దేశ జనాభా పెరుగుదల అంచనాల ప్రకారం 2030 నాటికి 14.8 కోట్ల ఉద్యోగాలు సృష్టించాలని అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్) డిప్యూటీ డైరెక్టర్ గీతాగోపీనాత్ తెలిపారు. ఉద్యోగాల కల్పనకు సంబంధించి జీ20 దేశాలతో పోలిస్తే భారత్ చాలా వెనకబడి ఉందన్నారు. కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్‌తో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ఈమేరకు వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా గీతాగోపీనాత్ మాట్లాడుతూ..‘భారత్‌లో జనాభా వృద్ధిరేటు అధికంగా ఉంది. జనాభా పెరుగుదల అంచనాల ప్రకారం 2030 నాటికి దేశంలో 6 నుంచి 14.8 కోట్లు ఉద్యోగాలు సృష్టించబడాలి. ప్రస్తుతం 2024లో ఉన్నాం. చాలా తక్కువ సమయంలోనే భారీగా జాబ్స్ క్రియేట్ చేయాలి. ఉద్యోగాల కల్పనలో జీ20 దేశాల్లో భారత్ వెనకబడింది. 2010 నుంచి ఇండియా సగటున 6.6 శాతం వృద్ధి నమోదు చేస్తోంది. అయితే ఉద్యోగకల్పన రేటు మాత్రం 2 శాతం లోపే ఉంది. కొత్త ఉద్యోగాలు పుట్టుకురావాలంటే ప్రైవేటు పెట్టుబడులు వచ్చేలా చూడాలి. భారత యువత నైపుణ్యాలను పెంపొందించుకోవాలి. భారత్‌తో పోటీ పడుతున్న ఇతర దేశాలతో పోలిస్తే స్థానికంగా దిగుమతి సుంకం అధికంగా ఉంది. దాన్ని తగ్గించాలి. కార్మిక చట్టాలను సమర్థంగా అమలు చేయాలి. ఇటీవల ప్రవేశపెట్టిన ‘మూలధన లాభాలపై పన్ను’ తాత్కాలికంగా ఖజానాకు డబ్బు సమకూర్చవచ్చు. కానీ అది భవిష్యత్తులో క్లిష్టంగా మారే అవకాశం ఉంది. జీఎస్టీ రేట్లను మరింత సరళీకరిస్తే అదనంగా 1.5 శాతం జీడీపీ వృద్ధికి అవకాశం ఉంది’ అన్నారు.
ఇదీ చదవండి: ఇల్లు కొంటున్నారా..? ఒక్క క్షణం..!
Comments
Please login to add a commentAdd a comment