
రాయ్‌పూర్: చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకుడు భూపేశ్ బఘేల్ తన చేతి మణికట్టుపై కొరడాతో కొట్టించుకున్నారు. ఆయన దుర్గ్ జిల్లాలోని జజంగిరి, కుమ్హారి అనే రెండు గ్రామాలలో జానపద సంప్రదాయంలో భాగంగా ఆయన ఇలా కొరడాతో కొట్టించుకున్నారు. గౌరి పూజ సమయంలో ఇలా కొరడాతో కొట్టించుకుంటే మంచి జరుగుతుందని స్థానికులు నమ్ముతారు.
ఎలాంటి చెడు జరగకుండా అమ్మ కాపాడుతుందని విశ్వసిస్తారు. భూపేశ్ బఘేల్ రాష్ట్రం సుభీక్షంగా ఉండాలని ప్రతి ఏడాది ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ఆయన కార్యాలయం పేర్కొంది. అందుకు సబంధించిన వీడియోని చత్తీస్‌గఢ్ సీఎం ట్వీట్టర్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
सोंटे का प्रहार और परंपराओं का निर्वहन. pic.twitter.com/SV82qommmu
— Bhupesh Baghel (@bhupeshbaghel) October 25, 2022
(చదవండి: కలిచివేసే ఘటన: చావుబతుకుల మధ్య ఉంటే చుట్టూ చేరి ఫోటోలు తీస్తూ...)