ఐఎంఎఫ్ చీఫ్ ఎకనమిస్ట్ గీతా గోపినాథ్ భారత ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. బుధవారం సాయంత్రం ఆమెతో భేటీ అయిన ఫొటోల్ని స్వయంగా ప్రధాని తన ట్విటర్‌లో పోస్ట్ చేశారు.
ఇటీవలే గీతా గోపినాథ్‌ను ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ సంస్థకు ఫస్ట్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా ప్రమోట్ చేసిన విషయం తెలిసిందే. జనవరి 21, 2022న ఆమె బాధ్యతలు స్వీకరించాల్సి ఉంది.
Chief Economist of the IMF, @GitaGopinath called on PM @narendramodi. pic.twitter.com/2B30CMvjja
— PMO India (@PMOIndia) December 15, 2021
ఈ ప్రకటన తర్వాతే గౌరవపూర్వకంగా ఆమె ప్రధాని మోదీని కలిసినట్లు తెలుస్తోంది. నిజానికి వచ్చే ఏడాదిలో ఆమె ఐఎంఎఫ్‌ను వీడి.. హార్వార్డ్ యూనివర్సిటీకి వెళ్లాలనుకున్నారు. కానీ, ప్రస్తుతం ఉన్న ఫస్ట్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ జియోఫ్రె ఒకమోటో వచ్చే ఏడాది తన పదవికి రాజీనామా చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే గీతను ఆ ఉన్నత పదవికి సిఫార్సు చేసింది ఐఎంఎఫ్ బోర్డు.
Comments
Please login to add a commentAdd a comment