Chhattisgarh: 57 అప్పటికి 75 అవుతుంది.. ఎగ్జిట్‌పోల్స్‌పై సీఎం బఘేల్‌ | Chhattisgarh Chief Minister Bhupesh Baghel On Exit Polls Prediction | Sakshi
Sakshi News home page

Chhattisgarh: 57 అప్పటికి 75 అవుతుంది.. ఎగ్జిట్‌పోల్స్‌పై సీఎం బఘేల్‌

Published Thu, Nov 30 2023 9:55 PM | Last Updated on Thu, Nov 30 2023 9:56 PM

Chhattisgarh Chief Minister Bhupesh Baghel On Exit Polls Prediction - Sakshi

రాయపూర్: ఎగ్జిట్ పోల్ అంచనాలపై  ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ స్పందించారు. ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు రాష్ట్రంలో బీజేపీపై కాంగ్రెస్‌కు స్వల్ప ఆధిక్యాన్నే అందించడాన్ని తోసిపుచ్చుతూ తమ పార్టీ భారీ మెజారిటీ సాధించే దిశగా పయనిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. చాలా సర్వేలు కాంగ్రెస్‌కు సీట్లు 57 అని అంచనా వేస్తున్నప్పటికీ కౌంటింగ్ రోజైన డిసెంబర్ 3న ఫలితాలు వెలువడే నాటికి ఆ సంఖ్య 75కి పెరుగుతుందన్నారు.

గురువారం ఎగ్జిట్ పోల్ ఫలితాలు విడుదలైన అనంతరం బఘేల్‌ మీడియాతో మాట్లాడారు. "ఏడు ఎగ్జిట్ పోల్స్‌ వెల్లడించిన అంకెలు  స్థిరంగా ఉన్నాయా? రెండు రోజుల తర్వాత, ఈ ఎగ్జిట్-పోల్ అంచనాలలో పేర్కొన్న సంఖ్యలు స్థిరపడతాయి. ఎగ్జిట్-పోల్ అంచనాలతో సంబంధం లేకుండా మేము ఛత్తీస్‌గఢ్‌లో అద్భుతమైన మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం" అన్నారు.

ఒక ఎగ్జిల్‌ పోల్‌ ఫలితాన్ని ప్రస్తావిస్తూ 57 (కాంగ్రెస్‌ సీట్లు) ఏమిటి? కౌంటింగ్‌ నాటికి ఇది 75 అవుతుంది అన్నారు.  ఇండియా టుడే చాణక్య నిర్వహించిన సర్వేలో ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌కు 57-66 సీట్లు వస్తాయని, బీజేపీకి 33-42 సీట్లు వస్తాయని, 0-3 సీట్లు ఇతరులకు వస్తాయని అంచనా వేసింది. కాంగ్రెస్‌కు స్వల్ప మెజారిటీ సూచనల నేపథ్యంలో బీజేపీ 'ఆపరేషన్ కమలం' ప్రారంభిస్తుందా అనే దానిపై సీఎం బఘేల్‌ స్పందిస్తూ వారికి ఆ అవకాశం లేదని, తమకు మెజారిటీ ఉందని, తమ కృషిపై, ప్రజలపై విశ్వాసం ఉందని పేర్కొన్నారు.

మూడు సర్వేలు కాంగ్రెస్ స్పష్టమైన విజయం సాధిస్తుందని అంచనా వేయగా, మరికొన్ని ఆ పార్టీ గెలుపు రేంజ్‌లో ఉందని చెప్పాయి. ఏబీపీ సీ-ఓటర్‌  అంచనాల ప్రకారం.. 90 మంది సభ్యుల అసెంబ్లీ ఉన్న రాష్ట్రంలో కాంగ్రెస్ 41-53 సీట్లు గెలుచుకోనుంది. బీజేపీకి 36-48 సీట్లు, ఇతరులకు 0-4 సీట్లు వస్తాయి.  ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా పోల్ కాంగ్రెస్‌కు 40-50 సీట్లు, బీజేపీకి 36-46 సీట్లు, ఇతరులకు 1-5 సీట్లు వస్తాయని అంచనా వేసింది. రిపబ్లిక్ టీవీ ఎగ్జిట్ పోల్‌లో కాంగ్రెస్‌కు 44-52 సీట్లు, బీజేపీకి 34-42 సీట్లు, ఇతరులకు 0-2 సీట్లు వచ్చాయి.

ఇండియా టీవీ-సీఎన్‌ఎక్స్ పోల్ కాంగ్రెస్‌కు 46-56 సీట్లు, బీజేపీకి 30-40 సీట్లు, ఇతరులకు 3-5 సీట్లు వస్తాయని అంచనా వేసింది. జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్‌లో కాంగ్రెస్  42-53, బీజేపీ 34-45, ఇతరులకు 0-3 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఇక కాంగ్రెస్ 44.6 శాతం ఓట్లతో 46-54 సీట్లు, 42.9 శాతం ఓట్లతో బీజేపీ 35-42 సీట్లు, 12.5 శాతం ఓట్లతో ఇతరులు 0-2 సీట్లు సాధిస్తాయని పీ-మార్క్ పోల్ పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement