folk
-
గుంటూరులో అంగరంగ వైభవంగా నాట్స్ జానపద, సాంస్కృతిక సంబరాలు
'భాషే రమ్యం.. సేవే గమ్యం' అని నినదించే ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తన నినాదానికి తగ్గట్టుగా గుంటూరు నగరంలో జానపద, సాంస్కృతిక సంబరాలను ఘనంగా నిర్వహించింది. నగరంలోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగిన నాట్స్ జానపద, సాంస్కృతిక సంబరాల్లో వందల మంది జానపద కళాకారులు, కవులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. తొలుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నగరంలో జానపద కళాకారుల ప్రదర్శనలతో ర్యాలీ నిర్వహించారు. డప్పు కళాకారుల నృత్యం, ఉత్తరాంధ్ర తప్పెటగుళ్లు, మహిళల కోలాటం కోలాహలం మధ్య పొట్టి శ్రీరాముల విగ్రహం నుంచి వెంకటేశ్వర విజ్ఞాన మందిరం వరకు ఈ ర్యాలీ సాగింది. ఆ తర్వాత విజ్ఞాన మందిరంలో కళాకారుల ప్రదర్శనలు అద్భుతంగా జరిగాయి. గాయకుల పాటలు, డప్పు కళకారుల ప్రదర్శనలు అందరిని ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా తెలుగు భాష గొప్పదనాన్ని చాటిచెప్పేలా ఈ కార్యక్రమాలు సాగాయి. తెలంగాణ ప్రజా గాయకుడు చింతల యాదగిరి పాడిన పాట ఈ చిట్టి చేతులు పాట అందరిని విశేషంగా ఆకట్టుకుంది. శ్రీకాకుళం, విజయనగరం, ఉభయగోదావరి, ఆదిలాబాద్, నల్గొండ, ఖమ్మం, గుంటూరు, కృష్ణాజిల్లాల నుండి జానపద, గిరిజన కళాకారులు సాంప్రదాయ వేషధారణలతో ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు, కళారూపాలు బుర్రకథలు, ఆహుతులను మైమరిపించాయి. కిక్కిరిసిన జనసందోహంతో విజ్ఞాన మందిరం నిండిపోయింది. కళాకారుల ప్రదర్శనకు ప్రేక్షకుల హర్షధ్వానాలతో విజ్ఞాన మందిరం మారుమ్రోగింది. షేక్ బాబుజి, ప్రజా నాట్యమండలి పీవీ రమణ, రంగం రాజేష్ లు తమ బృందంతో ఆలపించిన సామాజిక చైతన్య గీతాలు అలరించాయి.తెలుగు భాష పరిరక్షణ కోసమే మా కృషి: నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి(బాపు) నూతి మేం అమెరికాలో ఉంటున్నా మా మనస్సంతా ఇక్కడ ఉంటుందని నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి (బాపు) నూతి అన్నారు. మన తెలుగు భాష పరిరక్షణ కోసం నాట్స్ ఎంతగానో కృషి చేస్తుందన్నారు. దానిలో భాగంగానే నాట్స్ జానపద, సాంస్కృతిక సంబరాలు నిర్వహిస్తుందని తెలిపారు. తెలుగు కళలను, కవులను ప్రోత్సాహించేందుకు నాట్స్ ఎప్పుడూ ముందుంటుందన్నారు. అమెరికాలో నాట్స్ తెలుగు లలిత కళా వేదిక ఏర్పాటు చేసి ఇక్కడ కవులు, కళకారులను అక్కడ తెలుగువారికి కూడా పరిచయం చేస్తున్నామని.. వారి గొప్పదనాన్ని వివరిస్తున్నామని బాపు నూతి తెలిపారు. తెలుగు భాష తరతరాలకు తరగని వెలుగులా ఉండాలనేదే తమ ఆశయమని తెలిపారు. తెలుగు కళాకారులు మన సాంస్కృతిక వారసత్వాన్ని నిలబెట్టేందుకు చేస్తున్న కృషి అభినందనీయమని బాపు అన్నారు. కళకారులు చేసిన ప్రదర్శనలు అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు. ఈ జానపద సంబరాల నిర్వహణలో శాసనమండలి సభ్యులు లక్ష్మణరావు కీలకపాత్ర పోషించారని తెలిపారు. గురువుకు గౌరవం దక్కిన సమాజం ఎంతో ఉన్నతంగా ఎదుగుతుందని.. అందుకే ఉత్తమ ఉపాధ్యాయులను ఈ సంబరాల్లో గౌరవిస్తూ వారికి పురస్కారాలు అందించామని బాపు నూతి అన్నారు. నాట్స్ అటు అమెరికాలో ఇటు తెలుగు రాష్ట్రాల్లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడంతో పాటు వందలాది మందికి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయించిందని తెలిపారు. విద్యార్ధులకు ఉపకారవేతనాలు అందించారు. బడుల్లో మౌలిక వసతుల కల్పనకు సాయం చేయడం.... మహిళా సాధికారత కోసం ఉచితంగా మహిళలకు కుట్టు శిక్షణ ఇప్పించడం.. ఉచితంగా కుట్టు మిషన్ల పంపిణీ వంటి కార్యక్రమాలు చేసిందని వివరించారు. నల్లమల అటవీ ప్రాంతంలో గిరిజన మహిళలు స్వశక్తితో నిలబడేలా వారికి కావాల్సిన చేయూత నాట్స్ అందించిందన్నారు. నాట్స్ అంటే సేవ.. సేవ అంటే నాట్స్ అనే రీతిలో తమ కార్యక్రమాలు ఉంటాయని బాపు నూతి అన్నారు. అమెరికాలో తెలుగువారికి అండ నాట్స్: సత్య శ్రీరామినేనితెలుగువారికి అమెరికాలో ఏ కష్టం వచ్చినా నాట్స్ అండగా నిలుస్తుందని డల్లాస్ నాట్స్ నాయకుడు సత్య శ్రీరామినేని అన్నారు. విద్యార్ధులు అమెరికాకు వచ్చేటప్పుడు యూనివర్సీటీల గురించి పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాత మాత్రమే రావాలన్నారు. అమెరికాలో బోగస్ యూనివర్సీటీల వల్ల నష్టపోయిన తెలుగు విద్యార్ధులకు తాము అండగా నిలిచిన విషయాన్ని శ్రీరామినేని గుర్తు చేశారు. అందుకే నాట్స్ విద్యార్ధులకు అమెరికాలో చదువుల పట్ల అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపడుతుందన్నారు. నాట్స్ సేవా కార్యక్రమాలు అమోఘం: ఎమ్మెల్సీ లక్ష్మణరావునాట్స్ సేవా కార్యక్రమాలు అమోఘమని ఎమ్మెల్సీ లక్ష్మణరావు ప్రశంసించారు. కష్టాల్లో ఉన్న పేదలకు ఏ సాయం చేయాలన్నా నాట్స్ ముందుంటుందనే విషయం నాట్స్ సేవా కార్యక్రమాలనే నిరూపిస్తున్నాయన్నారు. ముఖ్యంగా నాట్స్ అధ్యక్షుడు బాపు నూతి సేవా కార్యక్రమాల్లో చూపిస్తున్న చొరవ మాలాంటి వారికి కూడా స్ఫూర్తిని నింపుతుందని తెలిపారు. దివ్యాంగులు స్వశక్తితో నిలబడేలా వారికి ఆర్థిక సహకారం, నల్లమల అడవుల్లో గిరిజన మహిళల సాధికారత కోసం నాట్స్ చేస్తున్న కృషి అభినందనీయమని తెలిపారు. విద్యార్ధులకు ఉపకారవేతనాలు, ఉపాధ్యాయులకు ప్రోత్సాహించేలా పురస్కారాలు అందిస్తున్న నాట్స్ కు లక్ష్మణరావు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఉపాధ్యాయులకు, కళకారులకు సన్మానంజానపద, సాంస్కృతిక సంబరాల్లో భాగంగా కవులకు, కళకారులకు నాట్స్ పురస్కారాలు అందించింది. వారిని సన్మానించింది. అలాగే పలు జిల్లాల్లో ఉత్తమ ఉపాధ్యాయులుగా పేరున్న వారిని ఆహ్వానించి వారిని సంబరాల వేదికపై సత్కరించింది. ఇంకా ఈ సంబరాల్లో జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, కన్నా మాస్టారు, పాటిబండ్ల విష్ణు, కృష్ట్నేశ్వరరావు, కార్యక్రమం సమన్వయ కర్త కాకుమాను నాగేశ్వరరావు, సుబ్బారాయుడు, దాసరి రమేష్, దాసరి సుబ్బారావు, సరిమల్ల చౌదరి, షేక్ బాషా, భగవాన్ దాస్, లక్ష్మణరావు, కిరణ్, గుర్రం వీర రాఘవయ్య తదితరులు పాల్గొన్నారు. (చదవండి: శ్రీశైలంలో మహిళలకు నాట్స్ ఉచితంగా కుట్టుమిషన్ల పంపిణీ) -
ఢిల్లీకి చేరిన ఐఎంఎఫ్ చీఫ్.. ఫోక్ సాంగ్‌కు డ్యాన్సులు..
ఢిల్లీ: అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF)మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా జీ20 సమ్మిట్‌లో పాల్గొనేందుకు గురువారం దేశ రాజధానికి చేరుకున్నారు. ఢిల్లీకి చేరుకున్న ఆమెకు దేశవాళీ నృత్య ప్రదర్శనతో ఘనస్వాగతం పలికారు. సంబల్పురి పాటపై సాంప్రదాయ జానపద నృత్యాన్ని ప్రదర్శించారు. ఈ సాంస్కృతిక ప్రదర్శనను జార్జివా మెచ్చుకున్నారు. స్వయంగా ఆమె కూడా డ్యాన్సర్లతో పాటు కాలు కదిపారు. స్టేజీ కింద నుంచి నృత్య ప్రదర్శనను చూసిన జార్జివా.. ఒకానొక దశలో డ్యాన్సర్లతో పాటే కాలు కదిపారు. నవ్వులు చిందిస్తూ చప్పట్లతో కళాకారులను మెచ్చుకున్నారు. ఈ వీడియోను కేంద్ర మంత్రి ధర్మెంద్ర ప్రధాన్ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా పంచుకున్నారు. సంబల్పురి బీట్స్‌ను ఆపడం కష్టం అని యాష్‌ట్యాగ్‌ను జతచేశారు. Difficult to resist #Sambalpuri beats . MD International Monetary Fund Ms. @KGeorgieva arrives in India for #G20 summit to a #Sambalpuri song and dance welcome . #OdiaPride pic.twitter.com/4tx0nmhUfK — Dharmendra Pradhan (@dpradhanbjp) September 8, 2023 ఈ వీడియో సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అయింది. గంటల వ్యవధిలోనే 19 వేల వ్యూస్ వచ్చాయి. వేలల్లో లైకులు కొట్టారు నెటిజన్లు. ఒడియా నృత్య కళాకారులను మెచ్చుకున్నారు. వీడియో చాలా బాగుందని కామెంట్లు వచ్చాయి. జీ20 వేదికైన భారత్‌కు దేశ విదేశాల నుంచి నేతలు నేడు ఢిల్లీకి వచ్చారు. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఇప్పటికే దేశ రాజధానిలో అడుగు పెట్టారు. శనివారం, ఆదివారం రెండు రోజుల పాటు ఢిల్లీలో విదేశీ నేతలతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇదీ చదవండి: జీ-20: కోవిడ్ కారణంగా మరో నేత మిస్.. పుతిన్, జిన్‌పింగ్ సహా.. -
మనసుకు నచ్చిన పని.. పాతిక సంవత్సరాల నుంచి ఇదే పనిలో..
ఈనెల 6 నుంచి 18 వరకు ఫ్రాన్స్‌లోని ‘ఇండియన్ యూరోపియన్ ఇన్స్టిట్యూట్ ఫర్ అడ్వాన్స్డ్ స్టడీస్, నాన్ట్స్’లో ‘ఇండియా– ఆఫ్రికా టువార్డ్స్ ఎ డైలాగ్ ఆఫ్ హ్యూమానిటీస్’ సదస్సు జరిగింది. ఆదివాసీల సంస్కృతి, సంగీతం గురించిన సమగ్ర పరిశోధనకు ఉపకరించే ఆ కార్యక్రమానికి ఆహ్వానితులుగా హాజరైన ప్రొఫెసర్ గూడూరు మనోజ ఆ వివరాలను సాక్షితో పంచుకున్నారు. ‘‘నేను పుట్టింది వరంగల్‌లో. మా నాన్న డీపీఓ. ఆయన బదలీల రీత్యా నా ఎడ్యుకేషన్ తెలంగాణ జిల్లాల్లో ఏడు స్కూళ్లు, నాలుగు కాలేజీల్లో సాగింది. పెళ్లి తర్వాత భర్త ఉద్యోగ రీత్యా మహారాష్ట్ర, నాందేడ్‌కి వెళ్లాను. అక్కడే ఇరవై ఏళ్లు నాందేడ్‌లోని స్వామి రామానంద తీర్థ మరాఠ్వాడా యూనివర్సిటీకి చెందిన ‘స్కూల్ ఆఫ్ లాంగ్వేజ్, లిటరేచర్ అండ్ కల్చర్ స్టడీస్’లో లెక్చరర్‌గా ఉద్యోగం చేశాను. ఆ తర్వాత నిజామాబాద్‌లో కొంతకాలం చేసి, మహబూబ్‌నగర్ పాలమూరు యూనివర్సిటీ నుంచి 2021లో రిటైరయ్యాను. సంగీతసాధనాల అధ్యయనం ఫ్రాన్స్ సమావేశం గురించి చెప్పడానికి ముందు నేను ఎందుకు ఈ పరిశోధనలోకి వచ్చానో వివరిస్తాను. నా ఉద్దేశంలో ఉద్యోగం అంటే రోజుకు మూడు క్లాసులు పాఠం చెప్పడం మాత్రమే కాదు, యువతకు వైవిధ్యమైన దృక్పథాన్ని అలవరచాలి. నా ఆసక్తి కొద్దీ మన సంస్కృతి, కళలు, కళా సాధనాల మీద అధ్యయనం మొదలైంది. అది పరిశోధనగా మారింది. ఆ ప్రభావంతోనే పాలమూరు యూనివర్సిటీలో నేను ఫోర్త్ వరల్డ్ లిటరేచర్స్ని పరిచయం చేయగలిగాను. మన సాహిత్యాన్ని యూరప్ దేశాలకు పరిచయం చేయడం గురించి ఆలోచన కూడా మొదలైంది. విదేశీ సాహిత్యానికి అనువాదాలు మన సాహిత్యంలో భాగమైపోయాయి. అలాగే మన సాహిత్యాన్ని, సాహిత్యం ద్వారా సంస్కృతిని ప్రపంచానికి తెలియచేయాలని పని చేశాను. వీటన్నింటినీ చేయడానికి నా మీద సామల సదాశివగారు, జయధీర్ తిరుమల రావు గారి ప్రభావం మెండుగా ఉంది. తిరుమలరావుగారు ఆదిధ్వని ఫౌండేషన్ ద్వారా నాలుగు దశాబ్దాలుగా చేస్తున్న పరిశ్రమలో భాగస్వామినయ్యాను. ఆదివాసీ గ్రామాల్లో పర్యటించి ధ్వనికి మూలకారణమైన సాధనాలను తెలుసుకోవడం, సేకరించడం మొదలుపెట్టాం. ఇల్లు, పిల్లలను చూసుకోవడం, ఉద్యోగం చేసుకుంటూనే దాదాపుగా పాతిక సంవత్సరాల నుంచి ఇదే పనిలో నిమగ్నమయ్యాను. చెంచు, కోయ, గోండ్లు నివసించే గ్రామాలకు నెలకు ఒకటి –రెండుసార్లు వెళ్లేవాళ్లం. గోండ్ లిపికి కంప్యూటర్ ఫాంట్ తయారు చేయగలిగాం. గోంద్ భాష యూనికోడ్ కన్సార్టియంలోకి వెళ్లింది కాబట్టి ఇక ఆ భాష అంతరించడం అనేది జరగదు. ఆదిధ్వని ఫౌండేషన్ ద్వారా 250 సంగీత సాధనాల వివరాలను క్రోడీకరించాం. మూలధ్వని పేరుతో పుస్తకం తెచ్చాం. అందులో క్రోడీకరించిన సంగీతసాధనాలు, 27 మంది కళాకారులను ఢిల్లీకి తీసుకువెళ్లి 2020లో ప్రదర్శనలివ్వడంలోనూ పని చేశాను. దేశంలో తెలంగాణ కళలకు మూడవస్థానం వచ్చింది. ఆద్యకళకు ఆహ్వానం ‘ఇండియన్ యూరోపియన్ ఇన్స్టిట్యూట్ ఫర్ అడ్వాన్స్డ్ స్టడీస్, నాన్ట్స్’ ఈ ఏడాది నిర్వహించిన ‘ఇండియా– ఆఫ్రికా టువార్డ్స్ ఎ డైలాగ్ ఆఫ్ హ్యూమానిటీస్’ సదస్సుకు మా ఆదిధ్వని ఫౌండేషన్ నిర్వహించే ‘ఆద్యకళ’కు ఆహ్వానం వచ్చింది. అందులో పని చేస్తున్న వాళ్లలో నేను, జయధీర్ తిరుమలరావుగారు సదస్సుకు హాజరయ్యాం. ‘ప్రాసెస్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ ఎ మ్యూజియమ్’ అనే అంశంపై మీద పత్రం సమర్పించాం. మనదేశంలో ఆదివాసీ సంస్కృతి మీద పరిశోధన చేసిన ఫ్రెంచ్ పరిశోధకులు డేనియల్ నాజర్స్తోపాటు అనేక మంది ఫ్రెంచ్ ప్రొఫెసర్లు ఈ సమావేశాలకు హాజరయ్యారు. అయితే వారంతా మనదేశంలో మూల సంస్కృతి, సంగీతవాద్యాలు అంతరించి పోయాయనే అభిప్రాయంలో ఉన్నారు. మేము వారి అపోహను తొలగించగలిగాం. అంతరించి పోతోందనుకున్న సమయంలో చివరి తరం కళాకారులను, కళారూపాలను ఒడిసి పట్టుకున్నామని చెప్పాం. కాటమరాజు కథ, పన్నెండు పటాలకు సంబంధించిన బొమ్మలు, కోయ పగిడీలను ప్రదర్శించాం. ఆఫ్రికాలో కళారూపాలు ఒకదానికి ఒకటి విడిగా ఉంటాయి. మన దగ్గర కథనం, సంగీతవాద్యం, పటం, గాయకుడు, బొమ్మ అన్నీ ఒకదానితో ఒకటి ముడివడి వుంటాయి. పారిస్‌లో ‘నేషనల్ మ్యూజియమ్ ఆఫ్ ఏషియన్ ఆర్ట్స్’, ఆంథ్రోపాలజీ మ్యూజియాలను కూడా చూశాం. ‘ప్రాసెస్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ ఎ మ్యూజియమ్’ అనే మా పేపర్‌కి సదస్సులో మంచి స్పందన లభించింది. ఇండియాలో మరో పార్శా్వన్ని చూసిన ఆనందం వారిలో వ్యక్తమైంది. యునెస్కో అంబాసిడర్, మనదేశానికి శాశ్వత ప్రతినిధి విశాల్ వి శర్మ కూడా ప్రశంసించారు. (క్లిక్ చేయండి: ఉందిలే మంచి టైమ్ ముందు ముందూనా...) చేయాల్సింది ఇంకా ఉంది ఆది అక్షరం, ఆది చిత్రం, ఆది ధ్వని, ఆది లోహ కళ, ఆది జీవనం, పరికరాలతో మ్యూజియం ఏర్పాటు చేయాలి. మ్యూజియం ఏర్పాటుకు ఆర్థిక సహాయం చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం రెండెకరాల స్థలం కేటాయించాలి. మ్యూజియం హైదరాబాద్ నగర శివారులో ఉంటే భావి తరాలకు మ్యూజియంకు సంబంధించిన పరిశోధనకి ఉపయోగపడుతుంది.రిటైర్ అయిన తర్వాత మనసుకు నచ్చిన పని చేయాలని నమ్ముతాను. ‘ఆదిధ్వని’ ద్వారా ఐదు మ్యూజియాల స్థాపనకు పని చేశాను. నా జీవితం ఆదిధ్వనికే అంకితం’’ అన్నారీ ప్రొఫెసర్. హైదరాబాద్‌లోని ఆమె ఇల్లు ఆదివాసీ సంస్కృతి నిలయంగా ఉంది. – వాకా మంజులారెడ్డి శబ్దం– సాధనం ప్రస్తుతం ‘ఆది చిత్రం’ పుస్తకం తెచ్చే పనిలో ఉన్నాం. ఇదంతా ఒక టీమ్ వర్క్. మన దగ్గర ఆదివాసీ గిరిజనులు, దళిత బహుజనుల దగ్గర నిక్షిప్తమై ఉన్న సంస్కృతిని వెలికి తీయడానికి మొదటి మార్గం శబ్దమే. ఆదివాసీలు తమ కథలను పాటల రూపంలో గానం చేసే వారు. కొన్ని కథలు తాటాకుల మీద రాసి ఉన్నప్పటికీ ఎక్కువ భాగం మౌఖికంగా కొనసాగేవి. మౌఖిక గానంలో ఇమిడి ఉన్న కథలను రికార్డ్ చేసుకుని, శ్రద్ధగా విని అక్షరబద్ధం చేశాం. ‘గుంజాల గొండి అధ్యయన వేదిక’ ఆధ్వర్యంలో ఐటీడీఏతో కలిసి చేశాం. ఓరల్ నేరేటివ్‌కి అక్షర రూపం ఇవ్వడాన్ని ‘ఎత్తి రాయడం’ అంటాం. ఆది కళాకారులను వెలికి తెచ్చే మా ప్రయత్నంలో భాగంగా సమ్మక్క– సారక్క కథను ఆలపించే పద్మశ్రీ సకినె రామచంద్రయ్యను పరిచయం చేశాం. ఆ కథను ఎత్తిరాసిన పుస్తకమే ‘వీరుల పోరుగద్దె సమ్మక్క సారలమ్మల కథ – కోయడోలీలు చెప్పిన కథ’. ఈ ప్రయత్నం రీసెర్చ్ మెథడాలజీలో పెద్ద టర్నింగ్ పాయింట్. – ప్రొఫెసర్ గూడూరు మనోజ, సభ్యులు, ఆదిధ్వని ఫౌండేషన్ -
కొరడాతో కొట్టించుకున్న చత్తీస్‌గఢ్ సీఎం.. ఎందుకంటే?
రాయ్‌పూర్: చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకుడు భూపేశ్ బఘేల్ తన చేతి మణికట్టుపై కొరడాతో కొట్టించుకున్నారు. ఆయన దుర్గ్ జిల్లాలోని జజంగిరి, కుమ్హారి అనే రెండు గ్రామాలలో జానపద సంప్రదాయంలో భాగంగా ఆయన ఇలా కొరడాతో కొట్టించుకున్నారు. గౌరి పూజ సమయంలో ఇలా కొరడాతో కొట్టించుకుంటే మంచి జరుగుతుందని స్థానికులు నమ్ముతారు. ఎలాంటి చెడు జరగకుండా అమ్మ కాపాడుతుందని విశ్వసిస్తారు. భూపేశ్ బఘేల్ రాష్ట్రం సుభీక్షంగా ఉండాలని ప్రతి ఏడాది ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ఆయన కార్యాలయం పేర్కొంది. అందుకు సబంధించిన వీడియోని చత్తీస్‌గఢ్ సీఎం ట్వీట్టర్లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. सोंटे का प्रहार और परंपराओं का निर्वहन. pic.twitter.com/SV82qommmu — Bhupesh Baghel (@bhupeshbaghel) October 25, 2022 (చదవండి: కలిచివేసే ఘటన: చావుబతుకుల మధ్య ఉంటే చుట్టూ చేరి ఫోటోలు తీస్తూ...) -
జాతీయాలతో జాతి భాష సంపన్నం
సెప్టెంబర్ 17, 2005. తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుకుంటోన్న వేళ ఉదయం 10 గంటలకు వేముల పెరుమాళ్లు లేరన్న విషయం తెలిసింది. తెలంగాణ భాష కోసం, తెలంగాణ జాతీయాల కోసం, తెలంగాణ జానపదుల కోసం, తెలంగాణ సామెతల కోసం, తెలంగాణ పల్లె పదాల కోసం జీవితాంతం కృషి చేసిన వేముల పెరుమాళ్లు.. సరిగ్గా తెలంగాణ విమోచనం రోజే లోకాన్ని వీడడం యాధృచ్చికమే కావొచ్చు కానీ మరిచిపోలేని జ్ఞాపకంగా తన మరణాన్ని మార్చుకోవడం మాత్రం గొప్ప విషయం. తెలుగు సంస్కృతి అంతా ఒక్కటే! అయినా తెలంగాణ సంస్కృతిలో కొంత భిన్నత్వం ఉంది. భాషలో యాసలో ప్రత్యేకత ఉంది. అందుకు కారణం సుమారు ఎనిమిది వందల సంవత్సరాలకు పైగా పరాయి పాలనలో తెలుగు చదవడం, రాయడం నిషేధింపబడ్డ రోజుల్లో కూడా తెలంగాణ ప్రజలు వారి భాషను, యాసను పదిల పరుచుకున్నారు. వారి సామెతల్ని, జాతీయాల్ని , మౌఖిక సాహిత్యాన్ని, లిఖిత సాహిత్యాన్ని భద్ర పరుచుకున్నారు. నిజాం పాలకులు సృష్టించిన ప్రతికూలమైన పరిస్థితులలో కూడా ఇక్కడి ప్రజలు వాటిని కాపాడుకోవడం ఒక సాహసవంతమైన చర్య. "సాలు పొంటి సాలు తీరు"గా వారి అవ్వ నుంచి మారుమూల గ్రామీణుల నుంచి వాళ్ల వాక్కును కల్తీ కాకుండా తన భాషగా చేసుకుని కాలగర్భంలో కలిసిపోగా మిగిలిన (పోయింది పొల్లు ఉన్నది గట్టి) జాతీయాల్ని ఏర్చికూర్చి "తెలంగాణ జాతీయాలు"గా గ్రంథస్తం చేశారు. ఉడుం పట్టు, దీక్ష కార్య శూరత్వం గల వారు ఎలాంటి మహాకార్యాన్నయినా అలవోక గా చేయగలరని తెలంగాణ జాతీయాలు పుస్తకం చూస్తే తెలుస్తుంది. వేముల పెరుమాళ్లు స్వస్థలం నాటి కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల తాలుకా రాయికల్ గ్రామం. రాయికల్, కోరుట్ల, జగిత్యాలలో విద్యాభ్యాసం చేసిన పెరుమాళ్లు.. శ్రీకాళహస్తిలోని గ్రామసేవక్ శిక్షణా కేంద్రం నుంచి గ్రామీణాభివృద్ధిలో డిప్లమో చేశారు. 1963 నుంచి 18 ఏళ్ల పాటు గ్రామీణాభివృద్ధి అధికారిగా మల్యాల, జగిత్యాల పంచాయతీ సమితులలో ఉద్యోగం చేశారు. 1981లో ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి జగిత్యాల పంచాయతీ సమితి అధ్యక్ష ఎన్నికలతో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. మండల వ్యవస్థ ఏర్పడిన తర్వాత జరిగిన ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి రాయికల్ మొదటి మండలాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఉద్యోగం, రాజకీయం.. ఏ రంగంలో ఉన్నా.. సాహిత్యాన్ని మాత్రం మరవలేదు పెరుమాళ్లు. దశాబ్దకాలంగా కష్టనష్టాలకు ఓర్చి, పేర్చి కూర్చిన ఈ గ్రంథం తెలంగాణ జాతీయాలకు, సామెతలకు నిఘంటవుగా నేటికి ప్రతిబింబిస్తుంది. నోసుక పుట్టినట్టు వీరి మరణానంతరం తెలంగాణ జాతీయాల్ని ఇంటర్ ప్రథమ సంవత్సరం పాఠ్యాంశంగా స్వీకరించి వీరి శ్రమకు, తెలంగాణ భాషకు, యాసకు సముచిత గౌరవాన్ని కల్పించడం వీరికే కాదు తెలంగాణ జాతీయాలకు అగ్రాసనం వేసినట్టయింది. పెరుమాళ్లు తాత కైరం భూమదాసు గొప్ప వైష్ణవ భక్తుడు, కవి, గాయకుడు. కైరం భూమదాసు వ్రాతప్రతులను పరిష్కరించిన పెరుమాళ్లు 2002లో "వరకవి కైరం భూమదాసు కృతులు" గ్రంథాన్ని ప్రచురించారు. 1958 నుంచి 1968 మధ్య కాలంలో జరిగిన ఎన్నో జాతీయ పరిణామాలను వీరు పద్యాలుగా మలిచారు. వీరు రచించిన శ్రీ రాజరాజేశ్వర, శ్రీ ధరమపురి నృకేసరి శతకాలు సంబంధిత దేవాలయాలు ప్రచురించాయి. బాల సాహిత్యంలో వీరు చేసిన కృషి ఫలితంగా కిట్టూ శతకం (బాలనీతి), నిమ్ము శతకం (పర్యావరణ) వెలువడ్డాయి. మహాత్ముని మహానీయ సూక్తులను "గాంధీమార్గం" త్రిశతిగా రచించారు. "లోగుట్టు" వీరు రచించిన రాజనీతి చతుశ్శతి. ఎంతో కాలం వీరు సేకరించిన జాతీయాలు, సామెతలతో వెలువడిన గ్రంథం "తెలంగాణ జాతీయాలు". పెరుమాళ్లు మరణానంతరం వెలువడిన గ్రంథం మానవతా పరిమళాలు. 1983 నుంచి 2001 వరకు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి చేసిన "జ్యోతిపథం" లఘు ప్రసంగాల సంకలనం. జానపద సాహిత్యం కూరాడుకుండ లాంటిది. దానిని మైల పరచకుండా చూసే బాధ్యతని సాహితీప్రియులందరిపై వేశారు పెరుమాళ్లు. జానపదుడు రుషీసుంటోడు, ఆయన నోట వెలువడ్డ జాతీయం, సామెత గంగలో రాయిలాంటిది. ఎన్నో వందల సంవత్సరాలు అది ప్రజల నోళ్లలో నాని రగిడిల్లింది. తెలంగాణ జాతీయాలు తరతరాల మన సామాజిక చరిత్రకు సజీవ సాక్ష్యం. చిల్లి బొక్కతీరు లక్షల్లో వున్న తెలంగాణ జాతీయాల్ని వేలలో "పోయింది పొల్లు, ఉన్నది గట్టి తీరు"గా గ్రంథస్తం చేశారు పెరుమాళ్లు. ఇంకా ఎన్నో ప్రాంతాల్లో సజీవంగా జానపదుని నాలుకపై తచ్చాడుతున్న జాతీయాల్ని.. ఔత్సాహికులు మరింత శ్రమించి కొత్త సంపదను జాతికి ఇవ్వాలన్న వారి కోరిక తీర్చాల్సిన తరుణం మళ్లీ వచ్చింది. అదే తెలంగాణ సాహిత్యానికి తిరిగి చెల్లించాల్సిన రుణం. వి.ప్రభాకర్, తెలంగాణ కవి, రిటైర్డ్ రిజిస్ట్రార్, సహకారశాఖ -
మట్టి కవులకు పుట్టినిల్లు.. పాలమూరు
ఒకప్పుడు కరువు విలయ తాండవం చేసిన గడ్డపైనే.. సాహిత్యం అలరారింది. పనితోనే పాట పుట్టిందని.. పాటే ‘పనీపాట’ అయిందని ఎందరో కవులు చాటి చెప్పారు. జానపదం, యక్షగానం, వీధినాటకం, కాళ్లగజ్జల దరువులో ఓలలాడింది.. రేలా ధూలాకు ఎగిరి గంతులేసింది.. మద్దెల మోతల జడకొప్పులు జానపదానికి కొత్త అందం తెచ్చిపెట్టాయి. దొరలు, భూస్వాముల అన్యాయాలను ప్రశ్నిస్తూ.. పాటల రూపంలో ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చింది. ‘పల్లె కన్నీరు పెడుతుందో..’నంటూ ప్రజలను ఆలోచింపజేస్తూ.. ‘గౌలిగూడ గల్లీకాడ గోల చేసినా..’ అంటూ యువతను ఉర్రూతలూగిస్తూ ఎన్నో పాటలు ఇక్కడి కవుల నుంచి జాలువారాయి. మొత్తంగా మట్టి కవులకు పుట్టినిల్లు గా నిలిచింది పాలమూరు జిల్లా. మదనాపురం: ఉమ్మడి పాలమూరు జిల్లాలో వివిధ కళా రూపాల్లో రాణించిన కళాకారులందరూ మట్టిలోని పరిమళాలే. గ్రామీణ స్థాయి నుంచి జాతీయస్థాయి వరకు అవార్డులు సినీ పరిశ్రమలో తెలంగాణ ఉద్యమంలో జానపద కళారూపాల్లో తమదైన ముద్ర వేసుకున్నారు పాలమూరు కళాకారులు. గోరటి వెంకన్న, బెల్లం సాయిలు, జంగారెడ్డి, కోట్ల వెంకటేశ్వర్‌రెడ్డి, సాయిచంద్, భీంపల్లి శ్రీకాంత్, శివనాగులు శివలింగం లాంటి ఎందరో కవులు సాహితీ ఔనత్యాన్ని ప్రభవించారు. ఇక్కడి కవులు రాసిన పాటలు, యక్షగానాలు, జడకొప్పులాట, తంబూరా లాంటి పాటలు నేటికీ తెలుగు ప్రజల మనసు చూరగొన్నాయి. కవిత సంపుటిలో ‘కోట్ల’ మైలురాయి గుండె కింద తడి.. రంగు వెలిసిన జెండా.. రహస్యాలు లేని వాళ్లు.. నాన్నా! నాలా ఎదుగు (దీర్ఘ కవిత తెలుగు, ఆంగ్ల భాషల్లో).. నూరు తెలంగాణ నానీలు.. మనిషెళ్లిపోతుండు (పాలమూరు వలసలపై కవిత్వం) వంటి అనేక రచనలు కోట్ల వెంకటేశ్వరరెడ్డి నుంచి జాలువారాయి. 2019లో తెలంగాణ ప్రభుత్వం కాళోజీ అవార్డుతో సత్కరించగా.. దాదాపు 50అవార్డులు అందుకున్నారు. తన రచనలు ప్రజలకు ఎంతో దోహదపడాలనీ కోరుకుంటున్నానని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. జానపదాల ‘బెల్లం సాయిలు’ ఐదు దశాబ్దాల క్రితమే పాలమూరులో జానపదానికి విత్తనాలు నాటిన కవి బెల్లం సాయిలు. ఆయన రాసిన ‘మరదల పోదామా మన్యంకొండకు’.. పొద్దంతా పోయింది ఎంకి పాట, సాంఘి క నాటకాలతో ప్రజ ల అభిమానాలు పొందాడు. అనేక రచనలు, వందల సంఖ్యలో అవార్డులు ఆయన సొంతం. కురుమూర్తిక్షేత్రంపై ఆయన చేసిన పరిశోధన చెరగని ముద్ర. గాయకుడిగా, నటుడిగా విభిన్న పాత్రలు పోషించిన ఆయనతాను బతికున్నంత కాలం పాలమూరు బిడ్డలకు జానపదాలు అంకితం చేస్తానంటున్నాడు. ఉద్యమానికి ఊపిరిపోసిన ‘గోరటి’ తెలంగాణ మలిదశ ఉద్యమంలో గోరటి వెంకన్న పాట తెలంగాణ ప్రజలను నిద్ర లేపింది. ఉద్యమానికి ఊపిరి పోసింది. యక్షగానం, విప్లవ సాహిత్య రచనల్లో ఆయన మణిహారాల పుట్ట. పాలమూరు మట్టిలో పుట్టిన పరిమళం. ఆయన చేతి నుంచి జాలువారిని పల్లె కన్నీరు పెడుతుందన్న జానపదం జనాలను ఆలోచింపజేసింది. 5 వేల పాటలు, 150 అవార్డులు, 50 రచనలు ఆయన సొంతం. పాటే నాకు జీవితమని.. పేర్కొంటూ తనను ఆదరిస్తున్న ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. పాటలతో ఉర్రూతలూగించే ‘ఎద్దుల జంగిరెడ్డి’ ఆయన పాట పాడితే ఎవరైనా మంత్రముగ్ధులు కావాల్సిందే. ఆయనే ఎద్దుల జంగిరెడ్డి. రెండు దశాబ్దాల క్రితం ‘గౌలిగూడ గల్లీ కాడ గోల చేసినా..’ అనే జానపదంతో యువతను ఉర్రూతలుగించాడు. ఎంకి పాటలు అంటే ఆయన సొంతం. పాలమూరు జిల్లాతోపాటు అమెరికా, ఆ్రస్టేలియా, జపాన్, జర్మనీ దేశాల్లో జానపద ప్రదర్శనలిచ్చి అవార్డులు అందుకున్నారు. వెయ్యి పాటలు, 500 రచనలు చేసి శభాష్ అనిపించుకున్నాడు. తాను పాట కోసమే బతుకుతున్నానని చెబుతున్నాడు. మధురం.. ‘రోజారమణి’ గాత్రం ‘నిమ్మ లోగొట్టే రో రఘువోనంద.. ’ అనే జానపదం, మధురమైన గానంతో కోట్లాది మంది గుండెల్లో చోటు సంపాదించుకుంది గాయకురాలు రోజారమణి. తాను పాడిన పాటలతో అందరినీ ఆకట్టుకుంటుంది. ఓ ప్రముఖ టీవీ చానల్‌లోని రేలా రే రేలా కార్యక్రమంతో ప్రారంభించిన పాటల సందడి ఇప్పటికీ 200 పాటలు పాడి యూట్యూబ్‌లో తనదైన ముద్ర వేసుకుంది. కొత్తకొత్త పాటలతో ప్రజల ముందు కొస్తానని తెలిపాడు. పల్లెటూరి పాటగాడు ‘శివలింగం’ పల్లెటూరి పాటలు వినాలంటే శివలింగం నోటనే వినాలి. భిన్నమైన గొంతు.. ఆకట్టుకునే రకం ఆయన నైజం. రాష్ట్ర ప్రభుత్వంచే ఉత్తమ గాయకుడిగా రెండు సార్లు అవార్డు, నగదు అందుకున్నాడు. మారుమూలపల్లెలో పుట్టి పల్లె పాటల పురుడు పోసుకున్న శివలింగాన్ని జిల్లా ప్రజలు మరిచిపోరు. కవిత పరిశోధనలో దిట్ట ‘భీంపల్లి’ పాలమూరు సాహితి అధ్యక్షుడు డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్.. అనేక సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలను చేపడుతూ జిల్లా తెలుగు సాహిత్య వికాసం అనే అంశంపై పీహెచ్డీ పరిశోధన చేశారు. జిల్లా కల్చరల్ అకాడమీ అధ్యక్షుడిగా, రాష్ట్ర రచయితల వేదిక జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ సెమినార్లలో 50కి పైగా పత్ర సమర్పణలు చేశారు. 40కి పైగా అవార్డులు అందుకొని.. కవిగా, కథకుడిగా,పరిశోధకుడిగా,విమర్శకుడిగా పేరుగాంచారు. సాహితీ కార్యక్రమాలకు క్రియాశీలక కార్యకర్త. పత్రికల్లో కవితలు, గేయాలు, వ్యాసాలు, కథలు, సమీక్షలు ఆయన సొంతం. పౌరాణికంలో రారాజు ‘కోట్ల వేమారెడ్డి’ జాతీయ స్థాయిలో పౌరాణికంలో అవార్డులు అందుకున్న ఘనత కోట్ల వేమారెడ్డిది. 300పైగా ప్రదర్శనలు, 200 పైగా అవార్డులు ఆయన సొంతం. తొమ్మిది పర్యాయాలు జాతీయస్థాయి అవార్డులు అందుకొని, తాను పుట్టిన ఊరిలో వ్యవసాయం చేస్తూ అంతరించిపోతున్న పౌరాణిక రంగాన్ని నేటి యువతకు అందిస్తానని చెబుతున్నారు. -
జానపదంలో వేగు‘చుక్క’
నివాళి ఒగ్గుకథని దేశంలోని అనేక ప్రాంతాల్లో ప్రదర్శించి తెలుగువారి ప్రతిష్టను పెంచిన తెలంగాణ కళానిధి సత్తయ్య. ఆయనను కన్న తెలంగాణ నేలలో అజ్ఞాతంగా దాగిన కళల్ని కాపాడుకోవడంపై దృష్టి పెట్టాలి. అతని ఇంటిపేరు చుక్క. కానీ సత్తయ్య పది సూర్యు ళ్లంత కాంతి గోళం. వర్తమాన జానపద కళారంగ విశ్వంలో అతని సాటి మరెవరూ లేరు. నేలమీద కళా గెలాక్సీ కళకళ లాడుతుంటే ఈర్ష్యపడి పై లోకం అమాంతం అతడిని తన \లోకి లాక్కుంది. ఒగ్గుకథ మూగదైంది. ఢమరుకం చిన్నబోయింది. యుద్ధ శబ్దం పలికే ‘నపీరా’ పీక నలిగి పోయింది. డిళ్ళెం పల్లెం డీలా పడింది. బీరన్న దేవుడు బీరిపోయిండు. సత్తయ్య చిరునగవు ఒక అద్భుతం. రెండు చిన్న పెదాలలోంచి ఐదు రోజుల ఒగ్గుకథ అలా వేలాదిమం దిని ఆనందాశ్రుస్నానాలు చేయించేది. మిలమిల లాడే కళ్లలో తృప్తి తొణికిసలాడేది. లోలోన మాత్రం పేదరికం బిగి కౌగిలిలో నిశ్శబ్ద యుద్ధం చేసేవాడు. మాణిక్యపురం, జనగామ నుంచి ప్రతిరోజు ప్రయాణించి హైదరాబాదులోని తెలుగు విశ్వవిద్యా లయం జానపద కళల శాఖకు అందరికన్నా ముందే హాజరు. అక్కడ తీసుకునే జీతం కోసం రోజూ వంద మైళ్లు ప్రయాణించేవాడు. ఎక్కడా అలసట అతని ముఖంలో కనిపించేది కాదు. అతని చిరునగవుల కాంతిని చూసి ఈర్ష్యపడిన ఆచార్యులు అతడిని ఎప్పుడు ఉద్యోగంలోంచి తీసేద్దామా అని ఆలోచించే వారు. విద్యా ర్థులు ఆ కళాకాంతిని చుట్టుముట్టేవారు. ఒక మృదంగ కళాకారుడు అతనిలా చేరిననాడు ఆచార్యుడయ్యాడు. సత్తయ్య మాత్రం ఇన్స్ట్రక్టర్ స్థాయికన్నా దిగజారాడు. తరువాత అతడిని సాగనంపి తృప్తిపడ్డారు. సత్తయ్య ఒగ్గుకథల్ని కేసెట్లు చేసి లాభాలు తీసిన వాళ్లు క్షేమంగా ఉన్నారు. జ్వరంలో సైతం స్టెరాయిడ్స్ ఇచ్చి పాటలు పాడించుకుని, మార్కెట్లోకి పాటలు పంపి, సత్తయ్యని దవఖాన బెడ్‌మీద కూడా వేయలేదు. అలా అలా అనారోగ్యంతో కళావిహీనమయ్యాడు. సిఫెల్ పవన్, నేను సత్తయ్య తరఫున కత్తులకు, గూండాయి జానికి వెరవకుండా నిలచి 1996లో రెండు లక్షలు ఇప్పిం చాకా తిరిగి అతని పెదాలపై చిరునవ్వు వెలిగింది. ప్రజల సంతృప్తే నాకు పురస్కారం అనుకుని నాలుగు దశాబ్దాలలో నాలుగువేల ఐదువందల ప్రదర్శ నలు ఇచ్చాడు. సుప్రసిద్ధ సంస్థలు తమ తృప్తి కోసం సత్తయ్యకు అనేక అవార్డులు ఇచ్చి సంతృప్తి పడ్డాయి. సత్తయ్య ఒగ్గుకథ చెప్పడానికి హక్కుదారు కాదు. కానీ ఒగ్గుకథని అభ్యసించాడు. కులాచారంగా అధికా రిక పండుగలు చేయలేదు. కానీ ఆ కళాకారులకన్నా వంద రెట్లు ఎక్కువ ప్రదర్శన స్థాయిని పెంచాడు. నాజర్ బుర్ర కథని మహోతృష్ణ కళగా తీర్చిదిద్దినట్లే సత్తయ్య ఒగ్గు కథా కళారూప ప్రదర్శనని ఉన్నతస్థాయి కళగా మార్చాడు. శిష్ట నృత్యాల కన్నా భిన్నంగా జానపద నృత్యం ఉంటుంది. పోతే ఈ నృత్య పద్ధతులు శిష్ట నృత్యాల కన్నా ఉన్నత స్థాయిలో ప్రదర్శించవచ్చునని తాను చేసి చూపాడు. హావభావాల ప్రకటనలో సైతం, తనదైన విశిష్టతను చూపాడు. అత్యాధునిక వీధి నాటక శైలి జానపదనాటకరంగమే ఇచ్చిందని ఒగ్గుకథ చూసినవా రికి తెలుస్తుంది. ప్రత్యేక ఆహార్యం లేకున్నా పాత్రలను ప్రేక్షకుల కళ్లకు రూపు కట్టించాడు. తానే సంగీత దర్శ కుడై వాద్యాలను వాయిస్తూ ప్రేక్షక జన సమూహాలను ఉర్రూతలూపాడు. చేతిలోని చిన్న కండువాని గుర్రం కళ్లెంగా, పైటగా, కిరీటంగా చీరగా, ముసుగుగా ఎన్నో రకాలుగా వాడగల నేర్పరి సత్తయ్య. అభినయంలో కాకలు తీరిన నర్తకి నయన భాషల్ని అలవోకగా ఒలికిం చగలిగాడు. ఆటని ప్రదర్శిస్తున్నప్పుడు సత్తయ్యలో పంచ భౌతిక శక్తులు ఆయనకు సహకరించేవి. జలం ఆయన కన్నులలో కన్నీటి బొట్లై జలజలా రాలేవి. అగ్ని అతని వదనంలో జనించి కోపోద్రిక్త నాసికలోంచి బయట పడేది. రెండు చేతులు, కాళ్లు అనేక అవయవాలు గాలిగా మారి తాండవించేవి. మునివేళ్లలో జగ్గు వాద్యం వేగం పొగల్ని సృష్టించేది. నేలలోంచి పూలు పూసినట్లు, పళ్లు పండినట్లు, ఆకులు రాలినట్లు, సత్తయ్య తనువు అనే మట్టి గడ్డలోంచి ఒక్కో అంకం అనే రుతువులోంచి బయ టపడేవి. సత్తయ్య ప్రదర్శకుడే కాదు. వాగ్గేయకారుడు. అనేక ప్రాచీ రాగతాళగతులను తన సమకాలీన ప్రేక్షకు లకు నజరానాలుగా వంచేవాడు. సత్తయ్య ఒక్కడు. కానీ తన ప్రదర్శనలో.. అనేకం. ఒక దైవపాత్ర, ఒక హాస్య గాడు, సూత్రధారి, మహిళా పాత్ర, ఒక గుర్రం, ఒక రుద్ర శంకరుడు, వెరసి నవరసబ్రహ్మ. తానొక్కడే. కానీ డ్యూయెట్ నృత్యంలో హీరో, హీరోయిన్ ఆయనే. సత్తయ్య గతం కాదు. ఆయన వర్తమాన జీవి. మీరు ఇంత గొప్ప ప్రదర్శకులు కదా. ఎంతసేపూ ఒగ్గు కథేనా? కళ్ల ముందు ప్రకృతి విధ్వంసం జరుగుతుంటే చూస్తూ ఊర్కుంటారా అని అడిగితే అప్పటికప్పుడు పర్యావరణ రణం అనే ఒగ్గుకథ రాసి ప్రదర్శించాడు. గత ఏడాది వరంగల్‌లో జరిగిన తెలంగాణ రచయితల వేదిక మహాసభలను ఆయనతోనే ప్రారంభించాం. లిఖిత రచయితల సభలకు ఆయనను పిలుచుకున్నం దుకు వందలాది ప్రేక్షకులు చప్పట్లతో హర్షం వెలిబు చ్చారు. కళాకారునికి, రచయితకు కావల్సింది శాలువా పోగులు, ఓ జ్ఞాపిక కాదు. భుక్తి గడ వడం. కుటుంబం నడవడం ముఖ్యం. అతనికి అవి కల్పించలేకపోయాం. ఒగ్గుకథని దేశంలోని అనేక ప్రాంతాల్లో ప్రదర్శించి తెలుగువారి ప్రతిష్టను పెంచిన తెలంగాణ కళానిధి సత్తయ్య. సంతాప ప్రకటనలు ఠంచన్‌గా కురిపించే విద్య తెలిసిన వారికి ఇలాంటి జానపద కళాకారులకు బతుకు గడిచే మార్గం కోసం ఆలోచనలు చేయవలసిన తరుణం ఇది. చుక్క సత్తయ్యని కన్న తెలంగాణ నేలలో అజ్ఞాతంగా దాగిన కళల్ని కాపాడుకోవడంపై దృష్టి పెట్టక తప్పదు. అదీ సత్తయ్యకు ఇచ్చే నిజమైన నివాళి. -జయధీర్ తిరుమలరావు వ్యాసకర్త అధ్యక్షులు, తెలంగాణ రచయితల వేదిక మొబైల్ : 99519 42242 -
వంగదండు
ఒక్క మాట చాలు... మనిషిని ఉద్యమ దండుగా మార్చేయడానికి! అలా.. దండు అయిన మనిషే.. వంగపండు. పొట్ట కోసం పని చేసుకునేవాడు ఆకలి తీరేందుకు ఆలోచించాలి కానీ... ఆకలి తీర్చేందుకు గొంతెత్తడం ఏంటి?! పాటకు ఉన్న దైవశక్తి అది. పదాలను అల్లి దేవుడికి దండ వేసినట్లు... పాటల్ని అల్లి ఉద్యమానికి వేసిన దండ ఇది! పల్లె పదాలతో జనహృదయాలను ఆకట్టుకున్నారు. ఈ కళ దైవమిచ్చినదిగా భావిస్తారా? ఇప్పటికీ నా అభివృద్ధి ఆగకుండా నడిపిస్తున్న శక్తిని దైవం అనే నమ్ముతాను. ఆ శక్తి నాలో ఉంది. అదే పాట రూపంగా వచ్చింది. అలాగని, పూజల పేరిట వృథాగా డబ్బు ఖర్చుపెట్టను. నా చిన్నతనంలో పంట నూర్పిళ్లప్పుడు రాత్రిపూట మా తాత వాళ్లు పొలం దగ్గరకి వెళితే నేనూ వాళ్లతో పోయేవాడిని. అప్పుడు మా తాత, నాయిన, పెదనాయిన దేవుళ్ల కథలు చెప్పేవారు. శివుడు, రాముడు, కృష్ణుడు గురించి చెబుతూ వాళ్లను తలుచుకుంటూ పడుకోమనేవారు. ఇన్నేళ్లయ్యాక కూడా ఇప్పుడు పడుకున్నాసరే నాటి సంఘటనలు, దేవుళ్ల కథలు అన్నీ గుర్తుకువస్తాయి, జానపదం దైవం అయితే.. దారి ఉద్యమం వైపుగా ఎలా మళ్లింది? మాది విజయనగరం జిల్లా పెదగొండపల్లి. పెరిగింది గ్రామీణ వాతావరణం. సామాన్య రైతు కుటుంబం. ముగ్గురు అక్కాచెల్లెళ్లు.. ముగ్గురు అన్నదమ్ములం. నేనే పెద్దవాడిని. చదువు పెద్దగా అబ్బలేదు. ఎస్ఎస్ఎల్సీ ఫెయిల్ కావడంతో బొబ్బిలిలో ఐటీఐ చేశాను. అప్పట్లో చైనా యుద్ధంలో పాల్గొనాలనే పిలుపు వస్తే, ఆ ట్రైనింగ్ తీసుకున్నా. ఆ యుద్ధం ఆగిపోవడంతో ఊరుబాట పట్టా. అప్పటికే మా నాన్న ఊళ్లో భూమి అమ్మేసి, రాయగఢ్‌లో కొన్నాడు. అక్కడ ఆయనకు వ్యవసాయంలో కొన్నాళ్లు తోడుగా ఉన్నా. ఆ భూమి అడవికి దగ్గరగా ఉండేది. దీంతో అక్కడి గిరిజనులతో పరిచయాలు.. వారి పదాలు నా పాటల్లో బాగా దొర్లాయి. ఈ పనుల్లో పడి తెలిసిన పల్లె పదాలతో తోచిన బాణీలు కట్టుకుని పాడుతుంటే ఊళ్లో అంతా ‘ఓరేయ్ కవీ’ అని పిలిచేవారు. అప్పట్లో అర్థంకాని పదాలు రాస్తేనే కవిత్వం అనుకునేవాడిని. నేనేదో లల్లాయ పదాలతో పాటలు అల్లుకుపోయేవాడిని. నాచేత పాటలు పాడించుకుని, సరదా పడేవారు. అంతవరకు సరదా సరదాగా గడిచిపోయింది. పెళ్లైన రెండేళ్లకు మొదలైన నక్సల్స్బరి ఉద్యమం నాలో పెద్ద మార్పు తీసుకొచ్చింది. ఎక్కడ ఉన్నా సరే ఉద్యమమే. అదే జీవితమైంది. ఆ ఉద్యమంలో ఎంతోమందిని కలిశా, ఎందరి కష్టాలనో చూశాను. జనాన్ని జాగృతం చేయడానికి వాటన్నిటినీ పాటగా రూపుకట్టా. ఆ ఊపులో 400కు పైగా జాన పద పాటలు రాసాను. వాటిలో 200కు పైగా గీతాలు మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చాయి. నా పాటల్లో చాలావరకు దేశంలోని అనేక భాషల్లోకి అనువదించబడ్డాయి. మీ దైవానికి అదే మీ పాటకు 50 ఏళ్లు నిండాయి. అదే మీకు జీవన భృతిని కలిగించిందా? ఉద్యమంలోకి వెళ్లిన ఏడాదికే విశాఖ షిప్ యార్డులో ఫిట్టర్‌మన్‌గా ఉద్యోగం వచ్చింది. కానీ ఉద్యోగం కంటే ఉద్యమమే నాకు ఆత్మసంతృప్తినిచ్చేది. షిప్‌యార్డులో పని చేస్తూ ఉన్నా మనసంతా ఉద్యమం వైపే ఉండేది. దీంతో పదిరోజులు పనికెళ్లడం, ఇరవై రోజులు పాటలు పాడుకుంటూ ఊళ్లమ్మట పడి తిరగడం చేశా. అలా కేరళ, తమిళనాడు, పశ్చిమబెంగాల్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ , కర్ణాటక రాష్ట్రాలన్నీ తిరిగా. ఇలా తిరుగుతూ ఉంటే ఏమౌతుంది.. ఇంట్లో పూట గడవని స్థితి. ఒక పూట తింటే మరో పూట పస్తే! అయినా సరే నమ్మిన సిద్ధాంతాన్ని వీడలేదు. ఆరేళ్ల సర్వీసులో ఉన్నా తర్వాత స్వచ్ఛంద పదవీ విరమణ చేసి, పూర్తిస్థాయి ఉద్యమంలోనే ఉన్నాను. ఈ మార్గం సరైనది కాదని.. ఎప్పుడైనా అనిపించిందా? చాలాసార్లు అనిపించింది. మధ్యతరగతి కుటుంబాలకు ఉద్యమాలు కరెక్ట్ కాదని అనుకున్నా. ఉద్యోగం వదులుకున్నప్పుడైతే పడిన మానసిక క్షోభ మాటల్లో చెప్పలేను. ఇంట్లో నలుగురు పిల్లలు, భార్య. వారికి కనీసం కడుపు నిండా తిండి కూడా పెట్టలేనప్పుడు ఈ ఉద్యమాలెందుకన్న ఆలోచన. బాగా మధనపడేవాడిని. మళ్లీ కొన్నాళ్లు సొంతూళ్లో వ్యవసాయం చేశాను. కలిసిరాలేదు. అన్నీ నష్టాలు. అప్పులు. ఆకలి బాధ కోసం ఆత్మాభిమానం చంపుకోకూడద నిపించింది. దీంతో మళ్లీ ఉద్యమం బాటే పట్టాను. దైవం పాటగా మిమ్మల్ని పలకరించింది. ఆ పాట మిమ్మల్ని ఆదుకోలేదా? అదే నన్ను బతికించింది. జనాల్ని ఉత్తేజపరిచే నా జానపద గీతాలు సినిమా వాళ్లనూ ఆకట్టుకు న్నాయి. దర్శకులు టి.కృష్ణ, ఆర్. నారాయణమూర్తిలతో పాటు మరికొందరు మా సినిమాలకు పాటలు రాయమని కోరారు. అలా 30 సినిమాల వరకు రాశాను. అలాగే ఆరేడు సినిమాల్లోనూ నటించాను. కొన్ని సినిమాలకు పాటలు రాసే అవకాశాలొచ్చినా జననాట్యమండలి నిబంధనలకు కట్టుబడ్డాను. వాటిని వదులు కున్నా. సినిమాలకు ప్రాధాన్యం ఇచ్చి ఉంటే నా జీవితం మరోలా ఉండేది. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునే శక్తిని, అదృష్టాన్ని దైవం కలిగించలేదని.. కోపం తెచ్చుకున్న సందర్భాలు... అదృష్టం, దురదృష్టం వంటి పదాలను ఎప్పుడూ పట్టించుకున్నది లేదు. వాటి మీద నమ్మకమూ లేదు. ఇప్పటికైతే ఆస్తులూ లేవు, అప్పులూ లేవు. ఇది కావాలని కోరుకుంటూ ఎన్నడూ గుళ్లకు వెళ్లింది లేదు. కనపడని దైవాన్ని నిందించడం, కోపం తెచ్చుకోవడం అంటూ ఏముంటాయి. అప్పుడు మనలోని శక్తిని మనమే తిట్టుకున్నట్టు అవుతుంది కదా! దైవం, దైవత్వం అంటే ఆపదలో ఉన్నవాడికి సాటిమనిషిగా సాయపడటం అని నమ్ముతాను. అది నిజం కూడా! దీనికో ఉదాహరణ చెబుతాను. ఆదిభట్ల కైలాసం అని నాకు మంచి మిత్రుడు. ఉద్యమకారుడు. నమ్మిన సిద్ధాంతం కోసం సెంటు భూమికూడా ఉంచుకోకుండా తనకున్న 150 ఎకరాలను నిరుపేదలకు రాసిచ్చేశాడు. ఆ భూములు పొందిన వారు ఇళ్లలో ఆయన్ని ఓ దేవుడిగా కొలుస్తారు. మూర్తీభవించిన మానవత్వానికి ఇంతకంటే ఉదాహరణ ఉంటుందా? ఇలాంటి వారు మన కళ్లెదుటే చాలా మంది ఉంటారు. మనం గమనించం. ఎదుటివాడికి సాయపడమనే భగవద్గీత, ఖురాన్, బైబిల్ బోధిస్తున్నాయి. మనమేం చేస్తున్నాం వాటిని మతగ్రం«థాలుగానే చూస్తున్నాం. మీ పిల్లలకు దైవాన్ని ఎలా పరిచయం చేస్తారు? వారికి ఏ విషయంలోనూ ఎలాంటి ఆంక్షలు లేవు. భార్య, నలుగురు పిల్లలు. మీకు నచ్చిన దైవాన్ని పూజించుకోమంటాను. జనానికి దారి చూపిన మహనీయులను మాత్రం స్మరించుకోమంటాను. వారు చూపిన బాటలో పయనించమంటాను. ముగ్గురు కొడుకుల్లో ఒకరు టీచర్‌గా ఉంటే, ఇంకొకరు వ్యవసాయం చేస్తున్నాడు. చిన్నవాడు చదువుకుంటున్నాడు. అమ్మాయి ఉష నాలాగే పాటలు పాడుతూ నా వారసురాలు అనిపించుకుంది. జానపదకళ కాపాడాలంటే విద్యార్థి దశ నుంచే భావి తరాలకు చెప్పాల్సిన అవసరం చాలా ఉంది. ఈ కళ అంతరించిపోకూడదని, తెలిసిన ఈ కళను నా తుది శ్వాస వరకు పదిమందికి చేరువచెయ్యాలన్నదే నా తపన. మీ పాటలోనూ, సాయపడేవారిలోనూ దేవుడిని చూసే మీరు దైవం మీదా పాటలు కట్టారు..? నాకు చిన్నప్పటి నుంచి శివుడంటే ఇష్టం. ఆయన చాలా సింపుల్‌గా ఉంటాడు. జంతు చర్మం కట్టుకుంటాడు. శ్మశానంలో తిరుగుతాడు. పిలవగానే పలుకుతాడని పేరు. ఆయన ది సామాన్యుల జీవితం. అందుకే చాలామంది శివుడ్నే కొలుస్తారు. అమ్మవారి మీదా, శివుడి మీదా .. ‘ఓమ్ ఉమాశంకరా .. వందిత పురంధరా.. హిమాచలాద్రి మందిరా.. ’ అంటూ చాలా పాటలు పాడాను. శివయ్య బుర్ర కథలకూ బాణీలు కట్టా. అలాగని, ఏనాడూ శివాలయానికి వెళ్లిందీ లేదు. ఇప్పుడు కూడా శ్రీకాకుళంలోని ఓ పల్లెటూరులో ‘శివకోలలు’ అని పండుగ జరుగుతుంది. దీనికి నన్ను అతి«థిగా పిలిచారు. ఇక్కడ వేదిక మీద జానపద పాటలు పాడాలి. అన్నింటితో పాటు శివుడికి సంబంధించిన పాటలూ ఉంటాయి. దైవం అంటే భక్తి ఉండాలా, భయం ఉండాలా.. అంటే భక్తే ఉండాలంటాను. ఎందుకంటే మనం నమ్మి భక్తిగా ఏ పని చేసినా విజయం సిద్ధిస్తుంది. భయంతో ఏ పని చేసినా ఫలితం దక్కదు. – పంపన వరప్రసాదరావు, సాక్షి, విశాఖపట్నం -
జానపదం 'అంటరానిదా'?
సందర్భం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన రెండేళ్ల కాలంలో ఏ మాత్రం జంకూ గొంకూ లేకుండా శిష్ట వర్గాల పండితులకు వారి సాహిత్యానికి, కళలకే ప్రభుత్వం, ప్రభుత్వ సలహాదారులు అంకితం కావడం జుగుప్స కలిగిస్తోంది. రెండో రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా వివిధ రంగాలలో ప్రతిభ కనబరిచిన 62 మందికి తెలంగాణ ప్రభుత్వం లక్షా నూట పదహార్లతో ఈరోజు సన్మానించను న్నది. ఇది సంతోషించ తగిన విషయమే. కానీ ప్రత్యేక రాష్ట్రం సాధనలో రెండు దశాబ్దాలుగా సాహిత్యం, కళలు మహోన్నత పాత్ర పోషించాయి. బతుకమ్మలు రోడ్డెక్కాయి. జానపద కళాకారులు తమ వాద్యాలను, ఆహార్యాలతో పాటుగా ఉద్యమంలో భాగం చేశారు. దళిత వర్గాలకు చెందిన ఎంతోమంది కవులు, కళాకారులు అక్షరాన్ని, శబ్దాన్ని ఆయుధం చేశారు. 2013లో తిరుపతిలో జరిగిన ప్రపంచ మహాసభలో అవమానాల పాలైన తెలంగాణ జానపద కళాకారులు ఒక్కటై, వేలాదిమందిగా నిరసన ధ్వని వినిపించారు. ప్రత్యేక తెలంగాణలో మాత్రమే మాకు న్యాయం జరుగుతుందని బలంగా నమ్మి ఉద్యమంలో భాగస్వాములయ్యారు. ఎంతోమంది శిష్ట పురస్కార గ్రహీతలు, కవులు, కళాకారులు సమైక్యత ముసుగులు ధరించిన వేళ దళిత జానపద నిమ్నవర్గాల వారు నినాదాలయ్యారు. ఊరేగింపులను నిరంతరం ధ్వనింపజేశారు. ప్రజల భాష, సాహిత్యాలు, కళలు రాబోయే కాలంలో వెల్లివిరుస్తాయని ఆశించారు. కానీ ఈ రంగాలలో జరిగిన ప్రస్తుత ఎంపిక చూసి నిరుత్తరులయ్యారు. సాహిత్య రంగంలో ఒక్క దళిత రచయిత పేరు లేదు. జానపద నృత్యం విభాగం కింద వృత్తి కళాకారుడిని కాకుండా ఉద్యమ గాయకుడిని ఎంపిక చేసి జానపదులను అవమానించారు. ‘జానపద సంగీతం’ విభాగం కింద కూడా వృత్తి కళాకారులను కాకుండా జానపదేతరులను ఎంపిక చేశారు. వేల ఏళ్లుగా జానపద కళా సంగీత ప్రదర్శనలనే నమ్ముకున్న వారిని నట్టేట ముంచారు. అలాంటి ఒక్క జానపద వృత్తి కళాకారునికి ఈసారి చోటు దక్కక పోవడం శోచనీయం. రాష్ట్రావతరణ వేడుకలలో అత్యధిక భాగమైన కళా ప్రపంచం లేకుండా ఉత్సవాలు జరుపుకోవడం సరైనదేనా. రాష్ట్ర స్థాయిలో అలాంటి కళాకారులు లేరని ప్రభుత్వం భావించిందా? లేదా వేడుకలలో వారిని ప్రేక్షకులుగానే ఉండాలని తీర్మానించిందా? వారు ఊరేగింపులోని తలలుగానే లెక్కించాలనుకుందా? జానపద కళల గురించి ఒక మాట ఉంది. ఎక్కడైతే (ఫోక్లోర్) చచ్చిపోతుందో అక్కడ ఫేక్లోర్ తోక ఊపుతుంది. నిజానికి దక్షిణాది రాష్ట్రాలలో తెలంగాణలోనే వైవిధ్యభరితమైన గొప్ప విశిష్ట జానపద కళాకారులు ఉన్నారు. గతంలో ఇలాంటి వాతావరణం ఉండబట్టే ఆ కళలు అంతరించిపోవడానికి దగ్గరయ్యాయి. వాటిని కాపాడవలసిన వేళ వాటి ఊసులేకుండా చేయడం ‘పాపం’ కిందే లెక్క. కళాకా రులని కాపాడకుండా, వారిని గౌరవించకుండా ‘కళ’ని కాపాడలేం. ఎన్నో జానపద విలక్షణ కళలను జాతీయ స్థాయిలో గుర్తింపు తేవలసిన ప్రభుత్వం ఒక్క కళని ఆశీర్వదించలేదు, అసలు ఒక్క జానపద కళాకారుడిని గుర్తించక పోవడం ఎందువల్ల జరిగింది? ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన రెండేళ్ల కాలంలో బహిరంగంగా ఏ మాత్రం జంకూ గొంకూ లేకుండా శిష్ట వర్గాల పండితులకు వారి సాహిత్యానికి, వారి కళలకే ప్రభుత్వం, ప్రభుత్వ సలహాదారులు అంకితం కావడం చాలామందికి జుగుప్స కలిగిస్తోంది. ప్రజా సాహిత్యం, జానపద, గిరిజన సాహిత్యం, కళలపట్ల వీరికి, ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి లేకపోవడం దివాలాకోరుతనం. జానపద గిరిజన కళలపై డాక్యుమెంటరీలు తీయడానికి మాత్రం ప్రభుత్వం లక్షలాది రూపాయలు విచ్చలవిడిగా ఖర్చు చేయడం ఆర్థిక దుర్వినియోగం అవుతుందని కళాకారులు వాపోతున్నారు. నోరులేని జానపద కళాకారుల గురించి నాయకులు ఎవరూ పట్టించుకోవడం లేదు. తమకు తెలిసిన చోటామోటా రచయితలకు, కళాకారులకు అవార్డులు ఇప్పించడానికి రాష్ట్ర , జిల్లా స్థాయిలో కలెక్టర్లకి వచ్చిన లేఖల కట్టలు చూస్తే తెలుస్తోంది. అంతా పైరవీలే. తెలంగాణ ప్రజలు దీనిని ఊహించలేదు. కళాకారుడి మొర వినలేదు. వారికి ఫించన్ల సంఖ్య కూడా పెంచలేదు. ఈ జానపద కళాకారులు బీడీలు తాగి, సట్నాలు తిని, కట్టిన పన్నులను జానపదేతర కవులు, కళాకారులకు పురస్కారాలుగా ఇవ్వడం తెలంగాణ ప్రజల సొమ్ము దుర్వినియోగం జరిగిందని ప్రజలు అనుకుంటే తప్పెలా అవుతుంది? ఆశ్రితులనే ముఖ్యమంత్రిగారు కమిటీ సభ్యులుగా వేయడం వల్ల వారు వాళ్ల ఆశ్రితులనే ఎంపిక చేస్తారు. ఈ వరస, ఇలాంటి సంఘటనలు రెండేళ్లలో కోకొల్లలు. తెలంగాణలో సాంస్కృతిక రంగం భ్రష్టు పట్టించడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు. తప్పుడు సలహాలు ఇస్తున్నారు. వారిపట్ల జాగ్రత్త అవసరం. పురస్కారాల ఎంపికలో తమ వారికే ఇప్పించుకోవాలనే దుగ్ధకి అంతంలేదు. ఇది ఇలాగే కొనసాగడంవల్ల ప్రభుత్వానికి చాలా చెడ్డపేరు వస్తుంది. అందుకే జూన్ రెండో తేదీన జరిగే సన్మాన కార్యక్రమంలో తప్పకుండా దళిత రచయితలను, జానపద కళాకారులను కొందరిని ఎంపిక చేసి వారికి కూడా గౌరవంగా సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాం. తెలంగాణ భాషా సాంస్కృతిక జానపద గిరిజన కళారంగం పాలసీని కూడా రూపొందించే దిశగా ఆలోచించాలని కోరుతున్నాం. పాలసీ ఉంటే జవాబుదారీతనం ఉంటుంది. లేని పక్షంలో సాంస్కృతిక రంగం గుప్పుమంటుంది. వ్యాసకర్త కవి, రచయిత ‘ మొబైల్ : 99519 42242 జయధీర్ తిరుమలరావు -
సందట్లో జానపదం
వేడుకలు ఆడంబరాల వేదికలే తప్ప,సంప్రదాయానికి ఆనవాళ్లుగా లేవు అని పెదవి విరిచే వారిని పన్నీటి జల్లులా పలకరిస్తోంది జానపదం. అడుగడుగునా పాశ్చాత్య పోకడలు తొంగి చూస్తున్న సంబురాల్లో పల్లె గాలి అల్లరి లేదని నీరసపడే పట్నవాసులను తెలుగుదనంలో పరవశింపజేస్తున్నాయి పల్లెపదాలు. వివాహం, సీమంతం, బారసాల, పుట్టిన రోజు వేడుక, చీరలు కట్టించడం.. ఇలా సందడి ఏదైనా సిటీలో జానపద పాటలు వీనుల విందు చేస్తూ ఫంక్షన్‌కు లోకల్ టచ్ ఇస్తున్నాయి. ..:: నిర్మలా రెడ్డి పెద్ద పెద్ద వేదికలు, హుందాగా ఆహూతులు, వారి మధ్య వెలిగిపోతూ వధూవరులు, బాజాభజంత్రీల మోతలు.. ఎన్ని ఉన్నా ఇంకా ఏదో వెలితి నేటి పెళ్లిళ్లలో అనుకునే వారి మదిని సంబురంలో ముంచెత్తుతూ.. ‘సువ్వి సువ్వి సువ్వి సువ్వని సుదతులు దంచెదరు ఓలాల...’ అంటూ ఓ బృందం సుతిమెత్తగా మదిని తట్టిలేపుతుంది. నిన్నటి తరం పెళ్లి ముచ్చటను ఈ తరానికి పరిచయం చేస్తుంది. అందుకే ‘వనితలు మనసులు కుందెన చేసెటు వలపులు దంచెదరు ఓలాల.. కనుచూపులనెడు రోకండ్లతో కన్నెల దంచెదరు ఓలాల..’ అంటూ వేడుకకు సంప్రదాయపు అలంకారాలను అద్దుతున్నాయి జానపద బాణీలు. ఏ తీరుకు ఆ పాట.. డీజే హోరులో తడిసిముద్దవుతున్న నేటి వేడుకలను ఆ పాత రోజుల్లోకి తీసుకెళ్తున్నాయి జానపద బృందాలు. రోలు, రోకటి అచ్చట్లు, వధూవరుల ముచ్చట్లు, అత్తాకోడళ్ల సవాళ్లు, వదినామరదళ్ల ఆటపట్టింపులు.. పెళ్లి వేడుక మొదలైన క్షణం నుంచి అప్పగింతలయ్యే వరకూ ప్రతి తంతునీ విడమరచి చె ప్పే పాటలు జానపదంలో వేలాదిగా ఉన్నాయి. మరుగున పడిపోతున్న ‘లాలి’త్యాన్ని వెలికి తీసి పల్లె బాణీల్లో బారసాల బుజ్జాయికి జోలపుచ్చుతున్నారు కళాకారులు. కట్టు.. బొట్టు.. సిటీలో జరిగే పలు వేడుకల్లో ఇప్పుడు జానపదాలు పల్లవిస్తున్నాయి. ఇక్కడ పాటలు పాడేవారు పది మందికి తగ్గకుండా బృందంగా ఏర్పడతారు. వీరంతా వివిధ ఉద్యోగాల్లో ఉన్నవారూ, పాటలపై ఆసక్తి ఉన్నవారూ అయి ఉంటారు. అలాగే వారికి నాటి సంప్రదాయపు సొగసు కూడా తెలిసి ఉంటుంది. ఆ వేడుకకు తగ్గట్టు తమ ఆహార్యంతోనూ ఆకట్టుకుంటారు. పెద్దంచు పట్టుచీర , నుదుటన పెద్ద బొట్టు, తల నిండుగా పువ్వులు, చేతుల నిండుగా గాజులతో మహిళలు పెళ్లిలో హాస్యమాడే పాటలతో ఆకట్టుకుంటే.. మగవారు సంప్రదాయ పంచెకట్టుతో ఆనందాన్ని పంచుతారు. తరం మారినా.. పెళ్లి సందడిలో వయసుతో నిమిత్తం లేదు. ఇక్కడ మూడు తరాల వారూ కోరుకునేది ఆనందమే. అందుకే అందరూ ఎంటర్టైన్మెంట్కు ప్రాధాన్యం ఇస్తారు. కొన్ని సౌండ్ పార్టీలు డీజేలతో సెలబ్రేట్ చేసుకుంటే, ఇంకొందరు ఆర్కెస్ట్రాలతో ఆహ్వానితులను ఎంగేజ్ చేస్తారు. ఈ మధ్యకాలంలో వీటి స్థానంలో పాతదే అయినా ఈ తరానికి కొత్తదైన జానపద పాటలు వినిపిస్తున్నాయి. కొన్నేళ్లుగా జానపదాలతో వేడుకలలో ఆకట్టుకుంటున్న కళాకారిణి స్నేహలతా మురళి మాట్లాడుతూ ‘నేను మొదట జానపద పాటలను పెళ్లిలో పాడటం మొదలుపెట్టినప్పుడు యువత అనాసక్తి చూపుతారేమో అని భయపడ్డాను. కానీ, వారు పెళ్లికి డీజే పెట్టించుకుని, తర్వాత ఆ విషయమే మర్చిపోయి జానపద పాటల్లో లీనమవడంతో ధైర్యం వచ్చింది. నాతో నా స్నేహితులూ, ఆసక్తి గలవారు చేరడంతో మేమంతా బృందంలా ఏర్పడ్డాం. చిన్నాపెద్ద ఏ ఫంక్షన్‌కి ఆహ్వానించినా మా పాటలతో వారి వేడుకను ఆద్యంతం సంబురంగా మార్చేందుకు ప్రయత్నిస్తుంటాం. పెళ్లిలో వియ్యాలవారి మధ్య అరమరికలు తొలగడానికి ఈ పాటలు దోహదం చేస్తుంటాయి. కొన్నిసార్లు పిల్లలు, పెద్దలు మాతో శృతి కలుపుతుంటారు. ఈ పాటలతో అప్పటి వరకూ ఉన్న స్తబ్ధత పోయిందని వేడుకకు వచ్చిన వారు చెబుతుంటే ఆనందం కలుగుతుంది. పదేళ్లుగా ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నాను. నటుడు మోహన్‌బాబు ఇంట పెళ్లికి, సీమంతానికి పాడాం. ఇంకా నగరంలో జరిగిన జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ వివాహ వేడుకల్లోనూ జానపద పెళ్లి పాటలు పాడాం’ అని తెలిపారు స్నేహలత. అర్థం చెప్పే ‘పాట’వం.. పెళ్లి పాటలు పదిగురిలోకి చేరాలి. అవి కలకాలం ప్రజల నాలుకలపై ఆడాలి. సంప్రదాయపు సొబగులతో, అవి అందించే ఆశీస్సులతో వేడుకలు మరింత వేడుకగా మారాలి. ఇందుకు నగరంలోని జానపద బృందాలు ‘పాట’పడుతున్నాయి. ముహూర్తం పెట్టి పసుపు దంచింది మొదలు నలుగు పాట, విడి పాట, వియ్యపురాలి పాట, భోజనం బంతి పాట, పూల చెండ్ల పాట, అప్పగింతల పాట.. ప్రతి సందర్భానికీ పాటలే పాటలు. వీరు ఆ పాటలను పాడేసి ఊరుకోవడం లేదు. పాటల సమయ సందర్భాలను, వాటిలోని సాహిత్యాన్నీ అందాన్నీ పరిచయం చేస్తూ జనరంజకం చేస్తున్నారు. పాటకు అనుగుణంగా అప్పటికప్పుడు యువతతోనూ చిందేయిస్తూ తామూ పాదం కలిపి పదం పాడుతుంటారు. మామూలుగా ఈ కార్యక్రమం కొత్తాపాత తేడా లేకుండా కలిసిపోవడానికే! యువతరంలో జోష్‌నందించడానికే అయినా దానికి మంచి గొప్ప ప్రయోజం కూడా కల్పిస్తున్నారు. ఒకరిని చూసి ఒకరు పెళ్లి పాటలు పాడతాం అని బృందాలుగా తయారవుతున్నారు. అన్నింటికీ ఉన్నట్టే పెళ్లిపాటలు పాడే బృందాలకూ ప్యాకేజీలు ఉన్నాయి. హృద్యంగా పాటలు పాడి, కార్యక్రమాన్ని ఆద్యంతం రంజింపజేసే వారినే అవకాశాలు అధికంగా పలకరిస్తున్నాయి. -
ఆ జ్ఞాపకాలు నన్నెప్పుడూ వెంటాడుతుంటాయి!
సింగీతం శ్రీనివాసరావు... మైండ్‌లోనే టైమ్ మెషీన్ ఉన్న సూపర్ జీనియస్! క్లాసూ... మాసూ... ఫ్యాంటసీ... సైన్స్ ఫిక్షనూ... జానపదం... పౌరాణికం... రియల్ లైఫ్ స్టోరీలూ, రీల్ లైఫ్ ఎక్స్పరిమెంట్లూ... యానిమేషన్లూ... ఇలా ఏ జానర్‌కైనా ఆయన ఆనర్ తీసుకొస్తారు. సెల్యులాయిడ్ సైంటిస్ట్... సింగీతం! నేడు పుట్టినరోజు జరుపుకొంటున్న సింగీతం శ్రీనివాసరావు స్పెషల్ ఇంటర్వ్యూలు ‘సాక్షి’ పాఠకులకు ప్రత్యేకం!! నా కెరీర్లో టాప్ 5 సినిమాల గురించి చెప్పమంటే... కొద్దిగా కష్టమే. కానీ, ఇష్టమైన కొన్ని మైలురాళ్ళను ప్రస్తావిస్తా... సింగిల్ కాలమ్ న్యూస్ నుంచి పుట్టిన ‘మయూరి’... ఓ చిన్న వార్త నుంచి సినిమా పుడుతుందంటే ఎవరూ నమ్మకపోవచ్చు. కానీ ‘మయూరి’ (1984)ని చూస్తే మీరు నమ్మాల్సిందే. నిర్మాత రామోజీరావు, సుధాచంద్రన్ గురించి సింగిల్ కాలమ్ వార్త చదివి ఇన్స్పైర్ అయ్యి, నా దర్శకత్వంలో సినిమా చేద్దామనుకున్నారు. సుధాచంద్రన్ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలకు కొంత ఫిక్షన్ జత చేసి ‘మయూరి’ కథ అల్లుకున్నాం. ఎవరైనా హీరోయిన్‌తో ఈ సినిమా చేసి, ఆఖర్లో సుధాచంద్రన్ క్లోజప్ చూపిద్దామని మొదట అనుకున్నాం. సుధాచంద్రన్ దగ్గర మరిన్ని సంఘటనలు తెలుసుకుందామని కలిసినప్పుడు, ఆమె కళ్లల్లోని ఇంటెన్సిటీ నన్ను ఆకట్టుకుంది. ఆమెతోనే ఈ సినిమా చేద్దామని నిర్ణయించుకున్నాం. మొదట ఆమె చేయనంటే, ఒప్పించాం. ఇలాంటి సినిమాలో డ్యూయట్లు పెట్టాలా? వద్దా? అనే విషయంలో డైలమా. అప్పుడు నేను ‘కన్నడ’ రాజ్‌కుమార్ షూటింగ్లో ఉన్నా. ఆయన్ను అడిగితే అద్భుతమైన సలహా చెప్పారు. అదేమిటంటే -‘‘సినిమాలో 10 రీళ్లు అద్భుతంగా ఉండి, ఆఖరి 2 రీళ్లు యావరేజ్‌గా ఉంటే, అది యావరేజ్ సినిమా అయిపోతుంది. అలాగే 10 రీళ్లు యావరేజ్‌గా ఉండి, ఆఖరి 2 రీళ్లు అద్భుతంగా ఉంటే ఆ సినిమా హిట్ కింద లెక్క. మీ సినిమా క్లైమాక్స్ అద్భుతం అంటున్నారు కాబట్టి, ముందు డ్యూయెట్లు పెట్టినా ఫరవాలేదు’’. అవార్డులు, అన్ని భాషల్లో జయకేతనాలు... ఇవన్నీ కాదు. అంగవైకల్యం ఉన్నా అందలమెక్కవచ్చని ఈ సినిమా ఎంతోమందికి ఇచ్చిన స్ఫూర్తి చాలు దర్శకునిగా నేను పూర్తిస్థాయి సంతృప్తిని ఆస్వాదించడానికి. రాజ్కపూర్కైతే విపరీతంగా నచ్చేసింది! సినిమా అంటేనే డైలాగులు పేలాలి అనుకునే కాలంలో - మూకీ సినిమా చేయడమంటే చాలామందికి సాహసం, కొంతమందికి చాదస్తం కింద లెక్క. కేవీ రెడ్డిగారి దగ్గర అసిస్టెంట్ డెరైక్టర్‌గా ఉన్నప్పటి నాటి కోరిక అది. ఆ తర్వాత సినిమాల హడావిడిలో పడి మర్చిపోయా. కానీ ఓ రోజు బాత్రూమ్లో స్నానం చేస్తుండగా సడన్‌గా మూకీ తీద్దామని ఆలోచనొచ్చింది. రెండు వారాల్లో స్క్రిప్టు రెడీ. కమల్‌కి చెబితే ఎక్స్లెంట్ అన్నాడు. కానీ ఒక్క నిర్మాత కూడా ముందుకు రాలేదు. దాంతో కథని మనసు లాకర్లో పెట్టేశా. దేనికైనా కాలం, ఖర్మం కలిసి రావాలి కదా. కొన్నేళ్లకు అదే జరిగింది. బెంగళూరులో ఓ హోటల్లో ఉన్నా. ‘కన్నడ’ రాజ్‌కుమార్ సినిమా షూటింగ్ చేసొచ్చి, రెస్ట్ తీసుకోవడానికి రెడీ అవుతుంటే, ‘శృంగార్ ఫిలింస్’ నాగరాజ్ వచ్చారు. ఆయన నటుడు. దానికన్నా ప్రధానంగా సినిమా షూటింగ్స్‌కి ఫారిన్ కో ఆర్డినేటర్. ఏదో కబుర్లు చెప్పుకుంటూ యథాలాపంగా ఆ కథ చెప్పా. ఆయన ఫ్లాట్ అయిపోయాడు. మనం తీద్దామన్నాడు. కమల్ కూడా ఓకే అన్నాడు. అలా ‘పుష్పక విమానం’(1984) యాత్ర మొదలైంది. ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ వారి అవార్డు ఫంక్షన్లో వ్యాఖ్యానం చేసిన ఓ అమ్మాయి నవ్వు, కళ్లు నన్ను ఆకట్టుకున్నాయి. ఆమెను చూస్తుంటే. ‘రోమన్ హాలిడే’ అనే హాలీవుడ్ సినిమాలో చేసిన ఆర్డ్రే హెప్బర్న్ గుర్తొచ్చింది. వెంటనే కథానాయికగా తీసేసుకున్నాం. ఆమె ఎవరో కాదు? అమల. హోటల్ ప్రొప్రయిటర్ పాత్రకు గుమ్మడి గారిని అనుకున్నాం. అప్పుడే ఆయన భార్యకు వంట్లో బాగోకపోవడంతో, చేయడం కుదర్లేదు. వేరే కన్నడ ఆర్టిస్టుతో చేయించేశాం. ఇక ముష్టివాడి పాత్రను పీఎల్ నారాయణతోనే చేయించాలని ఎప్పుడో ఫిక్స్ అయిపోయాను. ముంబైలో షో వేస్తే, రాజేంద్ర కుమార్, రాజ్‌కపూర్, ఆర్డీ బర్మన్ లాంటి హేమాహేమీలు మెచ్చుకున్నారు. రాజ్కపూర్కైతే ‘డెడ్‌బాడీ రొమాన్స్’ సీన్ విపరీతంగా నచ్చేసింది. నేనెన్ని ప్రయోగాలు చేసినా, ‘పుష్పక విమానం’ మోసుకొచ్చినంత పేరు ప్రఖ్యాతులు, జాబ్ శాటిస్ఫాక్షన్ ఇంకేదీ ఇవ్వలేదు. మొదట మరుగుజ్జు ప్రేమకథ అనుకున్నాం... ‘‘కమల్‌హాసన్ లాంటి గ్లామర్ హీరో ఓ మరుగుజ్జుగా కనిపిస్తే ఏం బాగుంటుంది? అందుకే అందరూ వద్దన్నారు. ఇది కమల్‌కి పుట్టిన ఆలోచనే. నాకు చెప్పగానే, నేను వెంటనే ఉద్వేగానికి గురయ్యా. నేను, కమల్, రచయిత క్రేజీ మోహన్ కలిసి ఓ కథ తయారు చేశాం. మరుగుజ్జు ప్రేమకథ అన్నమాట. ఐదారు రోజులు షూటింగ్ చేశాక, మాకే కథపై సందేహాలు మొదలయ్యాయి. నిర్మాత పంజు అరుణాచలం కథలు బాగా జడ్జ్ చేయగలరు. ఆయన్ను పిలిచి కథ వినిపిస్తే, పగ నేపథ్యంలో డ్యూయల్ రోల్‌తో చేయమని సలహా ఇచ్చారు. అలా స్క్రీన్‌ప్లే మార్చితే ‘విచిత్ర సోదరులు’(1989) కథ తయారైంది. ఇందులో తండ్రి పాత్రకు మొదట ప్రేమ్‌నజీర్ అనుకున్నాం. అస్వస్థతగా ఉండటంతో ఆయన చేయలేనన్నారు. ఎలాగో కవలలుగా చేస్తున్నారు కాబట్టి, తండ్రి వేషం కూడా మీరే చేయండని నేను కమల్‌తో చెబితే, ఆయన సరేనన్నారు. విలన్‌గా అమ్రీష్పురిలాంటి వాళ్లను తీసుకోవచ్చు కానీ, ఎవ్వరూ ఊహించని వ్యక్తితో చేయిస్తే, ప్రేక్షకులు థ్రిల్ అవుతారనిపించింది. అందుకే హాస్యనటుడు నాగేశ్‌ని విలన్‌గా తీసుకున్నాం. ఇక మేకింగ్ విషయానికొస్తే - మరుగుజ్జు కమల్ సీన్లు తీయడానికి చాలా శ్రమించాం. ఎందుకంటే ఆ రోజుల్లో గ్రాఫిక్స్ లేవు. మానిటర్లు లేవు. మిఛెల్ కెమెరాతోనే అద్భుతాలు చేయాలి. అసలు కమల్ని పొట్టివాడిగా ఎలా చూపించారన్నది అప్పట్లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ. కమల్ మోకాళ్లకు స్పెషల్లీ డిజైన్డ్ షూస్ తొడిగాం. 18 అంగుళాల గొయ్యిలు రెండు తవ్వించి, ఒక దాంట్లో కమల్ని, మరొక దాంట్లో కెమెరాను పెట్టి ఒకే లెవెల్లో ఉండేలా చిత్రీకరణ జరిపేవాళ్లం. గోతిలో దిగిన కమల్ మోకాళ్లకి షూస్ తొడిగి నడిపిస్తూ ఉంటే, మరుగుజ్జు కమల్ నడుస్తున్నట్టే అనిపిస్తుంది. అలాగే ఓ సీన్లో మరుగుజ్జు కమల్ కూర్చుని కాళ్లు కదుపుతారు కదా. అదెలా తీశామో తెలుసా? అవి కమల్ కాళ్లు కావు. ఆర్టిఫీషియల్ లెగ్స్. కమల్ కాళ్లను మడిచి కూర్చుంటే, రైల్వే సిగ్నల్స్ టెక్నిక్‌లో ఆర్టిఫీషియల్ కాళ్లతో సీన్ షూట్ చేశాం. ఆడియో క్యాసెట్లు తయారు చేసే పారిశ్రామికవేత్త సహదేవన్ ఈ విషయంలో మాకు బాగా సహకరించారు. ఇంకో ముఖ్యమైన వ్యక్తి గురించి చెప్పకపోతే అది పాపమే అవుతుంది. జపాన్ అనే సెట్‌బాయ్ ఈ గోతుల్ని కరెక్ట్‌గా తవ్వి, మాకు బోలెడంత టైమ్ కలిసొచ్చేలా చేశాడు. కమల్ నిర్మాత కాబట్టే ఈ సినిమాను 90 రోజుల్లో తీయగలిగాం. ఇంకెవరైనా అయ్యుంటే బడ్జెట్ పెరిగిపోయేది. షూటింగ్ డేసూ పెరిగేవి. అసలు ఈ సినిమా మేకింగ్ గురించి డాక్యుమెంటరీ తీద్దామని నేనూ, కమల్ ఎన్నాళ్లనుంచో అనుకుంటున్నాం. కుదరడం లేదు. ఎప్పటికైనా చేయాలి. నా ఇతర సినిమాల్ని మళ్లీ రీమేక్ చేయొచ్చేమో కానీ, దీన్ని మళ్లీ తీయడం మాత్రం అసాధ్యమే. ఎంత టెక్నాలజీ అందుబాటులో ఉన్నా సరే! నాగేశ్లాంటి ఆర్టిస్టులు... ఇలాంటి బలమైన స్క్రిప్టు మళ్లీ దొరకవు. నా లైఫ్‌లో ఎప్పటికీ ఓ మెమరీ ఇది. విమానంలో కథ చెబితే థ్రిల్ అయిపోయారు! టైమ్ మెషీన్ ఎక్కి మనకు నచ్చిన కాలానికి వెళ్లిపోతే ఎంత బాగుంటుంది? అది గతమైనా కావచ్చు. భవిష్యత్తు అయినా కావచ్చు. 18వ శతాబ్దంలోనే హెచ్‌జి వెల్స్ రాసిన ‘టైమ్ మెషీన్’ కథను కాలేజీ రోజుల్లో చదివి నేను తెగ థ్రిల్ ఫీలయ్యా. అప్పుడు అనుకోలేదు... ఆ నేపథ్యంలో సినిమా తీస్తానని. ఓ రోజు నేను, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విమానంలో కలిసి వెళ్తున్నాం. సరదాగా తనకు టైమ్ మెషీన్ నేపథ్యంలో కథ గురించి చెప్పా. ‘అద్భుతం’ అన్నాడాయన. అక్కడితో ఊరుకోలేదు. తనకు తెలిసిన వాళ్లందరికీ గొప్పగా చెప్పేశాడు. కానీ ఎవ్వరూ రియాక్ట్ కాలేదు. శివలెంక కృష్ణప్రసాద్ అనే కొత్త నిర్మాత మాత్రం రెడీ అన్నాడు. టైమ్ మెషీన్ ఎపిసోడ్లో శ్రీకృష్ణదేవరాయల కాలానికి వెళ్లడం ఉంటుంది. ఆ పాత్రను చేయగల ఒకే ఒక్క హీరో బాలకృష్ణ. అందుకే ఆయనకు ఈ కథ చెబితే, వెంటనే ఓకే అన్నారు. ఈ సినిమాకు ముగ్గురు ఛాయాగ్రాహకులు పనిచేశారు. మొదట పీసీ శ్రీరామ్ వర్క్ చేశారు. ఆయనకు కడుపులో సమస్య రావడంతో, శ్రీకృష్ణ దేవరాయల ఘట్టాలను వీఎస్సార్ స్వామి తీశారు. ఇక ఫ్యూచర్ ఎపిసోడ్‌కు సంబంధించిన ట్రిక్ ఫొటోగ్రఫీని కబీర్‌లాల్ తీసి పెట్టారు. ఇళయరాజా మ్యూజిక్కే ఈ సినిమాకు ప్రాణం. ‘ఆదిత్య 369’ (1991) సినిమా చూస్తుంటే - నాక్కూడా టైమ్‌మెషీన్ ఎక్కి ఆ రోజుల్లోకి వెళ్లిన ఫీలింగ్ కలుగుతుంది. వెంటనే దీనికి సీక్వెల్ చేయాలన్న ఆలోచనా పుడుతుంది. ‘మాయాబజార్’లో వదిలేసిన బాణీని వాడా! కేవీ రెడ్డిగారు తీసిన కళాఖండం ‘మాయాబజార్’కి పనిచేసినవాణ్ణి. ఆ సినిమా అంటే ప్రాణం నాకు. యానిమేషన్ సినిమా చేద్దామని నిర్మాత వినోద్ ప్రపోజల్ తెచ్చినపుడు, నాకు ‘మాయాబజార్’లోని ఘటోత్కచుడి పాత్ర మెదిలింది. ఆ పాత్రను బాల్యం నుంచి మొదలుపెట్టి తీద్దామనిపించింది. అప్పటికి తెలుగులో పూర్తి స్థాయిలో ఎవరూ యానిమేషన్ సినిమా చేయలేదు. నాకంతకు ముందు ఇంగ్లీషులో ‘సన్ ఆఫ్ అల్లాడిన్’ చేసిన అనుభవం ఉంది. ‘ఘటోత్కచుడు’ (2008) ఏడు భాషల్లో తీశాం. సంగీత దర్శకత్వమూ నేనే చేశా. ‘వివాహ భోజనంబు’ పాటను మాత్రం అలాగే ఉంచాం. ఆ పాటను అన్ని భాషల్లోనూ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారితోనే పాడించాం. కేవీరెడ్డిగారి ‘మాయాబజార్’ కోసం సాలూరు రాజేశ్వరరావుగారు నాలుగు బాణీలిచ్చారు. ‘కుశలమా ప్రియతమా’ అనే బాణీని ఆ సినిమాలో వాడలేదు. దాన్నే తీసుకుని ‘ఘటోత్కచుడు’లో ఉపయోగించా. కైరో ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఫిలిమ్ ఫెస్టివల్‌కి ఎంపికైందీ సినిమా. నేను తీసిన సినిమాలన్నీ ఒకెత్తు అయితే, ఇదొక్కటీ మాత్రం ప్రత్యేకం. ఎందుకంటే నేను కూడా చిన్నపిల్లాణ్ణయిపోయి, తీసిన చిన్నపిల్లల సినిమా కదా! నా కెరీర్లో మరపురాని ఈ ఐదు సినిమాల జ్ఞాపకాలు నన్నెప్పుడూ వెంటాడుతుంటాయి! - పులగం చిన్నారాయణ