి. దీనితోపాటు మొండిబకాయిల సమస్య పరిష్కారం తక్షణ ప్రాధాన్యతాంశం. దీనివల్ల రుణ వృద్ధి క్రెడిట్ ప్రొవిజనింగ్ సామర్థ్యం పెరుగుతుంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పాలనా వ్యవహారాల పటిష్టత కూడా ముఖ్యం. ♦ ప్రభుత్వ ఆదాయ–వ్యయాల మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు లక్ష్యాలను తప్పకూడదు.ఈ విషయంలో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ను సరళీకరించాలి. ♦ కార్మిక, భూ వ్యవహారాలకు సంబంధించి కీలక మార్కెట్లలో సంస్కరణలు ముఖ్యం. దీనితోపాటు వ్యాపార సానుకూల పరిస్థితులు పెరగాలి. -
భారత వృద్ధి రేటు ఈ ఏడాది 7.4 శాతం
వాషింగ్టన్: భారత్ ఈ ఏడాది వృద్ధి రేటులో చైనాను వెనక్కి నెట్టేస్తుందని, 7.4% చొప్పున వృద్ధి చెందుతుందని, వచ్చే ఏడాది వృద్ధి రేటు 7.8 శాతానికి చేరుకుంటుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనా వేసింది. పొరుగున్న ఉన్న చైనా వృద్ధి రేటు మాత్రం ఇదే కాలంలో 6.6%, 6.4%గానే ఉంటుందని ఐఎంఎఫ్ తెలిపింది. 2017 రెండో త్రైమాసికంలో వృద్ధి రేటు బాగా తగ్గిన అనంతరం పుంజుకోవడం మొదలైందని, 2018, 2019 సంవత్సరాల్లో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ ప్రస్థానం కొనసాగుతుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. ఈ మేరకు ప్రపంచ ఆర్థిక రంగంపై తాజా అంచనాలను వెలువరించింది. డీమోనిటైజేషన్, జీఎస్టీ వంటి విధానాల ఫలితంగా 2017లో మన దేశ జీడీపీ వృద్ధి రేటు 6.7%కి పడిపోయిన విషయం విదితమే. అదే ఏడాది చైనా ఆర్థిక వృద్ధి రేటు 6.9%కి చేరుకోవడంతో భారత్‌ను వెనక్కి నెట్టేసింది. అంతకు ముందు వరకు మన దేశమే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఉంది. స్వల్పకాలంలో వృద్ధి రేటు పెరుగుదలకు డీమోనిటైజేషన్, జీఎస్టీ అమలు ప్రభావాల నుంచి బయటకు రావడం, ప్రైవేటు వినియోగం బలంగా ఉండడం వంటివి సానుకూలతలుగా ఐఎంఎఫ్ పేర్కొంది. జీఎస్టీ కారణంగా వాణిజ్య పరమైన అడ్డంకులు తొలగి, సమర్థత పెరుగుతుందని, పన్ను వసూళ్లు అధికమవుతాయని అంచనా వేసింది. మధ్య కాలానికి కూడా భారత వృద్ధి రేటు బలంగానే ఉంటుందని పేర్కొంటూనే, సమగ్రాభివృద్ధి అనే సవాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపింది. పెట్టుబడులపై రుణభారం కార్పొరేట్ కంపెనీలు అధిక రుణ భారాన్ని మోస్తుండడం, బ్యాంకింగ్ రంగంలో మొండిబకాయిల సమస్యలు భారత్‌లో పెట్టుబడులపై ప్రభావం చూపించొచ్చని ఐఎంఎఫ్ పేర్కొంది. పీఎన్బీ స్కామ్‌ను ఈ సందర్భంగా ప్రస్తావించింది. చాలా వరకు వర్ధమాన దేశాల్లో బ్యాలన్స్షీట్లపై ఒత్తిళ్ల వల్ల మధ్యకాలంలో వృద్ధితగ్గిపోయే రిస్క్ ఉందని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో విధానపరమైన చర్యలు అవసరమని నివేదికలో సూచించింది. బ్యాంకుల రుణాల రికవరీ యంత్రాంగం మరింత వేగం సంతరించుకోవాలని, ప్రభుత్వం ప్రకటించిన రీక్యాపిటలైజేషన్ వృద్ధికి తోడ్పడుతుందని అంచనా వేసింది. -
నోట్ల రద్దు సమస్యల నుంచి భారత్ గట్టెక్కుతోంది
వాషింగ్టన్: నోట్ల రద్దు(డీమోనిటైజేషన్), వస్తు–సేవల పన్ను(జీఎస్టీ) సమస్యల నుంచి భారత్ ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోందని అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) పేర్కొంది. అయితే, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ వ్యవస్థల సామర్థ్యాన్ని పెంచడం... విద్య, వైద్యం వంటి రంగాల్లో ప్రభుత్వం సంస్కరణలను తీసుకురావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. ‘గడిచిన కొన్నేళ్లలో భారత్ ఎకానమీ పటిష్ట వృద్ధిని సాధిస్తోంది. సరఫరా సంబంధ అడ్డంకులను తొలగించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు, నిర్మాణాత్మక సంస్కరణలు, స్థూల ఆర్థిక విధానాలే దీనికి కారణం. అయితే, జీఎస్టీ, నోట్ల రద్దు కారణంగా వృద్ధి మందగించింది. ఇప్పుడు మళ్లీ ఈ ప్రభావం నుంచి గట్టెక్కడంతో డిసెంబర్ కార్టర్లో జీడీపీ వృద్ధి 7.2 శాతానికి ఎగబాకింది. ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ స్థానాన్ని తిరిగి సంపాదించుకోగలిగింది’ అని ఐఎంఎఫ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్తావో ఝాంగ్ చెప్పారు. ఈ నెలలోనే భారత్ పర్యటనకు రానున్న నేపథ్యంలో పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ అంశాలను పేర్కొన్నారు. ‘రానున్న కాలంలో ముఖ్యంగా విద్య, వైద్యం వంటి రంగాల్లో కీలక సంస్కరణలను ప్రవేశపెట్టడం ద్వారా ఆర్థిక వ్యవస్థకు మేలు చేకూరుతుంది. అదేవిధంగా ప్రైవేటు, ప్రభుత్వ పెట్టుబడులను ప్రోత్సహించడం, బ్యాంకింగ్–ఫైనాన్షియల్ వ్యవస్థల సామర్థ్యాన్ని మెరుగుపరచడం వంటివి కూడా చాలా కీలకం. ఈ చర్యలన్నీ సమ్మిళిత, స్థిరమైన ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తాయి. ధనిక దేశాలతో సమాన స్థాయికి ప్రజల ఆదాయాలు చేరుకునేందుకు బాటలు వేస్తుంది’ అని ఝాంగ్ వివరించారు. కాగా, ప్రాంతీయ, ప్రపంచ ఆర్థికాభివృద్ధికి భారత్, చైనాలు అత్యంత ప్రధానమైన చోదకాలని చెప్పారు. బలమైన ద్వైపాక్షిక ఆర్థిక భాగస్వామ్యంతో ఇరు దేశాలకూ ప్రయోజనకరమని ఆయన పేర్కొన్నారు. మూలధన నిధులపై...: మొండిబకాయిల సమస్య పరిష్కారాన్ని వేగవంతం చేసేందుకు ప్రభుత్వం చేపడుతున్న విస్తృత ఫైనాన్షియల్ సంస్కరణల్లో భాగంగానే ప్రభుత్వ రంగ బ్యాంకులకు మూలధన నిధులను(రీక్యాపిటలైజేషన్) అందించాలని ఐఎంఎఫ్ అభిప్రాయపడింది. బ్యాంకింగ్, కార్పొరేట్ రంగాల్లో ఇటీవల చోటుచేసుకుంటున్న తీవ్ర ఇబ్బందులను(మొండిబకాయిలకు సంబంధించి) పరిష్కరించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన విధానపరమైన సంస్కరణలు చాలా కీలకమైనవని ఝాంగ్ వ్యాఖ్యానించారు. -
వృద్ధి వేగంలో చైనాకన్నా భారత్ ముందు
వాషింగ్టన్ /దావోస్: భారత్ 2018లో 7.4 శాతం వృద్ధి రేటును సాధిస్తుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనా వేసింది. చైనా వృద్ధి రేటు 6.8 శాతంగానే ఉంటుందని, తద్వారా ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా 2018లో భారతదేశమే ముందుంటుందని తన తాజా నివేదికలో విశ్లేషించింది. పెద్దనోట్ల రద్దు, వస్తు– సేవల పన్ను (జీఎస్టీ) అమలుకు సంబంధించి ఆర్థిక మందగమనం నుంచి భారత్ కోలుకుంటోందని తన వరల్డ్ అవుట్‌లుక్‌లో వివరించింది. 2019లో భారత్ వృద్ధి రేటు 7.8 శాతంగా ఉంటుందనీ ఐఎంఎఫ్ అంచనావేసింది. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సందర్భంగా దావోస్ (స్విట్జర్లాండ్)లో ఐఎంఎఫ్ ఈ అవుట్‌లుక్‌ను ఆవిష్కరించింది. 2018–19లో ఆసియా వృద్ధి 6.5 శాతంగా ఐఎంఎఫ్ అవుట్‌లుక్. -
జీఎస్టీ, పెద్ద నోట్ల రద్దు వల్ల లాభాలే
న్యూఢిల్లీ : డిమానిటైజేషన్, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్.. నిర్ణయాలు భారత్‌కు దీర్ఘకాలంలో అత్యుత్తమ ఫలితాలను ఇస్తాయని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్(ఐఎంఎఫ్) మరోసారి స్పష్టం చేసింది. ఎకానమీ డౌన్ ట్రెండ్‌కు ఇది శాశ్వత పరిష్కారమని ఐఎంఎఫ్ తెలిపింది. ఈ రెండు నిర్ణయాల వల్ల దేశం తాత్కాలిక కుదుపులకు గురయినా.. దీర్ఘకాలంలో మాత్రం మంచి ఫలితాలు వస్తాయని ఐఎంఎఫ్ పేర్కొంది. ఈ ఏడాది భారత వృద్ధి రేటు 6.7 శాతం సాధిస్తుందని అంచనా ఉండగా.. వచ్చే ఏడాది ఇది 7.4 శాతానికి చేరుకుంటుందని ఐఎంఎఫ్ చెబుతోంది. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ వల్ల దేశంలో పన్నులన్నీ.. ఒకే గొడుకు కిందకు వచ్చాయని ఐఎంఎఫ్ తెలిపింది. దీనివల్ల నల్లధధనం, అవినీతి, దొంగనోట్ల వంటి వాటికి పూర్తిస్థాయిలో చెక్ పెట్టవచ్చని పేర్కొంది. దాదాపు 13 ఏళ్ల తరువాత అంతర్జాతీయ రేటింగ్ సంస్థ అయిన మూడీస్ భారత్ రేటింగ్ మార్చిన విషయాన్ని ఐఎంఎఫ్ ప్రస్తావించింది. -
భారత ఆర్థిక రంగానికి పెను సవాళ్లు
వాషింగ్టన్: భారీగా పేరుకుపోయిన మొండి బాకీలతో భారత ఆర్థిక రంగం పెను సవాళ్లను ఎదుర్కొంటోందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) పేర్కొంది. కార్పొరేట్లు రుణభారం తగ్గించుకునే ప్రక్రియ మందకొడిగా సాగుతుండటం తదితర అంశాలు బ్యాంకింగ్ వ్యవస్థకు పరీక్షగా మారాయని, పెట్టుబడులను.. వృద్ధి వేగాన్ని వెనక్కి లాగుతున్నాయని ఐఎంఎఫ్ తెలిపింది. భారత ఆర్థిక వ్యవస్థ స్థిరత్వ మదింపు (ఎఫ్ఎస్ఎస్ఏ)నకు సంబంధించిన తాజా నివేదికలో ఐఎంఎఫ్ ఈ అంశాలు వెల్లడించింది. ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు సంయుక్తంగా దీన్ని రూపొందించాయి. 2011 తర్వాత ఎఫ్ఎస్ఎస్ఏ నివేదికను విడుదల చేయడం ఇదే తొలిసారి. భారత్‌లో ప్రధానమైన బ్యాంకులు ఎదురొడ్డి నిలుస్తున్నట్లుగా కనిపిస్తున్నప్పటికీ, బ్యాంకింగ్ వ్యవస్థకు మాత్రం చెప్పుకోతగిన స్థాయిలో ముప్పులు పొంచే ఉన్నాయని ఐఎంఎఫ్ తెలిపింది. భారత్‌లో క్రమంగా బ్యాంకుల ఆధిపత్యం తగ్గి.. బ్యాంకేతర సంస్థల ద్వారా రుణ వితరణ పెరుగుతోందని ఐఎంఎఫ్ అసిస్టెంట్ డైరెక్టర్ మారినా మొరెట్టి తెలిపారు. అయితే, ప్రభుత్వ రంగ బ్యాంకుల పట్టు ఇంకా చెప్పుకోతగ్గ స్థాయిలోనే కొనసాగుతోందని వివరించారు. -
నోట్ల రద్దుతో తగిన ప్రయోజనాలు: ఐఎంఎఫ్
వాషింగ్టన్: డీమోనిటైజేషన్ (పెద్ద నోట్ల రద్దు) వల్ల నగదు కటకటతో ఆర్థిక వృద్ధికి తాత్కాలిక ఇబ్బందులు ఏర్పడినప్పటికీ అవి తొలగిపోతున్నాయని అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్) పేర్కొంది. ‘‘ఏడాది క్రితం చోటు చేసుకున్న డీమోనిటైజేషన్‌తో లాభాలేంటో చూస్తూనే ఉన్నాం. అవి ఇక ముందూ కొనసాగుతాయి’’ అని ఐఎంఎఫ్ డిప్యూటీ అధికార ప్రతినిధి విలియం ముర్రే చెప్పారు. మధ్య కాలానికి డీమోనిటైజేషన్ వల్ల చక్కని ప్రయోజనాలు సాకారమవుతాయన్న ఆయన... ఆర్థిక రంగ క్రమబద్ధీకరణ, ఆర్థిక కార్యకలాపాలపై తగిన సమాచారం, బ్యాంకింగ్ వ్యవస్థ, డిజిటల్ చెల్లింపులను మెరుగ్గా వినియోగించుకోవడం ద్వారా సమర్థవంతమైన చెల్లింపుల వ్యవస్థను ప్రయోజనాలుగా పేర్కొన్నారు. -
ప్రధాని మోదీకి చల్లటి కబురు..!
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీకి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఎంఎంఎఫ్) చల్లటి వార్తను చెప్పింది. యశ్వంత్ సిన్హాలాంటి సొంత నేతలే పెద్దనొట్ల రద్దు, జీఎస్టీపై తీవ్ర విమర్శలు చేసిన తరుణంలో ఐఎంఎఫ్ భారత ఆర్థిక వ్యవస్థ స్థిరిమైన దారిలో ప్రమాణిస్తోందని పేర్కొంది. గత త్రైమాసింలో భారత ఆర్థిక వ్యవస్థ కేవలం 5.7 శాతం వృద్ధి రేటు నమోదు చేసినా.. భవిష్యత్‌లో పుంజుకుంటుందని ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టినా లెగ్రాడే ఆశాభావం వ్యక్తం చేశారు. గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ అనే కొత్త పన్నుల వ్యవస్థ రావడం వల్ల.. వ్యవస్థాగత మార్పులు చోటు చేసుకున్నాయని.. అందువల్లే వృద్ధిరేటు తక్కువగా నమోదైవుండొచ్చని ఆమె అన్నారు. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ అనేవి భారత ఆర్థిక వ్యవస్థను స్థిరమైన గాడిలోకి తీసుకెళతానయే నమ్మకాన్ని ఆమె వ్యక్తం చేశారు. భారత ఆర్థిక వ్యవస్థ గాడితప్పిందని ఈ మధ్య ఐఎంఎఫ్ చేసిన నేపథ్యంలో లెగార్డే చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేపుతున్నాయి. భారత ఆర్థిక వ్యవస్థ ఏడాది కాలంగా పెనుమార్పులకు లోనైంది. ఈ కారణాలలో వృద్ధి రేటు నమోదలు కొన్ని ఇబ్బందులు ఎదురయి వుంటాయి.. భవిష్యత్‌లో మాత్రం జీఎస్టీ, డిమానిటైజేషన్ ఆర్థిక వ్యవస్థకు తిరుగులేని శక్తిని చేకూర్చుతాయని ఆమె చెప్పారు. జీఎస్టీ అమలు అనేది ఒక చారిత్రాత్మక ప్రయత్నం. ఆర్థిక వ్యవస్థ గతిని మార్చే బృహత్కార్యం వల్ల తాత్కాలిక ఇబ్బందులు తప్పవు అని ఆమె స్పష్టం చేశారు. -
భారత్ వృద్ధి అంచనా యథాతథం
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017–18) భారత వృద్ధి రేటును యథాతథంగా 7.2 శాతంగా కొనసాగిస్తున్నట్లు అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) తెలిపింది. వచ్చే ఆర్థిక సంవత్సరం 2018–19లో ఇది 7.7 శాతానికి చేరుతుందని వరల్డ్ ఎకనమిక్ అవుట్‌లుక్ (డబ్ల్యూఈవో) అప్డేట్ నివేదికలో పేర్కొంది. ఐఎంఎఫ్ అంచనాల ప్రకారం ఈ రెండేళ్లూ కూడా భారత వృద్ధి రేటు చైనా కన్నా అధికంగానే ఉండనుంది. చైనా వృద్ధి 2017లో 6.7 శాతంగాను, 2018లో 6.4 శాతంగాను ఉండగలదంటూ గతంలో ప్రకటించిన అంచనాలను తాజా నివేదికలో ఐఎంఎఫ్ స్వల్పంగా పెంచింది. భారత వృద్ధి రేటు అంచనాలను గతంలో ఇచ్చిన స్థాయిలోనే యథాతథంగానే ఉంచినప్పటికీ.. చైనాను మించగలదని తెలిపింది. పెద్ద నోట్ల రద్దు ప్రభావాలతో గత ఆర్థిక సంవత్సరం భారత వృద్ధి 7.1 శాతానికే పరిమితమైనప్పటికీ.. ఇది ఊహించిన దానికన్నా అధికమేనని ఐఎంఎఫ్ పేర్కొంది. -
భారత్ వృద్ధి అవకాశాలు మెరుగుపడ్డాయ్!
♦ ఐఎంఎఫ్ విశ్లేషణ ♦ తొలగిన డీమోనిటైజేషన్ ఎఫెక్ట్, ♦ కీలక సంస్కరణల అమలు కారణం న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి అవకాశాలు గణనీయంగా మెరుగుపడినట్లు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) పేర్కొంది. పెద్ద నోట్ల రద్దు అనంతరం ఆర్థిక వ్యవస్థపై పడిన ప్రతికూల ప్రభావం తొలగిపోతుండడం, కీలక సంస్కరణల అమలు ఇందుకు ప్రధాన కారణమని వివరించింది. అయితే కార్పొరేట్ రుణ భారం, బ్యాంకింగ్ మొండిబకాయిలు (ఎన్పీఏ)లు ఆందోళన కరమైన అంశాలుగా తెలిపింది. జూలై 7, 8 తేదీల్లో జర్మనీలోని హ్యామ్‌బర్గ్‌లో జీ–20 దేశాల నాయకులు సమావేశమవుతున్న నేపథ్యంలో ఐఎంఎఫ్ విడుదల చేసిన విశ్లేషణా పత్రంతో కొన్ని ముఖ్యాంశాలు... ⇔ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతున్నప్పటికీ, అత్యంత జాగరూకత అవసరం. రికవరీ మరింత పటిష్టం కావడానికి విధానపరమైన చర్యలు అవసరం. ఉత్పాదకత వృద్ధిలో జోరు లేకపోవడం, ప్రపంచంలోని అన్ని దేశాల్లో తగిన వృద్ధి సంకేతాలు కనిపించకపోవడం ఇక్కడ గమనించాల్సిన అంశాలు. ⇔ భారత్, చైనా వంటి వర్థమాన దేశాల్లో సైతం వృద్ధి తీరు మరింత పటిష్టం కావాల్సి ఉంది. ⇔ భారత్‌తో పాటు ఇండోనేషియా, టర్కీ వంటి వర్థమాన దేశాల్లో కార్పొరేట్ రుణ భారం సమస్య తీవ్రంగా ఉంది. భారత్ విషయానికి వస్తే– ఎన్పీఏల సమస్య తీవ్రంగా కొనసాగుతోంది. ఇది ఆందోళనకరమైన అంశమే. ⇔ పలు దేశాల్లో ఆర్థిక అవకాశాల విస్తృతికి పరిమితులు ఉన్నాయి. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల్లో విద్యా రంగంపై పెట్టుబడుల పెంపు, ప్రభుత్వ నిధుల సక్రమ వినియోగం అవసరం. ఆయా అంశాలు వృద్ధి విస్తృతికి దోహదపడతాయి. సవాళ్లు ఉన్నాయ్... 2017,18 సంవత్సరాల్లో ప్రపంచ వృద్ధి 3.5 శాతం ఉంటుందని అంచనా. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో ఒడిదుడుకులు కొనసాగుతుండడం ఇక్కడ ప్రధానంగా ఆందోళన కలిగించే అంశం. రికవరీ పటిష్టానికి మరింత జాగరూకతతో కూడిన విధాన చర్యలు అవసరం. – క్రిస్టినా లెగార్డ్, ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ -
జీఎస్టీతో వృద్ధికి ఊతం
⇔ మధ్యకాలికంగా 8% ఉండొచ్చు... ⇔ మొండిబకాయిలే ఆందోళనకరం ⇔ భారత్‌పై ఐఎంఎఫ్ అంచనాలు వాషింగ్టన్: త్వరలో అమల్లోకి రాబోయే వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) విధానం... మధ్యకాలికంగా 8 శాతానికి పైగా వృద్ధి సాధించేలా భారత్‌కు తోడ్పడగలదని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) అంచనా వేసింది. అయితే, దేశ బ్యాంకింగ్ వ్యవస్థలో పేరుకుపోయిన మొండి బకాయిలే సమస్యాత్మకమని ఆందోళన వ్యక్తం చేసింది. ‘‘పొరుగుదేశాలతో పోలిస్తే భారత్ అత్యంత వేగంగా ఎదుగుతున్న మార్కెట్ ఎకానమీ’’ అని ఐఎంఎఫ్ డిçప్యూటీ ఎండీ తావో ఝాంగ్ అభివర్ణించారు. భారత్ వృద్ధి రేటు 2016–17లో 6.8%గానూ, 2017–18లో 7.2%గానూ ఉండవచ్చని చెప్పారు. నిలకడగా, పటిష్టమైన వృద్ధికి తోడ్పడే కీలకమైన ఆర్థిక సంస్కరణల అమల్లో ప్రభుత్వం చెప్పుకోతగ్గ స్థాయిలో పురోగతి సాధించిందని ఝాంగ్ తెలిపారు. ఉత్పత్తి పెరుగుదల, రాష్ట్రాల మధ్య వస్తు, సేవల రాకపోకలు సులభతరం అయ్యేలాందుకు జీఎస్టీ దోహదపడుతుందన్నారు. చమురు ధరల తగ్గుదల భారత్ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చిందని, ద్రవ్యోల్బణ తగ్గుదలకు దోహదపడిందని చెప్పారు. డీమోనిటైజేషన్‌పై స్పందిస్తూ... దీనివల్ల ఆర్థిక కార్యకలాపాలు కొంత మందగించాయని.. అయితే క్రమంగా రికవరీ కనిపిస్తోందని ఝాంగ్ చెప్పారు. మొండిబాకీలు ఆందోళనకరం.. భారత్‌లో మొండిబకాయిలతో బ్యాంకింగ్ వ్యవస్థ పోరు కొనసాగిస్తుండటం ఆందోళన కలిగిస్తోందని ఝాంగ్ చెప్పారు. కీలక రంగాల్లో కార్పొరేట్ల పరిస్థితులు అంత బాగా లేకపోవడమూ ఆందోళనకరమేనన్నారు. 2016–17 ఏప్రిల్– డిసెంబర్ మధ్యలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మొండి బకాయిలు రూ.1 లక్ష కోట్ల మేర పెరిగి మొత్తం రూ. 6.06 లక్షల కోట్లకు చేరాయి. ఇందులో సింహభాగం విద్యుత్, ఉక్కు, రహదారులు, టెక్స్టైల్స్ రంగాల కంపెనీలకు చెందినవే ఉన్నాయి. 2015–16 ఆఖరు నాటికి స్థూల మొండి బాకీలు రూ. 5,02,068 కోట్లుగా ఉన్నాయి. -
జీఎస్టీతో వృద్ధి పరుగులు..!
డీమోనిటైజేషన్‌తో ‘ఉగ్ర’ నిధులకు చెక్... ► ఐఎంఎఫ్ సమావేశంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వాషింగ్టన్: త్వరలో అమల్లోకి రానున్న వస్తు, సేవల పన్ను(జీఎస్టీ)తో దేశ ఆర్థిక వ్యవస్థ మరింత దూసుకెళ్తుందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన వృద్ధి సాధిస్తున్న దేశంగా భారత్ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తుందని కూడా ఆయన చెప్పారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) సమావేశంలో మాట్లాడుతూ జైట్లీ ఈ వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా తమ ప్రభుత్వం అమలు చేసిన పెద్ద నోట్ల రద్దు(డీమోనిటైజేషన్) ప్రక్రియతో పన్ను ఆదాయాలు మెరుగుపడటంతోపాటు దొంగనోట్ల చెలామణీకి అడ్డుకట్ట పడుతుందన్నారు. ‘డీమోనిటైజేషన్‌తో భారత్ ఆర్థిక వ్యవస్థ తక్కువ నగదు వినియోగం దిశగా పరిణామం చెందుతుంది. ఉగ్రవాదుల నిధులకు వీలుకల్పిస్తున్న దొంగనోట్ల ముప్పుకు కూడా కళ్లెం పడుతుంది’ అని పేర్కొన్నారు. దేశీయంగా పటిష్టమైన డిమాండ్‌కు తోడు తమ ప్రభుత్వం చేపడుతున్న నిర్మాణాత్మక సంస్కరణలతో రానున్న సంవత్సరాల్లో వృద్ధి మరింతగా పరుగులు తీస్తుందన్నారు. ‘జూలై 1 నుంచి జీఎస్టీ అమలుకు సంసిద్ధంగా ఉన్నాం. జీఎస్టీతో పన్నుల వ్యవస్థ సామర్థ్యం బలోపేతం అవుతుంది. వ్యాపారాలకు సానుకూల పరిస్థితుల కల్పనలో కూడా ఇది తోడ్పాటునందిస్తుంది. దేశవ్యాప్తంగా ఏకరూప మార్కెట్ ఆవిర్భావానికి దోహదం చేస్తుంది’ అని జైట్లీ వివరించారు. ఐఎంఎఫ్ విశ్వసనీయతకు దెబ్బ... ఐఎంఎఫ్‌లో కోటా సంస్కరణల అమల్లో జాప్యం పట్ల ఆర్థిక మంత్రి జైట్లీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ జాప్యం మరింతగా కొనసాగితే ఐఎంఎఫ్ తన చట్టబద్ధత, విశ్వసనీయతను కోల్పోతుందని పేర్కొన్నారు. 15వ సాధారణ కోటా సమీక్షలు(జీఆర్‌క్యూ) పూర్తి చేసేందుకు గడువును 2019 వార్షిక సమావేశాల వరకూ పొడిగించడం పట్ల భారత్ చాలా అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది. కనీసం ఈ గడువుకైగా కట్టుబడతారని ఆశిస్తున్నా’ అని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వాస్తవిక మార్పులకు అనుగుణంగా ఐఎంఎఫ్‌లో కోటా సంస్కరణలు అమలు చేయాలని భారత్ ఎప్పటినుంచో కోరుతూవస్తోంది. దీనివల్ల వర్థమాన దేశాల కార్యకలాపాలు ఐఎంఎఫ్‌లో పెరగడంతోపాటు తమ గళాన్ని మరింత బలంగా వినిపించేందుకు వీలవుతుంది. -
2017లో వృద్ధి 7.2 శాతమే!
♦ అంచనాలు తగ్గించిన ఐఎంఎఫ్ ♦ ఇంతక్రితం 7.6 శాతం ♦ డీమోనిటైజేషన్ కారణమని ప్రకటన వాషింగ్టన్: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు అంచనాలను అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) తగ్గించింది. ఇంతక్రితం 7.6 శాతంగా ఉన్న అంచనాలను 7.2 శాతానికి కుదించింది. డీమోనిటైజేషన్ నేపథ్యంలో ఏర్పడిన పరిస్థితులు ఇందుకు కారణమని వివరించింది. పెద్ద నోట్ల రద్దు వల్ల వినియోగ విభాగంలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయని వివరించింది. పలు రంగాల విషయంలో నగదు కొరత, మార్పిడి విషయాల్లో తీవ్ర పరిస్థితులు నెలకొన్నాయని తన తాజా వార్షిక ప్రపంచ ఆర్థిక విశ్లేషణ (డబ్ల్యఈఓ)లో పేర్కొంది. ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంక్ వార్షిక వేసవికాల సమావేశం ప్రారంభానికి ముందు ఈ ఔట్లుక్ విడుదలైంది. విశ్లేషణా అంశాలను మరిన్ని చూస్తే... మధ్యంతర కాలానికి సంబంధించి చూస్తే– వృద్ధి అంచనాలు బాగున్నాయి. వృద్ధి ఎనిమిది శాతానికి పెరగవచ్చు. కీలక సంస్కరణల అమలు, సరఫరాల వైపు సమస్యల పరిష్కారం, తగిన ద్రవ్య, పరపతి విధానాలు దీనికి దోహదం చేసే అంశాలు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017–18 ఏప్రిల్–మార్చి) దేశ జీడీపీ వృద్ధి రేటును కేంద్రం 7.1 శాతంగా అంచనావేస్తున్న సంగతి తెలిసిందే. పలు సవాళ్లు ఉన్నప్పటికీ, భారత్ వృద్ధి పటిష్ట స్థితిలో ఉండడానికి కారణాలు చూస్తే– కీలక వ్యవస్థాగత సంస్కరణల అమలు, అంతర్జాతీయ వాణిజ్య సానుకూలత, విదేశీ మారక ద్రవ్య అంశాలకు సంబంధించి తక్కువస్థాయిలోనే ఒడిదుడుకులు కొనసాగుతుండడం కీలకమైనవి. డీమోనిటైజేషన్ వల్ల ఎదురయిన సమస్యలు సర్దుమణగిన అనంతరం తక్షణం భారత్ ఆర్థిక వ్యవస్థ దృష్టి సారించాల్సిన అంశాలు మరికొన్ని ఉన్నాయి. కార్మిక చట్టాల సంస్కరణలు, తయారీ బేస్ విస్తరణ, వ్యాపారానికి సానుకూల అవకాశాల కల్పన, ఉపాధి అవకాశాల సృష్టి, వ్యవసాయ సంస్కరణలు, మౌలిక సదుపాయాల కల్పన వంటివి ఇందులో ఉన్నాయి. బ్యాంకింగ్ మొండిబకాయిల సమస్య పరిష్కారం, వాటికి తగిన మూలధన కల్పన, సబ్సిడీల హేతుబద్ధీకరణ, పన్ను సంస్కరణలు, జీఎస్టీ అమలు వంటివి వృద్ధికి బాటలువేస్తాయి. ప్రపంచ వృద్ధి రేటు 3.5% ఇదిలావుండగా, 2016లో 3.1 శాతంగా ఉన్న ప్రపంచ ఆర్థిక వృద్ధిరేటు 2017లో 3.5 శాతానికి చేరుతుందని ఐఎంఎఫ్ అంచనావేసింది. 2018లో 3.6 శాతానికి చేరుతుందనీ అంచనావేసింది. ఇక చైనా వృద్ధి రేటు 2017లో 6.6 శాతంగా ఉంటుందని పేర్కొన్న ఐఎంఎఫ్, ఇది 2018లో 6.2 శాతానికి తగ్గుతుందని విశ్లేషించింది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక క్రియాశీలత మెరుగుపడ్డం, డిమాండ్ పెరుగుతుందన్న అంచనాలు, సరఫరాలపై ఒపెక్ దేశాల అంగీకృత నియంత్రణలు వెరసి చమురు ధరలు 2016 మొదట్లోకన్నా ప్రస్తుతం మెరుగుపడ్డానికి కారణాలని ఐఎంఎఫ్ వివరించింది. ఇక అమెరికా ఫెడ్ ఫండ్ రేటు పెంపు అంశాన్ని ప్రస్తావిస్తూ– వేగవంతంగా వడ్డీరేటు పెంచితే ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులు కఠినమయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. అమెరికా ఆర్థికవృద్ధి పుంజుకుంటోందని, భవిష్యత్ డిమాండ్‌పై విశ్వాసం మరింత పెంపొందుతోందని నివేదిక తెలిపింది. బ్రిటన్‌లోనే దాదాపు ఇదే సానుకూలత ఉందని పేర్కొంది. -
వృద్ధి తగ్గుదల తాత్కాలికమే
మధ్య కాలానికి భారత్ వృద్ధి రేటు 8 శాతానికి పైనే.. ⇒ జీఎస్టీ అమలుతో ఇది సాకారం ⇒ అంతర్జాతీయ ద్రవ్యనిధి అంచనా వాషింగ్టన్: పెద్ద నోట్ల రద్దు అనంతర ప్రతికూల ప్రభావాలతో భారత జీడీపీ వృద్ధి రేటు క్షీణత తాత్కాలికమేనని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనా వేసింది. మధ్య కాలానికి 8 శాతానికిపైనే భారత్ వృద్ధి రేటు సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమల్లోకి తీసుకురావడం ఇందుకు తోడ్పడుతుందని పేర్కొంది. ఈ మేరకు భారత్‌పై వార్షిక నివేదికను ఐఎంఎఫ్ విడుదల చేసింది. దాని ప్రకారం... డీమోనిటైజేషన్ అనంతరం ఎదురైన ఇబ్బందుల కారణంగా జీడీపీ రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2016–17) 6.6 శాతానికి క్షీణిస్తుంది. గతేడాది నవంబర్ 8 తర్వాత నగదు కొరత కారణంగా వినియోగం, వ్యాపార కార్యకలాపాలు కుదేలయ్యాయి. వృద్ధిని నిలబెట్టుకోవడం సవాళ్లకు దారితీసింది. అయితే, ఆర్థిక వ్యవస్థపై పెద్ద నోట్ల రద్దు ప్రభావం తాత్కాలికమే. ఇది తిరిగి వెనుకటి స్థితికి వచ్చేస్తుంది. 2017–18లో 7.2 శాతానికి చేరుకుంటుంది. అనంతరం భారత జీడీపీ వృద్ధి రేటు కొన్ని సంవత్సరాలపాటు 8 శాతానికి పైనే నమోదవుతుంది. నగదు సరఫరా సులభతరం అయితే బలమైన వినియోగదారుల విశ్వాసం స్వల్ప కాలంలో వినియోగానికి కలసి వస్తుంది. పెట్టుబడుల రికవరీ అన్నది మధ్యస్థంగా ఉంటుంది. అది కూడా రంగాల వారీగా హెచ్చు, తగ్గులు ఉండొచ్చు. భారత చర్యలకు మద్దతు అక్రమ నగదు చలామణిని అరికట్టేందుకు కేంద్ర సర్కారు తీసుకున్న చర్యలకు ఐఎంఎఫ్ డైరెక్టర్లు మద్దతు పలకడం విశేషం. అయితే, నగదు చెల్లింపుల పరంగా అవాంతరాలు లేకుండా చూడాలని, తగినంత నగదు లభ్యత ఉండేలా చర్యలు తీసుకోవాలని ఐఎంఎఫ్ కేంద్ర సర్కారును కోరింది. భారత్ గత కొన్ని సంవత్సరాలుగా బలమైన ఆర్థిక పనితీరు చూపించడానికి పటిష్టమైన విధాన చర్యలు, ద్రవ్య స్థిరీకరణకు కట్టుబడి ఉండడం, ద్రవ్యోల్బణ నియంత్రణ విధానాలను కారణాలుగా పేర్కొంది. సరఫరా సమస్యలను తొలగించడంతోపాటు, ఉత్పత్తి పెంపు, ఉద్యోగావకాశాల కల్పన, సమగ్రాభివృద్ధికి వీలుగా సంస్కరణలు ఉండాలని పేర్కొంది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో ఆటుపోట్లు, అమెరికా వడ్డీరేట్ల పెంపును వెలుపలి సవాళ్లుగాపేర్కొంది. కార్పొరేట్, ప్రభుత్వ రంగ బ్యాంకుల బ్యాలన్స్ షీట్లు బలహీనపడడంపై అందోళనం వ్యక్తం చేసింది. జీఎస్టీ బలంగానే ఉండాలి జీఎస్టీతో ఆశించినదానికంటే అధిక ప్రయోజనాలు, నిర్మాణాత్మక సంస్కరణలు బలమైన వృద్ధి రేటుకు దారితీస్తాయని ఐఎంఎఫ్ అంచనా వేసింది. జీఎస్టీ కారణంగా మధ్య కాలంలో భారత వృద్ధి 8%కి పైగా నమోదవుతుందని, దేశాన్ని ఒకే మార్కెట్‌గా మార్చి వస్తు, సేవల రవాణా పరంగా సమర్థతకు దారితీస్తుందని తెలిపింది. అయితే, జీఎస్టీ రూపు రేఖలు, దాని అమలు విషయంలో అనిశ్చితిని ప్రస్తావించింది. ‘‘భారత జీడీపీలో పన్నుల వాటా 17%. ఇది వర్ధమాన దేశాలతో పోలిస్తే తక్కువ. బలమైన జీఎస్టీ చట్టం అమలు అన్నది మా బలమైన వృద్ధి అంచనాలకు మూలం. కనుక జీఎస్టీలో మినహాయింపులు పరిమితంగా ఉండాలి. అన్ని రాష్ట్రాల్లో రేట్లు ఒకే తీరులో ఉండాలి. కార్పొరేట్ పన్ను తక్కువ ఉండేలా ప్రత్యక్ష పన్నుల విధానంలో హేతుబద్ధీకరణ జరగాలి. విద్యుత్తు, రియల్టీ రంగాలను ఒకే ట్యాక్స్ రేటు పరిధిలో ఉంచాలి’’ అని సూచించింది. -
ట్రంప్‌పై అంతర్జాతీయ సంస్థ చీఫ్ ప్రశంసలు
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు తొలిసారిగా ఓ అంతర్జాతీయ సంస్థ చీఫ్ నుంచి ప్రశంసలు దక్కాయి. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి అమెరికా ఆర్థిక వ్యవస్థకు డోనాల్డ్ ట్రంప్ మంచి చేశాడని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) చీఫ్ క్రిస్టీన్ లగార్డే అన్నారు. అతడు స్వల్పకాలంలోనే అమెరికా ఆర్థిక వ్యవస్థను కుదుట పరిచాడని ఇది మంచి పరిణామం అన్నారు. అయితే, డాలర్‌ను పటిష్టత చర్యలు, వడ్డీ రేట్ల పెంపు అనే అంతర్జాతీయ వర్తక వ్యాపారంపై ప్రభావాన్ని చూపుతుందని తెలిపారు. అమెరికాలో మౌలిక వసతుల ఏర్పాటు రంగంలో రెట్టింపు చేయనున్న పెట్టుబడి సంస్కరణలు, పన్ను సంస్కరణలు అమెరికా ఆర్థిక వ్యవస్థకు మరింత బూస్టింగ్ ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దుబాయ్‌లో జరిగిన వరల్డ్ గవర్నమెంట్ శిఖరాగ్ర సదస్సులో ఆమె ఈ విషయాలు చెప్పారు. అయితే, ట్రంప్ విదేశాంగ విధానాల జోలికి మాత్రం ఆమె వెళ్లలేదు. -
భారత్ వృద్ధిరేటుకు ఐఎంఎఫ్ కోత
7.6% నుంచి 6.6%కి తగ్గింపు • నోట్ల రద్దు్ద కారణమని విశ్లేషణ • ద్రవ్యలోటు కట్టుతప్పుతుందన్న మూడీస్, బ్యాంక్ ఆఫ్ అమెరికా • క్యాడ్ పెరుగుతుందన్న నోముర వాషింగ్టన్, న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు, ఫిబ్రవరి 1 వార్షిక బడ్జెట్ నేపథ్యంలో భారత్ ఆర్థిక పరిస్థితి, ద్రవ్యలోటు, కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) వంటి స్థూల ఆర్థిక అంశాలపై అంచనాలు వెలువడుతున్నాయి. పెద్దనోట్ల రద్దు వల్ల తాత్కాలికంగా వినియోగం తగ్గుతుందని, దీనితో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2015–16) వృద్ధి రేటు 6.6 శాతానికి పడిపోతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనావేసింది. ఇంతక్రితం ఈ అంచనా 7.6 శాతంగా ఉంది. ప్రపంచబ్యాంక్ కూడా వృద్ధి అంచనాను 7.6 శాతం నుంచి 7 శాతానికి తగ్గించింది. ఇక భారీ వృద్ధి, వ్యయాలు లక్ష్యంగా ఉండడం వల్ల వచ్చే ఆర్థిక సంవత్సరం (2017–18) ద్రవ్యలోటు లక్ష్యం నుంచి కేంద్రం పక్కకు తప్పుకునే అవకాశం ఉందని అంతర్జాతీయ ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ మూడీస్, ఆర్థిక సేవల దిగ్గజం బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిలించ్ అంచనా వేశాయి. నోట్ల రద్దు వల్ల కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) పెరిగే అవకాశం ఉందని జపాన్ బ్రోకరేజ్ సంస్థ నోమురా అభిప్రాయపడుతోంది. వివరాలు.., ప్రపంచవృద్ధి 3.1 శాతం: ఐఎంఎఫ్ 2016లో పలు ఆర్థిక వ్యవస్థల్లో ఉన్న తాత్కాలిక మందగమన ధోరణి 2017, 2018లో తిరిగి పుంజుకునే వీలుంది. 2016లో ప్రపంచ వృద్ధి 3.1 శాతంగా ఉంటుందని భావిస్తున్నాం. 2017,18 సంవత్సరాల్లో ఈ రేటు వరుసగా 3.4 శాతం, 3.6 శాతాలుగా ఉండొచ్చు. అయితే 2016కు సంబంధించి చైనా వృద్ధి రేటు అంచనాలను స్వల్పంగా 6.6 శాతం నుంచి 6.7 శాతానికి పెరిగే వీలుంది. అయితే ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా మాత్రం భారత్ కొనసాగుతుంది. 2018లో భారత్ వృద్ధి రేటు 7.7 శాతంగా ఉంటే, చైనా వృద్ధి రేటు 6 శాతంగా ఉంటుంది. వాణిజ్య అంశాలకు సంబంధించి రక్షణాత్మక విధానాలు కొంత ఒత్తిడులను సృష్టించే వీలుంది. ద్రవ్యలోటు 3.5 శాతం: బీఓఎఫ్ఏఎల్: కేంద్రం వచ్చే ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటు బాట తప్పే అవకాశం ఉందని అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజ సంస్థ– బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిలించ్ అంచనావేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య వ్యత్యాసం– ద్రవ్యలోటు పరిమాణం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువతో పోల్చితే 3.5 శాతం (రూ.5.33 లక్షల కోట్లు) దాటకూడదన్నది బడ్జెట్ లక్ష్యం. అయితే వచ్చే ఏడాది ఈ రేటు 3 శాతానికి తగ్గాలన్నది ద్రవ్య బాధ్యత, బడ్జెట్ నిర్వహణా చట్టం చెబుతున్న విషయం. అయితే దీనికి భిన్నంగా ద్రవ్యలోటును రానున్న బడ్జెట్లో కూడా 3.5 శాతంగానే కొనసాగించే వీలుందని బ్యాంక్ ఆఫ్ అమెరికా అంచనావేస్తోంది. మూడీస్దీ అదే మాట... ఇక మూడీస్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కేంద్రం 3.5 శాతం ద్రవ్యలక్ష్యాన్ని సాధించే వీలుందని మూడీస్ పేర్కొంది. అయితే మౌలిక రంగాల వ్యయం అధికమయ్యే అవకాశం ఉన్నందున వచ్చే ఏడాది ద్రవ్యలోటును3 శాతానికి కట్టడిచేసే అవకాశాలు తక్కువగా ఉన్నాయని తన తాజా నివేదికలో వివరించింది. క్యాడ్ 1.3 శాతం: నోముర: 2017 స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో కరెంట్ అకౌంట్ లోటు 1.3 శాతంగా ఉంటుందని జపాన్ బ్రోకరేజ్ సంస్థ– నోమురా అంచానా వేసింది. ఇదిలాఉండగా, భారత్ వినియోగదారులు పూర్తిస్థాయిలో ఆశావహ ధోరణితో ఉన్నట్లు మాస్టర్‌కార్డ్ ఇండెక్స్ ఆఫ్ కన్సూమర్ కాన్ఫెడెన్స్ (హెచ్2 2016)నివేదిక తెలిపింది. -
తగ్గిన విదేశీ మారక ద్రవ్య నిల్వలు
విదేశీ కరెన్సీ ఆస్తులు క్షీణించడమే కారణం ముంబై: విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఈ నెల 23తో ముగిసిన వారానికి తగ్గాయి. విదేశీ కరెన్సీ ఆస్తులు తగ్గడంతో విదేశీ మారక ద్రవ్య నిల్వలు 94 కోట్ల డాలర్లు తగ్గి 35,967 కోట్ల డాలర్లకు పడిపోయాయని ఆర్బీఐ తెలిపింది. ఆర్బీఐ వెల్లడించిన గణాంకాల ప్రకారం,,. అంతకు ముందటి వారంలో విదేశీ మారక ద్రవ్య నిల్వలు 238 కోట్ల డాలర్లు క్షీణించి 36,060 కోట్లకు తగ్గాయి. ఈ ఏడాది సెప్టెంబర్ 30తో ముగిసిన వారానికి ఈ నిల్వలు జీవిత కాల గరిష్ట స్థాయి, 37,199 కోట్ల డాలర్లకు పెరిగాయి. ఇక ఈ నెల 23తో ముగిసిన వారానికి మొత్తం విదేశీ మారక ద్రవ్య నిల్వల్లో అధిక భాగం ఉండే విదేశీ కరెన్సీ ఆస్తులు(ఎఫ్సీఏ–ఫారిన్ కరెన్సీ అసెట్స్) 93 కోట్ల డాలర్లు తగ్గి 33,597 కోట్ల డాలర్లకు పడిపోయాయి. పుత్తడి నిల్వలు నిలకడగా 1,998 కోట్ల డాలర్లుగా ఉన్నాయి. అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) వద్దనున్న స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ 9 లక్షల డాలర్లు తగ్గి 142 కోట్ల డాలర్లకు పడిపోయాయి.దీంతో ఐఎంఎఫ్ వద్ద భారత రిజర్వ్ పొజిషన్ 11 లక్షల డాలర్లు తగ్గి 229 కోట్ల డాలర్లకు పడిపోయింది. -
మోదీకి ఐఎంఎఫ్ మద్దతు
వాషింగ్టన్: అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్)ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేపట్టిన నల్లధనంపై యుద్ధానికి మద్దతు ప్రకటించింది. దేశలో పెరుగుతున్న అక్రమ ఆర్థిక లావాదేవీలు, అవినీతి నిరోధానికి రూ.500 రూ.1000 కరెన్సీ చెలామణీ రద్దును ఐఎంఎఫ్ స్వాగతించింది. కానీ ఈ ప్రక్రియలో "తెలివిగా" వ్యవహారించాలని సూచించింది. భారతదేశంలాంటి ఆర్థికవ్యవస్థలో రోజువారీ లావాదేవీల్లో నగదు పాత్ర భారీగా ఉన్నప్పటికీ, ఈ కార్యక్రమాన్ని చాలా తెలివిగా ,ఎలాంటి అంతరాయంలేకుండా ముందు జాగ్రత్తతో నిర్వహించాలని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) ప్రతినిధి గెర్రీ రైస్ మీడియాకు చెప్పారు. భారత ప్రభుత్వం సంచలన నిర్ణయంపై స్పందన కోరినపుడు ఆయన ఇలా వ్యాఖ్యానించారు.ఇది అసాధారణమైన నిర్ణయం కాదనీ, దేశాల తరచూ ఇలాంటి చర్యలు తీసుకుంటాయని పేర్కొన్నారు. కానీ దీన్ని చాలా సమర్ధవంతంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని రైస్ మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. -
భారత్ ఓ ఆశా కిరణం
• బ్యాంక్‌ల మొండి బకాయిలు సమస్యే • ఐఎంఎఫ్ వెల్లడి న్యూఢిల్లీ: ప్రపంచ దేశాల్లో భారత్ ఆశాకిరణమని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అభివర్ణించింది. అయితే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పెరిగిపోతున్న మొండి బకాయిలు సమస్యేనని పేర్కొంది. భారత్‌తోపాటు చైనా సైతం తన వృద్ధిని కొనసాగిస్తుందని ఐఎంఎఫ్ చీఫ్ ఎకనమిస్ట్ మౌరిస్ ఆబ్స్‌ఫెల్డ్ అన్నారు. భారత్‌లో ద్రవ్యోల్బణం, కరెంటు ఖాతా లోటు, ద్రవ్యలోటు తగ్గుముఖం పడుతున్నాయని పేర్కొన్నారు. శుక్రవారం ఢిల్లీలో బ్రూకింగ్స్ ఇండియా నిర్వహించిన కార్యక్రమంలో ఆబ్స్‌ఫెల్డ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... భారత్‌లో ఇప్పటికీ నిర్మాణపరమైన సవాళ్లు ఉన్నాయన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల నిరర్థక ఆస్తుల విషయంలో చెప్పుకోతగ్గ పురోగతి ఉన్నప్పటికీ, అవి పెరిగిపోవడం సవాలేనన్నారు. 2016, 2017 సంవత్సరాల్లో భారత్ 7.6 శాతం వృద్ధి రేటు సాధిస్తుందని ఇటీవలే ఐఎంఎఫ్ తన అంచనాలను ప్రకటించి న విషయం తెలిసిందే. -
బ్యాంకులది ఒడిదుడుకుల బాటే!
అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ నివేదిక వాషింగ్టన్: భారత్ బ్యాంకులది ఒడిదుడుకుల బాటేనని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) అంచనా వేసింది. లాభాలు తగ్గడం, మొండిబకాయిల బరువు దీనికి కారణంగా వివరించింది. ‘గ్లోబల్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ’ పేరుతో ఐఎంఎఫ్ తాజాగా ఒక నివేదికను విడుదల చేసింది. మొండిబకాయిల గురించి ప్రత్యేక, అదనపు, సకాల చర్యలు అవసరమని సూచించింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌యూ) రుణాల్లో స్థూల మొండిబకాయిలు 2014-15లో 5.32% (రూ.2.67 లక్షల కోట్ల) ఉంటే ఈ పరిమాణం 2015-16లో 9.32%కి (రూ.4.76 లక్షల కోట్లు) పెరగడం ఆందోళన కలిగిస్తున్న సంగతి తెలిసిందే. గత 12 నెలల్లో 39 లిస్టెడ్ బ్యాంకుల స్థూల ఎన్పీఏలు 96% పెరిగాయి. 2016 జూన్ నాటికి రూ.6.3 లక్షల కోట్ల స్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో ఐఎంఎఫ్ భారత్ బ్యాం కింగ్‌కు సంబంధించి సంస్థ విడుదల చేసిన నివేదికలో ముఖ్యాంశాలు... ⇔ ఎన్పీఏలతో ఇందుకు సంబంధించి అదనపు ప్రొవిజనింగ్ (కేటాయింపులు) బ్యాంకింగ్‌కు భారంగా మారతాయి. దీనితో వ్యవస్థకు మరింత అధిక మొత్తంలో మూలధనం అవసరం అవుతుంది. ⇔ సమస్య పరిష్కార దిశలో కార్పొరేట్ దివాలా చట్టాల సంస్కరణల పటిష్ట అమలు అవసరం. అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్, ఈక్విటీకి రుణ మార్పిడి, సమగ్ర, పారదర్శక నియమ నిబంధనల అమలు ముఖ్యం. ⇔ కార్పొరేట్ రుణ ఒత్తిడులను ఎదుర్కొనే ఒక ప్రత్యేక యంత్రాంగమూ మొండిబకాయిల సమస్య పరిష్కారంలో కీలకం. ⇔ భారత్‌లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పలు వర్ధమాన దేశాల్లోనూ మొండిబకాయిల సమస్య ఉంది. ఆయా దేశాల్లో బ్యాంకింగ్ పర్యవేక్షణ పటిష్టత అవసరం. అలాగే ప్రపంచవ్యాప్తంగా సమస్య తీవ్రమవకుండా నిరోధించే క్రమంలో వ్యవస్థలు, సెంట్రల్ బ్యాంకుల మధ్య సమన్వయ అవసరం ఎంతో ఉంది. ⇔ స్థిరమైన రాజకీయ వాతావారణ పరిస్థితి భారత్‌కు లాభిస్తున్న అంశాల్లో కీలకమైనది. ⇔ పెండింగ్ ప్రాజెక్టుల పూర్తిపై దృష్టి సమస్య పరిష్కారంలో కీలకం. -
ప్రపంచ రుణ భారంపై జాగ్రత్త
అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఆందోళన వాషింగ్టన్: ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు రుణ భారం పట్ల జాగరూకతతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) హెచ్చరించింది. ఈ రుణ భారం ఆల్-టైమ్ హైకి చేరినట్లు పేర్కొంది. గడచిన ఏడాదికి ఫైనాన్షియల్ సెక్టార్‌ను మినహాయించి చూస్తే... ప్రభుత్వ, ప్రైవేటు రుణ భారాలు 152 ట్రిలియన్ డాలర్లకు చేరినట్లు నివేదిక తెలిపింది. ఇందులో 65 శాతానికిపైగా ప్రైవేటు రంగానిదని వివరించింది. ఇదే తీరు కొనసాగితే ప్రపంచ ఆర్థిక వృద్ధి మళ్లీ వెనక్కు తిరుగుతుందని ఐఎంఎఫ్ వివరించింది. ఈజీ మనీ విధానం సమస్యకు మూలం ప్రపంచ వ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకుల ‘ఈజీ మనీ’ విధానమే అసలు సమస్యని కూడా పేర్కొంది. 2008 ఆర్థిక సంక్షోభం మొదలుకొని వృద్ధికి మద్దతుగా సెంట్రల్ బ్యాంకులు వడ్డీరేట్లు తగ్గిస్తూ వస్తున్న విషయాన్ని ప్రస్తావించింది. చైనాలో పెరుగుతున్న ప్రైవేటు రంగం రుణ భారం, కొన్ని దిగువ ఆదాయ దేశాల్లో ప్రభుత్వ రుణాల భారం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి విఘాతం కలిగిస్తాయని విశ్లేషించింది. ఆర్థిక వ్యవస్థల మందగమనం వల్ల రుణ భారాలు తగ్గించుకోవడం అటు కంపెనీలకు ఇటు దేశాలకు కూడా కష్టమైన పనని పేర్కొంది. రుణ భారం తగ్గించుకునే ప్రక్రియలో తీసుకునే నిర్ణయాలు వ్యయాలకు, పెట్టుబడులకు విఘాతంగా మారి చివరికి అది ప్రపంచ వృద్ధి గతిపై ప్రభావం చూపుతుందనీ విశ్లేషించింది. ఇదే పరిస్థితి కొనసాగితే, తాజా ఆర్థిక సంక్షోభ పరిస్థితులు తలెత్తుతాయని, ఇది తీవ్ర ఆర్థిక మాంద్యం పరిస్థితికి దారితీసే వీలుందని ఐఎంఎఫ్ ద్రవ్య నిర్వహణా విభాగ నివేదిక హెచ్చరించింది. పరిస్థితి మెరుగుపడాలంటే... ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇబ్బందులు తొలగిపోయే పరిస్థితులను కూడా నివేదిక వివరించింది. ఇందులో ఒకటి బలమైన వృద్ధి తీరు ఒకటికాగా, ఇందుకు ప్రధానంగా సాధారణ స్థాయి ద్రవ్యోల్బణ పరిస్థితులని పేర్కొంది. ఉత్పాదకతను, ఉపాధిని సృష్టించే పెట్టుబడులు, ద్రవ్య, వాణిజ్య పరమైన పెట్టుబడులు, కంపెనీలు క్రమంగా తమ రుణ భారాలను తగ్గించుకోవడం వంటివి ఇందులో కీలకమని వివరించింది. -
పాకిస్తాన్‌కు ఐఎమ్ఎఫ్ సాయం
ప్రపంచ దేశాల్లో ఆర్థిక స్థిరత్వం కాపాడేందుకు ఏర్పరిచిన అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ(ఐఎమ్ఎఫ్) పాకిస్తాన్‌కు 102.1 మిలియన్ డాలర్ల(రూ.68,238 కోట్లకు పైగా)ను విడుదల చేసింది.ఈ విడుదలతో మూడేళ్ల ఆర్థిక సంస్కరణల ప్రణాళిన ముగిసినట్టు ఐఎమ్ఎఫ్ పేర్కొంది. దేశ ఆర్థికవ్యవస్థను పునరుద్ధరించుకునేందుకు, మెరుగుపరుచుకునేందుకు ఆర్థికసాయంగా ఈ నిధిని ఐఎమ్ఎఫ్ పాకిస్తాన్‌కు అందజేసింది.2013 సెప్టెంబర్‌లో ఆర్థిక సాయంగా 6.15 బిలియన్ డాలర్లను పాకిస్తాన్‌కు అందించనున్నట్టు ఐఎమ్ఎఫ్ బోర్డు నిర్ణయించింది. ముందు నిర్ణయించిన మాదిరిగానే, స్థూల ఆర్థిక స్థిరత్వ లాభాలు, వృద్ధి సమర్థించే సంస్కరణలను బలోపేతం చేసేందుకు ఈ నిధులు ఖర్చుచేయాలని ఐఎమ్ఎఫ్ ఎగ్జిక్యూటివ్ బోర్డు డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ మిత్సుహిరో ఫురుసవా చెప్పారు. కీలకమైన ఆర్థిక సంస్కరణలో మాత్రమే వీటిని ఖర్చుచేయడానికి అధికారులు నిబద్ధతో పనిచేయాలని ఆయన పేర్కొన్నారు.పాకిస్తాన్‌కు విడుదల చేసిన ఈ నిధి ద్వారా స్థూల ఆర్థిక స్థిరత్వం పునరుద్ధరించుకోవడంతో పాటు దుర్బలత్వాన్ని తగ్గించి కీలకమైన అంశాల్లో పాకిస్తాన్ పురోగతి సాధించగలుగుతుందని తెలిపారు. -
భారత్‌లో పడిపోతున్న మహిళా కార్మిక శక్తి
న్యూఢిల్లీ: ఆకాశంలో సగం మాదే అని సగర్వంగా చెప్పుకుంటున్న భారత మహిళలు ఉన్నత విద్యలో ఇంతకుముందు కన్నా ఎంతో ముందుకు దూసుకుపోతున్న కార్మిక శక్తిలో మాత్రం ఇంతకుముందు కన్నా వెనకబడి పోతున్నారు. ఉన్నత విద్యలో మహిళలు 2007లో 39 శాతం ఉండగా, అది 2014 నాటికి 46 శాతానికి పెరిగింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ విడుదల చేసిన గణాంకాల ప్రకారం 1999లో భారత్‌లో మహిళల కార్మిక శక్తి 34 శాతం ఉండగా, 2014 నాటికి అది 27 శాతానికి పడిపోయింది. మహిళా కార్మికుల్లో ప్రపంచ సగటు 50 శాతం ఉండగా, భారత్‌లో మాత్రం 27 శాతానికి పడిపోవడం విచారకర పరిణామం. తూర్పు ఆసియా దేశాల్లో ఈ సగటు 63 శాతం ఉండడం గమనార్హం. ఉన్నత విద్యలో మహిళల శాతం ఏటేటా పెరుగుతున్నప్పటికీ కార్మిక శక్తిలో మాత్రం ఎందుకు వెనకబడి పోతున్నారు. మహిళలకు ఉద్యోగావకాశాలు లేకనా? వర్క్ ప్లేస్‌లో సరైన వసతులు లేకనా? పలు రంగాల్లో మహిళలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తున్నప్పటికీ, ఆటోమొబైల్, రవాణా వ్యవస్థలతోపాటు, రక్షణ రంగంలో కూడా మహిళలకు అవకాశాలు పెరుగుతున్న నేటి పరిస్థితుల్లో ఎందుకు మహిళలు కార్మిక శక్తిలో వెనకబడుతున్నారన్నది ప్రధాన ప్రశ్న. మహిళలు పెళ్లి చేసుకొని ఇంటిపట్టునే ఉండాలనే సామాజిక ధోరణి ఇప్పటికీ కొనసాగడమే అందుకు కారణమని సామాజిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఉద్యోగం పురుష లక్షణం నానుడి కనుమరగయ్యేంత వరకు ఈ పరిస్థితి ఇలాగే కొనసాగవచ్చని వారంటున్నారు. పదవ తరగతి నుంచి డిగ్రీ స్థాయి వరకు విద్యా సంస్థల్లోకి యువతుల ప్రవేశం యువకులకన్నా ఎక్కువగా ఉంటునప్పటికీ ఉన్నత విద్యలో, ముఖ్యంగా ఎంఫిల్, పీహెచ్డీలలో మగవాళ్లతో పోలిస్తే వారు ఇంకా వెనకబడే ఉన్నారు. దానికి కారణం కొన్ని రాష్ట్రాల్లో, కొన్ని వర్గాల ప్రజల్లో యుక్త వయస్సులోనే ఆడ పిల్లల పెళ్లిళ్లు చేయడం కారణమని తెలుస్తోంది. అయినప్పటికీ దేశంలో సగటు మహిళలను తీసుకుంటే ఉన్నత విద్యలో వారి సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. ఉన్నత విద్యలో 2012-13 సంవత్సరంలో మహిళలు 20.8 శాతం ఉండగా, మహిళల సంఖ్య 2014-15 సంవత్సరం నాటికి 23.6 శాతానికి పెరిగింది. అయితే ఇది గ్లోబల్ సగటు 27 శాతం కన్నా తక్కువే. ఈ సగటు చైనాలో 26 శాతం ఉండగా, బ్రెజిల్లో 36 శాతం ఉంది. దేశంలో యువకులు సరాసరి సగటున 23.5 ఏళ్ల వయస్సులో పెళ్లి చేసుకుంటోండగా, యువతులు సరాసరి సగటున 19.2 ఏళ్ల వయస్సులో పెళ్లి చేసుకుంటున్నారు. గతంతో పోలిస్తే మహిళల్లో కూడా పెళ్లి చేసుకునే వయస్సు పెరిగినప్పటికీ వారి కార్మిక శక్తి మాత్రం తగ్గుతోంది. భారత ఆర్థిక వృద్ధి రేటు పెరిగినప్పుడల్లా మహిళా కార్మిక శక్తి పడిపోతోందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అంచనా వేసింది. మహిళల్లో విద్యా స్థాయి పెరగడంతోపాటు మహిళాకార్మిక శక్తికి విలువ పెరిగినప్పుడే భారత్‌లో మహిళా కార్మిక శక్తి పెరుగుతోందని సూత్రీకరించింది. -
ద్రవ్యలోటు కట్టడి.. జీఎస్టీ అమలు కీలకం!
భారత్‌కు ఐఎంఎఫ్ సూచన.... న్యూఢిల్లీ : ప్రభుత్వ ఆదాయాలు-వ్యయాలకు మధ్య వ్యత్యాసం- ద్రవ్యలోటు కట్టడి, ధరల పెరుగుదల అదుపు, వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమలు, సబ్సిడీలు దుర్వినియోగం జరక్కుండా లక్ష్యాన్ని చేరేలా తగిన చర్యలు భారత్ ఆర్థికాభివృద్ధిలో కీలకమని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) తాజా నివేదిక ఒకటి పేర్కొంది. ఆయా అంశాల్లో తగిన చర్యలు అంతర్జాతీయంగా ఆర్థిక ఒడిదుడుకుల నుంచి ఆర్థిక వ్యవస్థను రక్షించడమే కాకుండా, పెట్టుబడుల అవకాశాలనూ పెంపొందిస్తాయని వివరించింది. ముఖ్యాంశాలు చూస్తే... ⇔ 2016, 2017లో దేశ వృద్ధి రేటు అంచనాను 7.4 శాతంగా అంచనా. ⇔ అంతర్జాతీయ ఒడిదుడుకులను తట్టుకొని నిలబడ్డానికి 2017-18లో దేశ ద్రవ్యలోటు 3 శాతంగా ఉండాలి. ⇔ ఆర్బీఐ రేటు నిర్ణయ ప్రక్రియ విధానం మరింత పటిష్టం కావాలి. అలాగే రేటు కోత నిర్ణయాల ప్రయోజనం బ్యాంకింగ్ ద్వారా సకాలంలో కస్టమర్‌కు అందే చర్యలు ఉండాలి. ⇔ ద్రవ్యోల్బణం అదుపులో ఉండడం వల్ల పసిడి దిగుమతులు అదుపులో ఉంటాయి. కరెంట్ అకౌంట్ లోటుకు సంబంధించి ఇది సానుకూల అంశం. -
ఆరు రంగాల్లో సంస్కరణలు..
భారత్‌కు ఐఎంఎఫ్ సూచన * సానుకూలతలు, ప్రతికూలతలపై విశ్లేషణ * సంస్కరణల వేగం తగ్గుతోందనీ అభిప్రాయం * 2016, 2017ల్లో వృద్ధి అంచనా 7.4 శాతం బీజింగ్: భారత్ ఆరు రంగాల్లో సంస్కరణలను చేపట్టాల్సిన అవసరాన్ని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) ఉద్ఘాటించింది. ‘నోట్ ఆన్ గ్లోబల్ ప్రాస్పెక్ట్స్ అండ్స్ పాలసీ చేంజెస్’ అన్న పేరుతో విడుదల చేసిన ఒక నివేదికలో ప్రపంచంలోని పలు దేశాలతో పాటు భారత్ వృద్ధి బాటలో నెలకొన్న సానుకూలతలు, ప్రతికూలతలు, తీసుకోవలసిన జాగ్రత్తలపై కీలక సూచనలు చేసింది. చైనాలోని చెంగ్దూలో నిర్వహించిన జీ- 20 ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల రెండు రోజుల సమావేశం ముగింపును పురస్కరించుకుని ఈ నోట్‌ను రూపొందించింది. భారత్‌కు సంబంధించి తదుపరి సంస్కరణలు చేపట్టాల్సిన రంగాల్లో ప్రొడక్ట్ మార్కెట్, కార్మిక, మౌలిక, బ్యాంకింగ్, న్యాయ వ్యవస్థ-ఆస్తి హక్కులు, ద్రవ్య వ్యవస్థాగత సంస్కరణ విభాగాలు ఉన్నాయని నివేదిక స్పష్టం చేసింది. సంస్కరణల వేగం తగ్గడం, బలహీనంగా ఉన్న కార్పొరేట్ రంగం, బ్యాంక్ బ్యాలెన్స్ షీట్స్ అలాగే ఎగుమతుల క్షీణత ఆందోళనకరమైన అంశాలుగా విశ్లేషించింది. 2016, 2017ల్లో భారత్ వృద్ధి రేటును 7.4 శాతంగా కొనసాగిస్తున్నట్లు ఉద్ఘాటించింది. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ విడిపోయిన నేపథ్యంలో... అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితి బలహీనంగా మారిందనీ విశ్లేషించింది. ఈ సవాలును ఎదుర్కొనడంపై అన్ని దేశాలూ దృష్టి సారించాలని సూచించింది. నివేదికలోని మరిన్ని ముఖ్యాంశాలను చూస్తే... * ఆర్థిక వ్యవస్థ రికవరీ బాటలోనే ఉంది. చమురు ధరలు తక్కువగా ఉండడం, సానుకూల విధాన నిర్ణయాలు, వ్యాపార, పెట్టుబడుల విశ్వాసాలు మెరుగుపడ్డం దీనికి ప్రధాన కారణాలు. * మొత్తం 9 రంగాలను ప్రాతిపదికగా తీసుకుని వివిధ దేశాలకు తీసుకోవలసిన చర్యలను నివేదిక సూచించింది. * సంస్కరణలు చేపట్టాల్సిన రంగాలకు సంబంధించి వర్థమాన దేశాలైన చైనా, బ్రెజిల్, దక్షిణాఫ్రికాకన్నా భారత్‌లో జాబితా ‘ఆరు’తో పెద్దదిగా ఉండడం గమనార్హం. * తొమ్మిదింటిలో భారత్‌కు సంబంధించి మెరుగ్గా ఉన్న రంగాల్లో నూతన చొరవలు, క్యాపిటల్ మార్కెట్ డెవలప్మెంట్, ట్రేడ్-ఎఫ్‌డీఐ విధానాల సరళీకరణలు ఉన్నాయి. * చైనా, దక్షిణాఫ్రికాల విషయంలో సంస్కరణలు చేపట్టాల్సిన ఐదు రంగాలను విశ్లేషించింది. బ్రెజిల్‌కు మూడు రంగాలను సూచించింది. రష్యా విషయంలో ఈ సంఖ్య ఏడుగా ఉంది. 7.5 వృద్ధి సరే... పేదల బాగేది: డ్రీజ్ భారత్ గడచిన 12 సంవత్సరాలుగా 7.5 శాతం వృద్ధి రేటును సాధిస్తున్నా... సామాన్యుని జీవన ప్రమాణాల మెరుగుదలలో వైఫల్యం చెందిందని ప్రముఖ ఆర్థికవేత్త జీన్ డ్రీజ్ విశ్లేషించారు. భారత్‌పాటు మరికొన్ని దేశాల్లో సైతం ఇదే పరిస్థితి నెలకొందని నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ సభ్యునిగా కూడా పనిచేసిన డ్రీజ్ అన్నారు. ప్రస్తుతం డ్రీజ్ రాంచీ విశ్వవిద్యాలయంలో విజిటింగ్ ప్రొఫెసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గడచిన రెండేళ్లలో వృద్ధి ధోరణి ఆందోళన కలిగిస్తోందన్నారు. బ్రెగ్జిట్తో సమస్యలు: జీ20 ఆర్థిక మంత్రులు బ్రెగ్జిట్తో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మరిన్ని సమస్యలు పొంచి ఉన్నట్టు జీ20 దేశాల ఆర్థిక మంత్రులు అభిప్రాయపడ్డారు. బ్రెగ్జిట్ వల్ల ఆర్థిక అనిశ్చితి ఏర్పడిందన్న ఆందోళనల నేపథ్యంలో చెంగ్దూలో జరిగిన జీ20 దేశాల ఆర్థిక మంత్రుల సమావేశం దీనిపై చర్చించింది. బ్రెగ్జిట్ వల్ల ఎదురయ్యే పరిణామాలను ఎదుర్కోగల స్థితిలో ఈయూ సభ్య దేశాలు ఉన్నాయని... అలాగే, భవిష్యత్తులో ఈయూకు బ్రిటన్ సన్నిహిత భాగస్వామిగా ఉంటుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ప్రాంతీయ రాజకీయ విభేదాలు, ఉగ్రవాదం, శరణార్ధుల వలసలు కూడా ప్రపంచ ఆర్థిక వాతావరణానికి సంక్లిష్టంగా మారాయని ఈ సమావేశంలో మంత్రులు అభిప్రాయపడ్డారు. సమావేశంలో పాల్గొన్న సందర్భంగా బ్రిటన్ ఆర్థిక మంత్రి ఫిలిప్హామండ్ మాట్లాడుతూ... ఈయూతో చర్చించడం ద్వారా అనిశ్చితికి ముగింపు పలుకుతామన్నారు. -
వృద్ధి రేటు అంచనాలకు ఐఎంఎఫ్ కోత
వాషింగ్టన్: అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) తాజాగా అటు అంతర్జాతీయంగా, ఇటు దేశీయంగా 2016, 2017 వృద్ధి రేటు అంచనాకు 10 బేసిస్ పాయింట్లు (0.1 శాతం) కత్తెర వేసింది. వచ్చే రెండేళ్లలో భారత్ వృద్ధి రేటు 7.4 శాతంగా ఉంటుందని పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా రెండేళ్లలో ఈ రేటు వరుసగా 3.1 శాతం, 3.4 శాతంగా ఉంటుందనీ విశ్లేషించింది. వృద్ధి అంచనా కోతకు ప్రధానంగా యూరప్ నుంచి బ్రిటన్ విడిపోవడం (బ్రెగ్జిట్) కారణమని పేర్కొంది. -
భారత్ లో ఆర్థిక అసమానతలు అధికం
♦ ఐఎంఎఫ్ నివేదిక వెల్లడి ♦ ఆసియా పసిఫిక్‌లో భారత్, చైనాల్లోనే అత్యంత దుర్భరమని విశ్లేషణ సింగపూర్: భారత్, చైనాల్లో ఆర్థిక అసమానతలు అధికంగా ఉన్నట్లు అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) సంస్థ తన నివేదికలో పేర్కొంది. ఆసియా పసిఫిక్ దేశాల్లో- ఈ రెండుదేశాల్లోనే ఆర్థిక అసమానతలు తీవ్రంగా ఉన్నట్లు ఐఎంఎఫ్ పేర్కొంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలయినప్పటికీ ఈ దేశాల్లో ఆర్థిక సమతౌల్యతలు తగిన విధంగా లేవని పేర్కొంది. నివేదికలో మరిన్ని ముఖ్యాంశాలు.. ♦ భారత్, చైనాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. పేదరికమూ తగ్గుతోంది. అయితే ధనిక, పేద మధ్య వ్యత్యాసం తీవ్రంగా ఉంది. ♦ గతంలో ఆసియాలో వృద్ధి పంపిణి తగిన స్థాయిలో ఉండేది. అయితే భారత్, చైనాలు ఇటీవల పేదరికం తగ్గుతున్నా.... సమానత్వ సాధన ద్వారా వృద్ధి చెందడంలో వెనకబడుతున్నాయి. ♦ పట్టణ ప్రాంతాల్లో మధ్య తరగతి ఆదాయాల పెరుగుదలలో చైనా, థాయ్‌లాండ్‌లు కొంత విజయం సాధించగలిగాయి. అయితే భారత్, ఇండోనేసియాలు అధిక ఆదాయ స్థాయిలవైపు ఈ వర్గాన్ని తీసుకువెళ్లడంలో తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ♦ భారత్, చైనాల్లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజల ఆదాయాల్లో సైతం వ్యత్యాసం తీవ్రంగా పెరిగింది. చైనాలో వేగవంతమైన పారిశ్రామికీకరణ, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కోస్తా ప్రాంతాలపై దృష్టి పెట్టడం వంటి అంశాలు మారుమూల ప్రాంతాల వృద్ధికి విఘాతంగా మారుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో అధిక ద్రవ్యోల్బణం పరిస్థితులు కూడా పట్టణ-గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయ వ్యత్యాసానికి కారణం. ♦ పట్టణ ప్రాంతాల్లో విద్యా అవకాశాలు కూడా బలహీనంగా ఉన్నాయి. ♦ కాగా ఆదాయ వ్యత్యాసాలను తొలగించడానికి, ఆర్థిక పారదర్శకతను నెలకొల్పడానికి రెండు దేశాలు తగిన ప్రయత్నాలు చేస్తుండడం గమనార్హం. ఇవి రానున్న కాలంలో కొంత సత్ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. భారత్‌లో అందరినీ బ్యాంకింగ్ పరిధిలోకి తీసుకురావడానికి ప్రారంభించిన జన్‌ధన్ యోజన ప్రశంసనీయమైనది. దీనితోపాటు, ఆధార్, మొబైల్ ఆధారిత సేవలు, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ యాక్ట్ కింద కార్యకలాపాలు ఆర్థిక స్వావలంభన దిశలో ముఖ్యమైనవి. భారత్ వృద్ధి 7.4 శాతం: హెచ్ఎస్బీసీ న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) ఈ ఏడాది(2016-17) 7.4% వృద్ధిని సాధిస్తుందని ఆర్థిక సేవల దిగ్గజ సంస్థ- హెచ్ఎస్బీసీ తన పరిశోధనా నివేదికలో అంచనావేసింది. వచ్చే ఆరు త్రైమాసికాల్లో తయారీ రంగం పేలవంగా ఉండే అవకాశం ఉందనీ, అయితే అదే సమయంలో తగిన వర్షపాతం వల్ల వ్యవసాయ రంగం మంచి ఫలితాలను అందించే అవకాశం ఉందని వివరించింది. మొత్తం జీడీపీలో ఈ రంగాల వాటా వరుసగా 17, 15 శాతాలుగా ఉండే వీలుందని నివేదిక పేర్కొంది. ఇక బ్యాంకింగ్ రంగంలో మొండిబకాయిల సమస్య కొనసాగుతుందని పేర్కొంది. తగిన వర్షపాతం వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 7.6%గా నమోదవుతుందని ఆర్బీఐ అంచనావేసింది. ఆర్థికశాఖకు సంబంధించి ఈ అంచనాలు 7-7.75%గా ఉన్నాయి. ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్(ఏడీబీ) అంచనాలు కూడా హెచ్ఎస్బీసీ అంచనాల స్థాయిలోనే 7.4%గా ఉన్నాయి. వృద్ధికి సంస్కరణలు కీలకం: కొటక్: కాగా భారత్ సత్వర వృద్ధికి సంస్కరణలు కీలకమని కొటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ తన పరిశోధనా నివేదికలో పేర్కొంది. చైనాలో మందగమన ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో అంతర్జాతీయ ఇన్వెస్టర్ల దృష్టిని భారత్ దిశగా మళ్లించడానికి భారత్‌లో వ్యవస్థాగత సంస్కరణలు అవసరమని అభిప్రాయపడింది. ఈ సందర్భంగా వస్తు సేవల పన్ను, దివాలా కోడ్ అమలు, కార్మిక చట్ట సంస్కరణల అవసరాన్ని ఉద్ఘాటించింది. విద్యా, ఉపాధి రంగాల్లో మెరుగుదల, సామాన్యునికి సత్వర న్యాయం దిశలో చర్యలు అవసరమని సూచించింది. -
భారత్ కు ప్రైవేటు వినియోగం దన్ను
♦ 2016,2017లో వృద్ధి 7.5% ♦ ఐఎంఎఫ్ అంచనా ♦ చైనా, జపాన్‌లకు సవాళ్లు సింగపూర్: భారత్ ఆర్థిక వ్యవస్థ 2016, 2017లో 7.5 శాతం వృద్ధి సాధిస్తుందన్న తన అంచనాల్లో ఎటువంటి మార్పూ లేదని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) పేర్కొంది. బలహీన ఎగుమతులు, రుణ వృద్ధి రేటు తక్కువగా ఉండడం వంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ వినియోగ డిమాండ్ పటిష్టతే భారత్ వృద్ధికి కారణమవుతున్నట్లు తాజా ఆసియా, పసిఫిక్ ప్రాంతీయ ఆర్థిక అవుట్‌లుక్‌లో పేర్కొంది. మరిన్ని ముఖ్యాంశాలు.. ♦ ఇంధన ధరలు తక్కువగా ఉండడం, గృహ ఆదాయాలు పెరగడం వంటి అంశాలు భారత్ వినియోగ డిమాండ్ పెరుగుదలకు కారణం. ♦ వస్తు సేవల పన్ను అమలుసహా విద్యుత్, మైనింగ్ వంటి రంగాల్లో వ్యవస్థాగత సంస్కరణల అమలును భారత్ వేగవంతం చేయాలి. భూమి, కార్మిక చట్టాల సంస్కరణలు సైతం వృద్ధి బాటలో కీలకం. ♦ బలహీన ఎగుమతులు, రుణ వృద్ధి లేకపోవడం, బ్యాంకుల బలహీన బ్యాలెన్స్ షీట్లు, కంపెనీల లాభాల అనిశ్చితి వంటి అంశాలు ఆర్థిక వ్యవస్థపై భారం మోపుతున్నాయి. ♦ ప్రైవేటు పెట్టుబడుల్లో రికవరీ, మౌలిక రంగంలో ప్రభుత్వ భారీ పెట్టుబడుల అవకాశాలు వంటి అంశాలు ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు దోహదపడతాయి. ♦ ఆసియా పసిఫిక్ ప్రాంతం ప్రస్తుత, వచ్చే సంవత్సరాల్లో 5.3% వృద్ధిని సాధించవచ్చు. ♦ ఆసియాలో ప్రధానమైన చైనా, జపాన్ ఆర్థిక వ్యవస్థలకు సవాళ్లు కొనసాగుతాయి. ♦ 2015లో 6.9 శాతం వృద్ధి సాధించిన చైనా, 2016లో 6.5 శాతం వృద్ధి నమోదుచేసుకునే వీలుంది. 2017లో ఈ రేటు 6.2%కి తగ్గవచ్చు. ♦ జపాన్ వృద్ధి రేటు ఈ ఏడాది 0.5 శాతం, వచ్చే ఏడాది 0.1 శాతంగా నమోదయ్యే వీలుంది. ♦ ఆర్థిక సంక్షోభ పరిస్థితులను తట్టుకుని నిలబడే సామర్థ్యాలు ఆసియా దేశాలకు ఉన్నాయి. -
వర్థమాన దేశాల ద్రవ్య విధానాలు భేష్!
♦ ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ ♦ దీనిపై ఐఎంఎఫ్ వైఖరి మారాలని సూచన ముంబై: వర్థమాన దేశాలు అనుసరించే ద్రవ్య విధానాల పట్ల అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) సంస్థ వంటి బహుళజాతి సంస్థలు తమ ధోరణిని మార్చుకోవాలని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ సూచించారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ద్రవ్య, పరపతి విధానాలు పటిష్టంగా అన్నీ ఆలోచించి తగిన విధంగా తీసుకుంటారని, వర్థమాన దేశాల్లో అలాకాకుండా ప్రభుత్వం లేదా గవర్నర్ల ‘తిక్క’ నిర్ణయాలు ఉంటాయని బహుళజాతి సంస్థలు భావిస్తుంటాయని, ఈ ధోరణి సరికాదని రాజన్ ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో పేర్కొన్నారు. పటిష్ట రీతిలో రాజకీయ, ఆర్థిక పరిస్థితులన్నింటినీ పరిగణనలోకి తీసుకునే వర్థమాన దేశాల్లో కూడా ద్రవ్య పరపతి విధానాలు ఉంటాయని వివరించారు. ఏప్రిల్5 రేటు కోతలో మెజారిటీ నిర్ణయానికే రాజన్ ఓటు! ఆర్బీఐ ఈ నెల 5వ తేదీన బ్యాంకులకు తానిచ్చే రుణ రేటు రెపోను పావుశాతం తగ్గించింది. దీనితో ఈ రేటు 6.5 శాతానికి చేరింది. ఈ సందర్భంగా గవర్నర్ రఘురామ్ రాజన్, ఇందుకు సంబంధించి టెక్నికల్ అడ్వైజరీ కమిటీ మెజారిటీ అభిప్రాయానికే ఓటు చేశారు. ఈ విషయంలో ఆయన ప్రస్తుతం తనకుతానుగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నా... మెజారిటీ ప్రాతిపదికన రేటు కోత నిర్ణయం తీసుకున్నట్లు నేడు విడుదలైన నాటి సమావేశం మినిట్స్ వివరాలు తెలిపాయి. -
భారత్ ఆర్థిక బాట బాగుంది..
న్యూఢిల్లీ: భారత్ అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు బాగున్నాయని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) చీఫ్ క్రిస్టినా లగార్టీ పేర్కొన్నారు. ఆర్థికాభివృద్ధికి దోహదపడే రీతిలో భారీ మౌలిక ప్రాజెక్టులకు పెట్టుబడులు అందుతున్నాయని అన్నారు. వృద్ధికి ఈ అంశం కీలకమని తాము భావిస్తున్నట్లు వెల్లడించారు. దీనివల్ల దేశంలో మధ్యకాలికం నుంచి దీర్ఘకాలంలో ఉత్పాదకత మెరుగుపడుతుందన్న అంచనాలను వెలువరించారు. వ్యవసాయం, తయారీ రంగాల్లో సైతం అవరోధాలు తొలగించడానికి తగిన కృషి జరుగుతున్నట్లు తెలిపారు. మూడు రోజుల అడ్వాన్సింగ్ ఆసియా కాన్ఫరెన్స్‌లో ప్రసంగించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె పేర్కొన్న అంశాల్లో ముఖ్యమైనవి... * చమురు, గ్యాస్ నికర దిగుమతిదారుగా కొనసాగుతున్న భారత్, ఈ కమోడిటీల తక్కువ ధరల వల్ల అధిక ఆర్థిక ప్రయోజనాలను పొందగలుగుతోంది. తద్వారా మౌలిక రంగం ప్రాజెక్టుల్లో పెట్టుబడులకు అవకాశం కలిగింది. * ఒకపక్క జనాభా పెరుగుతున్నా... తగిన పటిష్ట విధానాలు అవలంబించడం వల్ల వృద్ధికి ఎటువంటి అడ్డంకులూ ఏర్పడ్డం లేదు. * ఇక్కడ వృద్ధికి అవకాశం ఉంది. పెరుగుతున్న జనాభా.. ఈ నేపథ్యంలో మార్కెట్ల విస్తృతి, సంస్కరణలకు కట్టుబడి ఉండడం, సాంకేతికంగా పురోగతి, ఆర్థిక వ్యవస్థలో సృజనాత్మకత అన్నీ వృద్ధికి బాటలు వేసే అంశాలే. * చమురు ధరలు దిగువ స్థాయిలో ఉండడం వల్ల... ఈ పరిణామం ద్రవ్యోల్బణం కట్టడి, సరళతర పరపతి విధానాలకు దోహదపడుతుంది. ఈ దిశలో భారత్ ముందుకు వెళుతోందని విశ్వసిస్తున్నా. ఉద్దేశపూర్వక ఎగవేతదారులపై చర్య: జయంత్ సిన్హా కాగా అడ్వాన్సింగ్ ఆసియా కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జయంత్ సిన్హా అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, ఉద్దేశపూర్వక ఎగవేతదారులపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అయితే ప్రపంచవ్యాప్తంగా మందగించిన ఆర్థిక ఒడిదుడుకుల వల్ల రుణాలు చెల్లించలేని స్థితిలో ఉన్న కార్పొరేట్లను... ఉద్దేశపూర్వక ఎగవేతదారులను ఒకే గాటన కట్టడం సరికాదని కూడా ఆయన ఈ సందర్భంగా అన్నారు. ప్రస్తుతం భారత్ పటిష్ట వృద్ధి బాటన నడుస్తోందన్నారు. అమెరికా, చైనా తరహాలోనే దీర్ఘకాలంలో పటిష్ట వృద్ధి బాటన నడవగలిగే సామర్థ్యాన్ని భారత్ ఆర్థిక వ్యవస్థ సముపార్జించుకుందన్నారు. జీడీపీ తలసరి ఇప్పటికీ చాలా తక్కువగా ఉందన్న ఆయన, ఈ విభాగంలో పురోగతికి తగిన అవకాశాలు ఉన్నాయని అన్నారు. ప్రభుత్వం సైతం ఈ అంశంపై దృష్టి సారించినట్లు తెలిపారు. కొన్ని పారిశ్రామిక దేశాలు అనుసరిస్తున్న అసాధారణ ద్రవ్య విధానాలను వ్యవస్థ ఎదుర్కొనడంపై మదింపు జరపాలన్న రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ జయంత్ సిన్హా పిలుపును ఆయన సమర్థించారు. కొన్ని దేశాల సంకుచిత విధానాలు మొత్తం ప్రపంచంపై కొంత ప్రతికూలత చూపే అవకాశం ఉందని కూడా అన్నారు. -
ఐఎంఎఫ్ లో పెరగనున్న భారత్ ఓటింగ్ హక్కులు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్)లో భారత్ ఓటింగ్ హక్కులు పెరగనున్నాయి. ఇందుకుగాను ఐఎంఎఫ్‌లో దేశం రూ.69,575 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. ఈ మేరకు గ్రాంట్‌ను కోరుతూ, ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ శుక్రవారం పార్లమెంటులో సప్లిమెంటరీ డిమాండ్ (ఆఫ్ గ్రాంట్)ను ప్రవేశపెట్టారు. దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న ఐఎంఎఫ్ కోటా సంస్కరణల అమలు వల్ల మొట్టమొదటిసారి సంస్థ 10 అతిపెద్ద కోటా సభ్యత్వం ఉన్న దేశాల జాబితాలో నాలుగు వర్థమాన దేశాలు- భారత్, బ్రెజిల్, చైనా, రష్యాలు చేరనున్నాయి. మిగిలిన ఆరు దేశాలు- అమెరికా, జపాన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, బ్రిటన్. 188 సభ్యదేశాల ఐఎంఎఫ్‌లో ప్రస్తుత భారత్ ఓటింగ్ రైట్స్ విలువ 2.34%. కోటా రూపంలో ఈ వాటా 2.44%. దేశాల ప్రాధాన్యతలకు అనుగుణంగా కోటా పెంపు సంస్కరణల అమలు వల్ల ఆయా దేశాల ఇన్వెస్ట్మెంట్ పరిమితులు పెరగడం వల్ల ఐఎంఎఫ్ ఆర్థిక పరిపుష్టి మరింత మెరుగుపడనుంది. -
ఐఎంఎఫ్ ఈడీగా సునీల్ సభర్వాల్
వాషింగ్టన్: స్వతంత్ర ఇన్వెస్టర్ సునీల్ సభర్వాల్ తాజాగా అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) ఆల్టర్నేట్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా నియమితులయ్యారు. అమెరికా సెనెట్ సునీల్ నియామకానికి ఆమోదం తెలిపింది. భారత సంతతికి చెందిన ఒక వ్యక్తి ఇలాంటి పదవిని పొందటం ఇదే తొలిసారి. సునీల్ సభర్వాల్ ఇదివరకు యూరోపియన్ ఈ-కామర్స్ పేమెంట్ సర్వీసెస్ సంస్థ ఒగాన్ బోర్డు చైర్మన్‌గా, జర్మనీకి చెందిన నెట్వర్క్ సర్వీసెస్ కంపెనీ ఈజీక్యాష్ కొనుగోలు విషయంలో వార్బర్గ్ పింకస్‌కు సలహాదారుడిగా, ఫస్ట్ డేటా కార్ప్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా, జీఈ క్యాపిటల్ ఎగ్జిక్యూటి వ్గా పలు రకాల బాధ్యతలను నిర్వహించారు. ఆయన ఓహియో యూనివర్సిటీ నుంచి బీఎస్ పట్టాను, లండన్ బిజినెస్ స్కూల్ నుంచి ఎంఎస్ పట్టాను పొందారు. అమెరికా ప్రెసిడెంట్ బరాక్ ఒబామా సునీల్‌ను ఈ పదవికి 2014 ఏప్రిల్‌లో తొలిసారి నామినేట్ చేస్తే, అటు తర్వాత గతేడాది మార్చిలో మళ్లీ రెండోసారి నామినేట్ చేశారు. -
చౌక చమురు భారత్ కు వరం
ఐఎంఎఫ్ విశ్లేషణ.. వాషింగ్టన్: తక్కువ స్థాయిలో ఉన్న ముడి చమురు ధరలే భారత్ ఆర్థిక వ్యవస్థకు కలిసి వస్తున్న అంశమని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) సంస్థ పేర్కొంది. గడచిన 18 నెలల కాలంలో క్రూడ్ ధర దాదాపు 70 శాతం పడి ప్రస్తుతం దాదాపు 35 డాలర్ల వద్ద కదులుతున్న నేపథ్యంలో.... ఐఎంఎఫ్ భారత్ వ్యవహారాల బృందం చీఫ్ పౌల్ క్యాషిన్ భారత్ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి చేసిన విశ్లేషణలో పలు కీలక అంశాలను పరిశీలిస్తే... ♦ వస్తువులు, సేవలపై వినియోగదారులు మరింత ఖర్చుచేయడానికి క్రూడ్ తక్కువ స్థాయి ధరలు దోహదపడతాయి. ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు, విదేశీ వాణిజ్య సమతౌల్య నిర్వహణకు సైతం ఇది లాభించే అంశం. ♦ భారత్ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 7.3 శాతం వృద్ధి రేటును సాధించే అవకాశం ఉంది. ఇది వచ్చే ఆర్థిక సంవత్సరం 7.5 శాతానికి పెరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దేశీయ వృద్ధి పటిష్టతకు అంతర్గత డిమాండ్ ప్రధాన కారణం. ♦ పెట్టుబడుల పరిస్థితి ఇంకా ఊపందుకోవాలి. ♦ మొండిబకాయిల సమస్య బ్యాంకింగ్ రంగంపై పెను భారాన్ని మోపుతోంది. ♦ అంతర్జాతీయ మందగమనం భారత్ విదేశీ వాణిజ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తోంది. కఠిన పరపతి విధానం కొనసాగించాలి.... రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కఠిన పరపతి విధానాన్ని దీర్ఘకాలం కొనసాగించాల్సిన అవసరం ఉందని తన స్టాఫ్ రిపోర్ట్‌లో ఐఎంఎఫ్ పేర్కొంది. ద్రవ్యలోటుకు సంబంధించి ప్రభుత్వం గాడితప్పదని తాజా జైట్లీ బడ్జెట్ హామీ ఇచ్చిన నేపథ్యంలో... రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు- ప్రస్తుతం 6.75 శాతం) కోత త్వరలో ఉంటుందని వస్తున్న పలు అంచనాల నేపథ్యంలో ఐఎంఎఫ్ ఈ సూచన చేయడం గమనార్హం. సమీప కాలానికి సంబంధించి ద్రవ్యోల్బణం లక్ష్యాలను సాధించడానికి కఠిన పాలసీ విధానమే అవసరమని నివేదిక అభిప్రాయపడింది. గృహ వినియోగానికి సంబంధించి నిజానికి ఇప్పటికీ ద్రవ్యోల్బణం కొంత ఎక్కువగానే ఉందని అభిప్రాయపడింది. ఈ సమస్య పరిష్కారానికి సరఫరాల సమస్యనూ తొలగించాల్సిన అవసరం ఉందని సూచించింది. ఏప్రిల్ 5న ఆర్బీఐ ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష జరపనుంది. ఆలోపే రెపో రేటు పావు శాతం తగ్గుతుందని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు. సేవల రంగం పేలవం: నికాయ్ న్యూఢిల్లీ: నికాయ్ సర్వీసెస్ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ ఫిబ్రవరిలో 3 నెలల కనిష్ట స్థాయికి పడింది. జనవరిలో 54.3 పాయింట్ల వద్ద ఉన్న ఈ సూచీ, ఫిబ్రవరిలో 51.4 పాయింట్లకు పడిపోయింది. డిమాండ్ తక్కువగా ఉండడం దీనికి కారణమని సర్వేను రూపొందించిన మార్కిట్సంస్థ ఎకనమిస్ట్ పాలెయానా డీ లీమా తెలిపారు. కాగా తయారీ-సేవల రంగాలు రెండింటికీ సంబంధించిన సూచీ జనవరిలో 11 నెలల గరిష్ట స్థాయిలో 53.3 పాయింట్ల వద్ద ఉంటే... ఇది ఫిబ్రవరిలో 51.2 పాయింట్లకు తగ్గింది. ఏప్రిల్ 5న ఆర్బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్ష నేపథ్యంలో ఈ నిరాశాకర ఫలితం వెలువడ్డం గమనార్హం. అయితే సూచీ 50 పాయింట్ల దిగువకు పడిపోతేనే దానిని క్షీణ దశగా భావిస్తారు. -
ఉద్దీపనలు కాదు... ఉపాధిపై దృష్టి!
♦ దేశాలకు ఐఎంఎఫ్ చీఫ్, జీ-20 ప్రముఖుల పిలుపు ♦ సంస్కరణాత్మక చొరవతోనే సవాళ్లను అధిగమించాలని సూచన షాంఘై: మందగమనంలో ఉన్న వృద్ధికి ఊపునివ్వటానికి ఉద్దీపన చర్యలపై ఆధారపడ కుండా... ఉపాధి కల్పనపై దృష్టి పెట్టాలని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) చీఫ్ క్రిస్టినా లగార్డ్, జీ-20 దేశాల అత్యున్నత స్థాయి అధికారులు పాల్గొన్న సదస్సు పిలుపునిచ్చింది. వ్యవస్థాగత సంస్కరణలపై జరిగిన ఈ కీలక సదస్సులో పలువురు ప్రముఖులు పాల్గొని... ప్రపంచ వృద్ధిపై కీలక సూచనలు చేశారు. సమావేశంలో క్రిస్టినా మాట్లాడుతూ, ఉపాధి కల్పనకు సంబంధించి 2014 జీ-20 సదస్సులో తీసుకున్న నిర్ణయాన్ని తక్షణం అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. నియంత్రణల సరళీకరణ, వాణిజ్య వృద్ధి, సాంకేతిక రంగం పురోగతి వంటి దాదాపు 800 అంశాల అమలుపై అప్పట్లో ఒక ఉమ్మడి అంగీకారం కుదిరిందని పేర్కొన్న ఆమె... వాటిలో చాలా వరకూ ఇప్పటికీ అమలుకునోచుకోలేదని ఆందోళన వ్యక్తంచేశారు. వృద్ధి అవకాశాలపై నీలినీడలు: ఓఈసీడీ ప్రపంచ ఆర్థిక వృద్ధి అవకాశాలపై నీలినీడలు కొనసాగుతున్నాయని ఆర్థిక విశ్లేషణా సంస్థ- ఓఈసీడీ తాజా నివేదికలో పేర్కొంది. అభివృద్ధి చెందుతున్న దేశాలు సైతం తమ సత్తాను కోల్పోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయని తెలిపింది. భారత్ విషయంలో వ్యవస్థాగత సంస్కరణలు ప్రస్తుతం వృద్ధికి కీలకమని తెలిపింది. -
బలహీనంగా ప్రపంచ ఎకానమీ: ఐఎంఎఫ్
దుర్బల దేశాల రక్షణకు కొత్త విధానాలు అవసరం వాషింగ్టన్: ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చాలా దుర్బలంగా ఉందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) హెచ్చరించింది. అత్యంత దుర్బలంగా ఉన్న దేశాలను రక్షించేందుకు కొత్త విధానాలను రూపొందించకపోతే పరిస్థితి మరింత తీవ్రమవుతుందని ఒక నివేదికలో పేర్కొంది. షాంఘైలో త్వరలో జీ20 కూటమి దేశాల ఆర్థిక మంత్రుల సమావేశం జరగనున్న నేపథ్యంలో ఐఎంఎఫ్ నివేదిక ప్రాధాన్యం సంతరించుకుంది. దీన్ని జీ20 సమావేశంలో ప్రవేశపెట్టనున్నారు. ప్రపంచ వృద్ధి మందగించిందని, మార్కెట్లలో సంక్షోభాలు.. చమురు ధరల పతనం.. రాజకీయభౌగోళిక వివాదాలతో వృద్ధి పట్టాలు తప్పే అవకాశాలు ఉన్నాయని ఐఎంఎఫ్ పేర్కొంది. ఆర్థిక సంక్షోభాలు పెరుగుతుండటం, ఆస్తుల ధరలు పడిపోతుండటం తదితర పరిణామాలతో ప్రపంచ ఎకానమీ రికవరీ మరింత బలహీనపడిందని ఐఎంఎఫ్ తెలిపింది. రిస్కులను కట్టడి చేయడానికి, ప్రపంచ ఎకానమీని వృద్ధి బాట పట్టించడానికి జాతీయ స్థాయిలోను, బహుళపక్ష స్థాయిలోను పటిష్టమైన విధానాలు అవసరమని పేర్కొంది. 2015 ఆఖరు నాటికి అంతర్జాతీయంగా కార్యకలాపాలు అనూహ్యంగా మందగించాయని, ఈ ఏడాది ప్రారంభంలో పరిస్థితి మరింత దిగజారిందని వివరించింది. వృద్ధికి పొంచి ఉన్న ముప్పులను ఎలా ఎదుర్కొనాలన్నదే షాంఘై చర్చల్లో ప్రధానాంశం కాగలదని పేర్కొంది. ఉదార ఆర్థిక విధానాలు కావాలి ... డిమాండ్‌ను పెంచేందుకు ప్రపంచ దేశాలు ఆర్థిక సహాయక ప్యాకేజీలివ్వడంతో పాటు సంస్కరణలను అమలు చేయాలని ఐఎంఎఫ్ సూచించింది. కఠిన ఆర్థిక విధానాల వల్ల వృద్ధి గతి మందగించకుండా అమెరికా ఫెడరల్ రిజర్వ్ సహా ప్రపంచ దేశాల సెంట్రల్ బ్యాంకులు ఉదార ద్రవ్య విధానాలు పాటించాల్సి ఉంటుందని పేర్కొంది. అయితే ద్రవ్యపరపతి విధానంపై మరీ ఎక్కువగా ఆధారపడిపోకూడదని, సమీప భవిష్యత్‌లో ద్రవ్య విధానాలు పెట్టుబడులకు ఊతమిస్తూ.. రికవరీకి తోడ్పడేలా ఉండాలని ఐఎంఎఫ్ వివరించింది. -
ఐఎంఎఫ్ లో కోటా సంస్కరణలు మొదలు
♦ టాప్ 10 పెద్ద సభ్య దేశాల్లో భారత్‌కూ చోటు ♦ బ్రిక్ దేశాలకు మరిన్ని ఓటింగ్ హక్కులు వాషింగ్టన్: చారిత్రక మార్పులకు తెరతీస్తూ అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) కోటా సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. భారత్, చైనాతో పాటు ఇతర వర్ధమాన దేశాలకు మరిన్ని ఓటింగ్ హక్కులు కల్పిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో తొలిసారి ఐఎంఎఫ్‌లోని 10 అతి పెద్ద సభ్య దేశాల్లో భారత్, చైనా, బ్రెజిల్, రష్యాకు (బ్రిక్ కూటమి) చోటు దక్కుతుంది. అలాగే, 6 శాతం పైగా కోటా షేర్లు వర్ధమాన మార్కెట్లకు బదిలీ కానున్నాయి. 2010లోనే కోటా, గవర్నెన్స్ సంస్కరణలకు ఐఎంఎఫ్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఆమోదం లభించింది. ఆ తర్వాత దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సంస్కరణలకు 2015లోగానీ అమెరికా కాంగ్రెస్ ఆమోదముద్ర వేయలేదు. ఈ సంస్కరణలతో ఐఎంఎఫ్ ఆర్థిక సామర్థ్యం రెట్టింపై.. శాశ్వత మూలనిధి వనరులు 477 బిలియన్ల ఎస్‌డీఆర్‌లకు (దాదాపు 659 బిలియన్ డాలర్లకు) చేరతాయి. 188 సభ్యదేశాలున్న ఐఎంఎఫ్‌లో భారత్‌కు ప్రస్తుతం 2.34 శాతం మేర ఓటింగ్ హక్కులు ఉన్నాయి. కోటా పరంగా 2.44 శాతం వాటా ఉంది. టాప్ 10 సభ్య దేశాల్లో అమెరికా, జపాన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, బ్రిటన్ ఉన్నాయి. సంస్కరణలతో సంస్థ విశ్వసనీయత, సమర్ధత, చట్టబద్ధత మరింత మెరుగుపడగలవని 14వ సాధారణ కోటా సమీక్షపై ప్రకటనలో ఐఎంఎఫ్ పేర్కొంది. -
మార్కెట్లు అతలాకుతలం
అంతర్జాతీయ వృద్ధిపై ఆందోళన ► ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి అంచనాల్లో ఐఎంఎఫ్ కోత ► కొనసాగుతున్న ముడి చమురు ధరల పతనం ► కరెన్సీ క్రాష్.. బంగారం వైపు పరుగులు ► సెన్సెక్స్ 418 పాయింట్లు డౌన్.. 24,062 వద్ద క్లోజ్ ► 126 పాయింట్ల నష్టంతో 7,309కు నిఫ్టీ అంతర్జాతీయ ఆర్థిక వృద్ధిపై ఆందోళన కారణంగా ప్రపంచ మార్కెట్లు బుధవారం అతలాకుతలమయ్యాయి. స్టాక్ మార్కెట్లు. ముడి చమురు ధర నిలువునా పతనం కాగా, బంగారం భగ్గుమంది. మరోవైపు ఇతర వర్థమాన దేశాల కరెన్సీల్లానే రూపాయి విలవిలలాడంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి వృద్ధి అంచనాల్లో కోత విధించడం, చైనా ఆర్థికాభివృద్ధి 25 సంవత్సరాల కనిష్టస్థాయికి పడిపోవడం ఇన్వెస్టర్లను భయాందోళనలకు లోనుచేసింది. దాంతో వారు ఈక్విటీలను విక్రయించి, సురక్షిత సాధనంగా భావించే పుత్తడివైపు పరుగులు తీసారు. ఆసియా, యూరప్, అమెరికా మార్కెట్లు భారీ స్థాయిలో పతనమయ్యాయి. అంతర్జాతీయంగా ఆర్థిక వృద్ధిపై ఆందోళనలు బుధవారం ప్రపంచ మార్కెట్లతో పాటే భారత స్టాక్ మార్కెట్‌ను కుప్పకూల్చాయి. స్టాక్ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ఇంట్రాడేలో 24వేల పాయింట్ల దిగువకు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 7,300 పాయింట్ల దిగువకు పతనమయ్యాయి. ఒకదశలో బీఎస్ఈ సెన్సెక్స్ 640 పాయింట్లకు పైగా పతనమైంది. చివరిలో కొంత కొనుగోళ్లు జరగడంతో 418 పాయింట్లు నష్టపోయి 24,062 పాయింట్ల వద్ద ముగి సింది. మోదీ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన నాటి(2014,మే 16) నుంచి చూస్తే ఇదే అత్యంత బలహీన స్థాయి. నిఫ్టీ 126 పాయింట్ల నష్టంతో 7,309 పాయింట్ల వద్ద ముగిసింది. అన్ని రంగాల సూచీలు నష్టపోయాయి. బ్యాంక్, లోహ, రియల్టీ షేర్లు బాగా నష్టపోయాయి. ఈ ఏడాది ఇప్పటివరకే నిఫ్టీ 20% పతనమైంది. మరింత పతనం: డాలర్‌తో రూపాయి మారకం కూడా భారీగా క్షీణించడం ప్రభావం చూపించింది. రూపాయి ఇంట్రాడేలో 68 మార్క్ దిగువకు పడిపోయింది. ముడి చమురు సరఫరా మరింతగా పెరుగుతుందని, దరలు మరింతగా తగ్గుతాయనే ఆందోళనకు చైనా ఆర్థిక వ్యవస్థ మందగమనం భయాలు కూడా తోడవుతుండటంతో మార్కెట్లు మరింత పతనమయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొనసాగుతున్న విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు, రూపాయి క్షీణత ఇన్వెస్టర్ల ఆందోళనను మరింత అధికం చేస్తున్నాయని హెమ్ సెక్యూరిటీస్ డెరైక్టర్ గౌరవ్ జైన్ వ్యాఖ్యానించారు. ప్రపంచ మార్కెట్లు సమీప భవిష్యత్తులో కోలుకునే అవకాశాల్లేవని రోబొబ్యాంక్కు చెందిన మైఖేల్ ఇవ్‌రీ వ్యాఖ్యానించారు. అయితే లార్జ్ క్యాప్ షేర్లు కొనుగోలు చేయడానికి ఇదే సరైన తరుణమని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ ఎస్. నరేన్ పేర్కొన్నారు. చైనా మందగమనం, ముడి చమురు ధరల పతనం, ప్రపంచ వృద్ధిపై ఆందోళనలు..మార్కెట్ పట్ల ఇన్వెస్టర్ల ప్రాధాన్యతను తగ్గిస్తున్నాయని బీఎన్పీ పారిబా ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్ వినోద్ నాయర్ అంటున్నారు. రోజంతా నష్టాలే.. సెన్సెక్స్ 24,326 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. ప్రపంచ వృద్ధి అంచనాల తగ్గింపుతో ఆసియా మార్కెట్లు పతనంతో నష్టాలు మరింత పెరిగాయి. ఇంట్రాడేలో 23,840 పాయింట్ల కనిష్ట స్థాయిని(మంగళవారం నాటి ముగింపుతో పోల్చితే 640 పాయింట్లు నష్టం) తాకింది. ఇక నిఫ్టీ 7,242-7,471 పాయింట్ల మధ్య కదలాడింది. బీఎస్ఈలో 400 కంపెనీల షేర్లకు కొనుగోలుదారులే కరువయ్యారు. మొత్తం 411కు పైగా కంపెనీలు లోయర్ సర్క్యూట్ బ్రేకర్‌ను తాకాయి. మూడు సెన్సెక్స్ షేర్లకే లాభాలు.. తాజా డిసెంబర్ క్వార్టర్లో అంచనాలను మించిన ఫలితాలను వెల్లడించినప్పటికీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ 3.7 శాతం క్షీణించి రూ.1,004 వద్ద ముగిసింది. దీంతో ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.12,613 కోట్లు ఆవిరైంది. 30 సెన్సెక్స్ షేర్లలో 3 షేర్లు (బజాజ్ ఆటో, హీరో మోటొకార్ప్, విప్రో)మాత్రమే స్వల్పంగా లాభపడ్డాయి. మిగిలిన 27 షేర్లు నష్టాల్లో ముగిశాయి. అదానీ పోర్ట్స్ 5.5 శాతం నష్టపోయింది. ఎస్బీఐ 5.1%, కోల్ ఇండియా 3.45%, మారుతీ3.4%, టాటా మోటార్స్ 3.3% చొప్పున నష్టపోయాయి. 1.94 లక్షల కోట్లు ఆవిరి సెన్సెక్స్ భారీ పతనం కారణంగా ఇన్వెస్టర్ల సంపద బుధవారం ఒక్క రోజే రూ.1.84 లక్షల కోట్లు ఆవిరైంది. బీఎస్ఈలో లిస్టైన్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.90,64,734 కోట్లకు తగ్గిపోయింది. పుత్తడి వెలుగులు... సురక్షిత మదుపు సాధనంగా పుత్తడికి ప్రాధాన్యత పెరుగుతోంది. బంగారం ధరలు రెండు నెలల గరిష్ట స్థాయికి ఎగిశాయి. న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.340 పెరిగి రూ.26,690కు చేరింది. అంతర్జాతీయంగానూ పుత్తడి మెరుపులు మెరిపిస్తోంది. న్యూయార్క్ ఫ్యూచర్స్ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర కడపటి సమాచారం అందేసరికి 1.5% ఎగసి 1,107 డాలర్లకు పెరిగింది. పాతాళానికి ప్రపంచ సూచీలు ఐఎంఎఫ్ వృద్ధి అంచనాల్లో కోత, ముడి చమురు ధరల పతనం కారణంగా ప్రపంచ మార్కెట్లు భారీగా నష్టాల పాలయ్యాయి. ఆసియా మార్కెట్లు 1-4 శాతం, యూరప్ మార్కెట్లు 3-6 శాతం నష్టపోయాయి. ముఖ్యంగా జపాన్, హాంకాంగ్ 3%పైగా పడిపోయాయి. కడపటి సమాచారం అందేసరికి అమెరికా మార్కెట్లు దాదాపు 3% నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఈ పతనం మరింతగా కొనసాగుతుందని, మరో రెండు, మూడు నెలల వరకూ బేర్ మార్కెట్ తప్పదని విశ్లేషకులు అంటున్నారు. ఎందుకీ పతనం... వృద్ధి అంచనాల్లో కోత: అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) సంస్థ ప్రపంచ వృద్ధి అంచనాలు తగ్గించడంతో ఆసియా, యూరప్ మార్కెట్లు భారీ నష్టాలపాలయ్యాయి. ఈ ఏడాది ప్రపంచ వృద్ధి 3.6 శాతంగా ఉండొచ్చని గతంలో పేర్కొన్న అంచనాలను ఐఎంఎఫ్ తాజాగా 3.4 శాతానికి తగ్గించింది. వచ్చే ఏడాది వృద్ధి అంచనాలను 3.8 శాతం నుంచి 3.6 శాతానికి తగ్గిం చింది. దీంతో అంతర్జాతీయంగా ఆర్థిక మాంద్యం తలెత్తుతుందేమోనన్న ఆందోళన, రుణ ఎగవేతలు పెరిగిపోతాయని, మరో మందగమనం తప్పదేమోనన్న భయాలు ఇన్వెస్టర్లను వణికించాయి. ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. 27 డాలర్ల దిగువకు క్రూడ్: అధిక సరఫరాల కారణంగా ముడి చమురు ధరలు మరింత పతనమవుతాయని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ(ఐఈఏ) హెచ్చరించడం ముడి చమురు ధరలను మరింత క్షీణింప జేసింది. కడపటి సమాచారం అందేసరికి న్యూయార్క్ లైట్‌స్వీట్, బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధరలు 12 ఏళ్ల కనిష్ట స్థాయిలో 27 డాలర్ల దిగువకు దిగజారాయి. తరలుతున్న విదేశీ నిధులు: విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీల నుంచి పెట్టుబడులను ఉపసంహరిస్తున్నారు. వీరి నికర అమ్మకాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. చైనా మందగమనం: చైనా తాజా జీడీపీ గణాంకాలు ఆ దేశ మందగమనాన్ని సూచిస్తుండటంతో ప్రపంచ మార్కెట్లపైనా ప్రభావం చపుతోంది. 28 నెలల కనిష్టానికి రూపాయి: మార్కెట్ల పతనంతో డాలర్‌తో రూపాయి మారకం 28 నెలల కనిష్టానికి పడిపోయింది. దిగుమతిదారుల నుంచి డా లర్లకు డిమాండ్ పెరగడంతో 23 పైసలు నష్టపోయి 67.95 వద్ద ముగిసింది. -
భారత్ ఆర్థికాభివృద్ధి 7.3 శాతమే!
వాషింగ్టన్: భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 7.3 శాతం వృద్ధి మాత్రమే సాధిస్తుందన్న అంచనాలను అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) పునరుద్ఘాటించింది. అయితే 2016-17, 1017-18లో మాత్రం ఈ రేటు 7.5 శాతానికి పెరుగుతుందని విశ్లేషించింది. అలాగే 2016కు సంబంధించి ప్రపంచ వృద్ధి అంచనాను 3.6 శాతం నుంచి 3.4 శాతానికి కుదించింది. ఈ మేరకు తన వరల్డ్ ఎకనమిక్ అవుట్‌లుక్ (డబ్ల్యూఈఓ)ను ఐఎంఎఫ్ అప్డేట్ చేసింది. మరిన్ని ముఖ్యాంశాలు చూస్తే.. * భారత్ వృద్ధి ధోరణి కొనసాగే అవకాశం ఉండగా.. చైనా మాత్రం తిరోగమించనుంది. 2016లో వృద్ధి రేటు 6.3% ఉండే వీలుంది. 2017లో ఇది మరింతగా 6%కి తగ్గొచ్చు. * చైనా మందగమనం, ప్రపంచవ్యాప్తంగా తయారీ రంగ బలహీనతలతో పలు దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. * అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో మందగమనం, దిగువస్థాయి కమోడిటీ ధరలు, కఠిన ద్రవ్య పరిస్థితుల దిశగా అమెరికా అడుగుల వంటివి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సవాళ్లను విసురుతున్నాయి. ఈ సవాళ్లను విజయవంతంగా నిర్వహించలేకపోతే... ప్రపంచ వృద్ధి పట్టాలు తప్పుతుంది. * అభివృద్ధి చెందిన దేశాల్లో వృద్ధి రికవరీ సజావుగా సాగట్లేదు. ఇదే ధోరణి ఇకముందూ కొనసాగే వీలుంది. * చమురు ధరలు తగ్గినప్పటికీ, ఈ కమోడిటీ దిగుమతి దేశాల్లో వినియోగం బలహీనంగానే ఉంది. తగ్గిన ప్రయోజనాన్ని వినియోగదారుకు బదలాయించకపోవడం దీనికి ఒక కారణం. * అభివృద్ధి చెందిన దేశాలు 2016లో 0.2 శాతం వృద్ధి రేటును సాధిస్తాయి. అయితే 2017 ఏడాదిలో ఈ రేటు 2.1 శాతానికి పెరిగే అవకాశం ఉంది. వర్థమాన దేశాలకు సంబంధించి ఈ రేటు 4.3 శాతం, 4.7 శాతంగా ఉండే వీలుంది. 2015లో ఈ రేటు 4 శాతంగా ఉంది. -
ఐఎంఎఫ్ చోద్యం చూస్తూ కూర్చుంది..
సంస్థ విధానాలను ఆక్షేపించిన ఆర్బీఐ గవర్నర్ రాజన్ ముంబై: ఉదార ఆర్థిక విధానాల విషయంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) వ్యవహరించిన తీరును రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ తీవ్రంగా ఆక్షేపించారు. సంపన్న దేశాల మొదలుపెట్టిన విధానాలు వర్ధమాన మార్కెట్లలో అల్లకల్లోలం సృష్టిస్తుంటే ఐఎంఎఫ్ వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు మాత్రం చప్పట్లు కొడుతూ, చోద్యం చూస్తూ కూర్చున్నాయని వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా తలెత్తే పరిణామాలను పరిశీలించి తగు చర్యలు తీసుకోవాల్సిన ఐఎంఎఫ్... దానికి పూర్తి భిన్నంగా వ్యవహరించిందన్నారు. ఒక దేశానికి మేలు చేసే విధానాలు యావత్ ప్రపంచానికి మేలు చేస్తాయన్న రీతిలో ఐఎంఎఫ్ అధ్యయనాలు ఉంటున్నాయని రాజన్ ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా పేర్కొన్నారు. కానీ, ఏ సెంట్రల్ బ్యాంకుకైనా నిర్దేశిత లక్ష్యం ఆయా దేశాలకు ప్రయోజనం కలిగించే చర్యలు తీసుకోవడమే తప్ప యావత్ప్రపంచం ప్రయోజనార్థం పనిచేయడం కాదన్నారు. సెంట్రల్ బ్యాంకులు స్వదేశం తర్వాతే మిగతా ప్రపంచదేశాలకు రెండో ప్రాధాన్యమే ఇస్తాయని చెప్పారు. అంతర్జాతీయంగా సెంట్రల్ బ్యాంకులు ప్రతిద్రవ్యోల్బణంపై ఆందోళన చెందుతున్నాయని, దాని బారి నుంచి తప్పించుకునేందుకు వృద్ధికి ఊతమిచ్చే చర్యల కోసం ప్రయత్నిస్తున్నాయని రాజన్ పేర్కొన్నారు. పెట్టుబడులు పెడితేనే 9% వృద్ధి.. తొమ్మిది శాతం వృద్ధి రేటు సాధించాలంటే భారీ స్థాయిలో పెట్టుబడులు రావడంతో పాటు సరఫరాలను మెరుగుపర్చి, డిమాండ్‌కి ఊతమిచ్చే చర్యలు అవసరమని రాజన్ చెప్పారు. అయితే, ఇదంతా నిరంతర ప్రక్రియని, ఒక్క రోజులో సాధ్యపడేది కాదని పేర్కొన్నారు. వాస్తవిక వృద్ధి సాధన కష్టంతో కూడుకున్నదన్నారు. కానీ ఏదో రకంగా వృద్ధి సాధించాలనే ఉద్దేశంతో జనాకర్షక విధానాలు పాటించడం సరికాదని రాజన్ తెలిపారు. సరైన ఆర్థివేత్తలు తగినంతమంది లేరు.. అంతర్జాతీయ వేదికలపై దేశానికి ప్రాతినిధ్యం వహించగలిగే సత్తా ఉన్న మంచి ఆర్థికవేత్తలు భారత్‌లో తగినంత మంది లేరని కూడా రాజన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. కెనడా-భారత్ సారథ్యంలో.. ఏర్పాటైన జీ20 మార్గదర్శకాల కమిటీలో కెనడా ఆర్థికవేత్తలు ఏకంగా ఏడుగురు ఉన్నారని, కానీ భారత్ తరఫునుంచి అంత మంది లేరని రాజన్ చెప్పారు. ఆ నైపుణ్యాలు గల వారు ప్రభుత్వంలో చాలా తక్కువ మంది ఉండటం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని తెలిపారు. మరోవైపు, ఉద్యోగాల కల్పన మెరుగుపడాలంటే చిన్న సంస్థలకు తోడ్పాటు అందించాల్సిన అవసరం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. అటు, వ్యాపారాలకు అనువైన పరిస్థితులు కల్పించాల్సిన అవసరం కూడా ఉందని రాజన్ చెప్పారు. -
అనిశ్చిత ప్రపంచంలో ‘వెలుగు’ భారత్..!
వాషింగ్టన్: నెమ్మదించిన ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ ఒక వెలుగురేఖగా అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) చీఫ్ క్రిస్టినా లగార్డ్ అభివర్ణించారు. వాషింగ్టన్లో చేసిన ఒక ప్రసంగంలో ఆమె ఈ వ్యాఖ్య చేశారు. ప్రపంచంలో పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు తీవ్ర అనిశ్చితిలో చిక్కుకున్నట్లు పేర్కొన్నారు. అమెరికా వడ్డీరేట్ల పెంపు అవకాశాలు, చైనాలో బలహీనతలు అనిశ్చితికి కారణమవుతున్నాయని, తీవ్ర మార్కెట్ ఒడిదుడుకులకు దారితీస్తున్నాయని ఆమె అన్నారు. ఇంకా ఏమన్నారంటే... ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 2015లో మందగమనంలోనే కొనసాగుతుంది. వచ్చే ఏడాది కొంత పుంజుకోవచ్చు. ఎగుమతుల ఆధారిత ఆర్థిక వ్యవస్థ చైనా వృద్ధి మందగమనంలోకి జారిపోతోంది. ఆర్థిక వ్యవస్థలో సంస్కరణలు తెస్తుండడం చైనాకు సంబంధించి ఆహ్వానించదగిన పరిణామం. ఆదాయాల పెంపునకు, ప్రజల జీవన ప్రమాణాల మెరుగు దిశలో ఈ చర్యలు దోహదపడతాయని భావిస్తున్నాం. వెరసి దీర్ఘకాలంలో వృద్ధి పురోగతికి దోహదపడే వీలుంది. క రష్యా, బ్రెజిల్ వంటి ఆర్థిక వ్యవస్థలు సైతం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. లాటిన్ అమెరికాలోని పలు దేశాలు వేగంగా ఆర్థిక మందగమనంలోకి జారిపోతున్నాయి. చిన్న స్థాయి ఆదాయ దేశాలపై కూడా ప్రతికూల ప్రభావాలు పెరుగుతున్నాయి. ఆయా అంశాలన్నీ అంతర్జాతీయ ఆర్ధిక పరిస్థితులను తీవ్రంగా బలహీనపరుస్తున్నాయి. ఫైనాన్షియల్ స్థిరత్వం ఇప్పటికిప్పుడు జరుగుతుందన్న భరోసా లేదు. కొంతలో కొంత ఆశావహ అంశం ఏమిటంటే- అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలు స్వల్పంగా కోలుకుంటున్న సంకేతాలు కనిపిస్తుండడం. యూరో ప్రాంతం, జపాన్ సానుకూల వృద్ధిలోకి మారుతున్నాయి. అమెరికా, బ్రిటన్లలో కూడా పరిస్థితి మెరుగుపడుతోంది. అంతర్జాతీయ మందగమనం, కమోడిటీ ధరల క్షీణత వంటి అంశాల కారణంగా ప్రపంచ వాణిజ్య వృద్ధి పడిపోతోంది. క్రూడ్ ధరలు పడిపోతుండడం వనరుల ఆధారిత ఆర్థిక వ్యవస్థలకు ఇబ్బందిగా మారింది. -
కఠిన షరతులకు గ్రీసు ఓకే?
ఏథెన్స్ : బెయిలవుట్ ప్యాకేజీ ప్రతిపాదనలకు గురువారం రాత్రి గ్రీసు కేబినెట్ ఆమోదముద్రవేసింది. ఈ అర్థరాత్రికల్లా యూరోపియన్ సెం ట్రల్ బ్యాంక్, ఐఎంఎఫ్ తదితర రుణదాతలకు ఆ ప్రతిపాదనల్ని గ్రీసు పంపవచ్చని భావిస్తున్నారు. గత ఆదివారం రిఫరెండం నిర్వహణకు కారణమైన కఠిన షరతులకే గ్రీసు ప్రభుత్వం ఓకే చెపుతూ ప్రతిపాదనల్ని తయారుచేసిందన్న వార్త లు వెలువడుతున్నాయి. 50 బిలియన్ యూరోల బెయిలవుట్ ప్యాకేజీని కోరుతూ 13 బిలియన్ యూరోల మేర పెన్షన్ సంస్కరణలు, వ్యయాల కోత, పన్నుల పెంపు వంటివి అమలుచేయడానికి సంసిద్ధత వ్యక్తంచేస్తూ గ్రీసు ప్రతిపాదనల్ని రూపొందించిందని అనధికార వార్తలు వెలువడుతున్నాయి. -
వృద్ధిలో చైనాను మించనున్న భారత్: ఐఎంఎఫ్
వాషింగ్టన్ : వృద్ధి రేటు విషయంలో చైనాను భారత్ అధిగమించనుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) తెలిపింది. 2013లో 7.7 శాతంగా ఉన్న చైనా వృద్ధి రేటు ఈ ఏడాది 6.8 శాతానికి, వచ్చే ఏడాది 6.3 శాతానికి తగ్గనుందని పేర్కొంది. అదే సమయంలో 2013లో 6.9 శాతంగా ఉన్న భారత్ స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి 2015, 2016లో 7.5 శాతం మేర ఉండగలదని వరల్డ్ ఎకనమిక్ అవుట్‌లుక్ (డబ్ల్యూఈవో) జులై నివేదికలో ఐఎంఎఫ్ తెలిపింది. వర్ధమాన దేశాల్లో వృద్ధి ఓ మోస్తరు స్థాయిలో ఉంటుందని, సంపన్న దేశాలు క్రమక్రమంగా వృద్ధి బాట పట్టగలవని వివరించింది. 2015లో ప్రపంచ దేశాల వృద్ధి రేటు గతేడాదితో పోలిస్తే స్వల్ప తగ్గుదలతో 3.3 శాతంగా ఉండొచ్చని, వచ్చే ఏడాది కొంత మెరుగుపడి 3.8 శాతానికి పెరగొచ్చని ఐఎంఎఫ్ తెలిపింది. 2014లో 1.8 శాతంగా ఉన్న సంపన్న దేశాల వృద్ధి ఈ ఏడాది 2.1 శాతానికి, 2016లో 2.4 శాతానికి పెరగొచ్చని పేర్కొంది. -
గ్రీస్ డిఫాల్ట్..
ఐఎంఎఫ్‌కు రుణ చెల్లింపుల్లో - యూరోజోన్, రుణదాతలకు తాజా సంస్కరణల ప్రతిపాదన - కొత్త బెయిలవుట్కోసం గ్రీస్ ప్రధాని విజ్ఞప్తి.. బ్రసెల్స్: అనుకున్నంతా అయింది. ఆఖరినిమిషం వరకూ జరిగిన చర్చలు విఫలమయ్యాయి. అప్పుల ఊబిలో కూరుకుపోయిన గ్రీస్ చివరకు ఐఎంఎఫ్‌కు చెల్లించాల్సి ఉన్న 1.7 బిలియన్ డాలర్ల బకాయి విషయంలో చేతులెత్తేయడంతో అనధికారికంగా డిఫాల్ట్ జరిగిపోయింది. తమకు బకాయిలు అందలేదని ఐఎంఎఫ్ అధికార ప్రతినిధి కూడా వాషింగ్టన్లో ధ్రువీకరించారు. దీంతో ఐఎంఎఫ్ చెల్లింపుల్లో డిఫాల్ట్ అయిన తొలి అభివృద్ధి చెందిన దేశంగా గ్రీస్ నిలిచింది. అంతేకాకుండా 2001లో జింబాబ్వే తర్వాత ఐఎంఎఫ్ రుణచెల్లింపుల్లో డిఫాల్ట్ అయిన మొట్టమొదటి దేశం కూడా ఇప్పుడు గ్రీస్ కావడం గమనార్హం. అయితే నిర్ణీత తేదీనాటికి రుణ వాయిదా చెల్లింపు విఫలమైన తర్వాత నెలరోజులవరకూ ఆ మొత్తం అందకపోతే, అధికారికంగా ఆ దేశం దివాలా తీసినట్లు ఐఎంఎఫ్ ప్రకటిస్తుంది. మరోపక్క, ఈయూతో తాజాగా చర్చలు జరిపేందుకు వీలుగా చెల్లింపుల డెడ్‌లైన్ గడువు పెంచే అంశాన్ని కూడా ఐఎంఎఫ్ పరిశీలిస్తోంది. పాత బకాయి చెల్లిస్తే మళ్లీ తమ రుణాలు కొనసాగుతాయని ఐఎంఎఫ్ ప్రతినిధి గెర్రీ రైస్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, గ్రీస్ ప్రధాని అలెక్సిస్ సిప్రస్ తమకు మరో కొత్త బెయిలవుట్ ప్యాకేజీని ఇవ్వాల్సిందిగా మరోసారి రుణదాతలకు విజ్ఞప్తి చేశారు. అయితే, గతంలో తాము ప్రతిపాదించిన బెయిలవుట్ షరతులపై ఆదివారం గ్రీస్‌లో జరగనున్న రిఫరెండం పూర్తయ్యేదాకా ఎలాంటి సంప్రదింపులూ సాధ్యంకాదని జర్మనీ ఆర్థిక మంత్రి ఉల్ఫ్‌గాంగ్ షాబుల్ తేల్చిచెప్పారు కూడా. అయితే, గ్రీస్ ప్రధాని తాజా విజ్ఞప్తిపై యూరోజోన్ ఆర్థిక మంత్రులు బుధవారం పొద్దుపోయాక చర్చలుజరిపారు. ఆదివారం వరకూ ఇక ఎలాంటి సంప్రదింపులూ జరపకూడదని వారు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గ్రీస్ తమ షరతులకు అంగీకరించకపోవడంతో యూరోపియన్ యూనియన్(ఈయూ)-అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్) అందిస్తూవస్తున్న బెయిలవుట్ ప్యాకేజీని మంగళవారం(జూన్ 30) అర్ధరాత్రితో నిలిపివేశాయి. దీంతో ఐఎంఎఫ్‌కు బకాయి చెల్లించలేక గ్రీస్ డిఫాల్ట్కావాల్సి వచ్చింది. ఐదేళ్ల తర్వాత మళ్లీ గ్రీస్ ఎలాంటి అంతర్జాతీయ ఆర్థిక సాయం లేకుండా ఒంటరైంది. మరింత దిగజారిన పరిస్థితులు... గ్రీస్ అధికారికంగా డిఫాల్ట్ కావడంతో అక్కడ ఆర్థిక సంక్షోభ పరిస్థితులు మరింత తీవ్రం అవుతున్నాయి. ఈ నెల 6 వరకూ బ్యాంకులను మూసేయడంతో ప్రజలు రోడ్లమీదకు వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఏటీఎంల ముందు క్యూ కడుతున్నారు. అయితే, పెన్షనర్లకు మాత్రం తమ సొమ్ము తీసుకోవడానికి వీలుగా బుధవారం సుమారు 1,000 బ్యాంక్ బ్రాంచ్‌లు తెరిచినట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. కాగా, గ్రీస్ ప్రధాని తాజాగా రుణదాతలకు రాసిన తాజా విజ్ఞప్తి లేఖలో బెయిలవుట్ షరత్తుల్లో కొన్ని సడలింపులు ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. ఇందులో ముఖ్యంగా తమ దీవుల్లో ఇప్పుడున్న 30 శాతం వ్యాట్ రాయితీని యథాతథంగా కొనసాగనివ్వాలని.. అదేవిధంగా 2012 నాటి పెన్షన్ సంస్కరణలను ఈ ఏడాది అక్టోబర్‌దాకా వాయిదా వేయాలని సిప్రస్ ప్రతిపాదించారు. దీనికి ఓకే అంటే రుణదాతలు గతంలో ప్రతిపాదించిన డీల్‌కు తాము ఆమోదం తెలుపుతామని పేర్కొన్నారు. కాగా, యూరోజోన్ నుంచి వైదొలిగే ప్రమాదాన్ని నివారించాలంటే తమకు యూరోపియన్ స్థిరత్వ యంత్రాంగం(ఈఎస్ఎం) నుంచి మరో 30 బిలియన్ యూరోల విలువైన బెయిలవుట్ ప్యాకేజీ ఇవ్వాలని గ్రీస్ కోరుతోంది. అంతేకాకుండా రెండేళ్లపాటు తమ రుణాలన్నింటినీ పునర్వ్యవస్థీకరించాలని కూడా విజ్ఞప్తి చేసింది. దీనికి అంగీకరిస్తే గ్రీస్‌కు ఇది మూడో బెయిలవుట్ ప్యాకేజీ అవుతుంది. 2010 నుంచి ఇప్పటివరకూ ఈయూ-ఐఎంఎఫ్‌లు రెండు ప్యాకేజీలు(240 బిలియన్ యూరోలు)ను అందిస్తూవచ్చాయి. అయితే, గ్రీస్‌కు ఇస్తున్న సహాయ ప్యాకేజీ మంగళవారం అర్ధరాత్రితోనే ముగిసిపోయిందని.. అంతేకాకుండా ఈయూ ఆఫర్‌ను గతవారంలోనే గ్రీస్ ప్రభుత్వం తిరస్కరించిన నేపథ్యంలో ఇప్పుడు గత ప్రతిపాదనలకు తావులేదని జర్మనీ ఆర్థిక మంత్రి స్పష్టంచేశారు. రిఫరెండం నిలిపివేత సంకేతాలు... కాగా, బెయిలవుట్ షరతులకు వ్యతిరేకంగా ఓటు వేయాలన్న వాదనలు ఊపందుకుంటున్న నేపథ్యంలో ఆదివారం జరగనున్న రెఫరెండంను విరమించుకోవాలని కూడా గ్రీస్ ప్రధాని సిప్రస్పై యూరోపియన్ నేతలు ఒత్తిడితీసుకొస్తున్నారు. అయితే తమ కొత్త బెయిలవుట్ విజ్ఞప్తికి యూరోజోన్ మంత్రులు అంగీకరిస్తే.. రిఫరెండంను సస్పెండ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు గ్రీస్ అధికారిక వర్గాలు సంకేతాలిచ్చాయి. -
సరళ విధానాలనే నిందించొద్దు...
వాషింగ్టన్ : ప్రపంచంలోని పలు సెంట్రల్ బ్యాంకులు అనుసరిస్తున్న సరళ పరపతి విధానాలే ఆర్థిక సంక్షోభాలకు ఆజ్యం పోస్తున్నాయన్న వాదనలను అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) తోసిపుచ్చింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 1930 నాటి మహా మాంద్యం తరహా సమస్యలోకి జారిపోతోందని.. దీనికి ప్రధానంగా సెంట్రల్ బ్యాంకులు పోటాపోటీగా ప్రకటిస్తున్న సహాయ ప్యాకేజీలు, సరళ పాలసీలే కారణమని ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ తాజాగా హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఒక్క సరళ పాలసీవల్లే ఆర్థిక సంక్షోభాల్లోకి జారిపోతున్నామంటూ నిందించడం తగదని ఐఎంఎఫ్ తన పరిశోధన పత్రంలో పేర్కొంది. గత సంక్షోభాలకు కారణం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వాన్ని కాపాడేందుకు పటిష్టమైన నియంత్రణ యంత్రాంగం లేకపోవడమేనని తెలిపింది. 2007-08 నాటి ప్రపంచ ఆర్థిక సంక్షోభాన్ని ముందుగానే ఊహించిన అతికొద్ది మంది ఆర్థికవేత్తల్లో రాజన్ ఒకరు. రాజన్ అలా అనలేదు...: మహా మాంద్యం తరహా సమస్యల్లోకి జారిపోతున్నామని రాజన్ వ్యాఖ్యానించలేదని ఆదివారం ఆర్బీఐ వివరణ ఇచ్చింది. అప్పటి ఆర్థిక మాంద్యానికి కేంద్ర బ్యాంకుల విధానాలతో పాటు పలు కారణాలున్నాయని.. ప్రస్తుత విధానాలు, అప్పటి వ్యూహాల్లా మారిపోవొచ్చని మాత్రమే వ్యాఖ్యానించినట్లు ఆర్బీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. -
2015లో వృద్ధి 7.5 శాతం: మూడీస్
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ స్థూల ఉత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 2015లో 7.5 శాతం ఉంటుందని రేటింగ్ సంస్థ మూడీస్ అంచనావేసింది. 2014లో ఈ రేటు 7.2 శాతం. వడ్డీరేట్ల తగ్గింపు వల్ల వ్యవస్థలో ప్రైవేటు రంగం పెట్టుబడి పెరుగుతుందని విశ్లేషించింది. జనవరి-మార్చి మధ్య జీడీపీ వృద్ధి 7.3 శాతంగా నమోదయ్యే అవకాశం ఉన్నప్పటికీ, మున్ముందు క్వార్టర్లలో ఈ రేటు మరింత పురోగమించడానికే తగిన అవకాశాలు ఉన్నాయని తన తాజా నివేదికలో తెలిపింది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి రేటు చైనాకన్నా అధికంగా 7.5 శాతంగా ఉంటుందని ఇప్పటికే అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్), ప్రపంచబ్యాంకులు అంచనా వేయడం తెలిసిందే. -
భారత్‌కు ఉజ్వల భవిత: ఐఎంఎఫ్
- 2014-15లో వృద్ధి 7.2 శాతం - పలు రంగాల్లో సంస్కరణలు అమలు చేయాలని సూచన వాషింగ్టన్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశం 7.2% ఆర్థిక వృద్ధిని సాధిస్తుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) అంచనా వేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ రేటు 7.5%గా ఉంటుందని పేర్కొంది. నిజానికి ప్రభుత్వ అంచనాలకన్నా ఇవి తక్కువ. కేంద్రం అంచనాల ప్రకారం ఈ రేట్లు వరుసగా 7.4%, 8-8.5% శ్రేణిలో ఉన్నాయి. అయితే ఆర్థిక రంగానికి సంబంధించి భారత్‌కు ప్రపంచంలో ప్రత్యేక స్థానం ఉందని ఐఎంఎఫ్ వెల్లడించింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తక్కువ స్థాయిలో కొనసాగుతుండటం, బంగారం దిగుమతులు తగ్గడం, కరెంట్ అకౌంట్ లోటు కట్టడి, విధాన నిర్ణయాల సానుకూలత వంటి అంశాలు దేశంలో ఆర్థిక పునరుత్తేజానికి దోహదపడతాయని విశ్లేషించింది. ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటిగా మారిందని ఇండియా ఆర్థిక వ్యవస్థకు సంబంధించి విడుదల చేసే వార్షిక నివేదికలో పేర్కొంది. ముఖ్యాంశాలివీ.. ⇒ వ్యవస్థాగత సంస్కరణలను వేగవంతం చేస్తూ... పెట్టుబడుల ప్రక్రియ పునరుత్తేజానికి భారత్ తగిన చర్యలు తీసుకోవాలి. ⇒ కొత్తగా పెట్టుబడులు పెడుతున్న ప్రాజెక్టుల అమలు ప్రారంభమవుతోంది. ప్రత్యేకించి విద్యుత్, రవాణా రంగాల్లో ఇది కనబడుతోంది. ⇒ ఫైనాన్షియల్ రంగం బలోపేతమవుతోంది. ఆర్థిక వ్యవస్థలో దేశ ప్రజలందరినీ భాగస్వాముల్ని చేయడానికి దోహదపడే మరో అంశమిది. ⇒ అంతర్జాతీయంగా, దేశీయంగా కొన్ని సవాళ్లున్నాయి. అయితే వీటిని తట్టుకునే సామర్థ్యం భారత్‌కుంది. అమెరికాలో వడ్డీరేట్ల పెంపు అంతర్జాతీయంగా ప్రధాన సవాలు కాగా, దేశీయంగా చూస్తే కార్పొరేట్ రంగం బలహీనత కీలకం. దీనివల్ల మొండిబకాయిలు పెరిగే అవకాశముంది. ⇒ జీడీపీ గణాంకాల సవరణలు తయారీ, సేవల రంగాల నిజ పనితీరుకు దర్పణం పడుతున్నాయి. ⇒ ద్రవ్యోల్బణం కట్టడికి ప్రభుత్వ చర్యలు తగిన విధంగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆర్బీఐ వడ్డీరేట్ల తగ్గింపు సంకేతాలు హర్షణీయం. ⇒ వచ్చే 15 ఏళ్లలో భారత్‌లో యువత ప్రధానపాత్ర పోషించనుంది. ప్రపంచంలో భారత్‌కే లభిస్తున్న ప్రత్యేక అవకాశమిది. 10 కోట్ల మంది జాబ్ మార్కెట్లోకి ప్రవేశించే అవకాశముంది. వీరికి ఉపాధి అవకాశాలు భారీగా కల్పించాల్సి ఉంది. ⇒ ఇంధనం, మైనింగ్, విద్యుత్, మౌలికరంగం, భూసేకరణ, పర్యావరణం, వ్యవసాయ, లేబర్ మార్కెట్, విద్యా ప్రమాణాల మెరుగుదల వంటి అంశాల్లో సంస్కరణలను అమలు చేయాలి. -
చైనా వృద్ధి లక్ష్యం 7 శాతానికి తగ్గింపు
బీజింగ్: చైనా ప్రస్తుత సంవత్సరం (2015) స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు లక్ష్యాన్ని 7 శాతంగా నిర్దేశించుకుంది. గత ఏడాది చైనా వృద్ధి లక్ష్యం 7.5 శాతం. అయితే 7.4 శాతం వృద్ధి నమోదయ్యింది. ఇంత కనిష్ట స్థాయి వృద్ధి నమోదుకావడం 24 సంవత్సరాల్లో తొలిసారి. గతేడాది వృద్ధి రేటుతో పోలిస్తే ప్రస్తుత సంవత్సరం చైనా లక్ష్యం ప్రకారం రేటు మరింత త గ్గనుంది. చైనా పార్లమెంటు వార్షిక సమావేశం సందర్భంగా చేసిన ప్రసంగంలో ప్రధాని లీ కిక్వైంగ్ 7 శాతం వృద్ధి రేటు లక్ష్యాన్ని ప్రకటిస్తూ దేశ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న అంశాలను ప్రస్తావించారు. బొగ్గు వంటి కాలుష్య కారక ఇంధన వనరులపై ఆధారపడ్డాన్ని తగ్గించుకోవాలని ఈ సందర్భంగా అన్నారు. దేశంలో ప్రతి ద్రవ్యోల్బణం ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో, డిమాండ్ పెంపునకు చర్యలు అవసరమని అన్నారు. జనవరిలో వార్షిక రిటైల్ ద్రవ్యోల్బణం ఐదేళ్ల కనిష్ట స్థాయి 0.8 శాతానికి పడిపోయింది. 2014 మొత్తంలో ద్రవ్యోల్బణం 3.5 శాతం ఉండగా, 2015లో ఇది కనీసం 3 శాతం స్థాయిలో ఉండాలని చైనా భావిస్తోంది. ఆయా అంశాలతో పాటు కోటి ఉద్యోగ అవకాశాల కల్పనను కూడా చైనా లక్ష్యంగా పెట్టుకుంది. చైనా వృద్ధి రేటు 2015లో 6.8 శాతానికి పడిపోతుందని, 2016లో ఇది భారత్ వృద్ధి రేటు 6.5 శాతం కన్నా దిగువకు అంటే 6.3 శాతానికి పడిపోతుందని ఇటీవల అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనా వేసిన సంగతి తెలిసిందే. -
ప్రైవేట్ పెట్టుబడులకు అడ్డంకులు తొలగించాలి
ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ వాషింగ్టన్: అనేక నియంత్రణలు, నిబంధనలు, బొగ్గు.. విద్యుత్ కొరత మొదలైనవి భారత్‌లో ప్రైవేట్ పెట్టుబడులకు అవరోధాలుగా ఉన్నాయని ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ అభిప్రాయపడ్డారు. దేశం అధిక వృద్ధి బాట పట్టాలంటే, ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించాలంటే వీటిని తొలగించాల్సి ఉంటుందని అంతర్జాతీయ ద్రవ్య నిధికి (ఐఎంఎఫ్) ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. మౌలిక సదుపాయాలు కల్పించడం, ప్రాపర్టీ హక్కులు పరిరక్షించడం, కాంట్రాక్టులకు భద్రత కల్పించడం, మెరుగైన గవర్నెన్స్ తదితర అంశాలు భారత ఎకానమీకి అవసరమని సుబ్రమణియన్ తెలిపారు. ‘ప్రైవేట్ రంగం మరింత పెద్ద పాత్ర పోషించాల్సి ఉంది. కాబట్టి ప్రైవేట్ రంగం ఎదగకుండా, ఉపాధి కల్పనకు అడ్డంకిగా నిలుస్తున్న అనేకానేక నియంత్రణాపరమైన ఆటంకాలను తొలగించాల్సి ఉంటుంది’ అని ఆయన చెప్పారు. తగినంత బొగ్గు, విద్యుత్ సరఫరా లేకపోవడం వల్ల గానీ కంపెనీలు రుణభారంతో సతమతమవుతుండటం వల్ల గానీ పలు ప్రాజెక్టులు నిల్చిపోయాయని సుబ్రమణియన్ తెలిపారు. వీటిని సరిచేస్తే ప్రైవేట్ పెట్టుబడులు, వృద్ధి మెరుగుపడగలవన్నారు. అలాగే ఎక్కడ న్యాయవివాదాల్లో చిక్కుకోవాల్సి వస్తుందోనన్న భయంతో బ్యూరోక్రాట్లు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం లేదని ఆయన చెప్పారు. కనుక వేగవంతంగా నిర్ణయాలు తీసుకునేందుకు అనువైన పరిస్థితులు కల్పించాలని, అలాగే బొగ్గు, విద్యుత్ సమస్యల పరిష్కారంపైనా, మౌలిక సదుపాయాల కల్పనపైనా ప్రధానంగా దృష్టి సారించాలని సుబ్రమణియన్ అభిప్రాయపడ్డారు. 5 శాతం వృద్ధి రేటు సరిపోదు.. భారత్ ఎదగాలన్నా, భారీ జనాభాకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నా 5 శాతం రేటు వృద్ధి రేటు సరిపోదని సుబ్రమణియన్ చెప్పారు. సవాళ్లన్నీ అధిగమించాలంటే మళ్లీ ఏడున్నర-ఎనిమిది శాతం వృద్ధి రేటు సాధించాల్సి ఉంటుందని.. దాదాపు పది నుంచి ఇరవై ఏళ్ల పాటు దీన్ని కొనసాగించగలగాలని ఆయన తెలిపారు. ప్రభుత్వంలో ఒక రకంగా విధానపరమైన జడత్వం ఉన్న భావన నెలకొందన్నారు. అయితే, కొత్త ప్రభుత్వం ఇటువంటి సమస్యలను పరిష్కరించగలదన్న భావనతో కొంత మేర ఆశాభావం ఉందన్నారు. -
ఆసియా ఇన్ఫ్రా బ్యాంక్ ఆవిర్భావం
ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్‌ల పెత్తనానికి చెక్..! * బీజింగ్ కేంద్రంగా ఏర్పాటు; వచ్చే ఏడాది నుంచి కార్యకలాపాలు * భారత్, చైనాతో పాటు మరో 19 దేశాలకు సభ్యత్వం... * అవగాహన ఒప్పందంపై సంతకాలు * అధీకృత మూలధనం 100 బిలియన్ డాలర్లు... బీజింగ్: అమెరికా, ఇతరత్రా పశ్చిమ దేశాల కనుసన్నల్లో పనిచేస్తున్న ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) పెత్తనానికి చెక్ చెప్పేవిధంగా ఆసియాలో కొత్త బ్యాంకు ఆవిర్భవించింది. ఈ ప్రాంతంలోని దేశాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి నిధులందించే లక్ష్యంతో ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్(ఏఐఐబీ) శుక్రవారం ఏర్పాటైంది. చైనా నేతృత్వంలో బీజింగ్ కేంద్రంగా నెలకొల్పనున్న ఏఐఐబీ కోసం అవగాహన ఒప్పందాల(ఎంఓయూ)పై చైనా, భారత్‌తో పాటు మరో 19 దేశాలు సంతకాలు చేశాయి. ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకులకు పోటీగా... వాటిపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడం కూడా దీని ప్రధానోద్దేశంగా భావిస్తున్నారు. ఇక్కడి ‘గ్రేట్ హాల్ ఆఫ్ ద పీపుల్’లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఏఐఐబీ ఏర్పాటుకు శ్రీకారంచుట్టారు. భారత్ తరఫున ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక వ్యవహారాల విభాగం జాయింట్ సెక్రటరీ ఉషా టైటస్ ఈ ఎంఓయూపై సంతకాలు చేశారు. విధివిధానాలు త్వరలో ఖరారు... ఏఐఐబీ వచ్చే ఏడాది నుంచి కార్యకలాపాలు ప్రారంభించనుంది. 100 బిలియన్ డాలర్ల(సుమారు రూ.6.1 లక్షల కోట్లు) అధీకృత మూలధనంతో ఇది ఏర్పాటవుతుందని ఎంఓయూలో పేర్కొన్నారు. ప్రాథమిక వినియోగ మూలధనం 50 బిలియన్ డాలర్లు ఉండొచ్చని అంచనా. చైనా ఆర్థిక శాఖ ఉప మంత్రి జిన్ లిక్వన్ ఏఐఐబీకి తొలి సెక్రటరీ జనరల్‌గా వ్యవహరించనున్నారు. ఆసియా అభివృద్ధి బ్యాంక్(ఏడీబీ) వైస్ ప్రెసిడెంట్‌గా కూడా ఆయన గతంలో పనిచేశారు. సభ్య దేశాలతో సంప్రదింపుల తర్వాత ఓటింగ్ హక్కులు, ఇతర ప్రామాణిక అంశాలపై నిర్ణయం తీసుకోనున్నారు. జీడీజీ, ప్రజల కొనుగోలు శక్తి(పర్చేజింగ్ పవర్ పారిటీ-పీపీ) ఆధారంగా వీటిని ఖరారు చేయనున్నారు. దీనిప్రకారం చూస్తే భారత్‌కు ఏఐఐబీలో చైనా తర్వాత రెండో అతిపెద్ద వాటాదారు కానుంది. ఈ కొత్త బ్యాంకు కారణంగా ఆసియా ప్రాంతంలోని దేశాలకు మౌలిక సదుపాయాల అభివృద్ధికి నిధుల లభ్యత పెరగనుందని ఉషా టైటస్ పేర్కొన్నారు. ఇటీవల బ్రెజిల్లో బ్రిక్స్ సదస్సు సందర్భంగా భారత్ ప్రధాని మోదీతో భేటీ అయిన చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఏఐఐబీలో సభ్యత్వానికి ఇండిమాను ఆహ్వానించారు. భారత్, చైనాలతో పాటు ఏఐఐబీలో వియత్నాం, ఉజ్జెకిస్థాన్, థాయ్‌లాండ్, శ్రీలంక, సింగపూర్, ఖతార్, ఒమన్, ఫిలిప్పైన్స్, పాకిస్థాన్, నేపాల్, బంగ్లాదేశ్, బ్రూనై, కంబోడియా, కజకిస్థాన్, కువైట్, లావో పీడీఆర్, మలేసియా, మంగోలియా, మయన్మార్లు వ్యవస్థాపక సభ్య దేశాలుగా చేరాయి. అయితే, ఏడీబీలో ప్రధాన భూమిక పోషిస్తున్న జపాన్‌తో పాటు దక్షిణకొరియా, ఇండోనేసియా, ఆస్ట్రేలియాలు కూడా ఏఐఐబీకి దూరంగా ఉన్నాయి. ప్రధానంగా అమెరికా ఒత్తిడే దీనికి కారణమని పరిశీలకులు భావిస్తున్నారు. కార్పొరేట్లు హర్షం... ఏఐఐబీలో భారత్ సభ్యదేశంగా చేరడాన్ని భారత కార్పొరేట్ రంగం స్వాగతించింది. దీనివల్ల మౌలిక సదుపాయాలకు, నిధుల కొరతకు కొంత పరిష్కారం లభిస్తుందని ఫిక్కీ సెక్రటరీ జనరల్ దిదార్ సింగ్ పేర్కొన్నారు. ఆసియాలో మౌలిక సదుపాయాల కోసం వచ్చే పదేళ్లలో సుమారు 8 ట్రిలియన్ డాలర్ల మేర నిధులు అవసరమవుతాయని అంచనా. ఒక్క భారత్‌కే ట్రిలియన్ డాలర్లు(దాదాపు రూ.61 లక్షల కోట్లు) అవసరమని భావిస్తున్నారు. బ్రిక్స్ బ్యాంకుకు అదనంగా... వర్ధమాన దిగ్గజ దేశాల కూటమి బ్రిక్స్(బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) మౌలిక నిధుల కల్పన కోసం బ్రిక్స్ బ్యాంకును ఏర్పాటు చేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇది కూడా చైనాలోని షాంఘై కేంద్రంగానే ఏర్పాటు కానుంది. దీని మొదటి అధ్యక్ష పదవి కూడా భారత్‌కే లభించనుంది. ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌లకు పోటీగానే బ్రిక్స్ బ్యాంకు ఏర్పాటు చేస్తున్నారంటూ ఇప్పటికే పశ్చిమ దేశాల్లో విమర్శలు కూడా వెల్లువెత్తుతున్న నేపథ్యంలో.. కొత్తగా ఏఐఐబీ ఆవిర్భావం జరగడం విశేషం. కాగా, ఎంఓయూపై సంతకాల అనంతరం సభ్య దేశాల ప్రతినిధులతో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సమావేశమయ్యారు. ఏఐఐబీ ఏర్పాటును అత్యంత కీలక ముందడుగుగా ఆయన అభివర్ణించారు. ‘సంపన్నులు కావాలంటే మంచి ‘రహదారులు’ నిర్మించుకోవాలన్నది చైనాలో సామెత. ఇప్పుడు ఏఐఐబీ ఏర్పాటు వెనుక ప్రధానోద్దేశం కూడా ఇదే. ఆసియా దేశాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధిని ప్రోత్సహించడం, తద్వారా ఆర్థిక వ్యవస్థలు పరుగులు తీయాలన్న సంకల్పంతోనే ఈ బ్యాంకును నెలకొల్పుతున్నాం’ అని జిన్‌పింగ్ వ్యాఖ్యానించారు. ఒక్క ఆసియా నుంచే కాకుండా ఇతర ప్రాంతాలకు చెందిన దేశాలను కూడా దీనిలో భాగస్వామ్యానికి ఆహ్వానిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఏడీబీ తదితర బహుళజాతి ఆర్థిక సంస్థల నుంచి నిర్వహణ నైపుణ్యాలు, అనుభవాలను ఏఐఐబీకి వినియోగించుకుంటామన్నారు. కాగా, ఈ కొత్త బ్యాంకుతో తమకు ఎలాంటి ముప్పూ ఉండబోదని ఏడీబీ ప్రెసిడెంట్ తకెహికో నకావో బీజింగ్‌లో వ్యాఖ్యానించారు. -
ఈ ఏడాది భారత వృద్ధి 5.6%
వచ్చే ఏడాది 6.4 శాతం ఐఎంఎఫ్ అంచనాలు వాషింగ్టన్: భారత్ ఈ ఏడాది 5.6 శాతం వృద్ధి రేటు సాధిస్తుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్) పేర్కొంది. వచ్చే ఏడాది 6.4 శాతం వృద్ధి సాధ్యమవుతుందని వివరించింది. ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం తీసుకుంటున్న ఆర్థిక సంస్కరణల కారణంగా ఎగమతులు, ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతున్నాయని, వృద్ధిరేటు పరుగులు పెడుతోందని పేర్కొంది. ఐఎంఎఫ్ రూపొందించిన వరల్డ్ ఎకనామిక్ అవుట్‌లుక్(డబ్ల్యూఈఓ) ఈ వివరాలను వెల్లడించింది. అలాగే ద్రవ్యోల్బణం ఈ ఏడాది 7.8 శాతంగానూ, వచ్చే ఏడాది 7.5 శాతంగానూ ఉండొచ్చని ఐఎంఎఫ్ అంచనా వేస్తోంది. ఎన్నికల అనంతరం భారత్‌లో వాణిజ్య విశ్వాసం పెరుగుతోందని, తయారీ రంగ కార్యకలాపాలు పుంజుకుంటున్నాయని ఫలితంగా వృద్ధి పెరుగుతోందని ఐఎంఎఫ్ పేర్కొంది. ఈ ఏడాది మిగిలిన మూడు నెలలు, వచ్చే ఏడాది వృద్ధి పరుగులు పెడుతుందని వివరించింది. వర్షాలు సరిగ్గా కురవకపోవడంతో మందగించిన వ్యవసాయ వృద్ధి ప్రభావాన్ని పెరుగుతున్న ఎగుమతులు, పెట్టుబడులు భర్తీ చేశాయని పేర్కొంది. ఎన్నికల అనంతరం భారత్‌లో ప్రాదుర్భవించిన వాణిజ్య విశ్వాసం భవిష్యత్‌లో అవసరమైన వ్యవస్థాగత సంస్కరణలకు తగిన ఊతాన్ని ఇచ్చిందని తెలిపింది. ఇక అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి అంచనాల కంటే మందగిస్తుందని పేర్కొంది. అమెరికా ఆర్థిక వ్యవస్థలో ఉన్న తాత్కాలిక సమస్యలు దీనికి కారణమని వివరించింది. సంక్షోభాల ప్రభావం కారణంగా యూరో దేశాల్లో కూడా రికవరీ బలహీనంగా ఉంటుందని ఐఎంఎఫ్ అంచనా వేస్తోంది. -
బ్యాంకులకు రేట్ల కోత సాధ్యంకాదు
ముంబై: ఆర్థిక వ్యవస్థ వృద్ధికి అధిక ద్రవ్యోల్బణమే అతిపెద్ద అడ్డంకిగా నిలుస్తోందని ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ ఉద్ఘాటించారు. కరెన్సీ రేటు తీవ్ర హెచ్చుతగ్గులు, పొదుపు దెబ్బతినడానికి.. వడ్డీరేట్లను తగ్గించకపోవడానికి అధిక ధరలే కారణమని పేర్కొన్నారు. తాజా పాలసీ సమీక్షలో కీలక వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగించడాన్ని సమర్థించుకున్నారు. సమీక్ష అనంతరం ఒక మీడియా ఇంటర్వ్యూలో రాజన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘వడ్డీరేట్లను ఎలాబడితేఅలా తగ్గించేందుకు నా చేతిలో మంత్రదండం ఉందని ప్రజలు అనుకుంటారు. వీటిని నేనొక్కడినే నిర్ణయిస్తాననేది కూడా వారి అభిప్రాయం. వడ్డీరేట్లను కేవలం దేశ ఆర్థిక వ్యవస్థలో పరిస్థితులే నిర్ధారిస్తాయి. ఒకవేళ నేను పాలసీ రేట్లను భారీగా తగ్గించినా.. బ్యాంకులు రుణాలపై వడ్డీరేట్లను తగ్గించేందుకు సిద్ధంగా లేవు. అధిక ద్రవ్యోల్బణమే దీనికి కారణం. అందువల్ల ముందుగా ధరలకు కళ్లెం వేయాలి. ఈ విషయంలో మేం(ఆర్బీఐ) కొంత విజయం సాధించాం. అయితే, ధరల కట్టడిపై పోరు ఇంకా పూర్తికాలేదు’ అని రాజన్ వ్యాఖ్యానించారు. ఎస్ఎల్ఆర్, సీఆర్ఆర్ నిబంధలను సడలిస్తాం బ్యాంకింగ్ వ్యవస్థ పనితీరు మరింత పెంచడంతోపాటు.. ప్రాధాన్య రంగాలకు రుణాల(పీఎస్ఎల్)ల కల్పన ప్రక్రియను సమర్థవంతంగా అమలు చేయడానికి ఆర్బీఐ ప్రాధాన్యమిస్తోందని రాజన్ చెప్పారు. తాజా సమీక్షలో పాలసీ వడ్డీరేట్లను తగ్గించకపోయినప్పటికీ.. చట్టబద్ధ ద్రవ్య నిష్పత్తి(ఎస్ఎల్ఆర్-బ్యాంకుల ప్రభుత్వ బాండ్లలో తప్పనిసరిగా పెట్టుబడి పెట్టాల్సిన నిధుల పరిమాణం)ని అర శాతం తగ్గించడానికి ఇదే కారణమన్నారు. ఎస్ఎల్ఆర్, నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్ఆర్-బ్యాంకుల తమ డిపాజిట్ నిధుల్లో తప్పకుండా ఆర్బీఐ వద్ద ఉండచాల్సిన నిధుల పరిమాణం) తగ్గింపు వంటి చర్యలను దీర్ఘకాలంపాటు కొనసాగించనున్నామని కూడా రాజన్ తెలిపారు. సమీక్ష అనంతరం సాంప్రదాయంగా విశ్లేషకులతో జరిపిన సంభాషణల్లో ఆయన ఈ అంశాలను ప్రస్తావించారు. తాజా కోతతో ఎస్ఎల్ఆర్ 22.5% నుంచి 22%కి దిగొచ్చిన సంగతి తెలిసిందే. దీనివల్ల బ్యాంకులకు అదనంగా రూ.40 వేల కోట్లు అందుబాటులోకి రానున్నాయి. బ్యాంకులతో పాటు ఇతరత్రా వర్గాలు కూడా ఎస్ఎల్ఆర్, సీఆర్ఆర్ వంటి తప్పనిసరి నిబంధనల విషయంలో వెసులుబాటునివ్వాలని ఎప్పటినుంచో అడుగుతున్నారని... ఈ దిశగా తగిన చర్యలు తీసుకుంటామని రాజన్ చెప్పారు. ద్రవ్యోల్బణం దిగొస్తేనే..: తమ అంచనాల కంటే వేగంగా ద్రవ్యోల్బణం దిగొస్తే.. వృద్ధికి చేయూతనిచ్చేందుకు వడ్డీరేట్లను కచ్చితంగా తగ్గిస్తామని రాజన్ పేర్కొన్నారు. అయితే, వేగంగా ధరలు గనుక ఎగబాకితే, వడ్డీరేట్లను పెంచేందుకు కూడా వెనుకాడబోమని తేల్చిచెప్పారు. రిటైల్ ద్రవ్యోల్బణం 2015 జనవరికల్లా 8 శాతం, 2016 జనవరి నాటికి 6 శాతానికి పరిమితం కావాలని ఆర్బీఐ లక్ష్యంగా నిర్ధేశించింది. ప్రపంచ మార్కెట్లు మరోసారి క్రాష్ కావచ్చు.. ప్రపంచ మార్కెట్లు మరోసారి క్రాష్ అయ్యే ప్రమాదం ఉందని రాజన్ హెచ్చరించారు. ధనిక దేశాల సరళ ద్రవ్య విధానాల కారణంగా ఏర్పడిన రిస్కీ ఆస్తులను అధిక ధరలకు ఇన్వెస్టర్లు కొంటూపోయి, ఆతర్వాత ఒక్కసారిగా అమ్మడం మొదలుపెడితే మార్కెట్లు పతనమయ్యే అవకాశాలుంటాయన్నారు. ప్రస్తుత అంతర్జాతీయ మార్కెట్ల పరిస్థితిని మహా మాంద్యం సంభవించిన 1930వ దశకంనాటితో పోల్చారు. అప్పటికంటే సరళ ద్రవ్య విధానాలను ఇప్పుడు కేంద్ర బ్యాంకులు అనుసరిస్తున్నాయని, ఈ విధానాల వ్యయాన్ని భరించేస్థితి ప్రస్తుత ప్రపంచానికి లేనందున, మరో పతన ప్రమాదం ఎక్కువగా ఉందని వ్యాఖ్యానించారు. -
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటును వచ్చే ఐదేళ్లలో ....2 శాతం పెంచాలి
సిడ్నీ: ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటును వచ్చే ఐదేళ్లలో ఇప్పటి స్థాయి నుంచి 2 శాతం మేర పెంచాలని జీ-20 దేశాల ఆర్థిక మంత్రులు, గవర్నర్ల సమావేశం పిలుపునిచ్చింది. అదేవిధంగా ఆటోమేటిక్‌గా పన్నుల సమాచారాన్ని పంచుకోవడం, అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్) సంస్కరణల అమలుపైనా కలసికట్టుగా పనిచేయాలని నిర్ణయించింది. భేటీ ముగింపు అనంతరం ఆదివారం ఇక్కడ విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో ఈ అంశాలను పేర్కొన్నారు. భారత్ వంటి వర్ధమాన దేశాల ఆర్థిక వ్యవస్థలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపైన కూడా సమావేశంలో దృష్టిపెట్టారు. ‘ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటును రానున్న ఐదేళ్లలో 2 శాతం పైగా పెంచాల్సిన అవసరం ఉంది. అంటే మరో 2 లక్షల కోట్ల డాలర్లకు పైగా జతకావాలి. ఇదే జరిగితే గణనీయమైన స్థాయిలో ఉద్యోగాల సృష్టికి దోహదం చేస్తుంది. ఇప్పుడున్న విధానాల స్థానంలో మరింత వాస్తవికతతో కూడిన పాలసీలను తీసుకొచ్చేలా ప్రతిష్టాత్మక చర్యలతోనే ఇది సాధ్యం’ అని సంయుక్త ప్రకటన వెల్లడించింది. ఆటోమేటిక్‌గా పన్ను వివరాలను షేర్ చేసుకునేందుకు ఉద్దేశించిన కొత్త ప్రమాణాలను అమలు విషయంలో అన్నిపక్షాలతోనూ కలిసి పనిచేయనున్నట్లు తెలిపింది. ఈ ప్రమాణాలను 2015 చివరికల్లా జీ-20 దేశాలన్నీ ఆచరణలోకి తీసుకురావాలని నిర్ణయించారు. నల్లధనం, పన్ను ఎగవేతల సమస్యల పరిష్కారానికి ఈ సమాచార షేరింగ్ అనేది సజావుగా జరగాలని భారత్ ఎప్పటినుంచో ఒత్తిడి తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. అదేవిధంగా బహుళజాతి కంపెనీలు(ఎంఎన్‌సీలు) లాభాలను ఎక్కడైతే ఆర్జిస్తున్నాయో అక్కడే పన్నుకట్టాలన్న డిమాండ్‌కు కూడా జీ20 సమావేశం మద్దతు పలికింది. ఈ ఏడాది(2014) గ్లోబల్ వృద్ధి రేటు 3.7%గా ఉండొచ్చనేది ఐఎంఎఫ్ తాజా అంచనా. ఐఎంఎఫ్ సంస్కరణలపై... ఐఎంఎఫ్‌లో కోటా, పాలనపరమైన సంస్కరణల అమలు జాప్యం కావడం పట్ల(అమెరికా దీనికి ఇంకా ఆమోదముద్ర వేయాల్సి ఉంది)జీ20 సమావేశం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఏప్రిల్‌లో జరగనన్ను తదుపరి భేటీ నాటికి ఈ సంస్కరణలకు ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేసింది. 2010లో అంగీకరించిన ఈ కోటా సంస్కరణలను ఈ ఏడాది జనవరి నుంచి అమలు చేయాల్సి ఉంది. వీటివల్ల భారత్ వంటి వర్ధమాన దేశాలకు ఐఎంఎఫ్‌లో బలం పెరుగుతుంది. జీ20 కూటమిలో అమెరికా, ఫ్రాన్స్, జపాన్, ఆస్ట్రేలియా వంటి అభివృద్ధి చెందిన దేశాలతోపాటు భారత్, దక్షిణాఫ్రికా, బ్రెజిల్ వంటి వర్ధమాన దేశాలున్నాయి. మొ త్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వీటి పరిమాణం 85%. -
భారత్ వృద్ధి 5.4 శాతం
సిడ్ని/వాషింగ్టన్: భారత్ వచ్చే ఆర్థిక సంవత్సరంలో 5.4 శాతం వృద్ధి సాధించగలదని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) అంచనా వేస్తోంది. అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడడం, ఎగుమతులు పెరగడం, వర్షాలు బాగా కురవడం, సంస్కరణల కారణంగా విశ్వాసం పెరగడం వంటివి దీనికి ప్రధాన కారణాలని ఐఎంఎఫ్ పేర్కొంది. సిడ్నీలో ప్రారంభం కానున్న జీ20 సమావేశాల నేపథ్యంలో ఐఎంఎఫ్ ఈ వివరాలు వెల్లడించింది. మెరుగైన వృద్ధి సాధించడానికి భారత్ ద్రవ్యోల్బణాన్ని నియంత్రించాలని, సరఫరా సమస్యలను అధిగమించాలని సూచించింది. వేగంగా వద్ధి సాధించడానికి, ఉద్యోగ కల్పనకు, పేదరిక నిర్మూలనకు ఈ చర్య తీసుకోవాలసి ఉందని పేర్కొంది. కఠినమైన ద్రవ్యవిధానాల కారణంగా వృద్ధి మందగించినప్పటికీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ 4.6 శాతం వృద్ధి సాధించగలదని ఐఎంఎఫ్ తెలిపింది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం రెండంకెల స్థానంలోనే ఉంటుందని ఐఎంఎఫ్ అంచనా వేస్తోంది. అంతర్జాతీయ ఆర్థిక వృద్ధికి చోదక శక్తులుగు నిలుస్తున్న భారత్, చైనా, బ్రెజిల్లో ఇటీవల కాలంలో వృద్ధి మందగించిందని పేర్కొంది. ఆహార భద్రత చట్టం భేష్ భారత ఆహార భద్రత చట్టం చరిత్రాత్మకమైనదని ఐఎంఎఫ్ కితాబిచ్చింది. అధిక శాతం ప్రజలకు అందుబాటు ధరల్లో తగినంత ఆహార పదార్ధాలు ఈ చట్టం ద్వారా అందుతాయని పేర్కొంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద ఆహార భద్రత కార్యక్రమమని, దీనిద్వారా 120 కోట్ల భారత జనాభాలో మూడింట రెండొంతుల మందికి చౌక ధరల్లో ఆహార పదార్ధాలు అందుబాటులోకి వస్తాయని వివరించింది. ఈ చట్టం దృష్ట్యా కేంద్రం తాజా మధ్యంతర బడ్జెట్లో ఆహార సబ్సిడీ కోసం రూ.1,15,000 కోట్లు కేటాయించింది. -
పపంచ ఎకానమీలో పెనుమార్పులు: ఐఎంఎఫ్
వాషింగ్టన్: ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతిగా అనుసంధానమైందని, పెనుమార్పులకు లోనవుతోందని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) పేర్కొంది. ఈ నేపథ్యంలో కొత్త మార్పులకు అనుగుణంగా తలెత్తే రిస్కులను ఎదుర్కొనేందుకు విధానకర్తలు సంసిద్ధంగా ఉండాలని హెచ్చరించింది. ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ వార్షిక సమావేశాల ప్రారంభ కార్యక్రమం సందర్భంగా ఐఎంఎఫ్ ఎండీ క్రిస్టీన్ లగార్డ్ ఈ విషయాలు తెలిపారు. -
కార్పొరేట్లు, బ్యాంకులకు మందగమనం దెబ్బ: ఐఎంఎఫ్
వాషింగ్టన్: దేశీయంగా నెలకొన్న ఆర్థిక ఒత్తిళ్ల కారణంగా భారత కార్పొరేట్లు, బ్యాంకులు బలహీనపడ్డాయని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) పేర్కొంది. బ్యాంకులు, కార్పొరేట్ల లాభాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశాలు మరింత పెరిగాయని తెలిపింది. అలాగే, వృద్ధి రేటు అంచనాలను మరింత కుదించే పరిస్థితి కూడా తలెత్తవచ్చని శుక్రవారం విడుదల చేసిన ఆసియా, పసిఫిక్ దేశాల ఆర్థిక పరిస్థితులపై నివేదికలో ఐఎంఎఫ్ వివరించింది. ఆర్థిక సంక్షోభ ప్రభావాలతో ఆసియాలో కొన్ని దేశాలు తీవ్ర ఒత్తిడికి లోనైనప్పటికీ...చాలా దేశాల్లో ఇది ఇంకా అదుపులోనే ఉందని ఐఎంఎఫ్ తెలిపింది. డిమాండ్ బలహీనంగా ఉన్నప్పటికీ, ఆహార పదార్థాల ధరలు ఎక్కువగా ఉండటం వల్ల ద్రవ్యోల్బణం రెండంకెల్లోనే కొనసాగవచ్చని వివరించింది. భారత్‌కు వచ్చే ఏడాదిలో ఉపశమనం..: భారత్ ఎకానమీ వచ్చే ఏడాది గణనీయంగా కోలుకునే అవకాశం ఉందని ఐఎంఎఫ్ డెరైక్టర్ (ఆసియా పసిఫిక్ విభాగం) అనూప్ సింగ్ తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న పలు విధానపరమైన నిర్ణయాలు ఇందుకు తోడ్పడగలవని వివరించారు. మరోవైపు, వృద్ధి విషయంలో భారత ప్రభుత్వం, ఐఎంఎఫ్‌ల అభిప్రాయాల మధ్య కొన్ని త్రైమాసికాల వ్యత్యాసమే ఉందన్నారు. -
ఐఎంఎఫ్ వృద్ధి లెక్కలు పట్టించుకోం: భారత్
న్యూఢిల్లీ: భారత్ వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 3.75 శాతంగానే ఉంటుందంటూ అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) ఇచ్చిన అంచనాలను కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి ఆనంద్ శర్మ తోసిపుచ్చారు. తయారీ రంగం, దేశీయంగా డిమాండ్, ఎగుమతులు అన్నీ మెరుగుపడుతున్న నేపథ్యంలో వృద్ధి రేటు కచ్చితంగా 5 శాతం మించగలదని ఒక ప్రకటనలో ఆయన ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు, ప్రణాళిక శాఖ మంత్రి రాజీవ్ శుక్లా కూడా దాదాపు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను బట్టి చూస్తే భారత్ సహా పలు వర్ధమాన దేశాలు మళ్లీ 8 శాతం పైగా వృద్ధి సాధించలేకపోవచ్చని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) డిప్యుటీ చీఫ్ రూప దత్తగుప్తా తెలిపారు. ఇక, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత్ ద్రవ్య లోటు స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) 8.5 శాతానికి ఎగియవచ్చని కూడా ఐఎంఎఫ్ తాజాగా అంచనా వేసింది. -
భారత్ వృద్ధి అంచనాలకు ఐఎంఎఫ్ భారీ కోత
వాషింగ్టన్: భారత్ స్థూల దేశీయోత్పత్తి 2013లో కేవలం 3.75 శాతమేనని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) సంస్థ అంచనా వేసింది. క్రితం అంచనాలు (ఏప్రిల్‌లో) 5.7 శాతం నుంచీ ఐఎంఎఫ్ ఈ మేరకు కుదించింది. బలహీన డిమాండ్, తయారీ, సేవల రంగాల పేలవ పనితీరు అంచనాల కోతకు కారణమని తన తాజా వరల్డ్ ఎకనమిక్ అవుట్ లుక్ నివేదికలో సంస్థ మంగళవారం పేర్కొంది. ద్రవ్యోల్బణాన్ని అదుపుచేయడానికి కఠిన ద్రవ్య విధానం అనుసరించాల్సి రావాల్సిన దేశాల్లో భారత్ ఒకటని ఐఎంఎఫ్ విశ్లేషించింది. ఈ పరిస్థితి వల్ల డిమాండ్ తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉందని పేర్కొంది. వచ్చే ఏడాది 5 శాతం కాగా వచ్చే ఏడాది అంటే 2014లో వృద్ధిరేటు అంచనాను సైతం ఇంతక్రితం 6.2 శాతం నుంచి 5 శాతానికి కుదించింది. సరఫరాల సమస్య కొంత కుదుటపడ్డం, ఎగుమతులు మెరుగుపడ్డం వల్ల 2013కన్నా 2014లో వృద్ధి కొంత మెరుగుపడవచ్చని (3.75 శాతం నుంచి 5 శాతానికి) వివరించింది. ఇక్కడ జరుగుతున్న ప్రపంచబ్యాంక్, ఐఎంఎఫ్ వార్షిక సమావేశాల నేపథ్యంలో ఈ నివేదిక విడుదలయ్యింది.