
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత భూపేష్ బాఘేల్ వరుస షాక్‌లు తగులుతున్నాయి. పలు కేసుల్లో ఈడీ, సీబీఐ అధికారులు ఆయనను టార్గెట్ చేశారు. తాజాగా బెట్టింగ్ యాప్ వ్యవహారం విషయమై.. భూపేష్ బాఘేల్ ఇంట్లో సీబీఐ అధికారులు సోదాలు చేపట్టారు. ఇక, ఇప్పటికే ఇప్పటికే మద్యం కుంభకోణానికి సంబంధించి ఆయన నివాసంలో ఈడీ సోదాలు జరిపింది దీంతో, ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న ఆందోళన కాంగ్రెస్ శ్రేణుల్లో నెలకొంది.
వివరాల ప్రకారం.. మాజీ సీఎం భూపేష్ బాఘేల్‌ను పలు కేసులు టెన్షన్ పెడుతున్నాయి. ఆయనపై కేసుల ఉచ్చు బిగుస్తోంది. తాజాగా మహదేవ్ బెట్టింగ్ యాప్ వ్యవహారానికి సంబంధించిన కేసులో భూపేష్ బాఘేల్ నివాసాల్లో సీబీఐ దాడులు నిర్వహిస్తోంది. రాయ్‌పుర్, భిలాయిలోని ఆయన నివాసాల్లో సీబీఐ అధికారులు తనిఖీలు (CBI Raids) చేస్తున్నారు. ఇదే సమయంలో ఆయను అత్యంత సన్నిహితుడైన ఓ సీనియర్ పోలీసు అధికారి ఇంట్లోనూ ఈ దాడులు జరుగుతున్నాయి.
మరోవైపు.. సీబీఐ సోదాలపై మాజీ సీఎం భూపేష్ బాఘేల్ స్పందించారు. ఈ సందర్బంగా ఆయన ట్విట్టర్ వేదికగా..‘ఇప్పుడు సీబీఐ వచ్చింది’ అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా.. ఏప్రిల్ 8, 9 తేదీల్లో అహ్మదాబాద్ (గుజరాత్)లో జరగనున్న ఏఐసీసీ సమావేశం కోసం ఏర్పాటైన “డ్రాఫ్టింగ్ కమిటీ” సమావేశానికి భూపేష్ బాఘేల్ ఈరోజు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ క్రమంలోనే నేడు ఉదయమే సీబీఐ రాయ్‌పూర్, భిలాయ్‌లోని ఆయన నివాసాలకు సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించడం విశేషం.

अब CBI आई है.
आगामी 8 और 9 अप्रैल को अहमदाबाद (गुजरात) में होने वाली AICC की बैठक के लिए गठित “ड्राफ़्टिंग कमेटी” की मीटिंग के लिए आज पूर्व मुख्यमंत्री भूपेश बघेल का दिल्ली जाने का कार्यक्रम है.
उससे पूर्व ही CBI रायपुर और भिलाई निवास पहुँच चुकी है.
(कार्यालय-भूपेश बघेल)— Bhupesh Baghel (@bhupeshbaghel) March 26, 2025
ఇదిలా ఉండగా.. ఇటీవలి కాలంలో మాజీ సీఎం భూపేష్ బాఘేల్‌ను పలు కేసులు వెంటాడుతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి భూపేష్ బాఘేల్, ఆయన కుమారుడు చైతన్య నివాసంలో ఇటీవల ఈడీ అధికారులు దాడులు చేసిన విషయం తెలిసిందే. ఆ సోదాల సందర్భంగా రూ.30 లక్షల నగదు, పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. సోదాల అనంతరం తిరిగి వెళ్తున్న ఈడీ అధికారుల వాహనాలపై నిరసనకారులు రాళ్లు రువ్వడంతో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. దీంతో, ఒక్కసారిగా అక్కడ ఆందోళన నెలకొంది.
#WATCH | Raipur: CBI raids underway at the residence of former Chhattisgarh CM and Congress leader Bhupesh Baghel. pic.twitter.com/McOgzts1qk
— ANI (@ANI) March 26, 2025