IMF chief
-
IMF Report: ఆ టెక్నాలజీతో సగానికిపైగా ఉద్యోగాలు పోతాయ్..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని వ్యవస్థల్లోని ఉద్యోగాలకు ముప్పుగా పరిణమించింది. దీని ప్రభావం ఇప్పటికే ప్రారంభం కాగా రానున్న రోజుల్లో మరింత తీవ్ర రూపం దాల్చనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ భద్రతకు ముప్పును కలిగిస్తుందని, అయితే ఉత్పాదకత స్థాయిలను పెంచడానికి, ప్రపంచ వృద్ధికి అద్భుతమైన అవకాశాన్ని అందిస్తుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) చీఫ్ చెబుతున్నారు. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల్లో 60 శాతం ఉద్యోగాలపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం చూపుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా.. దావోస్ డబ్ల్యూఈఎఫ్ సదస్సు బయలుదేరే కొద్దిసేపటి ముందు వాషింగ్టన్లో ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఏఐ ప్రభావం తక్కువగా ఉంటుందన్న అంచనా నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా 40 శాతం ఉద్యోగాలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని ఐఎంఎఫ్ తాజా నివేదికను ఉటంకిస్తూ పేర్కొన్నారు. సగం మంది పోయినా మిగిలినవారికి లబ్ధి ఎంత ఎక్కువ నైపుణ్యం కలిగిన ఉద్యోగాలపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం అంత ఎక్కువగా ఉంటుందన్నారు. ఏఐ వల్ల ఉద్యోగం పూర్తిగా పోవచ్చు లేదా మెరుగుపడవచ్చని, ఉత్పాదకత, ఆదాయ స్థాయి పెరగవచ్చని జార్జివా చెప్పారు. కాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల సగం ఉద్యోగాలు పోయినప్పటికీ మిగిలిన సగం మంది ఏఐ కారణంగా మెరుగైన ఉత్పాదకత ప్రయోజనం పొందుతారని ఐఎంఎఫ్ తాజా నివేదిక పేర్కొంది. ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కార్మిక వ్యవస్థపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెద్దగా ఉండదని, అదే సమయంలో దాని ద్వారా ఉత్పన్నమయ్యే మెరుగైన ఉత్పాదకత నుంచి ప్రయోజనం పొందే అవకాశం కూడా తక్కువగానే ఉంటుందని వివరించింది. ఈ నేపథ్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందించే అవకాశాలను అందుకోవడానికి పేద దేశాలకు సహాయం చేయడంపై దృష్టి పెట్టాల్సిఉందని జార్జివా ఏఎఫ్‌పీ వార్తా సంస్థతో పేర్కొన్నారు. -
ఢిల్లీకి చేరిన ఐఎంఎఫ్ చీఫ్.. ఫోక్ సాంగ్‌కు డ్యాన్సులు..
ఢిల్లీ: అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF)మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా జీ20 సమ్మిట్‌లో పాల్గొనేందుకు గురువారం దేశ రాజధానికి చేరుకున్నారు. ఢిల్లీకి చేరుకున్న ఆమెకు దేశవాళీ నృత్య ప్రదర్శనతో ఘనస్వాగతం పలికారు. సంబల్పురి పాటపై సాంప్రదాయ జానపద నృత్యాన్ని ప్రదర్శించారు. ఈ సాంస్కృతిక ప్రదర్శనను జార్జివా మెచ్చుకున్నారు. స్వయంగా ఆమె కూడా డ్యాన్సర్లతో పాటు కాలు కదిపారు. స్టేజీ కింద నుంచి నృత్య ప్రదర్శనను చూసిన జార్జివా.. ఒకానొక దశలో డ్యాన్సర్లతో పాటే కాలు కదిపారు. నవ్వులు చిందిస్తూ చప్పట్లతో కళాకారులను మెచ్చుకున్నారు. ఈ వీడియోను కేంద్ర మంత్రి ధర్మెంద్ర ప్రధాన్ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా పంచుకున్నారు. సంబల్పురి బీట్స్‌ను ఆపడం కష్టం అని యాష్‌ట్యాగ్‌ను జతచేశారు. Difficult to resist #Sambalpuri beats . MD International Monetary Fund Ms. @KGeorgieva arrives in India for #G20 summit to a #Sambalpuri song and dance welcome . #OdiaPride pic.twitter.com/4tx0nmhUfK — Dharmendra Pradhan (@dpradhanbjp) September 8, 2023 ఈ వీడియో సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అయింది. గంటల వ్యవధిలోనే 19 వేల వ్యూస్ వచ్చాయి. వేలల్లో లైకులు కొట్టారు నెటిజన్లు. ఒడియా నృత్య కళాకారులను మెచ్చుకున్నారు. వీడియో చాలా బాగుందని కామెంట్లు వచ్చాయి. జీ20 వేదికైన భారత్‌కు దేశ విదేశాల నుంచి నేతలు నేడు ఢిల్లీకి వచ్చారు. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఇప్పటికే దేశ రాజధానిలో అడుగు పెట్టారు. శనివారం, ఆదివారం రెండు రోజుల పాటు ఢిల్లీలో విదేశీ నేతలతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇదీ చదవండి: జీ-20: కోవిడ్ కారణంగా మరో నేత మిస్.. పుతిన్, జిన్‌పింగ్ సహా.. -
బియ్యం కోసం కయ్యాలొద్దు: ఐఎంఎఫ్ చీఫ్ ఎకనామిస్ట్
Restrictions On Rice Export IMF To India బియ్యం ధరలకు కళ్లెం వేసేందుకు కేంద్ర సర్కార్ చర్యలు ఆస్ట్రేలియా, కెనడా దేశాల్లోనూ సంక్షోభం నెలకొంది. ఇటీవల బియ్యం కోసం విదేశాల్లో భారతీయులు క్యూ కట్టిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఆస్ట్రేలియా బియ్యం కొనుగోళ్లు విపరీతంగా పుంజు కున్నాయి. నెలలో కొనే బియ్యానికి రెట్టింపు పరిమాణంలో భారతీయులు బియ్యం కొనుగోలు చేస్తున్నారని ఆస్ట్రేలియాలోని దుకాణ దారులు చెబుతున్నారు. బాస్మతీయేతరరకాల బియ్యం ఎగుమతులపై నిషేధం విధించిన నేపథ్యంలోపెద్ద ఎత్తున నిల్వ చేసుకునేందుకు విదేశాల్లోని భారతీయులు ప్రయత్నిస్తున్నారు. ఫలితంగా ఒక్కసారిగా డిమాండ్ పెరగడంతో దాన్ని నియంత్రించేందుకు వ్యక్తికి 5 కిలోల బియ్యం మాత్రమే అమ్ముతున్న పరిస్థితి నెలకొంది. చాలామంది భారతీయులు తమ నిర్ణయం పట్ల తిరగబడుతున్నారని, అయినప్పటికీ తాము ఒకరికి 5 కిలోలకు మంచి అమ్మడంలేదని అక్కడి విక్రయదారులు వాపోతున్నారు. మరోవైపు బియ్యం ఎగుమతులపై పరిమితులను తొలగించాలని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ భారత ప్రభుత్వాన్ని కోరింది. ఈ కొరత ప్రపంచ ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపుతుందని , ఈ నేపథ్యంలో నిర్దిష్ట రకం బియ్యం ఎగుమతిపై పరిమితులను తొలగించాలని భారతదేశాన్ని కోరుతున్నామని పేర్కొంది. ప్రస్తుత వాతావరణంలో, ఈ రకమైన పరిమితులు ప్రపంచంలోని ఇతర దేశాలలో ఆహార ధరలపై అస్థిరతను పెంచే అవకాశం ఉంది. అంతేకాదు ఇది ప్రతీకార చర్యలకు కూడా దారితీస్తాయని ఐఎంఎఫ్ చీఫ్ ఎకనామిస్ట్ పియర్-ఒలివర్ గౌరించాస్ మీడియాతో అన్నారు. అటు ఈ నిషేధం కారణంగా అమెరికాలోని ఇండియన్ స్టోర్లలో పరిమితులు కొనసాగుతున్నాయి. దాదాపు స్టోర్లన్నీ ఖాళీ. టెక్సాస్‌లో పరిస్థితి దారుణంగా ఉంది. ఒక కుటుంబానికి ఒక బ్యాగ్‌ను మాత్రమే అనే బోర్డులు దర్శనమిచ్చాయి. దీనికి సంబంధించి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాబోయే పండుగ సీజన్లో దేశీయ సరఫరాను పెంచడానికి, రిటైల్ ధరలను అదుపులో ఉంచడానికి భారత ప్రభుత్వం జూలై 20న బాస్మతీయేతర తెల్ల బియ్యం ఎగుమతిని నిషేధించింది. దీన్ని తక్షణమే అమలులోకి తెచ్చింది.దేశం నుండి ఎగుమతి అయ్యే మొత్తం బియ్యంలో ఈ రకం బియ్యం 25 శాతం ఎగుమతి అవుతాయి. At the Indian store today for spices, I checked to see if rice prices went up due to the export ban. I was shocked to see this. Limits on quantities. Stock up on your staples NOW. Other countries are looking at the ban on rice and are stock piling. pic.twitter.com/kns8AtoQ3E — Lisa Muhammad (@iamlisamuhammad) July 23, 2023 Don't know if these empty shelves at Walmart today where Basmati rice is usually stocked, is related to the news of India's ban on rice exports but it wouldn't surprise me either. pic.twitter.com/GHXfI9RoAM — JJ Crowley (@JJCrowleyMusic) July 23, 2023 కాగా భారతదేశం నుండి బాస్మతీయేతర తెల్ల బియ్యం ఎగుమతులు 2022-23లో 4.2 మిలియన్ల డాలర్లు కాగా, అంతకుముందు సంవత్సరంలో 2.62 మిలియన్ డాలర్లుగా ఉంది. ఇండియానుంచి బాస్మతీయేతర తెల్ల బియ్యం ఎగుమతయ్యే దేశాల్లో ప్రధానంగా అమెరికా, థాయిలాండ్, ఇటలీ, స్పెయిన్ శ్రీలంక ఉన్నాయి. -
ఈ దశాబ్దం భారత్‌దే
వాషింగ్టన్: భారత ఆర్థిక వ్యవస్థ ఈ దశాబ్దంలో బలమైన వృద్ధిని నమోదు చేస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంకు వార్షిక సమావేశాలకు హాజరయ్యేందుకు వాషింగ్టన్కు వచ్చిన సందర్భంగా ఆమె మాట్లాడారు. ‘‘భారత్ కరోనా మహమ్మారి కల్పించిన విపత్తు నుంచి కోలుకుని ఈ రోజు ఎక్కడ ఉందో చూడండి. మనం ముందున్న దశాబ్దాన్ని చూస్తున్నాం. 2030 భారత్‌కు బలమైన దశాబ్దం అవుతుంది. భారత్ అత్యంత వేగవంతమైన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా కచ్చితంగా నిలుస్తుంది’’ అని మంత్రి సీతారామన్ అన్నారు. భారత్ కరోనాకు ముందు, ఆ తర్వాత ఎన్నో సంస్కరణలను చేపట్టిందని గుర్తు చేశారు. కరోనా విపత్తును అవకాశంగా మలుచుకుని సంస్కరణలను మరింత ముందుకు తీసుకెళ్లినట్టు వివరించారు. తక్కువ వ్యయాలు, డిజిటైజేషన్ స్థాయి అన్ని రకాల తరగతుల్లోనూ పౌరుల జీవనాన్ని సులభతరం చేసినట్టు చెప్పారు. ‘‘టెక్నాలజీ పల్లెలకు కూడా చేరింది. వారు ఇప్పుడు టెక్నాలజీ వినియోగం తెలిసిన వారు. స్మార్ట్ఫోనే అవసరం లేదు.. ఫీచర్ ఫోన్ ఉన్నా చాలు. టెక్నాలజీ ఎంతో మంది ప్రజలకు చేరువ అవుతోంది’’ అంటూ భారత్ సాధిస్తున్న ప్రగతిని మంత్రి సీతారామన్ వివరించారు. క్రిప్టోలను కట్టడి చేయాల్సిందే.. క్రిప్టోల నియంత్రణ అన్నది అంతర్జాతీయంగా ఉండాలని.. అప్పుడే మనీల్యాండరింగ్, ఉగ్రవాదులకు నిధులు అందకుండా చూడడం సాధ్యపడుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) నిర్వహించిన అత్యున్నత స్థాయి ప్యానెల్ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి సీతారామన్ మాట్లాడారు. క్రిప్టో ఆస్తుల్లో ప్రభుత్వం జోక్యం లేకుండా, వ్యాలెట్ల ద్వారా కార్యకలాపాలు కొనసాగినంత కాలం వాటి నియంత్రణ కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. సెంట్రల్ బ్యాంకు నిర్వహణలోని డిజిటల్ కరెన్సీ రూపంలో అయితే దేశాల మధ్య చెల్లింపులు మరింత సమర్థవంతంగా నిర్వహించుకోవచ్చన్నారు. భారత్‌లో క్రిప్టోలపై పన్ను విధింపు అన్నది వాటిల్లోకి వచ్చే పెట్టుబడుల మూలాలు తెలుసుకునేందుకే గానీ, చట్టబద్ధత కల్పించడం కాదని స్పష్టం చేశారు. ఐఎంఎఫ్ చీఫ్‌తో చర్చలు ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టలినా జార్జీవాతో నిర్మలా సీతారామన్ మంగళవారం వాషింగ్టన్లో భేటీ అయ్యారు. ప్రస్తుత భౌగోళిక ఉద్రిక్తతలు, ఆర్థిక వ్యవస్థలపై దీని ప్రభావం తదతర అంశాలపై చర్చించారు. మూలధన వ్యయాలు చేయడం ద్వారా వృద్ధికి మద్దతుగా నిలిచేందుకు భారత్ కట్టుబడి ఉన్నట్టు చెప్పారు. పరిమిత ద్రవ్య వెసులుబాట్ల మధ్య భారత్ అనుసరించిన విధానపరమైన చర్యలు ఆర్థిక వ్యవస్థ బలంగా నిలబడేందుకు సాయపడినట్టు ఈ సందర్భంగా జార్జీవా పేర్కొన్నారు. కరోనా కారణంగా ఏర్పడిన సవాళ్లు ఉన్నప్పటికీ అత్యంత వేగవంతమైన ఆర్థిక వ్యవస్థగా కొనసాగడం పట్ల జార్జీవా చర్చించారు. భౌగోళిక రాజకీయ పరిస్థితులు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై చూపించే ప్రభావం పట్ల, ఇంధన ధరల పెరుగుదల సవాళ్లపై ఇరువురు నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా–భారత్ బంధం పటిష్టం భారత్–అమెరికా బంధం మెరుగైన స్థితిలో ఉందని, ప్రస్తుత సవాళ్ల సమయంలో ఇది ప్రపంచక్రమాన్ని మరింత బలోపేతం చేస్తుందని మంత్రి సీతారామన్ అన్నారు. రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు వాటి విస్తృతిని గుర్తించాయని, ఒకరితో ఒకరు కలసి పనిచేసేందుకు సౌకర్యంగా ఉన్నాయని చెప్పారు. -
మహమ్మారితో మహా సంక్షోభం : ఐఎంఎఫ్
న్యూయార్క్ : కరోనా మహమ్మారితో గడిచిన వందేళ్లలో కనివినీ ఎరుగని ఆర్థిక సంక్షోభం ముంచుకొస్తోందని, ఈ గండం నుంచి కోలుకునేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు సాగించాల్సి ఉంటుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) చీఫ్ క్రిస్టలినా జార్జివ అన్నారు. 2020లో అంతర్జాతీయ వృద్ధి రేటు ప్రతికూలంగా మారుతుందని ఆమె హెచ్చరించారు. 180 సభ్యదేశాల్లో 170 దేశాలకు సంబంధించి తలసరి ఆదాయం పడిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రేట్ డిప్రెషన్ తర్వాత ఇదే అతిపెద్ద ఆర్థిక విపత్తుగా భావిస్తున్నామని చెప్పారు. వచ్చే వారం ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంకుల సమావేశం జరగాల్సి ఉంది. మాంద్యంపై ప్రపంచ దేశాలు కలిసికట్టుగా పోరాడినా వచ్చే ఏడాది స్వల్ప రికవరీ మాత్రమే ఉండొచ్చని అంచనా వేశారు. వైరస్‌ను కట్టడి చేసేందుకకు విధించిన లాక్డౌన్లు సడలించిన తర్వాత సాధారణ కార్యకలాపాలు పుంజుకునేందుకు సమయం పడుతుందని ఆమె విశ్లేషించారు. అయితే కరోనా మహమ్మారి వ్యాప్తి ఎప్పుడు తగ్గుముఖం పడుతుంది? ఎంత వ్యవధి తీసుకుంటుందన్న అంశాలపై అనిశ్చితి నెలకొందని చెప్పారు. చదవండి : ప్రపంచంపై కరోనా పడగ మహమ్మారి ప్రభావాన్ని అధిగమించేందుకు పలు దేశాలు ఇప్పటికే 8 లక్షల కోట్ల డాలర్ల మేరకు ఉద్దీపన చర్యలు చేపట్టాయని గుర్తుచేశారు. అయినప్పటికీ దెబ్బతిన్న వ్యాపారాలు, వ్యక్తులను ఆదుకోవడంతో పాటు ఆర్థిక వ్యవస్థ కోలుకునే ప్రక్రియకు అవరోధాలు తప్పడం లేదని, వాటిని అధిగమించడానికి మరింత సాయం చేయాలని ఆమె ప్రభుత్వాలను కోరారు. ఈ సంక్షోభానికి సరిహద్దులు లేవని, అన్ని దేశాలు కరోనా మహమ్మారి బారిన పడ్డాయని జార్జివ చెప్పారు. -
మాంద్యం వచ్చేసింది..
వాషింగ్టన్: కరోనా కారణంగా ప్రపంచం మాం ద్యంలోకి జారిపోయిందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) చీఫ్ క్రిస్టలీనా జార్జియేవా స్పష్టం చేశారు. 2009 నాటి అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభంతో పోలిస్తే పరిస్థితులు మరింత దారుణంగా ఉండబోతున్నాయని వ్యాఖ్యానించారు. ‘ప్రపంచ దేశాలు మాంద్యంలోకి జారుకున్నాయన్నది సుస్పష్టం. ఆర్థిక కార్యకలాపాలు ఒక్కసారిగా నిల్చిపోవడంతో వర్ధమాన మార్కెట్ల ఆర్థిక అవసరాలకు 2.5 లక్షల కోట్ల డాలర్లు అవసరమవుతాయని ఐఎంఎఫ్ అంచనా. ఇది కనీస స్థాయి మాత్రమే. ఇంతకు మించే అవసరం ఉండవచ్చు‘ అని ఆమె తెలిపారు. -
ద్రవ్యలోటును అదుపులో ఉంచాలి!
వాషింగ్టన్: ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు సంబంధించి నికర వ్యత్యాసం ద్రవ్యలోటును భారత్ అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ చీఫ్ ఎకనమిస్ట్ గీతా గోపీనాథ్ సూచించారు. అయితే దేశ ఆదాయ అంచనాలు కొంత సానుకూలంగానే ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు. 2018లో భారత్ వృద్ధి రేటు 6.8 శాతం అయితే, 2019లో 6.1%గానే ఉంటుందని, 2020లో 7 శాతానికి పెరుగుతుందని ఐఎంఎఫ్ మంగళవారం వెలువరించిన తన అవుట్‌లుక్‌లో పేర్కొంది. ఈ నేపథ్యంలో గోపీనాథ్ విలేకరులతో మాట్లాడారు. నాన్–బ్యాంకింగ్ ఫైనాన్షియల్ విభాగం, వినియోగ, లఘు చిన్న మధ్య తరహా పరిశ్రమల రుణాల వంటి అంశాల్లో ఒడిదుడుకులు, సవాళ్లను భారత్ ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంక్ వార్షిక సమావేశాల నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. -
తర్వాత ఐఎంఎఫ్ చీఫ్ మనోడేనా...?
అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) సంస్థ చీఫ్ క్రిస్టీన్ లగార్డే పదవీ కాలం ముగుస్తోంది. దీంతో ఆయన వారసుడిగా.. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల నుంచే ఒకరిని ఎన్నుకోవాలని భారత్ ప్రతిపాదించింది. ఇన్నాళ్లూ యూరోపియన్లు మాత్రమే దీనికి చీఫ్ అయ్యేవాళ్లు. ఈ పద్ధతిని మార్చి, అభివృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థలకు అవకాశం కల్పించాలని పేర్కొంది. ఈసారి ఐఎంఎఫ్ అభ్యర్థి రేసులో వేరే ఏ దేశం వాళ్లు లేకపోవడంతో, రెండోసారి కూడా క్రిస్టీన్ లగార్డేకే భారత్ మద్దతిచ్చిందని కేంద్ర ఆర్థిక కార్యదర్శి శక్తికాంత్ దాస్ తెలిపారు. కానీ తర్వాతి ఎన్నికల్లో కచ్చితంగా ఐఎమ్ఎఫ్ ఎండీ స్థానం అభివృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థలకే కల్పించాలని దాస్ అభిప్రాయం వ్యక్తంచేశారు. భారత మీడియాప్రతినిధులు ఏర్పాటుచేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఐఎమ్ఎఫ్ డైరెక్టర్ ఎన్నికపై ప్రశ్నలు ఉత్పన్నం కావడంతో, దాస్ తన అభిప్రాయాన్ని చెప్పారు. ఐదేళ్ల క్రితం ఐఎమ్ఎఫ్ చీఫ్ గా క్రిస్టీన్ లగార్డేను ఎన్నుకునేటప్పుడు, అభివృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థల మధ్య ఏకగ్రీవ అభిప్రాయం లేకపోవడాన్ని ఆయన ఈ సమావేశంలో ఎత్తిచూపారు. దాస్ వ్యక్తంచేసిన ఈ అభిప్రాయంతో తర్వాతి ఐఎమ్ఎఫ్ ఎన్నికల్లో భారత్ పోటీకి నిలబడుతుందని తెలుస్తోంది. -
భారత్ ఓ కాంతిపుంజం
♦ బలమైన వృద్ధి దిశగా వర్ధమాన దేశాలు ♦ ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టిన్ లగార్డే వాషింగ్టన్: బలమైన వృద్ధి, ఆదాయం పెరుగుదల వంటి అంశాల కారణంగా అంతర్జాతీయ ఆర్థికవ్యవస్థలో భారత్ ఒక కాంతిపుంజంలా దూసుకె ళ్తోందని ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టిన్ లగార్డే తెలిపారు. చైనా ఆర్థిక వ్యవస్థ మందగమనం, కమోడిటీ ధరల తగ్గుదల, చాలా దేశాల్లో ద్రవ్య సంకట పరిస్థితులు ఉండొచ్చనే అంచనాల నేపథ్యంలో ప్రపంచ వృద్ధి అంచనాలు బలహీనంగా మారాయని వివరించారు. అయితే వర్ధమాన దే శాలు బలమైన వృద్ధిని నమోదు చేస్తున్నాయన్నారు. అభివృద్ధి చెందిన దేశాలు పుంజుకోవాల్సి ఉందని, కానీ అలా జరగడం లేదని అభిప్రాయపడ్డా రు. ఆమె జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌లోని గోతే యూనివర్సిటీలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడారు. బ్రెజిల్, రష్యాల్లో తీవ్ర ప్రతికూల పరిస్థితులు ఉన్నాయని లగార్డే చెప్పారు. ముడి చమురు ధరల తగ్గుదల నేపథ్యంలో మధ్యతూర్పు ప్రాంతంలోనూ ఇదే పరిస్థితి నెలకొని ఉందన్నారు. చాలా ఆఫ్రికా దేశాలు, తక్కువ ఆదాయమున్న దేశాలు కూడా ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని తెలి పారు. కానీ భారత్ మాత్రం వీటికి భిన్నంగా బల మైన వృద్ధితో ముందుకు దూసుకె ళ్తోందని పేర్కొన్నా రు. ఇండోనేసియా, మలేసియా, ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్, వియత్నాం వంటి ఆసియా దేశాలు కూడా మంచి ప్రదర్శన కనబరుస్తున్నాయని తెలిపారు. వృద్ధి చోదక పాలసీలే లక్ష్యంగా చాలా దేశాలు వృద్ధికి దోహదపడే పాలసీల రూపకల్పనకు ప్రాధాన్యమిస్తున్నాయని లగార్డే అభిప్రాయపడ్డారు. ఆదాయ వ్యయాల ప్రాధాన్యతలను మార్చడం వల్ల దీన్ని సాధించవచ్చని చెప్పారు. భారత్ ఎనర్జీ సబ్సిడీలపై వ్యయాలను తగ్గించుకుందని, ఇక్కడ మిగిలిన నిధులను వృద్ధికి దోహదపడే ఇన్ఫ్రా రంగంలో ఇన్వెస్ట్ చేసే అవకాశముందని వివరించారు. జపాన్ పిల్లల సంరక్షణపై ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తోందని, దీని వల్ల ఆర్థిక వ్యవస్థలో మహిళల ప్రాధాన్యం పెరిగి, తద్వారా రానున్న కాలంలో ఆ దేశంలో వృద్ధి ఎగసే అవకాశముందని పేర్కొన్నారు.