వాషింగ్టన్: ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు సంబంధించి నికర వ్యత్యాసం ద్రవ్యలోటును భారత్ అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ చీఫ్ ఎకనమిస్ట్ గీతా గోపీనాథ్ సూచించారు. అయితే దేశ ఆదాయ అంచనాలు కొంత సానుకూలంగానే ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు. 2018లో భారత్ వృద్ధి రేటు 6.8 శాతం అయితే, 2019లో 6.1%గానే ఉంటుందని, 2020లో 7 శాతానికి పెరుగుతుందని ఐఎంఎఫ్ మంగళవారం వెలువరించిన తన అవుట్‌లుక్‌లో పేర్కొంది. ఈ నేపథ్యంలో గోపీనాథ్ విలేకరులతో మాట్లాడారు. నాన్–బ్యాంకింగ్ ఫైనాన్షియల్ విభాగం, వినియోగ, లఘు చిన్న మధ్య తరహా పరిశ్రమల రుణాల వంటి అంశాల్లో ఒడిదుడుకులు, సవాళ్లను భారత్ ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంక్ వార్షిక సమావేశాల నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment