Gita Gopinath
-
ఆర్థికశాస్త్ర దిగ్గజాల సరసన భారతీయురాలు.. తొలి మహిళగా రికార్డు
‘అర్థం కావాలేగానీ ఆర్థికశాస్త్ర విషయాలు చందమామ కథల కంటే ఎక్కువగా ఆకర్షిస్తాయి’ అంటారు. అది ఎంత వరకు నిజమో తెలియదుగానీ, గీతా గోపీనాథ్‌కు ఆర్థికశాస్త్రం అనేది శ్వాస! సివిల్ సర్వీసులలో చేరాలనేది తన మొదటి కల. అయితే ఆర్థికశాస్త్రంపై ఆసక్తి ఆమెను వేరే దారిలోకి తీసుకెళ్లింది. ప్రపంచ ఆర్థికశాస్త్ర దిగ్గజాల సరసన చేర్చింది... ఐఎంఎఫ్ (అంతర్జాతీయ ద్రవ్యనిధి) గోడ (వాల్ ఆఫ్ ఫార్మర్ చీఫ్ ఎకనామిస్ట్స్)పై ఆ సంస్థ తరపున పనిచేసిన ప్రముఖ ఆర్థికవేత్తల ఫోటోలు వరుసగా కనిపిస్తాయి. ఒక్కో ఫొటో చూస్తూ వెళుతుంటే ఆర్థికరంగంలో వారి మేధోకృషి గుర్తుకు వస్తుంటుంది. అపురూపమైన చిత్రాలు అవి. ఇప్పుడు ఆ ఫొటోల వరుసలో ఆర్థికవేత్త గీతా గోపీనాథ్ ఫోటో చేరింది. ఐఎంఎఫ్ వాల్ ఫొటోల వరుసలో కనిపించిన తొలి మహిళా ఆర్థికవేత్తగా గీతా గోపీనాథ్ తనప్రత్యేకతను చాటుకుంది. ట్రెండ్‌ను బ్రేక్ చేస్తూ ప్రఖ్యాత ఆర్థికవేత్తల ఫొటోల వరుసలో తన ఫోటో ఏర్పాటు చేసినందుకు ట్విట్టర్ ద్వారా సంతోషం వ్యక్తం చేసింది గీత. ఇండియన్–అమెరికన్ ఆర్థికవేత్తగా పేరు తెచ్చుకున్న గీతా గోపినాథ్ కోల్‌కతాలో జన్మించింది. మైసూర్‌లోని నిర్మల కాన్వెంట్ స్కూల్లో చదువుకుంది. దిల్లీలో లేడి శ్రీరామ్ కాలేజ్ ఫర్ ఉమెన్‌లో బీఏ, యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్లో ఎం.ఏ. చేసింది. ప్రిన్స్టన్ యూనివర్శిటీ నుంచి పీహెచ్‌డి పట్టా అందుకుంది. Breaking the trend 👊💥…I joined the wall of former Chief Economists of the IMF 😀 pic.twitter.com/kPay44tIfK— Gita Gopinath (@GitaGopinath) July 6, 2022 చదువు పూర్తయిన తరువాత హార్వర్డ్ యూనివర్శిటీ ఇంటర్నేషనల్ స్టడీస్ అండ్ ఎకనామిక్స్ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేసింది. ఏడవ తరగతి వరకు గీతకు 45 శాతం లోపు మార్కులు వచ్చేవి. తల్లిదండ్రులెప్పుడూ మార్కుల విషయంలో ఒత్తిడి తెచ్చేవారు కాదు. అయితే ఏడవ తరగతి తరువాత మాత్రం గీత చదువులో దూసుకుపోయింది. మార్కులే మార్కులు! అంతమాత్రాన చదువే లోకం అనుకోలేదు. హాయిగా ఆటలు ఆడేది. పాటలు పాడేది. గిటార్ వాయించేది. ఫ్యాషన్ షోలలో పాల్గొనేది. గణితం నుంచి సైన్స్ వరకు ఎంత జటిలమైన విషయాన్ని అయిన నాన్న గోపీనాథ్ ఇంట్లో ఉన్న వస్తువులను ఉదహరిస్తూ సులభంగా అర్థమయ్యేలా చెప్పేవాడు. బహుశా గీతకు ఆ లక్షణమే వచ్చి ఉంటుంది. జటిలమైన ఆర్థిక విషయాలను వేగంగా అర్థం చేసుకోవడంలోనే కాదు, వాటిని సులభంగా బోధించడంలో పట్టు సాధించింది. గీత పరిశోధన పత్రాలు టాప్ ఎకనామిక్స్ జర్నల్స్‌లో ప్రచురితమయ్యాయి. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ‘యంగ్ గ్లోబల్ లీడర్’ (2011) పురస్కారాన్ని అందుకుంది. 2014లో ‘టాప్ 25 ఎకనామిస్ట్స్ అండర్ 45’ జాబితాలో చోటు సంపాదించింది. భారత ప్రభుత్వ అత్యున్నత పురస్కారం ప్రవాసీ భారతీయ సమ్మాన్ అందుకుంది. ఐఎంఎఫ్‌లో చీఫ్ ఎకనామిస్ట్‌గా పనిచేసిన గీత ప్రస్తుతం ఐఎంఎఫ్–డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ పదవిలో ఉంది. -
'ట్రెండ్‌ను బ్రేక్ చేస్తూ'..ఐఎంఎఫ్ గీతా గోపినాథ్ సరికొత్త రికార్డ్‌లు!
న్యూఢిల్లీ: భారతీయ సంతతికి చెందిన ప్రముఖ ఆర్థికవేత్త, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ– ఐఎంఎఫ్ మొదటి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గీతా గోపీనాథ్ మరో అరుదైన గుర్తింపును పొందారు. ఐఎంఎఫ్ ‘వాల్ ఆఫ్ ఫార్మర్ చీఫ్ ఎకనమిస్ట్స్’పై ఆమెకు చోటు లభించింది. ఈ గొప్ప స్థానాన్ని సంపాదించిన మొదటి మహిళ గీతా గోపీనాథ్‌కాగా, ఈ స్థానానికి చేరిన భారత్ సంతతికి చెందిన రెండవ వ్యక్తి. ఇంతక్రితం రఘురామ్ రాజన్ ఈ గౌరవం లభించింది. ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ 2003 నుంచి 2006 మధ్య ఐఎంఎఫ్ చీఫ్ ఎకనమిస్ట్ అండ్ డైరెక్టర్ ఆఫ్ రిసెర్చ్‌గా బాధ్యతలు నిర్వహించారు. గీతా గోపీనాథ్, 2018 అక్టోబర్‌లో ఐఎంఎఫ్ మొట్టమొదటి మహిళా చీఫ్ ఎకనమిస్టుగా నియమితులయ్యారు. గత ఏడాది డిసెంబర్లో ఐఎంఎఫ్ మొట్టమొదటి మహిళా డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా పదోన్నతి పొందారు. గోపీనాథ్ పరిశోధనలు అనేక అగ్ర ఆర్థిక శాస్త్ర పత్రికలలో ప్రచురితమయ్యాయి. ఐఎంఎఫ్ చీఫ్ ఎకనామిస్ట్‌గా నియామకానికి ముందు ఆమె హార్వర్డ్ యూనివర్శిటీలోని ఆర్థిక శాస్త్ర విభాగంలో అంతర్జాతీయ అధ్యయనాలు, ఆర్థికశాస్త్రంలో ప్రొఫెసర్‌గా ఉన్నారు.2005లో హార్వర్డ్ యూనివర్శిటీ ఫ్యాకల్టీలో చేరడానికి ముందు, ఆమె యూనివర్శిటీ ఆఫ్ చికాగోలోని బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఎకనామిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. బ్రేకింగ్ ది ట్రెండ్ ‘ట్రెండ్‌ను బ్రేక్ చేస్తూ, నేను ఐఎంఎఫ్ మాజీ చీఫ్ ఎకనామిస్ట్‌ల గోడపై చేరాను’ అని గీతా గోపీనాథ్ ఒక ట్వీట్లో పేర్కొన్నారు. మాజీ చీఫ్ ఎకనామిస్ట్‌ల గోడపై నెలకొలి్పన తన ఫొటో వద్ద ఫోజిచ్చిన్న చిత్రాన్ని కూడా ఆమె తన ట్వీట్‌కు జోడించారు. Breaking the trend 👊💥…I joined the wall of former Chief Economists of the IMF 😀 pic.twitter.com/kPay44tIfK — Gita Gopinath (@GitaGopinath) July 6, 2022 మూడేళ్ల పాటు ఐఎంఎఫ్ డిప్యూటీ ఎండీగా బాధ్యతలు నిర్వహిస్తున్న గీతా గోపినాథ్ మూడేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగనున్నారు. ఆ తర్వాత హార్వర్డ్ వర్సిటీలో ప్రొఫెసర్‌గా విధులు చేపట్టాలని అనుకున్నట్లు గీతా గోపినాథ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. -
సంపన్న ఎకానమీపై గీతా గోపీనాథ్ వ్యాఖ్యలు
దావోస్: అభివృద్ధి చెందిన ఎకానమీలు 2024 నాటికి తిరిగి ట్రాక్‌లోకి వస్తాయని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గీతా గోపీనాథ్ పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలు మళ్లీ పురోగతి పట్టాలెక్కకపోతే, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల వృద్ధి రేటు 5 శాతం దిగువనే ఉంటుందని కూడా ఆమె అభిప్రాయపడ్డారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సమావేశం 2022 సందర్భంగా ‘ప్రపంచ తదుపరి వృద్ధి ధోరణి’ అనే అంశంపై జరిగిన ప్రత్యేక సెషన్లో ఆమె చేసిన ప్రసంగంలో ముఖ్యాంశాలు... ♦ కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు తీవ్ర ప్రతికూల ప్రభావాలకు లోనయ్యాయి. నెమ్మదిగా తిరిగి కోలుకుంటున్నాయి. ఈ రికవరీకి ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధం మళ్లీ విఘాతంగా మారింది. ♦ యుద్ధం వల్ల ఇంధనం, ఆహారంతో సహా వస్తువుల ధరలు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నాయి. ప్రపంచం తీవ్ర ప్రతికూలతలను ఎదుర్కొంటోంది. దీనితో ప్రపంచ వృద్ధి ధోరణిపట్ల డౌన్‌గ్రేడ్ దృక్పధాన్ని కలిగి ఉన్నాము. ♦ ప్రధానంగా అధిక స్థాయి ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి సెంట్రల్ బ్యాంకులు ప్రయత్నిస్తున్నాయి. వడ్డీ రేట్లను తీవ్రంగా పెంచుతున్నాయి. ఈ చర్యలు తీసుకోవాల్సిన తప్పనిసరి పరిస్థితి ఉంది. అయితే ఆయా వడ్డీరేట్ల పెంపు నిర్ణయాలు ప్రపంచ ఆర్థిక, వాణిజ్య విభాగాలపై త్రీవ ప్రతికూల పరిణామాలకు దారితీసే వీలుంది. ♦ కోవిడ్, తదనంతరం యుద్ధ వాతావారణ పరిస్థితుల నేపథ్యంలో వృద్ధికి సంబంధించి ప్రపంచ దేశాల మధ్య తీవ్ర వ్యత్యాసాలు నెలకొన్నాయి. ఆర్థిక వనరుల వినియోగం, వ్యాక్సినేషన్ వంటి అంశాల్లో వైరుధ్యాలు దీనికి కారణం. ♦ ఆహారం, ఇంధనం, వనరుల సంక్షోభాలు ఇప్పుడు వృద్ధి అసమతౌల్యతకు దారితీసే అవకాశాలు ఏర్పడినందున దీర్ఘకాలిక ఆర్థిక శ్రేయస్సు, అంతర్జాతీయ పరస్పర సహకారం వంటి అంశాలపై తక్షణం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. -
కలసికట్టుగా ఆర్థిక వ్యవస్థలను కాపాడుకుందాం!
వాషింగ్టన్: సుదీర్ఘకాలంగా ఉన్న ద్రవ్యోల్బణం, సరఫరా వ్యవస్థలో అవరోధాలు, ఇంధన మార్కెట్లలో అనిశ్చితులు అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి జోరును దెబ్బతీసినట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. వాషింగ్టన్లో జీ20 దేశాల ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంకు గవర్నర్ల సమావేశంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి మాట్లాడారు. ఇండోనేషియా అధ్యక్షతన బుధవారం ఈ సమావేశం జరిగింది. అంతర్జాతీయ భవిష్యత్ ఆర్థిక వృద్ధి తీరు, రిస్క్‌లు, అంతర్జాతీయ ఆరోగ్యం సమావేశం అంజెండాలోని అంశాలుగా ఉన్నాయి. ఈ సందర్భంగా మంత్రి సీతారామన్ మాట్లాడుతూ.. స్థూల ఆర్థిక పర్యవసనాలను ఎదుర్కొనేందుకు అంతర్జాతీయంగా విధానాల సమన్వయానికి జీ20 తగిన ప్రేరణనిచ్చే స్థితిలో ఉందని మంత్రి సీతారామన్ పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థలను కాపాడేందుకు చురుకై, ఉమ్మడి చర్యల అవసరం ఉందన్నారు. ప్రముఖులతో సమావేశాలు.. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్), ప్రపంచబ్యాంకు వార్షిక సమావేశాల్లో పాల్గొనేందుకు గత సోమవారం వాషింగ్టన్కు నిర్మలా సీతారామన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ఐఎంఎఫ్ చీఫ్‌క్రిస్టలీనా జార్జీవాతో భేటీ అయ్యారు. అలాగే, అమెరికా వాణిజ్య మంత్రి గినారాయ్‌మోండోతో చర్చలు నిర్వహించారు. ఆర్థిక సహకార విస్తృతికి గల మార్గాలపై చర్చించారు. సెమీకండక్టర్ ఇండస్ట్రీ అసోసియేషన్ ప్రెసిడెంట్, సీఈవో జాన్ నెఫర్ తోనూ సీతారామన్ సమావేశమయ్యారు. సెమీకండక్టర్ పరిశ్రమకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ప్రకటించడం, పరిశ్రమలో విదేశీ పెట్టుబడులకు ఆహ్వానం పలకడాన్ని నెఫర్ ప్రశంసించారు. 2047 నాటికి అధిక ఆదాయ దేశంగా భారత్: అమితాబ్ కాంత్ ఆకాంక్ష న్యూఢిల్లీ: భారత్ 2047 నాటికి అధిక ఆదాయం కలిగిన దేశంగా అవతరించాలన్న ఆకాంక్షతో పనిచేయాలని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ పిలుపునిచ్చారు. ఇందుకోసం ఏటేటా స్థిరమైన వృద్ధి రేటు సాధించాల్సిన అవసరాన్ని ఆయన ప్రస్తావించారు. భారత్ తన ప్రైవేటు రంగ సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకుంటే మంచి వృద్ధిని సాధిస్తుందన్నారు. 1947లో దక్షిణ కొరియా, చైనా, భారత్ తలసరి ఆదాయం ఇంచుమించు ఒకే స్థాయిలో ఉన్న విషయాన్ని కాంత్ గుర్తు చేశారు. 75 ఏళ్ల తర్వాత చూస్తే దక్షిణ కొరియా తలసరి ఆదాయం భారత్ కంటే ఏడు రెట్లు అధికంగా ఉన్నట్టు చెప్పారు. చైనా, దక్షిణ కొరియా ఏటేటా 10 శాతం వృద్ధిని నమోదు చేయడం వాటికి సాయపడినట్టు తెలిపారు. చదవండి👉 భారత్‌కు ఆ సత్తా ఉంది,రష్యాతో పెట్టుకోవద్దు..అలా చేస్తే అమెరికాకే నష్టం! -
భారత్‌కు ఆ సత్తా ఉంది,రష్యాతో పెట్టుకోవద్దు..అలా చేస్తే అమెరికాకే నష్టం!
ముంబై: ఎకానమీకి సాధారణంగా ప్రయోజనం చేకూర్చే మూలధన ప్రవాహాలు ఒక్కొక్కసారి నష్టాలకూ దారితీసే అవకాశం ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గీతా గోపీనాథ్ పేర్కొన్నారు. అయితే ఇలాంటి సవాళ్లను ఎదుర్కొనే సత్తా భారత్‌కు ఉందని కూడా ఆమె వివరించారు. కోవిడ్–19 సంక్షోభం ఉన్నప్పటికీ గత కొన్నేళ్లుగా రికార్డు స్థాయిలో భారత్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) ఆకర్షించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గోపీనాథ్ మాట్లాడుతూ, మూలధన ప్రవాహాల నుండి వచ్చే నష్టాలను తగ్గించడానికి భారత్ పలు రక్షణాత్మక విధానాలను అవలంభిస్తోందని అన్నారు. మూలధన ప్రవాహాలకు సంబంధించి సంస్కరణలు, నిర్వహణ అనే అంశంపై విడుదల చేసిన ఒక అధ్యయన నివేదిక సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. క్యాపిటల్ ఫ్లోస్‌కు సంబంధించి ‘అధ్యయనం ఆధారంగా’ పలు సలహాలను ఇచ్చారు. ఈ అంశాల గురించి ఆమె ఏమన్నారంటే... ►మూలధన ప్రవాహాలు అనేక ప్రయోజనాలను కలిగి ఉంటాయి. తద్వారా అవసరమైన పెట్టుబడలు అందుతాయి. ఎకానమీకి కొన్ని విధానాలు వచ్చే నష్టాలకు ఎదుర్కొనడానికి దోహదపడతాయి. భారతదేశానికి కూడా ఇదే తరహా ప్రయోజనాలు అందుతున్నాయి. ►అయితే నష్టాలూ ఇందులో ఇమిడి ఉన్నాయి. భారత్ విషయానికి వస్తే, మూలధన ప్రవాహాల విషయంలో దేశంలో ఇప్పటికే భారీగా పరిమితులు ఉన్నాయి. అంతర్జాతీయ ఆర్థిక వాతావరణం మారినప్పుడు భారత ప్రభుత్వం ఈ పరిమితులను చాలా చురుగ్గా ఉపయోగిస్తుంది. కార్పొరేట్లు చేసే అంతర్జాతీయ రుణాల మొత్తంపై పరిమితులు విధించడం ఇక్కడ కీలకంగా చెప్పుకోవాల్సిన అంశం. ► పటిష్ట విధానాలు, నియంత్రణలతో భారత్ దాని క్యాపిటల్ అకౌంట్ వ్యవస్థను సరళీకృతం చేసే ప్రక్రియలో ఉంది. భారత్ ఫైనాన్షియల్ మార్కెట్లు, సంస్థలు పరిపక్వతతో కూడిన నియంత్రణలో ఉండడం వల్ల దేశం మరిన్ని రూపాల్లో క్యాపిటల్ ఫ్లోస్‌ను అనుమతించే వీలుంది. ►అంతర్జాతీయంగా మహమ్మారి ప్రారంభంలో మేము చూసిన ‘నాటకీయ’ మూలధన ప్రవాహాలు మళ్లీ ఇప్పుడు ఉక్రెయిన్‌లో యుద్ధం తరువాత కొన్ని అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలోకి ప్రవేశిస్తున్నాయి. ఇది ఆర్థిక వ్యవస్థలపై చూపే ప్రభావం ఎలా ఉంటుందన్న అంశాలపై ఆయా దేశాల విధాన నిర్ణేతలు సమగ్ర విశ్లేషణ జరుపుకోవాల్సి ఉంటుంది. ► తీవ్ర ఆర్థిక సంక్షోభం తర్వాత, అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలలో వడ్డీ రేట్లు చాలా కాలంగా తక్కువగా ఉన్నందున, అధిక రాబడుల కోసం వర్ధమాన మార్కెట్లకు మూలధనం ప్రవహించింది. కొన్ని దేశాల్లో ఇది విదేశీ కరెన్సీలో ఆయా దేశాల అంతర్జాతీయ రుణాన్ని క్రమంగా పెంచడానికి దారితీసింది. విదేశీ కరెన్సీ ఆస్తులు లేదా హెడ్జ్‌ల ద్వారా పరిష్కారింపలేని స్థాయికి కొన్ని దేశాల ఫైనాన్షియల్ వ్యవస్థలను అస్థిరపరిచే స్థాయికి ఇది చేరింది. ►సరళతర వడ్డీరేట్ల వ్యవస్థ తిరోగమనం పట్టిన సందర్భాల్లో వర్ధమాన దేశాల మార్కెట్లలో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులకు దారితీసింది. అటువంటి గత అనుభవాలు, పరిశోధనల నుండి ఇప్పుడు నేర్చుకున్న పాఠాలు ఏమిటంటే, కొన్ని పరిస్థితులలో స్థూల ఆర్థిక వ్యవస్థను అలాగే ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడటానికి దేశాలు క్యాపిటల్ ఫ్లోస్‌పై తగిన ముందస్తు జాగ్రత్తలు, విధి విధానాలు తప్పనిసరిగా రూపొందించుకోవాలి. ఏదైనా అనుకోని పరిస్థితుల తలెత్తినప్పుడు ముందు జాగ్రత్తగా తీసుకున్న చర్యలు ఆర్థిక సంక్షోభం తీవ్రతను తగ్గిస్తాయి. ►అంతర్జాతీయ రుణ బాధ్యతలు క్రమంగా పెరుగుతూ ఉండడం వల్ల అనుకోకుండా ఆర్థిక స్థిరత్వానికి వచ్చే నష్టాలను ఈ అధ్యయనం వివరిస్తోంది. అంతర్జాతీయ విదేశీ మారకద్రవ్యానికి సంబంధించి అసమతుల్యతను ఎప్పటికప్పుడు జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. ►అసమతౌల్య క్యాపిటల్ ఇన్‌ఫ్లో పెరుగుదలను ఎలా గుర్తించాలి? మూలధన ప్రవాహాలను సరళీకరించడం అవసరమా? కాదా? అని నిర్ణయించుకోవడంతో సహా ఇందుకు సంబంధించి అన్ని అంశాలపై విధాన సలహాలు, ఆచరణాత్మక మార్గదర్శకత్వాన్ని నివేదిక విశ్లేషణాంశాలు అందిస్తాయి. డాలర్ ఆధిపత్యానికి ‘ఆంక్షలు’ గండి ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో రష్యాపై విధిస్తున్న ఆంక్షలు అమెరికా డాలర్ ఆధిపత్యాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందని గీతా గోపీనాథ్ విశ్లేషించారు. అయితే అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో డాలర్ తక్కువ ఆధిపత్యం చెలాయించే అవకాశం ఉన్నప్పటికీ, ప్రధాన ప్రపంచ కరెన్సీగా కొనసాగడంలో ఎటువంటి అవరోధం ఉండబోదని ఆమె స్పష్టం చేశారు. ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మరింత ‘విచ్ఛిన్నం’ చేసే అవకాశం ఉందని కూడా హెచ్చరించారు. భౌగోళిక ఉద్రిక్తత నేపథ్యంలో క్రిప్టో కరెన్సీ వినియోగమూ పెరిగే వీలుందని విశ్లేషించారు. ‘‘యుద్ధం నేపథ్యంలో క్రిప్టోకరెన్సీల నుండి స్టేబుల్కాయిన్లు– సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీల వరకు డిజిటల్ ఫైనాన్స్ ప్రాధాన్యత పెరిగే అవకాశం ఉంది. అందువల్ల డిజిటల్ ఫైనాన్స్‌పై అంతర్జాతీయ నియంత్రణ ప్రస్తుతం అవశ్యం’’ అని ఆమె అన్నారు. ఇక రష్యాపై పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షల వల్ల విభిన్న దేశాలు, దేశీయ గ్రూపుల మధ్య ప్రత్యేక వాణిజ్య అవగాహనలు, చిన్న కరెన్సీ బ్లాక్‌లు ఆవిర్భవించే అవకాశం ఉందని ఆమె అన్నారు. -
క్రిప్టోకరెన్సీపై కీలక వ్యాఖ్యలు చేసిన ఐఎమ్ఎఫ్ చీఫ్ ఎకనమిస్ట్ గీతా గోపినాథ్..!
పార్లమెంట్లో క్రిప్టోకరెన్సీపై నియంత్రణ బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమైన విషయం తెలిసిందే. వివిధ దేశాల్లోని సెంట్రల్ బ్యాంకులు క్రిప్టోకరెన్సీలను నిషేధించాలని కోరుతుండగా... ఈ నిర్ణయాలను అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎమ్ఎఫ్) మద్దతు తెలిపింది. కాగా త్వరలోనే ఐఎమ్ఎఫ్కు డిప్యూటీ మేనేజింగ్ డైరక్టర్ పదవి స్వీకరించనున్న ఐఎమ్ఎఫ్ చీఫ్ ఎకనమిస్ట్ గీతా గోపినాథ్ క్రిప్టోకరెన్సీపై కీలక వ్యాఖ్యలు చేసింది. చదవండి: చరిత్ర సృష్టించిన గీతా గోపినాథ్.. ఎక్కాలే రాని చిన్నారి.. ఇప్పుడు ఏకంగా ఐఎంఎఫ్‌లో నెం.2!! నిషేధం బదులుగా..నియంత్రణే మేలు..! నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ (NCAER) నిర్వహించిన కార్యక్రమంలో గీతా గోపినాథ్ క్రిప్టోకరెన్సీలపై వ్యాఖ్యానించారు. క్రిప్టోకరెన్సీలను నిషేధించే బదులుగా వాటిని నియంత్రణలోకి తీసుకురావడం చాలా మంచిదని అభిప్రాయపడ్డారు. అభివృద్ధి చెందే దేశాల ఆర్థిక వ్యవస్థలకు క్రిప్టోకరెన్సీలు ప్రత్యేక సవాలుగా నిలుస్తాయని తెలిపారు. అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే అభివృద్ధి చెందుతున్న మార్కెట్లకు క్రిప్టోకరెన్సీలు మరింత ఆకర్షణీయంగా ఉన్నాయని అన్నారు . అయితే అభివృద్ధి చెందుతున్న దేశాలు మారకపు రేటు నియంత్రణలను కలిగి ఉంటాయి. మూలధన ప్రవాహ నియంత్రణలను క్రిప్టోకరెన్సీలు ప్రభావితం చేసే అవకాశం ఉందని గీతా పేర్కొన్నారు. క్రిప్టోకరెన్సీలను ఇన్వెస్టర్లు ఒక పెట్టుబడి ఆస్తిలాగానే ఉపయోగిస్తున్నారని, ఆయా దేశాల్లో పెట్టుబడికి సంబంధించిన నియమాలను డిజిటల్ కరెన్సీపై కూడా వర్తించేలా చూడాలని గీతా సూచించారు. భారత ప్రభుత్వం క్రిప్టోకరెన్సీలకు సంబంధించిన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని చూస్తున్న తరుణంలో గోపీనాథ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 23తో ముగియనున్నాయి. కాగా క్రిప్టోకరెన్సీ బిల్లుపై కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. క్రిప్టోకరెన్సీపై కేంద్ర ప్రభుత్వం బిల్లును తెచ్చే వరకు వేచి చూడాల్సిందే. చదవండి: ప్రధాని మోదీని కలిసిన ఐఎంఎఫ్ చీఫ్ ఎకనమిస్ట్ -
ప్రధాని మోదీని కలిసిన గీతా గోపినాథ్
ఐఎంఎఫ్ చీఫ్ ఎకనమిస్ట్ గీతా గోపినాథ్ భారత ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. బుధవారం సాయంత్రం ఆమెతో భేటీ అయిన ఫొటోల్ని స్వయంగా ప్రధాని తన ట్విటర్లో పోస్ట్ చేశారు. ఇటీవలే గీతా గోపినాథ్‌ను ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ సంస్థకు ఫస్ట్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా ప్రమోట్ చేసిన విషయం తెలిసిందే. జనవరి 21, 2022న ఆమె బాధ్యతలు స్వీకరించాల్సి ఉంది. Chief Economist of the IMF, @GitaGopinath called on PM @narendramodi. pic.twitter.com/2B30CMvjja — PMO India (@PMOIndia) December 15, 2021 ఈ ప్రకటన తర్వాతే గౌరవపూర్వకంగా ఆమె ప్రధాని మోదీని కలిసినట్లు తెలుస్తోంది. నిజానికి వచ్చే ఏడాదిలో ఆమె ఐఎంఎఫ్‌ను వీడి.. హార్వార్డ్ యూనివర్సిటీకి వెళ్లాలనుకున్నారు. కానీ, ప్రస్తుతం ఉన్న ఫస్ట్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ జియోఫ్రె ఒకమోటో వచ్చే ఏడాది తన పదవికి రాజీనామా చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే గీతను ఆ ఉన్నత పదవికి సిఫార్సు చేసింది ఐఎంఎఫ్ బోర్డు. చదవండి: కోల్‌కతా టు న్యూయార్క్ వయా బెంగళూరు -
Gita Gopinath: అనూహ్య పరిణామం.. అంతర్జాతీయ వేదికపై మన ‘గీత’
అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF)లో ఓ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. భారత సంతతికి చెందిన గీతా గోపినాథ్‌కు కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు గురువారం ప్రకటించారు. అంతర్జాతీయ సంస్థ ఐఎంఎఫ్‌కు ఇంతకుముందు తొలి ఉమెన్ ఛీఫ్ ఎకనమిస్ట్‌గా చరిత్ర సృష్టించిన గీతా గోపినాథ్.. ఇప్పుడు మరో ఘనత దక్కించుకున్నారు. ఏకంగా ఫస్ట్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతలు చేపట్టబోతున్నారామె. ప్రస్తుతం ఈ అంతర్జాతీయ ఆర్థిక సంస్థకు నెంబర్ 2గా ఉన్నజియోఫ్రె విలియమ్ సెయిజి ఒకమోటో( ఫస్ట్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్).. వచ్చే ఏడాది మొదట్లో బాధత్యల నుంచి తప్పుకోనున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆ స్థానాన్ని గీతా గోపినాథ్‌తో భర్త చేయనుంది ఐఎంఎఫ్. నిజానికి ఆమె వచ్చే ఏడాది జనవరిలో ఐఎంఎఫ్‌ను వీడి.. హర్వార్డ్ యూనివర్సిటీలో చేరతానని ప్రకటించుకున్నారు. కానీ, అనూహ్యంగా ఆమెకు కీలక బాధ్యతలు అప్పగించింది ఐఎంఎఫ్. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్‌కు మేనేజింగ్ డైరెక్టర్ పదవిలో 68 ఏళ్ల క్రిస్టలీనా జార్జియేవా(బల్గేరియా) కొనసాగుతోంది. ఇక ఇప్పుడు రెండో పొజిషన్లో గీతా గోపినాథ్(49) నియమితురాలయ్యింది. దీంతో కీలకమైన ఒక అంతర్జాతీయ ఆర్థిక విభాగపు కీలక బాధ్యతల్ని ఇద్దరు మహిళలు చూసుకోబోతున్నారన్నమాట. మైసూర్ టు వాషింగ్టన్ గీతా గోపినాథ్.. పుట్టింది డిసెంబర్ 8, 1971 కోల్‌కతా(కలకత్తా)లో. అయితే ఆమె చదువు మొత్తం మైసూర్ (కర్ణాటక)లో సాగింది. చిన్నతనంలో గీతాకు చదువంటే ఆసక్తే ఉండేది కాదట. ముఖ్యంగా ఎక్కాల్లో ఆమె సుద్దమొద్దుగా ఉండేదని గీత తల్లి విజయలక్క్క్ష్మి ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు కూడా. ఇక ఏడో తరగతి నుంచి చదువులో మెరుగైన ప్రతిభ కనబరుస్తూ వచ్చిన గీత.. ఫ్లస్ టు సైన్స్‌లో విద్యను పూర్తి చేసింది. అయితే డిగ్రీకొచ్చేసరికి తనకు ఏమాత్రం సంబంధం లేని ఎకనమిక్స్‌ను ఎంచుకుని పేరెంట్స్‌ను సైతం ఆశ్చర్యపరిచిందామె. ఢిల్లీలోనే బీఏ, ఎంఏ ఎకనమిక్స్ పూర్తి చేసి.. ఆపై వాషింగ్టన్లో మరో పీజీ, ప్రిన్స్టన్ యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ పట్టా అందుకుంది. ఈ రీసెర్చ్‌కి గానూ ఆమెకు ప్రిన్స్టన్ వుడ్రో విల్సన్ ఫెలోషిప్ రీసెర్చ్ అవార్డు అందుకుంది. ఆపై చికాగో బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేశారామె. కీలక బాధ్యతలెన్నో.. 2018, అక్టోబర్‌లో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్‌కు ఛీఫ్ ఎకనమిస్ట్‌గా గీతా గోపీనాథ్ నియమించబడింది. అంతేకాదు ఐఎంఎఫ్‌లో కీలక బాధ్యతలు చేపట్టిన తొలి భారత సంతతి వ్యక్తి కూడా ఆమెనే!. ఇక ఆ పదవిలో కొనసాగుతూనే.. ఇంటర్నేషనల్ ఫైనాన్స్‌కు కో డైరెక్టర్‌గా, నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనమిక్ రీసెర్చ్‌లో మాక్రోఎకనమిక్స్ ప్రొగ్రామ్‌ను నిర్వహించారామె. ఇంతేకాదు ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్‌లో ఎకనమిక్ అడ్వైజరీ ప్యానెల్లో సభ్యురాలిగా, కేరళ ముఖ్యమంత్రికి ఆర్థిక సలహాదారుగా, ఈ ఏడాది జూన్‌లో వరల్డ్ బ్యాంక్-ఐఎంఎఫ్ హైలెవల్ అడ్వైజరీ గ్రూపులో కీలక సభ్యురాలిగా వ్యవహరించారు. గౌరవాలు 2011లో యంగ్ గ్లోబల్ లీడర్‌గా వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ నుంచి అవార్డుతో పాటు 2019లో భారత సంతతి వ్యక్తి హోదాలో ప్రవాసీ భారతీయ సమ్మాన్ పురస్కారం అందుకున్నారామె. కరోనా సంక్షోభంలో ఐఎంఎఫ్ తరపున ఆమె అందించిన సలహాలు, కార్యనిర్వహణ తీరు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. వ్యక్తిగత జీవితం గీతా గోపీనాథ్ భర్త ఇక్బాల్ సింగ్ ధాలివాల్.. మాజీ ఐఏఎస్ ఈయన. 1995 ఏడాది సివిల్స్ పరీక్షల్లో ఫస్ట్ ర్యాంకర్ ఆయన. కొంతకాలం విధులు నిర్వహించి.. ఆపై ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఈయన కూడా ఆర్థిక మేధావే. ప్రస్తుతం మస్సాచుషెట్స్ టెక్నాలజీ ఇనిస్టిట్యూట్, జే-పాల్లో ఎకనమిక్స్ విభాగంలో గ్లోబల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ జంటకు ఒక బాబు.. పేరు రోహిల్. గీతా గోపినాథ్‌కు ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియాతో పాటు అమెరికన్ పౌరసత్వం కూడా ఉంది. -సాక్షి, వెబ్‌స్పెషల్ -
అమితాబ్ సెక్సిస్ట్ కమెంట్స్ దుమారం
సాక్షి, ముంబై: మహిళలు ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నావారి అందం, సామర్ధ్యంపై చవకబారు కమెంట్స్, అనుచిత వ్యాఖ్యానాలు నిరంతరం మనం చూస్తూనే ఉంటాం. దీనికి సాధారణ వ్యక్తులనుంచి సూపర్ స్టార్లు, సెలబ్రిటీలు ఎవ్వరూ అతీతులు కాదు. తాజాగా బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ కౌన్ బనేగా కరోడ్‌పతి షోలో వివక్షా పూరిత వ్యాఖ్య చేశారు. దీంతో ట్విటర్లో దుమారం రేగుతోంది. తన పాపులర్ షోలో భాగంగా అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ చీఫ్ ఎకనామిస్ట్‌గా ఉన్న గీతా గోపీనాథ్‌కు సంబంధించిన ప్రశ్నను ఒక మహిళా కంటెస్ట్‌కు సంధించారు అమితాబ్. 2019నుండి గీతా గోపీనాథ్ ఏ సంస్థకు ముఖ్య ఆర్థికవేత్తగా ఉన్నారనే ప్రశ్నను అడిగారు. ఇంతవరకు బాగానే ఉంది. ఇక్కడే ఆయన తన నైజాన్ని చాటుకున్నారు. గీతా ఫోటోను తెరపై చూపిస్తూ చాలా అలవోకగా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ‘‘ఆమె ఫేస్ ఎంత అందంగా ఉంది..ఆర్థికవ్యవస్థతో ఆమె అందాన్ని ఎవరైనా జోడించి చూడగలమా ’’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన ఈ వీడియోను గోపీనాథ్ స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేశారు. అమితాబ్ వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ, బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్కుపెద్ద అభిమానిననీ తనకు ఈ వీడియో చాలా ప్రత్యేకమైనదంటూ ట్వీట్ చేయడం విశేషం. "గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్" అని కూడా ఆమె అభివర్ణించారు. కానీ బిగ్‌బీ సెక్సిస్ట్ వ్యాఖ్యలపై ట్విటర్ యూజర్లు మాత్రం మండిపడుతున్నారు. ఆయన వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నారు. ముఖ్యంగా ప్రముఖ బిజినెస్ ఛానల్ యాంకర్, సీనియర్ ఎనలిస్ట్ లతా వెంకటేష్ సహా పలువురు ఈ ట్వీట్‌ను రీట్వీట్ చేశారు. అతి చిన్న వయసులోనే గీతా గోపీనాథ్ సాధించిన గౌరవాన్ని గుర్తించకుండా, ఆమె అందాన్ని ప్రస్తావించడం విచారకరమని విమర్శిస్తున్నారు. Ok, I don't think I will ever get over this. As a HUGE fan of Big B @SrBachchan, the Greatest of All Time, this is special! pic.twitter.com/bXAeijceHE — Gita Gopinath (@GitaGopinath) January 22, 2021 -
వ్యాక్సిన్ పంపిణీపై ఐఎంఎఫ్ కీలక వ్యాఖ్యలు
న్యూయార్క్ : కరోనా వైరస్ సృష్టించిన సంక్షోభం ఇప్పట్లో సమసిపోదని, వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత అది అందరికీ అందేలా బహుముఖ సహకారం అవసరమని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) హెచ్చరించింది. ప్రభుత్వాలు, కేంద్ర బ్యాంకుల చొరవతో చేపట్టిన కార్యక్రమాల ఫలితంగా కోవిడ్-19 నుంచి కోలుకునే పరిస్థితి కనిపిస్తోందని, దీనికి మరిన్ని చర్యలు అవసరమని ఫారెన్ పాలసీ మ్యాగజీన్లో ప్రచురితమైన ఓ వ్యాసంలో ఐఎంఎఫ్ పేర్కొంది. కరోనా వైరస్ నుంచి చోటుచేసుకుంటున్న రికవరీ పరిమితంగానే ఉందని, అన్ని రంగాలు, ప్రాంతాల్లో అసమానతలతో నిండిఉందని ఈ వ్యాసంలో ఐఎంఎఫ్ మేనజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా, ప్రధాన ఆర్థికవేత్త గీతా గోపీనాథ్‌లు పేర్కొన్నారు. చదవండి : ఊహించినదానికంటే లోతైన మాంద్యం : గీతా గోపీనాథ్ కరోనా వైరస్ కల్లోలంతో ఈ సంక్షోభ ఫలితంగా 2021 సంవత్సరాంతానికి 12 లక్షల కోట్ల డాలర్ల మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. ఫలితంగా అల్పాదాయ దేశాలకు నిరంతర సాయం కీలకమని తెలిపింది. కరోనా వైరస్ ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న 75 దేశాలకు ఐఎంఎఫ్ అత్యవసర నిధులను సమకూర్చగా, మధ్యాదాయ దేశాలకు విస్తృతస్ధాయిలో ఊతమిచ్చే చర్యలను కొనసాగించేందుకు సిద్ధమని స్పష్టం చేసింది. ఇక పేద దేశాలు సహా ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ నేతృత్వంలో 76 సంపన్న దేశాలు కోవ్యాక్స్ కూటమికి వెన్నుదన్నుగా నిలవడం పట్ల ఐఎంఎఫ్ అధికారులు హర్షం వ్యక్తం చేశారు. కాగా, ఈ కూటమిలో చేరబోమని అమెరికా ప్రకటించడం గమనార్హం. -
ఊహించినదానికంటే లోతైన మాంద్యం : గీతా గోపీనాథ్
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఊహించిన దానికంటే చాలా లోతైన మాంద్యంలోకి వెళ్లిపోతోందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ చీఫ్ ఎకనామిస్ట్ గీతా గోపీనాథ్ వ్యాఖ్యానించారు. కరోనాతో దాదాపు అన్ని దేశాల్లో ఆర్థిక వ్యవస్థలు కుదేలవ్వడంతో వృద్ధిరేటు తగ్గునుందని పేర్కొన్నారు. ముఖ్యంగా 2020 ఆర్థిక సంవత్సరానికి భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు ఏకంగా 4.5 శాతం పడిపోయిందని, భారతదేశం వృద్ధి 2 సంవత్సరాలలో ఒక శాతం కంటే కొద్దిగా ఎక్కువ ఉంటుందన్నారు. కానీ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోలుకోవడంతో భారత్ కూడా నెమ్మదిగా కోలుకుంటుందని పేర్కొన్నారు. కరోనా కట్టడి విషయంలో భారత్ బాగానే వ్యవహరించినప్పటికీ, పరీక్షల సామర్థ్యాన్ని పెంచాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. అలాగే ప్రస్తుత సంక్షోభ సమయంలో పేదలకు నగదు బదిలీ, ప్రతి ఒక్కరికి అవసరమైన ఉద్యోగాలను సృష్టించడం చాలా ముఖ్యం అని గీతా గోపీనాథ్ పేర్కొన్నారు. (చైనా ఉత్పత్తుల బహిష్కరణ సాధ్యమేనా?) గీతా గోపీనాథ్ పేర్కొన్న కొన్ని కీలక అంశాలు దేశాలు ప్రపంచీకరణపై పునరాలోచనలో ఉన్నప్పటికీ ప్రపంచ సంక్షోభం ప్రపంచ సహకారంతోనే పరిష్కారమవుతుంది. రానున్న సమీపకాలంలో దేశాలు వైద్య ఎగుమతులపై ఆంక్షలు పెట్టబోతున్నాయి. కానీ ఈ విషయంలో ప్రపంచ దేశాల మధ్య సహకారం అవసరం. ప్రస్తుతం ప్రధాన సవాలు ఆరోగ్య సంక్షోభం. అధిక జనాభా గల దేశంలో పడకల సంఖ్య అంతర్జాతీయ సగటుకు దూరంగా ఉంది. కానీ, తీసుకున్న చర్యలు బావున్నాయి. ఇది చాలా కష్టమైన సమయం. ప్రధాన నగరాలన్నీ కరోనాతో పోరాడుతున్నాయి. ఆరోగ్య సామర్థ్యాలను, పరీక్షల సామర్థ్యాన్ని పెంచాలి. సామాజిక భద్రతా చర్యల్ని చేపట్టాలి. పేదలకు నగుదును అందుబాటులో వుంచాలి. ఎక్కువ ఉద్యోగ కల్పన అవసరమయ్యే సమగ్ర విధానాన్ని అవలంబించాలి. వలస కార్మికులు తిరిగి నగరాలకు రావటానికి ప్రస్తుతం ఇష్టపడరు. ఇది సమస్య అవుతుంది. ప్రభుత్వం వారికి నగదును అందించాల్సిన అవసరం ఉంది. స్థానికంగా వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఇది ఆర్థికవ్యవస్థ రికవరీకి చాలా సహాయపడుతుంది. అంతర్జాతీయ వాణిజ్యంలో భారతదేశం పాత్ర పెద్దది కనుక భారీ సంస్కరణలు అవసరం. డిజిటల్ ఫ్రంట్లోభారత్ చాలా బాగా రాణించింది. అదే తరహాలో వైద్యపరంగా కూడా రాణించాలి. సంస్కరణలను వేగవంతం చేయడం కచ్చితంగా దేశానికి సహాయపడుతుంది. (గణేష్ విగ్రహాలు కూడా చైనా నుంచేనా: నిర్మలా సీతారామన్) కాగా చరిత్రలోనే తొలిసారిగా 2020లో అన్ని ప్రాంతాల్లో ప్రతికూల వృద్ధిరేటును అంచనా వేస్తున్నామని బుధవారం గీతా గోపీనాథ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తొలి త్రైమాసికంలో కాస్త రికవరీ ఉన్నప్పటికీ చైనా వృద్ధిరేటును ఒక శాతంగా అంచనా వేశామన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ 4.5 శాతం తగ్గుతుందని, 1961 తర్వాత ఇదే అత్యంత తగ్గుదల అని ఆమె పేర్కొన్నారు. అయితే, 2021లో వృద్ధిరేటు 6 శాతానికి పుంజుకుంటుందన్నారు. -
ఐఎంఎఫ్ : పాతాళానికి వృద్ధి రేటు
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి విరుచుకుపడటంతో భారత వృద్ధి రేటు అంచనాలను పలు రేటింగ్ సంస్థలు, దేశీ, అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు కుదిస్తున్న క్రమంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) షాకింగ్ అంచనాలతో ముందుకొచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో భారత్ వృద్ధి రేటు కేవలం 1.9 శాతానికి పరిమితమవుతుందని ఐఎంఎఫ్ వెల్లడించింది. 1991 చెల్లింపుల సంక్షోభం తర్వాత భారత్ వృద్ధి రేటు ఇంతటి కనిష్టస్ధాయికి చేరుతుందనే అంచనా వెలువడటం ఇదే తొలిసారి. వృద్ధి రేటు దిగజారినా ప్రపంచంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్ధల్లో భారత్ ఒకటని ఐఎంఎఫ్ పేర్కొంది. మరోవైపు అగ్రదేశాల్లో ఈ ఏడాది అమెరికా (-5.9), జపాన్ (-5.2), బ్రిటన్ (-6.5), జర్మనీ (-7.1), ఫ్రాన్స్ (-7.2), ఇటలీ (-9.1), స్పెయిన్ -8 శాతం నెగెటివ్ వృద్ధి రేటు నమోదు చేస్తాయని ఐఎంఎఫ్ నివేదిక పేర్కొంది. ఇక చైనా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1.2 శాతం జీడీపీ వృద్ధి సాధిస్తుందని తెలిపింది. భారత్, చైనాలు మాత్రమే సానుకూల వృద్ధి రేటును సాధిస్తాయని వెల్లడించింది. కరోనా మహమ్మారి ప్రభావంతో పాశ్చాత్య దేశాల వృద్ధి రేటు మైనస్‌లోకి జారుకుంటుందని పలు సంస్ధలు అంచనా వేస్తున్నాయి. చదవండి : మహమ్మారితో మహా సంక్షోభం : ఐఎంఎఫ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వ్యవస్ధపై మహమ్మారి విధ్వంసంతో 1991లో సరళీకరణ అనంతరం భారత్‌లో తొలిసారిగా వృద్ధి రేటు కనిష్టస్ధాయికి పడిపోతుందని ప్రపంచ బ్యాంక్ సైతం వెల్లడించింది. దక్షిణాసియా ఆర్థిక దృక్కోణం నివేదికలో భారత్ 2020-21లో 1.5 శాతం నుంచి 2.8 శాతం మేరకు వృద్ధి రేటు సాధిస్తుందని ప్రపంచ బ్యాంక్ పేర్కొంది. మార్చి 31తో ముగిసిన గడిచిన ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధిరేటు 4.8 శాతం నుంచి 5 శాతం మధ్య ఉండవచ్చని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. ఈ ఏడాది అంతర్జాతీయ వృద్ధి రేటు -3 శాతంగా ఉంటుందని తాము అంచనా వేస్తున్నామని, మహమ్మారి వ్యాప్తితో స్వల్పకాలంలోనే వృద్ధి రేటును అనూహ్యంగా తగ్గించామని ఐఎంఎఫ్ ప్రధాన ఆర్థికవేత్త, ఇండో-అమెరికన్ గీతా గోపీనాథ్ పేర్కొన్నారు. -
‘ఇక ఐఎంఎఫ్‌పై విరుచుకుపడతారు’
సాక్షి, న్యూఢిల్లీ : భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటును కుదించినందుకు అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్)తో పాటు ఐఎంఎఫ్ చీఫ్ ఎకనమిస్ట్ గీతా గోపీనాథ్‌పై విరుచుకుపడేందుకు కేంద్ర మంత్రులు సిద్ధమవుతారని కాంగ్రెస్ నేత, ఆర్థిక శాఖ మాజీ మంత్రి పీ చిదంబరం అన్నారు. నోట్ల రద్దును తొలిగా వ్యతిరేకించిన వారిలో ఐఎంఎఫ్ చీఫ్ ఎకనమిస్ట్ గీతా గోపీనాథ్ ఒకరని, ఐఎంఎఫ్..గీతా గోపీనాథ్‌లపై మంత్రుల దాడికి మనం సంసిద్ధం కావాలని చిదంబరం మంగళవారం ట్వీట్ చేశారు. కేవలం మూడు నెలల వ్యవధిలోనే భారత వృద్ధి రేటును 1.3 శాతం మేర కోత విధిస్తూ 4.8 శాతానికి ఐఎంఎఫ్ సోమవారం కుదించింది. రుణాల జారీలో తగ్గుదల, దేశీయ డిమాండ్ పడిపోవడంతో భారత వృద్ధిరేటు అంచనాను తగ్గిస్తున్నట్టు దావోస్‌లో ప్రపంచ ఆర్థిక పరిస్ధితిపై ఐఎంఎఫ్ విడుదల చేసిన నివేదికలో పేర్కొన్న సంగతి తెలిసిందే. భారత్‌లో వృద్ధి మందగమనం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటునూ ప్రభావితం చేస్తుందని, వరల్డ్ ఎకానమీ వృద్ధి అంచనాను కూడా 0.1 శాతం మేర సవరించామని గీతా గోపీనాథ్ పేర్కొనడం గమనార్హం. కాగా భారత వృద్ధి రేటును సవరిస్తూ ఐఎంఎఫ్ తాజా అంచనా మరింత తగ్గవచ్చని చిదంబరం వ్యాఖ్యానించడం గమనార్హం. చదవండి : వృద్ధి అంచనా కుదింపు : ఐఎంఎఫ్ హెచ్చరిక -
ద్రవ్యలోటును అదుపులో ఉంచాలి!
వాషింగ్టన్: ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు సంబంధించి నికర వ్యత్యాసం ద్రవ్యలోటును భారత్ అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ చీఫ్ ఎకనమిస్ట్ గీతా గోపీనాథ్ సూచించారు. అయితే దేశ ఆదాయ అంచనాలు కొంత సానుకూలంగానే ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు. 2018లో భారత్ వృద్ధి రేటు 6.8 శాతం అయితే, 2019లో 6.1%గానే ఉంటుందని, 2020లో 7 శాతానికి పెరుగుతుందని ఐఎంఎఫ్ మంగళవారం వెలువరించిన తన అవుట్‌లుక్‌లో పేర్కొంది. ఈ నేపథ్యంలో గోపీనాథ్ విలేకరులతో మాట్లాడారు. నాన్–బ్యాంకింగ్ ఫైనాన్షియల్ విభాగం, వినియోగ, లఘు చిన్న మధ్య తరహా పరిశ్రమల రుణాల వంటి అంశాల్లో ఒడిదుడుకులు, సవాళ్లను భారత్ ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంక్ వార్షిక సమావేశాల నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. -
పుంజుకోనున్న భారత్ ఆర్థిక వ్యవస్థ!
న్యూఢిల్లీ/వాషింగ్టన్: భారత్ ఆర్థిక వ్యవస్థ 2019, 2020లో ఊపందుకోనున్నదని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) పేర్కొంది. ఈ రెండు సంవత్సరాల్లో వరుసగా 7.5 శాతం, 7.7 శాతం వృద్ధి నమోదవుతుందని విశ్లేషించింది. అంతకుముందు అంచనాలకన్నా ఇది 10 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) ఎక్కువ. ఈ రెండు సంవత్సరాల్లో చైనా ఆర్థిక వృద్ధి రేటు 6.2 శాతంగా ఉంటుందని వివరించింది. తద్వారా భారత్ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే వేగవంతమైన అభివృద్ధిని సాధిస్తున్న దేశంగా నిలుస్తుందని ఐఎంఎఫ్ పేర్కొంది. క్రూడ్ ధరలు తక్కువగా ఉండడం, నిత్యావసరాల ధరల పెరుగుదల స్పీడ్ తగ్గడం, కఠిన ద్రవ్య పరపతి విధాన ప్రక్రియ నెమ్మదించడం భారత్ వృద్ధి పురోగతికి కారణంగా వివరించింది. ఐఎంఎఫ్ మొట్టమొదటి మహిళా చీఫ్ ఎకనమిస్ట్ గీతా గోపీనాథ్ విడుదల చేసిన నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు... ►ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం– ద్రవ్యలోటుపై భారత్‌లో ఆందోళనకరమైన పరిస్థితులు ఉన్నాయి. ► ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగిస్తోంది. 2019, 2020ల్లో ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు 3.5, 3.6 శాతాలుగా ఉంటాయి. గతంతో పోల్చితే ఈ అంచనాలు వరుసగా 0.2 శాతం 0.1 శాతం తక్కువ. పలు దేశాల్లో వృద్ధి మందగమనం దీనికి కారణం. పెరగనున్న రాష్ట్రాల ద్రవ్యలోటు: ఇండియా రేటింగ్స్ ఎన్నికల సంవత్సరంలో రాష్ట్రాల ద్రవ్యలోటు పెరగనుందని ఫిచ్ గ్రూప్ కంపెనీ– ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ తాజా నివేదిక తెలిపింది. వ్యవసాయ రుణాల మాఫీ, ఇతర స్కీమ్‌లు ఇందుకు ప్రధాన కారణమని విశ్లేషించింది. 28 ఏళ్ల కనిష్టానికి చైనా వృద్ధి వెల్లడించిన చైనా ఎన్బీఎస్ బీజింగ్: చైనా గత ఏడాది 6.6 శాతం వృద్ధిని సాధించింది. 1990 తర్వాత ఇదే అత్యంత తక్కువ స్థాయి జీడీపీ వృద్ధి రేటు. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో 6.5 శాతంగా ఉన్న వృద్ధి ఈ ఏడాది నాలుగో త్రైమాసికంలో 6.4 శాతానికి పడిపోయిందని చైనా నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ (ఎన్బీఎస్) వెల్లడించింది. 2017లో 6.8 శాతంగా ఉన్న జీడీపీ 2018లో 6.6 శాతానికి తగ్గింది. ఇది 28 సంవత్సరాల కనిష్ట స్థాయి. అమెరికాతో ఉన్న వాణిజ్య సవాళ్లు దీనికి ప్రధాన కారణం. కార్పొ బ్రీఫ్స్... శ్రేయీ ఎక్విప్మెంట్ ఫైనాన్స్ లిస్టింగ్‌పై కసరత్తు.. విలీన స్కీమ్ ద్వారా ఎక్విప్మెంట్ ఫైనాన్స్ వ్యాపార విభాగాన్ని స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయనున్నట్లు శ్రేయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ చైర్మన్ హేమంత్ కనోడియా తెలిపారు. సిడ్బిలో వాటా విక్రయించనున్న కెనరా బ్యాంక్.. చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్ (సిడ్బి)లోని కోటి షేర్లను విక్రయించాలని కెనరా బ్యాంక్ ప్రతిపాదించింది. ఈ అమ్మకానికి సంబంధించి.. ఒక్కో షేరు ఫ్లోర్ ప్రైస్ రూ.225 వద్ద నిర్ణయించినట్లు రాయిటర్స్ వెల్లడించింది. మరోవైపు ఎన్ఎస్డీఎల్లోని 4 లక్షల షేర్లను రూ.850 ఫ్లోర్ ప్రైస్ వద్ద విక్రయించనున్నట్లు తెలుస్తోంది.గుజరాత్లో నూతన సెల్లో ప్లాంట్ ప్రారంభం బీఐసీ సెల్లో ఇండియా రూ.300 కోట్ల వ్యయంతో గుజరాత్‌లోని వాపిలో ఏర్పాటుచేసిన అతిపెద్ద స్టేషనరీ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించింది. ఇందులో 1,500 మంది ఉద్యోగులను నియమించుకోగా.. వీరిలో 70 శాతం మహిళలే ఉన్నట్లు తెలిపింది. టాటా టెలీ, ఎయిర్టెల్ విలీనానికి ఆమోదంనష్టాల్లో కూరుకుపోయిన టెలికం సంస్థ– టాటా టెలీసర్వీసెస్‌ను భారతీ ఎయిర్ టెల్లో విలీనం చేసేందుకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అనుమతి ఇచ్చింది. ఈ విలీనానికి టెలికమ్యునికేషన్స్ శాఖ అనుమతి లభించాల్సి ఉంది. అక్టోబర్ 2017లో విలీన ప్రకటన వెలువడింది. -
ఐఎంఎఫ్ బాధ్యతలు స్వీకరించిన గీతా గోపీనాథ్
వాషింగ్టన్: అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) చీఫ్ ఎకనమిస్టుగా ప్రముఖ ప్రవాస భారతీయ ఆర్థికవేత్త గీతా గోపీనాథ్ (47) బాధ్యతలు చేపట్టారు. ఆమె ఈ పదవిలో నియమితులైన తొలి మహిళ కావడం విశేషం. అమెరికా పౌరసత్వం ఉన్న గీతా గోపీనాథ్.. హార్వర్డ్ వర్సిటీలో ఇంటర్నేషనల్ స్టడీస్ అండ్ ఎకనమిక్స్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. డిసెంబర్ 31న పదవీ విరమణ చేసిన ఐఎంఎఫ్ రీసెర్చ్ విభాగం ఎకనమిక్ కౌన్సిలర్, డైరెక్టర్ మారిస్ ఆబ్స్‌ఫెల్డ్ స్థానంలో ఆమె నియమితులయ్యారు. గతేడాది అక్టోబర్ 1న గీతా గోపీనాథ్ నియామకాన్ని ఐఎంఎఫ్ ఎండీ క్రిస్టీన్ లగార్డ్ ప్రకటించారు. గీతా గోపీనాథ్ ప్రపంచంలోనే అత్యుత్తమమైన ఆర్థికవేత్తల్లో ఒకరని లగార్డ్ కితాబిచ్చారు. బహుళజాతి సంస్థలు పెను సవాళ్లు ఎదుర్కొంటుండటం, ప్రపంచ దేశాలు గ్లోబలైజేషన్ను పక్కనపెట్టి దేశీయ అంశాలకే ప్రాధాన్యమిస్తుండటం వంటి ధోరణులు పెరుగుతున్న తరుణంలో ఐఎంఎఫ్ చీఫ్ ఎకనమిస్టుగా గీతా గోపీనాథ్ నియామకం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రపంచ దేశాలు గ్లోబలైజేషన్ నుంచి వెనక్కి తగ్గుతుండటాన్ని నివారించడం ఐఎంఎఫ్ ముందున్న పలు ప్రధాన సవాళ్లలో ఒకటని ది హార్వర్డ్ గెజిట్‌కిచ్చిన ఇంటర్వ్యూలో గీత తెలిపారు. ‘గ్లోబలైజేషన్లో భాగంగా గడిచిన 50–60 ఏళ్లలో ప్రపంచ దేశాలు టారిఫ్‌లు తగ్గించుకోవడం, వాణిజ్యం పెంచుకోవడం వంటివి చేశాయి. కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా గ్లోబలైజేషన్ నుంచి ప్రస్తుతం వెనక్కి తగ్గుతున్నాయి. చైనా తదితర దేశాలపై అమెరికా టారిఫ్‌లు విధించడం, ఆయా దేశాలు కూడా అదే రీతిలో స్పందించడం కొన్ని నెలలుగా చూస్తున్నాం. దీంతో వాణిజ్య విధానాలపై అనిశ్చితి పెరుగుతోంది. ప్రపంచ దేశాల మధ్య వాణిజ్యం పెరగడం వల్ల అంతర్జాతీయంగా పేదరికం తగ్గినా.. దాని ప్రభావంతో అసమానతలు పెరిగిపోయాయన్న ఆందోళన ఉంది. ఇలాంటి సందేహాలను నివృత్తి చేసేందుకు తగు చర్యల అవసరం‘ అని ఆమె పేర్కొన్నారు. అమెరికా వడ్డీ రేట్లను పెంచుతుండటం వల్ల వర్ధమాన దేశాలపై పడుతున్న ప్రభావాలు, వాణిజ్యంలో డాలర్ ఆధిపత్య ప్రభావాలు మొదలైన వాటిపై అధ్యయనం చేయాల్సి ఉందన్నారు. -
ఐఎంఎఫ్ చీఫ్ ఎకానమిస్ట్‌గా గీతా గోపినాథ్
మరో భారతీయ సంతతి మహిళకు అపూర్వ గౌరవం దక్కింది. అత్యంత ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ(ఐఎంఎఫ్)కు చీఫ్ ఎకానమిస్ట్‌గా భారతీయర సంతతి మహిళ గీతా గోపినాథ్ నియమితులయ్యారు. ఐఎంఎఫ్ రీసెర్చ్ డిపార్ట్మెంట్ ఎకానమిక్ కౌన్సిలర్‌గా, డైరెక్టర్‌గా గీతా గోపినాథ్‌ను నియమిస్తున్నట్టు ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టియానే లగార్డే ప్రకటించారు. మౌరైస్(మౌరి) అబ్స్ట్ఫెల్డ్ ఈ ఏడాది చివరిన పదవి విరమణ చేయనుండటంతో, ఆ స్థానంలో గీతా గోపినాథ్‌ను నియమిస్తూ ఐఎంఎఫ్ నిర్ణయం తీసుకుంది. గీతా గోపినాథ్ ప్రస్తుతం హార్వర్డ్ యూనివర్సిటీలో ఎకానమిక్స్కు, ఇంటర్నేషనల్ స్టడీస్‌లో జాన్ జవాన్స్ట్రా ప్రొఫెసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ‘గీత ప్రపంచంలో ఉన్న అత్యుత్తమ ఆర్థికవేత్తల్లో ఒకరు. మంచి విద్యా ప్రావీణ్యముంది. నాయకత్వ బాధ్యతల్లో మంచి ట్రాక్ రికార్డును సొంతం చేసుకున్నారు. విస్తృతమైన అంతర్జాతీయ అనుభవముంది’ అని లగార్డే అన్నారు. ఆమె అసాధారణమైన ప్రతిభను గుర్తించి, తమ చీఫ్ ఎకానమిస్ట్‌గా గీతను నియమించాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. గీత అమెరికన్ ఎకానమిక్ రివ్యూకి కో-ఎడిటర్‌గా కూడా ఉన్నారు. నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకానమిక్ రీసెర్చ్‌లో మాక్రో ఎకానమిక్స్ ప్రొగ్రామ్‌కు, ఇంటర్నేషనల్ ఫైనాన్స్‌కు కో-డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఎక్స్చేంజ్ రేట్లు, వాణిజ్యం, అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం, ద్రవ్య పరపతి విధానం, రుణాలు, అభివృద్ధి చెందుతున్న మార్కెట్ సంక్షోభాలు వంటి అంశాలపై 40 పరిశోధన ఆర్టికల్స్‌కు గీతనే రచయిత. గీతా గోపినాథ్ గురించి... గీత భారత్‌లో పుట్టి పెరిగారు. ఆమెకు అమెరికా పౌరసత్వం ఉంది. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బీఏ డిగ్రీ పొందారు. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకానమిక్స్, యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ నుంచి ఎంఏ డిగ్రీలు పొందారు. ఆ అనంతరం 2001లో ప్రిన్స్‌స్టన్ యూనివర్సిటీలో ఎకానమిక్స్‌లో పీహెచ్డీ చేశారు. అదే ఏడాది యూనివర్సిటీ ఆఫ్ చికాగాలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరారు. 2005లో హార్వర్డ్‌కు వెళ్లారు. -
మేం వెరీ లక్కీ: ముఖ్యమంత్రి
తిరువనంతపురం: హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన ప్రఖ్యాత ఆర్థికవేత్త, ప్రొఫెసర్ గీతా గోపీనాథ్ కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ ఆర్థిక సలహాదారుగా నియమితులయ్యారు. కేరళ మూలాలున్న ఆమె సేవలను రాష్ట్రం కోసం అందిపుచ్చుకోవడం తమకు ఆనందంగా ఉందని, ఈ విషయంలో కేరళ ప్రజలు చాలా అదృష్టవంతులని సీఎం విజయన్ ప్రశంసల జల్లు కురిపించారు. అయితే, ప్రముఖ ప్రపంచ ఆర్ధికవేత్తగా పేరొందిన గీతా గోపీనాథ్‌ను కేరళ ఆర్థిక సలహాదారుగా నియమించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికార సీపీఎం సైద్ధాంతిక భావజాలానికి విరుద్ధంగా ఈ నియామకం ఉందని విమర్శకులు అంటున్నారు. 38 ఏళ్ల గీత నూతన ఉదారవాద ఆర్థిక విధానాలను ప్రబోధిస్తున్నారు. అయితే, ప్రస్తుతం ఉదారవాద ఆర్థిక విధానాలకు కాలం చెల్లిందని, ఈ నేపథ్యంలో ఆమె తన వైఖరిలో ఏమేరకు మార్పు తెచ్చుకున్నారో తెలియదని సొంత పార్టీ సీపీఎం నేతలు భిన్నమైన వ్యాఖ్యలు చేస్తున్నారు.