ఢిల్లీ: అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF)మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా జీ20 సమ్మిట్‌లో పాల్గొనేందుకు గురువారం దేశ రాజధానికి చేరుకున్నారు. ఢిల్లీకి చేరుకున్న ఆమెకు దేశవాళీ నృత్య ప్రదర్శనతో ఘనస్వాగతం పలికారు. సంబల్‌పురి పాటపై సాంప్రదాయ జానపద నృత్యాన్ని ప్రదర్శించారు. ఈ సాంస్కృతిక ప్రదర్శనను జార్జివా మెచ్చుకున్నారు. స్వయంగా ఆమె కూడా డ్యాన్సర్లతో పాటు కాలు కదిపారు.
స్టేజీ కింద నుంచి నృత్య ప్రదర్శనను చూసిన జార్జివా.. ఒకానొక దశలో డ్యాన్సర్లతో పాటే కాలు కదిపారు. నవ్వులు చిందిస్తూ చప్పట్లతో కళాకారులను మెచ్చుకున్నారు. ఈ వీడియోను కేంద్ర మంత్రి ధర్మెంద్ర ప్రధాన్ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా పంచుకున్నారు. సంబల్‌పురి బీట్స్‌ను ఆపడం కష్టం అని యాష్‌ట్యాగ్‌ను జతచేశారు.
Difficult to resist #Sambalpuri beats .
— Dharmendra Pradhan (@dpradhanbjp) September 8, 2023
MD International Monetary Fund Ms. @KGeorgieva arrives in India for #G20 summit to a #Sambalpuri song and dance welcome . #OdiaPride pic.twitter.com/4tx0nmhUfK
ఈ వీడియో సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అయింది. గంటల వ్యవధిలోనే 19 వేల వ్యూస్ వచ్చాయి. వేలల్లో లైకులు కొట్టారు నెటిజన్లు. ఒడియా నృత్య కళాకారులను మెచ్చుకున్నారు. వీడియో చాలా బాగుందని కామెంట్లు వచ్చాయి.
జీ20 వేదికైన భారత్‌కు దేశ విదేశాల నుంచి నేతలు నేడు ఢిల్లీకి వచ్చారు. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఇప్పటికే దేశ రాజధానిలో అడుగు పెట్టారు. శనివారం, ఆదివారం రెండు రోజుల పాటు ఢిల్లీలో విదేశీ నేతలతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
ఇదీ చదవండి: జీ-20: కోవిడ్ కారణంగా మరో నేత మిస్.. పుతిన్, జిన్‌పింగ్ సహా..
Comments
Please login to add a commentAdd a comment