పాకిస్తాన్కు ఐఎమ్ఎఫ్ సాయం | IMF releases $102.1 million to Pakistan | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్కు ఐఎమ్ఎఫ్ సాయం

Published Thu, Sep 29 2016 1:41 PM | Last Updated on Mon, Sep 4 2017 3:31 PM

పాకిస్తాన్కు ఐఎమ్ఎఫ్ సాయం

పాకిస్తాన్కు ఐఎమ్ఎఫ్ సాయం

ప్రపంచ దేశాల్లో ఆర్థిక స్థిరత్వం కాపాడేందుకు ఏర్పరిచిన అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ(ఐఎమ్ఎఫ్) పాకిస్తాన్కు 102.1 మిలియన్ డాలర్ల(రూ.68,238 కోట్లకు పైగా)ను విడుదల చేసింది.

ప్రపంచ దేశాల్లో ఆర్థిక స్థిరత్వం కాపాడేందుకు ఏర్పరిచిన అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ(ఐఎమ్ఎఫ్) పాకిస్తాన్కు 102.1 మిలియన్ డాలర్ల(రూ.68,238 కోట్లకు పైగా)ను విడుదల చేసింది.ఈ విడుదలతో మూడేళ్ల ఆర్థిక సంస్కరణల ప్రణాళిన ముగిసినట్టు ఐఎమ్ఎఫ్ పేర్కొంది. దేశ ఆర్థికవ్యవస్థను పునరుద్ధరించుకునేందుకు, మెరుగుపరుచుకునేందుకు ఆర్థికసాయంగా ఈ నిధిని ఐఎమ్ఎఫ్ పాకిస్తాన్కు అందజేసింది.2013 సెప్టెంబర్లో ఆర్థిక సాయంగా 6.15 బిలియన్ డాలర్లను పాకిస్తాన్కు అందించనున్నట్టు ఐఎమ్ఎఫ్ బోర్డు నిర్ణయించింది.
 
ముందు నిర్ణయించిన మాదిరిగానే, స్థూల ఆర్థిక స్థిరత్వ లాభాలు, వృద్ధి సమర్థించే సంస్కరణలను బలోపేతం చేసేందుకు ఈ నిధులు ఖర్చుచేయాలని ఐఎమ్ఎఫ్ ఎగ్జిక్యూటివ్ బోర్డు డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ మిత్సుహిరో ఫురుసవా చెప్పారు. కీలకమైన ఆర్థిక సంస్కరణలో మాత్రమే వీటిని ఖర్చుచేయడానికి అధికారులు నిబద్ధతో పనిచేయాలని ఆయన పేర్కొన్నారు.పాకిస్తాన్కు విడుదల చేసిన ఈ నిధి ద్వారా స్థూల ఆర్థిక స్థిరత్వం పునరుద్ధరించుకోవడంతో పాటు దుర్బలత్వాన్ని తగ్గించి కీలకమైన అంశాల్లో పాకిస్తాన్ పురోగతి సాధించగలుగుతుందని తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement